జీఎస్టీ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. గత ఫిబ్రవరిలో ఏడాది ప్రాతిపదికన 12.5 శాతం పెరిగి రూ.1.68 లక్షల కోట్ల పన్ను వసూలైనట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే కాలంలో వసూలైన రూ.1.50 లక్షల కోట్లతో పోలిస్తే ఇది పెరిగింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ 2023-24 ఆర్థిక సంవత్సరంలో సగటు నెలవారీ స్థూల వసూళ్లు రూ. 1.67 లక్షల కోట్లుగా ఉన్నాయని, ఈ మొత్తం గత ఏడాది కంటే ఎక్కువగా ఉందని తెలిపింది.
కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.9.57 లక్షల కోట్లను వసూలు చేయాలని కేంద్రం లక్క్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment