టీచర్ దెబ్బలకు స్పృహకోల్పోయిన విద్యార్థిని | student unConsciousness after teacher beat her | Sakshi
Sakshi News home page

టీచర్ దెబ్బలకు స్పృహకోల్పోయిన విద్యార్థిని

Published Thu, Oct 20 2016 2:50 PM | Last Updated on Fri, Nov 9 2018 4:59 PM

student unConsciousness after teacher beat her

గన్నవరం: ఉపాధ్యాయుడి దెబ్బలకు తాళలేక ఓ విద్యార్థిని స్పృహ కోల్పోయింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాదు జిల్లా పరిషత్ పాఠశాలలో చోటు చేసుకుంది. ఆ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తనూజ అనే విద్యార్థిని బుధవారం పాఠశాలకు హాజరు కాలేదు. ఎందుకు రాలేదని ఉపాధ్యాయుడు విద్యార్థిని దండించాడు. దెబ్బలకు తట్టుకోలేక విధ్యార్థిని కిందపడిపోవడంతో హుటాహుటిన దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దీంతో తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరావు పరారయ్యాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement