2022-23 సంవత్సరానికి గాను దేశ వ్యాప్తంగా 5.83 కోట్ల ట్యాక్స్ రిటర్న్ దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ట్యాక్స్ ఫైలింగ్‌కి ఈ రోజే చివరి రోజు కావడంతో పన్ను చెల్లింపు దారులు ఈ-ఫైలింగ్ చేసేందుకు పోటీపడుతున్నారు.
ఈ రోజు (జూలై 30) మధ్యాహ్నం 1 గంటల వరకు 5.83 కోట్ల ఐటీఆర్‌లు ఫైలింగ్ జరిగాయని ఆదాపు పన్ను శాఖ ట్వీట్ చేసింది. దీంతో గత ఏడాది జూలై 31 వరకు దాఖలు చేసిన ఐటీఆర్‌ల సంఖ్యను దాటింది అని ఐటీ శాఖ ట్వీట్‌లో పేర్కొంది. .
ఆదాయపు పన్ను రిటర్నుల గణాంకాలను అందిస్తూ.. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఈరోజు మధ్యాహ్నం 1 గంటల వరకు 46 లక్షలకు పైగా ఫైలింగ్ చేసినట్లు తెలిపింది. శనివారం ఒక్కరోజే 1.78 కోట్ల మంది ఈ పోర్టల్‌లో విజయవంతంగా లాగిన్‌లు జరిగాయి. గడిచిన గంటలో 3.04 లక్షల ఐటీఆర్‌లు దాఖలు చేయబడ్డాయి” అని ఐటీ శాఖ మధ్యాహ్నం 02:03 గంటలకు ట్వీట్ చేసింది.
📢 Kind Attention 📢
— Income Tax India (@IncomeTaxIndia) July 30, 2023
Here are some statistics of the Income Tax Returns filed.
5.83 crore #ITRs have been filed till 1 pm today (30th July) crossing the number of ITRs filed till 31st July, last year.
We have witnessed more than 46 lakh successful logins till 1 pm today and…
Comments
Please login to add a commentAdd a comment