Rajanna Sircilla District
-
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోస్టర్ కలకలం
-
‘ఇక్కడ ప్రభుత్వం నడుస్తుందా.. సర్కస్ నడుస్తుందా?
రాజన్న సిరిసిల్ల జిల్లా: తమ మీద కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన,బతుకమ్మ చీరల ఆర్డర్ కూడా ఇవ్వకుండా కక్ష్య సాధింపు చర్యలు దిగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి నేత కార్మికులకు చీరల ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లను మరో తిరుప్పూరు చేయడానికి కృషి చేశామన్న ఆయన, సిరిసిల్ల నేతన్నల తరఫున పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల అధికారులకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలకు తలొగ్గి సిరిసిల్లలో ఇష్టానుసారం చేయొద్దు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్ అయినా కూడా విచారణ చేస్తామని సూచించారు.ఇక ఇన్నోవేటివ్ థింకింగ్ అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు.ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పుకోవడం ఇన్నోవేటివ్ థింకింగా .?చేయని రుణమాఫీ చేసినట్టు చెప్పుకోవడం ఇన్నోవేటివ్ థింకింగా ? బామ్మర్దులకి కాంట్రాక్ట్‌లు ఇచ్చుకోవడం ఇన్నోవేటివ్ థింకింగా? అని ప్రశ్నలు గుప్పించారు.హైడ్రా కూల్చి వేతలపై స్పందించిన కేటీఆర్..హైదరాబాద్‌లో ప్రభుత్వం ఏం చేస్తుందో వారికే అర్థం కావట్లేదు. ప్రభుత్వం నడుస్తుందా… సర్కస్ నడుస్తుందా?హైడ్రా పేరుతో గర్భిణిలని ,పిల్లల్ని కూడా అవస్థలు పెడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.ఫార్మా సిటీ రద్దు చేస్తామని కాంగ్రెస్ నాయకులు అనేక సార్లు చెప్పారు . ఫార్మాసిటీ ఉందా,రద్దు చేశారా లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం ప్రస్తుత సిటీ గురించి మాట్లాడటం లేదు.. ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.👉చదవండి : దేవర ఈవెంట్ రద్దుపై కేటీఆర్ -
తప్పతాగి.. ప్రసాదం చేయడానికి వచ్చి..
వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి కి నైవేద్య సమర్పణలో అపచారం చోటుచేసుకుంది. నైవేద్యాన్ని సిద్ధం చేసే వంట బ్రాహ్మణుడు మద్యం తాగి విధులకు వచ్చాడు. స్వామికి నిత్యం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య నైవేద్యం సమర్పిస్తారు. అయితే స్వామివారికి శుక్ర వారం సమయానికి నైవేద్యం సిద్ధం కాకపోవడంతో ఆలయ పర్యవేక్షకులు అల్లి శంకర్, వరి నర్సయ్య వెంటనే నివేదన శాలలోకి వెళ్లి పరిశీలించగా.. నైవేద్యం సిద్ధంగా లేకపోవడంతోపాటు వంటబ్రాహ్మణుడు మద్యం మత్తులో ఉండటాన్ని గమనించారు.సమయం దాటిపోతుండటంతో మరో బ్రాహ్మణుడితో నైవేద్యం సిద్ధం చేయించారు. హడావుడిగా సిద్ధం చేయడంవల్ల వేడిగా ఉన్న నీటిలో బియ్యాన్ని పోసి ఉడికీఉడకని నైవేద్యాన్ని స్వామివారికి నివేదించారు. అప్పటికే నివేదన సమయం అరగంట ఆలస్యమైంది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఆ వంట బ్రాహ్మణుడు ఇదేవిధంగా మద్యం మత్తులో విధులు నిర్వహించటంతో మెమో జారీ చేసినట్లు గోదాం పర్యవేక్షకుడు నర్సయ్య తెలిపారు. ఆదాయం ఘనం.. కైంకర్యాలపై పట్టింపు కరువువేములవాడ రాజన్నకు భక్తుల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నా శ్రీస్వామి వారికి పవిత్రంగా సమర్పించే నైవేద్యాన్ని సిద్ధం చేయడంలో అధికా రుల నిర్లక్ష్యంపై భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్త మవుతోంది. ఇదిలా ఉండగా వేములవాడ శ్రీరాజ రాజేశ్వరస్వామి ఆలయంలో రెండో రోజు శుక్రవా రం కూడా ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసా గాయి. ఆలయంలోని వివిధ విభాగాలపై ఫిర్యా దులు రావడంతో గురువారం నుంచి తనిఖీలు చేస్తున్నారు. శుక్రవారం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో అధికారులు స్వామి వారి అన్నదానం, అకౌంట్స్ విభాగాల్లోని రికార్డులు పరిశీలించారు. రికార్డుల పరిశీలన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
సిరిసిల్ల బస్టాండ్‌లో కాకుల హల్చల్
సిరిసిల్ల టౌన్: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌లో శనివారం రెండు కాకులు హల్చల్ చేశాయి. పాతబస్టాండులోని వేపచెట్టుపై ఉండే కాకులు మధ్యాహ్నం సమయంలో అటువైపు వస్తున్న పురుషులపై మాత్రమే దాడి చేశాయి. నాలుగైదు గంటల పాటు కేవలం మగవారి తలలపై తన్నుతూ దాడి చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చివరికి స్థానికులు ఈ తతంగాన్ని పరీక్షించగా చెట్టుపై గూడులో కాకి పిల్లల్ని పెట్టినట్లు తెలిసింది. శత్రువులు రాకుండా చూడటంలో భాగంగానే ఇలా చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు. అయితే ఈ విషయం స్థానికంగా చర్చకు దారితీసింది. -
వృద్ధురాలిని పీక్కుతిన్న కుక్కలగుంపు
ముస్తాబాద్ (సిరిసిల్ల): వీధికుక్కలు జవహర్‌నగర్‌లో బాలు డిని చంపిన ఘటన మరువకముందే మ రో దారుణం చోటు చేసుకుంది. అచేతన స్థితిలో అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వృద్ధురాలిపై కుక్కలగుంపు దాడి చేసి ప్రాణాలు తీశాయి. తలను పీకి.. పొట్టను చీల్చి పేగులు, కా లే యాన్ని తినేశాయి.ఈ దారుణ ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బట్టోనితాళ్లలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. బట్టోనితాళ్లకు చెందిన పిట్ల రామలక్ష్మి(85) ఇంట్లో నిద్రిస్తుండగా బుధవారం అర్ధరాత్రి వీధికుక్కల గుంపు విచక్షణారహితంగా దాడిచేసి ముఖాన్ని కొరుక్కుతిని, పొట్టను చీల్చాయి. వృద్ధాప్యం, అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్న రామలక్ష్మి ఎదురుతిరగలేని పరిస్థితిలో ప్రాణాలు విడిచింది. రామలక్ష్మి ము ఖం పూర్తిగా ఛిద్రమై ఎముకలు తేలాయి. ఆమె పడుకున్న మంచంలోనే ప్రాణాలు వదలగా, రక్తం ధారలు కట్టింది. వేర్వేరు ఇళ్లలో కొడుకులు రామలక్ష్మి ముగ్గురు కుమారులు బాలరాజు, దేవయ్య, అంజయ్యలు వేర్వేరు ఇళ్లలో ఉంటున్నారు. వ్యవసాయ పనులు ముమ్మరం కావడంతో పొద్దంతా పనులకు వెళ్లి వచ్చినవారు బుధవారం రాత్రి గాఢనిద్రలోకి జారుకున్నారు. రామలక్ష్మి తనకున్న ప్రత్యేక గదిలో నిద్రించింది. ఆ గదికి సరైన తలుపులు లేకపోవడంతో రాత్రివేళ కుక్కలు దాడి చేశాయి.మంచంలో ఎంత గింజుకున్నా, కుక్కలు వదల్లేదని అక్కడున్న పరిస్థితులను బట్టి తెలుస్తోంది. అందరూ నిద్రలో ఉండడంతో ఆమె కేకలు ఎవరికీ వినిపించలేదు. గురువారం ఉదయం రామలక్ష్మి కుటుంబీకులు జరిగిన సంఘటన చూసి బోరున విలపించారు. మృతురాలి గదంతా రక్తసిక్తమై, శరీర భాగాలు పడి ఉన్నాయి. -
కిడ్నీ మార్పిడి చేయించడం లేదని.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
సిరిసిల్లక్రైం: డయాలసిస్‌తో బాధప డుతున్న ఓ భర్త తన భార్యను క్షణి కావేశంలో హత్యచేసి..ఆపై తను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్నసిరిసిల్ల జిల్లాకేంద్రంలోని శాంతి నగర్‌కు చెందిన దూస రాజేశం(62) రెండు కిడ్నీలు కొద్దినెలల క్రితం పాడయ్యాయి. దీంతో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. తనకు కిడ్నీ మార్పిడి చేయించాలని కొన్నాళ్లుగా కుటుంబ సభ్యులతో గొడవ పడు తున్నాడు.కిడ్నీ దొరకగానే శస్త్రచికిత్స చేయిద్దామని, అప్పటి వరకు ఆగాలని కుటుంబసభ్యులు సముదాయించారు. ఈ క్రమంలోనే డయాలసిస్‌తో కాలం వెళ్లదీయలేనని మనస్తా పానికి గురైన రాజేశం ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో తన భార్య లక్ష్మి(50)ని బలమైన ఆయుధంతో తలపై కొట్టి హత్య చేశాడు. అనంతరం ఇంట్లోని పైకప్పుకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజేశం పవర్‌లూమ్స్ నడిపించేవాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో..రాజేశంకు ఇద్దరు కుమారులు. చిన్నకొడుకు విద్యాభ్యాసం కోసం హైదరాబాద్‌లో ఉండగా, పెద్ద కుమారుడు ఆదివారం తన అత్తగారింట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేరని గమనించిన రాజేశం తన భార్యను హత్య చేసి తను ఆత్మహత్యకు పాల్పడినట్టు కుమారుడు వేణు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
డబుల్ పెన్షనర్ల నుంచి రూ.10 లక్షలు రికవరీ
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ సర్వీసు పెన్షన్లు, సామాజిక ఆసరా పెన్షన్.. రెండూ పొందుతున్న పది మంది రూ.10 లక్షలను తిరిగి ప్రభుత్వ ఖజానాకు చెల్లించారు. జిల్లాలో 71 మంది రెండు పెన్షన్లు పొందుతున్నట్లుగా పేర్కొంటూ జూలై 6న ‘సాక్షి’లో ‘ప్రభుత్వ పెన్షనర్లకు ఆసరా’శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో రెండు పెన్షన్లు పొందుతున్న వారికి పంచాయతీ కార్యదర్శుల ద్వారా నోటీసులు జారీచేశారు. రెండు పెన్షన్లు పొందుతున్న వారు ఆసరా పెన్షన్ డబ్బులను తిరిగి చెల్లించాలని ఆదేశించారు.కాగా, ఏళ్ల తరబడి పొందిన ఆసరా పెన్షన్ డబ్బులను ఒకేసారి చెల్లించడం ఇబ్బందిగా ఉండడంతో రికవరీకి సమయం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు వారికి వెసులుబాటు కలి్పంచారు. ఇప్పటికే 10 మంది రూ.10 లక్షలు చెల్లించగా.. ఇంకా 61 మంది, రూ.47.75 లక్షల మేరకు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని దశలవారీగా రికవరీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆసరా పెన్షన్లు నిలిపివేసి, సరీ్వసు పెన్షన్ నుంచి ఆ సొమ్మును దశలవారీగా రికవరీ చేయాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఒకేసారి చెల్లించాలని ఒత్తిడి చేయకుండా వాయిదా పద్ధతిలో వసూళ్లకు ప్రణాళిక సిద్ధం చేశారు. -
బీజేపీ కోసం కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ కష్టపడ్డాడు: కేటీఆర్
సాక్షి, రాజన్న సిరిసిల్ల: పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలే హవా కొనసాగించబోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఇండియా, ఎన్డీఏ కూటమిలకు స్పష్టమైన మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని అన్నారు. రెండు కూటమిలో లేని పార్టీలు.. బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, బీజూ జనతాదళ్ లాంటి ప్రాంతీయ శక్తులే కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర, మల్లర పనులు చేస్తూ 5 నెలల టైం పాస్ చేసిందని మండిపడ్డారు. మేడిగడ్డ, శ్వేతపత్రాలు, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలపై ఫోకస్ చేసి ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నించిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మెజార్టీ సీట్లు మేమే సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ సైనికులు అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శించారు. పార్టీ కోసం కష్టపడిన గులాబీ సైకులకు వినయపూర్వక ధన్యవాదాలు. ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించబోతున్నాం. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో గెలవబోతుంది. ఈనాడైనా ఏనాడైనా బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామరక్ష అని ప్రజలకు అర్థమైంది. ఆ రెండు పార్టీలు సన్నాయి నొక్కులు నొక్కడానికి, విమర్శలు చేయడానికి, కేసీఆర్‌ను దూషించడానికి పరిమితం అయ్యాయి. తెలంగాణకు ఏం చేయకపోయినా అడ్డగోలు విమర్శలు చేశాయి. వీరి వల్ల ఏం కాదని ప్రజలకు అర్థమైపోయింది. ఈ ఎన్నికల్లో చేసిన కృషి స్థానిక సంస్థల ఎన్నికలకు పునాది కాబోతుంది అని కేటీఆర్ పేర్కొన్నారురాష్ట్రంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై ఆడబిడ్డలు తీవ్ర మనస్థాపంతో ఉన్నారు .కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకులు లేకనే.. మా పార్టీ నుండి వచ్చిన వారికి టిక్కెట్లు ఇచ్చి నిలబెట్టింది. ఢిల్లీలో కుస్తీలు, గల్లీలో దోస్తీల్లా రెండు పార్టీల వ్యవహారముంది. డమ్మీ అభ్యర్హులను పెట్టీ రేవంత్ రెడ్డి బీజేపీ అభ్యర్థులు గెలిచేలా ప్రణాళికలు చేశాడు. కాంగ్రెస్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని 420 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా’ అని కేటీఆర్ తెలపారు. -
ఎక్కే విమానం.. దిగే విమానం అంటూ.. ఢిల్లీకి జాతరలు
సిరిసిల్ల: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూడు, నాలుగు నెలలుగా ఎక్కే విమానం.. దిగే విమానం అంటూ.. ఢిల్లీకి జాతరలు.. యాత్రలు చేస్తున్నాడే తప్ప రైతుల బాధలు చూడట్లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం ఆయన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో నీరు లేక ఎండిన పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 15 లక్షల నుంచి 20 లక్షల పొలాలు నీరు లేక ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే.. సీఎం కానీ, మంత్రులు కానీ పొలాల దిక్కు చూసిన పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య విధానాలతో కాళేశ్వరంపై, కేసీఆర్‌పై కడుపు మంటతో మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లర్లను రిపేరు చేయకుండా.. కాఫర్ డ్యామ్ నిర్మించకుండా పొలాలను ఎండబెట్టారని ఆరోపించారు. గతంలో గోదావరి నీళ్లను ఎత్తిపోసి కాల్వల ద్వారా చెరువులు నింపి పొలాలు ఎండిపోకుండా కేసీఆర్ చూసుకున్నారని గుర్తు చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అన్నారు. సారంపల్లిలో పొలాలను చూస్తుంటే.. మేతకు తప్ప కోతకు పనికి రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారులు రైతులకు లీగల్ నోటీసులు ఇచ్చి అప్పులు కడతారా.. చస్తారా.. అన్నట్లుగా వేధిస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్ల ఖజానా నింపుతున్నారు యాసంగి సీజన్లో రైతుబంధుకు రూ.7వేల కోట్లు సిద్ధం చేస్తే.. రైతులకు ఇవ్వకుండా ఆ నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తూ వాళ్ల ఖజానా నింపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర ప్రయోజనాల కోసం రైతులను గోసపెడుతోందన్నారు. రాష్ట్రంలో 200 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, రైతుల పరిస్థితి చూస్తుంటే జాలి వేస్తోందన్నారు. రూ.2లక్షల రుణం మాఫీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. డిసెంబరు 9న రుణమాఫీ చేస్తానని రేవంత్‌రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ అడ్డుకాకుండా ఈసీకి లేఖ రాసి రుణమాఫీని ప్రకటించాలన్నారు. రైతుభరోసా కింద ఎకరానికి రూ.15వేలు ఇవ్వాలని, పంటలు ఎండిన రైతులను, కౌలు రైతులను, రైతు కూలీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎకరాకు రూ.10వేలు ఇచ్చిందని, ఇప్పుడు రూ.25వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల్లో ధైర్యం నింపి వారికి భరోసా ఇచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఎండిన పొలాలను సందర్శించాలని కేసీఆర్ నిర్ణయించారని వివరించారు. నిరుడు చెరువుల్లోకి కాల్వనీరు వచ్చి పొలం పారిందని, ఈసారి పది ఎకరాల్లో వరి వేస్తే మొత్తం ఎండిపోయిందని కేటీఆర్‌కు పర్శరాములు అనే కౌలు రైతు చెప్పారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ పాల్గొన్నారు. -
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన
-
సిలిండర్ ఈకేవైసీ @ రూ.150
సిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గృహజ్యోతి’ పథకంలో రూ.500కే గ్యాస్ సిలిండర్ ప్రారంభానికి ముందే అక్రమార్కులకు కాసులపంట కురిపిస్తోంది. ఈకేవైసీ పేరుతో అందినకాడికి దోచుకుంటున్న విషయం మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై మహిళలు మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. స్థానిక శివనగర్ ప్రాంతంలోని ఓ గ్యాస్ ఏజెన్సీలో ఈకేవైసీకి రూ.150 చెల్లించాలని ఏజెన్సీ నిర్వాహకులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించినవారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి ఏజెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. మరోవైపు ఈకేవైసీతో పాటుగా కచ్చితంగా పైపు తీసుకోవాలనే నిబంధన ఉందని నిర్వాహకులు చెప్పడం గమనార్హం. ఈ విషయమై జిల్లా పౌర సరఫరాల అధికారిని వివరణ కోరగా.. ఈకేవైసీకి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. -
బస్సు చోరీ చేసి.. ప్రయాణికుల్ని ఎక్కించుకుని..
రాజన్నసిరిసిల్ల జిల్లా: సిద్దిపేటలో చోరీకి గురైన ఆర్టీసీ అద్దె బస్సు రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లి శివారులో ప్రత్యక్షమైంది. పోలీసులు తెలిపిన వివరాలివి. సిద్దిపేట డిపోకు చెందిన అద్దె బస్సు (టీఎస్ 36 టీఏ 3336)ను ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశాడు. అంతటితో ఆగకుండా నేరుగా సిద్దిపేట బస్టాండ్‌కు వెళ్లి ప్రయాణికులను ఎక్కించుకొని వేములవాడకు వచ్చాడు. ఇక్కడి నుంచి హైదరాబాద్ బోర్డుతో ప్రయాణికులను ఎక్కించుకుని బయల్దేరాడు. ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేసి, టికెట్ మాత్రం ఇవ్వలేదు. దీంతో అనుమానం వచ్చిన ప్రయాణికులు.. తంగళ్లపల్లి మండలం సారంపల్లి శివారులోని ఎల్లమ్మ గుడి వద్దకు చేరుకోగానే డ్రైవర్‌ను నిలదీశారు. దీంతో సదరు వ్యక్తి బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు. వెంటనే ప్రయాణికులు డయల్ 100కు కాల్చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఇక్కడి పోలీసులు సిద్దిపేట పోలీసులకు సమాచారమిచ్చారు. సీసీ పుటేజీల ఆధారంగా నిందితుడిని గంభీరావుపేటకు చెందిన రాజుగా గుర్తించారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. -
బీజేపీవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని !
సాక్షి, రాజన్న సిరిసిల్ల: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో టికెట్ ఆశించి భంగపడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. 115 స్థానాలకు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. 9 స్థానాల్లో సిట్టింగ్‌లను మార్చిన విషయం తెలిసిందే ఈ క్రమంలో చోటు దక్కని నేతలు కేసీఆర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తిరుగుబావుట ఎగురవేస్తున్నారు. ఎలాగైనా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేయాలనే ఆశతో పార్టీ మారేందుకు యత్నిస్తున్నారు. ప్రత్నామ్నాయ బీజేపీ, కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే అసంతృప్తి నేతలను తమవైపు తిప్పుకునేందుకు ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి టికెట్ రాని నేతలతో చర్చలు జరుపుతున్నాయి. ఇక అనుకున్నట్టుగానే వేములవాడ చెన్నమనేనికి కాకుండా పోయింది. అంతా భావించినట్టుగానే చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థల చైర్మన్ చల్మెడ లక్ష్మీనర్సింహారావుకే దక్కింది. అయితే, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు దారెటు..? బీఆర్ఎస్ లోనే ఉంటూ చల్మెడ కోరినట్టుగా ఆయనకు సహకరిస్తారా..? లేక, ఇంకో మార్గమేదైనా చూసుకుంటారా..? చెన్నమనేని రాజకీయ వారసత్వానికి కామానో.. లేక, ఫుల్ స్టాప్ పడేందుకు ఆయన సుముఖంగా ఉంటారా..? టిక్కెట్ కొట్లాటకు ముందు ఎంత ఉత్కంఠైతే నెలకొందో.. అదే ఆసక్తి టిక్కెట్ కన్ఫర్మేషన్ తర్వాత కూడా వేములవాడలో కనిపిస్తోంది. చదవండి: వామపక్షాలతో పొత్తులేదని తేల్చేసిన కేసీఆర్.. కమ్యూనిస్టుల కీలక భేటీ వేములవాడ అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు అంతా ఊహించినట్టుగానే ఈసారి టిక్కెట్ దక్కలేదు. అందుకోసం గులాబీబాస్ కేసీఆర్ చెప్పిన కారణం.. చెన్నమనేనిపై వేములవాడ కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్ ఎప్పట్నుంచో పోరాటం చేస్తూ కోర్టుల్లో రచ్చరచ్చగా మారి ద్వంద్వ పౌరసత్వ వివాదమే. అయితే, అది ఆయన్ను పక్కకు పెట్టేందుకు కేవలం సాకు మాత్రమేనని వాదనా ఇప్పుడు రమేష్ బాబు వర్గం నుంచి వినిపిస్తోంది. అలాగైతే.. 2014, 2018కి ముందు నుంచే ఈ వివాదం కొనసాగుతున్నప్పుడు.. అప్పుడెలా మరి రమేష్ బాబు అధికార బీఆర్ఎస్ అభ్యర్థయ్యారో చెప్పాలన్న వాదన ఇప్పుడు రమేష్ బాబు, ఆయన అనుచరవర్గం నుంచి వినిపిస్తోంది. అయితే గతంలో తన తండ్రి ప్రాతినిథ్యం వహించిన వేములవాడ.. చెన్నమనేని ఫ్యామిలీకి ఓ కంచుకోటగా మారిపోయింది. ఈసారి తమ ప్రాతినిథ్యమే లేకపోతే.. అది కామాగా భావించాలని ఎవరైనా చెప్పినా.. ఆ తర్వాత అదే పూర్తిగా ఫుల్ స్టాప్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే మరొకరు వచ్చి జెండా పాతారంటే.. కచ్చితంగా దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలోనే రమేష్ బాబు వేములవాడలో తన తదుపరి భవిష్యత్ కార్యాచరణకై సీరియస్ గా యోచిస్తున్నట్టు తెలుస్తోంది. చదవండి: ఖానాపూర్‌లో నా సత్తా ఏంటో చూపిస్తా: రేఖా నాయక్ సంచలన వ్యాఖ్యలు పైగా నిన్న తనకు టిక్కెట్ దక్కదన్న ప్రచారం నేపథ్యంలోనే.. కేసీఆర్ ప్రకటన కంటే ముందే ఓ భావోద్వేగంతో.. ఒకింత నిర్వేదంతో తన తండ్రి మాటలను ఉటంకిస్తూ.. ఆత్మగౌరవం అనే పదాన్ని వాడుతూ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఆయన అంతరగాన్ని తెలియజెప్పింది. ఈ క్రమంలో అనుకున్నట్టుగానే వేములవాడ టిక్కెట్ ను కేటీఆర్ కు సన్నిహితంగా ఉన్న చల్మెడకు కేటాయించడంతో వేములవాడలో ఒకవైపు చల్మెడ అనుచరుల్లో ఆనందం కనిపిస్తే.. ఇంకోవైపు ఒకింత నైరాశ్యం, మరింత స్తబ్దత వాతావరణం కనిపించింది. తన తండ్రి నుంచి కొనసాగుతూ వస్తున్న రాజకీయ వారసత్వాన్ని వదలుకోవడానికి చెన్నమనేని ఫ్యామిలీ సిద్ధంగా లేదన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే బాబాయ్ అబ్బాయ్ తో పాటు.. చెన్నమనేని ఫ్యామిలీ సభ్యుల్లో కీలకమైనవారంతా వేములవాడలో నెక్స్ట్ జరుగబోయే రాజకీయమెలా ఉండబోతోంది.. తామేం చేయాలనే సమాలోచనల్లో పడ్డట్టుగా సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే బీజేపి ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్.. చెన్నమనేనితో మాట్లాడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జర్మనీలో ఉన్న రమేష్ బాబు.. ఈనెల ఆగస్ట్ 25వ తేదీన వేములవాడకు రానున్నారు. మొత్తంగా రమేష్ బాబు చూపు కూడా బీజేపీ వైపు పడినట్టుగా తెలుస్తోంది. అందుకు తన బాబాయ్ సపోర్ట్ తో పాటు.. ఈటెల కూడా చొరవ తీసుకోవడంతో.. వేములవాడ నుంచి బీజేపి అభ్యర్థిగా బరిలోకి దిగాలన్న యోచనలో రమేష్ బాబు కూడా యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. నర్సాపూర్‌లో నువ్వా నేనా? సిట్టింగ్ మదన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి మధ్య పోటీ ఇప్పటికే ఈ విషయాన్ని బీజేపీ అధిష్ఠానం పెద్దలకు కూడా ఈటెల చేరవేసినట్టు తెలుస్తుండగా.. మరి రమేష్ బాబు పయనమెటు...? ప్రచారం జరుగుతున్నట్టుగా ఆయన బీజేపీలో చేరతారా...? ఈసారి తన టిక్కెట్ కు గండికొట్టే సాకుగా మారిన ద్వంద్వ పౌరసత్వ వివాదాన్నీ.. కేంద్రంలో ఉన్న పార్టీతో కలిస్తే ఏమైనా తొలగించుకునే అవకాశం దొరుకుతుందా వంటి పలు విశ్లేషణలతో కూడిన చర్చలకు ఇప్పుడు తెర లేస్తోంది. మొత్తంగా టిక్కెట్ కన్ఫర్మేషన్కు ముందు రసవత్తరంగా సాగిన రాజన్న క్షేత్రంలోని రాజకీయం.. టిక్కెట్ కన్ఫర్మేషన్ తర్వాత కూడా అంతకంతకూ రసకందాయంగా మారుతుండటం ఇక్కడి విశేషం. -
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహిళపై దుండగుడి దాడి
-
మందు పోయను, ఓడిపోతే మాత్రం.. : కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: ప్రతి పక్షాలు ఓట్లు అడగడానికి వస్తే కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వారికి చెప్పి నిలదీయండి అంటూ తెలంగాణ సమాజానికి మంత్రి కేటీఆర్ పిలుపు ఇచ్చారు. బీసీ బందు పథకంలో భాగంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ జరిగింది. సుమారు 600 మందికి చెక్కులను కేటీఆర్ స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీ దయ ఉంటే మళ్లీ గెలుస్తా. మందు పోయను. ఒకవేళ ఓడిపోతే మాత్రం.. ఎలాగైనా మీకు సేవ చేసుకుంటూనే ఇంట్లో కూర్చుంటా అంటూ వ్యాఖ్యానించారాయన. అలాగే.. పింఛన్ పెంపుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపైనా కేటీఆర్ స్పందించారు. ‘‘ప్రతిపక్షాలు మాకు సలహాలు ఇస్తే కేసీఆర్ పెన్షన్ పెంచలేదు. ఆరువందల మందికి పెన్షన్ వస్తే వార్త కాదు.. ఆరుగురికి రాకపోతే ఇవాళ రేపు వార్త అవుతోంది. తెలంగాణాలో 12 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చాం. వేములవాడ తిప్పాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 70% శాతం ప్రసవాలు జరుగుతున్నాయి. జిల్లాలో వచ్చే నెలలో కేసీఆర్ చేతుల మీదుగా మెడికల్ కాలేజీ ప్రారంభిస్తాం. చేనేత దినోత్సవం సందర్భంగా 9 రకాల పథకాలు అమలు చేసుకున్నాం. అలాగే.. బీసీబంధు అంటే లోన్ కాదు. ఇది కేవలం మీ(బీసీ లబ్ధిదారుల్ని ఉద్దేశించి..) కులవృతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇస్తున్న గ్రాంట్ మాత్రమే. తిగిగి కట్టవలసిన అవసరం లేదు అని స్పష్టం చేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన.. ‘‘వేములవాడకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. 24 గంటలు మంచి నీరు అందేలా చర్యలు చేపడుతున్నాం. వేములవాడ ఆలయాన్ని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేస్తాం’’ అని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇదీ చదవండి: కోకాపేట వేలంపాటపై సంచలన ఆరోపణలు -
విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి మిడ్‌మానేర్‌లో దూకిన తల్లి
సాక్షి, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో విషాదం చోటుచేసకుంది. బోయినపల్లి మండలం శభాష్‌పల్లి వంతెన వద్ద పిల్లలతో సహా ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కడుపున పుట్టిన ముగ్గురు బిడ్డలతో కలిసి బుధవారం మిడ్ మానేరు రిజర్వాయర్‌లోకి దూకి ప్రాణాలు విడిచింది. మృతుల్లో పద్నాలుగు నెలల పసికందు కూడా ఉండటం మనసుని కలిచివేస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను నీటిలోంచి వెలికితీశారు. చనిపోయిన వారిని తల్లి రజిత, అయాన్(7), అశ్రజాబిన్(5), ఉస్మాన్ అహ్మద్(14నెలలు)గా గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా వేములవాడ అర్భన్ మండలానికి చెందిన రజిత, కరీంనగర్‌లోని సుభాష్ నగర్‌కు చెందిన మహ్మద్ అలీది ప్రేమ వివాహం. ఈ క్రమంలో పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పి పిల్లలు కలిసి బయల్దేరింది. అప్పటి నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నేడు మిడ్ మానేరులో నాలుగురిని విగత జీవులుగా గుర్తించారు. కుటుంబ కలహాల వల్లే మహిళ ఇంతటి దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: సారీ కవిత నా వల్ల మాటలు పడ్డావ్.. తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం -
రాజన్న సిరిసిల్లలో ముగిసిన జవాన్ అనిల్ అంత్యక్రియలు
-
రాజన్న సిరిసిల్లలో ఆర్మీ జవాన్ పీ.అనిల్ అంత్యక్రియలు
-
పెళ్లయిన వెంటనే రంగంలోకి.. అటు వివాహం.. ఇటు నినాదం
సాక్షి, బోయినపల్లి(చొప్పదండి): తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ వధూవరులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. వివరాలివి. రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలం రామన్నపేట జూనియర్ పంచాయతీ కార్యదర్శి నాగుల శ్రీకాంత్, కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల జూనియర్ పంచాయతీ కార్యదర్శి మౌనిక వివాహం బుధవారం కరీంనగర్ జిల్లా కేశవపట్నంలో జరిగింది. పెళ్లితంతు అనంతరం వధూవరులిద్దరూ.. ‘జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్ చేయాలి..’ అనే ప్లకార్డు ప్రదర్శించారు. (చదవండి: నో పార్కింగ్.. అయితే ఏంటి?) -
పిల్లనిచ్చి వరకట్నంగా కుక్కలు..
సిరిసిల్ల: శునకాలను కొందరు అభిరుచికొద్దీ, ఇంకొందరు ఇంటికి రక్షణ కోసం పెంచుకుంటారన్న విషయం తెలిసిందే. కానీ.. శునకరాజాలను ఆస్తిగా భావిస్తూ.. ఆడపిల్లలకు కట్నంగా కూడా ఇచ్చే కుటుంబాలు కూడా ఉన్నాయి. వాళ్లెవరూ, వారి జీవనశైలి ఏమిటి? తెలుసుకోవాలనుకుంటున్నారా..! రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు గ్రామాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగించే గంగిరెద్దుల కుటుంబాలు ఉన్నాయి. కోనరావుపేట మండలం కొండాపూర్, బావుసాయిపేట, చందుర్తి మండలం రామారావుపల్లె గ్రామాల్లో దాదాపు వంద కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ మూడు పల్లెలకు చెందిన గంగిరెద్దుల కుటుంబాల వారు జిల్లావ్యాప్తంగా భిక్షాటన చేస్తారు. ఆహారాన్ని సేకరించి కుక్కలను పోషిస్తారు. ఈ కుక్కలను వేటకు, వారు నివాసం ఉండే గుడారాల రక్షణకు ఉపయోగిస్తారు. ఒక్కో కుటుంబంలో ఐదు నుంచి పది, పదిహేను, ఇరవై.. శునకాలను పెంచుతుంటారు. అయితే శునకాలనే ఆస్తిలా భావించే ఈ ఆచారం గంగిరెద్దుల కుటుంబాల్లో తరతరాలుగా కొనసాగుతోంది. ఎన్ని ఎక్కువ శునకాలను పెంచితే అంత ఆస్తిపరులన్న మాట. వారు పోషిస్తున్న శునకాల సంఖ్యను బట్టే ఆ కుటుంబపెద్దకు వారి కులంలో గౌరవం లభిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఆడ పిల్లలకు పెళ్లిలో కట్నంగా శునకాలను ఇచ్చే సంప్రదాయం ఈ కుటుంబాల్లో ఉంది. అయితే ఇప్పుడిప్పుడే ఆ కుటుంబాల్లో మార్పు వస్తోంది. వ్యవసాయం చేస్తూ కొందరు.. చిన్న చిన్న బుట్టల్లో ప్లాస్టిక్ సామగ్రి అమ్ముతూ, కొబ్బరి కుడుకలకు బదులు చక్కెర ఇçస్తూ కొందరు జీవనం సాగిస్తున్నారు. ఒకప్పుడు ఎక్కువగా ఉండేవి.. మాకు కుక్కలను పెంచడం ఆనవాయితీగా వస్తోంది. ఇంటి ముందు ఎన్ని ఎక్కువ కుక్కలుంటే అంత విలువ ఉండేది. ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ తక్కువ. కాలం మారినా.. మాకు కుక్కలు ఉండాల్సిందే. మేం ఏం తింటే అదే వాటికి పెడతాం. మాతోనే ఉంటాయి. మేం ఏ ఊరికి వెళ్తే.. ఆ ఊరికి మా వెంట వస్తాయి. – టేకుమల్ల రాజయ్య, సంచార జీవి. శునకాలే మా ఆస్తి.. మునుపు ఎక్కువ కుక్కలను పెంచేటోళ్లం. షికారీ చేసేవాళ్లం. కానీ ఇప్పుడు మావోళ్లు సోకులకు వచ్చిండ్రు. కుక్కలను ఎక్కువ సాదుత లేరు. వ్యవసాయం చేస్తుండ్రు. కుడుకలకు చక్కరి అమ్ముతూ.. బతుకుతుండ్రు. బిచ్చం ఎత్తడం లేదు. అయినా మాకు కుక్కలతోనే ధనం. – గంట లచ్చయ్య, బావుసాయిపేట. -
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ కాలేజీ ప్రారంభించిన కేటీఆర్
-
వేములవాడ : వైభవంగా పార్వతీ రాజరాజేశ్వర కల్యాణం (ఫొటోలు)
-
ప్రధాని పేరైనా మార్చుకోవాలి.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజ్‌భవన్‌ను రాజకీయాలకు అడ్డాగా మార్చడం మనుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. రాజ్‌భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో పెట్టుకున్నారని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థను బ్రిటిష్ వారు ప్రవేశ పెట్టారని.. దానిని ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్‌ను ఎవరు ఎన్నుకున్నారని రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి రాజకీయాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారు కూడా పార్టీలకు అనుకూలంగా, పార్టీల ప్రతినిధులుగా పార్టీల చర్చల్లో పాల్గొనడం, రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేయడం మానుకుంటే మంచిది. ఇంత అన్యాయంగా ఒక పార్టీ గురించే మాట్లాడుతూ, ఒక పార్టీ నాయకుల ఫోటోలనే రాజ్‌భవన్‌లో పెట్టుకుంటూ రాజ్‌భవన్‌ను రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చడం దేశానికి మంచిది కాదు. వ్యవస్థకు మంచిది కాదు. బ్రిటీష్ కాలం నాటి బానిస చిహ్నాలు పోవాలని మొన్న మోదీ గొప్ప స్పీచ్ ఇచ్చారు. అందుకే రాజ్‌పథ్‌ను కర్తవ్య పథ్ అని మార్చామని ప్రధాని అన్నారు. మరి గవర్నర్ వ్యవస్థ కూడా బ్రిటీషోళ్లు పెట్టిందే. అవి ఎందుకు ఉండాలి.. దాని వల్ల దేశానికి ఏం ఉపయోగమో చెప్పాలి. రాజకీయాల్లో ఉన్నవారికి గవర్నర్ పదవి ఇవ్వొద్దని మోదీనే చెప్పారు. రెండేండ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటేనే ఇవ్వాలన్నారు. మరి ఇవాళ మోదీ అది పాటిస్తున్నాడా..? ముఖ్యమంత్రి మోదీనేమో నీతులు చెబుతాడు. ప్రధానమంత్రి మోదీనేమో అదే నీతులను తుంగలో తొక్కుతాడు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉంటాయి. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి ఉంటారు. గవర్నర్ పదవికి బ్రిటీష్ కాలంలో అర్థం ఉండే. ఎందుకంటే పైనా వైశ్రాయ్ ఉండే.. కింద గవర్నర్ ఉండే.. వారు సంభాషించుకునేవారు. ఇక ప్రధానమంత్రైనా ఆయన పేరును వైశ్రాయ్ అని మార్చుకోవాలి. లేదంటే ఇక్కడ గవర్నర్లను అయినా ఎత్తేయాలి. ఇతరులకు చెప్పేముందు ఆయన ఆలోచించుకుంటే మంచిది’ అని కేటీఆర్ సూచించారు. చదవండి: అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగానికి గవర్నర్ తమిళిసైకి ఆహ్వానం -
సిరిసిల్ల: షాలిని ప్రేమ-పెళ్లి వ్యవహారం సుఖాంతం?!
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల జిల్లాలో సంచలనంగా మారిన యువతి కిడ్నాప్ వ్యవహారం.. ఆపై ఇష్టపూర్వక వివాహంగా మారి ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం నుంచి ఈ కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తనకు నచ్చిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నానని షాలిని ప్రకటించడం, ఆమెను బెదిరించి ఉంటారన్న తల్లిదండ్రుల అనుమానాలతో కేసు ఉత్కంఠగా మారింది. అయితే.. సాయంత్రం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేను కలిసిన నవ దంపతులు.. రక్షణ కోసం అభ్యర్థించారు. ఈ క్రమంలో.. ఆ జంటకు కౌన్సెలింగ్ నిర్వహించిన ఆయన.. పెద్దలను పిలిపించి మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు సమాచారం. తన ఇష్ట ప్రకారమే తన ప్రియుడితో వెళ్లానని తెలిపిన ఎస్పీకి షాలిని వాంగ్మూలం ఇచ్చింది. అంతేకాదు నాలుగైదేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్లు తెలిపారు. ఏడాది కిందట ఈ ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే.. షాలిని అప్పటికి మైనర్ కావడంతో.. వివాహం చెల్లదని చెబుతూ పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి జైలుకి పంపించారు. ఈ క్రమంలో.. మైనార్టీ తీరాక వివాహం చేసుకుందామని షాలినితో చెప్పాడు జ్ఞానేశ్వర్. త్వరలోనే వచ్చి తీసుకెళ్తానని ఆమెకు ముందుగానే సమాచారం ఇచ్చాడు. అయితే.. షాలిని గుడికి వెళ్తుందనే సమాచారం జానీకి ముందే తెలుసు!. అందుకే ఆమెను తీసుకెళ్లే యత్నం చేశాడట. కానీ.. ముఖానికి అడ్డుగా కర్చీఫ్ ఉండడంతో ఎవరో అనుకుని ఆమె భయపడి ప్రతిఘటించినట్లు షాలిని వెల్లడించింది. తీరా కారులోకి వెళ్లాక.. అది అతనే అని తెలిసి వెంట వెళ్లినట్లు చెప్పింది. తమ ఇష్టప్రకారమే వివాహం జరిగిందని, తల్లిదండ్రుల నుంచి ప్రాణ భయం ఉందని రక్షణ కల్పించాలని ఆ నవ దంపతులు జిల్లా ఎస్పీని కోరారు. దీంతో.. ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో కిడ్నాప్ గురైందనుకున్న యువతి షాలిని.. పెళ్లి చేసుకొని వీడియో రికార్డులను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. మా బిడ్డను మా ముందు నిలబెట్టండి ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నానని చెప్తున్న షాలిని వ్యవహారంలో తమ గోడును కూడా వినాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. బలవంతంగా షాలినిని ఎత్తుకెళ్లి వివాహం చేసుకుని ఉంటాడని, తమ బిడ్డను తమ ముందు నిలబెడితే అసలు విషయం తేలుతుందని షాలిని తల్లిదండ్రులు వాపోతున్నారు.భయపెట్టి లేదంటే తమను చంపుతామని బెదిరించి.. తమ కూతురితో జానీ అలా చెప్పించి ఉంటారని షాలిని తల్లిదండ్రులు చంద్రయ్య-పద్మ ఆరోపిస్తున్నారు. -
బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్
సాక్షి, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. డ్రగ్స్ టెస్ట్ కోసం తాను రెడీ అంటూనే.. బండి సంజయ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు ఆయన. డ్రగ్స్ టెస్ట్ కోసం నా రక్తం, కిడ్నీ, బొచ్చు.. ఏది కావాలంటే అది ఇస్తా. ఇక్కడే ఉంటా. డాక్టర్లను తీసుకుని రా? క్లీన్‌చిట్‌తో బయటకు వస్తా. చెప్పినట్లు బండి సంజయ్ తన చెప్పుతో తనను తాను కొట్టుకుంటాడా? అంటూ కేటీఆర్ మండిపడ్డారు. జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ మనిషా? పశువా? అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారు కేటీఆర్. ఫాల్తూ మాటల రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. నాకు క్లీన్చిట్ వస్తే కరీంనగర్లో కమాన్ దగ్గర సంజయ్ చెప్పుతో తనను తాను కొట్టుకుంటాడా? అని మండిపడ్డారు కేటీఆర్. ఇంకా ఆయన ఏమన్నారంటే.. 👉రైతు బంధు రూ. 65 వేల కోట్ల ఇచ్చిన ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం. ఇంత కన్నా మేలు చేసిన ప్రభుత్వాలు ఏవైనా ఉన్నాయా?. 👉కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనం అన్నా.. కేసీఆర్ నాయకత్వం కొన్నది. ఎర్రటి ఎండలో నీటి ప్రవాహం వచ్చింది అంటే కేసీఆర్ ఘనత కాదా?. 👉ఇక్కడ నిలబడ్డ బిజెపి అభ్యర్థులను కోరుతున్నా.. నేతన్న కార్మికులకు, రైతులకు మీరు ఏమైనా చేశారా?. బండి సంజయ్‌ను అడుగుతున్నా.. భైంసా ను దత్తత తీసుకున్న అంటున్నావు తీసుకో కానీ నీవు గెలిచిన నీ నియోజక వర్గంలో ఎం చేసినావు? 👉వేములవాడ కు 100 కోట్ల తో అభివృద్ది చేపించావా?. 👉IIIT అడిగాము. కానీ అదికూడా తీసుకు రాలేవు. ఈ బడ్జెట్ కి ఎంపికి ఇదే చివరి అవకాశం. ఇప్పటికైనా కరీంనగర్ ప్రజలకు ఏమైనా తీసుకు రా. బడ్జెట్ సమావేశాలకు వెళ్లు.. హిందీ రాకపోతే ఇంగ్లీష్ మాట్లాడు. కానీ, కరీంనగర్ కు ఏమైనా తీసుకు రా. 👉ఇద్దరు గుజరాత్ వాళ్ళు దేశాన్ని నడుప్పొచ్చు. కానీ మన రాష్ట్రాన్ని నడిపే ముఖ్యమంత్రి దేశాన్ని నడుపరాదు అంట!. 👉బిజెపి సోదరులు లక్ష్మణ్ మాట్లాడుతూ బి అర్ ఎస్ అట్టర్ ప్లాప్ అంటున్నారు. మహారాష్ట్ర లోని కొన్ని మండలాల ప్రజలు తెలంగాణలో కలుపుకోవాలి అని అంటున్నారు. లచ్చన్నకు గెలుపు గర్వం వద్దు అని అంటున్న అని కేటీఆర్ ప్రసంగించారు. -
మాడపల్లి కిడ్నాప్ ఉదంతంపై కేటీఆర్ స్పందన
సాక్షి, రాజన్న సిరిసిల్ల: మాడపల్లి యువతి కిడ్నాప్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. తండ్రితో కలిసి వేకువ ఝామున గుడికి వెళ్లిన యువతిని అపహరించుని వెళ్లారు దుండగులు. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజీ ద్వారా వైరల్ అవుతోంది. అయితే.. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గ జిల్లా పరిధిలో జరిగిన ఈ ఘటన గురించి.. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు దురదృష్టకరమన్న ఆయన.. కిడ్నాప్ నిందితులను సాయంత్రంలోగా పట్టుకోవాలని కేటీఆర్ ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను ఎవరిని ఉపేక్షించొద్దని సూచించారాయన. ఇదిలా ఉంటే.. చందుర్తి మండలం మూడపల్లీ గ్రామ యువతి కిడ్నాప్ ఉదంతం కలకలం సృష్టించింది. ఎంగేజ్మెంట్ అయిన మరునాడే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. గతంలో బాధితురాలిని ప్రేమ పేరుతో వేధించిన యువకుడే.. ఈ నేరానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. -
మూడపల్లిలో యువతి కిడ్నాప్
-
సిరిసిల్ల టౌన్ ఎస్సై ఉపేందర్‌రెడ్డి మృతి
సాక్షి, సిరిసిల్ల క్రైం: సిరిసిల్ల టౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్సై ఉపేందర్‌రెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లంతకుంట మండలంలోని ఒబులాపూర్‌కు చెందిన ఉపేందర్‌రెడ్డి 28 ఆగస్టు 1990న కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరారు. పదోన్నతులతో ఎస్సై స్థాయికి ఎదిగారు. వేములవాడ ఆర్అండ్ఆర్ కాలనీలోని అద్దె ఇంట్లో భార్య విజయతో ఉంటున్నారు. ఆయన రామగుండం, ఆదిలాబాద్ జిల్లాలో హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్సైగా పని చేశారు. 2019లో ఎస్సైగా వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో విధుల్లో చేరారు. 8 నెలల క్రితం బదిలీపై డీపీవో కార్యాలయానికి వచ్చారు. ఉపేందర్‌రెడ్డి చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఇటీవల అవి ఎక్కువవడంతో పది రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు కాగా వారికి పెళ్లిళ్లు జరిపించారు. ఎస్సై మృతికి ఎస్పీ రాహుల్‌హెగ్డే సంతాపం ప్రకటించారు. -
రెండు దశాబ్దాల్లోనే మారిన దశ.. నాడు కల్లోలం.. నేడు ప్రశాంతం
సిరిసిల్ల: గోధూళి వేళ.. వ్యవసాయ పనులు ముగించుకుని అందరూ ఇళ్లకు చేరుతున్నారు.. సూర్యుడు అస్తమించాడు.. చీకటి కమ్ముకుంటుంది.. అంతలోనే కంజీరమోతలు.. ఎర్రెర్రని పాటలు.. ఆవేశపూరిత ప్రసంగాలు.. దోపిడీలేని సమాజం కోసం విప్లవించాలనే నినాదాలు.. ప్రజాకోర్టు.. ఊరిలోని అంశాలపై బహిరంగ చర్చలు.. లాల్ సలామ్ అంటూ.. వీడ్కోలు..! మరసటి రోజు తెల్లవారుజామున 5 గంటలు.. బూట్ల చప్పుళ్లతో ఊరు తెల్లవారింది.. ఆ పల్లెలోని వారిని ఊరు విడిచి వెళ్లకుండా కట్టడి. గ్రామ చావడి వద్దకు అందరిని చేర్చి ప్రజాదర్భార్. మేమున్నదే మీకోసం అంటూ అడవుల్లో తిరిగే వాళ్లకు మీరు అన్నం పెట్టొద్దు.. మొన్న వాళ్లకు అన్నం పెట్టిన వారు ఎవరో మాకు తెలుసు.. వాళ్ల సంగతి మేం చూసుకుంటాం.. మీరు మాత్రం వాళ్లకు సహకరించొద్దు. చట్టం ఉందే మీకోసం.. అంటూ.. ఖాకీ డ్రెస్సుల పిలుపు..! ఇది రెండు దశాబ్దాల కిందట రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పల్లెల్లో పరిస్థితి. అడకత్తెరలో పోకచెక్కల్లా ప్ర జలు బిక్కుబిక్కుమంటూ గడిపేవారు. ఊరు మారింది ఇరవై ఏళ్ల క్రితం పరిస్థితులు, ఇప్పటి స్థితిని అంచనా వేస్తే పల్లెలు ఎంతో మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మారుమూల కోనరావుపేట మండలం బావుసాయిపేటను పరిశీలిస్తే ఆ విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఆ పల్లెకు వాహనయోగం వ చ్చింది. అప్పట్లో ఊరు మొత్తంలో మూడు, నాలు గు వాహనాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఇంటికో బైక్, ఊరి నిండా ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు ఇలా ఎంతో మార్పు వచ్చింది. జిల్లాలోనే అత్యధి క కోళ్ల పరిశ్రమ ఆ గ్రామంలో విస్తరించింది. 20 కోళ్ల ఫారాలతో పౌల్ట్రీ రంగంలో అగ్రస్థానంలో ఉంది. ఆ ఊరిలో పట్టణాల తరహాలో సూపర్మార్కెట్లు నడుస్తున్నాయి. ఒకప్పటి కల్లోల పల్లె ఇప్పుడు ప్రశాంతంగా ప్రగతి పథంలో పరుగులు తీస్తుంది. బావుసాయిపేట ఊరి జనాభా నాలుగు వేలు. ఓటర్ల సంఖ్య 2,740, వార్డులు పది. నివాసాల సంఖ్య 876. చిన్న ఊరే అయినా అభివృద్ధిలో అగ్రపథాన నిలుస్తుంది. తీరొక్కటి దొరికే... సంత బావుసాయిపేటలో ప్రతీ బుధవారం జరిగే వారసంతలో తీరొక్క వస్తువులు దొరకుతాయి. చేపలు, రొయ్యలు మొదలు కొని బట్టలు, నిత్యసవరమైన వస్తువులు అన్నీ లభి స్తాయి. దీంతో కొండాపూర్, వెంకట్రావుపేట, బండపల్లి, గోవిందరా వుపల్లె గ్రామాల వాసులు వారసంతకు వచ్చి సరుకులు కొనుగోలు చేస్తారు. ఊరు శివారులో మూలవాగు, మరో రెండు చెరువులు ఉండడంతో భూగర్భజలాలకు కొదువ లేదు. వరి, పత్తి, మొక్కజొన్న, నువ్వులు వంటి పంటలను సాగుచేస్తారు. భూములు కొనుగోలు, విక్రయాలతో ఊరి ఆర్థికస్థితి మెరుగుపడింది. వ్యవసాయంలో బావుసాయిపేటలో అగ్రగామిగా నిలుస్తుంది. దీంతో గ్రామీణ ఆర్థికస్థితి ఎంతో బాగుపడింది. ఊరిలో రోడ్డుకు ఇరువైపులా ఉండే చెట్లు పల్లె అందాన్ని పెంచాయి. ఎంతో మార్పు వచ్చింది ఒకప్పటితో పోల్చితే ఊరిలో ఎంతో మార్పు వచ్చింది. రోడ్లు బాగుపడ్డాయి. రవాణా వసతి పెరిగింది. కమ్యూనికేషన్ పెరిగింది. ప్రజల జీవనంలోనూ మార్పు వచ్చింది. పట్టణాల్లో దొరికేవి అన్ని పల్లెల్లో అన్నీ లభిస్తున్నాయి. – బైరగోని నందుగౌడ్, చైతన్య యూత్, అధ్యక్షుడు వేగంగా అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత పల్లెల్లో అభివృద్ధి వేగంగా సాగుతుంది. అన్ని రంగాల్లో మార్పు వేగంగా జరిగింది. ఇంటింటా సెల్‌ఫోన్ యుగమైంది. గతంలో పోల్చితే.. పల్లె ముఖచిత్రం ఎంతో మారింది. కల్లోల పల్లెల్లో వ్యవసాయ విస్తరణతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడింది. – కెంద గంగాధర్, గ్రామ సర్పంచ్ -
Paralysis: పక్షవాతం పడగొడుతోంది!
ఈ చిత్రంలో కనిపిస్తున్న దంపతులు ముస్తాబాద్‌కు చెందిన అనమేని బాలయ్య, శ్యామల. మేస్త్రీ పనిచేస్తూ, వ్యవసాయం చేసుకునే బాలయ్యకు ఏడాదిన్నర క్రితం పక్షవాతం వచ్చింది. అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడు. రూ.3లక్షల వరకు అప్పు చేసి వైద్యం చేయిస్తున్నారు. కూతురు వెన్నెలను ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదివిస్తున్నారు. బాలయ్యకు నెలకు రూ.13వేల వరకు ఖర్చు అవుతుంది. ఈ చిత్రంలో మంచానికే పరిమితమైన మెంగని శ్రీనివాస్(51)ది ముస్తాబాద్. ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లిన శ్రీనివాస్ 2020లో తిరిగొచ్చాడు. ఆరు గెదెలు కొని, డెయిరీతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అంతలోనే శ్రీనివాస్‌కు పక్షవాతం రాగా.. రూ.8లక్షలు ఖర్చ య్యింది. అయినా నయం కాలేదు. కుటుంబ పెద్ద పక్షవాతానికి గురవడంతో పాలిటెక్నిక్ పూర్తి చేసిన కొడుకు వివేక్ బీటెక్‌కు చదువలేకపోయాడు. ప్రైవేటు ఉద్యోగం చేస్తూ తండ్రికి ఆసరాగా నిలుస్తున్నాడు. చిన్నకుమారుడు సాత్విక్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ముస్తాబాద్(సిరిసిల్ల): జిల్లాలో ఇటీవల పక్షవాతానికి గురవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. మారుతున్న జీవన విధానం.. ఆహారమార్పులతో బీపీ(బ్లడ్ ప్రెషర్) పెరిగి అనారోగ్యం పాలవుతున్నారు. బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైన వ్యక్తులు మంచానికి పరిమితం అవుతుండగా.. చికిత్స కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కుటుంబాలు అప్పులపాలవుతున్నాయి. మారుతున్న జీవన విధానం ప్రస్తుత ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలతో చిన్న వయస్సులోనే పక్షవాతానికి గురవుతున్నారు. పెరుగుతున్న రక్తపోటు(బీపీ), షుగర్, కొలెస్ట్రాల్ వంటి వాటితో పక్షవాతం దాడి చేస్తుంది. ఒకే చోట కదలకుండా పనిచేయడం, మద్యం ఎక్కువగా తాగడం, మాంసం, జంక్‌ఫుడ్ తీసుకోవడం, పొగతాగే అలవాటు ఉన్న వాళ్లలో పెరాలసిస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. అతిగా మొబైల్ వినియోగించే వారిలోనూ పెరాలసిస్ లక్షణాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. స్పందించే సమయం ముఖ్యం పక్షవాతానికి గురయ్యే వారికి ముందుగానే లక్షణాలు బయటపడుతుంటాయి. ఇలాంటి లక్షణాలు ముందుగానే గుర్తించి తక్షణమే వైద్యం అందిస్తే త్వరగా కోలుకునే లక్షణాలు ఉన్నాయి. ఇటీవల సిరిసిల్లకు చెందిన ఒకరు పక్షవాతానికి గురికాగా కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అత్యంత వేగంగా స్పందించిన డ్యూటీ డాక్టర్ పక్షవాతానికి గురైన నాలుగు గంటల్లోపే ఖరీదైన ఇంజక్షన్ ఇవ్వడంతో శాశ్వత పక్షవాతం నుంచి బయటపడ్డాడు. (క్లిక్: ఆర్థరైటిస్‌తో బాధ పడుతున్నారా? ఇలా చేస్తే..) ఇలా తెలుసుకోవాలి మెదడులో ఒక ప్రాంతం ఒక్కో భాగాన్ని నియంత్రిస్తుంది. రక్తప్రసరణ నిలిచిపోయినప్పుడు ఆ భాగంలో రక్తం గడ్డకట్టి తలనొప్పి, కళ్లు తిరగడం, అపస్మారక స్థితిలోకి వెళ్తుంటాయి. నాడీవేగం తగ్గడం, తల, కళ్లు ఒక వైపునకు తిరగడం. కనుపాపలు వెలుతురుకు స్పందించకపోవడం జరుగుతుంది. మూత్ర ఆపుకునే శక్తి సన్నగిల్లడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, వాంతి సమస్యలు లక్షణాలు కనిపిస్తాయి. బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైన వారు బలహీనంగా ఉంటారు. పక్షవాతానికి గురైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి, ఎంతవేగంగా చికిత్స అందిస్తే రికవరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ–హెల్త్ ద్వారా నమోదు జిల్లాలో ఈ–హెల్త్ అధికారులు సర్వే చేపట్టారు. జిల్లాలో అధిక రక్తపోటు(బీపీ) కేసులు 29,213 ఉన్నాయి. ఇందులోని వారే పెరాలసిస్‌కు గురవుతున్నట్లు ఆరోగ్యశాఖ భావిస్తోంది. జిల్లాలో దాదాపుగా 2500 ఆపైగా పక్షవాతం కేసులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. పక్షవాతానికి కారణమయ్యే షుగర్ కేసులు కూడా జిల్లాలో 13,331 కేసులు ఉన్నాయి. పెరాలసిస్ బాధితులకు కూడా ప్రభుత్వం అండగా నిలవాలని పేద కుటుంబాలు కోరుతున్నాయి. (క్లిక్: స్వదేశీ సాహివాల్‌కు అద్దె గర్భంతో కొత్త ఊపిరి) జీవన విధానం మార్చుకోవాలి ప్రజల జీవన విధానంలో మార్పులు వచ్చా యి. స్మోకింగ్, ఆల్కహల్, జంక్‌ఫుడ్ తీసుకుంటున్నారు. యువత కూడా పెరాలసిస్‌కు గురవడం సాధారణంగా మారింది. లక్షణాలు బయటపడగానే చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. మానసిక ఒత్తిడికి గురికావద్దు. వ్యాయామం, యోగా చేయాలి. – డాక్టర్ చింతోజు శంకర్, ఐఎంఏ జిల్లా మాజీ అధ్యక్షుడు -
రోడ్డెక్కిన ‘మధ్యమానేరు’ నిర్వాసితులు
వేములవాడ అర్బన్: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు ముంపు గ్రామాల్లో ఏళ్లుగా నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ నిర్వాసితులు సోమవారం రోడ్డెక్కారు. ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాధర్నాకు పూనుకున్నారు. ముందస్తుగా పోలీసులు ముంపు గ్రామాలైన అనుపురం, రుద్రవరం గ్రామాల్లో భారీగా మోహరించారు. సోమవారం వందలాది మంది నిర్వాసితులను పోలీసులు అడ్డుకోవడంతో అనుపురం వద్ద కరీంనగర్–సిరిసిల్ల రోడ్డుపై బైఠాయించారు. అదే సమయంలో వివిధ ముంపు గ్రామాల నిర్వాసితులు నందికమాన్ వద్దకు భారీగా తరలివచ్చారు. ‘మేం వ్యవసాయం చేసుకుందామంటే భూములు లేవు. చేతిలో పనిలేక అడ్డాకూలీలుగా మారాం’అని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామన్న ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని మండిపడ్డారు. పట్టా ఇచ్చిన ప్రతీ కుటుంబానికి రూ.5.04 లక్షలు ఇస్తామన్న సీఎం కేసీఆర్ హామీ నెరవేర్చలేదన్నారు. తమకు ఇళ్లు, భూముల పరిహారం, పట్టాలు, యువతకు ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాదాపు 300 మందిని పోలీసులు కోనరావుపేట పీఎస్‌కు తరలించారు. మహాధర్నాకు తరలివస్తున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులను వేములవాడ బ్రిడ్జిపై పోలీసులు అరెస్ట్ చేసి తంగళ్లపల్లి ఠాణాకు తరలించారు. నిర్వాసితులకు అండ: రేవంత్‌రెడ్డి మిడ్‌మానేరు నిర్వాసితులకు సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చలేదని, వారికి న్యాయం జరిగేంతవరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ధర్నా చేస్తున్న నిర్వాసితులపై పోలీసులు దౌర్జన్యం చేయడం దుర్మార్గమని, నిర్వాసితులతో పాటు కాంగ్రెస్ నేతల అరెస్టును ఖండిస్తున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయం చేయాలి: బండి రాష్ట్ర ప్రభుత్వం మిడ్‌మానేరు బాధితుల డిమాండ్లపై స్పందించి వెంటనే న్యాయం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ముంపు బాధితులకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న జేఏసీ, బీజేపీ నేతలను, మహిళలను అరెస్ట్ చేయడాన్ని ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలన్నారు. -
11 ఏళ్ల కిందట సంచలనం.. ఇప్పటి యువ ఐపీఎస్‌లకు పాఠమైంది..
సిరిసిల్ల(రాజన్న సిరిసిల్ల): డబ్బుల కోసం వేసిన వలపుగాలానికి సంపన్న వ్యక్తి చిక్కాడు. మహిళతో సుతిమెత్తగా మాట్లాడిస్తూ.. అతడ్ని ట్రాప్ చేసి దూర ప్రాంతానికి రప్పించారు. ఓ గదిలో బంధించారు. అతడి కుటుంబానికి ఫోన్ చేసి లక్షలు డిమాండ్ చేశారు. సొమ్ములిచ్చేంత వరకు ఆ వ్యక్తిని చిత్రహింసలు పెట్టారు. తమను గుర్తు పడితే లైఫ్‌కే ప్రమాదమని చంపేశారు. మృతదేహం వానస రాకుండా ఫ్రిజ్‌లో కుక్కేశారు. పదిరోజులైనా ఆచూకీ లభించలేదు. కేసును చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని వినియోగించి ఛేదించారు. నిందితులను పట్టుకుని జైలుకు పంపారు. ఆ హత్యకేసులో ఆరుగురికి యావజ్జీవ శిక్ష పడింది. సిరిసిల్లలో 2011 జూన్‌లో సంచలనం సృష్టించిన ఈ ఘటన ఇప్పుడు హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ ఐపీఎస్‌లకు పాఠమైంది. మిస్టరీగా మారిన యువకుడి హత్యోదంతాన్ని అన్ని ఆధారాలతో సహా కోర్టు ఎదుట ఉంచడంలో పోలీసులు సక్సెస్ అయిన తీరును అకాడమీలో హిస్టరీగా బోధించారు. 11 ఏళ్ల కిందట సంచలనం సృష్టించిన ఆ ఘటనపై ప్రత్యేక కథనం.! చదవండి👉: బొంగులో చికెన్ తెలుసు కానీ.. బొంగులో కల్లు పేరు విన్నారా? క్రైం నంబరు 173/2011 సిరిసిల్ల పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపా రి గర్దాస్ శ్రీనివాస్(42). అతనికి భార్య లలిత, ఇద్దరు పిల్లలు సాయికృష్ణ, శ్రీకాంత్, తల్లిదండ్రులు సునంద, నర్సప్ప ఉన్నారు. సుజాత అనే మహిళ శ్రీనివాస్‌కు ఫోన్లో పరిచయమైంది. హైదరాబాద్ రావాల్సిందిగా కోరింది. శ్రీనివాస్ 2011 జూన్ 20న హైదరాబాద్ ఉప్పల్‌లోని ఏఆర్కే అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. ఆరుగురు సభ్యులు గల ముఠా పథకం ప్రకారం అతన్ని నిర్బంధించి కుటుంబసభ్యులను రూ.25లక్షలు డిమాండ్ చేశారు. శ్రీనివాస్ తండ్రి నర్సప్ప నిందితులు సూచించిన బ్యాంకు ఖాతాలో రూ.1.50 లక్షలు వేశాడు. ఆ డబ్బులను వివిధ ఏటీఎంల నుంచి డ్రా చేసుకున్నారు. తమను గుర్తుపడితే సమస్య ఏర్పడుతుందని అదే అపార్ట్మెంట్లో హత్యచేశారు. ఫ్రిజ్‌లో శవాన్ని మూటకట్టి ఉంచారు. ఈ ఘటనపై సిరిసిల్ల పోలీసులు క్రైం నంబరు 173/ 2011 కేసు నమోదు చేశారు. పక్కావ్యూహంతో.. వలపు వల ♦ప్రస్తుత మంచిర్యాల జిల్లాకు చెందిన కొండపాక శ్రీధర్ ఉరఫ్ శేఖర్(30) 2003 నుంచి వివిధ నేరాల్లో జైలుకు వెళ్లాడు. భార్యను హత్య చేసిన కేసులో సిరిసిల్ల తారకరామనగర్‌కు చెందిన మేర్గు చిరంజీవి జైలుకు వెళ్లాడు. వీరిద్దరు అక్కడే పరిచయమయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత శ్రీధర్ సిరిసిల్లు మకాం మర్చాడు. ♦సిరిసిల్లలో ప్రముఖ వస్త్రవ్యాపారి గర్దాస్ శ్రీనివాస్ ఇంట్లో అద్దెకు ఉండే ఆకులేని ఇందిరతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. భర్తతో విడాకులై ఒంటరిగా ఉంటున్న కొక్కుల సుజాతను వివాహం చేసుకున్నాడు. తనకు పెద్దమొత్తంలో డబ్బులు కావాలని తొలుత పరిచయమైన ఇందిరతో చెప్పాడు. ♦తమ ఇంటి యజమాని శ్రీనివాస్ బాగా ఆస్తిపరుడని అతన్ని ట్రాప్ చేస్తే డబ్బులు గుంజవచ్చని ఇందిర సలహా ఇచ్చింది. పథకం ప్రకారం.. హైదరాబాద్ ఉప్పల్‌లో ఓ అపార్ట్మెంట్లో రెండునెలల కోసం ప్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. శ్రీధర్ సుజాతతో శ్రీనివాస్‌కు ఫోన్ చేయించి ట్రాప్ చేశారు. ♦2011 జూన్ 20న శ్రీనివాస్‌ను హైదరాబాద్ రావాల్సిందిగా సుజాత కోరగా.. శ్రీనివాస్ వెళ్లి అపార్ట్మెంట్లో బంధి అయ్యాడు. సిరిసిల్లకు చెందిన మేర్గు చిరంజీవి, గూడూరి రాజు సహకారంతో శ్రీధర్ శ్రీనివాస్‌ను బంధించాడు. శ్రీనివాస్ తండ్రి గడ్దాస్ నర్సప్పకు ఫోన్ చేసి రూ.25 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. వాళ్లు చెప్పిన అకౌంటులో నర్సప్ప రూ.1.50 లక్షలు వేయగా.. నిందితులు హైదరాబాద్‌లోని వివిధ ఏటీఎంల నుంచి రూ.1.25 లక్షలు డ్రా చేశారు. ♦బంధీగా ఉన్న శ్రీనివాస్ జూన్ 25న పెద్ద ఎత్తున కేకలు వేయడంతో ప్లాట్లోనే అతన్ని హత్య చేశారు. శవం వాసన రాకుండా దాచే ందుకు కొత్త ఫ్రీజ్ కొన్నారు. శవాన్ని మూట గా అందులో ఉంచారు. జూన్ 26న ఇందిర, కొండ రాజును హైదరాబాద్‌కు పిలిచి రూ.లక్షతో పాటు బైక్ ఇచ్చి సిరిసిల్లకు వెళ్లి అక్కడి ఎం జరుగుతుందో ఎప్పటికప్పుడు ఫోన్లో చెప్పాల్సిందిగా నిందితులు సూచించారు. చదవండి👉: కడుపులో 11.57కోట్ల కొకైన్.. 2017 సెప్టెంబరు 12న శిక్ష శ్రీనివాస్ హత్యకేసులో పోలీసులు శాస్త్రీయంగా విచారించారు. సెల్‌ఫోన్ సంభాషణ ఆధారంగా కొండ రాజును ముందుగా పట్టుకున్నారు. అతడ్ని విచారించి అపార్ట్మెంటుకు వెళ్లగా.. ఫ్రీజ్‌లో శవం బయటçపడింది. నిందితులు భీవండికి పారిపోగా.. అప్పటి సిరిసిల్ల ఓఎస్డీ ధరావత్ జానకీ, ప్రొబేషనరీ డీఎస్పీ శ్రీనివాస్, సిరిసిల్ల టౌన్ సీఐ సర్వర్ కేసును శాస్త్రీయంగా ఛేదించారు. 2017 సెప్టెంబరు 12న కరీంనగర్ న్యాయస్థానం నిందితులు కొండపాక శ్రీధర్, ఆకులేని ఇందిర, కొక్కుల సుజాత, మేర్గు చిరంజీవి, గూడూరి రాజు, కొండ రాజుకు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. చిరంజీవి అప్పటికే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు నెలలకు చార్జ్‌షీట్ అప్పుడు నేను సిరిసిల్ల టౌన్ సీఐగా ఉన్నాను. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకుని నిందితులను పట్టుకున్నాం. అప్పటి పోలీసు ఉన్నతాధికారుల సూచన... సహకారంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని, అన్ని ఆధారాలు సేకరించి రెండు నెలల్లో చార్జ్‌షీట్ వేశాం. నిందితులకు శిక్ష పడింది. ప్రస్తుతం ఆ కేసును శిక్షణ ఐపీఎస్‌లకు ఇటీవల పాఠంగా బోధించారు. – సర్వర్, ఎస్బీ, సీఐ, సిరిసిల్ల -
బీజేపీ–టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సోషల్ మీడియాలో బీజేపీ నాయకుడు చేసిన పోస్టు ఘర్షణకు దారితీసింది. దీంతో పోలీస్‌స్టేషన్ ఎదుటే బీజేపీ–టీఆర్ఎస్ వర్గాలు గొడవపడ్డాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన బీజేవైఎం మండల అధ్యక్షుడు బోనాల సాయికుమార్ టీఆర్ఎస్ కార్యకర్త శివరామకృష్ణపై అనుచిత వ్యాఖ్యలుచేస్తూ రెండు రోజుల కిందట సోషల్ మీడియాలో పోస్టుపెట్టారు. దీనిపై స్పందించిన టీఆర్ఎస్ కార్యకర్తలు ముగ్గురు శుక్రవారం రాత్రి పదిర గ్రామంలోని సాయికుమార్ ఇంటికెళ్లారు. ఆ సమయంలో సాయికుమార్ లేకపోవడంతో అతని తల్లిదండ్రులు మణెమ్మ, రవీందర్‌లతో అమర్యాదగా మాట్లాడారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మణెమ్మ, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గోపి, మరికొంత మందితో కలిసి ఎల్లారెడ్డిపేట ఠాణాకు వచ్చారు. ఇది తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు స్టేషన్‌కు చేరుకోగా ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈక్రమంలోనే స్టేషన్లో ఉన్న గోపితోపాటు మండల ఉపాధ్యక్షుడు రామచంద్రం, మరో ఇద్దరిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడిచేశారు. రామచంద్రంకు బలమైన గాయాలవడంతో ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీస్‌స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయడంతో సీఐ మొగిలి, ఎస్సై శేఖర్, సిబ్బందితో కలిసి ఇరువర్గాలను శాంతింపజేశారు. దాడిపై బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. స్టేషన్ ఎదుటే ఇరు వర్గాలు రాళ్లతో దాడిచేసుకున్నాయి. సిరిసిల్ల ప్రాంతంలో బలపడుతున్న బీజేపీని అణచివేయాలనే ఉద్దేశంతో మంత్రి కేటీఆర్ డైరెక్షన్లోనే తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని గోపి ఆరోపించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, గ్రామస్థాయి కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు, నాయకులు సోషల్‌మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో దూషిస్తూ రెచ్చగొడుతున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తెలిపారు. -
శభాష్ బాబు.. ఆయన చిత్రం సజీవ దృశ్యం
సిరిసిల్ల కల్చరల్: అతను చిత్రం గీస్తే సజీవ దృశ్యం అన్న భావన కలుగుతుంది. అత్యంత అలవోకగా గీసే రేఖాచిత్రాల్లో సైతం అరుదైన సృజనాత్మకతను ప్రదర్శించే నైపుణ్యం ఆయనకే సొంతం. పుస్తకాల ముఖచిత్రాలు, లోపల సందర్భానుసారం వచ్చే బొమ్మలు, వివిధస్థాయిల్లోని రాజకీయ నాయకుల చిత్రపటాలు అతని చేతిలో శాశ్వతత్వాన్ని ఆపాదించుకుంటాయి. పసి వయసు నుంచే పెంచుకున్న అభిరుచి అంచెలంచెలుగా పరిణామం చెంది చెయ్యి తిరిగిన కళాకారుడిగా ఎదిగిన ఆయనే దుండ్రపెల్లి బాబు. ఇటీవల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నిలువెత్తు చిత్రపటాన్ని గీసి ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టిని ఆకర్షించాడు. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడమే లక్ష్యం మా ఊరులో ఉన్న సొంత ఇల్లు, కొంత పొలం, మిడ్ మానేరు డ్యామ్ నిర్మాణం కారణంగా మునిగిపోయింది. చిన్న కుటుంబం కాబట్టి ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. నా కళే నా పెట్టుబడి. చేతిలో ఉన్న కళనే పూర్తిగా నమ్ముకున్నా. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న. ఎప్పటికైనా సరే అంతర్జాతీయ స్థాయి ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలన్నది నా సంకల్పం. – దుండ్రపల్లి బాబు పేద కుటుంబం నుంచి తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన దుండ్రపెల్లి లక్ష్మి, దుర్గయ్య రెండోసంతానంగా 1988లో జన్మించా డు బాబు. పేద వ్యవసాయ కుటుంబం. ఆర్థిక వనరుల లేమితో చొప్పదండిలోని తన మేనమామ దగ్గర పెరిగా డు.పదోతరగతి వరకు మంథనిలోని రెసిడెన్షియల్ పాఠశాలలో, రుక్మాపూర్‌లో ఇంటరీ్మడియట్ పూర్తిచేసి, జెఎన్టీయూ నిర్వహించిన ప్రవేశపరీక్ష ద్వారా తనకు ఎంతో ఇష్టమైన బ్యాచ్‌లర్ ఫైన్ ఆర్ట్స్‌లో చేరిపోయాడు. 2014లో బీఎఫ్ఏ పూర్తి చేసి ఆరో అనే కంపెనీలో ఇలస్ట్రేటర్‌గా పార్ట్‌టైమ్ ఉద్యోగం చేశాడు. మరింత నైపుణ్యాల కోసం ఎంఎఫ్‌ఏలో చేరాడు. ఇదీ.. బాబు ప్రతిభ 2016లో ఎంఎఫ్ఏ పూర్తయ్యాక పుస్తకాలకు వేసే ముఖపత్రాలకు అందమైన ఇలస్ట్రేషన్ ఇవ్వడంతో పేరు తెచ్చుకున్నాడు. ఓ ప్రవాస భారతీయుడి కోరిక మేరకు ‘చిన్ననాటి ఆటలు. జ్ఞాపకాల మూటలు’ అనే పుస్తకానికి సుమారు 100 చిత్రాలు గీసి ఇచ్చారు. కందుకూరి రాము, శివజాస్తితో కలిసి చేసిన ఈ ప్రాజెక్టు సత్ఫలితాలు ఇచ్చింది. రామాయణం, మహాభారతం సహా అంతర్జాతీయస్థాయి పుస్తకాలకు వేసిన చిత్రాలు ఆదరణ పొందాయి. భారతీయ నేపథ్య వస్త్రాలంకరణతో రూపొందించిన రాజులు, చక్రవర్తులు, స్వాతంత్ర సమరయోధులు, రాజకీయ నేతలు సుమారు 500 క్యారెక్టర్ల చిత్రాలు మంచి ప్రజాదరణ పొందాయి. మరో వందచిత్రాల రూపకల్పన కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు చలనచిత్రాలకు సంబంధించిన స్టోరీబోర్డు వర్క్‌లో బిజీగా ఉంటున్నాడు. సినిమాకు సంబంధించిన చిత్రానువాద స్క్రిప్ట్‌తో చిత్రాలకు అక్కడికక్కడే గీసి ఇవ్వడం మనోడి ప్రత్యేకత. -
సిరిసిల్ల జరీ.. అగ్గిపెట్టెలో చేరి
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ అగ్గిపెట్టెలో ఇమిడేలా చీరను, దబ్బనంలో ఇమిడేలా మరో చీరను నేశాడు. కట్టుకునేందుకు వీలుగా ఉన్న ఈ రెండు చీరలను చేనేత మగ్గంపై బంగారం జరీ పోగులతో నేసి శభాష్ అనిపించుకున్నాడు. గతంలో చేనేత కళా వైభవాన్ని ప్రపంచానికి చాటిన పలువురు చేనేత కళాకారులు అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసినా.. అవి కట్టుకునేందుకు అనువుగా ఉండేవి కావు. అగ్గిపెట్టెలో పట్టే చీరతో నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ఇప్పుడు హరిప్రసాద్ చేనేత మగ్గంపై గ్రాము బంగారం జరీతో నేసిన చీర కట్టుకునేందుకు అనువుగా ఉంది. మరోవైపు దబ్బనంలో దూరే చీరను సైతం హరిప్రసాద్ నేశాడు. ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించాడు. న్యూజిలాండ్‌కు చెందిన సునీత–విజయభాస్కర్‌రెడ్డి దంపతుల కోరిక మేరకు రూ.10 వేల ఖర్చుతో అగ్గిపెట్టెలో ఇమిడే కట్టుకునే చీరను నేశాడు. దబ్బనంలో ఇమిడే చీర ఈ చీర 5.5 మీటర్ల పొడవు, 160 గ్రాముల బరువుతో ఉంది. దబ్బనంలో దూరే చీరను సైతం కట్టుకునేందుకు వీలుగా నేశాడు. గ్రాము గోల్డ్ జరీ పట్టు దారాలతో ఈ చీరను నేశాడు. దీని బరువు 350 గ్రాములు ఉంటుంది. ఇప్పటికే సూక్ష్మ కళలో రాణిస్తున్న హరిప్రసాద్ అగ్గిపెట్టెలో ఇమిడే చీరను, దబ్బనంలో దూరే చీరను నేసి మరోసారి సిరిసిల్ల నేత కళను ప్రపంచానికి చాటి చెప్పాడు. -
వరద సమస్యకు శాశ్వత పరిష్కారం
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ము న్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన సిరిసిల్లలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితులను ఓదార్చారు. భవిష్యత్‌లో వరద ఇబ్బందులు లేకుం డా చూస్తానని హామీ ఇచ్చారు. వరదనీరు మానేరు వాగులోకి వెళ్లిపోయేలా చూస్తామని, అందుకు ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తామని తెలిపారు. నాలాలపై కబ్జాలను తొలగిస్తామని, ఈ క్రమంలో పేద లు నష్టపోతే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని స్ప ష్టం చేశారు. అంతకుముందు మంత్రి సిరిసిల్ల కలెక్టరేట్లో జిల్లా అధికారులతో వరదలపై సమీక్షించారు. వేములవాడ మూలవాగుపై కూలిన వంతెన ను శివరాత్రి జాతరలోగా నిర్మించాలని సూచిం చారు. వరదలతో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి పరిహారం అందించాలని, ఇళ్లు కోల్పోయిన వారికి ఆర్థిక సాయం అందించాలని, పంటనష్టాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే వరదలతో దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలన్నారు. ఇందు కోసం రూ.1.35 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. సిరిసిల్లలో వరద నీరు వెళ్లిపోయేలా ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. వరద నీటిలో నడుస్తూ.. సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్‌లో వరద నీటిలో నడుస్తూ బాధితులతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. భోజనాలు, నీళ్లు అందుతున్నాయా! అని తెలుసుకున్నారు. మున్సిపల్ అధికారులు డ్రెయినేజీల్లో చెత్తను సరిగా తీయడం లేదని, అడిగినా పట్టించుకోవడం లేదని మహిళలు మంత్రికి ఫిర్యాదు చేశారు. అక్కడే ఉన్న డీఆర్ఎఫ్ బృందం వద్దకు వెళ్లి బాగా పని చేశారని అభినందించారు. ఇంకో రెండు రోజులు సిరిసిల్లలోనే ఉండాలని సూచించారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్‌హెగ్డే, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి మంత్రి వెంట ఉన్నారు. -
సిరిసిల్ల నేత కళాకారుడి నైపుణ్యం: అగ్గిపెట్టెలో ఇమిడే షర్ట్, లుంగీ
సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరోసారి తన నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు. చేనేత మగ్గంపై ఆయన అగ్గిపెట్టెలో ఇమిడే షర్ట్, లుంగీని నేశాడు. తన సాంచాల షెడ్డులో పట్టుపోగులతో రెండున్నర మీటర్ల షర్ట్ బట్ట, రెండు మీటర్ల పొడవైన లుంగీని నేశాడు. తర్వాత రెండున్నర మీటర్ల వస్త్రంతో షర్ట్‌ను కుట్టించాడు. లుంగీ, షర్ట్.. రెండూ అగ్గిపెట్టెలో ఇమిడి పోవడం విశేషం. లుంగీ 140 గ్రాములు, షర్ట్ 100 గ్రాముల బరువు ఉన్నాయి. హరిప్రసాద్ వారం పాటు శ్రమించి వీటిని తయారు చేశాడు. శనివారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని.. శుక్రవారం వీటిని సిరిసిల్లలో ప్రదర్శించారు. గతంలో కూడా హరిప్రసాద్ సూక్ష్మ మరమగ్గం, మరమగ్గంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రాలను నేశాడు. -
గుమ్మానికి వేలాడిన నిరసన సూత్రం
చాలా సంఘటనలు ఇలా జరిగి అలా కాలం పొరల్లోకి వెళ్లిపోతుంటాయి. ఒక్కోసారి ఎంతో ప్రాధాన్యత గల సందర్భాలు కూడా సమాజంపై వేయవలసినంత ముద్ర వేయకుండానే మాములు ఘటనగా సమసిపోతాయి. దానివల్ల వాటి నుంచి నేర్చుకోవలసిన పాఠాలు ఎవరికీ అందకుండానే మిగిలిపోతాయి. అయితే వాటి మూలాల్ని వెదికి ఆయా వ్యక్తులు అంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించిన పూర్వాపరాలే మిటో తెలుసుకుంటే అవి వ్యవస్థలో రావలసిన మార్పునకు సూచనలిస్తాయి. ఈ మధ్య ఒక మహిళ తన భూసమస్యను పరిష్కరించమని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి వేసారి తన మంగళసూత్రాన్ని ఎమ్మార్వో ఆఫీసు ప్రవేశ ద్వారానికి తగిలించింది. తాను ఇంతకన్నా ఏమీ చెల్లించుకోలేను, దీన్ని తీసుకొని నా కార్యం చేసి పెట్టండని వేడుకొంది. ఈ సంఘటన జూన్ 30 నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల రెవెన్యూ కార్యాలయంలో జరిగింది. ఆ మహిళా రైతు పేరు పొలాస మంగ. మంగకు ఎలాంటి పోరాట, ఉద్యమ నేపథ్యం లేదు. రెండేళ్లుగా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా తన భూమిపై హక్కును ఎలా పరిరక్షించుకోవాలో అర్థం కాలేదు. ఆఫీసు లోపల తన తాళి బొట్టును తీసి ఏ ఉద్యోగి చేతిలోనో పెడితే పరిస్థితి ఎలా ఉండేదో గానీ, ఏకంగా ఆఫీసు గుమ్మానికి తగిలించడంతో కలకలం రేగింది. మధ్యలో వేలాడుతూ ఆఫీసులోకి వచ్చే పోయేవారి కంటపడి ఇదేమి చోద్యమనేలా చర్చకు వచ్చింది. ఇదేదో ఉద్రిక్త పరిస్థితికి దారి తీస్తుందన్న బెదురుతో రెవెన్యూ అధికారులు విషయాన్ని స్థానిక పోలీసు స్టేషనుకు చేరవేశారు. ఆ సమయాన జిల్లా కేంద్రంలో ఉన్న డిప్యూటీ తహసీల్దారు హుటాహుటిన ఆఫీసుకొచ్చి ఆమెతో మాట్లాడి సమస్యను తెలుసుకొన్నారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్ళి ఆమె అలా ఎందుకు చేయవలసివచ్చిందో కనుక్కున్నారు. వార్త జిల్లా కలెక్టర్ దాకా వెళ్ళింది. సంగతేమిటో చూడమని ఆయన ఆర్డీవోను పుర మాయించారు. ఆ అధికారి స్వయంగా భూమి వద్దకు వెళ్లి పూర్తిస్థాయి విచారణ చేపట్టి సమస్యను పరిష్కరిస్తామని ఆమెతో అన్నారు. ఇలా అధికారులు దిగి వచ్చి తన సమస్యను ఆలకిస్తారని ఆమె తాళిని తగిలించేముందు ఊహించి ఉండకపోవచ్చు. ఇదొక అరుదైన ఘటనగా, రెవెన్యూ శాఖ పరువు ప్రతిష్టకు ముడిపడిన విషయంగా భావించి అధికారగణం కదిలి వచ్చిందనుకోవచ్చు. ప్రపంచంలో మహిళలు అతికష్ట సమయంలో ఉద్వేగభరితమైన రీతిలో తమ నిరసనను ప్రదర్శించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. మంగ చూపిన తెగువ కూడా ఆ స్థాయికి తక్కువేమీ కాదు. పదేళ్ల క్రితం గల్ఫ్ దేశానికి వెళ్ళిన మంగ భర్త రాజేశం ఎక్కడ, ఎలా ఉన్నాడో సమాచారం లేదు. ప్రస్తుతం కొడుకుతో పాటు మెట్‌పల్లిలోని తన పుట్టినింటిలో ఉంటూ ఆమె ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది. ఇదే అదునుగా తన ఎకరం 23 గుంటల భూమిని భర్త తోబుట్టువులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆమె వాదన. మంగ భర్త పరిస్థితిని కూడా తెలుసుకునే పని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి. ఆమె అనుభవాలను, ఆలోచనలను నలుగురి ముందుకు తెచ్చి వాటికి తగిన ప్రాచుర్యం ఇయ్యవలసిన సందర్భమిది. మంగ చూపిన తెగువను ఒక నిరసన బాటగా మలుచుకునే బాధ్యత నారీలోకంపై ఉంది. ప్రభావశీల సంఘటనలు ప్రతిరోజూ జరుగవు. - బి. నర్సన్ వ్యాసకర్త కవి, కథకుడు మొబైల్ : 9440128169 -
‘ఇవన్నీ కేసీఆర్ గొర్రెలు అంటున్నరు.. ఇంకా నయం కేసీఆరే గొర్రె అంటలేరు.’
-
నన్నెవరూ ఆపలేరు: సీఎం కేసీఆర్
సాక్షి, సిరిసిల్ల: ‘కేసీఆర్ ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు.. తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు నేను అనుకున్నవన్నీ జరిగాయి. లక్ష్యశుద్ధి.. చిత్తశుద్ధి.. వాక్శుద్ధి ఉంటే.. ఏదైనా కచ్చితంగా అయి తీరుతుంది’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌తో కలసి రాజన్నసిరిసిల్ల జిల్లా నూతన కలెక్టరేట్ సముదాయం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇంటిగ్రేటెడ్ డ్రైవింగ్ స్కూల్, నర్సింగ్ కాలేజీ, వ్యవసాయ మార్కెట్ యార్డును ఆదివారం ప్రారంభించారు. కలెక్టరేట్లో కేసీఆర్ సుదీర్ఘంగా (గంటసేపు) మాట్లాడారు. తెలంగాణ వచ్చాక ఏడేళ్లలో ఏం సాధించామో అందరి కళ్లముందే కనిపిస్తోందని తెలిపారు. రాజకీయాల్లో కిరికిరిగాళ్లు ఎప్పుడూ ఉంటారని, సన్నాసులు ఎప్పుడూ సన్నాసులేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక పాలన సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని, కొత్త కలెక్టరేట్ నమూనాలను ఆర్కిటెక్చర్ ఉషారెడ్డి, ఇంజినీర్ గణపతిరెడ్డి అద్భుతంగా తీర్చిదిద్దారని అభినందించారు. రైతుల ఇళ్లలో బంగారు వాసాలు కావాలే గోదావరి జలాలను రివర్స్ పంపింగ్ ద్వారా మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెడితే అది అయితదా.. పోతదా.. అని అనుమానపడ్డారని, ఏం జరిగిందో కళ్లముందే ఉందని కేసీఆర్ అన్నారు. మల్టీ స్టేజీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని తాను చెబితే కొందరు అపవాదులు వేశారని తెలిపారు. ఈ విషయంలో ప్రధాని మోదీతోనే పంచాయితీ పెట్టుకున్నానని పేర్కొన్నారు. కాళేశ్వరం నుంచి మిడ్‌మానేరు వరకే 40 లక్షల ఎకరాలు పారుతోందని స్పష్టం చేశారు. ఎంతో శ్రమించి కాళేశ్వరం కడితే.. కరెంట్ ఖర్చు రూ.10వేల కోట్లు అంటూ.. కొందరు మాట్లాడుతున్నారని, రైతుల బాగుకోసం ఎన్ని వేల కోట్లయినా ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. రైతుల ఇళ్లలో బంగారువాసాలు కావాలన్నారు. చెంబుతో నీళ్లు ముంచుకోవచ్చు... ఆరేళ్లలో ఎంతో అద్భుతం జరిగిందని, వలస వెళ్లిన వారు తిరిగి వస్తున్నారని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టుతో మహబూబ్‌నగర్, సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని, ఇంకా మధ్యలో చిన్నచిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ వరద కాలువ ఇప్పుడు రిజర్వాయర్‌గా మారిందని, 365 రోజులు చెంబుతో నీళ్లు ముంచుకోవచ్చన్నారు. లక్ష్మీ, సరస్వతి, పార్వతీ ప్రాజెక్టులతో 180 కిలోమీటర్లు గోదావరి సజీవ జలదృశ్యం ఆవిష్కృతమైందని స్పష్టం చేశారు. గతంలో వర్షాలు పడితే.. చెరువులు తెగిపోయేవని, ప్రస్తుత ప్రభుత్వం చెరువులను బాగు చేయడంతో అధిక వర్షాలు పడినా చెరువులు మంచిగా ఉన్నాయన్నారు. బతుకమ్మ చీరలపైనా రాజకీయం.. ఒకప్పుడు సిరిసిల్లలో ఆత్మహత్యలు వద్దు.. అనే నినాదాలు గోడలపై కనిపించాయని, అవి తనను ఎంతో కలిచివేశాయన్నారు. నేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు బతుకమ్మ చీరల తయారీ ఇస్తే.. దాన్ని కూడా రాజకీయం చేయడం దారుణమన్నారు. సిరిసిల్లలో పద్మశాలి భవన్ కు రూ.5కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పల్లె, పట్టణ ప్రగతిని బాగా చేయండి ‘మీకు దండం పెడతా.. పల్లె ప్రగతి.. పట్టణ ప్రగతిని పకడ్బందీగా చేయండి’ అంటూ సీఎం కోరారు. ఆక్సిజన్ కొనుక్కునే దుస్థితి ఎందుకొచ్చిందో అర్థం చేసుకోవాలన్నారు. హరితహారం ఉజ్వలమైన కార్యక్రమం అని.. అందరూ భాగస్వాములు కావాలని కోరారు. భవిష్యత్‌లో మన పిల్లలకు ఇచ్చే సంపద ప్రకృతి మాత్రమేనని, పల్లెలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ ఏడాది లాక్డౌన్ కారణంగా ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఆదాయం కోల్పోయిందని పేర్కొన్నారు. అయినా ఒక్కో పనిని చేసుకుంటూ పోతున్నామని, దుబారా లేకుండా ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, జెడ్పీ చైర్పర్సన్ అరుణ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, రఘోత్తమరెడ్డి, భానుప్రసాద్‌రావు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పాల్గొన్నారు. నర్సింగ్ విద్యార్థుల స్టై ఫండ్ పెంపు.. మొదటి సంవత్సవం వారికి ప్రస్తుతం రూ.1500 స్టైఫండ్ ఇస్తున్నారు.. దాన్ని రూ.5 వేలకు పెంచుతున్నం. రెండో సంవత్సరం వారికి ఇచ్చే రూ.1600 స్థానంలో రూ.6వేలు, మూడో సంవత్సరం వారికి ఇచ్చే రూ.1900 స్థానంలో రూ.7వేలు ఇస్తం. గర్వంగా చెబుతున్నా... దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతీ గ్రామపంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ ఉంది. ప్రతీ ఊరిలోనూ వైకుంఠధామాలు ఉన్నాయని నేను గర్వంగా చెబుతున్నా. రూ.10వేల కోట్లు... రూ.10వేల కోట్లతో హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేస్తున్నం. రెండో విడత గొర్రెల పంపిణీని రూ.4వేల కోట్లతో చేపడతం. -
చూసి చూసి.. రిబ్బన్ తీసిపడేసిన సీఎం కేసీఆర్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: సీఎం కేసీఆర్ ఒకింత అసహనానికి గురవడంతో.. అధికారులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. సిరిసిల్లలో సీఎం ఆదివారం తన పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మండేపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఒక ఇంటి గృహ ప్రవేశానికి అంతా రెడీ కాగా, వేద మంత్రాల మధ్య లబ్ధిదారులతో సహా కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు. రిబ్బన్ కట్ చేద్దామనుకునే సరికి.. కత్తెర అందుబాటులో లేకపోవడంతో కాసేపు కత్తెర కోసం సీఎం వేచి చూశారు. కత్తెర లేకపోవడంతో సీఎం కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే తనే చేతితో రిబ్బన్‌ను పీకి పడేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి నూతన గృహంలోకి అడుగుపెట్టారు. -
‘సీఎం కేసీఆర్ ఇక్కడికి వచ్చే నాటికి వనం పెరగాలి’
సాక్షి, రాజన్న సిరిసిల్ల: త్వరలోనే అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అవినీతికి తావులేకుండా డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నామన్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో 264 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను బుధవారం మంత్రి కేటీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు హజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..డబల్ బెడ్రూమ్ ఇల్లు ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూలేని విధంగా రూపాయి ఖర్చు లేకుండా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అప్పగించామన్నారు. ఇళ్ల వద్ద ఖాళీ స్థలంలో హరితవనం పెంచాలని సూచించారు. వచ్చే ఏడాది సీఎం కేసీఆర్ ఇక్కడికి వచ్చే నాటికి వనం పెరగాలని తెలిపారు. చెట్లు పెంచితే కరోనాకష్ట కాలంలో ఆక్సిజన్ సమస్యే ఉండదని హితవు పలికారు. నాలుగు లక్షల 75 వేల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో ఎంతో మంది సీఎంలు.. ఆడబిడ్డలకు, బీడీలు చుట్టే మహిళలకు పెన్షన్ ఇవ్వాలని ఆలోచన చేయలేదని దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడాలేని పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, రైతుబందు, ఉచిత విద్యుత్‌ను సీఎం కేసీఆర్ ఇచ్చారని కొనియాడారు. -
27 రోజులు.. 27 లక్షలు... ఐనా దక్కని ప్రాణం...!
తంగళ్లపల్లి (సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన ముత్తంగి శ్రీనివాస్‌రెడ్డి (45)ది వ్యవసాయ కుటుంబం. నాలుగెకరాల పొలం ఉంది. వ్యవసాయం చేస్తూనే భార్య లత, కూతురు రేఖ, కొడుకు శివరామకృష్ణను పోషించుకుంటున్నాడు. కూతురు డిగ్రీ పూర్తిచేసింది. కొడుకు ఇంటర్ చదువుతున్నాడు. సాఫీగా సాగుతున్న వారి జీవితాల్లో కరోనా భూతం కల్లోలం సృష్టించింది. మే మొదటివారంలో శ్రీనివాస్‌రెడ్డి కరోనా బారినపడ్డాడు. మొదట లక్షణాలు తెలియలేదు. కరోనా అని గుర్తించడంలో ఆలస్యమైంది. ఐదు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా.. చేరిన ప్రతి ఆస్పత్రిలో రూ.లక్షల బిల్లు వేశారే కానీ, ప్రాణాలు మాత్రం దక్కలేదు. శ్రీనివాస్‌రెడ్డి గత నెల 30న ప్రాణాలు వదిలాడు. మొత్తం 27 రోజుల చికిత్సకు రూ.29 లక్షల వరకు ఖర్చయ్యాయి. ఇందులో రూ.2 లక్షలు మంత్రి కేటీఆర్ సాయం చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్ భార్య, పిల్లలు కరోనా పాజిటివ్‌తో ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. శ్రీనివాస్‌రెడ్డిని బతికించుకునే ప్రయత్నంలో బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు ఇలా.. అన్ని చోట్లా లత అప్పు తెచ్చింది. వైద్య ఖర్చులు దాదాపు రూ.23 లక్షలు కాగా, అతడిని ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్స్‌లు, రవాణా ఖర్చులకు మరో రూ.4 లక్షల వరకు అయ్యాయి. రూ.27 లక్షల అప్పు తెచి్చనా శ్రీనివాస్‌రెడ్డి మాత్రం దక్కలేదు. ప్రస్తుతం ఆ కుటుంబం తమకున్న నాలుగెకరాలు అమ్ముకునే దుస్థితి నెలకొంది. ఇంటి పెద్ద మరణం ఓవైపు.. అప్పుల బాధలు మరోవైపు వారిని కుంగదీస్తున్నాయి. భూమి అమ్మితేనే అప్పు తీరేది. అది అమ్మితే.. బిడ్డ పెళ్లి చేసేదెలా అని లత కన్నీరుమున్నీరవుతోంది. ఇదీ చికిత్సకైన ఖర్చుల లెక్క.. శ్రీనివాస్‌రెడ్డికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యాక మొదట సిరిసిల్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఒకరోజు చికిత్స చేసి రూ.లక్ష బిల్లు వేశారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్ తరలించి, కొంపల్లిలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ మూడు రోజులు చికిత్స చేసి రూ.1.50 లక్షల బిల్లువేశారు. తమ వల్ల కాదని వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని చేతులెత్తేశారు. తర్వాత అల్వాల్‌లో ఉన్న మరో కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఏడు రోజులు చికిత్స చేసి రూ.7 లక్షల బిల్లువేశారు. మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. చావుబతుకుల మధ్య ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని ఉప్పల్‌లో ఉన్న ఇంకో కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ 11 రోజులు చికిత్స అందించి రూ.12 లక్షల బిల్లువేసి చేతులెత్తేసింది ఆసుపత్రి. ఎలాగైనా ప్రాణాలు దక్కించుకోవాలనే తపనతో శ్రీనివాస్‌రెడ్డిని మరో కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఐదురోజులు చికిత్స అందించినా ప్రాణం దక్కలేదు. సదరు ఆస్పత్రి రూ.3.50 లక్షలు బిల్లు చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని చెప్పగా కుటుంబసభ్యులు దిక్కుతోచని స్థితిలో మంత్రి కేటీఆర్‌ను వేడుకున్నారు. రూ.2 లక్షలు తాను చెల్లిస్తానని కేటీఆర్ హామీ ఇవ్వగా.. కుటుంబసభ్యులు మిగతా రూ.1.50 లక్షలు కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లారు. ‘‘మాయదారి కరోనా మా ఇల్లును ఆగం చేసింది. మా ఆయనను రోజుకో ఆస్పత్రి తిప్పిండ్రు. తమ వళ్ల కాదన్నరు. దినాం లక్షకు పైగా ఖర్చు చేసినం. అంబులెన్సుల్లో తిప్పినందుకే నాలుగు లక్షలు ఒడిసినయ్. అప్పు ఎలా తీర్చేది.. బిడ్డ పెళ్లి ఎలా చేసేది’’ –శ్రీనివాస్‌రెడ్డి భార్య లత -
సై అంటే సై.. నాయకుల సోషల్ యుద్ధం
సాక్షి,వేములవాడ: రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేస్తున్నారు. శుక్రవారం ఎమ్మెల్యే రమేశ్‌బాబు ‘వంద పడకలే కాదు.. వంద సమాధానాలు’ అంటూ సామాజిక మధ్యమంలో కరపత్రం పోస్టు చేశారు. దీంతో టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ ‘ఈ ప్రశ్నలకు సూటిగా జవాబు చెప్పండి’ అని మరో కరపత్రం పోస్టు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీరి ప్రచారం చర్చనీయాంశంగా మారింది. కాగా వేములవాడ శివారులోని తిప్పాపూర్‌లో రూ.22.50 కోట్లతో నిర్మించిన వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిని శుక్రవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లాలో కరోనా ఉధృతి తగ్గుతోందన్నారు. ఇటీవల చేపట్టిన సర్వేలో 3,900 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు తేలిందని, వారిని గుర్తించి కిట్లు అందించామని తెలిపారు. వంద పడకల ఆస్పత్రి ప్రారంభంతో వేములవాడ ప్రాంత ప్రజలకు వైద్యసేవలు దరి చేరాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 50పడకలతో కోవిడ్–19 సేవలు అందుబాటులోకి వచ్చాయని కేటీఆర్ తెలిపారు. చదవండి: ఒక్క చాన్స్.. ఈటలపై పోటీకి సై అంటున్న నేతలు -
కరోనా కాటు: సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ మృతి
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అంజయ్య (54) కరోనా కాటుకు బలయ్యారు. ఆయనకు ఈనెల 13న కరోనా పాజిటివ్ రాగా.. హైదరాబాద్‌లోని ఓమ్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు పరిస్థితి విషమించడంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. అదనపు కలెక్టర్‌గా పనిచేసిన ఆయన అనతికాలంలోనే మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఈయన స్వగ్రామం సూర్యా పేట జిల్లా జాజిరెడ్డిగూడెం. అంజయ్య మృతిపై మంత్రి కేటీఆర్, కలెక్టర్ కృష్ణభాస్కర్, జెడ్పీ చైర్పర్సన్ అరుణ సంతాపం తెలిపారు. కరోనాతో జేఎన్ఏఎఫ్ఏయూ మాజీ రిజిస్ట్రార్ మృతి విజయనగర్‌కాలనీ (హైదరాబాద్): జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ షేక్ రెహమాన్ పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. యూనివర్సిటీలో గతంలో ఫొటోగ్రఫీ హెచ్ఓడీగా విధులు నిర్వహించిన రెహమాన్ ప్రస్తుతం ప్లానింగ్ అకడమిక్ సేవలు అందిస్తున్నారు. రెహమాన్ మృతికి వర్సిటీ వీసీ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్. కవితా దరియాణిరావు, వర్సిటీ సిబ్బంది సంతాపం తెలిపారు. -
నా వివాహం.. సారీ కొద్దిమందికే ఆహ్వానం
సిరిసిల్ల కల్చరల్: జీవితంలో ఒకేసారి జరిగే వేడుక పెళ్లి. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరినీ అతిథులుగా ఆహ్వానించి జరుపుకునే సంబురం. అలాంటి అపురూప కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించాలనుకున్న తల్లిదండ్రుల ఆశలపై కరోనా నీళ్లు చల్లుతోంది. ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకున్న వధూవరుల కల తీరడం లేదు. కేవలం కుటుంబసభ్యులు, పరిమిత సంఖ్యలో బంధువుల సమక్షంలోనే వివాహాలు జరుగుతున్నాయి. వైరస్ ప్రభావంతో శుభలేఖల రూపురేఖలతోపాటు పెళ్లి తంతులో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో పెళ్లంటే అదొక వైభవం. ఈ వేడుకను సామాజిక హోదాకు చిహ్నంగా భావించేవారు. కానీ కరోనా కారణంగా రెండేళ్లుగా ఫంక్షన్‌హాళ్లకు బదులుగా ఇంటి ముందే ముత్యాల పందిరి వేస్తున్నారు. భారీ సంఖ్యలో బంధువులకు బదులు 30, 40 మందితో కానిచ్చేస్తున్నారు. పోలీసులైతే ఏకంగా 20 మందికే పరిమితం చేసుకోవాలని నిబంధన విధించారు. నిశ్చితార్థం రోజు వధూవరులు పరస్పరం ఇచ్చుపుచ్చుకునే కానుకల్లో మాస్క్‌లు, శానిటైజర్లు చేరిపోయాయి. పెళ్లికి రాలేమండి.. కోవిడ్ కారణంగా పెళ్లికి ఇంటికొక్కరిని కూడా ఆహ్వానించే పరిస్థితి లేదు. ఒకవేళ ఆహ్వానించేందుకు వెళ్లినా బంధువులు సరే అంటున్నారు కానీ కరోనాను తల్చుకొని జంకుతున్నారు. కొందరైతే శుభలేఖలు ఇచ్చే సమయంలోనే మేం రాలేమండీ.. రోజులు బాగుంటే చూద్దాం లెండి.. ఏమీ అనుకోవద్దు.. రాకపోయినా వచి్చనట్టే భావించండి.. అని ముఖం మీదే చెప్పేస్తున్నారు. శుభలేఖల్లో మాస్కు ధరించి హాజరు కావాలని కొందరు ముద్రిస్తుండగా, మరికొందరు ఇంటి వద్దే ఉండి ఆశీస్సులు అందించాలని కోరుతున్నారు. ఈ నెల తొలివారం నుంచి ముహూర్తాలు.. మే తొలివారం నుంచే ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 21 నుంచి వందల సంఖ్యలో వివాహాలు నిశ్చయమయ్యాయి. అయితే కరోనా సెకండ్ వేవ్‌ను నియంత్రించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. పెళ్లికి గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతినిచ్చింది. దీంతో ఫంక్షన్‌హాళ్లు బుక్ చేసుకోవాలనుకున్నవారు వెనక్కి తగ్గారు. ఇదివరకే బుక్ చేసుకున్నవారు అడ్వాన్స్‌లు వాపస్ ఇవ్వాలని ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులపై ఒత్తిడి చేస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో కుటుంబసభ్యులు, స్వల్ప సంఖ్యలో బంధువుల సమక్షంలో ఇంటిముందే పెళ్లి జరిపిస్తున్నారు. -
'ప్రాణంగా పెంచుకున్నా.. న్యాయం చేయండి సారూ..'
సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి పోలీస్‌స్టేషన్.. రాత్రి 8 దాటింది. మరికాసేపట్లో రాత్రి కర్ఫ్యూ.. దాని అమలు తీరుతెన్నులపై ఠాణా సిబ్బంది తర్జనభర్జన పడుతూ బిజీగా ఉన్నారు. అంతలో చేత్తో చచ్చిన కోడిని పట్టుకుని ఓ యువకుడు స్టేషన్లోకి ఎంటరయ్యాడు. ‘నేను ప్రాణంగా పెంచుకుంటున్న కోడిపెట్టను ఇసుక ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేశారు. న్యాయం చేయండి సారూ..’ అంటూ యువకుడు అనేసరికి ఏం చేయాలో, అతడికేం చెప్పాలో పోలీసులకు తోచలేదు. కానీ, తరువాత విషయం అర్థమై కడుపుబ్బా నవ్వుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చందుర్తి మండలం బండపల్లికి చెందిన గసికంటి రాజు (32) గల్ఫ్‌లో ఉండేవాడు. కరోనా నేపథ్యంలో ఇంటికి వచ్చేసి వ్యవసాయం చేస్తూనే పది కోళ్లనూ పెంచుకుంటున్నాడు. అందులోని ఓ కోడిపెట్ట మంగళవారం తెల్లవారుజామున చనిపోయింది. ఇసుక ట్రాక్టర్‌తో దాన్ని ఢీకొట్టి చంపేశారంటూ రాజు అదేరోజు రాత్రి ఠాణా మెట్లెక్కినప్పుడు పై సన్నివేశం చోటుచేసుకుంది. ప్రేమగా పెంచుకుంటున్న తన కోడిని ఢీకొట్టి చంపిన వారిపై కేసు పెట్టి, తనకు న్యాయం చేయాలని రాజు వేడుకోగా, ‘మాకున్న కేసుల పంచాయితీకి మళ్లీ ఇదొకటా.. చూద్దాంలే’ అంటూ పోలీసులు సర్దిచెప్పి ఇంటికి పంపేశారు. -
రాజన్న సిరిసిల్ల: టిఫిన్ బాక్స్ బాంబు కలకలం
సాక్షి, వేములవాడ: ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టుల కాల్పుల అనంతరం రాష్ట్రంలో విస్తృత తనిఖీలు చేపడుతున్న సమయంలో టిఫిన్ బాక్స్ బాంబు వెలుగులోకి వచ్చింది. దీంతో సిరిసిల్ల జిల్లాలో కలకలం ఏర్పడింది. కోనరావుపేట మండలం మర్రిమడ్ల శివారులోని అటవీ ప్రాంతంలో టిఫిన్ బాక్స్ బాంబు బయటపడింది. ఆ ప్రాంతానికి పోలీసులు చేరుకొని సురక్షితంగా టిఫిన్ బాక్స్ బాంబును వెలికితీశారు. ఇంకా ఏమైనా మందుపాతరలు ఉన్నాయేమోనని పోలీసులు ఆ ప్రాంతాన్ని జేసీబీతో తవ్వించారు. ప్రస్తుతం ఒక టిఫిన్ బాక్స్ బాంబు మాత్రమే బయటపడింది. దాన్ని నిర్వీర్యం చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. రాజన్న సిరిసిల్ల - నిజామాబాద్ జిల్లాల సరిహద్దు ప్రాంతం మర్రిమడ్ల, మానాల అటవీ ప్రాంతం గతంలో మావోయిస్టులు, జనశక్తి నక్సల్స్‌కు పట్టున్న ప్రాంతం. అప్పట్లో నక్సలైట్లు ఈ టిఫిన్ బాక్స్ బాంబును పెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బాంబు వెలికితీసిన పోలీసులు, బాంబ్ డిస్పోజల్ బృందం సభ్యులు ఆ ప్రాంతంలో క్షుణ్నంగా తనిఖీ చేపట్టారు. ఎక్కడ ఎలాంటి మందుపాతరలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఒక టిఫిన్ బాక్స్ బాబు బయటకు కనిపించడం అటవీశాఖ అధికారులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం దానిని నిర్వీర్యం చేసే పనిలో పోలీసులు ఉన్నారు. బయటపడ్డ టిఫిన్ బాక్స్ బాంబుపై పోలీసులు విచారణ చేపట్టారు. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కాల్పుల నేపథ్యంలో తెలంగాణలోనూ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలోనే ఈ బాక్స్ బాంబు వెలుగులోకి రావడం కలకలం రేపింది. ఈ సందర్భంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. -
కేంద్రం అవార్డులు ఇస్తుంది.. పైసలు ఇస్తలేదు: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: ‘బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఉన్నాయా? నేను ఆ పార్టీలకు చాలెంజ్ చేస్తున్నా.. ఎక్కడికైనా వెళ్లి చూద్దామా?’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె.తారక రామారావు సవాల్ విసిరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాల్లో శనివారం పలు అభివృద్ధి పథకాలను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో వ్యవసాయ రంగానికి 24 గంటలపాటు విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామని, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, గ్రామాల్లో నర్సరీలు, వైకుంఠధామాలు, శ్మశానవాటికలు, పల్లెప్రకృతి వనాలు, ట్రాక్టర్లు, ట్యాంకర్లు, నెలనెలా గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తున్నామని వివరించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. మండే ఎండాకాలంలో గోదావరి జలాలతో వాగులు పారుతున్నాయని, చెరువులు మత్తళ్లు దూకుతున్నాయని, ఇది సీఎం కేసీఆర్ ఘనత అని అన్నారు. సీఎం కేసీఆర్‌ను ఇప్పుడు ఎవరు పడితే వాళ్లు సోషల్ మీడియాలో తిడుతున్నారని, మేం అలా పిచ్చిమాటలు మాట్లాడమని స్పష్టం చేశారు. కేంద్రం అవార్డులు ఇస్తుంది.. పైసలు ఇస్తలేదు ‘కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సర్వేలు చేసి తెలంగాణ పల్లెలు బాగున్నాయంటూ అవార్డులు ఇస్తోంది. కానీ, పైసలు మాత్రం ఇస్తలేద’ని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర ప్రజలు ఏటా పన్నుల రూపంలో రూ.2.72 లక్షల కోట్లు కేంద్రానికి చెల్లిస్తుంటే.. కేంద్రం వివిధ రూపాల్లో ఏటా రూ.1.40 లక్షల కోట్లు మాత్రమే ఇస్తోందని అన్నారు. మిష¯Œ కాకతీయ ద్వారా చెరువులు బాగయ్యాయని నీతి ఆయోగ్ పేర్కొంటూ.. తెలంగాణకు రూ.24 వేలు కోట్ల సాయం అందించాలని సిఫారసు చేస్తే, 24 పైసలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కరోనా పేరుతో కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల్లో కోత విధిస్తోందని అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఆత్మగౌరవ ప్రతీక డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పేదల ఆత్మగౌరవ ప్రతీక అని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో 2.82 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రూ.18 వేల కోట్లు వెచ్చించి నిర్మిస్తున్నామని చెప్పారు. ఒక్కో డబుల్ బెడ్రూం ఇల్లు ఏడు ఇందిరమ్మ ఇళ్లతో సమానమని పేర్కొన్నారు. ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అని తెలంగాణలో అంటారని, ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తోందని, పెళ్లికి కల్యాణలక్ష్మి రూపంలో సాయం చేస్తోందని పేర్కొన్నారు. అప్పులు తెచ్చి రైతుబంధు ఇస్తున్నామని, ఆసరా పింఛన్లు అందిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. వరి సాగులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా ఉందన్నారు. రాష్ట్రం రాక ముందు... తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎలా ఉందో ప్రజలు ఒకసారి ఆలోచించాలన్నారు. కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మ¯Œ కొండూరి రవీందర్రావు, జెడ్పీ చైర్పర్స¯Œ న్యాలకొండ అరుణ, కలెక్టర్ కృష్ణభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
మీ పదవులు కేసీఆర్ భిక్షమే: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పదేపదే విమర్శలు చేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ నేతలపై మంత్రి కె. తారక రామారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్న టీ కాం గ్రెస్, టీ బీజేపీ నాయకులకు ఆ పదవులు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ పెట్టిన బిచ్చం. ఉమ్మడి రాష్ట్రంలో మీ బతుకులు జీ హుజూర్ తప్ప ఇంకేముందో ఆలోచించాలి. తెలంగాణ కోసం రాజీనామాలు కోరితే పారిపోయిన సన్నాసులు మీరు. చీకటిలో చిరుదివ్వెలాగా కేసీఆర్ ఒక్కరే ఎత్తిన జెండా దించకుండా స్వరాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. అలాంటి నాయకుడిని నిందిస్తే ఊరుకొనేది లేదు’అని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ సాధనే లక్ష్యంగా... రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన టీఆర్ఎస్ సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2001లో కేసీఆర్ అనే పదమే లేదని, చంద్రశేఖర్‌రావు ఒక్కడే మొండిధైర్యంతో మూడు పదవులకు రాజీనామా చేసి పార్టీ స్థాపించి ముందుకు సాగాడని కేటీఆర్ గుర్తుచేశారు. ‘ఆనాడు కేసీఆర్‌కు సినిమా హంగులు లేవు.. డబ్బులు లేవు.. కుల బలం లేదు.. అయినా తెలంగాణ ఆత్మగౌరవాన్ని సజీవంగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణ సమాజం రాజకీయ నాయకులను నమ్మే పరిస్థితి లేదు. కేసీఆర్‌కు మజిల్ పవర్, మనీ పవర్, మీడియా పవర్ లేకుండానే ప్రతికూల పరిస్థితుల్లో మొండి ధైర్యంతో తెలంగాణ సాధనకు ముందుకు సాగారు. అన్నీ ఖిలాఫ్ ఉన్నా.. అందరూ వ్యతిరేకంగా ఉన్నా.. గులాబీ జెండాను నమ్ముకొని తెలంగాణ సాధనే లక్ష్యంగా సాగారు. దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి కేసీఆర్ తెలంగాణ సాధించారు. వాస్తవానికి అప్పుడు నేను కూడా లేను. అప్పుడు అమెరికాలో ఉన్నా’అని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం మన పథకాలను బాగున్నాయంటే.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో అమలవుతున్న పథకాలు బాగున్నాయని పార్లమెంట్ వేదికగా కితాబిస్తే రాష్ట్రంలోని సన్నాసులకు అవి అర్థం కావని.. ఒకవేళ అర్థమైనా అర్థం కానట్లుగా నటిస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలకు ఇతర రాష్ట్రాల్లోని ప్రయోజనాలు ముఖ్యమని, కానీ టీఆర్ఎస్ మాత్రం తెలంగాణ ఇంటి పార్టీ అని పేర్కొన్నారు. త్వరలోనే సోషల్ మీడియా కమిటీలు... టీఆర్ఎస్ కన్నతల్లి లాంటిదని, పార్టీ సభ్యత్వాలను మొక్కుబడిగా చేయొద్దని.. ఇంటింటికీ వెళ్లి నమోదు చేయాలని కేటీఆర్ సూచించారు. ఈసారి క్రీయాశీల సభ్యత్వాలకు గుర్తింపు కార్డులు జారీ చేస్తామని చెప్పారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ. 2 లక్షల ప్రమాద బీమా ఉంటుందన్నారు. త్వరలోనే సోషల్ మీడియా కమిటీలు ఏర్పాటు చేసి జిల్లాలవారీగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని వివరించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శులు బండి రమేశ్, గూడూరి ప్రవీణ్, కర్ర శ్రీహరి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. సీఎం అనే గౌరవం లేకుండా.. ‘సీఎం అనే గౌరవం లేకుండా టీ కాంగ్రెస్, టీ బీజేపీ నేతలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నరు. ఎవడు పడితే వాడే మాట్లాడుతున్నడు. కనీసం కేసీఆర్ వయసుకైనా గౌరవం ఇవ్వడం లేదు. ఒకటి, రెండు గెలవంగనే ఎగిరెగిరి పడుతున్నరు. మరి రాష్ట్రంలో 32 జెడ్పీ స్థానాలు, 130 మున్సిపల్ స్థానాలు, 9,500 గ్రామపంచాయతీలను గెలిచిన మనమెంత మాట్లాడాలి. ఓపికకూ ఓ హద్దు ఉంటుంది. ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు. సీఎం లనే ఉరికించిన చరిత్ర టీఆర్ఎస్ది. తెలంగాణ అనే పదాన్నే నిషేధించిన సభ నుంచి వాళ్లనే తరిమేశాం. నోరు పారేసుకోవడం మొదలు పెడితే.. పీఎంను, కేంద్ర మంత్రులను విడిచిపెట్టం. మర్యాదగా మాట్లాడటమే మా అసమర్థతగా భావించవద్దు’అని విపక్షాలపై మండిపడ్డారు. -
బావిలో పడ్డ చిరుత, ఆందోళనలో స్థానికులు
సాక్షి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత పులి వ్యవసాయ బావిలో పడింది. అటవీశాఖ అధికారులు దాన్ని రక్షించే పనిలో నిమగ్నమయ్యారు. బోయినపల్లి మండలం మల్కాపూర్ శివారులోని వ్యవసాయ బావిలో రాత్రి చిరుత పడ్డట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. బావి వద్దకు చేరుకొని రెస్క్యూ టీం ద్వారా పులిని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చిరుతను చూసేందుకు పెద్దసంఖ్యలో జనం బావి వద్దకు చేరుకున్నారు. చిరుతను సురక్షితంగా బయటకు తీసి అడవిలో విడిచిపెట్టాలని, అప్పుడే తాము ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రశాంతంగా ఉంటామని విజ్ఞప్తి చేస్తున్నారు.(చదవండి: పులిపై మత్తు ప్రయోగం.. ) -
లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి
ఇల్లంతకుంట(మానకొండూర్): లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గాలిపల్లికి చెందిన మల్లుగారి పవన్‌కళ్యాణ్‌రెడ్డి (22) కరీంనగర్లో డిగ్రీ పూర్తిచేసి ఇంట్లోనే ఉంటున్నాడు. వ్యక్తిగత అవసరాలకు ఇటీవల ఆన్లైన్ లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. కొద్దిరోజుల క్రితం తన సోదరి వద్ద రూ.10,000 తీసుకుని కొంత అప్పు తీర్చాడు. మిగతా డబ్బు కోసం లోన్‌యాప్ నిర్వాహకులు పవన్కళ్యాణ్రెడ్డిని వేధించడంతోపాటు అతడి సోదరికి కూడా ఫోన్ చేశారు. (చదవండి: అగ్ని ప్రమాదం.. 10 మంది శిశువులు మృతి) ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఇబ్బందులు ఎదురవుతాయేమోననే భయంతో శుక్రవారం తెల్లవారుజామున పవన్ ఇంట్లో దూలానికి ఉరివేసుకున్నాడు. అయితే, పవన్‌కళ్యాణ్‌రెడ్డి ఎంత మొత్తం రుణం తీసుకున్నాడనేది ఆరా తీస్తున్నామని పోలీసులు చెప్పారు. అప్పు విషయం తల్లిదండ్రులకు చెప్పకపోవడం, దాన్ని ఎలా తీర్చాలో తెలియకనే ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. మృతుడి తండ్రి రాజిరెడ్డి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. (చదవండి: కరోనా భయంతో బ్యాంక్ ఉద్యోగిని ఆత్మహత్య) -
అలా.. హైదరాబాద్‌కు వెళ్లారు!
సాక్షి, సిరిసిల్ల: జిల్లాలోని అధికార టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు హైదరాబాద్ బాటపట్టారు. ఇష్టమున్నా.. లేకున్నా.. రాజధాని నగరానికి వెళ్లిపోయారు. అక్కడికి పోయి వస్తే సరి.. లేకుంటే.. రాలేదని మనసులో పెట్టుకుంటారనే భయంతో ఎన్నికల ప్రచారానికి తరలివెళ్లారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారపర్వంలో తాము కూడా ముందుంటున్నామంటూ నేతల దృష్టిలో పడేందుకు యత్నిస్తున్నారు. కేటీఆర్ భుజాలపై ఎన్నికల బాధ్యతలు సిరిసిల్ల ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతలు భుజాన వేసుకుని ప్రచార నగారా మోగించారు. కాలంతో పోటీపడి హైదరాబాద్‌లోని గల్లీల్లో ప్రచారం సాగిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా గులాబీబాస్ టీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశనం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గమైన సిరిసిల్ల, ఆ పక్కనే ఉన్న వేములవాడ నియోజకవర్గాల నుంచి టీఆర్ఎస్ ముఖ్య నాయకులు బల్దియా బరిలో ప్రచారం చేసేందుకు కదిలిపోయారు. జిల్లా గులాబీదళం నగర వీధుల్లో ఇంటింటి ప్రచారం సాగిస్తోంది.(చదవండి: ఆరేళ్లలో బీజేపీ చేసింది సున్నా: కేటీఆర్) రెండు డివిజన్లలో జిల్లా శ్రేణులు.. జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్‌లోని రెండు డివిజన్లలో ప్రచారం విస్తృతంగా సాగిస్తున్నారు. 123 డివిజన్ హైదర్‌గూడలో సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇందులో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, పార్టీ సీనియర్ నాయకుడు, సీఎం కేసీఆర్ మేనల్లుడు చీటీ నర్సింగరావు, పార్టీ జిల్లా బాధ్యుడు తోట అగయ్య, సీనియర్ నాయకులు కె.గోపాల్‌రావు, జిందం చక్రపాణి, జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, “సెస్’ డైరెక్టర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు హైదర్‌గూడలో ఇంటింటి ప్రచారంలో నిమగ్నమయ్యారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వెళ్లిన టీఆర్ఎస్ నాయకులకు అక్కడి కార్పొరేటర్ అభ్యర్థి శ్రీనివాస్‌రావు అక్కడే ఓ ఫంక్షన్ హాల్లో బస, వసతి కల్పించారు. వేములవాడ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు 122వ డివిజన్లోని కూకట్‌పల్లిన్‌లో ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటికే కొందరు హైదరాబాద్‌లో మకాం వేసి ప్రచారం సాగిస్తుండగా.. మరి కొందరు ముఖ్య నాయకులు త్వరలోనే హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మొన్న దుబ్బాకకు దూరం... ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నికల ప్రచారానికి జిల్లా నాయకులు దూరంగా ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో సిరిసిల్ల నియోజకవర్గ సరిహద్దులు కలిసి ఉంటాయి. ఇలా దగ్గరనేఉన్న దుబ్బాకకు టీఆర్ఎస్ శ్రేణులు దూరంగా ఉండడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పక్కగ్రామాల్లో పరిచయాలు ఉన్నా.. ప్రచారానికి వెళ్లకుండా టీఆర్ఎస్ శ్రేణులను కట్టడి చేశారు. అదే బీజేపీ నాయకులు దుబ్బాకకు వెళ్లి ప్రచారం చేశారు. దుబ్బాక ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు చేదు అనుభవం ఎదురైంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఛాన్స్ తీసుకోవద్దునే వ్యూహంతో క్షేత్రస్థాయిలో చురుగైన కార్యకర్తలు, నాయకులను బల్దియా పోరులో మోహరించారు. దుబ్బాక ఎన్నికలకు జిల్లా శ్రేణులు దూరంగా ఉండడంతో నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఈసారి సర్వశక్తులను ఒడ్డేందుకు అధికార టీఆర్ఎస్ సిద్ధమైంది. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ శ్రేణులను రంగంలోకి దింపారు. బల్దియా బాటలో బీజేపీ శ్రేణులు.. జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు కూడా హైదరాబాద్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రచారాని తరలివెళ్లారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిలుపు మేరకు జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు భాగ్యనగరం బాటపట్టినట్లు సమాచారం. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, నాయకులు బండ మల్లేశ్‌యాదవ్, ఆడెపు రవీందర్, మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, రెడ్డబోయిన గోపీ, శంకర్, ఆవునూరి రమాకాంత్‌రావు, గాజుల వేణు, అన్నల్దాస్ వేణు, కౌన్సిలర్లతోపాటు వివిధ మండలాల నాయకులు బల్దియా బాటపట్టారు. దుబ్బాక ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంతో అదే ఉత్సాహంతో బీజేపీ నాయకులు నగరంబాట పట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జిల్లా నాయకుల భాగస్వామ్యం కీలకంగా ఉండడం విశేషం. -
కడుపు అతుక్కుని కవలల జననం
ముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో అవిభక్త కవలలు జన్మించారు. ముస్తాబాద్‌కు చెందిన చెవుల శిరీష–వెంకటేశ్ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మూడోసారి గర్భందాల్చిన శిరీషకు ప్రస్తుతం ఎనిమిదినెలలు, శనివారం రాత్రి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ముస్తాబాద్‌లోని ఓ నర్సింగ్‌హోమ్‌లో చేర్పించారు. వైద్యులు శిరీషకు స్కానింగ్ చేసి కవలలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేయగా, కడుపులో ఇద్దరు ఆడ శిశువులు అవిభక్తంగా ఉన్నారు. ఇద్దరికీ కడుపు భాగం అతుక్కుని ఉంది. కాళ్లు, చేతులు, తలలు వేర్వేరుగా ఉన్నాయి. ఇద్దరు శిశువులు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారు. లక్షల మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని శిరీషకు వైద్యం అందించిన డాక్టర్ అనూష తెలిపారు. ఈ కవలలు రెండు కిలోల బరువుతో జన్మించగా.. మెరుగైన వైద్యం కోసం సిద్దిపేటలోని పిల్లల ఆస్పత్రికి తరలించారు. కాగా, అవిభక్త కవలలను చూసి శిరీష–వెంకటేశ్ దంపతులు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. రెక్కాడితే డొక్కాడని తాము ఈ కవలలను ఎలా కాపాడుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ట్రిబ్యునల్‌కు భూ పంచాయితీలు
ఎస్.శ్రీనివాస్ అనే వ్యక్తి సిరిసిల్ల నివాసి. ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లెలో 1.24 ఎకరాలు ఉందని, రెవెన్యూ అధికారులు తనకు తెలియకుండానే మరొకరి పేరిట పట్టాచేశారని ఫిర్యాదు చేశాడు. ఆర్డీవో కోర్టులో ఏడాదికి పైగా కేసు నడుస్తోంది. ఇరువర్గాల వాదనలు ఆర్డీవో విన్నారు. హియరింగ్ ముగిసింది. తీర్పు వస్తుందనే దశలో కరోనా లాక్డౌన్ వచ్చింది. కేసు వాయిదా పడింది. లాక్డౌన్ అనంతరం భూ వివాదం పరిష్కారం అవుతుందని ఇరువర్గాలు భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చింది. భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో శ్రీనివాస్ కేసు ఆర్డీవో కోర్టులో అలాగే ఉంది. ఇలాంటి కేసులు జిల్లాలో దాదాపు 736వరకు ఉన్నాయి. వీటిల్లో జేసీకోర్టులో ఇటీవలే తీర్పులు వచ్చి హైకోర్టుకు వెళ్లిన కేసులు 20వరకు ఉన్నాయి. హియరింగ్‌లో 56 కేసులు ఉన్నాయి. ముస్తాబాద్(సిరిసిల్ల): ఏళ్లుగా కొనసాగుతున్న భూ పంచాయితీల సత్వర పరిష్కారానికి తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. రెవెన్యూకోర్టులో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించే విధంగా ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటుచేస్తోంది. భూముల ధరలు పెరగడం, భూ పంచాయితీ సమస్యలతో దాడులు, హత్యలు వంటి ఘటనలు జరగకుండా ట్రిబ్యునల్ దోహదపడేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ల కోర్టుల్లో 736కేసులు ఉన్నాయి. ఇవి సంవత్సరాలుగా హియరింగ్ జరగడం, వాయిదాల దశలో ఉన్నాయి. కొన్ని తుదితీర్పు దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కొత్తగా రెవెన్యూ చట్టం తీసుకురావడం, అందులో భాగంగా భూ పంచాయితీలకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నారు. అధికారులకు తప్పనున్న పనిభారం ప్రోటోకాల్ అమలు, రెవెన్యూ సంబంధ పనులు, ఇతర బాధ్యతలతో తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్లు(ప్రస్తుత అడిషనల్ కలెక్టర్లు) బీజీగా ఉంటారు. భూ సేకరణ, మంత్రులు, అధికారుల పర్యటనలు, సమావేశాలతో ఒత్తిళ్లమధ్య విధులు నిర్వహిస్తుంటారు. దీంతో భూ సమస్యల పరిష్కారానికి వారికి సరైన సమయం, విచారణ చేసే అవకాశాలు తక్కువ. ప్రత్యేక ట్రిబ్యునల్ ద్వారా భూ సమస్యల పరిష్కారం లభిస్తుందని కక్షిదారులు ఆశిస్తున్నారు. రిటైర్డుజడ్జి ద్వారా ట్రిబ్యునల్ జిల్లాలో తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను ట్రిబ్యునల్‌కు బదలాయింపు చేస్తారు. నూతన రెవెన్యూ చట్టం ప్రకారం రిటైర్డు జడ్జిని నియమించి కేసుల పరిష్కారానికి కృషి చేయనున్నారు. ప్రతి వెయ్యి భూ పంచాయితీలకు ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు కానుంది. ఈ లెక్కన జిల్లాలో ఒక ట్రైబ్యునల్ ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ఫిర్యాదులు లేని భూ వివాదాలు జిల్లాలో ఫిర్యాదులు లేని భూ సమస్యలు చాలానే ఉన్నాయి. అన్నదమ్ముల భూ పంపిణీ వివాదాలు, సరిహద్దు పంచాయితీలు, ఒకరి పేరిటా ఉన్న భూమిని మరొకరి పేరుతో పట్టా చేయడం, ఆన్లైన్లో తప్పులు, రికార్డుల్లో తక్కువ భూమి నమోదు, సర్వే నంబర్లలో తప్పులు, 1బీ రికార్డుల్లో పేరు మార్పిడి, మ్యూటేషన్లు ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. ఇందులో కొన్ని రెవెన్యూ కోర్టుల వరకు వెళ్తే.. ఊర్లో పెద్ద మనుషుల ద్వారా మరిన్ని పంచాయితీలు నడిచేవి ఉన్నాయి. వీటన్నింటికి ట్రిబ్యునల్ పరిష్కారం చూపుతుందని ప్రభుత్వం భావిస్తోంది. -
నాగుల పంచమి రోజున అరుదైన దృశ్యం
సాక్షి, రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లో నాగుల పంచమి రోజున అరుదైన దృశ్యం వెలుగు చూసింది. గ్రామ శివారులోని బొమ్మన వేణి మల్లయ్య వ్యవసాయ పొలంలో రెండు సర్పాలు సయ్యాటలాడాయి. రెండు గంటలపాటు ప్రకృతి ఒడిలో పరవసించి పోయాయి. పాముల సయ్యాటను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. ఆసక్తిగా తిలకించారు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. (నెటిజనుల ఆగ్రహం.. చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్) -
అప్పుల బాధతో రెజ్లింగ్ క్రీడాకారుడి మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): చిన్నతనంలోనే తండ్రి అనా రోగ్యంతో కానరాని లోకా లకు వెళ్లాడు.. తల్లి కూలీ పనులు చేస్తూ నలుగురు కొ డుకులను చదివించింది.. వారు ప్రయోజకులు అవుతుంటే ఆమె మురిసిపోయింది.. ఇంతలో నా లుగో కుమారుడైన రెజ్లింగ్ క్రీడాకారుడు శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకోవడం బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఎస్సై వెంకటకృష్ణ కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన భుజంకార్ ఎల్లోజి–బాలమణి దంపతులకు నలుగురు కుమారులు రాజేష్, వంశీ, శివ, శ్రీనివాస్ ఉన్నారు. ఎల్లోజి 20 ఏళ్ల కిందట అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి బాలమణి అన్నీ తానై కుమారులను పెంచింది. ఎదిగిన కుమారుల్లో శ్రీనివాస్ రెజ్లింగ్‌లో జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. మి గతా ముగ్గురు చికెన్, మటన్ వ్యాపారం చేస్తున్నారు. క్రీడలకు ఆదరణ తగ్గడంతో శ్రీనివాస్ గతకొంతకాలంగా గ్రామంలోనే ఉంటూ సోదరులకు వ్యాపారంలో సహాయ పడుతున్నాడు. కరోనా నేపథ్యంలో వ్యాపారం సాగక అప్పులవడం, అ నారోగ్యం కారణంగా మనస్తాపం చెందిన శ్రీ నివాస్ గత నెల 30న పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు కరీంనగర్ తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సలహాతో హైద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు..
సాక్షి, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో ఇద్దరు జనశక్తి సీపీఐ(ఎంఎల్) నక్సలైట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లెల్లకు చెందిన వ్యక్తితో పాటు, సిద్ధిపేట జక్కాపూర్‌కు చెందిన విఠల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. వారి వద్ద నుంచి కంట్రీమేడ్ పిస్టల్, రివాల్వర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు రిక్రూట్మెంట్లు, నిర్వహణ కోసం అవసరమైన నిధుల సేకరణ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలోనే జనశక్తి నక్సల్ పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. ఇంకా పలువురి నక్సల్స్ అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. -
‘రైతు బంధుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’
సాక్షి, రాజన్న సిరిసిల్ల: రైతు బంధు ఎగ్గొడతారని ప్రతిపక్ష పార్టీల నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కె.తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదని స్పష్టం చేశారు. రైతు బంధు పెట్టిన తరువాతనే దేశంలో ప్రధానమంత్రి పీఎం కిసాన్ యోజన పథకం ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్ ఆదుకుంటే కాంగ్రెస్ జాతీయ నాయకుడు అభిషేక్ సింగ్వీ అభినందించారని తెలిపారు. జిల్లా కేంద్రంలో మోడల్ రైతు బజారును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... (చదవండి: ఆహ్లాదం అంచున అగాధం!) ‘ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాలంటే దశాబ్దాలు గడిచేవి. కాళేశ్వరం మూడేళ్లలో పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది. ఏటికి ఎదిరీదినట్లు కాళేశ్వరం ప్రాజెక్టుతో 85 మీటర్ల నుంచి 618 మీటర్ల ఎత్తుకి నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఈ ఏడాది ఆర్థికంగా ఇబ్బందులున్నా ప్రభుత్వం 12 వందల కోట్ల రుణమాఫీ చేసింది. 52 లక్షల ఖాతాల్లో రైతు బంధు జమ చేశాం. కరోన సమయంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ వ్యాపారాలు చేసుకునే విదంగా రైతు బజార్ నిర్మించాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగున్నప్పుడే తెలంగాణ బాగుంటుంది. నియంత్రిత సాగుకు కొందరు వక్ర భాష్యం చెప్తున్నారు. రాష్ట్రంలో అన్ని చోట్ల సమీకృత రైతు బజార్లు నిర్మిస్తాం. తెలంగాణ వ్యాప్తంగా మత్స్య పరిశ్రమ పెరుగుతోంది. నీలి విప్లవం రాబోతోంది. పౌల్ట్రీ రంగంలో అగ్రగామిగా ఉన్నాం. సిరిసిల్ల జిల్లాను ప్రయోగ కేంద్రంగా తీసుకోబోతున్నాం. సిరిసిల్లలో జరిగిన అభివృద్ధి అన్ని మున్సిపాలిటీల్లో జరుగుతుంది. సిరిసిల్ల నియోజకవర్గన్ని రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే అగ్రశ్రేణిలో నిలబెడతాను’అని మంత్రి పేర్కొన్నారు. (చదవండి: మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేయాలి: కేటీఆర్) -
వేములవాడలో గ్యాంగ్‌వార్‌ను తలపించే ఘటన
రాజన్నసిరిసిల్ల: వేములవాడలో ఆదివారం సాయంత్రం గ్యాంగ్‌వార్‌ను తలపించే ఘటన చోటుచేసుకుంది. రెండు వర్గాలవారు దాదాపు 20 నిముషాలపాటు రణరంగాన్ని సృష్టించారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వివరాలు.. రాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్లిన ఓ యువకుడిని మరో యువకుడు ప్రశ్నించాడు. నెమ్మదిగా వెళ్లాలని మందలించాడు. దాంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరు యువకుల స్నేహితులు సైతం రంగంలోకి దిగడంతో వివాదం మరింత ముదిరింది. రెండు గ్రూపుల యువకుల పరస్పర దాడులతో స్థానియకులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. పది మందిపై కేసు నమోదు చేశారు. గొడవకు సంబంధించిన వీడియో బయటికొచ్చింది. (చదవండి: వెళ్లనీయరు.. ఉండనీయరు..) -
కరోనా రెడ్ జోన్ ఏరియాలో కేటీఆర్ పర్యటన
సాక్షి, రాజన్న సిరిసిల్ల: ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. వేములవాడలోని కోవిడ్ ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించి ప్రజలకు ధైర్యం చెప్పారు. రెడ్ జోన్ ఏరియాలో కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందుతున్నాయా అని మంత్రి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సామాజిక దూరం పాటించి.. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని కోరారు. మే 3 వరకు ఇళ్ళకే పరిమితం కావాలి ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. (చదవండి: లాక్డౌన్ : నలుగురికి స్పూర్తిగా) అమెరికా ఏం చేయలేకపోయింది.. అగ్రరాజ్యమైన అమెరికా కరోనా వైరస్‌ను తట్టుకోలేకపోయిందని, అక్కడ శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా అదుపులో ఉందని తెలిపారు. కరోనాకు నియంత్రణనే మందు అని గుర్తు చేశారు. కరోనా సోకకుండా జిల్లా యంత్రాంగం అప్రత్తమైందని.. జిల్లాలో ఒకే ఒక పాజిటివ్ కేసు నమోదైందని వెల్లడించారు. జిల్లాలో మళ్లీ కొత్త కేసులు నమోదు కావద్దని, అందరూ స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు. (చదవండి: మళ్లీనా!) ‘దేశానికే తెలంగాణ అన్నపూర్ణ. ఎండాకాలంలో మెట్ట ప్రాంతమైన సిరిసిల్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం. పల్లెల్లో భౌతిక దూరం పాటిస్తున్నారు. కానీ, పట్టణాలలో యువత పాటించడం లేదు. ప్రజలు అధికారులకు సహకరించాలి. లేని యెడల చట్ట రీత్యా చర్యలు తప్పవు. రాబోయే మరో రెండు వారాలు ప్రజలు సహకరించాలి. త్వరలో కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించుకుందాం’అని మంత్రి అన్నారు. -
కరోనా: రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి కేసు
సాక్షి, రాజన్న సిరిసిల్ల: రాష్ట్ర వ్యాప్తంగా దడ పుట్టిస్తున్న మహమ్మారి కరోనా జిల్లాలో తొలిసారి బయటపడింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వేములవాడకు చెందిన నలుగురు వ్యక్తులకు రెండవసారి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, వైరస్ బారినపడ్డ సదరు యువకుడికి ఎలాంటి కోవిడ్-19 లక్షణాలు లేకుండానే పాజిటివ్‌గా తేలడం కలవరం పుట్టిస్తోంది. ఇక, తెలంగాణలో ఇప్పటివరకు 471 కరోనా కేసులు నమోదవగా.. 12 మంది మృతి చెందారు. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. (చదవండి: కరీంనగర్లో కరోనా కేసులు ఇలా...) (చదవండి: లాక్డౌన్: దండంపెట్టి చెబుతున్నా..!) -
లండన్‌లో చిక్కుకున్న రాష్ట్ర విద్యార్థులు
సిరిసిల్ల: ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన తెలంగాణ విద్యార్థులు స్వస్థలం వచ్చేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా ప్రభావంతో అక్కడి విద్యా సంస్థలు మూసివేయగా స్వగ్రామానికి వచ్చేందుకు విద్యార్థులు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. ఆదివారం నుంచి భారత దేశానికి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేయనుండటంతో లండన్‌లో ఉన్న విద్యార్థులకు ఇబ్బందులు మొదలయ్యాయి. వీరిలో రాష్ట్రానికి చెందిన 50 మంది ఉన్నారు. తిరిగి వెళ్లేందుకు విమానాలు లేవని, టికెట్లు రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు సిబ్బంది చెప్పడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. భారత్ వచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. -
15 ఏళ్ల నిరీక్షణకు తెర
కోనరావుపేట: దుబాయ్ వెళ్లిన ఓ వలసజీవి.. అక్కడి ఏజెంట్ మోసానికి 15 ఏళ్లు నరకయాతన అనుభవించాడు. వీసా లేకుండా పనిచేశాడంటూ దుబాయ్ ప్రభుత్వం రూ.5.15 లక్షల జరిమానా విధించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలం ఎగ్లాస్పూర్కు చెందిన దొబ్బల దుర్గయ్య రూ.80 వేలు అప్పు చేసి ఓ ఏజెంట్ ద్వారా 2005 లో దుబాయ్ వెళ్లాడు. అక్కడికి వెళ్లాక ఏజెంట్ పాస్‌పోర్ట్ తీసుకుని వదిలేశా డు. 15 ఏళ్లు నరకం అనుభవించాడు. విషయం తెలుసుకున్న ఇండియన్ పీపుల్స్ ఫోరం ఉపాధ్యక్షుడు జనగామ శ్రీనివాస్ అక్కడి అధికారులతో మాట్లాడి.. వీసా, టికెట్, అవుట్ పాస్‌పోర్ట్ ఇప్పించి ఇండియాకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం దుర్గయ్య స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. -
వేములవాడలో భగ్గుమన్న రాజకీయ కక్షలు!
సాక్షి, రాజన్న సిరిసిల్ల: వేములవాడలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదనే కోపంతో ముద్రకోల వెంకటేశ్ అనే మాజీ కౌన్సిలర్ శివ అనే యువకుడిపై కత్తితో దాడిచేశాడు. తీవ్రగాయాలపాలైన బాధితున్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు..వేములవాడ మున్సిపాలిటీలోని 3వ వార్డు నుంచి వెంకటేశ్ టీఆర్ఎస్ తరపున పోటీచేశాడు. ఇండిపెండెంట్ అభ్యర్థి దివ్య చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాడు. అయితే, తన ఓటమి కారణం శివే అని వెంకటేశ్ కక్ష పెంచుకున్నాడు. తనకు కాకుండా దివ్యకు ఓటు వేసిన శివను చంపుతానంటూ పలుమార్లు హెచ్చరించాడు. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్‌తో అతనిపై కత్తితో దాడికి దిగాడు. నిందితుడు వెంకటేశ్, అతని మిత్రుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
బాధ్యులను ఉపేక్షించం: మంత్రి కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: విద్యార్థులపై వేధింపులకు పాల్పడిన వారిని ఉపేక్షించే ప్రసక్తేలేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్ ను కేటీఆర్ గురువారం సందర్శించారు. వేధింపులకు గురైన తొమ్మిది విద్యార్థులను ఆయన పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. ఇప్పటికే దేవయ్యను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. విద్యార్థులు స్వంత హాస్టల్ భవనం కావాలని కోరారని త్వరలో నిర్మిస్తామని కేటీఆర్ వెల్లడించారు. జిల్లాలోని అన్ని బాలికల హాస్టల్లో ఆత్మరక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొన్నారు. నిరంతరాయంగా శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కలెక్టర్,ఎస్పీలను ఆదేశించామని చెప్పారు. భవిష్యత్తులో సిరిసిల్ల హాస్టల్లో జరిగిన సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
దివ్య హత్య కేసు : లొంగిపోయిన నిందితుడు
సాక్షి, సిద్దిపేట : సంచలనం సృష్టించిన బ్యాంకు ఉద్యోగిని దివ్య (23) హత్య కేసులో నిందితుడు వెంకటేశ్ బుధవారం వేములవాడ సీఐ శ్రీధర్ ఎదుట లొంగిపోయాడు. నిందితున్ని సీఐ శ్రీధర్ సిద్దిపేట పోలీసులకు అప్పగించారు. కాగా, వారం రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన దివ్య మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఆమె గజ్వేల్‌లోని ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. బ్యాంకు సమీపంలోనే ఓ ఇంటిపై అంతస్తులో అద్దెకు ఉంటోంది. (చదవండి : గజ్వేల్‌లో యువతి దారుణ హత్య) ఆమెకు వరంగల్‌కు చెందిన సందీప్ అనే యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈనెల 26న పెళ్లి జరగాల్సి ఉంది. ఈనేపథ్యంలో ఇరు కుటుంబాల వారు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉండగా..ఈ దారుణ ఘటన చోటుచేసుంది. బ్యాంకులో పనులు ముగించుకుని ఇంటికి చేరిన దివ్య.. కాబోయే భర్తతో ఫోన్లో మాట్లాడుతుండగా దుండగుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. పదునైన కత్తితో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. ఆ సమయంలో దివ్య తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడం.. దివ్య నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సందీప్ బ్యాంకు సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. దీంతో చుట్టుపక్కల వారు, తోటి బ్యాంకు ఉద్యోగులు అక్కడకు వచ్చి చూసేసరికి దివ్య రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయి కనిపించింది. ప్రేమోన్మాదమే తమ కుమార్తె హత్యకు కారణమని దివ్య తల్లిదండ్రలులు కన్నీరుమున్నీరయ్యారు. (చదవండి : దివ్య హత్య కేసులో మరో కోణం..) (దివ్య హత్య : పోలీసుల అదుపులో వెంకటేష్ తల్లిదండ్రులు) -
రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత పులుల సంచారం
-
సిరిసిల్ల జిల్లాలో అమానుషం!
సాక్షి, రాజన్న సిరిసిల్ల : జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్ అటెండర్ కనకయ్యతో చెప్పులు తుడిపించారు. ఈ ఘటన తంగళపల్లి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువత్తుతున్నాయి. డీఎమ్‌హెచ్‌వోపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ ఘటనపై డీఎమ్హెచ్వో చంద్రశేఖర్ వివరణ ఇచ్చారు. ‘చెప్పులపై క్యాండిల్ మరకలు పడటంతో నేను తొలగిస్తుంటే.. అటెండర్ మధ్యలో కల్పించుకున్నాడు. చెప్పులను తీసుకుని వెళ్లాడు. నేను వారించిన కూడా అతడు వినలేదు. నా చెప్పులు తుడిపించే స్థాయికి దిగజారలేదు. ఆ ఫొటో ఎవరు తీశారో కూడా నాకు తీయలేదు. ఇంట్లో కూడా నా పనులు నేనే చేసుకుంటాను’ అని చంద్రశేఖర్ తెలిపారు. -
నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన
-
నేడు సిరిసిల్ల జిల్లాకు సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమ వారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8:30 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరి 10:30 గంటలకు వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మిడ్ మానేరు డ్యామ్ పరిశీలన కోసం బయలుదేరుతారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మిడ్ మానేరు నుంచి బయలుదేరి ఒంటి గంటకు కరీంనగర్ జిల్లాలోని తీగలగుట్టపల్లికి చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు. -
కందికట్కూర్‌కు ‘లీకేజీ’ భయం
ఇల్లంతకుంట (మానకొండూర్): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ గ్రామం వద్ద నిర్మించిన మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర) ప్రాజెక్టు నుంచి రెండు రోజులుగా నాలుగైదు చోట్ల నీటి ఊటలు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఆనకట్ట నుంచి నీరు లీకవడంతో తమకు ముప్పేమైనా ఉంటుందా? అని గ్రామస్తులు ఆందోళనలకు గురవుతున్నారు. గతంలో బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద బోగం ఒర్రె ప్రాం తంలో బుంగపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అక్కడి మాదిరిగానే ఇక్కడ బుంగ పడుతుందని భయపడుతున్నారు. కాగా, ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ సమీపంలో మధ్యమానేరు ఆనకట్ట నుంచి శనివారం మూడు చోట్ల ఊట లొచ్చాయి. దీంతో అధికారులు రాళ్లు, మట్టితో ఆ ప్రాంతాన్ని పూడ్చివేయించారు. ఆదివారం మళ్లీ రెండుచోట్ల ఊటలు రావడం ప్రారంభమైంది. ఇది చూసి గ్రామస్తులు ఆనకట్ట నుంచి వస్తున్న లీకేజీ ఊట ఎక్కడ ఉప్పెనగా మారుతుందోనని ఆందో ళన చెందుతున్నారు. సుమారు మూడు కిలోమీటర్ల దూరం వరకు ఆనకట్ట వెంట నిర్మించిన కాల్వలో సీపేజీ నీళ్లు పారుతున్నాయి. నాలుగైదు చోట్ల కట్ట నుంచి నీళ్లు బయటికి వస్తున్నాయి. భయం అవసరం లేదు: శ్రీకాంత్‌రావు, ఎస్ఈ మధ్యమానేరు ఆనకట్ట నుంచి వస్తుంది సీపేజీ వాటర్ మాత్రమే. ఆనకట్టకు ప్రమాదం లేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది అనుకున్న స్థాయిలో కూడా రావడం లేదు. కట్ట లీకేజీపై సీఎం పేషీ ఆరా మధ్యమానేరు ఆనకట్ట లీకేజీపై సీఎం పేషీ అధికారులు ఆదివారం ఆరా తీశారు. అధికారులకు ఫోన్ చేసి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. -
సిరిసిల్లలో జేఎన్టీయూ ఏర్పాటు
సాక్షి, సిరిసిల్ల: జిల్లాలో జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య టి.పాపిరెడ్డి అన్నారు. సిరిసిల్ల పట్టణ శివారులోని పెద్దూరు, సర్దాపూర్, వెంకటాపూర్ శివారుల్లో 88 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి బృందం బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. అనంతరం సిరిసిల్ల కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాపిరెడ్డి మాట్లాడారు. కళాశాల స్థాపనకు అన్ని విధాలా అనుకూలమైన పరిస్థితులున్నాయని వివరించారు. పట్టణానికి అతి సమీపంలో స్థలం ఎంపిక చేయడం బాగుందని, సిరిసిల్లలో ఏర్పాటు చేయడం వల్ల సిద్ధిపేట, కామారెడ్డి, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో విద్యార్థులకు అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. రెండేళ్లలో సిరిసిల్లకు రైల్వే లైన్ రానున్న నేపథ్యంలో రవాణా పరంగా ఇబ్బందులుండవని పేర్కొన్నారు. ఏర్పాటుకు సానుకూల నివేదిక అందిస్తామని స్పష్టం చేశారు. సిరిసిల్లలో సాధ్యమైనంత త్వరలో మోడల్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. జాయింట్ కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా మాట్లాడుతూ ఎమ్మెల్యే తారకరామారావు ప్రత్యేక చొరవతో జేఎన్టీయూ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కమిటీ సభ్యులు, రాష్ట్ర విద్య మండలి వైస్‌చైర్మన్ ఆచార్య వి.వెంకటరమణ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఈ. సాయిబాబారెడ్డి, ఓయూ ఇంజినీరింగ్ కళాశాల వైస్‌ప్రిన్సిపాల్ ఆచార్య ఎ.కృష్ణయ్య, డీఆర్వో ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీవో టి.శ్రీనివాస్‌రావు, జిల్లా సర్వేయర్ శ్రీనివాస్, తహసీల్దార్ అంజన్న పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధం పెట్టుకుందని..
సాక్షి, సిరిసిల్ల : వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళను గ్రామస్తులు ట్రాక్టర్‌కు కట్టేసి చితకబాదారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోనాల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలకు వెళ్తే.. బోనాల గ్రామానికి చెందిన కున్న లావణ్య భర్త నాగరాజు విదేశాల్లో ఉంటాడు. అయితే ఇక్కడ ఒంటరిగా ఉంటున్న లావణ్య.. అదే గ్రామానికి చెందిన పడుగే నారాయణ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. నారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. లావణ్య, నారాయణల మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టు బయటకి పొక్కడంతో గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టారు. దీంతో వారిద్దరు గ్రామం నుంచి పారిపోయారు. వారు సిరిసిల్లలోని శివనగర్‌లో ఒక ఇంట్లో అద్దెకు దిగారు. ఈ విషయం నారాయణ కుటుంబసభ్యులకు తెలియడంతో బుధవారం సాయంత్రం అక్కడికి వెళ్లి అతన్ని ఇంటికి పట్టుకుని వచ్చారు. దీంతో లావణ్య నారాయణ కనిపించడం లేదని.. అతన్ని వారి బంధువులు తీసుకెళ్లారని పోలీసులను ఆశ్రయించారు. అనంతరం లావణ్య నేడు గ్రామానికి చేరుకుని.. నారాయణ ఇంటికి వెళ్లారు. లావణ్య అక్కడికి రావడంతో నారాయణ కుటుంబసభ్యులు ఆమెను బంధించారు. అనంతరం పలువురు గ్రామస్తులతో కలిసి ట్రాక్టర్ ముందు భాగంలో కట్టేసి ఆమెను చితకబాదారు. -
తడబడింది.. నిలబడింది...
ఒకప్పుడు వందలాది మంది పిల్లలతో వెలిగిన బడులు మూతబడ్డాయి. పిల్లలు రాకుంటే బడి ఎలా నడుస్తుంది. అందుకే బడి మూతపడింది.. ఇందులో వింతేముంది.. ఎన్నో సర్కారు స్కూళ్లు మూతపడ్డాయి. కానీ ఇక్కడ మూతపడింది సర్కారు స్కూళ్లు కాదు.. ప్రైవేటు స్కూళ్లు.. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 17 ప్రైవేటుబళ్లు మూతపడ్డాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా చేయి చేయి కలిపి సర్కారు బడిని బతికించుకున్నారు. ఇది కొన ఊపిరితో ఉన్న ఎన్నో సర్కారు స్కూళ్లకు ఆదర్శమైంది.. ఒక్కరు చూపిన చొరవ వందలాది మంది తల్లిదండ్రులకు ప్రైవేటు భారాన్ని తప్పించిన విజయమిదీ.. బీజం పడింది ఇక్కడే... ఎల్లారెడ్డిపేట మండలంలోని పదిరలో ఏడో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఉంది. ఒకప్పుడు ఎంతో మందికి విద్యాబద్ధులు నేర్పించిన ఆ బడి ఒక దశలో మూతపడే స్థాయికి చేరింది. కారణం అక్కడ ఓ ప్రైవేటు స్కూల్ ఏర్పాటు కావడం. అందులో కేరళకు చెందిన ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం పై ఆసక్తితో తమ పిల్లలను ఆ బడికి పంపించడం ప్రారంభించారు. ఒకరిని చూసి ఒకరు ఇలా ప్రైవేటు బడిలో సంఖ్య పెరుగుతోంది. సర్కారు బడిలో తగ్గుతోంది. ఆ బడిలో చదువుకున్న స్థానికులను ఇది కలచి వేసింది. ఈ విషయాన్ని మండల విద్యాధికారిగా ఉన్న మంకు రాజయ్యకు చెప్పారు. సర్కారు బడిలో ఇంగ్లీష్ మీడియం బోధన చేయలేరా..? అని పదిర గ్రామస్తులు ప్రశ్నించారు. ఎందుకు చేయలేం.. తప్పకుండా చేద్దామని నిర్ణయించుకుని తొలి అడుగు వేశారు. అంతే! ప్రభుత్వ స్కూల్లో ఆంగ్ల బోధనకు శ్రీకారం చుట్టారు. దాంతో అక్కడి ప్రైవేటు స్కూల్ మూతపడింది. సర్కారు బడి బతికింది.. అదే స్ఫూర్తితో దుమాల గ్రామంలోనూ సర్కారు బడిలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించారు. అక్కడా ప్రైవేటు స్కూల్ మూతపడింది. ఇలా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని 17 ప్రైవేటు స్కూళ్లు సర్కారు ఒక్కొక్కటిగా చేతులెత్తేశాయి. ‘మా బడికి రండి’ అంటూ... ‘మా బడికి రండి’ అంటూ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కరపత్రాలను ముద్రించారు. సర్కారు బడిలో ఆంగ్ల మాధ్యమంతో పాటు.. తాము అందించే విద్యాబోధన విధానాలను వివరిస్తూ.. కరపత్రాలను పంపిణీ చేశారు. పిల్లల తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్లి.. వాళ్లకు అర్థమయ్యే రీతిలో చెప్పారు. ఒకటికి రెండుసార్లు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంటికి రావడంతో తల్లిదండ్రుల్లోనూ మార్పు వచ్చింది. ప్రైవేటు బడికి పంపకుండా సర్కారు బడికి పంపించడం మొదలు పెట్టారు. ఒకరిని చూసి మరొకరు సర్కారు బడిపై నమ్మకాన్ని పెంచుకున్నారు. ఇలా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని 32 స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేశారు. ఆ స్కూళ్లలో 979 మంది విద్యార్థులు ఉండగా.. ఆంగ్ల మాధ్యమానికి సర్కారు బడిలో శ్రీకారం చుట్టగానే 3905 మందికి చేరింది. పదిరతో మొదలైన మార్పు అటవీ గ్రామాల్లోకి పల్లెలకు సోకింది. సర్కారు బడిలో నాణ్యమైన చదువు దరి చేరడంతో ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు బడికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. పిల్లలకు అవసరమైన బూట్లు, బ్యాడ్జీలు, టైలు, కొన్ని గ్రామాల్లో స్కూల్ బస్సులను సైతం సమకూర్చుకుని కార్పోరేట్ స్కూళ్లను మరిపించే విధంగా విద్యాబోధన చేస్తున్నారు. గత ఏడేళ్లలో దాతల సాయంతో రూ.కోటి వరకు విరాళాలు సమకూర్చుకుని సర్కారు స్కూళ్లకు జవసత్వాలు కల్పిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని సర్కారు విద్యాసంస్థల్లో 6753 మంది చదువుతున్నారు. ఇందులో ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని 12 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, మరో 32 మంది ప్రజాప్రతినిధులు తమ పిల్లలను స్థానికంగా ఉండే సర్కారు స్కూళ్లలోనే చదివించడం మరో విశేషం. ఇలా మార్పునకు టీచర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు బాటలు వేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కె. తారక రామారావు సైతం ప్రజాప్రతినిధుల, ఉపాధ్యాయుల ఉత్సాహాన్ని చూసి స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయించారు. కార్పోరేట్ సోషల్ రెస్పాన్స్(సీఎస్ఆర్) కింద వివిధ కంపెనీల ద్వారా సర్కారు స్కూళ్లకు ఆధునిక హంగులు కల్పించారు. బాధ్యతలను గుర్తించిన గురువులు... బడి వేళ దాటితే చాలు.. ఇంటిదారి పట్టే ఉపాధ్యాయులు ఉన్న ఈ రోజుల్లో ఇక్కడి ప్రభుత్వ ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తున్నారు. వారి పట్టుదల, కృషి ఫలితంగానే సర్కారు బడి నిలబడింది. నూతన విధానానికి శ్రీకారం చుట్టక ముందు ఇక్కడి సర్కారు స్కూళ్లలో 158 మంది ఉపాధ్యాయులు ఉండగా.. పిల్లల సంఖ్య పెరిగి ఇప్పుడు 201కి చేరింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యార్థులు లేక స్కూళ్లు మూత పడి 750 ఉపాధ్యాయ స్థానాలు రద్దయ్యాయి. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో అందుకు భిన్నంగా పిల్లల సంఖ్యతో పాటు టీచర్ల సంఖ్య పెరగడం విశేషం. కోటికొక్కరు.. రాజయ్య సారు... సర్కారు బడిని బతికించడంలో ఓ అధికారి కీలకపాత్రను పోషించారు. ఆయనే ఎల్లారెడ్డిపేట మండల విద్యాధికారి మంకు రాజయ్య. ఆయన పట్టుదల, అంకితభావం, నిబద్ధతతో చేసిన కృషి ఫలితంగా మార్పు సాధ్యమైంది. కోనరావుపేట మండలం ధర్మారం సర్కారు బడిలో చదువుకుని ఎంఈవోగా ఉద్యోగం సాధించిన ఆయన కళ్లముందే సర్కారు స్కూళ్లు మరణశయ్యపై ఉండడం చూసి తట్టుకోలేక పోయారు. సమస్య మూలాలను గుర్తించారు. ఈ పరిస్థితిని మార్చాలనుకున్నారు. గ్రామస్థులతో సమావేశాలు, ఉపాధ్యాయులతో సమీక్షలు, ఇంటింటా ప్రచారం ‘మన బడి.. మనందరి బాధ్యత’ అని కదిలించారు. అద్భుతమైన ఫలితాలను సాధించారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని స్కూళ్లలో విశేషమైన మార్పునకు బాటలు వేశారు. ఇదే స్ఫూర్తితో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మరో 25 స్కూళ్లలోనూ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. జాతీయ స్థాయిలో గుర్తింపు... రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలో వచ్చిన మార్పు జాతీయ స్థాయిలో గుర్తింపునిచ్చింది. ఎల్లారెడ్డిపేట ఎంఈవో మంకు రాజయ్య ప్రతిష్ఠాత్మకమైన అవార్డును ఢిల్లీలో అందుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్రమంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని, కేంద్ర మంత్రి స్మృతి ఇరాని చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. సర్కారు బడిలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని, ప్రభుత్వం అందించే సౌకర్యాలను వివరిస్తూ.. ప్రైవేటు బడి కంటే సర్కారు స్కూల్ ఎంతో మేలు అనే సందేశాన్ని ఇచ్చే ‘ఇది మా సర్కారు బడి’ అనే షార్ట్ ఫిల్మ్‌ను నిర్మించి పల్లెల్లో ప్రదర్శిస్తున్నారు. – వూరడి మల్లికార్జున్, ‘సాక్షి’ రాజన్న సిరిసిల్ల. – ఫొటోలు: నిమ్మ బాల్‌చందర్‌రెడ్డి, ఎల్లారెడ్డిపేట. అందరి సహకారంతో సాధించాం... అందరి సహకారంతో సర్కారు బడిని సగౌరవంగా నిలబెట్టాం. తెలుగుతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని బోధించాలని నిర్ణయించి సక్సెస్ అయ్యాం. ఇందుకోసం అనేక ఇబ్బందులు పడ్డాం. కానీ అంతిమంగా విజయం సాధించడం సంతోషంగా ఉంది. లోపాలు వెతికే కంటే లోపాలను సవరించడంపై దృష్టి సారిస్తే మంచి ఫలితాలు వస్తాయి. సామాజిక భాగస్వామ్యంతో బడులు బలోపేతం అయ్యాయి. – మంకు రాజయ్య, ఎంఈవో, ఎల్లారెడ్డిపేట. -
మురిసిన సిరిసిల్ల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాల వినియోగంలో రాజన్న సిరిసిల్ల, ఖమ్మం జిల్లాలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. రాష్ట్ర తలసరి వినియోగం కంటే ఆ రెండు జిల్లాలు ముందుండటం గమనార్హం. కాగా ఆదిలాబాద్ జిల్లా మాత్రం చిట్టచివరి స్థానంలో నిలిచింది. పశుసంవర్థశాఖ విడుదల చేసిన 2018–19 ఆర్థిక ఏడాది పాలనా నివేదిక ప్రకారం రాష్ట్ర తలసరి పాల వినియోగం నెలకు 4.6 లీటర్లుగా ఉంది. జిల్లాల ప్రకారం చూస్తే అత్యధికంగా రాజన్న సిరిసిల్ల నెలకు 6.3 లీటర్ల తలసరి వినియోగంతో టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత ఖమ్మం జిల్లా 5.5 లీటర్లతో రెండో స్థానంలో నిలిచినట్లు నివేదిక తెలిపింది. పాల ఉత్పత్తిలో దేశంలో 13వ స్థానం ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారత్ మొదటిస్థానంలో ఉండగా తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో పాల సేకరణ 3.92 లక్షల లీటర్లు ఉండగా, 2018–19 ఆర్థిక సంవత్సరంలో 7 లక్షల లీటర్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విజయ డెయిరీ తన నివేదికలో తెలిపింది. 2025 నాటికి ఏకంగా 10 లక్షల లీటర్లు సేకరించి పురోగమించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు నివేదికలో స్పష్టంచేసింది. 57,538 పాడి పశువుల పంపిణీ సహకార డెయిరీలకు పాలు పోసే 2.13 లక్షల మంది రైతులకు పాడి పశువులను సబ్సిడీపై అందజేయాలని గతేడాది ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రూ. 1677 కోట్లతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ పాడి రైతులకు 75%, ఇతర రైతులకు 50%సబ్సిడీపై పాడి పశువులను అందజేస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 57,538 మంది పాడి రైతులకు గేదెలు, ఆవులను సబ్సిడీపై అందజేశారు. -
కుమారుడి మృతి తట్టుకోలేక తల్లి మృతి
-
అన్నీ కలిసొస్తే ఆయనే కేంద్రమంత్రి
రాజన్న సిరిసిల్ల జిల్లా: అన్నీ కలిసి వస్తే కరీంనగర్ టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ కేంద్ర మంత్రి అయ్యే అవకాశముందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల వచ్చిన కేటీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణాకు లాభమని.. కాంగ్రెస్ బీజేపీలు గెలిస్తే రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీలకు లాభమని వ్యాఖ్యానించారు. ఇద్దరు ఎంపీలతోనే మనం తెలంగాణా తెచ్చుకున్నామని, 16 మంది ఎంపీలు ఉంటే ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవాలని కోరారు. ఇప్పుడు మోదీకి వేడి లేదు.. కాంగ్రెస్‌కు గాడి లేదు.. రానున్నది సంకీర్ణ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. మన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు.. తెలంగాణాకు కేంద్ర మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదని గుర్తు చేశారు. అలాంటి మోదీకి మనం ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. మనకు కావాల్సింది చౌకీదార్ నాయకుడు కాదని, దిల్దార్ నాయకుడు కావాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శమని, మోదీ, చంద్రబాబు నాయుడు రైతుబంధు పథకాలను కాపీ కొట్టారని తీవ్రంగా విమర్శించారు. దేశంలోనే నెంబర్ వన్ సీఎంగా కేసీఆర్ గుర్తింపు పొందారని కొనియాడారు. -
పార్టీల ఎజెండా ఏదైనా.. ‘జెండా’ సిరిసిల్లదే..!
సాక్షి, సిరిసిల్ల :ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో 1500 మంది ఉపాధి పొందుతున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి పార్లమెంట్ ఎన్నికల వరకు సిరిసిల్లలో సందడి నెలకొంది. ఏ పార్టీకి అయినా.. ఎజెండా లేకున్నా.. సరే కానీ ఆ పార్టీ జెండాలు లేకుంటే.. కుదరని పరిస్థితి నెలకొంది. పార్టీ అధినేతలు ప్రచారానికి వచ్చినా.. ఊరూరా ఎన్నికల ప్రచారం చేసినా.. జెండాలు, కండువాలు తప్పని సరి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల బరిలో నిలిచే అన్ని పార్టీలకు సిరిసిల్ల వస్త్రపరిశ్రమ జెండాలను సరఫరా చేస్తోంది. ఫలితంగా ఊరంతా ఉపాధి పొందుతోంది. బట్ట నుంచి బ్యానర్ల వరకు.. ఎన్నికలు ఏవైనా, పార్టీలేవైనా.. అభ్యర్థి ఎవరైనా ఎన్నికల ప్రచారానికి వినియోగించే జెండాలు, కండువాలు వస్త్రోత్పత్తి ఖిల్లా సిరిసిల్ల నుంచే సరఫరా అవుతాయి. వస్త్ర పరిశ్రమకు నిలయమైన సిరిసిల్లలో 34 వేల మరమగ్గాలు ఉన్నాయి. ఇందులో 27వేల మగ్గాలపై పాలిస్టర్ వస్త్రోత్పత్తి సాగుతుండగా.. మరో ఏడు వేల మగ్గాలపై కాటన్ వస్త్రం ఉత్పత్తి అవుతోంది. పాలిస్టర్ బట్టపై ఆర్డర్ వచ్చినట్లుగా వివిధ పార్టీల గుర్తులు, రంగులు, అభ్యర్థుల పేర్లు ప్రింటింగ్ చేసి సరఫరా చేస్తారు. పాలిస్టర్ బట్టను పార్టీ రంగుల్లో ప్రాసెసింగ్ చేయించి సరఫరా చేస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పాటు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సిరిసిల్ల నుంచి ప్రచార సామగ్రి ఎగుమతి అవుతోంది. దేశవ్యాప్తంగా సిరిసిల్లలో తయారైన జెండాలు ఎన్నికల వేళ రెపరెపలాడుతున్నాయి. సిరిసిల్లలోనే చౌక.. దేశంలోని బీవండి, సూరత్, మాలేగావ్ ప్రాంతాల్లో మరమగ్గాలపై పాలిస్టర్ గుడ్డ ఉత్పత్తి అవుతున్నా.. అక్కడ ఉత్పత్తి అయ్యే వస్త్రం సిరిసిల్ల వస్త్రంలాగా చౌకగా లభించదు. దీంతో హైదరాబాద్‌కు చెందిన మర్వాడీ సేట్లు.. దేశంలోని వివిధ ప్రాంతాల పార్టీల ఆర్డర్లు ముందుగానే తీసుకుని సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులకు ఆర్డర్లు ఇస్తారు. ఒక్క బ్యానర్‌ను సైజును బట్టి రూ.50 నుంచి రూ.200 వరకు ఉంటుంది. కండువా, జెండాలకు రూ.25 నుంచి రూ.50, టోపీ (క్యాప్)లకు రూ.20 నుంచి 30 వరకు తోరణాల జెండాలు పదివేల జెండాలకు రూ.3000 నుంచి రూ.4000 వరకు అమ్ముతారు. బహిరంగ సభల్లో వినియోగించే భారీసైజు బ్యానర్లను సైతం ఇక్కడే ముద్రించి ఇస్తారు. వీఐపీ కండువాలను రూ.100 ఒక్కటి సరఫరా చేస్తారు. రూ.5కోట్ల మేర వ్యాపారం.. ప్రతి ఎన్నికల సమయంలో సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు రూ. 5 కోట్ల మేర వ్యాపారం సాగుతోంది. ఇక్కడికి ఆర్డర్లు రావడం కొత్తేం కాదు. సిరిసిల్ల నేతన్నలు గత నలుబై ఏళ్లుగా జెండాలు అందిస్తున్నారు. 1978లో తొలుత సిరిసిల్లలో రామ్బలరామ్ స్క్రీన్పింటర్స్ రంగురంగుల పార్టీల జెండాలను ముద్రించడం ఆరంభించింది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగి దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతాపార్టీ, వైఎస్సార్సీపీ, బహుజన సమాజ్‌పార్టీ, జనసేన, ఇలా ఏ పార్టీ అయినా ఆయా పార్టీల రంగుల్లో జెండాలను ప్రింట్ చేసి అందిస్తారు. అభ్యర్థుల పేర్లు, నినాదాలు సైతం బట్టపై అద్దడం విశేషం. ఎన్ని‘కళ’ సిరిసిల్లలో పాతిక వేల కుటుంబాలు వస్త్రోత్పత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. తరచూ ఆటుపోట్లతో వస్త్రపరిశ్రమ సంక్షోభానికి గురికావడం, ఉపాధి లేక పోవడం వంటి సమస్యలు ఉండేవి. ఇప్పుడు బతుకమ్మ చీరలు ఉత్పత్తి ఆర్డర్లు, ఎన్నికల ప్రచార సామగ్రి ఆర్డర్లు రావడంతో నేతన్నలకు చేతి నిండా పని లభిస్తోంది. ఎన్నికల సామగ్రి సరఫరాతో 500 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. జెండాలను కుట్టుమిషన్లపై కుట్టే పనిలో మరో వెయ్యి మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఇక్కడే బట్ట తయారు కావడంతో ఇక్కడి కార్మికులకు మెరుగైన ఉపాధి లభిస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) జెండా ఆర్డర్లు సైతం సిరిసిల్లకు రావడం విశేషం. చేదు అనుభవం.. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి తొలిసారి సిరిసిల్లకే వచ్చారు. ప్రజాచైతన్య యాత్రను సిరిసిల్ల నుంచే శ్రీకారం చుట్టడం భారీ ఎత్తున పీఆర్పీ జెండాలు, కండువాల ఆర్డర్లు వచ్చాయి. ఆర్డర్లు ఇచ్చిన ఆ పార్టీ నేతలు ఆర్డర్లకు డబ్బులు ఇవ్వలేదు. ప్రచార సామగ్రిని తీసుకెళ్లలేదు. దీంతో సిరిసిల్ల వస్త్రవ్యాపారులు ఉద్దేర భేరానికి స్వస్తి పలికారు. ‘‘మిషన్‌పై జెండాలు కుడుతున్న ఈమె మేర్గు లావణ్య. సిరిసిల్లలోని వెంకట్రావునగర్. లావణ్య రోజుకు వెయ్యి జెండాలు కుడుతుంది. ఒక్కో జెండాకు 25పైసల చొప్పున రోజుకు రూ.250 కూలి లభిస్తోంది. నెలకు సగటున లావణ్య ఇంట్లో ఉంటూనే రూ.5వేలు సంపాదిస్తోంది. లావణ్య భర్త శ్రీనివాస్ నేత కార్మికుడు. సాంచాలు నడుపుతూ నెలకు రూ. 8వేలు సంపాదిస్తాడు. ఇంట్లోనే పాపను చూసుకుంటూ లావణ్య ఉపాధి పొందుతోంది’’. ‘‘ఈమె కాటబత్తిని అనిత. సిరిసిల్ల సాయినగర్. అనిత పార్టీల జెండాలు, కండువాల, క్యాప్‌లు కట్‌చేస్తూ.. సరిచేస్తూ.. నెలకు రూ.6వేల వరకు సంపాదిస్తోంది. ఆమె భర్త సత్యనారాయణ డయింగ్ కార్మికుడు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడ్డాడు. ఇద్దరు పిల్లలను పోషించేందుకు బీడీలు చేసేది. రోజుకు వెయ్యి బీడీలు చేసినా.. నెలకు రూ.3వేలకు మించి రాకపోయేవి. ఈ డబ్బులతో ఇల్లు కిరాయి చెల్లిస్తూ.. పిల్లలను సాకడం కష్టమైంది. దీంతో ఆమె పార్టీల జెండాల తయారీ కార్ఖానాలో పనికి చేరింది. దీంతో ఇప్పుడు రూ.6వేలు వస్తున్నాయి. ప్రభుత్వం వితంతు పింఛన్ రూ.వెయ్యి ఇస్తోంది. పిల్లలను చదివిస్తోంది’’. 16 ఏళ్లుగా ఇదే పని నేను 2002 నుంచి 16 ఏళ్లుగా ఇదే వ్యాపారం చేస్తున్నాను. ఎన్నికల సమయంలో కొద్దిగా ఎక్కు వ పని ఉంటుంది. మిగితా రోజు ల్లో స్కూల్, కాలేజీల బ్యా నర్లు, యాగాలు, యజ్ఞాల కండువాలు, జెం డాలు సరఫరా చేస్తాను. ఏడాది పొడువునా ఇ దే పని ఉంటుంది. నా వద్ద 25 మంది కార్మికు లు పని చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు మంచి గిరాకీ ఉంది. దేశమంతా సరఫరా చేస్తున్నాను. – ద్యావనపల్లి మురళి, వ్యాపారి చదువుకుంటూ.. సంపాదిస్తూ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న. మా అమ్మ నిర్మలతో పాటు నేను జెండాలు కుడుతాను. చదువుకుంటేనే తీరిక వేళల్లో పనిచేస్తాను. రెండు మిషన్లు ఉన్నాయి. అంతకు ముందు మా అమ్మ బీడీలు చేసేది. బీడీల పని కంటే ఈ పని బాగుంది. మంచి ఉపాధి లభిస్తుంది. ఇంటి వద్దనే నీడ పట్టున ఉండి పని చేస్తాం. ఎన్నికల రోజుల్లో పని ఎక్కువగా ఉంటుంది. – సామల దీప్తి, ఇంటర్ విద్యార్థి -
పేరిణిలో ‘రజిత’
సాక్షి, నిర్మల్ అర్బన్: టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ బాలికల జూనియర్ కళాశాలలో ప్రభుత్వ మ్యుజిక్ టీచర్‌గా పని చేస్తున్న ఎట్టెం రజిత రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండల కేంద్రం వాస్తవ్యురాలు. నృత్య కళలోనే ప్రత్యేకత సంతరించుకున్న ‘పేరిణి’లో ఆమె కళాకారిణిగా, శిక్షకురాలిగా రాణిస్తున్నారు. తాను నమ్మిన కళే తనకు ఉద్యోగాన్ని చూపించిందనే రజిత గర్వంగా చెబుతారు. వివాహానంతరం కూడా శిక్షణను కొనసాగించిన రజిత ఓవైపు డిప్లొమాలాంటి సర్టిఫికెట్ కోర్సులు చేస్తూనే మరోవైపు అనేక మందికి శిక్షణనిచ్చారు. ఈ క్రమంలోనే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఆంధ్రనాట్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా పేరిణి నృత్య ప్రదర్శనలు ఇచ్చిన రజిత పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ చేతుల మీదుగా నాట్యచూడామణి, ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ రమణాచారి చేతుల మీదుగా హంసవాణి అవార్డులను అందుకున్నారు. 2017 అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా కేటీఆర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం, విజయవాడ కళాక్షేత్రం వారి నాట్య కౌముది, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వీసీ చేతుల మీదుగా కళాభూషణ, అసోంలోని సాలోరి ఆర్ట్స్ ఆకాడమీ వారి బెస్ట్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. రవీంద్రభారతిలో నిర్వహించిన పేరిణి నృత్యోత్సవంలో కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ చేతుల మీదుగా ఉత్తమ నాట్యాచారిణి, బాంబేలో ప్లయింగ్ స్టెరో కంపెనీ వారి బెస్ట్ కొరియోగ్రాఫర్ ప్రశంసాపత్రాలు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ సంబురాల్లో జిల్లా ఉత్తమ కళాకారిణిగా కలెక్టర్ ప్రశాంతి రజితకు అవార్డును అందజేశారు. అలాగే ప్రపంచ తెలుగు మహాసభలో ఉత్తమ పేరిణి కళాకారిణిగా ప్రశంసాపత్రాలు అందుకున్న రజిత తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షురాలిగా కూడా సేవలందిస్తున్నారు. -
నాకు ఓటేయలేదు.. డబ్బులు తిరిగివ్వండి..!
