crows
-
కాకి పగ పదిహేడేళ్లు..
పాములు పగబడతాయన్న మాట అప్పుడప్పుడూ వింటుంటాం. పాత సినిమాల్లో అయితే పగబట్టి వెంటాడే పాముల సీన్లూ చూసి ఉంటాం. మరి అవి అలా నిజంగా పోగబడతాయా? ఏమో చెప్పలేం. కానీ కాకులు మాత్రం పగబడతాయట. అదీ నెలో, ఏడాదో కాదు.. ఏకంగా 17 ఏళ్ల పాటు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని మరీ పగ తీర్చుకునేందుకు ప్రయతి్నస్తాయట. వాషింగ్టన్ యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఆ వివరాలేంటో చూద్దామా..కొన్ని కాకులను బంధించి.. పక్షుల్లో కాకులను బాగా తెలివైనవిగా భావిస్తారు. తమకు ఆహారం వేసే మనుషులను గుర్తించగలవని కూడా ఇంతకుముందే తేల్చారు. అదే సమయంలో తమకు కీడు చేయడానికి ప్రయతి్నంచిన, భయపెట్టినవారిపై పగబడతాయని తాజాగా తేల్చారు. దీనిపై వాషింగ్టన్ యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జాన్ మార్జలఫ్ నేతృత్వంలోని పరిశోధకులు సుదీర్ఘ ప్రయోగం చేశారు. 2006లో దెయ్యం లాంటి ఓ మాస్కు పెట్టుకుని.. యూనివర్సిటీ క్యాంపస్‌లో కొన్ని కాకులను పట్టి బంధించారు. వాటిని కాసేపు భయపెట్టినట్టుగా చేశారు. తర్వాత వాటి కాళ్లకు ఐడెంటిఫికేషన్ రింగులను వేసి వదిలేశారు.మాస్క్ తో వెళితే వెంటాడుతూ.. శాస్త్రవేత్తలు ఆ తర్వాతి నుంచి క్యాంపస్‌లో ఆ దెయ్యం మాస్కు వేసుకుని కొన్నిసార్లు, వేసుకోకుండా మరికొన్నిసార్లు, వేరే ఇతర మాస్క్ లు పెట్టుకుని ఇంకొన్నిసార్లు తిరుగుతూ కాకులకు ఆహారం పెట్టడం మొదలుపెట్టారు. ఈ సమయంలో వాటి స్పందనను రికార్డు చేస్తూ వచ్చారు. శాస్త్రవేత్తలు దెయ్యం మాస్కు వేసుకుని వెళ్లినప్పుడు కాకులు.. తీవ్రంగా అరుస్తూ, వెంటాడుతూ రావడాన్ని.. మాస్క్ లేనప్పుడు, వేరే మాసు్కలు వేసుకున్నప్పుడు అవి మామూలుగానే ఉండటాన్ని రికార్డు చేశారు. అయితే క్రమంగా ఇలా వెంటాడటం తగ్గిందని, సుమారు 17 ఏళ్ల తర్వాత అవి వెంటాడటం ఆగిపోయిందని ప్రొఫెసర్ జాన్ మార్జలఫ్ చెప్తున్నారు.పక్కాగా గుర్తించి మరీ వెంటాడాయి..‘‘కొందరు వలంటీర్లకు వేర్వేరు మోడళ్లలోని మాస్కులు ఇచ్చి, యూనివర్సిటీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరగాలని చెప్పాం. అందులో మేం కాకులను పట్టుకుని, భయపెట్టినప్పటి మాస్క్ లు వేసుకున్నవారిని మాత్రమే కాకులు టార్గెట్ చేశాయి. గట్టిగా అరవడం, వేగంగా వచ్చి కాళ్లతో తన్నడం వంటివి చేశాయి. మేం బంధించిన కాకులు మాత్రమేకాకుండా వేరే కాకులు కూడా ఇలా చేశాయి. అవి ప్రమాదకరమని భావించిన వాటిపై సమాచారం ఇచి్చపుచ్చుకోవడమే దీనికి కారణం’’ అని ప్రొఫెసర్ వెల్లడించడం గమనార్హం. ..: సాక్షి సెంట్రల్ డెస్క్ :.. -
సిరిసిల్ల బస్టాండ్‌లో కాకుల హల్చల్
సిరిసిల్ల టౌన్: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌లో శనివారం రెండు కాకులు హల్చల్ చేశాయి. పాతబస్టాండులోని వేపచెట్టుపై ఉండే కాకులు మధ్యాహ్నం సమయంలో అటువైపు వస్తున్న పురుషులపై మాత్రమే దాడి చేశాయి. నాలుగైదు గంటల పాటు కేవలం మగవారి తలలపై తన్నుతూ దాడి చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చివరికి స్థానికులు ఈ తతంగాన్ని పరీక్షించగా చెట్టుపై గూడులో కాకి పిల్లల్ని పెట్టినట్లు తెలిసింది. శత్రువులు రాకుండా చూడటంలో భాగంగానే ఇలా చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు. అయితే ఈ విషయం స్థానికంగా చర్చకు దారితీసింది. -
భూకంపాన్ని పసిగట్టిన పక్షులు?.. వీడియో వైరల్!
జపాన్‌లోని క్యోటో నగరంలో ఆమధ్య వేల సంఖ్యలో కాకులు గుంపులుగా ఎగురుతున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అయ్యింది. జపాన్‌లోని హోన్షులో ఆకాశంలో వేలాది కాకులు ఎగురుతూ క్యోటో సమీపంలోని జపనీస్ ద్వీపానికి చేరుకున్నాయి. మనుషులకు మించి ప్రకృతిని అర్ధం చేసుకునే శక్తి పక్షులకే ఉందా? అని అంటే.. అవుననే సమాధానమే వస్తుంది. ప్రకృతి వైపరీత్యాలను కాకులు , కుక్కలు మొదలైనవి ముందుగానే గుర్తిస్తుంటాయి. సునామీ, భూకంపం లాంటి ప్రకృతి విపత్తులు సంభవించడానికి కొన్ని క్షణాల ముందు వేలాది కాకులు వింతగా ప్రవర్తించడానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జపాన్‌లోని క్యోటో నగరంలో మాదిరిగానే కొన్నాళ్ల క్రితం క్రితం టర్కీలో సంభవించిన విధ్వంసకర భూకంపానికి కొద్ది క్షణాల ముందు కూడా పక్షులు అసాధారణంగా ప్రవర్తించాయి. భారీ సంఖ్యలో పక్షులు గుమిగూడి కిలకిలారావాలు చేస్తూ ఆకాశంలో అటుఇటూ సంచరిస్తూ కనిపించాయి. పక్షులు అలా ప్రవర్తించడానికి కారణం రానున్న భూకంపాన్ని పసిగట్టడమేనంటూ నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా ద్వీప దేశమైన జపాన్‌లో 2024 నూతన సంవత్సరం తొలిరోజే శక్తివంతమైన భూకంపం చోటు చేసుకుంది. వాయవ్య జపాన్ తీరంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పలుమార్లు భూప్రకంపనలు నమోదయ్యాయి. కనీసం 21 సార్లు భూమి కంపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఈ భూకంపానికి కొన్ని నిముషాల ముందు వేలాది పక్షలు ఒకచోట చేరి విచిత్రంగా ప్రవర్తించాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కూడా చదవండి: జపాన్‌లో భారీ భూకంపం.. 155సార్లు కంపించిన భూమి The sudden increase in crow activity in #Japan is causing concern among residents, reminiscent of an ancient omen associated with natural disasters. On the first day of 2024, Japan is struck by a significant #earthquake#Tsunami pic.twitter.com/vNLoM1JRWu — Surajit (@surajit_ghosh2) January 1, 2024 -
అద్భుతం.. అతని పిలుపుకి కాకులన్నీ ఎలా ఎగరేసుకుంటూ వచ్చాయో!
-
ప్రభుత్వానికి ఖర్చులు తగ్గిస్తున్న కాకులు.. ఎలాగో తెలుసా?
నీళ్లు తాగడానికి ఓ కుండ దగ్గరకు వెళ్లిన కాకికి అందులోని నీళ్లు అందకపోతే రాళ్లు తీసుకొచ్చి కుండలో వేసి నీళ్లు పైకి రాగానే తాగేసిన కథను విని ఉంటారు. మరి అదే కాకికి ఆకలేస్తే..! ఏముంది రోడ్డుపై పడేసిన చెత్తను తీసుకొచ్చి ఓ డబ్బాలో వేస్తే చాలు. అలా చెత్త వేయగానే ఇలా తిండి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు స్వీడన్లో కాకులు ఇదే పని మీదున్నాయి. చెత్తను డబ్బాల్లో వేస్తూ తిండి సంపాదిస్తున్నాయి. పక్క కాకులకు కూడా ఈ ట్రిక్‌ను నేర్పిస్తున్నాయి. అసలు కాకులు అలా ఎందుకు చేస్తున్నాయి, చెత్తను డబ్బాలో వేస్తే తిండి వస్తుందని వాటికెలా తెలిసింది, దాని వల్ల ప్రజలకు, సిటీకేంటి లాభం, తెలుసుకుందామా? చెత్త సమస్యకు చెక్ పెట్టేందుకు.. స్వీడన్ ప్రజలు వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్తను పడేస్తున్నారు. సిగరెట్ తాగి పీకలను రోడ్డుపై విసిరేస్తున్నారు. ఆ దేశ వీధుల్లో పడే చెత్తలో దాదాపు 62 శాతం సిగరెట్ పీకలే ఉంటున్నాయని స్వీడన్ టైడీ ఫౌండేషన్ చెబుతోంది. అక్కడి వీధుల్లో ఏటా దాదాపు 100 కోట్ల వరకు సిగరెట్ పీకలను పడేస్తున్నారంటోంది. ఇవే సిగరెట్ పీకలు, చెత్త సమస్యతో స్వీడన్ లోని సోడెర్టాల్జె మున్సిపా లిటీ కూడా ఇబ్బంది పడుతోంది. రహదారులను పరిశుభ్రం చేసేందుకు ఏటా దాదాపు రూ. 16 కోట్లను ఆ మున్సిపాలిటీ ఖర్చు చేస్తోంది. దీంతో ఆ నగరంలోని స్టార్టప్ సంస్థ ‘కోర్విడ్ క్లీనింగ్’ తెలివిగా కాకులను రంగంలోకి దింపింది. చెత్తను, సిగరెట్ పీకలను తీసుకెళ్లి ఓ డబ్బాలో పడేసేలా శిక్షణ ఇచ్చింది. ఆ వెంటనే ఆ డబ్బా నుంచి తిండి వచ్చేలా ఏర్పాటు చేసింది. ఇందుకు ఆ సంస్థ ఓ డబ్బాను రూపొందించింది. కాకులనే ఎందుకు? కోర్విడ్ జాతికి చెందిన న్యూ కెలడోనియా కాకులు చాలా తెలివైనవని ఒక పరిశోధనలో వెల్లడైంది. ఏడేళ్లున్న మనిషి ఎలాగైతే ఆలోచిస్తాడో అచ్చం అలా ఆలోచించే సామర్థ్యం వీటి సొంతమని తేలింది. ఇవి ఏదైనా సరే చాలా త్వరగా నేర్చుకుంటాయి. పక్క వాటికి నేర్పిస్తాయి కూడా. ఈ పక్షులకే ఇప్పుడు చెత్త క్లీనింగ్‌పై శిక్షణనిచ్చారు. సిగరెట్ పీకలను, చెత్తను ఆహారం అనుకొని తినే అవకాశమే లేదని తేలింది. వీటి గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నాకే శిక్షణ ఇచ్చారు. ఏమైనా లాభముందా? మున్సిపాలిటీ సిబ్బందికి ఒక్కో సిగరెట్ పీకను తీయడానికి అయ్యే ఖర్చుల్లో నాలుగో వంతు ఖర్చు చేస్తే చాలు కాకులు ఆ పని చేసి పెడుతున్నాయి. అంటే మొత్తంగా పీకలను తీయడానికి అయ్యే ఖర్చులో దాదాపు 75% తగ్గించేస్తున్నాయి. ఇప్పటి వరకు కాకులకే శిక్షణ ఇచ్చామని, మున్ముందు మరిన్ని రకాల పక్షులకు శిక్షణ ఇస్తామని అధికారు లు చెబుతున్నారు. ఇది కేవలం నగరాన్ని పరిశు భ్రంగా ఉంచడానికి మాత్రమే కాదని.. ప్రజలు కూడా వారి పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా చేయాలనేదే తమ ఉద్దేశమని చెప్పారు. మనుషులు నేర్చుకునేదెప్పుడో! ఏదేమైనా చెత్తను తొలగించడానికి పక్షులకు కూడా శిక్షణ ఇస్తున్నాం కానీ.. చెత్త వేయొద్దని మనుషులకు చెప్పలేకపోతున్నామని అక్కడి అధికారులు అంటున్నారు. కాకులు చెత్త తీసుకెళ్లడంపై కొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఇప్పుటికైతే చెత్తను తీసుకెళ్లే పనే పక్షులకు అప్పగించారు. ఇకముందు చెత్త వేస్తే చాలు.. వచ్చి వెనక నుంచి తన్నేలా శిక్షణనిస్తారేమో’ అని ఫన్నీగా అంటున్నారు. సాక్షి, సెంట్రల్ డెస్క్ -
రామ చిలుకలు కలలోకి వచ్చాయా.. మీ పంట పండినట్టే..!
Parrots In Dreams: మనిషి నిద్రించే సమయంలో కలలు రావడం సర్వసాధారణం. కలలో మనుషులు, జంతువులు, పక్షులు, ఎత్తయిన శిఖరాలు, జలపాతాలు, లోయలు ఇలా ఎన్నో కనిపిస్తుంటాయి. అయితే కలలోకి కొన్ని రకాల పక్షులు వస్తే అదృష్టం, సంతోషం.. కొన్ని జాతుల పక్షులు కనిపిస్తే సమస్యలు ఎదురవుతాయని శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా రామచిలుకలు కలలోకి వస్తే ఆ మనిషి పంట పండినట్టేనట. ఇలా జరగడం వల్ల వ్యాపార రంగాల్లో గుర్తింపు, గౌరవంతో పాటు ఆకస్మిక ధనలాభం, అధిక మొత్తంలో లాభాలు కలుగుతాయట. కాబట్టి కలలో రామచిలుకలు కనిపించడం శుభసూచకమేనని చాలామంది విశ్వసిస్తారు. అలాగే, పిచ్చుకలు, నెమలి, గరుడ పక్షి, కొంగ కనిపించడం కూడా శుభ సంకేతమేనట. ఈ పక్షులు కలలోకి వస్తే.. కష్టాలు తొలగిపోయి కుటుంబాల్లో ఆనందాలు నెలకొనడంతో పాటు సంపద వృద్ధి, వివాహం, సంతానప్రాప్తి కలుగుతాయట. అయితే, కలలో కాకి కనిపిస్తే మాత్రం దురదృష్టమని.. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురయ్యే ప్రమాదముందని కొందరు నమ్ముతారు. చదవండి: విటమిన్ బి12 లోపం ఉందా..? ల్యాబ్‌కు వెళ్లక్కర్లేదు.. ఇలా చేస్తే తెలుస్తుంది..! -
కాకులకు ఏమైందో?
వికారాబాద్ అర్బన్: పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీలో ఆదివారం సుమారు 20 కాకులు మృత్యువాతపడ్డాయి. వికారాబాద్ నుంచి అనంతగిరి వెళ్లే ప్రధాన రోడ్డు పక్కనే రాజీవ్‌నగర్ ఉంది. కాలనీకి ఆనుకుని రోడ్డుకు ఇరువైపులా పెద్దపెద్ద మర్రి, మామిడి చెట్లు ఉన్నాయి. ఆదివారం ఉదయం ఉన్నట్టుండి చెట్ల పైనుంచి కాకులు కిందపడటం, కొద్దిసేపు గిలగిలా కొట్టుకొని చనిపోవడాన్ని స్థానికులు గమనించారు. ఒకటి తర్వాత ఒకటి సుమారు 20 కాకులు మృత్యువాత పడ్డాయి. అదేవిధంగా కాలనీలోని పలువురి ఇళ్ల ఎదుట ఉన్న చెట్ల మీది నుంచి కూడా కాకులు పడిపోగా కొందరు మంచినీరు తాగించి బతికించే ప్రయత్నం చేశారు. ఏమైనా విషాహారం తిని ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. కరోనా ప్రారంభంలోనూ వికారాబాద్ పట్టణంలో తొలిసారిగా రాజీవ్‌నగర్ కాలనీలోనే రెడ్‌జోన్ ఏర్పాటు చేయడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కాకుల మృతితో భయాందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే కారణాలు తెలుసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పోస్టుమార్టం చేస్తాం పాయిజన్ కలిసిన నీళ్లు తాగడంతో కాకులు మృతిచెంది ఉండొచ్చు. ఆదివారం వాటి కళేబరాలను సేకరించాం. పోస్టుమార్టం నిర్వహించి కారణాలు తెలుసుకుంటాం. – సదానందం, జిల్లా పశువైద్యాధికారి -
అద్దంలో ప్రతిబింబం.. కార్లపై దాడి.. కాకులపై కేసు
లండన్: సాధారణంగా పక్షులు, ఇతర జీవులు అద్దంలో తమ ప్రతిబింబం చూసుకుంటూ.. అవతలి వైపు మరొక జీవి ఉందేమో అనుకొని భ్రమపడుతుంటాయి. ఈ క్రమంలో అవి అద్దంపై దాడిచేసి ఫన్నీగా ప్రవర్తించడం మనకు తెలిసిందే. అయితే, తాజాగా ఇలాంటి ఫన్నీ ఘటన ఒకటి యూకేలో చోటుచేసుకుంది. అయితే, డెర్బీషైర్ అనే గ్రామంలోని కార్లిస్లే అవెన్యూ, లిటిల్ ఓవర్ ప్రాంతంలో కొన్ని రోజులుగా బయట పార్కింగ్ చేసిన కార్ల అద్దాలు, వైపర్లు పాడవుతున్నాయి. వాటిపై గీతలు ఉండటాన్ని వారు గమనించారు. కాగా, మొదట ఇది ఎవరో.. ఆకతాయిల పనిగా భావించారు. కానీ, ప్రతిరోజు వారి కార్లు పాడవుతుండటంతో విసిగిపోయి కొంత మంది యువకులను కాపలాగా ఉంచారు. అప్పుడు వారికి ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ఇది కాకులు చేస్తున్న పనిగా గుర్తించారు. ప్రతిరోజు రెండు కాకులు కార్లపై అద్దాలను, వైపర్లను పాడుచేస్తున్నాయి. అంతటితో ఆగకుండా అక్కడి వస్తువులను కూడా ఎత్తుకుపోతున్నాయి. అక్కడి స్థానికులు ఈ కాకులను చూసి హాడలేత్తి పోతున్నారు. ఆ రెండు కాకులు మిగతా కాకుల్లా ఎటుపోకుండా.. అక్కడే ఉంటూ, రెండు కలిసి వాహానాలను పాడు చేస్తున్నాయి. కాగా, జూలీ బానీస్టర్ అనే మహిళ ఒక నెలలో రెండుసార్లు కారు అద్దాలను, వైపర్లను మార్చానని వాపోయింది. దీంతో వారు ఆ కాకులకు తూర్పులండన్‌లో 50-60 దశకంలో ఉన్న ఇద్దరు అండర్ వరల్డ్ డాన్లైనా ‘రోనీ, రెగీ’ పేర్లు పెట్టారు. అయితే, మరికొందరు.. ఆ కాకులు భయ పడాలని పొలంలోని దిష్టిబొమ్మలను తీసుకొచ్చి, తమ కార్ల ముందు పెట్టుకున్నారు. అయినా కూడా, ఆ రెండు కాకులు ఏమాత్రం భయపడలేదు. అవి.. రోడ్డుపై నడుచుకుంటే వెళ్తున్న మనుషుల తలపై కూడా దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో విసిగిపోయిన వారు డెర్బీషైర్‌లోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, మొదట పోలీసులు ఈ సంఘటనను వింతగా చూశారు. కాగా క్రమంగా ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుండటంతో కేసును నమోదు చేశారు. దీనిపై రాయల్ సొసైటీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ బర్డ్స్ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. కాకులు ఇలా ప్రవర్తించడం చాలా అరుదని తెలిపారు. ఆ కాకులు కారు అద్దంలో తమ ప్రతిబింబం చూసుకొని అవతలి వైపు మరోక పక్షి ఉందేమో.. అని భ్రమపడి ఉంటాయని అన్నారు. అయితే, ఇప్పుడిది ఆ నగరవాసులకు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘పాపం.. కాకులు కార్లను పాడు చేస్తున్నాయి..’, ‘స్నేహాం అంటే మీదే..’, ‘వాటిని మచ్చిక చేసుకొవచ్చుగా..మరీ!’,‘ఇప్పుడు.. వాటిని జైల్లో పెడతారా ఏంటీ?’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. -
లోకంలో.. పలు కాకులు; ఆసక్తికర సంగతులు
లోకులు పలు కాకులు అనే సామెత మనకు తెలిసిందే. ఆ సామెత ఎలా ఉన్నా.. కాకుల్లో పలు రకాలు ఉన్నాయి. మనం సాధారణంగా కావ్ కావ్ మంటూ చెవులు చిల్లులు పడేలా అరిచే నల్ల కాకులనే చూస్తాం. కానీ కాకుల్లో కూడా అందమైనవి. ఆకట్టుకునే రంగుల్లో ఉన్నవి కూడా లోకంలో ఉన్నాయి. కార్విడె కుటుంబానికి చెందిన కాకుల్లో హౌస్ క్రోలని, రావెన్స్ అని, జాక్‌డా అని, మాగ్ పీ అని రకరకాలుగా ఉన్నాయి. వాటి వివరాలు ఓ సారి చూద్దాం. రుఫోస్ ట్రీపీ.. కాకి జాతిదే అయినా ఇది గోధుమ రంగులో ఉంటుంది. భారత ఉపఖండం దీని ఆవాసం. సాధారణ వర్షపాతం ఉండే ప్రాంతాలు, అడవులు, పట్టణాల్లోని ఉద్యానవనాల్లో ఇది కనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సర్దుకుపోతుంది. పళ్లు, గింజలు, కీటకాలు, చిన్న చిన్న జీవులు దీని ప్రధాన ఆహారం. వైట్ బెల్లీడ్ ట్రీ పీ.. తోక పొడుగ్గా, అందంగా ఉండే ఈ కాకి, ఎక్కువగా పశ్చిమ కనుమల్లో నివసిస్తుంది. రూఫోస్ ట్రీపీతో స్నేహం చేస్తుంది. జనావాసాలు అంటే దీనికి పడదు. గింజలు, కీటకాలు, సరీసృపాలు, ఎలుకలు దీని ఆహారం. కామన్ గ్రీన్ మాగ్పీ.. దేశంలోని పక్షి జాతుల్లో అందమైనది. పచ్చని రంగుతో చూడముచ్చటగా ఉంటుంది. పరిమాణంలో చిన్నగా ఉండే ఈ కాకి హిమాలయాల్లో, ఈశాన్య భారతంలో కనిపిస్తుంది. ఇండియన్ జంగిల్ క్రో.. రతదేశం మొత్తం ఈ కాకి కనిపిస్తుంది. హౌస్ క్రోకి దీనికి తేడా స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తి నల్లగా, కొంచెం పెద్దగా ఉంటుంది. జంగిల్ క్రో అయినా జనావాసాలకు దగ్గరలోనే నివసిస్తుంది. లార్జ్ బిల్లెడ్ క్రో.. ది కూడా అడవి కాకిలాగే పెద్దగా ఉంటుంది. కానీ సైజులో తేడా కనిపిస్తుంది. భారత్, ఆగ్నేయ ఆసియా దేశాల్లోని కాకుల్లో ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఇది కూడా ప్రతిభ గలది. పరిస్థితులకు అనుకూలంగా మారుతుంది. యెల్లో బిల్లెడ్ బ్లూ మాగ్పీ.. వైట్ బెల్లీడ్ ట్రీ పీలాగే దీనికి కూడా పొడవైన తోక ఉంటుంది. కామన్ గ్రీన్ మాగ్పీలా అందంగా ఉంటుంది. భారత ఉపఖండంలోని ఉత్తర ప్రాంతాల్లో ఇది నివసిస్తుంది. నేలపై ఉండే ఆహారాన్ని సేకరించి కడుపునింపుకుంటుంది. బ్లాక్ హెడెడ్ జే.. హిమాలయాల్లో ఈ కాకి జాతి జీవిస్తుంది. నేపాల్, భూటాన్ వ్యవసాయ భూముల్లో కూడా అప్పుడప్పుడూ కనిపిస్తుంది. దీని తలపైన నల్లగా ఉంటుంది. యూరేసియన్ జేకి ఇది దగ్గరి చుట్టం. అదే పరిమాణంలో కూడా ఉంటుంది. హౌస్ క్రో.. పంచంలో అన్ని ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే కాకి ఇది. దీని ఆవాసాలు మనుషులకు చేరువలో ఉంటాయి. కాకి జాతుల్లో కర్ణకఠోరంగా కావ్ కావ్ మంటూ కూసే కాకి ఇదే. నల్లగా ఉన్నా.. కొంత భాగం బూడిద రంగులో మెరుస్తూ ఉంటుంది. కామన్ రావెన్.. కాకి జాతుల్లో పెద్ద వాటిల్లో ఇది ఒకటి. ఇది అత్యంత ప్రతిభ కలిగినది. తెలివైనది. అంతేగాక అవకాశవాది అనే పేరున్నది. వాయవ్య భారతంలో మాత్రమే కనిపిస్తుంది. రాజస్థాన్, పంజాబ్‌తో పాటు సమీపంలోని ఎడారుల్లో జీవిస్తుంది. వెస్ట్రన్ జాక్‌డా.. కాకి జాతిలో చిన్న రకం ఇది. ఉత్తర భారత దేశంలోని కశ్మీర్లో కనిపిస్తుంది. తిండి విషయంలో ఇది కూడా అవకాశవాదే. ఇది పలు రకాలైన ఆహారం భుజిస్తుంది. మొక్కలు, క్రిములు చివరకు వాన పాములు లాంటి వాటికి కూడా గుటుక్కుమనిపిస్తుంది. -
