ట్యాక్స్ పేయర్లకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. 2021-22, 2022-23 సంవత్సరాలలో మీరు ఐటీ రిటర్న్స్ (ITR) ఫైల్ చేసివారికి ఇది ముఖ్యమైన వార్త. మీ ఐటీఆర్‌లో కొన్ని తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. కొన్ని ఐటీఆర్‌లు, థర్డ్ పార్టీ సమాచారంలో వ్యత్యాసాలను గుర్తించామని, వాటిని సరిదిద్దాలని పన్ను చెల్లింపుదారులను సీబీడీటీ కోరింది.
కొంతమంది పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌లు, థర్డ్ పార్టీల నుంచి వచ్చిన డివిడెండ్‌లు, వడ్డీ ఆదాయానికి సంబంధించిన సమాచారంలో వ్యత్యాసాలను గుర్తించినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. పన్ను చెల్లింపుదారులు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ఈ-ఫైలింగ్ పోర్టల్ అందుబాటులో ఉందని సీబీడీటీ ఒక ప్రకటనలో తెలిపింది.
డిపార్ట్‌మెంట్ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. పన్ను చెల్లింపుదారులకు ఎస్‌ఎంఎస్ ఈ-మెయిల్ ద్వారా వ్యత్యాసం గురించి తెలియజేస్తున్నట్లు సీబీడీటీ తెలిపింది. వ్యత్యాసాన్ని స్పష్టం చేయలేని పన్ను చెల్లింపుదారులు ఆదాయాన్ని తక్కువగా నివేదించిన కేసును సరిచేయడానికి అప్‌డేటెడ్ ఐటీఆర్ సమర్పించే అవకాశాన్ని పరిగణించవచ్చని సీబీడీటీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment