
సాక్షి, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో విషాదం చోటుచేసకుంది. బోయినపల్లి మండలం శభాష్‌పల్లి వంతెన వద్ద పిల్లలతో సహా ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కడుపున పుట్టిన ముగ్గురు బిడ్డలతో కలిసి బుధవారం మిడ్ మానేరు రిజర్వాయర్‌లోకి దూకి ప్రాణాలు విడిచింది. మృతుల్లో పద్నాలుగు నెలల పసికందు కూడా ఉండటం మనసుని కలిచివేస్తుంది.
సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను నీటిలోంచి వెలికితీశారు. చనిపోయిన వారిని తల్లి రజిత, అయాన్(7), అశ్రజాబిన్(5), ఉస్మాన్ అహ్మద్(14నెలలు)గా గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా వేములవాడ అర్భన్ మండలానికి చెందిన రజిత, కరీంనగర్‌లోని సుభాష్ నగర్‌కు చెందిన మహ్మద్ అలీది ప్రేమ వివాహం. ఈ క్రమంలో పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పి పిల్లలు కలిసి బయల్దేరింది.
అప్పటి నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నేడు మిడ్ మానేరులో నాలుగురిని విగత జీవులుగా గుర్తించారు. కుటుంబ కలహాల వల్లే మహిళ ఇంతటి దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: సారీ కవిత నా వల్ల మాటలు పడ్డావ్.. తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం
Comments
Please login to add a commentAdd a comment