
బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్‌కు తీవ్ర అస్వస్థత
ముంబై: బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండటంతో శనివారం ఉదయం ఆయన్ను ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. ఆయన నిమోనియాతో బాధపడుతున్నట్టుగా సన్నిహితులు తెలిపారు. అయితే వార్తల్లో వస్తున్నట్టుగా ఆయన ఐసియులో లేరని, సాధరణ చికిత్స మాత్రమే అంధిస్తున్నట్టుగా తెలిపారు.
జ్వరంతో పాటు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఉండటంతో ఆసుపత్రిలో చేర్చినట్టుగా తెలిపారు. ప్రస్తుతం దిలీప్ కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉందని, అబ్జర్వేషన్ లో ఉంచారని ఆయన సన్నిహితుడు ఉదయ తారా నాయర్ వెల్లడించారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో దిలీప్ కుమార్ గా ఫేమస్ అయిన ఆయన అసలు పేరు మహ్మద్ యూసుఫ్ ఖాన్, దేవదాసు సినిమాతో ఉత్తరాది ప్రేకకులతో ట్రాజెడీ కింగ్ గా పిలిపించుకున్న దిలీప్ అందాజ్, దీదర్, మొగళ్ ఈ అజమ్ లాంటి సినిమాలతో సూపర్ స్టార్ గా ఎదిగారు. 1998లో నటించిన ఖిలా ఆయన చివరి సినిమా.