మగవారిపైనే దాడిచేయడంతో విస్తుపోయిన జనం
సిరిసిల్ల టౌన్: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌లో శనివారం రెండు కాకులు హల్‌చల్ చేశాయి. పాతబస్టాండులోని వేపచెట్టుపై ఉండే కాకులు మధ్యాహ్నం సమయంలో అటువైపు వస్తున్న పురుషులపై మాత్రమే దాడి చేశాయి. నాలుగైదు గంటల పాటు కేవలం మగవారి తలలపై తన్నుతూ దాడి చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
చివరికి స్థానికులు ఈ తతంగాన్ని పరీక్షించగా చెట్టుపై గూడులో కాకి పిల్లల్ని పెట్టినట్లు తెలిసింది. శత్రువులు రాకుండా చూడటంలో భాగంగానే ఇలా చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు. అయితే ఈ విషయం స్థానికంగా చర్చకు దారితీసింది.
Comments
Please login to add a commentAdd a comment