మణిపూర్ గవర్నర్ కన్నుమూత
ముంబయి : మణిపూర్ గవర్నర్ సయ్యద్ అహ్మద్(70) ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన గత కొన్ని రోజులుగా క్యాన్సర్ సంబంధిత వ్యాధితో సతమతమవుతున్న విషయం విదితమే. అనారోగ్య సమస్యలతో ఆయనను గత వారం బాంద్రా సమీపంలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గవర్నర్కు భార్య, ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మణిపూర్ గవర్నర్గా ఆయన మే 16, 2015న బాధ్యతలు స్వీకరించారు.