వింత వ్యాధితో కోళ్లు, కాకులు మృతి
సాక్షి, కొత్తపల్లె/పాములపాడు (కర్నూలు): కొత్తపల్లె, పాములపాడు మండలాల్లోని పలు ప్రాంతాల్లో వింత వ్యాధితో కోళ్లు, కాకులు చనిపోతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కోళ్లు చనిపోయిన తర్వాత ముక్కులోంచి ఒక రకమైన ద్రవం కారడం, కొన్ని కోళ్లకు చర్మంపై బోడిపెలుగా వచ్చి చర్మం రాలిపోవడం వంటివి జరుగుతున్నాయని బాధితులు చెబుతున్నారు. గురువారం కొత్తపల్లె మండలం సింగరాజుపల్లె గ్రామంలో సంజీవరాయుడుకు చెందిన 50 కోళ్లు మృత్యువాత పడ్డాయి. అదే గ్రామంలో ఐదు కాకులు కూడా మృతి చెందాయి. అలాగే పాములపాడుకు చెందిన నబీరసూల్ అనే రైతు ఇంట్లో నాలుగు, కృష్ణానగర్ గ్రామంలో రామకోటినాయక్ అనే రైతు ఇంట్లో 70 కోళ్లు చనిపోయాయి. చాలా మంది రైతుల ఇళ్లలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ విషయం తమ దృష్టికి రాలేదని పాములపాడు పశువైద్యాధికారి భాస్కర్ తెలిపారు. -
కావ్ కావ్ సేవ్ సేవ్
సాక్షి, హైదరాబాద్: ఇంటి ముందు ఉదయమే కాకులు కావ్‌కావ్‌మని అరిస్తే.. ‘బంధువులు వస్తారేమో’ అనడం కద్దు. నలుగురు కలిసి గోల చేస్తుంటే.. ‘ఏమిటా కాకిగోల’ అని.. తప్పుల తడకలెక్కలను ‘కాకిలెక్కల’ని ఎత్తి పొడుస్తారు. ఇరుగుపొరుగు నుంచి సూటిపోటి మాటలు ఎదురైతే.. ‘కాకుల్లా పొడుచుకుతింటున్నారు’ అంటారు. ‘ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడు’.. ఇది పిసినారులను ఉద్దేశించి అనే మాట. నిత్య జీవితంలో ఎదురయ్యే వివిధ పరి స్థితుల్లో ఇలా కాకులతో ముడిపెట్టి మాట్లాడి, పోల్చే సందర్భాలెన్నో. పెంపుడు పక్షి కాకున్నా జనంతో నిత్యం మమేకమై మసిలే పక్షి కాకి. పొద్దున లేచింది మొదలు సాయంత్రం వరకు అది కనిపించని క్షణం, ‘కావ్కావ్’మని వినిపించని శబ్దం ఉండవేమో. అయితే ఇదంతా గతం. క్షణం కాదుకదా ఇక రోజుల తరబడి కాకి కనిపించ దేమో. దసరా నాడు పాలపిట్ట దర్శనం కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించినట్టు భవిష్య త్తులో కాకిని చూడాలంటే.. వెతకాలేమో!. పరిస్థితి ఇలాగే ఉంటే కొన్నేళ్లలో నగరాలు, పట్ట ణాల్లో కాకులు కనిపించటమే గగనమంటోంది ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యా లయం పక్షి విభాగం జరిపిన ప్రాథమిక అధ్య యనం. ఈ విభాగం అధిపతి వి.వాసుదేవరావు ఆధ్వర్యంలో త్వరలో దీనిపై పూర్తిస్థాయి అధ్యయనం జరగనుంది. చంపేస్తున్న ఔషధ వ్యర్థాలు కాకులంటే చాలామందిలో ఏహ్య భావం ఉంటుంది. కానీ మనకు తెలియకుండా అవి చేస్తున్న మేలెంతో. చనిపోయిన జంతు కళేబరాలు వేగంగా మాయమయ్యేలా చేసి మనచుట్టూ అనారోగ్యకర వాతావరణం లేకుండా చేస్తాయివి. హిందువుల్లో చనిపోయిన వ్యక్తి కర్మకాండల్లో ‘కాకి ముట్టే’ తంతుకు చాలా ప్రాధాన్యం ఉంది. కానీ ఇప్పుడు కాకులు క్రమంగా తగ్గిపోవడానికి మనుషులే కారణమవుతుండటం విషాదం. నగరాలు, పట్టణాల్లోని ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో పోగయ్యే వ్యర్థాలు కాకుల తిండిని విషతుల్యం చేస్తున్నాయి. ఆసుపత్రి వ్యర్థాలను నిజానికి శాస్త్రీయ పద్ధతిలో ధ్వంసం చేయాలి. ఖర్చు తగ్గించుకునేందుకు ఆసుపత్రుల నిర్వాహకులు వ్యర్థాలను నేరుగా చెత్తకుండీల్లో పారేస్తున్నారు. ఇటీవల ఇళ్లలోనూ మందుల వాడకం పెరిగింది. వివిధ ఆరోగ్య సమస్యల నిమిత్తం తెచ్చుకున్న మందులను అవసరం తీరాక, నిల్వ ఉండి కాలం తీరిన ఔషధాలను చెత్తకుండీల్లో పడేస్తున్నారు. సాధారణంగా కాకులు తిండి కోసం చెత్తకుండీల వద్దకే ఎక్కువగా చేరుతుంటాయి. చెత్తలోంచి కావాల్సిన తిండిని ఏరుకుని తింటాయి. ఈ మందులు కలిసిన తిండి తిని అవి అనారోగ్యానికి గురై చనిపోతున్నాయి. కాకులు అంతరించేందుకు ఇది ప్రధాన కారణమవుతోంది. కాకి చావుకు కారణాలెన్నో! ఆసుపత్రి వ్యర్థాలు, పారేసిన ఔషధాలు కలిసిన తిండి తినడం వల్ల కొన్ని కాకులు చనిపోతుండగా ఆడ కాకుల్లో గుడ్లుపెట్టే సామర్థ్యం దెబ్బతింటోంది. ఫలితంగా వాటి సంతతి తగ్గిపోతోంది. ఇంకా కాకి చావుకు మరెన్నో కారణాలున్నాయంటున్నారు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ’ ప్రధాన కార్యదర్శి సంజీవ్‌వర్మ. పక్షుల్లో కాకులు తెలివైనవి. ప్రమాదం పొంచి ఉన్నచోట అవి ఉండటానికి ఇష్టపడవు. నగరంలో పతంగులను ఎగురవేయడానికి ఉపయోగించే మాంజా దారం పలుచోట్ల చెట్లలో ఇరుక్కుపోతోంది. ఈ మాంజా ఉచ్చులో పడి చాలా కాకులు చనిపోతున్నాయి. ఒక కాకి చనిపోతే మిగతా కాకులు అక్కడ ఉండేందుకు ఇష్టపడవు. అందుకే నగరం కంటే, శివారు ప్రాంతాల్లో కాకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో ఇళ్ల నుంచి చెత్తను తెచ్చి సమీపంలోని కుండీలో వేసేవారు. అందులోని తిండిని తిని కాకులు గడిపేవి. ఇప్పుడు ఇంటింటికి వెళ్లి›మున్సిపల్ సిబ్బంది చెత్తను సేకరిస్తున్నారు. ఫలితంగా కుండీల్లో వాటికి తిండి కరువైంది. ఎత్తుగా ఉండే చెట్లపైనే కాకులు గూళ్లు పెట్టుకుంటాయి. అపార్ట్మెంట్ల నిర్మాణంతో ఇళ్ల ప్రాంగణాల్లో ఏపుగా ఉండే చెట్లు మాయమయ్యాయి. వీధుల్లోనూ పొడవాటి చెట్లు కనిపించట్లేదు. దీంతో గూళ్లకు అనువైన వాతావరణం వెదుక్కుంటూ కాకులు వెళ్లిపోతున్నాయి. కాకులకిది అత్యంత ప్రమాదకరస్థితి ఆసుపత్రులు, ఇళ్ల నుంచి వచ్చే మందుల వ్యర్థాలు పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కాకులు అంతరించేందుకిది కారణమయ్యేంత తీవ్రత నెలకొంది. ఫలితంగా ఐదారేళ్లుగా కాకుల సంఖ్య బాగా తగ్గిపోతోందని మా ప్రాథమిక అధ్యయనంలో తేలింది. త్వరలో మా బృందం పూర్తిస్థాయి అధ్యయనం ప్రారంభించనుంది. అందులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. – వి.వాసుదేవరావు, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త, పక్షి విభాగాధిపతి -
కాకి మాంసంతో చికెన్ వెరైటీలు
రామేశ్వరం: చికెన్ మాంసంలో కాకి మాంసాన్ని కలిపి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్ట్ చేసిన ఘటన తమిళనాడులోని రామేశ్వరంలో చోటు చేసుకుంది. వివరాలు.. రామేశ్వరంలోని ఓ ఆలయంలో భక్తులు తమ పూర్వీకుల జ్క్షాపకార్థం కాకులకు అన్నాన్ని ఆహారంగా వేశారు. అయితే ఆ అన్నాన్ని తిన్న కాసేపటికే కాకులు ఎక్కువ సంఖ్యలో మృతి చెందాయి. దీంతో ఆందోళన చెందిన భక్తులు అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వేటగాళ్లు కాకులకు మద్యం కలిపిన ఆహారాన్ని ఇవ్వడం వల్లే అవి చనిపోయాయని తేల్చారు. చనిపోయిన కాకులను సేకరించి వాటి మాంసాన్ని చికెన్ స్టాల్స్‌కు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కాకి మాంసం కలిపిన చికెన్‌ను కొందరు దుకాణదారులు రోడ్డు పక్కన తినుబండారాల్లో వినియోగిస్తున్నట్లుగా తెలిపారు. కాకులను చంపడమే కాక, దాని మాంసాన్ని చికెన్ స్టాళ్లకు విక్రయించినందుకుగానూ ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 150 చనిపోయిన కాకులను వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ఆ గుడిలో చికెన్, మటన్ బిర్యానీలే ప్రసాదాలు -
కాకులు కొవ్వు కొవ్వు అంటున్నాయి!
న్యూయార్క్.... తెలవారుతున్న సమయం.. కోయిలల కజిన్స్ కాకులు తమదైన గోల చేస్తున్నాయి! ఆ కావ్.. కావ్లు.. అందరికీ వినిపిస్తున్నాయిగానీ... కొందరు శాస్త్రవేత్తలకు మాత్రం కాకులు... ‘‘కొవ్వు.. కొవ్వు’’ అంటున్నట్లుగా ఉన్నాయి! కాకులకు కొవ్వుకు సంబంధం ఏంటనేగా మీ ఆలోచన? చాన్నాళ్లుగా నగరాల్లో ఉండటంతో అవి తమ సహజమైన ఆహారం తినడం మానేశాయి. మనిషి తిని పారేసిన చీజ్బర్గర్లు, హాట్‌డాగ్‌లు తినే బతుకు వెళ్లదీస్తున్నాయి. ఫలితం అచ్చం మన మాదిరిగానే అవి కొవ్కెక్కిపోతున్నాయి! ఆండ్రియా టౌన్సెండ్ అనే శాస్త్రవేత్త తన బృందంతో కలిసి చేసిన ఓ పరిశోధన ఈ విషయాన్ని తేల్చింది. నగర జీవనం మనుషులనే కాదు.. కాకుల్లాంటి చిన్న జీవులను ప్రభావితం చేస్తోందనేందుకు ఇదే తార్కాణమని ఆండ్రియా చెప్పారు. పిచ్చుకలు, కాకుల్లాంటి జీవులంటే ఆండ్రియాకూ మక్కువే. హామిల్టన్ కాలేజ్‌లో ఆర్నిథాలజిస్ట్గా పనిచేస్తున్న ఆండ్రియాకు ఓ ఆలోచన వచ్చింది. మనలాగే కాకులు కూడా చీజ్బర్గర్లు తింటే ఏమవుతుంది? అన్న ప్రశ్నకు సమాధానం వెతికేందుకు ఒక పరిశోధన మొదలుపెట్టింది. కాలిఫోర్నియాలోని డేవిస్ ప్రాంతంలో సుమారు 140 కాకిగూళ్లను ఎంచుకుని అక్కడి వాటికి మెక్‌డొనాల్డ్ చీజ్బర్గర్లు అందించడం మొదలుపెట్టింది. గూళ్లు ఉన్న చెట్టు కింద ఉంచిన బర్గర్లను కాకులు ఇష్టంగా తిన్నాయని.. ఒక్కో కాకి మూడు బర్గర్లు లాగించేసిందని ఆండ్రియా తెలిపారు. కొన్ని కాకులు బర్గర్ ముక్కలను గూళ్లకు మోసుకెళ్లడమూ చూశామని తెలిపారు. ఆ తరువాత ఇదే ప్రయోగాన్ని గ్రామీణ ప్రాంతమైన క్లింటన్లోనూ చేపట్టారు. మూడేళ్లపాటు జరిగిన ఈ పరిశోధనలో గ్రామీణ ప్రాంతాల్లోని కాకులతో నగరాల్లోని కాకులను పోల్చి చూశారు కూడా. తేలిందేమిటంటే.. కాంక్రీట్ జనారణ్యంలో ఉన్న కాకుల్లో కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉందీ అని! అంతేకాదు.. గ్రామీణ ప్రాంత కాకులతో పోలిస్తే నగర ప్రాంత కాకులు తొందరగా మరణిస్తున్నట్లు గుర్తించారు. కొలెస్ట్రాల్ ఎక్కువవడం వల్లనే మరణించాయా? లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్నది తేలాల్సి ఉంది. శుద్ధి చేసిన ఆహారంతో సమస్య ఆండ్రియా పరిశోధన వివరాలు ‘ద కాండోర్’ అనే జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. నగరజీవనం కాకులను ఎలా ప్రభావితం చేస్తోందో చెబుతుంది ఈ పరిశోధన. మనుషులు తినగా మిగిలిన ఆహారం.. ముఖ్యంగా బ్రెడ్, పిజ్జా, చీజ్ వంటి శుద్ధి చేసిన ఆహారం ఎక్కువగా తినడం వల్లనే కాకులకు కొలెస్ట్రాల్ సమస్య వస్తోందని ఆండ్రియా అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కాకులు.. సహజంగా దొరికే ఇతర ఆహారంపై ఆధారపడతాయన్నది తెలిసిందే. గతంలో ఇదే అంశంపై జరిగిన ఒక పరిశోధన కూడా నగరాల్లోని చిన్న చిన్న జంతువుల్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్లు తేల్చింది. చిన్న చిన్న మోతాదుల్లో కొలెస్ట్రాల్ శరీరానికి మేలు చేసేదికాగా.. ఎక్కువైతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. -
మూడేళ్లుగా కాకి పగ; వణికిపోతున్న కూలీ!
భోపాల్ : సాధారణంగా నచ్చని వ్యక్తిపై ద్వేషం పెంచుకుంటే ఆ విషయాన్ని పాము పగతో పోలుస్తారు కొంతమంది. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన శివ కేవత్ అనే దినసరి కూలీపై పగబట్టిన కాకుల గురించి తెలిస్తే తమ అభిప్రాయం మార్చుకుంటారు. పిల్ల కాకిని చంపేశాడన్న కోపంతో కాకి సమాజం అతడిపై కక్ష గట్టి మూడేళ్లుగా దాడి చేస్తోంది. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజమని ముఖం నిండా గాయాలతో సతమవుతున్న శివ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అసలేం జరిగిందంటే.. మధ్యప్రదేశ్‌లోని శివపురికి చెందిన శివ కేవత్ మూడేళ్ల క్రితం పనికి వెళ్లేందుకు ఇంటి బయటకు వచ్చాడు. ఇంటి సమీపంలో ఉన్న కాకి గూట్లో పిల్ల కాకి మూలుగు విని దాని దగ్గరకు వెళ్లాడు. గాయంతో విలవిల్లాడుతున్న కాకి పిల్లను చేతిలోకి తీసుకుని నిమురుతుండగానే అది ప్రాణాలు కోల్పోయింది. సరిగ్గా అప్పుడే గూటికి దగ్గరకు వచ్చిన తల్లి కాకి సహా ఇతర కాకులు పిల్ల కాకిని శివ చంపేశాడని భావించాయి. ఇక ఆనాటి నుంచి అతడిపై పగబట్టాయి. ఇంట్లో నుంచి శివ బయటికి వెళ్లే సమయంలో అక్కడికి చేరుకుని రోజూ అతడిని ముక్కుతో పొడవడంతో పాటుగా కాళ్లతో ముఖం, చేతులపై దాడి చేయడం ప్రారంభించాయి. కాగా మొదట్లో ఇదంతా యాధృచ్చికంగా జరుగుతోందని భావించిన శివకు రాను రాను అసలు విషయం అర్థమైంది. దీంతో వాటిని తప్పించుకుని పోయేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కాకులు మాత్రం అతడిని విడిచిపెట్టడం లేదు. మూడేళ్లుగా తాను అనుభవిస్తున్న బాధ గురించి శివ మాట్లాడుతూ..‘ నేను కాకి పిల్లను కాపాడాలనుకున్నాను. కానీ అది నా చేతుల్లో ప్రాణాలు విడిచింది. దీంతో నేనే దాన్ని చంపానని కాకులు భావిస్తున్నాయి. వాటి ఙ్ఞాపక శక్తి అమోఘం. ఇన్నేళ్లు అయినా నా ముఖాన్ని మర్చిపోకుండా దాడి చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికైనా నన్ను క్షమించి వదిలేస్తే బాగుండు’ అని వ్యాఖ్యానించాడు. -
ఆయన కోసం రోజూ కాకులు ఎదురు చూస్తాయి
సిరుగుప్ప : పట్టణంలోని సదాశివనగర్‌లోని ప్రభుత్వ అతిథి గృహం పక్కన రోడ్డులో ఉన్న శ్రీవీరభద్రేశ్వర బాగలకోట హోటల్ యజమాని శివశంకర్‌గౌడ గత 10 సంవత్సరాల నుంచి నిరంతరంగా కాకులకు రోజుకు మూడుసార్లు రొట్టెలను ఆహారంగా వేస్తూ, తాగునీటిని అందిస్తూ పశుపక్ష్యాదులకు మిత్రునిగా అభినందనలు అందుకుంటున్నారు. ప్రతిదినం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయన కాకులకు తిండి నీరు అందజేస్తారు. ప్రతి పూటా 10కి రొట్టెలను చిన్నచిన్న ముక్కలుగా చేసి ప్రభుత్వ అతిథి మందిరం ప్రహరీ గోడపై వేస్తారు. ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న కాకులు గుంపులు గుంపులుగా చేరి రొట్టె ముక్కలను అక్కడే తిని మరికొన్ని నోటితో కరచుకొని గూళ్లకు తీసుకుపోతాయి. ఇలా రోజు రూ.100లు కాకులకు ఆహారం కోసం ఖర్చు చేస్తున్నారు. కొన్ని సార్లు కోతులు, ఉడుతలు కూడా రొట్టెల సేవను అందుకుంటాయి. కాకులు అంటే కొందరికి అరిష్టం అని కొందరు మూఢ నమ్మకాలు కలిగిన ప్రజల మధ్య ప్రతి రోజూ గౌడ వాటి ఆకలి తీర్చడం విశేషం. -
కాకులతో పెట్టుకుంటావా.. ఖబడ్దార్!
వేమనపల్లి: పాములు పగబడుతాయనే మాట విన్నాం.. కానీ కాకులు కూడా పగబట్టడం వింతే మరి. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలకేంద్రం బొగుడ గూడెంలో కాకుల జంట ఓ యువరైతును పగబట్టాయి! అతను ఎటు వెళ్లినా వెంటప డుతూ ముప్పుతిప్పలు పెడుతున్నాయి. తెల్గ రమేశ్ అనే వ్యక్తిని ఓ కాకుల జంట గత పది రోజులుగా వెంబడిస్తోంది. రమేశ్ ఇంటి సమీపంలో ఉన్న వేపచెట్టు ఇటీవల గాలి దుమారాలకు ఒక వైపునకు వంగింది. రోడ్డు వెంట రాకపోకలకు ఇబ్బందిగా ఉందని రమేశ్ ఆ చెట్టు కొమ్మలను నరికాడు. అదే వేప చెట్టుపై ఉన్న కాకి గూడును అతను గమనించ లేదు. ఆ కొమ్మలు నరుకు తుండగా గూట్లో ఉన్న కాకిపిల్లలు కింద పడ్డాయి. ఇక అంతే.. ఆ కాకులు వెంటనే రమేశ్‌పై దాడికి దిగాయి. కావు కావు మం టూ అరుస్తూ, కాళ్లతో కొడుతూ, ముక్కుతో పొడుస్తూ బీభత్సం సృష్టిం చాయి. వాటి గోలకు తట్టుకోలేక ఇంట్లోకి పరిగెత్తాడు. కిందపడ్డ కాకి పిల్లలను కాపాడాలని గ్రామస్తులు సూచించారు. దీంతో వాటిని తట్టలోకి తీసుకుని కొమ్మలు లేని ఆ వేప చెట్టుపై పెట్టాడు. అప్పటి నుంచి కాకులు పిల్లల ఆలనాపాలనా చూసుకుంటున్నా యి. కానీ, రమేశ్‌ను మాత్రం వదిలిపెట్టడం లేదు. చెట్టు పక్కనే ఉన్న గడ్డివాము వద్దకెళ్లి ఎడ్లకు మేత వేద్దామన్నా వెంబడిస్తున్నాయి. వాడలో కనిపించినా, రోడ్డు మీదకొచ్చినా దాడికి దిగుతున్నాయి. దీంతో రమేశ్ వాటి కంటపడకుండా వ్యవసాయ పనులకు వెళుతున్నాడు. ‘‘కాకులతోని నాకిదేం గోస, వాటి పగ గింత ఘోరంగా ఉంటుందనుకోలేదు. వాటి పిల్లలను కింద పడేసినందుకే నా మీద కసి పెంచుకు న్నయ్. మా బొగుడగూడెంల ఎక్కడ కనపడ్డా నాపై దాడికి దిగుతున్నాయి. ఆటికి కనపడకుండా చేన్లకు, ఎవుసపు పనులకు పోతాను’’అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
కాకుల్లోనూ వస్తుమార్పిడి
భవిష్యత్తు భద్రంగా ఉండాలని ముందు జాగ్రత్తగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం, వాటి ప్రకారమే నడుచుకోవడం మనలో చాలామందికి అలవాటే. అయితే ఈ అలవాటు మనుషులకు మాత్రమే కాకుండా కాకులకు కూడా ఉందట. స్వీడన్‌లోని లండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. కాకులు తమ మనుగడను శాశ్వతం చేసుకునేందుకు రకరకాల పద్ధతులను అనుసరించడాన్ని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందులో వస్తుమార్పిడి వంటివి కూడా ఉన్నాయని వెల్లడించారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన పద్ధతిని ఎంచుకొని, తమను తాము కాపాడుకుంటాయట. అయితే ఈ పద్ధతులను ఎంచుకునే సమయంలో స్వీయనియంత్రణను పాటించడం, పలు రకాలుగా ఆలోచించడం, ఎంచుకోవడానికి కాస్త సమయం తీసుకోవడం వంటివి కాకుల్లో ఉన్న ఉత్తమ గుణాలని శాస్త్రవేత్తలు తెలిపారు. కేవలం మనుషుల్లో మాత్రమే కనిపించే ఈ లక్షణాలను గతంలో చింపాజీల్లో గమనించామని, అంతకు మించిన పరిణితిని కాకులు కనబర్చడం ఆశ్చర్యపర్చిందని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఓస్వాత్ తెలిపారు. -
కాకుల్లోనూ వస్తుమార్పిడి
భవిష్యత్తు భద్రంగా ఉండాలని ముందు జాగ్రత్తగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం, వాటి ప్రకారమే నడుచుకోవడం మనలో చాలామందికి అలవాటే. అయితే ఈ అలవాటు మనుషు లకు మాత్రమే కాకుండా కాకులకు కూడా ఉందట. స్వీడన్‌లోని లండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. కాకులు తమ మనుగడను శాశ్వతం చేసుకునేందుకు రకరకాల పద్ధతులను అనుసరించడాన్ని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందులో వస్తుమార్పిడి వంటివి కూడా ఉన్నాయని వెల్లడించారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన పద్ధతిని ఎంచుకొని, తమను తాము కాపాడుకుంటాయట. అయితే ఈ పద్ధతులను ఎంచుకునే సమయంలో స్వీయనియంత్రణను పాటించడం, పలు రకాలుగా ఆలోచించడం, ఎంచుకోవడానికి కాస్త సమయం తీసుకోవడం వంటివి కాకుల్లో ఉన్న ఉత్తమ గుణాలని శాస్త్రవేత్తలు తెలిపారు. కేవలం మనుషుల్లో మాత్రమే కనిపించే ఈ లక్షణాలను గతంలో చింపాజీల్లో గమనించామని, అంతకు మించిన పరిణితిని కాకులు కనబర్చడం ఆశ్చర్యపర్చిందని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఓస్వాత్ తెలిపారు. -
కాకులూ.. ఇటు రాకండి..!
మనుషులకు భాష ఉంది కాబట్టి పలానా పనిచేయకం డని నేరుగా మాట్లాడి చెప్పొ చ్చు.. మరి జంతువులకు, పక్షులకు ఎలా చెప్పాలి? ఏమీ లేదు.. పేపర్ మీద రాస్తే సరి.. అలా ఎలా సాధ్యం అనుకుంటే జపాన్‌లో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకోవాల్సిందే మరి! జపాన్‌కు చెందిన కత్సుఫుమి శాటో ఒక ప్రొఫెసర్. ఆయన ఒట్సుషిచిలోని యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. వర్సిటీలోని రీసెర్చ్ సెంటర్ పైభాగంలో కొన్ని పైపులు ఉన్నాయి. మూడేళ్ల క్రితం ఆ పైపులకు ఉన్న ఇన్సులేషన్ మెటీరియల్‌ను తరచుగా కాకులు పీక్కొని తమ గూడు నిర్మాణం నిమిత్తం తీసుకెళ్లేవి. దీంతో పైపులు పాడయిపోయేవి. ఎన్నిసార్లు కాకులను పారద్రోలినా మళ్లీ వచ్చేవి. దీంతో విసిగిపోయిన శాటో.. కాకుల నిపుణుడు అయిన సుటోము టకేడా అనే తన స్నేహితుడిని ఆశ్రయించాడు. శాటో బాధ విన్న సుటోము కాకులకు కనిపించేలా పేపర్‌పై కొన్ని గుర్తులు పెట్టమని, వాటిపై ‘కాకులు ఇక్కడికి రాకండి’ అని అర్థం వచ్చేలా రాయమని సూచించా డు. సుటోము అలా చెప్పగానే శాటో పకపక నవ్వి ఆ విధంగా రాస్తే కాకులు రావా? అంటూ ఎగతాళి చేశాడు. ఏమో రాకపోవచ్చేమో! ఒకసారి ప్రయత్నించి చూడు అని సుటోము చెప్పాడు. సుటోము చెప్పినట్లే శాటో ఆ పేపర్లపై రాసి కాకులకు కనిపించేలా పెట్టాడు. వాటిని చూసిన కాకులు మెల్లిమెల్లిగా రావడం మానేశాయి. శాటో అదృష్టమో లేక టైమ్ బాగుండో కాకులు దగ్గరికి కూడా వచ్చేవి కావు. వర్సిటీ సిబ్బంది ఆ పేపర్లను చూపిస్తూ కాకులను హెచ్చరించడం వల్ల అవి భయపడి ఉంటాయని సుటోము తెలిపారు. అంతేకాకుండా కొన్ని గుర్తులతో ఉన్న ఆ పేపర్లను చూసి కాకులు భయపడి ఉంటాయని వివరించారు. -
ముఖ్యమంత్రిపై రెట్ట వేసిన కాకి
బెంగళూరు: కర్నాటక సీఎం సిద్దరామయ్యను కాకి గోల విడిచిపెట్టడం లేదు. రాష్ట్రకవి మంజీశ్వర్ గోవింద్ పాయ్ ను స్మరిస్తూ కేరళలోని మంజీశ్వరంలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేరళ సీఎం పినరయి విజయన్, కర్నాటక సీఎం సిద్దరామయ్య, లోక్ సభ సభ్యుడు వీరప్పమొయిలీలలతో పాటూ పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. వక్తలు ప్రసంగిస్తుండగానే వేధిక పక్కనే ఉన్న ఓ చెట్టు పై నుంచి ఓ కాకి వచ్చి సిద్దరామయ్యపై రెట్టవేసి తిరిగి చెట్టుపైకి వెళ్లిపోయింది. దీంతో కంగుతిన్న సిద్ధరామయ్య దగ్గరకు మంగళూరు నగర నార్త్ ఎమ్మెల్యే మొహియుద్దీన్ బవ వెంటనే వెళ్లి టిష్యుతో రెట్టని తుడిచారు. కాకి రెట్ట వేయడంతో తెల్లటి దోతి పాడవడంతో మాజీ మూడా(ఎంయూడీఏ) ఛైర్మన్ సీనియర్ కాంగ్రెస్ నేత తేజోమయ కూడా వెంటనే సీఎం దగ్గరికి వెళ్లి ఆయన డ్రెస్ క్లీన్ చేశారు. పక్కనే ఉన్న సిబ్బంది వెంటనే చెట్టు దగ్గరకు వెళ్లి కాకులను అక్కడి నుంచి తరిమివేశారు. కాకులతో సిద్ధరామయ్యకు ఇదేమీ మొదటి సమస్యకాదు..అంతకు ముందు ఆయన వాడిన వాహనంపై కాకి వాలిందట. ఆ కాకి వాహనం బొనెట్ పైనే తిష్టవేసిందట. దాన్ని సిబ్బంది తరిమినా వెళ్లకుండా పది నిమిషాల పాటు కారు బోనెట్ పైనే ఉండిపోయిందట. కాగా ఈ సీన్‌ను ఎవరో రికార్డ్ చేశారు. అది అప్పుడు సిద్ధ రామయ్యకు తలనొప్పి తెచ్చిపెట్టింది. పాత కారుపై కాకి వాలడం వల్లే సిద్ధ రామయ్య కారు మార్చారంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ముఖ్యమంత్రికి జాతకాలపై నమ్మకమని... అందుకనే 35 లక్షలు ఖర్చు పెట్టి కొత్త కారు కొన్నారంటు ఆరోపణలు వెల్లువెత్తాయి. సీఎంగా బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి ఇలా జాతకాల పిచ్చితో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు రావడంతో సిద్ధరామయ్య వివరణ కూడా ఇచ్చారు. కారు మార్చేయాలని సిబ్బందికి తానే చెప్పానని అన్నారు. అయితే, ఆ కారు అప్పటికే 2 లక్షల కిలోమీటర్లు తిరిగేసిందని, అందువల్ల పాతది అయిపోయింది కాబట్టే దాన్ని మార్చాల్సిందిగా సూచించానని పేర్కొన్నారు. అంతేతప్ప తాను మూఢవిశ్వాసాలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మనని ఆయన చెప్పాల్సి వచ్చింది. (ఫైల్ ఫోటో) -
కాకులకు కూడా తెలివి ఎక్కువేనట!
వాషింగ్టన్: కార్విడ్ జాతికి చెందిన కాకులన్నీ మనకు ఒకేలా కనిపిస్తాయి. ఎక్కువ నలుపు, తక్కువ ఇతర రంగులు కలిగిన మాగ్పీస్ కాకులను మాత్రం మనం వేరుగా గుర్తించవచ్చు. కాకులు మాత్రం మనుషుల్ని గుర్తుపెట్టుకుంటాయి. ఏ మనిషి నుంచి ప్రమాదం పొంచి ఉందో, ఏ మనిషి నుంచి ప్రమాదంలేదో గుర్తిస్తాయి. అంతేకాకుండా పొంచి వున్న ప్రమాదాన్ని గుర్తించి తోటి కాకులను హెచ్చరిస్తాయి. ఫలానా మనిషి వద్దకు వెళ్లొద్దంటూ చీవాట్లు కూడా పెడతాయి. పెద్ద పెట్టున గోల చేస్తాయి. ఆ అరుపులనే మనం కాకిగోల అంటాం. అంతేకాకుండా తమ జాతి కాకి చనిపోతే దాన్ని గుర్తు పడతాయి. దాన్ని దూరంగా తీసుకుపోతాయి. ఆ కాకి ఎందుకు చనిపోయిందో, ఎవరు అందుకు బాధ్యులో గుర్తించేందుకు కూడా ప్రయత్నిస్తాయి. భవిష్యత్తులో తమ జాతి పక్షులకు ఎవరి నుంచి ప్రమాదం ఉందో అంచనా వేసేందుకే అవి ఇలా ప్రవర్తిస్తాయి. ఈ అంశాలను సియాటిల్‌లోని వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన అధ్యయనకారులు శాస్త్రపద్ధతిలో ప్రయోగాలు జరిపి నిరూపించారు. వారు తమ అధ్యయన వివరాలను ‘యానిమల్ బిహేవియర్’ జర్నల్‌లో ప్రచురించారు. కయేలి స్విస్ట్ అనే గ్రాడ్యువేట్ విద్యార్థిని ఈ ప్రయోగాల కోసం అధ్యయనకారులు ఎంపిక చేసుకున్నారు. ఆ విద్యార్థి ఒకే చోట రోజు కాకులకు ఆహారం పెడుతూ వచ్చారు. ఆ ప్రాంతానికి కాకులు రావడం ప్రారంభించాయి. ఒక రోజున బూరుతీసిన ఓ కాకిలో, ఓ పావురంలో తినే పదార్థాలను కూర్చి, వాటిని వేర్వేరుగా కాకుల తిండి గింజల పక్కన అమర్చి ముసుగులు ధరించిన వాలంటీర్లను పరిశీలకులుగా నియమించారు. బూరు తీసిన కాకి మాంసాన్ని గుర్తించిన కాకులు దాన్ని తాము తినే పదార్థాలకు దూరంగా తీసుకెళ్లి పెట్టాయి. తర్వాత వాలంటీర్ల దగ్గరకు వెళ్లొందన్నట్లుగా తోటి కాకులను గోల చేసి హెచ్చరించాయి. పదే పదే ఈ ప్రయోగాన్ని నిర్వహించగా కొన్నిసార్లు ముసుగులు ధరించిన వాలంటీర్లపైనా కూడా అవి దాడులు చేశాయి. ఒక్కసారి కూడా అవి తినే పదార్థాలను కూరిన పావురం వద్దకు వెళ్లలేదు. కాకులు కూడా స్వజాతి పక్షపాతులేమో! కాకులకు కూడా తిండిపెట్టే స్నేహితులెవరో, చంపేసే శత్రువులెవరో గ్రహించే విచక్షణ జ్ఞానం ఉందని వాషింగ్టన్ యూనివర్శిటీ బయాలోజీ ప్రొఫెసర్ జాన్ మార్జులుఫ్ చెప్పారు. కాకి జాతిలో రంగులు కలిగి ఉండే మాగ్పీస్ కాకులు పక్షులన్నింటిలోకెల్లా తెలివిగలవని శాస్త్రవేత్తలు చెబుతారు. -
పులిసిన ఆముదంతో పురుగులకు చెక్!
విత్తు నాటడం కాదు పంట ఇంటికి తెచ్చుకోవడం గొప్ప అంటారు పెద్దలు. కల్లంలో పంటను కాకులు, గద్దలు తన్నుకుపోకుండా కాపాడు కోవడం రైతుకు కష్టతరమే. ఈనగాసిన పంట నక్కల పాలయినట్లు మార్కెట్ మాయజాలం బారి నుంచి తప్పించుకోవడం రైతుకు ఎటూ అలవిగాని పనే అనేది ఏండ్ల తరబడి అనుభవంతో చూస్తున్నదే. అయితే విత్తనం వేసింది మొదలు సాకి సవరించే క్రమంలో కూడా పురుగూ పుట్ర దాడులు రైతు పుట్టి ముంచుతున్నాయి. కనీసం ఈ విపత్తుల నుంచైనా రైతు తనను, పంటను కాపాడుకోగలిగితే కారిన చెమట ఫలితం కండ్ల చూసుకొనే భాగ్యవంతుడవుతాడు. పంటను కాపాడుకోవడానికి కొన్ని సులభ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఆధునిక సేద్యం ఆచరణలోకి వచ్చిన తరువాత మన పూర్వీకులు తమ అనుభవసారాన్ని రంగరించి అందించిన ఈ పద్ధతులు మార్కెట్ మాయతెరల కారణంగా మరుగున పడి అంటరానివై పోయాయి. జ్ఞాపకాల దుమ్ముదులిపి ప్రాచీనులు అందించిన సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులు అద్భుతంగా పనిచేస్తున్నాయని అనేక మంది రైతులు ఆచరణలో రుజువు చేస్తున్నారు. తన పొలంలో అందుబాటులో ఉండే వివిధ పదార్ధాలతో వివిధ కీటకాల సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. పండ్ల తోటల్లో కాండం తొలిచే పురుగు, నల్లముట్టె పురుగు, లద్దె పురుగు వంటి వాటిని పెద్దగా ఖర్చు లేకుండా నివారించుకోవచ్చు. పులియ బెట్టిన ఆముదం పిండి ఇందుకు బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆముదం రసాన్ని తయారు చేసుకోవడం కూడా అతి సులభం. పులియ బెట్టిన ఆముదం రసం తయారు చేసుకునే విధానం: 5 కిలోల ఆముదాలు తీసుకొని మెత్తగా పొడి కొట్టుకోవాలి. ఈ పొడిని 5 లీటర్ల నీటిలో వేసి బాగా కలియపెట్టి ఒక కుండలో పోసి, నీడగా ఉన్న చోట 10 రోజుల పాటు కదల్చకుండా ఉంచాలి. 10 రోజుల్లో ఈ ద్రావణం బాగా పులిసి ఒక రకమైన దుర్వాసన వెదజల్లుతుంది. ఈ పులిసిన ద్రావణాన్ని 5 లీటర్ల నీరు పట్టే కుండలను తీసుకొని, కుండకు రెండు లీటర్ల ద్రావణం నింపుకోవాలి. ఈ కుండలను పొలంలో అక్కడక్కడ గొయ్యితీసి నేలకు సమానంగా పాతి పెట్టాలి. ఆ తర్వాత వీటిని సాధారణ నీటితో కుతికెల వరకు నింపాలి. ఎకరా పొలంలో ఐదు కుండలను పాతి పెడితే సరిపోతుంది. ఉపయోగించేది ఇలా: ఆముదం ద్రావణం నుంచి వెలువడే వాసన అన్ని రకాల రెక్కల పురుగులను, తెల్లదోమ, పచ్చదోమలను ఆకర్షిస్తుంది. లద్దెపురుగులు, నల్లముట్టె పురుగులు కూడా ఈ వాసనకు ఆకర్షితమై కుండలోని నీళ్లలో పడి చనిపోతాయి. వరి, చెరకు తోట్లల్లో గట్ల వెంట ఈ కడవలను పెట్టినట్లయితే ఎలుకలు పారిపోతాయి. ఈ వాసన ఉన్నంత కాలం ఆ ప్రాంతంలోకి ఎలుకలు తిరిగి రావు. పొలంలో అక్కడక్కడ ఎరపంటగా వేసిన ఆముదపు మొక్కల నుంచి సేకరించిన విత్తనాలను ఇందుకు వినియోగించుకోవచ్చు. మట్టి కుండలను కొనుగోలు చేసుకుంటే సరిపోతుంది. - సాగుబడి డెస్క్ -
కాకులు హత్యలు చేస్తాయా!
అరణ్యం కాకులు ఎంత తెలివైనవంటే... శత్రువుల దాడి నుంచి తప్పించుకోవడానికి, తమ అసలు గూటికి దగ్గర్లో కొన్ని డూప్లికేట్ గూళ్లని నిర్మిస్తాయి. వాటిలో ఏమీ లేకపోవడం చూసి తన గూటి జోలికి ఎవరూ రారని వాటి ప్లాన్! కాకులు చీమలను చంపి, నలిపి, ఆ మిశ్రమాన్ని ఒళ్లంతా పూసుకుంటాయని పరిశోధనల్లో తేలింది. చీమల్లో ఫార్మిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పరాన్న జీవులను మన దగ్గరకు రాకుండా చేస్తుంది. అందుకే పురుగూ పుట్రా తమ దగ్గరకు రాకుండా కాకులు అలా చేస్తాయట! ఆడకాకులు నిజాయితీగా ఉంటాయి. ఒక్కసారి ఒకదానితో జతకడితే, జీవితాంతం దానితోనే ఉంటాయి. కానీ మగకాకులు అలా కాదు. వేరేది నచ్చితే వెళ్లిపోతాయి! కాకులు ఒకదాన్నొకటి పొడుచుకుని చంపుకుంటాయి. అలా ఎందుకు చేస్తాయో కనిపెట్టలేకపోయారు శాస్త్రజ్ఞులు! పురుగులు, పండ్లు, గుడ్లు, చేపలు, కప్పలు, ధాన్యం... మొత్తం వెయ్యి రకాల ఆహార పదార్థాలను తింటాయివి! ఆహారం విషయంలో కాకులకు స్వార్థం ఎక్కువే. తమ ఆహారాన్ని మరేదైనా ఎత్తుకుపోవాలని చూస్తోందని తెలిస్తే, వెంటనే ఓ రహస్య ప్రదేశంలో గొయ్యి తీసి పాతిపెడతాయి. తర్వాత కావలసినప్పుడు తీసుకుని తింటాయి! వాల్నట్స్, బాదం కాయల వంటి వాటిని పగులగొట్టుకుని, లోపలి పప్పు తినాలన్న విషయం తెలుసు కాకులకు. అందుకే వాటిని ఎత్తై ప్రదేశాల నుంచి వదిలి, కిందపడి పగిలాక పప్పును తింటాయి. మరీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే... వాల్‌నట్స్‌ను వాహనాల చక్రాల కింద పడేస్తాయి. కారు చక్రాల కింద పడి పగులుతాయని! ఆంగ్లతార ఇంట్లో యువరాణి! ప్యారిస్ హిల్టన్. ఆంగ్ల సినిమాలు చూసేవారికి ఈమెని ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. హాలీవుడ్ పాపులర్ హీరోయిన్లలో ఒకరైన హిల్టన్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. అయితే ఆమె మాత్రం జంతువులను ఫాలో అవుతుంటారు. హిల్టన్‌కి జంతువులంటే ఎంతో ప్రేమ. పెటా కార్యకర్త అయిన ఆమె, ఏమాత్రం తీరిక దొరికినా... రోడ్ల మీద తిరిగే కుక్కల దగ్గర్నుంచి, అంతరించిపోతోన్న జంతువుల సంరక్షణ వరకు... అన్ని కార్యక్రమాల మీదా దృష్టి పెడుతుంటారు. హిల్టన్ దగ్గర చాలా రకాల కుక్కలు ఉన్నాయి. అవి ఇల్లంతా తిరుగుతూ భలే సందడి చేస్తుంటాయి. కొన్ని రకాల చిలుకలు ఉన్నాయి. అయితే అన్నిటికంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది... హిల్టన్‌కి ప్రాణప్రదమైన పందిపిల్ల గురించి. ఇదంటే ఆమెకి ఎంత పిచ్చి అంటే, ఎక్కడికి వెళ్లినా దాన్ని తనతో తీసుకెళ్తూ ఉంటుంది. దానికోసం ప్రత్యేకంగా దుస్తులు కుట్టిస్తుంది. నగలు వేస్తుంది. లిప్‌స్టిక్ కూడా పూస్తుంటుంది. దాన్ని చూసి అందరూ యువరాణిలా ఉంది అంటూ ఉంటారు. అందుకే దాని పేరు ‘ప్రిన్సెస్ పిగ్లెట్’గా స్థిరపడిపోయింది!