
మొదట హీరోయిన్‌గా తర్వాత సెకండ్ హీరోయిన్‌గా సినిమాలు చేసింది తానీషా ముఖర్జీ. తెలుగులో కంత్రి సినిమాలోనూ నటించింది. హిందీ బిగ్‌బాస్ ఏడో సీజన్‌లోనూ పార్టిసిపేట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. 'నా ఫస్ట్ సినిమా ష్... ఈ మూవీ చిత్రీకరణలో భాగంగా ఓ కొండ పైన షూటింగ్ చేయాల్సింది. అప్పుడు నేను ఆ కొండ మీదినుంచి కిందపడిపోయాను. తలకు బలమైన గాయం తగిలింది.
ఏడాదిదాకా ఆస్పత్రుల చుట్టూ..
వైద్యులు.. నా మెదడు డ్యామేజ్ అయిందన్నారు. ఏడాదిపాటు రెగ్యులర్‌గా ఆస్పత్రికి వెళ్తూ ట్రీట్‌మెంట్ తీసుకున్నాను. మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ఒక సంవత్సరం పట్టింది. అయితే అప్పుడీ విషయం ఎవరికీ చెప్పలేదు. అసలే నా ఫస్ట్ సినిమా.. ఎక్కడ నన్ను తీసేస్తారోనన్న భయంతో నాది పెద్ద సమస్యగా ఎప్పుడూ చూపించలేదు. గాయంతో బాధపడుతూనే షూటింగ్ పూర్తి చేశాను. రెండుగంటలు షూట్ జరిగితే మూడు గంటలు పడుకునేదాన్ని.
యాక్సిడెంట్ తర్వాత..
మెదడుకు అయిన గాయం వల్ల ఎక్కువసేపు యాక్టివ్‌గా ఉండేదాన్ని కాదు. నిర్మాతలు నాకెంతగానో సపోర్ట్ చేశారు. అయితే యాక్సిడెంట్ తర్వాత నా పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసి ఉండకపోవచ్చు. పైగా బరువు పెరిగాను. కొన్ని చోట్ల ఎక్స్‌ప్రెషన్స్ కూడా వేగంగా పలికించలేకపోయాను. జనాలకు ఈ విషయం తెలియదు.. కాబట్టి యాక్టింగ్ బాగోలేదనో, సీన్ పండలేదనో విమర్శలు గుప్పించారు' అని తానీషా చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment