Tax Audit
-
ఎంట్రీలు పడుతున్నాయ్.. బీ రెడీ!
గతవారం వరకు వరుసగా అన్ని ఐటీఆర్ ఫారాలను గురించి తెలుసుకున్నాం. ఎన్ని ఫారాలు ఉన్నాయి, ఎవరు ఏ ఫారం వేయాలి మొదలైన విషయాలు తెలుసుకున్నాం. ఇక గడువుల విషయం చూస్తే వేతన జీవులు, ట్యాక్స్ ఆడిట్ వర్తించని వారికి గడువు తేదీ 31 జూలై 2024. ఇతరులకు గడువు తేదీ 30–09–2024. ఈ కాలమ్‌ను ప్రతివారం చదివి అనుసరించే వారికి వచ్చే నెలాఖరు గడువు. ఇప్పుడిప్పుడే అన్ని కార్యాలయాల్లో అధికారులు వారి వారి విధులు నిర్వహించడాన్ని పూర్తి చేస్తున్నారు.అంటే డిస్బర్సింగ్ అధికార్లు, డిడక్టింగ్ అధికార్లు, పన్ను రికవరీ చేయడం, ఆ పన్ను మొత్తాల్ని గవర్నమెంట్ ఖాతాకి చెల్లించడం, ఆ తర్వాత ఫారాలు 16 అలాగే 16 అ తయారు చేసి జారీ చేయడం, టీడీఎస్ రిటర్నులు ఆదాయపు పన్ను శాఖ వారికి దాఖలు చేయడం మొదలైనవి జరుగుతున్నాయి. ఈ అధికార్ల జాబితాలో మీ యాజమాన్యం, బ్యాంకులు, పన్ను రికవరీ చేసే ఇతర అధికార్లు ఉన్నారు. ఆలస్యం కావచ్చు. ఏవో ఇబ్బందులు ఏర్పడవచ్చు.వీటిని ఆధారంగా చేసుకుని డిపార్టుమెంటు వారు తమ సైటులో మీ వివరాలను పొందుపరుస్తారు. వీటినే ఫారం 26 అ, అఐ అంటారు. వీటిలో పద్దులు పడకపోతే, మీరు రిటర్నులు వేయలేరు. అంటే సమాచారం పూర్తిగా లభ్యమవదు. సాధారణంగా ఈ ఫారాల్లోని సమాచారం సంపూర్ణమైనది, సమగ్రమైనది, సరైనది, కచ్చితమైనది, నమ్మతగ్గది. అయితే, తప్పులు సహజం. మీరు, ముందు ఈ రెండింటిలోని ప్రతి అంశాన్ని క్షుణ్నంగా చెక్ చేయండి.మీకు సంబంధించినది కాకపోతే విభేదించండి. అభ్యంతరాలను తెలియజేయండి. అలా జరిగిన వెంటనే డిపార్టుమెంటు వారు సంబంధిత అధికార్లతో సంప్రదింపులు జరిపి, సరిదిద్దుతారు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల మీకు రెస్పాన్స్ రాకపోతే, గడువు తేదీలోపల రిటర్ను వేయటం మాత్రం మానేయకండి. ఆ తర్వాతైనా సర్దుబాట్లు జరగవచ్చు. మిస్‌మ్యాచ్‌కు మరొక కారణం.. డబుల్ ఎంట్రీ. అంటే ఒక వ్యవహారం రెండు సార్లు నమోదు కావడం. మీరు ఒకదాన్నే పరిగణనలోకి తీసుకోండి.మరీ చిత్రమైన విషయం ఒకటుంది. ఈ మధ్య ఒక కుటుంబంలో ముగ్గురు సభ్యులు వారి ఉమ్మడి ఆస్తిని అమ్మగా ఆ విక్రయాల గురించి ముగ్గురి అఐ లలోనూ ఎంట్రీలు కనబడ్డాయి. ఆస్తి అమ్మకం విలువ రు. 4 కోట్లు. ముగ్గురి ‘సమాచారం’లోనూ రూ. 4 కోట్లు అని పడింది. కానీ, జరిగింది ఒకే లావాదేవీ. దాని విలువ రూ. 4 కోట్లు. ఏ స్థాయిలో ఈ తప్పు జరిగిందో కాని రికార్డుల్లో ఎంట్రీలు మూడింతలు పడ్డాయి. ఇటువంటివి జరిగే అవకాశం ఉంది.అలాగే జాయింటుగా ఉన్న బ్యాంకు అకౌంట్లోకి వచ్చే బ్యాంకు వడ్డీ, దాని మీద వడ్డీ, ఇటువంటి విషయాల్లో తగిన జాగ్రత్త వహించండి. ఎంట్రీల్లోని తప్పులను మీకు అనుకూలంగా మల్చుకోకండి. ఒక సమాచారం ఏదేని అఐ లో పడకపోయినా, దాన్ని ఆసరాగా తీసుకుని ఆ ఆదాయం లేదా వ్యవహారాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మర్చిపోకండి. ఈ సంవత్సరం ఫైలింగ్ మొదలెట్టవచ్చు. రెడీ అవ్వండి. – కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు -
ట్యాక్స్ ఆడిట్ చేయించారా? లేదా? లేదంటే..!
టాక్స్ ఆడిట్ అంటే? ఆదాయపు పన్ను చట్టం ప్రకారం కొందరికి ఆడిట్ వర్తిస్తుంది. అలా చేయించే ఆడిట్నే ట్యాక్స్ ఆడిట్ అంటారు. ఎవరికి వర్తిస్తుంది? ఇది ఎన్నో సంవత్సరాల నుంచి అమల్లో ఉంది. ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమాల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరం మీ టర్నోవరు/బిజినెస్ వసూళ్లు/బ్యాంకులో రశీదులు అక్షరాలా ఒక కోటి రూపాయలు దాటితే కంపల్సరీగా ఆడిట్ చేయించాలి. వ్యాపారస్తులకు ఈ పరిమితి రూ. 1 కోటి. వృత్తి నిపుణులకు అయితే రూ. 50,00,000 పరిమితిగా ఉంటుంది. ఎవరు చేస్తారు? ఈ ఆడిట్‌ని డిపార్టుమెంట్ వారు చేయరు. చట్టప్రకారం మనమే.. అంటే అస్సెస్సీలే తమ టర్నోవరు రూ. 1 కోటి దాటితే ప్రాక్టీసులో ఉన్న సీఏ చేత చేయించాలి. ఈ ఆడిట్‌ను మనంతట మనమే స్వయంగా చేయించాలి. అంటే వాలంటరీగా చేయాలి. అలా చేయించినందుకు సీఏకి ఫీజు మనమే ఇవ్వాలి. సకాలంలో చేయించకపోయినా, చేసి ఆడిటర్ రిపోర్ట్‌ను సమరి్పంచకపోయినా, చాలా పెద్ద మొత్తంలో పెనాల్టీలు వేస్తారు. ఆడిట్ వెనుక లక్ష్యం ఏమిటంటే.. ♦ సరైన, తగిన విధంగా, కరెక్టుగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌ను నిర్వహించేలా చూడటం. ♦ అలా నిర్వహించిన అకౌంటు మొదలైన వాటిని సీఏ సర్టిఫై చేయాలి లేదా ధృవీకరించాలి. ♦ ఆడిటింగ్ చేస్తున్నప్పుడు దొరికిన తప్పులు, దొర్లిన తప్పొప్పులు, తేడాలు, మిస్ అయిన అంశాలు, తప్పుడు సమాచారాలు, డబుల్ అకౌంటింగ్, ఆదాయంలో హెచ్చుతగ్గులు, ఖర్చుల్లో హెచ్చుతగ్గులు, వ్యక్తిగత ఖర్చులు, సమంజసం కాని ఖర్చులు, సంబంధం లేని ఖర్చులు, కేవలం ఆ సంవత్సరానికి సంబంధించినవే రాశారా లేదా వేరే సంవత్సరానివి రాశారా, ఆ వ్యాపారానివేనా లేక వేరే వ్యాపారానికి సంబంధించినవా, ఆ వ్యక్తి ఖర్చేనా లేక వేరే వ్యక్తికి సంబంధించినదా? క్యాపిటల్ ఖర్చెంత, రెవెన్యూ ఖర్చెంత? ఒకదానికొకటి సర్దుబాటు చేయలేదు కదా? స్థిరాస్తి కొని మామూలు ఖర్చుగా రాశారా? ఇలా వందలాది ప్రశ్నలకు జవాబులు ఈ రిపోర్టులో రాయాలి. ♦ అంతే కాకుండా అస్సెస్సీ కేవలం చట్టప్రకారం తనకు అర్హత ఉన్న, ఎలిజిబిలిటీ ఉన్న ప్రయోజనాల తగ్గింపులు, మినహాయింపులు మాత్రమే పొందారా లేక అదనంగా ఏదైనా లబ్ధి పొందారా? ♦ అంతే కాకుండా, ఇతర చట్టాల ప్రకారం, అంటే ఈఎస్ఐ, పీఎఫ్, జీఎస్టీ, కంపెనీ లా మొదలైన వాటి ప్రకారం చెల్లింపులు, అవి సక్రమమేనా, సకాలంలో చెల్లించారా .. ఇలా ఎన్నో విషయాలు బయపడతాయి. మీకు నిబంధనలు వర్తించే పక్షంలో ట్యాక్స్ ఆడిట్ తప్పక చేయించండి. అదే మీకు శ్రీరామరక్ష. -కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి ( ట్యాక్సేషన్ నిపుణులు) -కె.వి.ఎన్ లావణ్య( ట్యాక్సేషన్ నిపుణులు ) -
5.83 కోట్లు దాటిన ఐటీ రిటర్నులు
2022-23 సంవత్సరానికి గాను దేశ వ్యాప్తంగా 5.83 కోట్ల ట్యాక్స్ రిటర్న్ దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ట్యాక్స్ ఫైలింగ్‌కి ఈ రోజే చివరి రోజు కావడంతో పన్ను చెల్లింపు దారులు ఈ-ఫైలింగ్ చేసేందుకు పోటీపడుతున్నారు. ఈ రోజు (జూలై 30) మధ్యాహ్నం 1 గంటల వరకు 5.83 కోట్ల ఐటీఆర్‌లు ఫైలింగ్ జరిగాయని ఆదాపు పన్ను శాఖ ట్వీట్ చేసింది. దీంతో గత ఏడాది జూలై 31 వరకు దాఖలు చేసిన ఐటీఆర్‌ల సంఖ్యను దాటింది అని ఐటీ శాఖ ట్వీట్లో పేర్కొంది. . ఆదాయపు పన్ను రిటర్నుల గణాంకాలను అందిస్తూ.. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఈరోజు మధ్యాహ్నం 1 గంటల వరకు 46 లక్షలకు పైగా ఫైలింగ్ చేసినట్లు తెలిపింది. శనివారం ఒక్కరోజే 1.78 కోట్ల మంది ఈ పోర్టల్‌లో విజయవంతంగా లాగిన్లు జరిగాయి. గడిచిన గంటలో 3.04 లక్షల ఐటీఆర్‌లు దాఖలు చేయబడ్డాయి” అని ఐటీ శాఖ మధ్యాహ్నం 02:03 గంటలకు ట్వీట్ చేసింది. 📢 Kind Attention 📢 Here are some statistics of the Income Tax Returns filed. 5.83 crore #ITRs have been filed till 1 pm today (30th July) crossing the number of ITRs filed till 31st July, last year. We have witnessed more than 46 lakh successful logins till 1 pm today and… — Income Tax India (@IncomeTaxIndia) July 30, 2023 -
ట్యాక్స్ ఆడిటింగ్.. సకాలంలో రిపోర్టు సమర్పించకపోతే భారీ పెనాల్టీలు, ఎంతంటే?
ఇప్పుడు ప్రపంచమంతటా వినబడే మాట ఆడిటింగ్. ప్రతి వ్యవహారాన్ని నిర్వహించిన తర్వాత చెక్ చేస్తున్నారు. తనిఖీ అనుకోండి .. సమీక్ష అనుకోండి.. శోధన అనుకోండి. ప్రతి చట్టంలోనూ ‘‘ఆడిటింగ్’’ చేయాలని చెబుతున్నారు. అలా ఆదాయపు చట్టంలో కూడా ఒక ఆడిట్ ఉంది. దాని పేరు ‘‘ట్యాక్స్ ఆడిట్’’. కొన్ని నిబంధనల ప్రకారం వృత్తి నిపుణులు, వ్యాపారస్తుల అకౌంట్స్‌ను ఆడిట్ చేయించాలి. ఎందుకు చేయించాలి? అసెసీలు సరైన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ నిర్వహిస్తున్నారా లేదా? సరిగ్గా అన్నీ క్లెయిమ్ చేస్తున్నారా లేదా? మోసపూరితమైన వ్యవహారాలు జరిగాయా? అనేది చూసేందుకు దీన్ని నిర్దేశించారు. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ సక్రమంగా నిర్వహించడం వల్ల ఆదాయపు అధికారులకు పని ఒత్తిడి తగ్గుతుంది. టైమ్ వృధా కాదు. ఈ ఆడిట్ ఎవరు చేస్తారు.. ప్రాక్టీస్ చేస్తున్న సీఏలు మాత్రమే ఈ ఆడిట్ చేయాలి. తర్వాత వారు రిపోర్టును ఫారం 3 ఇఅ/3 ఇఆ/3 ఇఈ రూపంలో ఇవ్వాలి. ఈ ఆడిట్ ఎవరు చేయించాలి.. ఒక వ్యాపారి అమ్మకాలు, టర్నోవరు, స్థూల వసూళ్లు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1 కోటి దాటితే ఆడిట్ చేయించాలి. వృత్తి నిపుణులైతే వారి వార్షిక వసూళ్లు రూ. 50 లక్షలు దాటితే ట్యాక్స్ ఆడిట్ చేయించాలి. వ్యాపారస్తులు రూ. 1 కోటి దాటినా, రెండు కోట్ల లోపల ఉంటే నిర్దేశించిన శాతం మేరకు ‘‘లాభ’’ శాతం ఆదాయంగా డిక్లేర్ చేస్తే ట్యాక్స్ ఆడిట్ వర్తించదు. అంతే కాకుండా రూ. 10 కోట్ల లోపు టర్నోవరు ఉన్నవారికి వారి నగదు వ్యవహారాలు – వసూళ్లు – చెల్లింపులు టర్నోవరులో 5 శాతం దాటకపోతే వారికీ మినహాయింపు ఉంది. దీనర్థం ఏమిటంటే నగదు వ్యవహారాలను కట్టిపెట్టి అంతా బ్యాంకు ద్వారా చేయించడమే. ఫారం 3 ఇఅ/3 ఇఆ/3 ఇఈ అంటే.. ఇది ఆడిట్ రిపోర్ట్ ప్రొఫార్మా. దీని ప్రకారం అన్ని విషయాలు తెలియజేయాలి. ఇందులో వంద పైగా అంశాలు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. అమ్మకాలు, ఆదాయాలు, అప్పులు, ఆస్తులు, చెల్లింపులు, ఖర్చులు ఇలా అన్నీ ఎంతో వివరంగా ఇవ్వాలి. పూర్తిగా ఇవ్వాలి. వివరణ, విశ్లేషణ ఉంటాయి. తప్పులు, ఒప్పులు, సర్దుబాట్లు, దిద్దుబాట్లు.. ఒకటేమిటి అన్నింటినీ డేగకన్నుతో చూస్తారు. సెప్టెంబర్ 30 ఆఖరు తేదీ.. ఈ ఆడిట్ రిపోర్టును సమర్పించడానికి గడువు తేదీ ఈ సంవత్సరం సెప్టెంబర్ 30. ఆడిట్ రిపోర్టుతో పాటు రిటర్నులు కూడా సమర్పించాలి. అన్నింటికీ గడువు తేదీ సెప్టెంబర్ 30. గత సంవత్సరంలో ఈ గడువుని పొడిగిస్తూ వచ్చారు. ఈసారి మాత్రం పొడిగించరండి! భారీ– భారీ పెనాల్టీలు వడ్డిస్తారు.. సకాలంలో ఆడిట్ రిపోర్టు సమర్పించకపోతే పెనాల్టీ వడ్డిస్తారు. రూ. 1,50,000 లేదా టర్నోవరు మీద 5 శాతం.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే అంత మొత్తం వడ్డిస్తారు. వడ్డించే ముందు మర్యాదపూర్వకంగా పిలిచి అన్ని వివరాలూ అడిగి, ఆలస్యానికి కారణం సమంజసమేనని అనిపిస్తే వడ్డించరు. లేదంటే వడ్డన తప్పదు. చదవండి: టెన్షన్ పెడుతున్న కొత్త రకం బ్యాంకింగ్ వైరస్.. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులూ జాగ్రత్త! -
ట్యాక్స్ ఆడిట్ అంటే ఏంటీ? ఎందుకు చేయించాలి? ఎవరికి అవసరం
ఆడిట్ అంటే చాలా మందికి తెలిసిన అంశమే. మన దేశంలో ఎన్నో రకాల ఆడిట్లు అమల్లో ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టంలో కూడా ఒక ఆడిట్ అంశం పొందుపర్చారు. సెక్షన్ 44అఆ ప్రకారం నిర్దేశిత టర్నోవర్/అమ్మకాలు/ వసూళ్లు దాటిన అస్సెస్సీలు వారి అకౌంట్స్‌ను ఆడిట్ చేయించాలి. అలా చేయించడాన్నే ట్యాక్స్ ఆడిట్ అంటారు. ఉద్దేశ్యం ఏమిటంటే .. అస్సెస్సీ సరైన అకౌంటు బుక్స్ నిర్వహించాలి. మిగతా ఎన్నో రికార్డులు రాయాలి. వీటి వల్ల సరైన ఆదాయం తెలుసుకోగలగాలి. అస్సెస్సీకి ఎన్నో మినహాయింపులు, తగ్గింపు, ప్రయోజనాలు ఉంటాయి. వీటి వల్ల ఆదాయపు పన్ను తగ్గుతుంది. ఈ విషయంలో ఎటువంటి అవకతవకలు, తప్పొప్పులు జరగకుండా చూడాలి. అమ్మకాలు, కొనుగోళ్లు, ఆస్తులు, అప్పులు, మూలధనం లేదా పెట్టుబడికి సంబంధించిన సోర్స్‌లు.. ఇలా ఎన్నో అంశాలు పుస్తకాల్లో రాస్తారు. అవి సరైనవేనా .. కాదా అన్నది చెక్ చేయాలి. ఆ ఆడిట్ వల్ల డిపార్ట్మెంటుకు ఎంతో సమయం, వనరులు వృధా కాకుండా ఉంటాయి. ఎవరి అకౌంట్స్ ఆడిట్ చేయాలి.. వ్యాపారం/వాణిజ్యం/ఇతరత్రా బిజినెస్‌లు చేస్తున్నవారికి ఈ ఆడిట్ వర్తిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిమితుల ప్రకారం బిజినెస్ చేసే వారికి వర్తించే పరిమితి రూ. 1 కోటిగా ఉంది. వృత్తికి సంబంధించిన వారికి రూ. రూ. 50 లక్షలుగా ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ పరిమితి దాటితే ట్యాక్స్ ఆడిట్ వర్తిస్తుంది. ఈ పరిమితి ప్రాతిపదికను నిర్ణయించడానికి వసూళ్లు/ఆదాయం/అమ్మకాలు/టర్నోవర్ మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. ఆడిట్ ఎవరు చేయాలి.. ప్రాక్టీసు చేస్తున్న సీఏతో ఈ ఆడిట్ చేయించాలి. సదరు సీఏ .. ఆ వ్యక్తి దగ్గర/సంస్థలో ఉద్యోగంలో చేస్తున్న వారు కాకూడదు. ఎటువంటి ఆర్థిక లావాదేవీలు ఉండకూడదు. సీఏ స్వతంత్ర వ్యక్తి అయి ఉండాలి. సంస్థలు ఏయే బుక్స్ రాయాలి.. చట్టంలో నిర్వచించిన ప్రకారం డేబుక్స్, నగదు చిట్టా, లెడ్జర్లు, అకౌంట్స్ బుక్స్, ఇతర పుస్తకాలు.. రాతపూర్వకంగా గానీ లేదా కంప్యూటర్ ద్వారా, ఫ్లాపీ, డిస్క్, ఎలక్ట్రానిక్ రూపంలో నిర్వహించవచ్చు. వృత్తిలో ఉన్న వారు .. అంటే లీగల్, మెడికల్, ఇంజినీరింగ్, ఆర్కిటెక్ట్, అకౌంటింగ్, టెక్నికల్ కన్సల్టెన్సీ, ఇంటీరియర్ డెకరేషన్ మొదలైన వర్గాల వారు.. ఐటీ అధికారులు అసెస్మెంట్ చేయడానికి సహాయపడే విధంగా ఉండేలా రికార్డులు, అకౌంటు బుక్స్ నిర్వహించాలి. ఇక వ్యాపారస్తులు (వృత్తి నిపుణులు కాని వారు) కొన్ని పరిమితులకు లోబడి అకౌంట్స్ నిర్వహించాలి. ఆ పరిమితులను గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఏతావాతా అమ్మకాలు, టర్నోవరు, వసూళ్లకు సంబంధించిన రికార్డులు రాయాలి. చట్టంలో ఎంతో భాష్యం జోడించారు కానీ.. దీని సారాంశం ఏమిటంటే అమ్మకాలకు సంబంధించిన బిల్లులు, ఇన్వాయిస్లు, రిజిస్టర్లు .. కొనుగోళ్లకు సంబంధించిన ఆస్తులకు, అప్పులకు సంబంధించినవి .. అన్నీ .. సమస్తమూ నిర్వహించాలి. బ్యాంకు అకౌంట్లు, వసూళ్లు/రాబడి/వాపసులు, ఖర్చులు, బిల్లులు, ఓచర్లు, కాగితాలు.. ఇలా ఎన్నో నిర్వహించాలి. - కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) -
ట్యాక్స్ ఆడిట్ పూర్తయిందా? రిటర్ను వేశారా?
ఆదాయపు పన్ను చట్ట ప్రకారం ట్యాక్స్ ఆడిట్ అసెసీలు వారి రిటర్నులను దాఖలు చేయడానికి గడువు తేది ఈ నెలాఖరుతో (30/09/16) ముగుస్తుంది. అసెసీ అకౌంట్లను తనిఖీ చేయడాన్నే ఆడిట్ అంటుంటాం. ఆదాయపు పన్ను చట్ట ప్రకారం చేయించే ఆడిట్‌ను ట్యాక్స్ ఆడిట్‌గా పిలుస్తారు. జీతం మీద ఆదాయం, ఇంటి మీద ఆదాయం, మూలధన లాభాలు, ఇతర ఆదాయం ఉన్న వారికి ఈ ఆడిట్ వర్తించదు. అదేవిధంగా తక్కువ టర్నోవర్, వసూళ్లు ఉన్న వ్యాపారస్తులకు, వృత్తి నిపుణులకు ట్యాక్స్ ఆడిట్ వర్తించదు. ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యాపారం ద్వారా ఒక వ్యక్తి టర్నోవర్, వసూళ్లు, అమ్మకాలు కోటి రూపాయలు దాటితే వారికి ట్యాక్స్ ఆడిట్ వర్తిస్తుంది. ఒక అసెసీ వృత్తిపరమైన టర్నోవర్, వసూళ్లు రూ.25 లక్షలు దాటితే వారు కూడా ట్యాక్స్ ఆడిట్ పరిధిలోకి వస్తారు. కొన్ని వ్యాపారాల్లో ఉన్న అసెసీలకు నిర్దేశించిన లాభ శాతాన్ని లేదా ఎక్కువ లాభ శాతాన్ని ఆదాయంగా పరిగణిస్తారు. అటువంటి వారు అకౌంట్లు రాయాల్సిన అవసరం లేదు. వారికి ట్యాక్స్ ఆడిట్ కూడా వర్తించదు. కానీ వారు నిర్దేశించిన దాని కన్నా తక్కువ లాభాన్ని చూపితే అకౌంట్లు రాసి, ట్యాక్స్ ఆడిట్ చేయించాలి. ట్యాక్స్ ఆడిట్‌ని ప్రాక్టీసులో ఉన్న సీఏలతో చేయించాలి. ఈ ఆడిట్ ద్వారా అసెసీలు మినహాయింపులను, తగ్గింపులను సరిగ్గా చేసుకోవచ్చు. ఈ ఆడిట్ 44ఏబీ సెక్షన్ ప్రకారం జరగాలి. కంపెనీల విషయంలో అయితే కంపెనీ చట్ట ప్రకారం ఆడిట్‌తోపాటు ట్యాక్స్ ఆడిట్ చేయించాలి. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్యాక్స్ ఆడిట్‌ను పూర్తిచేశాక రిపోర్ట్‌ని జతపరుస్తూ 30/09/16 లోపల అసెసీలు ఆన్లైన్ ద్వారా రిటర్నులు వేయాలి. దాఖలుకు అసెసీలకు డిజిటల్ సంతకం కావాలి. ఈ డిజిటల్ సంతకం లేకుండా రిటర్నులు దాఖలు చేయలేరు. ట్యాక్స్ ఆడిట్ చేశాక రిపోర్ట్‌ని ఫారం 3సీఏ/సీబీ, 3సీడీలోనే ఇవ్వాలి. ఫారం 3 సీడీలో ఎన్నో అంశాలను పొందుపరుస్తారు. ఈ అంశాలు సంఖ్యాపరంగా లెక్కిస్తే పది, విడిగా చూస్తే వందలు దాటుతాయి. అన్నింటికీ వివరాలు చూపాలి. అకౌంట్ పుస్తకాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి. స్థిరాస్తుల విక్రయంలో ప్రతిఫలం ఎంత? ఎంత మొత్తం మీద స్టాంప్ డ్యూటీ చెల్లించామో చెప్పాలి. టీడీఎస్, స్టాక్స్ తదితర వాటి వివరాలు తెలపాలి. సెక్షన్ 271బీ ప్రకారం గడువు తేది లోపల రిటర్నులు దాఖలు చేయకపోతే పెనాల్టీ విధిస్తారు. టర్నోవర్‌పై 0.5 శాతం లేదా రూ.1,50,000లో ఏది తక్కువైతే దానిని పెనాల్టీగా చెల్లించాలి. - ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి,కె.వి.ఎన్ లావణ్య -
ట్యాక్స్ ఆడిట్ చేయిస్తున్నారా?
కమ్ సెప్టెంబర్.. కమ్ సెప్టెంబర్.. అలనాటి పేరు పొందిన పాట. పాట పూర్తయ్యే లోపల రానే వచ్చింది సెప్టెంబర్ 2015. ఆదాయపు పన్ను చట్ట ప్రకారం ట్యాక్స్ ఆడిట్ అసెసీలు వారి రిటర్నులను దాఖలు చేయడానికి గడువు తేది ఈ నెలాఖరుతో ముగుస్తుంది. అదే 30-09-2015. గడువు తేది.. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్యాక్స్ ఆడిట్‌ను పూర్తి చేసిన తర్వాత రిపోర్టును జతపరుస్తూ 2015 సెప్టెంబర్ 30లోగా అసెసీలు ఆన్ లైన్ ద్వారా దాఖలు చేయాలి. దాఖలు చేయడానికి అసెసీలకు డిజిటల్ సంతకం కావాలి. డిజిటల్ సంతకం కావాలంటే గుర్తింపు పొందిన ప్రైవేట్ సంస్థలు డిజిటల్ సంతకాన్ని నమోదు చేస్తాయి. ఈ సంతకం లేనిదే రిటర్న్ వేయలేము. ముందుగా సీఏలు ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్‌ని ఆన్లైన్లో దాఖలు చేస్తారు. ఆ తర్వాత అసెసీ ఈ-ఫైలింగ్ ద్వారా రిటర్న్ ఫైల్ చేస్తారు. ఎవరికి వర్తిస్తుంది...? - ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యాపారం ద్వారా ఒక వ్యక్తి యొక్క టర్నోవరు, వసూళ్లు, అమ్మకాలు కోటి రూపాయలు దాటితే, - ఒక ఆర్థిక సంవత్సరంలో వృత్తి ద్వారా ఒక వ్యక్తి యొక్క టర్నోవరు, వసూళ్లు, ఇరవై ఐదు లక్షల రూపాయలు దాటితే, - కొన్ని వ్యాపారాల్లో ఉన్న అసెసీలకు నిర్దేశించిన లాభ శాతం లేదా ఎక్కువ లాభ శాతం ఆదాయంగా పరిగణిస్తారు. అటువంటి వారు అకౌంట్ బుక్స్ రాయనవసరం లేదు. ఆడిట్ అక్కర్లేదు. ఇటువంటి వారు తక్కువ లాభాన్ని చూపిస్తే అకౌంట్స్ రాయాలి. ట్యాక్స్ ఆడిట్ చేయించాలి. ఫారం 3సీఏ/సీబీ మరియు 3సీడీ.. ట్యాక్స్ ఆడిట్ చేసిన తర్వాత రిపోర్టుని ఫారం 3సీఏ/సీబీ మరియు 3సీడీలోనే ఇవ్వాలి. ఇది కాకుండా లోటుపాట్లు, అవకతవకలు పొందుపరుస్తారు. గతంలో చెప్పాల్సిన వివరాల కన్నా కొత్త ఫారంలో అదనపు వివరాలు ఇవ్వాలి. 3సీడీలో ఎన్నో అంశాలు పొందుపరుస్తారు. ఈ అంశాల సంఖ్య.. పేజీల పరంగా పది పైగా ఉంటాయి. అంశాలను విడిగా లెక్కపెడితే వందలు దాటతాయి. లెక్కలేనన్ని అంశాల మీద లెక్కపూర్వకంగా వివరాలివ్వాలి. తప్పనిసరిగా అవసరమైన ఎన్నో వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ట్యాక్స్ ఆడిట్ అంటే..? ఆడిట్ అంటే అకౌంట్స్‌ని తనిఖీ చేయడం. ఆదాయ పు పన్ను చట్టప్రకారం చేయించే ఆడిట్‌ని ట్యాక్స్ ఆడిట్ అంటారు. జీతం మీద ఆదాయం, ఇంటి మీ ద ఆదాయం, మూలధన లాభాలు, ఇతర ఆదా యం ఉన్న వారికి.. ఈ ఆడిట్ వర్తించదు. అలాగే, తక్కువ టర్నోవరు, వసూలు ఉన్న వ్యాపారస్తులకి, వృత్తి నిపుణులకి వర్తించదు. ఈ ట్యాక్స్ ఆడిట్‌ని ప్రాక్టీసులో ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్లతో చేయిం చాలి. అస్సెసీ చేత క్రమంగా... సక్రమంగా లావాదేవీలను నమోదు చేయించడం, బుక్స్ రాయడం, ఎటువంటి అవకతవకలు లేకుండా చూడటం ఈ ఆడి ట్ లక్ష్యం. పెనాల్టీలు వడ్డిస్తారు... పెనాల్టీలూ ఉంటాయి సెక్షన్ 271బీ ప్రకారం ఆడిట్ పూర్తి చేసిన గడువు తేదీ లోపల రిటర్న్ దాఖలు చేయకపోతే పెనాల్టీలు వేస్తారు. టర్నోవరు, వసూళ్లు, అమ్మకాలు మొత్తంలో 0.5 శాతం లేదా రూ. 1,50,000.. ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే దాన్ని పెనాల్టీగా చెల్లించమంటారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. పన్ను భారం కంటే పెనాల్టీ భారం ఎక్కువ అవుతుంది. ఆలస్యం ఎందుకు.. మీకు గాని ట్యాక్స్ ఆడిట్ వర్తిస్తే.. వెంటనే వృత్తి నిపుణులను సంప్రదించి, సకాలంలో మీ బాధ్యతలను నిర్వర్తించండి.