Tanishaa Mukerji
-
ఫస్ట్ సినిమా.. బ్రెయిన్ డ్యామేజ్: కంత్రి హీరోయిన్
మొదట హీరోయిన్గా తర్వాత సెకండ్ హీరోయిన్గా సినిమాలు చేసింది తానీషా ముఖర్జీ. తెలుగులో కంత్రి సినిమాలోనూ నటించింది. హిందీ బిగ్బాస్ ఏడో సీజన్లోనూ పార్టిసిపేట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. 'నా ఫస్ట్ సినిమా ష్... ఈ మూవీ చిత్రీకరణలో భాగంగా ఓ కొండ పైన షూటింగ్ చేయాల్సింది. అప్పుడు నేను ఆ కొండ మీదినుంచి కిందపడిపోయాను. తలకు బలమైన గాయం తగిలింది. ఏడాదిదాకా ఆస్పత్రుల చుట్టూ.. వైద్యులు.. నా మెదడు డ్యామేజ్ అయిందన్నారు. ఏడాదిపాటు రెగ్యులర్గా ఆస్పత్రికి వెళ్తూ ట్రీట్మెంట్ తీసుకున్నాను. మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ఒక సంవత్సరం పట్టింది. అయితే అప్పుడీ విషయం ఎవరికీ చెప్పలేదు. అసలే నా ఫస్ట్ సినిమా.. ఎక్కడ నన్ను తీసేస్తారోనన్న భయంతో నాది పెద్ద సమస్యగా ఎప్పుడూ చూపించలేదు. గాయంతో బాధపడుతూనే షూటింగ్ పూర్తి చేశాను. రెండుగంటలు షూట్ జరిగితే మూడు గంటలు పడుకునేదాన్ని. యాక్సిడెంట్ తర్వాత.. మెదడుకు అయిన గాయం వల్ల ఎక్కువసేపు యాక్టివ్గా ఉండేదాన్ని కాదు. నిర్మాతలు నాకెంతగానో సపోర్ట్ చేశారు. అయితే యాక్సిడెంట్ తర్వాత నా పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసి ఉండకపోవచ్చు. పైగా బరువు పెరిగాను. కొన్ని చోట్ల ఎక్స్ప్రెషన్స్ కూడా వేగంగా పలికించలేకపోయాను. జనాలకు ఈ విషయం తెలియదు.. కాబట్టి యాక్టింగ్ బాగోలేదనో, సీన్ పండలేదనో విమర్శలు గుప్పించారు' అని తానీషా చెప్పుకొచ్చింది. చదవండి: సినిమా కోసం తిరిగి పర్సు ఖాళీ.. అప్పుడు భార్యే..! -
తల్లికి మర్చిపోలేని గిఫ్టిచ్చిన బాలీవుడ్ హీరోయిన్స్
బాలీవుడ్ హీరోయిన్స్ కాజోల్, తనీషా ముఖర్జీ తల్లి తనూజాకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. మహారాష్ట్ర ముంబైలోని లోనావాలో ఓ కొత్తింటిని బహుమతిగా ఇచ్చారు. విలాసవంతమైన ఈ ఇల్లు నిర్మాణం పూర్తవడానికి దాదాపు 8 నెలలు పట్టగా.. తాజాగా తల్లితో కలిసి గృహప్రవేశం చేశారిద్దరూ. తల్లీకూతుర్లు కలిసి రిబ్బన్ కట్ చేసి కొత్తింట్లోకి వెళ్లారు. కుడికాలుతో ఇంట్లో అడుగుపెట్టారు. ఈ వీడియోను తనీషా సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అది కాస్తా వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు 'బంగారం లాంటి పిల్లలుంటే ఏదైనా సాధ్యమే', 'మీ బంధం కలకాలం ఇలాగే కొనసాగాలి', 'కొత్తింటి కల సాకారమైనందుకు శుభాకాంక్షలు' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా తనూజా- షోమూ ముఖర్జీల సంతానమే కాజోల్, తనీషా. ఇక కాజోల్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆమె సలాం వెంకీ సినిమాలో నటించింది. View this post on Instagram A post shared by Tanishaa Mukerji (@tanishaamukerji) చదవండి: ఆత్మహత్యకు చేసుకోవాలనుకున్న చలపతిరావు అన్నయ్య కంటే ముందే పెళ్లి చేసుకున్న చలపతిరావు, ఆయన లవ్ స్టోరీ.. -
'ఫిల్మ్ మేకింగ్ నా రక్తంలోనే ఉంది'
ముంబై: ఫిల్మ్ మేకింగ్ తన రక్తంలోనే ఉందని బాలీవుడ్ నటి తనీషా ముఖర్జీ అన్నారు. ప్రేక్షకులకు వినోదం అందించేందుకు సినిమాలు నిర్మించాలనుకుంటున్నట్టు చెప్పారు. తన తల్లి కోసం 'ప్రత్యేక బహుమతి' సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించించారు. 'ఇఫా' బృందం ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తనీషా ముఖర్జీ పాల్గొన్నారు. 'ఇటీవల నిర్మాణ సంస్థ ప్రారంభించా. ఇక నుంచి చాలా కష్టపడాలి. నటించడం చాలా సరదాగా ఉంటుంది. ప్రేక్షకులకు వినోదం అందించాలనే సినిమాలు నిర్మించాలనుకుంటున్నా' అని తనీషా తెలిపారు. అయితే తన కొత్త ప్రాజెక్టు వివరాలు వెల్లడించేందుకు నిరాకరించింది.