మహిళలపై బ్యాంక్ మేనేజర్ దాడి | andra bank manager hulchl in siricilla | Sakshi
Sakshi News home page

మహిళలపై బ్యాంక్ మేనేజర్ దాడి

Published Mon, Dec 5 2016 3:33 PM | Last Updated on Tue, Nov 6 2018 4:04 PM

నగదు కోసం బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులపై బ్యాంక్ మేనేజర్ దాడి చేశాడు.

సిరిసిల్ల: నగదు కోసం బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులపై బ్యాంక్ మేనేజర్ దాడి చేశాడు. ఈ సంఘటన సిరిసిల్లా రాజన్న జిల్లా ముస్తాబాద్‌లో సోమవారం వెలుగుచూసింది. స్థానిక ఆంధ్రబ్యాంక్‌కు నగదు కోసం వచ్చిన ఖాతాదారులపై బ్యాంక్ మేనేజర్ రాజేంద్ర చేయి చేసుకున్నాడు. నగదు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఖాతాదారులు సోమవారం ఉదయాన్నే బ్యాంకు ఎదుట బారులు తీరారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో.. అక్కడ కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో అసహనానికి గురైన బ్యాంక్ మేనేజర్ రాజేంద్ర వీరంగం సృష్టించాడు. లైన్లో నిల్చొని ఉన్న మహిళలపై చేయి చేసుకున్నాడు. ఈ దాడిలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. మేనేజర్ తీరుకు నిరసనగా స్థానికులు ఆందోళనకు దిగారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement