
మన దేశంలో పలువురు సెలబ్రిటీలు సినిమాలు, యాడ్స్, షోలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తారు. అదే టైంలో ప్రభుత్వానికి ట్యాక్స్ (పన్ను) కూడా కడుతుంటారు. అదీ కోట్లలోనే ఉంటుంది. తాజాగా ఈ లిస్టులో అగ్రస్థానానికి బిగ్ బీ అమితాబ్ (Amitabh Bachchan) వచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకీ గత ఏడాది కాలంలో ఎంత సంపాదించారంటే?
(ఇదీ చదవండి: చిరంజీవికి ముద్దు.. ఈ ఫొటో వెనక ఇంత కథ ఉందా?)
82 ఏళ్ల వయసులోనే ఫుల్ ఎనర్జీతో పనిచేస్తున్న అమితాబ్ బచ్చన్.. గతేడాది 'కల్కి'లో (Kalki 2898AD) ప్రభాస్ కి ధీటుగా నటించి ఆకట్టుకున్నారు. మరోవైపు 'కౌన్ బనేగా కరోడ్ పతి' షోతోనూ అలరిస్తున్నారు. కొన్ని యాడ్స్ కూడా చేస్తున్నారు. అలా 2024-25 సంవత్సరానికి గానూ దాదాపు రూ.350 కోట్ల వరకు సంపాదించారట. ఇందులోనూ రూ.120 కోట్ల ట్యాక్స్ ఈ మధ్యే కట్టారట.
మన దేశంలో అత్యధిక ట్యాక్స్ కట్టే సెలబ్రిటీల్లో గతేడాది షారుక్ ఖాన్ (రూ.92 కోట్లు) అగ్రస్థానంలో నిలిచినట్లు వార్తలొచ్చాయి. ఇతడి తర్వాత తమిళ హీరో దళపతి విజయ్ (రూ.80 కోట్లు), సల్మాన్ ఖాన్ (రూ.75 కోట్లు) ఉండగా.. నాలుగో స్థానంలో అమితాబ్ ఉన్నాడు. ఈసారికి వచ్చేసరికి ఎక్కువ పన్ను కట్టి టాప్ లోకి వచ్చేశాడని సమాచారం.
(ఇదీ చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?)
Comments
Please login to add a commentAdd a comment