దేహం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. సమతుల ఆహారంతోనే సమగ్రమైన ఆరోగ్యం సాధ్యమవుతుంది. వీటితోపాటు మనసు మీద ప్రభావం చూపించే ఆహారాలు కూడా ఉంటాయి. నిరుత్సాహంగా మార్చే ఆహారాలతోపాటు మనసును ఉత్తేజపరిచే ఆహారాలు కూడా ఉంటాయి.
►కార్బోహైడ్రేట్లు సెరోటోనిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తాయి. ఇది ఫీల్‌గుడ్ హార్మోన్. అందుకే మన రోజువారీ ఆహారంలో కార్బొహైడ్రేట్‌లు ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే మితిమీరిన చక్కెర స్థాయులు లేని కార్బోహైడ్రేట్‌లను తీసుకోవడం మంచిది. తిన్న తర్వాత త్వరగా జీర్ణమై రక్తంలో చక్కెర స్థాయులను పెంచే ఆహారానికి బదులుగా కూరగాయలు, బీన్స్, పొట్టు తీయని ధాన్యాలను తీసుకోవాలి.
►లేత మాంసం, కాయధాన్యాలు, కోడిగుడ్లు, చికెన్, పాలు, పాల ఉత్పత్తులలో ప్రొటీన్ సమృద్ధిగా ఉంటుంది. ఆహారంలో వీటిని తీసుకున్నప్పుడు డోపామైన్, నార్‌ఎపీనెఫ్రిన్ హార్మోన్‌లు విడుదలవుతాయి. ఇవి శక్తిని ఇనుమడింప చేయడంతోపాటు మెదడును ఒక విషయం మీద కేంద్రీకృతం చేయడానికి దోహదం చేస్తాయి.
►హైలీ ప్రాసెస్‌డ్ ఫుడ్, డీప్ ఫ్రైలు తిన్న తర్వాత వాటిని జీర్ణం చేయడానికి దేహం ఎక్కువ శక్తిని వినియోగించాల్సి వస్తుంది. దాంతో నీరసం ఆవహించినట్లవుతుంది. కాబట్టి జిహ్వ చాపల్యాన్ని నియంత్రించుకోలేక వాటిని తిన్నప్పుడు ఇతర ఆహారం మోతాదు తగ్గించడం మంచిది.
►ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తినాలనే జాగ్రత్త పాటించడంతోపాటు ఇష్టమైన వాటిని పూర్తిగా మానేయాల్సిన అవసరం కూడా లేదు. దేహ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కోసం అవసరమైన వాటిని తింటూనే ఇష్టమైన వాటిని రోజులో ఒక్కసారికి పరిమితం చేసుకోవచ్చు.
►తరచు కొత్తిమీర చట్నీ తింటుండటం వల్ల లేదా ధనియాల పొడిలో కొద్దిగా తేనె వేసుకుని తీసుకుంటుండటం వల్ల జ్ఞాపకశక్తి మెరుగు పడుతుంది.
►వేరుశనగలో ఉండే విటమిన్–బి3... జ్ఞాపకశక్తి మెరుగయ్యేలా చేస్తుంది.
చదవండి: Beauty Tips In Telugu: టమాటా... సీ సాల్ట్.. మృతకణాలు ఇట్టే మాయం!
Anjeer Health Benefits: అంజీర తింటున్నారా.. ఈ విషయాలు తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment