Meat
-
చచ్చినా.. తగ్గేదే లే!
సాక్షి, భీమవరం: తెలుగు నేలపై సంక్రాంతి సీజన్ అంటే పందెంకోళ్ల పౌరుషం గుర్తొస్తుంది. పందెంలో గెలిచినా.. ఓడినా మాంసాహార ప్రియులు పుంజులను లొట్టలేసుకుని లాగిస్తుంటారు. పందెంలో ఓడిపోయిన, చనిపోయిన పుంజును తూర్పు గోదావరి జిల్లాలో ‘కోస’ అని పశ్చిమ గోదావరిలో ‘కోజ’ అని వ్యవహరిస్తారు. వీటి మాంసానికి ఎంతో డిమాండ్ ఉంది. ఏనుగు చచ్చినా బతికినా విలువ తగ్గదన్నట్టు పందెం పుంజైనా, పోరాటంలో మరణించిన ‘కోజ’ అయినా ధర వేలల్లో ఉంటుంది. బరువును బట్టి ఇవి రూ.4 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుతాయి.పుష్టికరమైన ఆహారం..పందెం కోడిని మేపినట్లు మేపామనే సామెతను బట్టి పందెం పుంజులను ఎంత శ్రద్ధగా పెంచుతారో అర్థం చేసుకోవచ్చు. శక్తి కోసం నాటు పుంజులకు ఉడకబెట్టిన మటన్, డ్రై ఫ్రూట్స్, కోడి గుడ్లు, వెల్లుల్లి లాంటి బలవర్థకమైన ఆహారాన్ని నెలల తరబడి అందిస్తారు. శరీరంలో కొవ్వు చేరకుండా తేలిగ్గా ఎగిరేందుకు వాటితో ఈత, నడక వ్యాయామాలు చేయిస్తారు. ప్రత్యేకంగా పెంచిన ఈ తరహా పుంజులు రంగు, ఎత్తు, పోరాట పటిమను బట్టి రూ.50 వేల నుంచి లక్షల్లో ధర పలికితే మిగిలినవి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటాయి. ప్రత్యేకమైన రుచి.. పందెంకోళ్లను మటన్, బాదం, జీడిపప్పు, పిస్తా లాంటి ఖరీదైన మేతతో పుష్టిగా మేపి వ్యాయామాలు చేయించడం వల్ల వాటి శరీరంలో కొవ్వు లేకుండా కండ ఎక్కువగా ఉంటుంది. పందెంలో ప్రత్యర్థి పుంజుపై గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డిన సమయంలో రక్తం మరింత వేడెక్కి ప్రత్యేకమైన రుచి వస్తుందని మాంసాహార ప్రియుల నమ్మకం. అందుకోసమే ఎంత ఖరీదైనా వెనుకాడకుండా వీటిని కొనుగోలు చేసి ఆరగిస్తారు. బంధుమిత్రులకు వండి పెట్టి.. కొందరు పందేలరాయుళ్లు ‘కోజ’లను తమ వెంట తీసుకెళ్లిపోతే మరి కొందరు బరి బయటే అమ్మేస్తుంటారు. పుంజు బరువును బట్టి ధర పలుకుతుంది. ప్రత్యేకంగా వీటిని నిప్పులపై కాల్పించుకుని దగ్గరుండి కావాల్సిన సైజుల్లో ముక్కలు కొట్టించి మాంసాన్ని తీసుకువెళుతుంటారు. వీటిని కొనేందుకే కొందరు బరుల వద్దకు వస్తుంటారంటే అతిశయోక్తి కాదు. పందెం పూర్తి కాగానే పరుగులు తీస్తుంటారు.పండుగ నాడు ఇంటికి వచ్చిన బంధుమిత్రులకు ‘కోజ’ పుంజులను వండి పెట్టి ఆనందంగా గడుపుతారు. తెలిసిన వారికి మాంసాన్ని పంపేందుకు ఆసక్తి చూపుతారు. పందెం అనంతరం ‘కోజ’ను తమకే ఇవ్వాలని పందేలరాయుళ్లకు ముందుగానే చెబుతారు. ‘పెద్దలకు’ కానుకగా.. సంక్రాంతి సమయంలో సామాన్యులే కాకుండా కొందరు నాయకులు, ఉద్యోగులు సైతం తమ పైవారికి ‘కోజ’లను కానుకగా పంపించి ప్రసన్నం చేసుకుంటారు. పందేల నిర్వాహకులు ఒక్కో బరి నుంచి 25కిపైగా ‘కోజ’లను సేకరించి రాజకీయ నాయకులతో పాటు పోలీస్, రెవెన్యూ, పంచాయతీ, అగ్నిమాపక శాఖ అధికారులకు పంపిస్తుంటారు. స్టేషన్ మామూళ్ల విషయాన్ని పక్కనపెడితే తమకు ఎన్ని ‘కోజ’లు పంపాలో పోలీసులు ముందే ఇండెంట్ పెడతారని పందేలరాయుళ్లు అంటుంటారు. కోట్లు కురిపిస్తున్న ‘కోజ’ ‘కోజ’ల రూపంలో పండుగ మూడు రోజులూ ఒక్కొక్క బరి వద్ద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చిన్నా పెద్దా కలిపి దాదాపు 80 కోడిపందేల బరులు ఏర్పాటు కానుండగా ‘కోజ’లపై రూ.5 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. -
నాగాలాండ్‌లో 99.8 శాతం మాంసాహార ప్రియులు
-
దీపావళి సంబరాల్లో ‘మాంసం, మద్యం’... స్టార్మర్ కార్యాలయం క్షమాపణలు
లండన్: దీపావళి సంబరాల్లో మాంసం, మద్యం చోటు చేసుకున్న ఉదంతంపై బ్రిటన్ ప్రధాని కార్యాలయం శుక్రవారం క్షమాపణలు తెలిపింది. దాన్ని అనుకోకుండా దొర్లిన తప్పిదంగా అభివర్ణించింది. ‘‘దీనిపై బ్రిటిష్ హిందూ సమాజం ఆందోళనలను అర్థం చేసుకోగలం. ఇకపై జరిగే సంబరాల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాం’’ అని హామీ ఇచ్చింది. ప్రధాని అధికారిక నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్‌లో అక్టోబర్ 29న దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాటిలో ప్రధాని ప్రధాని కియర్ స్టార్మర్ పాల్గొనడమే గాక దీపాలు వెలిగించారు. అయితే ఆ వేడుకల్లో మాంసం, మద్యం చోటుచేసుకోవడంపై హిందూ సమాజం నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. డౌనింగ్ స్ట్రీట్ దీపావళి సంబరాలు హిందూ సమాజం విశ్వాసాలకు అనుగుణంగా జరగలేదంటూ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన బ్రిటిష్ ఇండియన్ ఎంపీ శివానీ రాజా గురువారం స్టార్మర్‌కు లేఖ కూడా రాశారు. ఇకముందు వాటినెలా జరపాలో వివరించేందుకు సంసిద్ధత వెలిబుచ్చారు. -
టెన్షన్... టెన్షన్..
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు విభాగానికి ప్రతి ఏడాది గణేష్ ఉత్సవాలు, సామూహిక నిమజ్జనం ఓ సవాల్ లాంటివి. బందోబస్తు నేపథ్యంలో వీటిని అధికారులు ఫైనల్స్‌గా పిలుస్తుంటారు. ఎలాంటి అపశ్రుతులు, వదంతులు షికార్లు చేయడం తదితరాలు చోటు చేసుకోకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పహారా కాస్తుంటారు. అయినప్పటికీ చిన్న చిన్న ఉదంతాలు, టెన్షన్లు మామూలే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి దుర్గా నవరాత్రులు పోలీసులకు చెమటలు పట్టించాయి. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, మాసబ్‌ట్యాంక్‌ల్లో శుక్ర, శనివారాల్లో చోటు చేసుకున్న ఘటనలతో పోలీసులు పరుగులు పెట్టారు. నగర వాసులు పూర్తి సంమయనం పాటించడంతో ఏ చిన్న అపశ్రుతి లేకుండా ఈ రెండూ గట్టెక్కాయి. దీంతో పోలీసుల ఊపిరి పీల్చుకున్నారు. డిప్రెషన్ రోగి నిర్వాకం.. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన దేవీమాత విగ్రహం చేతిని శుక్రవారం మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి ధ్వంసం చేశాడు. ఈ విషయం తెలియడంతో పోలీసు విభాగం అత్యంత అప్రమత్తమైంది. ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది. ఎట్టకేలకు అదే రోజు రాత్రి 8.15 గంటలకు నాగర్ కర్నూలుకు చెందిన కృష్ణయ్యను ఫీల్‌ఖానా చౌరస్తా వద్ద పట్టుకున్నారు. గురువారం రాత్రి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సద్దుల బతుకమ్మ పండగ జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆకలితో ఉన్న కృష్ణయ్య ఆహారం కోసం గ్రౌండ్స్‌లోకి వచ్చాడు. తినేందుకు ఏదైనా దొరుకుతుందేమోనని వెతికే ప్రయత్నాల్లోనే మండపం చిందరవందర కావడంతో పాటు విగ్రహం చేయి ధ్వంసమైందని పోలీసులు తేల్చారు. మండపం వద్ద నిర్వాహకులు ఎవరు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవరించడంతో పోలీసులు వారి పైనా కేసు నమోదు చేశారు. ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో వదంతులు షికారు చేశాయి. వీధికుక్క చేసిన పనికి... మాసబ్‌ట్యాంక్ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి మరో కలకలం రేగింది. ఓ ప్రార్థన స్థలం ఎదురుగా రోడ్డుపై ఓ ప్రాణి మాంసం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఈ విషయం బయటకు రావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వెంటనే అప్రమత్తమై రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సమీపంలో ఉన్న చెత్త పదార్థాల నుంచి ఓ వీధికుక్క మాంసం ముక్కను నోటితో కరుచుకుని రావడం వీటిలో కనిపించింది. కొద్దిదూరం ఆ ముక్కను అలాగే తీసుకువెళ్లిన శునకం నోటి నుంచి ఓ ముక్క ప్రార్థన స్థలం సమీపంలో పడిపోయింది. శునకం తిరిగి ఆ ముక్కను తీసుకోకుండా వదిలేసి వెళ్లిపోయిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. వీటిని వెంటనే మీడియాకు విడుదల చేసిన పోలీసులు ఈ అంశంపై వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుర్గా నవరాత్రుల్లో పోలీసులకు ఉత్కంఠ -
హెల్త్ ఫ్యాక్ట్: నాన్‌వెజ్ తిన్నాక బాదం తినండి... ఎందుకంటే..?
మాంసాహారం తిన్న తర్వాత కొన్ని బాదం పలుకులు తినడం వల్ల ఓ ప్రయోజనం ఉంది. కొవ్వుల కారణంగా జరిగే అనర్థాల్ని తగ్గించడం ద్వారా అవి కరోనరీ గుండెజబ్బులనూ నివారిస్తాయి.బాదంలోని ఒమెగా–3 ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఆ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. ఆ మాటకొస్తే మామూలు సమయాల్లో బాదం తినడం వల్ల కూడా చాలా మేలు కలుగుతుంది. వీటిలోని క్యాల్షియమ్ ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు... ఆహారనాళాన్నీ ఆరోగ్యంగా ఉంచడం లో బాదం తోడ్పడుతుంది. గుండెకూ మేలు చేస్తుంది.ఇవి చదవండి: ‘ఆరుద్ర’ను చూస్తే అనువైన వరుడు.. -
మాంసాహారం తినే రాష్ట్రాల్లో మనమే టాప్ప్లేస్
సాక్షి, హైదరాబాద్: పెళ్లి.. పుట్టినరోజు ఇలా ఏ దావత్ చేసినా.. ముక్కలుండాలె... ముక్కలేయకపోతే బంధాలే ముక్కలైపోతాయని బంధు ‘బలగం’మస్తుగా ఉన్న ప్రతీ కుటుంబానికీ తెలుసు. మటన్ ఓ ట్రెడిషన్‌గా మారిపోయి దేశంలోనే మన రాష్ట్రాన్ని టాప్ప్లేస్కు తీసుకెళ్లింది. జాతీయసగటు కన్నా ఎక్కువగా మాంసాన్ని మనవారు లాగించేస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో 70 శాతానికిపైగా ప్రజలు మాంసాహారాన్ని ఇష్టపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. దేశంలో 16.6శాతం మంది పురుషులు 29.4 శాతం మంది మహిళలు తప్ప, మిగిలిన వారంతా నాన్ వెజ్ ప్రియులేనని, ప్రతీ ముగ్గురిలో ఇద్దరు మాంసం తినేవారేనని తేల్చింది. మనమే టాప్... దేశవ్యాప్తంగా మాంసాహారం తినే రాష్ట్రాల్లో 98.7 శాతంతో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా, పశ్చిమబెంగాల్ 98.55, ఏపీ 98.25 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒక కేజీ మాంసం ధర రూ.500 నుంచి రూ.600 మధ్య ఉండగా, మన దగ్గర రూ. 800 నుంచి రూ.1,000 వరకూ ఉంది. తెలంగాణవాసులు వారానికి కనీసం మూడుసార్లు మాంసాహారాన్ని తింటున్నారని ఓ సర్వే వెల్లడించింది. ప్రతీ వ్యక్తి సంవత్సరానికి సగటున రూ.58,000 మాంసం కోసం వెచి్చస్తున్నారని ఓ వెటర్నరీ అధికారి తెలిపారు. ⇒ రాష్ట్రంలో 2014–15లో సగటున ఒక్కో వ్యక్తి సంవత్సరానికి 12.95 కిలోలు తినగా, అది 2021–22 నాటికి 21.17 కిలోలకు పెరిగింది. ఇప్పుడు ఆ సగటు 28.5 కిలోలకు చేరింది. ఇదే సమయంలో జాతీయ సగటు మాంసం వినియోగం దాదాపుగా 7.1 కిలోలు పైచిలుకు మాత్రమే కావడం గమనార్హం. ⇒ మన దగ్గర వినియోగిస్తున్న 28 కిలోల్లో దాదాపు 8 కిలోలు గొర్రె/మేక మాంసం కాగా (జాతీయ సగటు 3.5 కిలోలు) కాగా, ఇందులో స్వల్పంగా బీఫ్, పంది మాంసం మిగిలినది చికెన్.⇒ జాతీయ పోషకాహార సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఏడాదికి ఒక మనిషి 11 కిలోలు వరకూ వినియోగించవచ్చు. గొర్రె/మేక మాంస వినియోగం ఎక్కువగా ఉన్న మన దగ్గర ఉత్పత్తి సరిపోక ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. బయట నుంచి వచ్చే మాంసం ఏదైనా కారణాల వల్ల ఆగిపోతే మాంసం కేవలం 10 రోజులు రాకపోయినా మాంసం ధర రూ.1000 పైబడుతుందని అంచనా. మటన్ క్యాపిటల్ హైదరాబాద్ రాష్ట్రంలో ఉత్పత్తి చేసి, దిగుమతి చేసుకునే మాంసంలో ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే వినియోగిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి సరఫరా అయ్యే మాంసాన్ని హైదరాబాద్‌లో నిల్వ చేసి తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలకు సరఫరా చేయడంతో హైదరాబాద్ మాంసం సరఫరాకు కేంద్రంగా మారింది. మరోవైపు హోటళ్లు, రెస్టారెంట్లు పెద్ద సంఖ్యలో ఉండడంతో పాటువ్యక్తిగత వినియోగం కోసం కూడా కలిపి హైదరాబాద్‌లో ప్రతిరోజూ సుమారు 18,000కు పైగా గొర్రెలను వధిస్తున్నట్టు అంచనా.రోజుకు 50వేల వరకూ జంతువధ... తెలంగాణలో చెంగిచెర్ల, జియాగూడ, బోయిగూడ, బహదూర్‌పురా, అంబర్పేట్ తదితర ప్రాంతాల్లో కబేళాలు ఉన్నాయి. స్థానిక వినియోగం, ఎగుమతుల కోసం వేర్వేరుగా వీటిని వినియోగిస్తున్నారు. వీటిలో అన్ని రకాల మాంసాలు కలిపి ఒక్కరోజులో 6 వేల నుంచి 7 వేల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 45వేల నుంచి 50వేల దాకా జంతువులను వధిస్తారు. ఇందులో సగంపైనే హైదరాబాద్ వినియోగానికే కేటాయిస్తున్నారు. స్వయం సమృద్ధి దిశగా... గొర్రెల ఉత్పత్తిలో మనం తొలిస్థానంలో, మాంసం ఉత్పత్తి, వినియోగం రెండింటిలో మనం ముందున్నాం. దేశంలో బీఫ్ ఎగుమతుల ద్వారా మనకు అత్యధిక ఆదాయం లభిస్తోంది. అదే సమయంలో గొర్రె/మేక మాంసం దిగుమతులు తగ్గించేందుకు, స్వయం సమృద్ధి సాధించే దిశగా పలు ప్రయత్నాలు ముమ్మరం చేశాం. –డా.బర్బుధ్ది, డైరెక్టర్, నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్‌ఎమ్‌ఆర్‌ఐ)ఉత్పాదకత పెంపుపై దృష్టి... రాష్ట్రంలో మాంస వినియోగం రానురానూ పెరుగుతోంది. డిమాండ్‌ను అందుకునే ప్రయత్నాల్లో భాగంగా ప్రస్తుతం ఒక గొర్రె/మేక ద్వారా వస్తున్న మాంసం పరిమాణాన్ని పెంచాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటికి సరైన ఆహారం అందించడం ద్వారా దిగుబడి రెట్టింపు చేసే దిశగా కృషి చేస్తున్నాం. –పి.బస్వారెడ్డి, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఎన్‌ఎమ్‌ఆర్‌ఐ -
తాబేలు మాసం తిని తొమ్మిదిమంది మృతి.. 78 మందికి అనారోగ్యం!
ఆఫ్రికన్ దేశం టాంజానియాకు సమీపంలోని జాంజిబార్ దీవులలో తాబేలు మాంసం తిన్న తొమ్మదిమంది మృతి చెందారు. వీరిలో ఎనిమిదిమంది పిల్లలతో పాటు ఒక మహిళ కూడా ఉన్నారు. ఈ ఘటనలో 78 మంది అనారోగ్యం పాలయ్యారు. వీరందరినీ స్థానిక అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. హానికరమని తెలిసినా సముద్ర తాబేలు మాంసాన్ని జాంజిబార్‌వాసులు ఎంతో ఇష్టంగా తింటారు. ఒక్కోసారి ఈ మాంసం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా జరిగిన ఘటన గురించి మకోని జిల్లా వైద్యాధికారి డాక్టర్ హాజీ బక్రీ మాట్లాడుతూ విషపూరితమైన ఆహారం తిన్నకారణంగా ఒక మహిళతో పాటు ఎనిమిదిమంది చిన్నారులు మృతి చెందారని తెలిపారు. మరో 78 మంది అనారోగ్యంపాలై చికిత్స పొందుతున్నారన్నారు. వీరంతా సముద్ర తాబేలు మాసం తిన్నారని లేబొరేటరీ పరీక్షల్లో నిర్ధారితమయ్యిందని తెలిపారు. ఈ ఘటన దదిమిలా ఉన్నతాధికారులు విపత్తు నిర్వహణ బృందాన్ని ఘటన జరిగిన ప్రాంతానికి పంపారు. ప్రభుత్వం సముద్ర తాబేలు మాంసాన్ని తినవద్దని అక్కడి ప్రజలను కోరింది. కాగా 2021 నవంబర్‌లో పెంబాలో తాబేలు మాంసం తిని మూడేళ్ల చిన్నారితో సహా ఏడుగురు మృతి చెందారు. ఆ సమయంలో మరో ముగ్గురు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందారు. -
వారణాసిలో 26 మాంసం దుకాణాలు సీల్!
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో గల కాశీ విశ్వనాథ ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలోగల 26 మాంసం దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. న్యూ రోడ్, బెనియాబాగ్ ప్రాంతంలో మాంసం, చికెన్ దుకాణాలను అధికారులు మూసివేయించారు. కాశీ విశ్వనాథ ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలోని మాంసం, చికెన్ దుకాణాలను మూసివేయాలని ఆదేశిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ హౌస్ గత నెలలో తీర్మానం చేసింది. ఈ నేపధ్యంలో వెటర్నరీ అధికారి డాక్టర్ అజయ్ ప్రతాప్ సింగ్ ఇటీవల బెనియాబాగ్, న్యూ రోడ్లో గల మాంసం, చికెన్ దుకాణాలను తనిఖీ చేశారు. వీటిలో 26 దుకాణదారులు ఆహార భద్రతా విభాగం, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదని తేలింది. ఈ తనిఖీల తర్వాత, ఆయా దుకాణాలను మూసివేయాలని వెటర్నరీ అధికారి గత వారం నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పటికీ దుకాణాలు యధాతథంగా కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు(శనివారం) వెటర్నరీ అధికారి నేతృత్వంలో ఎన్ఫోర్స్మెంట్ బృందం బెనియాబాగ్, కొత్తరోడ్డు ప్రాంతంలోని 26 దుకాణాలను సీజ్ చేసింది. -
ప్రపంచంలో అత్యధికంగా ఇష్టపడే మాంసం ఏదో తెలుసా!
ఆరోగ్యంగా ఉండాలంటే ఓన్లీ శాకాహారమే కాక కొద్ది మొత్తంలో మాంసకృత్తులతో కూడిన ఆహారం తీసుకోవడం మంచిది. శరీరానకి అన్ని రకాల విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా లభించాలంటే తప్పనిసరిగా మాంసాహారం కూడా తీసుకోవాలసిందే. కొన్ని ప్రాంతాల్లో వివిధ జంతువుల మాంసాన్ని ఇష్టంగా తింటారు. ఇక మన దేశంలో కోడి, గొర్రె మాంసం ఎక్కువగా తింటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా తినే జంతు మాంస ఏదో తెలిస్తే షాకవ్వుతారు. ముఖ్యంగా మన భారత్‌లో ఏం తింటారో వింటే నోట మాట రాదు. ఇంతకీ ప్రపంచవ్యాప్తంగా ఏ జంతు మాంసాన్ని అత్యధికంగా ఇష్టపడుతున్నారంటే.. గత కొన్నేళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా మాంసాహార వినియోగం విపరీతంగా పెరిగింది. దీని రుచి బాగా ఎక్కువ ఉండటంతో అత్యధిక మంది వీటినే ఇష్టంగా ఆస్వాదిస్తున్నారు. అన్ని వనరులు అందుబాటులో ఉండటం కారణంగా కూడా ఈ మాంస వినియోగం ఎక్కువయ్యిందని చెప్పొచ్చు. ఇక 2017 లెక్కల ప్రకారం మాంసం వినియోగం ఏకంగా 330 మిలియన్ టన్నులు ఉంది. ప్రజల ఆదాయం పెరగడంతో పాటు ఆరోగ్యంపై స్ప్రుహ కూడా ఎక్కువగా ఉండటంతో మాంసం వినియోగం పెరిగిందనే చెప్పొచ్చు. కొన్ని దేశాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా.. మాంసం వినియోగం మాత్రం తగ్గడం లేదు. అయితే సంపన్న దేశాల్లో మాంసం ఎక్కువగా వినియోగిస్తుండగా, పేద దేశాల్లో వినియోగం తక్కువగానే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఏ జంతువు మాంసం ఎక్కువగా ఇష్టపడుతున్నారో గమనిస్తే..పోర్క్ మాంసానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. ఒక సర్వే ప్రకారం..ప్రపంచంలో అత్యధికంగా ప్రజలు ఇష్టపడే మాంసాల్లో ఈ పోర్కే తొలి స్థానంలో నిలవడం విశేషం. ఆ తరువాత స్థానంలో చికెన్నును ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు వెల్లడయ్యింది. భారత్‌లో కూడా చికెన్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఆ తరువాత మూడో స్థానంలో గొడ్డు మాంసం ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీని ధర తక్కువగా ఉండడంతో చాలా మంది దీనికి మొగ్గు చూపిస్తున్నారు. మేకలు నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. ఐదో స్థానంలో టర్కీ కోడి ఉంది. దీనిని ఎక్కువగా ఉత్తర అమెరికా, మెక్సికోలో ఎక్కువగా వాడుతారు. ప్రపంచంలో బాతు మాంసం ఆరో స్థానంలో నిలిచింది. దీనిని చైనా, అమెరికాలో ఎక్కువగా వినియోగిస్తారు. ఏడో స్థానంలో గేదె మాంసం ఉంది. దీనిని ఆసియాలోని కొన్ని దేశాల్లో ఎక్కువగా తింటారు. కుందేలు మాంసం 8వ స్థానంలో నిలిచింది. దీనిని చైనా, ఉత్తర కొరియాలో ఎక్కువగా తింటారు. తొమ్మిదో స్థానంలో జింక ఉండగా..జపాన్ లో ఈ మాంసాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. కాగా, అత్యంత తక్కువ మాంసం వినియోగిస్తున్న దేశంగా భారత్ నిలవడం విశేషం. ఇక్కడ మాంసాహారం కంటే శాఖాహారానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మరో సర్వే ప్రకారం మూడింటరెండు వంతుల మాంసాహారం వినియోగిస్తున్నారని తేలినా.. సగటు వినియోగంతో పోలిస్తే తక్కువగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆధ్యాత్మిక భావాలు, సంప్రదాయాలు పట్టింపులు ఎక్కువగా ఉండడం వల్ల అంత తొందరగా మాంసాహారం జోలికి వెళ్లరు. (చదవండి: చల్లటి నీరు అరుదైన గుండె వ్యాధికి దారితీస్తుందా? ఓ బాడీబిల్డర్ చేదు అనుభవం) -
మాంసం దుకాణాలపై కొరడా ఝుళిపిస్తున్న అధికారులు
మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ సూచనల మేరకు గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్ నగరంలో అనుమతి లేకుండా బహిరంగంగా మాంసం, చేపలను విక్రయించడాన్ని నిషేధించింది. దీనిని అమలు చేసేందుకు అధికారులు నగరంలోని పలు మార్కెట్లలో దాడుల నిర్వహిస్తున్నారు. గ్వాలియర్ మార్కెట్లో లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న ఏడు మాసం దుకాణాలను అధికారులు మూసివేయించారు. అలాగే పలువురు వ్యాపారుల నుంచి వేల రూపాయల జరిమానా వసూలు చేశారు. దీనికితోడు ఆయా వ్యాపారుల నుంచి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హర్ష్‌సింగ్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అనూజ్ శర్మ, డాక్టర్ వైభవ్ శ్రీవాస్తవ నేతృత్వంలో నగరంలో బహిరంగంగా మాంసం, చేపలు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు బృందాలుగా ఏర్పడి చర్యలు చేపట్టారు. రోడ్డు పక్కన మాంసం, చేపలు విక్రయిస్తున్న వారి నుంచి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. తాత్కాలిక దుకాణాల ఆక్రమణలను కూడా తొలగించారు. నిబంధనలను పాటించని దుకాణదారుల నుంచి మూడు వేల రూపాయల చొప్పున జరిమానా వసూలు చేశారు. ఇది కూడా చదవండి: 2023.. భారత్‌లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదాలివే.. -
కుక్కలకు పచ్చిమాంసం తినిపిస్తున్నారా? ఆ ఇన్ఫెక్షన్ మనుషుల్లోనూ..
ఈరోజుల్లో కుక్కల్ని పెంచుకోవడం కామన్ అయిపోయింది. విశ్వాసానికి ప్రతీకగా నిలిచే కుక్కలు బెస్ట్ స్ట్రెస్ బస్టర్‌గానూ ఉంటాయి. అందుకే చాలామంది తమ ఇంట్లో మనిషిలాగే కుక్కలను కూడా ట్రీట్ చేస్తుంటారు. కుటుంబసభ్యులకు చేసినట్లు కుక్కలకు కూడా ఘనంగా బర్త్‌డే పార్టీలు, సీమంతాలు నిర్వహిస్తుంటారు. మరికొందరైతే కుక్కలకి పెట్టకుండా ఏమీ తినరు. అయితే కొన్నిసార్లు అతి ప్రేమతో తెలియకుండానే తప్పులు చేస్తుంటారు. ఇష్టంగా తింటున్నాయి కదా అని ప్రతిరోజూ వాటికి ఆహారంలో పచ్చి మాంసం పెడుతుంటారు. దీని వల్ల మనుషులకు అనేక ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని తాజా అధ్యయనంలో బయటపడింది. కుక్కలకు పచ్చిమాంసం పెట్టడం వల్ల యాంటీ రెసిస్టెంట్ బ్యాక్టీరియాకు కారణం అవుతుందని తేలింది. యాంటీబయాటిక్స్ మన శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపేందుకు వాడతారు. కానీ మితిమీరి యాంటీబయోటిక్స్‌ను వాడితే శరీరం బాక్టీరియాను నిరోధించే శక్తిని క్రమంగా కోల్పోతుంది. అయితే కుక్కులకు పచ్చి మాంసం తినిపించడం వల్ల సిప్రోఫ్లోక్సాసిన్ నిరోధక E. కోలిని విసర్జిస్తుందని తాజాగా యూకేకు చెందిన బ్రిస్టోల్ సైంటిస్టులు జరిపిన అధ్యయనంలో తేలింది. సాధారణంగా Fluoroquinolones అనే యాంటిబయోటిక్స్‌ను మనుషులకు, పశువైద్యంలోనూ ఉపయోగిస్తారు. కుక్కలకు పచ్చి మాంసం తినిపించం వల్ల బాక్టీరియా ఏర్పడి యాంటీబయాటిక్-రెసిస్టెంట్ E. కోలితో కలుషితమవుతుందని శాస్త్రవేత్తలు తమ రీసెర్చ్‌లో కనుగొన్నారు. సుమారు 600 ఆరోగ్యకరమైన కుక్కలను పరిశీలించగా వాటి నమూనాల్లో మానుషులు, జంతువుల ప్రేగుల్లో E. coli బాక్టీరియా రకాన్ని గుర్తించారు. ఇది పరిశుభ్రత సరిగా లేని, పచ్చి మాంసం తినడం వల్ల పేరుకుపోయిందని తేలింది. దీనివల్ల యాంటిబయోటిక్స్ నిరోధం తగ్గిపోతుందని, ఫలితంగా బాక్టీరియా ఇతర శరీర భాగాలకు వ్యాపించే ప్రమాదం ఉంది. పచ్చిమాంసాన్ని కుక్కలకు స్వయంగా తినిపించం వల్ల మనుషుల్లోనూ అనేక ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అంతేకాకుండా ఇది ప్రేగుల్లో కొన్ని సంవత్సరాల పాటు పేరుకుపోయి తర్వాత ట్రీట్మెంట్ అందివ్వడానికి సైతం కష్టమవుతుంది. సైంటిస్టులు జరిపిన అధ్యయనంలో సుమారు 7.3% గ్రామీణ కుక్కలు, 11.8% పట్టణాల్లో కుక్కల మలంలో సిప్రోఫ్లోక్సాసిన్-రెసిస్టెంట్ E. కోలి ఉన్నట్లు గుర్తించారు. వండని మాసం తినిపించడే ఈ బాక్టీరియాకు కారణమని నమూనాల్లో తేలింది. అందుకే కుక్కల నిర్వాహణలో జాగ్రత్తలు పాటించాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. -
కుల నిర్మూలన ఇలాగేనా?
ఆర్ఎస్ఎస్ నాయకులు కుల నిర్మూలన గురించి మాట్లాడటం మంచిదే. అదే సమయంలో దానికి గల మార్గాలను కూడా వారు వివరించాలి. ప్రస్తుత మాంసాహారం వర్సెస్ శాకాహారం వివాదం కులతత్వంతో కూడుకున్నది. ఇది కుల నిర్మూలనకు సహాయం చేయకపోగా, పౌర సమాజంలో, విశ్వ విద్యాలయాల్లో కులతత్వాన్ని ప్రోత్సహిస్తుంది. వివాహం, గౌరవప్రదమైన కులాంతర భోజనాలు అనే ఈ రెండు సామాజిక వ్యవస్థలు తీవ్రమైన కుల నిర్మూలనా శక్తిని కలిగి ఉన్నాయి. అందుకే తాము హిందువులని ఆర్ఎస్ఎస్ భావించే అన్ని కులాలకూ దేవాలయాలలో అర్చకత్వ హక్కులు కల్పించాలి. దేశం, సమాజం, కుటుంబం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మంచిదని ప్రచారం చేయడం ద్వారా కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి. జాతీయ స్థాయిలో కుల గణనను డిమాండ్ చేస్తూ, ద్విజ ఆధిపత్యం కలిగిన సమాజంలో తమ చారిత్రక స్థానం పట్ల స్పృహను ప్రదర్శిస్తూ, తమ సంఖ్య గురించి శూద్ర/ఓబీసీలు చైతన్యాన్ని చూపుతున్న నేపథ్యంలో– ఎట్టకేలకు, ఆర్ఎస్ఎస్ బహిరంగ వేదికలపై కుల నిర్మూలన గురించి మాట్లాడుతోంది. కుల నిర్మూలన కోసం దత్తాత్రేయ çహొసబలే, ఇతర నాయకులు దళితులు, శూద్రులకు ఆలయ ప్రవేశాన్ని, నీటి హక్కు లను గురించి ప్రస్తావిస్తున్నారు. ఈ రెండు అంశాలూ కాలం చెల్లినవి మాత్రమే కాదు, ఇవి సామాజిక వివక్షను తొలగించే అవకాశం లేదు. రెండు సామాజిక వ్యవస్థల శక్తి మాంసాహారం వర్సెస్ శాకాహారం వివాదం కులతత్వంతో కూడుకున్నది. ఇది కుల నిర్మూలనకు సహాయం చేయకపోగా, పౌర సమాజంలో, విశ్వవిద్యాలయాల వంటి ప్రభుత్వ సంస్థలలో కుల తత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ఆహార సాంస్కృతిక ఘర్షణలకు దారి తీస్తుంది. కులాల మధ్య విభజితమైన ఆహార సంస్కృతి కూడా కులాంతర వివాహాలకు అడ్డుగోడగా నిలుస్తో్తంది. వివాహం, గౌరవప్రదమైన కులాంతర భోజనాలు అనే ఈ రెండు సామాజిక వ్యవస్థలు తీవ్రమైన కుల నిర్మూలనా శక్తిని కలిగి ఉన్నాయి. వివాహం, ఆహార సాంస్కృతిక కండిషనింగ్ అనేవి, సామాజిక బృందాలను ఏకం చేయగలవు లేదా విభజించగలవు కాబట్టి వాటిని నేను ఉద్దేశపూర్వకంగానే శక్తి అని పిలుస్తాను. కుల వివాహ వ్యవస్థ, సామా జికంగా వేర్పాటుతో కూడిన ఆహార సాంస్కృతిక పరంపర అనేవి వేయి సంవత్సరాలుగా దేశంలో కుల అంతరాలను కొనసాగించాయి. కుల కేంద్రకమైన వివాహ వ్యవస్థ అనేది వ్యక్తుల డీఎన్ఏను కుల ప్రాతిపదికన విభజించడానికి ఉద్దేశించబడింది. గత వందేళ్ల ఆర్ఎస్ఎస్ ఉనికిని చూసినట్లయితే, కుల నిర్మూలన కోసం కులాంతర వివాహాలను అది ప్రోత్సహిస్తుందనడానికి వారి రచనల్లో గానీ, నాయకుల ప్రసంగాల్లో గానీ ఎలాంటి ఆధారాలు లేవు. కులాంతర వివాహం వివిధ వృత్తులు కలిగిన రెండు వేరు వేరు వర్గాల మధ్య రక్త సంబంధాలను మార్పిడి చేస్తుందని డా. బి.ఆర్ అంబేడ్కర్ సూచించారు. ఇది ఇద్దరు భాగస్వాముల కులాన్ని బలహీనపరచడమే కాకుండా, వారి సంతానపు మానసిక, శారీరక సామర్థ్యాలను మెరుగు పరుస్తుంది. బహుశా అలాంటి కులాంతర వివాహాన్ని రుజువు చేయడానికి ఆయన సవితా అంబేడ్కర్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె బ్రాహ్మణ కుటుంబ నేపథ్యం నుండి వచ్చారు. సాధారణంగా పాశ్చాత్య సంస్కృతితో మాంసాహారం తినే దళితుడు, భారతీయ వాతావరణంలో మాత్రమే పెరిగిన బ్రాహ్మణ స్త్రీ తమ వైవాహిక జీవి తంలో ఎలాంటి సర్దుబాట్లు చేసుకున్నారు అనే సమాచారం మన వద్ద లేదు. అంబేడ్కర్, సవిత తమ ఆహారాన్ని పూర్తి శాకాహారంగా గానీ, మిశ్రమ ఆహారంగా గానీ మార్చుకుని ఉండొచ్చు. లేదా ఎదుటివారి ఆహార ఎంపికను మరొకరు గౌరవించి ఉండొచ్చు. ప్రస్తుత వ్యవస్థలో కులాంతర వివాహం అన్ని కులాలకు చెందిన భారతీయ యువత ఉన్నత విద్యను అభ్యసిస్తున్నందున కులాంతర వివాహాల పరిధి పెరుగుతోంది. అవి జరుగుతున్నాయి కూడా. కానీ కులాంతర వివాహాలను సాధారణంగా తల్లిదండ్రులు అంగీకరించరు. ఎందుకంటే ఇది సామాజిక కళంకాన్ని తీసుకొస్తుంది. అనేక సందర్భాల్లో, ముఖ్యంగా ఒక భాగస్వామి దళి తుడు, మరొకరు దళితేతరులు అయినప్పుడు అలాంటి వివాహితు లను చంపడం ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది. అధికారంలో ఉన్న బీజేపీకి మార్గదర్శకంగానూ, భారతదేశంలోని అతిపెద్ద సామాజిక సంస్థగానూ ఉన్న ఆర్ఎస్ఎస్ ఈ సమస్యతో ఎలా వ్యవహరిస్తుందో సమాజానికి తెలియదు. ఈ సంస్థ నాయకులు సనా తన ధర్మం లేదా హిందూ సంప్రదాయం గురించి నిరంతరం మాట్లాడుతుంటారు. కులాంతర వివాహాలు సనాతన ధర్మంలో లేక హిందూ సంప్రదాయంలో భాగమేనా అన్నది వాళ్లు స్పష్టం చేయాలి. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కుల నిర్మూలన ఒక క్లిష్టమైన యత్నం. కుల నిర్మూలన గురించి మాట్లాడటం మంచిదే. అదే సమయంలో దానికి గల మార్గాలను, సాధనాలను వివరించాలి. కులాలు, మాంసాహారం, శుద్ధ శాకాహారులు కుల వ్యవస్థ భారతీయుల మధ్య భోజనాన్ని ప్రధాన సమస్యగా మార్చింది. శతాబ్దాలుగా దేశంలోని వివిధ కులాల ప్రజలు పక్క పక్కనే కూర్చుని భోంచేయడం లేదు. పట్టణ ప్రాంతాల్లో ఆధునిక రెస్టారెంట్ వ్యవస్థలు కుల రహితంగా తినే వీలును కల్పించాయి. కానీ గ్రామాల్లో ఇప్పటికీ ఇది పెద్ద సమస్య. అనేక పాఠశాలల్లో దళితులు వండిన ఆహారాన్ని దళితేతరులు తినడం లేదు. ఈ పరంపరకు వ్యతి రేకంగా ఆర్ఎస్ఎస్ స్పష్టమైన వైఖరిని తీసుకోలేదు. శాకాహారం, మాంసాహారం అనే సమస్య ప్రస్తుతం చాలా ఐఐటీలు, ఇతర కేంద్ర విద్యా సంస్థల్లో తీవ్రమైన సమస్యగా మారింది. కొంతమంది కేంద్ర మంత్రులు ఆర్ఎస్ఎస్ శాకాహార సంస్కృతిలో భాగమయ్యారు. పైగా వారు పూర్తి శాకాహార మెనూని అవలంబించాలని ఆయా సంస్థలను కోరుతున్నారు. కేంద్ర విద్యాసంస్థల్లో, విశ్వ విద్యాలయాలలో శాకాహారం మాత్రమే అందించాలని ఆదేశాలను పంపిన మొదటి విద్యా మంత్రి స్మృతి ఇరానీ. ముంబై ఐఐటీతో సహా ఇతర ఐఐటీల అధిపతులు శాకాహారం, మాంసాహారం తినేవారికి వేర్వేరు వసతి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటన్నింటికీ కారణం సనాతన ధర్మాచరణకు చెందిన శాకాహార భావజాలమే. ముస్లింలను, క్రైస్తవులను విడిచిపెట్టండి... శూద్రులు, దళితులు, ఆదివాసీలు భారతదేశంలో ప్రధానంగా మాంసాన్ని, లభ్యత ఆధారంగా శాకాహారాన్ని తినడం ద్వారా జీవిస్తున్నారు. కానీ పండుగ సందర్భాలలో వారికి ఇష్టమైనది మాంసాహారమే. ఆహార సాంస్కృతిక పరంపరలో స్పష్టమైన కుల వర్ణ విభజన ఉంది. ఆర్ఎస్ఎస్ తన స్వచ్ఛమైన శాకాహార సంస్కృతిని వదులుకుంటుందా? బహిరంగ, వ్యక్తిగత ప్రదేశాలలో ప్రజలు తమకు నచ్చిన ఆహారాన్ని తినడం గురించి ఏ వైఖరిని తీసుకుంటుంది? హిందూ లేదా హిందూత్వ ఆహార సంస్కృతి ఏమిటి? ఇది స్వచ్ఛమైన శాకాహారమా లేదా వ్యక్తిగత ఎంపిక ఆధారంగా మిశ్రమ ఆహారమా? వ్యక్తిగత ప్రాధాన్యాల ఆధారంగా ఆహార సంస్కృతిని ప్రజా స్వామ్యీకరించడం కుల నిర్మూలన చర్యల్లో ఒకటి. కానీ ఆర్ఎస్ఎస్ నాయకులు కుటుంబాల ఆహార స్వేచ్ఛ గురించి ఎప్పుడూ మాట్లాడ లేదు. ఉదాహరణకు దక్షిణ భారతదేశంలో శూద్రులు, దళితులు, ఆదివాసీలందరూ మాంసాహారాన్ని తింటుంటారు. బ్రాహ్మణులు, వైశ్యులు కులపరంగా శాకాహారులు. వారి పిల్లలకు అలాగే తినేలా శిక్షణ ఇస్తారు. ఈ పద్ధతులను ప్రస్తావించకుండా ఆర్ఎస్ఎస్ కులాన్ని ఎలా నిర్మూలిస్తుంది? కుల నిర్మూలనకు దశలవారీగా ఉపయోగపడే నాలుగు సామాజిక సాధనాలను నేను గుర్తించాను. వాటి గురించి ఈ సంస్థ మౌనంగా ఉంది. 1) తాము హిందువులని ఆర్ఎస్ఎస్ భావించే అన్ని కులాలకు దేవాలయాలలో అర్చకత్వ హక్కులు కల్పించాలి. దళితులు, ఆదివాసీలు, శూద్రులతో సహా అన్ని కులాల కోసం వాటిల్లో ప్రవేశానికి హక్కు కల్పించేలా ధార్మిక పాఠశాలలను, కళాశాలలను తెరవాలి. 2) చర్మశుద్ధి నుండి కుండల తయారీ వరకు అన్ని వృత్తుల గౌరవం పెరిగేలా బోధనా సామగ్రిని రూపొందించాలి. 3) దేశం, సమాజం, కుటుంబం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మంచిదని ప్రచారం చేయడం ద్వారా కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి. 4) మాంసాహారం, శాకాహారంతో సంబంధం లేకుండా ఇతరుల ఆహార ఎంపికను గౌరవిస్తూ కలిసి భోంచేసేలా చూడాలి. ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సుతో సహా, శుద్ధ శాకాహారమే హిందూ లేదా భారతీయ ఆహార సంస్కృతిగా జరుగుతున్న ప్రచారాన్ని నిలిపివేయాలి. కుల నిర్మూలన గురించి ఆర్ఎస్ఎస్కు చిత్తశుద్ధి ఉంటే ఈ అంశాలపై తన వైఖరిని స్పష్టంగా తెలియ జేయాలి. కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
కూరగాయలే ఎక్కువగా తినాలి
రామచంద్రాపురం (పటాన్చెరు): ‘ఒక మనిషి నిత్యం 240 గ్రాముల కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి..కానీ కేవలం 145 గ్రాములే తీసుకుంటున్నారని’అంతర్జాతీయ కూరగాయల పరిశోధన కేంద్రం డైరెక్టర్ జనరల్ డాక్టర్ మార్కో వోపేరీస్ అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఇక్రిశాట్లోని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ 50వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మార్కో వోపేరీస్ విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల్లోనూ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారని, నిత్యం కూరగాయలను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటామని చెప్పారు. ఆదాయం తక్కువగా ఉన్న ప్రజలు సైతం ఎక్కువ మాంసాహారం తీసుకుంటున్నారని, అభివృద్ధి చెందిన ఫ్రాన్స్‌లాంటి దేశాల్లో సైతం కూరగాయలు ఎక్కువగా తినడం లేదన్నారు. తైవాన్, జపాన్, వియత్నాం, కొరియాలాంటి దేశాల్లో కూరగాయలను ఆహారంగా తీసుకునేవారి ఎక్కువ అని, భారత్‌లో అయితే 145 గ్రాముల కూరగాయలను మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నారని తెలిపారు.కూరగాయల సాగులో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడటం వల్ల అవి తిన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పారు. కూరగాయలు, పండ్లపై మరింత పరిశోధన జరగాలన్నారు. అవసరమైతే కూరగాయల నుంచి తీసిన జ్యూస్ భద్రపరచుకొని దానిని తీసుకోవచ్చన్నారు. అనంతరం వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులకు కూరగాయలు పండించే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఆర్ డైరెక్టర్ డాక్టర్ టీకే బెహెరా, ప్రపంచ విత్తనపరిశోధన సంస్థ రీజినల్ డాక్టర్ రామ్‌నాయర్ తదితరులు పాల్గొన్నారు. -
నాడు కుక్క మాంసంపై నిషేధం.. నేడు ఎత్తివేత.. మధ్యలో ఏం జరిగింది?
రాష్ట్రంలో కుక్క మాంసం అమ్మకాలు, కొనుగోళ్లపై నిషేధం విధిస్తూ నాగాలాండ్ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌ను గౌహతి హైకోర్టు ఆమధ్య రద్దు చేసింది. హైకోర్టు సింగిల్ బెంచ్.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2011పై ఈ సందర్భంగా పలు ప్రశ్నలు లేవనెత్తింది. కుక్క మాంసం అమ్మకాల నిషేధం వెనుక.. నాగాలాండ్ ప్రభుత్వం2020, జూలై 4న కుక్క మాంసాన్ని నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేశారు. కుక్క మాంసం కొనుగోళ్లు, అమ్మకాలను నిషేధించారు. నోటిఫికేషన్లో తెలిపిన వివరాల ప్రకారం వాణిజ్య, రెస్టారెంట్లు వంటి ప్రదేశాలలో కూడా కుక్క మాంసం అమ్మకాలను నిషేధించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ 2014 సర్క్యులర్‌ను అనుసరించి నాగాలాండ్ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఇది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్, 2011లో పేర్కొన్న జంతువులు మినగా ఇతర జాతుల జంతువులను వధించడాన్ని నిషేధించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్, 2011లోని రూల్ 2.5.1(a)లోని వివరాల ప్రకారం గొర్రెలు, మేకలు, పందులు,పౌల్ట్రీ, చేపలను ఆహారంగా భావించి, వాటిని వధించేందుకు అనుమతి కల్పించారు. ‘ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’ హైకోర్టులో జస్టిస్ మార్లీ వాన్‌కుంగ్ సింగిల్ జడ్జి ధర్మాసనం కేసును విచారిస్తూ ఆహార భద్రత, ప్రమాణాల నియంత్రణ- 2011లో కుక్క పేరు చేర్చకపోవడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఎందుకంటే ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కుక్క మాంసం కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో దాని పేరును జాబితాలో చేర్చకపోవడం ఊహకు అతీతమేమీ కాదని వివరించింది. కుక్క మాంసం అంటే ఎంతో ఇష్టం నాగా ప్రాంతాల్లో నేటికీ కుక్క మాంసాన్ని ఇష్టంగా తింటున్నారని, ఇది శతాబ్దాలుగా కొనసాగుతోందని హైకోర్టు పేర్కొంది. ది అంగామి నాగాస్, ది ఏఓ నాగాస్ ది రెంగ్మా నాగాస్ తదితర పుస్తకాలు, వివిధ పత్రాలను పరిశీలిస్తే నాగాలాండ్‌లోని వివిధ గిరిజన సమూహాలలో కుక్క మాంసం వినియోగం శతాబ్దాలుగా వస్తున్నదని హైకోర్టు పేర్కొంది. ‘కుక్కలను హింసిస్తున్నారు’ విచారణ సందర్భంగా యానిమల్స్ అండ్ హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్/ఇండియా తరఫు న్యాయవాది తన వాదనలో కుక్కలను స్మగ్లింగ్ చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నదన్నారు. కుక్కల కాళ్లకు తాడు కట్టి, దాని నోటికి కూడా తాడు కట్టి గోనె సంచిలో వేస్తారని పేర్కొన్నారు. వీటికి రోజుల తరబడి ఆహారం, నీరు ఇవ్వరని ఆరోపించారు. ఇది జంతువుల పట్ల క్రూరత్వం ప్రదర్శించడం కిందకు వస్తుందన్నారు. అయితే తాము కుక్క మాంసంపై నిషేధం విధించడాన్ని సమర్థించలేదని హైకోర్టు ముందు విన్నవించారు. దీనిపై స్పందించిన కోర్టు జంతువులపై క్రూరత్వానికి సంబంధించిన కేసుల్లో ఐపీసీని ఆశ్రయించవచ్చని తెలిపింది. ఇది కూడా చదవండి: బజరంగ్ దళ్ ఎప్పుడు, ఎలా ఆవిర్భవించింది? కాంగ్రెస్‌తో దీనికి కనెక్షన్ ఏమిటి? -
మాకొద్దు బాబోయ్.. మాంసం చూస్తే వణికిపోతున్న అమెరికన్లు.. ఆ పురుగు వల్లనే ఇదంతా!
మాంసం చూస్తే ఎవరికైనా తినాలనిపిస్తుంది. ఇంకొంత మందికి ముక్క లేకపోతే ముద్ద దిగదని అంటారు. అయితే కొందరు అమెరికన్లకు మాత్రం మాంసం చూస్తేనే ఒళ్లంతా అలర్జీ వచ్చేసి వాంతులతో వస్తున్నాయట. దీనిపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు చివరికి ఇది ఆల్ఫా – గాల్ సిండ్రోం అని కనుగొన్నారు. అసలు ఆ వ్యాధి ఏంటి, ఇలా ఎందుకు జరుగుతోందంటే.. ఆల్ఫా గాల్ అనేది ఒక ఫుడ్ అలెర్జీ. ఈ సిండ్రోం ఉన్న వారికి మాంసం, లేదా జంతువుల ఉత్పత్తులను ఆహారంగా ఇస్తే అలర్జీకి గురవుతారు. ఇది లోన్ స్టార్ టిక్ అనే కీటకం కుట్టడం వల్ల వ్యాపిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 2010 తర్వాతి నుంచి అమెరికాలో ఆల్ఫా గాలా సిండ్రోం కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గతంలో ప్రభుత్వ విడుదల చేసిన నివేదికలో 100,000 మందికి ఉండగా.. తాజాగా విడుదల చేసిన నివేదికలో ఆ సంఖ్యను మరింత పెరిగి దాదాపు 450,000 మంది ఈ సిండ్రోం బారిన పడినట్లు పేర్కొన్నారు. 2011 లో పరిశోధకులు మొదటగా లోన్ స్టార్ టిక్ అనే కీటకం కుట్టడం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని కనుగొన్నారు. ఆ ప్రాంతంలోని ఓ ప్రముఖ క్లినిక్ ప్రకారం, ఇటువంటి కేసులు సాధారణంగా దక్షిణ, తూర్పు, మధ్య యునైటెడ్ స్టేట్స్లో ఎక్కువగా ఈ వ్యాధి వ్యాపిస్తున్నట్లు తెలిపింది. లాంగ్ ఐలాండ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ ఎరిన్ మెక్గింటీ దీని గురించి మాట్లాడుతూ, గత దశాబ్దంలో ఆమె సిండ్రోమ్‌తో సుమారు 900 మందిని చూసిందని చెప్పుకొచ్చారు. ఇది వేగంగా వ్యప్తి చెందుతుందని ఆమె చెప్పారు. జింకల ద్వారా ఈ కీటకం నగరాల సరిహద్దుల్లోకి అక్కడి నుంచి వివిధ మార్గాల్లో జనావాసాల్లోకి వస్తోంది. దీంతో ఈ అలర్జీ బారిన పడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. చదవండి నాన్న చనిపోయారు.. కానీ ఆయన గుండె చప్పుడు విన్నారు.. -
Swiggy: స్విగ్గీ నిర్వాకం.. వెజ్ బిర్యానీలో చికెన్ పీస్.. మండిపడ్డ కస్టమర్
స్విగ్గీలో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసిన ఓ శాకాహారికి చేదు అనుభవం ఎదురైంది. పార్సిల్ ఓపెన్ చేసి తింటున్న ఆమెకు ఊహించని విధంగా బిర్యానీలో చికెన్ ముక్క కన్పించింది. దీంతో స్వచ్ఛమైన వెజిటేరియన్ అయిన ఆమె.. స్విగ్గీ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బిర్యానీలో మాంసం ముక్క ఫొటో, ఆర్డర్ బిల్లు వంటి వివరాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసి మండిపడింది. ఈ కస్టమర్ పేరు నటాషా భరద్వాజ్. తన విశ్వాసాలకు విఘాతం కల్గించేలా చేసిన స్విగ్గీపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పులు ఎంతమాత్రము ఆమోదయోగ్యం కాదన్నారు. నిజమైన శాకాహారులు స్విగ్గీలో ఆర్డర్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి అని ఇతర కస్టమర్లకు సూచించారు. If you’re a strict vegetarian (like me) think twice before ordering from @Swiggy ! I ordered biriyani rice with aloo which is clearly MARKED AS VEGETARIAN on the platform and I found a piece of meat (could be chicken, mutton or anything!) in the rice. Such grave errors are… pic.twitter.com/h7K57CPML4 — Natasha Bhardwaj (@bhardwajnat) April 11, 2023 ఈ విషయంపై స్విగ్గీ ఎగ్జిక్యూటివ్స్‌కు ఫిర్యాదు చేస్తే వారికి అసలు బాధగా లేదని నటాషా అసహనం వ్యక్తం చేశారు. అది నాన్ వెజ్ రెస్టారెంట్ అని, అయినా స్విగ్గీలో వెజ్ రెస్టారెంట్‌గా ఎందుకు మార్క్ చేసుకున్నారో తెలియడం లేదని వారు బదులిచ్చారని చెప్పారు. ఈ మహిళ ట్వీట్‌కు స్విగ్గీ కూడా బదులిచ్చింది. మా రెస్టారెంట్లలో ఇలాంటి మిక్స్‌ప్‌లు జరుతాయని ఊహించలేదని, దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఆర్డర్ ఐడీ చెప్పాలని సూచించింది. దీంతో మహిళ ఆర్డర్ ఐడీని కూడా స్విగ్గీకి షేర్ చేసింది. చదవండి: దడ పుట్టిస్తున్న కరోనా.. 7 నెలల గరిష్టానికి కొత్త కేసులు.. మరో 7,830 మందికి పాజిటివ్.. -
Medak: చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని మహిళ మృతి
సాక్షి, మెదక్ : చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాద ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఒడిశాకు చెందిన సంతోషి(30) అనే మహిళ కూలి పనుల కోసం వలస వచ్చింది. ముసాయిపేట్ మండలం కొప్పులపల్లి గ్రామ శివారులో ని ఇటుక బట్టీలలో పని చేసుకుంటూ జీవిస్తుంది. మంగళవారం తూప్రాన్ సంతకు వెళ్లిన మహిళ.. మద్యం సేవించి ఇంటికి వచ్చింది. అనంతరం ఇంట్లో చికెన్ వండుకుని తింటున్న సమయంలో చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తూప్రాన్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మహిళ చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. వెల్దుర్తి ఎస్ఐ మధుసూదన్ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: ‘సాక్షి’ చేతిలో సాత్విక్ సూసైడ్ నోట్.. నివ్వెరపోయే విషయాలు -
ఫ్రెష్‌టుహోమ్ 104 మిలియన్ డాలర్ల సమీకరణ
న్యూఢిల్లీ: మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించే స్టార్టప్ సంస్థ ఫ్రెష్‌టుహోమ్ తాజాగా రూ. 104 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 861 కోట్లు) సమీకరించింది. అమెజాన్ ఎస్ఎంభవ్ వెంచర్ ఫండ్, ఇతర ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన ఈ నిధులను వ్యాపార విస్తరణ కోసం వినియోగించుకోనుంది. వచ్చే ఏడాది వ్యవధిలో 100 భౌతిక రిటైల్ స్టోర్స్‌ను ప్రారంభించనుంది. 2015లో బెంగళూరు కేంద్రంగా ఫ్రెష్‌టుహోమ్ కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం దేశీయంగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 160 పైగా నగరాల్లోనూ వ్యాపారం నిర్వహిస్తోంది. ఇప్పటివరకూ 250 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించినట్లు సంస్థ సీఈవో, సహ వ్యవస్థాపకుడు షాన్ కడవిల్ తెలిపారు. ప్రస్తుతం 30 రిటైల్ స్టోర్స్ ఉండగా వచ్చే 12 నెలల్లో వీటిని 130కి పెంచుకోనున్నట్లు వివరించారు. అటు సౌదీ అరేబియాతో పాటు ఇతర దేశాల్లోనూ విస్తరించనున్నట్లు తెలిపారు. 2025 ఆఖరు నాటికి ఐపీవోకి (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) వచ్చే యోచనలో ఉన్నట్లు కడవిల్ చెప్పారు. ప్రస్తుతం తమ వార్షికాదాయం దాదాపు రూ. 1,100 కోట్లుగా ఉన్నట్లు వివరించారు. -
ఈ పిట్ట రుచికి నాటుకోళ్లు, పొట్టేలు కూడా సాటిరావు
సాక్షి, విశాఖపట్నం(తగరపువలస): సైజులో పిడికిడంత అయినా రుచిలో కముజు(కౌజు) పిట్టకు నాటుకోళ్లు, పొట్టేలు కూడా సాటిరావు అంటారు మాంసప్రియులు. నెలరోజుల వ్యవధిలోనే కోతకు వచ్చే కముజు పిట్టల పెంపకానికి పెట్టుబడి, ఖర్చూ తక్కువే. రెండింతలు ఆదాయాన్ని ఇచ్చే కముజుల పెంపకాన్ని భీమిలి మండలం పరిధిలో ఔత్సాహికులు చేపడుతున్నారు. జపాన్ బ్రీడ్ పక్షిగా పేరుపొందిన కముజుకు బ్రాయిలర్ కోళ్లకు ఇచ్చే ఫీడ్‌తో పెంచవచ్చు. కొవ్వు తక్కువ, మినరల్స్, విటమిన్లు ఎక్కువగా లభించే ఈ పిట్టలో ఐరన్ తక్కువగా ఉంటుంది. అందువల్ల మాంసానికి రుచి వస్తుంది. వీటి మాంసం మధుమేహం, రక్తపోటు అదుపులో ఉంచడానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. దీని గుడ్డు కూడా నాటుకోడి గుడ్డు కంటే ఎన్నో రెట్లు మేలు చేస్తుందంటారు. కముజు గుడ్డు ధర రూ.2. సాధారణ, నాటుకోడి గుడ్లతో పోలిస్తే వీటి సైజు అయిదు రెట్లు తక్కువగా ఉంటాయి. పిల్ల రూ.13.. పక్షి రూ.55 ఆంధ్ర– ఒడిశా సరిహద్దులోని ఇచ్ఛాపురం ప్రాంతం నుంచి కముజు పక్షులను పెంపకందారులు తెస్తుంటారు. పిల్లగా ఉన్నప్పుడు రూ.13 వంతున కొనుగోలు చేసి తెచ్చి వీటి పెంపకాన్ని చేపడతారు. రాగులు, సజ్జలు కాకుండా బ్రాయిలర్ ఫీడ్ లేదా లేయర్ ఫీడ్ స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన తాగునీరు అందిస్తే 30 రోజుల్లోనే 200–250 గ్రాములు వచ్చి కోతకు వస్తుంది. నెల రోజుల వ్యవధిలో వీటి పెంపకానికి అయ్యే ఖర్చు రూ.20 వ్యర్థాలు పోగా ఆహారంలోకి 180–200 గ్రాములు అందుతుంది. వీటిని డిమాండ్‌ను బట్టి రూ.50 నుంచి 60కు విక్రయిస్తుంటారు. హోటళ్లలో జత పక్షులను రూ.250 వరకు విక్రయిస్తుంటారు. చికెన్ వెరైటీల మాదిరిగానే కముజును కూడా మసాలు లేకుండా.. మసాలాలు చేర్చుకుని కర్రీ, ఫ్రై, తండూరి, పకోడి తదితర వంటకాలు చేసుకోవచ్చు. పిల్లల కోసం అయితే ఎనిమిది వారాల్లోనే గుడ్లు పెట్టి 15–18 రోజుల్లోనే పిల్లలను పొదుగుతాయి. ఇంక్యుబేటర్ల ద్వారా కూడా గుడ్లను పొదిగించవచ్చు. పిల్లలు బయటకు వచ్చిన తర్వాత చలికాలంలో బ్రూడర్ వద్ద 10 నుంచి 12 రోజులు, వేసవిలో 2 నుంచి ఆరు రోజులు ఉంచాలి. దీని వలన పక్షి ముడుచుకుపోకుండా ఎదగడానికి దోహదపడుతుంది. వీటిని మాంసం లేదా సంతతి వృద్ధి చేసినా రెట్టింపు నుంచి 10 రెట్ల లాభాలు ఆర్జించవచ్చు. కముజుల జీవితకాలం రెండేళ్లు. నాణ్యమైన మాంసం, గుడ్ల కోసం ఒక మగ పక్షికి మూడు ఆడ పక్షులు జతగా వేయాలి. వ్యాధులు తక్కువ.. మార్కెటింగ్ ఎక్కువ కముజులకు నేలమీద తేమ కారణంగా బోరకాలు వ్యాధి సోకుతుంది. వీటిని వేరుచేస్తే ఎలాంటి మందులు వాడకుండానే తగ్గుముఖం పడుతుంది. ఇంకా వీటికి ఎలాంటి వ్యాధులు సోకవు. ప్రస్తుతం ఫంక్షన్లు, హోటళ్లు, డాబాల్లో ఉండే మెనూలలో కముజుకు ప్రాధాన్యం పెరిగింది. హోటళ్లలో ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచిన పక్షుల వలన రుచి తగ్గవచ్చు కాని ఫారాల దగ్గర ఆర్డర్లు ఇచ్చి కొనుక్కుంటే పెంపకందారులకు ఆదాయం పెరగడంతో పాటు మాంసప్రియుల జిహ్వ చాపల్యాన్ని సంతృప్తి పరచవచ్చు. కొందరు పెంపకందారులు కోళ్లకు ఇచ్చినట్టే హార్మోన్ ఇంజక్షన్లు వీటికి కూడా ఇచ్చి త్వరగా దిగుబడి సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వాటి రుచి కాస్త తగ్గవచ్చు. వ్యాధులు, జ్వరాలు వంటి పత్యాలు లేకుండా అందరూ అన్ని వేళల్లో తినగలిగే పక్షి ఇది. అన్ని వర్గాల ప్రజలకు ఇష్టమైనది కముజు గతంలో అంత తేలికగా దొరికేది కాదు. ఇది అన్ని వర్గాల ప్రజలకు ఇష్టమైన మాంసాహారం. ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ దొరుకుతున్నాయి. వీటిపై ఎలాంటి నిషేధం లేదు. బ్యాచ్‌ల వారీగా తరచూ ఆర్డర్లు వస్తే విక్రయదారులకు చేతినిండా ఆదాయమే. రెండేళ్ల వరకు వీటిపై లాభాలు పొందవచ్చు. మార్కెటింగ్ నైపుణ్యాలు అత్యంత అవసరం. – కోన గణేష్, తాళ్లవలస, భీమిలి మండలం -
ఊపిరి తీసిన మాంసం ముక్క
నవీపేట: పెళ్లి విందులో మాంసం ముక్క గొంతులో చిక్కుకుని ఒక వ్యక్తి మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం హనుమాన్ ఫారమ్ శివారులోని ఓ ఫంక్షన్లో హాల్లో శనివారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. నవీపేటకు చెందిన రమణాగౌడ్ (45) పెళ్లి విందులో భోజనం చేస్తుండగా మాంసపు ముక్క గొంతుకు అడ్డుపడి ఊపిరి ఆడక కిందపడిపోయాడు. బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు స్పష్టం చేశారు. గ్యాస్ సమస్యతో పాటు హార్ట్ స్ట్రోక్ రావడంతో రమణాగౌడ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
ముక్క లేనిదే.. ముద్ద దిగేదేలే!
తెలుగింటి పాకశాలల్లో గతంలో రాజ్యమేలిన గోంగూర, ఆవకాయ ఇప్పుడు సైడ్ అయిపోయాయి. ‘తాజాకూరలలో రాజా ఎవరండీ.. వంకాయేనండీ..’అంటూ పాడుకున్న కూరగాయలేవీ తెలుగువారి పంటికి రుచించడం లేదు. ఇంటా బయటా, విందు వినోదం ఏదైనా సరే.. ముక్క లేనిదే ముద్ద దిగేదేలే.. అన్నట్టుగా మారిపోయింది. మాటామంతీ జరగాలంటే మటన్.. చీటికీమాటికీ చికెన్.. ఫుల్లు జోష్‌లో ఫిష్.. వెరైటీగా కావాలంటే ప్రాన్స్, బర్డ్స్.. ఎన్ని రకాల మాంసం ఉంటే అంత సరదా. సండే లేదు మండే లేదు.. అన్నీ నాన్‌వెజ్‌డేలే అయిపోయాయి. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ తాజా గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. –సాక్షి, హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో మాంసం వినియోగం ఎక్కువ. ఇందులోనూ తెలంగాణ టాప్‌లో, ఏపీ మూడో స్థానంలో ఉండటం విశేషం. గొర్రెలు, మేక మాంసం వృద్ధిలో తెలంగా ణ.. చేపలు, రొయ్యల ఉత్పత్తితో ఏపీ ముందంజ లో ఉంది. ఇంకోవైపు చికెన్, గుడ్లు అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నవి కూడా తెలుగు రాష్ట్రాలే. దమ్ బి ర్యానీ, పాయ, తలకాయ, కీమా, నాటు కోడి ఇగురు, చేపల పులుసు, రొయ్యల ఫ్రై, ఎండు చేపల వంకాయ ఇలా చెప్పుకుంటూ పోతే జిహ్వకో రుచి అన్నట్టుగా మాంసం వంటకాల జాబితా చాంతాడును మించి ఉంటోంది. ఫంక్షన్లలో అయితే ఎన్నో వెరైటీల డిష్‌లను వడ్డిస్తుండటం కనిపిస్తోంది. దేశంలో తెలంగాణనే టాప్ మాంసాహార వినియోగంలో దేశంలో తెలంగాణదే హవా. తినడమే కాదు ఉత్పత్తిలోనూ మన రాష్ట్రానిదే అగ్రస్థానం. ఉత్పత్తి పెరుగుతున్నా వినియోగం అధికంగా ఉండటంతో ధరలూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లలో మాంసం ఉత్పత్తి దాదాపు రెట్టింపు అయింది. మరోవైపు గత నలభై ఏళ్లకాలంలో మాంసం ధరలు 30రెట్లు పెరగడం గమనార్హం. జాతీయ వార్షిక తలసరి మాంసం వినియోగం 5.4 కేజీలుకాగా.. అదే తెలంగాణలో అంతకు నాలుగు రెట్లు ఎక్కువగా అంటే 21.17 కిలోల మాంసం వినియోగిస్తున్నారు. గతంలో తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి రోజూ 700–800 లారీల గొర్రెలు, మేకలు దిగుమతి అయ్యేవని.. రాష్ట్రంలో గొర్రెలు/మేకల సంఖ్య పెరగడంతో దిగుమతి చేసుకునే లారీల సంఖ్య 100 వరకు తగ్గిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగం ఇలా.. గ్రామీణ భారతీయుల్లో 6.4% మంది మటన్, 21.7 % మంది చికెన్, 26.5 % మంది చేపలు, 29.2% మంది గుడ్లు తింటున్నట్టు నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ డేటా చెబుతోంది. పట్టణాల్లో 21% మంది మటన్, 21% మంది చేపలు, 27% చికెన్, 37.6% మంది గుడ్లను వినియోగిస్తున్నారు. రాజస్తాన్‌లో శాకాహారులే అధికం రాజస్తాన్‌లో శాకాహారులు అత్యధిక సంఖ్యలో ఉండటం విశేషం. ఆ రాష్ట్రంలో 73.2 శాతం పురుషు లు, 76.6 శాతం మహిళలు శాకాహారులే. ఇక హరియాణాలో 68.5శాతం పురుషులు, 70 శాతం మ హిళలు.. పంజాబ్‌లో 65.5శాతం పురుషులు.. 68 శాతం మంది స్త్రీలు శాకాహారాన్నే ఇష్టపడుతుండటం విశేషం. రూ.7,200 కోట్ల సంపద సృష్టించాం ‘‘2017లో ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంతో మాంసం ఉత్పత్తిలో విప్లవాత్మక మా ర్పులు వచ్చాయి. దీనికి ముందు రాష్ట్రంలో మటన్ ఉత్పత్తి 5.4 లక్షల టన్నులుగా ఉంటే, ప్ర స్తుతం 10.04 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. 2014– 15లో సాలీనా తల సరి మాంసం లభ్యత 12.95 కేజీలుకాగా అదిప్పుడు 22.70 కేజీలకు చేరింది. గొర్రెల పెంపకానికి ఇ ప్పటివరకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేశాం. తద్వారా రూ.7,200 కోట్ల సంపద సృష్టించాం. – దూదిమెట్ల బాలరాజు యాదవ్, తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ -
తాళి కడుతున్న ముందే చెప్పు.. విందులో నాన్‌వెజ్ పెడుతున్నారుగా..!
తాళి కడుతున్న ముందే చెప్పు.. విందులో నాన్‌వెజ్ పెడుతున్నారుగా..! -
పెళ్లి భోజనంలో మాంసం పెట్టరా? వరుడి ఫ్రెండ్స్ గొడవ.. వివాహం రద్దు..
జీడిమెట్ల: పెళ్లిలో పెట్టిపోతలకంటే కీలక పాత్ర పోషించేది పెళ్లి విందు. ఆ విందులో వధువు తరఫున వారు మాంసం పెట్టలేదన్న కోపంతో పెళ్లి రద్దు చేసుకున్నారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని, కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఈ నెల 30న పెళ్లి చేసేందుకు ఇరువర్గాల వారు ఒప్పుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జగద్గిరిగుట్ట రింగ్‌బస్తీకి చెందిన అబ్బాయికి కుత్బుల్లాపూర్‌కు చెందిన అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది. 28వ తేదీ తెల్లవారుజామున 3గంటలకు పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. బంధువులంతా షాపూర్‌నగర్‌లోని ఓ కల్యాణ మండపానికి చేరుకున్నారు. వధువు కుటుంబీకులు ఏర్పాటు చేసిన విందులో అందరూ భోజనం చేస్తున్నారు. చివరిబంతిలో పెళ్లి కొడుకు మిత్రులు కూర్చున్నారు. వారికి వెజ్ ఐటమ్స్ వడ్డించారు. దీంతో కొంతమంది లేచి ‘మాంసాహారం లేదా’అని అడిగారు. లేదని వధువు కుటుంబీకులు చెప్పడంతో.. విందులో మాంసం పెట్టకపోవడమేమిటని వరుడి స్నేహితులు వధువు బంధువులతో వాగ్వాదానికి దిగారు. అలా తిండి దగ్గర మొదలైన గొడవ ఇరువర్గాలు కొట్టుకునేవరకు వెళ్లింది. దీంతో పెళ్లి రద్దు అయినట్లు ప్రకటించారు. కాస్త నెమ్మదించాక విషయం పోలీసుల వరకూ వెళ్లింది. జీడిమెట్ల సీఐ పవన్.. ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో నవంబర్ 30(రేపు)న పెళ్లి జరిపించేందుకు ఇరు వర్గాలు ఒప్పుకున్నారు. చదవండి: ఎయిర్‌పోర్టులో కొత్త టెర్మినల్ ప్రారంభం -
నాటుకోడికి ఫుల్ గిరాకీ.. ఆ టేస్టే వేరు.. రోజుకు వెయ్యి లాభం!
గూడూరు(తిరుపతి జిల్లా): మాంసంప్రియుల ట్రెండ్ మారింది. మటన్ కొనే స్థోమత లేని వారంతా ఆరోగ్యాన్ని, అంతకుమించి రుచికి ప్రాధాన్యతనిస్తూ నాటుకోడి వైపు పరుగులు తీస్తున్నారు. బ్రాయిలర్ కోళ్ల మాంసంకంటే గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన నాటుకోళ్ల మాంసం రుచిగా ఉండటంతో కాస్త ధర ఎక్కువైనా ఎక్కడెక్కడ దొరుకుతాయా అని రెక్కలు కట్టుకొని తిరుగుతున్నారు. ఈ మార్పుతో నాటుకోళ్ల పెంపకం సైతం అధికమైంది. పల్లెల్లో అధికంగా దొరికే నాటుకోళ్లను కొందరు అదేపనిగా కొనుగోలు చేసి, ఆదివారం రోజు పట్టణాల్లో విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక పాత బస్టాండ్ ప్రాంతంలోని ద్రైపది కాంప్లెక్స్ ప్రాంతం ఆదివారం నాటుకోళ్ల సంతను తలపిస్తోంది. ఒకప్పుడు పల్లెల్లో నాటు కోళ్లను పెంచుకుని, పండుక్కో పబ్బానికో కోసుకుని ఇంటిల్లిపాదీ సంతోషంగా గడిపేవారు. కాల క్రమంలో వాటిని పెంచడంతోపాటు ఇతర ఇబ్బందుల నేపథ్యంలో పెంచేవాళ్లు తగ్గుతూ వచ్చారు. ఈ కారణంగానే చిన్న చిన్న పల్లెల్లోనూ చికెన్ సెంటర్లు పుట్టగొడుల్లా పుట్టుకొచ్చాయి. అయితే నాటుకోడి రుచి తెలిసిన పల్లె జనానికి బ్రాయిలర్ కోడి రుచించలేదు. ఫ్రీజర్లలో నిల్వ చేస్తుండటం.. చెన్నై నుంచి తక్కువ ధరకు తీసుకొచ్చి కిలో రూ.99 బోర్డులు పెడుతుండటంతో ప్రజల్లో అనుమానం అధికమైంది. ఎందుకొచ్చిన గొడవ అని.. నాటుకోడి తింటే పోలా అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. అంతెందుకు.. హోటళ్లలోనూ నాటుకోడి, రాగి సంగటి బోర్డులు చూస్తే వాటికి పెరిగిన డిమాండ్ ఇట్టే అర్థమవుతోంది. క్రమంగా పెరుగుతున్న పెంపకం మారిన మాంసం ప్రియుల అభిరుచికి అనుగుణంగా నాటుకోళ్లకు గిరాకీ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో వాటి పెంపకం కూడా అధికమైంది. కొందరు వ్యాపారులు పల్లెలకు వెళ్లి నాటుకోళ్లను కొనుగోలు చేసి తీసుకొచ్చి పట్టణాల్లో విక్రయిస్తున్నారు. ఇక చాలాచోట్ల నాటుకోళ్లను షెడ్లలోనూ పెంచుతున్నారు. వీటిలోనూ రకాలు ఉండటంతో, అందుకు అనుగుణంగా ధర ఉంటోంది. దాదాపుగా మటన్ ధరకు సరితూగుతూ... నాటు కోడి మాంసం దాదాపుగా మటన్ ధరకు సరితూగుతోంది. మటన్ ధర కిలో రూ.800 నుంచి రూ.1000 వరకూ పలుకుతోంది. ఇదే స్థాయిలో ఒకటిన్నర కిలో బరువున్న నాటుకోడి ధర రూ.700 వరకు ఉంటోంది. వ్యర్థాలన్నీ పోనూ సుమారు కిలో మాంసం ఇంటికి చేరుతుంది. అయితే నాటుకోడి అయితే, ఎలాంటి ఆలోచన లేకుండా ఇంటికి తీసుకెళ్లొచ్చు. అదే మటన్ అయితే, ఏది అంటగట్టారోననే అనుమానం తిన్నా తీరదు. ఇంకేముంది.. నాటు, నాటు పాటను గుర్తుకు తెచ్చుకొని ఎంచక్కా లొట్టలేసుకుంటూ నాటుకోడిని ఆరగించేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం విశేషం. నాటుకోళ్లకు డిమాండ్ నేను బేల్దారి పనిచేస్తుంటా.. ఆదివారం మాత్రం నాటు కోళ్లు తీసుకొచ్చి అమ్ముతుంటా. ఒక్కో రోజు వెయ్యి వరకూ మిగులుతుంది. వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. పల్లెటూళ్లలో పెరిగిన కోళ్లు కావడంతో రుచితో పాటు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొనుగోళ్లు చేస్తుంటారు. – రమేష్, గూడూరు ఆ రుచే వేరబ్బా బ్రాయిలర్ కోడి మాంసం తిన్నట్టే ఉండదు. ఆదివారం ముక్క లేనిదే ముద్ద దిగదు. మటన్ తెచ్చుకుందామంటే ఆ ధర వింటేనే అమ్మో అనిపిస్తుంది. అందుకే నాటుకోడి ఎక్కడ దొరుకుందా అని చూస్తుంటా. రాగి సంగటి కాంబినేషన్ ఉండనే ఉంది. ఆ టేస్టే వేరు. – శ్రీనివాసులురెడ్డి, గూడూరు చదవండి: రూమ్‌కు తీసుకెళ్లి రోల్డ్‌గోల్డ్ ఉంగరం తొడిగి.. పెళ్లయిపోయిందని నమ్మించి.. -
సాకర్ సమరం.. 1800 కిలోల మాంసం వెంట తెచ్చుకున్న ఫుట్‌బాల్ జట్లు
ఫుట్‌బాల్ సాకర్ సమరానికి సమయం అసన్నమైంది. ఖాతార్ వేదికగా ఆదివారం (నవంబర్ 20) ఫిఫా వరల్డ్‌కప్-2022 ప్రారంభం కానుంది. ఆతిథ్య ఖతార్, ఈక్వెడార్ మధ్య మొదటి మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. అయితే ఈ మెగా ఈవెంట్‌కు ముందు ఓ ఆసక్తికర విషయం ఒక్కటి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు వచ్చిన అర్జెంటీనా, ఉరుగ్వే జట్లు ఏకంగా 4,000 పౌండ్ల(1800) కిలోల మాంసం తీసుకువచ్చాయి. దక్షిణ అమెరికాకు చెందిన ఈ రెండు ఫుట్‌బాల్ పవర్‌హౌస్‌లు తమ హోం ఫుడ్ రుచిని కోల్పోకుండా ఉండడానికి ఇంత మొత్తంలో మంసాన్ని తీసుకువచ్చాయి. అయితే ఈ ఫుడ్‌ను ఖతార్‌కు తరలించేందుకు రెండు దేశాల ఫుట్‌బాల్ అసోసియేషన్లు భారీ ఏర్పాట్లు చేశారు. కాగా ఉరుగ్వే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీట్ ఆ దేశ ఫుట్‌బాల్ అసోసియేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుని మాంసాన్ని సరఫరా చేస్తుంది. ఇక ఈ విషయంపైఉరుగ్వే ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇగ్నాసియో అలెన్సో స్పందించారు. "మా జట్టుతో పాటు అత్యధిక పోషణ గల ఆహారాన్ని కూడా తీసుకువెళ్లాము. ప్రపంచంలోనే ఉరుగ్వే మాంసం అత్యుత్తమైనది" అని ఇగ్నాసియో అలెన్సో ఈస్పీఎన్తో పేర్కొన్నారు. కాగా దక్షిణ అమెరికా దేశాలలో మాంసంతో తయారుచేసే అత్యంత ప్రసిద్ద వంటకాల్లో 'అసాడో' ఒకటి. యూఏఈతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో 5-0 తో గెలిచిన తర్వాత ఈ అసాడోను అర్జెంటీనా జట్టు టెస్టు చేసింది. ఉరుగ్వే కూడా కూడా అబుదాబి స్టేడియంలో అసాడోను రుచి చూసింది. చదవండి: FIFA WC 2022: ఫిఫా చరిత్రలో మాయని మచ్చలా ఐదు వివాదాలు -
Bengaluru: మాంసం, మద్యం విక్రయాలు బంద్
సాక్షి, బెంగళూరు: మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నేడు (అక్టోబర్ 2న) బెంగళూరు గ్రామీణ జిల్లాలో మాంసం, మద్యం విక్రయాలను నిషేధిస్తూ కలెక్టర్ లత ఆదేశాలు జారీ చేసారు. శనివారం రాత్రి 11 నుండి మరుసటిరోజు ఆదివారం రాత్రి 12 గంటల వరకూ ఈ ఆదేశాలు అమలులో ఉంటాయి. ప్రజలు ఈ ఆదేశాలను తప్పకుండా పాటించాలని కలెక్టర్ కోరారు. చదవండి: (పోలీసుల మాస్టర్‌ప్లాన్: మొబైల్ చోరీకి గురైతే పనికి రాకుండా ప్లాన్) -
ముక్క.. పక్కాయేనా..?
అనంతపురం నాల్గో రోడ్డులో రమేష్ కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. కొన్ని రోజుల క్రితం వీరింటికి బంధువులొచ్చారు. చాలా రోజులకు ఇంటికి రావడంతో ప్రత్యేక వంటకాలతో వారిని సంతోష పెట్టాలని.. రమేష్ స్థానికంగా ఉండే ఓ మటన్ దుకాణానికి వెళ్లి కేజీ పొట్టేలు మాంసం తెచ్చి భార్యతో కూర చేయించాడు. ఏమైందో తెలియదు.. తిన్న కొద్దిసేపటికీ వారందరికీ ఒకటే విరేచనాలు. ఆస్పత్రికి వెళ్లి రూ. వెయ్యి ఖర్చు చేస్తే గానీ ఉపశమనం లభించలేదు. అనంతపురంలోనే కాదు.. ఉమ్మడి జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా ఎక్కడపడితే అక్కడ వెలిసిన మాంసం దుకాణాలు ప్రజల ఆరోగ్యాలను గుల్ల చేస్తున్నాయి. రాయదుర్గం: పెళ్లయినా, ఇతర ఏ ఫంక్షన్ అయినా ప్రస్తుత రోజుల్లో నాన్‌వెజ్ అంటేనే ప్రజలు ఉత్సాహం చూపుతారు. కరోనా నేపథ్యంలో రోగనిరోధక శక్తిపై అవగాహన పెరకడంతో మాంసాహారంపై మరింత ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ధరలు ఆకాశాన్నంటినా ఆదివారమొస్తే కచ్చితంగా తినాల్సిందేనంటున్నారు. అయితే, దీన్నే అదునుగా తీసుకున్న కొందరు వ్యాపారులు ఎక్కడపడితే అక్కడ దుకాణాలు ఇష్టానుసారంగా నెలకొల్పి అపరిశుభ్ర వాతావరణంలో కార్యకలాపాలు సాగిస్తూ వారి ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. నిబంధనలు ఇలా.. కబేళాలు, మాంసాహార దుకాణాలు ఏర్పాటు చేయాలంటే ముందుగా మున్సిపల్, పంచాయతీ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఏర్పాటు చేసిన కబేళా (స్లాటర్ హౌజ్)ల్లోనే జీవాలను వధించాలి. వధించే ముందు పశువైద్యాధికారి జీవాలకు ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. వధించిన తర్వాత పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తిస్తే విక్రయించేందుకు వీలుగా మెడ భాగంలో ధ్రువీకరణ ముద్ర వేస్తారు. వినియోగదారులు ఆ ముద్రను చూసి కొనుగోలు చేస్తే కొంత భరోసా ఉంటుంది. జరుగుతోంది ఇలా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కనీస ప్రమాణాలు పాటించడం లేదు. కొన్నింటిని కబేళాల్లో వధిస్తున్నా.. పశు వైద్యాధికారి ధ్రువపరచడం లేదు. మరికొందరైతే దుకాణాల ఆవరణలోనే వధిస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో అయితే పట్టించుకునే వారే లేరు. అటు స్థానిక అధికారులు, ఇటు పశు సంవర్ధక శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో దుకాణదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ దుకాణాలు తెరుస్తున్నారు. పలు వ్యాధులతో చనిపోయిన జీవాలను సైతం ఎక్కడో వధించి తీసుకొస్తూ ప్రజలకు కట్టబెట్టేస్తున్నారు. ఆరోగ్యాలను హరిస్తున్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో చాలా చోట్ల ఉన్న కబేళాలను మళ్లీ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు నిబంధనలు పక్కాగా అమలు చేస్తే ప్రజలకు ఎంతో మేలు చేకూర్చినట్లవుతంది. నెలకోసారి కొంటాం పెద్దల సాంప్రదాయ ప్రకారం ఇంట్లో కోడి మాంసం వండటం లేదు. దీంతో మేక, పొట్టేలు మాంసం కొనాల్సి వస్తోంది. పెద్ద కుటుంబం కావడంతో మూడు కిలోలు కొంటాం. ధర తక్కువ ఉన్నప్పుడు వారానికి రెండు సార్లు కొని తిన్నాం. ప్రస్తుతం నెలకు ఒకసారి కూడా తెచ్చుకోలేని పరిస్థితి. – బోయ శివన్న, రైతు, రంగచేడు కమిషనర్లకే చర్యలు తీసుకునే అధికారం కబేళాల ఏర్పాటు, మాంసం నాణ్యతగా ఉండేలా చూడడం, అపరిశుభ్రత ఉంటే చర్యలు తీసుకోవడం తదితర చర్యలు చేపట్టే అధికారం మున్సిపల్ కమిషనర్లకు ఉంది. మాకు సమాచారం ఇస్తే వైద్యాధికారులు వెళ్లి జీవం ఎలా ఉందో ధ్రువీకరిస్తారు. ప్రాథమిక పరీక్షల్లోనే ఆరోగ్యంగా ఉన్నది లేనిది తెలుస్తుంది. అవసరమైతే వధించిన తర్వాత జీవాల పరీక్షలకు ల్యాబ్ కూడా అందుబాటులో ఉంది. ఆరోగ్యంగా ఉండే మాంసం విక్రయించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలి. లేదంటే కఠిన చర్యలు చేపడతాం. – ఏవీ రత్నకుమార్, జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ, అనంతపురం నాణ్యతలేని మాసం విక్రయిస్తే కఠిన చర్యలు రాయదుర్గంలో అధికారికంగా జంతుశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం. ప్రస్తుతం మార్కెట్ వద్దే స్థలం కేటాయించి వ్యాపారాలు చేపట్టేలా ఆదేశాలిచ్చాం. అక్కడ కాకుండా పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ విక్రయాలు సాగిస్తున్నట్టు మా దృష్టికి వస్తున్నాయి. మూగజీవాలు ఆరోగ్యంగా ఉన్నాయా..? లేదా అని పశు వైద్యులు గుర్తించాకే వధించాల్సి ఉంటుంది. వ్యాధుల బారిన పడ్డ, మృతి చెందిన వాటి మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. స్పెషల్ డ్రైవ్ నిర్వహించేలా సిబ్బందికి ఆదేశాలు కూడా జారీ చేస్తాం. – దివాకర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, రాయదుర్గం -
ఆగస్టు 31న మాంసం విక్రయాలు, జంతు వధ నిషేధం
కర్ణాటక: బెంగళూరులో ఆగస్టు 31న మాంస విక్రయాలను, జంతు వధను నిషేధించారు. ఈ మేరకు బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) ఆగస్టు 31న గణేష్ చతుర్థి సంధర్భంగా ఈ నిషేధాన్ని విధించినట్లు పేర్కొంది. అంతేకాదు నిషేధం విధిస్తూ పౌరసరఫరాల సంస్థ సర్యులర్ కూడా జారీ చేసింది. పైగా మరింత సమాచారం కోసం నిషేధం కాఫీని కూడా జత చేసింది. పశుసంవర్ధక శాఖ జాయింట డైరెక్టర్ బృహత్ బెంగళూరు మహానగర కార్పొరేషన్ పరిధిలోని దుకాణాల్లో జంతువులను వధించడం మాంసం విక్రయించడం నిషేధమని తెలియజేశారు. ఇంతకమునుపు ఈ నెల ప్రారంభంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కూడా మాంసం అమ్మకాలను, జంతువులను చంపడాన్ని నిషేధిస్తూ పౌర సరఫరాల శాఖ సర్క్యులర్ జారీ చేసింది. (చదవండి: హిజాబ్ వ్యవహారం: కర్ణాటక హైకోర్టు తీర్పుపై సుప్రీంలో వాదనలు.. ఇష్టానుసారం కుదరదంటూ పిటిషనర్లకు మందలింపు) -
నాన్‌వెజ్ ప్రియులకు షాక్.. వంద కిలోల కుళ్లిన మాంసం
సాక్షి, విజయవాడ: వన్‌టౌన్ కొత్తపేట హనుమంతరావు చేపల మార్కెట్లో సుమారు వంద కిలోల కుళ్లిన మాంసాన్ని నగరపాలక సంస్థ సిబ్బంది నిర్వీర్యం చేశారు. చేపల మార్కెట్లోని పలు దుకాణాలపై నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది ఆదివారం దాడులు నిర్వహించారు. పలు దుకాణాల్లో నిల్వ ఉంచిన మంసాన్ని గుర్తించారు. అందులో కుళ్లిన కోడిమాంసం, పొట్టేలు తలకాయ, చేపలను నిల్వ ఉంచినట్లుగా గుర్తించారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ ఎ.రవిచంద్, తన సిబ్బందితో కలసి దాడులు చేశారు. మార్కెట్లో ఉంచిన మాంసాన్ని స్వాధీనం చేసుకొని, దానిపై బ్లీచింగ్ చల్లి నిర్వీర్యం చేసి గోతిలో పూడ్చివేశారు. ఈ మాంసాన్ని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. మాంసంలో పేగులను తొలగించి శుభ్రపరచి పొట్టలో ఐస్ వేసి విజయవాడ ఫిష్ మార్కెట్లో తీసుకొచ్చారని, ఇది పూర్తిగా కుళ్లి రంగు మారిందని నిర్ధారించారు. దీనిని విక్రయిస్తున్న దుకాణాలకు ప్రజారోగ్య చట్టం కింద నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ రవిచంద్ మాట్లాడుతూ.. నగరంలో ఎవరైనా నిల్వ చేసిన మాంసం విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కుళ్లిన మాంసాన్ని తినడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతారని పేర్కొన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి సూక్ష్మంగా పరిశీలన చేసిన తరువాతే మాంసం కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా సూచించారు. చదవండి: (ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ కేసులో మరో ట్విస్ట్) -
Swiggy: రచయితకు చేదు అనుభవం.. రూ.70 వాపస్ చేస్తామనడంతో..
తమిళ పాటల రచయిత కో శేషాకు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ప్యూర్ వెజిటేరియన్ అయిన ఆయన స్విగ్గీ పుణ్యామా అని మాంసం రుచి చూడాల్సి వచ్చింది. శేషా బెంగళూరులో స్టే చేశాడు. ఈక్రమంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ద్వారా బుధవారం ‘గోబీ మంచూరియా విత్ కార్న్ ఫ్రైడ్ రైస్’ ఆర్డర్ చేశాడు. మాంచి ఆకలిమీదున్న ఆయన ఫుడ్ రాగానే ఆబగా తినేశాడు. కొద్దిగా తిన్న తర్వాత ఆయనకు ఫుడ్‌లో ఏదో తేడా అనిపించింది. అది వెజ్ మంచూరియా కాదని నిర్ధారణకు వచ్చి తినడం ఆపేశాడు. తనతోపాటు ఉన్న ఇద్దరు నాన్ వెజిటేరియన్ మిత్రులకు దాన్ని రుచి చూపించగా.. వాళ్లు అది చికెన్ మంచూరియా అని క్లారిటీ ఇచ్చారు. కంగుతిన్న శేషా స్విగ్గీ తప్పిదంపై కస్టమర్ కేర్‌ను సంప్రదించాడు. (చదవండి: బ్రెయిన్ పని చేయని స్థితిలో కమెడియన్) Found pieces of chicken meat in the “Gobi Manchurian with Corn Fried Rice” that i ordered on @Swiggy from the @tbc_india. What’s worse was Swiggy customer care offered me a compensation of Rs. 70 (!!!) for “offending my religious sentiments”. 1/2 pic.twitter.com/4slmyooYWq — Ko Sesha (@KoSesha) August 17, 2022 అయితే, తమ పొరపాటును గుర్తించిన సదరు సంస్థ.. ఆర్డర్ విలువ రూ.70 వాపస్ చేస్తామని బదులిచ్చింది. దీంతో శేషాకు చిర్రెత్తుకొచ్చింది. తన మత విశ్వాలసాలను 70 రూపాయలకు విలువ కడతారా? అంటూ విమర్శలు గుప్పించాడు. చెత్త సర్వీస్ అంటూ ట్విటర్ వేదికగా గరం అయ్యాడు. పుట్టు వెజిటేరియన్ అయిన తనకు స్విగ్గీ స్టేట్ హెడ్ క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. అవసరమనుకుంటే డెలివరీ యాప్‌పై లీగల్‌గా కూడా వెళ్తానని శేషా చెప్పుకొచ్చాడు. I’ve been a strict vegetarian all my life & it disgusts me to think how casually they tried to buy my values. I demand that a representative of Swiggy, no lesser than the State Head call me to personally to apologise. I also reserve my rights to a legal remedy.@SwiggyCares — Ko Sesha (@KoSesha) August 17, 2022 కాగా, శేషా ట్వీట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కొందరు ఆన్లైన్ ఫుల్ డెలివరీల్లో ఇవన్నీ కామన్ అని అంటుండగా మరికొందరు.. స్విగ్గీ సర్వీస్ మునుపటిలా లేదని అంటున్నారు. ఇంకొందరు.. ఇదివరకు ఎప్పుడూ మాంసం తిననపుడు.. అది వెజ్ కాదు.. నాన్ వెజ్ అని ఎలా తెలిసింది? అని శేషాను ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ వివాదంపై స్విగ్గీ ట్విటర్ వేదికగా స్పందించింది. రెస్టారెంట్ పార్టనర్ వల్లే తమ కస్టమర్‌కు ఇబ్బంది కలిగిందని, తమ సర్వీస్‌లో లోపం కాదని చెప్పింది. నిజంగా పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుని.. శేషాకు వివరణ ఇస్తామని బదులిచ్చింది. (చదవండి: విధి ఆడిన వింత నాటకం: ఇష్టమైన ఆటే ప్రాణం తీసింది!) For all those who have rushed to the aid of Swiggy:https://t.co/Fwsn7mmX51 — Ko Sesha (@KoSesha) August 17, 2022 -
మాంసం కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా నయనతార
ప్రముఖ సంస్థ ఫిపోలాకు ప్రచార కర్తగా సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతారను నియమించినట్లు ఆ సంస్థ వ్యవస్థాపక సీఈఓ సుశీల్ కనుగోలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం (ఆగస్టు 7) జరిగిన సమావేశంలో సశీల్ మాట్లాడుతూ ''దక్షిణ భారతదేశంలోని అత్యత్తుమ మాంసం రిటైల్ బ్రాండ్లలో ఒకటైన ఫిపోలా ఆహార ప్రియులను ఆకర్షించడంతోపాటు మంచి ఆదరణ ఉందన్నారు. దీనిని మరింతగా విస్తరణ చేసేలా దృష్టి పెట్టాం'' అని తెలిపారు. అందులో భాగంగానే దక్షిణ భారతదేశంలో లేడీ సూపర్‌స్టార్ నయనతారను తమ బ్రాండ్ ప్రచార కర్తగా నియమించాని పేర్కొన్నారు. దీనికి నటి నయనతార ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రచార వీడియోను ఆయన ఆవిష్కరించారు. -
పులినే రమ్మంటూ బస్ విండో తెరిచాడు... అంతే ఒక్క జంప్ చేసి...
క్రూరమృగాలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న అంతే సంగతులు. ఒక్కోసారి ఏ జరుగుతుందో కూడా ఊహించలేం. ఇక్కడొక వ్యక్తి చిన్న మాంస ముద్దతో ఉన్న స్టిక్‌ని ఎర చూపి బస్ విండో తీసి మరీ రమ్మంటూ సైగ చేశాడు. అంతే ఆ తర్వాత ఘటన చూస్తే షాక్ అయిపోతాం. ఏం జరిగిందంటే...ఒక వ్యక్తి కారు విండో కొద్దిగా తెరిచి పులిని రమ్మంటూ ఒక మాంస ముద్ద ఉన్న స్టిక్‌ని చూపిస్తాడు. అంతే పులి వేగంగా వస్తూ.. ఒక్క జంప్ చేసి విండో వద్ద నుంచుని ఆ స్టిక్‌ని లాగేసుకుంటుంది. అంతే అతను ఆ హఠాత్పరిణామానికి భయపడుతూ...నెమ్మదిగా డోర్ వేసేసుకుంటాడు. లేదంటే ఇక అంతే సంగతులు. అయినా క్రూర మృగాలతో పరాచాకాలంటే ప్రాణాలతో చెలగాడటమే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి కి ఎంత థైర్యం ఏదైనా జరిగితే అంటూ నెటిజన్లు చివాట్లు పెడుతూ ట్వీట్ చేశారు. (చదవండి: ఇంద్రుడి ఐరావతం భూమిపై పుట్టింది! ఏడు రకాల ప్రత్యేకతలు కూడా.. ) View this post on Instagram A post shared by the amazing tigers (@the_amazing_tigers) -
Vijayawada: 100 కిలోల కుళ్లిన మాంసం స్వాధీనం
సాక్షి, పటమట (విజయవాడ తూర్పు): అక్రమంగా నిల్వ ఉంచిన మాంసాన్ని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలోని కృష్ణలంక తారకరామ నగర్‌కు చెందిన హరిమాణిక్యం రాము తన ఇంట్లో అక్రమంగా మాంసం నిల్వ ఉంచారని అధికారులకు ఫిర్యాదు అందింది. వీఎంసీ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ రవిచంద్ సోమవారం తనిఖీ చేసి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. రవిచంద్ మాట్లాడుతూ హరిమాణిక్యం రాము చనిపోయిన మేకలు, గొర్రెలు తక్కువ ధరకు కొనుగోలు చేసి జంతువుల పొట్టలో పేగులు తొలగించి వాటిస్థానంలో ఐస్ ముక్కలు ఉంచి నగరానికి తరలిస్తారని తెలిపారు. ఆర్డర్లను బట్టి తెచ్చిన ఈ మాంసాన్ని రెస్టారెంట్లకు సరఫరా చేస్తారన్నారు. తారకరామానగర్‌లోని ఆయన ఇంటిలో నిల్వ ఉంచారని విషయం తెలుసుకుని దాడి చేయగా రాము వద్ద 100 కిలోలకు పైగా చనిపోయిన మేకలు, గొర్రెలు, వాటి తల, మాసం, కాళ్లు పురుగులు పట్టి ఉన్నాయని తెలిపారు. -
సామాన్యులకు కేంద్రం భారీ షాక్..
చండీగఢ్:మాంసం, చేపలు, పెరుగు, పనీర్, తేనె వంటి ఆహార పదార్థాల విషయంలో ముందే ప్యాక్ లేదా లేబుల్ చేసిన ఆహార పదార్థాలపై ఇక వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధిస్తారు. దీనితో ఆయా ఆహార పదార్థాల ధరలు మరింత ప్రియం కానున్నాయి. చెక్కుల జారీకి బ్యాంకులు వసూలు చేసే రుసుముపై కూడా జీఎస్టీ అమలవుతుంది. పన్నులను హేతుబద్ధీకరించే ఉద్దేశంతో మినహాయింపులను ఉపసంహరించుకోవడానికి సంబంధించి రాష్ట్రాల మంత్రుల బృందం (జీఓఎం) చేసిన సిఫార్సులను చాలావరకూ మండలి ఆమోదించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రారంభించిన సమయానికి (2017 జూలై 1) 14.4 శాతంగా ఉన్న సగటు జీఎస్టీ రేటు ప్రస్తుతం 11.6 శాతానికి పడిపోయిన నేపథ్యంలో దీనిని పెంచడానికి జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణ అవసరమని మండలి ప్రధానంగా భావించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఇక్కడ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో రెండు రోజుల కీలక జీఎస్టీ మండలి 47వ సమావేశం ప్రారంభమైంది. మొదటిరోజు సమావేశం మంత్రుల బృందం చేసిన పలు సిఫారసులను ఆమోదించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ప్యాక్డ్, లేబుల్డ్ ఆహార ఉత్పత్తులు పొందుతున్న పన్ను మినహాయింపులను తొలగించాలని సుదీర్ఘ చర్చ తర్వాత మండలి నిర్ణయించినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం మండలి నిర్ణయాలు ఇవీ... ♦ముందుగా ప్యాక్ చేసిన, లేబుల్ చేసిన మాంసం (ఘనీభవించిన స్థితిలోలేని పదార్ఘాలు మినహా), చేపలు, పెరుగు, పనీర్, తేనె, ఎండిన చిక్కుళ్ళు, ఎండిన మఖానా, గోధుమలు, ఇతర తృణధాన్యాలు, మెస్లిన్ పిండి, బెల్లం, పఫ్డ్ రైస్ (మూరి) సంబంధిత అన్ని ఉత్పత్తులు, సేంద్రియ, కంపోస్ట్ ఎరువుకు ఇకపై జీఎస్టీ మినహాయింపు వర్తించదు. దీనిపై ఇకపై 5 శాతం పన్ను విధింపు ఉంటుంది. ♦అదేవిధంగా చెక్కుల జారీకి (వదులుగా లేదా పుస్తక రూపంలో) బ్యాంకులు వసూలు చేసే రుసుముపై 18 శాతం జీఎస్టీ విధిస్తారు. అట్లాస్‌సహా మ్యాప్‌లు, చార్ట్‌లపై 12 శాతం లెవీ ఉంటుంది. ♦ప్యాక్ చేయని, లేబుల్ లేని, బ్రాండెడ్ కాని వస్తువులపై జీఎస్టీ మినహాయింపు కొనసాగుతుంది. ♦రోజుకు రూ. 1,000 కంటే తక్కువ ఉన్న హోటల్ గదులపై 12% పన్ను ఇకపై అమలవుతుంది. ప్రస్తుతం ఇక్కడ పన్ను మినహాయింపు ఉంది. ♦వంట నూనె, బొగ్గు, ఎల్ఈటీ ల్యాంప్స్, ప్రింటింగ్– డ్రాయింగ్ ఇంక్, ఫినిష్డ్ లెదర్ సోలా ర్ వాటర్ హీటర్‌తో సహా అనేక వస్తువుల విషయంలో ఇన్వర్టెడ్ డ్యూటీ వ్యవస్థలో సవరణను కూడా జీఎస్టీ మండలి సిఫార్సు చేసింది. రాష్ట్రాలకు పరిహారంసహా పలు కీలక అంశాలపై బుధవారం మండలి కీలక నిర్ణయం తీసుకోనుంది. -
మనుషులంతా కలిస్తే.. కిలోమీటర్ మాంసం ముద్ద!
భూమ్మీద జనాభా కొంచెం అటూ ఇటూగా 780 కోట్లు. మరి అంత మందినీ కలిపి గట్టి ముద్ద చేస్తే.. మహా అయితే ఓ కిలోమీటర్ వెడల్పుండే ఓ పెద్ద మాంసం ముద్ద తయారవుతుందట. అమెరికాకు చెందిన గణిత శాస్త్రవేత్తలు సరదాగా ఈ లెక్కలేశారు. మనుషుల శరీర సాంద్రత ఘనపు (క్యూబిక్) మీటర్‌కు 985 కిలోలుగా, సగటున ఒక్కొక్కరి బరువును 62 కిలోలుగా లెక్కించి.. అందరినీ కలిపితే ఎంత పెద్ద మాంసం ముద్ద అవుతుందో తేల్చారు. ఆ మాంసం ముద్ద.. ఈఫిల్ టవర్‌కు మూడింతలు, లేదా న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్ వెడల్పు అంత ఉంటుందని అంచనా వేశారు. ఇది మొత్తం భూమితో పోలిస్తే.. పెద్ద కొండ ముందు ఆవ గింజంత అన్నమాట. మరి సరదాగా లెక్కలేసినా.. దీనిపై వాళ్లు చేసిన కామెంట్ మాత్రం చెంప చెళ్లుమనేలా ఉంది. అదేంటో తెలుసా.. ♦‘మనుషులు ఇంత చిన్న మాంసం ముద్దను మేపడానికి అంత పెద్ద భూమిని నాశనం చేస్తున్నారు’..అని. భూమ్మీద ఉన్న మనుషులందరినీ.. అమెరికాలోని గ్రాండ్ కాన్యన్(లోయ)లో కుప్పపోస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆ దేశ శాస్త్రవేత్త ఒకరు రూపొందించిన చిత్రమిది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
మటన్ , చికెన్ అంటే భలేభలే! వారంలో 2, 3 రోజులు ఉండాల్సిందే!
ఒకప్పుడు బంధువులు వచ్చినప్పుడో.. ఏదైనా వేడుక జరిగినప్పుడో.. పండుగల సందర్భంలోనో మాంసాహారాన్ని వినియోగించేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో నాన్‌వెజ్‌ను ఇష్టంగా తింటున్నారు. ఎలాంటి సందర్భాలు లేకున్నా వారంలో రెండు మూడు రోజులు ‘ముక్క’తో ఎంచక్కా లాగించేస్తున్నారు. ఆదివారం వచ్చిందంటే ‘నీసు’ లేనిదే ముద్ద దిగనివారు కూడా ఉన్నారు. కర్నూలు (అగ్రికల్చర్): జిల్లాలో మాంస వినియోగం ఏడాదికేడాదికి పెరుగుతోంది. చికెన్, మటన్, చేపలపైనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతి నెలా రూ.217 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దీనికి అదనంగా బీఫ్, పోర్క్, గుడ్లు, కంజులు తదితర వాటిపై ప్రతి నెలా మరో రూ.20 కోట్లు వెచ్చిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 46 లక్షలకుపైగా జనాభా ఉంది. ఒక సర్వే ప్రకారం జనాభాలో 85 శాతం మంది మాంసం ప్రియులు ఉన్నారు. ఆదివారం వచ్చిందంటే వీరి ఇళ్లలో నాన్‌వెజ్ ఘుమఘుమలు ముక్కుపుటాలను అదరగొడుతుంటాయి. కొన్ని కుటుంబాలు వారంలో మూడు నాలుగు రోజులు మాంసాహారాన్ని ఆరగిస్తుండటం విశేషం. పోషకాహారం కోసం కరోనా వైరస్ వ్యాపించిన తర్వాత జిల్లాలో మాంసాహార వినియోగం గణనీయంగా పెరిగింది. రోగనిరోధక శక్తిని పెంచుకుంటే వైరస్ ఏమీ చేయలేదని డాక్టర్లు సూచించారు. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఏదో ఒక మాంసం తీసుకోవాలని చెప్పారు. వైరస్ తగ్గుముఖం పట్టినా ప్రజలు నాన్‌వెజ్‌కు దూరంగా ఉండలేకపోతున్నారు. 2020తో పోలిస్తే 10 నుంచి 15 శాతం మాంసం అమ్మకాలు పెరిగాయి. సామాన్య ప్రజలకు చికెన్ ధరలు అందుబాటులో ఉన్నాయి. దీంతో మాంసాహారుల్లో 50 శాతం మంది చికెన్‌తో సరిపుచ్చుకుంటున్నారు. ప్రతి నెలా 5,440 టన్నుల వినియోగం మాంసాహారుల్లో 50 శాతం మంది చికెన్, 30 శాతం మంది మటన్, 20 శాతం మంది చేపలు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెలా కోడిమాంసం 2,400 టన్నులు, మటన్ 1,440 టన్నులు, చేపలు 1,600 టన్నుల ప్రకారం మొత్తంగా 5,440 టన్నుల అమ్మకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వీటి విలువ రూ.217 కోట్లు ఉంటోంది. అంటే ఏడాదికి 65,280 టన్నుల నాన్‌వెజ్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఏడాదికి మాంసాహారానికే రూ.2,604 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. నాణ్యత తప్పనిసరి వినియోగదారులు మాంసం ఏదైనా నాణ్యతను దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి. పశువైద్యులు ధ్రువీకరించిన తర్వాతనే పొట్టేళ్లను మాంసానికి వినియోగించాల్సి ఉంది. నాణ్యమైన మాంసం విక్రయించే విధంగా నగరపాలక సంస్థ, మున్సిపల్, పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. రికార్డు స్థాయిలో ఉత్పత్తి జిల్లాలో మాంసం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 2021–22లో లక్ష్యం 1,03,201 టన్నులు ఉండగా రికార్డు స్థాయిలో 1,09,711 టన్నులు ఉత్పత్తి అయ్యింది. జిల్లాలో ప్రతి నెలా 5,000 నుంచి 6,000 టన్నుల ప్రకారం ఏడాదికి 66 వేల టన్నుల మాంసం అమ్మకాలు జరుగుతున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో చికెన్, మాంసం, చేపలు, గుడ్ల వినియోగం గణనీయంగా పెరిగింది. – డాక్టర్ రామచంద్రయ్య,జిల్లా పశుసంవర్ధకశాఖాధికారి, కర్నూలు ఇష్టంగా తింటాం మాకు మాంసాహారమంటే ఎంతో ఇష్టం. మాంసం, చికెన్, చేపలు వినియోగిస్తాం. వారంలో రెండు, మూడు రోజులు తీసుకుంటాం. కరోనా మొదలైనప్పటి నుంచి వీటి వినియోగాన్ని పెంచాం. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రధానంగా మాంసాహారంపై దృష్టి పెట్టాం. – ఎం రాజేష్, చౌట్కూరు గ్రామం, మిడుతూరు మండలం వినియోగం పెరిగింది మేం కొన్నేళ్లుగా చికెన్ సెంటరు నిర్వహిస్తున్నాం. 2020 నుంచి చికెన్ వినియోగం గణనీయంగా పెరిగింది. కరోనా కంటే ముందుతో పోలిస్తే 10 శాతంపైగా అమ్మకాలు పెరిగాయి. సోమవారం నుంచి శనివారం వరకు రోజుకు 500 కిలోల వరకు అమ్మకాలు ఉంటాయి. ఆదివారం 1000 కిలోల వరకు ఉంటాయి. వారం రోజుల్లో వినియోగదారులకు, హోటళ్లకు మేం 3500 కిలోల చికెన్ విక్రయిస్తున్నాం. మార్కెట్లో కొన్ని నెలలుగా బ్రాయిలర్ కోళ్ల కొరత ఉంది. ఇందు వల్ల కిలో చికెన్ రూ.300 ప్రకారం విక్రయిస్తున్నాం. వారానికి గుడ్లు 5000 వరకు విక్రయిస్తున్నాం. – నాగశేషులు, ప్రకాశ్‌నగర్, కర్నూలు అమ్మకాలు ఊపందుకున్నాయి కర్నూలులోని మద్దూరునగర్‌లో మాది చిన్న షాపు. ప్రతి రోజు పొట్టేలు మాంసం అమ్ముతాం. కరోనా తర్వాత విక్రయాలు ఊపందుకున్నాయి. సోమవారం నుంచి ఆదివారం వరకు సగటున 150 కిలోల మాంసం అమ్మతున్నాం. పొట్టేళ్ల ధరలు పెరగడంతో కిలో మాంసం రూ.750 ప్రకారం విక్రయిస్తున్నాం. – షాకీర్, మద్దూర్‌నగర్, కర్నూలు -
హలాల్ V/s జట్కా.. మాంసం అమ్మకాల్లో కొత్త ట్రెండ్
సాక్షి, బెంగళూరు: హలాల్ కట్ వివాదం నేపథ్యంలో ఉగాది సందర్భంగా జట్కా కట్ మాంసం వ్యాపారం జోరుగా జరిగింది. ఆదివారం నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అంతటా మాంసం దుకాణాల వద్ద జనం క్యూ కట్టారు. హిందూ సంఘాలు హలాల్ కట్ పట్ల గత కొద్దిరోజులుగా వ్యతిరేక ప్రచారం ముమ్మరం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలాచోట్ల హలాల్ కట్ మాంసం విక్రయాలు తగ్గినట్లు సమాచారం. దొడ్డ తాలూకాలో జట్కాకట్, గ్రామీణ ప్రాంతాల్లో కుప్ప మాంసానికి డిమాండు ఎక్కువైంది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ హిందువులు జట్కా కట్ కోసం ఎగబడ్డారు. దేవనహళ్లి, రామనగర జిల్లాలో కూడా హలాల్ కట్ మాంసం దుకాణాలకు వ్యాపారం తగ్గిందని సమాచారం. ఆరా తీసి కొనుగోళ్లు అనేక చోట్ల మాంసం దుకాణాల ముందు హలాల్, జట్కా మాటలు వినిపించాయి. నగర, గ్రామీణ ప్రాంతాల్లో మాంసం దుకాణాల్లో ఎక్కువగా జట్కా మాంసం కొనుగోలు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. బెంగళూరు నగరంలో మైసూరురోడ్డు, యశవంతపుర రోడ్డు, కోరమంగల, కంఠీరవ స్టేడియం సమీపంతో పాటు నగరంలో చాలాచోట్ల హలాల్ కట్ మాంసం దుకాణాలవద్ద రద్దీ తక్కువగా కనిపించింది. కొన్ని మాంసం దుకాణాల్లో హలాల్ కట్ , జట్కా కట్ అని బోర్డులు పెట్టి విక్రయించారు. నగరంలో మైసూరు రోడ్డులోని పాపణ్ణ మటల్ స్టాల్లో మాంసం వ్యాపారం జోరుగా జరిగింది. చాలా చోట్ల కుప్పలు వేసి విక్రయించిన మాంసం కోసం ప్రజలు ఎగబడ్డారు. స్థానికులే జీవాలను కోసి విక్రయించారు. తక్కువ ధరకు ఈ మాంసం అమ్మడంతో కొనడానికి ఎగబడ్డారు. ఏ పద్ధతైనా ఓకే: మంత్రి ఈశ్వరప్ప హలాల్– జట్కా వివాదాన్ని కొందరు వ్యక్తులు, పార్టీలు సృష్టించారు, ప్రజలు దీని ఫలితాన్ని అనుభవిస్తున్నారని మంత్రి కేఎస్.ఈశ్వరప్ప అన్నారు. ఆదివారం కార్కళలో మాట్లాడుతూ ముస్లింలు హలాల్ చేయాలంటే చేయనీయండి, హిందూవులు జట్కా చేయాలంటే చేయనివ్వండి అని చెప్పారు. ఈ విషయం సమాజంలో విషబీజాలు నాటే కుతంత్రం జరుగుతోందన్నారు. -
Health Tips: లేత మాంసం, కోడిగుడ్లు తిన్నపుడు విడుదలయ్యే హార్మోన్ల వల్ల..
దేహం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. సమతుల ఆహారంతోనే సమగ్రమైన ఆరోగ్యం సాధ్యమవుతుంది. వీటితోపాటు మనసు మీద ప్రభావం చూపించే ఆహారాలు కూడా ఉంటాయి. నిరుత్సాహంగా మార్చే ఆహారాలతోపాటు మనసును ఉత్తేజపరిచే ఆహారాలు కూడా ఉంటాయి. ►కార్బోహైడ్రేట్లు సెరోటోనిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తాయి. ఇది ఫీల్‌గుడ్ హార్మోన్. అందుకే మన రోజువారీ ఆహారంలో కార్బొహైడ్రేట్లు ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే మితిమీరిన చక్కెర స్థాయులు లేని కార్బోహైడ్రేట్లను తీసుకోవడం మంచిది. తిన్న తర్వాత త్వరగా జీర్ణమై రక్తంలో చక్కెర స్థాయులను పెంచే ఆహారానికి బదులుగా కూరగాయలు, బీన్స్, పొట్టు తీయని ధాన్యాలను తీసుకోవాలి. ►లేత మాంసం, కాయధాన్యాలు, కోడిగుడ్లు, చికెన్, పాలు, పాల ఉత్పత్తులలో ప్రొటీన్ సమృద్ధిగా ఉంటుంది. ఆహారంలో వీటిని తీసుకున్నప్పుడు డోపామైన్, నార్ఎపీనెఫ్రిన్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి శక్తిని ఇనుమడింప చేయడంతోపాటు మెదడును ఒక విషయం మీద కేంద్రీకృతం చేయడానికి దోహదం చేస్తాయి. ►హైలీ ప్రాసెస్డ్ ఫుడ్, డీప్ ఫ్రైలు తిన్న తర్వాత వాటిని జీర్ణం చేయడానికి దేహం ఎక్కువ శక్తిని వినియోగించాల్సి వస్తుంది. దాంతో నీరసం ఆవహించినట్లవుతుంది. కాబట్టి జిహ్వ చాపల్యాన్ని నియంత్రించుకోలేక వాటిని తిన్నప్పుడు ఇతర ఆహారం మోతాదు తగ్గించడం మంచిది. ►ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తినాలనే జాగ్రత్త పాటించడంతోపాటు ఇష్టమైన వాటిని పూర్తిగా మానేయాల్సిన అవసరం కూడా లేదు. దేహ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కోసం అవసరమైన వాటిని తింటూనే ఇష్టమైన వాటిని రోజులో ఒక్కసారికి పరిమితం చేసుకోవచ్చు. ►తరచు కొత్తిమీర చట్నీ తింటుండటం వల్ల లేదా ధనియాల పొడిలో కొద్దిగా తేనె వేసుకుని తీసుకుంటుండటం వల్ల జ్ఞాపకశక్తి మెరుగు పడుతుంది. ►వేరుశనగలో ఉండే విటమిన్–బి3... జ్ఞాపకశక్తి మెరుగయ్యేలా చేస్తుంది. చదవండి: Beauty Tips In Telugu: టమాటా... సీ సాల్ట్.. మృతకణాలు ఇట్టే మాయం! Anjeer Health Benefits: అంజీర తింటున్నారా.. ఈ విషయాలు తెలుసా? -
మాంసమే నైవేద్యంగా..
పెబ్బేరు రూరల్: అన్ని హనుమంతుడి ఆలయాల్లో సిందూరం, తమలపాకులు, టెంకాయలతో ప్రత్యేక పూజలు చేయడం చూస్తుంటాం. కానీ, చింతలకుంట ఆంజనేయస్వామికి మాత్రం మాంసం, మద్యాన్ని నైవేద్యంగా ఉంచి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం నుంచి 8 కి.మీ. దూరంలో పాతపల్లి శివారులో చింతలకుంట ఆంజనేయస్వామి కొలువుదీరాడు. ఇక్కడ ఏటా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మూడు రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. తాము కోరుకున్న కోరికలు తీరిన భక్తులు కోళ్లు, పొట్టేళ్లను స్వామి వారికి బలిస్తారు. దీంతోపాటు కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు స్వామివారి సన్నిధిలో పొట్టేళ్లను బలిచ్చి పూజలు చేస్తారు. శుక్రవారం పలువురు భక్తులు కోళ్లను బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. చరిత్ర..: ఈ ఆలయం చుట్టుపక్కల చింతచెట్లు ఎక్కువగా ఉండడంతో అప్పట్లో రాక్షసులు ఎక్కువగా సంచరించేవారట. మనుషులు, పశుపక్షాదులను చంపుతుండటంతో ప్రజలు రక్షించాలని హనుమంతుడిని వేడుకోవడంతో ఆయనే ఇక్కడ కొలువై రాక్షసకాండకు ముగింపు పలికాడని చెబుతారు. ఈక్రమంలోనే రాక్షసులంతా హనుమంతుడిని వేడుకోవడంతో.. భక్తులు వారి ఇష్టపూర్తితో తనకు జంతువులను బలి ఇస్తారని, వాటితో కడుపు నింపుకోవాలని, మనుషుల జోలికి వెళ్లవద్దని చెప్పినట్లు ఓ కథ ప్రచారంలో ఉంది. అయితే శ్రీరంగాపూర్ మొదటి పరిపాలన రాజు వాసుదేవరావు సైతం తాను అనుకున్నది నెరవేరడంతో గుడిని నిర్మించారు. గుడి సమీపంలో చింతల చెరువు ఉండటంతో చింతలకుంట ఆంజనేయస్వామి అని పేరొచ్చిందని చెబుతారు. -
శాఖాహార ‘చికెన్’! కేఎఫ్‌సీ అరుదైన ప్రయోగం
కెంటకీ ఫ్రైడ్ చికెన్ (KFC) అరుదైన ప్రయోగానికి సిద్ధపడింది. ప్లాంట్ బేస్డ్ చికెన్‌ను కస్టమర్ల కోసం తీసుకురాబోతోంది. అంటే అది శాకాహార చికెన్!!. మొక్కల నుంచి ఉత్పత్తి అయ్యే ‘మాంసం లాంటి’ ఫుడ్ అన్నమాట. జనవరి 10న అమెరికాలో బియాండ్ మీట్ పేరుతో ఈ ‘మాంసం కానీ మాంసం(చికెన్)’ ఫ్రైడ్ రుచులను కస్టమర్లకు అందించబోతోంది. వాస్తవానికి గత కొన్నేళ్లుగా మాంసం పత్యామ్నాయాల కోసం పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ల్యాబ్‌లో పెంచుతున్న మాంసం, తక్కువ మాంసం మోతాదు ఉన్న ఉత్పత్తులతో పాటు మాంసానికి ప్రత్యామ్నాయంగా మొక్కల ఆధారిత మాంసం మీద పరిశోధకులు ఫోకస్ ఉంటోంది. లెగ్యుమెస్ (సోయాబీన్స్, లెంటిల్స్), క్వినోవా లాంటి ధాన్యాలు, కోకోనట్ ఆయిల్, సెయిటన్, పచ్చి బఠానీ లాంటి ప్రొటీన్లు ఉన్న కూరగాయల్ని, ఇతరత్రాల్ని ప్లాంట్ బేస్డ్ మీట్స్‌లో ఉపయోగిస్తారు. సో.. ఇది ప్యూర్ వెజ్ మీట్ అన్నమాట. యమ్ కంపెనీలో బిగ్గెస్ట్ బ్రాండ్‌గా పేరున్న కేఎఫ్‌సీ ఒక్క అమెరికాలోనే 4వేలకు పైగా రెస్టారెంట్లను కలిగి ఉన్న విషయం తెలిసిందే. యమ్లోనే కేఎఫ్‌సీ తరపున బియాండ్ మీట్ కంపెనీ వేరుగా శాఖాహార ఫుడ్ ప్రొడక్టులతో 2019 ఆగష్టు నుంచి(అట్లాంటా కేంద్రంగా) కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇక శాఖాహార ‘చికెన్’ ప్రకటన నేపథ్యంలో బియాండ్ షేర్లు 7 శాతం మేర పెరగడం విశేషం. బియాండ్ ఫ్రైడ్ చికెన్ ధర 7 డాలర్లు(దాదాపు 500రూ. పైనే) నిర్ణయించారు. త్వరలో ఈ ఫ్రాంచైజీలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది బియాండ్ మీట్. -
అదేంటో.. ఆదివారం వస్తే ముక్కలేనిదే ముద్ద దిగట్లా!
సాక్షి, కోవెలకుంట్ల (కర్నూలు): మాంసంలో ఎముక రుచి..పుంటికూర(గోంగూర)లో పుడక రుచి అన్నారు పెద్దలు.. సామెత సంగతేమోగాని ఆదివారం వచ్చిందంటే కొందరికి ముక్కలేనిదే ముద్ద దిగదు. బంధువులు వచ్చినారనో..చిన్నోడు కలవరిస్తున్నాడనో..ఇంట్లో బాలింత ఉందనో..బలం రావాలనో.. ఏదో సాకు చూపి కూరాకు (మాంసం) తెచ్చుకునే వారు ఎక్కువే. జిల్లా జనాభా 44 లక్షలకు పైగా ఉంటే అందులో 70 శాతం మంది మాంస ప్రియులే. వీరిలో చికెన్ తినేవారు కొద్ది మంది అయితే.. మటన్ లాగించేవారు మరికొంత మంది. ధర ప్రియం అయినా చాలా మంది మటన్ కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ప్రతి ఆదివారం జిల్లాలో 40 టన్నుల వినియోగం ఉన్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కిలో రూ.600 నుంచి రూ. 800 లెక్కన రూ.3 కోట్ల మటన్‌ను జిల్లా వాసులు ఆరగించేస్తున్నారు అన్నమాట. జిహ్వకో రుచి.. తలకూర, రాగి సంకటిని ఇష్టపడే వారు కొందరైతే..జొన్న రొట్టె, బోటీ రుచి అమోఘం అనే వారు మరికొందరు. కైమాతో వేపుడు చేసుకొని కమ్మగా లాగించేవారు ఇంకొందరు. ఎవరి రుచులు ఎలా ఉన్నా..దేవనకొండ మండలం ఈదులదేవరబండలో చీకులకు సాటిరావు అనే వారు కూడా ఉన్నారు. ఆదివారం వచ్చిందంటే కోసిగి, గాజులదిన్నె, సుంకేసుల ప్రాంతాల్లోనూ కడ్డీ మాంసం నిప్పులపై వేగుతూ మాంసప్రియులను ఊరిస్తూ ఉంటుంది. ఆదోనిలో అల్పాహారంగా ‘పాయ’ ప్రత్యేకంగా నిలుస్తోంది. కోవెలకుంట్లలో మటన్ విక్రయిస్తున్న దృశ్యం ధర అధికమైనా.. సంపూర్ణ పోషక విలువలు, సంతృప్తికరమైన రుచి రెండూ ఒకేదాంట్లో దొరికే తక్కువ పదార్ధాల్లో ఒకటైన మటన్‌ను మాంసం ప్రియులు ఎంతోగానో ఇష్టపడుతున్నారు. ధర అధికమైనా కొనుగోలు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో కిలో రూ.800 అమ్ముతుండగా పల్లె ప్రాంతాల్లో రూ.600 చొప్పున విక్రయిస్తున్నారు. ఎన్ఆర్సీఎం ధ్రువీకరణ జిల్లాలోని పొట్టేళ్ల మాంసం రుచికరంగా ఉంటుంది. ఈ విషయం శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. జిల్లాలో నెల్లూరు జుడిపి, నెల్లూరు బ్రౌన్ అనే రెండు రకాల పొట్టేళ్లు పెంచుతుంటారు. సారవంతమైన నేలల్లో మొలిచే గడ్డిని మేయడంతో వీటి మాంసం రుచికరంగా ఉంటుంది. ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని జాతీయ మాంసం పరిశోధన కేంద్రం(ఎన్ఆర్సీఎం) ధ్రువీకరించింది. ప్రత్యేక సంతలు.. జిల్లాలో 25.90 లక్షల మేకలు, గొర్రెలు ఉన్నాయి. ఆదోని, డోన్, ఆలూరు, మంత్రాలయం, సంజామల, శిరివెళ్ల, కొలిమిగుండ్ల, రుద్రవరం, చాగలమర్రి, దొర్నిపాడు ప్రాంతాల్లో గొర్రెల పెంపకం దారులు అధికంగా ఉన్నారు. పత్తికొండ, నందికొట్కూరులో సోమవారం, ఆలూరులో బుధవారం, ఆదోని, గూడూరులో శుక్రవారం, కోడుమూరు, కల్లూరులో శనివారం, ఎమ్మిగనూరులో ఆదివారం ప్రత్యేక సంతలు జరుగుతాయి. ఈ సంతల్లో జీవాల క్రయవిక్రయాలు సాగుతున్నాయి. జిల్లా కేంద్రంతోపాటు నంద్యాల, ఆదోని, బనగానపల్లె, డోన్, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల తదితర పట్టణాల్లో 2,500 మటన్ షాపులు ఉన్నాయి. జిల్లాలో 25.90 లక్షల మేకలు, గొర్రెలు ఉన్నాయి. ఆదోని, డోన్, ఆలూరు, మంత్రాలయం, సంజామల, శిరివెళ్ల, కొలిమిగుండ్ల, రుద్రవరం, చాగలమర్రి, దొర్నిపాడు ప్రాంతాల్లో గొర్రెల పెంపకం దారులు అధికంగా ఉన్నారు. పత్తికొండ, నందికొట్కూరులో సోమవారం, ఆలూరులో బుధవారం, ఆదోని, గూడూరులో శుక్రవారం, కోడుమూరు, కల్లూరులో శనివారం, ఎమ్మిగనూరులో ఆదివారం ప్రత్యేక సంతలు జరుగుతాయి. ఈ సంతల్లో జీవాల క్రయవిక్రయాలు సాగుతున్నాయి. జిల్లా కేంద్రంతోపాటు నంద్యాల, ఆదోని, బనగానపల్లె, డోన్, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల తదితర పట్టణాల్లో 2,500 మటన్ షాపులు ఉన్నాయి. మటన్ అంటే ఇష్టం చికెన్ కంటే మటన్ అంటేనే ఇష్టం. కార్తీకమాసం, శ్రావణ మాసం తప్ప మిగిలిన అన్ని ఆదివారాల్లో క్రమం తప్పకుండా మటన్ తెచ్చుకుంటాం. ఇందులో ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలు ఉంటాయి. తినడానికి రుచికరంగా ఉంటుంది. – నాగభూషణంరెడ్డి, కోవెలకుంట్ల 40 కిలోలు అమ్ముతున్నాం బనగానపల్లె మార్కెట్ నుంచి పొట్టేళ్లు తెచ్చుకుంటాం. ప్రతి ఆదివారం 40 కిలోల మటన్ అమ్ముతున్నాం. రెండు నెలల క్రితం వరకు కిలో 660 రూపాయలకు అమ్మేవాళ్లం. ఇప్పుడు రూ. 600లకు విక్రయిస్తున్నాం. – మద్దిలేటి, మటన్ వ్యాపారి, కోవెలకుంట్ల -
ఛీ! యాక్!! మూడేళ్లగా పచ్చిమాంసం మాత్రమే తింటున్నాడు.. ఒక్క రోజు కూడా..
ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికీ హెల్త్ కాన్షియస్ తెగ పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో రకరకాల ఆహార అలవాట్లు ఆచరిస్తున్నారు. ఐతే భిన్న ఆహార అలవాట్లు భిన్న ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయనడంలో సందేహం లేదు. పచ్చి మాంసాన్ని రోజు వారీ ఆహారంగా తినడం అటువంటి ప్రత్యేక ఆహార అలవాట్లలో ఒకటి. అవును.. మీరు సరిగ్గానే చదివారు! ఓ వ్యక్తి గత మూడేళ్లగా పచ్చిమాంసం తింటూ ఎటువంటి అనారోగ్యం తలెత్తకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానంటూ చెబుతున్నాడు. అతనెవరో.. అది ఎలా సాధ్యమయ్యిందో తెలుసుకుందాం.. అమెరికాలోని నెబ్రస్కాకు చెందిన వెస్టన్ రో అనే వ్యక్తి మూడుళ్లుగా వండకుండా లేదా వేడిచేయకుండా మాంసం, చికెన్, గుడ్లు.. వంటి మాంస ఉత్పత్తులను పచ్చిగానే తింటున్నాడట. ఔరా! అని ముక్కు మీద వేలేసుకుంటున్నారా? అంతేకాదు.. తన విచిత్ర ఆహార అలవాట్లపై 'ది నేచురల్ హ్యూమన్ డైట్' పేరుతో యూట్యూబ్ ఛానెల్లో డాక్యుమెంట్ కూడా చేశాడట. సాల్మన్ అనే చేప, చికెన్ ఆర్గన్స్, పచ్చి మాంసం.. మొదటైన వాటిని పచ్చిగా తినడం మనం అతని వీడియోల్లో చూడొచ్చు. పచ్చి మాంసం తినే అలవాటు మీకు కొంత విడ్డూరంగా అనిపించినా... వెస్టన్ రో మాత్రం ఈ ఆహారంతో రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటున్నట్లు చెబుతున్నాడండీ!! రో తన మానసిక, శారీరక ఆరోగ్యం పూర్తిగా స్థిమితంగానే ఉందనీ, ఈ పచ్చి మాంసం ఆహారంగా తినడం ప్రారంభించిన తర్వాత ఒక్కసారి కూడా అనారోగ్యం బారీన పడ్డదాకలాలు లేవని, ఇంతవరకు ఏ ఆరోగ్య సమస్యలు తలెత్తలేదనీ.. తన ఆరోగ్యంపై పచ్చి మాంసం ఎలాంటి ప్రభావాన్ని చూపిందో ది ఇండిపెండెంట్ అనే ఆన్లైన్ న్యూస్ పేపర్‌కు వివరించాడు. కల్టివేట్ (వ్యవసాయం) చేసిన మాంసం, చికెన్, గుడ్లు.. క్రమంతప్పకుండా తింటున్నానని, ఉడికించిన ఆహారంతో పోలిస్తే మరింత శక్తినిస్తుందని డైలీ మెయిల్ అనే బ్రిటీష్ డైలీ మిడిల్ మార్కెట్ న్యూస్‌పేపర్‌కు వెల్లడించాడు. ముడి చికెన్ తరచుగా తింటే ‘సాల్మొనెల్లా’ అనే ఇన్ఫెక్షన్ బారీన పడే అవకాశం ఉంది. ఇది సాధారణంగా కలుషిత ఆహారం, నీళ్ల కారణంగా సోకుతుంది. ఎప్పుడైనా ఈ వ్యాధితో బాధపడ్డావా అని అడిగినప్పుడు, ఇది చాలా వివాదాప్సదమైన అంశం. కానీ పచ్చి మాంసంలోని బాక్టీరియా మన శరీరంలో సహజ సమతుల్యతకు దారి తీస్తుందని, ఎటువంటి హాని కలగదని న్యూయార్క్ పోస్ట్‌తో చెప్పడు. ఇతని పచ్చి మాంసం ఆహార అలవాట్ల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే అతని యూట్యూబ్ చానెల్లో తెలుసుకోవచ్చు. చదవండి: World Sight Day: ఆరెంజ్, క్యారెట్, రాగులు, ఉసిరి.. తిన్నారంటే.. మీ కంటి చూపు.. -
మూన్ జే-ఇన్ కీలక నిర్ణయం.. ఇక కుక్కల మాంసం బంద్!
సియోల్: దక్షణి కొరియా ప్రెసిడెంట్ మూన్ జే-ఇన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కుక్క మాంసం తినడాన్ని నిషేదిస్తున్నట్లు సోమవారం ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కుక్క మాంసం చాలాకాలంగా దక్షిణ కొరియా వంటకాలలో భాగంగా ఉంది. అక్కడ సంవత్సరానికి సుమారు 1 మిలియన్ కుక్కలు తింటారని అంచనా. అయితే మనుషులు కాలక్రమేణా పశువుల కంటే ఎక్కువగా జంతువులను సహచరులుగా చూస్తుండటంతో వీటి వినియోగం తగ్గింది. సోమవారం జరిగిన వారాంతపు సమావేశంలో మూన్ ప్రధానమంత్రి కిమ్ బూ-క్యూమ్తో మాట్లాడుతూ.. కుక్క మాంసం వినియోగం నిషేదించడాన్ని వివేకంతో పరిగణించాల్సిన సమయం రాలేదా? అంటూ ప్రశ్నించారు. మరోవైపు జంతు హక్కుల కార్యకర్తల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది. దక్షిణ కొరియలో పెంపుడు జంతువులను పెంచకోవడం, ఇంట్లో కుక్కలతో నివసించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ ఒక ప్రసిద్ధ జంతు ప్రేమికుడు. ఆయన కార్యాలయంలో అనేక కుక్కలను పెంచుకుంటున్నారు. చదవండి: (సిక్కు మెరైన్‌కు తలపాగా ధరించే అవకాశం.. 250 ఏళ్ల చరిత్రలో) దక్షిణ కొరియా జంతు సంరక్షణ చట్టం.. ప్రధానంగా కుక్కలు, పిల్లుల క్రూరమైన వధను అడ్డుకోవడానికి ఉద్దేశించబడిందే కానీ వినియోగాన్ని నిషేధించదు. ఈ నెలలో చేసిన ఓ సర్వే రిపోర్ట్ ప్రకారం 78% మంది కుక్క, పిల్లి మాంసం ఉత్పత్తులను, విక్రయాలను నిషేదించాలని కోరగా, 49% మంది మాంసం వినియోగ నిషేదాన్ని సమర్థించారు. అయితే మాంసం విక్రేతలు తమ వృత్తిపై హక్కు కోసం పట్టుబడుతూ, వారి జీవనోపాధి ప్రమాదంలో ఉందని చెప్తున్నారు. చదవండి: (చైనాను బూచిగా చూపుతున్నాయి!) -
కుక్కలు చంపాయి.. ఊరంతా పంచుకున్నారు
ములకలపల్లి (భద్రాద్రి కొత్తగూడెం) : దాహం తీర్చుకునేందుకు గ్రామంలోకి వచ్చిన దుప్పిపై కుక్కలు దాడిచేయడంతో మృతి చెందింది. ఈ క్రమంలో మృత్యువాత పడిన దుప్పిని కోసిన గ్రామస్తులు మాంసాన్ని పంచుకున్నారు. దీంతో అటవీ అధికారులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చాపరాలపల్లి శివారు అటవీ ప్రాంతం నుంచి ఓ దుప్పి దాహార్తి తీర్చుకునేందుకు గ్రామంలోకి వచ్చింది. ఈ క్రమంలో ఊరకుక్కలు దాడి చేయడంతో మృతిచెందింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కొందరు దుప్పిని కోసి మాంసం పంచుకున్నారు. జరిగిన విషయం అటవీ అధికారులకు తెలియడంతో ఎఫ్ఎస్ఓ కిషన్ ఆధ్వర్యంలో అర్ధరాత్రి వేళ గ్రామంలో తనిఖీలు చేసి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిదిమంది గ్రామస్తులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చాపరాలపల్లి (ఈస్ట్) బీట్ ఆఫీసర్ మల్లికార్జునరావు శనివారం వెల్లడించారు. -
కౌజు.. మోజు: పెరుగుతున్న గిరాకీ
కోడి మామూలైపోయింది.. అప్పుడప్పుడూ నాటు కోడి తింటున్నా జిహ్వ కొత్త రుచులు కోరుతోంది.. ఈ అన్వేషణలో సిక్కోలు ప్రజలకు దొరికిన మేలిరకపు మాంసాహారం కౌజు పిట్ట. పుష్కలమైన పోషక విలువలతో కూడిన వీటి మాంసానికి డిమాండ్ పెరుగుతోంది. ఊరూరా విక్రయాలు ఊపందుకుంటున్నాయి. వీటి పెంపకం సులభం కావడంతోపాటు లాభసాటిగా ఉండటంతో కొత్త రకం ఉపాధిగా మారింది. వజ్రపుకొత్తూరు: మాంసాహార ప్రియులు కొత్త రుచులను ఆస్వాదిస్తున్నారు. బ్రాయిలర్ చికెన్, నాటు కోళ్ల స్థానంలో కౌజు పిట్టలు చేరుతున్నాయి. పోషకాలు పుష్కలంగా ఉండే కౌజుపిట్టల మాంసాన్ని లొట్టలేసుకుంటూ ఆరగిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో వీటి అమ్మకాలు గణనీయంగా పెరగడం, కచ్చితమైన ఆదాయ వనరు కావడంతో పెంపకదారులు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ పెంపకం వీటి ప్రత్యేకత కావడంతో నిరుద్యోగ యువతకు చక్కటి స్వయం ఉపాధి మార్గంగా నిలుస్తోంది. పెంపకం ఖర్చు తక్కువ.. కోళ్లు, బాతుల మాంసం కంటే కౌజుపిట్టల మాంసం, గుడ్లు బలవర్ధకం. వీటి గుడ్లలో ప్రోటీన్లు, ఫాస్పరస్, ఇనుము, ఏ, బి 1, బి 2 విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇతర గుడ్ల కన్నా 2.47 శాతం తక్కువ కొవ్వు ఉంటుంది. అన్ని కాలాల్లో వీటి మాంసం, గుడ్లకు డిమాండ్ ఉంది. ఇక కోళ్ల పెంపకంతో పోలిస్తే వీటి పెంపకం చాలా తేలిక. పెట్టుబడి, కూలీల అవసరం తక్కువ. మేత ఖర్చు కూడా తక్కువే. వీటికుండే అధిక రోగ నిరోధక శక్తి కారణంగా వ్యాపార సరళిలో పెంచినా నష్ట భయం ఉండదు. మధుమేహ బాధితులు కూడా తీసుకోవచ్చు. కౌజులు చిన్న సైజు పక్షులు కనుక తక్కువ ఆదాయ వర్గాల వారికీ అందుబాటులో ఉంటాయి. సరైన జాతి( బ్రీడ్) ఎంపిక, షెడ్, మేతతో పాటు మార్కెటింగ్ సౌకర్యం పరిశీలించుకుని వీటి పెంపకం చేపట్టవచ్చు. టీకాలు అవసరం లేదు.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం గోపినాథపురం, టెక్కలి మండలం చింతలగార, నందిగాం మండలం బోరుభద్ర, పాలకొండ, శ్రీకాకుళం, రణస్థలం, సోంపేట తదితర ప్రాంతాల్లో కౌజు పిట్టల పెంపకాన్ని విస్తృతంగా చేపడుతున్నారు. ఇతర పక్షులతో పోలిస్తే కౌజులు తొందరగా ఎదుగుతాయి. 3–4 ఏళ్లు బతుకుతాయి. పుట్టిన 5–6 వారాలు తరువాత అమ్ముకోవచ్చు. ఇక వీటి పెంపకానికి టీకాలు అవసరం లేదు. అయితే ఆకస్మిక వాతావరణ మార్పులను తట్టుకోలేవు. అలాంటి సమయంలో వ్యాధులు సోకకుండా నిపుణుల సహాయం తీసుకోవాలి. బ్రాయిలర్ కోళ్లకు వచ్చే వ్యాధులే వీటికీ సోకుతాయని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని జిల్లా పశు సంవర్ధక శిక్షణా కేంద్రం ఉప సంచాలకుడు డాక్టర్ మాదిన ప్రసాదరావు తెలిపారు. జాతి ఎంపిక ప్రధానం.. కోళ్లలో మాదిరిగా కౌజుల్లో కూడా మాంసం, గుడ్లు కోసం వేర్వేరు జాతులు ఉన్నాయి. గుడ్లు కోసం ఫారో, బ్రిటీష్ రెంజ్, ఇంగ్లీష్ నైట్, మంజూరియన్ గోల్డ్ పెంచుతుంటారు. మాంసం కోసం బాబ్వైట్(అమెరికన్), వైట్ బ్రెస్టెడ్( ఇండియన్), జపనీస్ క్వయిల్ పెంపకాన్ని చేపడుతున్నారు. మన ప్రాంతంలో ఎక్కువగా జపనీస్ క్వయిల్ పిట్టలను పెంచుతున్నారు. నెలకు లక్షన్నర దాకా ఆదాయం రెండేళ్ల క్రితం 3 వేల పిట్టలతో ఫారం ఏర్పాటు చేశా. నెలకు ఏడు వేలు పిల్లలు చొప్పున మూడు బ్యాచ్‌లు విక్రయిస్తున్నా. ఇది కాకుండా నా దగ్గర గుడ్లు పెట్టే కౌజులు నాలుగు వేల వరకు ఉన్నాయి. రోజుకు 1,800 నుంచి 2 వేలు గుడ్లు ఉత్పత్తి అవుతాయి. రోజుకు 50 వేల గుడ్లు పొదిగే యంత్రాన్ని కొనుగోలు చేశా. నెలకు 20 వేల పిల్లలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తా. 15 వేల పిల్లలను ఫారంలోనే పెంచి మాంసం కోసం విక్రయిస్తా. అన్ని ఖర్చులు పోనూ నెలకు రూ.60 వేల నుంచి రూ.1.50 లక్షలు వరకు ఆదాయం సమకూరుతోంది. – పాచిపెంట మధుసూదనరావు, కౌజు రైతు, చింతలగార చదవండి: పండు ఈగకు ‘వలపు వల!’ బాబోయ్ భల్లూకం: ఎలుగుబంట్ల హల్చల్ -
కుళ్లిన మాంసంతో కిక్కు ఏంటి రా బాబు..!
పుర్రెకో బుద్ధి..జిహ్వకో రుచి. ఈ సామెత ప్రపంచంలో ఉండే మానవుల అభిప్రాయాలు, అభిరుచులు ఒక్కొక్కరికి ఒక్కొ విధంగా ఉంటాయని తెలియజేసే సందర్భంలో ఈ సామెత వాడతారు. అంతేందుకు మన చుట్టూ ఉన్నవారు రకరకాల అభిరుచులను కలిగి ఉంటారు. వారి ఆహారపు అలవాట్లు కూడా వింతగా ఉంటాయి. కొంతమంది తమనీ తాము మర్చిపోవడానికి మద్యం, గంజాయిని ఎక్కువగా సేవిస్తుంటారు. అది వారికి ఒక వ్యసనంలా తయారవుతుంది. ఇంతకుముందు చెప్పిన సామెత ప్రకారం ఒక్కొక్కరు, ఒక్కొ విధంగా చెడు అలవాట్లను అలవర్చుకుంటారు. తాజాగా మత్తు బాగా రావడం కోసం ఓ వ్యక్తి చేసిన వింత ప్రయత్నానికి సంబంధించి ఇంటర్నెట్లో షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం బాగా వైరలయ్యింది. ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే కుళ్లిన మాంసం. ఔను మీరు విన్నది నిజమే...! కుళ్లిన మాంసాన్ని తిని సదరు వ్యక్తి మత్తులో ఊగిపోతున్నాడు. ఈ విషయాన్ని బహిరంగంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కుళ్లిన మాంసం తింటే మత్తులో ఊగిపోవచ్చునని తన స్నేహితుడు చెప్పిన వెంటనే, ఆచరించాడు. అంతేకాకుండా కుళ్లిన మాంసాన్ని తినడం ద్వారా తనకి ఏం జరగలేదనే విషయాన్ని కూడా ఇతరులతో పంచుకున్నాడు. ఇంకా ఈ కుళ్లిన మాంసం ఎంతో రుచిగా ఉందని తెలిపాడు. ఈ విషయాన్ని 2017లోనే కుళ్లిన మాంసంతో కిక్కు వస్తుందని ఓ యూట్యూబర్ ఒక వీడియోలో తెలిపాడు. ఇలాంటి కుళ్లిన మాంసం తినడంతో ఆరోగ్యరీత్యా ఇబ్బందులకు గురవుతారని వైద్య నిపుణులు వెల్లడించారు. కుళ్లిన మాంసం కొన్ని సార్లు విష పదార్థంగా మారే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు. అసలు కుళ్లిన మాంసం జోలికి పోకుండా ఉండటమే మంచిదని వైద్యులు చెప్తున్నారు చదవండి: వైరల్: ఓ పక్క ఆక్సిజన్ పీలుస్తూ, మరోపక్క గుప్పుమంటూ సిగరెట్ -
గణనీయంగా పెరిగిన గుడ్లు, మాంసం ఉత్పత్తి
సాక్షి, అమరావతి: రాష్రంలో గుడ్లు, మాంసం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020–21 ఆర్థిక సంవత్సరంలో గుడ్ల ఉత్పత్తి 15 శాతం, మాంసం ఉత్పత్తి 11.76 శాతం పెరిగాయి. 2019–20లో 8.50 లక్షల మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి కాగా 2020–21లో 9.54 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయిందని పశుసంవర్ధకశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. 2019–20లో 2,170.77 కోట్ల గుడ్లు ఉత్పత్తి కాగా 2020–21లో 2,496.39 కోట్లు ఉత్పత్తి అయినట్లు అంచనా వేశారు. 2020–21లో 147.13 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి జరిగినట్లు ప్రాథమికంగా తేల్చారు. ఈ అంచనాలను రాష్ట్ర పశుసంవర్ధకశాఖ కేంద్రానికి పంపించింది. కేంద్రం ఆమోదిస్తే వాటి విలువ ఎంత అనేది కూడా తేలనుందని అధికారులు తెలిపారు. మరోపక్క తాజా గణాంకాల మేరకు రాష్ట్రంలో మొత్తం 3,40,68,177 పశుసంపద ఉంది. ఇందులో అత్యధిక పశుసంపద అనంతపురం జిల్లాలో 66.06 లక్షలుండగా అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 14.44 లక్షలు ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న, మధ్యతరగతి రైతుల వద్ద ఎక్కువగా పశుసంపద ఉంది. కరువు పరిస్థితుల్లో ఆ రైతులకు ప్రధాన ఆదాయవనరు పశుసంపదే. రాష్ట్రంలో మొత్తం 46,00,087 ఆవులు ఉండగా 62,19,499 గేదెలున్నాయి. 1,76,26,971 గొర్రెలుండగా 55,22,133 మేకలు ఉన్నాయి. గతంతో పోలిస్తే రాష్ట్రంలో మేకలు, గొర్రెల సంపద గణనీయంగా పెరిగింది. గతంలో గొర్రెలు 135.60 లక్షలుంటే తాజా గణాంకాల ప్రకారం 176.26 లక్షలకు, మేకలు 44.96 లక్షల నుంచి 55.22 లక్షలకు పెరిగాయి. వైఎస్సార్ చేయూత ద్వారా మహిళలకు పాడిపశువులు రాష్ట్రంలో మరింత పాలు, మాంసం ఉత్పత్తి పెంచడంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు జీవనోపాధి మెరుగుపరచడం ద్వారా ఆర్థికంగా వారి కాళ్లమీద వారే నిలబడేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ చేయూత ద్వారా ఆర్థికసాయం అందించింది. వారు కోరుకున్న మేరకు పాడి పశువులు, మేకలు, గొర్రెలు కూడా సమకూర్చేందుకు బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయిస్తోంది. వైఎస్సార్ చేయూత లబ్ధిదారులకు జగనన్న పాలవెల్లువ కింద 1,12,008 యూనిట్లను అందజేయాలని, అలాగే జగనన్న జీవక్రాంతి ద్వారా 72,179 యూనిట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 70 శాతం మేర యూనిట్లకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించింది. పాల ఉత్పత్తి పెంచేందుకు నాణ్యమైన దాణా రైతుభరోసా కేంద్రాల ద్వారా పాడి రైతులకు నాణ్యమైన పశువుల దాణాను సబ్సిడీపై సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అలాగే మినరల్, మిశ్రమ లవణాలు ఉన్న దాణాను సరఫరా చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఉపాధి హామీ పథకం కింద 20 వేల ఎకరాల్లో 150 కోట్ల రూపాయలతో పశుగ్రాసం పెంచేందుకు చర్యలను చేపట్టాం. ఈ చర్యలతో రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. చేయూత మహిళలకు జగనన్న పాలవెల్లువ, జగనన్న జీవక్రాంతి ద్వారా ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలను రాష్ట్రం నుంచే సరఫరా చేస్తున్నాం. – అమరేంద్రకుమార్, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ -
చిరుతపులి పిల్లను చంపి వండుకు తిన్నారు
సాక్షి, చెన్నై: చిరుతపులి పిల్లను చంపి, ఆ మాంసాన్ని వండుకు తిన్న ఐదుగురు వేటగాళ్లను తమిళనాడులోని నీలగిరి జిల్లా అటవీ శాఖ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు.అటవీ గ్రామంలోకి దారి తప్పి వచ్చిన ఓ చిరుతపిల్లను కొందరు వ్యక్తులు వేటాడి హతమార్చినట్టు శనివారం అటవీశాఖ అధికారులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులకు అక్కడి ఓ పంట పొలంలో చిరుతపులిని వేటాడిన ఆనవాళ్లు లభించాయి. విచారణను వేగవంతం చేయగా ఆదివారం ఉదయం అదే ప్రాంతానికి చెందిన వినోద్, కురియ, బిను, కుంజప్పన్, విన్సంట్‌లను అరెస్టు చేశారు. వారంతా కలసిదాని మాంసాన్ని వండుకొని తిన్నట్లు గుర్తించారు. Kerala: Five persons were arrested for allegedly killing a leopard and consuming its meat in Idukki district. (23.01.2021) pic.twitter.com/GTTyFRtzHq — ANI (@ANI) January 24, 2021 -
విజయవాడలో బరితెగించిన మాంసం మాఫియా
సాక్షి, అమరావతి బ్యూరో/పటమట: విజయవాడలో మాంసం మాఫియా బరితెగించింది. చనిపోయిన కోళ్లు.. చనిపోయిన మేకలు, గొర్రెల్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని నీట్‌గా డ్రెస్సింగ్ చేసి రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడమే కాకుండా ప్రతి ఆదివారం బహిరంగంగానే విక్రయిస్తున్నారు. కల్తీ మాంసం విక్రయిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. నగరంలో వారానికి నాలుగు టన్నుల కల్తీ మాంసం విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం. (ముక్కలేనిదే ముద్ద దిగడం లేదు..) నిబంధనలు ఇవి.. నిబంధనల మేరకు కబేళాలో మటన్, బీఫ్ విక్రయదారులు తప్పనిసరిగా సంబంధిత జంతు శరీరంపై వీఎంసీ స్టాంప్ వేయించుకుని విక్రయాలు చేయాలి. కానీ ఒక పశువు, మేక, గొర్రెలకు స్టాంప్ వేయించుకుని మిగిలిన వాటి మాంసం యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. కొందరు వ్యాపారులైతే అది కూడా పాటించడం లేదు. అధికారులు దాడులు చేస్తున్నప్పటికీ వ్యాపారుల్లో మార్పు రావడం లేదు. రెస్టారెంట్లో కుళ్లిన మాంసం ఈ నెల 4న బందరురోడ్డులోని ఓ రెస్టారెంట్లో నిల్వ ఉన్న 400 కిలోల మాంసాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్లు, వీఎంసీ వెటర్నరీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్రిజ్‌లో పురుగులు పట్టి ఉన్న మాంసంతోనే వివిధ రకాల మాంసం పదార్థాలను తయారు చేయడం ఇటీవల సంచలనం కలిగించింది. ఈ నెల 8న భవానీపురం గొల్లపాలెంగట్టు వద్ద జరిగిన దాడుల్లో నగరంలోని పేరుమోసిన హోటళ్లకు సరఫరా చేసే బల్క్ మాంసం విక్రయదారుల నుంచి 400 కిలోల మాంసాన్ని వీఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఈ దాడుల్లో చనిపోయిన మేక మాంసం నుంచి పురుగులు బయటకు వచ్చాయి. అంతేకాకుండా తుప్పు పట్టిన ఫ్రీజర్‌లో మాంసం ఉంచడం వల్ల్ల ఆ తుప్పు మాంసంలోకి చేరి వాటిని తిన్నవారు అనారోగ్యం పాలవుతారని అధికారులు చెబుతున్నారు. అక్టోబర్ 3న రైల్వే పార్సిల్ కౌంటర్లో భువనేశ్వర్ నుంచి నగరానికి దిగుమతి చేసుకుంటున్న 100 మేక తలకాయలను అధికారులు సీజ్ చేశారు. ఈ నెల 10న రామలింగేశ్వర నగర్‌లోని ఫిష్ మార్కెట్లో 100 కిలోల నిల్వ ఉన్న చేపలను విక్రయిస్తుండగా అడ్డుకున్నారు. ఈ నెల 15న కరెన్సీ నగర్, రామచంద్ర నగర్లో మటన్‌లో బీఫ్ కలిపి విక్రయిస్తున్న ముగ్గురు వ్యాపారుల నుంచి మాంసం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
మటన్ కొనేటప్పుడు జాగ్రత్త!
సాక్షి,విజయవాడ: ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న మటన్ మాఫియా గుట్టును కార్పొరేషన్ అధికారులు శనివారం రట్టు చేశారు. విజయవాడకు అక్రమంగా తరలించిన పోటెళ్ళ తలలు ,కాళ్ళును స్వాధీనం చేసుకున్నారు. హౌరా ఎక్స్‌ప్రెస్ రైల్లో వచ్చిన పదహారు బాక్సులను పట్టుకున్నారు. సీజ్ చేసిన పదహారు బాక్సులను వీఎంసీ సిబ్బంది నిర్జన ప్రదేశంలో పూడ్చేశారు. వీటిని యూపీ నుంచి ఢిల్లీకి, అక్కడినుంచి విజయవాడ కు తెచ్చినట్టు అధికారులు గుర్తించారు. రేపు ఆదివారం కావటంతో నిల్వ ఉంచిన మాంసం అమ్మి సొమ్ము చేసుకునేందుకు ఈ మాఫియా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కబేళాలోని మాంసం మాత్రమే కొనుగోలు చేయాలని వీఎంసీ అధికారులు సూచించారు. చదవండి: అద్దె మాఫీ.. వారికి ఉపశమనం.. -
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
కరోనా వైరస్ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శరీర అవయవాలపై అధికంగా దాడి చేస్తోంది. పేద, ధనిక తేడా లేకుండా ఆస్పత్రి పాలు చేస్తోంది. ఈ మహమ్మారి బారిన పడకుండా జనం సవాలక్ష మార్గాల్ని వెతుక్కోవాల్సి వస్తోంది. వ్యాధి నిరోధక శక్తి మరింత పెంచుకోవాలని వైద్యులు సూచించేలా చేస్తోంది. ఆరోగ్యానికి మాంసాహారమే ఉత్తమ మార్గమని జనం భావించేలా చేసింది. నిన్నమొన్నటి వరకు వెల వెలబోయిన నాన్‌వెజ్ వ్యాపారాలు నేడు పుంజుకునేలా మార్చింది. వైరస్ అంతం.. ఇమ్యూనిటీ పంతం అనేలా తెచ్చింది. జిల్లాలో మాంసం వినియోగం పెరగడంపై ‘సాక్షి’ స్పెషల్ ఫోకస్.. చిత్తూరు కలెక్టరేట్: అసలే కరోనా కాలం. రోగనిరోధక శక్తిని పెంచే ప్రొటీన్లు, పోషకాలు చికెన్‌లో అధికంగా ఉంటాయని ప్రజలు భావిస్తున్నారు. కరోనా ప్రారంభమైన మొదట్లో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం నెల రోజులుగా పతాక స్థాయికి చేరాయి. గతంలో ఎన్నడూలేని విధంగా కోడి మాంసం, గుడ్ల వినియోగం పెరిగింది. గతంలో.. కరోనా వైరస్ ప్రారంభంలో చికెన్, మటన్ తింటే వైరస్ సోకుతుందనే ప్రచారం సాగింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఒక్కసారిగా వాటి వినియోగం పడిపోయింది. గతంలో రోజుకు 15 లక్షల కోడిగుడ్లు విక్రయాలు జరుగుతుండేవి. కరోనా ఎఫెక్ట్‌తో 4 లక్షలకు అమ్మకాలు పడిపోయింది. చికెన్ కూడా అంతకుముందు నెలకు 6.5 లక్షల టన్నుల వరకు విక్రయించేవారు. కరోనా వల్ల 2 లక్షల టన్నులకు పడిపోయింది. కరోనా ప్రారంభమైన మా తీరని నష్టం వాటిల్లింది. అప్పట్లో కోళ్లు, కోడిగుడ్లు ఎక్కువగా నిల్వ ఉండడంతో తక్కువ ధరకు కొందరు విక్రయించేశారు. మరికొంతమంది వ్యాపారులు ఉచితంగా పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు.. చికెన్ తింటే కరోనా వస్తుందన్న భయాన్ని నిపుణులు పోగొట్టారు. సాక్షాత్తు వైద్యులే చికెన్, మటన్, కోడిగుడ్లు తినాలని సూచించడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ప్రజలు వీటిని వినియోగించడం ప్రారంభించారు. ఇందులో విచిత్రమేమిటంటే కరోనా కేసులు ఎక్కువైన సమయంలో వాటి వినియోగం పెరిగింది. చికెన్ ధర కిలో రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. కోడిగుడ్డు ధర రూ.2.50 నుంచి రూ.5 చేరింది. ధర పెరిగినా వినియోగదారులు ఏమాత్రం తగ్గడం లేదు. రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని.. కరోనా సమయంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. ప్రజలు కండ పుష్టి పొందడానికి, ఎముకల బలానికి, ప్రొటీన్లు, పోషకాల పెంపు కోసం చికెన్ తినడం ప్రారంభించారు. చికెన్‌లో చాలా రకాల పోషకాలుంటాయని వైద్యులు సలహాలిస్తున్నారు. చికెన్‌లో అమినో యాసిడ్స్ ఉండడం వల్ల శక్తివంతంగా ఉండడానికి సహాయపడుతుందని అంటున్నారు. మినరల్స్‌గా పిలుచుకునే సెలినీయం పోషకం ఉండడం వల్ల కీళ్ల నొప్పులు రాకుండా అడ్డుకుంటుందని చెబుతున్నారు. విటమిన్– బీ5, పాంటోథెనిక్ ఆమ్లం వంటివి ఒత్తిడిని కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతాయని వైద్యులు చెబుతున్నారు. చికెన్ తినడం వల్ల గుండెనొప్పి, ఇతర సమస్యలను తగ్గిస్తుందని, విటమిన్– బీ6 అధికంగా ఉండడంతో గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవని చెబుతున్నారు. చికెన్‌లో జింక్ అధికంగా ఉండడంతో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు. పెరిగిన వినియోగం జిల్లాలో చికెన్, మటన్ వినియోగం గతంలో కంటే అధికంగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో రోజు మార్చి రోజు చికెన్ తింటున్నారు. బాయిలర్ చికెన్‌తో పాటు నాటుకోడి మాంసాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. మటన్, కోడిగుడ్లకు కూడా ప్రాధాన్యమిçస్తున్నారు. మటన్ అతిగా తీసుకోకూడదని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. వారంలో రెండు రోజులు మాంసం తీసుకోవచ్చని, పూటకు సగటున 300 గ్రాముల మాంసం తీసుకుంటే సరిపోతుందంటుని చెబుతున్నారు. జిల్లాలో మటన్‌తో పాటు నాటు కోడి మాంసం ధర పెరిగింది. మటన్ కిలో రూ.800 నుంచి రూ.900 వరకు పెరిగింది. నాటుకోడి మాంసం ధర కిలో రూ.600 దాటింది. బాయిలర్ కోడి మాంసం ధర కిలో రూ.200 నుంచి రూ.250 వరకు ఉంటోంది. కరోనా వల్ల మొదట్లో పూర్తిగా నష్టపోయిన చికెన్ వ్యాపారులు ప్రస్తుతం ఆర్థికంగా పుంజుకుంటున్నారు. ఉచితంగా పంపిణీ చేశాం కోవిడ్ వచ్చిన మొదట్లో చికెన్ ధరలు పడిపోయాయి. కొనే వారు లేక చికెన్, కోళ్లు ఉచితంగా పంపిణీ చేశాం. ఎక్కువ రోజులు కోళ్లు నిల్వ చేసుకోలేక రెగ్యులర్ కస్టమర్లకు ఉచితంగా పంచిపెట్టాం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. అమ్మకాలు జోరందుకున్నాయి. మదనపల్లెలో కిలో చికెన్ ధర రూ.150 వరకు పలుకుతోంది. – మైనుద్దీన్, చికెన్ వ్యాపారి జాగ్రత్తలు ముఖ్యం జాగ్రత్తలు పాటిస్తే కరోనా దరిచేరదు. ఒకవేళ వచ్చినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారం రోజుల పాటు కఠోర సాధన చేస్తే కరోనాను జయించవచ్చు. ధాన్యం, యోగా, ఆధ్యాత్మిక చింతనతో గడిపితే చాలు. పోషకాహారాలు తీసుకున్న వారికి కరోనా రాదు. కరోనాపై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాలి. – మహేష్‌నారాయణ, యోగా సాధకులు వ్యాపారాలు వృద్ధి చెందాయి కరోనా వచ్చిన మొదట్లో అపోహలతో చాలా నష్టపోయాం. చికెన్, కోడిగుడ్లు తినకూడదని అప్పట్లో తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది. కొనడానికి ఎవరూ ముందుకొచ్చే వారు కాదు. రోజుకు 8 లక్షల కోడిగుడ్లు అమ్మాలంటే గగనంగా ఉండేది. ప్రస్తుతం రోజుకు 15 లక్షల వరకు కోడిగుడ్లు అమ్ముడవుతున్నాయి. ధరలు కూడా పెరిగాయి. – హరినాయుడు, ఎస్ఆర్పురం -
కుక్కుట చరితం
ప్రస్తుతం మనం పెంచుతున్న వివిధ రకాల కోళ్లన్నీ ఎర్ర అడవి కోడి జాతి నుంచి వచ్చినవేనని తాజా పరిశోధనలో వెల్లడైంది. భౌగోళిక పరిస్థితులు, వాతావరణ, పర్యావరణ మార్పులతోపాటు సంక్రమణతో ఎర్ర అడవి కోడి పలు ప్రాంతాల్లో రకరకాలుగా మార్పు చెందినట్టు తేల్చారు. వేల సంవత్సరాల క్రితమే ఈ జాతులన్నీ వేరుపడినట్టు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సాక్షి, అమరావతి: మాంసాహారంలో ప్రధాన భాగంగా మారిన కోడికి 10 వేల సంవత్సరాల చరిత్ర ఉందనే విషయం తెలిసిందే. అయితే, ప్రపంచంలో కోళ్ల పెంపకం ఎక్కడ మొదలైందనే దానిపై కొన్ని వందల సంవత్సరాలుగా వివాదం నడుస్తోంది. తాజాగా వివిధ దేశాల శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధన ఈ విషయమై ఆసక్తికర అంశాలను బయటపెట్టింది. ప్రస్తుతం మనం పెంచుతున్న వివిధ రకాల కోళ్లన్నీ ఎర్ర అడవి కోడి జాతి నుంచి వచ్చినవేనని తాజా పరిశోధన స్పష్టం చేసింది. ఆగ్నేయ ఆసియా, దక్షిణాసియాలో ఉండే ఎర్ర అడవి కోళ్లు, వాటి ఉప జాతులు ఒక దానితో ఒకటి సంకరం చెంది ఇప్పుడున్న దశకు వచ్చాయి. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న కోళ్లలో 80 శాతం వీటి నుంచే సంక్రమణ చెందినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతర్జాతీయ సైంటిఫిక్ జర్నల్ ‘సెల్ రీసెర్చ్’ నేతృత్వంలో వివిధ దేశాల సైంటిస్టులు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. మన దేశం నుంచి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జెడ్ఎస్ఐ)కి చెందిన సైంటిస్టు ముఖేష్ ఠాకూర్ భాగం పంచుకున్నారు. 8 వేల నుంచి 10 వేల ఏళ్ల క్రితం చైనా,ఉత్తర థాయ్‌లాండ్, మయన్మార్‌లో కోళ్ల పెంపకం మొదలైనట్టు ఈ పరిశోధన వెల్లడించింది. ప్రాంతాన్ని బట్టి జాతులు మారాయి కోళ్ల పెంపకం మన ప్రాంతమైన సింధు లోయలో ప్రారంభమైనట్టు గతంలో జరిగిన అనేక పరిశోధనల్లో స్పష్టమైంది. నిరంతరంగా జరిగే పరిశోధనల్లో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు జరిగిన సెల్ రీసెర్చ్ సర్వే కూడా ఆసక్తికరమైంది. కానీ.. దీనిపై భిన్న వాదనలున్నాయి. కోళ్ల జాతులు ప్రాంతాలు, భౌగోళిక పరిస్థితుల్ని బట్టి చాలా రకాలుగా మారిపోయాయి. కోళ్ల చరిత్ర చాలా సుదీర్ఘమైనది. – డాక్టర్ కె.నాగరాజకుమారి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ పౌల్ట్రీ, ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల, గన్నవరం 864 రకాల జన్యువుల్ని విశ్లేషించి.. ► పరిశోధనలో భాగంగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెంపకంలో ఉన్న కోడి జాతుల్లోని 864 రకాల జన్యువులను విశ్లేషించారు. ► సాంకేతిక పరిభాషలో ‘గినస్ గల్లస్’గా పిలిచే ఎర్ర అడవి కోడి, దానికి చెందిన ఐదు ఉప జాతులు, వివిధ దేశాల్లో పెంచుతున్న మరికొన్ని కోళ్ల జాతుల మైటోకాండ్రియల్ డీఎన్ఏలను విశ్లేషించారు. ► గతంలో ఇదే అంశంపై పరిశోధనకు వినియోగించిన 79 కోళ్ల జాతుల డీఎన్ఏలు కూడా ఇందులో ఉన్నాయి. గత పరిశోధనలకు భిన్నంగా.. ► తాజా పరిశోధన గత పరిశోధనలకు భిన్నంగా ఉండటంతో దానిపైనా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ► మొదట ఉత్తర చైనా, సింధు లోయ (ఇండస్ వ్యాలీ) ప్రాంతంలో కోళ్ల పెంపకం మొదలైనట్టు గత పరిశోధనలు తేల్చాయి. ► చార్లెస్ డార్విన్ సైతం కోళ్ల పెంపకం ఇండస్ వ్యాలీలో ఎర్ర అడవి కోళ్లతో మొదలైందని ప్రతిపాదించారు. ► కానీ సెల్ రీసెర్చ్ పరిశోధన దీనికి వ్యతిరేకంగా ఉండటంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ► కోళ్ల పెంపకంపై శాస్త్రవేత్తల్లో చాలా శతాబ్దాల నుంచి ఆసక్తి ఉందని జెడ్ఎస్ఐ సైంటిస్ట్ ముఖేష్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. ► తాజా పరిశోధన కోళ్ల పెంపకం చరిత్రకు సంబంధించిన కీలక అంశాలను కనుగొందని, ఈ సమాచారం భవిష్యత్ పరిశోధనలకు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఎర్ర అడవి కోడి జాతి నుంచి.. భౌగోళిక పరిస్థితులు, వాతావరణ, పర్యావరణ మార్పులతోపాటు సంక్రమణతో ఎర్ర అడవి కోడి వివిధ ప్రాంతాల్లో రకరకాలుగా మార్పు చెందినట్టు తేల్చారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ జాతులన్నీ వేరుపడినట్టు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఆగ్నేయ ఆసియా అడవుల్లో ఈ కోళ్లు పైకి ఎగిరి పోట్లాడుకోవడాన్ని చూసిన మానవులు వాటిని మచ్చిక చేసుకున్నారని భావిస్తున్నారు. ఆ తర్వాత వాటిని పెంచుకోవడం, వాటి మాంసం, గుడ్లను ఆహారంగా ఉపయోగించడం మొదలైంది. ఇప్పుడు అదే ప్రధాన ఆహారంలో ఒకటైంది. -
‘అందుకే చికెన్, మటన్ రేట్లు పెరిగాయి’
సాక్షి, హైదరాబాద్ : మాంసాన్ని అధిక ధరలకు విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. అధిక ధరకు మాంసం విక్రయించే దుకాణాలను సీజ్ చేస్తామన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో చికెన్, మటన్, చేపల లభ్యతపై పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మాంసం ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. లాక్డౌన్ కారణంగా గొర్రెలు, మేకల సరఫరా నిలిచిపోవడంతో మటన్ ధరలు పెరిగాయని తెలిపారు. ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గొర్రెలు, మేకల పెంపకం దారులు వాటిని విక్రయించుకునేందుకు వీలుగా అనుమతుల కోసం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించారు. (చదవండి : పారిశుధ్య కార్మికులకు కరోనా ఎఫెక్ట్!) కాగా, లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో మాంసం ధరలు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు కిలో రూ.50 పలికి చికెన్ ఇప్పుడు 180 పలుకుతోంది. ఇక మటన్ ధర కూడా విపరీతంగా పెరిగింది. కిలో మటన్ రూ.800 నుంచి రూ.1000 దాకా పలుకుతోంది. కరోనా పుకార్లతో మొన్నటి వరకు నష్టపోయామంటున్న వ్యాపారులు.. ఇప్పుడు లాక్‌డౌన్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. -
కాకి మాంసంతో చికెన్ వెరైటీలు
రామేశ్వరం: చికెన్ మాంసంలో కాకి మాంసాన్ని కలిపి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్ట్ చేసిన ఘటన తమిళనాడులోని రామేశ్వరంలో చోటు చేసుకుంది. వివరాలు.. రామేశ్వరంలోని ఓ ఆలయంలో భక్తులు తమ పూర్వీకుల జ్క్షాపకార్థం కాకులకు అన్నాన్ని ఆహారంగా వేశారు. అయితే ఆ అన్నాన్ని తిన్న కాసేపటికే కాకులు ఎక్కువ సంఖ్యలో మృతి చెందాయి. దీంతో ఆందోళన చెందిన భక్తులు అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వేటగాళ్లు కాకులకు మద్యం కలిపిన ఆహారాన్ని ఇవ్వడం వల్లే అవి చనిపోయాయని తేల్చారు. చనిపోయిన కాకులను సేకరించి వాటి మాంసాన్ని చికెన్ స్టాల్స్‌కు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కాకి మాంసం కలిపిన చికెన్‌ను కొందరు దుకాణదారులు రోడ్డు పక్కన తినుబండారాల్లో వినియోగిస్తున్నట్లుగా తెలిపారు. కాకులను చంపడమే కాక, దాని మాంసాన్ని చికెన్ స్టాళ్లకు విక్రయించినందుకుగానూ ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 150 చనిపోయిన కాకులను వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ఆ గుడిలో చికెన్, మటన్ బిర్యానీలే ప్రసాదాలు -
పండుగ ప్యాకేజీ!
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ముంగిట సంక్రాంతి పండుగ రావడంతో అభ్యర్థులు ముందుగానే తాయిలాల పంపిణీకి తెరతీశారు. భోగి, సంక్రాంతి, కనుమ నేపథ్యంలో వరుసగా మంగళ, బుధ, గురువారాల్లో రాష్ట్రవ్యాప్తంగా చాలా పురపాలికల్లో విచ్చలవిడిగా ఇంటింటికీ పండుగ ప్యాకేజీలను సరఫరా చేశారు. ‘భోగి నుంచి కనుమ వరకు పండుగ ఖర్చు మొత్తం మాదే.. మీరేం ఫికర్ కావద్దు’అంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. కిలో మటన్ లేదా రెండు కిలోల చికెన్, పిండి వంటల కోసం 5 లీటర్ల వంట నూనె ప్యాకెట్లు, రెండు కిలోల బియ్యం, కిలో శనగ పిండి, ఉప్పు, పప్పు కారం వంటి పదార్థాలతోపాటు ఫుల్ బాటిల్ విస్కీ లేదా ఐదారు బీరు సీసాలతో ప్యాకేజీలు మూటగట్టి ఓటర్లకు పంపిణీ చేశారు. మాంసం దుకాణాలు, సూపర్ మార్కెట్లలో ప్యాకేజీలను తయారు చేసి ఓటర్ల ఇళ్లకు చేరవేశారు. కొన్ని చోట్ల మద్యం దుకాణాల యజమానులే అభ్యర్థుల తరఫున ఓటర్లకు మద్యం, మిక్చర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అభ్యర్థి వెంట ప్రచారంలో తిరిగిన వారికి మామూలు రోజుల్లో క్వార్టర్ విస్కీ పంపిణీ చేస్తే పండుగ రోజుల్లో తలా ఒక ఫుల్ బాటిల్ సరఫరా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించడంలో చివరి రెండు రోజులు కీలకం. పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచార కార్యక్రమాల గడువు ముగిసిపోనుంది. అనంతరం భారీ ఎత్తున డబ్బు, మద్యం, ఇతర తాయిలాల పంపిణీతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయితే సంక్రాంతి పండుగ రావడంతో పోలింగ్‌కు ఐదారు రోజుల ముందే అభ్యర్థులు భారీ ప్రలోభాలకు తెరతీసినట్లు చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ద్విముఖ పోటీ నెలకొన్న వార్డులు/డివిజన్లలో పోటాపోటీగా ఓటర్లకు తాయిలాలు పంపిణీ చేస్తున్నారు. బీజేపీ లేదా స్వతంత్ర అభ్యర్థి రూపంలో త్రిముఖ పోటీ ఉన్న చోట్ల ఓటర్లు డబుల్, త్రిబుల్ బోనంజాలు అందుకుంటున్నారు. శివార్లలో శివాలెత్తిన ప్రలోభాలు.. రియల్ ఎస్టేట్ వ్యాపారంపరంగా ప్రాధాన్యతగల ఈ పురపాలికల్లోని కొందరు ‘బడా అభ్యర్థులు’విచ్చలవిడిగా ఓటర్లకు తాయిలాలు పంపిణీ చేస్తున్నారు. మున్సిపల్ చైర్పర్సన్/మేయర్ పదవిని ఆశిస్తున్న అభ్యర్థులైతే గెలుపే లక్ష్యంగా రోజూ రూ. లక్షల్లో ఖర్చు పెడుతున్నారు. సంక్రాంతి రోజు నగర శివారు మున్సిపాలిటీల్లో చాలా మంది అభ్యర్థులు ఇంటింటికీ పండుగ ప్యాకేజీలు పంపించి తమకే ఓటు వేయాలని అభ్యర్థించారు. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ నెల 22న పోలింగ్ నిర్వహించనుండటం తెలిసిందే. ఇందులో 22 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు హైదరాబాద్ శివార్లలో ఉన్నవే. శివారు మున్సిపాలిటీల్లో పండుగ ప్యాకేజీలతోపాటు పురుషుల కోసం ఫుల్‌బాటిల్ మద్యం, మహిళల కోసం శీతల పానీయాలను సైతం ఓటర్ల ఇళ్లకు పంపిణీ చేశారు. స్థానిక సూపర్ మార్కెట్లకు ఆర్డర్లు ఇచ్చి మరీ 5 లీటర్ల వంట నూనె, 2 కిలోల గోధుమ పిండి, కిలో శనగ పిండితో ప్రత్యేక ప్యాకెట్లు తయారీ చేయించినట్లు చర్చ జరుగుతోంది. కిలో మటన్/2 కిలోల చికెన్‌తోపాటు ఈ ప్యాకెట్లను ఓటర్ల కుటుంబాలకు అందజేశారు. గట్టి పోటీ ఉన్న చోట ఇద్దరు ముగ్గురు అభ్యర్థులూ పండగ ’ప్యాకెట్ల’లను అందజేయడంతో ఓటర్లకు మొత్తం మీద పండుగ ఖర్చు తీరింది. ఉదాహరణకు తాండూరు మున్సిపాలిటీలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పండుగ రోజు మద్యం, మాంసం, నగదుతో ఎర వేశారు. బుధవారం సంక్రాంతి రోజున చికెన్, మటన్ సెంటర్లలో మాంసం ప్యాకెట్లు సిద్ధం చేసి ఇంటింటికీ పంచారు. ఆదిబట్ల మున్సిపాలిటీలో ఓ అభ్యర్థి ఓటర్లకు పండుగ రోజు చీరలు పంపిణీ చేస్తే ఆయనకు పోటీగా మరో అభ్యర్థి ఓటరుకు రూ. వెయ్యి చొప్పున పంచాడు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డుల్లోనూ ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. జప్తులేవీ..? మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను గత నెల 23న రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమాళి అమల్లోకి వచ్చింది. అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు సంక్రాంతి రోజు చాలా మున్సిపాలిటీల్లో విచ్చలవిడిగా పండుగ ప్యాకేజీలు, డబ్బు, మద్యం పంపి ణీ చేసినా స్థానిక ఎన్నికల అధికారులు చోద్యం చూశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తేదీ నుంచి జప్తు చేసుకున్న మద్యం, డబ్బు, ఇతరత్రా కానుకల వివరాలను ఎస్ఈసీ రోజువారీగా ప్రకటించాల్సి ఉండగా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి 3 వారాలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎక్కడా ఏమీ జప్తు చేయలేదని తెలుస్తోంది. పోలింగ్‌కు మరో 5 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా ఎన్నికల సంఘం ప్రలోభాలకు అడ్డుకట్ట వేసే అంశంపై దృష్టి సారించాల్సి ఉంది. -
పిల్లలకు పెద్దల జబ్బులు!
సాక్షి, హైదరాబాద్: పెద్దలకే పరిమితమైన జీవన శైలి వ్యాధులు, ఇప్పుడు పిల్లలపైనా పంజా విసురుతున్నాయి. డయాబెటిక్, బీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో పిల్లలు సతమతమవుతున్నారు. ఇదే విషయంపై కేంద్ర ఆరోగ, కుటుంబ సంక్షేమ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, 19 ఏళ్లలోపు పిల్లల్లో ఒక్క శాతం మందికి డయాబెటిక్ సోకిందని స్పష్టం చేసింది. అదే వయసు వారిలో ప్రతి 10 మందిలో ఒకరు ప్రీ డయాబెటిక్ (డయాబెటిక్ ముందస్తు స్థితి) ఉన్నట్లు పేర్కొంది. 7 శాతం మంది కిడ్నీ వ్యాధులతో, 5 శాతం మంది బీపీతో బాధపడుతున్నారని వెల్లడించింది. పాఠశాలకు వెళ్లే వారిలో 3 శాతం, 10 నుంచి 19 ఏళ్ల వారిలో 4 శాతం మంది తీవ్రమైన కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది పడుతున్నారని స్పష్టం చేసింది. ఈ పరిస్థితులకు అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం, పర్యావరణ సమస్యలు, అనారోగ్యకరమైన జీవనశైలి ప్రధాన కారణాలని తెలిపింది. యునిసెఫ్ సహకారంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర జాతీయ పోషకాహార సర్వే (సీఎన్‌ఎన్‌ఎస్) జరిగింది. దేశవ్యాప్తంగా 2016 నుంచి 2018 వరకు జరిగిన ఈ భారీ సర్వే వివరాలను కేంద్రం తాజాగా వెల్లడించింది. మన రాష్ట్రంపై బీపీ, షుగర్ పంజా.. సర్వే ప్రకారం దేశంలో 10–19 ఏళ్ల మధ్య పిల్లల్లో 5 శాతం మంది బీపీతో బాధపడుతుండగా, తెలంగాణలో ఏకంగా 6.7 శాతం ఉండటం ఆందోళనకరం. ఢిల్లీలో 10.1 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 8.6 శాతం, మణిపూర్‌లో 8.3 శాతం ఉండటం గమనార్హం. కేరళలో అత్యంత తక్కువగా 0.5 శాతం మందికే బీపీ ఉంది. అదే వయసు పిల్లల్లో డయాబెటిస్తో బాధపడేవారు దేశంలో 0.6 శాతం మంది ఉండగా, తెలంగాణలో 1.1 శాతం మంది ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో అత్యధికంగా త్రిపురలో 4.9 శాతం మంది డయాబెటిస్తో బాధపడుతున్నారు. తెలంగాణ బీపీ విషయంలో 5వ స్థానం, డయాబెటిస్‌లో 9వ స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో 8.6 శాతం మంది ప్రీ డయాబెటిస్తో బాధపడుతున్నారని తేల్చింది. రాష్ట్రంలో 5–9 ఏళ్ల పిల్లల్లో ఎవరికీ డయాబెటిస్ లేదని తేలింది. అయితే ప్రీ డయాబెటిస్ స్థితిలో ఉన్న పిల్లలు 8 శాతం ఉన్నారని పేర్కొంది. 30.8 శాతం తక్కువ బరువు.. తెలంగాణలో 0–4 ఏళ్లలోపు పిల్లల్లో 30.8 శాతం మంది తక్కువ బరువుతో ఉన్నారు. 33.4 శాతం పిల్లలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. 5–9 ఏళ్ల పిల్లల్లో 22.7 శాతం మంది ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. ఇక 10–19 ఏళ్ల మధ్య వయసు పిల్లల్లో 26 శాతం మంది ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. ఇదే వయసు వారిలో 5.7 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. విటమిన్ ‘ఏ’తో బాధపడేవారిలో తెలంగాణ దేశంలోనే ఐదో స్థానంలో నిలిచి ఉంది. మాంసంలో మన పిల్లల స్థానం.. 4 దేశంలో చికెన్ సహా మాంసం తినే వారిలో మన రాష్ట్ర పిల్లలు నాలుగో స్థానం వరకు ఉన్నారు. 5–9 ఏళ్లలోపు పిల్లలు మాంసం లేదా చికెన్ తినేవారు (62.1 శాతం) దేశంలోనే రెండో స్థానంలో ఉన్నారు. ఇదే వయసు వారిలో గుడ్లు తినేవారు 75.3 శాతంతో మూడో స్థానంలో ఉన్నారు. చేపలు తినేవారు మాత్రం 19.3 శాతం ఉన్నారు. 10–19 ఏళ్ల మధ్య పిల్లల్లో 63.5 శాతం మంది మాంసం తింటూ దేశంలోనే నాలుగో స్థానంలో నిలవగా, గుడ్లు తినడంలో 72.4 శాతంతో 5వ స్థానంలో నిలిచారు. చేపలు తినేవారు 18.8 శాతమే ఉన్నారు. అయితే 2 నుంచి 4 ఏళ్ల పిల్లలు 20.7 శాతం మాత్రమే గుడ్లు తింటున్నారు. -
మాంసం తినడం మంచిదేనట!
సాక్షి, న్యూఢిల్లీ : ఆవు, పంది, గొర్రె మాంసం రోజూ తినడం మంచిది కాదని, దాని వల్ల ప్రాణాంతకమైన గుండె జబ్బులు, క్సాన్సర్లే కాకుండా మధుమేహం–2 జబ్బు వస్తోందంటూ పలు ఆరోగ్య సంస్థలు ఇంతకాలం చేస్తూ వచ్చిన సూచనలు తప్పని కెనడా, పోలాండ్, స్పెయిన్‌కు చెందిన పరిశోధకులు తేల్చారు. కెనడాలోని డలౌజీ, మ్యాక్‌మాస్టర్ యూనివర్శిటీలు, స్పెయిన్, పోలాండ్లోని కొక్రేన్ రీసర్చ్ సెంటర్లకు చెందిన 14 మంది పరిశోధకుల బృందం గతంలో 40 లక్షల మంది ప్రజల ఆరోగ్యాన్ని సమీక్షించిన 61 అధ్యయనాలను క్షుణ్నంగా పరిశీలించి ఈ విషయాన్ని తేల్చింది. మోతాదుకు మించి మాంసం తినడం వల్ల జబ్బులు, ముఖ్యంగా ఈ మూడు జబ్బులు వస్తాయనడానికి వారు ఎలాంటి ఆధారాలను సేకరించలేక పోయారని పరిశోధకుల బృందం అభిప్రాయపడింది. గత అధ్యయనాలను దృష్టిలో పెట్టుకొని ఒకరు రోజుకు 70 గ్రాములకు మించి మాంసం తినరాదంటూ బ్రిటన్ జాతీయ ఆరోగ్య పథకం కింద జారీ చేసిన మార్గదర్శకాలు తొందరపాటు చర్యేనని ఈ పరిశోధకుల బృందం పేర్కొంది. మధ్య వయస్కులు కూడా మరీ ఎక్కువ కాకుండా ఇంతకన్నా ఎక్కువ మాంసమే తినవచ్చని తాజా అధ్యయనంలో పరిశోధకులు అభిప్రాయపడ్డారు. తమంతట తాము డైట్ మార్చుకోవాలనుకుని మాంసహారాన్ని తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చుగానీ, అనారోగ్యానికి, మాంసహారానికి సంబంధం ఉన్నట్లు పాత అధ్యయనాలు ఏవీ కూడా సహేతుకంగా రుజువు చేయలేక పోయయని కూడా తాజా అధ్యయనం పేర్కొంది. శుద్ధి చేసిన మాంసం తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో తాజా అధ్యయనంపై దుమారం రేగే అవకాశం ఎక్కువగా ఉంది. -
నల్లకోడి మాంసంతో ఆరోగ్యం..
గుంటూరు, చిలకలూరిపేటరూరల్: కోడి రంగుతో పాటు మాంసం కూడా నలుపురంగు లోనే ఉంటుంది. కోడి పెట్టే గుడ్డు మినహా శరీరంలోని అవయవాలన్నీ నలుపురంగులోనే ఉండటం ప్రత్యేకం. ఈ కోళ్ల పెంపకంతో ఆర్థికంగా ఆదాయంతో పాటు ఆరోగ్యం లభిస్తుంది. వైద్య శాస్త్రవేత్తల సూచనలతో ఒక విద్యావంతుడు ఈ కోళ్ల పెంపకంపై దృష్టి సారించారు. వీటి గురించి పశువైద్యాధికారి డాక్టర్ మల్లయ్య తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కఢక్‌నాథ్ నల్ల కోళ్లు చిలకలూరిపేట రూరల్ మండలంలోని గంగన్నపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న కోమటినేనివారిపాలెం గ్రామానికి చెందిన గోరంట్ల పిచ్చయ్య ఎంబీఎ(హెచ్ఆర్), ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, బీఈడీ ఉన్నత విద్యను అభ్యసించి ఒక సంస్థలో సీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. కంపెనీ పనుల నిమిత్తం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కఢక్‌నా«థ్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడే నల్లరంగులో ఉన్న కోడిపెట్టలు, పుంజులను పరిశీలించారు. కోళ్లను పెంచుతున్న రైతులతో మాట్లాడితే మరొక ఆసక్తికరమైన విషయం చెప్పారు. వీటి మాంసం తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని, క్షీణించిన ఆరోగ్యం కూడా మెరుగవుతుందని తెలియచేశారు. అక్కడ నుంచి తిరిగి వచ్చాక పిచ్చయ్య ఈ కోళ్ల గురించి పసుమర్రు పశువైద్యాధికారి డాక్టర్ మల్లయ్యను సంప్రదించారు. ఇద్దరూ కలిసి వివిధ ప్రాంతాల్లో ఉన్న కోళ్లను, పశు సంవవర్థక శాఖకు చెందిన శాస్త్రవేత్తలు, వైద్యులను సంప్రదించారు. కఢక్‌నా«థ్ ప్రాంతంలోని కోళ్ల పెంపకందారులు తెలిపినవి వాస్తవమేనని గుర్తించారు. వెంటనే పిచ్చయ్య తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కోళ్లఫారం ఏర్పాటు చేశారు. చిరు ప్రయత్నం ప్రారంభం ... గ్రామంలో తనకు చెందిన కొద్దిపాటి స్థలంలో చిన్న షెడ్డును ఏర్పాటు చేసి కఢక్‌నా«థ్ నుంచి ఒక్కో గుడ్డును రూ.50 చొప్పున, కేజీ బరువు ఉన్న కోడిని రూ.1,000 చొప్పున మొత్తం 50 కోళ్లు, 10 గుడ్లు, రెండు పుంజులను కొనుగోలు చేసి తీసుకువచ్చారు. అక్కడి కోళ్లు స్థానిక వాతావరణానికి అనుగుణంగా అలవాటయ్యేందుకు వాటితో పాటు స్థానిక కోళ్లను కొన్నింటిని కొనుగోలు చేశారు. రెండింటినీ కలిపి ఒక షెడ్డు ఏర్పాటు చేసి వాటిలో పెంపంకం ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు వస్తున్నారు. నల్లకోడి మాంసంతో ఆరోగ్యం కఢక్నాథ్కు చెందిన నల్ల కోడి మాంసం ఆహారంగా స్వీకరిస్తే అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా పక్షవాతం, గుండెనొప్పి, రక్త ప్రసరణ, ఆరోగ్యం క్షీణించిన వారికి ప్రత్యేక ఔషధంలా పనిచేస్తుందని వైద్యులు చెబుతుండటంతో ప్రజలు ఈ కోడిమాంసం ఆహారంగా స్వీకరించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ కోడి గుడ్డును తీసుకుంటే పౌష్టికాహారంగా ఉంటుందని చెబుతున్నారు. ఒక్క కోడి 80 గుడ్లు ...ఆరున్నర సంవత్సరాలు సాధారణంగా స్థానికంగా ఉండే కోళ్లు 25 నుంచి 35 గుడ్లు మాత్రమే పెట్టి వాటినే పొదిగి పిల్లలను పెంపొందింప చేస్తాయి. ఇందుకు భిన్నంగా కఢక్‌నాథ్ నల్లకోళ్లు మాత్రం 75 నుంచి 80 గుడ్లను పెడతాయి. స్థానిక కోళ్ల జీవితకాలం కేవలం నాలుగున్నర ఏళ్లు మాత్రమే. కఢక్‌నా«థ్ కోళ్లు ఆరున్నర ఏళ్లు జీవిస్తాయి. పిచ్చయ్య తీసుకువచ్చిన కోళ్లు ఆరు సంవత్సరాలు గడిచినా నేటికీ ఆరోగ్యంగా ఉండటమే ఇందుకు నిదర్శనం. స్వయం పర్యవేక్షణ... మారుతున్న వాతావరణానికి అనుగుణంగా కఢక్‌నా«థ్ కోళ్లను నిత్యం పర్యవేక్షిస్తూ షెడ్లో వాటికి అవసరమైన ఆహారం, నీరు, వ్యాధి నిరోధక జాగ్రత్తలు తీసుకుంటే పెంపకందారులకు ఆదాయం అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఒక్కో కోడి మాంసం ధర కిలో రూ.1,000 ఉంటే ఒక్కో గుడ్డు ధర రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. నల్ల కోడి మాంసంతో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కఢక్‌నాథ్ ప్రాంతానికి చెందిన నల్లకోళ్ల గురించి తెలిసి, స్వయంగా వెళ్లి పరిశీలించాం. వీటిపై అనేకమంది పశుసంవర్థక శాస్త్రవేత్తలు, వైద్య విభాగంలోని ప్రొఫెసర్లను సంప్రదించాం. నల్లకోడి మాంసం ఆహారంగా స్వీకరిస్తే మానవుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింప చేస్తుంది. పక్షవాతం, గుండెజబ్బులు ఉన్న వారికి ఈ మాంసం ఆహారంగా తీసుకుంటే బాగుంటుంది. పెంపకందారులకు ఆదాయం కూడా బాగుంటుంది.–డాక్టర్ సీహెచ్ మల్లయ్య, పశు వైద్యాధికారి, పసుమర్రు -
మాంసం వినియోగంలో మనమే టాప్
సాక్షి, హైదరాబాద్: దేశంలో గొర్రెల సంఖ్య, మాంసం వినియోగంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. డిసెంబర్ 31తో ముగిసిన జాతీయ పశుగణనకు సంబంధించిన నివేదికలో పలు వివరాలు వెల్లడయ్యాయి. గొర్రెల సంఖ్యలో తెలంగాణ తర్వాత రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఏపీ, మహారాష్ట్ర నిలిచాయి. 2017 జూన్ నాటికి రాష్ట్రంలో ఉచిత గొర్రెల పథకం అమలు చేసే నాటికి గొర్రెల సంఖ్య కోటి మాత్రమే. ఆ పథకం కింద ప్రభుత్వం చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి 74 లక్షల గొర్రెలను గొల్లకుర్మలకు పంపిణీ చేసింది. వీటికి 55 లక్షల పిల్లలు పుట్టాయి. దీంతో రాష్ట్రంలో కొత్తగా 1.28 కోట్ల గొర్రెలు తయారయ్యాయి. వీటి విలువ రూ. 2,500 కోట్లు. గొర్రెల పంపి ణీ పథకంతో రాష్ట్రంలో రూ.2,500 కోట్ల అదనపు సంపద గ్రామాల్లో వచ్చి చేరింది. జాతీయ పశుగణన చేపట్టేనాటికి రాష్ట్రంలో 2.24 కోట్ల గొర్రెలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో అత్యధిక గొర్రెలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. ఇప్పటివరకు దేశంలో అత్యధిక గొర్రెలు ఉన్న రాష్ట్రంగా రాజస్థాన్‌ను వెనక్కి నెట్టింది. పథకానికి రూ.5 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత గొర్రెల పథకం ఇతర రాష్ట్రాలనూ ఆకర్షిస్తోంది. పథకం కోసం ప్రభుత్వం రూ. 5 వేల కోట్లు కేటాయించింది. అందులో రూ.3 వేల కోట్లు జాతీయ సహకారాభివృద్ధి సంస్థ(ఎన్సీడీసీ) ద్వారా రుణం పొందింది. మరో 20 శాతం నిధులను కేంద్రం సబ్సిడీగా అందించింది. మిగిలిన సొమ్మును రైతులు తమ వాటాగా చెల్లించారు. ఒక్కొక్క యూనిట్ వ్యయం రూ.1.25 లక్షలు కాగా, ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ అంటే రూ. 93,750 ఇచ్చింది. లబ్ధిదారుడు మిగిలిన 25 శాతం అంటే రూ. 31,250 చెల్లించారు. పెరిగిన మాంసం ఉత్పత్తి... తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత గొర్రెల పంపిణీ పథకంతో రాష్ట్రంలో వాటి సంఖ్య పెరగడమే కాకుండా మాంసం ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. ఏడాది సగటున రాష్ట్రంలో 26,839 మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి అవుతోంది. మాంసం ఉత్పత్తిలో 15 శాతం వృద్ధి సాధించినట్లు అధికారులు వెల్లడించారు. 2017 జూన్‌కు ముందు రాష్ట్రానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి రోజుకు దాదాపు 500 నుంచి 600 లారీల గొర్రెలు దిగుమతి అవుతుండేవి. ప్రస్తుతం ఈ సంఖ్య 100కు పడిపోవడం గమనార్హం. గొర్రెల సంఖ్య పెరగడమే కాకుండా మాంసం వినియోగంలోనూ తెలంగాణ టాప్‌లో నిలిచింది. మాంసహారం తీసుకునేవారిలో సగటున ప్రతి వ్యకి ఏడాదికి 7.5 కిలోల మాంసం వినియోగిస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో 97 శాతం మంది మాంసాహారులే ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది. జాతీయ పోషకాహార సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఏడాదికి ఒక మనిషి 11 కిలోలు వినియోగించాల్సి ఉంది. తెలంగాణ 7.5 కిలోలతో మొదటిస్థానంలో ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ 7.2 కిలోలు, తమిళనాడు 6.5 కిలోలు, కర్ణాటక 6 కిలోలు, కేరళ 5.5 కిలోలు చొప్పున వినియోగిస్తున్నాయి. మాంసం అధికంగా వినియోగించే రాష్ట్రాల్లో మొదటి ఐదు స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాలే ఉండటం గమనార్హం. -
తిండి మారితే మేలు..
భూమిపై వనరుల వినియోగ భారాన్ని గణనీయంగా తగ్గించుకోవడానికి ఉత్తమ మార్గం మాంసం, డెయిరీ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించుకోవడమేనని సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం (2018) పేర్కొంది. మాంసం, పాల ఉత్పత్తులను తినటం మానివేస్తే చాలు.. ప్రజలకు ఆహార కొరత రాకుండా చూసుకుంటూనే ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ భూమి విస్తీర్ణాన్ని 75% తగ్గించవచ్చని ఒక అతిపెద్ద అధ్యయనం తెలిపింది. యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ 119 దేశాల్లో 40 వేల క్షేత్రాలు, ప్రజలు ఎక్కువగా తింటున్న 40 ఆహారోత్పత్తులపై అధ్యయనం చేసింది. ఈ ఉత్పత్తులకు అయ్యే వనరుల ఖర్చు, కాలుష్యం, వెలువడే ఉద్గారాలు తదితర విషయాలను పరిగణనలోకి తీసుకున్నది. అడవులు నరికి వ్యవసాయానికి మళ్లించడం వల్ల వన్యప్రాణుల సంఖ్య భారీగా అంతరిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా మాంసం, పాల ఉత్పత్తుల ద్వారా ప్రజలకు అందుతున్నది 18% కేలరీలు, 37% ప్రొటీన్లు. అయితే, వీటి కోసం 83% వ్యవసాయ భూములను కేటాయించాల్సి వస్తున్నది. వ్యవసాయం వల్ల వెలువడే కర్బన ఉద్గారాలలో 60% మాంసం, పాల ఉత్పత్తుల తయారీ వల్లనేనని ఈ అధ్యయనం తేల్చింది. మాంసం, పశువుల పాల ఉత్పత్తులను సగాన్ని తగ్గించుకొని, వాటి స్థానంలో పంటల ఉత్పత్తులతో భర్తీ చేసుకున్నా చాలా మేలు జరుగుతుందని తేలింది. -
కృత్రిమ మాంసం తక్షణ అవసరం
సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మాంసం తయారీ తక్షణ అవసరం అని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ వ్యాఖ్యానించారు. ఒకట్రెండేళ్లలో ఈ మాంసం అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. కృత్రిమ మాంసాన్ని తినేందుకు సిద్ధంగా ఉన్నామని అధిక శాతం ప్రజలు పలు సర్వేల్లో తెలిపినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)లో శుక్రవారం ‘ది ఫ్యూచర్ ఆఫ్ ప్రొటీన్’పేరుతో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పశుపోషణకు ఫుల్స్టాప్ పెట్టి కృత్రిమ మాంసం ఉత్పత్తిని ప్రోత్సహించాల్సిన తరుణం ఇదేనన్నారు. పశుపోషణ ఆపేస్తే నాలుగేళ్లలో భూతాపాన్ని అరికట్టొచ్చని చెప్పారు. భూతాపానికి మీథేన్ కూడా ఓ కారణమని, పశుపోషణ వల్ల మీథేన్ ఉద్గారాల తీవ్రత పెరుగుతోందని చెప్పారు. వరిసాగు, బొగ్గు మండించడం ద్వారా కూడా మీథేన్ వెలువడుతుందని పేర్కొన్నారు. అయితే కోళ్లు, గొర్రెలు, మేకల వంటి పశువుల పెంపకం ఆపేస్తే మీథేన్ ఉద్గారాలు తగ్గుతాయన్నారు. వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రం కాకముందే పశువుల పెంపకాన్ని ఆపేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. జంతువుల నుంచి కొన్ని కణాలను తీసుకుని బయోరియాక్టర్లలో వృద్ధి చేయడం ద్వారా తయారయ్యే ఈ మాంసం ప్రకృతి వనరులెన్నింటినో ఆదా చేస్తుందని తెలిపారు. మాంసంలో చేరుతున్న కొన్ని రకాల వైరస్ల కారణంగా కేన్సర్లు వస్తున్నాయని చాలా అధ్యయనాల్లో తేలిందని చెప్పారు. కృత్రిమ మాంసాన్ని తినేందుకు సిద్ధంగా ఉన్నట్లు 53 శాతం మంది తెలిపినట్లు ఫొర్నెలిటిక్స్ సంస్థ సర్వే చెబుతోందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం లక్షల సంఖ్యలో పశువులను పంపిణీ చేస్తున్న విషయంపై మాట్లాడుతూ.. గతంలో ఏపీలోనూ ఇదే తరహా ప్రయత్నం చేశారని ఇంటికో ఆవు పంపిణీ చేస్తే అందులో 90 శాతం కబేళాలలకు తరలిపోయాయని గుర్తు చేశారు. మొక్కల నుంచి ఇలా..! ప్రోటీన్లు అధికంగా ఉండే మొక్కలు, వృక్షాల ఉత్పత్తులను తీసుకుని ల్యాబుల్లో మాంసంగా తయారు చేస్తారు. చూసేందుకే కాదు.. తినేందుకు కూడా అచ్చు మాంసంలాగే ఉంటుంది. జంతువుల నుంచి ఎలా? ఆరోగ్యవంతమైన జంతువులను సరైన మంచి పరిసరాల్లో పెంచి వాటి నుంచి కొన్ని కణాలను తీసుకుని ల్యాబ్‌ల్లో అభివృద్ధి చేసి, దాని నుంచి మాంసాన్ని ఉత్పత్తి చేస్తారు. కృత్రిమ మాంసం తినడం వల్ల ఎలాంటి వ్యాధుల రావని, పైగా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. ‘కృత్రిమ మాంసం ఉత్పత్తి విషయంలో పరిశోధనలను ముమ్మరం చేసి, వాణిజ్య స్థాయికి తీసుకొచ్చేందుకు గుడ్ ఫుడ్ ఇన్స్టిట్యూట్ ప్రయత్నం చేస్తోంది. ఈ రంగంలోని అన్ని వర్గాల వారిని సమన్వయం చేసుకుంటూ మొక్కల ఆధారిత మాంసం, కృత్రిమ మాంసం ఉత్పత్తికి ప్రయత్నం చేస్తున్నాం.’ –వరుణ్ దేశ్‌పాండే, గుడ్‌ఫుడ్ ఇన్స్టిట్యూట్ ‘కృత్రిమ మాంసం ఎలా తయారు చేయొచ్చో శాస్త్రవేత్తలకు తెలుసు. జంతువుల నుంచి కాకుండా మొక్కల నుంచి తయారు చేసే ప్రత్యామ్నాయాలు దొరికితే బాగుంటుంది. కొబ్బరి నీళ్లు, తేనె వంటి వాటి పై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి ఫలిస్తే కృత్రిమ మాంసంలో కణాలు మినహా మరే ఇతర జంతు సంబంధిత పదార్థాలు ఉండవు’ – పవన్ కె.ధర్, కృత్రిమ బయాలజీ విభాగం, జేన్యూ, ఢిల్లీ ‘కృత్రిమ మాంసం తయారీని వాణిజ్య స్థాయిలో అభివృద్ధి చేయడం ఎలా అన్నది ఒక సవాలు. దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. భారత్‌లో కృత్రిమ మాంసం ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందన్నది ఇప్పుడిప్పుడే చెప్పలేం’ – రాకేశ్ మిశ్రా, డైరెక్టర్ సీసీఎంబీ, హైదరాబాద్ ‘పశుపోషణ కారణంగా పర్యావరణానికి జరుగుతున్న నష్టం అంత ఇంత కాదు. ఈ నేపథ్యంలో జంతువులను చంపాల్సిన అవసరం లేకుండా కావాల్సిన ప్రొటీన్లను ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం కల్పించే టెక్నాలజీలను ప్రొత్సహించాల్సి ఉంది.’ – సౌమ్యారెడ్డి, జంతు ప్రేమికురాలు -
కుళ్లిన మాంసం... బూజు పట్టిన చేపలు
నగరంపాలెం(గుంటూరు): కుళ్లిన స్థితిలో నిల్వ చేసి ఉంచిన మాంసం.. బూజుపట్టిన చేపలు.. కిలోల కొద్దీ డీప్ ఫ్రిజ్‌లో నిల్వ చేసి ఉంచిన దృశ్యాలు మాంసం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, ప్రజారోగ్య అధికారులు చేపట్టిన తనిఖీల్లో వెలుగు చూశాయి. ఆదివారం వెన్లాక్ మార్కెట్లోని పలు మాంసం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అధికారులు అక్కడి పరిస్థితులు చూసి విస్తుపోయారు. మార్కెట్లోని ఒక దుకాణంలో 200 కేజీల వరకు డీప్ ఫ్రిజ్‌లో కుళ్లిన స్థితిలో ఉన్న చికెన్‌ను, ఫంగస్ పట్టిన చేపలను అధికారులు గుర్తించారు. దీంతో షాపు నిర్వాహకునిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు రూ.30 వేల అపరాధ రుసుం విధించారు. రోసారి పునరావృతమైతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్కడే అపరిశుభ్ర ప్రదేశాల్లో నిల్వ ఉంచిన మాంసాన్ని, ఈగలు ముసురుతున్న మటన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రామన్నపేటలోని చికెన్ స్టాల్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో అపరిశుభ్రంగా ఉన్న నీటిలో ఉన్న నానబెట్టిన చికెన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై షాపు యజమానికి రూ.5 వేల అపరాధ రుసుం విధించారు. పరిశుభ్ర వాతావరణంలోనే కోళ్లను వధించాలని అధికారులను ఆదేశించారు. అమరావతి రోడ్డులో చిల్లీస్ రెస్టారెంట్, అరబిక్ రెస్టారెంట్లో నిర్వహించిన తనిఖీల్లో చికెన్ పీస్‌లు, వండటానికి సిద్ధం చేసిన చికెన్ నిల్వలను గుర్తించి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెస్టారెంట్ నిర్వాహకులకు రూ.5 వేల చొప్పున అపరాధ రుసుం విధించారు. అవగాహన, తనిఖీలు నిర్వహించాలి ఈ సందర్భంగా రాష్ట్ర మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ నగరంలో ప్రజలకు ఆరోగ్యకరమైన మాంసం అందించటానికి ప్రజారోగ్యశాఖకు చెందిన శానిటరీ ఇన్స్పెక్టర్లు సంబంధిత డివిజన్లలోని చికెన్, మటన్ స్టాల్స్‌లో పరిశుభ్రంగా ఉండేలా నిర్వాహకులకు అవగాహన కల్పించాలన్నారు. రెస్టారెంట్లు, మాంసం విక్రయ కేంద్రాల్లో తరచూ తనిఖీలు నిర్వహించాలన్నారు. రాష్ట్రస్థాయిలో ఫుడ్ తనిఖీ అధికారులు, తూనికలు, కొలతల శాఖ, నగరపాలక సంస్థ ప్రజారోగ్యశాఖ అధికారుల ఆధ్వర్యంలో బృందాలు ఏర్పాటు చేసి ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రజారోగ్యశాఖ అధికారి డాక్టరు శోభారాణి, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
మాంసం కూర వండలేదని తల్లిని చంపాడు
బడేపురం(తాడికొండ): మాంసం కూర వండలేదని మద్యానికి బానిసైన ఓ కొడుకు కన్నతల్లిని కత్తితో పొడిచి చంపిన ఘటన గుంటూరు జిల్లా తాడికొండ శివారు బడేపురం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బడేపురం గ్రామానికి చెందిన బెజ్జం కిషోర్ గత కొంత కాలం నుంచి మద్యానికి బానిసై ఇంటి వద్దే ఉంటున్నాడు. అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో భార్య అతన్ని వదిలేసి ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రుల ఆసరాతో జీవిస్తున్నాడు. వృద్ధుడైన తండ్రి వెంకటేశ్వరరావు తాడికొండలో ఆర్ఎంపీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం ఉదయం బయటికెళ్లిన కిషోర్ మద్యం తాగి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. మాంసం కూర వండలేదనే కారణంతో తల్లి బెజ్జం మరియమ్మ (70)తో వాగ్వాదానికి దిగాడు. ఆమె వంటకు ఏర్పాట్లు చేసుకుంటుండగా వెనుక నుంచి కూరలు తరిగే కత్తితో వీపుపై పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలొదిలింది. విధి నిర్వహణలో భాగంగా బయటికి వెళ్లి వచ్చిన తండ్రి వెంకటేశ్వరరావు.. కుమారుడే ఈ ఘాతుకానికి పాల్పడటంతో నిశ్చేష్టుడయ్యాడు. ఘటనా స్థలాన్ని మంగళగిరి రూరల్ సీఐ మధుసూదనరావు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తండ్రి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆస్తి ఇవ్వలేదనే చంపేశాడు.. ఆస్తి కోసమే తన కుమారుడు తల్లిని చంపేశాడని నిందితుడు బెజ్జం కిషోర్ తండ్రి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తి కోసం నిత్యం వేధిస్తుండటంతో గతంలోనే పిల్లలకు పంపకాలు చేసి ఆస్తిని రాసిచ్చినట్టు చెప్పారు. అయితే మద్యానికి బానిసైన కొడుకు ఆస్తిని దుర్వినియోగం చేస్తాడనే ఉద్దేశంతో మనుమలు, మనుమరాళ్ల పేరిట ఆస్తిని రాసినట్టు వివరించారు. ఇంతలోనే తల్లిని ఇలా హత్యచేస్తాడని ఊహించలేదని ఆయన కన్నీరుమున్నీరయ్యారు. -
బొక్కలేని ముక్క.. ఎంచక్కా!
సాక్షి, హైదరాబాద్ : మాంసం ప్రియులకు శుభవార్త.. ఎముక(బొక్క).. కొవ్వు లేని మాంసం త్వరలో మీ జిహ్వచాపల్యాన్ని తీర్చనుంది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ(సీసీఎంబీ) శాస్త్రవేత్తలు ప్రయోగాత్మ కంగా టిష్యూ ఇంజనీరింగ్, జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీ ఆధారంగా క్లీన్మీట్ తయారీకి శ్రీకారం చుట్టారు. ఈ సంవత్సరం చివరికి సుమారు టన్ను మాంసం అందుబాటులోకి రానున్నట్లు విశ్వస నీయంగా తెలిసింది. ఈ ప్రయోగం సఫలమై వినియోగదారులకు క్లీన్ మీట్ అందుబాటులోకి వస్తే మాంసం ప్రియులకు పండగేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎలా తయారు చేస్తారంటే.. మేక లేదా కోడి శరీరభాగాల నుంచి కణజాలాన్ని సేకరించి ప్రయోగశాలలో సంరక్షాలను అందజేసి ఈ విధానంలో మాంసాన్ని తయారు చేస్తారు. ఇది సాధారణ మాంసంలానే తాజాగా, రుచిగా ఉంటుందట. ధర కూడా సాధారణ మాంసం ఎంత ధర ఉంటుందో అంతే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మాంసంలో సూక్ష్మ జీవ నాశకాలు(యాంటీ బయాటిక్స్), వృద్ధి హార్మోన్ల ఉనికి ఉండదని, దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ ఇండియా, సీసీఎంబీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ మాంసాన్ని ప్రయోగ శాలలో తయారు చేస్తున్నారు. ఈ మాంసంలో బ్యాక్టీరియా ఉనికి కూడా ఉండదని చెబుతుండటం గమనార్హం. రాజస్తాన్‌లో శాకాహారులే అధికం రాజస్తాన్‌లో శాకాహారులు అత్యధిక సంఖ్యలో ఉండటం విశేషం. ఆ రాష్ట్రంలో 73.2 శాతం మంది పురుషులు, 76.6 శాతం మంది మహిళలు శాకాహారులే. హరియాణాలో 68.5 శాతం మంది పురుషులు, 70 శాతం మంది మహిళలు.. పంజాబ్‌లో 65.5 శాతం మంది పురుషులు, 68 శాతం మంది స్త్రీలు శాకాహారాన్నే ఇష్టపడుతున్నారు. గ్రామీణ భారతీయుల్లో 6.4 శాతం మంది మటన్.. 21.7 శాతం మంది చికెన్.. 26.5 శాతం మంది చేపలు.. 29.2 శాతం మంది గుడ్లు తింటున్నట్లు ఎన్ఎస్ఎస్ఓ డేటా చెబుతోంది. పట్టణాల్లో 21 శాతం మంది మటన్.. 21 శాతం మంది చేపలు.. 27 శాతం మంది చికెన్.. 37.6 శాతం మంది గుడ్లను వినియోగిస్తున్నారట. జాతీయ స్థాయి సగటు కంటే అధికం.. జాతీయ స్థాయిలో ఏటా సరాసరిన ఒక్కో వ్యక్తి మాంసం వినియోగం 3.2 కిలోలుగా ఉంది. ప్రపంచ సరాసరి మాత్రం 38.7 కిలోలుగా ఉంది. అమెరికాలో అయితే ఏటా ఒక్కో వ్యక్తి 125 కిలోల మాంసాన్ని సరాసరిన వినియోగిస్తున్నట్లు తేలడం విశేషం. జాతీయ స్థాయి సగటు కంటే చికెన్ వినియోగం తెలంగాణలో అధికంగా ఉండటం విశేషం. జాతీయ స్థాయిలో ఏటా ఒక్కో వ్యక్తి సరాసరిన 3.2 కిలోల మాంసం, 65 గుడ్లను వినియోగిస్తుండగా.. తెలంగాణలో 6.5 కిలోల మాంసం.. 90 గుడ్లను వినియోగిస్తున్నారు. హైదరాబాద్ విషయానికి వస్తే ఏటా ఒక్కో వ్యక్తి సగటున 7.5 కిలోల మాంసం, 100 గుడ్లను లాగించేస్తున్నట్లు అంచనా. కృత్రిమ మాంసంతో ఉపయోగాలివే.. దేశంలో ఏటా పెరుగుతోన్న మాంసం డిమాండ్‌ను తీర్చవచ్చు. కొవ్వు, ఎముకలు లేకపోవడంతో పోషకాహారంలా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ సమస్య ఉండదు. తక్కువ భూమి, నీరు వినియోగంతో ఈ మాంసాన్ని తయారుచేయవచ్చు. లక్షలాది మూగజీవులను చంపే అవసరం ఉండదు. గుడ్లు, చికెన్ వినియోగం పెరగాలి పోషక విలువలు అధికంగా ఉండే గుడ్ల వినియోగం ఏటా ఒక్కో వ్యక్తికి 118కి పెరగాలని జాతీయ పోషకాహార సంస్థ సూచించింది. చికెన్ వినియోగంలో సైతం జాతీయస్థాయి సగటు 15 కిలోలకు పెరగాల్సి ఉంది. – రంజిత్‌రెడ్డి, తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దేశంలో మాంసం వినియోగం ఇలా.. మాంసం వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలుస్తోంది. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. 2016–17 మధ్యకాలంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అత్యధిక సంఖ్యలో మాంసాహారులు ఉన్నట్లు ఎన్ఎస్ఎస్ఓ(నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్) అధ్యయనంలో తేలింది. ఇందులోనూ.. పురుషుల్లో 98.8 శాతం, మహిళల్లో 98.6 శాతం మంది మాంసాహారులే. మాంసాహారులు ప్రధానంగా మటన్, చికెన్, చేపల వంటకాలనే ఇష్టపడుతున్నారు. మాంసాహారుల విషయంలో రెండో స్థానంలో నిలిచిన పశ్చిమబెంగాల్లో 98.7 శాతం, ఏపీలో 98.4 శాతం, ఒడిశాలో 97.7 శాతం, కేరళలో 97.4 శాతం మంది పురుషులు మాంసాహారులే. ఏటా తెలంగాణలో 4.47 లక్షల మెట్రిక్ టన్నులు, ఏపీలో 5.27 లక్షల మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి అవుతోంది. -
జింక మాంసం స్వాధీనం
అన్నానగర్: దేవాలావలో ఆదివారం 30 కిలోల జింక మాసాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. నీలగిరి జిల్లా కూడలూర్ తాలూకా దేవాలావా ప్రాంతంలో జింక మాంసం విక్రయిస్తున్నట్టుగా అటవీ శాఖాధికారులకు ఆదివారం సమాచారం అందింది. దీని ప్రకారం అటవీ శాఖ అధికారులు శరవణన్, లూయిష్, మిల్టన్ ప్రభు ఆ ప్రాంతానికి వెళ్లి విచారణ చేశారు. అదే ప్రాంతానికి చెందిన పుష్పరాజ్ ఇంట్లో తనిఖీ చేయగా 30కిలోల జింక మాంసం లభ్యమైంది. దీనికి సంబంధించి పుష్పరాజ్ (56), ఇతని కుమారుడు పేరళగన్ (26)లను దేవాలావ అటవీ శాఖ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ చేశారు. ఇందులో టేన్‌టి రేంజ్ నెంబర్–1 ప్రాంతంలో జింక మృతి చెంది ఉందని, దాన్ని మాంసం కోసం ఇంటికి తీసుకెళ్లినట్లుగా నిందితులు అటవీశాఖాధికారులకు తెలిపారు. తరువాత జింక మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి వారిద్దరిని అరెస్టు చేశారు. -
కుళ్లిన మాంసంతో బిర్యానీ
తాడేపల్లిరూరల్ (మంగళగిరి): ఎప్పుడో ఒకసారి తనిఖీచేసే అధికారుల తీరుతో కొన్ని హోటళ్ల యాజమాన్యాలు బరితెగిస్తున్నాయి.. కుళ్లిన మాంసంతో బిర్యానీ వండి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పరిధిలోని మాంసం దుకాణాలను, బిర్యానీ హోటళ్లను శుక్రవారం రాష్ట్ర మాంసం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సి.ప్రకాష్ నాయుడు, మున్సిపల్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏ హోటల్లో తనిఖీ చేసినా వారం రోజుల నుంచి 10 రోజుల వరకు నిల్వ చేసిన మాంసం, ఆహార పదార్థాలు బయటపడ్డాయి. ఒక్కో హోటల్లో అయితే ఫ్రిజ్ అడుగుభాగంలో పురుగులు కూడా దర్శనమిచ్చాయని తనిఖీల్లో పాల్గొన్న ఓ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న స్టార్ దమ్ బిర్యానీ హోటల్ యాజమాన్యం వినియోగదారుల ఆరోగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా కుళ్లి కంపు కొడుతున్న మటన్, చికెన్లతో బిర్యానీ వండుతున్నట్లుగా గుర్తించి, యాజమాన్యానికి రూ.15వేలు జరిమానా విధించారు. మరోచోట ఏ మాత్రం శుభ్రత పాటించని ఓ మాంసం దుకాణ యజమానికి రూ.10 వేలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ప్రకాష్‌నాయుడు మాట్లాడుతూ ఆహార పదార్థాలను నిల్వ ఉంచి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటల్ యజమానులపై స్థానిక అధికారులు నిరంతరం నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తనిఖీల్లో మున్సిపల్ కమిషనర్ ఎన్.వి.నాగేశ్వరరావు, పశంసంవర్థక శాఖ ఏడీ డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
మాంసం అమ్మకంలో మోసం
అమరావతి,నగరంపాలెం: చికెన్ స్టాల్స్‌లో కుళ్లిన, దుర్వాసనతో బూజు పట్టిన స్థితిలో ఫ్రిజ్‌లలో కేజీల కొద్ది నిల్వ ఉన్న మాంసాన్ని రాష్ట్ర మాంసం అభివృద్ధి కార్పొరేషన్ (ఎస్ఎండీసీ) చైర్మన్ ప్రకాష్ నాయడు ఆకస్మిక తనిఖీలో వెలుగు చూసింది. రాష్ట్రవ్యాప్తంగా మాంసం అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న తనిఖీల్లో భాగంగా సోమవారం నగరంలో పలు ప్రాంతాల్లోని చికెన్ స్టాల్స్, పౌల్ట్రీ ఫారాల్లో ఆయన నగరపాలక సంస్థ ప్రజారోగ్యశాఖతో కలసి తనిఖీలు నిర్వహించారు. నల్లచెరువు ప్రదాన రహదారిలో ఉన్న రెండు, మణిపురం బ్రిడ్జ్ వద్ద, పొన్నూరురోడ్డులోని కోడి మాంసం విక్రయించే దుకాణాలను తనిఖీ చేశారు. దుకాణాల్లోని ఫ్రిజ్‌ల్లో కిలోల కొద్ది కుళ్లినన స్థితిలో గడ్డకట్టిన మాంసాన్ని గమనించి నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బందితో ప్రకాష్ నాయుడు చెత్త కుండీలో వేయించారు. దుకాణ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రథమ తప్పుగా షాపులకు రూ.95 వేలు అపరాధ రుసుం విధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మాంసం దుకాణాలపై ప్రజారోగ్య, ఫుడ్ అధికారులతో టాస్క్‌ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తామని చైర్మన్ ప్రకాష్ నాయుడు తెలిపారు. మాంసం విక్రయిదారులకు స్థానిక సంస్ధల సహకారంతో త్వరలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ ప్రజారోగ్యశాఖ అధికారి డాక్టరు శోభారాణి, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
గణతంత్రం నాడే తమ్ముళ్ల మాంసపు విందు
వైఎస్ఆర్ జిల్లా, కుచ్చుపాప(చాపాడు): స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతితో పాటు భారత జాతీయదినాలలో ఒకటైన గణతంత్ర దినాన ప్రభుత్వం మద్యం, మాంసం నిషేధాన్ని ప్రకటించింది. అయితే శుక్రవారం తెలుగుతమ్ముళ్లు జాతిని అవమానపరుస్తూ మండలపరిధిలోని కుచ్చుపాప గ్రామంలో జరిగిన మాంసపు విందులో పాల్గొన్నారు. వీరితో పాటు వారి నాయకుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జీ పుట్టా సుధాకర్‌యాదవ్ కూడా పాల్గొన్నారు. రిపబ్లిక్‌డే సందర్భంగా మైదుకూరులోని పార్టీ కార్యాలయంలో పుట్టా జాతీయజెండాను ఎగుర వేసి వేడుకల్లో పాల్గొన్నారు. తర్వాత కుచ్చుపాపలో రామసుబ్బారెడ్డి, వెంకటసుబ్బారెడ్డిలు టీడీపీలో చేరుతూ విందును ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు గణతంత్ర దినోత్సవం అని కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా విందులో పాల్గొని మాంసపు వంటలను ఆరగించారు. అధికారులు సైతం పట్టించుకోకపోవటం గమనార్హం. -
చెట్ల మాంసాన్ని మీరు తినబోతున్నారు..!!
టెపిక్, మెక్సికో : మరికొద్ది సంవత్సరాల్లో మీరు జంతువుల మాంసానికి బదులు చెట్ల నుంచి తయారు చేసిన మాంసాన్ని ఆస్వాదించబోతున్నారు. అవును. ప్రపంచవ్యాప్తంగా మాంసానికి డిమాండ్ విపరీతంగా పెరుగుతుండటంతో ప్రత్యామ్నాయ మార్గాలకు అడుగులు పడుతున్నాయి. 2050 కల్లా ధనిక దేశాల్లో జంతువుల మాంసం మాయమవుతుందని ఓ పరిశోధకుడి రిపోర్టు. ఆయన ప్రకారం చెట్ల నుంచి తయారు చేసిన మాంసం లేదా ఫ్యాక్టరీల్లో తయారు చేసిన మాంసం మార్కెట్లో, రెస్టారెంట్లలో మాంసాహార ప్రియులకు విందుగా మారుతుంది. సాధారణ జంతువుల మాంసంతో పోల్చితే అత్యధిక ప్రొటీన్ విలువలతో రుచిగా ఈ మాంసం ఉంటుంది. పురుగులు, స్పిరులినా లాంటి ప్రత్యమ్నాయంగా మారుతాయని మరికొందరు పరిశోధకులు చెప్పారు. యూఎన్ ఫుడ్ అగ్నికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ) ప్రకారం.. 2050 కల్లా మానవ అవసరాల రీత్యా వ్యవసాయ ఉత్పత్తులు 50 శాతం పెరగాల్సివుంది. -
మాంసం కోసం.. అమ్మాయిని చంపి..
సాక్షి, మాస్కో: మనిషి మాంసం కోసం యువతిని చంపిన ఘటన రష్యాలోని ఓ పట్టణ వాసులు వణికిపోతున్నారు. నది ఒడ్డున నిర్మానుష్య ప్రదేశంలో గుర్తు తెలియని యువతి శవం పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ స్థలానికి చేరుకుని వివస్త్రగా పడి ఉన్న అమ్మాయిని చూసి షాక్‌కు గురయ్యారు. ఆమె శరీర భాగాలను కత్తితో కోసి, మాంసాన్ని సేకరించినట్లు నిర్ధారించారు. ఘటనాస్థలిలో సర్జన్ వినియోగించే గ్లౌజులు దొరకడంతో.. ఓ నేర్పరి అయిన వైద్యుడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. మాంసం కోసం అమ్మాయిని చంపారనే వార్త రష్యా న్యూస్ చానెళ్లలో ప్రసారం కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఒంటరిగా బయటకు వెళ్లేందుకు మహిళలు, పిల్లలు జంకుతున్నారు. మనిషి రక్త మాంసాలకు అలవాటు పడిన మానవ మృగాన్ని త్వరగా పట్టుకోవాలని పోలీసులను కోరుతున్నారు. కాగా, రష్యా ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. -
ఎకానమీ క్లాస్‌లో మాంసాహారం బంద్
న్యూఢిల్లీ: దేశీయ విమానాల్లోని ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు మాంసాహారం వడ్డించబోమని ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా పేర్కొంది. ఇకపై కేవలం శాకాహారం మాత్రమే అందిస్తామని తెలిపింది. అంతర్జాతీయ విమానాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది. ‘గత రెండు వారాల నుంచే దేశీయ విమానాల్లోని ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు మాంసాహారం వడ్డించడం లేదు’ అని సంబంధిత అధికారి చెప్పారు. కాగా ఎయిరిండియాకు రూ. 52వేల కోట్ల వరకు అప్పులున్నాయి. దీంతో సంస్థను ప్రైవేటీకరించేందుకు కేంద్ర కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అయితే ప్రైవేటీకరణ బారినుంచి ఎయిరిండియాను కాపాడుకునేందుకు ఉద్యోగులు ఖర్చు తగ్గింపు ప్రణాళికలను యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. -
కమ్మని బోనం
1 పప్పు వడ కావలసినవి: పచ్చి శనగపప్పు – అరకిలో; మినప్పప్పు–పావుకిలో; కరివేపాకు– రెండు రెమ్మలు; కొత్తిమీర –ఒక కట్ట; ఉల్లిగడ్డ – 1; పచ్చిమిరపకాయలు– 5; అల్లం–చిన్నముక్క; ఉప్పు – తగినంత; నూనె –వేయించేందుకు తగినంత. తయారి: పచ్చిశనగపప్పు, మినçప్పప్పు రెండు గంటలసేపు నీళ్ళలోనానబెట్టాలి. నానబెట్టిన పప్పులను వక్క చెక్కగా రుబ్బాలి.తరువాత అల్లం, పచ్చిమిరపకాయలను ముద్దగా నూరి, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి, వీటన్నిటినిపిండిలో కలుపుకోవాలి. నూనె వేడిచేసి పిండి తీసుకుని అరచేతిలో ఒత్తి వడలు వేసుకోవాలి. వీటిని కోడికూర, మటన్ షోర్వాతో తింటే మరింత రుచిగా ఉంటుంది. 2 పులిహోర కావలసినవి: బియ్యం – కిలో; చింతపండు గుజ్జు – అర కప్పు; నూనె– పావు కప్పు; పల్లీలు (వేరుశనగకాయలు)– పావు కప్పు; శనగపప్పు – టీ స్పూను; మినప్పప్పు – టీ స్పూను;ఎండు మిరపకాయలు – 4; పచ్చిమిరపకాయలు – 5 ; నువ్వులపొడి – 2 టీ స్పూన్లు; పసుపు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; కరివేపాకు – 4 రెమ్మలు తయారి: అన్నం ఉడికించి చల్లార్చాలి. బాణలిలో నూనెవేసి ఎండుమిరపకాయలు, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఒకదాని తరువాత ఒకటి వేసివేయించాలి. ఆ తరువాత చింతపండుగుజ్జు, ఉప్పు వేసి దగ్గరపడేవరకూ ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. 3 పరమాన్నం కావలసినవి: పాలు– అరలీటరు, బియ్యం – కప్పు; బెల్లం– కప్పు; చక్కెర– పావు కప్పు; ఏలకులు – 3; జీడిపప్పు – 2 టీస్పూన్లు; కిస్మిస్లు – 2 టీస్పూన్లు; నెయ్యి– 4 టీస్పూన్లు తయారి: జీడిపప్పుని, కిస్మిస్లను విడివిడిగా నేతిలో వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. పాలు బాగా కాగిన తరువాత బియ్యం వేసి బాగా ఉడకనివ్వాలి. బెల్లం, చక్కెర వేసి కొంచెం దగ్గర పడిన తరువాత దింపుకోవాలి. గార్నిషింగ్ కోసం ఏలకుల పొడి, వేయించిన జీడిపప్పులను, కిస్మిస్లను వేసి స్టౌ పై నుంచి దించేయాలి. 4 బగారా అన్నం కావలసినవి బియ్యం – కిలో; ఉల్లిపాయలు – 2; నూనె లేదా నెయ్యి – 5 టీ స్పూన్లు; అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూను; పచ్చిమిరపకాయలు –5; కొత్తిమీర – కట్ట; పుదీన – 2 కట్టలు; పెరుగు – 1 కప్పు; బిర్యానీ ఆకులు – 2; ఏలకులు – 2; లవంగాలు – 2. తయారి: వెడల్పాటి గిన్నెలో నూనె వేడిచేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, పుదీన, ఏలకులు, లవంగాలు, ఉల్లిగడ్డ కలిపి వేయించాలి. తరువాత పెరుగు కలపాలి. ఈమిశ్రమంలో రెండు లీటర్ల నీళ్ళుపోసి మరిగాక బియ్యం పోసి ఉడికాక కొత్తిమీర కలిపి దించేయాలి. బగారా అన్నం వండితే ఇంటికి పండగ వచ్చేసినట్టే. 5 జొన్నరొట్టె కావలసినవి: జొన్నపిండి – 2 కప్పులు, నీళ్లు – తగినన్ని తయారి: జొన్నపిండి గోరు వెచ్చటి నీరు, ఉప్పు కలిపి ముద్దలా చేసుకోవాలి. చిన్నముద్ద తీసుకొని పీట మీద లేదా బండమీద చేత్తోఒత్తుతూ చపాతీల్లా గుండ్రంగా చేసుకోవాలి. పీటకి అంటుకోకుండామధ్య మధ్యలో పిండిని చల్లుకుంటూ గుండ్రంగా చేసుకోవాలి. దీనినిపెనంమీద వేసి రెండువైపులా ఎర్రగా కాల్చి తీసివేయాలి. వీటికివెల్లుల్లి కలిపిన కారం, వెన్న అద్దుకుని తింటే చాలా రుచిగా వుంటాయి. తయారి:మొక్కజొన్న కంకులనుంచి గింజలను వేరుచేసిఉప్పు, పచ్చిమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లి వేసి మెత్తగారుబ్బుకోవాలి. బాణలిలో నూనెవేడిచేసి నిమ్మకాయ సైజంతపిండి తీసుకొని అరచేతిమీదఒత్తి నూనెలో వేయాలి.ఎర్రగా కాల్చి తీసివేయాలి. నాటు కోడి, ఖీమా కూరలు జొన్నరొట్టెలకు మంచి కాంబినేషన్. 6 గోలిచ్చిన మాంసం కావలసినవి: మటన్ – కేజి; ఉల్లిపాయలు – 2; అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు స్పూన్లు; కారం – 2 టీ స్పూన్లు; పసుపు – అర టీ స్పూన్; ఉప్పు – తగినంత; జీలకర్ర పొడి – టీ స్పూన్; పచ్చిమిరప పేస్ట్ – టీ స్పూన్; కరివేపాకు – ఒక రెబ్బగసగసాలు – 2 టీ స్పూన్లు; పచ్చికొబ్బరి – 2 టీ స్పూన్లునూనె – 4 టీ స్పూన్లు తయారి: మటన్‌లో ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర‡పొడి కలిపి పక్కన ఉంచుకోవాలి. కడాయిలో నూనె వేసి ఉల్లిపాయముక్కలను ముందుగా వేయించి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక పక్కన ఉంచుకున్న మటన్ ముక్కల్ని కూడా కలిపి వేయించాలి. ఒక టీ కప్పు నీళ్ళు పోసి 20 నిముషాలు మగ్గనివ్వాలి. ఈ లోగా కొబ్బరి గసగసాలు ముద్దచేసుకొని ఎర్రకారం, కొత్తిమీర, కరివేపాకువేసి మరికొద్దిసేపు మగ్గనిచ్చి దించేయాలి. చుట్టాల మర్యాదకు ఇది ప్రత్యేకం. 7 కార్జం వేపుడు కావలసినవి: కార్జం – అర కిలో (పొట్టేలు లివర్); నూనె – తగినంత; అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీస్పూన్లు; ఉల్లిగడ్డ తరుగు – 1 కప్పు; గరంమసాలా – చిటికెడు; కారం – 2 టీస్పూన్లు; పసుపు – తగినంత; ఉప్పు – తగినంత తయారి: బాణలిలో నూనె వేసి ఉల్లిగడ్డ వేయించి తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. లివర్ ముక్కలు కూడా వేసి వేయించాలి. ఈ మిశ్రమానికిఉప్పు, గరంమసాలా, కారం, కలుపుకోవాలి. ముక్కలు మెత్తగా కావాలనుకుంటే కొద్దిగా నీళ్ళు చల్లివేయించాలి. 8 మక్కగారెలు కావలసినవి: మొక్కజొన్న కంకులు – 4; ఉప్పు – తగినంత; నూనె – వేయించేందుకు సరిపడినంత; పచ్చిమిరప తరుగు – ఒక స్పూను; వెల్లుల్లి – 4 రేకులు తయారి: మొక్కజొన్న కంకులనుంచి గింజలను వేరుచేసిఉప్పు, పచ్చిమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. బాణలిలో నూనెవేడిచేసి నిమ్మకాయ సైజంతపిండి తీసుకొని అరచేతిమీద ఒత్తి నూనెలో వేయాలి. ఎర్రగా కాల్చి తీసివేయాలి. జోరువానకు బెస్ట్ కాంబినేషన్. 9 నాటుకోడి షోరువా కావలసినవి: కోడి – కేజీ; ఉల్లిపాయలు –2; ఎండు కొబ్బరి – 2 టీ స్పూన్లు; గసగసాలు – 2 టీ స్పూన్లు; అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు; నిమ్మరసం – 2 టీస్పూన్లు; ఉప్పు – తగినంత. తయారి: నాటుకోడికి చిటికెడు పసుపు కలిపి ఒక ఉడుకురానివ్వాలి. నూనె వేడిచేసి ఉల్లిపాయల్ని వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేర్చి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. ఈ మిశ్రమంలో ఉడికించి ఉంచినకోడి మాంసాన్ని కలిపి మగ్గనివ్వాలి. రెండు కప్పుల నీళ్ళు పోసి బాగా ఉడికించి చివరిగా నిమ్మరసం కలుపుకోవాలి. మాంసాహార ప్రియులకు నోరూరించే వంటకం ఇది. 10 పచ్చి పులుసు కావలసినవి: చింతపండు – 100 గ్రాములు; కారప్పొడి – టీ స్పూన్; ధనియాల పొడి – అర టీ స్పూన్; ఉప్పు – తగినంత; పసుపు – చిటికెడు; పచ్చిమిర్చి పేస్ట్ – టీ స్పూన్; ఉల్లిగడ్డ తరుగు – అరకప్పు; నువ్వులు – 50 గ్రా.; కరివేపాకు – రెండు రెబ్బలు ; కొత్తిమీర – తగినంత; నూనె – రెండు టీ స్పూన్లు. తయారి: చింతపండు పులుçసుకు కారప్పొడి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు కలుపుకోవాలి. నువ్వులు వేయించి పొడి చేసి ఆ పొడిని కూడా ఈ పులుçసుకు కలపాలి. నూనె వేసి ఎండు మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర తాలింపు వేసి పులుసును పోసి దించేయాలి. ఉల్లిపాయ ముక్కలు కలపాలి. వేడివేడి అన్నంలో ముద్దపప్పుతోపాటు పచ్చిపులుసు తింటే చాలారుచిగా, మజాగా ఉంటుంది. ఖర్చులేని పచ్చిపులుసు సామాన్యుడి వంట. -
కలకలం.. పవిత్ర స్థలంలో మద్యం, మాంసం
అమేథి: పవిత్ర రంజాన్ రోజున మత ఘర్షణలు సృష్టించేందుకు గుర్తు తెలియని దుండగులు ప్లాన్ చేశారు. ప్రార్థనా స్థలంలో రాత్రవేళలో మద్యం, మాంసం వేసి వెళ్లారు. యూపీలోని అమేథీ షుకుల్ బజార్లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాదల్‌ఘర్ ఈద్గాలో వద్ద రంజాన్ ప్రార్థనలకు వెళ్లిన వారు ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులకు సమాచారం అందించారు. ఈద్గాను శుభ్రం చేసిన అనంతరం అక్కడ రంజాన్ ప్రార్థనలు జరిగాయి. ఈ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్పీ పూనమ్ వెల్లడించారు. -
‘మాంసం’ గొడవ వరుడినే మార్చేసింది..!
ముజాఫర్‌నగర్: పెళ్లి విందులో మాంసాహారం లేదని గొడవకు దిగిన వరుడితో తెగతెంపులు చేసుకుందో వధువు. అయితే అంతలోనే అనూహ్యంగా పెళ్లికి వచ్చిన అతిథి వధువును పెళ్లాడతానని ముందుకొచ్చాడు. ఆమె కూడా సరేననడంతో ఘనంగా పెళ్లి జరిగింది. సినీ తరహాలో జరిగిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కుల్హేదీ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. విందులో మాంసాహారం పెట్టలేదని వరుడు కుటుంబం వధువు కుటుంబంతో వాదనకు దిగింది. మార్కెట్లో మాంసం కొరత ఉందని అందుకే వండలేకపోయామని చెప్పినా వినలేదు. సముదాయించాలని యత్నించినా ఫలితం లేదు. దీంతో విసుగెత్తిన వధువు అసలు పెళ్లే వద్దని తేల్చి చెప్పింది. చివరకు ఆమెను పెళ్లాడతానని ముందుకొచ్చిన వ్యక్తితో ఏడడుగులు నడిచింది. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని అక్రమ కబేళాలను నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ మాంసం కొరత పెరిగింది. ఫలితంగా చికెన్ ధరలను అమాంతం పెంచేశారు. -
మాంసం ఏమైనా కొత్తగా తింటున్నామా?
చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన వారు మాత్రమే ధర్మం, నిజమైన మార్గం, పవిత్రమైనది లేదా అపవిత్రమైనది అనే దాని గురించిన ఆలోచిస్తారని మత్స్యేంద్రనాథ్( ఉత్తర భారతదేశంలో నాథ్ ఫౌండేషన్‌ను స్ధాపించిన గోరక్నాథ్ గురువు) ఆయన రాసిన అకుల్వీర్ తంత్ర గ్రంథంలో పేర్కొన్నారు. మరి మత్స్యేంద్రనాథ్ను అనుసరించే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు బహుశా ఈ విషయం తెలుసో లేదో!. ధర్మం పేరిట సృష్టించుకున్న కొన్ని నిబంధనలను సడలించుకోవాలని గురు మత్స్యేంద్రనాథ్ ఆ కాలంలో పిలుపునిచ్చారు. కౌలోపనిషత్తులో ఈ విషయాన్ని మరింత విపులంగా వివరించారు. నిజమైన స్వీయ జ్ఞానం కలిగిన వ్యక్తి ఉపవాసం ఉండడని, సమాజంలో ఒక వర్గాన్ని స్ధాపించడని, ఎలాంటి నిబంధనలు పెట్టుకోడని, అతని దృష్టిలో మనుషులందరూ ఒకటేనని కౌలోపనిషత్తు వివరించింది. కానీ ప్రస్తుత పరిస్ధితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రతి విషయం త్వరగా రాజకీయ రంగు పులుముకుంటోంది. అందులోకి తాజాగా శాకాహారం వచ్చి చేరింది. శాకాహారిగా ఉండటం భారత సంప్రదాయమని చెబుతూ.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాంసాహారంపై నిషేధం విధించారు. మాంసాహారం చరిత్ర వాస్తవానికి మాంసాహారాన్ని తీసుకునే అలవాటు రామాయణ కాలం నుంచి ఉంది. సింధు లోయ నాగరికత కాలంలో భారతీయులు ఎద్దు, దున్న, గొర్రె, మేక, తాబేలు, ఉడుం, చేపల మాంసాన్ని రోజూ వారీ ఆహారంగా వినియోగించారనడానికి ఆధారాలు ఉన్నాయి. అప్పట్లో ఏర్పాటు చేసుకున్న మార్కెట్లలో మాంస క్రయ, విక్రయాలు జోరుగా సాగేవి. 250 రకాల జంతువుల్లో 50 రకాల జీవులను చంపి వాటి మాంసాన్ని తినొచ్చని వేదాల్లో రాసి ఉంది. గుర్రం, గేదే, మేకల మాంసాన్ని తినొచ్చని బుగ్వేదంలో ఉంది. ఇందులోని 162వ శ్లోకంలో చక్రవర్తులు గుర్రాలను ఎలా వధించేవారో వివరంగా ఉంది. ఒక్కో దేవుడికి ఒక్కో రకమైన జంతువును బలి ఇచ్చేవారు. అగ్నికి ఎద్దు, ఆవులను, రుద్రుడికి ఎరుపు వర్ణం గల గోవులను, విష్ణువుకి మరగుజ్జు ఎద్దును, ఇంద్రుడికి తలపై మచ్చ కలిగిన ఎద్దును, పుషణ్కి నల్ల ఆవును బలి ఇచ్చేవారు. అగస్య మహాముని ఒకేసారి వంద ఎద్దులను బలి ఇచ్చిన సంఘటనను తైత్రేయ ఉపనిషత్తు ప్రశంసలతో ముంచెత్తింది. కొంతమంది బ్రహ్మణులు బంధువులు వచ్చిన సమయంలో కచ్చితంగా ఆహారంలో మాంసం ఉండేలా ఏర్పాట్లు చేసుకునేవారు. బృహాదారణ్యక ఉపనిషత్తులో మాంసాన్ని బియ్యంతో కలిపి వండే వారని ఉంది. దండకారణ్యంలో వనవాసానికెగిన రాముడు, సీత, లక్ష్మణులతో అలాంటి ఆహారాన్ని తీసుకున్నారని కూడా ఇందులో ప్రస్తావించారు. దీన్ని మాంసం భుత్తాదన అనేవారు. అయోధ్య రాజు దశరథుడు మటన్, పోర్క్, చికెన్, నెమలి మాంసంతో కూరలు వండే సమయంలో వాటిలో సుగంధ ద్రవ్యాలను ఉపయోగించేవారు. మహాభారతంలో కూడా మాంసానికి సంబంధించిన వివరణలు ఉన్నాయి. ఉడికించిన అన్నంతో కలిపి మాంసాన్ని తీసుకునేవారని, కొన్ని రకాల పక్షులను కాల్చి తినేవారని, గేదె మాంసంపై నెయ్యి వేసుకుని తినేవారని ఉంది. - ఓ సామాజిక వాది వ్యాసం -
కుమ్ముడు కనుమా..
రూ.12 కోట్ల విలువైన మటన్, చికెన్ లాగించారు.. రూ.8 కోట్ల మందు తాగేశారు.. విశాఖపట్నం: మాంసం ప్రియులు, మందుబాబులు మజా చేశారు. కనుమ పండగను బాగా ఎంజాయ్ చేశారు. సుమారు నాలుగు లక్షల కిలోల చికెన్‌ను, లక్ష కిలోల మటన్‌ను లాగించేశారు. దాదాపు రూ.8 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు. వెరసి కనుమకు మాంసం, మద్యం కోసం రూ.20 కోట్లు వెచ్చించి ఔరా! అనిపించారు. సంక్రాంతి మూడు రోజుల్లో కనుమ పండగకు ఓ ప్రత్యేకత. మాంసాహారులు, మద్యం ప్రియులకు ప్రీతికరమైన పండగ. భోగి, సంక్రాంతి పండగలకు మాంసాహారానికి దూరంగా ఉంటారు. సంక్రాంతి మర్నాడు వచ్చే కనుమ పండగ నాడు విధిగా మాంసాన్ని భుజించడం ఆనవాయితీ. మద్యం తాగాలన్న ఆచారం, ఆనవాయితీలు లేకపోయినా పనిలో పనిగా మందుబాబులు కనుమ నాడు మద్యం సేవించడానికి ప్రాధాన్యమిస్తారు. అందువల్లే కనుమ రోజు లిక్కర్, చికెన్, మటన్ కొనుగోళ్లకు జనం క్యూ కట్టారు. ఈ ఏడాది కనుమకు మాంసాహారులు, మద్యం ప్రియులకు ఆదివారం అడ్డంగా కలిసొచ్చింది. దీనికి చికెన్ ధర అందుబాటులో ఉండడం తోడైంది. ఇంకేముంది? కుమ్మేశారు. ఈ కనుమ పండగ కోసం పౌల్ట్రీ వ్యాపారులు రెండు లక్షల కోళ్లను సిద్ధం చేశారు. ఒక్కో కోడి బరువు సగటున రెండున్నర కిలోలకు చేరుకుంది. ఈ లెక్కన వ్యర్థాలు పోను ఒక్కో కోడి రెండు కిలోల చొప్పున చూస్తే ఇటు నగరంలోనూ, అటు జిల్లాలోనూ నాలుగు లక్షల కేజీల చికెన్ విక్రయాలు జరిగాయి. కిలో చికెన్ ధర స్కిన్ 130, స్కిన్లెస్ రూ.140–150కు విక్రయించారు. ఈ లెక్కన ఒక్క కనుమ నాడు అమ్ముడయిన చికెన్ ఖరీదు దాదాపు రూ.6 కోట్లన్నమాట! ఇక మటన్ విషయానికొస్తే జిల్లాలోను, నగరంలోనూ సుమారు 8 వేల మేకలు, గొర్రెలు అమ్ముడు పోయినట్టు అనధికార అంచనా. ఒక్కో గొర్రె నుంచి సగటున 12 కిలోల మాంసం లభ్యమవుతుంది. అంటే దాదాపు లక్ష కిలోల మటన్ అన్నమాట. కిలో మటన్ మార్కెట్లో రూ.600లకు విక్రయించారు. ఇలా చూస్తే దీని విలువ రూ.6 కోట్ల వరకు ఉంటుంది. అంటే చికెన్, మటన్లకు కనుమ రోజు వెచ్చించిన సొమ్ము రూ.12 కోట్లు! -
సండే స్పెషల్ గురూ!
కుక్కలను కోసి కొండ గొర్రె మాంసమని విక్రయం - లేగ దూడలను కోసి దుప్పి మాంసం అని అమ్మకం - పిల్లులను చంపి కుందేలు మాంసం అంటున్నారని ప్రచారం - కిలో మటన్ ధరలో.. సగానికే అమ్మడంపై అనుమానాలు - ఇప్పటికే వరంగల్‌లో పోలీసులకు పట్టుబడిన ఓ ముఠా పెద్దపల్లి: వన్య ప్రాణుల మాంసం అంటే ఎవరికైనా ఇష్టమే.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ చాటుమాటున వన్యప్రాణుల మాంసం విక్రయిస్తూ అక్కడక్కడా పోలీసులకు పట్టుబడుతున్న వారున్నారు. వన్య ప్రాణుల మాంసం పేరిట స్థానికంగా గ్రామాల్లో సంచరించే కొందరు వ్యక్తులు కుక్కలు, లేగదూడలు, పిల్లుల మాంసాన్ని వన్య ప్రాణుల మాంసంగా సండే స్పెషల్ పేరిట అమ్ముతున్నారు. పెద్దపల్లి పట్టణానికి ప్రతి ఆదివారం కొందరు వ్యక్తులు నిర్మల్, మహాముత్తారం ప్రాంతం నుంచి మాంసం తెచ్చి విక్రయిస్తున్నారు. అయితే వారు ప్రతి ఆదివారమే అమ్మడం అనుమానాలకు తావిస్తోంది. వన్య ప్రాణులన్నీ శనివారమే దొరుకుతున్నాయా.. అనే ప్రశ్న వ్యక్తమవుతోంది. కాగా, వన్య ప్రాణుల పేరిట కుక్కలను చంపి కొండ గొర్రెగా, లేగ దూడలను కోసి దుప్పి మాంసంగా, జంగపిల్లులు, పెంపుడు పిల్లులను హతమార్చి కుందేలు మాంసంగా విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐదారు నెలల క్రితం జయశంకర్ జిల్లాకు చెందిన కొందరు వేటగాళ్లు లేగలను చంపి దుప్పి మాంసంగా వరంగల్‌లో ప్రతి ఆదివారం విక్రయిస్తుండగా.. ఈ ముఠాను పథకం ప్రకారం అక్కడి పోలీసులు పట్టుకున్నారు. దాంతో వేటగాళ్లు తెస్తున్న మాంసం వన్యప్రాణులది కాదని, స్థానికంగా ఉన్న జంతువుల మాంసాన్ని ఈ రకంగా విక్రయిస్తున్నట్లు తేటతెల్లమైంది. ఆదివారమే ఎందుకు..? మాంసం ప్రియులు ప్రతి ఆదివారం విందు చేసుకోవడం సహజం. జిహ్వచాపల్యం వన్యప్రాణుల రుచిని కోరడంతో ఇదే అదనుగా కొందరు వ్యాపారులు ఆదివారం ఇలాంటి మాంసాన్ని విక్రయిస్తున్నారు. గడిచిన ఐదారేళ్లుగా వన్య ప్రాణుల మాంసం ప్రతి వారంవారం పెద్దపల్లిలో విక్రయిస్తున్నారు. ఇక ధర విషయంలో కూడా గొర్రె, మేక మాంసం కంటే ధర తక్కువకు లభించడం కూడా అనుమానాలకు దారి తీస్తోంది. ఎంతో అరుదుగా లభించే కొండ గొర్రె కిలో మాంసం ధర కేవలం రూ. 250లకే అందిస్తున్నారు. ఇక దుప్పి, మెకం లాంటి జంతువుల మాంసాన్ని కిలో రూ. 300లకే విక్రయిస్తున్నారు. స్థానిక మార్కెట్లలో గొర్రె పొట్టేలు, మేక మాంసం ధర కిలో రూ. 450 పైనే ఉంటోంది. రహస్యంగా అమ్ముతున్న వన్యప్రాణుల మాంసం ధర రెట్టింపు ఉండాల్సిందిపోయి.. సగం ధరకే దూర ప్రాంతాల నుంచి తెచ్చి మరీ ఇక్కడ విక్రయించడం చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల నుంచి వాట్సాప్‌లో కుక్కను కోసి వన్య ప్రాణుల మాంసంగా విక్రయిస్తున్నారన్న వీడియో ఒకటి హల్చల్ చేస్తోంది. దీంతో కొద్దికాలంగా ఆదివారం పూట వన్యప్రాణుల మాంసంగా ఎంతో రుచితో తింటున్న వారు కూడా ఒక్కసారిగా అయోమయంలో పడ్డారు. అప్పట్లో నాగా దళాలు.. పెద్దపల్లి జిల్లాలోని ధర్మపురి అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలో ఇక్కడికి చేరుకున్న నాగాలాండ్ దళాల సభ్యులు కుక్కలను విచ్చలవిడిగా చంపితిన్నారు. పెద్దపల్లి, ధర్మారం, వెల్గటూర్ మండల కేంద్రాల్లో ఎన్నికలకోసం నాగాలాండ్ దళాలను కేంద్ర ప్రభుత్వం దించింది. ఆ సమయంలో పహారా కాస్తున్న నాగా దళాల సభ్యులు తమకు ఎదురుపడ్డ ఊర కుక్కలను చంపి, వేపుకొని మరీ తిన్నారు. ఇలా చాలాకుక్కలు నాగా దళాలకు ఆహారంగా మారాయి. అదే పద్ధతిలో అటవీప్రాంతాలకు చెందిన వేటగాళ్లు కుక్కలను చంపి వన్యప్రాణి మాంసంగా విక్రయిస్తున్నారని పలువురు మాంసప్రియులు అంటున్నారు. కొండ గొర్రె కూర ఉందని ఫోనొచ్చింది.. పోయిన ఆదివారం ఆదిలాబాద్ జిల్లా జన్నారం నుంచి ఓ వ్యక్తి కొండగొర్రె కూర ఉందని ఫోన్ చేశాడు. ఆ రోజు మా ఇంట్లో విందు ఉండడంతో అప్పటికే మాంసం తెచ్చుకున్నాం. ఈ కూర తీసుకోలేదు. పోలీసులకు దొరికితే కేసు పెడతారని భయంతో వద్దన్నాం. కానీ, పెంపుడు జంతువులనే చంపి, అడవి మాంసంగా అమ్ముతున్నట్లు ప్రచారం జరుగుతోంది. – కొండి శ్రీనివాస్, మెకానిక్ -
రుచుల గుట్ట
ప్రాంతాలు వేరు కావచ్చు. ప్రాంతాల పేర్లు మారొచ్చు.మనుషుల్ని ఎప్పటికీ కలిపి ఉంచేవి కిచెన్లే! ఈ జిల్లా... ఆ జిల్లా అని లేదు. ఈ రాష్ట్రం... ఆ రాష్ట్రం అని లేదు. ‘భోజనం రెడీ’ అవగానే... మనుషులంతా ఒక్కటే.. భూగోళమంతా... విస్తరే! ఈ వారం సాక్షి ఫ్యామిలీ యాదాద్రి భువనగిరి నుంచి...క్యారియర్ తెచ్చింది.టేస్ట్ చెయ్యండి. పుంటికూర (గోంగూర)బోటి కావాల్సినవి: పుంటికూర ఆకులు – 250 గ్రాములు, బోటి (మేక మాంసం) – 500 గ్రాములు, కొత్తిమీర – తగినంత, పుదీన – గుప్పెడు, ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి), అల్లం– వెల్లుల్లిపేస్ట్ – 2 టీ స్పూన్లు, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – తగినంత, మసాలా – టీ స్పూన్, గసగసాలు – టీ స్పూన్ తయారీ విధానం: ∙మేక మాంసం తీసుకొని వేడినీటిలో 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తరువాత శుభ్రంగా కడిగి ముక్కలు చేయాలి. పొయ్యి మీద గిన్నెపెట్టి నూనె వేసి, వేడిచేయాలి. ఆ తరువాత అల్లం– వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేసి తాలింపు చేయాలి. ఆ తరువాత బోటిని వేసి 5 నిమిషాలు ఉడికించాలి. తగినంత కారం, ఉప్పు కలిపి ఉడికించాలి. 15 నిమిషాల తరువాత తరిగిన పుంటికూర ఆకులు వేసి ఉడికించాలి. తరువాత గరం మసాలా, కొత్తిమీర వేసి దించాలి. పచ్చికొబ్బరి షర్బత్ కావాల్సినవి: బెల్లం –1 కిలో, నీళ్లు – 2 లీటర్లు, పచ్చి కొబ్బరి – 250 గ్రాములు, పచ్చిసోంపు – 150 గ్రాములు, కొత్త కుండ – 1 తయారీ: ∙ముందుగా పచ్చికొబ్బరిని, సోంపును కచ్చా పచ్చాగా దంచుకొని ముద్ద చేయాలి. ఆ తరువాత గిన్నెలో 2 లీటర్లు నీళ్లు పోసి, బెల్లం తురుము వేసి, గరిటెతో కలుపుతూ కరిగించాలి. ఈ బెల్లం నీళ్లను ఒక కొత్త కుండలో పోసి, మరికొద్దిసేపు ఒక గరిటెతో కలపాలి. కొబ్బరి, పచ్చిసోంపు ముద్ద వేసి, పైకి కిందకు కలపాలి. దానిని ఓ రెండు గంటలు ఉంచి, తరువాత తాగితే రుచిగా ఉంటుంది. చింతచిగురు ఎండుచేపలకూర కావాల్సినవి: చింతచిగురు – రెండుకప్పులు, వట్టిచేపలు (ఎండుచేపలు/రొయ్యలు) – 100 గ్రాములు, ఉల్లిపాయలు – రెండు, పచ్చిమిర్చి – నాలుగు, జీలకర్ర – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – చిటికెడు, కారం – టీ స్పూన్ (తగినంత), ఉప్పు – తగినంత, నూనె – మూడు టేబుల్ స్పూన్లు, అల్లం – వెల్లుల్లి ముద్ద – టీ స్పూన్, గరం మసాలా – టీ స్పూన్, కొత్తిమీర తరుగు – టీ స్పూన్ తయారీ: ∙పొయ్యి వెలిగించి, మూకుడు పెట్టి వేడి అయ్యాక, కడిగి ఆరబెట్టిన ఎండు చేపలను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మూకుడులో నూనె వేసి వేడయ్యాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన మిరపకాయలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. అందులో అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి కలిపి తర్వాత కరివేపాకు, పసుపు వేయాలి. రెండు నిమిషాల తర్వాత నలిపిన చింతచిగురు వేసి, కలపాలి. ఎండుచేపలను వేసి, కలిపి అందులో కారం, ఉప్పు వేసి మూతపెట్టాలి. మూడు నిమిషాల తర్వాత మరోసారి కలియబెట్టి, వేగాక అందులో గరంమసాలా వేసి దించి కొత్తిమీరతో అలంకరించాలి. మలిదముద్దలు కావాల్సినవి: బియ్యప్పిండి/ సజ్జపిండి/ గోధుమపిండి – కిలో, బెల్లం – 500 గ్రాములు, ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడినన్ని, యాలకుల పొడి‡– రెండు టీ స్పూన్లు, బాదం పప్పులు – 2 టేబుల్ స్పూనులు (ముక్కలు చేసినవి), జీడిపప్పులు – 2 టేబుల్ స్పూన్లు (ముక్కలు చేసినవి) తయారీ: ∙ఒక గిన్నెలో బియ్యం పిండిని తీసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి, నీళ్లు పోస్తూ రొట్టె పిండిలా ముద్ద చేసుకొని, పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత రొట్టెల పీట మీద రొట్టె మాదిరి మందంగా ఒత్తుకోవాలి. తర్వాత పొయ్యి మీద పెనం పెట్టి, రొట్టెను రెండు వైపులా కాల్చుకోవాలి. తరువాత దానిని ఒక గిన్నెలో ముక్కలు ముక్కలుగా చేసుకొని, బెల్లం తురుము వేయాలి. వేడివేడిగా ఉన్న రొట్టె ముక్కలను, బెల్లంతో కలుపుతూ, యాలకుల పొడి, బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు పోయాలి. మళ్ళీ కలపాలి. ఆ తర్వాత కావల్సిన పరిమాణంలో గుండ్రంగా చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న ముద్దలు రుచిగా, బలవర్ధకంగా ఉంటాయి. చెన్నంగి(కసివింద)ఆకు పచ్చడి కావాల్సినవి: చెన్నంగి ఆకు–2 కప్పులు, ఎండు మిరపకాయలు –10, మిరియాలు – 10, వెల్లుల్లి రెబ్బలు –5, జీలకర్ర – టీ స్పూన్, చింతపండు– 10 గ్రాములు, మినప్పప్పు – 2 టీ స్పూన్లు, కరివేపాకు– రెమ్మ, ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు, నూనె–2 టీ స్పూన్లు తయారీ: ∙పొయ్యి మీద మూకుడు పెట్టి మిరియాలు, జీలకర్ర, మినపప్పు వేయించుకోవాలి. తీసి గిన్నెలో వేసి, మూకుడులో నూనె పోసి వేడయ్యాక అందులో ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చెన్నంగి ఆకు, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. చింతపండులో నారలు లేకుండా తీసి, మూకుడులో కొద్దిగా వేయించుకోవాలి. వేడి తగ్గాక ఈ మిశ్రమాన్ని తగినంత ఉప్పువేసి, మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో రోజూ రెండు ముద్దలు తింటే ఆరోగ్యానికి మంచిది. జీర్ణశక్తి పెరుగుతుంది. ఇన్పుట్స్: వెల్మినేటి జహంగీర్, మోత్కూరు; మహ్మద్ జమాలుద్దీన్, భువనగిరి టౌన్ ; ఎం.వెంకటరమణ, భువనగిరి ఖిల్లా -
ఆ పీడితుడు... ఇప్పుడు... దైవారాధకుడు
సువార్త గలిలయ సముద్రానికి అవతల ఉన్న గెరాసేనుల దేశానికి యేసుక్రీస్తు ఒకసారి వెళ్లాడు. అత్యంత హేయమైన పూజా విధానాలు, ఆచారాలున్న ఆ ప్రదేశానికి యూదులు వెళ్లడం నిషిద్ధం. కానీ అక్కడున్న ఒక దురాత్మల పీడితుణ్ణి బాగు చేయడానికి ప్రభువు వెళ్లాడు. అతడక్కడ అందరిపై దాడి చేస్తూ, గాయపరుస్తూ, అరుపులు కేకలతో హడలెత్తిస్తూ, నగ్నంగా తిరుగాడుతూ, సమాధుల్లో నివాసం చేస్తూ, అందరికీ బెడదగా మారాడు. యేసు అతణ్ణి కలుసుకోగానే స్వస్థపరచాడు. అంతే... అతను ఒక్కసారిగా సాధువైపోయి ఆయన పాదాల వద్ద కూర్చుండిపోయాడు. యేసు ఆజ్ఞతో అతణ్ణి వదిలిన ఎన్నో దుర్మాత్మలు అక్కడున్న రెండు వేలకు పైగా పందుల్లో దూరాయి. అవి తాళలేక పర్వతం పై నుండి సముద్రంలోకి దూకి చనిపోయాయి. కానీ అంతకాలం అన్ని దురాత్మల విధ్వంసక శక్తికి నిలయంగా ఉన్న ఆ వ్యక్తి మాత్రం స్వస్థచిత్తుడయ్యాడు. ఆ ప్రాంతవాసులంతా అది చూసి నివ్వెరపోయారు. యేసుక్రీస్తు కోరి మరీ నిషిద్ధ ప్రాంతానికి సైతం వెళ్లి అంతా ఈసడించుకున్న అతణ్ణి బాగుపరిచి నూతన జీవితాన్నివ్వడం దేవుని అసమాన ప్రేమకు అద్భుతమైన నిదర్శనం! మనం దేవుణ్ణి చూడకున్నా ఆయన మనల్ని చూస్తున్నా డనీ, చాలా ఈవులు (వరాలు) ఆయన మనం అడక్కుండానే మనకు అనుగ్రహిస్తున్నాడనీ అనడానికి అది ఒక ఉదాహరణ. దేవుని ప్రేమ తాకిడితో అతను సమాధులు వదిలి, దేవుని పాదాల వద్దే నివసిస్తున్నాడు. అరుపులు, కేకలు మాత్రమే ఎరిగిన వ్యక్తి ఇప్పుడు ఆరాధన చేస్తున్నాడు. నగ్నంగా పరుగులు తీసినవాడు ఇప్పుడు నవీన వ్యక్తిగా మారి నిశ్చలంగా, నిర్మలంగా దేవుని వద్ద కూర్చున్నాడు (మార్కు 5:1-20). లోకం వెలివేసిన వారినీ, పాపులనూ దేవుడు దగ్గరికి తీసి వారికి నూతన జీవితాన్నీ, నిత్యత్వాన్నీ ప్రసాదిస్తాడు. వారితోనే చరిత్రను తిరగరాయించి, లోకానికి వారిని ఆశీర్వాదంగా మారుస్తాడు. అదే దేవుని అద్భుతమైన ప్రేమ. అలాంటి యేసుక్రీస్తును ఆ వ్యక్తి స్వీకరించాడు కానీ, అక్కడి ప్రజలు తృణీకరించారు. తమ దేశాన్ని వదిలి వెళ్లమని అక్కడి ప్రజలు యేసును వేడుకోవడం ఆశ్చర్యం. ఎందుకంటే ఇస్రాయేలులోని యూదులకి పంది మాంసం నిషిద్ధం. కానీ అక్కడ రోమా అధికారులకీ, రోమా సైనికులకేమో అది అత్యంత ప్రీతిపాత్రం. అందువల్ల గెరాసేను ప్రజలు పందుల్ని పెంచి, మాంసాన్ని రోమీయులకు విక్రయించే లాభసాటి వ్యాపారం చేస్తున్నారు. ఆ కారణం వల్ల దురాత్మల పీడితుడు బాగయ్యాడని ఆనందించే బదులు, రెండు వేల పందులు చనిపోయాయని బాధపడ్డారు. యేసు అక్కడే ఉంటే మరిన్ని పందులు చనిపోతాయని భయపడ్డారు. దేవుడు అష్టకష్టాల కోర్చి, అన్నీ నష్టపోయి, పరలోకాన్ని కూడా వదిలేసి వచ్చి, పాపుల్ని రక్షించడానికి పూనుకుంటే - యేసు రాక వల్ల తాను ఎంత నష్టపోయానో లెక్కలేసుకుంటోంది ఈ లోకం. లోకపు లాభనష్టాల భాషకు దేవుని సర్వోన్నతమైన, అమూల్యమైన ప్రేమ విలువ అర్థమవుతుందా? దేవుని కన్నా మనుషుల కన్నా పందులనే ప్రేమించి వాటికే విలువనిచ్చే అక్కడి ప్రజల మధ్య తానుండలేనని గ్రహించిన ఆ వ్యక్తి తాను వెంట వస్తానని యేసును బతిమాలాడు. కానీ అక్కడే ఉండి పరిచర్య చేయమన్నాడు ప్రభువు. అతడా ప్రాంతంలో దివ్యమైన పరిచర్య చేసి ఎంతోమందిని ప్రభువు మార్గంలోకి నడిపించాడని చరిత్ర చెబుతోంది. - రెవ. డాక్టర్ టి.ఎ. ప్రభుకిరణ్ -
మాంసం ఎక్కువగా లాగిస్తున్న దేశాలివే..
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో ముక్క లేనిదే ముద్ద దిగడం లేదని ఐక్యరాజ్య సమితి వెల్లడించిన ఓ నివేదికలో తెలిసింది. ఒక అమెరికన్ ఏడాది కాలంలో సరాసరిన 126.6 కిలోల మాంసాన్ని హాంఫట్ చేస్తున్నాడు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వెల్లడించిన 'ద స్టేట్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్' నివేదికలో కేవలం లగ్జెంబర్గ్, హాంకాంగ్ ప్రజలు మాత్రమే మాంసం వినియోగంలో అమెరికా కంటే ముందున్నారని తేలింది. ఇది లగ్జెంబర్గ్‌లో 142.5 కిలోలుగా ఉండగా.. హాంకాంగ్‌లో 134 కిలోలుగా ఉంది. బ్రిటన్ 83.9 కిలోల మాంసం వినియోగంతో 25వ స్థానంలో నిలిచింది. 175 దేశాలతో విడుదల చేసిన ఈ జాబితాలో ఇక అతితక్కువ మాంసం వినియోగిస్తున్న దేశంగా బంగ్లాదేశ్ నిలిచింది. ఇక్కడ ఏడాది కాలంలో తలసరి వినియోగం 3.1 కిలోలుగా ఉంది. బురుండీ, కాంగోలు 3.7, 4.6 కేజీలతో బంగ్లాదేశ్ తరువాత తక్కువ వినియోగిస్తున్న దేశాలుగా నిలిచాయి. భారత్ 5.1 కిలోల తలసరి వినియోగంతో ఈ జాబితాలో 169వ స్థానంలో నిలిచింది. -
గాంధీ జయంతినాడు ముక్కా చుక్కా!
కుత్బుల్లాపూర్: జాతిపిత మహ్మాత్మాగాంధీ జయంతి నేడు మాంసం విక్రయించరాదని, ఎవరైనా తమ ఆదేశాలు బేఖాతర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ మాంసం దుకాణాల్లో జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు అంటించారు. ఆ తర్వాత అటు వైపు దృష్టి పెట్టకపోవడంతో ఆదివారం (గాంధీ జయంతి) కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో కొందరు మాంసం దుకాణదారులు యథావిధిగా షాపుల ముందే మేకలను కట్టి బహిరంగంగానే మాంసాన్ని విక్రయించారు. మరికొందరు షాపు షట్టర్లను సగం దించి.. గుట్టుచప్పుడుగా తమ దందా కొనసాగించారు. అలాగే, గాంధీ జయంతి నాడు మద్యం విక్రయాలపై నిషేధం ఉన్నా... మద్యం ఏరులైపారింది. వైన్ షాపులు ముందు మూత, వెనుక మద్యం గ్లాసుల మోత వినబడింది. జగద్గిరిగుట్ట, షాపూర్‌నగర్, కుత్బుల్లాపూర్, గాజులరామారం, సూరారం, చింతల్ తదితర ప్రాంతాల్లో ఇదే దృశ్యం కనిపించింది. -
నేడు మాంసం దుకాణాలు బంద్
సాక్షి,సిటీబ్యూరో: గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం మాంసం దుకాణాలు మూసి ఉంచాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మాంసం విక్రయాలకు పాల్పడే దుకాణాలు, వ్యక్తులపైన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. -
గొంతులో ఎముక ఇరుక్కొని..
చర్ల: మాంసం తింటుండగా గొంతులో ఎముక ఇరుక్కొని ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా చర్ల మండలంలో చోటు చేసుకుంది. తేగడ గ్రామానికి చెందిన నిట్టా జ్యోతి(50) ఆదివారం ఇంట్లో మాంసాహారం భుజిస్తుండగా ఓ ఎముక గొంతులో ఇరుక్కొని ఇబ్బంది పడింది. కడుపులోకి జారుతుందేమోనని చూసింది. అయినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు సోమవారం భద్రాచలంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు ఆమెను తరలించారు. ఆపరేషన్ చేయాలని అక్కడి వైద్యులు సూచించారు. ఆపరేషన్ చేయించేందుకు డబ్బులు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యాన్ని పొందవచ్చని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి మంగళవారం తీసుకు వెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు బుధవారం రాత్రి ఆమెకు ఆపరేషన్ చేస్తుండగా గొంతులో తీవ్ర రక్తస్రావమైంది. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున జ్యోతి మృతి చెందింది. ఆమెకు భర్త, ముగ్గురు పిల్లలుఉన్నారు. -
మాంసాహారంతో గుండెకు చేటా?
కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 52 ఏళ్లు. నేను తరచూ మాంసాహారం తీసుకుంటూ ఉంటాను. ఇది గుండెకు అంత మంచిది కాదనీ, ఆ ఆహార అలవాట్ల వల్ల గుండె దెబ్బతింటుందని కొందరు చెబుతున్నారు. ఇది నిజమేనా? మాంసాహారంతో గుండెజబ్బులు వస్తాయా? దయచేసి వివరించండి. - షరీఫ్, హైదరాబాద్ గుండెజబ్బులకు కొలెస్ట్రాల్ ఒక కచ్చితమైన రిస్క్‌ఫ్యాక్టర్. మాంసాహారం, కొవ్వులు ఎక్కువగా ఉండే ఫాస్ట్ఫుడ్స్లో ఇది ఎక్కువ. కొలెస్ట్రాల్ రెండు రకాలు. గుండెకు హాని చేసే కొలెస్ట్రాల్‌ను ఎల్డీఎల్ (లో డెన్సిటీ లిపోప్రొటీన్) అనీ, మేలు చేసేదాన్ని హెచ్‌డీఎల్ (హై డెన్సీటీ లైపోప్రొటీన్) అని అంటారు. మన రక్తంలో ఎల్డీఎల్ 100 కంటే తక్కువగానూ, హెచ్‌డీఎల్ 40 కంటే ఎక్కువగానూ ఉండాలి. అలాగే ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వులు 150 లోపు ఉండాలి. కొలెస్ట్రాల్ మన శరీరానికి రెండు రకాలుగా అందుతుంది. మొదటిది ఆహారం ద్వారా, రెండోది కాలేయం పనితీరు వల్ల. శిశువు పుట్టినప్పుడు శరీరంలో 70 మి.గ్రా. కొలెస్ట్రాల్ ఉంటుంది. మెదడు, నరాల వ్యవస్థ ఇలా శిశువు పూర్తిగా ఎదగడానికి రెండేళ్ల వయసు వచ్చే వరకు కొలెస్త్రాల్ ఎక్కువ మోతాదులో అవసరమవుతుంది. రెండేళ్ల తర్వాత దీని అవసరం అంతగా ఉండదు. అయితే వ్యక్తుల్లోని జన్యుతత్వాన్ని బట్టి కూడా మంచి, చెడు కొలెస్ట్రాల్ ఉత్పత్తి ఎక్కువ/తక్కువగా అవుతుంటుంది. మాంసాహారం మాత్రమేగాక... వేపుళ్లు, బేకరీ పదార్థాలు, నెయ్యి లాంటి వాటిని పరిమితి కంటే మించి ఎక్కువగా తీసుకుంటే ఆహారం కాస్తా కొవ్వుగా మారుతుంది. అది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు, దాన్ని పరిమితిలో ఉంచుకోడానికి మందులు వాడుతుంటే, వాటిని మధ్యలో మానేయకూడదు. మీరు మాంసాహారం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ కొవ్వులు తక్కువగా ఉండే చికెన్ తీసుకోవచ్చు. అయితే చికెన్ కంటే కూడా చేపలు మరికాస్త మేలైనవి. - డాక్టర్ అనుజ్ కపాడియా సీనియర్ కార్డియాలజిస్ట్,కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఇలాచేస్తే.. వారం రోజులు మాంసం తాజాగా ఉంటుంది
చండీగఢ్: మేక, గొర్రెను కోసిన తర్వాత దాని మాంసం ఆరు గంటలు మాత్రమే బయటి వాతావరణంలో తాజాగా ఉంటుంది. దాన్నే ఫ్రిజ్‌లో భద్రపరిస్తే రెండు రోజులపాటు తాజాగా ఉంటుంది. ఆ తర్వాత కుళ్లిపోతుంది. రెండు రోజులకన్నా ఎక్కువ సేపు మాంసాన్ని భద్రపర్చాలంటే దానికి రసాయనాలను పూయక తప్పదు. రసాయనాల మిశ్రమం వల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది. ఎలాంటి రసాయనాలు పూయకుండా మరి ఎక్కువ రోజులపాటు మాంసాన్ని భద్రపర్చాలంటే ఏం చేయాలి? సరిగ్గా ఇదే దిశగా హర్యానాలోని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)కు చెందిన జంతు ఉత్పత్తుల విభాగం శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి విజయం సాధించారు. మాంసాన్ని పొరలుగా కట్‌చేసి దానిమ్మ తొక్క నుంచి తీసిన యాంటీఆక్సిడెంట్లను ఎక్కిస్తే ఆ మాంసం ఫ్రిజ్‌లో పెట్టకపోయినా మామాలు ఇంటి ఉష్ణోగ్రతలో వారం రోజులపాటు తాజాగా ఉంటుందని తేలింది. బ్యాక్టీరియాను సమర్థంగా ఎదుర్కొనే ఫ్లవొనాయిడ్స్ లాంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు దానిమ్మ తొక్కలో ఉంటాయి. దానిమ్మ తొక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయనే విషయాన్ని ఇప్పటికే పరిశోధకులు కనిపెట్టారు. దానిమ్మ తొక్క పొడిని ఔషధంగా వాడినట్లయితే మధుమేహాన్ని నియంత్రించవచ్చని, గుండె జబ్బులను, కాలేయ సమస్యలను దూరంగా ఉంచవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకున్న డీఆర్డీవో శాస్త్రవేత్తలు సరిహద్దు ప్రాంతాల్లో, మంచు పర్వత ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు తాజా మాంసాన్ని చేరేవేసే ఉద్దేశంతో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. సాధారణంగా సైనిక బేస్ క్యాంపులకు చేరేవేసే మాంసాహారం దూరప్రాంతాల్లో ఉన్న సైనికుల వద్దకు చేరేసరికి మూడు, నాలుగు రోజులు గడిచి చెడిపోతోంది. ఒక్క గొర్రె, మేక మేంసాన్ని తాజాగా ఉంచేందుకే కాకుండా కోడి, పంది మాంసాన్ని తాజాగా ఉంచేందుకు కూడా దానిమ్మ పండు తొక్కలు ఉపయోగపడతాయని వారు తెలియజేశారు. -
మాంసం కొనేటప్పుడు జాగ్రత్తసుమా!
రాయవరం : ఇటీవలి కాలంలో మాంసం వినియోగం పెరుగుతోంది. మాంసంలో అధికంగా మాంసకృత్తులు, విటమిన్లు, కొవ్వు పదార్థాలు అధికంగా లభించడమే దీనికి కారణం. వీటిని కొనుగోలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొనకపోతే వ్యాధులబారిన పడే అవకాశం ఉంటుందని రాయవరం పశువైద్యశాల సహాయ సంచాలకుడు డాక్టర్ ఎం.రామకోటేశ్వరరావు హెచ్చరిస్తున్నారు. మాంసం నాణ్యతను, మాంసం నిల్వ అయితే కలిగే మార్పులను గమనించి కొనుగోలు చేయాలంటున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. మాంసం నాణ్యత రంగు, మెత్తదనం, రుచి, వాసన, నీటిని పీల్చే గుణాన్నిబట్టి మాంసం నాణ్యతను నిర్ధారించవచ్చు. సాధారణంగా మాంసం ఎరుపు రంగులో ఉంటుంది. గొడ్డు మాంసం ముదురు ఎరుపు రంగులోను, మేక, గొర్రె మాంసం మధ్యస్థ ఎరుపు రంగులోను, పంది మాంసం తెలుపు రంగులోను ఉంటుంది. చిన్న వయసు ఉన్న పశువు మాంసంతో పోలిస్తే పెద్ద వయసు ఉన్న పశువు మాంసం ఎక్కువ ఎరుపు రంగులో ఉంటుంది. నీటిని పీల్చే గుణం లేత వయసు పశువు మాంసంలో ఎక్కువగా ఉంటుంది. నిల్వ ఉంచిన మాంసానికి నీటిని పీల్చుకునే గుణం తగ్గుతుంది. మెత్తదనం అనేది కండరాలను కలిపే కణజాలంవల్ల కలుగుతుంది. చిన్న వయసు పశువులతో పోలిస్తే పెద్ద వయసు పశువుల్లో ఈ కణజాలం తక్కువగా ఉండి మాంసం గట్టిగా ఉంటుంది. ప్రతి జంతువు మాంసానికి ఒక ప్రత్యేకమైన వాసన ఉంటుంది. దానినిబట్టి మాంసాన్ని గుర్తించవచ్చు. మాంసం నిల్వ అయితే కలిగే మార్పులు * మాంసాన్ని సక్రమంగా నిల్వ చేయకుంటే కొన్ని మార్పులు జరిగి పాడైపోతుంది. సూక్ష్మజీవులు, శిలీంధ్రాల మూలంగా మాంసంలోని కొవ్వులు, మాంసకృత్తులు విచ్ఛిన్నమై కొన్ని మార్పులు జరుగుతాయి. * సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు జరిపే చర్యల వల్ల బ్యుటరిక్, ప్రొపియోనిక్లు ఏర్పడి మాంసానికి చెడు వాసన కలుగుతుంది. * నిల్వ మూలంగా సూక్ష్మజీవులు స్రవించే రంగుల వలన మాంసం ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోకి మారుతుంది. * సూడోమోనాస్, స్ట్రెప్టోకోకస్, లాక్టోబాసిల్లస్ వంటి బాక్టీరియాల వల్ల మాంసంపై పలుచని జిగురు వంటి పొర ఏర్పడుతుంది. * మాంసంపైన శిలీంధ్రాల వల్ల నలుపు, తెలుపు, ఆకుపచ్చని మచ్చలు, రంగు మచ్చలు ఏర్పడతాయి. * మాంసంలోని సల్ఫర్ పదార్థాలు విచ్ఛిన్నమవడం వలన హైడ్రోజన్ సల్ఫేట్, ఇతర మార్పుల వల్ల కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతాయి. * పాడైపోయినప్పుడు ఉత్పత్తి అయిన ఆమ్లాల వలన మాంసం పుల్లగా మారుతుంది. * కొవ్వు పదార్థాల విచ్ఛిన్నం జరిగి ఒక రకమైన వాసన వస్తుంది. దీనినే ‘రేన్సిడ్’ వాసన అంటారు. * ప్రొటీన్లు విచ్ఛిన్నం జరిగితే చేదు రుచి, చెడు వాసన కలుగుతాయి. * ఫాస్ఫోరిసాన్నే అంటారు. * కొన్నిసార్లు ఎముక దగ్గరి మాంసం పాడైపోతుంది. -
భళా.. నల్ల బంగారం!
- కడక్‌నాథ్ కోడి మాంసంలో విశిష్టమైన ఔషధ గుణాలు - వంద కోళ్లు పెంచితే 5 నెలల్లో రూ. 50 వేల నికరాదాయం - వినియోగదారునికి ఆరోగ్యం.. రైతుకు అధికాదాయం.. - ప్రోత్సహిస్తున్న వైరా కృషి విజ్ఞాన కేంద్రం కడక్‌నాథ్.. మధ్యప్రదేశ్ లోని దేశవాళీ కోళ్ల జాతి ఇది. నిలువెల్లా కారు నలుపులో ఉండటం వల్ల దీన్ని స్థానికులు కలిమసి (నల్లటి మాంసం కలిగిన పక్షి) అని పిలుస్తారు. దీని మాంసం కూడా నల్లగానే ఉంటుంది. మధ్యప్రదేశ్‌లోని దుర్భిక్ష ప్రాంతాలైన జబువా, ధార్ జిల్లాల్లో భిల్లులు, బిలాలా తదితర గిరిజనులు కోళ్ల ఫారాలను ఏర్పాటు చేసుకొని కడక్‌నాథ్ కోళ్లను పెంచుతూ పేదరికాన్ని అధిగమిస్తున్నారు. కడక్‌నాథ్ కోడి మాంసంలో ఔషధ గుణాలున్నాయని శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది. దీనివల్ల మధ్యప్రదేశ్‌లోనే గాక హైదరాబాద్, రాజస్థాన్, చత్తీస్ఘడ్ వంటి ప్రాంతాల్లోను కడక్‌నాథ్ కోడి మాంసానికి మంచి గిరాకీ ఏర్పడింది. నరాల వ్యాధులను తగ్గించే హోమియో మందుల తయారీకి అవసరమైన ఔషధ గుణాలు కడక్‌నాథ్ మాంసంలో ఉన్నాయి. ఈ మాంసంలో ఇనుము పాళ్లు ఎక్కువగా, కొవ్వు పాళ్లు తక్కువగా ఉన్నాయని బెంగళూరుకు చెందిన కేంద్రీయ ఆహార పరిశోధనా సంస్థ తెలిపింది. గుండె సంబంధిత వ్యాధులు, ఆస్త్మాతో బాధపడే వారికి కడక్‌నాథ్ మాంసాన్ని మేలైన ఆహారంగా సిఫారసు చేస్తున్నారు. ఈ కారణాల వల్ల కడక్‌నాథ్ మాంసానికి విపరీతమైన గిరాకీ ఏర్పడి మంచి ధర పలుకుతోంది. అయితే, పెరటి కోళ్లలా సంప్రదాయ పద్ధతుల్లో పెంచటం, సరైన వ్యాధి నివారణ చర్యలు పాటించకపోవటం, వినియోగం పెరిగి ఉత్పత్తి తగ్గటం వంటి కారణాలతో ఈ మధ్యకాలంలో కడక్‌నాథ్ కోళ్ల సంఖ్య భారీగా పడిపోయింది. మంచి గిరాకీ ఉండటాన్ని గుర్తించిన జబువా కృషి విజ్ఞాన కేంద్రం ఈ దేశవాళి కోడి జాతి అంతరించిపోకుండా కాపాడేందుకు నడుం బిగించింది. ముందుగా జబువా జిల్లాలోని జయదా ప్రాంతంలో శాస్త్రవేత్తలు పర్యటించి సమస్యను అధ్యయనం చేశారు. పెంపకంలో సంప్రదాయ పద్ధతులను అనుసరించటం వల్ల కోళ్ల బరువు పెరుగుదల రేటు చాలా తక్కువగా ఉంది. వ్యాధి చికిత్స, నియంత్రణలో శాస్త్రీయ పద్ధతులను పాటించకపోవటం వల్లే సగం కోళ్లు చనిపోతున్నట్టు వారు గుర్తించారు. రైతులకు కడక్‌నాథ్ కోళ్ల పెంపకంతో కలిగే లాభాలపై అవగాహన క ల్పించారు. స్థిరమైన ఆదాయంతో వలసలకు చెక్.. ముందుగా భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐ.సి.ఎ.ఆర్.)కి చెందిన జాతీయ వ్యవసాయ ఆవిష్కరణ ప్రణాళికా సంస్థ అందుబాటులో ఉన్న వనరులతో తక్కువ ఖర్చులోనే కోళ్ల ఫారాలను ఏర్పాటు చేసింది. కోడి పిల్లల ఉత్పత్తి కోసం జబువాలోని కృషి విజ్ఞాన కేంద్రానికి ఐ.సి.ఎ.ఆర్. రూ. 50 లక్షలు మంజూరు చేసింది. కృషి విజ్ఞాన కేంద్రం ప్రతి నెలా 5 వేల కడక్‌నాథ్ కోడి పిల్లలను ఉత్పత్తి చేసి రైతులకు సరఫరా చేస్తోంది. ఎంపిక చేసిన 500 మంది రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించింది. నాణ్యమైన మేత తయారీ, వ్యాధి నిరోధక టీకాలు వేయటంలో శిక్షణనిచ్చారు. కాలానుగుణంగా టీకాలు వేయటం వల్ల కోళ్ల మరణాలు 50 నుంచి 10 శాతానికి తగ్గాయి. 5 నెలల్లో అమ్మకానికి వస్తాయి.. ధాన్యం, ఊక వంటి స్థానికంగా లభించే వనరులతో రైతులే స్వయంగా దాణాను తయారు చేసుకుంటున్నారు. దీనివల్ల ఖర్చు తగ్గటంతో పాటు కోళ్లకు పోషకాలతో కూడిన ఆహారం లభించి వేగంగా బరువు పెరిగాయి. 5 నెలల్లో పుంజులు 3 కిలోలు, పెట్టలు 2 కిలోల బరువు పెరుగుతున్నాయి. ఒక్కో కోడి పిల్ల కొనుగోలు ధర రూ. 60., మేత, టీకాలు వంటివాటికి మరో రూ. 200 ఖర్చవుతుంది. కడక్‌నాథ్ కోళ్లు ఐదు నెలల్లో అమ్మకానికి వస్తాయి.. కిలో రూ. 350 చొప్పున.. కోడిని ఏకమొత్తంగా అయితే రూ. 800 కు విక్రయిస్తున్నారని జబువా కృషి విజ్జాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఐ. ఎస్. తోమర్ (09425 188028, 07392-244367) ‘సాగుబడి’కి తెలిపారు. అయితే, ఈ జాతి కోడిపెట్టలు గుడ్లను పొదగవు. వీటి గుడ్లను నాటుకోళ్ల కింద వేసి పొదిగించుకోవాలి. లేదా ఇంక్యుబేటర్ వాడాల్సి ఉంటుంది. కనీసం వంద కడక్‌నాథ్ కోళ్లను పెంచుతున్న రైతు ఐదు నెలల్లో రూ. 50 వేల నికరాదాయం పొందుతున్నారు. విడతకు 500 వరకు కడక్‌నాథ్ కోళ్లను పెంచే రైతులు ఉన్నారు. అంటే ఒక్కో రైతు తక్కువలో తక్కువ ఏడాదికి రూ. లక్షపైగా ఆదాయం ఆర్జిస్తున్నారు. కోళ్ల విక్రయానికి అవసరమైన విపణి వ్యవస్థ అభివృద్ధి చెందటంతో కడక్‌నాథ్ కోళ్లను పెంచే ఫారాల సంఖ్య 300 కు చేరింది. క్రమంగా మరికొందరు రైతులు అదేబాటలో పయనిస్తూ.. స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. దీంతో ఈ ప్రాంతం నుంచి జీవనోపాధి కోసం జరిగే వలసలు నిలిచిపోయాయి. జిల్లా పరిపాలనా సంస్థ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జయదాకు చెందిన కడక్‌నాథ్ కోళ్ల పెంపకందారుల సంఘాన్ని, అవార్డ్, నగదు పురస్కారంతో సన్మానించింది. కడక్‌నాథ్ కోళ్ల పెంపకంలో జబువా జిల్లా వాసులు సాధించిన విజయం దేశంలోని ఇతర వెనుకబడిన కరవు ప్రాంతాల కు స్ఫూర్తిదాయకం. కడక్‌నాథ్ కోడి పిల్ల ధర రూ. వంద! ఖమ్మం జిల్లా వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రం కడక్‌నాథ్ కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది. జూన్ ఆఖరు నాటికి కడక్‌నాథ్ కోడి పిల్లలను రైతులకు అందుబాటులోకి తెస్తామని, పిల్ల ధర రూ. వంద ఉంటుందని వైరా కేవీకే సమన్వయకర్త డా. జె. హేమంత్‌కుమార్ (99896 23831) ‘సాగుబడి’తో చెప్పారు. సజ్జలు, జొన్నలు వంటి స్థానికంగా అందుబాటులో ఉండే చిరుధాన్యాలతో తయారు చేసుకున్న దాణాతోపాటు అజొల్లాను సైతం మేపవచ్చని ఆయన అన్నారు. - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్ -
క్యాన్సర్ కొరుకుతానంటోంది!
వేటమాంసం, ప్రాసెస్డ్ మాంసాలు అతిగా తినడం వల్ల గుండె రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయనీ, స్థూలకాయం వస్తుందనీ చాలాకాలంగా వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, వాటివల్ల రకరకాల క్యాన్సర్లు కూడా వస్తాయని ఇటీవల తేలింది. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతున్నదేమిటంటే, పాశ్చాత్య దేశాల్లో 30 శాతం క్యాన్సర్లు రావడానికీ, అక్కడి ఆహారపుటలవాట్లకూ సంబంధం ఉందట! ఇక, మన భారతదేశం లాంటి వర్ధమాన దేశాల్లో కూడా 20 శాతం క్యాన్సర్లకూ, మనం తినే ఆహారానికీ లింకు ఉందని తేల్చారు. మాంసం తినడం మానేసినవారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గినట్లు కూడా పరిశోధనలు చెబుతున్నాయి. ఆరు నెలల క్రితమే డబ్ల్యూహెచ్ఓ ఒక అధ్యయన నివేదికను విడుదల చేసింది. అందులో ఒక జాబితాను సిద్ధం చేశారు. ప్రమాదకరమైన క్యాన్సర్ కారకాల పేర్లతో కూడిన ‘గ్రూప్1’లో ప్రాసెస్డ్ మాంసాన్ని చేర్చారు. ఇక, క్యాన్సర్ తెచ్చే అవకాశమున్న ఆహారపదార్థాల పేర్లతో కూడిన ‘గ్రూప్ 2ఏ’లో రెడ్ మీట్ (వేట మాంసం)ను పేర్కొన్నారు. గొడ్డు మాంసం, పెయ్యదూడ మాంసం, పంది మాంసం, గొర్రె మాంసం లాంటివన్నీ ‘రెడ్ మీట్’ కిందకు వస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏటా దాదాపు 34 వేల మంది ప్రాసెస్డ్ మాంసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మరణిస్తున్నారని తాజా అంచనా. అలాగే, దాదాపు 50 వేల మంది రెడ్ మీట్ అతిగా తినడం వల్ల ఏటా క్యాన్సర్‌తో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రతిరోజూ తింటే... పెద్ద పేగు క్యాన్సర్ ‘అతి సర్వత్ర వర్జయేత్’ - దేనిలోనైనా అతి పనికి రాదు అని పెద్దల మాట. మాంసం తినే విషయంలోనూ ఇది పాటించాల్సిన సూత్రమే. ఎందుకంటే, అరుదుగా మాంసం తినేవాళ్ళతో పోలిస్తే ప్రతి రోజూ మాంసం తినేవారికి ‘పెద్ద పేగు క్యాన్సర్’ వచ్చే రిస్కు మూడు రెట్లు ఎక్కువని హార్వర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనాలు తేల్చాయి. దీనికి కారణాలు అన్వేషిస్తే - మాంసంలో పీచు పదార్థం కానీ, సంరక్షించే ఇతర పోషకాలు కానీ ఉండవు. పెపైచ్చు, మాంసంలో యానిమల్ ప్రోటీన్, శ్యాచురేటెడ్ కొవ్వు ఉంటాయి. మాంసాన్ని ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు, హెచ్చు ఉష్ణోగ్రతల్లో వండుతున్నప్పుడు క్యాన్సర్ కారకాలైన హెటెరో సైక్లిక్ ఎమైన్స్ (హెచ్‌సీఏ), పాలీ సైక్లిక్ ఆరోమేటిక్ హైడ్రోకార్బన్స్ (పీఏహెచ్) ఏర్పడతాయి. అవి క్యాన్సర్ రిస్క్‌ను పెంచుతాయి. ప్రాసెస్డ్ మాంసంలోని అతి కొవ్వు, ఇతర జంతు ఉత్పత్తుల వల్ల హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. దాని వల్ల వక్షోజ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి క్యాన్సర్లు కూడా ... గొడ్డుమాంసం, పంది మాంసం, గొర్రె మాంసం లాంటివి అతిగా తిన్నా, ప్రాసె్స్డ్ మాంసాన్ని అతిగా తిన్నా అన్నవాహిక, ఊపిరితిత్తులు, క్లోమం (ప్యాంక్రియాస్), పొట్ట, గర్భాశయం లోపలి పొర, ప్రొస్టేట్ గ్రంథులకు క్యాన్సర్లు వచ్చే రిస్క్ పెరుగుతుందని ‘అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రిసెర్చ్’ వెల్లడించింది. ప్రాసెస్డ్ మాంసంతో పురీషనాళ క్యాన్సర్ ఇటీవలి కాలంలో పురీషనాళ క్యాన్సర్ (కోలో రెక్టల్ క్యాన్సర్) ఎక్కువవుతోంది. ప్రాసెస్డ్ మాంసం అతిగా తీసుకొన్నా, అతిగా ఉడికించిన మాంసాన్ని భుజించినా ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువని పరిశోధకులు తేల్చారు. ప్రాసెస్డ్ మాంసంతో ఎందుకు ముప్పంటే, మాంసం పాడవకుండా ఉండడానికి సహజంగా కానీ, కృత్రిమంగా కానీ నైట్రైట్లు, నైట్రేట్ల లాంటి లవణాలను చేరుస్తారు. అవి మాంసంలోని పదార్థాలతో రియాక్ట్ అయి క్యాన్సర్ కారక పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. అవి మన డీఎన్ఏను దెబ్బ తీస్తాయి. రోజుకు 50 గ్రాముల ప్రాసెస్డ్ మాంసం తినడం వల్ల పురీష నాళ క్యాన్సర్ వచ్చే రిస్క్ 18 శాతం పెరుగుతుందని తాజా అమెరికన్ అధ్యయనం వెల్లడించింది. గ్రిల్డ్ మాంసంతోనూ చిక్కే! నేరుగా నిప్పుల మీద మాంసాన్ని వేయించడం (గ్రిల్డ్ మాంసం), కాల్చడం వల్ల కొవ్వు ఆ వేడి నిప్పుల మీదకు చేరుతుంది. దాంతో, పాలీసైక్లిక్ ఆరోమేటిక్ హైడ్రోకార్బన్ (పీఏహెచ్)తో నిండిన మంటలు వస్తాయి. సదరు పీఏహెచ్‌లు ఆహారం తాలూకు ఉపరితలానికి అంటుకుంటాయి. వేడి పెరిగిన కొద్దీ మరిన్ని పీఏహెచ్‌లు వస్తాయి. దాంతో, ఉదర సంబంధమైన క్యాన్సర్లు వచ్చే రిస్కు పెరుగుతుంది. అతి కొవ్వుతో రొమ్ము క్యాన్సర్ కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలు, పాల ఉత్పత్తులు, వేపుడు ఆహారపదార్థాలు తినడం వల్ల స్త్రీలలో మరింతగా ఈస్ట్రోజెన్స్ ఉత్పత్తి అవుతాయి. వక్షోజాలలో, స్త్రీల సెక్స్ హార్మోన్లకు స్పందించే ఇతర అవయవాల్లో క్యాన్సర్ కణాల పెరుగుదలను అది ప్రోత్సహిస్తుంది. కాబట్టి, రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని నివారించాలంటే- మాంసం, పాల ఉత్పత్తుల ద్వారా అధిక కొవ్వు తీసుకోకుండా జాగ్రత్తపడాలి. అయితే మాంసాహారం తక్కువ కావడం వల్ల విటమిన్ బి-12, విటమిన్-డి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇది గమనించి మితం హితం అన్న జాగ్రత్త తీసుకోవాలి. అరుదుగా మాంసం తినేవాళ్ళతో పోలిస్తే ప్రతి రోజూ మాంసం తినేవారికి ‘పెద్ద పేగు క్యాన్సర్’ వచ్చే రిస్కు మూడు రెట్లు ఎక్కువ - హార్వర్డ్ వర్శిటీ -
కృత్రిమ మాంసం రెడీ
తయారీ బృందంలో తెలుగు శాస్త్రవేత్త నాలుగైదేళ్లలో మార్కెట్లోకి: ఉమా వలేటి వాషింగ్టన్: మాంసం కోసం జంతుబలి అవసరం లేకుండా.. కల్తీలేని, ఆరోగ్యకర మాంసాన్ని అందించేందుకు అమెరికా శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం విజయవంతమైంది. ఓ తెలుగు శాస్త్రవేత్తతో కూడిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందం.. ప్రయోగశాలలో జంతు కణజాలం నుంచి కృత్రిమంగా మాంసాన్ని రూపొందించింది. ప్రయోగం విజయవంతం కావటంతో రాబోయే రోజుల్లో ప్రయోగశాలలో పెద్ద మొత్తంలో కృత్రిమ మాంసాన్ని తయారుచేయవచ్చని బృంద సభ్యుడైన తెలుగు శాస్త్రవేత్త ఉమా వలేటి తెలి పారు. దీంతో మాంసం కోసం జంతువులను వధించాల్సి న అవసరం ఇకపై ఉండదని హృద్రోగ నిపుణుడు కూడా అయిన వలేటి చెప్పారు. ఇలాంటి మాంసంలో కొవ్వు ఎక్కువగా ఉండదని, బ్యాక్టీరియా వల్ల చెడిపోదని దీంతో ఎక్కువకాలం నిలువ ఉంచుకోవచ్చన్నారు. కొత్త కణాల్ని తయారుచేసుకునే సామర్థ్యమున్న కొన్ని జంతువుల కణాలు సేకరించి.. దీనికి ఆక్సిజన్, పోషక పదార్థాలు అందిస్తే 9 నుంచి 21 రోజుల్లో మాంసం ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు. ఎక్కువగా వినియోగించే ఎద్దు, పంది, కోడి మాంసాలపై ప్రయోగాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మూడేళ్లలో రెస్టారెంట్లలో, ఐదేళ్లలో రిటైల్ మార్కెట్లలో దీన్ని ప్రవేశపెట్టేలా ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. మొదటి ఉత్పత్తి పరిశ్రమ అమెరికాలో నెలకొల్పుతామని, ఇండియా, చైనాల్లో కూడా ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని తెలిపారు. అమెరికాలోని మెం ఫిస్‌లో స్టెమ్ సెల్ బయాలజిస్టు నికోల స్ జెనోవెసే, బయో మెడికల్ ఇంజినీర్ విల్ క్లెమ్‌తో కలిపి వలేటి మెంఫిక్ మీట్స్‌ను స్థాపించి పరిశోధనలు కొనసాగిస్తున్నారు. -
మంచి మాంసానికి ఇంకెన్నాళ్లు?
పనులు పూర్తయినా అందుబాటులోకి రాని స్లాటర్‌హౌస్‌లు సిటీబ్యూరో: మాంసంలో కల్తీ జరుగకుండా ఉండేందుకు, గ్రేటర్ కార్పొరేషన్‌కు మాంసపు వ్యర్థాల నిర్వహణ భారం తగ్గించేందుకు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నగర ప్రజల అవసరాల కోసం ఆధునిక స్లాటర్‌హౌస్‌ల ఏర్పాటుకు అవసరమైన నిధులు మంజూరు చేశారు. నాలుగు స్లాటర్ హౌస్‌లతోపాటు ఒక రెండరింగ్(మాంసపు వ్యర్థాల ప్రాసెసింగ్) ప్లాంట్ ఏర్పాటుకు దాదాపు రూ. 70 కోట్లు వెచ్చించారు. దేశంలోని మరే ఇతర నగరాల్లో లేని విధంగా అంతర్జాతీయ ప్రమాణాల కనుగుణంగా అత్యాధునికంగా వీటిని ఏర్పాటు చేయాలని భావించారు. వివిధ కారణాలతో తీవ్ర జాప్యం జరిగినప్పటికీ ఎట్టకేలకు రెండేళ్లక్రితం ప్లాంట్ల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. అంబర్‌పేట, న్యూబోయిగూడ, గౌలిపురా, రామ్నాస్పురాలలో ఆధునిక స్లాటర్‌హౌస్‌లు, చెంగిచెర్లలో రెండరింగ్ ప్లాంటు ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. రెండరింగ్ప్లాంట్ను జర్మనీకి చెందిన కంపెనీ, నాలుగు స్లాటర్‌హౌస్‌లను నెదర్లాండ్ కంపెనీలు అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేశాయి. వీటి ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ (ఓ అండ్ ఎం) కోసం టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టు ఏజెన్సీలను సైతం ఎంపిక చేశారు. ఇది జరిగి రెండేళ్లయినా.. ఎంపికైన కాంట్రాక్టు సంస్థలకు నిర్వహణ బాధ్యతలు మాత్రం ఇంకా అప్పగించలేదు. గౌలిపురా స్లాటర్ హౌస్‌కు సంబంధించి.. ప్లాంట్ ఏర్పాటు చేసిన భూమి పరిసరాల్లోని కొన్ని భూములు కోర్టు వివాదంలో ఉండటంతో అక్కడ కాంట్రాక్టు సంస్థకు బాధ్యతలప్పగించలేదు. మిగతా ప్రాంతాల్లోని స్లాటర్‌హౌస్‌లను కాంట్రాక్టు పొందిన సంస్థలకు అప్పగించకపోవడానికి కారణం రెండరింగ్ ప్లాంట్ వినియోగంలోకి రాకపోవడం. స్లాటర్ హౌస్‌ల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు, పీసీబీ నిబంధనలు తదితర అంశాల నేపథ్యంలో స్లాటర్ హౌస్‌లను వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించాలంటే.. వాటినుంచి వెలువడే జంతువ్యర్థాలను ప్రాసెసింగ్ చేసే యూనిట్ 25 కి.మీ.లలోపు దూరంలో అందుబాటులో ఉండాలని సంబంధిత నిపుణులు పేర్కొంటున్నారు. చెంగిచెర్లలోని రెండరింగ్ ప్లాంట్ పూర్తయి, దానికి సైతం ఓ అండ్ ఎంకు టెండర్లు పిలిచినప్పటికీ.. చెంగిచెర్లలోని స్లాటర్ హౌస్ నిర్వాహకులు రెండరింగ్ప్లాంట్ నిర్వహణ తమకే ఇవ్వాలంటూ కోర్టు నాశ్రయించినట్లు తెలిసింది. కోర్టు తీర్పు వెలువడేంత వరకు దాని నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకెవరికీ కాంట్రాక్టుకివ్వరాదని కోర్టు ఆదేశించినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. దాంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో దాదాపు రూ.70 కోట్లు వెచ్చించి నెలకొల్పిన ప్లాంట్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. మరోవైపు స్లాటర్ హౌస్‌ల నిర్వహణను మాంసం అమ్మకం వృత్తిగా కలిగిన వారికే కాంట్రాక్టు కివ్వాలనే వివాదాలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చెంగిచెర్లలోని మీట్ కార్పొరేషన్‌కు చెందిన జంతువధశాల కాంట్రాక్టు పొందిన నిర్వాహకులే అటు రెండరింగ్ప్లాంట్తో పాటు ఇటు స్లాటర్‌హౌస్‌లను ఇతరులకు ఓ అండ్ ఎం బాధ్యతలు అప్పగించకుండా వివిధ ప్రయత్నాలతోపాటు రాజకీయంగానూ చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలున్నాయి. రాజకీయ కారణాల వల్లే జీహెచ్ఎంసీ సైతం చేష్టలుడిగి చూస్తోందనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం నాలుగు స్లాటర్ హౌస్‌లను వందరోజుల ప్రణాళికలో ఉన్నందున ఆలోగా అవి అందుబాటులోకి రాగలవని పలువురు విశ్వసిస్తున్నారు. ప్రమాణాలు పాటించాలి.. కేంద్ర ప్రభుత్వం, పీసీబీ తదితర నిబంధనల మేరకు స్లాటర్‌హౌస్‌లు తగిన ప్రమాణాలు పాటించాలి. అపరిశుభ్రత, దుర్గంధాలకు తావులేకుండా ఏర్పాట్లుండాలి. జంతువ్యర్థాలను సరైన పద్ధతుల్లో డిస్పోజ్ చేయాలి. అంటే.. రెండరింగ్ప్లాంట్లో ప్రాసెసింగ్ చేయాలి. పరిసరాల ప్రజలకు కాలుష్యం వెదజల్లకుండా తగిన పర్యావరణ ఏర్పాట్లు చేయాలి. మొక్కలు నాటాలి. పార్కింగ్ సదుపాయాలుండాలి. ప్రతి మూడునెలలకోమారు సంబంధిత సంస్థలు తనిఖీలు నిర్వహించాలి ప్రారంభోత్సవం జరిగినా.. రెండేళ్ల క్రితమే స్లాటర్‌హౌస్‌ల నిర్మాణాలు పూర్తికావడంతో అప్పటి మేయర్ మాజిద్ హుస్సేన్ రామ్నాస్పురాలోని స్లాటర్‌హౌస్‌కు లాంఛనంగా ప్రారంభోత్సవం కూడా చేశారు. అంతకుమించి ఓ అండ్ ఎం పనులు జరగలేదు. స్లాటర్ హౌస్‌లు వినియోగంలోకి వస్తే.. జీహెచ్ఎంసీకి ఏటా దాదాపు రూ. 30 కోట్ల ఆదాయం రానుండటమే కాక, వేల టన్నుల మాంసం విదే శాలకు ఎగుమతయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. స్లాటర్ హోస్లో జంతువులను ఇలా వధిస్తారు ఈ ఆధునిక వధశాలల్లో శాస్త్రీయ పద్ధతుల్లో జంతువుల్ని వధిస్తారు. వధించేందుకు ముందు ఒక యంత్రం వద్ద హలాల్ చేస్తారు. జంతువుల చర్మం, ఎముకలు, ఇతరత్రా వ్యర్థాలు వేర్వేరు మార్గాల్లోవచ్చేలా ప్లాంట్లలో ప్రత్యేక ఏర్పాట్లున్నా యి. రక్తం సైతం ఆటోమేటిక్‌గా ప్రత్యేక ట్యాంకులోకి చేరుతుంది. ఆహారంలో వినియోగించే మాంసం మాత్రమే విడిగా వచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. మాంసం చెడిపోకుండా నిల్వ ఉంచేందుకు కోల్డ్ స్టోరేజీ ఏర్పాట్లున్నాయి. జంతువులుఆరోగ్యంగా ఉన్నట్లు వెటర్నరీ అధికారులు పరీక్షించి నిర్ధారిస్తారు. ఇక్కడ వృథా ఆయ్యే వ్యర్థాలంటూ ఉండవు. స్లాటర్ హౌస్‌లలో నీటినిల్వ చేసేందుకు పెద్ద నీటి ట్యాంకులు, తదితర ఏర్పాట్లున్నాయి. పరిసరాల్లో దుర్గంధం వెదజల్లకుండా వాయువులు ఆకాశంలోకి పోయేలా ఎత్తై గొట్టాలు ఏర్పాటు చేశారు. అంబర్‌పేట స్లాటర్ హౌస్ ప్లాంట్ వ్యయం : రూ. 22.16 కోట్లు కాంట్రాక్టు విలువ: రూ. 10 కోట్లు స్లాటర్‌హౌస్ సామర్ధ్యం: 2వేల గొర్రెలు/ మేకలు, 300 పశువులు న్యూబోయిగూడ.. ప్లాంట్ వ్యయం : రూ. 14.92 కోట్లు కాంట్రాక్టు విలువ: రూ. 9 కోట్లు సామర్ధ్యం: 2వేల గొర్రెలు/ మేకలు, 200 పశువులు రామ్నాస్పురా.. ప్లాంట్ వ్యయం : రూ.8.61 కోట్లు కాంట్రాక్టు విలువ: రూ. 3.5 కోట్లు స్లాటర్‌హౌస్ సామర్ధ్యం: 100 పశువులు గౌలిపురా : వ్యయం : రూ.4.38 కోట్లు, కాంట్రాక్టు విలువ: రూ. 1.5 కోట్లు , సామర్ధ్యం: , 400 మేకలు/గొర్రెలు చెంగిచెర్ల రెండరింగ్ ప్లాంట్ : వ్యయం రూ. 19.17 కోట్లు, ఓ అండ్ఎం కాంట్రాక్టు అంచనా : రూ. 6 కోట్లు ,ప్రాసెసింగ్ సామర్ధ్యం: 80 మెట్రిక్ టన్నులు -
పశుమాంసంతో నూనె తయారీ: వ్యక్తి అరెస్ట్
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్): నగరంలోని చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పశుమాంసంతో నూనె తయారు చేస్తున్న ఓ కేంద్రం గుట్టురట్టయ్యింది. పోలీసుల దాడులతో ఈ నిర్వాకం వెలుగుచూసింది. ఆదివారం ఆల్జబ్రీ కాలనీలోని ఫార్మ్‌హౌస్‌పై దాడులు నిర్వహించిన పోలీసులు పశుమాంసంతో నూనెను తయారు చేస్తున్నట్టు గుర్తించారు. నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
మాంసం పంచుకోవడంలో వివాదం: వ్యక్తి హత్య
మహదేవ్పూర్ (కరీంనగర్) : వేటకు వెళ్లి కొట్టుకొచ్చిన వన్యప్రాణుల మాంసం పంచుకోవడంలో చెలరేగిన వివాదం ముదిరి పాకానపడి ఒకరి హత్యకు దారి తీసింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ మండలం దమ్మూరు గ్రామంలో గురువారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన పెద్దిగడ్డ బాబు(40), చిన్నబాపు(35) వేటకు వెళ్లి వన్య ప్రాణుల మాంసాన్ని తెచ్చుకున్నారు. దాన్ని పంచుకునే క్రమంలో ఇద్దరి మధ్య జరిగిన వివాదంలో చిన్నబాపు కర్రతో బాబుపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగ గాయపడిన బాబు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
'ప్రజల తిండి విషయంలో జోక్యం చేసుకోం'
కోల్‌కతా: ముంబయిలో మాంసంపై నిషేధం విధించడంపట్ల విమర్శలు చేస్తున్నవారి సరసన పరోక్షంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేరారు. తమ ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో ఏ మాత్రం జోక్యం చేసుకోదని చెప్పారు. ఏం తినాలనేది నిర్ణయించుకునేది ప్రజలే తప్ప ప్రభుత్వ పరంగా నిర్ణయించలేమని, నిర్ణయించకూడదని అన్నారు. ఎవరు ఏం తినాలో వారి స్వయం నిర్ణయం అని చెప్పారు. సోమవారం మైనారిటీ డెవలప్మెంట్ శాఖ నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రస్తావించకుండానే తాను తన రాష్ట్రంలో విభజించి పాలన చేయనని, అందరికీ సమాన హక్కులు ఉండాలనే ఉద్దేశంతోనే పనిచేస్తానని చెప్పారు. -
మాంసం నిషేధంపై హైకోర్టు స్టే
ముంబయి: వాణిజ్య రాజధాని ముంబయిలో ఈ నెల 17న మాంసం అమ్మకాలను నిషేధించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపట్ల హైకోర్టు స్టే విధించింది. ఆ రోజు జంతు వధ విషయంలో జోక్యం చేసుకొని అలాంటివి జరగకుండా చూడాలని దాఖలు చేసిన పిటిషన్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించారు. 2004లో కూడా రెండు రోజులపాటు మాంసం అమ్మకాలను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారని గుర్తు చేసింది. జైనుల పవిత్ర కార్యక్రమం పర్యుషాన్ సందర్భంగా తొలుత ఎనిమిది రోజులు మాంసం నిషేధించాలని, ఆతర్వాత నాలుగురోజులకు కుదించి, అప్పటికీ పలు వర్గాల నుంచి విమర్శలు రావడంతో తర్వాత రెండు రోజులకు చివరికి ఒకే రోజుకు మాంసాన్ని నిషేధించినా.. దానిపై కూడా హైకోర్టు స్టే విధించింది. -
బ్యాన్... బ్యాన్!
చూడబోతే ఇది నిషేధాల రుతువులా కనబడుతోంది. ముంబై మహా నగరంలో ఈ నెల పదో తేదీతో మొదలుపెట్టి 13, 17, 18 తేదీల్లో మాంసం అమ్మకూడదని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మొన్న 9న ఉత్తర్వులు జారీచేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10, 17 తేదీల్లో మాంసం అమ్మకాలను నిషేధించింది. దాని స్ఫూర్తితో రాజస్థాన్ ప్రభుత్వమూ, ఈ హడావుడంతా చూసి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వమూ ఇలాంటి నిషేధాలనే విధించాయి. జైనుల పండగ పర్యూషణ్ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నిషేధాలను అమలు చేస్తున్నట్టు వీరంతా ప్రకటించారు. ఇదే సమయంలో జమ్మూ-కశ్మీర్ హైకోర్టు ఆ రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఇలా తినే తిండిపై నిషేధం విధించడం కొందరంటున్నట్టు కొత్తదేమీ కాదు. 1964లో కూడా ముంబై కార్పొరేషన్లో మాంసాహార అమ్మకాలను రెండు రోజులు నిలిపి ఉంచారని చెబుతున్నారు. అక్బర్ చక్రవర్తి ఏడాదిలో ఆర్నెల్లపాటు మాంసాహారాన్ని విడనాడినప్పుడు ఓ తొమ్మిదిరోజులపాటు పరమత సహనంకోసం, ఒక మతాన్ని గౌరవించడం కోసం దానికి దూరంగా ఉండటానికి ఇబ్బందేమిటని జస్టిస్ కట్జూ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ కూడా లోగడ ప్రశ్నించింది. గుజరాత్, రాజస్థాన్‌లలో జైనులు ఎక్కువగా ఉంటారు గనుక ఆ రాష్ట్రాల్లో వారితోపాటు కొన్ని రోజులు మాంసాహారాన్ని త్యజించడం నిర్హేతుకమేమీ కాదని సుప్రీంకోర్టు అప్పట్లో అన్నదిగానీ ఇప్పుడా నిషేధం మరో రెండు రాష్ట్రాలకు కూడా పాకింది. అహింసా సిద్ధాంతాన్ని ప్రబోధించే జైన మత విశ్వాసాలను... పర్యూషణ్ సమయంలో వారు పాటించే నిష్టను అందరూ గౌరవిస్తారు. ముఖ్యంగా జైనుల ఆహారపుటలవాట్లు వారికి ఒక ప్రత్యేక గుర్తింపునిస్తాయి. ఉద్దేశపూర్వకంగానో, అనుద్దేశితంగానో మనవల్ల క్రిమికీటకాలకు హాని జరిగినా అది దుష్కర్మేనని ఆ మతం చెబుతుంది. వారి దృష్టిలో శాకాహారమంటే కేవలం మాంసాన్ని తినకపోవడం మాత్రమే కాదు... ఆయా రుతువుల్లో దొరికే కాయగూరలనూ, పండ్లనూ తినడం... వాటిని కూడా తక్కువగా తినడం, ఆ ఆహారాన్ని అందరితో పంచుకోవడం. భూమి, నీరు, అగ్ని, వాయువు, వృక్షాలు వగైరాలను నిర్లక్ష్యం చేసే వ్యక్తి వాటితో పెనవేసుకుని ఉండే తన తన సొంత అస్తిత్వానికి సైతం ముప్పు తెచ్చుకునే స్థితికి చేరుతున్నాడని ఒక సందర్భంలో వర్ధమాన మహావీరుడు చెబుతాడు. ఇలాంటి సిద్ధాంతాలను ప్రబోధించే మతాన్ని గౌరవించడం, దాని భావాలను ఇష్టపడి ఆ మతస్తులతోపాటు కనీసం పర్యూషణ్ పండగ సమయంలోనైనా కలిసి నడవాలనుకోవడం మంచిదే. అలా ఎవరైనా చేస్తామంటే దాన్ని హృదయపూర్వకంగా స్వాగతించాలి. అయితే, ఈ సిద్ధాంతాలను వివరించి, జైన మతం గొప్పదనాన్ని, అందులోని పర్యావరణ అనుకూల స్పర్శను, దానివల్ల మానవాళికి కలిగే ఉపయోగాలను వివరించడం వేరు... ఏకపక్షంగా ఒక ఉత్తర్వు జారీ చేసి ఫలానా రోజు వరకూ మాంసం అమ్మవద్దని, తినొద్దని నిషేధాలు విధించడం వేరు. మొదటిది ఒక మతంపై అవగాహనను పెంచి, దాంతో సహానుభూతిని కలిగిస్తుంది. వేరొకటి ఎందుకో, ఏమిటో తెలియకుండా బలవంతంగా రుద్ది... ఒక మంచి భావనపై అనవసర దురభిప్రాయాన్ని కలగజేస్తుంది. ఇలాంటి నిషేధాలెందుకని ప్రశ్నించినవారిని... చాన్నాళ్లుగా ఉన్నదనో, ఫలానా కాలంలో అమలు చేశారనో దబాయించడం సరికాదు. అలా ఎవరు చెప్పినా-ప్రభుత్వాలైనా, న్యాయస్థానాలైనా- సరికాదు. మన దేశంలో పుట్టుకనేది చాలావాటిని నిర్ణయించినట్టే తినే ఆహారాన్ని కూడా నిర్ణయిస్తుంది. ఎక్కడ పుట్టి పెరిగారన్న అంశాన్నిబట్టి ఎవరి ఆహారపుటలవాట్లయినా ఉంటాయి. మాంసాహారం, శాకాహారాల్లో ఏది మంచిదనే చర్చ చాన్నాళ్లుగా ఉంది. మాంసాహారం తినేవారు కూడా కొన్ని సందర్భాల్లో వైద్యుల సలహా మేరకు తగ్గించడమో, పూర్తిగా మానేయడమో చేస్తుంటారు. ఇలా వ్యక్తిగత ఇష్టాయిష్టాలనుబట్టి, అవసరాలనుబట్టి నిర్ణయించుకోవడం సహేతుకమవుతుంది. ఒక చట్టం ద్వారానో, ఒక ఉత్తర్వు ద్వారానో మాన్పించాలని చూడటం నియంతృత్వమవుతుంది. ఇప్పుడు బృహన్ ముంబై కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతున్న వారిలో రకరకాల వారున్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీకి మద్దతు పలుకుతున్న శివసేన కూడా ఈ నిర్ణయంపై ఆగ్రహావేశాలు వ్యక్తంచేసింది. దీన్ని ఖండిస్తూ మాంసాహారాన్ని విక్రయించింది. ఆ పార్టీకున్న అభ్యంతరమల్లా ఒక్కటే. చాన్నాళ్లుగా పర్యూషణ్ సందర్భంగా కేవలం రెండు రోజులే ఉంటున్న నిషేధాన్ని ఇప్పుడు ఎందుకు పొడిగించాల్సివచ్చిందని అది ప్రశ్నిస్తోంది. ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించినప్పుడు బొంబాయి హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదనలు అందరినీ దిగ్భ్రాంతిపరిచాయి. ఈ ఉత్తర్వులో చేపల విక్రయాన్ని ఎందుకు చేర్చలేదని న్యాయమూర్తి ప్రశ్నించినప్పుడు... అది నీటిలోనుంచి బయటకు తీసిన వెంటనే చనిపోతుంది గనుక దాన్ని వధించడమనే ప్రశ్నే తలెత్తదని అక్కడి అడ్వొకేట్ జనరల్ జవాబిచ్చారు. నిషేధించడానికి ముందు అందుకు సంబంధించి ప్రభుత్వంలో ఏ కసరత్తూ జరగలేదని దీన్నిబట్టే తెలుస్తుంది. చివరకు ఇలాంటి నిషేధం ముంబై వంటి నగరంలో సరికాదని హైకోర్టు తేల్చింది. మరికొన్నాళ్లలో రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జైనుల ఓట్లను కొల్లగొట్టే ఉద్దేశంతోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిషేధానికి దిగిందన్న కొందరు ఆరోపిస్తున్నారు. అది నిజమైనా కావొచ్చు. ఏం చదవాలో, ఏం ఆలోచించాలో, ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయాలో నిర్దేశించడం మొదలుపెట్టి ఇప్పుడు వంటింట్లో ఏం వండాలో నిర్ణయించే దశకు మన ప్రభుత్వాలు చేరుకున్నాయని ఈ నిషేధ పరంపర తెలియజెబుతోంది. ఇంకా నగుబాటుపాలు కాకముందే ఈ వేలంవెర్రికి స్వస్తి పలకడం మంచిదని పాలకులు తెలుసుకోవాలి. -
'మరో రాష్ట్రంలో మాంసం బంద్'
రాయ్‌పూర్: మాంసం నిషేధించే రాష్ట్రాల సంఖ్య పెరుగుతోంది. నిన్నటి వరకు జమ్మూకాశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర మాంసాన్ని నిషేధించిన రాష్ట్రాలుగా ఉండగా తాజాగా వాటి సరసన ఛత్తీస్‌గఢ్ చేరింది. జైనుల పవిత్ర కార్యక్రమం సందర్భంగా ఈ నెల 17వరకు ఆ రాష్ట్రంలో మాంసం అమ్మకాలు నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాంసం అమ్మకాలు నిషేధించినట్లయింది. ఇప్పటికే మహారాష్ట్రలో మాంసం నిషేధించడం పట్ల పలు పార్టీల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం ఎక్కడి వరకు దారి తీస్తుందో వేచి చూడాల్సి ఉంది. -
నెగడు-20
రచన: ఎం.వి.రమణారెడ్డి దావానలం ఆరిన తరువాత, నిప్పు ఇంకా రగులుతూ ఉన్నప్పుడు, కాలుతున్న మాంసం దాపులకు రావడానికి ఇతర ఏ జంతువూ సాహసించదు. కర్రతో నిప్పును కుళ్లగించడం, కర్రతోనే నిప్పులను వేరుజేయడం, దూరం నుండే మాంసాన్ని దగ్గరికి లాక్కోవడం వంటి నైపుణ్యాలు తన చేతులకున్న కారణంగా, ఉడికిన మాంసాన్ని సమృద్ధిగా సంపాదించుకునే సౌకర్యం దానికి కలిసొచ్చింది. ఆ నరవానరానికి కాలిన మాంసం రుచిగా తగిలుండొచ్చు; కానీ, ఆ మాంసం కోసం అది చేసిన అన్వేషణ కేవలం రుచి కోసం కాదు. అడవిమంట మూలంగా దొరికేది సులువైన సముపార్జన గాబట్టి. కానీ అది నిరవధికంగా దొరికే పదార్థంగాదు. కోరినప్పుడల్లా అడవులు మండుతూ కూర్చోవు. కాబట్టి ఏడాదిలో ఎక్కువభాగం వేటాడకా తప్పదు. పచ్చిమాంసం తినకా తప్పదు. నరవానరానికి ప్రథమంగా నిప్పుతో ఏర్పడిన అవసరం వంటకోసం కాదు; ఆత్మరక్షణ కోసం. ఎంత పెద్దదైనా, ఎంత క్రూరమైనదైనా నిప్పు జోలికి ఏ జంతువూ రాలేదు. అనుభవంతో కలిగిన ఈ పరిజ్ఞానాన్ని ఆత్మరక్షణ అవసరాల కోసం అమలులోకి తీసుకురావడం మాత్రమే అప్పుడు జరిగింది. ఇది ఏడాదిలోనో, రెండేళ్ళలోనో జరిగిన జ్ఞానోదయం కాదు. ఈ కొద్దిపాటి ఆలోచనకు ఎంతలేదన్నా పదిలక్షల సంవత్సరాలు పట్టిందని మనం గుర్తుంచుకోవాలి. అప్పటికి ఆస్ట్రలోపిథికస్, దాని తరువాతి పరిణామదశలు అంతర్థానమై, ఆసియా, ఆఫ్రికా, యూరప్ ఖండాలను ‘హోమో ఎరెక్టస్’ ఆక్రమించింది. అప్పటికింకా అటువంటి జీవి అమెరికా ఖండం చేరుకోలేదు. పరిణామక్రమంలో హోమో ఎరెక్టస్ మనకు దగ్గరి బంధువు కాబట్టి, ఇకమీదట ఆ జీవిని ‘అతడు’, ‘ఆమె’ అనేందుకు అభ్యంతరం ఉండగూడదు.చెత్తాచెదారం కువ్వేసి, చేత్తో విరిగే మండలూ మాకులూ ప్రోగేసి, మంటలు చల్లారిన అడవినుండి కొరివిని తీసుకొచ్చి నెగడు రగిలించడం పెద్ద సమస్యేంగాదు. అయితే, అలాంటి పదార్థాలు గప్పున మండి చప్పున ఆరిపోతాయి. మాటిమాటికీ నిప్పును తెచ్చుకునేందుకు దావానలం రోజూ జరిగే సంఘటన కాదు. కానీ, ఆ మంటల్లో కాలిన లావుపాటి కలపమొద్దులు ఎంతోకాలం ఆరిపోకుండా రగులుతుంటాయే, అలాంటి ఏర్పాటు అతనికి కావలసింది. అడవులకు కొదువలేదు. కర్రకు కరువులేదు. లేనిదల్లా కొమ్మలు నరికే సాధనమే. అప్పుడు కొమ్మలు నరికేందుకు అనువైన పనిముట్టు అవసరమయింది. ఆ ప్రయోజనం కోసం రాయిని ఎలా చెక్కాలో, ఏ సైజు రాయిని ఎన్నుకోవాలో ఆ చిన్న మెదడు ఆలోచించింది. ఫలితంగా రూపొందిన పనిముట్టే రాతిగొడ్డలి. ‘గొడ్డలి’ అనగానే కర్రను దూర్చేందుకు మధ్యలో బెజ్జముండే మనతరం గొడ్డలిని ఊహించుకోలేం. రాయిలో తొర్ర తొలిచే లాఘవం నేర్చేందుకు తిరిగి వేల సంవత్సరాలు పట్టింది. మొదట్లో తయారైన గొడ్డలి చేత్తో పట్టుకుని కొమ్మను నరికేందుకు పనికొచ్చేది మాత్రమే. ఆ తరువాత మరికొంత కాలానికి, కర్రకు రాతిగొడ్డలి కట్టి చేజంపునా కొమ్మ నరికేందుకు అనుకూలమైన తయారీ రంగంలోకొచ్చింది. కర్రకు కట్టడమంటే - కట్టేందుకు తాడులాగా ఉపయోగపడే నార గురించి తెలిసుండాలి. రాయి గుణం, కర్ర గుణం, నిప్పు గుణం, నార గుణం అప్పటిదాకా సాధించిన అదనపు పరిజ్ఞానం. ఆనాటి మనిషికి అవన్నీ అతీంద్రియంగా పుట్టిన ఆలోచనలు కావు. అతీంద్రియంగా పుట్టే ఆలోచనకు వేల సంవత్సరాలూ లక్షల సంవత్సరాలూ అవసరముండదు. కళ్ళతో చూసింది, చెవులతో వినింది, స్పర్శతో గ్రహించింది - ఎంతోకాలంగా ఈ ఇంద్రియాలు అందిస్తున్న సమాచారాన్ని అనుభవాలతో బేరీజు వేసుకోవడం కారణంగా కొత్త ఆలోచన పుట్టుకొస్తుంది. ‘ముందు తరం నుండి గ్రహించడం, తరువాతి తరానికి అందించడం’ అనే స్తన్యజంతువు ప్రాథమిక స్వభావం నరవానర జీవిత విధానాన్ని కొత్తపుంతలు తొక్కించింది. కొరివితో వన్యమృగాలను భయపెట్టడం ఏనాడు తెలిసొచ్చిందో, ఆనాడే మనిషి నివాసం ఆరుబయలు నుండి గుహలోకి మారింది. అంతకుముందు గుహలన్నీ ప్రమాదకరమైన జంతువుల నివాసాలు. హక్కు కోసం జరిగిన పోరాటంలో మానవుడు జయించాడు; క్రూరమృగాలను మారుమూల ప్రాంతాలకు కాందిశీకులను చేశాడు. నిప్పు మూలంగా మానవునికి ఏర్పడిన మొట్టమొదటి ఆస్తి ‘గుహ’. కాబట్టి, మనిషి మనిషిగా ఎదిగేందుకు రాతి పనిముట్టు తొలిమెట్టు కాగా, నిప్పు రెండవమెట్టు. సుమారు ఐదు వేల సంవత్సరాలప్పుడు రాతి పనిముట్టుతో మనిషికి అవసరం తీరిపోయింది గానీ నిప్పుతో అవసరం మాత్రం ఇప్పటికీ తీరలేదు. రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com -
కృతుంగ...తెలుగింటి వంట
హైదరాబాదీల దిల్ పసంద్ పాయా చూడగానే జుర్రేయాలనిపిస్తుంది. మారుమిల్లి వెదురు బొంగు చికెన్... మాటల్లేవ్! టేస్ట్ చేయాల్సిందేనని తొందరపెడుతుంది. రాగి సంకటి ముద్ద, దాని మీద ఓ నేతి చుక్క... నంజుకోవడానికి నాటు కోడి కూర సీమ వాసులని నోరూరిస్తోంది. పల్నాడు, నైజాం కోడి బిర్యానీ, చెన్నూరు మాంసం పలావ్... ఇలా అచ్చంగా మనవైన వంటలు.. సజ్జరొట్టె, జొన్న రొట్టె, కొర్రన్నం... అన్నీ మన ఊరి వంటలు. ఇవన్నీ ఒకే చోట లాగించేయాలంటే... నగరంలోని కృతుంగ రెస్టారెంట్‌కు వెళ్లాల్సిందే... జంక్ ఫుడ్స్మయం అయిన మహానగరంలో అచ్చమైన తెలుగు రుచులు కనుమరుగయ్యే పరిస్థితిని గమనించి... 2002లో సీటీఓ లింగారెడ్డి ఓ చిన్న ప్రయత్నం చేశారు. అదే ‘కృతుంగ’ రెస్టారెంట్. ఆ తర్వాత నరేందర్‌రెడ్డి... ఆ చిన్న ప్రయత్నానికి సంకల్పాన్ని, దిశను నిర్దేశిస్తూ ఎన్నో రెస్టారెంట్లుగా విస్తరింపచేశారు. నగరవాసులకు తెలుగింటి రుచులను అందిస్తూ... వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది ఇప్పుడు కృతుంగ. చిన్న అవుట్‌లెట్‌గా ప్రారంభమై నేడు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో 13 బ్రాంచీలతో భోజన ప్రియులను ఆకట్టుకుంటోంది. సెలబ్రిటీలకు కేరాఫ్... జూనియర్ ఎన్టీఆర్, రోజా, అలీ, సుమా, ఎస్వీ కృష్ణారెడ్డి, అనూప్ రూబెన్స్, అక్కినేని, కృష్ణంరాజు ఫ్యామిలీస్, ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు... ఇలా అనేక మంది ప్రముఖులు, సామాన్యులు ఇష్టపడే ఫుడ్ పాయింట్ ఇది. 2002లో పంజాగుట్టలో ప్రారంభమైన కృతుంగా... తన బ్రాంచీలు విస్తరిస్తూ జూబ్లీహిల్స్, ఎర్రమంజిల్, అమీర్‌పేట్, యూసుఫ్‌గూడ, మణికొండ, కూకట్పల్లి, కొండాపూర్, జూబ్లీహిల్స్... ఇలా సిటీలోని అన్ని ప్రధాన సెంటర్లకూ విస్తరించింది. రుచికరమైన ఆహారానికి నాణ్యమైన దినుసులు ఎంతో ముఖ్యం. వంట సరుకులన్నీ సొంతంగా పండించిన వాటి నుంచి తెప్పించి ఇక్కడ వండి వారుస్తున్నారు. ఎండు మాంసం కర్రీస్ జూబ్లిహిల్స్ బ్రాంచ్ స్పెషల్. ఇది నగరంలో మరెక్కడా దొరకదు. ఆహారంతో ఆరోగ్యాన్ని బలి చేస్తున్న ఈ రోజుల్లో... జంక్ ఫుడ్ బదులు కాల్షియంతో కూడిన ఆరోగ్యవంతమైన ఆహారం అందించాలనేదే మా ఉద్దేశం. రాగి, జొన్న, నూనె తక్కువగా ఉండే వెరైటీలు, మట్టి కుండలో వంటలు... ఇలా అన్నీ మన ప్రాంతాల్లో చేసుకునే వంటలే. 1000కు పైగా ఉద్యోగులు మా రెస్టారెంట్లలో పనిచేస్తున్నారు. వీళ్లందరినీ వివిధ ప్రాంతాల నుంచి తెచ్చి, ఇక్కడి పనుల్లో శిక్షణ కూడా ఇస్తున్నాం. పసుపు నుంచి రాగుల వరకూ స్వయంగా పండించినవే ఇక్కడ వాడతాం. ఇలా పదిమందికి ఉపాధి, మంచి ఆహారం అందించడమే మా లక్ష్యం’ అంటారు కృతుంగా రెస్టారెంట్స్ ఎండీ టి.నరేందర్‌రెడ్డి. ఇటీవలే బెంగళూరులోని జయ్ నగర్లో 3వ బ్రాంచి ప్రారంభించారు. మున్ముందు బెంగళూరులో 6, పుణే, చెన్నయ్ సహా సౌత్ ఇండియాలో మరో 20 బ్రాంచీలు ప్రారంభించే యోచనలో ఉన్నట్టు ఆయన చెప్పారు. వీటితో పాటు అమెరికాలోనూ ప్రారంభిస్తామన్నారు. ఫుట్‌బాల్ వంటి అనేక ఆటల పోటీలు, ఈవెంట్లు, సెలబ్రిటీల ఫంక్షన్లకు ఇక్కడి నుంచే ఫుడ్ ఆర్డర్స్ వెళ్తుంటాయి. 2009లో కింగ్‌ఫిషర్ నిర్వహించిన వంటల పోటీలో బెస్ట్ ఫుడ్ అవార్డు, 2008లో ఫోర్బ్ జాబితాలో రాష్ట్రంలో టాప్ బెస్ట్ రెస్టారెంట్‌గా గుర్తింపు సంపాదించుకుని ప్రత్యేకతను చాటుకుంది ‘కృతుంగ’. kritunga@gmail.com ph: 9000633918 - ఓ మధు -
ఆదర్శ గ్రామాలు
ఏ పల్లెలో చూసినా ప్రస్తుతం మద్యం ఏరులై పారుతోంది.. ఎక్కడైనా నీటి గోస ఉన్నదేమో గానీ.. మద్యం విక్రయించని గ్రామాలు అరకొరే. ఇదిలా ఉంటే.. మారుతున్న ఆధునికతకు తోడు ఆయా భోజనప్రియుల్లోనూ మార్పులొస్తున్నాయి. నాన్‌వెజ్ లేనిదే ముద్ద దిగని రోజు లివి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ గ్రామాలు సంపూర్ణ మద్య నిషేధం పాటిస్తున్నాయి. జీవ హింసకు దూరంగా ఉంటూ.. మాంసం తినేందుకు అయిష్టపడుతున్నారు ఆ గ్రామాల ప్రజలు. పెద్దల కట్టుబాట్లకు కట్టుబడి.. గ్రామ కమిటీల ఆజ్ఞలతో.. అందరి సహకారంతో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని పాటిస్తున్నారు. అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తూ.. అభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు. జిల్లాలో మద్యం, మాంసం ముట్టని గ్రామాలపై మద్యం.. మందు.. కళ్లు.. ఇలా ఈ మత్తు పదార్థానికి పేర్లు ఎన్నున్నాయో... అది సృష్టించే అనర్థాలూ అంతకంటే చాలానే ఉన్నాయి. మానవత్వం నుంచి మనిషిని దూరం చేసేది.. మానవ సంబంధాల్ని చంపి పాతరేసేది.. ఏదైనా ఉందంటే అది మందే. అలాంటి మందునే మనుషుల నుంచి దూరం చేయాలనుకున్నారు ఆ పల్లెల ప్రజలు. అనుకున్నది అనుకున్నట్లు ఆచరించి చూపుతున్నారు. ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆ పల్లెల్లో మద్యం అమ్మకం లేదు. బెల్టుషాపులు లేవు. గుడుంబా తయారీదారులు లేరు. ఆ విక్రయాలూ లేవు. తాగేవారు లేరు. తాగించేవారూ లేరు. ఇప్పుడా ఊళ్లు ప్రశాంతంగా ఉన్నాయి. అలాంటి ఆదర్శ పల్లెలపై ప్రత్యేక కథనం. రాళ్లకన్నెపల్లిలో నాలుగేళ్లుగా నిషేధం తిర్యాణి : మండలంలోని గడలపల్లి పంచాయతీ పరిధి రాళ్లకన్నెపల్లి గ్రామస్తులు నాలుగేళ్లుగా మద్యానికి దూరంగా ఉంటున్నారు. గ్రామంలో మద్యం అమ్మినా, తాగినా వారిని ఊరిలోకి రానిచ్చేది లేదని గ్రామస్తులంతా కలిసి స్వచ్ఛందంగా తీర్మానించుకున్నారు. గతంలో గ్రామంలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతుండేవి. ఆడ, మగ తేడా లేకుండా చాలా మంది మద్యానికి బానిసలయ్యారు. దీంతో రోజూ గొడవలు జరుగుతుండేవి. దానికి రోజూ పంచాయతీలు పెట్టడం, తీర్మానాలు చేయడం మాములే అయిపోయింది. ఊరి పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రామస్తులు గ్రహించారు. ఆ పరిస్థితుల నుంచి బయటపడే మార్గాల గురించి ఆలోచించి, గ్రామస్తులంతా ఏకమై గ్రామంలో మద్యం నిషేధించాలని నిర్ణయానికి వచ్చారు. తమ గ్రామంలో మద్యం నిషేధిస్తున్నట్లు ప్రకటించి అప్పటి ఎస్సై శ్రీనివాస్ యాదవ్‌కు తమ గ్రామంలో మద్యం నిషేధిస్తున్నామని తెలుపుతూ రాత పూర్వకంగా తీర్మాన పత్రం రాసి ఇచ్చారు. అప్పటి నుంచి మద్యం బంద్ అయింది. ఊరు బాగు కోసం... గ్రామంలో మద్యం నిషేధ తీర్మానం చేసినప్పటి నుంచి ఊరిలో గొడవలు సద్దుమణిగాయి. అందరూ సంతోషంగా ఉన్నారు. మాకు మేముగానే ఊరిలో మద్యం అమ్మకాలు సాగించవద్దని నిర్ణయానికి వచ్చాం. మద్యం బెల్టుషాపుల ద్వారా అమ్మసాగించే వారి ఉపాధి పోతుందని విమర్శలు వచ్చాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా ఊరు బాగు కోసం త్యాగం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. - మడావి మోతీరాం మేడిగూడలో పెద్దల మాట గౌరవిస్తూ.. ఇచ్చోడ : మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడిగూడ పదేళ్లుగా మద్య, మాంసాలకు దూరంగా ఉంటూ గిరిజన, గిరిజనేతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. గతంలో ఈ గూడెంలో మద్యం తాగి తరచూ గొడవలు, పంచాయతీలు, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వారు. ప్రశాంతత కరువైంది. 15 ఏళ్ల కిందట గూడెంలో మద్యం తాగి గొడవపడ్డ సంఘటన పోలీస్‌స్టేషన్ వరకూ వెళ్లడంతో అప్పట్లో చాలామంది గిరిజనులపై కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో అప్పటి గ్రామపెద్ద మారు పటేల్ గూడెం పెద్దలతో చర్చించి మద్యం మాంసాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. నాడు తీసుకున్న నిర్ణయాన్ని నేటి కీ పాటిస్తున్నారు. ఇప్పుడు గ్రామం ప్రశాంతంగా ఉంది. అందరూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. మండలంలోని మాన్కపూర్ పంచాయతీ అనుబంధ గ్రామమైన మేడిగూడలో దాదాపు 70 కుటుంబాల్లో సూమారు 400 మంది జనాభా ఉంటారు. ఇక్కడ నివసించే ప్రజల్లో అందరూ ఆదిమ గిరిజన గోండు తెగకు చెందినవారే. గ్రామానికి ఇతర గ్రామాల నుంచి ఎవరైనా చుట్టాలు వచ్చినా ఇక్కడ మద్యం తాగనివ్వరు. సాలెగూడలో 27 ఏళ్లుగా మద్యానికి దూరంగా... ఉట్నూర్ : ఆ గూడెంలో ఐదుగురు కలిసి తీసుకున్న నిర్ణయం ఊరి స్వరూపాన్నే మార్చింది. ఒకప్పుడు మద్యం తాగుతూ... మాంసం తింటూ నిత్యం గొడవలు పడే కుటుంబాలున్న ఆ గూడెంవాసులు ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. 27 ఏళ్ల క్రితం అప్పటి గూడెం పెద్దలైన టేకం భీము, కొడప లచ్చు, ఆత్రం లేతు, టేకం రాము, ఆత్రం భీము కలిసి గూడెంలో ఎవరూ మద్యం ముట్టరాదంటూ తీర్మానించారు. అప్పటి నుంచి ఇప్పటికీ ఆ గూడెం మద్యానికి దూరంగా ఉంటోంది. ఇక గూడెంకు చెందిన దేవతల విగ్రహలు తయారు చేసే టేకం బాపురావు 1989లో తన కుటుంబం ఇక నుంచి మాంసాహారం ముట్టదని ప్రకటించాడు. అతనిని చూసిన ఇతర కుటుంబాల వారు క్రమక్రమంగా మాంసహారానికి దూరమయ్యారు. ప్రస్తుతం గూడెంలో 90 శాతం మంది మాంసాహారమంటే దూరంగా ఉంటారు. అందరూ మద్యమంటే అస్యహించుకుంటారు. ఒకరికొకరు అండగా... ఉట్నూర్ మండలం ఉమ్రి పంచాయితీ పరిధిలోని కొలాం గిరిజనులకు నిలయం సాలెగూడ. 50 ఏళ్ల క్రితం ఐదు ఇళ్లతో వెలసిన ఈ గూడెం ఇప్పుడు దాదాపు 75 కుటుంబాలతో సుమారు 420 వరకు గిరిజన జనాభాతో కళకళలాడుతోంది. గూడెంలో ఎవరిని చూసినా ప్రశాంతంగా కనిపిస్తారు. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న వీరు తెల్లారిందంటే చేను పనులకెళ్లడం సందెవేళ ఇంటికి చేరడం నిత్య దినచర్య. గూడెంలో ఏ కుటుంబంలో ఏ సమస్య ఎదురైనా ఒకరికొకరు అండగా నిలుస్తారు. ఒక ఇంట్లో శుభకార్యమైదంటే తలో చేయివేసి తమ ఇంట్లో శుభకార్యంలాగా భావిస్తూ దగ్గరుండి పనులు చేస్తారు. మద్యం తాగితే జరిమానా! గూడవాసులు ఎవరైనా మద్యం తాగినట్లు తెలిస్తే గూడ పెద్ద సమక్షంలో పటేల్ ఆధ్వర్యంలో పంచాయితీ పెడుతారు. మద్యం తాగిన వ్యక్తిని పంచాయితీకి పిలిపిస్తారు. మద్యం తాగినట్లు తేలితే రూ.500ల పైచిలుకు జరిమానా విధిస్తారు. ఇలా జమైన మొత్తానికి మరికొంత మొత్తం ఇంటింటి నుంచి సేకరించి గూడెంలో జరిగే శుభకార్యాలకు పనికి వచ్చేలా దాదాపు రూ.30 వేల విలువైన వంట పాత్రలను కొనుగోలు చేశారు. అయితే కొన్ని నెలల క్రితం ఒకరు మద్యం తాగకుండా ఉండలేనంటే కుటుంబంతో సహా పక్క గూడకు వసల వెళ్లాడు. జూన్-2011 నెలలో గూడలో ఓ పెళ్లి జరిగింది. పెళ్లి వారు మహారాష్ట్రకు చెందిన వారు. వారి పెళ్లిళ్లలో మద్యం తాగడం పరిపాటి. వారు కూడా మద్యం సీసాలు తీసుకువచ్చారు. అయితే ఈ గూడెం కట్టుబాటు, నిర్ణయాన్ని గౌరవిస్తూ ఊర్లో మద్యం తాగకుండా సీసాలు తిరిగి తీసుకెళ్లారు. ఇంతలా ఉంటుంది ఇక్కడ మద్యం విషయంలో కట్టుబాటు. శుభకార్యాల్లో శాకాహారమే... గూడెంలో ఏ శుభకార్యం జరిగినా శాకాహార భోజనమే పెడుతారు. మాంసాహారం అస్సలు పెట్టరు. అసలు ఆ మాటే వినిపించదంటే అతిశయోక్తి కాదు. గ్రామంలో 90 శాతం కుటుంబాలు మాంసం ముట్టరు. వీరి ఆరాధ్య దైవాలకు ముహూర్తాల సమయంలో జంతు బలులు ఉంటాయి. కానీ కొబ్బరికాయలతోనే పూజలు నిర్వహిస్తారు. ఇక ఈ గూడ పచ్చదనానికి పెట్టింది పేరు. గూడెంలోని రహదారి వెంట గూడ వాసులు చెట్లు పెంచుతున్నారు. అంతేకాకుండా ప్రతీ ఇంటి ఎదుట ఏదో పూల మొక్క కానవస్తుంది. టేకం అంకుశ్ నిరక్షరాస్యుడైనా తన ఇంటి ఆవరణలో చేపట్టిన మొక్కల పెంపుదనాన్ని ఆదర్శంగా తీసుకున్న కుటుంబాలు ప్రతీ ఇంటి ఎదుట పచ్చదానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. తమకు పూర్తిస్థాయి నీటి సౌకర్యం ఉంటే గూడెంనంతటిని పచ్చదనం చేస్తామని అంటున్నారు సాలెగూడవాసులు. -
మాంసాహారం తీసుకువచ్చాడని..
నాగోలు: మధ్యాహ్నం భోజనంలో మాంసాహారం తీసుకువచ్చాడని విద్యార్థిని టీచర్ చితకబాదిన సంఘటన మన్సూరాబాద్‌లో చోటు చేసుకుంది. సెంట్రల్ బ్యాంక్ కాలనీలోని కాకతీయ టెక్నో స్కూల్లో అదే ప్రాంతానికి చెందిన వర్థమాన్(5) ఒకటో తరగతి చదువుతున్నాడు. గురువారం టిఫిన్ బాక్సులో మాంసాహారం తీసుకువచ్చినట్లు గమనించిన టీచర్ మాధవి విద్యార్థిని చితకబాదింది. విషయం కుటుంబసభ్యులకు తెలపగా వారు బాలల హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. -
మాంసం తింటే ఎముకలు మెళ్లో కట్టుకు తిరగాలా...
ఒక ఊళ్లో ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు ప్రతి చిన్నదానికీ ఆర్భాటం చేసేవాడు. రోజూ మాంసం తెచ్చి వండించేవాడు. రోజూ ఎందుకండీ అని భార్య అంటే... చెప్పింది చెయ్యమంటూ ఆమె మీద అరిచేవాడు. పైగా తాము రోజూ విందు ఆరగిస్తామని అందరికీ తెలిసేలా చేయడానికి మాంసంలోని ఎముకలను అందరూ చూసేలా పారబోసేవాడు. కొన్నాళ్లకు ఆ ఊళ్లోవాళ్లు పెంచుకునే కోళ్లను ఎవరో ఎత్తుకెళ్లటం మొదలుపెట్టారు. వరుసగా అందరి కోళ్లనూ ఎత్తుకెళ్లేసరికి అందరూ కలిసి సదరు వ్యక్తి ఇంటిమీద పడ్డారు. నేను మాంసం కొని తెచ్చుకుంటున్నాను, మీ కోళ్లు ఏమయ్యాయో నాకు తెలీదు అని ఎంత చెప్పినా నమ్మలేదు సరికదా చితక బాదేశారు. కుయ్యో మొర్రో అంటున్న అతడిని చూసి...‘మాంసం తింటున్నాం కదా అని ఎముకలు మెళ్లో వేసుకుని తిరిగితే ఇలానే ఉంటుంది’ అంది భార్య. ఆ మాటే తర్వాత సామెతయ్యింది. -
పచ్చగడ్డే కాదు.. పచ్చిమాంసమూ తింటాయి!
జంతు ప్రపంచం * పుట్టినప్పుడు దాదాపు అన్ని జింకలకీ ఒంటిమీద తెల్లని మచ్చలుంటాయి. కాలం గడిచేకొద్దీ కొన్నింటికి చెరిగిపోతాయి. కొన్నిటి శరీరంపై మిగిలిపోతాయి! * పుట్టిన అరగంటకే ఇవి నడుస్తాయి. నెల తిరిగేసరికే పరుగెత్తుతాయి. * ఇవి నాలుగు పళ్లతో పుడతాయి. మిగతా పళ్లు తరువాత మొలుస్తాయి! * జింకలన్నీ శాకాహారులని చాలామంది అనుకుంటారు. కానీ కొన్ని రకాల జింకలు మాంసాన్ని కూడా తింటాయి! * వీటి చెవులు ఎంత బాగా పని చేస్తాయంటే... కొన్ని కిలోమీటర్ల దూరంలో వినిపించే శబ్దాలను కూడా స్పష్టంగా వినగలవు. అంతేకాదు... శబ్దం వచ్చే దిశకు తమ చెవుల్ని తిప్పి మరీ వింటాయి! * చిన్నగా కనిపిస్తుంటాయి కానీ ఇవి చాలా ఆహారాన్ని తింటాయి. దాదాపు గంట, రెండు గంటల పాటు తింటే కానీ వీటికి కడుపు నిండదు! * చలికాలం వస్తే ఇవి బద్దకంగా అయిపోతాయి. ఆహారం కూడా చాలా తక్కువగా తీసుకుంటాయి. మళ్లీ వేసవి రాగానే ఎక్కడలేని హుషారు వచ్చేస్తుంది! * ఏదైనా ప్రమాదం సంభవించబోతోందని అనుమానం వస్తే ఇవి తమ తోకల్ని పెకైత్తుతాయి. దాన్ని చూసిన ఇతర జింకలు పరుగందుకుంటాయి! * ఇవి కాస్త పిరికివనే చెప్పాలి. చిన్న చిన్న వాటికే బెదిరిపోతుంటాయి. శత్రువు దాడి చేసినప్పుడు మొదట ధైర్యంగా పరుగు తీసినా... ఉండేకొద్దీ బలహీనమైపోతాయి. దాంతో వాటికి చేతికి చిక్కి ఆహారంగా మారిపోతాయి! * ఇవి ఎప్పుడూ నేరుగా పరుగెత్తవు. వంకర టింకరగా, ముందువెనుకలు చూసుకోకుండా పరుగులు తీస్తాయి. దాంతో ఆ వేగాన్ని నియంత్రించుకోలేక ఒక్కోసారి అడ్డొచ్చినవాటిని గుద్దేస్తుంటాయి. అందుకే కొన్నిసార్లు చనిపోతుంటాయి కూడా!