చిన్నారిని చితక బాదిన సవతి తల్లి | Step mother beats four years child | Sakshi
Sakshi News home page

చిన్నారిని చితక బాదిన సవతి తల్లి

Published Sat, Feb 28 2015 12:19 AM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM

చిన్నారిని చితక బాదిన సవతి తల్లి

చిన్నారిని చితక బాదిన సవతి తల్లి

అనంతపురం (గుత్తి): నాలుగేళ్ల చిన్నారిని సవతి తల్లి చితకబాదింది.విషయం తెలుసుకున్న 1098 చైల్డ్‌లైన్ సభ్యులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ సంఘటన గుత్తి ఆర్‌ఎస్‌లో శుక్రవారం జరిగింది. రాజస్తాన్‌కు చెందిన హీరాలాల్,సంతోషి గత ఏడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు.వీరికి రేణుక జన్మించింది.పాప పుట్టిన తర్వాత సంతోషిని భర్తను వదిలేసింది. దీంతో హీరాలాల్ రాజస్తాన్ నుంచి గుత్తికి మకాం మార్చాడు. చిన్నారి రేణుకను తన వద్దే ఉంచుకున్నాడు.అయితే గత రెండు మాసాల క్రితం హీరాలాల్ రాజస్తాన్‌కు చెందిన కిరణ్‌రాథోడ్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో సవతి తల్లి కిరణ్ రాథోడ్ చిన్నారి రేణుకను చితకబాదడం మొదలు పెట్టింది. తరుచూ చిన్నారిని చిత్ర హింసలకు గురి చేసింది.

ఈ విషయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు 1098 చైల్డ్‌లైన్ సభ్యులు మురళికి సమాచారం అందింది.దీంతో మురళి తన తోటి సభ్యులు రామకృష్ణ,అశ్వని,అంగన్‌వాడీ సూపర్‌వైజర్ శకుంతలతో కలిసి గుత్తి ఆర్‌ఎస్‌లోని పత్తికొండ రోడ్డులో ఉన్న హీరాలాల్ ఇంటికి వెళ్లారు.చిన్నారిని ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించగా మా బిడ్డ మా ఇష్టమని మొదట దబాయించారు.పోలీసులకు చెబుతామని అనడంతో అసలు చిన్నారిని కొట్టలేదని సవతి తల్లి కిరణ్‌రాథోడ్ అడ్డం తిరిగింది.ప్రమాదవశాత్తు కింద పడి దెబ్బలు తగిలాయని బుకాయించింది.అయితే పానీ పూరిని తయ్యారు చేసే గరిట(చెలాకి)తో చిన్నారిని కొట్టినట్లు చెంపపై గాయాలున్నాయి.వీపు పై కూడా బలంగా కొట్టిన గుర్తులున్నాయి.చెంబ,వీపుపై దెబ్బలుండటంతో 1098 సభ్యులు వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లి చిన్నారి తండ్రి హీరాలాల్,సవతి తల్లి కిరణ్ రాథోడ్‌లపై ఫిర్యాదు చేశారు.పోలీసులు వారిరువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement