మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ సూచనల మేరకు గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్ నగరంలో అనుమతి లేకుండా బహిరంగంగా మాంసం, చేపలను విక్రయించడాన్ని నిషేధించింది. దీనిని అమలు చేసేందుకు అధికారులు నగరంలోని పలు మార్కెట్‌లలో దాడుల నిర్వహిస్తున్నారు.
గ్వాలియర్ మార్కెట్‌లో లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న ఏడు మాసం దుకాణాలను అధికారులు మూసివేయించారు. అలాగే పలువురు వ్యాపారుల నుంచి వేల రూపాయల జరిమానా వసూలు చేశారు. దీనికితోడు ఆయా వ్యాపారుల నుంచి సరుకులను స్వాధీనం చేసుకున్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హర్ష్‌సింగ్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అనూజ్ శర్మ, డాక్టర్ వైభవ్ శ్రీవాస్తవ నేతృత్వంలో నగరంలో బహిరంగంగా మాంసం, చేపలు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు బృందాలుగా ఏర్పడి చర్యలు చేపట్టారు. రోడ్డు పక్కన మాంసం, చేపలు విక్రయిస్తున్న వారి నుంచి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. తాత్కాలిక దుకాణాల ఆక్రమణలను కూడా తొలగించారు. నిబంధనలను పాటించని దుకాణదారుల నుంచి మూడు వేల రూపాయల చొప్పున జరిమానా వసూలు చేశారు.
ఇది కూడా చదవండి: 2023.. భారత్‌లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదాలివే..
Comments
Please login to add a commentAdd a comment