![Two Held Selling Crow Meat To Chicken Stalls In Rameswaram At TN - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/31/crow.jpg.webp?itok=XIBXjJte)
రామేశ్వరం: చికెన్ మాంసంలో కాకి మాంసాన్ని కలిపి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్ట్ చేసిన ఘటన తమిళనాడులోని రామేశ్వరంలో చోటు చేసుకుంది. వివరాలు.. రామేశ్వరంలోని ఓ ఆలయంలో భక్తులు తమ పూర్వీకుల జ‍్క్షాపకార్థం కాకులకు అన్నాన్ని ఆహారంగా వేశారు. అయితే ఆ అన్నాన్ని తిన్న కాసేపటికే కాకులు ఎక్కువ సంఖ్యలో మృతి చెందాయి. దీంతో ఆందోళన చెందిన భక్తులు అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
వేటగాళ్లు కాకులకు మద్యం కలిపిన ఆహారాన్ని ఇవ్వడం వల్లే అవి చనిపోయాయని తేల్చారు. చనిపోయిన కాకులను సేకరించి వాటి మాంసాన్ని చికెన్ స్టాల్స్‌కు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కాకి మాంసం కలిపిన చికెన్‌ను కొందరు దుకాణదారులు రోడ్డు పక్కన తినుబండారాల్లో వినియోగిస్తున్నట్లుగా తెలిపారు. కాకులను చంపడమే కాక, దాని మాంసాన్ని చికెన్ స్టాళ్లకు విక్రయించినందుకుగానూ ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 150 చనిపోయిన కాకులను వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment