హాలీవుడ్‌ స్థాయిలో ఉందంటున్నారు | Sanjeevani Movie Success Meet | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌ స్థాయిలో ఉందంటున్నారు

Jul 6 2018 1:52 AM | Updated on Jul 6 2018 1:52 AM

Sanjeevani Movie Success Meet - Sakshi

రవి వీడే, బాపిరాజు, అనురాగ్‌ దేవ్, మనోజ్‌ చంద్ర, శ్వేతావర్మ

మనోజ్‌ చంద్ర, అనురాగ్‌ దేవ్, శ్వేతా వర్మ, అమోఘ్‌ దేశపతి, మోహన్, నితిన్‌నాశ్, తనూజ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘సంజీవని’. రవి వీడే దర్శకత్వంలో జి.నివాస్‌ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ నిర్వహించారు. దర్శకుడు రవి వీడే మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకూ హాలీవుడ్‌ తెరపై మాత్రమే కనిపించిన అబ్బురపరిచే దృశ్యాల్ని ఫస్ట్‌ టైమ్‌ తెలుగు సినిమాలో చూపించాం.

సినిమా చూసినవారంతా హాలీవుడ్‌ స్థాయిలో తీశారని అభినందిస్తుండటం సంతోషంగా ఉంది. 87 థియేటర్లలో విడుదలైన మా సినిమా ప్రస్తుతం 100కి పైగా థియేటర్లలో ఆడుతోంది. థియేటర్ల పెంపే మా విజయానికి నిదర్శనం. మా చిత్రం ఓపెనింగ్‌ ఎపిసోడ్‌ని ప్రేక్షకుల కోసం యూట్యూబ్‌లో రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను మా సినిమా అలరిస్తోంది. మూడు రోజుల్లో 1.25కోట్ల రూపాయలు వసూలు చేసింది. మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు నిర్మాత నివాస్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement