Lilavati Hospital
-
ఆస్పత్రి పాలైన సంజయ్ రౌత్
ముంబై: శివసేన పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ సోమవారం ఆస్పత్రి పాలయ్యారు. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో ఆయన చేరారు. ఛాతి నొప్పి కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తోంది. మరో మూడు రోజులు ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతారని, చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని కుటుంబసభ్యులు చెప్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం శివసేన నేత సంజయ్‌రౌత్ దూకుడుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవిని చెరిసగం పంచాల్సిందేనని ఆయన బీజేపీకి అల్టిమేటం ఇచ్చారు. అందుకు బీజేపీ ఒప్పుకోకపోవడంతో ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. శివసేన అధినాయకత్వం వ్యూహాలకు అనుగుణంగా అటు బీజేపీని ఇరకాటంలో పెడుతూ.. ఇటు ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో పొత్తుకు లైన్ క్లియర్ చేయడంలో సంజయ్ రౌత్ కీలక పాత్ర పోషించారు. ఒకవైపు శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు చకచకా అడుగులు వేస్తుండగా.. మరోవైపు ఆయన ఆస్పత్రి పాలుకావడం పార్టీ శ్రేణులను కొంత నిరాశకు గురిచేసిందని చెప్పాలి. -
ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటి
సాక్షి, ముంబై : బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ తల్లి, సీనియర్ నటి తనూజా (75) ఆసుపత్రిలో చేరారు. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెను మంగళవారం రాత్రి ముంబైలోని లీలావతికి తరలించారు కుటుంబ సభ్యులు. నిన్నగాక మొన్న మావగారు వీరూ దేవగణ్‌ను కోల్పోయిన కాజోల్కు ఇపుడు తల్లి అనారోగ్యం మరింత బాధిస్తోంది. రెండురోజుల క్రితం (మే 27) బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగణ్ తండ్రి, సీనియర్ యాక్షన్ కొరియోగ్రాఫర్ వీరూ దేవగణ్ అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. కాగా జ్యుయల్ థీఫ్ నయీ రోషిణి, జీనేకా రా, హాథీ మేరి సాథీ లాంటి బాలీవుడ్ హిట్ సినిమాల్లో తనూజా హీరోయిన్గా నటించారు. -
మరోసారి ఆస్పత్రి పాలైన సీనియర్ నటుడు!
సాక్షి, ముంబై : అలనాటి బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ (93) అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్చారు. ఈ విషయాన్ని ఆయన అధికారిక ట్విటర్ పేజీలో వెల్లడించారు. ఛాతి ఇన్ఫెక్షన్ కారణంగా అస్వస్థతకు లోనవ్వడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారని, ఆయన కోలుకుంటున్నారని ట్వీట్ చేశారు. ఇంతకుముందు గతంలో పలుసార్లు దిలీప్‌కుమార్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం గురించి కొన్ని వదంతులు కూడా వ్యాపించాయి. కానీ ఆయన భార్య, అలనాటి ప్రముఖ హీరోయిన్ సైరా బాను వాటిని ఖండించారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో దిలీప్‌కుమార్ ఇబ్బంది పడుతున్నారు. బాబాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అయిన దిలీప్‌కుమార్ 1922 లో ప్రస్తుత పాకిస్థాన్‌లోని పెషావర్‌లో జన్మించారు. ఆయన అసలుపేరు యూసుఫ్‌ఖాన్. ఆయన తండ్రి లాలా గులామ్ సర్వార్ పండ్ల వ్యాపారి. తండ్రితో పడకపోవపడంతో.. ఇంటినుంచి వచ్చేసి పుణేకు చేరుకున్న దిలీప్ కుమర్.. అక్కడ ఆర్మీ క్లబ్ వద్ద కొంత కాలం సాండ్విచ్ స్టాల్‌ను నిర్వహిచారు. అనంతరం బాంబేకు చేరుకున్న ఆయన.. 'బాంబే టాకీస్' ఓనర్ దేవికా రాణి సలహా మేరకు తన పేరును యూసుఫ్ ఖాన్ నుంచి దిలిప్ కుమార్‌గా మార్చుకొని జ్వర్ భట(1944) చిత్రంతో బాలీవుడ్ తెరకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి సుమారు ఆరు దశాబ్దాల పాటు 60 చిత్రాల్లో తన నటనతో అభిమానులను అలరించారు. ఆయనకు ట్రాజెడీ కింగ్‌గా పేరుంది. చిట్టచివరగా 1998లో ఖిలా సినిమాలో నటించారు. 1994లో దాదాసాహెబ్ ఫాల్కే, 2015లో పద్మవిభూషణ్ అవార్డులు ఆయనను వరించాయి. -
క్షేమంగా ఇంటికి వెళ్లిన సీఎం..
సాక్షి, పనాజీ : గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ డిశ్చార్జ్ అయ్యారు. ఆయన చికిత్స పొందుతున్నలీలావతి ఆస్పత్రి నుంచి గురువారం ఇంటికి పంపించారు. దీంతో ఆయన అక్కడ నుంచి నేరుగా గోవాకు చేరుకున్నారు. ఈ విషయాన్ని గోవా డిప్యూటీ స్పీకర్ మైఖెల్ లాబో స్పష్టం చేశారు. ఈ నెల (ఫిబ్రవరి) 15 నుంచి ప్యాంక్రియాటిస్ సమస్య కారణంగా లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై దుష్ప్రచారం కూడా జోరుగా సాగింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే, పారికర్ చనిపోతే మరొకరు ముఖ్యమంత్రి అవుతారు అందులో అనుకోవడానికి ఏముందంటూ పెట్టి కలకలం రేపారు. ఈ వార్తలతో అసలు పారికర్‌కు ఏమైందంటూ పెద్ద స్థాయిలో చర్చ జరిగింది. అయితే, అవన్నీ కూడా ఊహాగానాలే అని పారికర్ డిశ్చార్జి కావడంతో స్పష్టమైంది. 'పారికర్ గోవా చేరుకున్నారు. ఆయన ఆస్పత్రి నుంచి విడుదల కావడం మంచి శుభవార్త. అయితే, ఆయన ఎప్పుడు బడ్జెట్‌ను ప్రవేశ పెడతారనే విషయం ఇప్పుడే తెలియదు' అని మైఖెల్ చెప్పారు. పారికర్‌కు ఉన్న పట్టుదల సామర్థ్యమే ఆయనను కోలుకునేలా చేసిందని, ఆయనే బడ్జెట్ బిల్లు ప్రవేశ పెట్టాలని అనుకుంటే కచ్చితంగా త్వరలోనే పెడతారని స్పష్టం చేశారు. ప్రస్తుతం పారికర్ పనాజీలోని తన నివాసానికి వెళ్లారు. -
'పారికర్‌ను అమెరికాకైనా తరలిస్తాం..'
సాక్షి, పనాజీ : అవసరం అయితే మెరుగైన వైద్యం కోసం గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ను అమెరికా తరలిస్తామని బీజేపీ నేత, గోవా డిప్యూటీ స్పీకర్ మైఖెల్ లాబో చెప్పారు. క్లోమం (ప్యాంక్రియాస్) సంబంధించిన సమస్య ఏర్పడిన కారణంగా కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురైన పారికర్ ప్రస్తుతం ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ప్రధాని మోదీ కూడా ఆయనను పరామర్శించి రావడంతో అంతలా పారికర్‌కు ఏమైందంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. అయితే, వాటన్నింటిని ఆస్పత్రి వర్గాలు కొట్టి పారేశాయి. ఆయన కోలుకుంటున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మైకెల్ కూడా సోమవారం ఓ ప్రకటన చేశారు. 'ఆయన మాకు కావాలి. మేం చేయగలిగిందంతా చేస్తాం. అవసరం అయితే, ఆయనను అమెరికాకు కూడా తరలిస్తాం' అని మీడియా ప్రతినిధులతో అసెంబ్లీ ప్రాంగణంలో చెప్పారు. ప్యాంక్రియాస్‌కు సంబంధించిన సమస్య కారణంగా పారికర్ ఈ నెల (ఫిబ్రవరి) 15న లీలావతి ఆస్పత్రిలో చేరి వైద్యంసేవలు పొందుతున్నారు. ఆయనకు ఓ సర్జరీ కూడా చేయగా ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆస్పత్రి వర్గాలు ఇప్పటికే చెప్పాయి. -
ఆస్పత్రిలో శివసేన చీఫ్
ముంబై: శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే బుధవారం ఆస్పత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షల కోసమే బాంద్రాలోని లీలావతి ఆస్పత్రిలో ఆయన చేరారని, ఈరోజే డిశ్చార్జ్ చేసే అవకాశముందని శివసేన అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన పడొద్దని కోరారు. ఆయనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు తెలిపారు. థాకరేకు గుండె, కాలేయ సంబంధ పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. కొన్నేళ్ల క్రితం ఇదే ఆస్పత్రిలో ఆయన యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. ఈ సాయంత్రం ఆయనను డిశ్చార్జ్ చేస్తామని లీలావతి ఆస్పత్రి ఆపరేషన్స్ అండ్ సప్లై డైరెక్టర్ అజయ్ కుమార్ పాండే తెలిపారు. -
బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్‌కు తీవ్ర అస్వస్థత
ముంబై: బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండటంతో శనివారం ఉదయం ఆయన్ను ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. ఆయన నిమోనియాతో బాధపడుతున్నట్టుగా సన్నిహితులు తెలిపారు. అయితే వార్తల్లో వస్తున్నట్టుగా ఆయన ఐసియులో లేరని, సాధరణ చికిత్స మాత్రమే అంధిస్తున్నట్టుగా తెలిపారు. జ్వరంతో పాటు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఉండటంతో ఆసుపత్రిలో చేర్చినట్టుగా తెలిపారు. ప్రస్తుతం దిలీప్ కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉందని, అబ్జర్వేషన్ లో ఉంచారని ఆయన సన్నిహితుడు ఉదయ తారా నాయర్ వెల్లడించారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో దిలీప్ కుమార్ గా ఫేమస్ అయిన ఆయన అసలు పేరు మహ్మద్ యూసుఫ్ ఖాన్, దేవదాసు సినిమాతో ఉత్తరాది ప్రేకకులతో ట్రాజెడీ కింగ్ గా పిలిపించుకున్న దిలీప్ అందాజ్, దీదర్, మొగళ్ ఈ అజమ్ లాంటి సినిమాలతో సూపర్ స్టార్ గా ఎదిగారు. 1998లో నటించిన ఖిలా ఆయన చివరి సినిమా. -
హీరో తండ్రికి అస్వస్థత
ముంబై : అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తండ్రి, మాజీ స్టంట్ డైరెక్టర్ వీరూ దేవగన్‌ను శనివారం ఆసుపత్రికి తరలించారు. న్యుమోనియోతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు ముంబై లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. బాలీవుడ్ సీనియర్ స్టంట్ మాస్టర్ గా పేరుగడించిన వీరూ దేవగన్ కొరియోగ్రాఫర్ గా కూడా వ్యవహరించారు. దాదాపు 80 సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. అనేక అవార్డులను కూడా అందుకున్నారు. అంతేకాకుండా అజయ్ దేవగన్, అమితాబ్ బచ్చన్, మనీషా కొయిరాలా, సుస్మితీ సేన్ తదితరులు నటించిన 'హిందుస్తాన్ కి కసమ్' (1999) అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. -
మణిపూర్ గవర్నర్ కన్నుమూత
ముంబయి : మణిపూర్ గవర్నర్ సయ్యద్ అహ్మద్(70) ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన గత కొన్ని రోజులుగా క్యాన్సర్ సంబంధిత వ్యాధితో సతమతమవుతున్న విషయం విదితమే. అనారోగ్య సమస్యలతో ఆయనను గత వారం బాంద్రా సమీపంలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గవర్నర్‌కు భార్య, ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మణిపూర్ గవర్నర్‌గా ఆయన మే 16, 2015న బాధ్యతలు స్వీకరించారు. -
రాజ్‌కుమార్ హిరానీకి గాయాలు
ప్రముఖ హిందీ చలనచిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీకి యాక్సిడెంట్ అయింది. మోటార్‌సైకిల్ మీద నుంచి కిందపడిపోవడంతో మంగళవారం ఉదయం ఆయన గాయాల పాలయ్యారు. ఆయన ముఖం మీద దవడ భాగంలో గాయమైంది. ముంబయ్‌లోని బంద్రా ప్రాంతంలోని ప్రసిద్ధ లీలావతీ హాస్పిటల్లో చేర్పించి, చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. డాక్టర్లు ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నట్లు సమాచారం. మోటార్ సైకిల్ ప్రమాదంలో హిరానీకి గడ్డం దగ్గర గాయాలయ్యాయి. అలాగే, కింద దవడ భాగం దగ్గర ఎముక విరిగినట్లు అనుమానిస్తున్నారు. సంజయ్ దత్ హీరోగా ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్’ చిత్రం తీసినప్పటి నుంచి దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు హిరానీ. ఆ తరువాత సంజయ్ దత్తోనే ‘లగేరహో మున్నాభాయ్’ లాంటి చిత్రాలు రాజ్‌కుమార్ హిరానీకి మంచి పేరు తెచ్చాయి. ఆమిర్‌ఖాన్‌తో ఆయన తీసిన ‘3 ఇడియట్స్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. గత ఏడాది చివరలో వచ్చిన ‘పీకే’ సైతం హయ్యస్ట్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచింది. -
ఆర్ ఆర్ పాటిల్ ఆరోగ్య పరిస్థితి విషమం
ముంబై : మహారాష్ట్ర మాజీ హోమంత్రి, ఎన్సీపీ నేత ఆర్ ఆర్ పాటిల్ (57) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్సలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఉన్న పాటిల్ మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఆయన గత రెండు వారాలుగా ఆస్పత్రిలో వెంటిలేటర్ ద్వారా చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించటంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఐసీయూకు తరలించారు. కాగా పాటిల్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు వెల్లడించేందుకు ఆస్పత్రి వర్గాలు నిరాకరించాయి. -
సీనియర్ నటుడు రిషి కపూర్‌కు డెంగీ
సాక్షి, ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు రుషికపూర్ బాంద్రాలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. ఆయనకు డెంగీ సోకినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. రిషి కపూర్ నివాసముంటున్న పాలిహిల్ ప్రాంతంలో దోమల బెడద ఎక్కువగా ఉందని బీఎంసీ పారిశుద్ధ్యం విభాగం సిబ్బంది ఒకరు చెప్పారు. కొద్ది రోజులుగా కపూర్ జ్వరంతో బాధపడుతున్నారు. రక్త పరీక్షల్లో ఆయనకు డెంగీ సోకినట్లు నివేదిక రావడంతో ఆయన్ని లీలావతి ఆస్పత్రిలోని 11వ అంతస్తులో చేర్చారు. కాగా కపూర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారు. -
ఆస్పత్రి నుంచి రిషి కపూర్ డిశ్చార్జ్
ముంబై: బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి ఇకపూర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. లీలావతి ఆస్పత్రి నుంచి గురువారం రాత్రి ఆయన ఇంటికి చేరుకున్నారు. మలేరియా జ్వరం రావడంలో ఆయన బుధవారం ఆస్పత్రిలో చేరారు. 'రిషి కపూర్ పూర్తిగా కోలుకున్నారు. గురువారం రాత్రి ఆస్పత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు' అని రిషీకపూర్ కుటుంబ సన్నిహితులు వెల్లడించారు. 62 ఏళ్ల రిషి కపూర్ ఇటీవల డు డూనీ చార్, స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాల్లో కనిపించారు. -
ఎంఎన్ఎస్ కార్యదర్శి అతుల్ కన్నుమూత
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యదర్శి అతుల్ సర్పోత్దార్ కన్నుమూశారు. గురువారం రాత్రి గుండె పోటు రావడంతో ఆయనను బాంద్రాలోని లీలావతి ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స కొనసాగిస్తుండగానే రాత్రి సుమారు 7.30 గంటలకు ఆయనకు మరోసారి గుండెపోటు వచ్చి తుదిశ్వాస విడిచారు. 51 ఏళ్ల అతుల్‌కు భార్య శిల్పా, కుమారుడు జయ్ ఇలా ఉన్నారు. అతుల్ చనిపోయిన విషయం తెలియగానే ఆయన భార్య శిల్పా దిగ్భ్రాంతికిలోనయింది. ఆమెకు కూడా లీలావతి ఆస్పత్రిలోనే చికిత్స నిర్వహిస్తున్నారు. అతుల్ చనిపోయిన విషయం తెలియగానే రాజ్‌తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, పదాధికారులు ఆస్పత్రికి చేరుకున్నారు. శివసేన నాయకులు దివంగత మధుకర్ సర్పోత్దార్ కుమారుడు అతుల్ ఎంఎన్ఎస్ అధినేత రాజ్‌ఠాక్రేకు అత్యంత సన్నిహితుడు. రాజ్‌ఠాక్రే శివసేన వదిలిన తర్వాత అతుల్ కూడా ఆయన బాటలో వెళ్లి ఎంఎన్ఎస్లో చేరారు. ఎంఎన్ఎస్ స్థాపించినప్పటి నుంచి అతుల్ రాజ్‌తో కలిసి పనిచేశారు. ముఖ్యంగా పార్టీని బలోపేతం చేయడానికి ఆయన ప్రధాన పాత్ర పోషించారు. వ్యక్తిగతంగా అతుల్ సౌమ్యుడనే గుర్తింపు ఉంది. అతుల్ మరణ వార్తతో ముంబైతో పాటు రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల్లోని కార్యకర్తలందరూ ఖిన్నులయ్యారు. అభిమానులు, పార్టీ కార్యకర్తల సందర్శన కోసం శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు అతుల్ భౌతికకాయాన్ని ఖేర్వాడిలోని వినాయక్ కాలనీలో ఉంచారు. మధ్యాహ్నం ఖేర్వాడిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకు రాజ్ ఠాక్రే హాజరయ్యారు. పెళ్లి విడిచి వచ్చిన రాజ్‌ఠాక్రే........ అతుల్ సర్పోత్దార్ లీలావతి ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో రాజ్ ఠాక్రే గోవా ముఖ్యమంత్రి మనోహర్ పర్కీకర్ కుమారుడి వివాహ కార్యక్రమంలో ఉన్నారు. అయితే లీలావతి ఆస్పత్రి నుంచి అతుల్ చనిపోయారన్న సమాచారం తెలియగానే ఆయన వెంటనే ముంబైకి బయల్దేరి వచ్చారు. అతుల్ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. -
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వినోద్ కాంబ్లి
ముంబై: గుండె పోటుతో ఆస్పత్రిలో చేరిన భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మంగళవారం డిశ్చార్జయ్యాడు. గత శుక్రవారం కాంబ్లీ అస్వస్థతకు గురికావడంతో అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. నవంబర్ 29వ తేదీన చెంబూర్‌లోని తన ఇంటి నుంచి బాంద్రాకు బయలుదేరిన కాంబ్లీకి ఛాతీలో నొప్పి రావడంతో కాంబ్లీ కారులోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అదే దారిలో వెళ్తున్న మాతుంగా డివిజన్ సీనియర్ పోలీసు ఇన్స్పెక్టర్ సుజాత పాటిల్ అతన్ని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం కాంబ్లీ మాట్లాడుతూ.. 'నేను తిరిగి ఇంటికి చేరుకున్నాను. నా ఆరోగ్యం బాగానే మెరుగైంది. నా ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు'.అని పేర్కొన్నాడు. -
వినోద్ కాంబ్లీకి గుండెపోటు
సాక్షి, ముంబై: భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ శుక్రవారం గుండెపోటుకు గురయ్యాడు. దీంతో హుటాహుటిన స్థానిక లీలావతి ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఉదయం 10 గంటల సమయంలో చెంబూర్‌లోని తన ఇంటి నుంచి బాంద్రాకు బయలుదేరిన కాంబ్లీకి ఛాతీలో నొప్పి రావడంతో కారులోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అదే దారిలో వెళ్తున్న మాతుంగా డివిజన్ సీనియర్ పోలీసు ఇన్స్పెక్టర్ సుజాత పాటిల్ అతన్ని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీంతో కాంబ్లీని కార్డియాక్ ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందించారు. గతేడాది జూలైలో కాంబ్లీకి యాంజియోప్లాస్టీ జరిగింది. భారత్ తరఫున కాంబ్లీ 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 54.20 సగటుతో 1084 పరుగులు; వన్డేల్లో 32.59 సగటుతో 2477 పరుగులు చేశాడు. 2000లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన కాంబ్లీ 2011లో ఫస్ట్‌క్లాస్ కెరీర్ నుంచి తప్పుకున్నాడు. ఇటీవల సచిన్ రిటైర్మెంట్ పార్టీకి తనను ఆహ్వానించలేదని మాస్టర్‌పై బహిరంగంగానే విమర్శలు చేశాడు. -
మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి గుండెపోటు
ముంబై: భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ(42)కి గుండెపోటు రావడంతో అతడిని లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఈ ఉదయం కారులో చెంబుర్ నుంచి బాంద్రాకు వెళుతున్న కాంబ్లీకి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. వెంటనే గుర్తించిన మహిళా ట్రాఫిక్ అధికారి ఒకరు.. అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు ఇంకా సమాచారం వెలువరించలేదు. గతేడాది జూలైలో వినోద్ కాంబ్లీ యాంజియోప్లాస్ట్ ఆపరేషన్ చేయింకున్నాడు. చిన్ననాటి స్నేహితుడైన సచిన్ టెండూల్కర్ తనను దూరం పెట్టడంతో కాంబ్లీ ఇటీవల ఆవేదన వ్యక్తం చేశాడు. సచిన్ రిటైర్మెంట్ కు తనను పిలవకపోవడంతో కలత చెందాడు. మైదానంలోనూ, బయట వివాదాస్పదుడిగా ముద్రపడిన కాంబ్లీ భారత్ తరపున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. -
మెరుగుపడిన దిలీప్ కుమార్ ఆరోగ్యం
ముంబయి : అలనాటి ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్యం మరింత మెరుగుపడింది. గుండె సంబంధిత సమస్యతో ముంబై లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, మరో రెండు రోజుల్లో డిశ్చార్జి అయ్యే అవకాశముంది. ఈ నెల 15న ఆస్పత్రిలో చేరిన దిలీప్ ఆరోగ్యం రోజురోజుకు మెరుగుపడుతోందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆయన కోలుకుంటున్నారని, త్వరలోనే డిశ్చార్జి అయ్యే అవకాశముందని వెల్లడించాయి. ఇప్పటికే ఆయనను పలువురు సిని నటీనటులు, కేంద్రమంత్రులు వచ్చి పరామర్శించారు. దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. -
మరింత మెరుగైన దిలీప్ కుమార్ ఆరోగ్యం
ముంబై: గుండె సంబంధిత సమస్యతో నగరంలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ మరో రెండు రోజుల్లో డిశ్చార్జి అయ్యే అవకాశముంది. ఈ నెల 15న అసౌకర్యంగా ఉండటంతో ఆస్పత్రిలో చేరిన దిలీప్ ఆరోగ్యం రోజురోజుకు మెరుగుపడుతోందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆయన కోలుకుంటున్నారని, త్వరలోనే డిశ్చార్జి అయ్యే అవకాశముందని వెల్లడించాయి. కాగా, దిలీప్‌ను బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ సోమవారం కలిసి పరామర్శించారు. అంతకుముందు బాలీవుడ్ నటులు షబానా అజ్మీ, ఫరీదా జలాల్, ఆశా పరేఖ్, రాజా మురద్, కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా కూడా దిలీప్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆరు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో రాణించిన దిలీప్‌కు మధుమతి, దేవ్‌దాస్, ముఖల్ ఈ అజామ్, గంగా జమునా, రామ్ ఔర్ శ్యామ్, కర్మ తదితర సినిమాలు నటునిగా మంచి పేరు తెచ్చి పెట్టాయి. -
లీలావతీ నుంచి డిశ్చార్జ్ కానున్న దిలీప్ కుమార్
నగరంలోని లీలావతీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ హిందీ నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన్ని మూడు నుంచి నాలుగు రోజుల్లో ఆసుపత్రి నుంచి వైద్యులు డిశార్జ్ చేయనున్నారని దిలీప్ కుమార్ భార్య సైరా భాను మేనేజర్ ముర్షిద్ ఖాన్ శనివారం ముంబైలో వెల్లడించారు. అయితే ఆయన క్రమంగా కొలుకున్నారని, ప్రస్తుతం అత్యవసర సేవ విభాగం (ఐసీయూ)లో ఉన్నారన్నారు. త్వరలో జనరల్ వార్డుకు మారుస్తారని ఖాన్ చెప్పారు. 90 ఏళ్ల ఆ మహానటుడు ఆదివారం ఛాతీలో తెలికపాటి నెప్పి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు దిలీప్‌ను లీలావతీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం దిలీప్ కుమార్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండె నెప్పిగా నిర్థారించారు. దిలీప్‌కుమార్ నటించిన జ్వార్ భాటా, మేళ, గంగా జమున, లీడర్, మొఘల్ ఏ అజాం, శక్తి, కర్మ, సౌదాగర్ చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మెగించిన సంగతి తెలిసిందే. -
కోలుకుంటున్న నటుడు దిలీప్‌కుమార్
ముంబై: గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్‌కుమార్ కోలుకుంటున్నారని ఆస్పత్రివర్గాలు తెలిపాయి. ఆదివారం తీవ్ర గుండెనొప్పితో దిలీప్‌కుమార్ స్థానిక లీలావతి ఆస్పత్రిలో జాయినవ్వగా ఐసీయూలో ఉంచి చికిత్స అందజేశారు. దిలీప్ కోలుకుంటున్నారని ఆస్పత్రి వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. దిలీప్ కుమార్ మరో రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షనలో చికిత్సను అందించాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అత డి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, అయితే దిలీప్ వయస్సు, అంతకుముందు జరిగిన గుండె ఆపరేషన్‌ను దృష్టిలో పెట్టుకుని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోనే ఉంచి ప్రత్యేక చికిత్స అందజేస్తున్నామని వైద్యులు తెలిపారు. కాగా, దిలీప్ కుమార్ భార్య, నటి సైరా భాను మాట్లాడుతూ 14 ఏళ్ల కిందట అతడికి గుండె ఆపరేషన్ జరిగిందని తెలిపారు. -
నిలకడగా దిలీప్ కుమార్ ఆరోగ్యం
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలీవుడ్ హీరో దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. సోమవారం కూడా ముంబై లీలావతి ఆస్పత్రి ఐసీయూలోనే ఉంచారు. 90 ఏళ్ల దిలీప్ కుమార్ ఆదివారం అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. 'దిలీప్ ఇంకా ఐసీయూలోనే ఉన్నాక్షేమంగా ఉన్నారు. ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఆందోళన చెందాల్సిన పనిలేదు. సైరా బాను ఆయన చెంతనే ఉన్నారు' అని సైరాబాను మేనేజర్ ముర్షీద్ఖాన్ చెప్పారు. కాగా దిలీప్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. స్వల్ప అస్వస్థతకు మాత్రమే గురయ్యారని ముర్షీద్ తెలిపారు. -
ఆస్పత్రిలో చేరిన దిలీప్‌కుమార్
ముంబై: ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ (90) ఆదివారం అనారోగ్యానికి గురవడంతో ఆయనను ముంబైలోని బాంద్రాలో ఉన్న లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఛాతీనొప్పిగా ఉన్నట్లు చెప్పడంతో వైద్యులు ఆయనను ఐసీయూలో చేర్చారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని లీలావతి ఆస్పత్రి వైద్యుడు ఒకరు చెప్పారు.