mohan
-
'సరిపోదా శనివారం' బ్యూటీ ప్రియాంక మోహన్ చీర లుక్స్ తో రచ్చ చేస్తుందిగా..! (ఫోటోలు)
-
'మీ అమ్మాయిలతో ఇలాంటి సినిమా తీయండి'.. స్టార్ డైరెక్టర్‌పై దర్శకుడు తీవ్ర విమర్శలు
అంజలి శివరామన్, శాంతి ప్రియ, శరణ్య రవిచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం బ్యాడ్ గర్ల్. ఈ మూవీని వర్ష భరత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌పై కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్, బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.అయితే ఈ సినిమాపై మరో డైరెక్టర్ మోహన్ జి క్షత్రియ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ చిత్రాన్ని బ్రాహ్మణ అమ్మాయి వ్యక్తిగత జీవితం ఆధారంగా తెరకెక్కించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ అమ్మాయి వ్యక్తిగత జీవితాన్ని చిత్రీకరించడం మీకు ఎల్లప్పుడూ బోల్డ్‌గా అనిపించొచ్చు.. కానీ వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ నుంచి ప్రేక్షకులు ఇంకా ఏం ఆశించాలని ప్రశ్నించారు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో తల్లిదండ్రులను దూషించమనేది పాతదే.. ఇందులో ఎలాంటి కొత్తదనం లేదని అన్నారు. ముందు మీ కులం అమ్మాయిలతో ఇలాంటి సినిమాలు తీసి వాటిని మీ కుటుంబానికి చూపించండి అంటూ కాస్తా ఘాటుగానే ట్వీట్ చేశారు. కుల ఆధారిత సినిమాలను తెరకెక్కించడం పట్ల వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్‌పై మోహన్ జి క్షత్రియ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.అయితే ఈ బ్యాడ్ గర్ల్ చిత్రాన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్డ్యామ్ -54వ ఎడిషన్‌లో వరల్డ్ ప్రీమియర్ ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ప్రతిష్టాత్మకమైన టైగర్ కాంపీటీషన్ విభాగంలో ఈ మూవీ పోటీపడుతోంది. ఈ చిత్రంలో హృదు హరూన్, టీజే అరుణాసలం, శశాంక్ బొమ్మిరెడ్డిపల్లి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రాధా శ్రీధర్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రం టీజర్‌ను ఆదివారం చెన్నైలో విడుదల చేశారు. ఇందులో ఎప్పుడూ బాయ్‌ఫ్రెండ్ ఉండాలని కోరుకునే టీనేజ్ అమ్మాయిగా (అంజలి శివరామన్) కనిపించింది. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యుక్తవయస్సులో ఉండే పాత్రలో అంజలి శివరామన్ నటించింది. ఆమె తన తల్లిదండ్రుల నుంచి తరచూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు టీజర్లో చూపించారు. ఊహించని ఓ సంఘటన ఆమెను ఇంటి నుంచి బయటకు వచ్చేలా చేస్తుంది. ఈ నిర్ణయం ఆమె ఎప్పుడూ ఉండాలనుకునే వ్యక్తిగా మారేలా చేస్తుంది. డేటింగ్ యాప్ గురించి తల్లి, కూతురు మాట్లాడుకోవడంతో టీజర్ ముగుస్తుంది.టీజర్‌పై పా రంజిత్ ప్రశంసలు..అయితే బ్యాడ్ గర్ల్ టీజర్‌పై డైరెక్టర్ పా రంజిత్ ప్రశంసలు కురిపించారు. ఇలాంటి సాహోసపేతమైన కథను అందించినందుకు వెట్రిమారన్‌ను కొనియాడారు. ఈ చిత్రం మహిళల పోరాటాలను సినిమా రూపంలో మీ ముందుకు తీసుకొస్తుందని.. డైరెక్టర్ వర్ష భరత్‌కు అభినందనలు తెలిపారు. అంజలి శివరామన్ అద్భుతంగా నటించిందని పా రంజిత్ ట్విటర్లో పోస్ట్ చేశారు. Portraying a brahmin girl personal life is always a bold and refreshing film for this clan. What more can be expected from vetrimaran, Anurag kasyap & Co.. Bashing Brahmin father and mother is old and not trendy.. Try with your own caste girls and showcase it to your own family… https://t.co/XP8mtnaFws— Mohan G Kshatriyan (@mohandreamer) January 27, 2025 -
క్రిమినల్ కేసులో హైకోర్టు అరుదైన తీర్పు
సాక్షి, అమరావతి : ఓ క్రిమినల్ కేసులో హైకోర్టు అరుదైన తీర్పు వెలువరించింది. నిందితుల వాదన వినకుండా, వాదన వినిపించే అవకాశం ఇవ్వకుండా, కనీసం వారికి న్యాయ సాయం (లీగల్ ఎయిడ్) కూడా అందించకుండా కేసు విచారణ (ట్రయల్) మొదలు పెట్టి, నెల రోజుల్లో వారికి శిక్ష విధిస్తూ ఏలూరు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ట్రయల్ నిష్పాక్షికంగా జరగనప్పుడు న్యాయానికి విఘాతం కలుగుతుందని పేర్కొంటూ ఆ తీర్పును రద్దు చేసింది. తిరిగి మొదటి నుంచి (డీ నోవో) విచారణ మొదలు పెట్టాలని, 6 నెలల్లో పూర్తి చేయాలని ప్రత్యేక కోర్టును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి, జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల ఆరోపణల ప్రకారం.. ఏలూరుకు చెందిన బోడ నాగ సతీష్ తన స్నేహితులైన బెహరా మోహన్, బూడిత ఉషాకిరణ్‌లతో కలిసి 2023 జూన్ 13న ఓ వివాహితపై యాసిడ్ దాడి చేశారు. దీంతో ఆమె చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో పోలీసులు వీరితో పాటు మరో ముగ్గురిపై హత్యానేరం, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జూన్ 15న నాగ సతీష్‌తో పాటు అతని ఇద్దరు స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం దర్యాప్తు పూర్తి చేసి ఏలూరు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో జూలై 7న చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టు ఆగస్టు 16న ట్రయల్ మొదలుపెట్టింది. అక్టోబర్ 10న తీర్పు వెలువరించింది. నాగ సతీష్, మోహన్, ఉషాకిరణ్లకు జీవిత ఖైదు విధించింది. మిగిలిన ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ నాగ సతీష్ తదితరులు హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై జస్టిస్ సురేష్‌రెడ్డి, జస్టిస్ శ్రీనివాస్‌రెడ్డి ధర్మాసనం విచారణ జరిపి, పై విధంగా ఆదేశాలు జారీ చేసింది. -
తెలంగాణకు శోభా కరంద్లాజే.. ఏపీకి పీసీ మోహన్
సాక్షి, న్యూఢిల్లీ: సంస్థాగత మార్పుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పార్టీ నూతన అధ్యక్షుల నియామకానికి శ్రీకారం చుట్టింది. సంక్రాంతిలోగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కౌన్సిల్ సభ్యులను నియమించేందుకు వీలుగా ప్రత్యేక ఎన్నికల అధికారుల పేర్లను ఖరారు చేసింది. శుక్రవారం 29 మందితో కూడిన జాబితాను బీజేపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల అధికారిగా కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే, ఆంధ్రప్రదేశ్‌కు కర్ణాటకకు చెందిన లోక్‌సభ సభ్యుడు పీసీ మోహన్‌లను నియమించింది. వీరితో పాటు తమిళనాడుకు కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, ఉత్తరప్రదేశ్‌కు పీయూష్‌గోయల్, అండమాన్ నికోబార్‌కు తమిళిసై సౌందర్‌రాజన్, బిహార్‌కు మనోహర్‌లాల్ ఖట్టర్, కర్ణాటకకు శివరాజ్ సింగ్ చౌహాన్, గుజరాత్‌కు భూపేంద్ర యాదవ్, మధ్యప్రదేశ్‌కు ధర్మేంద్ర ప్రధాన్, పుదుచ్చేరికి తరుణ్ ఛుగ్‌లకు ఎన్నికల అధికారులుగా బాధ్యతలు అప్పగించింది. -
సరికొత్త కాన్సెప్ట్‌తో ఎంఫోర్ఎం.. ఫస్ట్ రోజే లక్ష గెలిచే ఛాన్స్!
జో శర్మ, సంబీత్ ఆచార్య జంటగా నటిస్తోన్న చిత్రం 'ఎంఫోర్ఎం'. ఈ చిత్రానికి మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించారు. సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు డైరెక్టర్ తెలిపారు. సినీ చరిత్రలో ఇప్పటివరకు రానీ కాన్సెప్టుతో ఈ సినిమా చేసినట్లు వెల్లడించారు. రాబోయే పదేళ్లు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటారనే నమ్మకముందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా డైరెక్టర్ మోహన్ మాట్లాడుతూ.. 'ఇటీవల హిందీ ట్రైలర్ గోవా ఫిలిం ఫెస్టివల్లో విడుదల చేశాం. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మా సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాం. హీరోయిన్ జో శర్మ తన ఫర్మార్మెన్స్‌తో సినిమాకు హైలైట్‌గా నిలవనుంది. హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించాం. కథ, కథనాలను నమ్ముకునే సినిమా తీశాం. ఈ సినిమా విడుదలైన ఫస్ట్ డే చూసి ఇందులో కిల్లర్ ఎవరో గెస్ చేస్తే ఒక్కోక్కరికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.కాగా.. ఈ చిత్రంలో శుభలేఖ సుధాకర్, సత్య కృష్ణ, ఎంఆర్సీ వడ్లపట్ల, పసునూరి శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి వసంత్ సంగీతమందిస్తున్నారు. మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మించారు. -
ఒడిశాకు తప్పిన తుఫాను ముప్పు: సీఎం మోహన్
న్యూఢిల్లీ:'దానా' తుఫాను ఒడిశా తీరం దాటిన నేపధ్యంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ పరిస్థితిని సమీక్షించారు. ఇకపై రాష్ట్రం సురక్షితమని, అధికారుల టీమ్ వర్క్ కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన పేర్కొన్నారు.విలేకరుల సమావేశంలో సీఎం మాఝీ మాట్లాడుతూ, ఇప్పటివరకు ఎనిమిది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ‘ఒడిశా ఇప్పుడు సురక్షితంగా ఉంది. తుఫాను తాకిడి తరువాత, పరిస్థితిని సమీక్షించాము. అధికారుల సమిష్టి కృషి కారణంగా, ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. మేము ఎనిమిది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. సహాయ కేంద్రాల్లో వారికి వసతి కల్పించాం. విద్యుత్ లైన్ల మరమ్మతు పనులు జరుగుతున్నాయి. 1.75 లక్షల హెక్టార్లలో పంటలు నాశనమైనమయ్యాయి. బుధబలంగ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది’ అని పేర్కొన్నారు. The deep depression (remnant of severe cyclonic storm “DANA”) over north Odisha remained practically stationary during past 6 hours, weakened into a Depression over the same region and lay centred at 2330 hrs IST of yesterday, the 25th October near latitude 21.4°N and longitude… pic.twitter.com/Bb7LrXjHTT— India Meteorological Department (@Indiametdept) October 25, 2024'దానా' తుఫాను గంటకు ఏడు కి.మీ వేగంతో వాయువ్య దిశగా కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ ఒక పోస్ట్‌లో ఒకటి తెలిపింది. ఇది ఉత్తర ఒడిశా మీదుగా పశ్చిమ దిశలో పయనించి, రానున్న 12 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. తుఫాను ప్రభావం గురించి భారత వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సోమనాథ్ దత్తా మాట్లాడుతూ ఒడిశాలోని కొన్ని జిల్లాల్లో ఒకటి రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక తుపాను ప్రభావం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.ఇది కూడా చదవండి: అందరి చూపు షిల్లాంగ్ వైపే -
మూడేళ్ళ గ్యాప్ తర్వాత రీఎంట్రీ.. టాలీవుడ్ దూసుకెళ్తున్న ‘శనివారం’ బ్యూటీ (ఫొటోలు)
-
ఎందుకీ రాద్ధాంతం?
ఆ నెయ్యిలో ఏదో జంతువు కొవ్వు కలిసిందని జరుగుతున్న ప్రచారం కేవలం ఊహాజనితం. దీనికి ఎలాంటి శాస్త్రీయ కొలబద్ద లేదు. ఇలాగైతేనే ప్రజలు నమ్ముతారని మూఢ నమ్మకం మాటున చెబుతున్నదే. ఏదైనా విషయాన్ని ఉద్దేశ పూర్వకంగా అశాస్త్రీయంగా అంచనా వేయడంలో భాగంగానే ఇది జరిగింది. అంటే ఏదో ఆశించి ఇలా చేశారని స్పష్టమవుతోంది. ఇది ‘బ్యాడ్ కేస్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్’గా నిలుస్తుంది. – ప్రముఖ ఆర్థిక వేత్త, సామాజిక కార్యకర్త మోహన్ గురుస్వామిసాక్షి, హైదరాబాద్ : ఏ నివేదికలో నిరూపణ కాకుండానే తిరుమల లడ్డూపై దుష్ప్రచారం తగదని ప్రముఖ ఆర్థిక వేత్త, సామాజిక కార్యకర్త మోహన్ గురుస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ‘సెక్యులర్ రాజ్యంలో మతానికి చోటుండదు. మతపరమైన విశ్వాసాలు అనేవి వ్యక్తిగతం. అసలు ప్రభుత్వంలో మతం అనే దానికి చోటే లేదు. ఇలాంటి విషయాలను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుమలను వివాదాస్పదంగా మార్చడం సరికాదు’ అని అన్నారు.మతపరమైన విశ్వాసాలపై వివాదం సృష్టించి, తద్వారా రాజకీయ ప్రయోజనం పొందేందుకే తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు కనిపిస్తోందని చెప్పారు. పాలకులకు ఇబ్బంది కలిగించే విషయాలను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి వివాదాలు తెరపైకి తెస్తుంటారని, ఏపీలో ఇప్పుడదే జరుగుతోందన్నారు. తిరుమల లడ్డూ వివాదం, జాతీయ, రాష్ట్ర స్థాయిలో రాజకీయ పరిణామాలు, ఆర్థిక రంగంలో ఎదురవుతున్న సవాళ్లు తదితర అంశాలపై సాక్షి ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. అవన్నీ రాజకీయ ఆరోపణలే ⇒ లడ్డూల తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే రాజకీయ ఆరోపణలు, వాటికి ప్రభుత్వ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం మినహా అది నిజమని ఏ నివేదికలోనూ వెల్లడి కాలేదు. ఈ అంశం అమూల్‌తో సహా ఏ నివేదికలోనూ నిరూపితం కాకుండానే అయినట్టుగా ప్రచారం చేస్తున్నారు. ⇒ పాలు జంతువుల ఉత్పత్తితో ముడిపడినవే. శాస్త్రీయంగా చూస్తే.. ఆవు, బర్రె, మేక ఆ మాటకొస్తే ఏదైనా మొక్క నుంచి వచ్చే కొవ్వును మారి్పడి చేస్తే నెయ్యి తయారవుతుంది. ఆవు అధికంగా మేత మేసినా, లేక తక్కువగా తిన్నా ఫలితాల్లో మార్పులు కనిపిస్తాయి. ఇదే విషయాన్ని అమూల్ టెస్ట్ రిజల్ట్ నిర్ధారించింది. కల్తీ అయిందని చెబుతున్న నెయ్యే లడ్డూ తయారీలో వాడనప్పుడు అపచారం జరిగిందనడానికి ఎక్కడ తావుంది? ⇒ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాది. తన స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలే ఆయనకు అత్యంత ముఖ్యం. ఇందుకోసం ఏం చేయడానికైనా ఆయన వెనుకాడరని చరిత్ర చెబుతోంది. గతంలో మోదీని నంబర్ వన్ శత్రువుగా ప్రకటించిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయనకు నంబర్ వన్ మిత్రుడు ఎలా అయ్యారు? ⇒ అత్యున్నత పదవుల్లో ఉన్న వారికి లౌకికవాదమంటే అసలైన అర్థం తెలుసా? వారికి ఆ పదవిలో కొనసాగే అర్హత ఉందా? (ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను ఉద్దేశించి) అన్న అనుమానం కలుగుతోంది. చంద్రబాబు స్వార్థ రాజకీయాలే చేస్తారు ⇒ గతంలో చంద్రబాబు మనుషులు సైబరాబాద్ చుట్టూ భూములు కొని లాభ పడ్డారు. అప్పుడు అక్కడ భూముల పేరిట చేసిందే ఇప్పుడు అమరావతిలో పెద్ద ఎత్తున చేయబోతున్నారు. అందుకే అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని పట్టుబడుతున్నారు. తన అనుయాయులు కొన్న భూములన్నీ కూడా అక్కడే ఉండటం గమనించాల్సిన విషయం. చంద్రబాబు ఎప్పుడూ స్వార్థ రాజకీయాలే చేస్తారు. ⇒ అయితే అక్కడ మౌలిక, ఇతర అవసరాల కోసం పెట్టుబడులు పెట్టడానికి వేల కోట్ల రూపాయలు కావాలి. మోదీ ప్రభుత్వం కూడా ఆ మేరకు ఇచ్చే పరిస్థితి లేదు. ఏపీకి కేంద్రం ‘ప్రత్యేక హోదా కల్పన’ ఇవ్వడం అనేది అసాధ్యం. ఏపీలో బీహార్ మాదిరిగా వెనుకబాటుదనం లేదు. ఈశాన్య రాష్ట్రాల లాగా భౌగోళికంగా దూరప్రాంతాల్లోనూ లేదు. ప్రతిసారి కేంద్రం నుంచి గ్రాంట్లు కావాలని, డబ్బులు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేసినా అది రావడం కూడా కష్టమే. సాధ్యం కాదు. ⇒ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే చంద్రబాబు.. అమరావతిలో మెట్రో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, పరిపాలనా కేంద్రం సచివాలయం, గవర్నమెంట్ ఉద్యోగుల క్వార్టర్లు, ఇతర ఆధునిక సదుపాయాలు, ముఖ్యమైన సంస్థలన్నీ అమరావతిలోనే ఉండాలంటున్నారు. ఇలా అన్నీ అక్కడే ఎందుకో.. దాని వెనుక ఏం ప్రయోజనాలు ఆశిస్తున్నారో లోతుగా గమనించాలి. ముందుగా ఓ కమర్షియల్ సెంటర్‌గా ఎదిగాక అవన్నీ సమకూరాలని కోరుకుంటే మంచిది. ⇒ కేంద్రంలో రాజకీయ స్థిరత్వం అనేది చంద్రబాబు, నితీ‹Ùకుమార్ వంటి నమ్మకం లేని (అన్ ట్రస్ట్ వర్తీ) వ్యక్తులపై ఆధారపడి ఉంది. వీరిద్దరూ మద్దతు ఉపసంహరించినా కేవలం ఆరుగురు ఎంపీల మెజారిటీతో ప్రభుత్వం మనగలుగుతుంది. అయితే గత రెండు పర్యాయాలతో పోలి్చతే మోదీ ప్రభుత్వం బలహీనంగానే ఉంది. దేశంలో నిరుద్యోగ శాతం, ఉద్యోగాలు, ఉపాధి కోరుకుంటున్న యువత సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ విధానాలను, విపక్షాలను మోదీ ‘మిస్ మేనేజ్’ చేశారు. తప్పుడు గణాంకాలతో మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ‘కేపిటల్ ఇన్వెస్ట్మెంట్’ అనుకున్న విధంగా జరగలేదు. కార్పొరేట్ కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి. వైఎస్ జగన్ వికేంద్రీకరణ ఆలోచన బాగుంది ⇒ రాష్ట్ర రాజధానిని వికేంద్రీకరించాలనే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన ఎంతో బాగుంది. గతంలో కర్నూలులో రాజధాని ఉండేది. హైకోర్టు, రాష్ట్ర సచివాలయం రెండూ రాజధానిలోనే ఎందుకుండాలి? రాష్ట్ర రాజధానిలోనే మెట్రోరైల్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వంటివి ఎందుకుండాలి? భోపాల్, రాయ్‌పూర్, రాంచీ, లఖ్‌నవూ, పాట్నా వంటి రాజధానుల్లో మెట్రో, అంతర్జాతీయ విమానాశ్రయాలు లేవు. ⇒ జగన్ సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు.. ముఖ్యంగా విద్య, వైద్య రంగాలపై దృష్టి సారించడం బాగుంది. మంచి ఫలితాలు వచ్చాయి. వివిధ వర్గాల ప్రజలకు, ముఖ్యంగా పేదలకు నేరుగా నగదు బదిలీ (డీబీటీ) అనేది మంచి ఆలోచన. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో ఇలా చేయడం, ఇళ్ల దగ్గరే ప్రజలకు అందించడం ఎంతో మేలు చేసింది. డీబీటీ విధానాన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. ఇది ఉత్పాదకతను పెంచేదే. ఆర్థిక రంగానికి మేలు చేస్తుంది. ⇒ ఎవరైనా సంక్షేమ పథకాలు సరైనవి కాదు అనడం, వీటిపై డబ్బు ఖర్చు చేయడం వృథా అనడం తప్పు. విద్య, వైద్య సేవలకు కూడా చార్జ్ చేస్తారా? ఇవన్నీ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయి. ప్రభుత్వాలు ఏవైనా విద్యా రంగం, పబ్లిక్ హెల్త్‌కేర్‌పై ఎక్కువ నిధులు ఖర్చు చేయాలి. ప్రజలకు మేలు చేకూర్చడం అనేది ఓ మంచి ఆర్థిక కార్యక్రమంగా భావించాలి. -
కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా గోవింద్ మోహన్
న్యూఢిల్లీ: సీనియర్ ఐఏఎస్ అధికారి గోవింద్ మోహన్ తదుపరి కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా ఉన్న గోవింద్ మోహన్‌ను అజయ్‌కుమార్ భల్లా స్థానంలో హోంశాఖ కార్యదర్శిగా నియమిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. ఈనెల 22న అజయ్‌కుమార్ పదవీ విరమణ చేయనున్నారు. అదేరోజు గోవింద్ మోహన్ బాధ్యతలు చేపడతారు. నళిన్ ప్రభాత్ పదవీకాలం కుదింపు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్‌గా నళిన్ ప్రభాత్ పదవీకాలం 2028 ఆగస్టు 31 ఉండగా కేంద్రం అర్ధంతరంగా కుదించింది. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన నళిన్ను డిప్యుటేషన్‌పై ఏజీఎంయూటీ కేడర్‌కు మార్చింది. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ బుధవారం ఆదేశాలు జారీచేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేదాకా లేదా మూడేళ్లపాటు నళిన్ ఏజీఎంయూటీ కేడర్‌లో డిప్యుటేషన్‌పై కొనసాగుతారని వివరించింది. అరుణాచల్ ప్రదేశ్– గోవా– మిజోరం– కేంద్ర పాలిత ప్రాంతాలను కలిసి ఏజీఎంయూటీ కేడర్‌గా పిలుస్తారు. ఇది కేంద్ర హోంశాఖ నియంత్రణలో ఉంటుంది. ప్రభాత్‌కు కేంద్రం కొత్త బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. -
తిరుపతి: ఇష్టంలేని పెళ్లి చేశారని టెక్కీ ఘాతుకం
తిరుపతి క్రైం: తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని అన్న భార్య, ఇద్దరు కుమార్తెలను హత్యచేసి.. తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బుధవారం రాత్రి తిరుపతి పద్మావతినగర్‌లో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరుకు చెందిన గుడిమెట్ల తిరిపిదాస్ రెండేళ్ల క్రితం కుటుంబంతో వచ్చి తిరుపతి పద్మావతి నగర్లో నివాసం ఉంటున్నాడు. ప్రైవేట్ ఉద్యోగి అయిన దాస్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు. దాస్ సోదరుడు గుడిమెట్ల మోహన్ (36) చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతడికి 2019లో అన్నావదినలు వివాహం జరిపించారు. వివాదాల నేపథ్యంలో 2021లో భర్త మోహన్‌ను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తరువాత తమ్ముడి భార్య, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడిన దాస్ ఇద్దరూ కాపురం చేసుకునేలా ఒప్పించాడు. ఆ సమయంలో తనకు ఇష్టంలేని పెళ్లి చేశావంటూ దాస్‌పై తమ్ముడు మోహన్ దాడి చేశాడు. కొంతకాలం అనంతరం మోహన్ అతడి భార్య మధ్య గొడవలు ప్రారంభం కావటంతో మోహన్ భార్య తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది. చెన్నైలో ఉద్యోగం చేసుకుంటున్న మోహన్ తరచూ తిరుపతిలోని అన్న వద్దకు వచ్చి వెళ్తుండేవాడు. రెండు రోజుల క్రితం తిరుపతి వచి్చన మోహన్ బుధవారం సాయంత్రం అన్న కుమార్తెలను స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇంటివద్ద విడిచిపెట్టి బజార్‌కు వెళ్లాడు. అన్న ఇంట్లో లేని సమయంలో తిరిగి వచ్చిన మోహన్ కత్తితో వదిన, అన్న కుమార్తెల గొంతుకోశాడు. ఆ తరువాత తాను గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దాస్ ఇంటికి చేరుకోగా.. తలుపులు లోపలికి గడియపెట్టి ఉండడంతో అనుమానం వచ్చి వెనుక డోర్ తెరుచుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. అప్పటికే భార్య, ఇద్దరు కుమార్తెల మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. తమ్ముడు గదిలో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఉన్నాడు. సమాచారం అందుకున్న ఎస్పీ సుబ్బరాయుడు, డీఎస్పీ రవిమనోహరాచారి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తన తమ్ముడు ఇష్టంలేని పెళ్లి చేసినందుకు తనపై కక్ష పెంచుకున్నాడని దాస్ చెప్పాడు. భార్యాభర్త విడిపోవడంతో ఇద్దర్నీ కలిపేందుకు ప్రయత్నించానని తెలిపాడు. తనపై కోపం పెంచుకుని చివరకు ఇలా చేశాడని వాపోయాడు. -
ఎయిడ్స్ ఉందని ప్రచారం.. దశాబ్దాల తర్వాత నోరు విప్పిన హీరో
సెలబ్రిటీలపై ఎన్నో రూమర్స్ వస్తుంటాయి. కొందరు చూసీ చూడనట్లు ఉంటారు. కొందరేమో అగ్గి మీద గుగ్గిలమవుతారు. మరికొందరేమో కోపమొచ్చినా, బాధేసినా మనసులోనే దాచుకుంటారు. అలా ఒకప్పటి పాపులర్ హీరో మోహన్ మీద అప్పట్లో పెద్ద తప్పుడు ప్రచారం జరిగింది. అతడికి ఎయిడ్స్ ఉందని ఎవరో వదంతులు సృష్టించారు. ఇంకేముంది.. ఇది నిజమేనని చాలామంది వార్తలు రాసేశారు. దశాబ్దాల తర్వాత ఆ తప్పుడు వార్తలపై స్పందించాడు.ఎయిడ్స్ ఉందని ప్రచారం..తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. '90'స్లో సినిమాలకు దూరంగా ఉన్నప్పుడు నాకు ఎయిడ్స్ అని ప్రచారం చేశారు. ఇది విని నా అభిమానులు ఆందోళన చెందారు. కుటుంబం సైతం ఇబ్బందిపడింది. కానీ ఆ సమయంలో నాకు ఎంతో అండగా నిలిచింది. నాకు ఎయిడ్స్ లేదని మీడియాకు క్లారిటీ ఇవ్వమని ఓ జర్నలిస్టు సలహా ఇచ్చాడు. నేనందుకు ఒప్పుకోలేదు. స్పందించేందుకు ఇష్టపడని హీరోఈ పుకారు సృష్టించేదే మీడియా.. కాబట్టి వాళ్లంతట వాళ్లే ఇది తప్పని చెప్పాలని మొండిగా వ్యవహరించాను. ఏ సంబంధమూ లేని నన్ను బలి చేసినప్పుడు పనికి మాలిన పుకారు గురించి స్పందించాల్సిన అవసరం నాకేంటని సైలెంట్‌గా ఉన్నాను. అప్పుడు నా భార్య, కుటుంబం నాకెంతో అండగా నిలబడింది' అని చెప్పుకొచ్చాడు.రెండో సినిమాకే బ్రహ్మరథంకాగా మోహన్.. 1980వ సంవత్సరంలో మూడు పని అనే తమిళ చిత్రంతో వెండితెరపై ప్రయాణం ఆరంభించాడు. తన రెండో సినిమా నేంజతై కిల్లతే ఏడాదిపాటు బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ఆడటంతో పాటు మూడు జాతీయ అవార్డులు అందుకుంది. అక్కడి నుంచి మోహన్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. సిల్వర్ జూబ్లీ హీరోఆయన సినిమాలు ఏడాదిపాటు సక్సెస్‌ఫుల్‌గా ఆడటం సర్వసాధారణం కావడంతో తనను సిల్వర్ జూబ్లీ హీరో అని పిలిచేవారు. ఈయన తెలుగులో తూర్పు వెళ్లే రైలు, శ్రవంతి, అనంత రాగాలు, ఆలాపన, చూపులు కలిసిన శుభవేళ, అబ్బాయితో అమ్మాయి వంటి చిత్రాల్లో నటించాడు. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన జూన్ 7న విడుదలైన హర (తమిళ) చిత్రంతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చాడు.చదవండి: హీరోయిన్ కాకపోయుంటే ఏం చేసేదాన్నంటే?: ప్రియాంక మోహన్ -
Jabardasth Mohan: జబర్దస్త్ లేడీ గెటప్ కమెడియన్ పెళ్లి (ఫోటోలు)
-
గ్రాండ్‌గా టాలీవుడ్ కమెడియన్ పెళ్లి.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కామెడీ షో జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతోమంది ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా లేడీ గెటప్స్‌లో ఆడియన్స్‌ను అలరిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో వినోద్, కొమరం, శాంతి స్వరూప్, మోహన్, తన్మయ్, సాయితేజ, పవన్, అప్పారావు చాలామందే ఉన్నారు. ప్రస్తుతం ఈ కామెడీ షో లేడీ గెటప్స్‌లో అలరిస్తున్న మోహన్ ఓ ఇంటివాడయ్యారు. తాజాగా మోహన్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఈ వేడుకలో జబర్దస్త్ నటులు రాకెట్ రాఘవ, అధిరే అభి, గడ్డం నవీన్, అప్పారావు సహా పలువురు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోను జబర్దస్ కమెడియన్ నవీన్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం మోహన్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by jabardasth naveen (@gaddamnaveenofficial) View this post on Instagram A post shared by Harikrishna Jabardasth ❤️ (@harikrishna_jabardasth) -
సింగర్ సుజాత మోహన్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
ఒడిశా కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ!
ఒడిశాలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అధిరాజ్ మోహన్ పాణిగ్రాహి పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు వివిధ పదవులకు రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్‌కు అంజేశారు. ఎమ్మెల్యే పాణిగ్రాహి గత 25 ఏళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగారు. ఆయన త్వరలోనే బీజేడీలో చేరనున్నారని విశ్వసనీయ సమాచారం. ఖాడియాల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలతో చర్చించిన తర్వాతనే తాను కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయించుకున్నానని అధిరాజ్ మీడియాకు తెలిపారు. ఏ పార్టీలోకి వెళ్లాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటానన్నారు. అయితే ఆయన బీజేడీలో చేరుతారంటూ పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్‌పై అధిరాజ్ మోహన్ పాణిగ్రాహి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయనకు 59,308 ఓట్లు వచ్చాయి. బీజేడీ నేత లంబోధర్ నియాల్‌కు 56,451 ఓట్లు వచ్చాయి. 2014లో ఇదే అసెంబ్లీ స్థానం నుంచి పాణిగ్రాహి ఓటమి చవిచూశారు. -
ఒక పుస్తకం-ఒక మోహన్-ఒక ఆర్కే!
జ్ఞానోదయంనాడు ఈ పుస్తకాన్ని చూశాను. జ్ఞానము ఫటాపంచలయింది. సంవత్సరాలు పూర్తి మీద పూర్తి సంపూర్తి అయిపోతూనే ఉన్నాయి. ఒక్క బొమ్మ పూర్తి కాలేదు, అసలు మొదలు పెడితే కదా, పూర్తవడానికి! అసలే జీవితము బరువైంది, ఆపై ఈ పుస్తకం వచ్చి సిందుబాదు భుజాలమీద కూచున్నట్టుగా వచ్చి కూర్చుంది. ఎంతకూ దిగనంటుంది. అది దిగనంటుందా? దించుకోవడానికి నాకే ఇష్టం లేదా. ఏమో! తెల్లవారివారంగానే ప్రేమగా మా మొహాలను అద్దంలో చూసుకుని వాటి పై ఖాండ్రించి ఉమ్మేసి, మురిపెంగా మా కళాఖండాలను ముట్టుకుని నుసి మసి బారేంత కాల్చెయ్య గలిగిన దమ్మునిచ్చింది ఈ పుస్తకం. ఈ ముండమోపి బతుకులో కాస్తొ కూస్తొ అందం కనపడిదంటే వొక బాపు, వొక పతంజలి, వొక మోహన్, లాంటి మరి కొందరు ఒకే ఒకరులు అనే వాళ్ళ సాంగత్యమే, పొగురే, బలుపే. ఒకే ఒక కార్టూన్ కబుర్లు పుస్తకంతో స్నేహిత్యమే. 22 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ పుస్తకం రాబోతుందని అంధ్రజ్యోతి ఆదివారపు చాట పత్రికలో చాటింపు పడింది. ఆ తరువాత మాఊరికి వచ్చిన విశాలాంద్ర పుస్తకాల బండిలో ఈ పుస్తకం కంటపడింది. నా దురదృష్టవశాత్తు నేను కొనుక్కున్న పుస్తకంలో 90 వ నెంబరు పేజీ మిస్సు కాలేదు. అయి ఉంటే బావుణ్ణు. ఆ పేజిలో పైనుండి కిందికి రెండవ పేరాలో మోహన్ గారు ఇలా అంటాడు కదా " ఇలాంటి ప్రాజెక్ట్ మీద ఆసక్తి గల ఆర్టిస్టులెవరన్నా రావచ్చు. నాతో పాటు యానిమేషన్ చేసే అసిస్టెంట్స్ అందరితో కలిసి కూచుని బొమ్మలేసి, చూసి ఆనందం పొందవచ్చు. మరి జీతము, తిండి, బతుకూ ఎలా అనే తుఛ్చమైన ఐహికమైన ప్రశ్నలుంటే అవి గూడా పర్సనల్‌గా మాట్లాడుకుందాం. ఇలా పబ్లిగ్గా ఎందుకు. నేను 316243 అనే ఫోన్ నెంబర్ లో టెన్ టు సిక్స్ మాత్రమే కాకుండా ఆ తర్వాత గూడా గుమాస్తాగారికంటే హీనంగా పనిచేస్తూఉంటా. రండి ఇది మాయా యానిమేషన్స్, రెడ్ హిల్స్, హైదరాబాద్" ఈ మాటలు చదవడానికి ముందు నాకెప్పుడూ హైదరాబాదుకు వెళ్ళాలని కాని, మోహన్ గారిని కలవాలని గాని కోరికేమి ఉన్నది కాదు. నాకు ఆ సమయంలో ఒక ఉద్యోగం కావాలి. నేను బొమ్మలేస్తానని నాపై నాకు నమ్మకం ఉన్నది. మోహన్ గారి ఆ ఉద్యోగ ప్రకటన చూసిన తరువాత ఆయనని కలిసింది తొలుత నేను కాదు నా ప్రెండ్ కిశోర్, ఆ తరువాత లావణ్య. అదంతా చెప్పాల్సిన వేరే ముచ్చట. నాకు ఆయన ఉద్యోగం ఇచ్చాడా లేదా? జీతం, తిండి, బతుకూ కల్పించాడా లేదా వంటి తుఛ్చమైన ఐహికమైన ప్రశ్నలకు జవాబు మరో భాగంలో , మరెప్పుడయినా. నేను విశాలాంద్ర పుస్తకాల బండిలో కార్టూన్ కబుర్లు పుస్తకం కొనుక్కున్నా. హైద్రాబాదుకి చేరిన తరువాత ఆ పుస్తకానికి నల్లని చమన్ లాల్ బోర్డ్ తో అట్టవేసుకుని దానిపై తెల్లని జిరాక్స్ ముద్రణ గల లోత్రెక్ ఫోటో అతికించుకుని, పొస్టర్ కలర్‌తో నాదైన అక్షరాల్లో "కార్టూన్ కబుర్లు" అని రాసుకున్నాను. ఆ పుస్తకం చూసి మోహన్ గారు ముచ్చట పడ్డారు. అరే భలే ఉందబ్బా ఈ కవర్, నెక్స్ట్ ఎడిషన్‌కి ఇలా కవర్ వేద్దాము అని కూడా అన్నాడు. ( చాలా సంవత్సరాల తరువాత కొత్త కార్టూన్ కబుర్లు పుస్తకానికి నాతో డిజైన్ంగ్, లే అవుట్ చేయించుకుందామని ఆశ కూడా పడ్డారు) ఆ తరువాత, ఆ నా పుస్తకాన్ని పట్టుకుని అలానే అందరమూ కలిసి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉండే హార్ట్ ఆనిమేషన్ స్టూడియోకి చేరి అక్కడ ప్రిన్సిపాల్ గారు శ్రీ జయదేవ్ గారిని కలిసి నమస్కరించాము. ఆ తదుపరి నా నల్లని కార్టూన్ కబుర్ల పుస్తకం కవరు తెరిచి లోపల తెల్లని పేజీ పై "జయదేవ్ గారికి ప్రేమతో మోహన్" అని వ్రాసి సంతకం చేసి ఇచ్చాడు. అలా ఇవ్వడానికి మీకు ఏ అధికారం లేదు మొర్రో, అది నా పుస్తకం కుయ్యో, దానిని మా ఊర్లో మా నాయన జేబులో డబ్బులు కొట్టేసి కొనుక్కున్నా అయ్యో అని ఎంత మొత్తుకున్నా వినిపించుకోవడానికి ఎవరికీ ఆసక్తి లేదు. అందరూ చిరునవ్వుతో గ్రూప్ ఫోటో దిగే మూడ్ లో ఉన్నారు. ఆ తరువాత నేను చాలా అనే అయిదారు కార్టూన్ కబుర్లు పుస్తకాలు కొనుక్కున్నా. ప్రతి పుస్తకం పై మోహన్ గారు టు అన్వర్ విత్ లవ్ మోహన్ అని సంతకం చేసి ఇచ్చేవాడు. అప్పుడప్పుడూ నా ప్రియతములకి నేను ఆ పుస్తకాలు పంచుకునే పని పెట్టుకున్నా. అ మధ్య కూడా డాక్టరమ్మ ఒక భార్గవి గారి ఇంట్లో కార్టూన్ కబుర్లు రెండు కనపడితే నీకు రెండు పుస్తకాలు ఎందుకమ్మా అని దబాయించి , ఒక పుస్తకాన్ని నా కొత్తవకాయ ప్రెండ్ సుస్మిత చేతిలో పెట్టాను. ఈ మధ్య మా అమ్మ సత్యవతి భారతదేశాన్ని, నిషా బార్ గల్లీని ఖాలీ చెసి వెడుతూ "పుత్తర్ నీకేమైనా పుస్తకాలు కావాలా తేల్చుకో" అంది. ఆవిడ పుస్తకాల బీరువాలోంచి కార్టూన్ కబుర్లు తీసుకుని గుండెలకు హత్తుకున్నా. ఈ పుస్తకాన్ని ఎన్నిసార్లు చదివి ఉంటానో లెక్కే లేదు. చదివిన ప్రతిసారి రూపాయి కాయిన్ టెలిఫోన్ బాక్స్ లోంచి మోహన్ గారికి ఫోన్ చేసేవాడిని. అప్పుడు మొబైళ్ళు లేని కాలమది. హైద్రాబాద్ బ్రతుకు మీద చిరాకు, దుఖం, బాధ, పగ కలిగినప్పుడల్లా ఇంటి గోడమీద రక్తపు చూపుడు వేలుతో రెండు పేర్లు రాసేవాణ్ణి. నా హిట్ లిస్ట్ అది. ఒకటి మోహన్ రెండు ఆర్కే. వీళ్ళు ఇద్దరూ కలిసి ఈ పుస్తకాన్ని వేయకుండా ఉండి ఉంటే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు కదా. ఎప్పటికయినా ఆ పేర్ల మీద ఇంటూ మార్క్ వేసి వికట్టాటహాసం చేయాలని ఎనభైల సినిమా నాతెలుగు నరనరనా నింపుకున్న కొరిక అది. రెఢ్ హిల్స్ లో మేడమీద గదిలో బుద్దిగా బొమ్మలేసుకుంటున్న సమయాన మధ్యాహ్నపు కిటికి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ "మోహనా ఓ మోహనా" అని పిలుపు వినపడేది. కిటికిలోంచి తొంగి చూస్తే బొద్దుగా ఉండే స్కూటర్ మీద , స్కూటర్ లా బొద్దుగా ఉండే ఆర్కే గారు ఒంటికాలి మీద వాలి, చిరునవ్వుతో కిటికి వంక నవ్వుతూ చూస్తూ కనపడేవాడు. అప్పుడు వయసు నలభయ్లలో ఉన్న మానవులు వీరు. కుర్చీలోంచి లేచి ప్యాంట్‌ని పొట్టమీదకు లాక్కుని, ఎదురు టేబుల్ మీద పెన్నుల పెట్టుకునే డబ్బాలోని దువ్వెనతో తల దువ్వుకుని మోహన్ గారు మెట్లు దిగేవాడు. చాయ్, సిగరెట్, మీనాక్షి సాదా, ఆర్కే అనేవి అప్పటి ఆయన అలవాట్లు. ఆర్కే గారు పని చేసే బ్యాంకు మోహన్ గారి ఆఫీసుకు దగ్గరే. అప్పుడప్పుడూ , ఎప్పుడూ మోహన్ గారు తన టేబుల్ సొరుగులోనుండి విత్ డ్రాయల్ ఫాం తీసి అందులో తనకు కావలసిన అమౌంట్ నెంబరు రాసి, ఫామ్ వెనుక డియర్ ఆర్కే, అన్వర్ నో, శంకర్ నో పంపిస్తున్నాను మర్యాదగా ఒక రెండు వందలు నా అకవుంట్ నుండి ఇవ్వగలవు. అసలు మోహన్ గారి అకవుంట్ లో డబ్బులే ఉండవు. పట్టుకు వెల్లిన కాగితాన్ని చదివి ఆర్కెగారు తన జేబులోంచి డబ్బులు తీసి మాకు ఇచ్చేవాడు. ఇలా డబ్బులు కలెక్ట్ చేసే పని మోహన్ గారు ప్రకాష్ అనే తన తమ్ముడికి గానీ, శంకర్ కి కానీ, నాకు కానీ అప్పగించేవాడు కాని. అక్కడే ఉండే మరో గొప్ప కళాకారుడు శ్రీరాం కి మాత్రం చచ్చినా ఇచ్చేవాడు. శ్రీరాం చాలా ఉన్నత శ్రేణికి చెందిన ఆర్టిస్ట్ అనే భయంతో కాదు, ఆ డబ్బులు తీసుకుని మోహన్ గారి స్నేహానికి ఎక్కడ రాజీనామా చేసి పోతాడేమోననే భరించలేని గౌరవం కొద్ది. ఒకానొక సమయంలో తెలుగులో గొప్ప పుస్తకాలు అనే లిస్ట్, తెలుగు పుస్తకాల్లో ఆకర్షణీయమైన తీరుతెన్నులు అనే లిస్ట్ తో రెండు ఆదివారపు పత్రికలు తమతమ ఉద్దేశాల కథనాలు ప్రకటించాయి . ఆ రెండిటి ఉద్దేశాల ప్రకారము ఆ జాబితాలో ఎక్కడానూ "కార్టూన్ కబుర్లు" లేదు. కార్టూన్ కబుర్లు చదివి, దానిని బుర్రకు ఎక్కించుకోవాలంటే ముందు అటువంటి లిస్ట్ తయారు చేసేవారికి ఒక బుర్ర ఉండాలి కదా, పోనీలే అని సమాథాన్ పడ్డాను. తెలుగులో గొప్ప వందపుస్తకాలు జాబితా అనేది ఒకటి ఉంటే అందులో కార్టూన్ కబుర్లు ఉంటుంది. తెలుగులో పది గొప్ప పుస్తకాలు అని ఒక వరుస వేసినా అందులో కార్టూన్ కబుర్లు చేరుతుంది. తెలుగులో రెండే గొప్ప పుస్తకాలు అని లెక్క తేలినపుడు కూడా అందులో ఒక పుస్తకం పేరు కార్టూన్ కబుర్లు అయి తీరుతుంది. మామూలుగానే తెలుగులో బొమ్మలు చూడటమూ, బొమ్మలు చదవడమూ అంటేనే అది అంధులు చదవవలసిన లిపి, బధిరులు వినదగ్గ సంగీతము అనే స్థాయికి చేర్చిన రచనల మధ్య, రచయితల మధ్య కార్టూన్ కబుర్లు కానీ కార్టూనిస్ట్ మోహన్ కానీ ఆతని వచన విన్యాసం కానీ మరియొక్కటి ఎప్పటికీ పుట్టనిది, మరియొక్కడు చేయలేనిది. మోహన్ గారి వచనం అనేది, బాపు గీత అనేది తయరయితే వచ్చేది కాదు. సమస్త జీవులకు ఒక సూర్యుండు వలె. అవి ఒకసారి మాత్రమే పుడతాయి దానిని చూసి , చదివి ఆనందించగల హృదయ సౌందర్యం అనేది మన సంస్కారం పై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ప్రతి చిత్రకారుడి దగ్గర ఉండవలసిన పుస్తకం కార్టూన్ కబుర్లు, కార్టూన్ కబుర్లు చదవడం కొరకైనా ప్రతి చిత్రకారుడు నేర్చుకోదగ్గ భాష తెలుగు. ఏ రచయిత చదువుకొనంత, ఏ కవి వినలేనంత, ఏ చిత్రకారుడు గీయలేనంత ఏ జర్నలిస్ట్ చూడలేనంతటి ఒకడే మోహన్, ఒకే కార్టూన్ కబుర్లు పుస్తకం. వాస్తవానికి ఒక కార్టూన్ కబుర్లు పుస్తకం మరో రెండు కార్టూన్ కబుర్లుగా రావలసినది, రాలేదు. రాదు కూడా. ఎందుకని సమగ్ర బాపు బొమ్మల కళ. ఎందుకని బొమ్మల్లో చంద్ర మరియూ అతని గొప్ప డిజైనింగ్, ఎందుకని బొమ్మల బాలి-బాలి బొమ్మలు, ఎందుకని కరుణాకర్ ఒక మానవ శరీరసౌదర్య మూర్తి చిత్రణ, ఎందుకని గోవర్ధన గిరిని కుంచె చివరి గీతతో పైకెత్త గల గోపి బొమ్మల పూల మాల, ఎందుకని ఎందుకని ఎందుకని చాలా చాలా గొప్ప పనులు పుస్తకాలుగా రావో అందుకే ఇదీనూ రాదు . అంతవరకూ ఒక కార్టూన్ కబుర్లు ప్రస్తుతానికైతే ఉంది. అందుకని ఆ పుస్తకానికి జిందాబాద్. ఆర్కే గారికి జిందాబాద్ . నాకు మీ నమస్కారాలు. మోహన్ గారికి హేపీ బర్త్ డేలు. (చదవండి: అత్యంత ఖరీదైన పుస్తకం: విశ్వ జనుల విశ్వశాంతి గీతమే ‘An Invaluable Invocation’) -
మాంసం దుకాణాలపై కొరడా ఝుళిపిస్తున్న అధికారులు
మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ సూచనల మేరకు గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్ నగరంలో అనుమతి లేకుండా బహిరంగంగా మాంసం, చేపలను విక్రయించడాన్ని నిషేధించింది. దీనిని అమలు చేసేందుకు అధికారులు నగరంలోని పలు మార్కెట్లలో దాడుల నిర్వహిస్తున్నారు. గ్వాలియర్ మార్కెట్లో లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న ఏడు మాసం దుకాణాలను అధికారులు మూసివేయించారు. అలాగే పలువురు వ్యాపారుల నుంచి వేల రూపాయల జరిమానా వసూలు చేశారు. దీనికితోడు ఆయా వ్యాపారుల నుంచి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హర్ష్‌సింగ్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అనూజ్ శర్మ, డాక్టర్ వైభవ్ శ్రీవాస్తవ నేతృత్వంలో నగరంలో బహిరంగంగా మాంసం, చేపలు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు బృందాలుగా ఏర్పడి చర్యలు చేపట్టారు. రోడ్డు పక్కన మాంసం, చేపలు విక్రయిస్తున్న వారి నుంచి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. తాత్కాలిక దుకాణాల ఆక్రమణలను కూడా తొలగించారు. నిబంధనలను పాటించని దుకాణదారుల నుంచి మూడు వేల రూపాయల చొప్పున జరిమానా వసూలు చేశారు. ఇది కూడా చదవండి: 2023.. భారత్‌లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదాలివే.. -
వందల ఏళ్ల మూఢనమ్మకాన్ని చెరిపేసిన సీఎం
మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పదవీ బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా తన స్వగ్రామమైన ఉజ్జయిని సందర్శించారు. నగరవాసులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అయితే ఇక్కడే ఒక విచిత్రం చోటుచేసుకుంది. సాధారణంగా నేతలెవరూ రాత్రి వేళ ఉజ్జయినిలో బస చేయరు. దీనివెనుక వందల ఏళ్లుగా అనేక మూఢనమ్మకాలు స్థానికులలో నాటుకుపోయాయి. అయితే వీటన్నింటినీ కాదని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఉజ్జయినిలో రాత్రి గడిపారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఉజ్జయినిలో రాత్రిపూట ఉండటం ద్వారా వందల సంవత్సరాల నాటి మూఢనమ్మకాన్ని బద్దలు కొట్టారు. ఉజ్జయిని మధ్యప్రదేశ్‌లోని ఒక ధార్మిక నగరం. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వరం ఇక్కడే ఉంది. మహాకాళేశ్వరుడు ఉజ్జయినికి రాజు అని స్థానికులు నమ్ముతారు. మహాకాళేశ్వరుడు తప్ప మరే నాయకుడు లేదా మంత్రి ఇక్కడ రాత్రివేళ ఇక్కడ ఉండకూడదని చెబుతారు. ఈ నమ్మకాన్ని కాదని ఎవరైనా ప్రవర్తిసే వారికి ఏదైనా అవాంఛనీయ సంఘటన జరుగుతుందని స్థానికులు అంటారు. నేటికీ ఉజ్జయినిలో ఏ నాయకుడు గానీ, మంత్రిగానీ బస చేయకపోవడానికి ఇదే ప్రధాన కారణం. కాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఉజ్జయినిలో రాత్రి బస చేయడం గురించి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అతను ఈ నగర నివాసి అని, పైగా మహాకాళీశ్వరుని భక్తుడైనందున అతను ఇక్కడ సాధారణ వ్యక్తిగా పరిగణలోకి వస్తారని స్థానిక పండితులు అంటున్నారు. ఈ నియమం నగరవాసులకు వర్తించదని, అందుకే ముఖ్యమంత్రి యాదవ్ తన స్వస్థలమైన ఉజ్జయినిలో ఎటువంటి సంకోచం లేకుండా రాత్రి బస చేయవచ్చని వారంటున్నారు. ఈ విషయంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ ఉజ్జయినికి రాజు మహాకాళీశ్వరుడు మాత్రమేనని, తాను అతని సేవకుడినని, తాను ఇక్కడ రాజుగా కాకుండా మహాకాళీశ్వరుని భక్తునిగా కొనసాగుతానన్నారు. ఇది కూడా చదవండి: సోలార్ కంపెనీలో భారీ పేలుడు.. తొమ్మిదిమంది మృతి! -
సీఎం సొంతూళ్లో సంబరాలు... రెస్టారెంట్లో చాయ్ ఫ్రీ!
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణస్వీకారం చేయడంతో ఆయన సొంత ఊరు ఉజ్జయినిలో సంబరాలు అంబరాన్ని అంటాయి. మోహన్ యాదవ్ మద్దతుదారులు నగరాన్ని సీఎం అభినందనల పోస్టర్లతో నింపేశారు. మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి అయినందుకు అతని అభిమాని ఒకరు తన రెస్టారెంట్లో రోజంతా ఉచితంగా టీ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారోత్సవం భోపాల్‌లో జరిగినప్పటికీ, ఉజ్జయినిలో పండుగ వాతావరణం కనిపించింది. మోహన్ యాదవ్ అభిమాని ఆశిష్ రాథోడ్.. ఘాస్ మండిలోని తన హరిఓమ్ రెస్టారెంట్లో అందరికీ ఉచితంగా టీ అందించారు. మన దేశ ప్రధాని ఒకనాడు టీ విక్రయించారని, మోహన్ యాదవ్ కూడా కష్టపడి ఈ స్థానానికి చేరుకున్నారని రాథోడ్ పేర్కొన్నారు. మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి కావడంతో నగర కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరిగాయాన్నారు. ఈ సంబరాల నేపధ్యంలో తాను 300 లీటర్ల పాలు వినియోగించి, టీ తయారు చేసి, నగరవాసులకు ఉచితంగా అందిస్తున్నానన్నారు. ఇది కూడా చదవండి: లౌడ్ స్పీకర్లు బ్యాన్.. మాంసం విక్రయాలపై మార్గదర్శకాలు! -
లౌడ్ స్పీకర్లు బ్యాన్.. మాంసం విక్రయాలపై మార్గదర్శకాలు!
మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయడంతోనే కీలక ప్రకటనలు చేశారు. లౌడ్ స్పీకర్లను బ్యాన్ చేయడంతో పాటు, బహిరంగంగా మాంసం, గుడ్ల విక్రయాలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు వీవీఐపీ అతిథుల సమక్షంలో మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. తొలి కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామంటూ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాంసం, గుడ్లు దుకాణాలను నడపడానికి భారత ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని, మధ్యప్రదేశ్‌లో వీటిని అనుసరించేందుకు కఠిన ఆదేశాలు జారీ చేశామని సీఎం తెలిపారు. ప్రతి జిల్లాలో యువత కోసం ఒక ఎక్స్‌లెన్స్ కళాశాలను నిర్మిస్తామని, దీనిని ప్రధాన మంత్రి ఎక్స్‌లెన్స్ కళాశాలగా పిలుస్తామన్నారు. ఇందుకోసం 52 కాలేజీలు ఎంపిక చేశామని తెలిపారు. డిగ్రీ మార్క్స్‌షీట్‌ల కోసం విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, వీటికి పరిష్కారంగా కాలేజీలు, యూనివర్శిటీలలలో డిజీ లాకర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. కాగా తరచూ నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు హోంశాఖతో మాట్లాడామన్నారు. ధ్వని పరికరాలను నియంత్రించనున్నామని, ఎవరైనా మతపరమైన ప్రదేశంలో పరిమితులను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. జనవరి 22న యూపీలోని అయోధ్యలో జరిగే నూతన రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌లోనూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అయోధ్యకు వెళ్లే వారికి రామమందిర మార్గంలో స్వాగత సన్నాహాలు చేస్తున్నామన్నారు. 2024 జనవరి ఒకటి నుంచి రాష్టంలోని మొత్తం 55 జిల్లాలలో సైబర్ తహసీల్ ఏర్పాటు చేయనున్నమని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. -
ఆశించడం కంటే చనిపోవడం మేలు: మాజీ సీఎం శివరాజ్ సింగ్
భోపాల్: సీఎం పదవి నుంచి దిగిపోయినవేళ మధ్యప్రదేశ్ బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎంగా మోహన్ యాదవ్ బుధవారం బాధ్యతలు చేపట్టనుండగా, మంగళవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ వెళ్లి తనకు ఏదో ఒక పదవి కావాలని అధిష్టానాన్ని కోరుకోవడం కంటే చనిపోవడం మేలని పేర్కొన్నారు. అలా తాను అడగలేనని చెప్పారు. తన ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను కొత్త సీఎం కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక, ఈ విషయంలో ఆయనకు తన మద్దతు ఉంటుందని చెప్పారు. బీజేపీ అధిష్టానం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న మహిళా కార్యకర్తలు కొందరు కంటనీరు పెట్టుకోవడం, శివరాజ్‌సింగ్ భావోద్వేగానికి గురైనట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రానికి నాలుగు పర్యాయాలు సీఎంగా పనిచేశారు. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 📌 Women Supporters get Emotional while meeting Outgoing Madhya Pradesh CM Shivraj Singh Chouhan. #TNI #Insight #PiN #Politics #MadhyaPradesh #Women #ShivrajSinghChouhan pic.twitter.com/8KDwHOwnHw — The News Insight (TNI) (@TNITweet) December 12, 2023 బీజేపీ అనూహ్య నిర్ణయం.. మరోవైపు.. మధ్యప్రదేశ్ సీఎం ఎంపిక విషయంలో బీజేపీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఓబీసీ వర్గం నాయకుడు మోహన్ యాదవ్(58) పేరును ఖరారు చేసింది. ఆయన ఉజ్జయిని సౌత్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో ఉన్నత విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రి పదవికి పోటీపడిన వారిలో తొలుత మోహన్ యాదవ్ పేరు లేదు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)తో మొదటి నుంచి సంబంధాలు ఉండడం, రాష్ట్రంలో 48 శాతం జనాభా ఉన్న ఓబీసీ నేత కావడంలో బీజేపీ పెద్దలు ఆయనవైపు మొగ్గు చూపారు. One tight slap to Congress handles pic.twitter.com/gj6myS7mM8 — Rishi Bagree (@rishibagree) December 12, 2023 కరడుగట్టిన హిందుత్వావాది మోహన్ యాదవ్ విద్యార్థి దశ నుంచి నాయకుడిగా ఎదిగారు. కరడుగట్టిన హిందుత్వావాదిగా ముద్రపడ్డారు. కళాశాలల్లో ‘రామచరిత మానస్’ను ఆప్షనల్ సబ్జెక్టుగా ప్రవేశపెడతామని 2021లో ప్రకటించారు. మోహన్ యాదవ్ 1965 మార్చి 25న ఉజ్జయినిలో జని్మంచారు. 1982లో ఉజ్జయినిలోని మాధవ్ సైన్స్ కాలేజీలో జాయింట్ సెక్రెటరీగా ఎన్నికయ్యారు. 1984లో అదే కాలేజీలో ఉపాధ్యక్షుడిగా విజయం సాధించారు. ఎల్ఎల్బీ, ఎంబీఏతోపాటు పీహెచ్డీ పూర్తిచేశారు. చిన్నప్పటి నుంచే ఆయనకు ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉంది. 1993 నుంచి 1995 దాకా ఆర్ఎస్ఎస్ ఆఫీసు బేరర్‌గా పనిచేశారు. తొలిసారిగా 2013లో ఉజ్జయిని సౌత్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018, 2023లోనూ అక్కడి నుంచే విజయం సాధించారు. 2020లతో మొదటిసారిగా మంత్రి అయ్యారు. ఉజ్జయిని ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన మొట్టమొదటి నాయకుడు ఆయనే. -
మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
భోపాల్: బీజేపీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఓబీసీ వర్గం నాయకుడు మోహన్ యాదవ్(58) పేరును ఖరారు చేసింది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు వి.డి.శర్మ వెల్లడించారు. కేంద్ర పరిశీలకుల ఆధ్వర్యంలో బీజేపీ శాససనసభాపక్షం సోమవారం సాయంత్రం భోపాల్‌లో సమావేశమైంది. తమ నాయకుడిగా మోహన్ యాదవ్‌ను ఎన్నుకుంది. ఆయన పేరును ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్ ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలంతా ఆమోదించారు. మోహన్ యాదవ్ ఇక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమే. ఆయన ఉజ్జయిని సౌత్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో ఉన్నత విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రి పదవికి పోటీపడిన వారిలో తొలుత మోహన్ యాదవ్ పేరు లేదు. రా్ష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)తో మొదటి నుంచి సంబంధాలు ఉండడం, రాష్ట్రంలో 48 శాతం జనాభా ఉన్న ఓబీసీ నేత కావడంలో బీజేపీ పెద్దలు ఆయనవైపు మొగ్గు చూపించినట్లు తెలుస్తోంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా మోహన్ యాదవ్ ఎన్నిక కావడంతో ముఖ్యమంత్రి పదవికి శివరాజ్‌సింగ్ చౌహాన్ రాజీనామా సమరి్పంచారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా పనిచేస్తానని యాదవ్ చెప్పారు. తనను ఎంపిక చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు పార్టీ అగ్రనేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కరడుగట్టిన హిందుత్వావాది మోహన్ యాదవ్ విద్యార్థి దశ నుంచి నాయకుడిగా ఎదిగారు. కరడుగట్టిన హిందుత్వావాదిగా ముద్రపడ్డారు. కళాశాలల్లో ‘రామచరిత మానస్’ను ఆప్షనల్ సబ్జెక్టుగా ప్రవేశపెడతామని 2021లో ప్రకటించారు. మోహన్ యాదవ్ 1965 మార్చి 25న ఉజ్జయినిలో జని్మంచారు. 1982లో ఉజ్జయినిలోని మాధవ్ సైన్స్ కాలేజీలో జాయింట్ సెక్రెటరీగా ఎన్నికయ్యారు. 1984లో అదే కాలేజీలో ఉపాధ్యక్షుడిగా విజయం సాధించారు. ఎల్ఎల్బీ, ఎంబీఏతోపాటు పీహెచ్డీ పూర్తిచేశారు. చిన్నప్పటి నుంచే ఆయనకు ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉంది. 1993 నుంచి 1995 దాకా ఆర్ఎస్ఎస్ ఆఫీసు బేరర్‌గా పనిచేశారు. తొలిసారిగా 2013లో ఉజ్జయిని సౌత్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018, 2023లోనూ అక్కడి నుంచే విజయం సాధించారు. 2020లతో మొదటిసారిగా మంత్రి అయ్యారు. ఉజ్జయిని ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన మొట్టమొదటి నాయకుడు ఆయనే. -
నొప్పిని భరించలేక.. యువకుడి తీవ్ర నిర్ణయం!
సాక్షి, కరీంనగర్: మండలంలోని కొండపల్కల గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య, సీఐ రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాముల మోహన్(33) తన నాయీబ్రాహ్మణ వృత్తి ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొన్ని రోజులుగా విపరీతమైన వెన్ను నొప్పి వస్తుండటంతో ఆస్పత్రిలో చూపించుకొని, మందులు వాడుతున్నాడు. అయినా నొప్పి తగ్గడం లేదు. ఈ క్రమంలో దీపావళి పండుగ సందర్భంగా అతని భార్య రజని ఖాజీపేటలోని తన తల్లిగారింటికి వెళ్ళింది. మోహన్ సోమవారం ఉదయం ఇంటి ఆవరణలో గల మామిడి చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. ఇవి కూడా చదవండి: దిక్కులేని వారిని చేసి వెళ్లిపోయావా.. బండపల్లిలో విషాదం..! -
'కుమురంభీం వర్ధంతి' వేడుకలో.. ఒక్కసారిగా విషాదం!
సాక్షి, ఆదిలాబాద్: గోండు వీరుడు కుమురంభీం వర్ధంతి కార్యక్రమం నిర్మల్ జిల్లాలో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... కడెం మండలం చిన్నబెల్లాల్ గ్రామపంచాయతీ పరిధిలోని గొండుగూడలో ఆదివారం భీం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. జెండా గద్దె వద్ద భీం చిత్రపటాన్ని పెట్టి జెండా ఎగురవేసేందుకు ఇనుప పైపు అమరుస్తుండగా అది సమీపంలోని 11 కేవీ విద్యుత్ తీగకు తగిలింది. విద్యుత్ సరఫరా కావడంతో పైపును పట్టుకున్న మోహన్, భీంరావు, వెంకట్రావు షాక్‌కు గురయ్యారు. అప్రమత్తమైన స్థానికులు బాధితులను విద్యుత్ సరఫరా నిలిపివేయించి ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా పెంద్రం మోహన్(25) మార్గమధ్యలో మరణించాడు. ఆత్రం భీంరావు(26) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మరో బాధితుడు వెడ్మ వెంకట్రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆత్రం భీంరావుకు భార్య గంగామణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెంద్రం మోహన్ బీటెక్ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. ఇద్దరు యువకుల మృతితో చిన్నబెల్లాల్ గ్రామంలో విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. బీఆర్ఎస్ ఖానాపూర్ అభ్యర్ది భుక్యా జాన్సన్‌నాయక్ ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇవి చదవండి: ప్రాణం తీసిన పబ్జీ గేమ్.. ఏకంగా సెల్ టవర్ ఎక్కి.. పైనుంచి.. -
యువకుడు అదుపుతప్పి జూరాల కాల్వలో.. తీవ్ర విషాదం!
మహబూబ్‌నగర్: స్నేహితులతో కలిసి శుభకార్యానికి వచ్చిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన శనివారం వెలుగు చూసింది. ఎస్ఐ రాము కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన మోహన్ (18) మానవపాడులో పెళ్లికి శుక్రవారం వచ్చాడు. వ్యక్తిగత పని నిమిత్తం తెలిసిన వారి ద్విచక్ర వాహనం తీసుకొని అదేరోజు రాత్రి 44వ నంబర్ జాతీయ రహదారి వైపు వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి జూరాల కాల్వలో పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. శనివారం ఉదయం వెదకగా కాల్వలో మృతదేహం, బైక్ కనిపించింది. మోహన్ కర్నూలులోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మృతదేహానికి అలంపూర్ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి ఈశ్వరయ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వివరించారు. -
నిర్మాత కన్నుమూత
కన్నడ నిర్మాత, పంపిణీదారుడు కేసీఎన్ మోహన్(61) ఆదివారం బెంగళూరులోని తన నివాసంలో కన్నుమూశారు. మోహన్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కన్నడంలో అనేక సినిమాలను నిర్మించటం ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు. కాగా ఏడాది క్రితం సోదరుడు కేసీఎన్ చంద్రశేఖర్ మృతి చెందారు. ఆ దుఃఖం నుంచి కుటుంబ సభ్యులు కోలుకుంటున్నారు. ఇంతలోనే మోహన్ మృతి చెందడంతో ఈ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. -
కవిన్‌తో రొమాన్స్‌కు సిద్ధమేనా?
నాలుగేళ్లలోనే మూడు భాషలలో నటించిన లక్కీ నటి ప్రియాంక మోహన్. 2019లో మాతృభాషలో కథానాయకిగా పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ.. అదే ఏడాదిలో తెలుగులో నాని గ్యాంగ్ లీడర్ చిత్రంలో నటించే లక్కీ చాన్స్ దక్కించుకుంది. ఆ వెంటనే కోలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. ఇక్కడ శివ కార్తికేయన్‌కు జంటగా డాక్టర్ చిత్రంలో నటించింది. ఈమె కెరీర్లో మంచి విజయాన్ని సాధించిన చిత్రం ఇదే. ఆ తరువాత వెంటనే సూర్యకు జంటగా ఎదుర్కుమ్ తుణిందన్ చిత్రంలో నటించే అవకాశం తలుపు తట్టింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత శివకార్తికయేన్తో జతకట్టిన డాన్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. కాగా ప్రస్తుతం ధనుష్ సరసన నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అదే విధంగా దర్శకుడు రాకేష్ నూతన చిత్రంలో ప్రియాంక మోహన్ నాయకిగా నటించనుంది. అదే విధంగా సూర్యతో మరోసారి వాడివాసల్ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా తాజాగా ఈ అమ్మడు మరో అవకాశం వరించినట్లు తెలిసింది. డా డా చిత్ర విజయంతో మంచి జోరు మీద వున్న నటుడు కవిన్‌తో ప్రియాంక మోహన్ రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. దీనిని నృత్య దర్శకుడు సతీష్ తెరకెక్కించనున్నారు. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నట్లు తెలిసింది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉందని సమాచారం. కాగా ఇప్పటి వరకు తాను నటించిన చిత్రాలలో పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సంపాదించుకున్న ప్రియాంక మోహన్‌కు గ్లామరస్ పాత్రలపై దృష్టి పెట్టింది. ఈ కారణంతోనే ఇటీవల అందాల ఆరబోతతో ఫొటోలను సామాజిక మాధ్యమాలలో తరచూ విడుదల చేస్తోందనే ప్రచారం సాగుతోంది. -
63 ఏళ్ల వయసులో 6,000 కి.మీ.సైక్లింగ్
ఆయన వయసు 63 సంవత్సరాలు. జెట్ స్పీడ్‌తో సైకిల్ తొక్కుతూ రయ్ రయ్ అంటూ దూసుకెళ్తున్నారు. తొక్కుతున్న సైకిల్ స్పీడ్ చూస్తే 25 ఏళ్ల వయసు ఉన్న యువకుడు అనుకుంటారు. తన ఫేస్‌కు ఉన్న మాస్క్ తీస్తే కానీ తెలియదు ఆయన 60 ఏళ్ళకి పైబడిన వ్యక్తి అని. ఆయనే హైదరాబాద్‌కు చెందిన మేజర్ జనరల్ డాక్టర్ ఆలపాటి వెంకటకృష్ణ (ఏవీకే) మోహన్. సోమవారం హైదరాబాద్ నుంచి సిద్దిపేటలోని రంగనాయకసాగర్‌కు సైక్లింగ్ చేసుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా సాక్షి పలకరించింది. వివరాలు ఆయన మాటల్లోనే... – సాక్షి, సిద్దిపేట 23 ఏళ్లు ఇక్కడే.. 37 ఏళ్లు దేశవ్యాప్తంగా విధులు మా నాన్న దేవాదాయ శాఖలో విధులు నిర్వర్తించేవారు. కాకినాడలో ఎంబీబీఎస్ పూర్తి చేశాను. 1984లో సికింద్రాబాద్‌లోని మిలటరీ హాస్పిటల్లో డాక్టర్‌గా జాబ్ వచ్చింది. 37 ఏళ్ల పాటు ఆర్మీలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించి ఆర్మీ సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ పుణేలో మెడికల్ హెడ్‌గా మేజర్ జనరల్‌గా ఉద్యోగ విరమణ తీసుకున్నాను. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కౌకూర్‌లో నివాసం ఉంటున్నాను. నా కూతురు ప్రసన్న డెంటల్ స్పెషలిస్ట్ గౌహతిలో ప్రాక్టీస్ చేస్తోంది. పర్వతారోహణ.. బైకింగ్ 1991లో ఇటాలియన్లతో కలిసి మౌంట్ సతోపంత్‌కు పర్వతారోహణ యాత్ర చేశా. 2000 సంవత్సరం ప్రారంభంలో కాంగోలోని మౌంట్ నైరాగాంగోలో ప్రత్యక్ష అగ్నిపర్వతం అధిరోహించిన ఆర్మీ బ్రిగేడ్‌లో మొదటి వ్యక్తి నేనే. ఈశాన్యంలోని మొత్తం ఎనిమిది రాష్ట్రాలల్లో బైకింగ్ చేసుకుంటూ తిరిగి వచ్చాను. 2019లో దే«శంలోని మూడు కార్నర్లు తూర్పు, పడమర దక్షణంలో 11,500 కిలో మీటర్లు మోటార్ బైకింగ్ చేశాను. సైక్లింగ్ అంటే ఇష్టంతో నాకు చిన్నప్పటి నుంచి సైక్లింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. డిసెంబర్ 2014లో చెన్నైకి బదిలీపై వచ్చాను. అప్పటికే చెన్నై నగరంలో ప్రసిద్ధ సైక్లింగ్ గ్రూప్ అయిన చెన్నై జాయ్ రైడర్జ్ ఉంది. అందులో చేరాను. చెన్నై నుంచి విజయవాడ , 2015లో కర్ణాటక, కేరళ , తమిళనాడులో 900 కి.మీ, టూర్ ఆఫ్ నీలగిరీస్ సైక్లింగ్ పర్యటన చేశాను. 2016లో స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైక్లింగ్ చేశాను. జలశక్తి మిషన్ కింద 2019లో కచ్(గుజరాత్) నుంచి గౌహతి(అస్సాం) వరకు 3,200 కిలోమీటర్లు సైక్లింగ్ చేశాను. ఈ నెల 20 నుంచి నెల రోజుల పాటు గోల్డెన్ క్వాడ్రీలెట్రల్ ఈ నెల 20వ తేదీ నుంచి నెల రోజుల పాటు గోల్డెన్ క్వాడ్రీలెట్రల్ సైక్లింగ్ చేయనున్నాను. 6 వేల కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. ఔరంగాబాద్‌లో ప్రారంభమై జార్ఖండ్, వెస్ట్‌బెంగాల్, కోల్‌కతా, చెన్నై, ముంబై, ఢిల్లీ మీదుగా మళ్లీ ఔరంగాబాద్‌కు చేరుకుంటాను. ఇలా నెల రోజుల పాటు సైక్లింగ్ చేస్తాను. ఫిట్నెస్ ఔత్సాహికులకు సలహాలు, మెరుగైన జీవనం వైపు అడుగులు వేసేందుకు ఇతరులకు ఆదర్శంగా ఉండాలనేదే ఆలోచన. -
Cartoonist Mohan: బొమ్మలు చెక్కిన శిల్పం
బొమ్మలు కూడా మాట్లాడతాయి. మాట్లాడ్డమే కాదు జనం తరఫున పోట్లాడతాయి. కత్తులు దూస్తూ ముందుకు ఉరుకుతాయి. కదం తొక్కుతూ పరుగులు తీస్తాయి. రాజుగారి దురహంకారాన్ని ఎడంకాలితో తన్ని పారేస్తాయి. అయితే అన్ని బొమ్మలూ అలా చేయవు. బొమ్మకు ప్రాణం పోసే చేయిని బట్టి, ఆ చేతిని కదిపే కళాకారుడి మనసును బట్టి, ఆ మనసులో రెపరెపలాడే ఎర్ర జెండా పొగరును బట్టి బొమ్మలు కాలర్లు ఎగరేస్తాయి. అలాంటి బొమ్మల తాలూకు ఓనర్లలో ముఖ్యులు ఆర్టిస్ట్ మోహన్. తాడి మోహన్ రావు అంటే ఎవ్వరికీ తెలీకపోవచ్చు. కానీ కార్టూనిస్ట్ మోహన్ అంటే మాత్రం తెలీని వాళ్లు ఉండరు. మోహన్ అంటే సకల కళా వల్లభుడు. కార్టూన్లు, ఇలస్ట్రేషన్లు, కేరికేచర్లు, కవర్ పేజీ బొమ్మలు, ఉద్యమాలకు కదం తొక్కండర్రా అని కుర్రకారు గుండెల్లో పౌరుషాగ్ని రగిలించే పోస్టర్లు, రాజ్యాధి కారపు దురహంకారాన్ని కాలరు పట్టు కుని నిలదీసి తిరుగుబాటు చేసే జెండా లపై బొమ్మలు, బిగించిన పిడికిళ్లు, కస్సుమని దూసుకుపోయే కొడవళ్లు, యుద్ధభూమికి కదం తొక్కించే లాంగ్ మార్చ్ కాన్వాస్‌లు! మోహన్ అంటే యుద్ధం. అధర్మంపై అన్యాయంపై చిరు నవ్వుతోనే కత్తులు దూసే యుద్ధమే మోహన్! ఎక్కడో ఏలూరులో పుట్టి, అక్కడెక్కడో పశ్చిమబెంగాల్లో జ్ఞానానికి సానపట్టి, విజయవాడ ‘విశాలాంధ్ర’ మీదుగా హైదరాబాద్‌కు తరలి అదే రాజధానిగా కళాకారుల సామ్రా జ్యాన్ని స్థాపించాడు మోహన్. తెలుగునాట పొలిటికల్ కార్టూన్ అంటే ఇలా ఉండాలిరా నాయనా అన్నట్లు వందల వేల కార్టూన్లతో రాజకీయ నేతల గుండెల్లో అణుబాంబులు పేల్చిన ఉగ్రవాది మోహన్. ఎంత పెద్ద నాయకుడైనా సరే భయం లేదు. ఎంత దుర్మార్గపు నాయకుడైనా సరే ఖాతరే లేదు. తిట్టాలనుకుంటే తిట్టేయడమే. కోపం పెద్దదైతే లాగి లెంప కాయలు కొట్టేయడమే. ఎన్టీఆర్ నుండి నేటి కేసీయార్ వరకు మోహన్ కార్టూన్ బారిన పడని నేత లేరు. మోహన్ తండ్రి తాడి అప్పలస్వామి కమ్యూనిస్టు నాయ కులు. నాన్న నీడలో మండుటెండపు ఉద్యమాలు మోహన్ లోని కళాకారుడికి చిన్నప్పుడే ఓ కర్తవ్య బోధ చేసేశాయి. అదే 5 దశాబ్దాల పాటు తెలుగు నాట ఉద్యమ పోస్టర్లపైనా, తిరుగుబాటు జెండాలపైనా పిడికిళ్లు బిగించిన యోధుల విప్లవ నినాదాలు, కసి ఎక్కిన కొడవళ్ల బెదిరింపులు వగైరాల ఎర్రెర్రటి బొమ్మల రూపంలో మోహన్ సంతకం మెరుస్తూనే ఉంది. (క్లిక్: ఆ రాచరికంలో ఎందుకింత ఆకర్షణ?) ప్రభువెక్కిన పల్లకీలు మోసి, వారి అంతఃపుర రాణుల అందాలు పొగిడి వారిచ్చే చిల్లర బహుమతులు మూట కట్టుకుని మురిసిపోయే కళాకారులు కాలగర్భంలో కలిసి పోతారు. ఎవరికీ గుర్తుకు కూడా రారు. పల్లకి నెక్కిన ప్రభువును కాలర్ పట్టుకుని నీ రాజ్యం చాలా అన్యాయంగా ఉంది గురూ అని అనగలిగిన వాడే నిఖార్సయిన వీరుడు. అసలు సిసలు యోధుడు. అలాంటి వారినే తరతరాలుగా జనం గుర్తు పెట్టుకుంటారు. గుర్తుపెట్టు కోవడమేం ఖర్మ గుండెల్లో గుడి కట్టేసి ఆ గుడిలో ఏనిమేషన్ సినిమాలతో పూజలు చేసేస్తారు. అటువంటి అరుదైన యోధుడూ, కళాకారుడూ మన మోహన్! – సీఎన్ఎస్ యాజులు (సెప్టెంబర్ 21న చిత్రకారుడు మోహన్ వర్ధంతి) -
హీరో మోహన్ రీఎంట్రీ, ఈసారి యాక్షన్‌తో..
ఒకప్పుడు ప్రేమకథా చిత్రాల కథానాయకుడిగా రాణించిన మోహన్ చాలా గ్యాప్ తర్వాత హరా అనే చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారు. గురువారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభం అయ్యింది. దాదా 87 ఫేమ్ విజయ్ శ్రీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎస్పీ మోహన్‌రాజ్, జీ స్టూడియోస్ జయశ్రీ విజయ్ కలిసి నిర్మిస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు గుడ్‌టచ్, బ్యాడ్ టచ్‌ల గురించి బోధించినట్లే ఐపీసీ చట్టం రూల్స్ గురించి కూడా భోధించాలని చెప్పే కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం అని దర్శకుడు తెలిపారు. ఇప్పటి వరకు ప్రేమకథా చిత్రాల్లో నటించిన మోహన్ ఈ చిత్రంలో యాక్షన్ హీరోగా కనిపించబోతున్నారు. చెన్నైలో తొలి షెడ్యూల్ పూర్తి చేసి అనంతరం కోయంబత్తూరు, ఊటీ ప్రాంతాల్లో చిత్రీకరణ చెస్తామని దర్శకుడు తెలిపారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మోహన్ కన్నుమూత
సాక్షి, తూర్పుగోదావరి: వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు కొద్ది రోజుల కిందట కరోనా సోకడంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. మోహన్ మృతి పట్ల ఎంపీలు అనురాధ, మార్గాని భరత్, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సంతాపం తెలిపారు. ఇవీ చదవండి: రమ్య హత్య కేసు: హెడ్ కానిస్టేబుల్ ధైర్య సాహసాలు కొనసాగుతున్న అల్పపీడనం: ఏపీలో భారీ వర్షాలు -
1997 ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల
డా.మోహన్, నవీన్ చంద్ర, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయదర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం 1997. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ ఆదివారం హైరాబాద్లోని దసపల్ల హోటల్లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నారప్ప దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల హాజరై సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. ‘‘సురేష్ కొండేటి నాకు ఫోన్ చేసి ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయమని అడిగితే సినిమా గురించి తెలుసుకున్నాను. చాలా మంది నటీనటులు కనిపిస్తున్నారు. టైటిల్ చాలా బాగుంది. 1997తో నాకు ఏదో జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సినిమాలో కోటిగారు మంచి పాత్ర చేశానని చెప్పారు. ఫస్ట్ లుక్ బాగుంది. ఈ సినిమాతో దర్శకుడు, నిర్మాత, నటన ఇలా ఇన్ని పనులు చేయడం నిజంగా చాలా కష్టం, అయినా కూడా మోహన్ గారు మొదటిసారి ఇవన్నీ చేశారంటే నిజంగా గ్రేట్ సర్. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధించి మీరు మరిన్ని మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ఇక హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా చేయడానికి కారణం మోహన్ గారు ఒకరోజు నాకు ఈ కథ చెప్పారు. కథ వినగానే చేయాలని అనిపించింది. ఇది హీరోనా, చిన్న పాత్ర అన్నది కాకుండా ఓ మంచి పాత్ర చేసానన్న తృప్తి కలిగింది. మోహన్ గారు మొదటిసారి అయినా కూడా చాలా బాగా తీశారు. ముఖ్యంగా నటుడిగా కూడా అద్భుతంగా నటించారు. తప్పకుండా ఈ సినిమాను అందరూ ఆదరిస్తే ఆయన నుంచి మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి.’’ అని అన్నారు. అంతేకాకుండా సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. ‘‘మోహన్ గారితో చాలా మంచి అనుబంధం ఉంది. సినిమాలో ఆయన నాకు కొడుకుగా నటించాడు. అప్పటి నుంచి తనతో అదే అనుబంధం కొనసాగుతోంది. మోహన్ ఈ కథ చెప్పగానే చాలా బాగా నచ్చింది. అయితే ఈ సినిమాలో మీరు నటించాలని అడిగాడు. నేను పోలీస్ కావాలని మా నాన్న కోరిక. అది ఎలాగూ జరగలేదు. అయితే ఇలా పోలీస్ పాత్రల ద్వారా అయినా ఆ కోరిక తీరింది. నేను పోలీస్‌గా దేవినేని సినిమాలో చేశాను. అప్పటినుండి చాలామంది పోలీస్ పాత్రలే ఆఫర్ చేస్తున్నారు. ఒకరోజు చిరంజీవి గారు నువ్వు నటుడిగా పనికి వస్తావు ప్రొసీడ్ అవ్వమని చెప్పడంతో నేనుకూడా యాక్టింగ్ పై ఫోకస్ పెట్టాను. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా మంచి పాయింట్ తీసుకుని మోహన్ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవ్వాలి’’ అని అన్నారు. హీరో మోహన్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా కోటిగారికి థాంక్స్ చెప్పాలి. నా ప్రతి విషయంలో ఆయన సపోర్ట్ అందించారు. ఆయన లేనిదే నేను ఏ పని చేయలేదు. ఈ సినిమా అనుకున్నప్పుడు ముందు కోటిగారికే కథ చెప్పాను. ఆయన బాగుంది ప్రొసీడ్ అన్నారు. అలాగే మీరు ఇందులో ఓ పాత్ర చేయాలని చెప్పడంతో ఒప్పుకున్నారు. అలాగే నవీన్ చంద్రకు థాంక్స్ చెప్పాలి. కథ వినగానే వెంటనే చేస్తానని చెప్పారు. ఆయన చిన్న పాత్రయినా చాలా చక్కగా చేశాడు. అలాగే బెనర్జీ గారు, శ్రీకాంత్, రవి ప్రకాష్ ఇలా అందరూ సపోర్ట్ చేశారు. ఓ బర్నింగ్ ఇష్యుని తీసుకుని ఈ సినిమా చేశా. తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది. నా ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అని అన్నారు. -
అయ్యో జ్యోతి: అప్పట్లో సంచలనం.. ఇప్పుడు విషాదం
తండ్రి ఆరోగ్యం బాగోలేదు. పైగా లాక్డౌన్ కష్టాలు. అందుకే ఆ కూతురు సాహసానికి పాల్పడింది. వారంపాటు 1200 కిలోమీటర్లపైగా సైకిల్ మీద తండ్రిని ఇంటికి చేర్చింది. సైకిల్ జ్యోతి కుమారి సాహసానికి, ధైర్యానికి అప్పట్లో సర్వత్రా ప్రశంసలు కురిసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఇంట విషాదం నెలకొంది. పాట్నా: సైకిల్ గర్ల్ జ్యోతి కుమారి తండ్రి మోహన్ పాశ్వాన్ సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయాన్ని జిల్లా మెజిస్ట్రేట్ త్యాగరాజన్ ప్రకటించారు. ఏ తండ్రి కోసమైతే జ్యోతి కుమారి అంత కష్టానికి ఓర్చిందో.. ఆ తండ్రే ఇక లేరని, ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని త్యాగరాజన్ అన్నారు. అంతేకాదు ఆ కుటుంబానికి అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు కూడా. కాగా, జ్యోతి కుటుంబ స్వస్థలం బిహార్‌లోని దర్బంగా. యాక్సిడెంట్ తర్వాత.. జ్యోతి తండ్రి మోహన్ పాశ్వాన్ ఆటో డ్రైవర్. బతుకు దెరువు కోసం ఢిల్లీలోని గురుగ్రామ్‌కు వెళ్లాడు. ఇక పదో తరగతి ఫెయిల్ అయిన పెద్దకూతురు జ్యోతి కూడా ఆయతో పాటే వెళ్లింది. మోహన్ భార్య మిగిలిన పిల్లలతో ఊరిలో ఉండేది. పోయినేడాది ఓ రోడ్డు ప్రమాదంలో మోహన్ గాయపడ్డాడు. దీంతో ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. సరిగ్గా అదే టైంలో లాక్డౌన్ వచ్చి పడింది. ఇంటి కిరాయి కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఓనర్ ఖాళీ చేయమన్నాడు. దీంతో తండ్రి ఆరోగ్య దృష్ట్యా ఊరికి వెళ్లాలని జ్యోతి అనుకుంది. సైకిల్‌పై తండ్రిని కూర్చోబెట్టుకుని ఇంటి బాట పట్టింది. వారం కష్టం జబ్బు పడిన తండ్రి మోహన్‌ను సైకిల్ పై కూర్చోబెట్టుకుని ప్రయాణం మొదలుపెట్టింది జ్యోతి. రోజూ ముప్ఫై నుంచి నలభై కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కింది. మధ్య మధ్యలో కొందరు ట్రక్ డ్రైవర్లు లిఫ్ట్, భోజనం ఇచ్చి సాయపడ్డారు. మొత్తానికి వారం తర్వాత ఇంటికి చేరుకుంది. జ్యోతి ప్రయత్నానికి అప్పట్లో దేశమంతా సలాం కొట్టింది. అంత చిన్న వయసులో ఏమాత్రం అధైర్యపడకుండా... ఎక్కడా అలసిపోకుండా... అంత సుదీర్ఘ దూరం ఆమె సైకిల్‌పై ప్రయాణించడం అప్పట్లో అంతా మెచ్చుకున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం జ్యోతి తెగువకు హ్యాట్సాఫ్ చెబుతూ బాలపురస్కార్ ప్రకటించారు. ఇవాంక ట్రంప్ సహా పలువురు సెలబ్రిటీలు కూడా సైకిల్ జ్యోతి సాహసంపై స్పందించారు. అయితే ఆ టైంలో కొంత సాయం అందినప్పటికీ.. ఆర్థికంగా ఆ కుటుంబం నిలదొక్కుకోలేదని తెలుస్తోంది. జ్యోతి కుటుంబానికి సాయం జ్యోతి కథనాల తర్వాత అధికారులు ఆమెకు కొంత సాయం అందించారు. అప్పట్లో సైక్లింగ్ ఫెడరేషన్ కూడా జ్యోతిని సైకిల్ రైడర్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించింది. అయితే జ్యోతి తల్లి మాత్రం కూతురి చదువే మొదటి ప్రాధాన్యంగా పేర్కొంది. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన జ్యోతి కుటుంబం ఇప్పుడు విషాదంలో మునిగిపోయింది. దీంతో సాయం అందించేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. -
నాసా ప్రయోగం; ఎవరీ స్వాతి మోహన్..?
కేప్ కెనవరెల్: అంగారక గ్రహంపై జీవం ఆనవాళ్లను గుర్తించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) చేపట్టిన తాజా ప్రయోగంలో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి మోహన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘మార్స్ 2020 గైడెన్స్, నేవిగేషన్, అండ్ కంట్రోల్స్(జీఎన్ అండ్ సీ)కి ఆమె ఆపరేషన్స్ లీడ్‌గా ఉన్నారు. అంతరిక్షం పట్ల చిన్ననాటి నుంచే అమితాసక్తి కలిగిన స్వాతి మోహన్.. భారత్ నుంచి ఏడాది వయసులో తన తల్లిదండ్రులతో పాటు అమెరికా వెళ్లారు. స్టార్ ట్రెక్ స్ఫూర్తితో.. నార్తర్న్ వర్జినియా, వాషింగ్టన్ డీసీల్లో ప్రాథమిక విద్యాభ్యాసం, కార్నెల్ యూనివర్సిటీలో మెకానికల్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో బీఎస్ చేశారు. ఎంఐటీ నుంచి ఏరోనాటిక్స్/ఆస్ట్రోనాటిక్స్లో ఎంఎస్, పీహెచ్డీ పూర్తి చేశారు. ఉద్యోగ విధుల్లో భాగంగా నాసాలో పలు ప్రాజెక్టుల్లో పాలు పంచుకున్నారు. కేసిని (శనిగ్రహం పైకి), గ్రెయిల్ (చంద్రుడిపైకి) ప్రయోగాల్లో కీలక బాధ్యతలు చేపట్టారు. ఈ ‘మార్స్ 2020’ ప్రయోగం 2013లో ప్రారంభమైనప్పటి నుంచి డాక్టర్ స్వాతి మోహన్ ఇందులో పాలుపంచుకుంటున్నారు. తొలిసారి టీవీలో ‘స్టార్ ట్రెక్’సిరీస్ చూసిన 9 ఏళ్ల వయసు నుంచే స్వాతిలో అంతరిక్షం పట్ల ఆసక్తి ప్రారంభమైంది. చదవండి: అరుణ గ్రహంపై సక్సెస్‌ఫుల్‌గా ల్యాండైన ‘పెర్సి’ ఒక రూపాయికే పెట్రోలు.. ఎక్కడ? -
సైనేడ్ కిల్లర్ మోహన్ దోషి
యశవంతపుర: కేరళలోని కాసరగోడులో ఓ యువతిపై ఆత్యాచారంతో పాటు అనేక కేసుల్లో దోషి అయిన సైనేడ్ మోహన్ మరో కేసులోనూ దోషిగా తేలాడు. ఈ మేరకు మంగళూరు కోర్టు తీర్పునిచ్చింది. యువతిని పెళ్లి చేసుకొంటానని నమ్మించి అత్యాచారం చేసి హత్య చేశాడు. మోహన్‌పై ఇలా 20 కేసులు నమోదు కాగా 19 కేసుల్లో కోర్టు అతడ్ని దోషిగా తేల్చింది. ఇందులో నాలుగు కేసుల్లో మరణశిక్షతో పాటు 15 కేసుల్లో యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఈ నెల 24న మోహన్‌కు మిగిలిన ఒక్క కేసులోనూ కోర్టు శిక్ష విధించే అవకాశం ఉంది. యువతిని మభ్యపెట్టి హత్య కాసరగోడులో మహిళా హాస్టల్లో వంటమనిషిగా పని చేస్తున్న 25 ఏళ్లు యువతిని 2009లో మోహన్ పరిచయం చేసుకొన్నాడు. ప్రేమ, పెళ్లి పేరుతో లోబర్చుకున్నాడు. 2009 జులై 8న మంగళూరు సుళ్యలోని దేవస్థానికి వెళ్దామని ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చాడు. పెళ్లి చేసుకున్నాం, త్వరలో ఇంటికి వస్తామని యువతి కుటుంబసభ్యులను నమ్మించాడు. బెంగళూరులో ఒక లాడ్జిలో రూం తీసుకొని యువతిపై ఆత్యాచారం చేశాడు. జులై 15న గర్భ నిరోధక మాత్ర అంటూ మెజెస్టిక్ బస్టాండ్‌లో సైనైడ్ మాత్రను మింగించాడు. ఆమె పబ్లిక్ టాయ్‌లెట్ వద్దకు వెళ్లి కుప్పకూలి అక్కడే ప్రాణాలు విడిచింది. ఏమీ తెలియనట్లు మోహన్ జారుకున్నాడు. పోలీసులు అపరిచిత యువతి మృతి కేసుగా నమోదు చేసుకున్నారు. విచారణ జరిపి 2009 అక్టోబర్‌లో మోహన్‌ను అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా దిగ్భ్రాంతి గొలిపే దారుణాలను బయటపెట్టాడు. ఇదే మాదిరిగా ఎంతో మంది మహిళలను మభ్యపెట్టి సైనేడ్ ఇచ్చి హత్య చేసినట్లు వివరించాడు. ఇందులో ఎక్కువమంది కేరళ, మంగళూరు ప్రాంతాల్లోని పేద వర్గాలకు చెందిన మహిళలు ఉన్నారు. బాధిత మహిళల కుమారులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మోహన్‌కు అనేక కేసుల్లో కోర్టు శిక్షలను విధించింది. ప్రస్తుతం ఇతడు బెళగావి జైల్లో ఉన్నాడు. -
జిల్లా ఆస్పత్రిలో నృత్యాలపై సీరియస్
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో అప్పటి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్‌కు సత్కారం పేరుతో సిబ్బంది డీజే పాటలకు చిందులేసిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ మేరకు జిల్లా ఆస్పత్రిలోని ఐదుగురు అధికారులకు మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 10 రోజుల్లోగా సమాధానం చెప్పాలనిఆదేశించినట్టు తెలుస్తోంది. జిల్లా ఆస్పత్రిలో రోగులకు వైద్య సేవలు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నృత్యాలు చేస్తూ హడావుడి చేసిన ఘటనపై ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదించారు. ఇప్పటికే ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేసిన అధికారులు, తాజా గా రెగ్యులర్ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేయటం సంచలనంగా మారింది. జిల్లా ఆస్పత్రిలో గ్రేడ్–1 నర్సింగ్ సూపరింటెండెంట్ వరలక్ష్మీబాయి, గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్ జయకుమారి, డీసీహెచ్ఎస్లో పనిచేసే ఏడీ పిల్లా ఉమాదేవి, హెడ్ నర్స్ శాంతకుమారి, సూర్యవతి, ఫార్మసిస్ట్ రామకృష్ణలకు ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్‌రెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై డీసీహెచ్ఎస్ డాక్టర్ శంకరరావును వివరణ కోరగా ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఆదేశాలు జారీ అయ్యా యని, రేపు ఉదయం ఉద్యోగులకు నోటీసులు అందజేస్తామని పేర్కొన్నారు. -
ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత
సాక్షి, చెన్నై : కోలీవుడ్‌కి చెందిన ప్రముఖ సీనియర్ కమెడియన్ క్రేజీ మోహన్(67) గుండెపోటుతో చెన్నైలో ఈరోజు(సోమవారం) తుదిశ్వాస విడిచారు. ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో దగ్గరలోని కావేరి హాస్పిటల్‌కు తరలించారు. డాక్టర్లు కాపాడటానికి చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి. అపూర్వ సహోదరులు, మైకేల్ మదన కామరాజు, సతీలీలావతి, తెనాలి, పంచతంత్రం, కాదల కాదల, భామనే సత్యభామనే, వసూల్ రాజా ఎం.బి.బి.ఎస్ తదితర చిత్రాల్లో కామెడీ పాత్రలతో నటించి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. `క్రేజీ తీవ్స్ ఇన్ పాలవాక్కం` అనే నాటకం తర్వాత ఈయనకు క్రేజీ మోహన్ అనే పేరు వచ్చింది. ఇంజనీరింగ్ చదివేరోజుల్లోనే నాటకాలకు స్క్రిప్ట్స్ రాసేవారు. క్రేజీ మోహన్ సోదరుడు మధు బాలాజీ నాటక కంపెనీకి స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశారు. కె.బాలచందర్ దర్శకత్వం వహించిన `పొయ్‌కల్ కుదరై` సినిమాతో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆయన మృతి పట్ల కోలీవుడ్ చిత్ర ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
నటి శ్రీరెడ్డిపై దాడి
సాక్షి, చెన్నై: నటి శ్రీరెడ్డి, ఆమె మేనేజర్ మోహన్‌పై చెన్నైలో ఇద్దరు వ్యక్తులు దాడి చేసి, హత్యా బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. చెన్నై వలసరవాక్కంలో నటి శ్రీరెడ్డి నివశిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంట్లోకి చొరబడి శ్రీరెడ్డి, ఆమె మేనేజర్ మోహన్‌పై దాడి చేశారు. దీనిపై ఆమె వెంటనే కంట్రోల్ రూంకు ఫోన్ చేయగా పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మద్యం మత్తులో గొడవ పడుతున్న ఫైనాన్షియర్, సినీ నిర్మాత సుబ్రమణి (40), అతని అక్క కుమారుడు గోపి (23)లను అరెస్ట్ చేశారు. దాడిలో స్వల్పంగా గాయపడిన శ్రీరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జయ్యారు. శ్రీరెడ్డి ఫిర్యాదు మేరకు చెన్నై కోయంబేడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సదరు నిర్మాత సుబ్రమణి మూడునెలల క్రితం హైదరాబాద్‌లో శ్రీరెడ్డిని లైంగిక వేధింపులకు గురిచేయగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ పోలీసులు సుబ్రమణిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన సుబ్రమణి తన అక్క కుమారుడు గోపీని వెంటబెట్టుకుని వచ్చి శ్రీరెడ్డిపై దాడికి దిగారు. ఈ సంఘటనపై పోలీసులు శ్రీరెడ్డిని విచారిస్తున్నారు. -
రొమాంటిక్ థ్రిల్లర్
మోహన్, సంజనా నాయుడు, రాజ్‌కాంత్, గీత్‌షా ముఖ్య తారలుగా మన్యం శ్రీధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తాంత్రిక’. సంగకుమార స్వామి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో సంగకుమార స్వామి మాట్లాడుతూ– ‘‘వినోదం, హారర్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. గ్రాఫిక్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఇందులో రొమాన్స్ ఎక్కువగా ఉంటుంది. మా సినిమా యువతను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘వరుసగా సినిమాల్ని నిర్మిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు సంగకుమార్. ఈ సినిమా హిట్ అయి ఆయనకు డబ్బులు తీసుకురావాలి’’ అన్నారు నిర్మాత సాయి వెంకట్. ‘‘రొమాంటిక్ థ్రిల్లర్ నేపథ్యంలో నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతుంది’’ అన్నారు రాజ్‌కాంత్. ‘‘కన్నడలో 8 సినిమాలు చేశా. కథా బలమున్న ‘తాంత్రిక’ సినిమాతో తెలుగుకి పరిచయం కావడం హ్యాపీ’’ అన్నారు సంజనా నాయుడు. -
పోస్టు చేయని ప్రేమలేఖ
‘హమే తుమ్సే ప్యార్ కిత్నా, యే హమ్ నహీ జాన్ తే’ అని పర్వీన్ సుల్తానా గొంతు పంచిన పాట దుఃఖంలా నాకు తాకడానికి సెప్టెంబర్ 22, 2017 వరకు రావాల్సి వచ్చింది. మీ మీద ప్రేమ ఎప్పుడూ ఉంది, అయితే అది అంతగా ఉందని మాత్రం తెలీక ఉండింది. మీరు మాకు కలిగి ఉన్నంత కాలం మీ పెద్ద పొగరుతో నా చిన్న భేషజం తలపడ్డానికే సరిపోయింది. ప్రేమని చాటుకోవాలని నాకు తెలీదు, అలా చాటాలని మీరూ చెప్పలేదు కూడా. నా ప్రేమాభిమానం వంటి అక్కర మీకు ఎప్పుడూ లేదు. వట్టి పుణ్యానికి మీరు నాకు దారి వెంట తగిలిన తీగ కాదు, నా జీవితంలో యాక్సిడెంటూ కాదు మీ కలయిక. ఒక ఇరవై రెండు ఏళ్ళ నేను తెల్లవారు జామున నాలుగు గంటలకు మెడార్సి బిల్డింగ్ బయట భుజాన సంచి తగిలించుకుని మోకాళ్ళ మీద బిక్కు బిక్కున కూచున్నట్టుగా ఇప్పటికీ ఆ బొమ్మ నా కళ్ళ ముందు ఉన్నాడు. మీకు ఎప్పటికీ తెలీలేదు నేనెవరో! మీరు వేసిన అన్ని బొమ్మలూ మీ అన్ని రాతలూ మీకు గుర్తుండకపోవచ్చు. కానీ ఆ ఖలీల్ సిద్ధికి హైస్కూల్ పిల్లవాడికి, ఆ బాలాజి కాలేజ్ కుర్రవాడికి ఆ అన్నీ గుర్తే. మీ సన్నని గీత, మీ లావు రాత, మీ చమత్కార రచనా వచనం. మహా అంటే మిమ్మల్ని ఎవరు గుర్తుంచుకుంటారు? మీ భార్యా పిల్లలు, మీ తమ్ముడు చెల్లాయిలు, మీ బంధుమిత్రులు, మీ సహోద్యోగులు, మీ తోటి చిత్రకారులు, ఇంకా మీ అనుకునే మీ కామ్రేడ్లు. అంతకు మించి ఇంకెవరని మీకు ఎప్పటికి అందేను? నా అనగనగా ఆ రోజులనుంచి మీరు ఎన్నడూ పేరు విని ఉండని నూనెపల్లె అనే గ్రామంలో పొద్దంతా తెల్ల అంగి, ఖాకీ నిక్కరు తొడుక్కునే పిల్లవాడు ఒకడు మిమ్మల్ని తన వయసుతో పాటు మనసుతో పాటు పెంచుకుంటున్నాడని మీకు ఎప్పటికి తెలిసేను? నేను ఆ నంద్యాలలో ఆ నూనెపల్లెలో 22 ఏళ్ళు గడిపాను. నా బాల్యం నుంచి యవ్వనం వరకు మోహన్ బొమ్మని మోహన్ రాతని నేను తప్ప ప్రేమించిన మరో వాడు నాకు నా బడిలో, నా కాలేజిలో, నా నడకలో ఎవరూ తగల్లేదు. ఎవరైనా ఎట్లా ఊహించగలరు ఒక తాలూకా టవునులో ఒక చిన్నవాడు తన బాల్యంలో, యవ్వనంలో తెలియని మిమ్ముల, ఏనాటికయినా తెలుసుకుంటానో లేదో తెలీకపోయినా మిమ్మల్ని ప్రేమిస్తూనే వచ్చాడు. మీ రాత మీ గీత మీద ఉన్న ప్రేమ పంచుకోడానికి మరెవరి తోడూ లేకపోయినా ఆరాధన సాగిస్తూనే వచ్చాడు. ఈ ఇంటర్ మీడియట్ చదువరి ఆ సమయంలో సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, భాగ్యశ్రీ, అనూ అగర్వాల్, దీపక్ తిజోరి, దివ్య భారతి ప్రేమలో మునగాల్సిన అద్భుతమైన ఆ వయస్సునంతా మీరు గీసిన ఎర్ర పిడికిళ్ళ వంక, ఆంధ్రప్రభ ముఖ చిత్రాల వంక, కామ్రేడ్ దిమిత్రొవ్ లైన్ డ్రాయింగ్ వంక, ప్రపంచ పదుల చివర తటిల్లతలైన మీ లలిత కోమల రేఖల వంక ... అగాథమయిన ప్రేమలో మరి తేలలేక ఉన్నాడని పదే పదే ఆ బొమ్మలని పట్టి పట్టి బట్టీ పడుతున్నాడని మీకు తెలీదు. తెలిసినా తృణీకరించబడినది నా బీద ప్రేమ మీ చెంత. మీరు ఉన్నంత కాలం మీకు అందలేకపోయాను నేను. ప్రేమ విలువ ఇచ్చేవాడికే తెలుస్తుంది. మీకు గాలి విలువ, నావంటి గాలిగాడి విలువ తెలువనవసరం లేదనుకున్నారు. పైగా మీరు మేధావి. అవసరం లేని విషయాలు అనేకం మీ బుర్రలోంచి మీ బుర్రపై వంకీలు తిరిగిన జుట్టుకు మల్లే మెలికలు తిరిగి అల్లుకు పోయాయి. మీరు కోపర్నికస్ హెలియో సెంట్రిజం గురించి, ఎట్చియన్ లెనొయిర్ కనిపెట్టిన ఇన్ టర్నల్ కంబస్చన్ ఇంజన్ గురించి, డాంగే గురించి, మొహిత్ సేన్ గురించి, అజయ్ ఘోష్, పూరన్ చంద్ జోషిల గురించి, బొలీవియన్ జంగిల్ వార్, టెట్ అఫెన్సివ్ గురించి, లుముంబా, చే గువేరా, మార్టిన్ లూథర్ కింగ్‌ల హత్యల గురించి, కార్లో తుజ్జి రచన ‘బాన్దియేరా రొస్సా అవన్తి పాపొలో అల్ రిస్ కొసా’ గురించి గుక్క తిప్పుకోకుండా ఉపన్యాసాలు ఇవ్వడం మాత్రమే తెలుసు. మెసపుటేమియన్, సుమేరియన్, బాబిలాన్, పెర్సియన్, గ్రీక్, చీనా జపాన్ కళా రీతుల గురించి కబుర్లు దంచి కొట్టడం మాత్రమే తెలుసు. మీరు శిఖరం. నావంటి గులకరాయి లోపలి మనసు మీకు అందింది కాదు, మేఘాల్ని తగిలించుకున్నారు, అంది పుచ్చుకున్నారు. అదే పోయారు. మీరు ఉన్నా, ఉండలేక పోయినా మిమ్ముల వదల్లేకపోవడం నాకు తప్పింది కాదు. పుస్తకం మధ్యన, పాట పిలుపున, ఒక కొత్త బొమ్మ రంగు చెంతన మిమ్ము తలుచుకుంటూనే ఉన్నాం, మీరు కాక మరిక ఎవరున్నారని? ఏ దిక్కు చూసినా దిక్కు తోచిన వాడు ఎవడూ కనపడ్డం లేదు. మీరు లేకపోవడం ఏమీ బాగా లేదు. మార్టిన్ కాంపొస్, డెన్నిస్ షారజిన్, రామోన్ న్యూనెజ్ , కెవిన్ యూట్స్ బొమ్మలు కనబడుతుంటే పరిగెత్తుకు వచ్చి మీకు చూపించలేం. అతిఫ్ అస్లమ్ ఎంత బాగా పాడుతాడో తెలుసా మీకు? తెలుసుకోకుండానే శెలవన్నారు. డోమ్నిక్ ‘హార్ట్ బ్రేక్ ఎట్ హోమ్ కమింగ్’ వినాల్సింది మీరు దెబ్బకు అట్లా పడిపోయే వాళ్ళు. లాహోర్ ముసిలాయన యాకూబ్ అతిఫ్ పానీకా బుల్బులా పాట వినకుండానే జీవితం నీటి బుడగ అని ఎలా డిసైడ్ చేశారు? ఈ సంవత్సరం మీరు లేకుండానే మేడే ప్రదర్శన సాగి పోయింది, పెరిగిన డీజిల్ పెట్రోలు ధరలకు నిరసనగా మీ కుంచెత్తిన పిడికిలి ఆలంబన కాలేదు, ఈ సంవత్సరం ఏ కవితా పుస్తకం చెట్టు కింద లచ్చుమమ్మ వచ్చి సిరిమల్లెలు ఏరలేదు. ఏ ఎర్ర పోస్టర్ పై ఒక్క రైతూ పొలికేక పెట్టింది లేదు, మహారాష్ట్ర రైతుల లాంగ్ మార్చ్ వెనుక మీ నల్లని ఇంకు కెరటం కనగవ ఉవ్వెత్తున లేచి నీడ పట్టింది లేదు. చెప్పలేక పోతున్నాం కానీ ఇదేం అంత బాగా లేదు, ఆ పెన్సిలు దూసిన నెమళ్ళు కానరాని కోనలకు ఎగిరి పోవడం, చిట్టి ముక్కు గోధుమరంగు పిట్టగాడు వెలసిపోవడం, తురాయి చెట్టు కింద పరిగెత్తే జవ్వని చీరె చెంగుతో సహా అలా ఆకాశం వైపు అంతర్ధానం కావడం, కొమ్ముల గేదెపై గోచిపాత పసివాడు ఊదుతున్న వెదురు మురళి మరిక పలక్కపోవడం ఏం బాలా, మీరిలా మళ్ళీ మళ్ళీ గుర్తుకు రావడం కూడా బాలా, అయితే గియితే గుర్తులా వద్దు కానీ మీరే మళ్ళీ రారాదూ! ఒక ఫీనిక్స్ లా, ఒక క్వీన్ ఆఫ్ ఆండిస్లా కనీసం ఇంకో 32 సంవత్సరాల తరువాతయినా పర్లా, మళ్ళీ ఓసారి రారాదూ! నేనిక్కడ వేచి చూస్తుంటా. -అన్వర్ -
రిసెప్షన్ రోజే నవవరుడు ఆత్మహత్య
సాక్షి, విజయనగరం : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వివాహమైన రెండో రోజే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన విజయనగరం మున్సిపాలిటీ పరిధిలోని బాబామెట్ట పాంత్రంలో జరిగింది. బాబామెట్ట ప్రాంతానికి చెందిన మోహన్ చీపురుపల్లి వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 2న(ఆదివారం) ఆయన వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవారం సాయంత్రం జరగనున్న రిసెప్షన్ పనుల్లో కుటుంబీకులు బిజీగా ఉండగా.. ఏమైందో ఏమో కానీ మోహన్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహమైన అయిన రెండో రోజే నవవరుడు ఆత్మహత్య చేసుకోవడంతో పెళ్లింట విషాదం నెలకొంది. మోహన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
అవయవాలతో వ్యాపారం
లక్ష్మీకాంత్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ఆర్గాన్స్’. సందీప్తి, శ్రీలక్ష్మి, ప్రసాద్ రెడ్డి, మోహన్ ఇతర పాత్రల్లో నటించారు. రవికిరణ్ దర్శకత్వం వహించారు. రాజ్ కిరణ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత ముత్యాల రామదాసు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఆర్గాన్స్’ డిఫరెంట్ టైటిల్. అవయవ దానం చేయడం అనే మంచి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా హిట్ అయి యూనిట్‌కి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘ఆర్గాన్స్’ నా మొదటి చిత్రం. మా సినిమా చూసిన వారు కంటతడి పెట్టుకుంటారు. ఇందులో అవయవదానంతో పాటు ఫ్యామిలీ డ్రామా ఉంటుంది’’ అన్నారు రవికిరణ్. ‘‘మనిషి జీవించడానికి అవయవాలు ఎంతో ప్రధానం. కొందరు వాటిని తమ స్వార్థానికి వ్యాపారంగా మార్చేశారు. అలాంటి వాళ్లను హీరో ఏ విధంగా ఎదుర్కొన్నాడన్నదే కథ. సెన్సార్ పూర్తయింది. త్వరలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు బత్తుల లక్ష్మీనారాయణ. ∙సందీప్తి, లక్ష్మీకాంత్ -
హాలీవుడ్ స్థాయిలో ఉందంటున్నారు
మనోజ్ చంద్ర, అనురాగ్ దేవ్, శ్వేతా వర్మ, అమోఘ్ దేశపతి, మోహన్, నితిన్నాశ్, తనూజ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘సంజీవని’. రవి వీడే దర్శకత్వంలో జి.నివాస్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు. దర్శకుడు రవి వీడే మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకూ హాలీవుడ్ తెరపై మాత్రమే కనిపించిన అబ్బురపరిచే దృశ్యాల్ని ఫస్ట్ టైమ్ తెలుగు సినిమాలో చూపించాం. సినిమా చూసినవారంతా హాలీవుడ్ స్థాయిలో తీశారని అభినందిస్తుండటం సంతోషంగా ఉంది. 87 థియేటర్లలో విడుదలైన మా సినిమా ప్రస్తుతం 100కి పైగా థియేటర్లలో ఆడుతోంది. థియేటర్ల పెంపే మా విజయానికి నిదర్శనం. మా చిత్రం ఓపెనింగ్ ఎపిసోడ్‌ని ప్రేక్షకుల కోసం యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను మా సినిమా అలరిస్తోంది. మూడు రోజుల్లో 1.25కోట్ల రూపాయలు వసూలు చేసింది. మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు నిర్మాత నివాస్. -
ట్రంప్‌తో కుదరలేదు.. కారుతోనే సెల్ఫీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారు ముందు నిల్చొని సెల్ఫీ దిగుతున్న ఈ యువకుడు భారత సంతతికి చెందిన మహరాజ్ మోహన్(25). మలేసియాలో నివాసముంటున్న మోహన్ ట్రంప్‌ను కలవాలనే కోరికతో సింగపూర్ వెళ్లి, ట్రంప్ దిగిన హోటల్లోనే బస చేశాడు. ఇందుకోసం అతను ఒక్కరోజుకే రూ.38 వేలు చెల్లించాడు. మంగళవారం ఉదయం 6.30 గంటల నుంచి లాబీ బయట నిల్చుని పడిగాపులు కాసిన మోహన్‌కు 8 గంటలకు ట్రంప్ బయటకు వెళ్తున్న సమయంలో కనిపించారు. ట్రంప్‌తో మాట్లాడే అవకాశం రాకపోవడంతో ఆయన కారుతో సెల్ఫీ దిగి సంతృప్తి పొందాడు. -
అసలు సూత్రధారి ఎవరు?
విజయనగరం టౌన్: రియల్ ఎస్టేట్ వివాదంలో శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో అసలు సూత్రధారి ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. కాల్పులు జరిపిన నిందితుడు బొత్స మోహన్‌ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కానీ ఈ కుట్రవెనుక అసలు నిందితుడెవరనేది ప్రశ్నార్థకంగా మారింది. నిందితుడే కావాలని చేశాడా?.. లేక ఎవరైనా ఇందుకు పురమాయించారా? .. పెద్దల హస్తం ఉందా? అన్న విషయాలు తేలాల్సి ఉంది. విద్యలనగరమైన విజయనగరం వంటి ప్రశాంత నగరంలో కాల్పులు జరగడంతో జిల్లా వాసులు భయాందోళన చెందుతున్నారు. నిందితుడు బొత్స మోహన్ ఉపయోగించిన గన్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. అయితే అది ఎక్కడ ఉందనే విషయంలో నిందితుడు స్పష్టత ఇవ్వలేదని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఆర్థికలావాదేవీల కారణంగా ఈ సంఘటన జరిగిందా.. లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయుధం దొరికితే కేసుకు సంబంధించిన కీలక విషయాలు బయటకు వస్తాయని పోలీసులు చెబుతున్నారు. మరోపక్క అప్పలరాజు విశాఖ కేర్ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఆయన నుంచి పోలీసులు కొంత సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఇంతకుముందు కూడా బొబ్బిలి, పార్వతీపురం ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. తాజాగా విజయనగరంలో కూడా కాల్పులు చోటుచేసుకోవడంతో ప్రజలు భయపడుతున్నారు. కేసును త్వరలోనే ఛేదిస్తామని ఎస్పీ పాలరాజు చెబుతున్నారు. -
ఫోన్ కోసం ప్రాణాలు తీసుకున్నాడు
సాక్షి, మహబూబాబాద్ : కేవలం సెల్‌ఫోన్ కొనివ్వలేదనే కారణంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం దన్నసరి గ్రామశివారులోని సబ్‌స్టేషన్ తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన బానోతు మోహన్(16) ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. సెల్‌ఫోన్ కొనివ్వమని గత కొద్దిరోజుల నుంచి తన తల్లిదండ్రులను అడుగుతున్నాడు. సెల్‌ఫోన్ కొనివ్వలేకపోవడంతో మనస్తాపానికి గురై బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్నటి వరకు కళ్ల ముందు తిరిగిన కొడుకు బావిలో శవమై కన్పించడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రవాహం
సాయంత్రం నాలుగు అవుతోంది. రోజూ అయినట్టే, ఇందులో వింత ఏముంది అన్నట్టు, చిన్న ముల్లు చక చక ముందుకు పరిగెత్తింది. అంతకుముందు రోజు ట్రాష్ కార్ట్ దగ్గర కనిపించిన పెద్ద మనిషి ఈ రోజు నన్ను తమ వాకింగ్ సంఘంలో చేర్చుకుంటానని, వెళ్లే ముందు కాల్ చేస్తానని చెప్పాడు. పిల్లలు ఆఫీసు నుంచి రావడానికి ఇంకా రెండు మూడు గంటలు పడుతుంది. నా మనవరాలు బుజ్జి.. నేను జాకెట్ వేసుకోవడం చూసి తన సాక్సులు తీసుకొచ్చి ఇచ్చింది. ఎంతో మామూలుగా అనిపించే పనులు, ఈ చిన్ని మనుషులు చేస్తే ఎంత అపురూపంగా ఉంటుందో. ఈ ప్రేమా, పాశాలు లేకపోతే ఈ జగత్తు ఏమైపోతుందో అని ఆలోచిస్తుండగా, సెల్లు మోగింది.‘‘హలో మోహన్ గారూ.. ఆ.. ఆ.. రెడీ అండి. సరే సరే విల్ మీట్ యు ఎట్ ది లీసింగ్ ఆఫీస్..’’ అని కాల్ కట్ చేసి స్ట్రాలర్, డైపర్ బాగ్ తీస్కుని, పాపని ఎత్తుకుని బయటపడ్డాను. ఈ దేశంలో పిల్లలని ఎత్తుకుని ఎక్కడికి వెళ్లాలన్నా, రాజు వెడలె రభసకు అన్న చందంగా ఎంత తతంగమో. ఏదో చంటి పిల్లను ఎత్తుకుని వీధి చివరికి వెళ్ళొచ్చినట్టు కాదు. కానీ బయటికి రాగానే నీలాకాశం అంటే ఇదీ అని చెప్పే ఆకాశం, పక్షులూ వాటి కిలకిలలూ, అవి చూసి వాటికన్నా స్వచ్ఛంగా నవ్వే బుజ్జిదాన్ని చూస్తే ఎంత కష్టమైనా దూదిపింజలా ఎగిరిపోవలసిందే. అలా మోహన్ గారిని కలసి వారి వెంట కదిలాను. పక్కనే పది నిమిషాలు నడిస్తే వస్తుంది పార్కు. మేము వెళ్లేసరికి నాలాగే పిల్లల్ని తీస్కుని కొందరూ, తమకు తామే కొందరు అక్కడికి చేరుకున్నారు. నేను చేరగానే జట్టులోకి కొత్త పక్షి వచ్చినట్టు అందరూ నన్ను చూసి నవ్వారు. మోహన్ గారు నా పరిచయ భారం తనపై వేసుకున్నారు. ‘‘హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పానే రావు గారని! వీరే. ఇండియా నుండి వచ్చి వన్ వీక్ అయిందంట. మన సంఘంలోకి ఈరోజే చేరారు.’’ అని నా గురించి చెప్పారు. అందరూ చప్పట్లు చరిచి ‘వెల్కమ్ టు ది క్లబ్’ అని అన్నారు. ఇంత దూరం.. దేశం కానీ దేశంలో ఇన్ని నెలలు ఎలా గడపాలి అనుకుంటుండగా మంచి కంపెనీ దొరికినందుకు సంతోషంగా అనిపించింది. నా వయసు వాళ్ళని నేను వెతుక్కోగా, పాపా తన ఈడు పిల్లలతో కలిసిపోయింది. పిల్లల్లో కాస్త పెద్ద పిల్లకి పాపని చూసుకునే పెద్దరికం ఇచ్చి పిల్లల ప్లే ఏరియా ఎదురుగా, తాతయ్యలమంతా బెంచీలపై కూర్చున్నాము. అటువైపు బెంచీలపై అమ్మమ్మలు, నాయనమ్మలూ సెటిల్ అయ్యారు.‘‘రావు గారూ, మీ మిసెస్ రాలేదా?’’ వాచీని పైకి తోసుకుంటూ యథాలాపంగా అడిగారు మూర్తి అని పరిచయం కాబడ్డ వ్యక్తి. ‘‘లేదండి. తను లేదు. రెండేళ్ల క్రితం ఆక్సిడెంట్లో ...’’ అని ఆ వాక్యాన్ని పూర్తి చేయడం ఇష్టంలేక ఆపేశాను.అందరూ ఒక్క నిమిషం ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీక ఇబ్బంది పడ్డారు. మూర్తి గారు ‘సారీ’ అన్నారు.‘‘పర్లేదండి. అన్నీ దాటేశాను. అట్టాచ్డ్ డిటాచ్మెంట్ వచ్చేసింది.’’ అని వాతావరణాన్ని మామూలు చేద్దామని ప్రయత్నించాను.ఒక్క క్షణం అందరి కళ్ళు అవతలి బెంచీలపై ఉన్న తమ తమ వారిపై ఆగడం నా దృష్టి దాటిపోలేదు. ఈ వయస్సులో తోడు అవసరం ఎంతో, దాని విలువ ఏంటో నాకు బాగా తెలుసు. మెల్లగా పరిచయాలు అయ్యాక కబుర్లలో పడి సమయం మరచిపోయాము. తెలుగు వారు ఒకదగ్గర చేరితే మాటలకి కొదవా? పైగా ఒకటికి రెండు రాష్ట్రాలు ఇప్పుడు. ఉభయ రాష్ట్రాల రాజకీయాలూ, దానికి తోడు ట్రంపు పుణ్యమా అని అమెరికా రాజకీయాలూ, ఇక వాదనలకు ముగింపు ఎక్కడా?చీకట్లు ముసురుతాయి అనగా పిల్లలని తీస్కుని బయలుదేరాము. మనుషుల్లో పడితే హాయిగా అనిపించింది. మావాడితో చెబితే సంతోషించాడు.. నాకు కంపెనీ దొరికినందుకు. మెల్లగా ఇక్కడి రొటీన్‌కి అలవాటు పడిపోయాను. పొద్దునే కొడుకు, కోడలు పాపని డే కేర్‌లో దింపేసి ఆఫీసులకి వెళ్ళిపోతారు. మధ్యాహ్నం పాపని డే కేర్ నుండి తీసుకురావడం, సాయంత్రం పార్కులో ఆడించి, కాసేపు కబుర్లు చెప్పుకుని రావడం. ఇలా రోజులు సాగుతున్నాయి. డే కేర్‌కి వెళ్ళడానికి కూడా తోడు ఉన్నారు మా సాయంకాలం ఫ్రెండ్సు. తమాషాగా వుంది, ఎక్కడికి ఏ పనికి వెళ్లాలన్నా, ఎవరో ఒకరు మన వాళ్ళు తోడు ఉంటున్నారు. ఏదో పరాయి దేశం అనే ఫీలింగే కలగడం లేదు.మామూలుగా మా గ్రూపులో రాజకీయాలపైన, లేకపోతే మా పిల్లలపైనా సాగుతుంటాయి మా మాటలు. ఇక్కడి పిల్లలు కేవలం అవసరాల కోసమే మమ్మల్ని పిలిపించుకుంటారనే ఎక్కువమంది వాదన. నా అభిప్రాయాలు వేరుగా ఉండటం వల్ల, నేను ఎక్కువగా వాదించను. విని ఊరుకుంటాను అంతే. కానీ రోజూ ఒకేలా ఉండదు కదా..!! ఆవేళ మా కోడలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది. పాపని ఇంట్లో ఉంచేసి నేను, మోహన్ గారు బయలుదేరాము పార్కుకి.ఒక్కడినే రావడం చూసి మూర్తి గారు అందుకున్నారు, ‘‘ఏంటి రావు గారూ, ఈ రోజు డ్యూటీకి సెలవా?’’ అని. పాపని తీసుకురావడం నా పిల్లలు నాపై వేసిన డ్యూటీ అని ఆయన వాదన.ఎవరైనా రిటర్న్ ఇండియా వెళ్తున్నా కూడా, ‘‘విడుదలైపోయారా? మా విడుదలకు ఇంకా ఇన్ని రోజులు ఉన్నాయి..’’ అంటూ జోకులు వేస్తూ ఉంటారు.ఆయన ప్రశ్నకి నేను నవ్వి ఊరుకున్నాను.‘‘వి హావ్ టు డిస్కస్ అండి ఈ రోజూ. ఇలా నవ్వి ఊరుకుంటే మేము ఒప్పుకోము.’’ ఆవేశంగా చెప్పుకుపోతున్నారు మూర్తి గారు. ‘‘అసలు ఏమనుకుంటున్నారు ఈ వెధవలు. వీళ్ళ ట్రాష్లు పడెయ్యడానికీ, లాండ్రీ చెయ్యడానికి, గిన్నెలు కడిగి పిల్లల్ని ఆడించడానికే మనము ఇక్కడికి వచ్చామా? ఏదో ఇంత సర్వీస్ అయ్యాక కాస్త రిలాక్స్ అవుదామని వస్తే, ఏముందండి ఇక్కడ? ఉరుకుల పరుగుల జీవితం, ఫ్రిడ్జిలో కూరలు, డిష్ వాషర్ లో గిన్నెలు, డే కేర్‌లో పిల్లలు.’’ఇంతలో వెంకట్ గారు అందుకున్నారు, ‘‘మా ఆవిడ అసలు గిన్నెలు కడిగి ఎరుగదండీ ఇండియాలో. ఇక్కడేమో వీళ్ళు వారమంతా చాకిరీ చెయ్యడం, వారాంతాలు ఇల్లు శుభ్రం చేసుకోవడం, కూరలు చేసి ఫ్రిడ్జులో పడెయ్యడం. పిల్లలని మా మోహాన కొట్టేసి పరుగులే పరుగులు. ఏదో వీళ్ళ అవసరం కోసం రమ్మనడమే తప్ప ఏమైనా పట్టించుకుంటున్నారా అసలు?’’ఘాటుగా సాగుతున్నాయి మా పిల్లలపై నిందారోపణలు.‘‘మీరు ఈ రోజు మాట్లాడాల్సిందే రావు గారూ! ఇలా మౌనంగా ఉంటే కుదరదు..’’ అని పట్టుబట్టారు మూర్తి గారు. ఇక మాట్లాడక తప్పలేదు. అలాగని వారితో ఏకీభవించలేను. ఆత్మవిమర్శని ఎదుర్కోలేని వాణ్ణి. అందుకే నా మనసులో ఉన్నదే చెప్పదలచుకున్నాను. నేను చెప్పే కంప్లయింట్లు వినడానికి ఉత్సాహంగా ముందుకి జరిగి కూర్చున్నారు నా మిత్రులు. మెల్లగా నా భావాలు చెప్పడం ప్రారంభించాను.‘‘నేను మీతో ఏకీభవించలేను అండి. ఎందుకంటే ఇప్పుడు మీతో ఏకీభవిస్తే, ఒకప్పటి కొడుకుగా నేను ఏమి చేశాను అనే ప్రశ్న నేను వేసుకోవలసి వస్తుంది. మనందరం బహుశా ఒకే సమయంలో మన జీవితాలను ప్రారంభించి ఉంటాము. అప్పటి మనం, మన తల్లిదండ్రులకు ఏమి చేశామో మన పిల్లలు మనకి అదే చేస్తున్నారు. చెప్పాలంటే ఇంకా ఎక్కువే చేస్తున్నారేమో. మీ మీ సంగతులు నాకు తెలియవు. నా విషయంలో జరిగింది ఇది. ఉద్యోగరీత్యా మేము దూరంగా ఉండవలసి వచ్చింది. ఇప్పుడైతే అమెరికా కూడా పక్కనే ఉన్నట్టు ఉంది కానీ, అప్పటిలో ఇంకో రాష్ట్రంలో ఉద్యోగం అంటేనే విదేశాల్లో ఉన్నట్టు లెక్క. పల్లెలో మా నాన్న గారు నన్ను చదివించి మంచి ఉద్యోగం వచ్చేలా చేశారు. మరి నేను ఆయనకి ఏమి ఇవ్వగలిగాను? ఏమీ లేదే! వివాహం అయ్యేదాకా నెలకి ఇంత అని పంపేవాడిని. కాని పెళ్లి అయ్యి నాకంటూ ఒక కుటుంబం ఏర్పడిన తర్వాత నేను మాత్రం చేసింది ఏమిటి? మూడు నెలలకి ఒకమారు వెళ్లి పలకరించి రావడం, వేసవి సెలవుల్లో పిల్లలని తీస్కుని ఒక ఇరవై రోజులు ఉండి రావడం. వారి శేష జీవితం అంతా కొడుకు వస్తాడు అని ఎదురుచూడడం, మనవళ్ల కోసం కాపు కాసుకొని కూర్చోవడంతో సరిపోయింది. అయినా, ఏనాడూ ఒక్క మాట అని ఎరుగరు. అసలు అనాలని కూడా వారికి తెలీదేమో. మనంత లోకం వారు చూసి ఉండరు కదా! మా అమ్మ ఆ వేసవి సెలవుల కోసం, ఆటోలోంచి దిగే మనవళ్ల కోసం, కోడలి కోసం వీధి అరుగు మీద కూర్చుని ఎదురుచూస్తూ ఉండే దృశ్యం నన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అందుకే ఇక్కడ ఉండే కొన్నిరోజులైనా నా మనవరాలితో ఎక్కువ సమయం గడుపుతున్నాను. మేము సెలవుల తర్వాత వెళ్లిపోయేటప్పుడు అమ్మ కళ్ళల్లో తడికి అర్థం ఇప్పుడు అర్థం అవుతోంది. ఇక వీళ్ళ ఉరుకుల పరుగుల జీవితం మనం కోరుకున్నదేగా? మనం కన్న కలలే కదా వీరు నెరవేర్చింది. బాగా చదవాలి, అమెరికా వెళ్లి ఉద్యోగం చెయ్యాలి అని మనమే కదా పక్కింటి వారిని, ఎదురింటి వారిని చూపించి నూరిపోసింది. ఇన్ని అనుకుంటున్నాం కదా, మనలో ఎంత మంది బంధువులతో మా వాడు అమెరికాలో ఉన్నాడు అని గొప్పలు చెప్పుకోలేదు? మన మాట నిలబెట్టడానికే కదా ఈ ఉరుకుల పరుగుల జీవితం. సంపాదనే ముఖ్యం అనే సూత్రం మనం నూరిపోసిందే కదా! తప్పంతా పిల్లలపై నెట్టడం ఏమీ భావ్యం కాదు. మనం సృష్టించిన చట్రంలోనే ఇరుక్కుని తిరుగుతూ ఉన్నారు. మొన్న మా అబ్బాయి మృదంగం వాయిస్తూ ఉంటే, చూస్తూ అలా ఉండిపోయాను. వాడికి మృదంగం అంటే ఆసక్తి ఉందని నాకు తెలీనే తెలియదు. ఎన్నడూ, ఏది చదవాలో చెప్పడమే కానీ, వాడికి ఏది ఇష్టమో ఒక్కసారి కూడా కనుక్కోలేదు నేను.మనం ఎలా గింజా గింజా ఏరి వారిని కాపాడుకున్నామో, వారూ అదే చేస్తున్నారు, వారి పిల్లల కోసం. వీలైతే ఉన్న కొన్ని రోజులు సాయం చేద్దాం. మనం చెయ్యలేనివి అయితే కాదు కదా! కూర్చుని తినిపించడానికి మనమేమి అవసాన దశలో కూడా లేము. ఆ సమయం వస్తే తప్పక చూసుకుంటారు.ఇక పట్టించుకోవడం అంటారా? నిజంగా చెప్పండి మనలో ఎంత మంది అమెరికా రాక ముందు విమానాలు ఎక్కారు? మన రాష్ట్రం కాకుండా, మన దేశంలో వేరే ప్రాంతాలకు ఎంత మంది ట్రిప్పులు వేశారు? మూర్తి గారు! మీ అబ్బాయి మీ యానివర్సరీకి మీ ఇద్దరికీ గోవాకి టికెట్లు పంపించాడు అని చెప్పారు. ఎంత చక్కటి ఆలోచన కుర్రాడిది. ‘ఆ... వాడు రాకుండా ఏదో గిఫ్ట్ మాత్రం పంపాడు’’ అని తీసిపడేశారు. ఇక్కడ ఉండి కష్టపడి సంపాదిస్తున్నాడు కాబట్టే ఆ టికెట్లు పంపగలిగాడు. గోవా విశేషాలు, మీరు ఎంత బాగా ఎంజాయ్ చేసింది, మాకు చాలాసార్లు చెప్పారు మీరు!!మోహన్ గారూ! మీ సొంత ఇల్లు, అమ్మాయి పెళ్లి ఇవన్నీ ఘనంగా జరగడంలో మీ అబ్బాయి కృషి ఏమీ లేదా? లోపాలు, తప్పులు అందరూ చేస్తారు. వాటినే పట్టుకుని వేలాడితే ఎలా? ఎంతో కొంత మంచి కూడా ఉంటుంది కదా ప్రతి ఒక్కరిలో? పైగా వీళ్ళు మన కడుపున పుట్టినవాళ్ళు. మనం వాకింగ్ వెళ్తామంటే వాటికీ ప్రత్యేకంగా షూస్ తీసి ఇచ్చారు. వారాంతాల్లో ఎంత అలసిపోయినా చుట్టూ ఉన్న ప్రదేశాలు చూపిస్తున్నారు. మన కష్టాల్లో పాలు పంచుకుంటున్నారు. వాళ్ళు చేయగలిగినంత వాళ్ళు చేస్తున్నారు. కాస్త ఒంట్లో నలతగా ఉన్నా వెంటనే అన్ని రకాల చెకప్పులకి వాళ్ళే అప్పాయింట్మెంట్లు తీసుకుంటున్నారు. ఈ చిన్న చిన్న పనుల ద్వారానే వారి ప్రేమని చూపిస్తున్నారు. మనకోసం ప్రత్యేకంగా సమయం కేటాయించడానికి అసలు వారికంటూ సమయం ఉంటే కదండీ! అలసిన శరీరాలు సేద తీరకముందే మరుసటి రోజు ప్రయాణం షురూ. మన పిల్లల కోసం మనం పాకులాడినట్టే వారు కూడా. çసృష్టిధర్మం అదే కదా? ఇక పసిపిల్లల విషయం అంటే ఎంత పనో అందరికీ తెలిసిందే. చుట్టూ అంత మంది ఉండి కూడా వారిని పెంచడానికి ఆపసోపాలు పడుతూ ఉంటాము. ఎవరి సాయం లేకుండా ఇక్కడ పెంచడం అంటే ఎంత కష్టం. వీళ్ళే మనకి చిన్నపిల్లలుగా ఉంటారు. వారికి అప్పుడే పసిపిల్లలు. పెద్దలు లేకుండా ఎలా చేసుకోగలరు?నా వరకు నేను ఇది నా బాధ్యత అనుకుంటున్నాను. పెద్దలకు పిల్లలకు మధ్య ప్రేమ, పాశాలు నీటి ప్రవాహం లాంటివి. అది ముందు తరాలకు ప్రవహిస్తూ ఉంటుంది తప్ప వెనక్కి రాదు, రాలేదు. రెక్కలు వచ్చి ఎగిరిన పక్షి తిరిగి రాలేదని బాధపడడం ఎందుకు? ఎగరడం నేర్చుకుందని సంతోషించాలి గాని! ఇదీ నా అభిప్రాయం.’’ అంటూ నేను చెప్పవలసింది ఇక ఏమీ లేదని ఆపాను.అదివరకే అటువైపు ఉన్న అమ్మలు కూడా ఇటు వచ్చి నేను చెప్పినదంతా వింటూ ఉన్నారు. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. ఎవరి ఆలోచనల్లో వారు ఉండిపోయారు. చీకట్లు పడుతూ ఉండడం వల్ల మెల్లగా సెలవు తీసుకుని ఒక్కొక్కరే వెళ్ళిపోయాము. నా వల్ల ఆ రోజు వాతావరణం గంభీరంగా మారినప్పటికీ నాలో నేను పడుతున్న సంఘర్షణని వాళ్ళకి చెప్పేయడంతో మనసు తేలికగా అనిపించింది.ఆపైన కూడా, ఎవరి ఉరుకులు, పరుగులూ మరెవ్వరి కోసం ఆగలేదు. తరువాత మా సాయంకాలం కబుర్లలో మా పిల్లలు ఎప్పుడూ నలగలేదు. -
లైంగికంగా హింసించి సైనేడ్‌తో మట్టుబెట్టి
బనశంకరి : మహిళలను లైంగికంగా హింసించి అనంతరం వారిని సైనేడ్‌తో మట్టుబెట్టిన కిరాతకుడు, సీరియల్ కిల్లర్ మోహన్ కుమార్‌కు కింది కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు జీవితఖైదుగా మారుస్తూ గురువారం తీర్పుచెప్పింది. వివరాలు... దక్షిణ కన్నడ జిల్లాలో 2004 నుంచి 2009 వరకు 20 మంది మహిళలపై అతికిరాతకంగా అత్యాచారం అనంతరం వారిని సైనేడ్‌తో హత్య చేసిన మోహన్ కుమార్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో తీవ్ర సంచలనం రేగింది. ఈ ఆరోపణలపై దక్షిణ కన్నడ జిల్లా 4వ అదనపు సెషన్స్ కోర్టు మోహన్‌కు మరణశిక్ష విధించింది. దీనిని సవాల్ చేస్తూ సైనేడ్ మోహన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తులు రవి మళిమఠ్, మైకన్‌కున్హా కేసు విచారణ చేసి మరణశిక్షను రద్దు చేసి జీవితఖైదుగా తీర్పు చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిందితుడిని బయటకు విడుదల చేయరాదని, అతడు సమాజంలో జీవించడానికి అర్హుడు కాదని, అతడిని క్షమించడానికి వీలు లేదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. -
ఒకడు మోహన్
మోహన్ గీతలు డామినేట్ చేయడంవల్ల రాతల గురించి ఎవరూ ఎక్కువ మాట్లాడరు. ఆయనకో విలక్షణమైన శైలి ఉంది. వాక్యాలు పదునుగా ఉంటాయి. కమ్యూనిస్టు భావాలున్న కార్టూనిస్టుగా, మంచి రాత గీత ఉన్న జర్నలిస్ట్‌గా, అన్నిటికీ మించి మంచి స్నేహ శీలిగా మోహన్ కలకాలం గుర్తుంటారు. మోహన్ రేఖలు వేటకొడవళ్లలా నిగ్గుతేలి ఉంటాయి. శషబిషలు లేని సూటి విసుర్లతో కార్టూన్లు సృష్టించి అనేకమంది అభిమా నులను, కొద్దిమంది శత్రువులను సంపాయించుకు న్నారు. మోహన్ గీతలు డామినేట్ చేయడంవల్ల రాతల గురించి ఎవరూ ఎక్కువ మాట్లాడరు. ఆయనకో విలక్ష ణమైన శైలి ఉంది. వాక్యాలు పదునుగా ఉంటాయి. ప్రపంచంలోని వివిధ కళా రీతుల్ని ఆయన అధ్యయనం చేశారు. మోహన్ అక్షరాలను తెలుగువారు ఇట్టే గుర్తించగలరు. ఆయనకి ‘‘శిష్య కోటి’’ ఉంది. హైదరాబాద్‌లో ‘‘నీహార్ ఆన్ లైన్’’ పోర్టల్ ప్రారంభించినపుడు దాంట్లో ‘‘సరసమ్ డాట్‌కామ్’’ ప్రత్యేక హాస్య విభాగాన్ని పెట్టారు. వారం వారం పాతిక వెబ్ పేజీలు నేను హాస్యంగా, వ్యంగ్యంగా, సర సంగా రాస్తే దానికి మోహన్ క్యారి కేచర్లు, కార్టూన్లు సమకూర్చి నిండు తనం తెచ్చేవారు. రెండు సంవత్స రాలు నిరాఘాటంగా, 66 దేశాలలో లక్షలాది క్లిక్స్తో నడిచింది సరసమ్. మోహన్ తన కెరియర్లో సంతృప్తినిచ్చిన సందర్భంగా చెప్పేవారు. వాటిలోంచి వాచవిగా కొన్ని: ఆంధ్రజ్యోతిలో చిలకలపందిరి కూడా మా కాంబినేషన్లో బానే సందడి చేసింది. నేనంటే ఆయనకు వల్లమాలిన ఇష్టం. నా వెంకట సత్య స్టాలిన్‌కి బొమ్మలు వేసిచ్చారు. పుస్తకం తేవాలి. మోహన్ సరసమ్ డాట్కామ్ని ఆరు సంపుటాలుగా సర్వాంగ సుందరంగా తేవాలని ముచ్చట పడ్డారు. చాలా బొమ్మలు మళ్లీ గీశారు కూడా. కొన్ని అనుకున్నట్టు జరగవ్. అంతే. సృజనశీలికి, సన్మిత్రునికి నివాళి. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
నిధులుండీ...నిర్లక్ష్యం
– ఎంపీ నిధుల వినియోగంలోరాష్ట్రంలోనే చివరి స్థానం - రూ.17 కోట్లున్నా పట్టించుకోని వైనం - అంత నిర్లక్ష్యమేమిటంటూ ప్రజల ఆగ్రహం - పట్టించుకోని ఎంపీ మురళీ మోహన్ నిధులు ఉన్నాయి...ప్రతి ఏటా ఆ నిధులకు అదనంగా జతై రెట్టింపవుతున్నాయి. గత మూడేళ్లుగా రెండు పదుల కోట్లకు చేరుకున్నాయి. పాత నిధులను కూడా వీటితో కలిపి అభివృద్ధి పనులకు వెచ్చించుకునే వెసులుబాటు ఉంది. బాధ్యత ఉన్న ఏ ప్రజా ప్రతినిధి అయినా ఏం చేస్తారు ... కనీసం తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రాంతంలోనైనా వెచ్చించి ప్రగతి పూవులు పూయిస్తారు. కానీ ఏడు శాసన సభా నియోజకవర్గాల పరిధిలో ఉన్న రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ మురళీ మోహన్ మాత్రం ఇవేవీ పట్టనట్టు వ్యవహరిస్తూ నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నారు. ప్రతి ఏటా ఎంపీ నిధుల కోటా కింద ఏటా రూ.5 కోట్లు చొప్పున గత మూడేళ్లలో రూ.15 కోట్లు విడుదలయ్యాయి. ఇవి కాకుండా గతంలో ఖర్చు కాకుండా మిగిలిపోయిన మరో రూ. 2.15 కోట్లు అందనంగా వచ్చి చేరాయి. ఈ లెక్కన మొత్తంగా రూ. 17.15 కోట్లు ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. తాజా ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో రూ.5 కోట్లు విడుదలకు సిద్ధమై ఉంది. దీంతో కలిపి రూ. 22.15 కోట్లకు చేరనుంది. ఇన్ని నిధులు తన ఖాతాలో మూలుగుతున్నా తనకు పట్టనట్టు వ్యవహరించారు. ఇప్పటి వరకు కేవలం రూ.6.30 కోట్లు విలువైన 111 పనులకు మాత్రమే నిధులు కేటాయిస్తూ అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. ఇందులో రూ. 2.32 కోట్ల విలువైన 36 పనులను ఇటీవల ప్రతిపాదించినవే. ఇవి కూడా పంపించకపోయి ఉంటే జిల్లాలో ప్రగతి మరింత దయనీయంగా ఉండేది. ఇక చేసిన పనుల ఖర్చు విషయానికొస్తే రూ. 3.44 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలో బొమ్మూరు గ్రామంలో మహిళలు ఆర్థికంగా సాధికారిత సాధించాలన్న ఉద్దేశ్యంతో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం) ఇది. ఇప్పటి వరకు ఇక్కడ వేలాది మంది మహిళలు శిక్షణ పొంది ఆర్థికంగా స్థిరపడ్డారు. ప్రస్తుతం మహిళా ప్రాంగణం భవనం శిధిలావస్థకు చేరింది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బొమ్మూరు గ్రామం వచ్చినప్పుడు భవన సమస్యను అధికారులు వివరించారు. జిల్లా కలెక్టరు నుంచి ప్రజాప్రతినిధులందరికీ విన్నవించారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు రూ.50 లక్షలతో మరమ్మతులు చేస్తే సరిపోతుందని అంచనా కూడా వేశారు. కానీ రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీ మోహన్‌కు ఇదేమీ పట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదొక్కటే కాదు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇలాంటి సమస్యలు అనేకం వెంటాడుతున్నాయి. కానీ వాటిపై ఎంపీ దృష్టి పడటం లేదు. తనకొచ్చిన ఎంపీ నిధులు మురగడం తప్ప ఉపయోగం లేకుండాపోతోంది. సహ ఎంపీలు పోటీపడి ఖర్చు పెడుతున్నా ఈయనకు మాత్రం చీమకుట్టినట్టుగా కూడా ఉండడం లేదు. అంతేలే...చుట్టం చూపుకని నియోజకవర్గానికొచ్చే ఎంపీకి సమస్యలు ఎలా పడతాయని నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. తనకొచ్చిన నిధులను ఏదో ఓ రోజు తనకో, అనుయాయులకో లబ్థి చేకూరేలా ఖర్చు పెట్టేద్దామనుకుంటున్నారేమో గానీ మూడేళ్లగా వచ్చిన నిధుల జోలికి మాత్రం ఆయన పోవడం లేదు. నిధులు విడుదల ఇలా... ఎంపీ మురళీమోహన్‌కు ఏటా రూ.5 కోట్లు చొప్పున మూడేళ్లపాటు రూ.15 కోట్లు విడుదలయ్యాయి. ఇవి కాకుండా గతంలో ఖర్చు కాకుండా మిగిలిపోయిన మరో రూ. 2.15 కోట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ లెక్కన మొత్తంగా రూ.17.15 కోట్లు నియోజకవర్గ అభివృద్ధి పనులకు ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. తాజా ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో రూ.5 కోట్లు విడుదలకు సిద్ధమై ఉంది. దీంతో కలిపి రూ. 22.15 కోట్లకు చేరనుంది. కానీ మురళీమోహన్‌కు చిత్తశుద్ధే లేదు. ఇప్పటి వరకు కేవలం రూ.6.30 కోట్లు విలువైన 111 పనులకు మాత్రమే నిధులు కేటాయిస్తూ అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. ఇందులో రూ.2.32 కోట్ల విలువైన 36 పనులను ఇటీవల ప్రతిపాదించినవే. ఇవి కూడా పంపించకపోయి ఉంటే జిల్లాలో ప్రగతి మరింత దయనీయంగా ఉండేది. ఇక చేసిన పనుల ఖర్చు విషయానికొస్తే రూ. 3.44 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. ఇలా వినియోగించుకోవచ్చు... ఈ నిధులతో తాగునీటికి, రోడ్లకు, భవనాలకు, కల్వర్టులకు, విద్యకు, విద్యుత్ సౌకర్యానికి, కుటుంబ ఆరోగ్యానికి, ఇరిగేషన్‌కు, సంప్రప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధికి, రైల్వే రోడ్లు, రైల్వే వంతెనలకు, శానిటేషన్‌కు, క్రీడలకు, మత్స్యసంపద అభివృద్ధికి, వ్యవసాయానికి హేండ్లూమ్స్కు, పట్టణాభివృద్ధికి ఇలా ... ఎన్నింటికో ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. కానీ ఈ విభాగాలకు సంబంధించిన ఏ ఒక్క సమస్య మురళీ మోహన్‌కు పట్టకపోవడం ఆశ్చర్యం కల్గిస్తోంది. నిధులుండీ నిర్లక్ష్యం వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
అంతర్జాతీయ ఖ్యాతికి కృషి
- డిసెంబరు నాటికి ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులు - త్వరలో పెద్ద విమానాల సేవలు - ఎయిర్‌పోర్టు అడ్వయిజరీ కమిటీ చైర్మెన్, ఎంపీ మాగంటి మురళీ మోహన్ వెల్లడి మధురపూడి : రాజమహేంద్రవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టు ఎయిర్‌పోర్టు ఎడ్వయిజరీ కమిటీ చైర్మెన్, రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీ మోహన్ వెల్లడించారు. ఆయన అధ్యక్షతన శుక్రవారం ఎయిర్‌పోర్టు టెర్మినల్ భవనంలో ఎడ్వయిజరీ కమిటీ (సలహా సంఘం) సమావేశం జరిగింది. దీనిలో ఎయిర్‌పోర్టు విస్తరణకు భూములిచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి కృషి, మధురపూడి గ్రామంలో సర్వీసు రోడ్లు, పామాయిల్ తోటలిచ్చిన రైతులకు పరిహారం అందజేత, అభివృద్ధి, ప్రయాణికులకు సేవలు విస్తృతం, సౌకర్యాలు పెంపు, తదితర అంశాలపై చర్చించారు. అనంతరం విలేకర్లతో ఆయన మాట్లాడుతూ 1,749 మీటర్లున్న రన్ వేను 3,165 మీటర్లకు విస్తరించినట్టు పేర్కొన్నారు. అలాగే ఒకేసారి 4 పెద్ద విమానాలు, 8 హెలీకాఫ్టర్లను పార్కింగ్ చేయడానికి అనుకూలంగా ఏఫ్రాన్ నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఉభయగోదావరి జిల్లాల్లోని పంటలు, పండ్లు, పూలను విదేశీ, స్వదేశాలకు పంపడానికి కార్గో సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ సమావేశంలో ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎమ్.రాజ కిశోర్ మాట్లాడుతూ కార్గో విమాన సర్వీసులతో రైతాంగానికి మేలు జరుగుతుందన్నారు. ఎంపీ మురళీ మోహన్ చైర్మన్‌గా ఉన్న కమిటీకి ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ కో–చైర్మన్‌గా, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ కన్వీనర్‌గా, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీలు సభ్యులుగా ఉంటారని తెలిపారు. అయితే శుక్రవారం జరిగిన సమావేశానికి కలెక్టర్ మిశ్రా, ఎస్పీ రాజకుమార్‌లు హాజరు కాలేదు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం ఇన్చార్జి సబ్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ విజయరామ రాజు, ఎయిర్‌పోర్టు అధికారులు పాల్గొన్నారు. ముగ్గురు సభ్యులు నియామకం ఎయిర్‌పోర్టు ఎడ్వయిజరీ కమిటీ సభ్యులుగా ముగ్గురు నియమితులయ్యారు. రాజమహేంద్రవరానికి చెందిన కాశీ నవీన్‌కుమార్, రాజానగరానికి చెందిన మోది సత్తిబాబు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అవంతి సీడ్స్ వ్యాపారవేత్త అల్లూరి ఇంద్ర కుమార్ రాజు నియమితులయ్యారు. -
శీలానికి వెల కట్టిన పోలీసు
-డీఎస్పీ ఎదుట బెడిసికొట్టిన పంచాయితీ చిత్తూరు: ప్రేమించి.. పెళ్ళాడతానని మాట ఇచ్చిన ఓ కానిస్టేబుల్ మరో మహిళా కానిస్టేబుల్‌కు అన్యాయం చేసిన సంఘటన పలమనేరులో చోటు చేసుకుంది. ఇందుకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి. పలమనేరు మండలం ముసలిమొడుగుకు చెందిన మోహన్ అనే కానిస్టేబుల్ గత కొన్నాళ్ళుగా కుప్పం పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. ఇదే పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్‌గా కేవీ భార్గవి పని చేస్తుంది. ఇరువురూ గత కొన్నాళ్ళుగా ప్రేమించుకున్నారు. ఈ వ్యవహారం పెళ్ళిదాకా వచ్చింది. ఈ నేపధ్యంలో భార్గవి ప్రవర్తన నచ్చని మోహన్ ఆమెను వివాహం చేసుకునేందుకు నిరాకరించాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ భార్గవి డీఎస్పీ శంకర్‌ను కోరింది. ఇరువురిని ఒక్కటి చేసేందుకు డీఎస్పీ ప్రయత్నించగా.. మోహన్ అందుకు నిరాకరించాడు. తనను వదిలేయాలంటే ఆమెకు ఏం కావాలో అడగాలంటూ.. భార్గవి శీలానికి వెలకట్టేందుకు యత్నించాడు. మోహన్ తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా మోహన్ పెళ్ళికి అంగీకరించకపోవడంతో భార్గవి శుక్రవారం రాత్రి నిద్ర మాత్రలను మింగేసింది. అపస్మారక స్థితిలోకి వెళ్ళిన ఆమెను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు మోహన్‌పై కేసును నమోదు చేసి విచారిస్తున్నారు. -
మనసుకి ఏమైందిరా...
‘ఏమి సోదరా.. మనసుకేమైందిరా...’ అంటూ తొలిప్రేమ చిత్రంలో పవన్ కల్యాణ్ పాడుకుంటారు. అప్పట్లో ఆ పాట యువతరాన్ని ఒక ఊపు ఊపేసింది. ఇప్పుడు ‘ఏమి సోదరా.. మనసుకేమైందిరా...’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కల్యాణ్, హనీగుప్త, మోహన్ వత్స, ఉపాసన ప్రధాన పాత్రల్లో శ్రీనివాస్ నేదునూని దర్శకత్వంలో జేవీఆర్ సినిమాస్, వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై జేవీఆర్, దేశ్ముఖి రాజు యాదవ్, శ్రీనివాస్ నేదునూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచాన్ చేసి, గౌరవ దర్శకత్వం వహించారు. తెలంగాణ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి క్లాప్ ఇచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘యమధర్మ రాజు, చిత్రగుప్తుడు పాత్రలతో పాటు ప్రేమ గురించి ఈ చిత్రంలో చూపిస్తున్నాం. వినోదాత్మకంగా తీర్చిదిద్దుతాం. అందరూ కొత్తవాళ్లు నటిస్తున్న ఈ చిత్రంలో హీరోల్లో ఒకరైన శరత్ కల్యాణ్ వైజాగ్ సత్యానంద్‌గారి దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నారు’’ అని చెప్పారు. ‘‘మంచి కథ కుదిరింది. టైటిల్ అందరికీ నచ్చింది’’ అని నిర్మాతలు అన్నారు. హీరో, హీరోయిన్లు, నటులు కృష్ణుడు, తాగుబోతు రమేశ్, భోజ్‌పురి నటి రాణీ ఛటర్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మెలోడి శ్రీనివాస్, కెమెరా: మురళీ కృష్ణ, సహ నిర్మాత: పైల నర్సింహరావు. -
15 ఏళ్ల చెర తప్పింది
న్యూఢిల్లీ: గజరాజుకు 15 ఏళ్ల చెర తప్పింది. ఉత్తరప్రదేశ్ వన్యప్రాణి రక్షణ కార్యకర్తలు, పోలీసులు, అటవీ అధికారుల చొరవతో 55 ఏళ్ల ఏనుగు 'మోహన్'కు విముక్తి లభించింది. కోర్టు ఆదేశాలతో కఠినాత్ముడైన యజమాని నుంచి మోహన్ ను రక్షించామని జంతుప్రేమికులు, అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రతాప్‌గఢ్ కు చెందిన ఓ వ్యక్తి 2001లో బిహార్ లోని సోనెపూర్ పశువుల సంతలో ఈ ఏనుగును కొన్నాడు. దానికి సరిగా తిండి పెట్టకుండా హింసించేవాడు. ఈ విషయం ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ అధికారుల దృష్టికి రావడంతో వారు జిల్లా కోర్టును ఆశ్రయించారు. అలహాబాద్ హైకోర్టులోనూ ఏడాదిపైగా వాదనలు నడిచారు. చివరకు డిస్ట్రిక్ కోర్టు ఆదేశాలతో 'మోహన్'కు స్వేచ్ఛ లభించింది. మూడు రోజుల్లో యజమాని నుంచి మోహన్'ను విడిపించాలని జూలై 12న డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ ను చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆదేశించారు. అవసరమైన వైద్యం అందించాలని సూచించారు. కోర్టు ఆదేశాలతో చెర నుంచి 'మోహన్'ను విడిపించారు. -
విద్యుత్ వైర్లు తెగి వాహనదారుడు మృతి
భారీ ఈదురుగాలులకు 11కేవీ విద్యుత్ వైర్లు తెగి మీద పడడంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ శివారులోని వాసవీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడ్ని జగ్గుతండాకు చెందిన బుల్డోజర్ డ్రైవర్ భూక్యా మోహన్‌గా గుర్తించారు. -
క్రేన్ విరిగిపడి కార్మికుడి మృతి
పాల్వంచ(ఖమ్మం జిల్లా): కొత్తగూడెం థర్మల్ పవర్‌స్టేషన్(కేటీపీఎస్)లోని 7వ స్టేజీలో సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ఓ క్రేన్ బాడీ విరిగి పడి మోహన్(30) అనే కార్మికుడు మృతిచెందాడు. మోహన్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ముచ్చంద్ర. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్లాట్లు, పొలాలు, నగలు, నగదు
కాకినాడ రూరల్ : కాకినాడలో రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న ఆదిమూలం మోహన్‌కు ఏపీ, తెలంగాణ, కర్నాటకల్లో గల ఆస్తులపై అవినీతి నిరోధకశాఖ అధికారులు గురువారం ఏకకాలంలో దాడులు చేశారు. మోహన్ ఆదాయూనికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో ఈ దాడులు చేశామని ఏసీబీ డీఎస్పీ ఎ.రమాదేవి చెప్పారు. దాడుల్లో భారీగా బంగారం, వెండి వస్తువులు, నగదుతో పాటు రూ.కోట్ల విలువ చేస్తే ప్లాట్లు, పొలాలు, బినామీ పేర్లతో ఉన్నా ఐదు కంపెనీలకు సంబంధించిన దస్తావేజులు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. మోహన్‌కు నెల్లూరు, హైదరాబాద్‌లలో పలు కంపెనీలున్నట్లు దాడుల్లో బయటపడింది. డీటీసీ మోహన్ భారీగా ఆస్తులు కూడబెట్టడంతో పాటు బంధువుల పేరుతో రక,రకాల వ్యాపారాలు సృష్టించి నల్లధనాన్ని తెలుపు చేసుకునేందుకు యత్నించారని ఏసీబీ అధికారులు చెప్పారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట పంచాయతీ గైగోలుపాడులోని మోహన్ నివాసంతో పాటు ఏపీ, తెలంగాణ , కర్నాటక రాష్ట్రాల్లో తొమ్మిదిచోట్ల ఈ దాడులు నిర్వహిస్తున్నారు. దాడుల్లో బయటపడ్డ ఆస్తుల మార్కెట్ విలువ రూ.35 కోట్లు పైబడి ఉండవచ్చని, వాస్తవ విలువ రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకూ ఉండొచ్చని ఏసీబీ అధికారుల అంచనా. హైదరాబాద్‌లో 12 ప్లాట్లు, ఓ అపార్ట్మెంట్ కాకినాడతో పాటుహైదరాబాద్, అనంతపురం, విజయవాడ, ప్రొద్దుటూరు, కడప, నెల్లూరు, కాకినాడ, చిత్తూరు, బళ్లారిల్లో ఏకకాలంలో ఏసిబీ అధికారులు దాడులు చేసి తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని కొంపల్లిలో 8 ప్లాట్లు, మాదాపూర్‌లో నాలుగు ప్లాట్లు, పంజాగుట్టలో ఒక ప్లాటు, జూబ్లీ హిల్స్‌లో 699 గజాల్లో నాలుగంతస్తుల అపార్టుమెంటు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విజయవాడలో కుమార్తె పేరుతో ఒక ఇల్లు అల్లుడి పేరుతో రెండు ఇళ్లు, చిత్తూరులో తొమ్మిది ఎకరాల భూమి, ప్రకాశం జిల్లాలో 45 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి కాక బళ్లారి, చిత్తూరు, నెల్లూరు, విజయవాడ, హైదరాబాదుల్లో ఇంకా అనేక ఎకరాల భూములు ఉన్నట్లు భావిస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. బ్యాంక్ ఖాతాలు, లాకర్ల సీజ్ కాకినాడతో పాటు రాష్ట్రంలో డీటీసీ మోహన్‌తో పాటు అతని కుటుంబసభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు ఖాతాలను, లాకర్లను సీజ్ చేయనున్నట్లు డీఎస్పీ రమాదేవి చెప్పారు. దాడుల్లో పలు కీలక దస్తావేజులతో పాటు సెల్ఫోన్లు, బ్యాంకు పుస్తకాలు సీజ్ చేశామని, సోదాలు మరో రెండు రోజులు కొనసాగుతాయని వివరించారు. మోహన్ కుమార్తె పేరుతో హైదరాబాదు, నెల్లూరుల్లో ఐదు సంస్థలు నడుపుతున్నట్లు రికార్డులున్నా ఆ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలే తప్ప సంస్థలు లేవని తేలిందన్నారు. రికార్డుల్లో శ్రీ తేజా బయోఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్, తేజ అండ్ తేజశ్రీ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మెర్క్ మినరల్ ప్రైవేట్ లిమిటెడ్, సాయి దివ్య డెవలపర్స్, రోజాలిన్ రాక్స్ అండ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో సంస్థలు నడుపుతున్నట్లు ఉందన్నారు. మూడు రాష్ట్రాల్లో తొమ్మిది చోట్ల జరుగుతున్న దాడుల్లో ముగ్గురు డీఎస్పీలు, 9 మంది సీఐలు, 25 మంది సిబ్బంది పాల్గొన్నట్లు చెప్పారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన డీటీసీ మోహన్‌ను అరెస్టు చేసి విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు చెప్పారు. కాకినాడలో నిర్వహించిన దాడుల్లో డీఎస్పీ రమాదేవితో పాటు సీఐలు సుదర్శనరెడ్డి, సతీష్‌కుమార్, ఎస్ఐ విష్ణువర్ధన్‌లతో పాటు మరో ఆరుగురు సిబ్బంది పాల్గొన్నారు. ఇరిగేషన్ ఏఈ నుంచి డీటీసీగా.. డీటీసీ మోహన్ ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీరుగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1989లో ఆర్టీవో అరుు వరంగల్, నిజామాబాద్, హైదరాబాదుల్లో పనిచేశారు. 1998లో గ్రూప్-1 అధికారిగా ఎంపికై నేరుగా రవాణాశాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, విజయవాడ, మళ్లీ నెల్లూరుల్లో పనిచేసి డీటీసీగా కాకినాడకు ఏడాదిన్నర క్రితం వచ్చారు. -
'మోహన్ భగవత్ ప్రగతిశీల ఆలోచనాపరుడు'
ఆలయాల్లో స్త్రీల ప్రవేశం కోసం పోరాడుతున్న భూమాత బ్రిగేడియర్ నాయకురాలు తృప్తి దేశాయ్... తమ హక్కుల పోరాటంలో మోహన్ భగవత్ వైఖరిని తెలుసుకోవాలనే ప్రయత్నం చేశారు. తాజాగా ఆర్ ఎస్ ఎస్ లో మహిళలను చేర్చుకోవాలంటూ డిమాండ్ చేసిన ఆమె... మోహన్ భగవత్ జీ ప్రగతిశీల ఆలోచనాపరుడు అంటూ ప్రశంసలు కురిపించారు. ఆర్ ఎస్ ఎస్ లో మహిళలను చేర్చుకోవాలన్న తమ వైఖరిని ఆయన గౌరవిస్తారని భావిస్తున్నానన్నారు. స్త్రీ, పురుష సమాన హక్కుల కోసం పోరాటంలో భాగంగా తృప్తిదేశాయ్ మరో అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఆర్ ఎస్ ఎస్ లో మహిళలను చేర్చుకోవాలన్న తమ డిమాండ్ ను మోహన్ భగవత్ గౌరవిస్తారని భావిస్తున్నట్టు చెప్పారు. తాము సాధించాలని ప్రయత్నిస్తున్న హక్కులపై సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ తమ వైఖరిని తెలియజేయాలన్నారు. ఆ విధంగా వారి ఫ్యాన్ ఫాలోయింగ్ సమానత్వంకోసం పోరాడుతున్న తమకు.. మద్దతు పలుకుతుందని నమ్ముతున్నట్లు తృప్తి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రీయ సేవికా సమితి ద్వారా మహిళలు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ఆర్ ఎస్ ఎస్ లో ప్రత్యక్షంగా సభ్యంత్వం కోసం తృప్తి డిమాండ్ ను లేవనెత్తారు. తృప్తిదేశాయ్ పోరాటంతో ఇటీవలే శని సింగనాపూర్, నాసికా త్రయంబకేశ్వర్ ఆలయాల్లోకి మహిళలను అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే తృప్తి తాజా డిమాండ్ పై మాట్లాడిన బిజెపి ఉపాధ్యక్షుడు కాంత నలవాడే మాత్రం ఆమె డిమాండ్లు అర్థరహితమని, అనవసరమైన సమస్యలు సృష్టించకుండా.. మహిళలను వేధిస్తున్న ఇతర సమస్యల పరిష్కారానికి పోరాడితే మంచిదని సూచించారు. -
ఆర్ఎస్ఎస్ చీఫ్ ఫొటో మార్ఫింగ్, ఇద్దరి అరెస్ట్
కార్గాన్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఫోటోను మార్ఫింగ్ చేసిన ఘటనలో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మోహన్ భగవత్ ఫోటోను అభ్యంతరకంగా మార్పులు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం, ఆ ఫోటో సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేయడం మధ్యప్రదేశ్‌లో కలకలం సృష్టించింది. 22 ఏళ్ళ షాఖిర్, 20 ఏళ్ళ వసీమ్ అనే యువకులు మోహన్ భగవత్ చిత్రాన్ని మార్ఫింగ్ చేసి భికన్ గోన్ పట్టణంలోని స్థానిక సోషల్ నెట్ వర్కింగ్ గ్రూప్‌లో పోస్టు చేశారు. కాగా ఆ ఫొటోను మార్చి 16న పోస్టు చేసినట్లు గుర్తించామని, వారిద్దరినీ అరెస్టు చేసినట్లు ఏఎస్పీ అంతర్ సింగ్ కనేష్ వెల్లడించారు. మరోవైపు మోహన్ భగత్ మార్ఫింగ్ ఫొటోపై ఆర్ఎస్ఎస్, బిజెపి కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరికీ వ్యతిరేకంగా ఐటీ చట్టం సెక్షన్ 67, భారత శిక్షాస్మృతి 505 (2) సెక్షన్లకింద భికాన్ గాన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. కోర్టు వారిద్దర్ని ఈనెల 30 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే నిందితులు మాత్రం తమకు ఆ ఫొటో మరో గ్రూప్ నుంచి వచ్చిందని, కేవలం దాన్ని తాము పోస్టు చేసినట్లు చెప్తున్నారని ఏఎస్పీ పేర్కొన్నారు. -
5 ఓట్ల విజేత..
జాంబాగ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎం. ఆనంద్ కుమార్ గౌడ్‌పై మజ్లిస్ అభ్యర్థి డి. మోహన్ స్వల్ప తేడాతో విజయం సాధించారు. మోహన్‌కు 8,583 ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్థి ఆనంద్ కుమార్ గౌడ్‌కు 8,578 ఓట్లు పోలయ్యాయి. కేవలం 5 ఓట్ల తేడాతో మజ్లిస్ అభ్యర్థి మోహన్ విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి భజరంగ్ శర్మకు 5,235 ఓట్లు రాగా, కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ మంత్రి ఎం. ముఖేష్‌గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ 3,382 ఓట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు. - అబిడ్స్ -
'నాకేం.. మా రాజశేఖరరెడ్డి ఉన్నాడన్నాడు'
-
ఒక కళాకారుడి జీవన లాలస
బ్లాగు కాచిన వెన్నెల విన్సెంట్ వ్యాన్గో, జీవితాన్ని ఊపిరాడనంత మోహంతో కౌగిలించుకున్న ఒక వెర్రి డచ్చివాడు. రంగులే శ్వాసగా బతికినవాడు. కళ్లు చెదిరే మాస్టర్ పీస్‌లతో జనం కంటికి కొత్త రంగుల భాషను నేర్పిన గ్రేట్ మాస్టర్. అంతేనా! తమ్ముడికి రాసిన వందలాది లేఖల్లో తన అంతర్ బహిర్ రణఘోషను ఉద్వేగభరితంగా బొమ్మకట్టిన అపురూప లేఖాసాహిత్యకారుడు కూడా. కళతోపాటు జీవితంలోనూ అలుపెరగకుండా పోరాడిన ఆ కళాయోధుడి జీవితాన్ని వర్ణకావ్యంలా పరిచయం చేస్తుంది ‘లస్ట్ ఫర్ లైఫ్’ నవల. రచయిత, జీవితచరిత్రా నవలల్లో కాకలు తీరిన ఇర్వింగ్ స్టోన్. ఎనభయ్యేళ్ల కిందట వెలువడిన ఈ తీరని జీవన లాలస నేటికీ వన్నె తగ్గని పెయింటింగులా పాఠకులనూ, కళాప్రియులనూ ఆకర్షించి వ్యాన్గో రసోన్మాద జగత్తులోకి లాక్కెళ్తోంది. బొమ్మలు వేయడం తప్ప తన బతుక్కి మరో అర్థం లేదని చాటిన వ్యాన్గో నడిచిన పూలబాటల్లో, ముళ్లబాటల్లో స్టోన్ మనల్ని వేలుపట్టుకు నడిపిస్తాడు. ఆ వర్ణకారుడి ఫలించని తొలిప్రేమ, బెల్జియం బొగ్గుగనుల్లో మతబోధన, చేతికి చిక్కినట్టే చిక్కి జారిపోయే రంగులతో అనుదిన పోరాటం, ఆత్మను అరగదీసే సంశయాలు, సాటి మనిషి కష్టానికి చెరువయ్యే గుండె, పతితజనంతో సహవాసం, సంఘ బహిష్కారం... అన్నింటిని జీవం తొణకిసలాడే చిత్రాల్లో పరిచయం చేస్తూ వెళ్తాడు. పోరాటంలో మనోదేహాలు ఛిద్రం చేసుకుని, తను చేయాల్సింది చేశానన్న తృప్తితో హాయిగా నవ్వుతూ ముప్ఫై ఏడేళ్లకే ప్రాణాన్ని తూటాకి అర్పించుకున్న ఆ అమర కళావేత్త బలిదానాన్నీ కళ్లముందు పరచి గుండెను తడిచేస్తాడు. ఈ నవలను పదమూడేళ్ల కిందట తొలిసారి చదివినప్పుడు కదలిపోయాను. అప్పట్నుంచి వ్యాన్గో కళాజీవితాలను మరింత తెలుసుకోవాలనే ఆరాటం ఆరని జ్వాలలా ఎగసిపడుతూనే ఉంది. దాని వెలుగును ఇంకొందరికి పంచుదామని అనువాదం మొదలుపెట్టాను. కళాసాహితి http://kalasahiti.blogspot.in బ్లాగులో దీన్ని అందిస్తున్నాను. ఒక చిన్న భాగం ఇది... అనుకోకుండా అలా... వేసవి వెళ్లిపోయి శిశిరం మొదలైంది. ఉన్న కాసింత పచ్చదనమూ కనుమరుగైంది. అయితే విన్సెంట్‌లో ఏదో నూతన జీవశక్తి పురులు విప్పింది. తన జీవితాన్నే దీటుగా ఎదుర్కోలేని అతడు ఇప్పుడు ఇతరుల జీవితాలపైకి మళ్లాడు. తిరిగి పుస్తకాలు పట్టుకున్నాడు. పఠనం అతనికి ఎప్పుడూ ఇష్టమైన వ్యాపకమే. ఇతరుల జయాపజయాలు, సుఖదుఃఖాల గాథల్లో అతడు తనను వెంటాడుతున్న తన జీవిత వైఫల్యపు రక్కసి బారినుంచి రక్షణ పొందుతున్నాడు. వాతావరణం బాగున్నప్పుడు మైదానంలోకి వెళ్లి పగలంతా అక్కడే చదువుకుంటున్నాడు. వానపడితే గదిలోని చూర్లకిందున్న తన మంచంలో పడుకునో, లేకపోతే డెనిస్‌ల వెచ్చని వంటగది గోడపక్కన కుర్చీలో కూర్చునో గంటలకొద్దీ చదువుకుంటున్నాడు. గోరంత విజయాన్ని, కొండంత అపజయాన్ని మూటగట్టుకునే తనలాంటి అతి సామాన్య మానవుల జీవితగాథలతో మమేకమైపోతున్నాడు. వాళ్లు చూపిన బాటలో తన జీవితాన్ని సరైన రీతిలో దర్శించుకోగలుగుతున్నాడు. నెమ్మదిగా అతని మనసులో ఒక నవ్యభావన సుళ్లు తిరగసాగింది. ‘‘నేను పరాజితుణ్ని, పరాజితుణ్ని’’ అనే కుంగుబాటు స్థానంలో, ‘‘ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకేది తగింది? ఈ ప్రపంచంలో నాకు సరైన స్థానమేది?’’ అనే ఆరాటం మొదలైంది. తను చదివే ప్రతి పుస్తకంలోనూ తన జీవిత గమనాన్ని నిర్దేశించే దిక్సూచి కోసం తపనతో అన్వేషిస్తున్నాడు. తను ఎందుకూ పనికిరాడని తిడుతూ ఇంటి నుంచి ఉత్తరాలు వస్తున్నాయి. సోమరిగా తిరుగుతూ, సభ్యతాసంస్కారాలను, సంఘపు కట్టబాట్లను అతిక్రమిస్తున్నావంటూ తండ్రి నిందిస్తున్నాడు. మళ్లీ నీ కాళ్లపై నువ్వు నిలబడి, సమాజానికి నీ వంతు ఉపకారం ఎప్పుడు చేస్తానని అడుగుతున్నాడు. ఈ ప్రశ్నలకు సమాధానం కోసం విన్సెంట్ కూడా ఎదురుచూస్తున్నాడు. దొరికితే అతనికీ సంతోషమే. చివరికి, అతనికి పుస్తక పఠనంతోనూ విసుగెత్తింది. పరాజయం తర్వాత కొన్నాళ్లు అతడు దేన్నీ స్వీకరించనంతటి ఉద్వేగరాహిత్యంలోకి జారిపోయాడు. తర్వాత మనశ్శాంతి కోసం పుస్తకాలు చదివాడు. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. కానీ కొన్ని నెలలుగా అణచిపెట్టుకున్న తీవ్రవేదన ఇప్పుడు కట్టలు తెంచుకుని అతణ్ని దుఃఖంలో ముంచెత్తింది. పుస్తకాలతో సాధించిన మనోస్థిమితం ఆ ప్రవాహానికి ఏ మాత్రం అడ్డుకట్ట వెయ్యలేకపోయింది. అతడు జీవిత పతనావస్థకు చేరాడు. ఆ సంగతి అతనికి బాగా ఎరుకే. అయితే తనలో ఎంతో కొంత మంచి ఉందనీ, తను మరీ అంత మూర్ఖుణ్నీ, వ్యర్థజీవిని కాననీ, లోకానికి తను పిసరంతైనా మేలు చేయగలననీ అతడు అనుకుంటున్నాడు. మరి ఆ మేలేమిటి? తను వ్యాపారానికి పనికిరాడు. తనకు ఏది సరిపోతుందో దాంట్లో తప్ప మిగిలిన అన్ని వ్యవహారాల్లో ప్రయత్నించి ఓడిపోయాడు. కానీ తనెప్పుడూ ఇలా పరాజయానికి, వేదనకు గురికావాల్సినంత శాపగ్రస్తుడా? తన జీవితం పరిసమాప్తమైపోయిందా? అన్నీ ప్రశ్నలే. సమాధానాల్లేవు. రోజులు దొర్లిపోతున్నాయి. శీతాకాలం ప్రవేశించింది. తండ్రి విసుగెత్తిపోయి డబ్బు పంపడం మానేశాడు. విస్సెంట్ డెనిస్‌ల ఇంట్లో భోజనం మానుకుని పిడికెడు బ్రెడ్డుతో కడుపు నింపుకుంటున్నాడు. తమ్ముడు థియో బాధపడిపోయి కాస్త డబ్బు పంపుతున్నాడు. అతనికీ సహనం నశిస్తే తండ్రి తన బాధ్యత గుర్తెరిగి మళ్లీ కాస్త డబ్బు పంపుతున్నాడు. రివాజుగా మారిన ఆ ఇద్దరి సాయంతో విన్సెంట్ అరకడుపుతో రోజులు నెట్టుకొస్తున్నాడు. నవంబర్‌లో వాతావరణం తేటగా ఉన్న ఓ రోజున విన్సెంట్ మార్కాస్ బొగ్గు గనుల వద్దకు వెళ్లాడు. మనసులో ఏ ఆలోచనలూ లేవు. గోడపక్కనున్న ఓ తుప్పు పట్టిన ఇనుప చక్రమ్మీద కూర్చున్నాడు. గేట్లోంచి ఓ ముసలి కార్మికుడు బయటికొచ్చాడు. తలపైని నల్లటోపి కళ్లను కప్పేస్తోంది. భుజాలు కుంగిపోయాయి. చేతులు జేబుల్లో పెట్టుకున్నాడు. మోకాళ్ల చిప్పలు బయటికి పొడుచుకొచ్చాయి. అతని రూపంలో ఏదో మాటలకందనిది విన్సెంట్‌ను అమితంగా ఆకర్షించింది. తనకు తెలియకుండానే అలవోకగా జేబులోంచి పెన్సిల్ ముక్కను, ఇంటినుంచి వచ్చిన ఉత్తరాన్ని బయటికి తీశాడు. బొగ్గునుసితో నలుపెక్కిన మైదానంలోంచి వెళ్తున్న ఆ శల్యావశిష్టుని రూపాన్ని కవరు వెనకవైపు వేగంగా గీశాడు. తర్వాత ఆ కవర్లోని తండ్రి ఉత్తరాన్ని తీసి చదివాడు. ఒకే ఒక ముక్క రాసి ఉంది. కాసేపయ్యాక గేటుగుండా మరో కార్మికుడు బయటికొచ్చాడు. పదిహేడేళ్ల కుర్రాడు. పొడవుగా, నిటారుగా ఉన్నాడు. నడుస్తోంటే భుజాలు చూడముచ్చటగా కదులుతున్నాయి. ఎత్తయిన రాతిగోడపక్క నుంచి రైలుపట్టాలవైపు కదలిపోతున్నాడు. విన్సెంట్ అతడు కనుమరుగయ్యేంతవరకు చూసి అతని బొమ్మ గీశాడు. - పి.మోహన్ -
దమ్ముంటే నిజాలు చెప్పండి
-
సీఏ ఫైనల్లో మోహన్‌కు రెండో ర్యాంక్
శ్రీకాళహస్తి/విజయవాడ (లబ్బీపేట): చిత్తూరు జిల్లా తొట్టంబేడు వుండలంలోని చోడవరం గ్రావూనికి చెందిన నాగోలు మోహన్‌కువూర్ సీఏలో ఆల్ ఇండియూ రెండో ర్యాంకును సాధించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఆదివారం సీఏ ఫైనల్ పరీక్ష ఫలితాలు ప్రకటించింది. ఫలితాల్లో మోహన్‌కుమార్ జాతీయస్థాయిలో ప్రతిభ చూపి రెండోర్యాంకు కైవసం చేసుకున్నారు. విజయవాడలోని సూపర్‌విజ్‌లో మోహన్‌కుమార్ శిక్షణ పొందారు. సీపీటీ, ఐపీసీసీల్లో జాతీయస్థాయిలో తొమ్మిదో ర్యాంకును కైవసం చేసుకున్న మోహన్‌కుమార్.. సీఏ ఫైనల్లోనూ రెండో ర్యాంకుతో సత్తా చాటారు. మొదటి ర్యాంకును తమిళనాడుకు చెందిన విద్యార్థి దక్కించుకోగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో మోహన్‌కుమార్‌దే అత్యుత్తమ ర్యాంకు కావడం విశేషం. మోహన్‌కుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ తన తల్లిదండ్రులు మంజుల, నాగరాజురెడ్డి వ్యవసాయ పనులు చేస్తుంటారని తెలిపారు. ఎంతో కష్టపడుతూ తనను చదివించారని, ఇప్పుడు సాధించిన జాతీయ ర్యాంకును తల్లిదండ్రులకే అంకితమిస్తున్నానని చెప్పారు. సూపర్ విజ్ శిక్షణతోపాటు తన అన్నయ్య భానుప్రసాద్ స్ఫూర్తిగా నిలిచాడన్నారు. శిక్షణ ఇచ్చిన సూపర్‌విజ్ ప్రిన్సిపాల్ సబ్బినేని వెంకటేశ్వరరావు మోహన్‌కుమార్‌ను అభినందించారు. తొట్టంబేడు గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేశారు. -
కిడ్నీలో 300 గ్రాముల రాయి
ఓ యువకుడి కిడ్నీలో నుంచి 300 గ్రాముల రాయిని వైద్యులు బయటకు తీశారు. ఇంతపెద్ద రాయిని చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు. ఈ అరుదైన సంఘటన మెదక్ పట్టణంలో గురువారం వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మోహన్(25) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మూడు రోజులుగా మూత్రం ఆగిపోయింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ మోహన్ మెదక్ పట్టణంలోని సాయిచంద్ర నర్సింగ్‌హోంకు వచ్చాడు. పరీక్షలు చేసిన వైద్యులు సురేశ్ కిడ్నీలో రాళ్లు ఉన్నట్టు గుర్తించారు. ఆపరేషన్ నిర్వహించగా కిడ్నీలో 300 గ్రాముల బరువుగల రాయి బయట పడింది. కిడ్నీలో ఇంత పెద్ద రాయి రావడం ఇదే మొదటిసారి అని వైద్యులు సురేశ్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇంతపెద్ద పరిమాణంలోని రాయిని చూడలేదన్నారు. నీళ్లు సక్రమంగా తాగకపోవడం, మాంసహారం అధికంగా తీసుకోవడం, వంశపారంపర్యంగా కిడ్నీల్లో రాళ్లు వస్తుంటాయన్నారు. ఎంత ఎక్కువగా నీళ్లు తాగితే మనిషి అంత ఆరోగ్యంగా ఉంటాడని వైద్యులు తెలిపారు. -
ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
గోలియత్‌ను ఎత్తి పడేసిన వేలెడంత వియత్నాం
40 ఏళ్ల క్రితం ఈ రోజు - విజయవాడ ‘విశాలాంధ్ర’ డైలీ ఆఫీసు. ఆ రోజుల్లో టీవీ కంప్యూటర్ నెట్ లేవు. మా న్యూస్ డస్క్ దగ్గర టెన్షన్. పాతికేళ్లు హోరాహోరీగా సాగిన వియత్నాం యుద్ధం క్లైమాక్స్ కొచ్చింది. టీవీ ప్రింటర్ల చుట్టూ కాలుగాలిన పిల్లుల్లా తిరుగుతున్నాం. రోల్ అవుతున్న న్యూస్ బైట్స్‌ని చింపుకొస్తున్నాం. ‘‘వియత్నమీస్ ఆర్మీ టాంకులు దక్షిణానికొస్తున్నా యా? ఎక్కడున్నాయి. అమెరికన్ బాంబింగ్ ఎక్కడ జరుగుతోంది?’’ మా ఎడిటర్ సి. రాఘవాచారి ఆత్రంగా అడుగుతున్నారు. ‘‘క్వాంగ్రీటీ, దానాంద్, హువే సిటీల మీద కార్పెట్ బాంబింగ్ జరుగుతోంది. సైగాన్ గురించి న్యూస్ లేదు’’ మేం చెప్పాం. అంతకుముందు బంగ్లాదేశ్ యుద్ధ కాలంలో ఒక్క సప్తమ నౌకాదళం మన మద్రాసు, విశాఖ పక్క నుంచి పైకి బెంగాల్ వేపు కదుల్తుందంటేనే ఠారుకు చచ్చాం. అలాటిది మన కేరళ కంటే కొంచెం పెద్దగా ఉండే బుల్లి వియత్నాంను ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక శక్తి చుట్టు ముడుతుందంటే గుండెలు అవిసిపోవూ. ఇది పాతికేళ్లు గా డేవిడ్‌కీ గొలియత్కీ మధ్య సాగుతున్న పోరు. మొదట నాటు తుపాకులూ, విమానాలు కూల్చే గన్స్ తప్ప పెద్దగా ఏమీలేని దక్షిణ వియత్నాం విముక్తి సైన్యం కొద్ది కాలంగా అధునాతనమైన ట్యాంకులూ, మెషీన్ గన్స్‌ని రష్యా ఇవ్వగా తెచ్చుకుంది. అచ్చు కేరళ లాగా, కోనసీమ, గోవాల్లాగా కొబ్బరి చెట్లూ, అరటి తోపులూ వరి పొలాలతో మన ఊరు లాగే పచ్చగా మెరిసే వియ త్నాం బొగ్గులా తయారయింది. ‘‘ఒరేయ్ మీరు రాతి యుగంలోకెళ్లే వరకూ బాంబింగ్ చేస్తాం’’ అని ఒక అమె రికన్ జనరల్ వార్నింగ్ ఇచ్చినంత పనీ జరిగింది. దురా క్రమణ చేసినప్పుడల్లా అక్కడ ప్రజాస్వామ్యాన్నీ, ఎల క్షన్లనీ తెచ్చి పెడతామని చెప్పడం అమెరికాకి ఓ ఫ్యాషన బుల్ మంత్రం. దాంతోనే ఓ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా రివాజు. అప్పటికి ఈ కీలు బొమ్మ పాలన సైగాన్ని దాటి దేశంలో ఒక్క ఇంచికి మించింది లేదు. ప్రజలంతా విముక్తి సేన వెంటే. కొద్ది మంది తైనాతీలు తప్ప. మరి ఓటమి సూటిగా కళ్లలోకి తేరిపార చూస్తున్నందువల్ల అమెరికాకి పిచ్చెత్తి ఒక నాటు ఆటంబాంబు వేసినట్టు అన్ని నగరాలనూ, పట్నాలనీ ధ్వంసం చేసేస్తే? అంత సీన్లేదు. చాలా కష్టం. ఎందుకంటే ఒక్క యుద్ధ రంగంలోనే కాదు ప్రపం చమంతటా దౌత్య రంగంలో కూడా వియత్నాం ప్రజాభి ప్రాయాన్ని పోగేసింది. అప్పటికే 58 వేల మంది అమెరి కన్ సైనికుల శవపేటికలు అమెరికాకు వరసగా చేరాయి. ఒక్కో కాఫిన్ తీసుకోవడానికొచ్చే కుటుంబాలన్నీ ఈ యుద్ధం ఇక వద్దని వీధుల్లోకొచ్చి ప్రదర్శనలు చేస్తున్నా యి. హాలీవుడ్లో ఎక్కువ మంది స్టార్స్, వైట్ హౌస్ ముందుకు వేనకు వేలు ప్రజల్తో వచ్చి యుద్ధ వ్యతిరేక ప్రదర్శనల్లో పిడికిళ్లు బిగిస్తున్నారు. ప్యారిస్ శాంతి చర్చ ల్లో కేసింగర్ లాంటి కొమ్ములు తిరిగిన శకుని వాదాలను, ఊరూ పేరూ లేని మేడమ్ బిన్ (దక్షిణ వియత్నాం తాత్కాలిక విప్లవ ప్రభుత్వ విదేశాంగ మంత్రి) పచ్చి అబద్ధాలని ప్రపంచ వేదిక మీద నిరూపించింది. ఆ రోజుల్లో ఆవిడ ఢిల్లీ వస్తే ఘనంగా పౌర సన్మానం జరి గింది. వేదిక మీద ఇందిరా గాంధీ లేచి నడిచి వచ్చి మేడమ్ బిన్ను ఆప్యాయంగా కౌగలించుకుంది. అమెరి కాకి ఒళ్లు మండింది. ఆ పాతికేళ్లూ అది ఒట్టి యుద్ధంగా సాగలేదు. అమె రికన్ సాహిత్యం - కథ, నవల, కవితల్లోకీ, నాటకాల్లోకీ వియత్నాం నేరుగా దూసుకొచ్చి కూచుంది. అమెరికా, లాటిన్ అమెరికా చర్చిలలో ఆదివారం అయిందంటే లిబ రేషన్ థియాలజిస్టుల సెర్మన్ల నిండా వియత్నామే. మమ్మల్ని, దున్నల్లాగా, కబేళాకి తోల్తారా అంటూ ‘‘లుఫె లో సోల్జర్’’ అని బాబ్ మార్లే వచ్చి జమైకాలో పాడిన పాట ప్రపంచమంతా మళ్లీ మళ్లీ మారుమోగింది. అప్పు డు కలకత్తా వీధుల్లో ప్రెసిడెన్సీ కాలేజీ స్టూడెంట్స్‌తో కలసి, దేశమంతటి నుంచి పోగైన మేమంతా ప్రదర్శ నలు చేశాం. గావుకేకలు పెట్టి ఎస్ప్లనేట్ సెంటర్లో నినా దాలిచ్చాం. ‘‘ఆమ్ర నామ్ తూమ్ర శామ్’’ ఒక్కడు అరిస్తే ‘వియత్నామ్, వియత్నామ్’ వేల గొంతులందుకున్నా యి. ‘‘ఏ గంగా మీకాంగ్ ఏకీ హై’’ ఒకరు మొదలెడితే ‘‘భూలోమత్ భూలోమత్’’ అంటూ మైదానం దద్దరిల్లిం ది. ఇక్కడే కాదు అమెరికన్ నల్లజాతుల పౌర హక్కుల ఉద్యమాలకు వియత్నాం పతాకమయింది. ఆఫ్రికాలో వరసగా విముక్తి అవుతున్న దేశాలకు స్వేచ్ఛా నినాద మైంది. యూరోపియన్ రాక్ బాండ్స్, బీటిల్స్, బీట్నిక్, రోలింగ్ స్టోన్స్ పాటలకు పల్లవి అయింది. వియత్నాం కోసం ప్రపంచ ప్రజ అంతా ఒక్కటయింది. అమెరికా ఒంటరిదయింది. అయినా హిట్లర్‌కి ఓటమి ఖాయమని తెలిసినప్పటికీ మాస్కోని బాంబ్ చేయమని వందలాది విమానాలకు పదే పదే ఆర్డర్లిచ్చినట్టుగా అమెరికా కూడా ఆర్డర్లిచ్చింది. గంటల తరబడి సస్పెన్స్‌తో ఎదురు చూస్తున్న మా ముందు టెలిప్రింటర్లు టక టకమంటూ రొద చేశాయి. గుండెలు పట్టుకు చూశాం. ఎ.పి, ఎ.ఎఫ్.పి. వార్తా సం స్థల కబురు. సైగాన్లోకి విముక్తి సేన టాంకులు దూసు కొచ్చాయి. అయిపోయింది. అర్థమయిపోయింది ఇరవ య్యవ శతాబ్దపు సుదీర్ఘ యుద్ధంలో వియత్నాం బక్క రైతు బందిపోటు డేగ రెక్కలు తెగనరికాడు. కాసేపట్లోనే మళ్లీ వార్తలు. దుర్భేద్యమైన అమెరికన్ రాయబార కార్యాలయం గేట్లను వియత్నాం టాంకులు గుద్దుకుంటూ, ముక్కలు చెక్కలు చేసుకుంటూ ముందు కెళ్లాయి. పై అంతస్థు మీదికి చేరిన అమెరికన్ సైనికులూ, ఎంబసీ స్టాఫ్ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని దిక్కులు చూస్తున్నారు. అమెరికన్ హెలికాప్టర్లు పైన చక్కర్లు కొడుతూ కిందికి తాళ్లనిచ్చెనలు జారవిడుస్తున్నాయి. అందిన వాళ్లు అంది పుచ్చుకుని ఎగబాకి హెలికాప్టర్లలో కూచుంటున్నారు. లాటిన్ అమెరికా లాంటి ఖండాలనే గుప్పెట్లో బిగించిన మహా సామ్రాజ్యానికి ఏం గతి పట్టింది? ఎంత సిగ్గు చేటు? ఇంతా చేసి సప్త సముద్రాల అవతల బుల్లి వియత్నాం పెరట్లో కుక్క చావు చావాల్సి వచ్చింది. ఆసియా అంతా పులకరించింది. ప్రపంచం పలవరించింది. మా మొహాలన్నీ విప్పారాయి. అందరూ చిరున వ్వులు రువ్వుతున్నారు. న్యూస్ ఎడిటర్ టీలు ఆర్డర్ చేశారు. అందరం సిగరెట్లు వెలిగించాం. మొహాలు వెలిగిపోతున్నాయి ‘పతాక శీర్షిక’ ఏం పెట్టాలి? ‘బాక్స్ ఐటమ్’లు ఏం రాయాలి? చకచకా రాసేశాం. మర్నాడు అమెరికన్ పత్రికలన్నీ ‘సైగాన్ పతనం’ అని ‘సైగాన్ సరెండర్స్ టు రెడ్స్’ అని బ్యానర్ పెట్టా యి. మా బ్యానర్ ‘సైగాన్ విముక్తి’ అని. నిజానికి పతనమైంది అమెరికా. (వియత్నాంలో అమెరికా ఓటమికి నేటికి 40 ఏళ్లు) (వ్యాసకర్త ప్రముఖ కార్టూనిస్టు మొబైల్: 77028 41384) -
మైండ్ గేమ్
పూర్తిగా అమెరికాలో చిత్రీకరించబడిన యాక్షన్ లవ్ ఎంటర్టైనర్ ‘ఛేజ్’. రామ్ దివ్యేశ్, స్పందన అల్లూరి జంటగా మోహన్ నిమ్మకాయల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. అమెరికాలోని రేర్ లొకేషన్స్‌లో షూటింగ్ చేశామని, మైండ్ గేమ్‌తో నడిచే కథ ఇదని మోహన్ చెప్పారు. -
టిన్ డ్రమ్‌తో ఉస్మానియాకొచ్చాడు
నివాళి చివర్లో అందరం గుంటర్ గ్రాస్‌కి సెలైంట్ షేక్హేండ్లిచ్చి బయటపడ్డాం. చాలాకాలం ఆ ఇమేజెస్ తగులుకుని వెంటాడాయి. ఇదంతా అయిన పన్నెండూ పదమూడేళ్లకి ఆ నవలకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. గుంటర్ గ్రాస్ హైదరాబాద్ వచ్చాడంట గురూ. సా యంత్రం ఉస్మానియా యూ నివర్సిటీలో మీటింగ్. రోజు వారీ బొమ్మల పని హడా వుడిగా ముగించాం. ‘టిన్ డ్రమ్’ నవల చదివిన ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్, అందరికీ ఆదుర్దా, ఆనందం. ఏదో ఎక్స్పెక్టేషన్. కలర్ పేస్టల్స్‌తో ఆయన కేరికేచర్ లాగడమైంది. అది చంకలో పెట్టుకుని అందరం చంకలు గుద్దుకుంటూ ఉస్మానియాకెళ్లాం. (అది 1986-87 కచ్చి తంగా గుర్తులేదు) పెద్ద క్లాస్ రూమ్, ముందే ఆయన అక్కడున్నాడు. వచ్చిన వాళ్లని పలకరిస్తున్నాడు. ఆరడుగుల పైనే ఉన్నాడు. అడ్డంగా నాలుగడుగులున్నట్టున్నాడు. భారీ విగ్రహం. పక్కనే వాళ్లావిడ కూడా ఉంది. అంతే పర్సనాలిటీ, ఇద్దరూ నిటారుగా నించుంటే వెనకనున్న 16 ఎంఎం స్క్రీన్ మాకు కనిపించడానికి తంటాలు పడుతోంది. పక్కన రచయిత శివాజీ, మరో జర్నలిస్టూ నేనూ ముందుకెళ్లి కలర్ కేరికేచర్ చూపించాం. కింద సంతకం చేశాడు. కేరికేచరిస్టువా? అని అడిగాడు. ‘పొలిటికల్ కార్టూనిస్టుని. అప్పుడప్పుడు కేరికేచర్లు కూడా వేస్తా నన్నా’ వుయ్ ఆల్సో మేక్ స్టీల్ అన్నట్టు. అందరూ నా వాల్రస్ మీసాలే సాగదీసి వేస్తారని నవ్వాడు. మాకూ మరోదారి కనిపించలేదన్నాం. ఇదే నేనైతే ఇంకోలా వేస్తానన్నాడు ‘ఎవరేనా అంతేలేవో’ అని లోపలే అనుకుని బైటికి చిరునవ్వాం. కానీ ఆయన గొప్ప గ్రాఫిక్ ఆర్టిస్టనీ, శిల్పాలు కూడా చేస్తాడనీ తెలీని మూర్ఖులము. టిన్ డ్రమ్ తప్పితే ఆయన రచనల్ని పెద్దగా చదివి చచ్చిందీ లేదు. సభ మొదలయింది. గుంటర్ గ్రాస్ గొంతు సవరించి, కళ్లజోడు సర్దుకుని, మీసాలు దువ్వి మొదలు పెట్టాడు. ఎదురుగా ఉన్న ముందు సీట్లో వాళ్లవిడ కూచుంది. ఆవిడ వెనకున్న మాకు ఆయన కనిపించడం లేదు. పక్క సీట్లలోకి జరిగి సర్దుకున్నాం. టిన్ డ్రమ్ రాయడానికి తనను ఇన్స్పైర్ చేసిన విషాదాన్నీ, రానున్న వినాశాన్ని గురించీ చెప్పాడు. జర్మనీలో నాజీలు పుట్టి పెరగడం, హిట్లర్ అధికారంలోకి దూసుకొచ్చే కాలం గురించి వింటుంటే గుండెలవిశాయి. ఆ కాలంలోని హింసాత్మకమైన వాతావరణం, అది రాజకీయాలని దాటి కుటుంబ జీవితంలోకీ, పడక గదుల్లోకీ ఎంతగా చొచ్చుకొచ్చిందో గుంటర్ గ్రాస్ నోటి ద్వారా వింటూంటే గాభరా పుట్టింది. నాజీ జర్మనీ, రెండో ప్రపంచ యుద్ధం, కాన్సెంట్రేషన్ కేంపులూ, హోలూకాస్ట్ అన్నీ చదువుకున్నవే, తెలిసినవే. కానీ నాటి జర్మన్ కుటుంబ జీవనం అలా కెలకబారిందెలా అనేది పెద్దగా తెలీని సంగతి. దురాక్రమణదారు, పరా యి దేశాన్నే కాదు తన దేశ ప్రజల్ని కూడా ఎంత రొష్టు పెడతాడో అర్థమయింది. ఆ కాలంలో జర్మన్ ప్రజలు ఎంతో సుఖంగా ఉన్నారన్న భ్రమ బద్దలయింది. ‘టిన్ డ్రమ్’ ప్రపంచం దృష్టిలో పడ్డాక హాలీవుడ్ నుండి నాలుగైదు పెద్ద స్టూడియోలు నన్ను అడిగాయి. నవలని సినిమాగా తీస్తామంటారు. మరి మీరు స్క్రిప్ట్ ని మార్చకూడదన్నాను. నవల స్పిరిట్ మార్చ కూడద న్నాను. సినిమా హిట్ కావడం కోసం పెద్ద పెద్ద సూపర్ స్టార్లని కోట్లు పోసి కొనితెచ్చి వాళ్ల మీదే కెమెరా కళ్లు పెడతారు గదా అన్నాను. అవునన్నారు. అయితే కాద న్నాను. మొత్తం మీద వాళ్లతో కుదరలేదు. తర్వాత వచ్చిన ఒక ప్రొడ్యూసర్, డెరైక్టర్ టీమ్ నవల మీద ప్రేమతో, స్పిరిట్ చెక్కు చెదరకుండా తీస్తామని హామీ ఇచ్చారు. షూటింగ్లో నా సలహాలూ తీసుకున్నారు. ఇది నాకు తృప్తినిచ్చిన ఫిల్మింగ్ అని ముగించి ఆయన కూడా వచ్చి వాళ్లావిడ పక్క సీట్లో కూచున్నాడు. మేం మరి కాస్త పక్కకి జరిగాం. అంతలోనే మళ్లీ లేచి ‘సినిమాలో కొన్ని సీన్లు మీకు బూతుగా, అతి సెక్సులా అనిపించొచ్చు. కానీ అది హాలీవుడ్ కోణం నుంచి మిమ్మల్ని ఎక్సైట్ చేయడానికి కానేకాదు. అది ఆనాటి జర్మన్ సమాజంలోని వాస్తవం. అలాగే చూడండి. అపార్థం చేసుకోవద్దు’ అని చిన్న వార్నింగ్ ఇచ్చాడు. అనుకున్నట్టుగానే మొదటి సీన్లోనే అల్లంత దూరాన బీడువారిన భూమి మీద పారిపోతున్న యుద్ధ ఖైదీ, అతని వెంటాడే సైనికులూ, తుపాకులూ, బీభ త్సంగా కనిపిస్తాయి. తర్వాత ఆలుగడ్డలు కాల్చే ఒక మ్మాయి లంగా కింద యుద్ధ ఖైదీ దాక్కోవడం, సైని కులు వేరే దిక్కుకి పోవడం, ఆ తర్వాత ఖైదీ జిప్ పెట్టు కుంటూ ఆవిడని క్షమించమని నవ్వుతోనే కోరడం ఘోరమైన ప్రారంభం. తర్వాత జబ్బు చేసిన చిన్న పిల్లాడు కీచుమని అరిస్తే కిటికీ అద్దాలు బద్దలయిపోవడం, టీచర్ కళ్ల ద్దాలు ముక్కలై పోవడం, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే మళ్లీ అక్కడ కీచుమని అరిస్తే అద్దాల సీసాలు బద్దలై అందు లోని పసిపిల్లల పిండాలన్నీ స్లోమోషన్లో కారిపోవడం అంతా కడుపులో తిప్పుతుంది. ఇలా సినిమా ముగిసే సరికి అందరూ మౌనంగా అయిపోయారు. చివర్లో అందరం గుంటర్ గ్రాస్‌కి సెలైంట్ షేక్హేండ్లిచ్చి బయటపడ్డాం. చాలా కాలం ఆ ఇమేజెస్ తగులుకుని వెంటాడాయి. ఇదంతా అయిన పన్నెండూ పదమూ డేళ్లకి ఆ నవలకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈ లోగా జర్మన్ కల్చరల్ సెంటర్లో ఆయన పుస్తకాలు తెచ్చు కుని చదివాం. ఆయన గీసిన బొమ్మల ఆల్బమ్‌లు చూశాం. గ్రాస్‌కి కేరికేచర్ గీసి చూపించడం పిల్లచేష్టలని తెలిసి చాలా సిగ్గయింది. ఒక రోజు రచయిత పతంజలి వచ్చి ‘మైసెంచరీ’ పుస్తకం ఇచ్చి ఇదీ రాయడమంటే అన్నారు. చదివాక మాకూ అట్లాగే అనిపించింది. తర్వాత గ్రాస్ మీద వచ్చిన వివాదాలు చూసి ప్రాణం చివుక్కుమనింది. అయితేనేం, హిట్లరూ, డిక్టేటర్లూ, సవాలక్ష మంది పాల కులూ చస్తారు. గ్రాస్ రచన మిగిలిపోతుంది అది నిలిచిపోతుంది. మనకి దారి చూపుతుంది. (వ్యాసకర్త ప్రముఖ కార్టూనిస్టు, మొబైల్ : 7702841384) -
గొంతులేం ఖర్మ... చొక్కాలూ చించుకుంటాం...!
మరణశిక్ష పడిన ఖైదీ ఇంటర్వ్యూకి ఆమెకు అనుమతి ఎవరిచ్చారో మీకు తెలియ దన్నారు. మీకు తెలీకపోవడం ఆవిడ చేసిన నంబర్‌వన్ నేరమని తీర్పిచ్చారు. మీ ఇగ్నోరెన్స్ మీకే బ్లిస్ గానీ ఉడ్విన్కీ, మాలాంటి పాఠకులకీ ప్లస్ ఎలాగవుతుంది? గొల్లపూడి మారుతీరావు గారూ! నిర్భయ గురించి నిర్భీతిగా మీరు రాసింది చూశాం. భారతదేశం గొప్పదనీ, ఆదర్శ ప్రాయమైనదనీ ప్రపంచమం తటా చాటాలన్న మీ తపన మాకెంతో ఆనందంకలిగించిం ది. అచ్చు మాలాంటి అభిప్రా యాలే మీకూ ఉన్నందుకు ముచ్చటేసింది. పైగా మనది గొప్పదేశం కాదనీ ఏ వలసవాది కానీ తప్పుడు ప్రచారం చేస్తే వాడి గుడ్లు పీకి వాడి చేతుల్లోనే పెట్టాలనేంత కోపం మాతోపాటే మీగ్గూడా నూటా యాభై ఏడు శాతం ఉండ టంతో హండ్రెడ్ పర్సెంట్ ఏకీభవించేశాం.పైగా మీ నటనకే కాదు సాహిత్యంలో, సినీ చరిత్ర అధ్యయనంలో మీకున్న ప్రతిభను చూసి అప్రతిభులవుతున్నవాళ్లమే. సినిమా ఫీల్డ్‌లో కూడా చదువుకున్న వాళ్లుంటారా అని ముందుగా మిమ్మల్నీ, మీలాంటి మరి అతి కొద్ది మంది నీ చూసి విస్తుపోయాం. మీ కాలమ్ ఏ పత్రికలో వచ్చినా ముందుగా దాన్నే చదివి అభిమానులమయ్యాం. మనల్ని బానిసత్వంలో మగ్గించిన ఒక దుష్టదేశం లో పుట్టిన దెష్ట మహిళ తప్పుడు మాటలు ఎవ్వరూ ఎప్పుడూ వినరాదనీ, కనరాదనీ మీరనుకున్నట్టే మేము అనుకున్నాం. మీకూ మాకూ జమిలిగా గల దేశభక్తి అలాంటిది. ఎవడో ఒక రేపిస్టూ ప్లస్ ఇద్దరు లా రేపిస్టు లూ చెప్పిన ముష్టిమాటలు... సకల భారతీయ మగ పురుషుల అభిప్రాయాలు కాదనీ గొంతుచించుకుని అర వాలనుకున్నాం. కానీ ఖర్మ కొద్దీ మీరు కాలమ్ రాయక ముందే మీరు చూడని డాక్యుమెంటరీ చూశాం. మీరు లెక్క చేయని కొన్ని డైలీలూ, మేగజైన్లూ చదివాం. పైగా మీరు సినిమా ఫీల్డ్‌లో ఉన్నట్టుగా ఈ జర్నలిజంలో నల భై ఐదేళ్లుగా ఉన్నవాళ్లం. ‘నిర్భయ’ ముందూ, ఆ తర్వా తా మన దేశంలో ప్రతి రోజూ సెలవుల్లేకుండా ఎడ తెరపి లేకుండా జరుగుతున్న రేప్‌లూ, మర్డర్లను ఈ పాపిష్టి చేతుల్తోనే రాస్తున్నాం. అందుకే ఆ డాక్యుమెంటరీ చూసి నప్పుడు మీరు చెప్పిన మానవమృగం ముఖేష్‌సింగ్ ఒంటరివాడు కాదనిపించింది. అతని డిఫెన్స్ లాయర్లి ద్దరూ కూడా బొత్తిగా ఒంటరివాళ్లు కానేకాదనిపించింది. ఆడదాని తిక్క కుదర్చడానికి గ్యాంగ్‌రేప్ శిక్షలు సాధికా రికంగా విధించే వందలు, వేల ఖాప్ పంచాయతీలు గుర్తొచ్చాయి. పెదరాయుళ్లు చినరాయుళ్లూ కలిసి ఆడ దాని ప్లేస్ ఎక్కడో చెప్పే ప్రబోధాలు వినిపించాయి. మగమహారాజులు లాగి తంతేనే జన్మధన్యమైనట్టుగా థ్రిల్లయి ‘అబ్బనీ తీయనీ దెబ్బ’ అని పాడే బంగారు కోడిపెట్టలు కెవ్వున కేకేస్తూంటే, అది జాతినుద్దేశించిన సందేశంలా చక్కగా, సిగ్గు లేకుండా 70 ఎం.ఎం స్క్రీన్ మీద పరచుకుంటుంటే తమరి ధర్మాగ్రహం, సత్యా గ్రహం యాడబోయాయి. ‘ఈమెనే సర్వదావాడం డి’ అంటూ బోర్డుపెట్టి అసభ్యంగా చూపిన పచ్చి ఫ్యూడల్ దురహంకారాన్ని, పిచ్చి మేల్ షావనిస్టు పిగ్గరీ ని ఇంత కాలం మౌనంగా చూసిన, చేసిన మీకు ఇంత లోనే అంత కోపమెందుకో! పైగా ఆ సింగూ, ఈ సింగూ మరొకడూ తప్ప దేశమంతటా పురుగులెవరూ లేరనీ అంతా మహాపురుషులేనననీ మీరు జరిపించిన అఖిల భారత సర్వేలో తేలిందంటున్నారు. అది నిఖార్సైన, పదహారణాల పచ్చి అబద్ధం. అందుకే, ఈస్టిండియా కంపెనీ పెట్టిన ఆ దేశంలో పుట్టిన దెష్ట మహిళ చెప్పిందే నిజం, చూపిందే సత్యం అని జావేద్ అఖ్తరూ, షబనా అజ్మీ, బృందాకారత్, ఎన్.రామ్, నేనూ మావాళ్లూ ఇంకా అనేక మంది బుర్రా బుద్ధీ లేని మూర్ఖులం అందరం కూడబలుక్కుని గొంతులు చించుకుందామనుకున్నాం. అవసరమైతే చొక్కాలూ, గుండీలూ చించుకోవాలనీ, గుండెలు బాదుకోవాలని కూడా నిశ్చయించుకున్నాం. ఈ రేపిస్టులూ, వారిష్టులూ అయిన లాయర్ల మాటలు ప్రపంచంలో మన పవిత్ర భారతదేశం పరువు తీస్తున్నా యని మీరు బెంగపడడం బ్లాక్ అండ్ వైట్ అచ్చులో కనిపించింది. మీ ముక్కుల్లోంచీ, చెవుల్లోంచీ ఆగ్రహం పొగలుమియడం మల్టీకలర్లో చూశాం. మన పరువు కొత్తగా పోయేదేం లేదు. మన దేశం లో వరకట్న దహనాల్లో కాలి చచ్చిన అమ్మాయిల లిస్టు మన పత్రికల్లోనే కాదు, ఐరాసలో కూడా ఉంది. యాసిడ్ దాడుల్లో ముక్కులూ మొహాలూ కరిగిపోయిన అంద గత్తెల లెక్కలూ ఉన్నాయి. రోజువారీ రేప్‌లూ, హత్యల జాబితాలూ దొరుకుతాయి. ఇది మనందరం ఎంతో శ్రమించి ప్రేమించి కట్టుకున్న దుర్మార్గపు సమాజం. ఇందులో అంతర్భాగంగా ఉన్న ‘స్ట్రక్చరల్ వయొలెన్స్’ ఇదెవ్వరూ చూడకూడదనీ ఎవ్వరికీ కనిపించకూడదని మీ కాళ్లూ చేతులతో కప్పెట్టినా, చివరికి మీ నొటోరియస్ డబుల్ చిన్ అడ్డం వేసినా ఆగేది కాదు. ప్రపంచపుటద్దం ఉంది. ఎదురుగా మన దేశం మొహముంది. ‘ఇండియాస్ డాటర్’అని శ్వేతజాతి మహిళ ఉడ్విన్ డాక్యుఫిలిం తీయడమంటే మనల్ని భ్రష్టుపట్టించడానికే ననుకుందాం. మరి ‘గాంధీ’ సినిమా తెల్లతోలువాడైన అటెంబరో తీసినప్పుడు తమకు కోపమెందుకు రాలేదో. బ్రిటన్‌లో రేప్‌లు లేవని ఆవిడేం అనలేదు. పైగా ‘నేను రేప్విక్టమ్’నని చెప్పింది. ఆమెకి బ్రిటన్ మీద ప్రేమా లేదు ఇండియా మీద ద్వేషమూ లేదు. జర్నలిస్టు, ఆర్టిస్టు అంతే. ఇంతకాలం జర్నలిజంలో ఉన్నందుకు ఆ విదేశీ దెష్ట మహిళ చెప్పిన తప్పుడు మాటల్లాంటి వాటితో ఒక న్యూస్ స్టోరీ రాయగలిగి ఉంటే జన్మధన్యమై నట్టే ఫీలవుతాం. అలాంటి డాక్యుమెంటరీ చేయగలిగుంటే గొప్ప కర్తవ్యం ముగించి నట్టు సంతృప్తి పొందేవాళ్లం. ఇక ఉడ్విన్ నేరాలూ ఘోరాలను మీరు ఏకరువు పెట్టిన తీరు భలే ఫన్నీగా ఉంది. మరణశిక్ష పడిన ఖైదీ ఇంటర్వ్యూకు అను మతి ఎవరిచ్చారో మీకు తెలియదన్నారు. మీకు తెలీకపోవడం ఆవిడ చేసిన నంబర్ వన్ నేరమని ఢంకా బజాయించారు. మీ ఇగ్నోరెన్స్ మీకే బ్లిస్ గానీ ఉడ్విన్కీ, మాలాంటి పాఠకులకీ ప్లస్ ఎలాగవుతుంది. కాలమ్ రాసే ముందు కనీసం మూడు నాలుగు రోజులనాటి న్యూస్ పేపర్లూ తిరగేస్తే పోయేదే ముంది. నిర్భయ పేరునీ, ఫొటోనీ ప్రకటించిందట అంటూ టకారంతములేల. ఇంటర్నేషనల్ రిలీజ్లో అలా చేసుకోవచ్చని ఆమె అమ్మా, నాన్నలే అనుమతినిచ్చారు. ఈ పుకార్ల శృతపాండిత్యమెందుకు? డాక్యుమెంటరీని అధికారులకి చూపి సమ్మతిని తీసుకోలేదని మీకెలా తెలిసింది? అడుగడుగునా సకల అనుమతులూ తీసు కుందావిడ. కావాలంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపి స్తాం. ‘హిందూ’ పత్రిక ఎన్.రామ్‌ను అడిగితే సకల పత్రాలూ, సాక్ష్యాలూ చూపిస్తాడు. మరి ముఖేష్‌తో40 వేలకు బేరం కుదిరిందని తేలిన మీ ఇన్వెస్టిగేటివ్ రిపో ర్టింగ్కు ఆధారంగా ఓ చిత్తుకాయితం ముక్కయినా చూపించగలరా? పురపురా రాసేయడం కాదు. కాస్తంత వెనకా ముందూ చూసుకోవాలి. నరాలు ఉప్పొంగినప్పు డు నిజాలెందుకొస్తాయి. అవి టపామని తెగినప్పుడు రీజన్ చస్తుంది. ప్యూర్ ఫిక్షన్ వస్తుంది. ఆవిడ డబ్బు చేసుకోడానికే ఇంతటి పాతకానికి ఒడిగట్టిందంటు న్నారు. లక్షా ఇరవైవేల పౌండ్లు అప్పులో పడి మరీ ఎన్.డి.టి.వి.కి ఉచితంగా పైసా తీసుకోకుండా ప్రసారానికిచ్చింది! అన్నట్టు మీకు తెలుగుసరిగ్గా రాదని కొన్ని ఇంగ్లీషు పదాలు రాశారు. మేమందరం అంతే. అచ్చు మీలాగే బ్రిటీష్ బానిసలుగా పుట్టాం. అయినా ఒక సృజనాత్మక జర్నలిస్టును ‘షటప్’ అన్నా సరే మిమ్మల్ని మెకాలే వింగ్లిష్‌లో ‘గెటౌట్’ అనలేం. కారణం మీకున్న సమా చారం, నాలెడ్జి తెలుసు. ఇంత తెలిసివుండీ ఈ గుణమేం టోననుకుంటాం. ఇలాంటి బోలు వాదనలు చేసినా, మూర్ఖపు రాతలు రాసినా గౌరవం చావట్లేదు. కనికరమే గాని కసి కలుగుట లేదు. ఎడ్మిరేషన్తో... (అప్పుడు మీ నవలకి ముఖచిత్రం గీసిచ్చి, మీ ముచ్చట చూసి సరదా పడ్డ వెర్రి ఆర్టిస్టును, జర్నలిస్టును) - వ్యాసకర్త ప్రముఖ కార్టూనిస్టు మొబైల్ : 7702841384 - మోహన్ -
కార్టూనిస్ట్ మోహన్‌కు పతంజలి స్ఫూర్తి అవార్డు
విజయనగరం: ప్రముఖ వ్యంగ్య రచయిత, కార్టూనిస్టు మోహన్‌కు దివంగత జర్నలిస్టు, సంపాదకులు కె.ఎన్.వై.పతంజలి స్ఫూర్తి అవార్డును అందజేయనున్నట్టు పతంజలి సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి తెలిపారు. శనివారం విజయన గరంలోని గురజాడ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పతంజలి జయంతి రోజైన మార్చి 29న మోహన్‌కు ఈ అవార్డు అందజేయనున్నట్టు తెలిపారు. మార్చి 11, 29 తేదీల్లో కె.ఎన్.వై.పతంజలి వర్ధంతి, జయంతి సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 11న సభకు ఎన్.వేణుగోపాల్ ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు. -
కారు ఇంజన్ తో హెలికాప్టర్
తిరువళ్లూరు: తిరువళ్లూరు మున్సిపాలిటీ పరిధిలోని ఎంజీఆర్ నగర్ ప్రాంతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ తయారు చేస్తున్న హెలికాప్టర్ కలకలం రేపింది. తిరువళ్లూరు మున్సిపాలి టీ పరిధిలోని ఎంజీఆర్ నగర్‌కు చెందిన మోహన్ జయా ఇంజనీరింగ్ కళాశాలలోని ఏరోనాటికల్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. ఏరోనాటికల్ విభాగంలో చదివే విద్యార్థులకు నాలుగో సంవత్సరంలో విమానం, హెలికాప్టర్ పనితీరును నేరుగా తెలుసుకోవాల్సి ఉంది. ఇందు లో భాగంగా జయా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు ఉపయోపడే విధం గా హెలికాప్టర్‌ను తయారు చేయాలని నిర్ణయించిన కళాశాల యాజమాన్యం నిర్ణయించింది. అయితే అప్పటికే హెలికాప్టర్ తయారీలో ఆసక్తి వున్న మోహన్‌కు బాధ్యతలు అప్పగించారు. దీంతో మోహన్ హెలికాప్టర్ తయారీ పనులను ఇంటి వెనుక భాగంలో రెండు వారాల నుంచి కొనసాగిస్తున్నారు. అయితే శనివారం సాయంత్రం రెక్కలు అమర్చే పని వుండడంతో హెలికాప్టర్‌ను వీధిలోకి తెచ్చి పనులను నిర్వహించడం ప్రారంభించారు. హెలికాప్టర్ వీధిలోకి రావడంతో ఆశ్చర్యపోయిన స్థానికులు తిరువళ్లూరు టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు వర్గాలూ కలవరపాటుకు గురయ్యూరు. విషయం తెలుసుకున్న టౌన్ ఇన్స్పెక్టర్ పొన్రాజ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే మోహన్ తయారు చేస్తున్న హెలికాప్టర్‌కు ఎగిరే సామర్థ్యం లేదని, కేవలం ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధన కోసమే తయారు చేస్తున్నారని తెలియడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసమే తాము హెలికాప్టర్‌ను తయారు చేస్తున్నట్టు ప్రొఫెసర్ మోహన్ వివరించారు. తాము తయారు చేస్తున్న హెలికాప్టర్‌కు ఎగిరే సామర్థ్యం లేదని, తాము ఏరోనాటికల్ శాఖను అనుమతి కోరి నప్పడు సైతం ఇదే అంశాన్ని వారు గుర్తు చేశారని ఆయన వివరించారు. తాము తయారు చేసిన హెలికాప్టర్ పెట్రోల్‌తో నడుస్తుందని, కేవలం ఒక్కరు మాత్రమే ఇందులో ప్రయాణించే అవకాశం వుంటుందని వివరించారు. తాము తయారు చేస్తున్న హెలికాప్టర్ వలన ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ వుండదన్నారు. తమకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే హెలికాప్టర్‌ను తయారు చేస్తామని వివరించారు. ప్రస్తుతం తయారు చేసిన హెలికాప్టర్ కారు ఇంజన్‌తో పరుగెత్తుతుందని మోహన్ తెలిపారు. -
రేఖను దాటిపోదాం.. లక్ష్మణ్‌ను మరచిపోదాం
సందర్భం ఆర్.కె. లక్ష్మణ్ కామన్ మేన్ ఎప్పుడూ, ఎక్కడా మాట్లాడడు. అతన్తో మాట్లాడిస్తే పోలా అనిపించింది. ‘చిన్నవాడు సూపర్ మేన్‌ని పలకరించమంటున్నాడు మీ వాణ్ణి సమాధానం చెప్పమనండి’ అని పెన్ చేతికిచ్చాను. ‘ద సూపర్ మేన్ ఈజ్ ఎ మేన్ ఆఫ్ యాక్షన్ హి నెవర్ స్పీక్స్’ అని రాసి సంతకం పెట్టాడు. మర్నాడు ‘ఉదయం’లో ఇంటర్వ్యూతో సహా ఆ కార్టూన్ హిట్. 1960వ దశకం మధ్యలో ఈ సంతకం న్యూస్‌ప్రింట్ వాసనతో సహా చేతివేళ్లని తడిమింది. పైన కార్టూన్ గీతలకి గుడ్లప్పగించి కేప్షన్ చదవ్వాయ్ అంది. చిన్నగా నవ్వవాయ్ అని చెప్పలేదు. కానీ పెద్దగానే నవ్వించింది. మెల్లగా ఆ ఇండియన్ ఇంక్ గీతల నల్ల మందు మరిగాం. ఆ మత్తు ఈ రోజుకీ దిగలేదు. అప్పుడు ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీలో క్లాసులు అవగానే కాళ్లని క్యాంటీన్ వేపు కాకుండా లైబ్రరీకి నడి పించినవి ఈ నల్ల మత్తు గీతలే. ఇంటికొచ్చే ‘శంకర్స్ వీక్లీ’లో శంకర్, అబూ అబ్రహాం, బి.వి. విజయన్, కుట్టీ, ప్రకాష్ ఉన్ని ఇంకా ఎంతో మందివి రకరకాల స్టైల్స్ చూసినా ఆర్.కె.లక్ష్మణ్ గీత మరోరకంగా ఉండేది. అప్పుడు తెలుగులో ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, జ్యోతి మంత్లీలో బాపూ కార్టూన్లు, ఇలస్ట్రేషన్లూ రాజ్యమే లేవి. బొమ్మలేసే సరదావల్ల ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్లన్నీ అదే పనిగా చూడ్డం దారి వెతుక్కోవడం మామూలే. ఇప్పుడు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో పెద్ద పొలిటి కల్ కార్టూన్, ‘యు సెడ్ ఇట్’ పేరుతో ప్యాకెట్ కార్టూన్ వచ్చేవి. ఇందులో బట్టతలా, కళ్లజోడూ, గళ్లకోటూ పంచే, చేతిలో గొడుగుతో ‘కామన్ మేన్’ ఉండేవాడు. ఇం ట్లో భార్యతో వాదనల దగ్గర్నుంచి సంచితో కూరగా యల బజారుకు పోవడం, మర్నాడు అమాంతంగా మం త్రివర్గ సమావేశంలోకి తొంగిచూడ్డం, అంతలోనే ఊరే గింపులు చెదరగొట్టే పోలీసుల లాఠీచార్జీలూ ప్రత్యక్షం కావడం, ఇలా సర్వాంతర్యామిగా ఉండేవాడు. ఈ సామాన్యుడు తన ఇంటి గొడవల కిటికీలోంచి దేశ రాజ కీయాల్ని చూసి, రకరకాలుగా విస్తుపోడం షాక్ తినడం, బెంగపడ్డం చూపించాడాయన. నాలుగు దశాబ్దాలపైనే ప్రపంచాన్ని చూసి, మనకు చూపించిన ఈ సామాన్యుడి విగ్రహాన్ని మన దేశంలో రాష్ట్రపతి ఆవిష్కరించడం అపురూపమైన గౌరవమే. అలాగే మెగసెసె అవార్డు అందుకున్న ఏకైక భారతీయ కార్టూనిస్టూ ఈయనే. 60వ దశకంలో కుష్వంత్‌సింగ్ ఎడిటర్‌గా ఉన్నప్పుడు ‘ఇలస్ట్రేటెడ్ వీక్లీ’లో ఈయన కలర్ క్యారికేచర్లు వచ్చేవి. ‘నేనెన్నడూ కలవని స్టార్స్’ లాంటి పేరుతో సినీ తారలు, అశోక్ కుమార్, దేవానంద్, ఎస్డీ బర్మన్, మధుబాల ఇంకా ఎంతో మంది బొ మ్మలు వింతగా ఉండేవి. మ్యాగ జైన్ కవర్ మీద కూడా గొడ్డలి పట్టు కున్న జియావుల్ హక్ బొమ్మ మిలి టరీ యూనిఫామ్‌లో, మెడల్స్‌తో సహా పంచరంగుల్లో భయపెట్టేది. లోపల మేరియో మిరాండా తన సొంత స్టైల్‌తో గోవా, బొంబాయి, వీధులూ, భవంతులూ, పిల్ల లూ, పిల్లులూ, కుక్కలూ, ఆడామగా అందాల విచ్ క్రాఫ్ట్ అదరగొట్టేది. 70వ దశకంలో టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ వాళ్లే ‘సైన్స్ టుడే’ మ్యాగజైన్ తెచ్చారు. అందులో ఓ పేజీనిండా లక్ష్మణ్ కార్టూన్లుండేవి. సైంటిస్టులూ, వాళ్ల లేబొరేటరీ, గినీ పిగ్స్ అన్నిటినీ అమాయకంగా చూస్తున్నట్టే వెటకారాలుండేవి. ఒక సైంటిస్టు జుట్టంతా పీక్కుంటూ బావురుమంటుంటాడు. కిటికీలోని తెల్ల ఎలుక, తోటి ఎలుకతో చెప్తుంటుంది. ‘పదేళ్లుగా నా మీద ప్రయోగాలు చేస్తున్నాడు. చివర్లో నేను కుడి నుండి ఎడ మకు నడిస్తే ఎక్స్పరిమెంట్ సక్సెస్. ఆ సంగతి తెలిసే నేను ఎడమ నుండి కుడికి నడిచా’ ఇలాటివి ఎన్నో. 70వ దశకంలో జర్నలిజంలో చేరా. కొన్ని కార్టూన్లు కూడా గీసీ 80ల్లో హైదరాబాద్ వచ్చాక ఆయన్ని మొద టిసారి కలవడమైంది. హిమాయత్‌నగర్‌లో ఆయన బం ధువులో ఫ్రెండ్సో ఉన్నారు. ఎప్పుడూ వచ్చిపోయే వాడు. నేనో కార్టూన్ రిడిల్ పట్టుకెళ్లా. ఆయన కామన్ మేన్ ఎప్పుడూ, ఎక్కడా మాట్లాడడు. అతన్తో మాట్లా డిస్తే పోలా అనిపించింది. నా బొమ్మలూ లక్ష్మణ్ కామన్ మేన్ సూపర్ మేన్ లాగా అరవై అడుగుల పొడుగున్నట్టు పాదాలూ, గొడుగు మాత్రమే కనిపిస్తుంటా యి. ‘ఉదయం’ పత్రికలో నా కామ న్ మేన్ ఆ గొడుగు చువ్వ చివర లాగుతూ పలకరించమని అరుస్తుం టాడు. లక్ష్మణ్ దాన్ని చూసి ‘గుడ్ ఏం చేయాలని’ అడిగాడు. ‘చిన్నవా డు సూపర్ మేన్‌ని పలకరించమంటున్నాడు మీ వాణ్ణి సమాధానం చెప్పమనండి’ అని పెన్ చేతికిచ్చా ను. ఒక్కక్షణం ఆలోచించి ‘ద సూప ర్ మేన్ ఈజ్ ఎ మేన్ ఆఫ్ యాక్షన్ హి నెవర్ స్పీక్స్’ అని రాసి సంతకం పెట్టాడు. మర్నాడు ‘ఉదయం’లో ఇంటర్వ్యూతో సహా ఆ కార్టూన్ హిట్. అలా ఆయన్ని హైదరాబాద్‌లో, బెంగళూరులో చాలాసా ర్లు కలిశాం. లక్ష్మణ్ కార్టూన్ల గురించీ, ఆయనతో మా గుంపు అనుభవాల గురించీ ఎంతేనా ఎన్నైనా చెప్పుకో వచ్చు. శంకర్స్ వీక్లీ, తర్వాత ఈయనా, మరెంత మందో 70వ దశకం వరకూ తెచ్చిన సాంప్రదాయం ఎందుకో ముందుకు పోవడం లేదు. వెనక్కిపోతోంది కూడా. ఫలా నా బ్రాండ్ హ్యూమర్ కోసం పొద్దుటే ఆత్రంగా పేపర్ లాక్కుని చూసే పరిస్థితే లేదు. రాజకీయ పార్టీలూ, కార్పొరేట్ కంపెనీలూ ఎడ్వర్టైజింగ్ అన్నీ కలిసి జర్నలి జంలో కాళ్లూ, వేళ్లూ, ఒళ్లూ మొత్తం దూర్చేస్తున్నాయి. సొంత అభిప్రాయం, సొంత వ్యాఖ్యానం అంటే కత్తులు దూసే అసహనం కట్టలు తెంచుకుంటోంది. లక్ష్మణ్ తరం వెళ్లిపోయింది. ఈ తరానికి ఆ సంగతి తెలియా ల్సిన అవసరం లేదు. ఇదే జర్నలిజమనీ, ఇదే కార్టూనిం గ్ అనీ, మనమేం చేస్తే అది ఘనకార్యమనీ జబ్బలు చరు చుకుందాం. కన్వీనియంట్‌గా లక్ష్మణ్‌ని మరిచిపోదాం. లేకపోతే చాలా ఇన్‌కన్వీనియన్స్. (వ్యాసకర్త ప్రముఖ కార్టూనిస్టు) మొబైల్: 7702841384 -
అందరికీ నచ్చేలా...
మైనా, మోహన్, నరేశ్, లావణ్య, శరత్ ముఖ్య తారలుగా మోహన్‌నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్కడితో’. ‘మొదలైంది’ ఉపశీర్షిక. మొగిలి నాగేశ్వరరావు దర్శకుడు. ఈ చిత్రవిశేషాలను హీరో మోహన్ చెబుతూ - ‘‘అనుకున్న విధంగా ఈ చిత్రం వచ్చింది, అందరికీ నచ్చే విధంగా దర్శకుడు తెరకెక్కించారు. సుమన్ పాత్ర శక్తివంతంగా ఉంటుంది. ధనరాజ్ కామెడీ ఈ చిత్రానికి హైలైట్’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే: నవీన్‌రాజ్, సంగీతం: బోలె, కెమెరా: శ్యాంప్రసాద్. -
సమ్మోహనుడు
కార్టూనిస్ట్, ఇలస్ట్రేటర్, పెయింటర్, యానిమేటర్, పత్రికా రచయిత... మోహన్ పక్కన ఇవన్నీ పెట్టకపోయినా పర్వాలేదు. మోహన్ అంటే చాలు. ఆ పేరే ఒక ఉనికి. అస్తిత్వం. కర్మాగారం. పొలిటికల్ కార్టూనిస్ట్‌గా మోహన్ తెలుగు పత్రికా రంగంలో చూపిన ప్రభావం, ఆ ప్రభావంతో తయారైన కొత్త తరం అందరికీ తెలుసు. తెలుగుగడ్డ ఉద్యమాల పురిటిగడ్డగా ఎదగడానికి మోహన్ గీత గోడగోడపై ఎలా మండిందో, నిప్పులు ఎలా ఎగచిమ్మిందో అందరికీ తెలుసు. మోహన్ రేఖ జాతీయస్థాయి కార్టూనిస్టుల పక్కన కాలరెత్తుకొని నిలబడి తెలుగువాడి దమ్మును ఎలా నిరూపించిందో కూడా తెలుసు. కాని నిజంగా మోహన్ గురించి ఎందరికి తెలుసు? పాలపిట్ట పత్రిక తెలియచేసే ప్రయత్నం చేసింది. మోహన్‌పై విశేష సంచిక వెలువరించింది. మోహన్‌తో కాకుమాను శ్రీనివాసరావు చేసిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూ, శివాజీ, మృత్యుంజయ్, పాండు, అన్వర్, తైదల అంజయ్య, గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, చందు సుబ్బారావు, జావేద్ తదితరులు రాసిన వ్యాసాలు, మోహన్ బొమ్మలు... అన్నింటితో పేజీ పేజీన ఉత్సవ సౌరభం. తెలుగు నేలపై ఉద్యమరేఖా వికాసం, కార్టూన్ వికాసం, అందుకై మోహన్ తొలచిన దారి తెలియాలంటే ఈ సంచిక తప్పనిసరిగా చూడాలి. వెల: రూ.30; ప్రతులకు: 040 - 27678430 విశేష సంచిక -
పూర్తిగా అమెరికాలో...
హర్ష, మోహన్, శిరీష్, క్రిస్టిన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘రెండు రెళ్లు నాలుగే’. ధర్మ దోనేపూడి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. పూర్తిగా అమెరికాలోనే చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్ర కథకు కొన్ని నిజజీవిత సంఘటనలే ఆధారమనీ, పాటలకు మంచి స్పందన లభిస్తోందనీ, త్వరలోనే ప్లాటినమ్ డిస్క్ వేడుక జరుపుతామనీ దర్శక, నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీకాంత్ దేవరాజన్, కెమెరా: శ్రీకాంత్ బుజమెళ్ల. -
ఆకట్టుకునే కథతో...
యువతను అలరించే అంశాలతో రూపొందుతోన్న చిత్రం ‘ఒక్కడితో...’. దీనికి ఉపశీర్షిక ‘మొదలైంది’. మోహన్, మైనా, నరేశ్, లావణ్య, శరత్, అనూష ప్రధాన తారాగణం. ధన్‌రాజ్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. మొగిలి నాగేశ్వరరావు దర్శకత్వంలో బైలుపాటి మోహన్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బి. మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో మోహన్ మాట్లాడుతూ -‘‘వరంగల్ పరిసరాల్లో తొలి షెడ్యూలు చేశాం. సినిమా చాలా బాగా వస్తోంది. ధన్‌రాజ్ పాత్ర కొత్తగా ఉంటుంది. కథాకథనాలు, బోలే సంగీతం ఆకట్టుకుంటాయి’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే: నవీన్‌రాజ్. -
వెస్టిండీస్ క్రికెట్ జట్టు పై మండిపడ్డ బి.మోహన్
-
సరికొత్త కథనంతో...
‘‘మా చిత్రకథ రొటీన్‌గా ఉంటుంది. కానీ, కథనం మాత్రం చాలా కొత్తగా ఉంటుంది’’ అని నరేన్ చాలా నిజాయతీగా చెబుతున్నారు. ఆయనను దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీ సాయిరత్న ఆర్ట్స్ సమర్పణలో అభినవ ఆర్ట్ ఫిలింస్ పతాకంపై ఓబులమ్మ నిర్మిస్తున్న చిత్రం పూజ కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. టైటిల్ ఖరారు కాని ఈ చిత్రంలో హీరోను ఎంపిక చేయాల్సి ఉంది. హీరోయిన్గా ముంబయ్‌కి చెందిన మోడల్ అర్షిఖాన్ని తీసుకున్నారు. మోహన్, చిన్ని సతీష్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. చిత్రవిశేషాలను నరేన్ తెలియజేస్తూ -‘‘దర్శకత్వం, ప్రొడక్షన్ శాఖలో నాకు సుదీర్ఘ అనుభవం ఉంది. ఆ అనుభవంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాను. ఈ నెలాఖరున షూటింగ్ ప్రారంభించి, సింగిల్ షెడ్యూల్లో టాకీ పూర్తి చేస్తాం’’ అని చెప్పారు. -
పచ్చని పల్లెల్లో పచ్చ మంటలు
పెద్దకడబూరు : పచ్చని పల్లెల్లో పచ్చ నాయకులు మంటలను ఎగదోస్తున్నారు. అధికారం చాటున తెలుగుదేశం నాయకులు ఆగడాలకు తెరతీస్తున్నారు. గ్రామాల్లో కొత్త వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు. సాఫీగా సాగుతున్న మధ్యాహ్న భోజనం పథకంలో జోక్యం చేసుకుంటూ,, అధికారులకు తలనొప్పిగా మారుతున్నారు. దేవాలయాల్లాంటి బడుల్లో రాజకీయాలు నెరుపుతున్నారు. పెద్దకడబూరు మండలం ముచ్చగిరి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పదేళ్లుగా పొదుపు గ్రూపు మహిళ వంట ఏజెన్సీ నిర్వహిస్తోంది. ఎలాంటి ఆరోపణలు లేకున్నా ఆ ఏజెన్సీని మార్చాలని తెలుగు తమ్ముళ్లు ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓలపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే వారు ససేమిరా అంటున్నారు. అనుమతి ఉన్న ఏజెన్సీకే రేషన్, బిల్లులు ఇస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని టీడీపీ నాయకులకు సూచిస్తున్నారు. వీరి మాటలను లెక్కచేయకుండా మరో మహిళను రెచ్చగొట్టి, మధ్యాహ్న భోజనం వండించి, పిల్లలకు వడ్డిస్తున్నారు. విద్యార్థులు ఎవరి వద్దకు వెళ్లి అన్నం పెట్టించుకోవాలో తెలియక తికమక పడుతున్నారు. అనుమతి లేకుండా వంట చేయవద్దని ఆ మహిళకు ప్రధానోపాధ్యాయుడు రామ్మోహన్ సూచిస్తే.. ‘మా నాయకులు చెప్పారని, వారు చెప్పినట్లు చేస్తున్నానని’ ఆమె ఎదురు సమాధానం చెబుతోంది. రేషన్ దుకాణంలోకి వెళ్లి దౌర్జన్యంగా రేషన్ కూడా తెచ్చుకున్నట్లు సమాచారం. ఈ వివాదాన్ని హెచ్ఎం బుధవారం సర్పంచ్, గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ అనుమతి ఉన్న ఏజెన్సీ మహిళే వంట చేయడం సమంజసమని వారు స్పష్టం చేశారు. కాగా.. ముచ్చగిరిలో కాక దొడ్డిమేకల పాఠశాలలోనూ ఇలాంటి వివాదమే తలెత్తినట్లు తమ దృష్టికి వచ్చిందని ఎంఈఓ జగదీశ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వ అనుమతి వచ్చే వరకు ఆగమని చెప్పినా వారు పట్టించుకోవడం లేదన్నారు. అయితే ఇప్పటిదాకా ప్రభుత్వ అనుమతి ఉన్న ఏజెన్సీకే బిల్లులు మంజూరు చేస్తామన్నారు.