
కాజోల్, తనూజ ( ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై : బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ తల్లి, సీనియర్ నటి తనూజా (75) ఆసుపత్రిలో చేరారు. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెను మంగళవారం రాత్రి ముంబైలోని లీలావతికి తరలించారు కుటుంబ సభ్యులు. నిన్నగాక మొన్న మావగారు వీరూ దేవగణ్‌ను కోల్పోయిన కాజోల్‌కు ఇపుడు తల్లి అనారోగ్యం మరింత బాధిస్తోంది.
రెండురోజుల క్రితం (మే 27) బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగణ్ తండ్రి, సీనియర్ యాక్షన్ కొరియోగ్రాఫర్ వీరూ దేవగణ్ అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. కాగా జ్యుయల్ థీఫ్ నయీ రోషిణి, జీనేకా రా, హాథీ మేరి సాథీ లాంటి బాలీవుడ్ హిట్ సినిమాల్లో తనూజా హీరోయిన్‌గా నటించారు.
Comments
Please login to add a commentAdd a comment