జెఎన్టీయూలో కీచకపర్వం
Published Wed, Jan 27 2016 8:58 AM | Last Updated on Tue, Oct 16 2018 2:53 PM
కదిరి: అనంతపురం జేఎన్‌టీయూ అధ్యాపకుడు ఓ విద్యార్థిని పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు కదిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ప్రాథమిక సమాచారం మేరకు... కదిరి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని గతంలో జెఎన్టీయూ లో ఎంబీయే పూర్తిచేసింది. అప్పట్లో గెస్ట్ ఫ్యాకల్టీ అయిన సుశీల్ కుమార్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు గురిచేశాడు.
కాగా, ఎంబీయేలో ఓ సబ్జెక్ట్‌కు సంబంధించి పరీక్షకు హాజరయ్యేందుకు తాజాగా ఆమె జేఎన్టీయూకు వెళ్లింది. ఆ సమయంలోనూ ఆమె పట్ల సుశీల్ కుమార్ అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా చెప్పినట్టు వినకుంటే యాసిడ్ పోస్తానంటూ విద్యార్థిని బెదిరించాడు. దీంతో వేధింపులు భరించలేని బాధితురాలు మంగళవారం రాత్రి కదిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసుకుని సుశీల్ కుమార్ కోసం గాలిస్తున్నారు.
Advertisement
Advertisement