సాక్షి, తంగళ్లపల్లి (సిరిసిల్ల): ‘‘నాకు ఓటేయలేదు.. డబ్బులు వెనక్కిఇవ్వండి’అంటూ ఓడిపోయిన ఓ సర్పంచ్ అభ్యర్థి ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థిస్తున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలవాలన్న ఏకైక లక్ష్యంతో సదరు అభ్యర్థి పెద్ద మొత్తం ఖర్చు పెట్టాడు. తీరా పదవి చేజారిపోయేసరికి బేజారయ్యాడు. కొంత మంది గ్రామస్తులు మాత్రం అయ్యో పాపం అంటూ తాము తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నారు. పదవీ కాంక్షతో స్థాయికి మించి అప్పులు చేసి ఎందరో తమ కుటుంబాలను రోడ్డుపాలు చేసుకుంటున్నారని తెలిపేందుకు ఈ ఘటన అద్దం పడుతోంది. -
‘టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు ఒక్కటయ్యాయి’
సాక్షి, రాజన్న సిరిసిల్ల : టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు ఒక్కటయ్యాయని మంత్రి కే తారక రామారావు అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఆరు వేల కోట్లతో సిరిసిల్లను అభివృద్ది చేశామంటూ పేర్కొన్నారు. రైతుకు ఎంత చేసినా తక్కువే అంటూ.. ఇప్పటికే వ్యవసాయానికి 24గంటల కరెంటు ఇస్తున్నామని తెలిపారు. రైతుబంధు ద్వారా ఎనిమిది వేలు ఇస్తున్నానమని, మళ్లీ అధికారంలోకి వచ్చాక పదివేలకు పెంచుతామని హామి ఇచ్చారు. రైతు బీమా ద్వారా బాధిత రైతు కుటుంబాలను ఆదుకుంటున్నామని, రైతు చనిపోతే ఐదు లక్షలు ఇస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువులు, విత్తనాలకు క్యూలో నిలబిడ్డామని గుర్తుచేశారు. ఆదాయం పెంచి పేదలకు పెంచాలన్నదే కేసీఆర్ లక్ష్యమని అన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగానే నాకు రాష్ట్ర వ్యాప్తంగా పేరు వచ్చిందని అన్నారు. సంక్షేమ పథకాలలో తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలిచిందని తెలిపారు. -
నచ్చకపోతే నాకు ఓటెయ్యకండి
సాక్షి, సిరిసిల్ల: నియోజకవర్గ ప్రజలకు తాను నచ్చకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయవద్దని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకంటే విపక్షాల అభ్యర్థులు సమర్థులని విశ్వసిస్తే వారికే ఓటు వేయాలని కోరారు. పేదోళ్ల ముఖంలో ఇంకా చిరునవ్వులు కనిపించాలంటే తనకు మరోసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని, ఇంతకు పదింతలు అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. 2009 ఎన్నికల్లో తొలిసారి సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయగా 171 ఓట్ల మెజార్టీ తో బయటపడ్డానని, ఇప్పుడు కార్యకర్తలు లక్ష మెజార్టీని అందిస్తామంటుంటే పదేళ్లలో జరిగిన మార్పు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. దీనికంతటికీ కారణం కేసీఆర్ ఇచ్చిన ఆత్మ విశ్వాసమేనని పేర్కొన్నారు. అరవై ఏళ్ల దుష్టపాలనను మరిపించేలా తమ నాలుగేళ్ల పాలన కొనసాగిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఒకప్పుడు సిరిసిల్ల అంటే ఉరిసిల్లగా చెప్పుకునేవారని.. ఇప్పుడు నేత కార్మికులు నెలకు రూ.20 వేలు సంపాదించే స్థితికి చేరుకున్నారని వివరించారు. తాను నేత కుటుంబంలో పుట్టకపోయినా వారితో సమానంగా నేతన్నలపై అవగాహన పెంచుకున్నానని చెప్పారు. కొన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వేద్దామంటే ఖాళీ లేని పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. సిరిసిల్లకు రైల్వే లైను తీసుకువస్తానని, రాష్ట్రస్థాయి ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మోదీకంత సీన్ లేదు.. ఇక మీదట ప్రధాని మోదీకంత సీన్ ఉండదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇన్నిరోజులు గడిచినట్లుగా ఇక మీదట సాగవని స్పష్టం చేశారు. 15మంది ఎంపీలను గెల్చుకుంటే అందరూ మన వెంటే ఉంటారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర ఏమీలేదని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారని.. టీఆర్ఎస్, కేసీఆర్ అనే మూడు అక్షరాలు లేకుంటే ఇంకా 300 ఏళ్లయినా తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను గద్దె దించాలనే లక్ష్యంతోనే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తిరుగుతున్నారని, ఆయనకు ఆ పదవి రావడం కూడా కేసీఆర్ పెట్టిన భిక్షేనని వ్యాఖ్యానించారు. ఎన్నికలు వస్తున్నాయని కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా హామీలిస్తున్నారని, ఆరు రాష్ట్రాల బడ్జెట్ కేటాయించినా వారి హామీలు నెరవేరవన్నారు. టీటీడీపీ అధ్యక్షుడు రమణకు తన సీటే దిక్కులేదని, ఇంకా ఇరవై సీట్లు తెస్తానంటున్నాడని ఎద్దేవా చేశారు. కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనతో ప్రతీ కార్యకర్త గర్వంగా ఫీలవుతున్నారన్నారు. ఏ మాత్రం అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అమలుపర్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్రతిపక్ష పార్టీగా కూడా అర్హత లేని విధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ టీఆర్ఎస్ నేతలు బస్వరాజు సారయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకోండి కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మల్లుగారి నర్సగౌడ్ తన ఆవేదనను వెలిబుచ్చారు. తాము కోరుకున్న విధంగా పాలన సాగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకోవాలని, కేటీఆర్ స్థానికంగా తమకు అందుబాటులో ఉండటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నర్సగౌడ్ను పిలుచుకుని కేటీఆర్ సర్ది చెప్పారు. సమావేశానికి కొన్ని నిమిషాల ముందు.. సమావేశానికి కె.తారకరామారావు చేరుకోవడానికి కొద్ది నిమిషాల ముందే చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ అక్కడ దర్శనమిచ్చారు. కేటీఆర్‌కు ఎదురుపడి తన సీటు విషయమై గోడు వెళ్లబోసుకున్నారు. తర్వాత మాట్లాడుతానని కేటీఆర్ ఆమెకు నచ్చజెప్పి పంపించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 105 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించి, చొప్పదండి సీటును సస్పెన్స్‌లో ఉంచిన విషయం తెలిసిందే. -
కరెంటు మీటర్ రీడింగ్‌నే మార్చారు
సిరిసిల్ల : విద్యుత్ వినియోగంపై సెస్ అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుండగా, అంతకుమించిన పరిజ్ఞానంతో సెన్సార్ మీటర్లనే మార్చేసి విద్యుత్‌ను అక్రమంగా వాడుకుంటున్న వైనం సిరిసిల్లలో శుక్రవారం వెలుగుచూసింది. పట్టణంలోని నెహ్రూనగర్ ప్రాంతంలో సెస్ టౌన్ ఏఈ భక్తిసింగ్ ఆధ్వర్యంలో సెన్సార్ మీటర్లను తనిఖీ చేశారు. బొల్లి రవీందర్, గడ్డం శంకరయ్య, శ్రీనివాస్, సిద్దులవాడలో రాజేశం అనే వినియోగదారుల ఇళ్లలో సెన్సార్ మీటర్లను సీల్ ఓపెన్‌చేసి మీటరు తిరగకుండా కట్టడి చేశారు. తనిఖీల సందర్భంగా సెన్సార్ మీటర్ సీల్ ఓపెన్ చేసినట్లుగా సంకేతాలు ఇవ్వడంతో మరింత నిశితంగా మీటర్లను పరిశీలించారు. దీంతో విద్యుత్ చౌర్యం జరిగినట్లుగా నిర్ధారణ అయింది. సమాచారం అందుకున్న సెస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ యూనస్, డీఈఈ గోపికృష్ణ నెహ్రూనగర్‌కు వెళ్లి పరిశీలించారు. వినియోగదారులకు థెప్ట్‌కు సంబంధించి జరిమానా విధిస్తామని, ఆ మీటర్ల స్థానంలో కొత్త మీటర్లను ఏర్పాటు చేసినట్లు సెస్‌ఎండీ యూనస్ తెలిపారు. పదిరోజుల వ్యవధిలో సిరిసిల్ల పట్టణంలో 15 థెప్ట్ కేసులు నమోదయ్యాయని సెస్ ఎండీ యూనస్ వివరించారు. సెప్టెంబర్ 1 నుంచి విద్యుత్ చౌర్యానికి పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
15 రోజుల్లో మిషన్ భగీరథ నీరు అందిస్తాం
-
తల,మొండెం వేరుచేసి.. దారుణహత్య
గంభీరావుపేట(సిరిసిల్ల) : గంభీరావుపేట మండలంలో దారుణం చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల– కామారెడ్డి జిల్లాల సరిహద్దు అటవీప్రాంతమైన గంభీరావుపేట మండలం గోరింటాల గ్రామశివారులో తల లేని వ్యక్తి మొండెం మంగళవారం లభ్యమైంది. ప్రధాన రహదారి పక్కనే చెద్దర్లలో(బెడ్షీట్లలో)మూటగట్టి ఉన్న మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు, వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. ఎక్కడో కిరాతకంగా హత్యచేసి శరీరం నుంచి తలను వేరు చేసి.. మొండెంను ఇక్కడ వదిలేసి వెళ్లినట్లుగా భావిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో తలభాగం కోసం గాలించినా.. ఆచూకీ లభించలేదు. చేతులు కట్టేసి ఉండడం చూస్తుంటే.. కఠినంగా శిక్షించి, హింసించి హత్యచేసినట్లుగా భావిస్తున్నారు. వివరాలు సేకరించడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని బట్టి వయస్సు దాదాపు 40ఏళ్లలోపు ఉండవచ్చునని తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని ఎస్పీ రాహుల్‌హెగ్డే, డీఎస్పీ వెంకటరమణ, ఎల్లారెడ్డిపేట రూరల్ సీఐ రవీందర్, డాగ్ స్క్వాడ్ బృందం అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
ఇసుక లారీ బీభత్సం ఒకరు మృతి
-
దేశానికి ఆదర్శంగా మిషన్ భగీరథ
సాక్షి, సిరిసిల్ల : రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లా నీరు అందించటానికి ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు అభిప్రాయపడ్డారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం, మిషన్ భగీరథలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథ నల్లాల నీరు ద్వారా ప్రజల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందన్నారు. మిషన్ భగీరథ పనులను త్వరితగతిన పూర్తి చేసుకుని రాష్ట్రంలో నెంబర్‌వన్‌గా నిలవాలని ఆకాంక్షించారు. దేశంలో 28 రాష్ట్రాలు చేయలేని పనిని తెలంగాణ రాష్ట్రం చేస్తుందని అన్నారు. కేంద్ర మంత్రులను, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మిషన్ భగీరథ ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. -
ఒక్క‘ట్రీ’ బతకలేదు!
సాక్షి, సిరిసిల్ల : జిల్లాకేంద్రంలో చేపట్టిన రోడ్ల విస్తరణకు ఆటంకంగా మారిన ఏళ్లనాటి వృక్షాలను తొలగించిన అధికారులు.. వాటిని శాస్త్రీయ పద్ధతిన సంరక్షించేందుకు తీసుకున్న చర్యలు విఫలమయ్యాయి. 2017 జూన్‌లో ఆర్ అండ్ బీ, అటవీశాఖ అధికారులు తొలగించిన చెట్లకు ప్రాణం పోసేందుకు చేసిన కృషి మట్టిపాలైంది. ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా నాటిన 55 చెట్లు బతకలేదు. మొత్తం 300 వృక్షాలకు పునరుజ్జీవం పోసేందుకు రూ.36 లక్షలు కేటాయించగా.. 55 చెట్లను క్రేన్ల సాయంతో మట్టితో సహా పెకిలించి పట్టణ శివారులోని బైపాస్ రోడ్డులో నాటారు. సంరక్షణ చర్యలు విస్మరించడంతో అవి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ఏళ్లనాటి చెట్లు ఎండిపోయాయి.. పట్టణంలో 20 – 30ఏళ్ల క్రితం చెట్లు రోడ్డు విస్తరణలో తొలగించాల్సి వచ్చింది. ఫారెస్ట్, ఆర్ అండ్ బీ శాఖల అధికారులు హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థతో ఒప్పందం చేసుకుని చెట్లను తొలగించే పనులు చేపట్టారు. చెట్ల కొమ్మలు తొలగించి, వేర్లతో సహా పెలించారు. అయితే, మట్టి వాటి వేర్లకు అంటుకుని ఉండకపోవడంతో చెట్లు వాడిపోయాయి. వాటిని నాటిన ప్రాంత భూసారం, అవి పెరిగిన ప్రాంత భూసారానికి తేడా ఉండడంతో వృక్షాలు జీవం పోసులేకపోయాయని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా అధికారులు అప్పట్లో చెట్లను రక్షించేందుకు చేపట్టిన చర్యలు అభినందనీయం కాగా.. ఆ చెట్లు ఒక్కటీ దక్కకపోవడం బాధాకరం. కొన్ని నాటి ఆపేశాం జిల్లాకేంద్రంలో 300 చెట్లను తరలించాలని భావించాం. కానీ కొన్ని చెట్లను తరలించిన తర్వాత అవి బతికే అవకాశం లేదని తెలిసింది. వేర్లకు మట్టి అంటుకుని ఉండలేదు. ఇది గుర్తించి మిగితా వాటిని నాటకుండానే వదిలేశాం. కొత్త విధానంలో ఇలాంటివి సహజంగానే జరుగుతుంటాయి. – విఘ్నేశ్వర్‌రెడ్డి, ఆర్ అండ్ బీ ఈఈ -
ఎగువ మానేరు ఎడారేనా..?
సాక్షి, ముస్తాబాద్(సిరిసిల్ల) : రాజన్న సిరిసిల్ల జిల్లా వరప్రదాయని ఎగువ మానేరు ప్రాజెక్టు. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలోనే మొదటి చిన్నతరహ నీటి ప్రాజెక్టు. నిజాం కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఆధునీకీకరణ పనులు అటకెక్కాయి. మిషన్ కాకతీయ, నీటి ప్రాజెక్టులకు వేలాది కోట్లు ప్రభుత్వం కేటాయిస్తుండగా.. అధికారుల ఉదాసీనత ఈ ప్రాజెక్టుకు శాపంగా మారింది. వేలాది ఎకరాలకు ప్రత్యక్షంగా.. పరోక్షంగా సాగునీరందిస్తూ.. ప్రజల దాహార్తిని తీరుస్తున్న ఎగువ మానేరుపై పాలకులు శీతకన్ను వీడాలి. ఈ ఏడాది మరమ్మతు పనులకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తోందని ఎదురు చూసిన రైతన్నలకు చివరకు నిరాశే మిగిలింది. ఈ వర్షాకాలానికి ముందే పనులు పూర్తవుతాయని భావించారు. మరింత ఆయకట్టు సాగులోకి వస్తుందనకున్న అన్నదాతలకు ఎదురు చూపులే దక్కాయి. కొట్టుకుపోతున్న స్పిల్‌వే.. చివరి నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ 1945లో కూడవెళ్లి, పల్వంచ వాగులపై నర్మాల వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టును నిర్మించారు. 1948లో పనులు పూర్తయ్యాయి. 2టీఎంసీలతో 17వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే పనులకు శ్రీకారం చుట్టారు. కుడికాలువ ద్వారా అంటే ఇప్పటి ముస్తాబాద్ మండలానికి 10వేల ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా గంభీరావుపేట మండలానికి 7వేల ఎకరాలకు సాగునీటిని అందించారు. కాలక్రమంలో ప్రాజెక్టును అధికారులు పట్టించుకోలేదు. దీంతో సిల్ట్ పేరుకుపోయి నీటి సామర్థ్యం తగ్గింది. అలాగే కుడి, ఎడమ కా లువలు మట్టిలో కూరుకుపోయి చెట్లు మొలిచి నీ రు ముందుకు సాగని విధంగా తయారైంది. ఇక కుడి కాల్వలోని డిస్ట్రిబ్యూటరీ 17 వరకు షట్టర్లు ధ్వంసం అయ్యాయి. ఎడమ కాల్వలోని డీ–10 వ రకు శిథిలం అయ్యాయి. స్పిల్‌వే పై మొక్కలు మొ లిచి నెర్రెలు పెట్టింది. కొంత భాగం వరదకు కొ ట్టుకుపోయింది. చివరకు 5వేల ఎకరాలకు మాత్ర మే సాగునీరందించే ప్రాజెక్టుగా మిగిలిపోయింది. ప్రతిపాదనలకు మోక్షం కలిగేనా.. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో నీటిపారుదల శాఖ అ« దికారులు ఎట్టకేలకు కుడి, ఎడమ తూముల మరమ్మతు, షట్టర్ల మరమ్మతు, కుడికాలువ పది కిలో మీటర్లు, షట్టర్లు, ఎడమ కాలువ 5 కిలోమిటర్ల కా ల్వ లైనింగ్, ముఖ్యంగా యాభై ఏళ్లుగా నిండుకు న్న సిల్ట్ తొలగింపు తదితర పనులు చేపట్టేందుకు రూ. 49 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆరునెలల క్రితం పంపించిన ప్రతిపాదనలు ఈఎస్సీ వరకు వెళ్లి ఆగినట్లు తెలుస్తోంది. ఈ వేసవిలోనే సిల్ట్ తొలగించి కనీసం 13వేల ఎకరాలకు నీరందించాలనుకున్న ప్రతిపాదనలు దాటలేదు. మళ్లీ వర్షాలు మొదలైతే ఇక సిల్ట్పనులు చేయరాదు. భారీ వర్షాలు పడితే వచ్చే వెసవి నాటికి కూడా పూడిక తీసే అవకాశాలు తక్కువే. ష ట్టర్ మరమ్మతు చేయరాదు. మరోసారి రబీలో 5వేల ఎకరాలకు మాత్రమే నీరందించే అవకాశాలున్నాయి. 9వ ప్యాకేజీలోకి గెస్ట్‌హౌస్, బోటింగ్ నిజాం నిర్మించిన గెస్ట్‌హౌజ్ శిథిలావస్థలో ఉండగా.. ఉద్యానవనం రూపు కోల్పోయింది. దీంతో అధికారులు రూ.2 కోట్లతో ఆధునిక హంగులతో గెస్ట్‌హౌస్ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. టూరిజం శాఖ ఉద్యానవనం, గెస్ట్‌హౌస్ నిర్మాణం చేపట్టనుండగా.. దీనిని కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ కింద చేపట్టనున్నారు. -
‘రైతు బంధు’ దేశానికే ఆదర్శం
-
ప్రాణంతీసిన ఇష్టంలేని పెళ్లి..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తల్లిదండ్రుల బలవంతపు పెళ్లి ఓ యువతి ప్రాణాలు తీసింది. ప్రేమించిన యువకున్ని కాదని మరో వివాహం జరిపించగా..ఇష్టంలేని వ్యక్తితో కాపురం చేయలేక ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన వీర్నపల్లి మండలం కంచర్లలో విషాదం నింపింది. ఎస్సై ఎంవీ.సురేందర్‌రెడ్డి వివరాల ప్రకారం.. వీర్నపల్లి మండలం కంచర్లకు చెందిన అజ్మీరా అంగురి (20) ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడ్ని ప్రేమించింది. విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు కామారెడ్డి జిల్లా ముత్కేడు గ్రామానికి చెందిన సంతోష్‌తో ఏడు నెలలక్రితం వివాహం జరిపించారు. సంతోష్‌ను ఇల్లరికం తీసుకొచ్చుకున్నారు. మూడు నెలలకు అంగురి ప్రేమ విషయం భర్తకు తెలిసింది. దీంతో నాలుగు నెలలక్రితం సంతోష్ తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. భార్యభర్తల మధ్య విభేదాలు రావడంతో పరిస్థితిని అంచనా వేసిన ప్రేమికుడు 20రోజులక్రితం గల్ఫ్ వెళ్లిపోయాడు. అటు భర్తతో ఎడబాటు.. ఇటు ప్రేమికుడు దూరం కావడంతో శుక్రవారం అంగురి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. చుట్టప్రక్కల వారు గమనించి ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందింది. ఎస్సై కేసు నమోదు చేశారు. -
దోపిడీ పాలనను ప్రజలకు వివరించాలి
గంభీరావుపేట(సిరిసిల్ల) : టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలన, దోపిడీ విధారనాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని ఉమ్మడి కరీం నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం పార్టీశ్రేణులను కోరారు. మండలా నికి చెందిన పలువురు యువకులు బుగ్గ కృష్ణమూర్తి నేతృత్వంలో మృత్యుంజయం, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, రాష్ట్ర నాయకుడు కేకే మహేందర్‌రెడ్డి సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మృత్యుంజయం పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అంతకుముందు గ్రామంలో కృష్ణమూర్తి ఆధ్వర్యంలో యువకులు ర్యాలీ నిర్వహించారు. గొల్లపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మృత్యుంజయం, పొన్నం ప్రభాకర్, కేకే మ హేందర్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ చలవతోనే తెలంగాణ ఏర్పాటైం దన్నారు. స్వరాష్ట్రం సిద్ధించాక ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్.. రాష్ట్రంలో నియంత పా లన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణ పాఠం చెబుతారని హెచ్చరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకునూరి బాలరాజు, సాహెబ్, బండారి బాల్‌రెడ్డి, ఎస్కే గౌస్, లక్ష్మారెడ్డి, కరికే శ్రీనివాస్, కదిరే శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, బానోత్ రాజునాయక్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
త్వరగా పూర్తిచేయండి
సాక్షి, సిరిసిల్ల : రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు. ఇల్లంతకుంట, కోనరావుపేట మండలాల్లో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీ–9 టన్నెల్, మల్కంపేట రిజర్వాయర్ నిర్మాణాలను ఆయన పరిశీలించి పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఇల్లంతకుంట మండలం తెస్లాపూర్‌లోని ప్యాకేజీ – 10 కింద చేపడుతున్న సర్జ్‌పూల్ టన్నెల్‌ను కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్‌హెగ్డే, ఇరిగేషన్ అధికారులతో కలసి పరిశీలించారు. ప్యాకేజీ – 9 లోని రగుడు నుంచి మల్కంపేట, కొలనూరు, పాతిరెడ్డిపల్లె వద్ద కొనసాగుతున్న పనులు పరిశీలించారు. రగుడు నుంచి మల్కంపేట రిజర్వాయర్ వరకు నిర్మిస్తున్న 12 కి.మీ సొరంగ మార్గం పనుల్లో 9 కి.మీ మేర పూర్తి కాగా మరో 3 కి.మీ పనులు మిగిలి ఉన్నాయని మంత్రి తెలిపారు. మల్కంపేట రిజర్వాయర్ పనులు పూర్తి నాణ్యతతో త్వరగా పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. కొలనూరు రిజర్వాయర్‌ను మల్కంపేట రిజర్వాయర్‌కు అనుసందానించే విషయంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మంత్రి ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. మల్కంపేటలో 200 డబుల్ బెడ్రూం ఇళ్లు.. మల్కంపేట రిజర్వాయర్ చుట్టూ ఉన్న గ్రామాల పేదలకు, భూములు కోల్పోయిన వారికి 200 డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు కాంట్రాక్టర్లను ఆదేశించారు. త్రి వెంట డీఆర్వో శ్యాంప్రసాద్‌లాల్, ఈఈ బుచ్చిరెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. -
మేడే వేడుకల్లో పాల్గొన్న పొన్నం
సాక్షి, రాజన్నసిరిసిల్ల : రాబోయే ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మంగళవారం సిరిసిల్ల బివైనగర్‌లో మేడే సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గతంలో ఉన్న కార్మిక చట్టాలను , సంక్షేమాలను మరించ మెరుగు పరిచి కార్మికులకు అందేవిధంగా కృషిచేస్తామన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సిరిసిల్ల కార్మికులకు ఏం ప్రయోజనం కలుగుతుందని ఊహించామో, అదంతా ఇపుడు శూన్యమన్నారు. రాబోయే కాలంలో నేత కార్మికులకు ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఉండే సమస్యలను పరిష్కరిస్తామన్నారు. నేత కార్మికులందరికీ గుర్తింపు కార్డులను అందిస్తామని తెలిపారు. -
పని ఎక్కువ...జీతం తక్కువ
విద్యాశాఖలో ఉపాధ్యాయులు, సిబ్బందితో సమానంగా పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్స న్స్ (సీఆర్పీ)ను ప్రభుత్వం విస్మరిస్తోంది. మండల విద్యాశాఖాధికారుల పరిధిలో పనిచేసే సీఆర్పీలు రోజురోజుకూ పనిభారం పెరిగి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. స్కూల్ అసి స్టెంట్లతో సరిపోయే అర్హతలతో నియమితులైన సీఆర్పీలకు సమాన పనికి సమాన వేతనం అందని ద్రాక్షగానే మిగిలింది. డిగ్రీ, బీఎడ్, టెట్, పీజీ చేసిన వారు కూడా సీఆర్పీలుగా పనిచేస్తున్నా.. వారికి చాలీచాలని వేతనాలే అందుతున్నాయి. అరకొరగా ఇస్తున్న వేతనాలు రవాణా ఖర్చులకే సరిపోతుండడంతో జీవనోపాధికి నానాపాట్లు పడుతున్నారు. – సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట నుంచి ఎర్ర శ్రీనివాస్ సీఆర్పీ వ్యవస్థ ఏర్పడిందిలా.. గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసి డిప్యూటేషన్‌పై ఎమ్మార్పీ (మండల రిసోర్స్ పర్సన్)లుగా నియమించే వారు. పాఠశాలలు దెబ్బతింటున్నాయనే ఉద్దే శంతో ఆ వ్యవస్థను రద్దు చేసి కాంట్రాక్ట్ విధా నంలో ఆరేళ్ల క్రితం (2012లో) సీఆర్పీ వ్యవస్థ ను రూపొందించింది ప్రభుత్వం. డీఎస్సీ కమిటీ ఇంటర్వూ్యలు నిర్వహించి, అందులో ఉత్తీర్ణత, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్, మెరిట్ ప్రకారం సీఆర్పీలను నియమించారు. నియామక సమ యంలో రూ.5,500 వేతనం. అందులోనే టీఏ బిల్లు ఇచ్చేవారు. క్రమంగా.. 2013లో రూ. 7 వేలు, 2014లో 8,500 చెల్లించారు. ప్రస్తుతం రూ.15వేలు చెల్లిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2298 మంది సీఆర్పీలు పనిచేస్తున్నారు. ఇవీ డిమాండ్లు..: ఉద్యోగ భద్రత కల్పించాలి. వేతనం రూ. 28,940 స్కూల్ అసిస్టెంట్ పోస్టు కేటగిరి ప్రకారం ఇవ్వాలి. ఇన్సూరెన్స్, ఆరోగ్యకార్డులు, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలి. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. ఏడాదికి 22 సాధారణ సెలవులు ఇవ్వాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి. కేజీ నుంచి పీజీ విద్యలో భాగస్వాములను చేయాలి. వేతన వ్యత్యాసం వివిధ రాష్ట్రాలలో సీఆర్పీలకు ఇచ్చే వేతనాలకు, తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చే వేతనాలకు వ్యత్యాసం భారీగా ఉంది. ఉత్తరాఖండ్‌లో రూ. 75 వేలు, గుజరాత్లో రూ. 55,640, హర్యానాలో రూ.54వేలు, తమిళ నాడులో రూ. 51 వేలు, హిమాచల్‌ప్రదేశ్‌లో రూ. 57,390, సిక్కింలో రూ. 60,500 చొప్పున చెల్లిస్తున్నారు. తెలంగాణలో అన్ని రాష్ట్రాల కంటే తక్కువగా వేతనం కేవలం రూ.15 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఇవీ సీఆర్పీల విధులు.. - సీఆర్పీలను స్కూల్ కాంప్లెక్స్‌లకు అనుసంధానించారు. ఒక్కో సీఆర్పీ దాదాపు 15 నుంచి 18 పాఠశాలలను పరిశీలించాల్సి ఉంటుంది. - ఏదో ఒక స్కూల్‌ను ప్రార్థన సమయంలో సందర్శించి ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు నమోదు చేసుకొని వాట్సాప్‌లో అధికారులకు పంపాలి. - మండల వనరుల కేంద్రానికి, పాఠశాలలకు అనుసంధాన కర్తగా పని చేస్తూ సమాచారాన్ని అధికారులకు ఎప్పటికప్పుడు పంపుతూ ఉండాలి. - ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయుడు సెలవు పెడితే సీఆర్పీ విధులు నిర్వర్తించాలి. - కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణకు సహకరించాలి. - సర్వశిక్షా అభియాన్‌తోపాటు ఇతర విద్యాశాఖ కార్యక్రమాలను చేపట్టాలి. - మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించాలి. - బడి బయట పిల్లలను బడిలో చేర్పించడం, రెగ్యులర్‌గా రాని వారిని వచ్చేలా చేయడం వీరి విధి కూడా.. - పాఠశాలలో నిధుల వినియోగాన్ని సమీక్షించాలి. - క్లస్టర్ స్థాయిలో ఎగ్జిబిషన్ మేళాలు నిర్వహించడానికి స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలకు సహకరించాలి. - వేసవి బడులను నిర్వహించాలి. -
కి‘లేడీ’ రిమాండ్
సిరిసిల్లక్రైం: ప్రయాణికుల నుంచి డబ్బులు, నగదు చోరీచేసిన మహిళను సిరిసిల్ల సీసీఎస్ పోలీసులు మంగళవారం రిమాండ్ చేశారు. ఏఎస్పీ రవీంద ర్ తెలిపిన ప్రకారం.. కృష్ణాజిల్లా ఆత్రేయపురంకు చెందిన తాటపట్టి నర్సమ్మ తన సోదరుడితో కలిసి సిరిసిల్ల, వేములవాడ బస్టాండుకు వచ్చిన ప్రయాణికుల నుంచి వస్తువులు, ఆభరణాలు, నగదు చోరీ చేసింది. ఏడేళ్లకాలంలో వీరు రూ. 1.78 లక్షలు, 15తులాల బంగారం అపహరించారు. డబ్బులను అవసరాలకు ఖర్చు చేశారు. బంగారాన్ని వేములవాడలోని వారుంటున్న ప్రదేశంలో భద్రంగా ఉంచారు. వాటిని అమ్ముకునేందుకు మంగళవారం స్వగ్రామం బయల్దేరారు. పక్కా సమాచారంతో సిరిసిల్ల పాత బస్టాండ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. సమావేశంలో సీసీఎస్ సీఐ బన్సీలాల్ ఉన్నారు. -
అనర్హులకు ‘బీడీ పింఛన్’
వేములవాడరూరల్: తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ప్రభుత్వాన్ని, అధికారులను మోసం చేసి లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్మును పింఛన్ రూపంలో కాజేస్తున్నవారి గుట్టు రట్టయింది. ఎలాంటి అర్హతలు లేకుండా బీడీ కంపెనీ యజమానుల నుంచి ధ్రువీకరణ పత్రాలు పొంది మధ్య దళారులకు కమీషన్లు ఇస్తూ పింఛన్ పొందుతున్న కొంతమంది బండారం బట్టబయలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రూరల్ మండలం, అర్బన్ మండలంలోని దాదాపు 29 గ్రామాల్లో 10,295 మంది లబ్ధిదారులు వివిధ పథకాల కింద ప్రభుత్వ సొమ్మును పొందుతున్నారు. వీరికి ప్రభుత్వం ప్రతినెలా రూ.1.12 లక్షలు అందిస్తుంది. ఇందులో ప్రధానంగా 3,506 మంది మహిళలు బీడీ కార్మికుల పింఛన్ పొందుతున్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ. వెయ్యి చొప్పున నెలనెలా బ్యాంకులో జమ అవుతున్నాయి. అయితే వీరిలో చాలామంది బీడీ కంపెనీల నుంచి తప్పుడు ధ్రువీకరణ పత్రాలను పొంది ప్రభుత్వం నుంచి పింఛన్ పొందుతున్నట్లు తెలిసింది. వేములవాడ మండలంలో నెలకు రూ.2 లక్షలు బోగస్ లబ్ధిదారులు తీసుకుంటున్నట్లు అధికారుల విచారణలో బయటపడింది. కలెక్టర్ కృష్ణభాస్కర్ బోగస్ లబ్ధిదారులను గుర్తించేందుకు జిల్లా డీఆర్డీఏ, అడిషనల్ అధికారి మదన్మోహన్, ప్రత్యేక అధికారిగా నియమిస్తూ విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో వేములవాడ రూరల్ మండలంలోని కోనాయిపల్లి గ్రామంలో 24 మంది బీడీ కార్మికులు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి లబ్ధి పొందుతున్నట్లు బయటపడింది. ఈ విషయంపై ఎంపీడీవో వేణుగోపాల్‌తో చర్చించి వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పింఛన్ పొందుతున్న 24 మంది బీడీ కార్మికులపై కేసు నమోదు చేసినట్లు వేములవాడ సీఐ వెంకట స్వామి తెలిపారు. -
రూ.18 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్ఓ
రాజన్న సిరిసిల్ల జిల్లా : ఓ రైతు వద్ద రూ.18 వేలు లంచం తీసుకుంటూ తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వీఆర్వో ఆంజనేయులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. డబ్బులు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. జిల్లెల్లకు చెందిన కిరణ్ అనే రైతు సాదా బైనామాతో భూమిని ముటేషన్ చేసేందుకు వీఆర్ఓను ఆశ్రయించాడు. పని చేసేందుకు వీఆర్ఓ రూ.18 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా..పథకం ప్రకారం లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మిడ్ మానేరులో ఇసుక మాఫియా
-
కిరాక్ డాన్స్‌తో కేక పుట్టించిన మాజీ ఎంపీ
సాక్షి, వరంగల్ : పాతను వదిలించుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రపంచమంతా ఎన్నో వేడుకలు, సంబురాలు జరిగాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే వైరల్ అయ్యాయి. తెలంగాణకు సంబంధించి వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కిరాక్ డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వరంగల్ క్లబ్లో జరిగిన న్యూఇయర్ వేడుకలో పాల్గొన్న రాజయ్య.. సన్నిహితులతో కలిసి సరదాగా డాన్స్చేశారు. పాటకు తగ్గట్టుగా స్టెప్పులు, హావభావాలను మార్చుతూ అద్భుతంగా నర్తించారాయన. పోస్ట్ అయిన కొద్దిసేపటికే వీడియోలు వైరల్ అయ్యాయి. కోడలి అనుమానాస్పద మృతి కేసులో కొన్నాళ్లపాటు జైలులో ఉన్న రాజయ్య ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. చాలాకాలం తర్వాత న్యూఇయర్ పార్టీలో పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చిన ఆయన అందరితో సరదాగా గడిపారు. న్యూ ఇయర్ వేడుకలో అదరగొట్టిన మాజీ ఎంపీ -
మానవత్వం మంట కలిసింది
-
మిడ్‌మానేరు.. ఇక జాతీయ ప్రాజెక్టు
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ గ్రామ సమీపంలో చివరిదశ నిర్మాణంలో ఉన్న మధ్యమానేరు రిజర్వాయర్ ఇక జాతీయ ప్రాజెక్టు జాబితాలో చేరనుంది. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి తన్నీరు హరీశ్‌రావు అసెంబ్లీలో గురువారం ప్రకటన చేయడం జిల్లా ప్రజల్లో ఆనందం నింపింది. బోయినపల్లి(చొప్పదండి): ‘మధ్యమానేరు ప్రాజెక్టు నిర్మాణానికి 2006లో టెండర్లు పిలిచారు. ఆ తర్వాత ఎనిమిదిన్నరేళ్లలో రూ.106కోట్లు ఖర్చు చేశారు. మూడేళ్లలో మేం రూ.461కోట్లు ఖర్చు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నాం. ప్రాజెక్టు కోసం 25 గేట్లు సిద్ధమయ్యాయి. రెండు, మూడు నెలల్లో గేట్లు బిగించి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తాం’ అని గురువారం మిడ్‌మానేరుపై అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ శాసనసభ్యుడు టి.జీవన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు నీటి పారుదల శాఖామంత్రి టి.హరీశ్‌రావు వివరణ ఇచ్చారు. 2లక్షల ఎకరాలకు సాగునీరు ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని సుమారు 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూపొందించిన మిడ్‌మానేరు ప్రాజెక్టు అంశం అసెంబ్లీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎస్సారెస్పీ నుంచి 12 టీఎంసీల నీరు ఇక్కడకు తరలించడంతో ఎస్సారెస్పీలో నీటి లభ్యత లోటు ఏర్పడిందని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. దీంతో మంత్రి హరీశ్‌రావు మిడ్‌మానేరుపై పూర్తి వివరణ ఇచ్చారు. అలాగే సింగూర్ ప్రాజెక్టు నుంచి 15 టీఎంసీల నీరు ఎస్సారెస్పీకి విడుదల చేసి లోటు పూడుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నిల్వ సామర్థ్యం 25.873 టీఎంసీలు 25.873 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మధ్యమానేరుకు రూపకల్పన చేశారు. ఈ సమయంలోనే నిజామాబాద్ జిల్లా ఎస్సారెస్పీ నుంచి బోయినపల్లి మండలం వరదవెల్లి క్రాస్ రెగ్యులేటర్ వరకు 122 కిలోమీటర్ల పొడవున వరదకాలువ నిర్మించారు. ఎస్సారెస్పీలో పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్న తర్వాత పోటెత్తే వరదనీరును వరదకాలువ ద్వారా మిడ్‌మానేరులోకి తరలించేందుకు వీలుగా నిర్మించారు. వైఎస్సార్ మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు ప్రాజెక్టుపై శ్రద్ధ చూపలేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే రూ.461కోట్లు ఖర్చు చేయడంతో పది టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ప్రత్యేక గుర్తింపు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉన్న ప్రాజెక్టుగా మధ్యమానేరు ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఏఐబీపీ(ఆక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం) జాబితాలో మిడ్‌మానేరు ఉండడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాజెక్టుకు 25 శాతం నిధులు వస్తాయని ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టులో కాంక్రిట్ పనులు 4.8లక్షల క్యూబిక్ మీటర్లు చేయాల్సి ఉంది. 2006 నుంచి ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేవరకు కేవలం 50వేల క్యూబిక్ మీటర్ల పని మాత్రమే చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 4.10లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనులు చేశారు. ప్రస్తుతం మిషన్ భగీరథ పనుల కోసం ఎస్సారెస్పీ నుంచి వదిలిన నీరు 5.20 టీఎంసీలుంది. వచ్చే నవంబర్ వరకు నీటి నిల్వ మిడ్‌మానేరు ప్రాజెక్టు ఆధారంగా మిషన్ భగీరథ పథకం కింద సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లోని 18 మండలాలు, 466 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ఎస్సారెస్పీ నుంచి వరదకాలువ ద్వారా నీరు విడుదల చేసి 5 టీఎంసీలు నిల్వ చేసింది. వచ్చే ఏడాది నవంబర్ వరకు మిడ్‌మానేరులో ఇది నిల్వ ఉంటుందని ఎస్ఈ శ్రీకాంత్‌రావు చెప్పారు. ఈలోగా ప్రాజెక్టుకు 25 గేట్లు బిగించి పూర్థిస్థాయిలో నీరు నిల్వ చేయాలని భావిస్తున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే 2018 మార్చి వరకు మిడ్‌మానేరు ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. పెరగనున్న భూగర్భజలాలు మిడ్‌మానేరులో ఏడాదిపాటు 5 టీఎంసీల నీరు నిల్వ ఉంటే.. బోయినపల్లి మండలం మాన్వాడ, మల్లాపూర్, కొదురుపాక, నీలోజిపల్లి, శాభాష్‌పల్లి, వరదవెల్లి, వేములవాడ మండలం రుద్రవరం, సంకెపెల్లి, తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతలఠాణా తదితర ముంపు గ్రామాల పరిధిలోని పునరావాస కాలనీల్లో భూగర్భజలాలు పెరిగే అవకాశముంది. -
వాళ్లు టూరిస్టులు.. నేను లోకల్: కేటీఆర్
సిరిసిల్ల: నేరెళ్ల బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. నేరెళ్ళ బాధితులను మంగళవారం ఉదయం ఆయన పరామర్శించి దాదాపు గంట సేపు బాధితులతో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి డీఐజీ నివేదిక అందగానే బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధితులంతా తన నియోజకవర్గ ప్రజలనీ, వీరి ఆశీస్సులతోనే తాను ఎమ్మెల్యే అయ్యానన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ టూరిస్టులని, తను.. తన పార్టీ ఇక్కడ పర్మినెంట్ అని వ్యాఖ్యానించారు. కోర్టు వారితో మాట్లాడి హైదరాబాద్‌లో మెరుగయిన వైద్యం అందించేలా చూస్తామన్నారు. నేరేళ్ల ఘటన దురదృష్టకరం, అలా జరగాలని ఎవరూ కోరుకోరని తెలిపారు. ప్రజలు దయతలచి ఆశీర్వదిస్తే అధికారంలోకి వచ్చామన్నారు. ఇలాంటి సంఘటనలను తాము ప్రోత్సహించమని వివరించారు. క్షణికావేశంలో లారీలను దగ్దం చేయడంతోనే పోలీసులు కేసులు పెట్టారని వివరించారు. ఎవరైనా రాజకీయంగా విమర్శిస్తే భరిస్తాం కానీ ఇసుక మాఫియా అని అంటే సహించబోమన్నారు. గత 50 ఇళ్లలో ఇసుక ద్వారా వచ్చిన ఆదాయం, ఈ మూడేళ్లలో వచ్చిన ఆదాయం గమనిస్తే.. ఇసుక మాఫియా ఎవరో తెలుస్తుందని అన్నారు. కేసుల్లో దళితులు, బీసీలు ఉన్నారని, దళితులపైనే పెట్టారని ఆరోపించడం తప్పన్నారు. మీడియా మిత్రులు అసౌకర్యానికి క్షమించాలని కోరారు. మీడియా జరగని తప్పును తప్పుగా చూపించవద్దు.. సంయమనం పాటించండని కోరారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆర్థిక సాయం చేసి మళ్లీ మాకు ఓటు వేయమనే కుసంస్కారం మాది కాదన్నారు. -
సిరిసిల్ల చీర.. పేదింటికి సారె!
- ఆడపడుచులకు బతుకమ్మ కానుక - తెల్లకార్డు కుటుంబాలకు పంపిణీ - నేతన్నకు ఉపాధి ధీమా.. రూ.113 కోట్ల విలువైన చీరలకు ఆర్డర్లు సాక్షి, హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగ కానుకగా పేదింటి ఆడపడుచులకు సిరిసిల్ల చీరలను పంపిణీ చేసే కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. అటు చేనేతలకు, ఇటు పేద కుటుంబాలకు బహుళ ప్రయోజనకరంగా ఉండేలా ఈ పథకాన్ని రూపొందించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. చేనేత, జౌళి శాఖ మంత్రి కె.తారక రామారావు సంబంధిత అధికారులతో ఇప్పటికే పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. సిరిసిల్లలో మరమగ్గాలపై తయారు చేసే చీరలను ప్రభుత్వమే కొనుగోలు చేసి పంపిణీ చేయటం ద్వారా.. అక్కడి నేతన్నలకు ఆర్థికంగా భరోసా కల్పించినట్లవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రంజాన్ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు, క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్ కుటుంబాలకు దుస్తులను పంపిణీ చేస్తోంది. రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ సంబురాల సమయంలో పేదింటి ఆడపడుచులకూ చీరలు పంపిణీ చేస్తే పేద కుటుంబాలకు చిరు కానుక అందించినట్లు ఉంటుందని సర్కారు నిర్ణయం తీసుకుంది. 86 లక్షల తెల్ల రేషన్ కార్డులు.. రాçష్ట్రంలో దాదాపు 86 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. తెల్ల కార్డు కుటుంబాలన్నింటికీ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు అవసరమయ్యే చీరల తయారీకి ఇప్పటికే చేనేత, జౌళి శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైన మేరకు బడ్జెట్ కేటాయిం చేందుకు సీఎం కూడా ఆమోదం తెలిపారు. కార్మికుల ఆత్మహత్యలు, ఆకలి చావులతో సంక్షోభంలో ఉండే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు శాశ్వత ఉపాధి కల్పించేందుకు దోహదపడేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. నేతన్నకు చేతినిండా పని.. ప్రభుత్వ నిర్ణయంతో సిరిసిల్ల నేతన్నలకు చేతినిండా పని దొరికినట్లయింది. ఇప్పటికే రాజీవ్ విద్యామిషన్ స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్స్, కేసీఆర్ కిట్లలో చీరల తయారీ ఆర్డర్లను ప్రభుత్వం సిరిసిల్ల కార్మికులకే అప్పగించింది. యూనిఫామ్‌కు అవసరమయ్యే 1.03 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కేసీఆర్ కిట్ల పంపిణీలో భాగంగా 1.18 లక్షల చీరలకు ఆర్డర్లు ఇచ్చింది. ఈ ఏడాది బతుకమ్మ పండగకు 86 లక్షల మంది మహిళలకు చీరలు అందించాలంటే.. దాదాపు 5.41 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే చీరల తయారీ మొదలైంది. చేనేత, జౌళి శాఖ బతుకమ్మ చీరలకు ఇచ్చిన ఆర్డర్ల విలువ దాదాపు రూ.113 కోట్లు. ఒక్కో బతుకమ్మ చీరకు ప్రభుత్వం రూ.230 ధర చెల్లించనుంది. ప్రస్తుతం ఎనిమిది రకాల రంగులతో ఈ చీరలు ఉత్పత్తి అవుతున్నాయి. వృద్ధులకు 8 రంగుల చీరలు, 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు వారికి 40 రకాల ప్రింటింగ్ చీరలను బతుకమ్మ పండుగకు కానుకగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. సెప్టెంబర్ 1 నాటికి ఆర్డర్లు పూర్తి స్థాయిలో అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు 15 వేల మంది బతుకమ్మ చీరల ఆర్డర్లతో ఉపాధి పొందుతున్నారని చేనేత, జౌళి శాఖ అంచనా వేసింది. -
‘కాంగ్రెస్‌కు ప్రశ్నించే దమ్ము లేదు’
వేములవాడ(రాజన్న సిరిసిల్ల): తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దమ్ములేనిదైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు విమర్శించారు. పండిత్ దీన్‌దయాళ్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన ‘గడపగడపకు బీజేపీ’ కార్యక్రమం మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రశ్నించేందుకు కాంగ్రెస్ పార్టీకి దమ్ము సరిపోవడం లేదన్నారు. రానున్న రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీసే పార్టీగా బీజేపీ అవతరించబోతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విడుదల చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజలకు, రైతులకు ఎంతో విశ్వాసం ఉందని.. వచ్చేరోజుల్లో తెలంగాణలో బలమైన శక్తిగా ఎదుగుతామని చెప్పారు. సీఎం కేసీఆర్ సర్వే పేరుతో జనాల్ని మోసం చేస్తున్నారని.. కేవలం ఇది మైండ్‌గేమ్ అని, హౌస్ సర్వేలను తమ పార్టీ ఏమాత్రం పట్టించుకోబోదన్నారు. -
సిరిసిల్లలో ఐటీ దాడులు
సిరిసిల్ల: ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఓ వ్యాపారి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. సిరిసిల్లకు చెందిన ప్రముఖ వ్యాపారి చేపూరి బుచ్చయ్య ఇంటిపై గురువారం ఉదయం నుంచి ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఒక్కరోజు మహిళా కలెక్టర్
⇒ జేసీ యాస్మిన్ బాషాకు దక్కిన అరుదైన గౌరవం ⇒ స్వయంగా సీట్లో కూర్చోబెట్టిన కలెక్టర్ కృష్ణభాస్కర్ సాక్షి, సిరిసిల్ల: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా ప్రత్యేక గౌరవం పొందారు. జిల్లా కలెక్టర్ సీటులో ఆసీనులు కావడమే కాకుండా.. మహిళా దినోత్సవ బహిరంగ సభలోనూ కలెక్టర్‌గా కీర్తింపబడ్డారు. కలెక్టర్ హోదాలో పలు సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్ లీవ్‌లో ఉన్న సమయంలో జేసీ ఇన్చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం సర్వసాధారణమే అయినా.. కలెక్టర్ డి.కృష్ణభాస్కర్ పక్కన ఉండగానే ఆమె కలెక్టర్‌గా సంబోంధింపబడడం విశేషం. మహిళా దినోత్సవం రోజున కలెక్టర్‌గా అధికారిక సంతకం చేయడం మినహా ఆమె బుధవారం ‘ఒక్కరోజు కలెక్టర్’గా వ్యవహరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కలెక్టర్ సీటులో జేసీ.. ఉదయం కలెక్టరేట్లో జేసీ యాస్మిన్‌ను తన చాంబర్‌లోని కలెక్టర్ సీటులో కూర్చోబెట్టి కలెక్టర్ డి.కృష్ణభాస్కర్ మహిళల పట్ల తనకున్న గౌరవం చాటుకున్నారు. ‘ఈరోజు మీరే కలెక్టర్’ అంటూ జేసీని తన సీటులో కూర్చోబెట్టి.. తాను అధికారుల సీట్లలో కూర్చొని మరోసారి తనదైన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు. దాదాపు పావుగంటపాటు ఆమె కలెక్టర్ సీటులో, కలెక్టర్ అధికారుల సీటులో ఉండిపోయారు. అలాగే సభలో మాట్లాడుతున్న సమయంలో ‘ఇవాల్టి కలెక్టర్ యాస్మిన్ బాషా’ అని జిల్లా కలెక్టర్ డి.కృష్ణభాస్కర్ సంబోధించడంతో సభికులు కరతాళ ధ్వనులు చేశారు. మిగతా అతిథులు కూడా యాస్మిన్ బాషాను కలెక్టర్‌గా ప్రస్తావించారు. అధికారికంగా కుదరదని కలెక్టర్‌గా మారిన యాస్మిన్ అదే హోదాలో పలు సమావేశాలు నిర్వహించారు. బీసీ కమిషన్ పర్యటన, అపరిష్కృతంగా ఉన్న అభివృద్ధి పనులు, తహసీల్దార్లతో సమావేశాలను కలెక్టర్ హోదాలో నిర్వహించి, పలు సూచనలు చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా జేసీ యాస్మిన్‌కు ఒక్కరోజు కలెక్టర్‌గా పూర్తి బాధ్యతలు అప్పగించడానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ అధికారికంగా వీలుపడదని ఉన్నతాధికారులు చెప్పడంతో వెనక్కి తగ్గినట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
'టెక్స్టైల్ పార్కు అభివృద్ధికి నిధులు'
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి రాబోయే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని చేనేత, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. దక్షిణ భారత టెక్స్టైల్ మిల్లుల ప్రతినిధుల బృందం సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్‌ను శనివారం సందర్శించింది. ఆ ప్రతినిధుల బృందంతో మంత్రి భేటీయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ త్రిపుర రాష్ర్టాన్ని ఆదర్శంగా తీసుకుని సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. త్వరలోనే త్రిపురలో స్టడీ టూర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో కోయంబత్తూరు, తిరుపూరు మిల్లుల యజమానులు పాల్గొన్నారు. -
మున్సిపల్ కార్మికుడి ఆత్మహత్య
సిరిసిల్ల: ఆర్థిక ఇబ్బందులు తాళలేక మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుడి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబికానగర్‌కు చెందిన ఆంజనేయులు మున్సిపాలటీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవడంతో.. ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
సిరిసిల్ల జిల్లాలో విషాదం
రుద్రంగి: సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రెండేళ్ల చిన్నారితో కలిసి బావి వద్దకు వెళ్లిన ఓ తల్లి విద్యుదాఘాతానికి గురవడంతో ఆమె చేతిలో ఉన్న చిన్నారి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందింది. ఈ సంఘటన జిల్లాలోని రుద్రంగి మండలకేంద్రంలో సోమవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న ఎర్రం సృజన తన రెండేళ్ల చిన్నారి నేతిశ్రీతో కలిసి ఈ రోజు ఉదయం బావి వద్దకు వెళ్లింది. బావి వద్ద విద్యుత్ మోటర్ ఆన్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగలింది. దీంతో చేతిలో ఉన్న నేతిశ్రీ ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి చెందింది. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
బస్సు ప్రమాదం: 35 మందికి గాయాలు
ఎల్లారెడ్డిపేట: వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టిన ఘటనలో 35 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం వద్ద గురువారం చోటు చేసుకుంది. సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెంకటాపురం శివారులో చెట్టును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బహిర్భూమి రహిత జిల్లాగా సిరిసిల్ల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బహిర్భూమి రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల రికార్డు సృష్టించింది. జిల్లాలోని ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించి వందశాతం బహిర్భూమి రహితంగా మార్చేందుకు కలెక్టర్ కృష్ణ భాస్కర్, అధికారులు చేసిన కృషిని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. లక్ష్యాన్ని సాధించినందుకు గర్వంగా ఉందంటూ జపాన్ పర్యటనలో ఉన్న ఆయన ట్విట్టర్ ద్వారా ఆనందం వ్యక్తం చేశారు. -
సిరిసిల్ల ఎంపీపీ రాజీనామా
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు దడిగెల కమలాబాయి మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఎంపీడీవోకు ఇచ్చారు. టీఅర్ఎస్ ఎంపీటీసీల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం కమలాబాయి 2013 జూన్ 4 వ తేదీన బాధ్యతలు చేపట్టి ఎంపీపీ పదవిలో రెండున్నరేళ్లు కొనసాగారు. పదవీ కాలం పూర్తి కావడంతో కమలాబాయి రాజీనామా చేశారు. ఒప్పందం ప్రకారం పెద్దూర్ ఎంపీటీసీ సభ్యురాలు జూపల్లి శ్రీలత ఎంపీపీ బాధ్యలు చేపట్టే అవకాశం ఉంది. -
విద్యార్థినులను వేధిస్తున్న పోకిరి అరెస్ట్
సిరిసిల్ల: పోకిరి వేషాలు వేస్తూ.. విద్యార్థినులను ఏడిపిస్తున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్ల రాజీవ్ నగర్‌కు చెందిన పెండ్యం రాజు గత కొంతకాలంగా కళాశాలకు వెళ్తున్న విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో వేధింపులు ఎక్కువవడంతో.. ఓ విద్యార్థిని ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. దీంతో సోమవారం రంగంలోకి దిగిన స్థానిక ఎస్సై శ్రీనివాస్ విచారణ చేపట్టి పోకిరిని అరెస్ట్ చేశారు. -
ఎమ్మెల్యే రమేశ్‌బాబుకు బెదిరింపులు
ఆయన ఇంటిని పేల్చివేస్తామని కాల్.. బాంబు స్క్వాడ్ తనిఖీలు వేములవాడ అర్బన్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు నివాసం సంగీత నిలయాన్ని పేల్చివేస్తామని అగంతకులు బెదిరించారని తెలిసింది. శనివారం వేకువజామున ఎమ్మెల్యేకు ఇంటర్నెట్ ద్వారా వాయిస్‌కాల్ చేసి ఆయన నివాసాన్ని పేల్చివేస్తామని బెదిరింపులకు దిగినట్లు సమాచారం. అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్వా్వడ్తో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం రాజన్న ఆలయంలోనూ తనిఖీలు చేశారు. ఎమ్మెల్యే నివాసానికి పటిష్టమైన భద్రత కల్పించారు. టౌన్ సీఐ శ్రీనివాస్‌ను సంప్రదించగా, వీఐపీల రాకపోకలున్నందున తనిఖీలు చేశామన్నారు. -
మహిళలపై బ్యాంక్ మేనేజర్ దాడి
సిరిసిల్ల: నగదు కోసం బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులపై బ్యాంక్ మేనేజర్ దాడి చేశాడు. ఈ సంఘటన సిరిసిల్లా రాజన్న జిల్లా ముస్తాబాద్‌లో సోమవారం వెలుగుచూసింది. స్థానిక ఆంధ్రబ్యాంక్‌కు నగదు కోసం వచ్చిన ఖాతాదారులపై బ్యాంక్ మేనేజర్ రాజేంద్ర చేయి చేసుకున్నాడు. నగదు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఖాతాదారులు సోమవారం ఉదయాన్నే బ్యాంకు ఎదుట బారులు తీరారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో.. అక్కడ కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో అసహనానికి గురైన బ్యాంక్ మేనేజర్ రాజేంద్ర వీరంగం సృష్టించాడు. లైన్లో నిల్చొని ఉన్న మహిళలపై చేయి చేసుకున్నాడు. ఈ దాడిలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. మేనేజర్ తీరుకు నిరసనగా స్థానికులు ఆందోళనకు దిగారు. -
'వలసపోయినోళ్లు వాపసు వస్తుండ్రు'
► ఎల్లంపల్లికి మరో 4వేల ఎకరాల భూసేకరణ ► జీవో 123 వచ్చాకే రైతులకు లాభం మంత్రి హరీశ్‌రావు ► ఎల్లంపల్లి ప్రాజెక్టు స్టేజ్-2, ఫేస్-1 ప్రారంభం సాక్షి, సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తుండటంతో వలసపోయినోళ్లు వాపసు వస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఫాజుల్‌నగర్‌లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు స్టేజ్-2, ఫేస్-1ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఫాజుల్‌నగర్ నుంచి నర్సింగాపూర్ ప్రాజెక్టు లోకి నీటిని విడుదల చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ఇటీవల మహ బూబ్‌నగర్ జిల్లా పాలేమూరి చెరువు నీటి విడుదల సందర్భంగా ప్రజలు ‘వలసపోయి నోళ్లు వాపసొచ్చిండ్రని, కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పండంటూ’ తనను కోరారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ బతుకుదెరువు కోసం గల్ఫ్, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లి నానాకష్టాలు పడుతున్నారని, అలా వలస వెళ్లినోళ్లు వాపసొచ్చి రెండు పంటలు పండిం చుకుని సంతోషంగా జీవించే రోజులొచ్చాయ న్నారు. రైతన్నల కష్టాలను శాశ్వతంగా తీర్చేందుకే సీఎం కేసీఆర్ సాగునీటికి రూ.25 వేల కోట్లు కేటాయించారన్నారు. మరో నాలుగు వేల ఎకరాలు సేకరిస్తే ఎల్లంపల్లి ఆయకట్టు కింద 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాన్నారు. మిడ్‌మానేరు నిర్వాసితులకు ఫ్యామిలీ ప్యాకేజీ (యువత ప్యాకేజీ) కింద ఒక్కొక్కరికి రూ.2 లక్షలు పరిహారం ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సంతకం చేశారని చెప్పారు. కేబినెట్ ఆమోదంతో త్వరలోనే నాలుగువేల మందికి పరిహారం అందిస్తామన్నారు. జీవో 123 తీసుకొచ్చిన తర్వాత రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేవని, భూములు ఇచ్చిన పదిహేను రోజుల్లోగానే డబ్బులు చెల్లిస్తామని అన్నారు. కమీషన్లపైనే కాంగ్రేసోళ్లకు ప్రేమ... కాంగ్రెస్ నాయకులకు కమీషన్లపై ప్రేమ తప్ప.. ప్రజలపై కాదని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రాజెక్టులు తామే కట్టామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు పదేళ్లలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఎందు కు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. పైస లొచ్చే పైపులు, మోటార్లు, మొబిలైజేషన్ అడ్వాన్సు లు తప్ప... ఒక్క పంప్హౌస్నూ నిర్మించిన పాపాన పోలేదన్నారు. రైతులకు నీళ్లివ్వడం కాంగ్రెసోళ్లకు ఇష్టం లేదని, అందుకే భూమివ్వ కుండా రైతులను రెచ్చగొడతారని, కోర్టుల్లో కేసులు వేస్తారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇంకో పదేళ్లయినా ఎల్లంపల్లి పూర్తయ్యేది కాదన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనా రాయణ, కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్, వేములవాడ ఎమ్మెల్యే సీహెచ్.రమేశ్‌బాబు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ) చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ప్రాజెక్టుల సీఈ అనిల్ తదితరులు పాల్గొన్నారు. మహానేత కల నిజమైన వేళ ఎల్లంపల్లి నీటి విడుదల సందర్భంగా నిర్వహించిన బహిరంగసభ ఆహ్వాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నిలువెత్తు ఫ్లెక్సీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2006లో ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి సీఎం హోదాలో ఎల్లంపల్లికి శ్రీకారం చుట్టిన వైఎస్‌ను గుర్తు చేసుకుం టూ ఫాజుల్‌నగర్ గ్రామస్తులు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ‘‘శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పది సంవత్సరాల క్రితమే రూపకల్పన చేసిన మహానుభావుని కల నిజమైన వేళ... మెట్ట ప్రాంత ప్రజలు మీ యొక్క సేవలు స్మరించుకుంటారు...’’ అంటూ గ్రామస్తులు ఫ్లెక్సీపై వైఎస్ఆర్ సేవలను మరోసారి మననం చేసుకున్నారు. సభకు హాజరైన ప్రజలు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు సైతం ఆగిమరీ ఫ్లెక్సీని చూసుకుం టూ ముందుకు సాగారు. -
ఇసుక గుంతలో పడి బాలుడు మహిళ మృతి
-
జిల్లా సిగలో ‘సెస్’ వెలుగులు
విస్తరించనున్న సేవలు అడిగిన వెంటనే కనెక్షన్ ఆదర్శవంతమైన సరఫరా జిల్లా ఏర్పాటుతో నాణ్యమైన విద్యుత్ రాష్ట్రంలో డిస్కంల ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. కానీ, జిల్లాలో సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ ద్వారా కరెంటు కొనుగోలు చేస్తూ వినియోగదారులకు సరఫరా చేస్తోంది. గ్రామీణ వికాసం, పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తూ.. వ్యవసాయ, వస్త్రోత్పత్తి రంగాలను అభివృద్ధిలోకి తీసుకొస్తూ ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తోంది. జిల్లా ఏర్పాటుతో తన సేవలు విస్తరించేందుకు ముందుకు సాగుతోంది. సాక్షి, సిరిసిల్ల : సహకార రంగంలో ఉత్తమ సేవలందిస్తున్న సంస్థగా ‘సెస్’కు పేరుంది. కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్థ(ఆర్ఈసీ) దేశవ్యాప్తంగా ఐదు గ్రామీణ విద్యుత్ సహకార సంఘాలను 1970 దశకంలో స్థాపిం చగా అందులో సిరిసిల్ల ‘సెస్’ ఒక్కటి. మిగతావి ఉనికి కోల్పోయినా ‘సెస్’ మెరుగైన విద్యుత్ సరఫరా చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ముఖ్యంగా వ్యవసాయం, వస్త్రో త్పత్తి రంగ అభివృద్ధికి బాటలు వేస్తోంది. అడిగిన వెంటనే విద్యుత్ కనెక్షన్ మంజూరు చేస్తోంది. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే 24 గంటల్లో రిపేరు చేస్తోంది. 2007 వరకు ‘సెస్’ పరిధిలో వినియోగదారులే స్వచ్ఛందంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు చేసుకునేవారు. మరోవైపు.. ‘సెస్’ పరిధిలో విద్యుత్ లైన్‌లాస్ 15శాతం లోపే ఉంటోం ది. ఇప్పుడది 32 శాతానికి పెరిగింది. విని యోగదారులు క్రమం తప్పకుండా 85 శా తం మంది బిల్లులు చెల్లిస్తున్నారు. సంస్థ ప ని తీరును విదేశీ విద్యుత్ కంపెనీల ప్రతి నిధులు సందర్శించి అభినందించారు. వి ద్యుత్ పంపిణీ విధానంపై విదేశీ ఇంజినీరింగ్ విద్యార్థులు, విదేశీ విద్యుత్ సంస్థలు అధ్యయనం చేసి సేవలు అద్భుతమని కితాబిచ్చారు. మెరుగైన వేతనాలు.. ఎన్పీడీసీఎల్(ఉత్తర మండల విద్యుత్ పం పిణీ కంపెనీ) ద్వారా ‘సెస్’ ప్రతీ యూనిట్ విద్యుత్‌ను రూ.రూపాయికి కొనుగోలు చేస్తోంది. వ్యవసాయ రంగానికి ఉచితంగా, మరమగ్గాలకు 50శాతం రాయితీపై, వాణి జ్య అవసరాలకు రూ.4.50– రూ.8 చొప్పు న విక్రయిస్తోంది. వ్యవసాయ రంగం రా యితీని ప్రభుత్వం భరిస్తోంది. మరమగ్గాలకు అందించే రాయితీని ప్రభుత్వం ‘సెస్’కు చెల్లిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో రేయింబవళ్లు అందుబాటులో ఉండి సేవలందిస్తారనే ఉద్దేశంతో సిబ్బందికి మంచి వేతనాలు అందిస్తారు. ఉద్యోగులకు మెరుగైన జీతాలున్నాయి. భర్తీకి నోచుకోని ఉద్యోగ ఖాళీలు ‘సెస్’కు సొంతంగా ఉద్యోగులను నియమించుకునే స్థోమత ఉన్నా ప్రభుత్వం నుం చి అనుమతి రావడంలేదు. దీంతో ఏళ్లుగా కీలక పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. 1998లో 338 మంది సిబ్బంది ఉండగా వివిధ కారణాలతో 2011 నాటికి 123 మం దికి తగ్గారు. విలేజీ ఎలక్ట్రికల్ వర్కర్లకు అసిస్టెంట్ హెల్పర్లుగా పదోన్నతి కల్పించడం తో ఉద్యోగుల సంఖ్య 261 మందికి చేరిం ది. కీలకమైన పోస్టులన్నీ ఎన్పీడీసీఎల్, ట్రాన్స్‌కో నుంచి డెప్యుటేషన్‌పై భర్తీ చేస్తున్నారు. దీంతో సంస్థలో అజమాయిషీ కొరవడింది. రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా నిలి చిపోతే సరిచేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ల పని తీరు పరి శీలన, మరమ్మతులోనూ జాప్యమవుతోం ది. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టలేకపోతున్నా రు. సంస్థ అభివృద్ధి, బకాయిల వసూళ్లపై పర్యవేక్షణ లోపిస్తోంది. అందరికీ సహకారం.. -జిల్లా కేంద్రం కావడంతో ‘సెస్’ కార్యాలయాన్ని కలెక్టరేట్ కోసం కేటాయించారు -జిల్లా ఏర్పాటుతో సంస్థ ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా చర్య తీసుకోవాలి -ఇప్పటికే రూ.70 కోట్ల మేర ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు బకాయిల వసూళ్లపై దృష్టిసారించాలి -వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు మండల కేంద్రాల్లోని సేవాసదన్లను కంప్యూటరీకరించాలి -సీసీ కెమెరాలతో ఆధునికీకరించాలి -లైన్‌లాస్‌ను తగ్గించి విద్యుత్ చౌర్యాన్ని అరికట్టాలి -సభ్యులందరికీ విద్యుత్ సహకారం అందించేలా పాలకులు నిర్ణయించాలి. ‘సెస్’ సమగ్ర స్వరూపం స్థాపితం : 1970 నవంబరు 1 ఉద్యోగుల సంఖ్య : 261 మెుత్తం విద్యుత్ కనెక్షన్లు : 2,13,190 వ్యవసాయ కనెక్షన్లు : 62,836 మరమగ్గాల కనెక్షన్లు : 8,265 గృహవిద్యుత్ కనెక్షన్లు : 1,42,089 ‘సెస్’ పరిధిలోని ప్రాంతాలు సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, ఇల్లంతకుంట, బోయినపల్లి, వేములవాడ, చందుర్తి, కోనరావుపేట, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్గొండ కలిపి మెుత్తం 177 గ్రామాలు. విద్యుత్ సబ్స్టేషన్లు : 44 కొనుగోలు : 6.50 కోట్ల యూనిట్లు నెలవారీ బిల్లులు : రూ. 6.25 కోట్లు ‘సెస్’లో సభ్యుల సంఖ్య : 2,62,134 సంస్థ ఆస్తుల విలువ : రూ.120 కోట్లు ప్రస్తుత ఓటర్ల సంఖ్య : 1,31,843 -
రాజన్న సిరిసిల్ల జిల్లా సమగ్ర స్వరూపం
అధికారులు జిల్లా కలెక్టర్ డి.కృష్ణ భాస్కర్ ఎస్పీ: విశ్వజిత్ ఫోన్: 9440795243 ఇతర ముఖ్య అధికారులు జేసీ: షేక్ యాస్మిన్ బాషా డీఈవో: రాధాకృష్ణ సీపీవో: సీహెచ్ రాజు (9618598797) అసిస్టెంట్ డైరెక్టర్ (భూపరిపాలన): వి.శ్రీనివాస్ ఉద్యానవనాలు, పట్టుపరిశ్రమ శాఖ జేడీ: బి.శ్రీధర్‌రావు పశుసంవర్థకశాఖ జేడీ: ఎస్.కాంతయ్య జిల్లా ఆడిట్ ఆఫీసర్: డి.శ్రీనివాస్ డీపీఆర్వో: డివీజే ఏసీవీ ప్రసాద్ (99493 51657) డీఆర్డీవో, డీఆర్డీఏ: ఎన్.హన్మంతరావు డీపీవో: వి.శేఖర్ డీటీవో: వై.కొండల్రావు టీఎస్ఐడీసీ: ఇ.కుమారస్వామి (9490959902) డీఎస్వో: సి.పద్మ డీసీవో: ఐ.డి.శిరీష డీటీసీపీవో: జె.శైలజ (9849907824) మండలాలు: 13 సిరిసిల్ల, తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్, ఇల్లంతకుంట, వేములవాడ, వేములవాడ రూరల్, చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి, బోయినపల్లి రెవెన్యూ డివిజన్: 1 (సిరిసిల్ల) మున్సిపాలిటీలు: సిరిసిల్ల, వేములవాడ గ్రామపంచాయతీలు: 177 పరిశ్రమలు: వస్త్ర పరిశ్రమ ఇరిగేషన్: మధ్య మానేరు (మన్వాడ), ఎగువ మానేరు (నర్మాల), కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (9వ ప్యాకేజీ) ఎమ్మెల్యేలు కె. తారకరామారావు (సిరిసిల్ల), సీహెచ్ రమేశ్‌బాబు (వేములవాడ), రసమయి బాలకిషన్ (మానకొండూర్), బొడిగె శోభ (చొప్పదండి) ఎంపీ: బి.వినోద్‌కుమార్ పర్యాటకం: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం, నాంపల్లి గుట్ట, ఎగువ మానేరు జాతీయ రహదారులు: లేవు రైల్వే లైన్లు: లేవు (మనోహరాబాద్–కొత్తపల్లి) ప్రతిపాదన ఉంది హైదరాబాద్ నుంచి దూరం: 140 కిలోమీటర్లు ఖనిజాలు: గ్రానైట్, ఇసుక -
ప్రాణం తీసిన ఈత సరదా
మానేరులో యువకుడి దుర్మరణం సిరిసిల్ల టౌన్ : స్నేహితులతో కలిసి సరదాగా ఈతకెళ్లిన ఓ యువకుడు మానేరువాగులో పడి మృతిచెందిన సంఘటన గురువారం పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన గడ్డం శ్రీనివాస్, సారవ్వ కుమారు అజయ్(20) హైదరాబాద్ రైల్వేలో ప్రై వేటు కూలిగా పనిచేస్తున్నాడు. దసరా పండుగ కోసం నాలుగురోజుల క్రితం ఇంటికొచ్చాడు. మానేరువాగును చూసేందుకు స్నేహితులు వంశీ, అరుణ్‌తో కలిసి వెళ్లాడు. ఈతకొడుతున్న సమయంలో అజయ్‌కి అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో మునిగిపోయాడు. స్నేహితులు ఒడ్డుకు చేర్చేలోపే మృతిచెందాడు. -
ఆఫీస్‌ల కోసం అన్వేషణ
సిరిసిల్లలో కలెక్టర్ పర్యటన మినీ స్టేడియంలో పోలీస్‌పరేడ్ గ్రౌండ్ ‘సెస్’, సినారె, టౌన్ క్లబ్, డీఎస్పీ ఆఫీస్‌ల పరిశీలన సిరిసిల్ల : సిరిసిల్లలో జిల్లా కేంద్రం ఆఫీస్ కోసం అన్వేషణ ముమ్మరమైంది. దసరా రోజు కొత్త జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ పరిపాలన సాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో కలెక్టర్ నీతూప్రసాద్ బుధవారం సిరిసిల్లలో పర్యటించారు. సిరిసిల్లను కొత్త జిల్లాల జాబితాలో చేర్చిన తరువాత తొలిసారి కలెక్టర్ నీతూప్రసాద్ ఆఫీస్ భవనాల కోసం పరిశీలించారు. కొత్త బస్టాండ్ సమీపంలోని సినారె కళాభవనం, వ్యవసాయ మార్కెట్‌యార్డు, ‘సెస్’ ఆఫీస్, టీఎన్జీవో భవనం, రిటైర్డు ఉద్యోగుల సంఘం ఆఫీస్, టౌన్ క్లబ్, డీఎస్పీ ఆఫీస్, సిరిసిల్ల పోలీస్‌స్టేషన్, తంగళ్లపల్లిలోని బీడీ కంపెనీ, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలను పరిశీలించారు. కలెక్టరేట్‌తోపాటు ఎస్పీ ఆఫీస్, పొలీస్ పెరేడ్ గ్రౌండ్ వంటి అంశాలను పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కోసం ఉపయోగించాలని డీఎస్పీ సుధాకర్ కోరగా.. కలెక్టర్ నిరాకరించారు. విద్యార్థులకు ఆట స్థలం లేకుండా పోతుందని, వాటి జోలికి వెళ్లవద్దని జీవోలు ఉన్నాయని అన్నారు. మినీ స్టేడియాన్ని పోలీస్ పరేడ్ మైదానానికి ఇస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. శాశ్వతంగా కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్‌లు ఒకే చోట ఉండాలని, మిగతా ఆఫీస్‌ను సిరిసిల్ల చుట్టూ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆర్డీవో జీవీ.శ్యామ్‌ప్రసాద్‌లాల్, ఏడీఏ అనిల్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ బి.సుమన్‌రావు, ఇన్చార్జి తహశీల్దార్ బొద్దుల గంగయ్య, పీఆర్ ఈఈ విజయ్‌కుమార్, డీఈఈలు కిషన్‌రావు, సూర్యప్రకాశ్, ఆర్ఐ. రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
‘రాజధాని’ ఏసీ కోచ్ బస్ ప్రారంభం
సిరిసిల్ల: సిరిసిల్ల ఆర్టీసీ డిపోకు మంజూరైనా ‘రాజధాని’ ఏసీ కోచ్ బస్‌ను గురువారం ప్రారంభించారు. సిరిసిల్ల నుంచి సికింద్రాబాద్ వరకు నిత్యం హైదరాబాద్‌కు బస్సు ట్రిప్పులను ప్రారంభించినట్లు ఆర్టీసీ డీఎం వెంకటరమణ తెలిపారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ చొరవతో ఈ బస్సు మంజూరైనట్లు టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, ‘సెస్’ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, ఏఎంసీ చైర్మన్ జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ తవుటు కనకయ్య, ‘సెస్’ వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, కౌన్సిలర్ గడ్డం లత, జాగృతి జిల్లా కో కన్వీనర్ జూపల్లి నాగేందర్రావు, ఆర్టీసీ యూనియన్ నాయకులు జీ.పి.సింగ్, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. -
కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న నాయకులు
గంభీర్రావుపేట : కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. గంభీర్రావుపేట మండలం మల్లుపల్లె వద్ద ఆదివారం సాయంత్రం సిరిసిల్ల సాధన సమితి ఆధ్వర్యంలో నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జి చేశారు. ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీసు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు ఆందోళనకారులను రహదారిపై తొలగించి మంత్రి కాన్వాయ్‌ను పంపించారు. -
ఉద్రిక్తతల మధ్య సిరిసిల్ల బంద్
మూడు ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం నేడు కొనసాగనున్న బంద్ సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమం ఉధతమైంది. 48గంటల బంద్‌లో భాగంగా మంగళవారం ఉద్రిక్తతల మధ్య బంద్ సంపూర్ణంగా సాగింది. జిల్లా సాధన జేఏసీ, అఖిలపక్షం పిలుపు మేరకు సిరిసిల్ల బంద్ జరిగింది. తెల్లవారుజామునే జేఏసీ నాయకులు బస్ డిపోముందు బైఠాయించి బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. వన్‌పల్లికి వెళ్లిన నైట్‌హాల్ట్ బస్సు సిరిసిల్లకు రాగా.. ఆందోళనకారులు అద్దాలను ధ్వంసం చేశారు. తెరిచి ఉన్న పెట్రోల్ బంక్ డిస్ప్లేను, ఆఫీస్ అద్దాలను పగులగొట్టారు. బైపాస్ దారిలో వెళ్తున్న సిద్దిపేట, వేములవాడ డిపోల బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. రోడ్లపై టైర్లు వేసి మంటలు అంటించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. కేటీఆర్ చొరవ చూపి సిరిసిల్ల జిల్లాను ఇవ్వాలని డిమాండ్‌చేశారు. కోర్టు ముందు న్యాయవాదులు దీక్షలు కొనసాగించారు. వస్త్రవ్యాపారులు దీక్షల్లో కూర్చున్నారు. రోడ్డుపైనే వంటావార్పు చేసి సామూహికంగా భోజనాలు చేశారు. పట్టణంలో దుకాణదారులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. సిరిసిల్లలో మరమగ్గాలను బంద్‌చేసి వస్త్రోత్పత్తిని నిలిపివేసిన నేతకార్మికులు జిల్లా సాధన ఉద్యమంలో పాల్గొన్నారు. డీఎస్పీ పి.సుధాకర్, సీఐలు జి.విజయ్‌కుమార్, సీహెచ్.శ్రీధర్, పది మంది ఎసై ్సలు బందోబస్తును పర్యవేక్షించారు. 48 గంటల బంద్‌లో భాగంగా బుధవారం బంద్ కొనసాగుతుంది. -
సిరిసిల్లలో కొనసాగుతున్న బంద్
-
సిరిసిల్లలో కొనసాగుతున్న బంద్
కరీంనగర్ : సిరిసిల్ల జిల్లా సాధన కోసం జిల్లా జేఏసీ మంగళవారం స్థానిక డివిజన్లో 48 గంటల బంద్‌కు పిలుపు నిచ్చింది. అందులోభాగంగా ఆర్టీసీ డిపో ముందు అఖిలపక్షం నాయకులు బైఠాయించారు. డిపో నుంచి బయటకు వస్తున్న బస్సు అద్దాలను ధ్వంసం చేసి.. బస్సులను నిలిపివేశారు. అలాగే స్థానిక పాత బస్టాండ్ వద్ద పెట్రోల్ బంక్‌పై జేఏసీ సభ్యులు దాడి చేశారు. ఈ ఘటనలో పెట్రోల్ బంక్ అద్దాలు ధ్వంసమైనాయి. సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇరువైపులా రోడ్లుపై టైర్లు దహనం చేశారు. సిరిసిల్ల జిల్లా కోసం పట్టణంలోని స్థానిక వర్తక, వాణిజ్య సంస్థలు, విద్యాలయాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సెలవు ప్రకటించాయి. అయితే కోరుట్ల రెవెన్యూ డివిజన్లో కూడా 48 గంటల బంద్‌కు డివిజన్ సాధన కమిటీ మంగళవారం పిలుపు నిచ్చింది. -
సిరిసిల్లలో తూనికలు, కొలతల శాఖ తనిఖీలు
నాలుగు కేసుల నమోదు నిబంధనలు పాటించిన సూపర్మార్కెట్లు లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్ పి.రవీందర్ సిరిసిల్ల : సిరిసిల్ల పట్టణంలో తూనికలు, కొలతలశాఖ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని సాధన, గాయిత్రి, లక్ష్మి సూపర్‌మార్కెట్‌తోపాటు, తిరుమల ఎలక్ట్రానిక్స్‌లో తనిఖీలు చేశారు. నిబంధనల ప్రకారం ప్యాకింగ్ వస్తువులపై తయారీదారుడి పేరు లేకపోవడం, తయారు చేసిన తేదీ, ఎమ్మార్పీ ముద్రించకపోవడం, వస్తువును తయారు చేసి కంపెనీ చిరునామా ముద్రించలేదని గుర్తించిన నలుగురు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. సూపర్‌మార్కెట్, ఎలక్ట్రానిక్ దుకాణాల్లో ఉన్న వస్తువులకు సంబంధించిన బిల్లులు కూడా సక్రమంగా లేకపోవడంతో సదరు వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్లు తూనికలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్ పి.రవీందర్ తెలిపారు. నిబంధనలు పాటించకుండా వ్యాపారం సాగించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తూకంలో వినియోగదారులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సిరిసిల్లలో చాలా మంది వ్యాపారులు నిబంధనలను పాటించడం లేదని తెలిపారు. -
కు. ని.కి పాట్లు
నేలపైనే పడుకోబెట్టిన వైద్యసిబ్బంది ఏరియా ఆస్పత్రిలో బాధితుల ఆవేదన సిరిసిల్ల టౌన్ : కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌పై ప్రభుత్వ ప్రచారానికి.. సిబ్బంది నిర్వాకానికి పొంతనలేకుండా పోతుంది. ఆపరేషన్ చేయించుకునే వారికి మౌలిక వసతులు ఏర్పాటుచేయడంలేదు. సిరిసిల్ల ఏరియాస్పత్రిలో శుక్రవారం జరిగిన కుటుంబ నియంత్రణ శిబిరం ఇందుకు నిదర్శనంగా నిలిచింది. డివిజన్ స్థాయిలోని 9మండలాలనుంచి వచ్చిన 62 మందికి కుటుంబనియంత్రణ ఆపరేషన్లు జరిగాయి. వీరికి అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్లు నిర్వహించిన వైద్యాధికారులు కనీసం మంచాలు ఏర్పాటుచేయలేదు. ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్ ముందు వరండాలో నేలపై పడుకోబెట్టారు. ఫ్యాన్లులేక, ఆస్పత్రిలో నెలకొన్న దుర్గంధం, దోమల బెడద, నేలపై పడుకోలేక అవస్థలు పడ్డారు. శిబిరం నిర్వాహకుడు శ్రీనివాస్‌ను వివరణ కోరగా..ఆస్పత్రిలో మంచాలు లేక కింద పడుకోబెట్టక తప్పలేదన్నారు. సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ ఆర్.రమేష్, వైద్యులు సుహాసిని, తిరుపతి పాల్గొన్నారు. -
కైగట్టి పాడుతూ.. గజ్జెకట్టి ఆడుతూ..
ధూం.. ధాంగా పాటల తూటాలు.. సిరిసిల్ల జిల్లా సాధనకు గళమెత్తిన గాయకులు.. సిరిసిల్ల : ‘‘ ఓ కేటీఆర్ సారూ.. మా ఐటీ మంత్రిగారు.. సిరిసిల్ల జిల్లా హామీ.. ఏమైందో చెప్పు సారూ..’’ అంటూ కళాకారులు గళం విప్పుతే.. చప్పట్లు మోగాల్సిందే. సిరిసిల్ల జిల్లా సాధన కోసం సాగుతున్న ఉద్యమంలో కళాకారుల ఆటాపాటలు ఆకట్టుకుంటున్నాయి. పాటలను కైగట్టి పాడుతూ.. గజ్జె కట్టి ఆడుతూ అలరిస్తున్నారు. సిరిసిల్ల డివిజన్లోని తొమ్మిది మండలాల్లో తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తూ.. జిల్లా సాధన కోసం ఉద్యమాన్ని ఉరకలెత్తిస్తున్నారు కళాకారులు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ సాధన ఉద్యమంలో ఆట.. పాటలు ఎంతగా ప్రభావం చూపాయో ఆ తరహాలోనే అదే బాణీల్లో సిరిసిల్ల సాధన ఉద్యమంలోనూ కళాకారులు పాటలు పాడుతున్నారు. విద్యావంతులైన కళాకారులు సరికొత్త బాణీల్లో పాటలను కైగట్టి గానం చేస్తున్నారు. డప్పుల మోతలు, గజ్జెల సంగీతంలో పాటలు పరుగు పెడుతున్నాయి. ‘‘సిరిసిల్ల మాకు జిల్లా.. నగాదారిలో.. జిల్లా కావాలే నగాదారిలో..’’ అంటూ డిగ్రీ చదువుతున్న బైరగోని చంద్రం పాటందుకుంటే.. ఉరకలెత్తే ఉత్సాహం కలుగుతుంది. బతుకమ్మ పాటలు, పీరీల ఆటలు, కులవృత్తుల స్మరణలతో కళాకారులు గొంతెత్తి పాడుతున్నారు. డప్పు దరువుల మోతలు... జిల్లా సాధన ఉద్యమంలో డప్పు దరువులు ప్రజలను చైతన్యవంతులను చేస్తుంది. కళాకారుల దరువులు లేచి డ్యాన్స్ చేయాలన్నంతా ఉత్సహాన్ని తెప్పిస్తుంది. సిరిసిల్ల ప్రాంతానికి చెందిన కళాకారులు కులేరి కిశోర్, సామల్ల బాబు, బర్కుటి విజయ్, రాయల తిరుపతి, డప్పు పర్శరాములు, నక్క శ్రీకాంత్, పిల్లిట్ల రమేశ్, బర్కుటి సురేశ్, బైరగోని చంద్రం బృందం సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమంలో ధూం.. ధాం..గా ఉర్రూతలూగిస్తున్నారు. న్యాయవాదులు, జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో కళాకారుల బృందం ముందుకు సాగుతుంది. -
‘రంగినేని’ సాహిత్య పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానం
సిరిసిల్ల : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతిష్ఠాత్మకమైన ‘రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం–2016’కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని అవార్డు కమిటీ అధ్యక్షులు రంగినేని మోహన్‌రావు, కన్వీనర్ మద్దికుంట లక్ష్మణ్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. 2014, 2015, 2016 సంవత్సరాల్లో ప్రచురితమైన తెలుగు కథా సంపుటానికి అవార్డు అందిస్తామని పేర్కొన్నారు. అక్టోబరు 31లోగా ఐదు ప్రతులను ట్రస్ట్‌కు అందేవిధంగా పంపాలని కోరారు. అవార్డు కింద రూ.15వేల నగదు, జ్ఞాపిక, శాలువ, పురస్కార పత్రాన్ని 2017 జనవరిలో జరిగే అవార్డు ప్రదానోత్సవంలో అందిస్తామని వారు వెల్లడించారు. ఇతర వివరాలకు 94416 77373 సంప్రదించాలని సూచించారు. -
'జిల్లా కన్నా రెట్టింపు అభివృద్ధి చేస్తా'
హైదరాబాద్ : సిరిసిల్ల జిల్లా అయితే జరిగే అభివృద్ధి కన్నా రెట్టింపు అభివృద్ధి చేస్తానని మంత్రి కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ నియోజకవర్గ ప్రజలకు గురువారం బహిరంగ లేఖ చేశారు. రాజకీయంగా తనకు జన్మనిచ్చిన సిరిసిల్ల ప్రజలకు తాను గానీ, టీఆర్ఎస్ పార్టీ గాని జిల్లా ఏర్పాటు చేస్తామని ఎలాంటి వాగ్థానం చేయలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. అయినప్పటికీ సిరిసిల్ల జిల్లా కేంద్రాన్ని చేయాలని ఎంపీ వినోద్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌తో కలిసి సీఎం కేసీఆర్‌ను కోరామన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జిల్లాల ముసాయిదాలో సిరిసిల్ల జిల్లా లేకపోవడం ప్రజలను నిరుత్సాహానికి గురి చేసిన మాట వాస్తవమేనని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. కానీ, ప్రభుత్వం వాస్తవిక అంశాలను పరిగణలోకి తీసుకున్న నిర్ణయం వల్ల సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కుదరలేదని దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని నియోజకవర్గ శాసనసభ్యునిగా కోరుతున్నానన్నారు. సిరిసిల్ల నియోజకవర్గానికి తాను చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలతో తనకున్న అనుబంధాన్ని దెబ్బతీయలేరన్నారు. కొత్త జిల్లాల ప్రతిపాదనలు తెచ్చినపుడు కొడుక్కో జిల్లా, బిడ్డకో జిల్లా, అల్లుడికో జిల్లా అంటూ చేసిన విమర్శలను ప్రజలు గుర్తించాలన్నారు. సిరిసిల్లలో ప్రస్తుతమున్న అన్ని కార్యాలయాలు కొనసాగుతాయని...మరిన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ తెలిపారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం సిరిసిల్లలోనే కొనసాగుతానని, పట్టణ రుణాన్ని అభివృద్ధి ద్వారా తీర్చుకుంటానన్నారు. రెండేళ్లలో సోదరుడిగా చేసిన అభివృద్ధిని మీరంతా చూశారని...రాబోయే మూడేళ్లలో అగ్రశ్రేణి నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కలిసి నడుద్దామని కేటీఆర్ లేఖలో కోరారు. -
సిరిసిల్ల జిల్లా ఉద్యమం ఉధృతం
కరీంనగర్: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఉద్యమం ఊపందుకుంది. సిరిసిల్ల జిల్లా సాధన సమితి ఉద్యమాన్ని ఉధృతమైంది. బుధవారం జిల్లా సాధనసమితి, అఖిలపక్షనాయకులు, జేఏసీ సంయుక్తంగా మహార్యాలీ నిర్వహించారు. కొత్త బస్టాండు శివారులోని కార్గిల్లేక్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. అనంతరం రెవెన్యూ డివిజినల్ కార్యాలయాన్ని ముట్టడించారు. మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగుల రాములు ఆర్డీవో కార్యాలయంపైకి ఎక్కి ఆత్మాహుతికి యత్నించారు. ఈ సందర్భంగా జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ ఆవునూరి రమాకాంత్‌రావు మాట్లాడుతూ సిరిసిల్ల ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు ఎందుకు మౌనంగా ఉంటున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఆశ కల్పించిన మంత్రి ద్రోహిగా మిగలొద్దన్నారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షను గౌరవించి జిల్లా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్డీవో ఆఫీస్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. సిరిసిల్ల జిల్లా సాధన కోసం సంతకాల సేకరణ, న్యాయవాదులు, టీఆర్ఎస్ నాయకులు దీక్షలు కొనసాగించారు. -
ఉధృతం.. సిరిసిల్ల జిల్లా ఉద్యమం
దీక్షలు.. సంఘీభావ ర్యాలీలు ఆర్డీవోకు వైఎస్సార్ సీపీ వినతి కార్యాచరణ ప్రకటించిన జేఏసీ సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమం రోజు రోజుకూ విస్తరిస్తుంది. మరో వారంరోజుల కార్యాచరణ ప్రణాళిక జిల్లా సాధన జేఏసీ శనివారం ప్రకటించింది. సర్వమత పార్థనలతో పాటు, వినాయకుడికి విన్నపాలు, వంటావార్పు, మానవహారం, బోనాల పండుగ, చలో కలెక్టరేట్, సిరిసిల్ల దిగ్భంధానికి ప్రణాళిక రూపొందించింది. మరోవైపు ప్రై వేటు స్కూల్స్, కళాశాలల యజమానులు సిరిసిల్లలో నల్లబ్యాడ్జీలతో ప్రదర్శన నిర్వహించారు. కోర్టు ఎదుట న్యాయవాదులు, అంబేద్కర్ వద్ద టీఆర్ఎస్ నాయకులు దీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా సాధన కోసం మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఆర్పీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆర్డీవో జీవీ. శ్యామ్‌ప్రసాద్‌లాల్‌కు వినతిపత్రం అందించారు. కులసంఘాల ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీలు కొనసాగాయి. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, కోనరావుపేట, వేములవాడ, చందుర్తి మండలాల్లోనూ నిరసనలు కొనసాగాయి. టీఆర్ఎస్ నాయకులూ జిల్లా సాధన కోసం కదం తొక్కుతున్నారు. -
ఆర్వీఎంకు సిరిసిల్ల వస్త్రం
తొలి రోజు లక్షా 60 వేల మీటర్ల గుడ్డ కొనుగోలు సిరిసిల్లలలో పాతిక లక్షల మీటర్ల వస్త్రం సిద్ధం సిరిసిల్ల: సిరిసిల్ల నేతన్నలు ఉత్పత్తి చేసిన వస్త్రాన్ని చేనేత, జౌళిశాఖ అధికారులు కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ యార్డులోని గోదాముల్లో లక్షా 60 వేల మీటర్ల వస్త్రాన్ని కొనుగోలు చేశారు. రెండు మ్యాక్స్ సొసైటీల ద్వారా ఈ వస్త్రాన్ని కొన్నారు. సిరిసిల్లలోని 51 మ్యాక్స్ సొసైటీల్లో ఉత్పత్తి అయిన గుడ్డను మాత్రమే కొనుగోలు చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం సిరిసిల్లలో 25 లక్షల మీటర్ల వస్త్రం సిద్ధంగా ఉంది. రోజు వారీగా ఈ వస్త్రాన్ని కొనుగోలు చేస్తామని జౌళిశాఖ ఆర్డీడీ రమణమూర్తి తెలిపారు. రాజీవ్ విద్యా మిషన్‌కు మొత్తం కోటి 35 లక్షల మీటర్ల వస్త్రం అవసరం ఉండగా.. సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో మంత్రి కేటీఆర్ సిరిసిల్ల కార్మికులకు ఈ అవకాశాన్ని కల్పించారు. రూ.45 కోట్లు విలువైన వస్త్రాన్ని సిరిసిల్ల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. మొదటి విడతగా 37 లక్షల మీటర్ల గుడ్డను కొనుగోలు చేసేందుకు సిరిసిల్ల మ్యాక్స్ సొసైటీలకు ఆర్డర్లు ఇవ్వగా.. ఇప్పటి వరకు 25 లక్షల మీటర్ల వస్త్రం రెండువేల పవర్‌లూమ్స్‌పై పక్షం నెల రోజుల్లో ఉత్పత్తి అయింది. మిగితా ఆర్డర్‌ను పూర్తి చేసేందుకు వస్త్రోత్పత్తిదారులు సిద్ధంగా ఉన్నారు. కార్యక్రమంలో జౌళిశాఖ అధికారులు పూర్ణచందర్రావు, ఏడీలు ఎం.వెంకటేశం, రతన్‌కుమార్, డి.వి.రావు, డీవో రశీద్, మ్యాక్స్ సొసైటీ అధ్యక్షులు బీమరి రామచంద్రం, జౌళిశాఖ టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు. -
రెండో రోజూ సిరిసిల్ల బంద్
కరీంనగర్: సిరిసిల్లను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల బంద్ రెండో రోజుకు చేరుకుంది. పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసి వేసి జిల్లా కోసం ఆందోళన బాటపట్టారు. సిరిసిల్లను వెంటనే జిల్లా కేంద్రాల్లో చేర్చాలని కోరుతూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నాయకులు వాటర్ ట్యాంక్ ఎక్కి తమ నిరసన తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అఖిలపక్ష నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్ వద్ద అఖిలపక్ష కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
అఖిలపక్షం నేతల ఆందోళన... అరెస్ట్
హైదరాబాద్ : సిరిసిల్లను కొత్త జిల్లాగా ప్రకటించాలని కోరుతూ అఖిలపక్షం నేతలు హైదరాబాద్‌లో మంగళవారం ఆందోళన చేపట్టారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు వచ్చిన నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ...సిరిసిల్లను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేశారు. -
పవర్‌లూం కార్మికుడి ఆత్మహత్య
సిరిసిల్ల రూరల్ : సిరిసిల్ల మండలం రాజీవ్‌నగర్‌కు చెందిన తొర్ర ఎల్లయ్య(55) అనే పవర్‌లూం కార్మికుడు అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. గతకొన్నేళ్లుగా ఎల్లయ్య మరమగ్గాలు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లకు వివాహం చేయగా, ఒక కుమార్తెకు విడాకులై ఇంటివద్దే ఉంటోంది. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఎల్లయ్య కుటుంబ అవసరాల కోసం రూ.5లక్షల దాకా అప్పు చేశాడు. చేసిన అప్పులు తీర్చలేక, కుటుంబాన్ని పోషించుకోలేక మనస్తాపం చెంది సోమవారం విషపదార్థం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. -
దద్దరిల్లిన కార్మికక్షేత్రం
సిరిసిల్ల: సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ రోజు రోజుకు ఎక్కువవుతోంది. జిల్లా కావాలని కోరుతూ.. అధికార, ప్రతిపక్షాలకు చెందిన నాయకులు పోటాపోటీగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. దీంతో సిరిసిల్ల స్తంభించిపోయింది. నిరసన కారుల ప్రదర్శనలతో కార్మిక క్షేత్రం దద్దరిల్లింది. -
సిరిసిల్ల జిల్లా కోసం జేఏసీ రాస్తారోకో
మంత్రి కేటీఆర్ కనిపించడం లేదని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా కోసం రోజురోజుకూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో రగుడు బ్రిడ్జి వద్ద శనివారం రాస్తారోకో నిర్వహించారు. మంత్రి కేటీఆర్ మౌనం వీడాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రాస్తారోకోతో కరీంనగర్–కామారెడ్డి రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ఆందోళన కారులను సముదాయించారు. కార్యక్రమంలో నాయకులు కత్తెర దేవదాస్, సంగీతం శ్రీనివాస్, రాగుల రాములు, బుస్సా వేణు, జక్కుల యాదగిరి, చొక్కాల రాము, శ్రీనివాస్‌రావు, పంతం రవి, ఎండీ సత్తార్, రొడ్డ రామచంద్రం, కంసాల మల్లేశం, మనోజ్, రమేశ్, దశరథం తదితరులు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌పై బీజేవైఎం ఫిర్యాదు సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కె.తారకరామారావు కనిపించడం లేదని బీజేవైఎం ఆధ్వర్యంలో సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. నాయకులు అన్నల్దాస్ వేణు, గౌడ వాసు, నరేశ్, శ్రీధర్, పవన్, శ్యామ్, సురేశ్ సిరిసిల్ల టౌన్ ఎస్సై బి.శ్రీనివాస్‌గౌడ్‌కు ఫిర్యాదు అందించారు. స్కూల్ బోర్డుపై సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల శివనగర్‌లోని కుసుమ రామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాల బోర్డుపై ఆందోళనకారులు సిరిసిల్ల జిల్లా అని రాసిన కాగితాలను అతికించారు. కోర్టు ఎదుట న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షల్లో జె.శ్రీనివాసరావు, దాసరి శ్రీధర్, కోడి లక్ష్మణ్, డి.జనార్థన్‌రెడ్డి, కేసరి శ్రీనివాస్, మునిగె యాదగిరి, ఇల్లందుల రమేశ్ పాల్గొన్నారు. ఆవునూరి రమాకాంత్‌రావు, శాంతిప్రకాశ్‌శుక్లా, ప్రకాశం, సంఘీభావం తెలిపారు. -
సిరిసిల్ల జిల్లా కోసం సర్పంచ్ రాజీనామా
సిరిసిల్ల రూరల్: సిరిసిల్ల జిల్లా చేయాలని డిమాండ్‌తో ప్రభుత్వ తీరును నిరసిస్తూ సిరిసిల్ల మండలం తాడూరు గ్రామ సర్పంచ్ గుర్రం వెంకటలక్ష్మీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా పత్రాలను సిరిసిల్ల పట్టణంలోని కోర్టు ముందు అడ్వకేట్ జేఏసీ దీక్షా శిబిరంలో ప్రదర్శించారు. తన రాజీనామా పత్రాన్ని ఎంపీడీవో, డీపీవోకు పంపించనున్నట్లు తెలిపారు. దీంతో గుర్రం వెంకటలక్ష్మీ పదవీ త్యాగాన్ని అడ్వకేట్ జేఏసీ నాయకులు ఆవునూరి రమాకాంత్, మహేశ్‌గౌడ్, ధర్మేందర్, కోడి లక్ష్మణ్, కుంట శ్రీనివాస్ అభినందించారు. ఇప్పటికైన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇండ్లలో నుంచి బయటకు రావాలని, గుర్రం వెంకటలక్ష్మీ లాగా పదవులు త్యాగం చేస్తే జిల్లా సాధ్యమన్నారు. సిరిసిల్ల జిల్లా ప్రకటించే వరకు పోరాడుతామని తాడూరు సర్పంచ్ గుర్రం వెంకటలక్ష్మీ తెలిపారు. -
సిరిసిల్ల జిల్లా కోసం మహాపాదయాత్ర
జిల్లాసాధన జేఏసీ ఆధ్వర్యంలో వేములవాడకు.. ఎల్లారెడ్డిపేటలో బంద్ సంపూర్ణం ముస్తాబాద్‌లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం గంభీరావుపేటలో వాటర్ ట్యాంకర్ ఎక్కి యువకుడి నిరసన సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా సాధన కార్యాచరణలో భాగంగా జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం మహాపాదయాత్ర నిర్వహించారు. సిరిసిల్ల నుంచి వేములవాడ వరకు యాత్ర కొనసాగింది. వేములవాడలో బీజేపీ నాయకులు పాదయాత్రకు స్వాగతం పలికారు. సిరిసిల్లను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసేలా సీఎం కేసీఆర్‌కు బుద్ధిప్రసాదించాలని కోరుతూ ఉద్యమకారులు ఎములాడ రాజన్నకు మెుక్కులుచెల్లించుకున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో సిరిసిల్ల మండలం రగుడులో రాస్తారోకో చేశారు. సిరిసిల్ల జిల్లా సాధన కోసం ఎల్లారెడ్డిపేటలో నిరవధిక దీక్ష కొనసాగిస్తున్న బీజేపీ నాయకులు కంచర్ల పరుశరాములు, పట్టూరి రాజేశం గుప్తా ఆరోగ్యం క్షీణించడంతో పోలుసులు రంగప్రవేశం చేశారు. తీవ్ర ఉద్రిక్తల నడుమ పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ సైతం వారు దీక్ష కొనసాగిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా కోసం చేపట్టిన మండల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగ అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ముస్తాబాద్ మండలం గూడెంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు సిరిసిల్ల–ముస్తాబాద్ రహదారిపై బైఠాయించారు. ఇదే మండలం ఆవునూరు గ్రామస్తులు రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. గంభీరావుపేట మండలంఓ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేశారు. వార్డుసభ్యుడి నుంచి ఎంపీ వరకూ అధికార పార్టీ నాయకులందరూ తమ పదవులకు రాజీనామా చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నాయకులు డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు బట్టు ప్రవీణ్.. సిరిసిల్ల జిల్లా ప్రకటించాలనే డిమాండ్‌తో వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపాడు. నాయకుల జోక్యంతో కిందకు దిగాడు. -
హోరెత్తిన ఉద్యమం
గంభీరావుపేట : స్థానిక పెద్దమ్మ స్టేజీ వద్ద సిరిసిల్ల, కామారెడ్డి ప్రధాన రహదారిపై కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ, దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్స హన్మండ్లు నేతృత్వంలో కామారెడ్డి, సిరిసిల్ల, గంభీరావుపేట, నాగంపేటవైపు వెళ్లే రోడ్లను దిగ్బంధించారు. రోడ్లపై టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. నాయకులు ఎగదండి స్వామి, రామచంద్రారెడ్డి, కర్రొల్ల రాజు, మంగళి చంద్రమౌళి, ఆవునూరి బాబయ్య, కొత్తపల్లి శ్రీనివాస్, దోసల చంద్రం, ఖుతుబ్, ఎడబోయిన రాజు, జంగం రాజు, సాయిరెడ్డి, పల్లె శ్రీనివాస్, ప్రవీన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం కూడలిలో అఖిలపక్షం కో ఆర్డినేటర్ మల్లుగారి నర్సాగౌడ్ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా ప్రకటించాలని మౌన ప్రదర్శన చేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా సంతకాలు చేశారు. సిరిసిల్ల జిల్లా కావాలని, కాకపోతే కామారెడ్డిలో కలుపాలని పలువురు సంతకాలు చేశారు. రాజుపేటలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి జిల్లా సాధన ఉద్యమంలో కలిసి రావాలని టీడీపీ నాయకులు రాంచంద్రారెడ్డి, ఇబాదుల్లాఖాన్, రాగిశెట్టి నారాయణ, ప్రభాకర్ తదితరులు డిమాండ్ చేశారు. రెండో రోజుకు చేరిన రిలే దీక్షలు ముస్తాబాద్ : సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్‌తో గూడెంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం రెండో రోజుకు చేరుకున్నాయి. కరెంట్, సాగు, తాగునీటి సమస్యలు తీరాలంటే సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్ము బాలయ్య అన్నారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కాని పక్షంలో గూడెం, ఆవునూర్, కొండాపూర్, తుర్కపల్లి గ్రామాలను ఎల్లారెడ్డిపేట మండలంలో విలీనం చేయాలని కోరారు. తంగళ్లపల్లి మానేరు వంతెనపై రాస్తారోకో సిరిసిల్ల రూరల్ : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తంగళ్లపల్లి మానేరు వంతెనపై రాస్తారోకో చేశారు. సిరిసిల్లను జిల్లాగా ప్రకటిస్తేఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పీసీసీ అధికార ప్రతినిధి చీటీ ఉమేశ్‌రావు అన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రాస్తారోకో విరమింపజేశారు. నాయకులు ఓరుగంటి తిరుపతి, కూతురు వెంకట్‌రెడ్డి, బుర్ర మల్లేశం, ఎడమల భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంపీ, టెస్కాబ్ చైర్మన్ ఫ్లెక్సీలు.. సిరిసిల్ల జిల్లా ఏర్పాటును అడ్డుకుంటున్నారనే ఆరోపణలతో ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ఫొటోలను మార్పింగ్ చేసి సిరిసిల్ల బైపాస్‌రోడ్డులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఫ్లెక్సీలు తొలగించారు. స్థల యజమాని కొత్తపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ముసాయిదాతో మురిసిన ముస్తాబాద్ ముస్తాబాద్ :సిద్దిపేట జిల్లాలో ముస్తాబాద్ను చేర్చుతూ రాష్ట్రప్రభుత్వం సోమవారం విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్‌పై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముస్తాబాద్ మండలాన్ని సిద్దిపేట జిల్లాలో కలపాలనే డిమాండ్‌తో పదిరోజులుగా వివిధ పార్టీల నాయకులు, పలు వర్గాలు ఆందోళనలు చేసిన విషయం విదితమే. ముస్తాబాద్‌కు సిద్దిపేట 25 కిలోమిటర్ల దూరంలో ఉండగా.. కరీంనగర్ 70 కిలోమిటర్లు ఉంది. ప్రభత్వం ప్రజల సౌలభ్యం, సుపరిపాలన కొసం ఏర్పాటు చేస్తున్న జిల్లాలతో ముస్తాబాద్ లాంటి మారుమూల మండలానికి న్యాయం జరిగిందని పలువర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముసాయిదా పత్రంలో ముస్తాబాద్తోపాటు కరీంనగర్ జిల్లా నుంచి ఇల్లంతకుంట, హుస్నాబాద్, కోహెడ మండలాలను కలుపుతూ అభ్యంతరాలను స్వీకరించే గడువు ప్రకటించారు. -
సిరిసిల్లలో బంద్ సంపూర్ణం
స్తంభించిన ప్రజాజీవనం వాణిజ్య, వ్యాపార, విద్యాసంస్థల బంద్ సిరిసిల్ల : సిరిసిల్లను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం తలపెట్టిన బంద్ విజయవంతమైంది. వేకువజాము మూడుగంటల నుంచే ఆందోళనకారులు ఆర్టీసీ బస్సులు డిపో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. వేములవాడ, సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్ డిపోలకు సమాచారం అందించి బస్సులు రానీయెుద్దని హెచ్చరించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు మూసివేశారు. సినిమాహాళ్లు, పెట్రోల్‌బంక్‌లు తెరుచుకోలేదు. ఆందోళనకారులు కరీంనగర్–కామారెడ్డి ప్రధాన రహదారిపై చంద్రంపేట, నేతన్నచౌక్, అంబేద్కర్ విగ్రహాల వద్ద టైర్లకు నిప్పు పెట్టారు. వాహనాల రాకపోకలను నియంత్రించారు. రద్దీగా ఉండే గాంధీచౌక్, పాత బస్టాండు ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ఆందోళనలు, నిరసనల మధ్య బంద్ సాగింది. అన్ని వర్గాలవారు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. పాఠశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి బంద్‌కు సంఘీభావం తెలిపారు. అంబేద్కర్ చౌరస్తాలో కళాకారుల పాటలు, నాయకులు ఉపన్యాసాలు ఉత్తేజపరిచాయి. కరీంనగర్ డీఎస్పీ రామారావు, సీఐ మహేశ్‌గౌడ్, వేములవాడ సీఐ శ్రీనివాసరావు, ఎస్సైలు శ్రీనివాస్‌గౌడ్, రవీందర్, సదన్‌కుమార్ ఆందోళనకారులను కట్టడి చేశారు. -
సిరిసిల్లలో ఉద్రిక్తం
-
సిరిసిల్లలో ఉద్రిక్తం
సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమం రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. సిరిసిల్ల పట్టణ బంద్ శనివారం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఆందోళన కారులు ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలను దహనం చేశారు. దీంతో పలువురు ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, పట్టణంలోని వర్తక, వాణిజ్య, విద్యా సంస్థలు మూతబడ్డాయి. -
సిరిసిల్ల, హుస్నాబాద్ బంద్
కరీంనగర్: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, సిరిసిల్ల పట్టణాల్లో బంద్ కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లాలోనే హుస్నాబాద్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ శనివారం అఖిలపక్షాలు బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఉదయం నుంచే ఆయా పార్టీల నాయకులు ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో బస్సులు బయటకు రాలేదు. అదేవిధంగా సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌తో సిరిసిల్ల బంద్ కొనసాగుతోంది. అఖిలపక్షాల నాయకుల ధర్నాతో ఉదయం నుంచి డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు. -
సిరిసిల్ల జిల్లాకు కదిలిన ప్రజానీకం
పట్టణంలో తీవ్రమైన ఆందోళనలు ప్రధాన రహదారిపై రాస్తారోకో సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమం రోజురోజుకు తీవ్రమవుతోంది. శుక్రవారం పట్టణంలో ప్రజాసంఘాలు, న్యాయవాదులు, రాజకీయపార్టీలు, ముస్లింలు నిరసనలను చేపట్టారు. కామారెడ్డి–కరీంనగర్ ప్రధాన రహదారిపై మహాధర్నా, రాస్తారోకో నిర్వహించి ఆటపాటలతో నిరసనలు తెలిపారు. రెండు గంటల పాటు సాగిన రాస్తారోకోతో కిలోమీటర్‌కు పైగా వాహనాలు నిలిచిపోయాయి. కాంగ్రెస్ నాయకుడు మహేందర్ రెడ్డితో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. –సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలంటూ న్యాయవాదుల కోర్టు ముందు రెండో రోజు రిలేదీక్షలు చేపట్టారు. విద్యార్థులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, జిల్లా సాధన సమితి నాయకులు దీక్షల్లో పాల్గొంటున్న వారికి సంఘీభావం తెలిపారు. దీక్షల్లో న్యాయవాదులు కోడి లక్ష్మన్, బొంపెల్లి రవీందర్రావు, కళ్యాణ చక్రవర్తి, గుంటుక భువనేశ్వర్, ఆడెపు వేణు, దాసరి శ్రీధర్, మొగిలి రాజు, కటుకం బాలకుమార్‌లు పాల్గొన్నారు. – జిల్లా సాధన కోరుతూ పట్టణంలో ముస్లింలు శాంతిర్యాలీ నిర్వహించారు. ప్రజాభీష్టాన్ని ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షుడు షేక్‌యూసుఫ్, ఎండీ.సత్తార్, ఇంతియాజ్, ముస్తాఫా, సర్వర్, రియాస్, రఫీయొద్దీన్, పాల్గొన్నారు. కేటీఆర్ ఇల్లు ముట్టడి.. జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా మంత్రి కేటీఆర్ స్పందించడం లేదంటూ ఆయన ఇంటిని బీజేపీ, బీజేవైఎం, ప్రజాసంఘాలు ముట్టడించాయి. రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్లను జిల్లా చేయటంలో విఫలమైతున్న కేటీఆర్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేసారు. ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే ఆ పార్టీ నాయకులు పదవులను పట్టుకుని వేలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపి పట్టణ అధ్యక్షుడు గౌడ వాసు, నాయకులు అన్నల్దాస్ వేణు, వెల్ది చక్రపాణి, చందు, కోడం ఆనంద్‌బాబు, అంజన్న, శ్యాం పాల్గొన్నారు. ఆస్పత్రిలోనూ ఆమరణదీక్ష జిల్లా సాధనకు అంబేద్కర్ చౌరస్తాలో అర్బన్బ్యాంక్ చైర్మన్ గాజుల బాలయ్య, రిక్కుమల్ల మనోజ్ చేపట్టిన ఆమరణ దీక్ష చేపట్టగా శుక్రవారం ఉదయం పోలీసులు వారి దీక్షలను భగ్నం చేశారు. అరోగ్యం క్షీణించడంతో ఇద్దరిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో వారు ఆహారం తీసుకోకుండా మొండి కేయడంతో వైద్యులు ఫ్లూయిడ్స్ అందిస్తున్నారు. -
వైభవంగా చేనేత దినోత్సవం
నేతకార్మికులకు సన్మానం నేతన్న విగ్రహానికి క్షీరాభిషేకం సిరిసిల్ల: సిరిసిల్లలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. స్థానిక నేతన్నచౌక్లోని చేనేత కార్మికుడి కాంస్య విగ్రహానికి పద్మశాలీసంఘం ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు నేతన్న విగ్రహానికి పూలమాలవేసి జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేత శిల్పి నల్ల విజయ్‌కుమార్‌తోపాటు మరో నలుగురు నేత కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, ఏఎంసీ చైర్మన్ జిందం చక్రపాణి, ‘సెస్’ వైస్‌చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు పులి విఠల్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు కట్టెకోల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. సిరిసిల్లలో కాంగ్రెస్‌పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలోనూ జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. నేతన్న విగ్రహానికి పూలమాలవేసి నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, గడ్డం విఠల్, గోనె ఎల్లప్ప పాల్గొన్నారు.