జేఎన్‌టీయూ : షమోమ పునరుత్పాదక ఇంధన వనరుల ఎడ్యుకేషన్ సొసైటీ ( శ్రీ సొసైటీ), ఆరంజ్ రీసెర్చ్ ల్యాబ్ (ఓఆర్‌ఎల్ ల్యాబ్) సంస్థలతో జేఎన్‌టీయూ (ఎ) అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు ఇన్‌ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ కె.రాజగోపాల్ తెలిపారు. భవిష్యత్తులో పునరుత్పాదక ఇంధన వనరులకు సంబంధించిన (సోలార్, విండ్ పవర్) కోర్సుల్లో అవకాశాలు అపారంగా ఉండటంతో ఈ సంస్థలతో కలిసి పనిచేసేందుకు తగిన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామన్నారు. శ్రీసొసైటీ ప్రతినిధులు, ఓఆర్‌ఎల్ ల్యాబ్ ప్రతినిధులు గురువారం ఆయా సంస్థలు అందించే సేవలు గురించి వివరించారన్నారు. ఈ అంశంపై ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని జేఎన్‌టీయూలో ఏర్పాటు చేసే అంశంపై చర్చించినట్లు పేర్కొన్నారు. మరిన్ని అంశాలపై ఏకాభిప్రాయం వస్తే అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటామని స్పష్టం చేశారు.