
ముంబై: మహానగరం ముంబైలోని సుప్రసిద్ధ లీలావతి హాస్పిటల్(Lilavati Hospital) గురించి ఎప్పుడో ఒకప్పుడు వినేవుంటారు. ముంబైలోని ప్రముఖులైవరైనా అనారోగ్యానికి గురైనప్పుడు లీలావతి ఆస్పత్రిలో చేరారనే వార్తలను మనం అప్పుడప్పుడూ వినేవుంటాం. ఇటీవల బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురైనప్పుడు, ఆయనను చికిత్స కోసం లీలావతి ఆస్పత్రిలోనే చేర్చారు. ఇప్పుడు ఈ ఆస్పత్రి మరోసారి వార్తల్లో నిలిచింది. దీనిని నడుపుతున్న ఛారిటబుల్ ట్రస్ట్ అవినీతికి పాల్పడిందనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
ఈ ఛారిటబుల్ ట్రస్ట్ ఇటీవల.. ఇదే ట్రస్ట్‌కు చెందిన మాజీలు, సంబంధిత వ్యక్తులు రూ. 1,500 కోట్లకు పైగా నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించింది. ఈ ఉదంతంలో లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్ (ఎల్‌కేఎంఎంటీ)తో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లు వేర్వేరుగా బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. ప్రముఖ వజ్రాల వ్యాపారవేత్త కీర్తిలాల్ మెహతా(diamond businessman Kirtlal Mehta) తన భార్య లీలావతి మెహతా పేరు మీద ఈ ఆసుపత్రిని నిర్మించారు. ఇందుకోసం ఆయన లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్‌ను నెలకొల్పారు. లీలావతి ఆస్పత్రికి 1997లో పునాది వేశారు. ముంబైలో మెరుగైన ఆరోగ్య సేవలను అందించడమే లక్ష్యంగా ఈ ఆస్పత్రి ఏర్పాటయ్యింది. దీనిలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాలు, శిక్షణ పొందిన సిబ్బంది ఉన్నారు. కీర్తిలాల్ మెహతా 2002లో అనారోగ్యానికి గురయ్యారు.దీంతో ఆయన సోదరుడు విజయ్ మెహతా ట్రస్ట్ పగ్గాలు చేపట్టారు.
2006లో విజయ్ మెహతా తన కొడుకు, మేనల్లుళ్లను అక్రమంగా ట్రస్టీలుగా చేసి, కిషోర్ మెహతాను శాశ్వత ట్రస్టీ పదవి నుంచి తొలగించారనే ఆరోపణలు వినిపించాయి. అయితే 2016లో కిషోర్ మెహతా తిరిగి ట్రస్టీ అయ్యారు. ఆయన ఈ బాధ్యతలను ఎనిమిది సంవత్సరాలు పాటు నిర్వహించారు. 2024లో కిషోర్ మెహతా మరణానంతరం అతని కుమారుడు ప్రశాంత్ మెహతా శాశ్వత ట్రస్టీగా మారి, ఆసుపత్రి ఆర్థిక రికార్డులను ఆడిట్(Audit) చేయించారు. ఈ నేపధ్యంలో పలు అక్రమాలు వెలుగు చూశాయి. ఇప్పుడు దీనిపై దర్యాప్తు జరుగుతోంది.
ఇది కూడా చదవండి: ఐస్ బాత్ థెరపీ అంటే ఏమిటి? వ్యాయామం తరువాత ఎందుకు చేస్తారు?
Comments
Please login to add a commentAdd a comment