Dilip Kumar
-
అర్థమైందా.. రాజా!
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో సన్ పిక్చర్స్ నిర్మించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘జైలర్’ (2023). ఈ మూవీకి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ రానుంది. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లోనే తెరకెక్కనున్న ‘జైలర్ 2’ సినిమాను సంక్రాంతి సందర్భంగా ప్రకటించారు మేకర్స్. త్వరలోనే చిత్రీకరణనుప్రారంభించనున్నట్లు ‘జైలర్ 2’ అనౌన్స్మెంట్ టీజర్లో వెల్లడించారు. ‘టైగర్ కా హుకుమ్’ సాంగ్ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో పాటు వీడియో చివర్లో ‘అర్థమైందా.. రాజా’ అనే ఓ డైలాగ్ ఉంది. ‘జైలర్ 2’ కథాంశం ప్రధానంగా గోవా నేపథ్యంలో ఉంటుందని కోలీవుడ్ సమాచారం. సన్‌పిక్చర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. -
మనసారా ప్రేమించా.. ఏరోజూ అనుమానించలేదు: సైరా భాను
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సైరా భాను.. ఓ మధుర జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకుంది. హీరో దిలీప్‌కుమార్‌ను ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పటి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలింది. ఈరోజు(అక్టోబర్ 2న) ఈ దంపతుల 58వ ఎంగేజ్మెంట్ యానివర్సరీ. ఈ సందర్భంగా సైరా ఎమోషనల్ నోట్ వదిలింది. 'ప్రేమలో ప్రశ్నలు ఉండకూడదు.. హీరా పేరి సినిమాలో నేను చెప్పిన డైలాగ్ ఇది.. అందమైన జర్నీ..నిజ జీవితంలోనూ దాన్నే విశ్వసించాను. ప్రేమలో బలమైన నమ్మకం ఉంటే ప్రశ్నించే అవసరమే రాదు. నా స్వీట్హార్ట్ దిలీప్‌తో 1966 అక్టోబర్ 2న అందమైన ప్రయాణం ప్రారంభించాను. అప్పటినుంచి ఎన్నడూ తనను ప్రశ్నించలేదు. మా జర్నీలో ఎన్ని ఎత్తుపల్లాలు ఎదురైనా తనపై నమ్మకం కోల్పోలేదు.ఆరాధన..కేవలం ప్రేమించాను. అక్కడ అనుమానాలకు తావు లేదు. కేవలం ఆరాధన మాత్రమే ఉంది. ఆ భక్తిలోనే నిజమైన ప్రేమ ఉంది' అని రాసుకొచ్చింది. కాగా సైరా భాను, దిలీప్ కుమార్ 1966 అక్టోబర్ 11న పెళ్లి చేసుకున్నారు. అప్పుడు దిలీప్ వయసు 44 కాగా సైరా వయసు కేవలం 22 మాత్రమే! దాదాపు ఐదు దశాబ్దాలపాటు సైరాతో కలిసి జీవించిన దిలీప్ 2021 జూలై 7న మరణించారు. View this post on Instagram A post shared by Saira Banu Khan (@sairabanu) బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రాణం తీసిన జల్లికట్టు
పూతలపట్టు (చిత్తూరు జిల్లా): జల్లికట్టు ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఈ ఘటన గురువారం చిత్తూరు జిల్లా, యాదమరి మండలం, కొట్టాలలో చోటుచేసుకోగా, శుక్రవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. ఆడిజాతర పురస్కరించుకుని కొట్టాలలో గురువారం మారెమ్మ జాతర జరిగింది. ఇందులోనే జల్లికట్టును నిర్వహించారు. దీనికి మండల, తమిళనాడు సరిహద్దు పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ఎద్దులొచ్చాయి. కొంతసేపటికి ఓ ఎద్దు జల్లికట్టును వీక్షిస్తున్న బంగాపాళ్యంకు చెందిన దిలీప్‌కుమార్ (40)పైకి దూసుకెళ్లింది. కొమ్ములతో బలంగా పొడవడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఇదే ఘటనలో మరో 12 మంది స్వల్పంగా గాయపడ్డారు. అనుమతి లేకుండా జల్లికట్టు నిర్వహించిన మునిరత్నం, సెల్వరాజ్, పళణివేలు, మరికొంతమందిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిత్తూరు మండలం, తమ్మింద గ్రామంలో పదేళ్లుగా కాపురం ఉంటున్నారు. -
షారూఖ్ ఖాన్‌కు యాటిట్యూడ్? బిగ్‌బీని తక్కువ చేసి..
ఫలానా హీరోకు టెక్కు ఎక్కువ.. ఆ దర్శకుడికి ముక్కు మీద కోపం.. ఈ మ్యూజిక్ డైరెక్టర్‌కైతే పొగరు.. ఇలా ఇండస్ట్రీలోని తారల గురించి నెగెటివ్‌గా చాలామంది మాట్లాడుకుంటారు. అందులో ఎంత నిజం? ఎంత అబద్ధమనేది ఎవరికీ తెలియదు. అలా షారూఖ్ ఖాన్‌కు యాటిట్యూడ్ అని తానూ విన్నానంటున్నాడు బాలీవుడ్ నటుడు దేవన్ భోజని.యాటిట్యూడ్..తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'జో జీతా వోహి సికిందర్ సినిమా తర్వాత ఓ మూవీలో షారూఖ్ ఫ్రెండ్‌గా నాకు ఛాన్స్ వచ్చింది. అప్పటికే తనకు యాటిట్యూడ్ ఉందని విన్నాను. దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్ గురించి కూడా చెడుగా మాట్లాడతాడని ఎక్కడో చూశాను. ఫస్ట్ డే సెట్‌కు వెళ్లగానే నన్ను నేను అందరికీ పరిచయం చేసుకున్నాను. అయితే షారూఖ్ దగ్గరకు వెళ్లాలనేసరికి మాత్రం అవసరమా? అనిపించింది. నేనెవరనేది తెలుసునా పేరు దేవన్ అని పరిచయం చేసినప్పుడు అయితే ఏంటి? అని వెటకారంగా మాట్లాడతాడేమోనని ఏదేదో ఊహించుకున్నాను. ఇంతలో వెనక్కు తిరిగేసరికి తనే నిలబడ్డాడు. హాయ్, నేను షారూఖ్.. జో జీతా వోహి సికిందర్ సినిమాలో మీరు చాలా బాగా యాక్ట్ చేశారు అని మెచ్చుకున్నాడు. నేనెవరనేది తనకు తెలుసా? అని ఆశ్చర్యపోయాను.ప్రశంసలునా సినిమా చాలా నచ్చిందన్నాడు. తన గురించి విన్నదంతా పచ్చి అబద్ధమేనని అప్పుడర్థమైంది. తను చాలా బాగా కలిసిపోతాడు' అని చెప్పుకొచ్చాడు. కాగా దేవన్, షారూఖ్ 1994లో యే లంహే జుడాయికె సినిమాలో కలిసి నటించారు. కానీ ఈ చిత్రం చాలా ఆలస్యంగా 2004లో విడుదలైంది.చదవండి: అభిమాని కుటుంబాన్ని ఆదుకున్న మహేశ్ బాబు -
22 ఏళ్ల ఏజ్ గ్యాప్.. ఈ స్టార్స్ 'ప్రేమకథ' ఎప్పటికీ ప్రత్యేకమే
ఆమెకు 12.. అతడికి 34.. ఇద్దరి మధ్య సుమారుగా 22 ఏళ్ల వయోభేదం ఉన్నా చూపులు కలిశాయి. తొలిచూపులోనే ఆమెపై మనసు పారేసుకున్నాడు. ఆపై తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు. వారిద్దరి మధ్య ఉన్న వయసు గురించి అందరూ పలు రకాలుగా మాట్లాడుకున్నా ‘మాది దేవుడు కలిపిన బంధం’ అంటూ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా చివరి వరకు నిలిచారు. అలా బాలీవుడ్లో తమ ప్రేమ గొప్పదనాన్ని చూపారు ఈ లెజెండరీ కపుల్స్.. వారెవరో కాదు దిలీప్ కుమార్ - సైరా భాను. 1960ల నాటి సంగతి.. దిలీప్ కుమార్‌ను చూడ్డం కోసం ముంబైలో ‘మొఘల్ ఎ ఆజం’ ప్రీమియర్‌కు హాజరైంది ఒక పదహారేళ్లమ్మాయి. అప్పుడే లండన్ నుంచి వచ్చింది స్కూల్ చదువు ముగించుకొని. ఆ షోకి దిలీప్ కుమార్ రాకపోయేసరికి చాలా నిరాశపడింది. తర్వాత యేడాదికి తనూ హీరోయిన్ అయింది ‘జంగ్లీ’ సినిమాతో.. షమ్మీకపూర్ పక్కన. ఆమే సైరా బాను. ‘మొఘల్ ఎ ఆజం’ ప్రీమియర్ ప్రస్తావనకు తర్వాత ఆమె జీవితంలోని మలుపుకి సంబంధం ఉంది. (టాప్ హీరో రాజేంద్ర కుమార్‌తో సైరా భాను) మొదటి ప్రేమ రాజేంద్ర కుమార్‌తో ఆ రోజుల్లో దిలీప్ కుమార్ టాప్-1 స్థానంలో ఉంటే రాజేంద్ర కుమార్ రెండో స్థానంలో ఉన్నారు. సైరా బాను సినిమాల్లోకి రాకముందే రాజేంద్ర కుమార్ స్టార్. ఆ తరం ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడు. ‘జంగ్లీ’ హిట్‌తో సైరా బానుకు స్టార్స్ పక్కన నటించే అవకాశాలు క్యూ కట్టాయి. అందులో రాజేంద్ర కుమార్ హీరోగా ‘ఆయీ మిలన్ కీ బేలా’ కూడా ఉంది. సైన్ చేసింది సైరా. ఆ సెట్స్‌లో ఆమెను చూసిన రాజేంద్ర కుమార్ గుండె లయ తప్పింది. సైరా కళ్లల్లోని అమాయకత్వం అతణ్ణి పిచ్చివాణ్ణి చేసింది. ‘తుమ్హే క్యా దూ మై దిల్ కె సివా (నా హృదయాన్ని తప్ప నీకేం ఇవ్వ గలను)’ అంటూ సాగే ‘ఆయీ మిలన్ కీ బేలా’లోని పాటలో సైరా కోసం జీవించాడు. ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అంతటి హీరో తనకు ఫిదా కావడంతో రాజేంద్ర కుమార్ పట్ల ఆమెకూ ఆకర్షణ మొదలైంది. సినిమా పూర్తయ్యేటప్పటికి ప్రేమలో పడిపోయారిద్దరూ. ఆ మూవీ బాక్సాఫీస్ హిట్. దాంతో ఈ ఇద్దరి కలయికలోనే ‘ఝుక్ గయా ఆస్మాన్’ ప్రారంభమైంది. ఇందులోని ‘కౌన్ హై జో సప్నో మే ఆయా (నా కలలోకి వచ్చినదెవరు)’ పాటలో తన కళ్లల్లో సైరాను కొలువుంచుకొనే అభినయించాడు రాజేంద్ర కుమార్. ఈ సినిమా కూడా హిట్ అయ్యి ఆ జంటకు సూపర్ క్రేజ్ ఏర్పడింది. తెర మీది కెమిస్ట్రీతో పాటు వీళ్లిద్దరి ప్రేమాయణమూ బాలీవుడ్ నోట షికారు చేసింది. అయితే రాజేంద్ర కుమార్ అప్పటికే పిల్లల తండ్రి. అదేమీ అడ్డంకిగా భావించని సైరా అతణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంది. సైరా ప్రేమ కోసం భార్యా,పిల్లలనూ వదులుకోవడానికి సిద్ధపడ్డాడు రాజేంద్ర కుమార్. ఈ విషయం సైరా తల్లి నసీమ్ బానుకు తెలిసింది. నిజానికి రాజేంద్ర కుమార్ అంటే నసీమ్ కుటుంబానికి అపారమైన గౌరవం. ఒకరోజు ఆయన్ను కలిసి ‘సైరా చాలా మంచి పిల్ల. ఆమెను అర్థం చేసుకునే చక్కటి భాగస్వామి దొరకాలి’ అంటూ. రచ్చ కాకుండానే సైరాను ఆ ప్రేమ నుంచి తప్పించేసింది. అంతటితో వారిద్దరి ప్రేమకు ఫుల్స్టాప్ పడింది. బర్త్‌డే పార్టీలో దిలీప్ కుమార్‌తో సైరా ప్రేమ చాన్స్ రానే వచ్చింది సైరా బాను బర్త్‌డే రూపంలో. పార్టీ అనౌన్స్ చేసి దిలీప్ కుమార్‌ను అతిథిగా ఆహ్వానించింది నసీమ్. పుట్టిన రోజు పార్టీలో తన అభిమాన హీరో కనిపించడంతో ‘దిలీప్ సాబ్’ అంటూ సంభ్రమాశ్చర్యాలకు లోనైంది సైరా. దిలీప్ కుమార్ కూడా సైరాను చూసి ముగ్ధుడయ్యాడు. ఆ క్షణం దిలీప్ కుమార్ కళ్లల్లో మెరిసిన మెరుపు నసీమ్ దృష్టిని దాటిపోలేదు. అలా కొన్నేళ్లపాటు సైరా- దిలీప్‌లు కూడా తమ మధ్య మూగప్రేమనే మనసులో నింపుకొన్నారు. అయితే వీరిద్దరి ప్రేమను పెళ్లిపీటలెక్కించిన ఘనత మాత్రం సైరా తల్లి నసీమ్ భానుకే దక్కుతుంది. సమయం చిక్కగానే అతణ్ణి అడిగింది.. ‘మీరంటే సైరాకు పిచ్చి.. చిన్నప్పటి నుంచీ. నా కూతురిని పెళ్లి చేసుకుంటారా?’ అని. అప్పటికే వహీదా రెహ్మాన్‌తో డేటింగ్లో ఉన్నాడు దిలీప్ కుమార్. అయినా నసీమ్ ప్రతిపాదనను సమ్మతించాడు రెండో ఆలోచన లేకుండానే. అలా తనకన్నా ఇరవై రెండేళ్లు పెద్దవాడైన దిలీప్ కుమార్‌కు 1966లో జీవిత భాగస్వామి అయింది సైరా బాను. పెళ్లి తర్వాత అలాంటి కామెంట్లు అయితే పెళ్లి తర్వాత చాలామంది వీళ్లిద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ గురించే మాట్లాడుకున్నారట! పలు రకాలుగా కామెంట్లు వచ్చినా వాటన్నింటినీ పట్టించుకోకుండా ప్రతి సందర్భంలోనూ ఒకరికొకరుగా ముందుకు సాగారు. ఎళ్లు గడుస్తున్నా వారి బంధాన్ని నిక్షేపంగానే కొనసాగించారు. 'మనసులో ప్రేముంటే వయసుతో పనేముంది' అని తమ అనుబంధంతోనే నిరూపించారీ ఐకానిక్ కపుల్. పెళ్లయ్యాక ఆరేళ్లకు అంటే 1972లో మొదటిసారి గర్భం ధరించారు సైరా. ఎనిమిదో నెలలో ఆమెకు అబార్షన్ అయింది. పుట్టిన బేబీ కూడా దక్కలేదు. కొన్ని కారణాల వల్ల ఇకపై ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు కూడా తేల్చి చెప్పేశారు. దీంతో పలు కారణాల వల్ల హైదరాబాద్‌కు చెందిన ఆస్మా రెహ్మాన్ అనే మహిళను దిలీప్ రెండో వివాహం చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఆ బంధం రెండేళ్లకు మించి కొనసాగలేదు. సైరాను మరిచిపోలేకపోయాడు దిలీప్. రెండేళ్లపాటు సైరాకు దూరంగా ఉండటం ఒక నరకంగా భావించాడు. తిరిగి సైరాను చేరుకున్నారు. అంత జరిగినా దిలీప్ నా వాడే అంటూ సైరా కూడా చెప్పుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూలో దిలీప్ నా కోహినూర్ వజ్రం.. నా జీవితంలో అల్లాను రెండే రెండు కోరికలు కోరాను. మా అమ్మలా ఫేమస్ కావాలని, దిలీప్ కుమార్లాంటి భర్త దొరకాలని. అల్లా రెండిటినీ నెరవేర్చాడు. అని ఆమె చెప్పుకొచ్చింది. ఎన్ని జన్మలెత్తినా దిలీప్ నా వాడు! అంటూ తన భర్తపై అపారమైన ప్రేమను ఆమె బయటపెట్టింది. దిలీప్ కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసుఫ్ ఖాన్.. 1944 నుంచి 1998 వరకు బాలీవుడ్‌ను ఏలిన దిలీప్ 2021లో అనారోగ్యంతో కన్నుమూశారు. -
1,555 కి.మీ. జలమార్గాల్లో సరుకు రవాణా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అంతర్గత జలరవాణా అభివృద్ధిపై దృష్టిసారిస్తున్నట్టు ఏపీ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ చైర్మన్ దంతులూరి దిలీప్‌కుమార్ చెప్పారు. త్వరలోనే జలరవాణా, కార్గో రవాణాలో భాగంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) తీసుకొస్తామన్నారు. ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ ఫెడరేషన్, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ సంయుక్తంగా బుధవారం విజయవాడలో వివిధ స్టేక్ హోల్డర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా సరుకు రవాణా రంగంలో జలరవాణా గ్రోత్ ఇంజన్‌గా మారుతోందన్నారు. కాలుష్యంతోపాటు ప్రతి కిలోమీటరుకు టన్ను సరుకు రవాణాలో రైలు కంటే 18 శాతం, రోడ్డు మార్గం కంటే 54 శాతం ఖర్చు తగ్గుందని చెప్పారు. ఈ క్రమంలోనే లాభదాయక వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని నదీమార్గాల సామర్థ్యాల పెంపుపై సాంకేతిక పద్ధతిలో సర్వేలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కృష్ణా, గోదావరితో పాటు సుమారు 57 చిన్న, పెద్ద నదులున్నాయన్నారు. వీటిద్వారా 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరరేఖలోని కోస్టల్ షిప్పింగ్‌ను ఇన్‌ల్యాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్తో అనుసంధానం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. వీటిల్లో దాదాపు 1,555 కిలోమీటర్ల పొడవైన 11 నదులు/కాలువలు సరకు రవాణాకు అనువైన జలమార్గాలుగా మారతాయని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతర్గత జలరవాణాలో ఏటా 8 మిలియన్ టన్నుల సరుకు ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ సీఈవో ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏపీకి నేషనల్ వాటర్‌వేస్ (ఎన్‌డబ్ల్యూ)4 నంబరును కేటాయించగా.. దాదాపు 90 శాతం జలమార్గం ఏపీలోనే ఉందని చెప్పారు. కృష్ణానదిలో (వజీరాబాద్–విజయవాడ) 157 కిలోమీటర్లు, గోదావరిలో (భద్రాచలం–రాజమహేంద్రవరం) 171 కిలోమీటర్లు, కాకినాడ కెనాల్ (కాకినాడ పోర్టు– ధవళేశ్వరం) 50 కి.మీ., ఏలూరు కెనాల్ (రాజమహేంద్రవరం–విజయవాడ) 139 కి.మీ., కొమ్మమూరు కెనాల్ (విజయవాడ–పెదగంజాం) 113 కి.మీ., నార్త్ బకింగ్హమ్ కెనాల్ (పెదగంజాం–తడ) 258 కి.మీ. మేర ఏపీ జలమార్గం విస్తరించిందని వివరించారు. వీటితో పాటు ఎన్‌డబ్ల్యూ 79 కింద పెన్నానది (పోతిరెడ్డిపాలెం–కుడితిపాలెం/బంగాళాఖాతం) 32 కిలోమీటర్లు, ఎన్‌డబ్ల్యూ 104 కింద తుంగభద్ర నది (కిండి సింగవరం–జోహ్రాపురం) 58 కి.మీ. ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో ఏడాదికి ఎనిమిది మిలియన్ టన్నుల అంతర్గత జలరవాణా జరుగుతోందన్నారు. సిమెంట్ పరిశ్రమల క్లస్టర్లలో భాగంగా ముక్త్యాల నుంచి మచిలీపట్టణం, కాకినాడ పోర్టుకు సరుకు రవాణా చేసేలా అనుసంధానం చేస్తున్నామన్నారు. కడప ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమలు, పవర్ ప్లాంట్లకు పెన్నానది ద్వారా కృష్ణపట్నం ఓడరేవుకు జలమార్గం కలిసొస్తుందన్నారు. గండికోటలో క్రూజ్ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. కృష్ణానది తీరంలోని 8 ప్రముఖ ఆలయాల సందర్శనకు టెంపుల్ టూరిజం ప్రాజెక్టు చేపట్టామని చెప్పారు. తొలుత రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వర్చ్యువల్‌గా మాట్లాడారు. సమావేశంలో జలవనరులశాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి, హెరిటేజ్ క్రూజ్ కోల్కత్తా ప్రతినిధి రాజ్‌సింగ్, చాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
మై డియర్ కోహినూర్...
దిలీప్ కుమార్–సైరాభాను వేరు వేరు పేర్లు కావు. ఒకే నామం. వారిది ఆదర్శ దాంపత్య బంధం. దిలీప్ సాబ్–సైరాభానుల ఆన్–స్క్రీన్, ఆఫ్–స్క్రీన్ కెమిస్ట్రీ ‘ఆహా’ అనిపిస్తుంది. 78 ఏళ్ల వయసులో సైరాభాను తన డెబ్యూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌తో నెటిజనుల దృష్టిని ఆకట్టుకుంది. తొలి పోస్ట్‌లో భర్తను జ్ఞాపకం చేసుకొని, అతడికి ఇష్టమైన ఉర్దూ ద్విపదలను ఉటంకించింది. ఈ పోస్ట్‌కు నెటిజనులు ‘వహ్వా’ అంటున్నారు. ‘నేను సాహెబ్ అని ఎప్పుడూ పిలుచుకునే వ్యక్తి ఈరోజుకీ నాతోనే ఉన్నాడు. నాతోపాటే నడుస్తున్నాడు’ అంటూ దిలీప్ కుమార్ వర్థంతి సందర్భంగా తన మనసులోని మాట రాసింది. ఆమె పోస్ట్ చేసిన దిలీప్ కుమార్‌కు నచ్చిన కవితాపంక్తులు... ‘నాకు ప్రియమైన వ్యక్తి గాఢమైన నిద్రలో ఉన్నాడు. నా ప్రపంచం నిశ్చలనంగా మారిపోయింది. మేలుకోవాల్సిందిగా అతడిని ప్రార్థిస్తున్నాను. అతడి మెలకువతో నా ప్రపంచం మళ్లీ చలనశీలం అవుతుంది’ -
బ్లాక్ అండ్ వైట్ నక్షత్రం
నిరుడు ఈ నెలలోనే 7వ తేదీన కన్నుమూసిన దిలీప్‌కుమార్ వంటి ఒక కీర్తినార్జించిన వ్యక్తి జీవితంలోని విశేషాంశాలను తెలుసుకోవాలని ఆరాటపడుతున్న ఆయన అభిమానుల నిరీక్షణ ఏడేళ్ల క్రితమే 2014లో విడుదలైన ఆయన ఆత్మకథ ‘సబ్స్టెన్స్ అండ్ షాడో’లో ఫలించి ఉంటుంది. తన గురించి ఏదీ వదలకుండా ఆ పుస్తకంలో రాసుకున్నారు దిలీప్ కుమార్. పుస్తకంలో అనేక రహస్యోద్ఘాటనలతో పాటు.. దిలీప్‌కుమార్, సైరాబానుల ప్రేమకథ, లోకల్ ట్రైయిన్‌లో లతామంగేష్కర్‌తో అయిన తొలిపరిచయం, తొలిచిత్రం ‘జ్వార్ భాటా’ (1944) నుంచి ‘జుగ్ను’ (1947) వరకు యువనటుడిగా ఆయన ఎదుగుదల వంటి ఆసక్తికరమైన సాధారణ అంశాలు చాలానే ఉన్నాయి. దిలీప్ జీవితచరిత్ర కోసం ఒక అభిమానిలా తను కూడా ఏళ్లుగా కలగంటున్నానని పుస్తకం ఆవిష్కరణ రోజు సైరా చెప్పడం విశేషం. దిలీప్‌కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసఫ్‌ఖాన్. 1922 డిసెంబరు 11న పెషావర్ (ఇప్పటి పాకిస్థాన్)లో జన్మించారు. ఆరు దశాబ్దాలు సినిమాల్లో ఉన్నారు. పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. దేవానంద్ మరణం తర్వాత బాలివుడ్‌కు మొన్నటి వరకు మిగిలి ఉన్న ఏకైక నలుపు–తెలుపు చిత్రాల సూపర్‌స్టార్ దిలీప్. దిలీప్‌కుమార్ తండ్రి లాలా గులామ్ సర్వర్ పండ్ల వ్యాపారి. పెషావర్‌లో, దేవ్లాలి (మహారాష్ట్ర)లో ఆయనకు పండ్ల తోటలు ఉండేవి. దిలీప్ దేవ్లాలిలోని ప్రతిష్టాత్మకమైన బార్నెస్ పాఠశాలలో చదువుకున్నారు. 1930లలో వారి కుటుంబం ముంబైకి మారింది. 1940 ప్రాంతంలో దిలీప్ ఇంటిని వదిలి పుణె వెళ్లి అక్కడ క్యాంటీన్ నడిపారు. డ్రైఫ్రూట్స్ బిజినెస్ చేశారు. 1943లో నటి, ‘బాంబే టాకీస్’ అధినేత అయిన దేవికారాణి... పుణె మిలటరీ క్యాంటిన్లో దిలీప్‌ను చూసి ‘జ్వార్ భాటా’ లో ప్రధాన పాత్ర ఇచ్చారు. అలా దిలీప్ సినిమాల్లోకి వచ్చేశారు. కొన్ని చిత్రాలకు నిర్మాణ భాగస్వామ్యం వహించారు. తర్వాత రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు. దిలీప్ మొదట ప్రేమించింది నటి కామినీ కౌశల్‌ని. కానీ పెళ్లి దాకా పోలేదు. మధుబాలకు దగ్గరయ్యారు. మధుబాల కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఆమెనీ పెళ్లి చేసుకోలేకపోయాడు. తర్వాత అందాల నటి సైరాబానును ప్రేమించి 1966లో పెళ్లి చేసుకున్నారు. సైరాబాను అతడికన్నా 22 ఏళ్లు చిన్న. 1980లో ఆస్మాను పెళ్లాడారు. ఆ పెళ్లి ఎంతోకాలం నిలవలేదు. 2011 నాటికి దిలీప్ ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. భార్య సైరాబానుతో కలిసి తన జీవితంలో తొలిసారిగా మక్కా వెళ్లి వచ్చారు దిలీప్ కుమార్. ఇంతకీ యూసఫ్ ఖాన్ దిలీప్‌కుమార్ ఎలా అయ్యాడు? ప్రఖ్యాత నవలాకారుడు, సినిమా రచయిత భగవతీ చరణ్ వర్మ పెట్టిన పేరది! వాసుదేవ్, జహంగీర్, దిలీప్‌కుమార్ అని మూడు పేర్లు చెప్పి ఒకటి పెట్టుకోమన్నప్పుడు యూసఫ్... దిలీప్ అనే పేరును ఎంచుకున్నారు. (చదవండి: చైతన్య భారతి: టెస్సీ థామస్ / 1963 అగ్ని పుత్రిక) -
కమల్ హాసన్: ఆయనతో కలిసి నటించాలని ప్రాధేయపడ్డా.. కానీ..
Kamal Haasan Regrets Not Working With Dilip Kumar Says He Begged Him: యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తాజాగా నటించిన చిత్రం విక్రమ్. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో అలరించనుండగా సూర్య అతిథి పాత్రలో మెరవనున్నారు. లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 3న తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలోనూ విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మూవీ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది చిత్రబృందం. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఇతర నటీనటులుతో కలిసి నటించడం అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. ఆయనకు దిలీప్ కుమార్ అంటే ఎంతో అభిమానమని, ఆయనతో నటించే అవకాశం కోల్పోవడం గురించి చెప్పుకొచ్చారు. 'నాకు ఇతర నటీనటులతో కలిసి నటించడం అంతే ఎంతో ఇష్టం. నేను నటించాలని కోరుకుని, అలా నటించని నటుడు ఒకరు ఉన్నారు. ఆయనే దిలీప్ కుమార్ సర్. నేను 'తేవర్ మగన్' అనే సినిమాను హిందీలో రీమేక్ చేద్దామని అనుకున్నాను. అందులో నాతో కలిసి నటించమని కోరేందుకు ఆయన్ను కలిశాను. దిలీప్ కుమార్ చేతులు పట్టుకుని మరీ ఆ సినిమాలో నటించాలని ప్రాధేయపడ్డా. కానీ ఆయన ఒప్పుకోలేదు.' అని కమల్ హాసన్ తెలిపారు. అయితే తర్వాత అదే మూవీని హిందీలో అనిల్ కపూర్, అమ్రిష్‌పురి కాంబినేషనల్లో 'విరాసత్'గా తెరకెక్కించారు. చదవండి: 👇 అమ్ముడైన టికెట్లు 20 మాత్రమే.. రూ. 85 కోట్లకుపైగా నష్టం వచ్చే 3 నెలల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే.. -
ఆ సంచలన దర్శకుడితో రజినీకాంత్
గత కొంత కాలంగా అనారోగ్యం తనను ఇబ్బంది పెడుతున్నప్పటకీ సూపర్‌స్టార్ రజినీకాంత్ మాత్రం సినిమాలు చేయడం ఆపలేదు. అలా ఒక సినిమా పూర్తి కాకముందే మరో సినిమాను లైన్లో పెట్టాడు. ఈ మద్య వచ్చిన పెద్దన్న సినిమా షూటింగ్ సమయంలో అనారోగ్యం కారణంగా చాలా రోజుల పాటు వాయిదాలు వేస్తూనే చివరికి దాన్ని పూర్తి చేసారు. అయితే ఆ సినిమా తర్వాత చాలా కాలం పాటు బ్రేక్ తీసుకున్నాడు రజినీ. ఇక ఇదిలా ఉంటే ఇప్పటి వరకు తన తదుపరి సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు. తన ఆరోగ్య సమస్యల కారణంగా ఇక సినిమాలు చేయకూడదని రజనీ నిర్ణయించుకున్నట్లు కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఆ వార్తలతో తన అభిమానులు ఒక్కసారిగా నిరాశలోకి వెళ్ళిపోయారు. అయితే సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే.. త్వరలోనే రజినీకాంత్ తన 169వ చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. రజినీ మరో కుర్ర దర్శకుడితో పని చేయబోతున్నట్టు సమాచారం. తమిళ స్టార్ హీరో విజయ్‌తో 'బీస్ట్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్‌తో తన తదుపరి సినిమా చేయడానికి సూపర్ స్టార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల వచ్చిన 'డాక్టర్' చిత్రంతో ఈ దర్శకుడు బ్లాక్బప్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే రజినీకాంత్ గత కొన్నేళ్లుగా జయాపజయాలతో సంబంధం లేకుండా పా రంజిత్, కార్తీక్ సుబ్బరాజ్, శివ లాంటి యంగ్ డైరెక్టర్స్‌తో పని చేస్తూ యంగ్ టాలెంట్స్‌ని ఎంకరేజ్ చేస్తున్న విషయం తెలిసిందే. -
ఏ మేరే దిల్ కహీ ఔర్ చల్...
గోల్డెన్ ఎరా అంటారు– హిందీ సినిమా సంగీతంలో 1950–60ల మధ్య కాలాన్ని. సంగీతం కూడా విజయాన్ని నిర్దేశించేది. దిలీప్‌కుమార్ తన సినిమాలతో గొప్ప పాటలు ఇచ్చాడు. తను పాడాడు. కొందరి నసీబ్లు మార్చాడు. ఆ పాట కబుర్లు కొన్ని... దేవ్ ఆనంద్ దగ్గరకు ‘జంజీర్’ స్క్రిప్ట్ తీసుకుని వెళితే కథ చాలా బాగుంది... కాని హీరోకు పాటల్లేవు... నా ఇమేజ్‌కు తగినట్టుగా రెండు డ్యూయెట్స్ పెడితే ఈ సినిమా చేస్తాను అన్నాడు. దర్శకుడు ప్రకాష్ మెహ్రా ఒప్పుకోలేదు. అమితాబ్‌తో ఆ సినిమా తీశాడు. ఆ సినిమా ఒక రివెంజ్ స్టోరీ. అందులో పాటలకు వీలు లేదు. నిజమే. కాని ‘మొఘల్–ఏ–ఆజమ్’ ప్రేమ కథ. సలీమ్–అనార్కలీ తల మునకలుగా ప్రేమించుకుంటారు. దిలీప్ కుమార్‌కు దర్శకుడు కె.ఆసిఫ్ కథ చెప్పినప్పుడు ‘నాకు డ్యూయెట్ ఎక్కడ’ అనలేదు దిలీప్ కుమార్. తన మీద ఒక్క డ్యూయెట్ లేకుండానే ఆ సినిమాలో నటించాడు. ‘మొఘల్–ఏ–ఆజమ్’లో నేటికీ నిలబడి ఉన్న గొప్ప పాట ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ మధుబాలపై చిత్రీకరణ జరిగింది. అందులో దిలీప్ కుమార్ కుర్చీలో కూచుని ఆ పాటను తిలకిస్తాడు. రాజ్ కపూర్ అయితే కనీసం ఒక డ్రీమ్ సీక్వెన్స్ అయినా పెట్టి ఉండేవాడు ఇలాంటి కథలో. దిలీప్ కుమార్, సంగీత దర్శకుడు నౌషాద్, గీతకర్త షకీల్ బదయూని ముగ్గరూ కలిసి ఒక త్రయంగా పాటల మువ్వలకు శ్రావ్యతను ఇచ్చారు. దిలీప్ కుమార్, నౌషాద్‌ల కాంబినేషన్లో ఆ తరం వారు మురిపెంగా చెప్పుకునే ‘అందాజ్’, ‘మేలా’, ‘బాబుల్’, ‘కోహినూర్’, ‘గంగా జమున’, ‘ఉరన్ ఖటోలా’, ‘లీడర్’... లాంటి హిట్స్ వచ్చాయి. ‘మొఘల్ ఏ ఆజమ్’ తలమానికం. ‘కోహినూర్’లో నౌషాద్ చేసిన ‘దో సితారోంకా జమీన్ పర్ హై మిలన్ ఆజ్ కీ రాత్’ పాట తెలుగులో ‘ఈ రేయి నీవూ నేనూ ఎలాగైనా కలవాలి నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి’గా వినిపించింది. ఇదే సినిమాలోని ‘మధుబన్ మే రాధికా నాచేరే’ రఫీ రాగం తీస్తే సముద్ర గర్భంలో ఉన్న బెస్తవాడికి కూడా వినిపించింది. ఈ పాటలో దిలీప్ కుమార్ సితార్ వాయిస్తూ కనిపించేందుకు దాదాపుగా సితార్‌ను నేర్చుకున్నాడు. అందుకే ఆ భాగాన్ని అతనే వాయించినట్టు అనిపిస్తుంది. దిలీప్– నౌషాద్ కాంబినేషన్లో మీరు జేబులో నుంచి తీసేకొద్దీ వచ్చే చిరుతిండ్ల పొట్లాల వంటి పాటలు వచ్చాయి. ‘ఓ దూర్ కే ముసాఫిర్ ముజ్కోభి సాత్ లేలేరే’ (ఉరన్ఖటోలా), ‘ముఝే దునియ వాలో షరాబీన సంఝో’ (లీడర్), ‘ఆజ్ కీ రాత్ మేరే దిల్ కీ సలామీ లేలే’ (రామ్ ఔర్ శ్యామ్), ‘ఆజ్ పురానీ రాహోంసే కోయి ముఝే ఆవాజ్ న దే’ (ఆద్మీ), ‘కోయి సాగర్ దిల్ కో బెహలాతా నహీ’ (దిల్ దియా దర్ద్ లియా).... ఇవన్నీ కడిగిన సరిగమల్లా ఉంటాయి. ఇతర సంగీతకారులు తక్కువ తినలేదు. సలీల్ చౌధరి తన బెంగాళీ రసగుల్లాల్లాంటి పాటలతో ‘మధుమతి’ని నింపేశాడు. దిలీప్ పాడే ‘సుహానా సఫర్ ఔర్ ఏ మౌసమ్ హసీ’ పచ్చటి లోయల్లే వీచే గాలిలా ఉంటుంది. ‘దిల్ తడప్ తడప్ కె కెహ్ రహాహై ఆభిజా’ గుండెను హృదయంగా మార్చదూ?. ఇందులోనే ‘టూటే హుయే ఖ్వాబోనే’ ఒక లలితమైన రోదన. ఇక ఓ.పి. నయ్యర్ హార్మోనియం పెట్టె ముందేసుకుని ‘నయాదౌర్’లో ప్రతి పాటనూ హిట్ చేశాడు. ‘ఏ దేశ్ హై వీర్ జవానోంకా’ దేశభక్తి గీతాలలో మేలిమిది. ఆశాభోంస్లే, రఫీ పాడిన రెండు డ్యూయెట్లు ‘ఉడె జబ్ జబ్ తేరే జుల్ఫే’, ‘మాంగ్ కే సాథ్ తుమ్హారా’ దిలీప్–వైజయంతి మాలలకు మాలలు. ‘సాథీ హాత్ బఢానా ఏక్ అకేలా థక్ జాయేగా మిల్ కర్ బోజ్ ఉఠానా’ కలిసి పని చేయమని ఎంత బాగా చెబుతుంది. దిలీప్ కుమార్‌కు తలత్ మంచి పాటలు పాడాడు. ‘దాగ్’లో ‘ఏ మేరే దిల్ కహీ ఔర్ చల్’ పాట నేటికీ ప్రియమైనది. ‘ఫుట్‌పాత్’లో తలత్ పాడిన విరహ వెన్నెల గీతం ‘షామ్ ఏ గమ్ కీ కసమ్ ఆజ్ గంగీన్ హమ్ ఆభిజా ఆభిజా ఆజ్ మేరే సనమ్’ లేమత్తు పానీయం. దిలీప్ కుమార్ సెకండ్ ఇన్నింగ్స్‌లో సినిమాలు చేస్తే అందులోనూ ఆయనకు పాటలు ఇచ్చారు దర్శకులు. ‘కర్మ’లో ‘దిల్ దియాహై జాన్ భీ దేంగే’ పాటకు ముందు కొన్ని లైన్లను ఆయనే పాడి అభిమానులను మురిపించాడు. ‘సౌదాగర్’లో ‘ఇమ్లీకా బూటా’ పెద్ద హిట్. రోజులు గడిచే కొద్ది కొన్ని సుగంధాలకు విలువ పెరుగుతుంది. ఈ పాటల సుగంధం మరో వందేళ్లు. – సాక్షి ఫ్యామిలీ -
ఒక స్వర్ణయుగం ముగిసింది: సోనియా గాంధీ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మరణంపై కాంగ్రెస్ చైర్పర్సన్ సోనియా గాంధీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆమె దిలీప్ కుమార్ భార్య సైరా బానుకు ఒక లేఖ రాశారు. "మీ ప్రియమైన భర్త దిలీప్ కుమార్ కన్నుమూతతో, భారతీయ సినిమా చరిత్రలో ఒక స్వర్ణయుగం ముగిసింది’’ అని సైరా బానుకు గురువారం రాసిన సంతాప సందేశంలో సోనియా పేర్కొన్నారు. దిలీప్ కుమార్ ఒక లెజెండ్..భవిష్యత్తులో కూడా లెజెండ్‌గానే కొనసాగుతారు.ఎందుకంటే భవిష్యత్తరం సినీ ప్రేమికులు కూడా ఆయన అద్భుతమైన నటనా వైభవాన్ని ఆస్వాదిస్తాయి. ఎన్నో ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీలను అందించిన ఆయన నటనా నైపుణ్యాన్ని ఆరాధిస్తారంటూ ఆయన సాధించిన ఘనతను, విజయాలను గుర్తుచేసుకున్నారు. అలాగే గంగా జమునా, డాగ్, దీదార్, మొఘల్-ఏ-ఆజం, నయా దౌర్, మధుమతి, దేవదాస్,రామ్ ఔర్ శ్యామ్ లాంటి ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో తన పాత్రలతో అలరించిన ఆయన నటను ఎవరు మరచిపోగలమని వ్యాఖ్యానించారు..పూర్తికాల జీవితాన్ని అనుభవించిన దిలీప్ కుమార్ అమూల్యమైన వారసత్వాన్ని ప్రపంచ సినిమాకు అందించారని కొనియాడారు. ఆయన మరణం విశేష అభిమానులను దుఃఖ సాగరంలో ముంచేసిందనీ, దేశం ఎప్పటికీ ఆయనను గుర్తు పెట్టుకుంటుందనీ తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. అలాగే ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని,ధైర్యాన్ని మీకివ్వాలని ప్రార్థిస్తున్నానని సోనియా తన లేఖలో పేర్కొన్నారు. కాగా వయసు సంబంధిత సమస్యలతో దిలీప్ కుమార్ ముంబై ఆసుపత్రిలో బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. భారతీయ సినిమా 'కోహినూర్' గా భావించే మొహమ్మద్ యూసుఫ్ ఖాన్, స్క్రీన్ పేరు దిలీప్ కుమార్‌గా ప్రపంచానికి సుపరిచితుడు. 1966లో ఆయన సైరా బానును వివాహమాడారు. -
దిలీప్ కుమార్@ ఫుట్‌బాల్‌కు వీరాభిమాని
న్యూఢిల్లీ: తెరపై ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన సినీ దిగ్గజం దిలీప్ కుమార్‌కు వ్యక్తిగతంగా క్రీడలంటే చాలా ఇష్టం. అందులోనూ ఫుట్‌బాల్ అంటే పడి చచ్చే ఆయన ప్రఖ్యాత మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్‌కు వీరాభిమాని. ఆ జట్టు కోల్‌కతాలో ఆడినా, ముంబైలో ఆడినా ఆయన తప్పకుండా హాజరయ్యేవారని హైదరాబాద్‌కు చెందిన భారత జట్టు మాజీ కెప్టెన్ విక్టర్ అమల్‌రాజ్ గుర్తు చేసుకున్నారు. రోవర్స్ కప్, సంతోష్ ట్రోఫీ తదితర పెద్ద టోర్నీల మ్యాచ్‌లకు వెళ్లి దిలీప్ మ్యాచ్‌లను ఆస్వాదించేవారు. ఈ క్రమంలో జరిగిన ఒక ఘటన గురించి అమల్‌రాజ్ చెప్పారు. ‘ఫుట్‌బాల్ అంటే బాగా ఇష్టం కాబట్టి 1980 రోవర్స్ కప్ ఫైనల్‌కు ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే కొందరు ఉద్దేశపూర్వకంగా తనను ఇబ్బంది పెట్టడం దిలీప్‌కు కోపం తెప్పించింది. దిలీప్ మొహమ్మదాన్కు అభిమాని కాగా... ఈస్ట్ బెంగాల్ అభిమానులు ఆ సమయంలో సూపర్ హిట్ సినిమా అయిన ‘మర్యాద’ హీరో రాజ్‌కుమార్ పేరుతో గొడవ చేస్తుండటంతో ఆయననే అతిథిగా పిలవాల్సిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన ఎప్పటికీ మరచిపోలేను. వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అయిన దిలీప్ కుమార్‌ను కలవడం నా జీవితంలో మరచిపోలేని అనుభవం’ అని అమల్‌రాజ్ అన్నారు. మరో ప్రముఖ ఆటగాడు చున్నీ గోస్వామి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు ఆయనను ఒప్పించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయడంలో కూడా దిలీప్ కుమార్ కీలకపాత్ర పోషించారు. దిలీప్‌జీ... మీలాంటి మరో వ్యక్తి ఎప్పటికీ రాలేరు. భారత సినిమాకు మీరు చేసిన సేవ అసమానం. –సచిన్ టెండూల్కర్ భిన్న తరాలు ప్రేమించిన ఒక దిగ్గజం ఇవాళ కన్నుమూశారు. దిలీప్సాబ్కు నా నివాళి. – కోహ్లి దిలీప్‌గారే చెప్పినట్లుగా ప్రపంచంలో ఎన్నో విషయాలు మారిపోయినా అందరినీ ప్రేమించే మనసున్నవారు ఎప్పటికీ మారిపోరు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. –వీరేంద్ర సెహ్వాగ్ -
‘ట్రాజెడీ కింగ్’ కన్నుమూత
ముంబై: విలక్షణ నటనతో భారతీయ సినీ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బాలీవుడ్ నట దిగ్గజం దిలీప్‌కుమార్ (98) తుది శ్వాస విడిచారు. ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూసిన ఆయన.. అశేష అభిమానులను కన్నీటి సంద్రంలో ముంచారు. పాత్రోచిత సహజ నటనకు, తనకే ప్రత్యేకమైన డైలాగ్ డిక్షన్ తోడై సినీ రంగంలో కొన్ని దశాబ్దాల పాటు యూసుఫ్ ఖాన్ అలియాస్ దిలీప్‌కుమార్ స్టార్‌గా వెలుగొందారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో కోవిడ్ ప్రొటోకాల్ నేపథ్యంలో కొద్దిమంది సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య, అధికారిక లాంఛనాలతో, శాంతాక్రుజ్‌లోని శ్మశానవాటికలో దిలీప్‌కుమార్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహంపై త్రివర్ణ పతాకం కప్పి, గన్ సెల్యూట్‌తో తుది వీడ్కోలు పలికారు. నాటి ప్రముఖ నటి సైరా బాను దిలీప్‌కుమార్ భార్య. దిలీప్‌కుమార్ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ ‘నిషాన్ ఇ ఇంతియాజ్’కు ఘనంగా నివాళులర్పించారు. మొఘల్ ఇ ఆజమ్, దేవదాస్ వంటి క్లాసిక్ సినిమాలతో ‘ట్రాజెడీ కింగ్’గా, అత్యంత సహజంగా పాత్రలో ఒదిగిపోయే నట కౌశలంతో ‘మెథడ్ యాక్టర్’గా దిలీప్ కుమార్ ఖ్యాతిగాంచారు. బాలీవుడ్ నట శిఖరాలు రాజ్‌కపూర్, దేవానంద్‌లతో కలసి త్రిమూర్తుల్లో ఒకరిగా పేరుగాంచారు. వృద్ధాప్య సమస్యలతో గత మంగళవారం నుంచి దిలీప్ కుమార్ ముంబై ఉన్న హిందూజా ఆసుపత్రిలోని నాన్‌కోవిడ్ విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం 7.30 గంటలకు దిలీప్‌కుమార్ కన్నుమూశారని ఆయనకు వైద్యం అందించిన డాక్టర్ జలీల్ పార్కర్ ప్రకటించారు. ఆ తర్వాత దిలీప్‌కుమార్ సన్నిహితుడు ఫైజల్ ఫారూఖీ ఇదే విషయాన్ని ట్విటర్లో వెల్లడించారు. ఆసుపత్రి నుంచి దిలీప్ కుమార్ మృతదేహాన్ని పాలిహిల్‌లోని ఆయన స్వగృహానికి తీసుకువెళ్లారు. అక్కడ కుటుంబసభ్యులు, సన్నిహితులు, అభిమానులు, సహచర నటులు ఆయనకు కన్నీటి నివాళులర్పించారు. వారిలో నటులు ధర్మేంద్ర, షబనా ఆజ్మీ, షారూఖ్ ఖాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తదితరులు ఉన్నారు. ‘చాలా బాధగా ఉంది. నా సోదరుడిని కోల్పోయాను’అని ధర్మేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘గొప్ప నట కౌశలం ఆయన సొంతం. తరాలకతీతంగా తనను ప్రేక్షకులు అభిమానించారు. సినీ దిగ్గజంగా ఆయన గుర్తుండిపోతారు. సాంస్కృతిక ప్రపంచానికి ఆయన మరణం పెద్ద లోటు. ఆయన కుటుంబసభ్యులకు, సన్నిహితులకు, అశేష అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’అని ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. భారతీయ సినీ రంగానికి దిలీప్ కుమార్ చేసిన అసాధారణ సేవలను భవిష్యత్ తరాలు గుర్తుంచుకుంటాయని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘‘భారతీయ సినీ చరిత్రను ఎప్పుడు రాసినా.. అది దిలీప్ కుమార్ ముందు.. దిలీప్‌కుమార్ తరువాతగానే ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులు ఈ లోటును తట్టుకోనే శక్తి ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అని అమితాబ్ బచ్చన్ ఆవేదన వ్యక్తం చేశారు. దిలీప్ కుమార్ అంత్యక్రియలు జరిగిన తర్వాత అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ శాంతాక్రుజ్ శ్మశానవాటికకు వెళ్లి నివాళులర్పించారు. యూసుఫ్ భాయి చాలా రోజులుగా అనారోగ్యంతో ఉన్నారని, ఆయనకు సైరా బాను అన్నీ తానై సేవలు చేసిందని ప్రఖ్యాత గాయని లత మంగేష్కర్ పేర్కొన్నారు. ‘మా హీరోలకు దిలీప్‌కుమారే హీరో’అని నటుడు అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. తమ దేశంలో జన్మించిన దిలీప్ సాబ్‌కు పాకిస్తాన్ నాయకులు, ప్రజలు ఘన నివాళులర్పించారు. పాక్ ప్రభుత్వం గతంలో ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిషాన్ ఏ ఇంతియాజ్’ను కూడా బహూకరించింది. దిలీప్ కుమార్ అద్భుతమైన నటుడు, గొప్ప వ్యక్తి అని పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ప్రశంసించారు. ‘దిలీప్ సాబ్ మృతి వార్త కలచివేసింది. ఆయన గొప్ప విలక్షణ నటుడు. ఎస్కేఎంటీహెచ్కు నిధులను సమీకరించడంలో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆయన విలువైన సమయం కేటాయించి, నిధుల సమీకరణకు ఎంతో తోడ్పడ్డారు’అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన తల్లి పేరుతో ఆసుపత్రిని నిర్మించిన నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. పాకిస్తాన్లో జననం 1922 డిసెంబర్ 11న నేటి పాకిస్తాన్లో ఉన్న పెషావర్‌లో యూసుఫ్ ఖాన్‌గా దిలీప్‌కుమార్ జన్మించారు. దిలీప్ కుమార్ తండ్రి లాలా గులామ్ సర్వర్ పండ్ల వ్యాపారం చేసేవారు. ఆ తర్వాత వారి కుటుంబం బొంబాయికి తరలివచ్చింది. పండ్ల వ్యాపారంలో తండ్రికి సహకరిస్తున్న యూసుఫ్ ఖాన్‌ను నాటి ప్రముఖ నటి దేవికా రాణి సినీ రంగానికి పరిచయం చేశారు. అప్పుడే ఆయన పేరును దిలీప్ కుమార్‌గా మార్చారు. 1944లో వచ్చిన ‘జ్వార్ భాటా’తో ఆయన సినీరంగ ప్రవేశం జరిగింది. 1988లో వచ్చిన ‘ఖిలా’ఆయన చివరి సినిమా. సామాజిక సేవా కార్యక్రమాల్లో, వరదలు, భూకంపం వంటి ప్రకృతి విపత్తుల సమయంలో సాయం అందించే విషయంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. ఆరిఫ్ అల్వీ, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ ‘నిషాన్ ఏ ఇంతియాజ్’కు ఘనంగా నివాళులర్పించారు. మొఘల్ ఇ ఆజమ్, దేవదాస్ వంటి క్లాసిక్ సినిమాలతో ‘ట్రాజెడీ కింగ్’గా, అత్యంత సహజంగా పాత్రలో ఒదిగిపోయే నట కౌశలంతో ‘మెథడ్ యాక్టర్’గా దిలీప్‌కుమార్ ఖ్యాతిగాంచారు. బాలీవుడ్ నట శిఖరాలు రాజ్‌కపూర్, దేవానంద్‌లతో కలసి త్రిమూర్తుల్లో ఒకరిగా పేరుగాంచారు. వృద్ధాప్య సమస్యలతో గత మంగళవారం నుంచి దిలీప్‌కుమార్ ముంబైలో ఉన్న హిందూజా ఆసుపత్రిలోని నాన్‌కోవిడ్ విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం 7.30 గంటలకు దిలీప్‌కుమార్ కన్నుమూశారని ఆయనకు వైద్యం అందించిన డాక్టర్ జలీల్ పార్కర్ ప్రకటించారు. ఆ తర్వాత దిలీప్‌కుమార్ సన్నిహితుడు ఫైజల్ ఫారూఖీ ఇదే విషయాన్ని ట్విటర్లో వెల్లడించారు. ఆసుపత్రి నుంచి దిలీప్ కుమార్ మృతదేహాన్ని పాలిహిల్‌లోని ఆయన స్వగృహానికి తీసుకువెళ్లారు. అక్కడ కుటుంబసభ్యులు, సన్నిహితులు, అభిమానులు, సహచర నటులు ఆయనకు కన్నీటి నివాళులర్పించారు. వారిలో నటులు ధర్మేంద్ర, షబానా ఆజ్మీ, షారూక్ ఖాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తదితరులు ఉన్నారు. ‘చాలా బాధగా ఉంది. నా సోదరుడిని కోల్పోయాను’అని ధర్మేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘గొప్ప నట కౌశలం ఆయన సొంతం. తరాలకతీతంగా తనను ప్రేక్షకులు అభిమానించారు. సినీ దిగ్గజంగా ఆయన గుర్తుండిపోతారు. సాంస్కృతిక ప్రపంచానికి ఆయన మరణం పెద్ద లోటు. ఆయన కుటుంబసభ్యులకు, సన్నిహితులకు, అశేష అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’అని ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. భారతీయ సినీ రంగానికి దిలీప్ కుమార్ చేసిన అసాధారణ సేవలను భవిష్యత్ తరాలు గుర్తుంచుకుంటాయని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘‘భారతీయ సినీ చరిత్రను ఎప్పుడు రాసినా.. అది దిలీప్ కుమార్ ముందు.. దిలీప్‌కుమార్ తరువాతగానే ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులు ఈ లోటును తట్టుకోనే శక్తి ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అని అమితాబ్ బచ్చన్ ఆవేదన వ్యక్తం చేశారు. దిలీప్ కుమార్ అంత్యక్రియలు జరిగిన తర్వాత అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ శాంతాక్రుజ్ శ్మశానవాటికకు వెళ్లి నివాళులర్పించారు. యూసుఫ్ భాయి చాలా రోజులుగా అనారోగ్యంతో ఉన్నారని, ఆయనకు సైరా బాను అన్నీ తానై సేవలు చేసిందని ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేర్కొన్నారు. ‘మా హీరోలకు దిలీప్‌కుమారే హీరో’అని నటుడు అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. తమ దేశంలో జన్మించిన దిలీప్ సాబ్‌కు పాకిస్తాన్ నాయకులు, ప్రజలు ఘన నివాళులర్పించారు. పాక్ ప్రభుత్వం గతంలో ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిషాన్ ఏ ఇంతియాజ్’ను కూడా బహూకరించింది. దిలీప్‌కుమార్ అద్భుతమైన నటుడు, గొప్ప వ్యక్తి అని పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ప్రశంసించారు. ‘దిలీప్ సాబ్ మృతి వార్త కలచివేసింది. ఆయన గొప్ప విలక్షణ నటుడు. ఎస్కేఎంటీహెచ్కు నిధులను సమీకరించడంలో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆయన విలువైన సమయం కేటాయించి, నిధుల సమీకరణకు ఎంతో తోడ్పడ్డారు’అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన తల్లి పేరుతో ఆసుపత్రిని నిర్మిం చిన నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. పాకిస్తాన్లో జననం 1922 డిసెంబర్ 11న నేటి పాకిస్తాన్లో ఉన్న పెషావర్‌లో యూసుఫ్ ఖాన్‌గా దిలీప్‌కుమార్ జన్మించారు. దిలీప్‌కుమార్ తండ్రి లాలా గులామ్ సర్వర్ పండ్ల వ్యాపారం చేసేవారు. ఆ తర్వాత వారి కుటుంబం బొంబాయికి తరలివచ్చింది. పండ్ల వ్యాపారంలో తండ్రికి సహకరిస్తున్న యూసుఫ్ ఖాన్‌ను నాటి ప్రముఖ నటి దేవికా రాణి సినీ రంగానికి పరిచయం చేశారు. అప్పుడే ఆయన పేరును దిలీప్ కుమార్‌గా మార్చా రు. 1944లో వచ్చిన ‘జ్వార్ భాటా’తో ఆయన సినీరంగ ప్రవేశం జరిగింది. 1988లో వచ్చిన ‘ఖిలా’ చివరి సినిమా. సామాజిక సేవా కార్యక్రమాల్లో, వరదలు, భూకంపం వంటి ప్రకృతి విపత్తుల సమ యంలో సాయం అందించే విషయంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ సంతాపం దిలీప్ కుమార్ మరణం పట్ల సీఎం కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తంచేశారు. నటుడిగా దశాబ్దాల పాటు భారతీయ చలనచిత్ర రంగానికి దిలీప్‌కుమార్ చేసిన సుదీర్ఘ సేవను ఆయన గుర్తు చేసుకున్నారు. దిలీప్ మరణం దేశ చలనచిత్ర రంగానికి తీరనిలోటని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, దిలీప్‌కుమార్ మృతిపట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దిలీప్‌కుమార్ ప్రత్యేక స్థానం సంపాదించారని, ఆయన పాత్రను మరువలేమని కొనియాడారు. పలు చిత్రాల్లో ఆయన నటన అద్వితీయం అని పేర్కొన్నారు న్నాళ్లుగా దిలీప్‌కుమార్ ఆరోగ్యం బాగుండలేదు. తుది దశకు చేరిన ప్రొస్టేట్ కేన్సర్, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఉండేవారు. పలుమార్లు ఆసుపత్రిలో చేరి, చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. చివరి రోజుల్లో ఎవరినీ గుర్తించలేని స్థితికి చేరుకున్నారు. కొన్నాళ్లుగా దిలీప్‌కుమార్ ఆరోగ్యం బాగుండలేదు. తుది దశకు చేరిన ప్రొస్టేట్ కేన్సర్, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఉండేవారు. పలుమార్లు ఆసుపత్రిలో చేరి, చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. చివరి రోజుల్లో ఎవరినీ గుర్తించలేని స్థితికి చేరుకున్నారు. -
Dilip Kumar: హైదరాబాద్‌కు అల్లుడయ్యారు.. కానీ రెండేళ్లకే!
‘సుహానా సఫర్ ఔర్ ఏ మౌసమ్ హసీ’... అతని సినిమా ప్రయాణం అతి సుందరం. ‘ఏ మేరా దీవానాపన్ హై..’ నటన పట్ల అతని ఉన్మత్తతా అతి సుందరం. ‘మధుబన్ మే రాధికా నాచెరే’... వెండితెరపై ఆ లీలా వినోదమూ సుందరమే. ‘యూసఫ్ ఖాన్’ అని తల్లిదండ్రులు పేరు పెట్టారు. జగతి ‘దిలీప్ కుమార్’ అని పిలుచుకుంది. భారత ఉపఖండం ఎల్లలు గీసుకొని ఉండొచ్చు. కాని అతణ్ణి అభిమానించడంలో గీతలన్నీ దారులుగా మారడం అతి సుందరం. కొందరు పట్టాభిషేకం వల్ల చక్రవర్తులు అవుతారు. కొందరు ప్రజల అభిషేకం వల్ల. దిలీప్ కుమార్‌ను ‘సినీ మొఘల్ ఏ ఆజమ్’ అని పూమాల వేసుకోవడం బహు సుందరం. ట్రాజెడీ కింగ్... కామెడీ స్టార్... రొమాంటిక్ హీరో... మెథడ్ యాక్టర్... పేర్లు ఏవైనా అతడు పలకడం సుందరం. మేకప్ వేసుకున్న కోహినూర్ వ్రజ్రం ఇన్నాళ్లు వెండితెరపై మెరిసి ఇకపై నింగిలో తళుకులీననుంది. ఖదీర్ ‘‘జనం ఆకలితో మాడుతుంటే మనం వాళ్లకు దక్కాల్సిన తిండి గింజల్ని రేట్లు పెంచి అమ్ముకుని మన బొక్కసాన్ని నింపుకున్నాం. ఊళ్లో మహమ్మారి కమ్ముకుంటే మనం మందుల్ని దాచిపెట్టి వాటి రేట్లు పెంచేశాం. పోలీసులు దాడి చేస్తారని తెలియగానే అవే మందుల్ని మురుక్కాలవల్లో పారబోశాం. మనిషికి దక్కాల్సిందేదీ మనిషికి దక్కకుండా చేస్తున్నాం’’ – ఫుట్‌పాత్ (1953) ‘‘అనార్కలి సమాధి మీద నాలుగు కాళ్లు నిలబెట్టి తప్ప మీ సింహాసనం నిలవదు అని మీరనుకుంటే జహాపనా... ఈ సలీమ్ అటువంటి సింహాసనాన్ని ఎప్పటికీ కోరుకోడు’’ – మొఘల్ ఏ ఆజమ్ (1960) ‘‘ఏదో ఒక ఉపాయం ఆలోచించు దొరబాబూ. ఊళ్లో మీరూ ఉండేలా మేమూ ఉండేలా. యంత్రాలూ పరికరాలతోపాటు మనుషులు కూడా ఉండేలా. అందరం కలిసి బతికే మార్గం ఆలోచించు’’ – నయాదౌర్ (1957) ‘‘ఎవడయ్యా ఆ బడుద్దాయి.. వేదన తట్టుకోవడానికి తాగేది? నేను తాగుతున్నానంటే కారణం కనీసం ఊపిరన్నా ఆడుతుందని’’ – దేవదాస్ (1954) ‘రైట్ బ్రదర్స్’ ప్రపంచానికి ఎగరడం నేర్పించారు. అదొక రికార్డు. దిలీప్ కుమార్ ఈ దేశంలో నటులను నేలన నడవడం నేర్పించాడు. అదీ రికార్డే. నాటకం చూడ్డానికి వచ్చిన ప్రేక్షకుడికి వినిపించేలా అరిచి డైలాగులు చెప్పే రోజులు పోయాయి. అరవొద్దు. దూరం నుంచి కనిపించేలా ముఖమంతా కదిలించే భావాలు చూపించాల్సిన అవసరం లేదు. చూపించొద్దు. ఇది సినిమా. దీనికి వేరేగా చేయాలి... నాలా చేయాలి అని చేసి చూపించాడు దిలీప్ కుమార్. ఒక కాలం ఉంటుంది. అరణ్యాలు మార్గాలు తొలుచుకునే కాలం. కొత్తది ఒకటి ఏర్పడే కాలం. అలాంటి కాలంలో అలాంటి వాళ్లు పుడతారు. సినిమా సంగీతం ఇలా ఉండాలి అని నౌషాద్ వచ్చాడు. సినిమా పాట ఇంత లలితంగా ఉండాలి అని లతా వచ్చింది. సినిమా దర్శకత్వం ఇలా ఉండాలి అని మహబూబ్ ఖాన్ వచ్చాడు. సినిమా నటన ఇలా ఉండాలని దిలీప్ కుమార్ వచ్చాడు. ‘దీదార్’ (1951) సినిమాలో దిలీప్ కుమార్ అంధుడు. అప్పటివరకూ సినిమాల్లో అంధులు వేగంగా కనురెప్పలు మూస్తూ కంటి కింద నల్ల చారలతో నటించేవారు. అదొక స్టీరియోటైప్. దిలీప్ ఆ సినిమాలో కళ్లు తెరిచి అంధుడుగా నటించాడు. శరీర కదలికా, మాట, నడక వల్ల తాను అంధుడు అని ప్రేక్షకులకు చెప్పాడు. సినిమా అంటే ఆ పూటకు మేకప్ వేసుకుని, ఆ రోజుకు సీన్ పేపర్ చదువుకుని, ఆ షాట్లో చెప్పాల్సిన డైలాగ్ చెప్పి మధ్యాహ్నం షెడ్యూల్‌కు ఇంకో స్టూడియోకు పరిగెత్తి పోవడం కాదు అని వృత్తి ఏకాగ్రతను మొదట పాటించినవాడు దిలీప్ కుమార్. తెర మీద నీలా కనిపిస్తున్నావా నీ పాత్రలా కనిపిస్తున్నావా అని అందుకై మధనపడ్డ వాడు దిలీప్ కుమార్. ఒక కాలంలో ఒకే సినిమా అని అతడు పాటించిన సూత్రాన్ని దాదాపు 50 ఏళ్ల తర్వాత రజనీకాంత్, ఆమిర్‌ఖాన్ పాటించి విజయాలు సాధించి ఆపై అందరు హీరోలు అదే ధోరణికి వచ్చేలా చేశారు. వీరి దారికి మ్యాప్ ఇచ్చినవాడు దిలీప్ కుమార్. ∙∙ ‘చేతులు ఎక్కడ పెట్టుకోవాలి?’ ఇది తెలిస్తే నటులైపోతారు. ఒక నటుడు నటించడానికి చేతులే పెద్ద అడ్డం అని నటులకు మాత్రమే తెలుస్తుంది. ఆ చేతుల్ని అలా జార్చి వదల్లేము. చీటికి మాటికి కదిలించలేము. ఈ చేతుల్ని హ్యాండిల్ చేయడానికి కొందరు వాటిని విసురుతూ నటిస్తే, కొందరు కాలర్ దగ్గరకు తెచ్చి నటిస్తే, కొందరు ఒక చేతిని సగం మడిచి, మరికొందరు బెల్ట్ పట్టుకుని నటించడం చూశాం. వారి నటనలో చేతులు రిజిస్టర్ అవుతాయి. దిలీప్ కుమార్ నటనను చూడండి. అతడు రిజిస్టర్ అవుతాడు. చేతులు కాదు. భారతదేశ నటులందరిలోనూ చేతులను సరిగ్గా పెట్టి నటించడం తెలిసిన మొదటి నటుడు దిలీప్ కుమార్. యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లలో అందుకై అతడి సినిమాలు చూపిస్తారు. ∙∙ ‘నా విజయం నీ గుండెల్లో గడబిడ పుట్టిస్తే అంతే చాలు. నీ ఇనాం నీ దగ్గరే పెట్టుకో. నా విజయాన్ని నేను తీసుకెళ్తా’ అని ‘ఆన్’ (1952) సినిమాలో దిలీప్ కుమార్ అంటాడు. విజయం సాధిస్తే అలా సాధించాలి అనుకున్నవాడు దిలీప్ కుమార్. పెషావర్‌లో పుట్టి (1922) మరో పదేళ్ల తర్వాత కుటుంబం ముంబైకి వలస రావడం వల్ల అక్కడే చదువుకున్న దిలీప్ కుమార్ కాలేజ్‌లో రాజ్ కపూర్‌కు క్లాస్మేట్. చదువుకుని సొంతగా బతకాలనుకునే ఖాన్ల స్వభావం చదువు పూర్తి కావడంతోటే అతణ్ణి పూణెకి తీసుకెళ్లింది. అక్కడ సొంతంగా డ్రైఫ్రూట్స్ షాప్ పెట్టాడు. సంవత్సర కాలంలోనే లాభంతో తండ్రి దగ్గరకు వస్తే తండ్రి సంతోషించాడు. అయితే ఈ అందగాణ్ణి, చక్కటి మాట ఉన్నవాణ్ణి, మర్యాదపూర్వక ప్రవర్తన ఉన్నవాణ్ణి, మంచి ఇంగ్లిష్ మాట్లాడుతున్నవాణ్ణి నటి దేవికా రాణి చూసింది. అప్పటికే ఆమె సూపర్‌స్టార్. బాంబే టాకిస్ స్టూడియో ఓనర్. కొత్త హీరోలతో సినిమాలు తీయాలని వెతుకుతోంది ఆమె. ‘నీ జీతం 1250 రూపాయలు’ అని దిలీప్ కుమార్‌తో దేవికా రాణి చెప్తే అది నెలకా సంవత్సరానికా అర్థం కాలేదు దిలీప్‌కు. 1944లో 150 రూపాయలు పెద్ద జీతం. ‘నాకు మా స్టూడియోలో నెలకు 150 ఇస్తున్నారు. నీకు అది సంవత్సరానికి అయి ఉంటుంది’ అని రాజ్ కపూర్ ఆ సందేహానికి జవాబు చెప్పాడు. కాని తప్పు. నెలకు 1250 రూపాయలు ఆఫర్ చేసింది దిలీప్ కుమార్‌కు దేవికా రాణి. అలాంటి బ్యాంగ్‌తో మొదలయ్యాడు దిలీప్ కుమార్. కాలేజ్‌లో ఫుట్‌బాల్‌ను స్పోర్ట్స్ ప్రిఫెరెన్స్గా తీసుకున్న దిలీప్ కుమార్, ఎప్పుడూ నాటకాలు వేయని దిలీప్ కుమార్, హాలీవుడ్ సినిమాలు తలమునకలుగా చూసి ఎరగని దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్‌కు ఉన్నట్టుగా గ్రెగెరి పెక్ మోడల్ లేని దిలీప్ కుమార్, రాజ్ కపూర్‌కు ఉన్నట్టుగా సురభి నాటక సంస్థ లాంటిది లేని దిలీప్ కుమార్ అంత మంచి నటుడు ఎలా అయ్యాడు. అది రహస్యం. ఎప్పుడూ ఎవరికీ తెలియదు. అయ్యాడు. అవడానికే అతడు నిరంతరం శ్రమించాడు. దేవికా రాణి అతణ్ణి పెట్టి తీసిన మొదటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కాని ఇలా కొత్త తరహా నటన చూపుతున్న నటుణ్ణి అందరూ గుర్తించారు. మహబూబ్ ఖాన్ మల్టీస్టారర్‌గా రాజ్‌కపూర్, నర్గిస్, దిలీప్ కుమార్‌లను పెట్టి తీసిన ‘అందాజ్’ (1949)తో దిలీప్ కుమార్ తన ఊనికిని పూర్తిగా నిరూపించాడు. వరుసగా వచ్చిన మూడు సినిమాలు ‘దీదార్’ (1951), ‘తరానా’ (1951), ‘దాగ్’ (1952) దిలీప్ కుమార్‌ను ట్రాజెడీ కథలతో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాయి. అంతిమంగా ‘దేవదాస్’ (1955) అతణ్ణి ‘ట్రాజెడీ కింగ్’ను చేసింది. మెథడ్ యాక్టింగ్ అంటే పాత్రను మననం చేసుకుంటూ ఉండటం. మామూలు వ్యక్తిగా తక్కువ పాత్రగా ఎక్కువ ఉండటం. దిలీప్ కుమార్ ఈ పాత్రలతో ఎంత మమేకం అయ్యాడంటే ఆ కథలతో తనకు ఏ సంబంధం లేకున్నా ఆ విషాదం కమ్ముకుని డిప్రెషన్ రాసాగింది. డాక్టర్లు ‘ఇక మానెయ్. సరదా పాత్రలు చెయ్’ అంటే దిలీప్ దారి మార్చాడు. ఆజాద్ (1955), నయాదౌర్ (1957), మధుమతి (1958) అతణ్ణి చలాకీగా దూకుడుగా చూపించాయి. కాని అతడేంటో ఇంకా తెలియాల్సి ఉంది. ఎవరెస్ట్ ఎక్కాల్సి ఉంది. ఆ ఎవరెస్టే ‘మొఘల్ ఏ ఆజమ్’. హీరోలు డ్యూయెట్లు పాడుతూ ప్రేమిస్తారు. విడిపోతే విరహగీతాలు ఆలపిస్తారు. చివర్లో నాలుగు ఫైట్లు చేసి హీరోయిన్ని సొంతం చేసుకుంటారు. ఇదీ ప్రేమంటే. కాని ‘మొఘల్ ఏ ఆజమ్’లో సలీమ్‌గా దిలీప్ కుమార్ చూపిన ప్రేమ వేరు. ప్రేమ అంత గంభీరంగా ఉంటుందని, అంత గాఢంగా ఉంటుందని, అంత తెగింపుగా ఉంటుందని, అంత గర్జనతో ఉంటుందని, ఒక సామ్రాజ్యాన్నే గడగడలాడించే సత్తాను చిన్న గుండెలో ఇముడ్చుకుని ఉంటుందని దిలీప్ కుమార్ చూపించాడు. ఆ పాత్రకు అంతకు ముందు ఎలాంటి మోడల్ లేదు. ఏ మోడల్ అయినా అతడే చూపాడు. ‘జంజీర్’తో యాంగ్రీ యంగ్ మేన్ వచ్చాడని అమితాబ్‌ని చూపి అంటారు. నిజానికి యాంగ్రీ యంగ్‌మేన్ 1960లోనే వచ్చాడు. అతడు దిలీప్ కుమార్. రాజ్ కపూర్ వినోదం, సందేశం చూపే ప్రయత్నం చేశాడు. దేవ్ ఆనంద్ ఒట్టి వినోదమే. దిలీప్ కుమార్ వినోదం, సందేశం మాత్రమే కాదు అర్థవంతమైన ఒక జీవన అనుసరణను తన పాత్రల ద్వారా ఇస్తూ పోయాడు. మనం రాజ్ కపూర్, దేవ్ ఆనంద్‌ల పాత్రలను వారి సినీ ఇమేజ్ను ఒక అనుసరణీయతకు తీసుకోలేము. దిలీప్ కుమార్‌ను తీసుకోగలము. హీరోగా తన వయసు అయిపోయింది సరైన పాత్రలకు తగిన సంసిద్ధత తీసుకోవాలని 5 సంవత్సరాలు కెమెరా ముఖం చూడకుండా ఇంట్లో కూచున్నవాడు దిలీప్ కుమార్. ఆ తర్వాత కెమెరా ముందుకు వస్తే? అదొక ‘క్రాంతి’ (1981), ‘శక్తి’ (1982), ‘విధాత’ (1984), ‘కర్మ’ (1986), ‘సౌదాగర్’ (1991) అయ్యాయి. నువ్వొక మణివి. అవును. దానికి విలువుంది. అవును. కాని చీటికి మాటికి దానిని తీసి ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. కిరీటంలోనే పెట్టాలి. అలా పెట్టి బతికినవాడు దిలీప్. అందుకే యాభై ఏళ్ల కెరీర్లో కేవలం 60 సినిమాలు మాత్రమే చేశాడు. దిలీప్ కుమార్ ‘నయాదౌర్’లో డాన్స్ చేశాడు. అరె అన్నారు. ‘రామ్ ఔర్ శ్యామ్’లో కామెడీ చేశాడు. పడీ పడీ నవ్వారు. ‘గంగా జమున’లో న్యాయం కోసం ఆయుధం పట్టిన గ్రామీణుడిగా చూసి అతని పక్షం వహించారు. ‘మషాల్’లో అర్ధరాత్రి వాన కురిసిన ముంబై వీధుల్లో చావు బతుకుల్లో ఉన్న భార్యను బతికించుకోవడానికి దారిన పోయే కార్లను ఆపుతూ పరిగెత్తుతూ ‘ఏయ్ భాయ్’ అని అరుస్తూ ఉంటే ఉద్వేగంతో కన్నీరు మున్నీరు అయ్యారు. అతడు రాజేసిన స్పందనలకు నెత్తిన పెట్టుకున్నారు. చిల్లర మల్లర సినిమాలు చేయకుండా, చిల్లర మల్లర యాడ్స్‌లో నటించకుండా, రాజకీయ పదవుల కోసం చిల్లర మల్లర నాయకులతో స్నేహం నటించకుండా, చిల్లర మల్లర డబ్బు తీసుకుని శ్రీమంతుల పెళ్లిళ్లలో డాన్సులు చేయకుండా, చిల్లర మల్లర వాగుడు వాగకుండా, చిల్లర మల్లర ఇంటర్వ్యూలు ఇవ్వకుండా, షోస్ చేయకుండా నటుడికి ఉండాల్సిన సంస్కారం కోసం, జ్ఞానం కోసం, శీలం కోసం, నడవడిక కోసం తన ఎదుట ఒక బెత్తం ఉన్నట్టుగా దేవుని బెత్తమో ప్రేక్షకుని బెత్తమో... దానికి జవాబుదారిౖయె ఉండటానికి ప్రయత్నించడమే దిలీప్ కుమార్ గొప్పతనం. అతడి లాంటి వాణ్ణి చూసి నేర్చుకోవాలంటే అతడి లాంటి వాళ్లు మళ్లీ మళ్లీ రారు. అలా ఎదిగే ఐశ్వర్యం అందరికీ అబ్బదు. ఒక్కడే దిలీప్ కుమార్. ఆజ్ పురానే రాహోన్ సే కోయి ముఝె ఆవాజ్ న దే దర్ద్ మె డూబె గీత్ న దే ఘమ్ కా సిసక్తా సాజ్ న దే ► మధుబాలతో ప్రేమ..అనార్కలి దక్కలేదు దిలీప్ కుమార్, మధుబాల కలిసిన నటించిన మొదటి సినిమా ‘తరానా’ (1951) ఫ్లాప్. వాళ్ల రెండో సినిమా ‘సంగ్ దిల్’ (1952) బిలో యావరేజ్. మూడో సినిమా ‘అమర్’ (1954) యావరేజ్. వాళ్లు కలిసి నటించిన ఒకే ఒక్క సూపర్‌హిట్ సినిమా ‘మొఘల్ ఏ ఆజమ్’ (1960). దురదృష్ట వశాత్తూ ఆ సినిమా నాటికి వాళ్ల ప్రేమ ముగిసింది. ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ అని మొఘల్ ఏ ఆజమ్ సినిమాలో హిట్ పాట. దిలీప్‌కుమార్, మధుబాల కూడా తమ ప్రేమను దాచుకోలేదు. కలిసి మెలిసే తిరిగారు. కాని మధుబాల తండ్రి అతావుల్లా ఖాన్‌కు దిలీప్‌తో మధుబాల ప్రేమ నచ్చలేదు. దానికి కారణం మధుబాల కూడా హీరోయిన్లలో సూపర్‌స్టార్ కావడం. ఇంకా ఆమె ఎదుట చాలా కెరీర్ ఉండటం. ఆమె సంపాదన కుటుంబానికి ముఖ్యం కావడం. ఒక రకంగా తండ్రికీ దిలీప్‌కి మధ్య మధుబాల నలిగిపోయింది. ఇది ‘నయాదౌర్’ (1957) సినిమాతో పతాక స్థాయికి చేరింది. ఆ సినిమా చేయడానికి అడ్వాన్స్ తీసుకున్న మధుబాలాను షూటింగ్ అవుట్ డోర్ అనేసరికి తండ్రి నిలువరించాడు. ఔట్‌డోర్‌లో దిలీప్ ఉంటాడు కనుక తన కంట్రోల్ ఉండదు అని భయపడ్డాడు. షూటింగ్ ఆగిపోయేసరికి ఒళ్లు మండిన దర్శకుడు బి.ఆర్.చోప్రా కోర్టుకెక్కాడు. ఆ సమయంలో తండ్రి మర్యాద దిలీప్ కాపాడాలని మధుబాల ఆశించింది. కాని దిలీప్ మధుబాలకు ఆమె తండ్రికి వ్యతిరేకంగా బి.ఆర్. చోప్రా పక్షాన సాక్ష్యం చెప్పాడు. దీంతో ఆమె మనసు ముక్కలయ్యింది. ‘మొఘల్ ఏ ఆజమ్’ షూటింగ్ సమయానికి వారి మధ్య మాటలు లేవు. ‘ఒక్కసారి మా నాన్నకు సారీ చెప్పు చాలు’ అని మధుబాల అంది. దిలీప్ చెప్పలేదు. ఆ వాక్యూమ్‌ను నింపుకోవడానికి ఆమె హడావిడిగా వివాహితుడైన కిశోర్ కుమార్‌ను పెళ్లి (1960) చేసుకుంది. కాని దిలీప్, మధుబాల తమ టర్మ్స్ బాగలేకపోయినా ఎంతో ప్రొఫెషనలిజమ్‌తో మొఘల్ ఏ ఆజమ్‌లో నటించారు. ఉద్యానవనంలో ఎక్కడో దూరంగా తాన్సేన్ పాడుతూ ఉండగా వారి మధ్య ప్రణయ సన్నివేశం ఒకటి నడుస్తుంది. దానిని చూసిన వారెవరైనా వారు మాటలు మానుకున్న ప్రేమికులు అనుకోగలరా? వారి ప్రేమ కనీసం తెర మీదైనా పండింది. మధుబాలతో... ఆమె అతణ్ణే తన బిడ్డ అనుకుంది ప్రేమికులు మొండిగా ఉంటారు. మధుబాలను ప్రేమించిన దిలీప్ కుమార్ ఆమెతో పెళ్లి ఇక జరగదని అర్థమయ్యాక (1957) దాదాపు 11 ఏళ్ల పాటు మరో ప్రేమకథ వైపు చూళ్లేదు. ఆ కాలంలో అతని జీవితం లో ఏ స్త్రీ ఉందో కూడా ఎవరికీ తెలియదు. కాని తన 44 ఏళ్ల వయసులో తన కంటే 22 ఏళ్లు చిన్నది అయిన సైరా బానుతో ప్రేమలో పడ్డాడు. ఆమె హైస్కూల్ రోజుల నుంచి దిలీప్ ఫ్యాన్. చేసుకుంటే ఇలాంటి వాణ్ణే చేసుకోవాలి అనేదట. దిలీప్ కుమార్‌ని కలవడానికే సినిమా రంగంలోకి వచ్చిందట. కాని దిలీప్‌కు ఆమె పట్ల ఎటువంటి భావాలూ లేవు. ‘బచ్చీ’ (చిన్న పిల్ల) అని దూరం పెడుతూ వచ్చాడు. సినిమాల్లో తన పక్కన చాలా రోజుల తర్వాతగానీ తీసుకోలేదు. కాని సైరా ప్రేమ దిలీప్ కుమార్ పట్ల గట్టిది. వాళ్లు 1966లో వివాహం చేసుకున్నారు. దిలీప్ కుమార్ మగ దురహంకారి కాడు. పెళ్లయ్యాక సైరాబాను నటిగా కొనసాగడానికి అతడు ఏ అడ్డంకీ చెప్పలేదు. పెళ్లి తర్వాత సైరా దాదాపు పదేళ్లు హీరోయిన్గా నటించింది. ఆమె కెరీర్లో హిట్స్‌గా నిలిచిన ‘పడోసన్’, ‘విక్టోరియా నం.203’ వంటివి పెళ్లి తర్వాతే వచ్చాయి. సైరాకు దూకుడు ఎక్కువ. గర్భం దాల్చిన తర్వాత కూడా షూటింగ్లలో పాల్గొంది. ఆ సమయంలో చేసిన హార్స్ రైడింగ్ ఆమెకు ప్రమాదం తెచ్చి పెట్టిందని అంటారు. కడుపులో బిడ్డకు ఎనిమిది నెలల వయసులో ఆమెకు హై బ్లడ్ ప్రెషర్ వల్ల అబార్షన్ చేయాల్సి వచ్చింది. అంత లేటు అబార్షన్ కావడం వల్ల సైరా మళ్లీ గర్భం దాల్చే శక్తిని కోల్పోయింది. కాని దిలీప్ కాని సైరా కాని దీని గురించి ఎటువంటి ఫిర్యాదు లేకుండా జీవించారు. సైరా తనే దిలీప్‌కు తల్లయ్యింది. అతణ్ణే బిడ్డగా చేసుకుని అనుక్షణం చూసుకుంది. 98వ ఏట ఆఖరి నిమిషం వరకూ కూడా దిలీప్ కోసం పాకులాడిందామె. దిలీప్ మరణంతో ఆమె జీవితంలో అతి పెద్ద శూన్యం రానుంది. సైరాబానుతో పెళ్లి హీరోలకు హీరో హీరో అంటే ఎవరు? ఇన్‌స్పయిర్ చేసేవాడు. దేశంలో నటన విషయంలో దిలీప్ ఇన్‌స్పయిర్ చేసినట్టుగా మరో నటుడు చేయలేదు. నటుడు ధర్మేంద్ర పంజాబ్‌లో కాలేజీకి వెళ్లి వస్తూ దిలీప్‌కుమార్ సినిమాలు చూస్తూ ఇతనిలా హీరో అవ్వాలి అనుకుని హీరో అయ్యాడు. దిలీప్ అంటే ధర్మేంద్రకు చాలా గౌరవం. ఒక కడుపున పుట్టని తమ్ముణ్ణి అని చెప్పుకునేవాడు. దిలీప్ కుమార్ ధర్మేంద్రతో ‘దేవుడు నన్నెందుకు నీ అంత అందంగా పుట్టించలేదు’ అనేవాడు. పాకిస్తాన్ నుంచి శరణార్థిగా వచ్చి ఢిల్లీ శిబిరంలో ఉన్న ఒక బాలుడు సినిమాకు వెళ్లి అందులోని దిలీప్‌ను చూసి హీరో అవ్వాలనుకున్నాడు. ఆ సినిమాలో దిలీప్ పేరు మనోజ్. అదే తన పేరుగా చేసుకున్నాడు. అతడే మనోజ్ కుమార్. అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్ ఇద్దరూ దిలీప్ కుమార్ సినిమాలు చూసి నటనను నేర్చుకున్నామని బహిరంగంగా చెప్పారు, ఆయనను ఇమిటేట్ చేస్తూ నటిస్తారు కూడా. చిన్న గొంతుతో ఇంటెన్స్‌గా నటించడం దిలీప్ మొదట చూపెట్టాడు. అమితాబ్, షారూక్ అలాంటి సన్నివేశాల్లో దిలీప్ మార్గమే పాటిస్తారు. ‘మాకో కొడుకు పుట్టి ఉంటే అచ్చు నీలా ఉండేవాడు’ అని సైరా షారూక్‌తో అంది. ధర్మేంద్రతో..., మనోజ్ కుమార్‌తో.., అమితాబ్, షారూక్‌తో.. హైదరాబాద్ అల్లుడు దిలీప్ కుమార్ హైదరాబాద్ అల్లుడు. అవును. అయితే రెండేళ్లే. 1981–83 మధ్య అతడు తన జీవితంలోకి ఇంకో స్త్రీని ఆహ్వానించాడు. ఆమె హైదరాబాద్‌కు చెందిన అస్మా రహమాన్. ‘నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు ఏదైనా ఉంటే ఆమెను వివాహం చేసుకోవడమే’ అన్నాడు దిలీప్ కుమార్ తన ఆత్మకథ ‘ది సబ్‌స్టాన్స్ అండ్ షాడో’లో. హైదరాబాద్‌లో ఒక క్రికెట్ టోర్నీలో పాల్గొనడానికి వచ్చిన దిలీప్‌కుమార్‌కు అతని చెల్లెళ్లు అస్మా రహమాన్‌ను పరిచయం చేశారు. అప్పటికే ఆమెకు వివాహం అయ్యింది. ముగ్గురు పిల్లలు. కాని ఆమె దిలీప్‌కు చాలా పెద్ద ఫ్యాన్. దిలీప్‌తో విపరీతంగా ప్రేమలో ఉన్న ఆమె అతణ్ణి పెళ్లాడడానికి భర్తకు విడాకులు ఇచ్చింది. దిలీప్ కూడా సైరా నుంచి దాచి పెట్టి ఆమెను వివాహం చేసుకున్నాడు. 1981 లో జరిగిన ఈ వివాహం 1983లో ముగిసింది. సైరా దిలీప్‌ను క్షమించింది. ముంబై నుంచి తిరిగి వచ్చిన అస్మా తిరిగి మునుపటి భర్తను వివాహం చేసుకుని బెంగళూరులో స్థిరపడిందని కథనం. ఆస్మా రహమాన్‌తో... నీ కంటే పెద్దవాడు ఉంటాడు దిలీప్ కుమార్ తన ఆత్మకథలో ఇలా రాశాడు. ‘ఒకసారి విమానంలో ప్రయాణిస్తున్నాను. సాధారణంగా నా పక్క సీటు వాళ్లు నన్ను గుర్తుపట్టి కొంత హంగామా సృష్టిస్తుంటారు. నా పక్కన కూచున్న పెద్ద మనిషి అలా ఏమీ చేయలేదు. కిటికీలో నుంచి చూస్తూ కూచున్నాడు. నేనే ఆయనతో మాట కలిపాను. ఇద్దరం టీ తాగాం. ఆయన ఇంకా నన్ను గుర్తించడం లేదేమిటా అనుకున్నాను. ‘సినిమాలు చూస్తారా?’ అని అడిగాను. ఎప్పుడైనా ఒకసారి అన్నాడాయన. ‘నేను సినిమాల్లో పని చేస్తాను’ అని చెప్పాను. ‘ఓ అలాగా. ఏం చేస్తారు’ అని ఆయన అడిగాడు. ‘నటుణ్ణి’ అని చెప్పాను. ఆయన అంతకుమించి ఏమీ అడగలేదు. విమానం ల్యాండ్ అయ్యాక ఇక తట్టుకోలేక నా పేరు చెప్పాను – ‘నేను దిలీప్ కుమార్‌ని’ అని. ‘నేను జె.ఆర్.డి టాటాని’ అన్నాడాయన. అప్పుడు అర్థం అయ్యింది నాకు... నువ్వు ఎంతైనా ఎదుగు నీ కంటే పెద్దవాడు ఉంటాడు అని. విర్రవీగడం సరి కాదని. ఈ ఘటన నన్ను ఇంకా వినమ్రుడిని చేసింది... అని రాసుకున్నాడాయన. -
ఆయన్ను చూస్తే చాలనుకున్నాను... సినిమా చేశాను
దిలీప్‌కుమార్ అందరూ మెచ్చిన నటుడు. భారతీయ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన నటుడు. అంతటి లెజండరీ నటుడు మన తెలుగు హీరో కృష్ణంరాజు నిర్మించిన ‘ధర్మ్ అధికారి’లో నటించారు. ఇది కృష్ణంరాజు రెండు పాత్రల్లో నటించి, నిర్మించిన ‘బొబ్బిలి బ్రహ్మన్న’కి హిందీ రీమేక్. తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన కె. రాఘవేంద్రరావు హిందీ రీమేక్‌ని తెరకెక్కించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున తండ్రీ కొడుకులుగా బి. గోపాల్ దర్శకత్వం వహించిన ‘కలెక్టర్‌గారి అబ్బాయి’ హిందీ రీమేక్ ‘కానూన్ అప్నా అప్నా’లో దిలీప్ కుమార్ నటించారు. ఈ చిత్రాన్ని బి. గోపాల్ దర్శకత్వంలోనే తెలుగు నిర్మాత ఏఎస్ఆర్ ఆంజనేయులు నిర్మించారు. అలాగే ఎన్టీఆర్ నటించిన ‘రాముడు–భీముడు’ హిందీ రీమేక్ ‘రామ్ ఔర్ శ్యామ్’లోనూ దిలీప్‌కుమార్ నటించారు. తెలుగు నిర్మాతలు చక్రపాణి, బి. నాగిరెడ్డి నిర్మించగా, తాపీ చాణక్య దర్శకత్వం వహించారు. ఇలా తెలుగు చలనచిత్ర దర్శక–నిర్మాతలతో దిలీప్‌కుమార్‌కి అనుబంధం ఉంది. ఇప్పుడు దిలీప్‌కుమార్ భారతీయ సినీరంగాన్ని విషాదంలో ముంచి, తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయనతో సినిమాలు చేసిన రాఘవేంద్ర రావు, కృష్ణంరాజు, బి. గోపాల్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడిన విశేషాల్లోకి వెళదాం... ► నేను నాగేశ్వరరావుగారికి పెద్ద అభిమానిని. నేల టికెట్ కొనుక్కుని మరీ ఆయన సినిమాలు చూసేవాణ్ణి. అలాగే నాకు దిలీప్ కుమార్గారంటే కూడా చాలా ఇష్టం. కాలేజ్ డేస్‌లో ఫ్రెండ్స్ అందరం దిలీప్ కుమార్‌గారు రోజుకి 18 లక్షలు తీసుకుంటారట, చాలా పెద్ద హీరో అని చెప్పుకునేవాళ్లం. అసలు దిలీప్గారిని లైఫ్‌లో దూరంగా అయినా నిలబడి చూడగలమా? అనుకునేవాణ్ణి. కానీ ఆయన సినిమాకి డైరెక్షన్ చేయగలిగాను. ► నాగేశ్వరరావుగారు, నాగార్జునగారు తండ్రీ కొడుకులుగా నా దర్శకత్వంలో వచ్చిన ‘కలెక్టర్‌గారి అబ్బాయి’ని ప్రొడ్యూసర్ ఏస్ఆర్ ఆంజనేయులుగారు హిందీలో రీమేక్ చేద్దామన్నారు. ఆ తర్వాత దిలీప్‌కుమార్‌తో ఈ సినిమా చేస్తున్నాం అని ఆయన అన్నారు. అసలు నాకేమీ అర్థం కాలేదు. ఇంత అదృష్టం మనకు దక్కుతుందా అనిపించింది. దూరంగా అయినా చూడగలుగుతామా? అనుకున్న నాకు ఆయన్ను డైరెక్షన్ చేసే చాన్స్ అంటే చాలా ఆనందంగా అనిపించింది. షాకింగ్‌గా కూడా అనిపించింది. ► ఈ సినిమా గురించి మాట్లాడటానికి ఆంజనేయులుగారు నన్ను ముంబయ్ తీసుకెళ్లారు. దిలీప్‌కుమార్‌గారి ఇంటికి వెళ్లాం. వెళ్లగానే ఆయన కాళ్లకు దండం పెట్టాను. కాసేపయిన తర్వాత ‘ఏంటీ మీరు మాత్రమే మాట్లాడుతున్నారు. డైరెక్టర్ ఏమీ మాట్లాడటంలేదు’ అని ఆంజనేయులుగారిని దిలీప్‌గారు అడిగారు. ‘అలా ఏం లేదు. మీకు పెద్ద ఫ్యాన్ ఆయన. మిమ్మల్ని చూసిన ఆనందంలో మాట్లాడకుండా ఉండిపోయారు’ అంటే ఆయన నవ్వుకున్నారు. అలా ఆయనతో ‘కానూన్ అప్నా అప్నా’ సినిమా చేశాను. ► రీ టేక్ అని చెప్పడానికి టెన్షన్ పడిన సందర్భాలు లేవు. ఎందుకంటే దిలీప్‌గారు చాలా ఆప్యాయంగా, ప్రేమగా ఉండేవారు. ఈ సినిమా కమిట్ అయినప్పుడు ‘గోపాల్.. తెలుగులో ఈ సినిమా పెద్ద హిట్టయిందని నాకు తెలుసు. నాకున్న ఇమేజ్‌కి తగ్గట్టుగా కాకుండా వేరే ఏదైనా ట్రై చేద్దాం.. డిస్కస్ చేద్దాం’ అని చెప్పి, అప్పట్లో రాజేశ్ ఖన్నాగారి ‘ఆరాధన’కు రచయితగా చేసిన సచిన్ బౌమిక్ని పిలిపించారు. దిలీప్‌గారు కొన్ని సలహాలూ సూచనలూ ఇచ్చి, ‘నువ్వు ‘నో’ అంటే ‘నో’. నీకూ కరెక్ట్‌గా అనిపిస్తేనే పెట్టు. లేకపోతే వద్దు. ఎందుకంటే తెలుగు వెర్షన్ కోసం చాలా రోజులు వర్క్ చేశారు. ఆ కథ డిస్ట్రబ్ కాని మార్పులే చేద్దాం. లేకపోతే వద్దు’ అన్నారు. అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ► ‘నేను మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.15 లోపు షూటింగ్‌కి వస్తాను. నా అలవాటు అది. మీకేమైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పండి’ అని ముందే మాతో అన్నారు. ఆయనకు తగ్గట్టుగానే షూటింగ్ ప్లాన్ చేశాం. దిలీప్‌గారు బాగా షటిల్ ఆడేవారు. బాగా ఎక్సర్సైజులు కూడా చేసేవారు. అవన్నీ చేసుకుని చెప్పినట్లుగానే 12 గంటలకల్లా లొకేషన్లో ఉండేవారు. కంటిన్యూస్‌గా సాయంత్రం 3 గంటల వరకూ షూటింగ్ చేసినా బ్రేక్ కావాలనేవారు కాదు. 3 గంటల తర్వాత లైట్‌గా లంచ్ తిని, ఓ అరగంట రెస్ట్ తీసుకుని, మళ్లీ ఫుల్ ఎనర్జీతో షూటింగ్లో పాల్గొనేవారు. హైదరాబాద్‌లో, మదరాసులలో షూటింగ్ చేసినప్పుడు బస చేసిన హోటల్లో షటిల్ ఆడుకుని షూటింగ్‌కి వచ్చేవారు. ► అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ చేశాం. అప్పుడు నాగేశ్వరరావుగారు వచ్చారు. దిలీప్‌గారు, ఆయన ఇద్దరూ కూర్చుని ఆప్యాయంగా మాట్లాడుకుంటుంటే చూడటానికి రెండు కళ్లూ చాలలేదు. ఒకరినొకరు గౌరవించుకున్న తీరు చూసి, నాకు చాలా ముచ్చటేసింది. ► దిలీప్‌గారు ఎక్కువ టేక్స్ తీసుకునేవారు కాదు. ‘కానూన్ అప్నా అప్నా’కి ఖాదర్ ఖాన్ డైలాగ్ రైటర్. ఆయన ఒక పెద్ద క్యారెక్టర్ కూడా చేశారు. ఖాదర్ రాసిన వెర్షన్ తీసుకెళ్లి, దిలీప్‌గారు ఫైనల్‌గా ఒక వెర్షన్ రాసుకొచ్చేవారు. ఖాదర్ ఖాన్ రాసిన ఫ్లేవర్ పోకుండా చిన్న చిన్న మార్పులతో డైలాగులు రాసుకొచ్చేవారు. క్యారెక్టర్ని ఓన్ చేసుకోవడానికి ఆయన అలా చేసేవారు. అంటే.. ఎంత హోమ్‌వర్క్ చేసేవారో ఊహించవచ్చు. ► కానూన్ అప్నా అప్నా’ చేసిన కొంతకాలం తర్వాత ఓ సందర్భంలో చెన్నైలో దిలీప్కుమార్గారిని కలిశాను. గుర్తుపట్టి, ‘గోపాల్.. ఎలా ఉన్నావ్’ అని ఆప్యాయంగా పలకరించారు. ఒక లెజండరీ నటుణ్ణి కోల్పోయాం. చాలా బాధగా ఉంది. ఇండియన్ సినిమాకు గుర్తింపు తెచ్చిన నటుడు – కృష్ణంరాజు ► ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఇండస్ట్రీకి గుర్తింపు తెచ్చిన గొప్ప కళాకారుడు దిలీప్‌కుమార్. ప్రతి సినిమాలో ఆయన నటన ఎంతో గొప్పగా ఉంటుంది. వ్యక్తిగా కూడా చాలా గొప్పవారు. దిలీప్‌కుమార్‌కి నేను పెద్ద అభిమానిని. ‘బొబ్బలి బ్రహ్మన్న’ సినిమాలో యంగ్, ఓల్డ్ క్యారెక్టర్స్ నేనే చేసినప్పటికీ హిందీలో రీమేక్ చేయాలన్నప్పుడు పెద్ద వయసు పాత్రకు ధర్మేంద్రను, యంగ్ క్యారెక్టర్‌కు జితేంద్రను అనుకున్నాం. అలా అనుకున్నప్పటికీ దిలీప్‌కుమార్ అభిమానిగా ఆయన నటిస్తే బాగుంటుందనుకున్నాను. కానీ నటిస్తారో లేదో అని సందేహం. కానీ దిలీప్‌కుమార్‌గారు ‘బొబ్బిలి బ్రహ్మన్న’ సినిమా చూసి, నాకు ఫోన్ చేసి అభినందించారు. నటిస్తానని అన్నారు. అలా ‘ధర్మ్ అధికారి’ ఆరంభమైంది. ఇందులో యంగ్ క్యారెక్టర్‌ను జితేంద్ర చేశారు. ► సాధారణంగా దిలీప్‌కుమార్‌గారు సినిమా షూటింగ్‌కు మధ్యాహ్నం 12 గంటల మధ్యలో వచ్చేవారు. కానీ ఈ సినిమాకి మాత్రం ఉదయం ఏడు గంటలకే సెట్స్‌కి వచ్చేవారు. ఇందులోని ధర్మ్ రాజ్ క్యారెక్టర్ ఎంత బాగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే నేనంటే ఆయనకు ఉన్న ఇష్టం కూడా ఆయన్ను సెట్స్‌కు రప్పించిందేమో! ‘భాయీజాన్’ అంటూ ఆప్యాయంగా హత్తుకునేవారు. ► ఈ సినిమా షూటింగ్ అప్పుడు ఓ సందర్భంలో జితేంద్ర ఓ సన్నివేశానికి ఇంకా కాస్ట్యూమ్‌తో రెడీ కాలేదు. దిలీప్‌కుమార్‌గారు ఆలస్యంగా వస్తారని ఆయన అనుకున్నారు. కానీ ఆల్రెడీ వచ్చారని, షాట్‌కు రెడీ అయిపోయారని చెప్పాను. ‘దిలీప్‌గారు అప్పుడే వచ్చారా.. అబద్ధం చెప్పకు’ అని జితేంద్ర అన్నారు. ‘లేదు.. వచ్చారు’ అని చెప్పగానే అప్పటికప్పుడు జితేంద్ర షాట్‌కు రెడీ అయ్యారు. ► ‘బొబ్బిలి బ్రహ్మన్న’ చిత్రం 100 డేస్ ఫంక్షన్‌కు దిలీప్‌గారు వచ్చారు. ఆయనతో పాటు ఆయన భార్య సైరా బానుని కూడా తీసుకువచ్చారు. నేను, దిలీప్, ఆమె ఒకే చోట పక్కపక్కనే కూర్చున్నాం. అప్పుడు వేదిక మీద ఉన్న ‘బొబ్బిలి బ్రహ్మన్న’ పోస్టర్ చూసి, ఆయన ఎవరు? అని దిలీప్గారిని సైరా బాను అడిగారు. ‘నీ పక్కన ఉన్న అతన్ని అడుగు’ అని నన్ను చూపిస్తూ, ఆయన చమత్కరించారు. అప్పట్లో నేను యంగ్‌గా ఉన్నాను. పోస్టర్లో పెద్ద వయసున్న బ్రహ్మన్న గెటప్‌లో నన్ను గుర్తుపట్టలేకపోయారామె. యంగ్ రవి పాత్రను మాత్రమే నేను చేశానని ఆమె అనుకుని ఉంటారు. లెజెండ్ దూరమయ్యారు – కె. రాఘవేంద్రరావు భారతీయ సినిమా చరిత్రలో టాప్ లెజెండ్ దిలీప్‌కుమార్‌గారు. అన్ని రకాల పాత్రలు చేసిన గొప్ప నటుడు. ‘బొబ్బిలి బ్రహ్మన్న’ స్క్రిప్ట్ చదివి, సినిమా చూడగానే హిందీ రీమేక్‌లో నటించడానికి ఒప్పుకున్నారాయన. ఈ సినిమా షూటింగ్ అప్పుడు రాజమండ్రిలో చిన్న విలేజ్ దగ్గర ఓ ఇల్లు తీసుకున్నాం. అప్పుడు దిలీప్‌గారి భార్య సైరా బాను కూడా వచ్చారు. ఇద్దరూ చాలా సింపుల్ పర్సన్స్. ఒక గొప్ప వ్యక్తితో, గొప్ప నటుడితో సినిమా చేయడం నాకు హ్యాపీ అనిపించింది. ఇండియన్ ఇండస్ట్రీ ఒక లెజెండ్‌ని కోల్పోయింది. ప్రముఖుల నివాళి ‘‘ఒక శకం ముగిసింది. ఇక భారతీయ సినిమా అంటే దిలీప్‌కుమార్‌కి ముందు ఆ తర్వాత అనాలి’’ అంటూ దక్షిణ, ఉత్తరాది భాషలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు దిలీప్‌కుమార్ మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. లెజెండరీ యాక్టర్ దిలీప్‌కుమార్‌గారి మరణంతో భారతీయ సినీ పరిశ్రమలో ఓ శకం ముగిసింది. భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుల్లో దిలీప్‌కుమార్‌గారు ఒకరు. ఆయన ఒక యాక్టింగ్ ఇనిస్టిట్యూషన్. తన నటనతో దశాబ్దాలుగా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన సినీ సంపద. – చిరంజీవి భారతీయ సినీ పరిశ్రమకు దిలీప్‌కుమార్‌గారి మరణం తీరని లోటు. ఒక నటుడిగా మొదలై స్టార్‌గా ఎదిగిన దిలీప్‌గారి మరణంతో భారతీయ సినీ పరిశ్రమలో ఓ శకం ముగిసింది. అయితే వివిధ సందర్భాల్లో ఆయన్ను కలుసుకోగలిగినందుకు ఐ యామ్ బ్లెస్డ్. – మోహన్‌బాబు దిలీప్‌కుమార్ సార్ మనకు శాశ్వతంగా దూరమయ్యారనే వార్త నన్ను బాధించింది. ఆయన ఎప్పటికీ ఓ లెజెండ్. మన హృదయాల్లో దిలీప్‌గారి లెగసీ ఎప్పటికీ నిలిచే ఉంటుంది. – వెంకటేశ్ ప్రపంచ సినిమాపై దిలీప్‌కుమార్ చెరగని ముద్ర వేశారు. గ్రేటెస్ట్ యాక్టర్. లెజెండ్స్ ఎప్పటికీ బతికే ఉంటారు – రవితేజ దిలీప్‌గారి ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాక్టర్స్ అందరికీ ఓ ప్రేరణ. సినీ చరిత్రలో నిలిచిపోతారు. – మహేశ్‌బాబు భారతీయ సినీ పరిశ్రమ ఎదుగుదలలో దిలీప్‌కుమార్‌గారి పాత్ర విలువైనది. – జూనియర్ ఎన్టీఆర్ దిలీప్‌కుమార్‌గారి మరణం ఇండియన్ సినిమాకు తీరని లోటు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేం. – రామ్‌చరణ్ దిలీప్‌కుమార్‌గారు భారతీయ సినిమాకు చేసిన కృషి అసమానమైనది. ఈ తరం యాక్టర్స్‌కే కాదు. భవిష్యత్ తరాల యాక్టర్స్‌కూ ఆయన ఓ స్ఫూర్తి. – అల్లు అర్జున్ ఒక ఇనిస్టిట్యూషన్ వెళ్లిపోయింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమ చరిత్రను రాస్తే అది కచ్చితంగా దిలీప్‌కుమార్‌కు ముందు, దిలీప్‌కుమార్ తర్వాత అన్నట్లు ఉంటుంది. – అమితాబ్ బచ్చన్ దిలీప్ కుమార్‌తో నేను ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించాను. దిలీప్, సైరా బానులతో నాకు మంచి అనుబంధం ఉంది. కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలనే కాదు.. ఇతర సంగతుల గురించి కూడా మేం మాట్లాడుకునేవాళ్లం. ఆయన సినిమాలు విడుదలైన ప్రతిసారీ సైరా నన్ను వాళ్ల ఇంటికి ఆహ్వానించేవారు. నేను వెళితే ‘‘మన ఇంటికి ఎవరు వచ్చారో చూడు.. మన ‘మధుమతి’ (దిలీప్‌కుమార్ సరసన వైజయంతీ మాల నటించిన సినిమా) వచ్చారు’’ అని దిలీప్‌తో సైరా అనేవారు. అప్పుడు ‘ధనో వచ్చింది’ అని దిలీప్ అనేవారు. ‘గంగాజమున’ చిత్రంలో నేను పోషించిన పాత్ర పేరు ధనో. దిలీప్‌కుమార్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. తనతో కలిసి ఉండేందుకు ఆ అల్లాయే దిలీప్‌ను పిలిచాడని అనుకుంటున్నాను. – వైజయంతీ మాల నా ఆప్యాయమైన సోదరుడు దిలీప్‌కుమార్‌ని కోల్పోయాను. మా దిలీప్ ఉండటం ఆ స్వర్గానికే అదృష్టం. – ధర్మేంద్ర నా జీవితంలో ఓ తండ్రిలా ఉన్న దిలీప్ సార్‌తో నాకు ఎన్నో ప్రత్యేకమైన అనుభూతులు ఉన్నాయి. – సంజయ్ దత్ ఇండియన్ సినిమా అద్భుతమైన నటుడిని కోల్పోయింది. ఇలాంటి ప్రతిభాశాలి లేరు, రారు. – సల్మాన్ ఖాన్ అద్భుత నటన ద్వారా విలువైన, వెలకట్టలేని, ప్రత్యేకమైన బహుమతులను మాకు ఇచ్చిన యూసుఫ్ సాహెబ్‌కు ధన్యవాదాలు. నా దృష్టిలో మీరెప్పటికీ గ్రేటెస్ట్. సలామ్! – ఆమిర్ ఖాన్ ఈ ప్రపంచంలో చాలామంది హీరోలు ఉండొచ్చు. కానీ మా యాక్టర్స్ హీరో దిలీప్‌కుమార్ సారే. ఇండియన్ సినిమాలో ఆయన మరణంతో ఓ శకం సమాప్తమైపోయింది. – అక్షయ్‌కుమార్ -
22 ఏళ్ల వ్యత్యాసం.. ఎప్పటికీ తల్లి కాలేరు.. అయినా!
Dilip Kumar Saira Banu Love Story(సాక్షి, వెబ్‌డెస్క్): వయసులో ఇరవై రెండేళ్ల వ్యత్యాసం.. అయితేనేం అన్యోన్య దాంపత్యం వారిది. తరతరాలకు స్ఫూర్తినిచ్చే అద్భుతమైన ప్రేమ కథకు ఆ జంట ప్రాణం పోసింది. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా 54 ఏళ్ల పాటు కలిసే జీవన ప్రయాణాన్ని కొనసాగించింది. చిన్న చిన్న అపార్థాలకే విడాకులు తీసుకుంటారనే అపవాదు ఉన్న సినీ ఇండస్ట్రీలోనే వారూ ఉన్నారు. కానీ అభిప్రాయ భేదాలు తలెత్తినా సర్దుకుపోయారే తప్ప ఒకరి చేయి ఒకరు వీడలేదు. ఆయన మరొకరిని పెళ్లాడినా.. ఆమె అర్థం చేసుకున్నారే తప్ప అడ్డుచెప్పలేదు. ఆమె సహనం వహించింది. ఆయన తప్పు తెలుసుకున్నాడు. పొరపొచ్చాలు తొలగిపోయాయి. ఎప్పటిలాగే వారి అనుబంధం కొనసాగింది. కానీ ఇప్పుడు మృత్యువు వారిని విడదీసింది. బాలీవుడ్ ట్రాజెడీ కింగ్‌గా పేరొందిన దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ శాశ్వతంగా లోకాన్ని వీడి వెళ్లారు. లక్షలాది మంది అభిమానులతో పాటు భార్య సైరా బానుకు తీరని దుఃఖం మిగిల్చారు. పన్నెండేళ్ల వయసులోనే దిలీప్‌తో ప్రేమలో పడ్డ సైరా! అప్పటికే దిలీప్ కుమార్ బాలీవుడ్లో స్టార్‌గా ఎదిగారు. 1944లో జ్వర్ భాతా సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన ఆయన.. 1955 నాటికి ఆజాద్, దేవదాస్ సినిమాలతో బిగ్గెస్ట్ హిట్లతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. వారిలో సైరా బాను కూడా ఒకరు. ఆయనంటే ఆరాధన ఆమెకు. 'మొఘల్-ఎ-ఆజామ్' సినిమా సమయంలో దిలీప్‌ను కలవాలని ఎంతగానో ఆరాటపడ్డారు సైరా. కానీ కనీసం ఆమె వైపు చూడను కూడా చూడలేదాయన. ఆమె చిన్నబుచ్చుకుంది. అయితే, కొన్నాళ్ల తర్వాత ఆమె కోరిక నెరవేరింది. ఎట్టకేలకు ఆయనను కలిసే భాగ్యం లభించింది. సైరాను చూసి చిరునవ్వు చిందించాడు దిలీప్. గాల్లో తేలిపోయిందామె. మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఏదో ఒకరోజు దిలీప్‌ను పెళ్లి చేసుకుని భార్యను కావడం తథ్యం అని ఆనాడే బలంగా నమ్మింది. దిలీప్ పెద్దగా ఇంట్రస్ట్ చూపలేదు.. కానీ తన తల్లి, నటి నసీం బాను వారసత్వంతో బీ-టౌన్లో అడుగుపెట్టింది సైరా. ఎంతో మందికి జోడీగా నటించింది. అవేమీ ఆమె మనసుకు తృప్తినివ్వలేదు. ఎలాగైనా దిలీప్‌తో జోడీ కట్టాలి.. ఆయనకు జంటగా కనిపించాలి అని తహతహలాడేది. కానీ, దిలీప్ కుమార్ మాత్రం పెద్దగా ఆసక్తి కనబరచలేదు. తన పక్కన సైరా మరీ చిన్నదానిలా కనిపిస్తుందని ఆయన భావన. అయినా ఎన్నాళ్లని తప్పించుకుంటారు.. సైరా అందం, ఆకర్షణీయ రూపానికి ఎలా ఫిదా కాకుండా ఉంటారు. అలాంటి ఒకరోజు రానే వచ్చింది. ఆనాడు కారులో వెళ్తున్న సమయంలో.. ఓ పూదోటలో సైరాను చూశాడు దిలీప్ కుమార్. చీరకట్టులో నిండైన రూపంతో నిల్చుని ఉన్న ఆమెను చూసి, ‘‘ఇన్నాళ్లు నేను కాదనుకుంటోంది ఈ అందాల రాశినా! తను చిన్నపిల్ల కాదు. పరిపూర్ణ మహిళ. తనతో కలిసి నటించాల్సిందే’’ అనుకున్నాడు ఆయన. వెంటనే కారు దిగి, సైరాతో కరచాలనం చేశాడు. ఆనాటి నుంచి 54 ఏళ్ల వరకు ఆమె చేతిని వీడలేదు. కలిసి నటించారు.. అనుబంధాన్ని పెనవేసుకున్నారు సగీనా మహతో, చోటీ బహూ, దునియా వంటి చిత్రాల్లో జంటగా నటించారు దిలీప్- సైరా బాను. ఆ సమయంలో వారి మధ్య పరిచయం, గాఢమైన స్నేహంగా మారింది. కూతురి మనసు తెలుసుకున్న సైరా తల్లి నసీం బాను.. వీరిద్దరిని మరింత చేరువ చేసింది. వారి అనుబంధానికి వారధిగా నిలిచింది. ఈ క్రమంలో.. ఓ శుభ ముహూర్తాన దిలీప్.. సైరా ముందు తన మనసులోని మాటను బయటపెట్టారు. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది సైరా. అతడి ప్రేమను మనస్ఫూర్తిగా ఆమె అంగీకరించింది. 22 ఏళ్ల వ్యత్యాసం.. ఎప్పటికీ తల్లి కాలేరు 1966లో ఇద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అప్పటికి సైరాకు 22 ఏళ్లు. దిలీప్ కుమార్ వయస్సు 44. ఇద్దరి మధ్యా 22 ఏళ్ల వ్యత్యాసంపై ఎన్నో విమర్శలు వినిపించాయి. వీరి బంధం మూణ్ణాళ్ల ముచ్చటే అనే పెదవి విరుపులు. కానీ, అది తప్పని నిరూపించారు ఇద్దరూ. ఇక పెళ్లి తర్వాత కూడా సైరా కొన్నాళ్ల పాటు సినిమాల్లో నటించారు. పెద్ద హీరోలతో కలిసి పనిచేశారు కూడా. ఇటు కెరీర్, అటు వైవాహిక జీవితం సాగిపోతోందనుకుంటున్న సంతోష సమయంలో ఓ పెద్ద కుదుపు. 1972లో గర్భవతి అయ్యారు సైరా. ఇద్దరూ ఆనందంలో తేలిపోయారు. చిన్నారి రాకకోసం వేయి కళ్లతో ఎదురుచూశారు. కానీ, విధిరాత మరోలా ఉంది. ఎనిమిదో నెలలో సైరాకు గర్భస్రావం అయ్యింది. ఈ క్రమంలో తలెత్తిన అనారోగ్య సమస్యల వలన ఆమె ఎప్పటికీ తల్లికాలేరని నిర్ధారించారు వైద్యులు. పలువురితో సంబంధాలు.. రెండో వివాహం ఎప్పుడైతే సైరా ఇక గర్భవతి కాలేరన్న నిజం ప్రపంచానికి తెలిసిందో.. అప్పటి నుంచి పలువురు బాలీవుడ్ నటీమణులతో కలిపి దిలీప్ కుమార్ పేరు వినిపించేది. ఆయన మరో పెళ్లికి సిద్ధమయ్యారనేది ఆ వార్తల సారాంశం. వీటన్నిటిని చూసి, సైరాకు దుఃఖం పొంగుకొచ్చేది. దిలీప్ ఎప్పటికీ తన చేయి వీడడని మనసు ఎంతగా చెబుతున్నా.. ఎక్కడో ఏదో అనుమానం. ఊహించిందే నిజమైంది. ఆస్మా రెహమాన్ వారి జీవితాల్లో ప్రవేశించింది. పెద్ద తప్పు చేశాను.. దిలీప్ పశ్చాత్తాపం హైదరాబాద్‌లో ఓ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన సమయంలో ఆస్మాను కలిశాడు దిలీప్. ఆయన సోదరీమణులు ఫౌజియా, సయీదాలకు స్నేహితురాలు ఆమె. వారే తనను దిలీప్‌నకు పరిచయం చేశారు. అప్పటికే ఆస్మా.. ముగ్గురు పిల్లల తల్లి. అయినా ఎందుకో దిలీప్ కుమార్ ఆమె వైపు ఆకర్షితుడయ్యాడు. ఆస్మాను పెళ్లాడాడు. కానీ, ఆ బంధం రెండేళ్లకే ముగిసిపోయింది. ఆస్మాకు విడాకులు ఇచ్చి మళ్లీ సైరా చెంతకే చేరాడు దిలీప్ కుమార్. జీవితంలో తను రెండో పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశానని, కొన్ని అనివార్య కారణాలు, ఒత్తిడి వల్లే అలా చేయాల్సి వచ్చిందని, ఆ చేదు జ్ఞాపకాలను మరిచిపోవాలనుకుంటున్నానని దిలీప్ తన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నారు. నాకు ఆయనే సర్వస్వం.. అందుకే నిజానికి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తనను కాదని వేరే మహిళను జీవితంలో ఆహ్వానిస్తే ఏ భార్య మళ్లీ ఆ భర్తను క్షమించదు. కానీ, సైరా బాను ప్రేమ అనిర్వచనీయం, అనంతమైనది కదా. అందుకే ఆమె మళ్లీ మనస్ఫూర్తిగా దిలీప్ కుమార్‌ను భర్తగా అంగీకరించింది. ‘‘నాకు ఎల్లప్పుడూ ఆయనే సర్వస్వం. నా జీవితంలో ఆయన ఒక్కరే. ఒక అభిమానిగా, భార్యగా ఆయనను ఆరాధించాను. నాకు తెలుసు ఎంతో మంది అందమైన అమ్మాయిలు ఆయనను పెళ్లి చేసుకోవాలని కలలు కన్నారు. కానీ.. ఆయన నన్ను తన జీవితభాగస్వామిగా ఎంచుకున్నారు. నా కలలన్నీ నిజం చేశారు. ఆయనను ఎలా వదులుకోగలను’’ అంటూ ఒకానొక సందర్భంలో భర్తపై తనకున్న అవ్యాజమైన ప్రేమను చాటుకున్నారు సైరా. దిలీప్ సైతం.. ‘‘నువ్వు ఆ చందమామ కూతురువి. నాకోసం స్వర్గం నుంచి దిగివచ్చావు’’ అంటూ వీలు కుదిరినప్పుడల్లా ఆమెపై ప్రేమ కురిపించేవారు. కానీ, ఇప్పుడు ఆమెను ఇక్కడ వదిలి ఆయనే స్వర్గలోకాలకు వెళ్లిపోయారు. తన ప్రియసఖిని విషాదంలో ముంచివేశారు! -
మూగబోయాను..సైరా భాభీ మీకు నమస్కారం!
సాక్షి, ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మరణంతో సీనీరంగంతో పాటు, యావత్ ప్రపంచం తీవ్ర దిగ్బ్రాంతి లోనైంది. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దీంతో సోషల్ మీడియాలో ‘ఆర్ఐపీ దిలీప్ సాబ్’ ట్రిండింగ్‌లో నిలిచింది. దిలీప్ అస్తమయంపై పలువురు నటీనటులతో పాటు ప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘యూసుఫ్ భాయ్ తన చిన్న సోదరిని విడిచి వెళ్లిపోయారు..నాకేమీ తోచడం లేదు.. చాలా బాధగా ఉంది... మీ జ్ఞాపకాలు ముప్పిరిగొన్నాయి..మౌనం ఆవహించింది’ అంటూ సోషల్ మీడియా ద్వారా తన సంతాపాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా దిలీప్ సతీమణి సైరా బానుపై గౌరవంతో లతాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న యూసుఫ్ భాయ్‌కి సైరా భాభి ఎంతో సేవచూశారు. ఎవర్నీ గుర్తించలేని స్థితిలో ఉన్న ఆయనను రాత్రి పగలూ కంటికి రెప్పలా కాపాడుకున్న సైరాబానుకు నమస్కరిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. యూసుఫ్ భాయ్ ఆత్మకు శాంతికలగాలని ప్రార్థిస్తున్నాన్నారు. ఈ సందర్భంగా దిలీప్ కుమార్‌తో తన కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఇంకా బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ, టాలీవుడ్ హీరోయిన్ తమన్నా తదితరులు దిలీప్ కుమార్ మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. దిలీప్ సాబ్ అల్విదా అంటూ సంతాపం తెలిపిన షబానా, ఆయనకు తాను ఏకలవ్య శిష్యురాలనని చెప్పుకున్నారు. అంతేకాదు. దిలీప్‌జీ నిమాలకు, భాషకు, డిగ్నీటీతోపాటు సామాజిక బాధ్యత వహించినందుకు కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు భర్తను కోల్పోయిన సైరా బాను తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సహచరుడి పార్థివదేహం వద్ద కన్నీరు పెడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు, పలువురు ఓదార్చారు. pic.twitter.com/nPwM4myyOJ — Lata Mangeshkar (@mangeshkarlata) July 7, 2021 यूसुफ़ भाई पिछले कई सालों से बिमार थे, किसीको पहचान नहीं पाते थे ऐसे वक़्त सायरा भाभीने सब छोड़कर उनकी दिन रात सेवा की है उनके लिए दूसरा कुछ जीवन नहीं था. ऐसी औरत को मैं प्रणाम करती हूँ और यूसुफ़ भाई कीं आत्मा को शान्ति मिले ये दुआ करती हूँ. — Lata Mangeshkar (@mangeshkarlata) July 7, 2021 Adieu Dilip Saab . Unknown to you I have been your Eklavya.Thank you for the movies.Thank you for the language . Thank you for the dignity . Thank you for being socially responsible.Thank you🙏🙏 pic.twitter.com/P5UeMUOQ8t — Azmi Shabana (@AzmiShabana) July 7, 2021 -
దిలీప్ కుమార్ కెరీర్లో అద్భుతమైన పాట ఇదే
దిలీప్ కుమార్..ట్రాజెడీ కింగ్ ఆఫ్ బాలీవుడ్ గా పేరు సంపాదించిన గొప్ప నటుడు . ఆరు దశాబ్దాలకు పైగా సినీ జీవితం ఆయనది. 60పైగా చిత్రాల్లో నటించాడు. వాటిలో ఓ మచ్చుతునక ‘మొగలే ఆజమ్’. ఈ సినిమాలో సలీంగా ఆయన పోషించిన పాత్ర మరువలేనిది. అప్పటికే ట్రాజెడీ కింగ్ గా పేరుపొందిన దిలీప్ కుమార్.. ఈ సినిమాలో అద్భుత నటన కనబరిచారు. ఇక ఈ సినమాలోని ‘ప్యార్ కియాతో డర్నా క్యా’పాట ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. బహుశా ఈ పాట వినని సంగీత ప్రియులు ఉండరేమో. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఖ్యాతిని శిఖరాగ్రానికి చేర్చిన పాట ఇది. సినిమా అంతా బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటుంది కానీ ఆ పాట మాత్రం కలర్లో తీశారు. ఈ పాటకి షకీల్ బదాయునీ లిరిక్స్ అందించగా, నౌషాద్ అధ్భుతమైన సంగీతం అందించాడు. మొగలే ఆజమ్’విషయానికొస్తే.. మొఘల్ సామ్రాజ్యంలో యువరాజ్ సలీం, నర్తకి అనార్కలి ప్రేమ కథతో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ఇది. అప్పట్లో భారీ కలెక్షన్లతోపాటు సంచనల విజయం సాధించింది. అక్బర్ కుమారుడు సలీమ్ పాత్రలో దిలీప్ కుమార్ ఒదిగిపోయాడు. యువరాజు సలీమ్‌ను వీరయోధుడిగా మార్చాలనుకున్న అక్బర్ తన కురుమారిడిని యుద్ధ విద్య నేర్చుకునేందుకు చిన్నతనంలో బయటకు పంపిస్తాడు. 14 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన సలీమ్‌కు .. తమ సభలో ఆస్థాన నర్తకి అయిన అనార్కలీ ప్రేమలో పడుతాడు. సలీమ్-అనార్కలీ ప్రేమకథ అందరికీ తెలిసిందే. ఈ ఫిల్మ్‌లో భగ్న ప్రేమికుడగా సలీమ్ తన నటతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని 2004లో పూర్తి స్థాయి రంగుల చిత్రంగా మార్చి విడుదల చేసిన మంచి స్పందన రావడం విశేషం. 41 ఏళ్ల తర్వాత 2006లో పాకిస్థాన్ లో విడుదలైన తొలి హిందీ చిత్రంగా ఘనత కూడా సాధించింది. -
దిలీప్ కుమార్ ఎందుకు పేరు మార్చుకున్నారో తెలుసా?
ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్ మరణం చిత్రపరిశ్రమను అశనిపాతంలా తాకింది. తన నటనతో సినీ ప్రేక్షకులను కట్టిపడేసిన ఆయన నేడు(జూలై 7న) అందరికీ వీడ్కోలు చెప్తూ నింగికేగాడు. అందరికీ దిలీప్ కుమార్‌గా సుపరిచితులైన ఆయన అసలు పేరు మహమ్మద్ యూసఫ్ ఖాన్. సినిమాల్లోకి రాకముందు వరకు ఆయనను అందరూ ఇదే పేరుతోనే పిలిచేవారు. మరి ఆయన పేరెందుకు మార్చుకున్నాడు? ఎవరు మార్చారు? అనేది తెలియాలంటే ఇది చదివేయండి.. యూసఫ్ ఖాన్‌కు నటుడిగా మొదటి ఛాన్స్ ఇచ్చింది నిర్మాత దేవికా రాణి. తను తెరకెక్కించిన 'జ్వర్ భాతా' సినిమా ద్వారా ఆయనను కథానాయకుడిగా పరిచయం చేసింది. అయితే ఈ సినిమా స్టార్ట్ అవడానికి ముందే అతడికి పేరు మార్చుకోమని సలహా ఇచ్చింది. నిన్ను నటుడిగా ఆవిష్కరించబోతున్నానని, దానికంటే ముందు నీకు స్క్రీన్ నేమ్ ఉంటే బాగుంటుందని యూసఫ్ ఖాన్‌తో చర్చించింది. అప్పుడు ఆ స్క్రీన్ నేమ్‌తోనే అందరూ పిలుస్తారని, అందులోనూ రొమాంటిక్ ఇమేజ్ ఉన్న పేరైతే బాగుంటుందని అభిప్రాయపడింది. అంతేకాక ఏ పేరు పెడితే బాగుంటుందా? అని ఆలోచిస్తున్న సమయంలో దిలీప్ కుమార్ అనే పేరును కూడా ఆవిడే సూచించింది. ఆ పేరు తనకు కూడా సమ్మతమే కావడంతో యూసఫ్ ఖాన్ కాస్తా దిలీప్ కుమార్‌గా స్థిరపడ్డాడు. -
భారతీయ సినిమాకు ఆద్యుడు...అభినయం ఒక విశ్వవిద్యాలయం
సాక్షి, ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ అస్తమయంపై సినీ సెలబ్రిటీలతోపాటు, పలువురు రాజకీయ రంగ ప్రముఖులు, ఇతర నేతలు కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ సినిమాకు ఆయన ఆద్యుడు అంటూ కొనియాడారు. 60 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం సినీరంగంలో చిరస్థాయిగా నిలిచి పోతుందంటూ దిలీప్ కుమార్‌కు ఘన నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సినిమా లెజెండ్‌గా దిలీప్ ఎప్పటికీ గుర్తుండిపోతారనిపేర్కొన్నారు. ‘అసమాన తేజస్సు ఆయన సొంతం..అందుకే ప్రేక్షకులు ఆయనను చూసి మంత్రముగ్ధులవుతారు. సాంస్కృతిక ప్రపంచానికి ఆయన మరణం తీరని లోటని’ మోదీ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాజీ రాజ్యసభ సభ్యుడు దిలీప్ నిష్క్రమణపై సంతాపం తెలిపారు. సినీ ప్రపంచం ఒక గొప్ప నటుడుని కోల్పోయిందంటూ వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. Deeply anguished by the passing away of veteran actor & former Rajya Sabha member. In the death of Shri Dilip Kumar, the world of cinema has lost one of the greatest Indian actors. #DilipKumar pic.twitter.com/kW7RMoBBJD — Vice President of India (@VPSecretariat) July 7, 2021 కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా దిలీప్ కుమార్ మృతిపై సంతాపం వెలిబుచ్చారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన అసాధారణ సేవలు రానున్న తరాలకు కూడా గుర్తుండి పోతాయన్నారు. ఈ సందర్భంగా దిలీప్ కుమార్ కుటుంబానికి, స్నేహితులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. బాలీవుడ్లో ఒక అధ్యాయం ముగిసిందంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిలీప్ కుమార్ మృతిపై సంతాపం తెలిపారు. యూసుఫ్ సాబ్ అద్భుతమైన నటనా కౌశలం ప్రపంచంలో ఒక విశ్వవిద్యాలయంలా నిలిచిపోతుందన్నారు. ఆయన మనందరి హృదయాల్లో ఎప్పటికి నిలిచిపోతారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ సీఎం ట్వీట్ చేశారు. భారతీయ సినిమాకు లెజెండ్ దిలీప్ కుమార్ ఆద్యుడు. ఆయన ఎప్పటికీ చిరంజీవిగా మిగిలిపోతారని మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నివాళులర్పించారు. భారతీయ సినీ చరిత్రను లిఖిస్తే.. దిలీప్ కుమార్‌కు ముందు, దిలీప్ కుమార్‌కు తరువాత అని పేర్కొనాల్సి వస్తుందని బాలీవుడ్ మరో సీనియర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన సహ నటుడు దిలీప్ కుమార్‌ను గుర్తు చేసుకున్నారు. కాగా పాకిస్థాన్‌లోని పెషావర్‌లో 1922 డిసెంబర్ 11న జన్మించిన దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తున్న సమయంలో చాలామంది లాగే ఆయన కూడా తన పేరును మార్చుకున్నారు. 1944 తన తొలి సినిమా జ్వర్ భాటా నిర్మాత దేవికా రాణి సూచన మేరకు యూసుఫ్ ఖాన్ తన పేరును దిలీప్ కుమార్‌గా మార్చుకున్నారు. రొమాంటిక్ హీరోగా ప్రఖ్యాతి గాంచిన ఆయన మధుమతి, దేవదాస్, మొఘల్ ఏ ఆజమ్, గంగా జమునా, రామ్ ఔర్ శ్యామ్, కర్మ లాంటి ఎన్నో ప్రసిద్ధ సినిమాల్లో తన నటనతో అజరామరంగా నిలిచిపోయారు. हिंदी फ़िल्म जगत के मशहूर अभिनेता दिलीप कुमार जी का चले जाना बॉलीवुड के एक अध्याय की समाप्ति है। युसुफ़ साहब का शानदार अभिनय कला जगत में एक विश्वविद्यालय के समान था। वो हम सबके दिलों में ज़िंदा रहेंगे। ईश्वर दिवंगत आत्मा को अपने श्री चरणों में स्थान दें। विनम्र श्रद्धांजलि pic.twitter.com/PEUlqSYk3i — Arvind Kejriwal (@ArvindKejriwal) July 7, 2021 My heartfelt condolences to the family, friends & fans of Dilip Kumar ji. His extraordinary contribution to Indian cinema will be remembered for generations to come. pic.twitter.com/H8NDxLU630 — Rahul Gandhi (@RahulGandhi) July 7, 2021 Dilip Kumarji was the doyen of Indian Cinema and will forever be remembered. Condolences to his family and friends. May the legend's soul rest in eternal peace. pic.twitter.com/s8kRj8cFdw — Mohanlal (@Mohanlal) July 7, 2021 T 3958 - An institution has gone .. whenever the history of Indian Cinema will be written , it shall always be 'before Dilip Kumar, and after Dilip Kumar' .. My duas for peace of his soul and the strength to the family to bear this loss .. 🤲🤲🤲 Deeply saddened .. 🙏 — Amitabh Bachchan (@SrBachchan) July 7, 2021 -
దిలీప్‌కుమార్ మృతిపట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి
బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్ మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘దిలీప్ కుమార్ మృతి భారతీయన సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’అని సీఎం జగన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మరణం బాధాకరం. నేటి తరం నటులకు ఆయన ఆదర్శం. మీదైన నటనతో మధుర జ్ఞాపకాలను అందించిన దిలీప్ సర్‌కు ధన్యవాదాలు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి’అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా, గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దిలీప్ కుమార్ (98) బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్. హిందీ చలన చిత్ర పరిశ్రమలో ఓ ట్రెండ్ సెట్టర్. తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్‌ను ఏర్పరచుకున్నారు. దశాబ్దాల పాటు హిందీ చలనచిత్ర రంగాన్ని ఏలారు. భారతీయ చలన చిత్ర రంగంలో గోల్డెన్ ఏజ్‌గా చెప్పుకొనే తరానికి చెందిన నటుడాయన. దేవదాస్, మొఘల్-ఎ-ఆజమ్, గంగా జమున, రామ్ ఔర్ శ్యామ్, నయా దౌర్, మధుమతి, క్రాంతి, విధాత, శక్తి వంటి మైల్ స్టోన్స్ వంటి సినిమాల్లో నటించారు. ఉత్తమ నటుడిగా ఆయనకు 8 సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 1993లో ఫిలింఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. 1994లో దిలీప్‌కుమార్‌ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఈ దిగ్గజ నటుడి సేవలను గుర్తించిన ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2015లో పద్మవిభూషణ్ పురస్కారాలతో ఆయనను సన్మానించింది. -
Dilip Kumar: ఓ శకం ముగిసింది.. సినీ తారల సంతాపం
భారతీయ లెజండరీ నటుడు దిలీప్ కుమార్(98) మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓ శకం ముగిసిందని సంతాపం ప్రకటిస్తున్నారు. సీనీ పరిశ్రమలో లెజెండ్‌గా దిలీప్‌కుమార్ ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతారు. తనదైన నటనతో ఎన్నో ఏళ్ల పాటు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. ఆయన మరణం సినీ లోకానికి, సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటు. ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. Dilip Kumar Ji will be remembered as a cinematic legend. He was blessed with unparalleled brilliance, due to which audiences across generations were enthralled. His passing away is a loss to our cultural world. Condolences to his family, friends and innumerable admirers. RIP. — Narendra Modi (@narendramodi) July 7, 2021 ‘భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఓ శకం ముగిసింది. ఇలాంటి గొప్ప నటుడు మళ్లీ చూడలేం.కొన్నేళ్లపాటు తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్న లెజెండ్ మృతి బాధకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు. An Era comes to an END in the Indian Film Industry.Deeply Saddened by the passing of LEGEND #DilipKumar Saab. One of the GREATEST Actors India has ever produced,an Acting Institution & a National Treasure. Enthralled the world for several decades.May his soul Rest in Peace. pic.twitter.com/f5Wb7ATs6T — Chiranjeevi Konidela (@KChiruTweets) July 7, 2021 ‘భారతీయ సినీ పరిశ్రమ విలువను పెంచిన దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమైనవి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. Dilip Kumar Saab's contribution to the growth of Indian cinema is priceless. Rest in Peace sir. You will be missed — Jr NTR (@tarak9999) July 7, 2021 దిలీప్ కుమార్ సర్ ఇప్పుడు మాతో లేరు. అతను ఎప్పటికే లెజెండే. అతని వారసత్వం ఎప్పటికీ మన గుండెల్లో కొనసాగుతోంది. అతని కుటుంబ సభ్యలను నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నా’అని వెకంటేశ్ ట్వీట్ చేశారు. ‘ఈ ప్రపంచానికి చాలామంది హీరోలై ఉండొచ్చు. దిలీప్‌కుమార్ సర్ మాలో స్ఫూర్తి నింపిన గొప్ప హీరో. సినీ పరిశ్రమకు చెందిన ఒక శకం ఆయనతో ముగిసిపోయింది. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి’అని అక్షయ్ ట్వీట్ చేశారు. To the world many others may be heroes. To us actors, he was The Hero. #DilipKumar Sir has taken an entire era of Indian cinema away with him. My thoughts and prayers are with his family. Om Shanti 🙏🏻 pic.twitter.com/dVwV7CUfxh — Akshay Kumar (@akshaykumar) July 7, 2021 టీ 3958.. ఒక సంస్థ పోయింది. ఎప్పుడైన భారతీయన సినీ చరిత్ర రాయాల్సి వస్తే.. దిలీప్ కుమార్ ముందు.. దిలీప్ కుమార్ తర్వాత అని చెప్పాలి. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’అని అమితాబ్ ట్వీట్ చేశారు. T 3958 - An institution has gone .. whenever the history of Indian Cinema will be written , it shall always be 'before Dilip Kumar, and after Dilip Kumar' .. My duas for peace of his soul and the strength to the family to bear this loss .. 🤲🤲🤲 Deeply saddened .. 🙏 — Amitabh Bachchan (@SrBachchan) July 7, 2021 -
దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూత
ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్(98) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని హిందుజా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన బుధవారం ఉదయం 7.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. నేడు సాయంత్రం ఐదు గంటలకు ముంబైలోని జుహులో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మరణం పట్ల చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇటీవలే ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరగా ప్లూరల్ యాస్పిరేషన్’ (ఊపిరితిత్తుల్లో చేరిన నీటిని తొలగించడం) ప్రొసీజర్ నిర్వహించారు. కానీ మళ్లీ తీవ్ర అస్వస్థతకు లోనవడంతో ప్రాణలు విడిచారు. గతేడాది దిలీప్ కుమార్ సోదరులు అస్లాంఖాన్, ఇషాన్ ఖాన్లు కరోనాతో ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ఈ విషాదం నుంచి కోలుకోక ముందే దిలీప్ కూడా కన్నుమూయడంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. దిలీప్ కుమార్ 1922 డిసెంబర్ 11న పాకిస్తాన్‌లోని పెషావర్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు మహమ్మద్ యూసుఫ్ ఖాన్. బాంబే టాకీస్ యజమాని ఈయనకు దిలీప్ కుమార్ అని నామకరణం చేశాడు. సినిమాల్లోకి రాకముందు దిలీప్ తండ్రితో కలిసి పండ్లు అమ్మారు. ఆ తర్వాత 1944లో జ్వర్ భాతా చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. 1955లో ఆజాద్, దేవదాస్ సినిమాలతో బిగ్గెస్ట్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. 'ఆజాద్' ఆ దశాబ్దిలోనే అధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుకెక్కింది. ఆ తర్వాత వచ్చిన పౌరాణిక చిత్రం 'మొఘల్-ఎ-ఆజామ్'తో ఆయన ప్రేక్షకులకు ఆయన మరింత చేరువయ్యారు. ఓరకంగా చెప్పాలంటే 1944 నుంచి 1998 వరకు దిలీప్ కుమార్ చిత్రసీమను ఏలారనే చెప్పాలి. ఉత్తమ నటుడిగా ఆయనకు 8 సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 1993లో ఫిలింఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. 1994లో దిలీప్‌కుమార్‌ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఈ దిగ్గజ నటుడి సేవలను గుర్తించిన ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2015లో పద్మవిభూషణ్ పురస్కారాలతో ఆయనను సన్మానించింది. 1998లో దిలీప్‌కుమార్‌ను నిషాన్-ఇ-ఇంతియాజ్ అవార్డుతో పాక్ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. 2000 - 2006 వరకు రాజ్యసభ సభ్యుడిగానూ దిలీప్ కుమార్ సేవలందించారు. భారతీయ చిత్రసీమకు మెథడ్ యాక్టింగ్ టెక్నిక్ పరిచయం చేసిన ఆయన సినిమా రంగంలోనే గొప్ప నటుడిగా గుర్తింపు సాధించారు. -
ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా
సాక్షి, ముంబై: వరుస సంఘటనలు బాలీవుడ్ వర్గాలను కలవర పరుస్తున్నాయి. ప్రముఖ నటి మందిరా బేడీ భర్త హఠాన్మరణం బాలీవుడ్ సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. మరోవైపు బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్, మరో ప్రముఖ యాక్టర్ నసీరుద్దీన్ షా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం మరింత ఆందోళనకు గురి చేసింది. జూన్ 11న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన దాదాపు రెండు వారాల తరువాత, దిలీప్ కుమార్ మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. దిలీప్ కుమార్ (98)కు మరోసారి శ్వాస సంబంధింత సమస్యలు తలెత్తడంతో ముంబైలోని హిందుజా హస్పిటల్లో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందనీ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యగానే ఆయన్ను ఆసుపత్రికి తరలించామన్నారు. దిలీప్ కుమార్ ఆరోగ్యంపైఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా (70) కూడా బుధవారం ఆసుపత్రిలో చేరారు. న్యుమోనియాతో బాధపడుతున్న షా ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. చికిత్సకు షా బాగానే స్పందిస్తున్నారని షా మేనేజర్ ధృవీకరించారు. అటు నసీరుద్దీన్ షా భార్య, కుమారుడు వివాన్ సహా కుటుంబమంతా దగ్గరుండి ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నారు. గత రెండురోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయనను జూన్ 29వ తేదీన హాస్పిటల్లో చేర్పించామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుందన్నారు.త్వరలో డిశ్చార్జ్ అవుతారని భావిస్తున్నామని నసీరుద్దీన్ షా భార్య, నటి రత్నా పథక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఊపిరితిత్తుల్లో ప్యాచ్ కారణంగా ఆసుప్రతిలో చేర్పించాల్సి వచ్చిందన్నారు. కాగా మందిరా బేడీభర్త రాజ్ కౌశల్ గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. చదవండి : ప్రముఖ నటి మందిరా బేడి భర్త కన్నుమూత Gold Price: గుడ్‌న్యూస్,ఈ ఒక్క నెలలోనే ఎంత తగ్గిందో తెలుసా?