వీకెండ్‌ స్పెషల్‌: పాలకూర చికెన్‌ ఎగ్‌ బైట్స్‌, సింపుల్‌గా ఇలా | How To Make Spinach Chicken Egg Bytes Recipe In Telugu | Sakshi
Sakshi News home page

వీకెండ్‌ స్పెషల్‌: పాలకూర చికెన్‌ ఎగ్‌ బైట్స్‌, సింపుల్‌గా ఇలా

Published Sat, Sep 16 2023 3:52 PM | Last Updated on Sat, Sep 16 2023 4:02 PM

How To Make Spinach Chicken Egg Bytes Recipe In Telugu - Sakshi

పాలకూర చికెన్‌ ఎగ్‌ బైట్స్‌ తయారీకి కావల్సినవి:

పాలకూర – రెండు కప్పులు; గుడ్లు – పది; పాలు – ముప్పావు కప్పు;
చీజ్‌ తరుగు – అరకప్పు; ఉడికించిన చికెన్‌ ముక్కలు – పది; ఉప్పు,
మిరియాల పొడి – రుచికి సరిపడా.



తయారీ విధానమిలా:
పాలకూర, చికెన్‌ ముక్కలను సన్నగా తరిగి పెట్టుకోవాలి.పెద్దగిన్నెలో గుడ్ల సొన వేయాలి. దీనిలో పాలు, చికెన్, పాలకూర ముక్కలు వేసి కలపాలి.
► చివరిగా రుచికి సరిపడా, ఉప్పు, మిరియాల పొడి వేసి నురగ వచ్చేంత వరకు బాగా కలపాలి.
► ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కూప్‌లతో మఫిన్‌ ట్రేలో వేసి అరటగంట పాటు బేక్‌ చేస్తే పాలకూర చికెన్‌ ఎగ్‌ బైట్స్‌ రెడీ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement