కోకోనట్ చికెన్ తయారీకి కావల్సినవి:
చికెన్ – అర కిలో
మొక్కజొన్న పిండి – పావు కప్పు
కొబ్బరి కోరు – అర కప్పు
నూనె – సరిపడా, ఉప్పు – తగినంత
మిరియాల పొడి – కొద్దిగా
కారం – 1 టీ స్పూన్
గుడ్లు – 3
తయారీ విధానమిలా:
ముందుగా ఒక బౌల్‌లో మొక్కజొన్న పిండి, మిరియాల పొడి, కారం, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. మరో బౌల్‌లో గుడ్లు కొట్టి, 2 టీ స్పూన్ల కొబ్బరి పాలు పోసుకుని, బాగా గిలగ్గొట్టి పెట్టుకోవాలి. ఇంకో బౌల్‌లోకి కొబ్బరి కోరు తీసుకోవాలి.
ముందుగా ఒక్కో చికెన్ ముక్కను మొక్కజొన్న పిండిలో వేసి బాగా పట్టించాలి. తర్వాత దాన్ని గుడ్డు మిశ్రమంలో ముంచి వెంటనే కొబ్బరి కోరు పట్టించాలి. అనంతరం వాటిని నూనెలో దోరగా వేయించి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే.. ఈ కోకోనట్ చికెన్ ముక్కలు భలే రుచిగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment