Four years child
-
ఆ పాప నా మనవరాలే : బైడెన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుటుంబ వ్యవహారంపై గత కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చకు ఆయన ఎట్టకేలకు తెర దించారు. నేవీ జాన్ రాబర్ట్స్ అనే నాలుగేళ్ల చిన్నారి తన మనవరాలేనని అంగీకరించారు. ఆ పాప తన ఏడవ మనవరాలని ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘‘ నా కుమారుడు హంటర్ బైడెన్, లండెన్ రాబర్ట్‌లకు 2018లో కలిగిన సంతానమే చిన్నారి నేవీ. హంటర్, లండెన్లు తమ కుమార్తె క్షేమం కోసం వారిద్దరి మధ్య సంబంధాలను పెంపొందించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు’’ అని ఆ ప్రకటనలో చెప్పారు. ఇదేమీ రాజకీయ వ్యవహారం కాదని, కుటుంబ వ్యవహార మని స్పష్టం చేశారు. నేవీతో పాటుగా తమ మనవలు, మనవరాళ్లు అందరికీ అంతా మంచి జరగాలని తాను, జిల్ బైడెన్ కోరుకుంటున్నామని బైడెన్ పేర్కొన్నారు. నేవీ రాబర్ట్స్ పెంపకం బాధ్య తలపై తల్లి లండెన్ రాబర్ట్ కోర్టుకెక్కిన సమయంలో వారిద్దరి మధ్య సంబంధం వెలుగులోకి వచ్చింది. అప్పట్లోనే డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన కోర్టు నేవీ తండ్రి హంటర్ బైడెనేనని నిర్ధారించింది. హంటర్ బైడెన్ 2021లో తాను రాసిన పుస్తకంలో లండెన్తో సంబంధం గురించి రాశారు. డ్రగ్స్‌కు బానిసగా ఉన్న సమయంలో ఆమె తన జీవితంలోకి వచ్చిందని ఆ తర్వాత ఆమెని మర్చిపోయానని ఆ పుస్తకంలో రాశారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు పాప బాధ్యతను తాను కూడా తీసుకున్నానని అందులో రాసుకొచ్చారు. ఇంత జరిగినా అధ్యక్షుడు బైడెన్ ఈ వ్యవహారంపై స్పందించకపోవడం చిన్నారి నేవీని మనవరాలిగా స్వీకరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బైడెన్ ఈ ప్రకటన చేశారు. -
‘అమ్మా’నవీయం..
భద్రాచలంటౌన్: అయ్యో పాపం..పసివాడు. నాలుగేళ్ల పిల్లాడు. కానీ..ఆ తల్లి ఎంత కోపంతో ఉందో..ఏ బాధలో చేసిందో కానీ..కర్కశంగా వాతలు పెట్టింది. తాను కన్న బిడ్డే అయినా..ఎందుకో ఆ క్షణంలో మానవత్వం మరిచింది. శనివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని జగదీష్ కాలనీకి చెందిన పల్లపు లంకమ్మ తన నాలుగేళ్ల కుమారుడు రఘురాం మట్టి తింటున్నాడని వాతలు పెట్టింది. ఈమె భర్త ఈ ఏడాది అక్టోబర్‌లో చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె మానసిక స్థితి సరిగ్గా ఉండట్లేదు. ఆరేళ్ల కూతురితో పాటు ఈ బాబును సాకేందుకు ఆదాయం లేక, అటు భర్త మరణం తట్టుకోలేక మానసికంగా దెబ్బతిని..కోపాన్ని పిల్లలపై చూపుతుంటుందని ఐసీపీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీం) కౌన్సిలర్ యశోద తెలిపారు. ఈ క్రమంలో శనివారం పిల్లాడు రఘురాం మట్టి తింటున్నాడని కోపంతో గరిటెను కాల్చి ఎడమ బుగ్గ మీద, రెండు చేతుల మీద కాల్చింది. బాబు శరీరం కమిలి తల్లడిల్లుతుండడంతో స్థానికులు అంగన్వాడీ టీచర్ మాధవికి విషయం తెలిపారు. ఐసీడీఎస్ కౌన్సిలర్ యశోద, పోలీస్ వారు సోమవారం లంకమ్మ ఇంటికి వెళ్లి..కౌన్సెలింగ్ నిర్వహించి, బాలుడిని ఖమ్మంలోని చైల్డ్ కేర్‌లో ఉంచుతామని తెలిపారు. ఆ తల్లిపై కేసు నమోదు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
నాలుగేళ్ల చిన్నారికి లైంగిక వేధింపులు
