tanuja
-
అరకులో పాస్ పోర్ట్ ఆఫీస్ ప్రారంభించిన ఎంపీ తనూజ రాణి
-
అరకులో పాస్ పోర్ట్ ఆఫీస్ ప్రారంభించిన ఎంపీ తనూజ రాణి
-
శ్రీవారి సన్నిధిలో ఎంపీ తనుజా రాణి
-
చంద్రబాబుపై ఎంపీ తనూజ రాణి ఫైర్
-
రాష్ట్రపతి కలిసిన తరువాత ఎంపీ గుమ్మ తనూజ రాణి రియాక్షన్
-
నా గెలుపుకు కారణం జగనన్నే
-
ప్రచారంలో దూసుకుపోతున్న అరకు ఎంపీ అభ్యర్థి తనూజ రాణి
-
3 కాదు 30 పార్టీలు కలిసొచ్చిన సరే.. గెలిచేది జగనన్నే
-
Tanuja Chandra: చీకటి వెలుగుల దారుల్లో...
కథలు ఆకాశం నుంచి నేలకు దిగి రావు. ఈ నేలలో అనేక కథలు దాగున్నాయి. వాటి జాడలు వెదుక్కుంటూ వెళ్లడమే సృజనకారుల పని. బంధువులను వెదుక్కుంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని మారుమూల గ్రామాలకు వెళ్లిన రైటర్, డైరెక్టర్ తనూజ చంద్ర తనకు తెలియని ఎన్నో విషయాల గురించి తెలుసుకుంది. మహిళలు ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలపై డాక్యుమెంటరీలు తీయాలని నిర్ణయించుకుంది... తనూజ చంద్ర తల్లి కామ్నా చంద్ర రైటర్, సోదరుడు విక్రమ్ చంద్ర రైటర్, సోదరి అనుపమ చోప్రా ఫిల్మ్ క్రిటిక్. రెండు ముక్కల్లో చెప్పుకోవాలంటే ఇంటి నిండా సృజనాత్మక వాతావరణం కొలువై ఉండేది. టీవీ సిరీస్ జమీన్ ఆస్మాన్(1996)తో డైరెక్టర్‌గా వినోదరంగంలోకి అడుగుపెట్టింది తనూజ. మహేష్‌భట్ ‘జఖ్మ్’ సినిమాకు స్క్రీన్‌ప్లే రాసి మంచి పేరు తెచ్చుకుంది. సంజయ్ దత్, కాజోల్ జంటగా నటించిన ‘దుష్మన్’ సినిమాతో బాలీవుడ్లో డైరెక్టర్‌గా తొలి అడుగు వేసింది. ‘నేను కమర్షియల్ డైరెక్టర్ని మాత్రమే’ అనే ధోరణిలో కాకుండా మహిళల జీవితానికి సంబంధించిన సమస్త కోణాలను సినిమా, ఓటీటీ మాధ్యమాలపై ఆవిష్కరిస్తోంది తనూజ. ‘ఊహాల్లో నుంచి మహిళలకు సంబంధించిన కథలను అల్లడం కంటే వారి దగ్గరకు వెళ్లి మాట్లాడితే నిజమైన కథలు వస్తాయి’ అంటున్న తనూజ స్క్రిప్ట్ మేకింగ్ కోసం రైటింగ్ రూమ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఎంతోమంది మహిళలతో మాట్లాడింది. ఆ క్రమంలో తనకు ఏదైనా ఆలోచన వస్తే అది స్క్రిప్ట్‌గా రూపొందుతుంది. వెండితెరపై రాణిస్తున్న వారు షార్ట్ ఫిల్మ్స్‌పై పెద్దగా దృష్టి పెట్టరు. తనూజకు మాత్రం ఎలాంటి పట్టింపులు లేవు. పెద్ద డైరెక్టర్‌గా పేరు వచ్చిన తరువాత కూడా రొమాంటిక్ డ్రామా షార్ట్ ఫిల్మ్ ‘సిల్వత్’ తీసింది. ‘ఏ మాన్సూన్ డేట్’ అనే షార్ట్ ఫిల్మ్‌కు కూడా విశ్లేషకుల నుంచి ప్రశంసలు లభించాయి. అయిదు సంవత్సరాల క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లహ్ర అనే గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లింది తనూజ. అక్కడ తనకు ఇద్దరు మేనత్తలు ఉన్నారు. ఇద్దరూ భర్తను కోల్పోయి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఆంటీ రాధ సరదా మనిషి. శాంతస్వభావి. ఎంత పెద్ద కష్టానికైనా అడ్జస్టైపోతుంది. సుధా ఆంటీ మాత్రం రాధ ఆంటీకి పూర్తి భిన్నం. ఒకరకంగా చెప్పాలంటే ఫైర్‌బ్రాండ్. చాలా స్క్రిక్ట్. పర్ఫెక్షన్కు ప్రాధాన్యత ఇస్తుంది. ఎక్కడ తేడా వచ్చినా గొడవకు దిగుతుంది. ఒకరి వయసు 93. మరొకరి వయసు 83. వేరు వేరు ప్రపంచాలకు చెందిన ఇద్దరికీ తమ మనస్తత్వాల మూలంగా ఎప్పుడూ గొడవలు రాలేదు. వీరి జీవితాన్ని గురించి లోతుగా తెలుసుకున్న తరువాత ‘ఆంటీ సుధా ఆంటీ రాధ’కు శ్రీకారం చుట్టింది తనూజ. నలభై ఎనిమిది నిమిషాల ఈ డాక్యుమెంటరీలో హాయిగా నవ్వుకునే సన్నివేశాలే కాదు కంట తడి పెట్టించే సన్నివేశాలు కూడా ఉన్నాయి. ‘సాధారణ ప్రజలు అనే మాట వింటుంటాం. అయితే వారి జీవితాలలోకి తొంగి చూస్తే అసాధారణ సన్నివేశాలు, సాహసాలు కనిపిస్తాయి’ అంటున్న తనూజకు ఇది తొలి డాక్యుమెంటరీ ఫిల్మ్. కట్ చేస్తే... ‘వెడ్డింగ్.కాన్’ అనే సరికొత్త డాక్యుమెంటరీ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది తనూజ. పెళ్లి చేసుకుంటానని ఎంతోమంది మహిళలకు మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు కాజేశాడు ప్రజిత్. రకరకాల మారుపేర్లతో మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా మోసాలకు పాల్పడేవాడు. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, పశ్చిమబెంగాల్...