అనంతపురం సెంట్రల్ : అనంతపురంలో మరో దారుణం వెలుగు చూసింది. యాభై ఐదేళ్లు పైబడిన వయస్సు కలిగిన అతను.. మనవరాలి వయస్సు కలిగిన నాలుగేళ్ల చిన్నారిపై కన్నేశాడు. ఆడుకుంటున్న పసికూనపై లైంగికంగా వేధించాడు. ఈ ఘటన అనంతపురం మున్నానగర్‌లో వెలుగులోకి వచ్చింది. సీఐ సాయిప్రసాద్ కథనం ప్రకారం... మున్నానగర్‌లో నివాసముంటున్న చిన్నారి ఇంటి ఎదురుగా ఆడుకుంటుండగా, వారి పక్కింట్లో ఉంటున్న సదరు కామాంధుడు చిన్నారిని తన ఇంట్లోకి పిల్చుకున్నాడు.
లైంగికంగా వేధించడంతో ఆ బిడ్డ గట్టిగా కేకలు వేసింది. ఏం జరిగిందంటూ ఇరుగుపొరుగు వారితో పాటు బాలిక తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. ఆ తరువాత చిన్నారిని తీసుకొని తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి పంపనున్నట్లు సీఐ సాయిప్రసాద్ తెలిపారు. వైద్య పరీక్షల నివేదికను బట్టి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
నాలుగేళ్ల చిన్నారికి లైంగిక వేధింపులు
Published Sat, May 27 2017 12:09 AM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM
Advertisement
Advertisement