
దిలీప్ కుమార్
ముంబై: అలనాటి బాలీవుడ్ హీరో దిలీప్ కుమార్ క్షేమంగా ఉన్నట్లు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తెలిపారు. దిలీప్ కుమార్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. దిలీప్ కుమార్ ఆరోగ్యానికి సంబంధించి సామాజిక నెట్వర్క్లో జరిగే ప్రచారాన్ని ఆయన ఖండించారు.
91 ఏళ్ల దిలీప్ కుమార్ ఆరోగ్యంపై సామాజిక వెబ్సైట్లలో పుకార్లు వ్యాపించాయి. యూసఫ్ సాబ్ గురించి నిరాధారమైన పుకార్లు వ్యాపించాయని బిగ్ బీ ట్విట్టర్లో తెలిపారు. దిలీప్ కుమార్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు సైరా జీ తనకు తెలిపినట్లు ట్విట్ చేశారు.
దిలీప్ కుమార్ తన భార్య సైరాభానుతో కలసి ఇటీవల ముంబైలో జరిగిన సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత వివాహ రిసెప్షన్కు హాజరయ్యారు.
**