అనంతపురం సెంట్రల్ : అనంతపురంలో మరో దారుణం వెలుగు చూసింది. యాభై ఐదేళ్లు పైబడిన వయస్సు కలిగిన అతను.. మనవరాలి వయస్సు కలిగిన నాలుగేళ్ల చిన్నారిపై కన్నేశాడు. ఆడుకుంటున్న పసికూనపై లైంగికంగా వేధించాడు. ఈ ఘటన అనంతపురం మున్నానగర్‌లో వెలుగులోకి వచ్చింది. సీఐ సాయిప్రసాద్ కథనం ప్రకారం... మున్నానగర్‌లో నివాసముంటున్న చిన్నారి ఇంటి ఎదురుగా ఆడుకుంటుండగా, వారి పక్కింట్లో ఉంటున్న సదరు కామాంధుడు చిన్నారిని తన ఇంట్లోకి పిల్చుకున్నాడు. లైంగికంగా వేధించడంతో ఆ బిడ్డ గట్టిగా కేకలు వేసింది. ఏం జరిగిందంటూ ఇరుగుపొరుగు వారితో పాటు బాలిక తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. ఆ తరువాత చిన్నారిని తీసుకొని తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి పంపనున్నట్లు సీఐ సాయిప్రసాద్ తెలిపారు. వైద్య పరీక్షల నివేదికను బట్టి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
నాలుగేళ్ల చిన్నారిని చితకబాదిన టీచర్
చిట్యాల: వరంగల్ జిల్లా చిట్యాల మండలం కమల మెమోరియల్ హై స్కూల్లో శుక్రవారం ముక్కుపచ్చలారని నాలుగేళ్ల చిన్నారిని కర్రతో, చేతితో ఓ ప్రైవేటు స్కూల్ టీచర్ విచక్షణ రహితంగా కొట్టింది. మండలంలోని నవాబుపేట శివారు చింతకుంటరామయ్యపల్లికి ఏలేటి లత, తిరుపతిరెడ్డిల కూతురు శ్రీనీత(4)ను ఈ ఏడాదే నర్సరీలో చేర్పించారు. శుక్రవారం క్లాస్‌రూంలో ఏడుస్తు న్న శ్రీనీ తను స్కూల్ ఇన్చార్జి రాజేశ్ కర్ర, చేతితో వీపుపై కొట్టాడు. టీచర్‌పై రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
చిన్నారిని చితక బాదిన సవతి తల్లి
అనంతపురం (గుత్తి): నాలుగేళ్ల చిన్నారిని సవతి తల్లి చితకబాదింది.విషయం తెలుసుకున్న 1098 చైల్డ్‌లైన్ సభ్యులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ సంఘటన గుత్తి ఆర్ఎస్లో శుక్రవారం జరిగింది. రాజస్తాన్‌కు చెందిన హీరాలాల్,సంతోషి గత ఏడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు.వీరికి రేణుక జన్మించింది.పాప పుట్టిన తర్వాత సంతోషిని భర్తను వదిలేసింది. దీంతో హీరాలాల్ రాజస్తాన్ నుంచి గుత్తికి మకాం మార్చాడు. చిన్నారి రేణుకను తన వద్దే ఉంచుకున్నాడు.అయితే గత రెండు మాసాల క్రితం హీరాలాల్ రాజస్తాన్‌కు చెందిన కిరణ్రాథోడ్ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో సవతి తల్లి కిరణ్ రాథోడ్ చిన్నారి రేణుకను చితకబాదడం మొదలు పెట్టింది. తరుచూ చిన్నారిని చిత్ర హింసలకు గురి చేసింది. ఈ విషయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు 1098 చైల్డ్‌లైన్ సభ్యులు మురళికి సమాచారం అందింది.దీంతో మురళి తన తోటి సభ్యులు రామకృష్ణ,అశ్వని,అంగన్వాడీ సూపర్వైజర్ శకుంతలతో కలిసి గుత్తి ఆర్ఎస్లోని పత్తికొండ రోడ్డులో ఉన్న హీరాలాల్ ఇంటికి వెళ్లారు.చిన్నారిని ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించగా మా బిడ్డ మా ఇష్టమని మొదట దబాయించారు.పోలీసులకు చెబుతామని అనడంతో అసలు చిన్నారిని కొట్టలేదని సవతి తల్లి కిరణ్రాథోడ్ అడ్డం తిరిగింది.ప్రమాదవశాత్తు కింద పడి దెబ్బలు తగిలాయని బుకాయించింది.అయితే పానీ పూరిని తయ్యారు చేసే గరిట(చెలాకి)తో చిన్నారిని కొట్టినట్లు చెంపపై గాయాలున్నాయి.వీపు పై కూడా బలంగా కొట్టిన గుర్తులున్నాయి.చెంబ,వీపుపై దెబ్బలుండటంతో 1098 సభ్యులు వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లి చిన్నారి తండ్రి హీరాలాల్,సవతి తల్లి కిరణ్ రాథోడ్‌లపై ఫిర్యాదు చేశారు.పోలీసులు వారిరువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.