మొదలైన రాష్ట్రాల్లో ఎంతోమంది మహిళలను మోసం చేశాడు. థానేలోని ధోకాలీ ప్రాంతానికి చెందిన ఒక బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో ప్రజిత్ మోసం వెలుగులోకి వచ్చింది. థానే పోలీసులు ప్రజిత్‌ను అరెస్ట్ చేశారు. ‘వెడ్డింగ్.కాన్’ డాక్యుమెంటరీ ప్రజిత్లాంటి ఎంతోమంది మోసగాళ్ల మోసాలకు అద్దం పడుతుంది. ‘మ్యాట్రిమోనియల్ మోసాల ద్వారా నష్టపోయిన మహిళలు ఎందరో ఉన్నారు. అయితే చాలామంది పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడానికి ఇష్టపడడం లేదు. దీనికి కారణం తాము తప్పు చేశాం అనే భావన. నలుగురు నవ్వుతారేమో అనుకోవడం. ఇది నన్ను చాలా బాధ పెట్టింది’ అంటుంది తనూజ చంద్ర. అయితే ‘వెడ్డింగ్.కాన్’ బాధిత మహిళలకు ధైర్యాన్ని ఇస్తుంది, న్యాయం కోసం పోరాటం చేసే స్ఫూర్తిని అందిస్తుంది అనడంలో సందేహం లేదు. గమనాన్ని మార్చింది బంధువులను వెదుక్కుంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని మారుమూల గ్రామాలకు వెళ్లినప్పుడు సాధారణ జీవితాల్లోని అసాధారణ దృశ్యాలు కనిపించాయి. ఎంతో మంది మహిళలతో మాట్లాడిన తరువాత...మహిళల గురించి ఓటీటీ మాధ్యమం ద్వారా సీరియస్‌గా చెప్పాల్సిన కథలు ఎన్నో ఉన్నాయి అనిపించింది. ఆంటీ సుధా ఆంటి రాధ నా గమనాన్ని మార్చింది అని చెప్పవచ్చు. – తనూజ చంద్ర, రైటర్, డైరెక్టర్ -
తల్లికి మర్చిపోలేని గిఫ్టిచ్చిన బాలీవుడ్ హీరోయిన్స్
బాలీవుడ్ హీరోయిన్స్ కాజోల్, తనీషా ముఖర్జీ తల్లి తనూజాకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. మహారాష్ట్ర ముంబైలోని లోనావాలో ఓ కొత్తింటిని బహుమతిగా ఇచ్చారు. విలాసవంతమైన ఈ ఇల్లు నిర్మాణం పూర్తవడానికి దాదాపు 8 నెలలు పట్టగా.. తాజాగా తల్లితో కలిసి గృహప్రవేశం చేశారిద్దరూ. తల్లీకూతుర్లు కలిసి రిబ్బన్ కట్ చేసి కొత్తింట్లోకి వెళ్లారు. కుడికాలుతో ఇంట్లో అడుగుపెట్టారు. ఈ వీడియోను తనీషా సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అది కాస్తా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు 'బంగారం లాంటి పిల్లలుంటే ఏదైనా సాధ్యమే', 'మీ బంధం కలకాలం ఇలాగే కొనసాగాలి', 'కొత్తింటి కల సాకారమైనందుకు శుభాకాంక్షలు' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా తనూజా- షోమూ ముఖర్జీల సంతానమే కాజోల్, తనీషా. ఇక కాజోల్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆమె సలాం వెంకీ సినిమాలో నటించింది. View this post on Instagram A post shared by Tanishaa Mukerji (@tanishaamukerji) చదవండి: ఆత్మహత్యకు చేసుకోవాలనుకున్న చలపతిరావు అన్నయ్య కంటే ముందే పెళ్లి చేసుకున్న చలపతిరావు, ఆయన లవ్ స్టోరీ.. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ తనూజ మృతి కేసులో కీలక సమాచారం వెలుగులోకి..
సాక్షి, విజయవాడ: తనూజ మృతి కేసులో విజయవాడ పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం తనూజపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని, యాక్సిడెంట్‌గా నిర్ధారించారు. తనూజను గుంటూరు నుంచి కుంచనపల్లి వద్ద ఆమె స్నేహితుడు దింపి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఆమె మృతికి.. స్నేహితుడికి ఎటువంటి సంబంధం లేదని పోలీసులు తేల్చారు. కుంచనపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగితే ఎవరైనా శిఖామణి సెంటర్‌కు తీసుకువచ్చారా.. లేదా శిఖామణి సెంటర్లో యాక్సిడెంట్ జరిగిందా, ఇక్కడకు ఎందుకు వచ్చింది అన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. కుంచనపల్లి వద్ద సీసీ పుటేజ్‌ను సేకరించారు. తనూజ పోస్టుమార్టం రిపోర్టులో బలమైన వాహనం వేగంగా గుద్దినట్లు తేలింది. శరీరంలో పలుచోట్ల, ఇంటర్నల్ గాయాలు, బ్లీడింగ్ కూడా అవుతున్నట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా, మృతురాలి కుటుంబ సభ్యులు తనూజ మృతిపై ఎవరిపైనా తమకు ఎలాంటి అనుమానం లేదని చెప్పినట్లు సమాచారం. చదవండి: (తనూజ కేసు: విజయవాడ ఎందుకు వచ్చింది..?) -
మిస్టరీగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ తనూజ కేసు: విజయవాడ ఎందుకు వచ్చింది..?
Guntur software Engineer: గుంటూరు ఏటీ అగ్రహారానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ తనూజ (30)మృతిపై దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఆమె విజయవాడ గుణదల ప్రాంతంలో మృతి చెందడంతో గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. వివరాల కోసం ఫొటోలను పోలీస్ వెబ్సైట్లో పెట్టారు. చనిపోయిన యువతి సాఫ్ట్వేర్ ఇంజినీర్ తనూజ అని గుంటూరు నగరంపాలెం పోలీసులు నిర్ధారించారు. గుంటూరు నుంచి విజయవాడ ఎందుకు వచ్చింది అనే కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె సెల్‌ఫోన్ ఆధారంగా వడ్డేశ్వరం, నులకపేట ప్రాంతాల్లో తిరిగినట్లు గుర్తించారు. గురువారం ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీ రహదారిలో ఓ యువకుడు ఆమెను ద్విచక్రవాహనంపై దించినట్లు గుర్తించారు. ఈనెల 18వ తేదీన ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. కేఎల్‌యూ రోడ్డులో దింపినట్లు చెప్పడం, తనూజ కూడా వడ్డేశ్వరం బకింగ్‌హామ్ కెనాల్ బ్రిడ్జి మీద నుంచి వడ్డేశ్వరంలోకి రావడం గుర్తించారు. చదవండి: (సాయితో సోనీ వివాహేతర సంబంధం.. చంపుతానని భర్త బెదిరించడంతో..) అనంతరం ఆ యువతి సెల్‌ఫోన్ టవర్ సిగ్నల్ నులకపేటలోని తహసీల్దార్ కార్యాలయం, మంగళగిరి ప్రకాశం బ్యారేజ్ మెయిన్రోడ్లో తిరిగినట్లు గుర్తించారు. మంగళగిరి ప్రకాశం బ్యారేజ్ రోడ్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో తనూజ ఆనవాళ్లు ఏమీ కనిపించలేదు. తనూజకు రోడ్డు ప్రమాదం జరిగితే ఎవరైనా ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయి ఉంటే మృతదేహాన్ని అక్కడ పడవేసి ఉంటారా అనే అనుమానాలతోపాటు అఘాయిత్యం చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదికలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు ఉందని విజయవాడ పోలీసులు చెబుతున్నారు. మృతురాలి తల్లిదండ్రులను విచారించినా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు ఎలాగైనా ఈ కేసును ఛేదించాలనే పట్టుదలతో 15 మంది సభ్యులతో ఐదు బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. చదవండి: (డ్యూటీకని చెప్పి.. జీతం తీసుకొని వెళ్లిపోయి.. ఫోన్ చేస్తే..) -
ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటి
సాక్షి, ముంబై : బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ తల్లి, సీనియర్ నటి తనూజా (75) ఆసుపత్రిలో చేరారు. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెను మంగళవారం రాత్రి ముంబైలోని లీలావతికి తరలించారు కుటుంబ సభ్యులు. నిన్నగాక మొన్న మావగారు వీరూ దేవగణ్‌ను కోల్పోయిన కాజోల్కు ఇపుడు తల్లి అనారోగ్యం మరింత బాధిస్తోంది. రెండురోజుల క్రితం (మే 27) బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగణ్ తండ్రి, సీనియర్ యాక్షన్ కొరియోగ్రాఫర్ వీరూ దేవగణ్ అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. కాగా జ్యుయల్ థీఫ్ నయీ రోషిణి, జీనేకా రా, హాథీ మేరి సాథీ లాంటి బాలీవుడ్ హిట్ సినిమాల్లో తనూజా హీరోయిన్గా నటించారు. -
ముద్దమందారం పార్వతి
పార్వతి ఓ పల్లెటూరి పేదింటి అమ్మాయి. కలవారింటి కోడలు అవుతుంది. పెద్దంటి కోడలిగా ఆ ఇంట్లో ఆమె ఎదుర్కొనే సంఘటనలతో ముద్దమందారం సీరియల్ జీ తెలుగులో ప్రసారమవుతోంది. ఈ సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పార్వతిగా పరిచయం అయ్యింది తనూజ. ఈ బెంగుళూరుమందారం తెలుగింటి సింగారంగా ఎలా మారిందో ముచ్చటగా చెప్పుకొచ్చింది తనూజ. ‘‘పార్వతిగా ఇది నా డ్రీమ్ క్యారెక్టర్. సీరియల్లోకి నేను రాకముందే ఒక పల్లెటూరి అమ్మాయిలాంటి క్యారెక్టర్ని చేయడం ఎంత బాగుంటుందో కదా అనుకునేదాన్ని. ఈ మాట మా అమ్మతో తరచూ చెబుతుండేదాన్ని. ‘ముద్దమందారం’లో పార్వతి స్టోరీ చెప్పినప్పుడు మొదట నాకు అంతగా అర్ధం కాలేదు. అప్పుడు నాకు తెలుగు రాదు. ఆఫర్ వచ్చింది కదా అని క్యాజువల్‌గా ఓకే చేశాను. నిజానికి అప్పటికి ఇండస్ట్రీ గురించే అంతగా ఐడియా లేదు. అంతా కొత్త. తర్వాత్తర్వాత యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక్కోటి నేర్చుకుంటూ, కథ తెలుసుకుంటూ, నటిస్తూ.. క్యారెక్టర్లో లీనమైపోయా. పార్వతిగా మారిపోయా. చాలా మంది ఎంతో గొప్పగా పొగుడుతుంటారు. సలహాలు ఇస్తుంటారు. ఇప్పుడు మరో సీరియల్ చేస్తే ‘పార్వతి’గా ఉన్నప్పటి ఫాలోవర్స్ తర్వాత ఉంటారా అని భయపడుతుంటాను. టీచర్ అవ్వమన్నారు నేను పుట్టి, పెరిగింది అంతా బెంగుళూరులోనే. ముందు మా ఇంట్లో వాళ్లెవరికీ నేనీ ఫీల్డ్‌లోకి రావడం ఇష్టం లేదు. వద్దు మనకీ యాక్టింగ్ అనేవారు అమ్మనాన్న. ‘చదువులో ముందుంటున్నావు. బాగా చదువుకో, టీచర్ లేదా లెక్చరర్ అవ్వు’ అనేవారు నాన్న. హాబీ కోసం డ్యాన్స్ నేర్చుకునే టైమ్‌లో ఉదయం టీవీలో యాంకర్‌గా చేశాను. ఆ సమయంలోనే కన్నడలో ఓ షార్ట్ హారర్ మూవీలో నటించాను. అది తెలుగులో ‘చిత్రం కాదు నిజం’గా డబ్ అయ్యింది. మంచి పేరొచ్చింది. అప్పుడే ఈ తెలుగు సీరియల్ ఆఫర్ వచ్చింది. క్యాజువల్‌గా వెళ్లి కలిస్తే సెలక్ట్ అయ్యాను. దీంతో ఇంట్లో వాళ్లను ఒప్పించి ఈ ఫీల్డ్కి వచ్చాను. షార్ట్‌ఫిల్మ్, ఈ సీరియల్ బాగా హిట్టవడంతో అమ్మానాన్నలు ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు. అప్పట్లో వాళ్లు భయపడినంతగా ఇక్కడ ఎలాంటి నెగిటివిటీ లేదు. నా పర్సనల్ ఫ్యామిలీకన్నా సీరియల్ ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఎక్కువ అయిపోయింది. సీరియల్ అయిపోతే ఇంత పెద్ద, మంచి ఫ్యామిలీని మిస్ అవుతాను కదా అనిపిస్తుంటుంది. ఈ ఇండస్ట్రీలోనే ఉండాలని వచ్చినదాన్ని కాదు. ఎలాగో వచ్చాను, నా టాలెంట్‌ను చూపించుకోవాలని కృషి చేస్తున్నాను. ఇప్పుడు మరో తమిళ ప్రాజెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఇదే నా బ్యూటిఫుల్ జర్నీ అనీ నమ్మి, వర్క్స్ చేసుకుంటూ వెళుతున్నాను. నాదైన ప్రపంచం మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ షూటింగ్‌కి కూడా రారు. ‘నీ ఓపికకు ఓ దండం తల్లీ’ అనేస్తారు. కారణం, ఉదయం ఏడు గంటలకు షూటింగ్ స్పాట్‌కి వెళితే తిరిగి ఎప్పుడు ఇల్లు చేరుకుంటానో నాకే తెలియదు. అలా ఉంటుంది వర్క్షెడ్యూల్. అయినా, ఇంకా వర్క్ కావాలి అనుకుంటున్నాను. బయటి ప్రపంచాన్ని మిస్ అవుతున్నాను అనే భావనే లేదు. నాదైన ఒక ప్రపంచం ఈ ఇండస్ట్రీలోనే ఉంది. పేరెంట్స్‌ని మిస్ అవుతున్నాను అని చెబితే చాలు... వాళ్లు బెంగుళూరు నుంచి వచ్చి ఓ రోజు టైమ్ స్పెండ్ చేసి వెళ్లిపోతారు. ‘మీరు ఈ రోజు సీరియల్లో కాస్త డల్‌గా అనిపించారు. ఎండ ఎక్కువ ఉంది, కేర్ తీసుకోండి’ అని నా ఫ్యాన్స్ చెబుతుంటారు. చాలా ఆనందంగా ఉంటుంది. మరో అదృష్టం ఏంటంటే ఎక్కడకు వెళ్లినా నన్ను అమ్మలా చూసుకునే వాళ్లు దొరుకుతారు. ఇప్పుడు హరిత(అఖిలాండేశ్వరి పాత్రగా నటిస్తున్న హరిత)మ్మ ‘ఇది తిను, కాసేపు రెస్ట్ తీసుకో’.. అని చెబుతుంటారు. డైరెక్టర్, కెమరామెన్.. ఇలా ప్రతి ఒక్కరూ నా గురించి కేర్ తీసుకుంటారు. ముగ్గురు లక్ష్ములు అమ్మానాన్నలకు ముగ్గురం ఆడపిల్లలం. అక్క అనూజ లాయర్, నేను యాక్టర్, చెల్లి పూజ ఇంజనీయర్. మా అమ్మ నాన్న ‘మా ముగ్గురు లక్ష్ములు’ అని గర్వంగా చెబుతుంటారు. మా అమ్మను ఎప్పుడైనా అడుగుతాం ‘ముగ్గురం ఆడపిల్లలమే కదా, మగ పిల్లలు పుడితే బాగుండు అనుకున్నారా!’ అని. అప్పుడు అమ్మ ‘నేను అమ్మాయిలు పుట్టాలనే మొదటి నుంచీ దేవుళ్లకు మొక్కుకున్నాను. మీరు అబ్బాయిలకన్నా ఎందులో తక్కువ’ అంటుంది. అప్పుడైతే చాలా గర్వంగా అనిపిస్తుంటుంది. నాకు కూడా ఫ్యూచర్లో ఆడపిల్లే పుట్టాలని కోరుకుంటాను మా అమ్మ లాగ. కొంచెం మోడ్రన్ ముందు నుంచీ కాస్ట్యూమ్స్ది నాదే బాధ్యత అన్నారు. అందుకే, నా క్యారెక్టర్ మొదట ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉండేలా జాగ్రత్తపడుతున్నాను. కాస్ట్యూమ్స్ విషయంలో మా మమ్మీకి థాంక్స్ చెప్పాలి. మా మమ్మీవి కొత్త కొత్త చీరలన్నీ వచ్చేటప్పుడు దొంగతనంగా తెచ్చేసుకుంటాను (నవ్వుతూ). అమ్మ ఫోన్‌చేస్తుంది ‘పెళ్లికి వెళ్లాలని తీసుకున్నాను, నువ్వు తీసుకెళ్లావా?’ అంటుంది. మా సీరియల్లో కూడా ఈ రోజు పెళ్లి ఉందని నవ్వేస్తాను. అమ్మ కూడా నవ్వేస్తుంది. మా చెల్లెలు పూజ నాకు కాస్ట్యూమ్ విషయంలో, హెయిర్ స్టైల్స్ విషయంలో సూచనలు ఇస్తూ ఉంటుంది. నాకు ఫ్యూచర్ ప్లాన్స్ అంటూ పెద్దగా ఏమీ లేవు. ఇక్కడ మంచి అవకాశాలు వస్తున్నాయి. వాటిలో మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడు పల్లెటూరి అమ్మాయిలా యాక్ట్ చేస్తున్నాను. నెక్ట్స్ సీరియల్లో కొంచెం మోడ్రన్ అమ్మాయిలా క్యారెక్టర్ వస్తే బాగుండు అనుకుంటున్నాను.’ – నిర్మలారెడ్డి -
హాలీవుడ్ స్థాయిలో ఉందంటున్నారు
మనోజ్ చంద్ర, అనురాగ్ దేవ్, శ్వేతా వర్మ, అమోఘ్ దేశపతి, మోహన్, నితిన్నాశ్, తనూజ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘సంజీవని’. రవి వీడే దర్శకత్వంలో జి.నివాస్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు. దర్శకుడు రవి వీడే మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకూ హాలీవుడ్ తెరపై మాత్రమే కనిపించిన అబ్బురపరిచే దృశ్యాల్ని ఫస్ట్ టైమ్ తెలుగు సినిమాలో చూపించాం. సినిమా చూసినవారంతా హాలీవుడ్ స్థాయిలో తీశారని అభినందిస్తుండటం సంతోషంగా ఉంది. 87 థియేటర్లలో విడుదలైన మా సినిమా ప్రస్తుతం 100కి పైగా థియేటర్లలో ఆడుతోంది. థియేటర్ల పెంపే మా విజయానికి నిదర్శనం. మా చిత్రం ఓపెనింగ్ ఎపిసోడ్‌ని ప్రేక్షకుల కోసం యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను మా సినిమా అలరిస్తోంది. మూడు రోజుల్లో 1.25కోట్ల రూపాయలు వసూలు చేసింది. మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు నిర్మాత నివాస్. -
మన టార్జాన్!
కిలికిలి భాష గుర్తుందా! అదేనండీ... ‘బాహుబలి’ సినిమాలో కాలకేయులు మాట్లాడారు కదా! ‘బాహుబలి’ మానియా టైమ్‌లో కిలికిలి భాష గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. అయితే ఇప్పుడు భల్లాలదేవుడు.. అదేనండీ హీరో రానా మరో భాషపై కాన్సంట్రేట్ చేశారు. కానీ, ఇది మనుషులు మాట్లాడుకునేది కాదట. మరైతే.. ఏమై ఉంటుంది? అని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నాం. ప్రకృతి భాష అట! ఏనుగులతో మాట్లాడేందుకు ప్రిపేర్ అవుతున్నారు రానా. తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రానా హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు హిందీలో ‘హాథీ మేరే సాథీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. హాథీ మేరే సాథీ అంటే ఏనుగుతో సహచర్యం అని అర్థం. 1971లో రాజేష్ ఖన్నా, తనుజా జంటగా వచ్చిన ‘హాథీ మేరే సాథీ’ చిత్రానికి ఇది రీమేక్ అట. ‘‘హాథీ మేరే సాథీ’ చిత్రంలో నటించబోతున్నాను. కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించడం నాకిష్టం.. ఒక మనిషికి, ఏనుగుకి మధ్య ఉండే చక్కని రిలేషన్షిప్ నేపథ్యంలో సాగే కథ. ప్రభు సాల్మన్ కథ చెప్పేటప్పుడు నేచర్‌పై అతనికి ఉన్న ఇంట్రెస్ట్ తెలిసింది’’ అని పేర్కొన్నారు రానా. హాలీవుడ్ మూవీ ‘టార్జాన్’ సిరీస్‌లో హీరో ఏనుగుతోనూ దోస్తీ చేస్తాడు. మన టార్జాన్ (రానా) కూడా ఇప్పుడు చేయబోతున్నారు. -
‘హలో నా భార్యను చంపేశా.. రండి’
ముంబయి: వాణిజ్య నగరం ముంబయిలో దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య మొదలైన తగువులాట కత్తిపోట్లకు దారి తీసింది. ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఆగ్రహానికి లోనైన వైద్యుడైన భర్త ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. దాదాపు మూడుగంటలపాటు ఆమె పక్కనే కూర్చుని అనంతరం పోలీసులకు ఫోన్ చేసి తన భర్యను చంపేసినట్లు చెప్పాడు. ఈ సంఘటన జరిగిన సమయం తమ నాలుగేళ్ల బాలుడు పక్కన గదిలోనే నిద్ర పోతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉమేశ్ బాబోలే(38) అనే వ్యక్తి శివాజీ పార్క్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మతుంగా అనే ప్రాంతంలోని కోహినూర్ టవర్స్ లో తన భార్య తనూజ (36), కుమారుడితో కలిసి ఉంటున్నాడు. దంతవైద్యుడిగా పనిచేస్తూ జోగేశ్వరి ఈస్ట్ వద్ద క్లినిక్ నడుపుతున్నాడు. ఓ ఆర్థికపరమైన వ్యవహారం సంబంధించి అతడు భార్య తనూజతో ఆదివారం ఉదయాన్నే 6.30గంటల ప్రాంతంలో గొడవకు దిగాడు. అదికాస్త మరింత పెద్దదై తీవ్ర ఆగ్రహంతో కత్తి తీసుకొని పలుమార్లు ఆమెను పొడిచాడు. రక్తపు మడుగులో పడి చనిపోయిన ఆమె మృతదేహం పక్కనే మూడుగంటలపాటు కూర్చున్నాడు. 9.30గంటలకు ‘హలో నేను నా భార్యను చంపేశాను.. వచ్చి అరెస్టు చేయండి’ అంటూ పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. అంతకుముందు కూడా వీరిద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగేవని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. ఎవరితో సరిగా మాట్లాడరని, గత ఏడేళ్లుగా ఇక్కడే ఉంటున్నారని చెప్పారు. -
టీచర్ దెబ్బలకు స్పృహకోల్పోయిన విద్యార్థిని
గన్నవరం: ఉపాధ్యాయుడి దెబ్బలకు తాళలేక ఓ విద్యార్థిని స్పృహ కోల్పోయింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాదు జిల్లా పరిషత్ పాఠశాలలో చోటు చేసుకుంది. ఆ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తనూజ అనే విద్యార్థిని బుధవారం పాఠశాలకు హాజరు కాలేదు. ఎందుకు రాలేదని ఉపాధ్యాయుడు విద్యార్థిని దండించాడు. దెబ్బలకు తట్టుకోలేక విధ్యార్థిని కిందపడిపోవడంతో హుటాహుటిన దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దీంతో తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరావు పరారయ్యాడు. -
నెల కావస్తున్నా స్పష్టత లేదు..
ఇంకా మిస్టరీగానే తనూజ మృతి కేసు కేసులో కనీస పురోగతి సాధించలేకపోయిన పోలీసులు పెందుర్తి(విశాఖపట్నం): అనుమానస్పదంగా మృతి చెందిన కృష్ణరాయపురం బాలిక తనూజ మృతి కేసు అడుగు కూడా ముందుకు పడలేదు. గత నెల 23న అర్ధరాత్రి(24 ఉదయం వెలుగులోకి వచ్చింది) జరిగిన ఈ ఘటనలో పోలీసులు కనీస పురోగతి సాధించలేకపోయారు. గత నెల రోజులుగా పలువురు అనుమానితులను విచారించారు. అనేక ఆధారాలు సేకరించారు. అయినా ఈ కేసులో కనీస పురోగతి లేదు. తీవ్ర సంచలనం రేపిన ఈ కేసులో చివరకు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అది ఎప్పుడు వస్తుందో వారికీ స్పష్టత లేదు. ఆ అపార్ట్మెంట్లో ఏం జరిగింది.. కృష్ణరాయపురంలో నివాసం ఉంటున్న కె.నాగేశ్వరరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో చిన్నకుమార్తె తనూజ(14) పురుషోత్తపురం మహతి పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది. రోజూ ఇంటి నుంచి పాఠశాలకు నడిచుకుని రాకపోకలు సాగిస్తుంది. ఈ క్రమంలో జూలై 23న(శనివారం) సాయంత్రం పాఠశాల నుంచి వస్తున్న తనూజతో ఓ యువకుడు మాట్లాడుతూ వస్తుండగా ఆమె అక్క చూసింది. విషయాన్ని తల్లికి చెప్పడంతో అదే రోజు రాత్రి తనూజని మందలించింది. దీంతో మనస్థాపం చెందిన తనూజ ఇంటి నుంచి బయటకు వచ్చి సమీపంలోని ఓ అపార్ట్మెంట్ ప్లాట్‌లో ఉంటున్న స్నేహితురాలి వద్దకు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే అదే అపార్ట్మెంట్ కింద ఉన్న గోడకు ఆనుకుని తనూజ మతదేహం జూలై 24న(ఆదివారం) ఉదయం కనిపించింది. తల్లి మందలించడంతో అలిగి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తనూజ ఆ అపార్ట్‌మెంట్‌కు వెళ్ళడం వాచ్‌మెన్‌తో పాటు స్థానికులు చూసినట్లు చెబుతున్నారు. అక్కడకు వెళ్ళిన తనూజ స్నేహితురాలి వద్దకు వెళ్ళిందా..స్నేహితుడి సన్నిహితుల ప్లాట్‌కు వెళ్ళిందా అన్నది స్పష్టత రావడం లేదు. లేకపోతే తనూజ ఒంటరిగా బయటకు రావడం చూసి అక్కడే పొంచి ఉన్న ఆకతాయిలు ఏమైనా చేశారా అన్నది అంతుచిక్కడం లేదు.. మొత్తానికి ఈ ఘోరం అపార్ట్మెంట్ వేదికగానే జరిగిందన్నది సుస్పష్టం. ఫోరెన్సిక్ రిపోర్టు రావాలి..విజయ్‌కుమార్, ఎస్ఐ తనూజ కేసును అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ఏ క్లూ దొరికినా వదిలిపెట్టం. అయితే కొన్ని విషయాల్లో స్పష్టత రావాల్సి ఉంది. ఫోరెన్సిక్ రిపోర్టు వస్తే విషయం తెలుస్తుంది. మరికొద్దిరోజుల్లో రిపోర్టు రావచ్చు. -
వీడని తనూజ కేసు మిస్టరీ
పెందుర్తి : కృష్ణరాయపురంలో ఓ అపార్ట్మెంట్ పక్కన అనుమానాస్పదంగా మృతి చెందిన 14 ఏళ్ల బాలిక తనూజ కేసులో పురోగతి అంతగా లేదు. బాలిక మరణం ఇంకా మిస్టరీగానే ఉంది. పోలీసులకు కొన్ని కీలక ఆధారాలు లభించినప్పటికీ అవి కేసును ఛేదించలేకపోతున్నాయి. మంగళవారం వచ్చిన పోస్టుమార్టం రిపోర్టులో బాలికది అసహజ మరణం అని మాత్రం స్పష్టమైంది. తీవ్రమైన గాయాలు, ఒంట్లో ఎముకలు విరిగిపోవడంతోనే ఆమె మరణించిందని వైద్యులు నివేదిక ఇచ్చారు. అంతకుమించి ఆధారాలు ఆ రిపోర్ట్‌లో లేవని పోలీసులు చెబుతున్నారు. కేసులో మరిన్ని ఆధారాల కోసం బాలిక కీలక శరీర భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. మరో పది రోజుల్లో రిపోర్టు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ నివేదిక వస్తే కేసు మిస్టరీ కొంత వరకు వీడవచ్చునని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు బాలిక స్నేహితుడిపైనే దృష్టి సారించిన పోలీసులు ఇప్పుడు మరో కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. తనూజ స్నేహితుడి ప్రమేయాన్ని బలంగా విశ్వసించిన పోలీసులు అతడితో పాటు మరో ఇద్దరి అదుపులోనికి తీసుకుని విచారించారు. కానీ నిందితుల్లో ఒకడిగా భావించిన యువకుడి మేనమామతో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు మంగళవారం రాత్రి విడిచిపెట్టారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో తనూజ స్నేహితుడు మాత్రమే ఉన్నాడు. వీరి నుంచి ఎటువంటి సమాచారం లభించలేదని బోగట్టా. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని ఆ యువకుడు చెబుతున్నట్లు తెలిసింది. పాపం ఎవరిదీ? తనూజ ఓ యువకుడితో అపార్ట్మెంట్లోకి వెళ్లడం చూశామని ఆ అపార్ట్మెంట్ వాచ్‌మన్‌తో పాటు స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరన్నది ప్రశ్న తేలడం లేదు. ఈ ప్రాంతంలో నిత్యం రాత్రి సమయంలో మద్యం సేవించి రోడ్లపై తిరిగే ఆకతాయిలు కోకొల్లలు. రౌడీ గ్యాంగ్‌లకు లెక్కే లేదు. ఒకవేళ ఇంట్లో నుంచి వచ్చేసిన తనూజ వారి వలలో చిక్కుకుపోయిందా? అన్న సందేహం కూడా స్థానికంగా వ్యక్తమవుతోంది. -
తనూజ కేసులో స్నేహితుడే కీలకం?
తనూజ మృతి కేసు పోలీసుల అదుపులో ముగ్గురు అనుమానితులు లైంగికంగా వేధించినట్టు అనుమానం? పెందుర్తి : అనుమానాస్పదంగా మృతి చెందిన బాలిక తనూజ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనలో బాలిక స్నేహితుడి పాత్ర కీలకంగా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. అతడి మేనమామ(వరసకు) ప్రోద్బలంతోనే బాలికను బయటకు రప్పించినట్లు తెలిస్తోంది. ఆయనపై ప్రస్తుతం రౌడీ షీటు కూడా ఉన్నట్లు తెలిసింది. బాలిక స్నేహితుడి మేనమామ, మరో రౌడీ షీటరుతోపాటు మరో వ్యక్తి కూడా ఈ దుశ్చర్యలో పాలుపంచుకున్నట్టు సమాచారం. అయితే బాలికపై లైంగిక దాడి జరిగిందా ? లేదా ? అన్నది పోస్టుమార్టం నివేదిక వచ్చాకే వెల్లడవుతుంది. మొత్తానికి పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కేసు చిక్కుముడి ఒకటి రెండు రోజుల్లో వీడే అవకాశం ఉంది. అసలేం జరిగింది? కృష్ణరాయపురానికి చెందిన కె.తనూజ(14) ఓ యువకుడితో స్నేహం చేయడం చూసిన తల్లిదండ్రులు గత శనివారం రాత్రి తీవ్రంగా మందలించారు. ఆ సమయంలో తనూజ ఇంటి నుంచి బయటకి వచ్చేసింది. ఇదే సమయంలో స్నేహితుడ్ని తనూజ కలిసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇద్దరూ కలిసి కృష్ణరాయపురంలోని బీఆర్టీఎస్ రోడ్డుపక్కన ఉన్న అపార్ట్మెంటులోని ఒక ఫ్లాట్‌లోకి వెళ్లినట్టు వాచ్మెన్ పోలీసులకు వివరించాడు. అదే సమయంలో మరో ఫ్లాట్‌లో మద్యం సేవిస్తూ ఇద్దరు రౌడీ షీటర్లతో పాటు మరో వ్యక్తి ఉన్నాడు. ఆ సమయంలో బాలికతో వచ్చిన యువకుడు వారితో మాట్లాడాడు. అందరూ కలిసి బాలికను లైంగికంగా వేధించినట్లు పై వివరాల ఆధారంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలోనే పోలీసులు ఆ యువకుడితో పాటు రౌడీషీటరైన అతని మేనమామ, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వినికిడి. -
తనూజ మృతిపై వీడని మిస్టరీ
-
తనూజ మృతిపై వీడని మిస్టరీ
విశాఖపట్నం : విద్యార్థిని తనూజ మృతి కేసులో మిస్టరీ వీడలేదు. ఈ నేపథ్యంలో విశాఖ పోలీసులు తమ దర్యాప్తు ముమ్మరం చేశారు. పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తనూజ హత్య కేసులో బంధువుల ప్రమేయంపై కూడా పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందులోభాగంగా బంధువుల ప్రమేయంపై పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కృష్ణరాయపురంలో తనూజ తన తల్లిదండ్రులతో కలసి నివసిస్తుంది. అయితే శనివారం సాయంత్రం సెల్ ఫోనులో అదే పనిగా స్నేహితుడు మాట్లాడటంతో తనూజను తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఆగ్రహించిన ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. మరునాడు ఆదివారం ఉదయం వారి ఇంటి సమీపంలో తనూజ నగ్న మృతదేహం పడి ఉంది. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ఆమె స్నేహితుడుతోపాటు అతడి స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. -
ఎంత పనిచేశావు చిట్టితల్లీ!
పెందుర్తి: తల్లి మందలించిందని జనారణ్యంలోకి అడుగు పెట్టిన బాలిక.. కొద్ది గంటలు కూడా కాకముందే ప్రాణాలు పోగొట్టుకుంది. ఓ యువకుడితో మాట్లాడిందని అమ్మ మందలించడంతో అలిగి బయటకు రావడమే ఆమె పాలిట శాపమైంది. బాలిక మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెందుర్తి పోలీస్‌స్టేషన్ పరిధి కృష్ణరాయపురంలో జరిగిన ఈ ఘటన నగరవ్యాప్తంగా సంచలనం రేపింది. వివరాలివి.. కృష్ణరాయపురంలో నివాసం ఉంటున్న కె.నాగేశ్వరరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో చిన్నకుమార్తె తనూజ (14) పురుషోత్తపురంలోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. రోజూ ఇంటి నుంచి పాఠశాలకు నడుచుకుని వెళ్లివస్తుంది. శనివారం తనూజ పాఠశాల నుంచి ఓ యువకుడితో కలిసి వస్తుండగా ఆమె అక్క చూసింది. విషయాన్ని తల్లికి చెప్పడంతో శనివారం రాత్రి తనూజని మందలించారు. దీంతో మనస్థాపం చెందిన తనూజ ఇంటి నుంచి బయటకు వచ్చి సమీపంలోని ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో ఉంటున్న స్నేహితురాలి వద్దకు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే అదే అపార్ట్మెంట్ వద్ద ఆమె స్నేహితురాలు ఉంటున్న ఫ్లాట్‌కి కింద ఉన్న గోడకు ఆనుకుని తనూజ మృతదేహం ఆదివారం ఉదయం కనిపించింది. దీంతో స్థానికులు తనూజ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి దిలీప్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. యువకుడి తల్లిదండ్రులను కూడా ప్రశ్నిస్తున్నారు. తనూజ మృతదేహానికి వైద్యులు ఇవాళ పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. అనుమానాలెన్నో.. మరోవైపు తనూజ మరణం మిస్టరీగా మారింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన తనూజ స్నేహితురాలు ఉంటున్న అపార్ట్మెంట్ వైపు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. తనూజ స్నేహితురాలి వద్దకు వెళ్లి ఉంటే ఆ సమాచారం తల్లిదండ్రులకు చేరేది. ఎందుకంటే తనూజ రాత్రి 7 గంటలకు బయటకు రాగా రాత్రి 1 గంట వరకు ఆమె తల్లిదండ్రులు ఆమె కోసం గాలిస్తున్నారు. స్నేహితులు, బంధువుల వద్ద ఆరా తీసిన తరువాత రాత్రి 1 గంటకు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంటే తనూజ వెళ్లినట్టు చెబుతున్న స్నేహితురాలిని కూడా వీరు ఆరా తీసి ఉంటారు. మరో కోణంలో చూస్తే తనూజ మాట్లాడిన యువకుడు ఓ బ్యాచ్ తో ఉన్నట్లు సమాచారం. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తనూజ ఆ యువకుడిని కలిసిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆ గ్యాంగ్‌తో కలిసి తనూజపై ఆ యువకుడు లైంగికదాడికి పాల్పడి ఆమెను హతమార్చాడా అన్నది మరో అనుమానం. తనూజ మృతదేహంపై సగం వస్త్రాలు, రక్తస్రావం ఆనవాళ్లు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. ఆమె ముఖంపై మాత్ర మే తీవ్ర గాయాలుండడంతో అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందనుకోవడానికి ఆస్కారం తక్కువ. తనూజను హతమార్చి ఈ అపార్ట్మెంట్ వద్ద మృతదేహాన్ని పడేశారన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఘటనా స్థలానికి వంద మీటర్ల దూరంలో పోలీసుల నైట్‌బీట్ పాయింట్ ఉండడం గమనార్హం. ముమ్మర దర్యాప్తు తీవ్ర సంచలనం రేపిన తనూజ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సమాచారం అందిన వెంటనే ఏసీపీ భీమారావు, సీఐ జె.మురళి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి తల్లిదండ్రులతో పాటు స్నేహితులను, స్థానికులను విచారించారు. తనూజతో మాట్లాడినట్లు చెబుతున్న యువకుడిని తక్షణమే అదుపులోనికి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి తనిఖీ చేయించారు. ఘటనపై సీపీ యోగానంద్ ఫోన్ ద్వారా ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏసీపీ భీమారావ్ మాట్లాడుతూ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక మరిని నిజాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. -
కృష్ణరాయపురంలో దారుణం
విశాఖలో దారుణం విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కృష్ణరాయపురంలో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు మందలించారని ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన విద్యార్థిని మృతదేహమై కనిపించింది. వివరాలు ఇలా ఉన్నాయి..... పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణరాయపురానికి చెందిన నాగేశ్వరరావు, అరుణ దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కూతురు తనూజ(15) స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా తనూజ స్థానికంగా నివాసముంటున్న ఓ యువకుడితో ఫోన్లో మాట్లాడుతోంది. ఈ విషయమై శనివారం రాత్రి తనూజను తల్లిదండ్రులు మందలించారు. దీంతో తనూజ తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. స్థానికులు, బంధువుల ఇళ్లలో వెతికినా లాభం లేకపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు అర్ధరాత్రి పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి.. గాలింపు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా ఆదివారం ఉదయం కృష్ణరాయపురంలోని ఓ అపార్ట్మెంట్ వెనుక భాగంలోని నిర్మానుష్య ప్రాంతంలో.. బాలిక శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహం పై దుస్తులు లేకపోవడంతో.. అత్యాచారం చేసి ఆమెను హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం లభించిన ప్రాంతం తనూజ ఇష్టపడిన యువకుడి ఇంటికి సమీపంలో ఉండటంతో.. ఇందులో అతని పాత్ర ఉందా ? అనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు. -
అయ్యో పాపం..పసివాళ్లు
నగరంలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు చిన్నారులు మృతి నాన్న అడుగుల్లో అడుగులేస్తూ వచ్చిన ఓ పసి బాలుడు సంపులో పడి మృతి చెందాడు. ఇంటి ముందు ఆడుకుంటూ {పమాదవశాత్తూ పక్కనే ఉన్న దేవాలయం సంపులో పడి మరో చిన్నారి మత్యువాత పడ్డాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. తెగిపడిన కరెంటు వైర్లు తగిలి విద్యుత్ షాక్‌తో ఓ ఐదేళ్ల పాప మృత్యు ఒడికి చేరింది.ఇలా నగరంలో ఒకే రోజు ముగ్గరు పాల బుగ్గల పసి వయసు చిన్నారులు అనంతలోకాలకు చేరుకున్న సంఘటనతో ఆయా ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బోడుప్పల్/రాజేంద్రనగర్/మెహిదీపట్నం: హేమంత్(15 నెలలు) మంగళవారం సంపులో పడి మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం... రాజస్థాన్‌కు చెందిన తారారాం, ఇందిర దంపతులు. కొంత కాలం క్రితం నగరానికి వలస వ చ్చి స్థానిక సాయిరాంనగర్‌లో నివాసముంటున్నారు. వారికి ముగ్గురు పిల్లలు అందులో ఒకరు హేమంత్. అయితే తారారం మంగళవారం తన ఇంట్లోని సంపులో నుంచి నీటిని ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్‌లోకి నింపేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో సంపులోని నీళ్లు ఏ మేర ఉన్నాయో చూడడానికి సంపు తెరిచి చూస్తున్నాడు. ఇందంతా గమనిస్తున్న తారారం కుమారుడు హేమంత్ తండ్రి వెనకాలే సంపు దగ్గరికి చేరుకున్నాడు. తన కుమారుడు వచ్చిన విషయాన్ని గమనించని తారారం సంపులోని నీళ్లను చూసిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత కొడుకు కనిపించకపోయేసరికి వెతకడం మొదలుపెట్టారు. పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా కనిపించకపోవడంతో అనుమానం వచ్చి సంపులో చూసేసరికి హేమంత్ అందులో పడి ఉన్నాడు. తేరుకున్న తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ హేమంత్ అప్పటికే మృతి చెందాడని వైద్య పరీక్షల అనంతరం తేలింది. మరో ఘటనలో... సందీప్(5) అనే బాలుడు సంపులో పడి మృతి చెందిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఒంగోలుకు చెందిన సుబానీ ఆలియాస్ సుబ్బు, రాధా దంపతులు. బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. పుప్పాలగూడ ఎల్ఐసీ కాలనీ ప్రాంతంలోని ఓ నిర్మాణం వద్ద సుబ్బు వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. సుబ్బు కుమారుడు సందీప్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటూ పక్కనే ఉన్న పోచమ్మ దేవాలయం ప్రాంతంలోని నీళ్ల సంపులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో చూడగా సందీప్ సంపులో పడి ఉన్నాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. విద్యుఘాతానికి చిన్నారి బలి... ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై తనూజ(5) అనే చిన్నారి మృతి చెందిన సంఘటన హుమాయూన్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎస్.రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన హరిబాబు తన భార్య హరిజతో కలిసి గత నాలుగేళ్లుగా గుడిమల్కాపూర్‌లో నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమారుడు తరుణ్(7), కుమార్తె తనూజ(5)లు ఉన్నారు. 8 నెలల క్రితం హరిబాబు మరణించడంతో హరిజ ఇద్దరు చిన్నారులతో కలిసి హుమాయూన్‌నగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న ఓ భవనం వద్ద పనిలో కుదిరింది. సోమవారం రాత్రి తల్లి తనూజతో కలసి కిరాణం షాపుకు వెళ్లివస్తుండ గా రోడ్డుపై పడి ఉన్న విద్యుత్ వైరు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించింది. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. -
భిన్నమైన సంజీవని
‘‘ఈ కథతో సినిమా చేయగలరా లేదా అని చాలామంది మొదటినుంచీ సందేహాలు వ్యక్తం చేశారు. కానీ మేం డెడికేషన్‌తో ఈ సినిమాను పూర్తి చేశాం. రెగ్యులర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండే సినిమా ఇది ’’ అని దర్శకుడు రవి వీడే అన్నారు. అనురాగ్, తనూజ, మనోజ్ ప్రధాన పాత్రల్లో నివాస్ క్రియేషన్స్ పతాకంపై జి.నివాస్ నిర్మించిన ‘సంజీవని’ టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. రాజ్ కందుకూరి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సంగీత దర్శకుడు శ్రవణ్ కె.కె. తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: సుజీత్ పాలడుగు.