
బాలీవుడ్ హీరోయిన్స్ కాజోల్, తనీషా ముఖర్జీ తల్లి తనూజాకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. మహారాష్ట్ర ముంబైలోని లోనావాలో ఓ కొత్తింటిని బహుమతిగా ఇచ్చారు. విలాసవంతమైన ఈ ఇల్లు నిర్మాణం పూర్తవడానికి దాదాపు 8 నెలలు పట్టగా.. తాజాగా తల్లితో కలిసి గృహప్రవేశం చేశారిద్దరూ. తల్లీకూతుర్లు కలిసి రిబ్బన్ కట్ చేసి కొత్తింట్లోకి వెళ్లారు. కుడికాలుతో ఇంట్లో అడుగుపెట్టారు.
ఈ వీడియోను తనీషా సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అది కాస్తా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు 'బంగారం లాంటి పిల్లలుంటే ఏదైనా సాధ్యమే', 'మీ బంధం కలకాలం ఇలాగే కొనసాగాలి', 'కొత్తింటి కల సాకారమైనందుకు శుభాకాంక్షలు' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా తనూజా- షోమూ ముఖర్జీల సంతానమే కాజోల్, తనీషా. ఇక కాజోల్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆమె సలాం వెంకీ సినిమాలో నటించింది.
చదవండి: ఆత్మహత్యకు చేసుకోవాలనుకున్న చలపతిరావు
అన్నయ్య కంటే ముందే పెళ్లి చేసుకున్న చలపతిరావు, ఆయన లవ్ స్టోరీ..
Comments
Please login to add a commentAdd a comment