CBDT
-
కేంద్రం కీలక నిర్ణయం, వాళ్లకి ఉచిత రేషన్ కట్.. అందులో మీరున్నారా?
ఢిల్లీ : ఉచిత రేషన్ బియ్య పంపిణీ ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన (పీఎంజేకేఏవై) పథకంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ ట్యాక్స్ చెల్లింపు దారులకు రేషన్ బియ్యం పంపిణీని నిలిపివేసే దిశగా అడుగులు వేస్తోంది.ఇందులో భాగంగా ఇన్ కమ్ ట్యాక్స్ విభాగం పన్నులు చెల్లింపు దారుల డేటాను కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖకు పంచుకోనుంది. తద్వారా పన్నుచెల్లింపు దారులు ఎవరైనా ఉచిత రేషన్ బియ్యం పొందుతుంటే.. వారిని అనర్హులుగా గుర్తిస్తుంది. అనంతరం, ఉచిత రేషన్‌ను నిలిపి వేయనుంది.ఆదాయపు పన్ను చెల్లించలేని వారికి పీఎంజేకేఏవై పథకంలో భాగంగా పేద కుటుంబాలకు కేంద్రం ఉచిత రేషన్ అందిస్తుంది. అయితే పీఎంజేఏఏవైలో పన్ను చెల్లింపు దారులకు సైతం రేషన్ అందుతుందని కేంద్రానికి ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదులపై కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఆదాయపు పన్ను శాఖ వద్ద ఉన్న పన్ను చెల్లింపు దారుల డేటాను పరిశీలించనుంది. ఈ మేరకు సంబంధిత శాఖల్ని సమన్వయం చేస్తోంది. ఉచిత రేషన్ పథకంలో అనర్హుల డేటాను వెలికి తీయనుంది. ఆ తర్వాత కేంద్రం చర్యలు తీసుకోనుంది. దేశంలో కోవిడ్-19 కారణంగా తలెత్తిన ఆర్ధిక ఇబ్బందుల నుంచి నిరు పేదల్ని గట్టెక్కించేలా కేంద్రం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద పేదలకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తుంది. ఉచిత రేషన్ వ్యవధిని జనవరి 1, 2024 నుండి ఐదు సంవత్సరాల పాటు పొడిగించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి తాజా బడ్జెట్లో రూ.2.03 లక్షల కోట్లను ప్రతిపాదించింది. -
ట్యాక్స్ పేయర్లకు శుభవార్త.. డెడ్‌లైన్ పొడిగింపు
ఆదాయపు పన్ను శాఖ 'వివాద్ సే విశ్వాస్ స్కీమ్ 2024' (Vivad Se Vishwas Scheme 2024) గడువును పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపుదారులకు తక్కువ ట్యాక్స్ రేట్లతో వివాదాలను పరిష్కరించుకోవడానికి ఈ అవకాశాన్ని కల్పించింది.డిసెంబర్ 31తో ముగియనున్న 'వివాద్ సే విశ్వాస్ స్కీమ్ 2024' గడువును ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ 2025 జనవరి 31కి పొడిగించింది. ఈ గడువును పొడిగించకుండా ఉండి ఉంటే.. దరఖాస్తు చేసుకునేవారు 10 శాతం అదనపు పన్ను చెల్లించాల్సి ఉండేది. కాబట్టి ఇప్పటి వరకు ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకొని వారు కూడా నిర్దిష్ట గడువు లోపల అప్లై చేసుకోవచ్చు.పొడిగించిన గడువు వల్ల ప్రయోజనాలువివాద్ సే విశ్వాస్ స్కీమ్ అనేది.. 2024 బడ్జెట్లో ప్రకటించారు. పన్ను (Tax) చెల్లింపుదారులు తక్కువ మొత్తంలో వివాద్ సే పన్నును చెల్లించడం ద్వారా పెండింగ్‌లో ఉన్న వివాదాలను పరిష్కరించుకోవడానికి అనుమతిస్తుంది.2025 జనవరి 31 తరువాత లేదా ఫిబ్రవరి 1నుంచి వివాద్ సే విశ్వాస్ స్కీమ్ కోసం అప్లై చేసుకునే వారు అదనంగా 10 శాతం పన్నును చెల్లించాల్సి ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ సీబీడీటీ (CBDT) పేర్కొంది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.CBDT extends due date for determining amount payable as per column (3) of Table specified in section 90 of Direct Tax Vivad Se Vishwas Scheme, 2024 from 31st December, 2024 to 31st January, 2025.Circular No. 20/2024 dated 30.12.2024 issuedhttps://t.co/uYGf1Oh3g2 pic.twitter.com/agjuRsMHqg— Income Tax India (@IncomeTaxIndia) December 30, 2024 -
లక్ష్యాన్ని మించేలా పన్ను వసూళ్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు.. నిర్దేశిత రూ.22.07 లక్షల కోట్ల లక్ష్యాన్ని దాటేస్తాయని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఛైర్మన్ రవి అగర్వాల్ తెలిపారు. కార్పొరేట్, నాన్–కార్పొరేట్ పన్నుల వసూళ్లు గణనీయంగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (ఐఐటీఎఫ్)లో ట్యాక్స్‌పేయర్స్ లాంజ్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. సీబీడీటీ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 10 మధ్య కాలంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు నికరంగా 15.41 శాతం పెరిగి రూ.12.11 లక్షల కోట్లకు చేరాయి.ఇదీ చదవండి: గోల్డ్ ఈటీఎఫ్‌లు కళకళమరోవైపు, 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను విదేశీ ఆదాయం, అసెట్స్‌ను తమ ఐటీఆర్‌లలో వెల్లడించని వారు సవరించిన రిటర్న్‌లను దాఖలు చేసేందుకు డిసెంబర్ 31 వరకు గడువుందని అగర్వాల్ పేర్కొన్నారు. ఇతర దేశాలతో ఒప్పందాల ద్వారా విదేశీ అసెట్స్ వివరాలన్నీ ఆటోమేటిక్‌గా ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అందుతాయని, ఐటీఆర్‌లలో పొందుపర్చిన వివరాలతో వాటిని సరిపోల్చి చూస్తుందని తెలిపారు. అధిక విలువ అసెట్స్‌ను వెల్లడించనివారికి ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ పంపే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఆదాయ పన్ను చట్టంలో భాషను సరళంగా, అందరికీ అర్థమయ్యే విధంగా మార్చడంపై 6,000 పైచిలుకు సలహాలు తమకు వచ్చినట్లు అగర్వాల్ పేర్కొన్నారు. -
పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల నుంచి రావాల్సిన పన్ను బకాయిలపై వడ్డీని మాఫీ చేయడం లేదంటే తగ్గించి తీసుకోవచ్చంటూ అధికారులకు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) సూచించింది. నోటీసులో పేర్కొన్న మేరకు పన్ను చెల్లించడంలో జాప్యం చేస్తే నిబంధనల ప్రకారం ప్రతి నెలా 1 శాతం చొప్పున వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్, చీఫ్ కమిషనర్, ప్రన్సిపల్ కమిషనర్ లేదా కమిషనర్ ర్యాంక్ అధికారి ఎవరికి అయినా సరే వడ్డీని మినహాయించడం లేదంటే తగ్గించేందుకు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 220 (2ఏ) కింద అధికారులున్నట్టు సీబీడీటీ స్పష్టం చేసింది.వడ్డీ మాఫీ చేసే లేదా తగ్గించే అధికారాలపైనా స్పష్టత ఇచి్చంది. ‘‘రూ.1.5 కోట్లకుపైన వడ్డీ మాఫీ చేయడమా లేదంటే తగ్గించడమా అన్నది ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ పరిధిలో ఉంటుంది. రూ.50 వేల నుంచి 1.5 లక్షల మధ్య ఉంటే చీఫ్ కమిషనర్‌కు అధికారం ఉంటుంది. రూ.50 లక్షల వరకు వడ్డీ ప్రిన్సిపల్ కమిషనర్ లేదా ఇన్‌కమ్‌ట్యాక్స్ కమిషనర్ పరిధిలోకి వస్తుంది’’అని సబీడీడీ పేర్కొంది. ఈ నిర్ణయం పన్ను చెల్లింపుదారుల దరఖాస్తుల సత్వర పరిష్కారానికి వీలు కల్పిస్తుందని నాంజియా అండ్ కో ఎల్ఎల్పీ పార్ట్నర్ సచిన్గార్గ్ అభిప్రాయపడ్డారు.మోసం కేసులకు ఏడాదిలో పరిష్కారం ఎగుమతులు/దిగుమతుల మోసాల కేసుల విచారణలో క్షేత్రస్థాయి కస్టమ్స్ అధికారులు తటస్థంగా వ్యవహరించాలని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) కోరింది. విచారణకు ముందే సమాచారం మొత్తాన్ని విశ్లేషించి, క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించింది. కమర్షియల్ ఇంటెలిజెన్స్ ఫ్రాడ్ కేసుల్లో విచారణను ఏడాది దాటకుండా ముగించాలని కూడా కోరింది. -
హోటళ్లు, ఆసుపత్రుల్లో భారీ లావాదేవీలపై ఐటీ నిఘా!
హోటళ్లు, లగ్జరీ బ్రాండ్ విక్రయాలు, ఆసుపత్రులు, ఐవీఎఫ్ క్లినిక్‌లు వంటి చోట్ల జరుగుతున్న భారీ నగదు లావాదేవీలపై నిఘా పెట్టాలని దేశంలోని ప్రత్యక్ష పన్నుల నిర్వహణకు సంబంధించిన అత్యున్నత సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఆదాయపు పన్ను శాఖను కోరింది.అదే విధంగా గత ఆర్థిక సంవత్సరం నుంచి భారీగా పెరుగుతున్న పన్ను బకాయిలను రికవరీ చేయడానికి సమష్టి ప్రయత్నాలు చేపట్టాలని ఐటీ శాఖను సీబీడీటీ కోరింది. ఈ మేరకు సీబీడీటీ ఇటీవల సెంట్రల్ యాక్షన్ ప్లాన్ (CAP) 2024-25 అనే వార్షిక కార్యాచరణ ప్రణాళిక పత్రాన్ని విడుదల చేసింది.రూ.2 లక్షలకు పైబడిన నగదు లావాదేవీలను ఆర్థిక లావాదేవీల స్టేట్మెంట్ రూపంలో ఆర్థిక సంస్థలు రిపోర్ట్ చేయాల్సి ఉన్నా అది జరగడం లేదని సీనియర్ అధికారులు వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు. ఆ రిపోర్ట్‌లను పరిశీలిస్తున్నప్పుడు ఈ నిబంధనల అతిక్రమణ విస్తృతంగా ఉన్నట్లు గుర్తించామని సీబీడీటీ ఐటీ శాఖకు తెలిపింది.అలాగే సెక్షన్ 139A ప్రకారం నిర్దిష్ట లావాదేవీలలో పాన్ కార్డు నంబర్ అందించడం లేదా తీసుకోవడం తప్పనిసరి అయినప్పటికీ దీన్ని నిర్ధారించే వ్యవస్థ లేదని సీబీడీటీ పేర్కొంది. ఏదైనా అధిక మొత్తంలో వ్యయాన్ని పన్ను చెల్లింపుదారు సమాచారంతో ధ్రవీకరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.హోటళ్లు, బాంక్వెట్ హాళ్లు, లగ్జరీ బ్రాండ్ రిటైలర్లు, ఐవీఎఫ్ క్లినిక్‌లు, ఆసుపత్రులు, డిజైనర్ బట్టల దుకాణాలు, ఎన్ఆర్ఐ కోటా మెడికల్ కాలేజీ సీట్ల వంటి చోట్ల నిబంధనలు పాటించకుండా పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరుగుతున్నాయని గుర్తించిన సీబీడీటీ.. అక్కడ ఎలాంటి అంతరాయం కలిగించకుండా నిఘా పెట్టాలని ఆదాయపు పన్ను శాఖకు సూచించింది. -
దేశం విడిచి వెళ్తుంటే ట్యాక్స్ మొత్తం కట్టాల్సిందేనా? కేంద్రం క్లారిటీ
దేశం విడిచి వెళ్తున్న వారందరూ ముందుగా ట్యాక్స్ బకాయిలన్నీ తప్పనిసరిగా చెల్లించాలంటూ వచ్చిన వార్తలపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) స్పందించింది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 చట్టంలోని సెక్షన్ 230కు సంబంధించి వివరణ ఇచ్చింది.పన్ను చెల్లింపుదారుల్లో కలకలం సృష్టించిన ఈ వార్తలపై సీబీడీటీ స్పందిస్తూ.. దేశం విడిచి వెళ్తున్న ప్రతి భారతీయ పౌరుడు ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాలని సెక్షన్ 230 ఆదేశించదని పేర్కొంది. ఆవశ్యకమైన నిర్దిష్ట పరిస్థితులలో మాత్రమే ఇది వర్తిస్తుంది. 2004 ఫిబ్రవరి 5 నాటి సీబీడీటీ ఇన్స్ట్రక్షన్ నంబర్ 1/2004 ప్రకారం, తీవ్రమైన ఆర్థిక అవకతవకలకు పాల్పడిన వ్యక్తులు లేదా ప్రత్యక్ష పన్ను బకాయిలు రూ. 10 లక్షలకు పైగా ఉన్నవారికి మాత్రమే దేశం విడిచి వెళ్లే ముందు ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఎందుకంటే ఇలాంటి వారు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ విచారణలో ప్రత్యక్షంగా పాల్గొనడం అవసరం.అంతేకాకుండా ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీ ఏకపక్ష ప్రక్రియ కాదు. దీనికి ఇన్కమ్ టాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ లేదా ఇన్కమ్ టాక్స్ చీఫ్ కమిషనర్ నుంచి లిఖితపూర్వకమైన ముందస్తు అనుమతి అవసరం. ఇన్కమ్ టాక్స్ యాక్ట్, వెల్త్ టాక్స్ యాక్ట్, గిఫ్ట్-టాక్స్ యాక్ట్, ఎక్స్పెండిచర్-టాక్స్ యాక్ట్, మనీ యాక్ట్, 2015 వంటి వివిధ పన్ను చట్టాల కింద సదరు వ్యక్తికి ఎటువంటి బకాయిలు లేవని ఈ సర్టిఫికెట్ నిర్ధారిస్తుంది. దీన్ని ఇటీవలి ఫైనాన్స్ బిల్లులో ప్రతిపాదించారు.ఫైనాన్స్ (నం. 2) బిల్లు, 2024లో క్లాజ్ 71లో బ్లాక్ మనీ యాక్ట్, 2015కు సంబంధించిన సూచనలను చేరుస్తూ సెక్షన్ 230కి సవరణలు ప్రతిపాదించారు. ఈ సవరణలు వచ్చే అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. దీని ప్రకారం.. గుర్తించిన కేటగిరీల కింద కొంతమంది వ్యక్తులు దేశం విడిచి వెళ్లేముందు తప్పనిసరిగా ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాలి. -
కాసుల పంట.. భారీగా పన్ను వసూళ్లు
దేశంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు భారీగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూలై 11 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు 19.54 శాతం వృద్ధి చెంది రూ. 5.74 లక్షల కోట్లకు చేరాయని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఈ పన్ను వసూళ్లు రూ.4.80 లక్షల కోట్లుగా ఉన్నాయని పేర్కొంది.నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 5.74 లక్షల కోట్లలో (జూలై 11 నాటికి) కార్పొరేషన్ పన్ను (CIT) రూ. 2.1 లక్షల కోట్లు (రీఫండ్ మినహాయింపు తర్వాత), వ్యక్తిగత ఆదాయపు పన్ను (PIT) రూ. 3.46 లక్షల కోట్లు, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT) రూ. 16,634 కోట్లు (రీఫండ్ మినహాయింపు తర్వాత) ఉన్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) వివరించింది.కాగా ప్రభుత్వం 2024-25లో జూలై 11 వరకు రూ. 70,902 కోట్ల ప్రత్యక్ష పన్ను రీఫండ్లను జారీ చేసింది. 2023-24లో జారీ చేసిన రూ. 43,105 కోట్లతో పోలిస్తే ఇది 64.49 శాతం పెరిగింది. ప్రత్యక్ష పన్ను వసూళ్లకు సంబంధించి ప్రభుత్వం సవరించిన అంచనాల్లో పూర్తి ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్-మార్చి) రూ. 21.99 లక్షల కోట్ల వసూళ్లను అంచనా వేసింది.ఒక నిర్దిష్ట సంవత్సరానికి ప్రభుత్వం తన ఆర్థిక లోటు లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయపడుతుంది కాబట్టి ఆరోగ్యకరమైన పన్ను వసూళ్లు ముఖ్యమైనవి . కేంద్రం మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక లోటు 5.2 శాతం లక్ష్యంగా పెట్టుకుంది. స్థూల ప్రాతిపదికన, రీఫండ్లను సర్దుబాటు చేయడానికి ముందు, ప్రత్యక్ష పన్ను వసూళ్లు జూలై 11 నాటికి రూ. 6.45 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 23.24 శాతం వృద్ధి. -
సీబీడీటీ కొత్త చైర్మన్‌గా రవి అగర్వాల్
ఆదాయపు పన్ను శాఖ పరిపాలనా సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) కొత్త చైర్మన్‌గా 1988 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి రవి అగర్వాల్ నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ 1986 బ్యాచ్ కు చెందిన ఐఆర్ఎస్ అధికారి నితిన్ గుప్తా పదవీకాలం జూన్ 30తో ముగుస్తుంది.గుప్తా 2022 జూన్‌లో సీబీడీటీ చీఫ్‌గా నియమితులయ్యారు. గత ఏడాది సెప్టెంబరులోనే ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా జూన్ వరకు తొమ్మిది నెలల పొడిగింపు ఇచ్చారు. కొత్త సీబీడీటీ చీఫ్ ప్రస్తుతం బోర్డులో మెంబర్ (అడ్మినిస్ట్రేషన్)గా వ్యవహరిస్తున్నారు.అగర్వాల్ 2025 జూన్ వరకు సీబీడీటీకి నేతృత్వం వహిస్తారని కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అగర్వాల్ సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేయాల్సి ఉండగా, నియామక నిబంధనల సడలింపులో తిరిగి నియమితులైన కేంద్ర ప్రభుత్వ అధికారులకు వర్తించే సాధారణ నిబంధనలు, షరతుల ప్రకారం వచ్చే ఏడాది జూన్ 30 వరకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పునర్నియామకం కొనసాగుతుందని ఆయన నియామక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.సీబీడీటీకి చైర్మన్ నేతృత్వం వహిస్తుండగా, ప్రత్యేక కార్యదర్శి హోదాలో ఆరుగురు సభ్యులు ఉంటారు. ప్రగ్యా సహాయ్ సక్సేనా, హెచ్‌బీఎస్ గిల్, ప్రవీణ్ కుమార్, సంజయ్ కుమార్, సంజయ్ కుమార్ వర్మ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. జూన్ 30వ తేదీన వర్మ పదవీ విరమణ చేస్తున్నారు. -
అలర్ట్: ఆధార్-పాన్ లింక్ అవ్వకపోతే రెండింతలు టీడీఎస్
ఆధార్-పాన్ లింక్ ఇంకా చేయనివారికి ఐటీ శాఖ కీలక సమాచారం అందించింది. మే నెలాఖరుకల్లా ఆధార్‌తో పాన్ అనుసంధానం పూర్తయితేనే టీడీఎస్ షార్ట్ డిడక్షన్ కోసం పన్ను చెల్లింపుదారులపై ఏ చర్యలూ ఉండబోవని ఆదాయ పన్ను శాఖ తెలియజేసింది.ఐటీ శాఖ నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ ఆధార్‌తో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) లింక్ అవ్వకపోతే సాధారణంగా వర్తించే రేటుకు రెండింతల టీడీఎస్ కోతలుంటాయి. లావాదేవీ సమయంలో పాన్ ఇన్ఆపరేటివ్లో ఉన్న ట్యాక్స్‌పేయర్లకు టీడీఎస్/టీసీఎస్ షార్ట్ డిడక్షన్/కలెక్షన్ ఎగవేతకు పాల్పడ్డారన్న నోటీసులు వస్తున్నట్టు సీబీడీటీ తెలిపింది.ఈ మేరకు పన్ను చెల్లింపుదారుల నుంచి ఫిర్యాదులు అందాయని పేర్కొంది. ఇలా నోటీసులు అందుకున్న వారికి సీబీడీటీ స్పష్టత ఇచ్చింది. 31 మార్చి 2024 నాటికి ముందు చేసిన లావేదావేలకు సాధారణ రేటుకే టీడీఎస్/టీసీఎస్ వసూలుంటుందని స్పష్టం చేసింది.కాగా 2022 జూన్ 30 వరకు ఆధార్‌తో పాన్ అనుసంధానం ఉచితంగానే జరిగింది. జూలై 1 నుంచి 2023 జూన్ 30 వరకు రూ.1,000 ఆలస్య రుసుముతో అనుమతించారు. ఆ తర్వాత లింక్ అవ్వని పాన్ కార్డులు జూలై 1 నుంచి ఇన్‌ఆపరేటివ్‌లోకి వెళ్లాయి. ఇవి ఆపరేటివ్ కావాలంటే రూ.1,000 ఫైన్ కట్టాల్సిందే. కానీ 30 రోజుల సమయం పడుతుంది. ఆధార్, పాన్ లింక్ కాకపోతే ఐటీ రిఫండ్ ఉండదు. లింక్ చేసుకున్న తర్వాత రిఫండ్ వచ్చినప్పటికీ ఆలస్యమైన రోజులకు ఐటీ శాఖ వడ్డీ చెల్లించదు. -
ఐటీ రిటర్న్స్‌లో తప్పులు.. ట్యాక్స్ పేయర్లకు అప్డేట్
ట్యాక్స్ పేయర్లకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. 2021-22, 2022-23 సంవత్సరాలలో మీరు ఐటీ రిటర్న్స్ (ITR) ఫైల్ చేసివారికి ఇది ముఖ్యమైన వార్త. మీ ఐటీఆర్‌లో కొన్ని తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. కొన్ని ఐటీఆర్‌లు, థర్డ్ పార్టీ సమాచారంలో వ్యత్యాసాలను గుర్తించామని, వాటిని సరిదిద్దాలని పన్ను చెల్లింపుదారులను సీబీడీటీ కోరింది. కొంతమంది పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌లు, థర్డ్ పార్టీల నుంచి వచ్చిన డివిడెండ్లు, వడ్డీ ఆదాయానికి సంబంధించిన సమాచారంలో వ్యత్యాసాలను గుర్తించినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. పన్ను చెల్లింపుదారులు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ఈ-ఫైలింగ్ పోర్టల్ అందుబాటులో ఉందని సీబీడీటీ ఒక ప్రకటనలో తెలిపింది. డిపార్ట్మెంట్ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. పన్ను చెల్లింపుదారులకు ఎస్ఎంఎస్ ఈ-మెయిల్ ద్వారా వ్యత్యాసం గురించి తెలియజేస్తున్నట్లు సీబీడీటీ తెలిపింది. వ్యత్యాసాన్ని స్పష్టం చేయలేని పన్ను చెల్లింపుదారులు ఆదాయాన్ని తక్కువగా నివేదించిన కేసును సరిచేయడానికి అప్డేటెడ్ ఐటీఆర్ సమర్పించే అవకాశాన్ని పరిగణించవచ్చని సీబీడీటీ పేర్కొంది. -
పన్ను చెల్లింపు దారులకు భారీ ఊరట..!
-
పన్ను చెల్లింపు దారులకు భారీ ఊరట!
ఒక్కో పన్ను చెల్లింపుదారునకు సంబంధించి పన్ను డిమాండ్ రూ.లక్షవరకు ఉంటే, వాటిని ఆదాయపుపన్ను శాఖ ఉపసంహరించుకోనుంది. ఇటీవల బడ్జెట్లో ఇందుకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పథకాన్ని ప్రకటించడం తెలిసిందే. దీనికి సంబంధించి ఆదాయపుపన్ను శాఖ అత్యున్నత నిర్ణయాల మండలి సీబీడీటీ ఆదేశాలు జారీ చేసింది. 2015-16 అసెస్ మెంట్ సంవత్సరం వరకు పన్ను చెల్లింపు దారులకు సంబంధించి మొత్తం పన్ను బకాయి రూ.లక్షవరకు ఉంటే వారికి వెసులుబాటు లభించినట్లయింది. అసెస్ మెంట్ సంవత్సరం 2011-12 నుంచి 2015-16 వరకు రూ.10 వేల చొప్పున ఉంటే వాటిని ఉపసంహరించుకోనున్నట్లు సీబీడీటీ తెలిపింది. ఈ ప్రకటనతో మొత్తం రూ.3.500 కోట్లు విలువ చేసే పన్ను డిమాండ్ లను కేంద్రం వెనక్కి తీసుకోనుంది. అసలు చెల్లించాల్సిన పన్ను, దానిపై వడ్డీ, పెనాల్టీ, సెస్,సర్ ఛార్జీ అన్నీ కలిపిన తర్వాతే రూ.లక్ష పరిమితి అమలు కానున్నట్లు సీబీడీ స్పష్టం చేసింది. -
అలా అయితే రెడీ అయిపోండి.. ఐటీ నోటీసులు వస్తున్నాయి..
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) దాఖలు చేయవారికి ఆదాయపు పన్ను శాఖ త్వరలో నోటీసులు పంపనుంది. టీడీఎస్ కట్ అయినవారికి కూడా ఐటీ నోటీసులు సిద్ధమయ్యాయని ది ఎకనామిక్ టైమ్స్ తాజా కథనం పేర్కొంది. కచ్చితమైన సమాచారం ఉన్న పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఐటీ శాఖ నోటీసులు పంపుతుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. రీఫండ్ వ్యవధిని తగ్గించడం దగ్గర నుంచి పెద్ద పెద్ద పన్ను వివాదాలను పరిష్కరించడం దాకా పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించడంపైనే తమ దృష్టి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పన్ను వివాదాల పరిష్కారం కోసం సీబీడీటీ మైసూరులో డిమాండ్ మేనేజ్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇది రూ. 1 కోటి కంటే ఎక్కువ పన్ను వివాదాలపై దృష్టి సారిస్తుందని చెప్పారు. గతంలో కర్ణాటక పరిధిలోని వివాదాలకే పరిమితమైన ఈ మేనేజ్మెంట్ సెంటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కేసులను స్వీకరిస్తోందని సీబీడీటీ చైర్మన్ వివరించారు. -
పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్ : ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్‌లో కీలక మార్పులు!
ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపు దారులకు ముఖ్య గమనిక. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) విభాగం ఐటీఆర్ ఫైలింగ్‌లో పలు మార్పులు చేసినట్లు తెలిపింది. పన్ను చెల్లింపుదారులు ఆర్ధిక సంవత్సరం 2022-2023 ట్యాక్స్ ఫైలింగ్ సమయంలో ఐటీఆర్-2, ఐటీఆర్ -3 ఫారమ్స్ తప్పని సరిగా ఉపయోగించాలని సూచించింది. అందుకు చివరి గడువు జులై31, 2024కి విధించింది. అయితే ఎవరితే వ్యాపారం చేస్తూ వారికి వచ్చే ఆదాయంపై ట్యాక్స్ ఆడిట్ నిర్వహిస్తుంటే వారు తప్పని సరిగా అక్టోబర్ 31, 2024 లోపు ఐటీఆర్-3 ఫైల్‌ను తప్పని సరిగా చేయాలని కోరుంది. ఐటీఆర్-2 ఫైలింగ్ ఎవరు చేయాల్సి ఉంటుంది? ఇన్ కమ్ ట్యాక్స్ వెబ్‌పోర్టల్ వివరాల ప్రకారం.. వ్యక్తులు లేదంటే హెచ్‌యూఎఫ్.. అంటే హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ.. కార్పొరేటు వ్యాపార పరిభాషలో అవిభక్త హిందూ కుటుంబం.. మరీ సూటీగా చెప్పాలంటే కుటుంబ పార్టీ.. వ్యాపార పరిభాషలో హెచ్‌యూఎఫ్‌కు కర్త ఉంటాడు.. మొత్తం వ్యవహారాలన్నీ తన పేరిటే నడిచిపోతుంటాయ్.. కుటుంబసభ్యులే హక్కుదారు.. అలా ఉండి ట్యాక్స్ కట్టేవారు ఐటీఆర్-2ని తప్పని సరిగా ఫైల్ చేయాలి. ఐటీఆర్-1 ఫైల్ చేసేందుకు అనర్హులు. బిజినెస్, ప్రొఫెషన్ ద్వారా వచ్చే ప్రాఫిట్, లాభాలు లేని వారు ఈ ఫామ్స్ ఉపయోగించాలి. వడ్డీ, శాలరీ, బోనస్ కమీషన్, రెమ్యునరేషన్ వంటి వాటి ద్వారా ప్రాఫిట్స్, ఇతర లాభాలు పొందని వారు, అలాగే జీవిత భాగస్వామి, మైనర్ పిల్లలు వంటి వారి నుంచి ఆదాయం అందుకుంటున్న వారు వారి ఆదాయం మొత్తాన్ని జమ చేసి ఐటీఆర్-2 ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్-2లో మార్పులు రాజకీయ పార్టీలకు చేసిన విరాళాల వివరాలు, వైకల్యం ఉన్న వ్యక్తి వైద్య చికిత్సతో సహా నిర్వహణకు సంబంధించి తగ్గింపు వివరాలు, ఇంకా, పన్ను ఆడిట్ చేయడానికి వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ట్యాక్స్ ఆడిట్ అవసరమైనప్పుడు వారు ఈవీసీ ద్వారా వెరిఫై చేసుకోవచ్చు. -
దేశంలో ట్యాక్స్ కట్టేవాళ్లు ఎంతమందో తెలుసా?
న్యూఢిల్లీ: గడిచిన పదేళ్లలో ఇన్‌కం ట్యాక్స్ రిటర్నులను (ఐటీఆర్) దాఖలు చేసే పన్ను చెల్లింపుదారుల (ఫైలర్స్) సంఖ్య రెట్టింపయ్యింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7.78 కోట్లకు చేరింది. కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2013–14లో ఐటీఆర్‌లు దాఖలు చేసిన వారి సంఖ్య 3.8 కోట్లుగా ఉంది. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం దాదాపు 105 శాతం పెరిగింది. ఇదే వ్యవధిలో నికరంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు 161 శాతం పెరిగి రూ. 6.39 లక్షల కోట్ల నుంచి రూ. 16.64 లక్షల కోట్లకు ఎగిశాయి. స్థూలంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు 173 శాతం పెరిగాయి. రూ. 7.22 లక్షల కోట్ల నుంచి రూ. 19.72 లక్షల కోట్లకు చేరాయి. -
లేటెస్ట్ టెక్నాలజీతో.. అందుబాటులోకి ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ తన ప్రధాన పోర్టల్‌ను పునరుద్ధరించింది. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ పేస్, మెనూలు మార్పులు చేస్తూ తీర్చిదిద్దింది. తాజాగా, ఈ పోర్టల్‌ను సీబీడీటీ ఛైర్మన్ నితిన్ గుప్తా ప్రారంభించారు. ఇక, తాము కొత్తగా ప్రారంభించిన ఈ వెబ్సైట్ పన్ను చెల్లింపు దారులకు సౌకర్యవంతంగా ఉంటుందని నితిన్ గుప్తా తెలిపారు. పోర్టల్‌లో (https://incometaxindia.gov.in/) ట్యాక్స్‌కు సంబంధించిన చట్టాలు, నిబంధనల్ని సులభంగా తెలుసుకునేలా నావిగేషన్‌ను రూపొందించినట్లు పేర్కొన్నారు. దీంతో పాటు అలెర్ట్‌లు, ముఖ్యమైన తేదీలకు సంబంధించిన అలెర్ట్‌లు ఈ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని పన్ను చెల్లింపు దారులకు సూచించారు. -
లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్నారా? మెచ్యూరిటీ సొమ్ముపై పన్ను తప్పదు!
న్యూఢిల్లీ: జీవిత బీమా పాలసీల వార్షిక ప్రీమియం రూ.5 లక్షలకు మించి ఉంటే, వాటి మెచ్యూరిటీ తర్వాత అందుకునే మొత్తంపై పన్నును ఏ విధంగా లెక్కించాలన్నది ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి సవరించిన నిబంధనలను నోటిఫై చేసింది. ఏడాదికి చెల్లించే ప్రీమియం రూ.5 లక్షలకు మించితే పాలసీ గడువు తర్వాత అందుకునే మొత్తాన్ని వార్షిక ఆదాయానికి కలిపి చూపించి, పన్ను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. 2023 ఏప్రిల్ 1 తర్వాత నుంచి రూ.5 లక్షలకు మించి ప్రీమియం ఉండే పాలసీల మెచ్యూరిటీపై పన్ను అమల్లోకి వచ్చిన విషయం గమనార్హం. అంతకుముందు వరకు పాలసీల ప్రీమియం ఎంతన్న దానితో సంబంధం లేకుండా మెచ్యూరిటీ మొత్తంపై సెక్షన్ 10(10డీ) కింద పన్ను మినహాయింపు అమల్లో ఉంది. -
ఆధార్-ప్యాన్ లింక్ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన
ఆధార్ కార్డ్-పాన్ లింకింగ్‌కు గడువు నిన్నటి(జూన్ 30)తో ముగిసిన నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆధార్-పాన్ లింకింగ్ కోసం పెనాల్టీ చెల్లించిన తరువాత చలాన్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తన అధికారిక ట్విటర్ హ్యాండిల్లో సమాచారాన్ని పోస్ట్ చేసింది. అంతేకాదు మరోసారి గడువు పెంపు ఉంటుందనే ఊహాగానాలకు ఆదాయపు పన్ను శాఖ చెక్ పెట్టింది. ప్యాన్-ఆధార్‌లో లింకింగ్‌లో పాన్ హోల్డర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆధార్-పాన్ లింకింగ్ కోసం రుసుము చెల్లించిన తర్వాత చలాన్ డౌన్లోడ్ చేయడంలో పాన్ హోల్డర్లు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రసీదు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని, అయితే ఇ-పే ట్యాక్స్ ట్యాబ్‌లో చలాన్ చెల్లింపు వివరాలను చెక్ చేసుకోవచ్చని సూచించింది. అయితే ఇ-పే ట్యాక్స్‌లో ఇబ్బందులున్నాయని కొంతమంది యూజర్లు ట్విటర్లో ఫిర్యాదు చేశారు. (ధోనీ ఎంత పని చేశాడు: సత్య నాదెళ్ల ‘క్రష్’ కూడా అదేనట!) పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడడం 2017 జులై 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడానికి గడువును కేంద్రం చాలాసార్లు పొడిగించింది.జూన్ 30వ తేదీ లోపు పాన్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేయకపోతే, లింక్ కాని పాన్ కార్డులు చెల్లుబాటు కావడం ఆదాయపన్ను శాఖ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. Kind Attention PAN holders! Instances have come to notice where PAN holders have faced difficulty in downloading the challan after payment of fee for Aadhaar-PAN linking. In this regard, it is to be informed that status of challan payment may be checked in ‘e-pay tax’ tab of… — Income Tax India (@IncomeTaxIndia) June 30, 2023 -
16 రోజుల్లో ఐటీ రీఫండ్స్ చెల్లింపులు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు తిరిగి చెల్లింపులను (రిఫండ్) సగటున 16 రోజుల్లో పూర్తి చేస్తోంది. 2022–23 సంవత్సరాలో సగటు రిఫండ్ సమయం 16 రోజులకు తగ్గినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. 80 శాతం రిఫండ్లను రిటర్నులు దాఖలు చేసిన 30 రోజుల్లోనే విడుదల చేసినట్టు సీబీడీటీ చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. పన్ను చెల్లింపుదారులు సులభంగా, వేగంగా రిటర్నులు దాఖలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఐటీఆర్ దాఖలు చేసిన ఒక్కరోజులోనే వాటిని ప్రాసెస్ చేస్తున్నట్టు తెలిపారు. ఇలా ఒక్క రోజులో ప్రాసెస్ చేసినవి 2021–22లో 21 శాతం ఉంటే, 2022–23లో 42 శాతానికి పెరిగినట్టు వెల్లడించారు. టెక్నాలజీ సామర్థ్యం గురించి మాట్లాడుతూ.. 2022 జూన్ 28న ఒకే రోజు 22.94 లక్షల రిటర్నుల ప్రాసెసింగ్ నమోదైనట్టు పేర్కొన్నారు. స్వచ్ఛంద నిబంధనల అమలును సులభతరం చేసేందుకు వీలుగా.. పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను సంబంధిత అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన రెండేళ్ల వరకు ఎప్పుడైనా అప్డేట్ చేసుకునే సదుపాయం కల్పించినట్టు చెప్పారు. 2023 మార్చి 31 నాటికి 24.50 లక్షల అప్డేటెడ్ రిటర్నులు నమోదైనట్టు వెల్లడించారు. -
ఈ-అప్పీళ్ల పథకం నోటిఫై
న్యూఢిల్లీ: ఈ-అప్పీల్స్ పథకాన్ని ఆదాయపన్ను శాఖ నోటిఫై చేసింది. దీంతో అప్పీళ్లను ఎలక్ట్రానిక్ రూపంలో దాఖలు చేసుకోవడం, వాటిని ప్రాసెస్ చేయడం వీలు పడుతుంది. ‘ఈ–అప్పీల్స్ స్కీమ్, 2023’ కింద ఆదాయపన్ను శాఖ జాయింట్ కమిషనర్ (అప్పీల్స్) తన ముందు దాఖలైన అప్పీళ్లను ప్రాసెస్ చేయనున్నారు. దీని కింద బాధిత మదింపుదారులు JCIT (అప్పీల్స్) JCIT కంటే తక్కువ ర్యాంక్‌లో ఉన్న అసెస్సింగ్ అధికారి ఆమోదించే ముందు కొన్ని ఆర్డర్లను అప్పీల్ చేయవచ్చు. "జాయింట్ కమీషనర్ (అప్పీల్స్) ఈ పథకం నిబంధనలకు అనుగుణంగా దాని ముందు దాఖలు చేసిన లేదా కేటాయించిన లేదా బదిలీ చేయబడిన అప్పీళ్లను పరిష్కరించాలి" అని నోటిఫికేషన్ పేర్కొంది. JCIT (A)కి ఇన్కమ్ టాక్స్ అథారిటీ, మినిస్టీరియల్ స్టాఫ్, ఎగ్జిక్యూటివ్ లేదా కన్సల్టెంట్లు బోర్డు ద్వారా అవసరమని భావించే విధంగా అప్పీళ్లను పరిష్కరించడంలో సహాయపడతారు.అప్పీళ్ల కేసుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పన్ను చెల్లింపుదారుల వివరణ సైతం విననున్నారు. ఇదీ చదవండి: CSK ఓనరు, నికర విలువ ఎంత? ఈ విషయాలు తెలుసా? Ravindra Jadeja వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్ సూపర్ పిక్స్ వైరల్ డిఫరెంట్ లుక్స్‌లో టాప్ లీడర్స్: దిమ్మదిరిగే ఫోటోలు -
13.73 లక్షల కోట్లకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు
దేశంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు భారతదేశ ప్రత్యక్ష పన్ను వసూళ్లు 17 శాతం వృద్ధి చెంది రూ. 13.73 లక్షల కోట్లకు చేరుకుందని, ఇది పూర్తి సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం ఈ మొత్తం 83 శాతంతో సమానమని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (cbdt) తెలిపింది. ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 10, 2023 వరకు మొత్తం రూ.16.68 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు జరగ్గా... అందులో రూ. 2.95 లక్షల కోట్ల రీఫండ్లు జారీ అయ్యాయి. ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో జారీ చేయబడిన రీఫండ్ల కంటే 59.44 శాతం ఎక్కువగా ఉందని ప్రత్యక్ష పన్నుల బోర్డ్ పేర్కొంది. Gross Direct Tax collections for FY 2022-23 upto 10th March, 2023 are at Rs. 16.68 lakh crore, higher by 22.58% over gross collections for corresponding period of preceding yr. Net collections at Rs. 13.73 lakh crore are 16.78% higher than net collections for same period last yr pic.twitter.com/wtxMsqm1LG — Income Tax India (@IncomeTaxIndia) March 11, 2023 స్థూల ప్రాతిపదికన వసూళ్లు 22.58 శాతం పెరిగి రూ.16.68 లక్షల కోట్లకు చేరుకుంది. రీఫండ్ల సర్దుబాటు తర్వాత, సీటీఐ (కార్పొరేట్ ఆదాయపు పన్ను) వసూళ్లలో నికర వృద్ధి 13.62 శాతం, ఎస్టీటీ (సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్)తో సహా పీఐటీ (వ్యక్తిగత ఆదాయపు పన్ను) వసూళ్లు 20.06 శాతంగా ఉంది. -
ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్! ఏప్రిల్ 1 నుంచే ఐటీఆర్ ఫైలింగ్..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022–23) నూతన రిటర్నులు (ఐటీఆర్‌లు) ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి తెలిపింది. దీంతో అసెస్మెంట్ సంవత్సరం మొదటి రోజు నుంచే (2023 ఏప్రిల్ 1) రిటర్నులు దాఖలు చేసుకోవడం వీలవుతుంది. గతేడాదితో పోలిస్తే, ఐటీఆర్‌లలో పెద్దగా మార్పులు చేయలేదని తెలిపింది. ఆదాయపన్ను చట్టం 1961లో చేసిన సవరణల మేరకు స్వల్ప మార్పులను ప్రవేశపెట్టినట్టు స్పష్టం చేసింది. ఐటీఆర్ 1 నుంచి ఐటీఆర్ 7 వరకు పత్రాలను సీబీడీటీ నోటిఫై చేయడం తెలిసిందే. సాధారణంగా ఏటా మార్చి లేదా ఏప్రిల్‌లో ఐటీఆర్‌లను నోటిఫై చేస్తుంటారు. ఈ విడత ముందుగానే ఈ ప్రక్రియను సీబీడీటీ పూర్తి చేసింది. (ఇదీ చదవండి: ఎఫ్డీ కస్టమర్లకు ఎస్బీఐ గుడ్ న్యూస్! వడ్డీ రేట్లు పెంపు..) -
ఆధార్‌తో 48 కోట్ల పాన్లు అనుసంధానం
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు వ్యక్తులకు సంబంధించి 48 కోట్ల పాన్లు ఆధార్ డేటాబేస్‌తో అనుసంధానం చేసుకున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. మొత్తం 61 కోట్ల వ్యక్తిగత పాన్లు ఇప్పటి వరకు మంజూరు చేసినట్టు చెప్పారు. అంటే 80 శాతం కార్డులనే అనుసంధానించుకున్నట్టు తెలుస్తోంది. మిగిలిన 13 కోట్ల పాన్ హోల్డర్లు ఈ ఏడాది మార్చి 31లోపు అనుసంధానించుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు. అనుసంధానం చేసుకుని పాన్లు పనిచేయకుండా పోతాయన్నారు. దీంతో వ్యాపార, పెట్టుబడులు, పన్నుల సంబంధిత ప్రయోజనాలు నష్టపోయే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వాస్తవానికి ఆధార్–పాన్ అనుసంధానానికి కేంద్రం ఇచ్చిన గడువు ఎప్పుడో ముగిసింది. దీంతో రూ.1,000 ఫీజు చెల్లించి ఈ ఏడాది మార్చి 31 వరకు అనుసంధానించుకునేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు ఎన్నో విడతలుగా గడువు పెంచుకుంటూ, ప్రచారం నిర్వహిస్తూ వచ్చిన విషయాన్ని నితిన్ గుప్తా వివరించారు. -
లక్ష్యానికి మించి ప్రత్యక్ష పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల ఆదాయం బడ్జెట్ అంచనా రూ.14.20 లక్షల కోట్ల కంటే, 30 శాతం అధికంగా వసూలు అవుతుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. దీని ఆధారంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సైతం పన్నుల లక్ష్యం మరింత పెద్దగా ఉండొచ్చన్నారు. పన్నుల ఎగువేతకు చెక్ పెట్టేందుకు వీలుగా ఆన్లైన్ గేమింగ్‌కు సంబంధించి టీడీఎస్ నిబంధనల్లో మార్పులు ఉంటాయని చెప్పారు. తదుపరి ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో వీటికి చోటు కల్పించే అవకాశం ఉందన్నారు. ‘‘ఆన్లైన్ గేమింగ్‌పై ప్రస్తుతం టీడీఎస్ మినహాయింపు నిబంధన ఉంది.దీన్ని సవరించడమా లేక ప్రస్తుత రూపంలోనే ఉంచడమా అన్నది చూడాలి’’అని ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌లో భాగంగా తెలిపారు. ఆన్లైన్ గేమింగ్ ఆదాయంపై 10 శాతం టీడీఎస్ తగ్గించిన తర్వాతే ఇన్వెస్టర్‌కు చెల్లింపులు చేసే విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. మొత్తం మీద పస్త్రుత ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల ఆదాయం రూ.17.75–18.46 లక్షల కోట్ల మధ్య ఉండొచ్చని గుప్తా చెప్పారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ 10 వరకు వసూలైన ఆదాయం రూ.10.54 లక్షల కోట్లుగా ఉంది. ఇది అంచనాల కంటే 30 శాతం ఎక్కువ కావడం గమనార్హం. రిఫండ్లను తీసేసి చూస్తే నికరంగా రూ.8.71 లక్షల కోట్లు ఉంటుంది. బడ్జెట్ లక్ష్యంలో ఇది 61.31 శాతానికి సమానం. చదవండి: భారత్‌లో ట్విటర్ చాలా స్లో, మరీ దారుణం: ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్స్! -
ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఐటీ దాడులు.. రూ.100కోట్లు సీజ్!
రాంచీ: జార్ఖండ్‌లోని ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై దాడులు నిర్వహించింది ఆదాయ పన్ను శాఖ. లెక్కల్లో చూపని సుమారు రూ.100 కోట్ల లావాదేవీలు, పెట్టుబడులను గుర్తించి సీజ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన బొగ్గు, ఇనుప గనుల వ్యాపారాలకు సంబంధించి ఎమ్మెల్యేలతో పాటు వారి సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలు, బ్యాంకు ఖాతాలను గత వారం రోజులుగా సోదాలు నిర్వహిస్తోంది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ. ఈ మేరకు దాడులకు సంబంధించి మంగళవారం ఓ ప్రకటన చేసింది సీబీడీటీ. ‘నవంబర్ 4న ప్రారంభించి ఇప్పటి వరకు 50 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. అందులో రాంచీ, గొడ్డా, బెర్మో, దుమ్కా, జంషెడ్పూర్, ఛాయ్‌బాసా, బిహార్‌లోని పాట్నా, హరియాణాలోని గురుగ్రామ్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ప్రాంతాలు ఉన్నాయి. దాడులు నిర్వహించిన ఎమ్మెల్యేలు కుమార్ జైమంగళ్ అలియాస్ అనుప్ సింగ్, ప్రదీప్ యాదవ్.’ అని సీబీడీటీ తన ప్రకటనలో తెలిపింది. బొగ్గు క్రయవిక్రయాల్లో ఉన్న పలు వ్యాపార సంస్థలపై ఈసోదాలు నిర్వహించామని వెల్లడించింది. రు.2కోట్ల నగదు, రూ.100 కోట్లకుపైగా లెక్కల్లో చూపని లావాదేవీలు, పెట్టుబడులను గుర్తించినట్లు తెలిపింది సీబీడీటీ. బెర్మో నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే జైమంగళ్ ఈవిషయంపై రాంచీలో విలేకరులతో మాట్లాడారు. ఐటీ దాడులు జరిగినట్లు వెల్లడించారు. ఐటీ అధికారులకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు.. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎంతో కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ఇటీవలే బొగ్గు కుంభకోణానికి సంబంధించి సీఎం హేమంత్ సోరెన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయగా.. ఇప్పుడు అధికార కూటమి నేతలపై ఐటీ దాడులు జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి: ఒక్కసారిగా రంగు మారిన సియాంగ్ నది.. చైనానే కారణం? -
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్: అందరికీ ఒకటే ఐటీఆర్ ఫామ్!
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులు అందరికీ అనుకూలమైన ఒకే ఒక్క ఆదాయపన్ను రిటర్నుల పత్రాన్ని (ఐటీఆర్ ఫామ్) తీసుకురావాలంటూ ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. ఈ పత్రంలో వర్చువల్ డిజిటల్ అసెట్స్ రూపంలో వచ్చే ఆదాయాన్ని వెల్లడించేందుకు ప్రత్యేక భాగం ఉంటుంది. ట్రస్ట్‌లు, ఎన్జీవోలు మినహా మిగిలిన పన్ను చెల్లింపుదారులు అందరూ నూతన ప్రతిపాదిత ఐటీఆర్‌ను ఫైల్ చేసుకోవచ్చంటూ, దీనిపై అభిప్రాయాలు తెలియజేయాలని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) భాగస్వాములను కోరింది. ఐటీఆర్–7 మినహా మిగిలిన అన్ని ఐటీఆర్‌లను విలీనం చేయాలన్నది ప్రతిపాదన. చిన్న, మధ్య స్థాయి పన్ను చెల్లింపుదారుల్లో ఎక్కువ మంది ఐటీఆర్–1, ఐటీఆర్–4 దాఖలు చేస్తుంటారు. ఇంటి రూపంలో ఆదాయం, వేతనం రూపంలో రూ.50 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు ఐటీఆర్–1 దాఖలు చేయవచ్చు. రూ.50 లక్షల వరకు ఆదాయం కలిగిన వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు, సంస్థలు వ్యాపార ఆదాయం కూడా కలిగి ఉంటే ఐటీఆర్–4ను, వేతన లేదా వ్యాపార ఆదాయంతోపాటు మూలధన లాభాల పన్ను పరిధిలోని వారు ఐటీఆర్–2 దాఖలు చేయాలి. చదవండి: ‘జెఫ్ బెజోస్’ను అధిగమించి..ప్రపంచ ధనవంతుల జాబితాలో అదానీకి 3వ స్థానం -
బంగారాన్ని ఇంట్లో దాచుకుంటున్నారా? ఈ పన్నుల కథేంటో తెలుసా?
సాక్షి,ముంబై: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పసిడి వినియోగదారు భారత్. మన దేశంలో బంగారం అంటే సెంటిమెంట్ మాత్రమే కాదు పెట్టబడికి ఒక కీలకమైన మార్గం కూడా. బంగారాన్ని లక్ష్మీ దేవితో సమానంగా భావిస్తారు. పసిడి ఇంట్లో శుభప్రదమని నమ్ముతారు. అందుకే ఆభరణాల నుండి నాణేల వరకు ఇళ్లలో బంగారాన్ని దాచుకోవడానికి ఇష్టపడతారు. అయితే బంగారాన్ని ఇట్లో ఎంతమేరకు ఇంట్లో ఉంచుకోవాలి. అసలు దానికి సంబంధించిన ఏమైనా ఆంక్షలున్నాయా? చట్టప్రకారం ఇంటిలో ఎంత బంగారాన్ని దాచుకోవచ్చు? దీనిపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఏం చెబుతోంది? అనేది పరిశీలించడం చాలా అవసరం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ప్రకారం, ఒక వ్యక్తి వెల్లడించిన ఆదాయంతో బంగారాన్ని కొనుగోలు చేసినా లేదా వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంతో బంగారాన్ని కొనుగోలు చేసినా లేదా పొదుపు చేసిన మొత్తంతో కొనుగోలు చేసినా లేదా చట్టబద్ధంగా వారసత్వంగా వచ్చిన ఆదాయంతో కొనుగోలు చేసిన బంగారానికి పన్ను వర్తించదు. ఈ విధంగా కొనుగోలు చేసిన బంగారాన్ని సెర్చ్ ఆపరేషన్ల సమయంలో అధికారులు స్వాధీనం చేసుకోలేరు. నిబంధనల మేరకు దాచుకున్న బంగారంపై ఎలాంటి పన్ను వర్తించనప్పటికీ, కానీ దానిని విక్రయించే సమయంలో మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. చట్ప్రకారం వివాహిత మహిళ 500 గ్రాముల బంగారాన్ని, అవివాహిత మహిళ 250 గ్రాముల బంగారాన్ని, కుటుంబంలోని పురుషులకు పరిమితి 100 గ్రాములు మాత్రమే. మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బంగారం మన దగ్గర ఉంచుకుని తర్వాత దానిని విక్రయించాలనుకుంటే ఆ అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం.. దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ (ఎల్టీసీజీ)కి లోబడి ఉంటుంది, ఇది ఇండెక్సేషన్ ప్రయోజనంతో 20 శాతం. బంగారాన్ని కొనుగోలు చేసిన మూడేళ్లలోపు విక్రయిస్తే, ఆ లాభం వ్యక్తి ఆదాయానికి కలిపి, పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. సావరిన్ గోల్డ్ బాండ్లను (SGB) విక్రయించిన సందర్భంలో కూడా లాభాలు మీ ఆదాయంగా లెక్కించి, పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు.మూడు సంవత్సరాల తర్వాత విక్రయిస్తే, లాభాలపై ఇండెక్సేషన్‌తో 20 శాతం, ఇండెక్సేషన్ లేకుండా 10 శాతం చొప్పున పన్ను విధిస్తారు. అయితే మెచ్యూరిటీ వరకు బాండ్‌ని ఉంచితే వచ్చే లాభాలపై ఎలాంటి పన్ను ఉండదు. -
అలెర్ట్.. సంస్థలకు ఐటీఆర్ ఫైలింగ్ డెడ్‌లైన్ పొడిగింపు
ట్యాక్స్ పేయర్స్‌కు ముఖ్య గమనిక. కేంద్ర ఆర్ధిక శాఖ 2022-2023 ఆర్ధిక సంవత్సరానికి గాను సంస్థల ఇన్ కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయాల్సిన గడువును నవంబర్ 7కు పొడిగించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ), ఆదాయం,కార్పొరేట్ పన్ను విషయాలలో అపెక్స్ బాడీ గత నెలలో ఆడిట్ నివేదికలను దాఖలు చేయడానికి గడువును పొడిగించినందున ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీని కూడా పొడిగించినట్లు ఒక నోటిఫికేషన్లో తెలిపింది. ‘సీబీడీటీ అసెస్మెంట్ ఇయర్ 2022-23 చట్టంలోని సెక్షన్ 139 సబ్-సెక్షన్ (1) కింద సంస్థలు ఇన్ కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేసే గడువు తేదీని అక్టోబర్ 31, 2022.. నవంబర్ 7, 2022 వరకు పొడిగించింది’ అని సీబీడీటీ పేర్కొంది. -
ఐటీఆర్‌ల ప్రాసెసింగ్ వేగవంతం చేయండి
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను రిఫండ్ల (ఐటీఆర్) ప్రాసెసింగ్‌ను, రిఫండ్ల జారీని వేగవంతం చేయడంపై మరింతగా దృష్టి పెట్టాలని ఐటీ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. అలాగే ఫిర్యాదులను కూడా సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొ న్నారు. సీబీడీటీ అధికారులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆమె సంక్లిష్టమైన, ప్రత్యేకమైన కేసులేవైనా ఉంటే న్యాయస్థానానికి పంపే వి« దానాన్ని కూడా పరిశీలించాలని సూచించారు. అవసరమైతే సీబీడీటీ (కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బో ర్డు) ఏడాదిలో ఒక వారం రోజుల పాటు కేసుల పరిష్కరణకు కేటాయించవచ్చని మంత్రి పేర్కొన్నారు. ప్రత్యక్ష పన్ను వసూళ్లు 23 శాతం అప్ : ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకూ నికర 23 శాతం పెరిగి 7.04 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) డైరెక్టర్ నితిన్ గుప్తా ఈ వివరాలను ఐటీ అధికారుల అవార్డు ప్రదాన కార్యక్రమంలో తెలియజేశారు. 2021–22లో ఆదాయపు, కార్పొరేట్ పన్ను వసూళ్లు భారీగా రూ.14.09 లక్షల కోట్లుగా నమోదయినట్లు పేర్కొన్నారు. ఆదాయపు పన్ను ఈ–ఫైలింగ్ పోర్టల్‌లో లోపాలు దాదాపు తొలగిపోయినట్లు తెలిపారు. జూలై 31వ తేదీ నాటికి 5.83 కోట్ల పన్ను రిటర్న్స్ ఈ పోర్టల్ ద్వారా దాఖలయినట్లు పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో ఒక్కరోజులో 72 లక్షల రిటర్న్స్ దాఖలయినట్లు కూడా వెల్లడించారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వేతన జీవుల ఐటీఆర్ దాఖలు తుదిగడువు జూలై 31వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. కాగా, ఐటీ రిఫండ్స్ ఇప్పటి వరకూ రూ.1.41 లక్షల కోట్లు జరిగినట్లు వెల్లడించిన గుప్తా, గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఈ విలువ 83 శాతం పెరిగినట్లు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని రూ.14.20 లక్షల కోట్లుగా కేంద్ర బడ్జెట్ నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో కార్పొరేట్ పన్ను వసూళ్ల అంచనా రూ.7.20 లక్షలుకాగా, వ్యక్తిగత పన్ను వసూళ్ల అంచనా రూ.7 లక్షల కోట్లు. -
ఆదాయపు పన్ను శాఖలో భారీగా బదిలీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖలో భారీగా బదిలీలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఐటీ శాఖకు చెందిన 86 మంది చీఫ్ కమిషనర్ స్థాయి అధికారులకు సోమవారం బదిలీ చేస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పలువురికి పదోన్నతులు సైతం కల్పించింది కేంద్రం. హైదరాబాద్ ఐటీ చీఫ్ వసుంధర సిన్హాను ముంబైకి బదిలీ చేసింది సీబీడీటీ. హైదరాబాద్ కొత్త ఐటీ చీఫ్‌గా శిశిర్ అగర్వాల్‌ను నియమించింది. ఇదీ చదవండి: షాకింగ్ వీడియో.. రహదారిపై వాహనాలను ఢీకొడుతూ వ్యక్తిని లాక్కెళ్లిన కారు -
ఏడాదికి రూ. 20 లక్షలకు మించి డిపాజిట్ చేస్తే..
సాక్షి, ముంబై: అక్రమ నగదు లావాదేవీలకు అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఏడాదికి 20 లక్షలకుమంచి నగదు డిపాజిట్ చేస్తే పాన్, ఆధార్ తప్పనిసరిగా నమోదు చేయాలి. 2022, మే 10 నాటి నోటిఫికేషన్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటా) రూపొందించిన కొత్త నియమాలు, నిబంధనల సవరించింది. ఒక ఏడాది వ్యవధిలో నిర్దిష్ట మొత్తానికి (రూ.20 లక్షలు) మించి డిపాజిట్ చేస్తే పాన్, ఆధార్ వివరాలను సమర్పించాలని నిర్దేశించడం ఇదే తొలిసారి. ఆర్థికం స్కాంలు, లెక్కల్లో చూపని నగదు లావాదేవీలను అరికట్టడానికి, ప్రభుత్వం వార్షిక నగదు పరిమితి నిబంధనలను సవరించింది. ఇప్పటికి వరకు రోజుకు రూ.50వేలకు మించి బ్యాంకులో డిపాజిట్ చేసే వారి పాన్ కార్డు వివరాలను అందించే నిబంధన ఉంది. ఇకపై ఏడాదికి 20 లక్షలకు మించి బ్యాంకులో డిపాజిట్ చేస్తే పాన్ నెంబరు, ఆధార్ వివరాలు తప్పనిసరిగా అందించాలి. ఒకవేళ పాన్ నంబర్ లేకుంటే. ఆ లావాదేవీ చేయడానికి వారం ముందు పాన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న రశీదును బ్యాంకులో సమర్పించాల్సి ఉంటుంది. సన్నిహిత కుటుంబ సభ్యులనుంచి తప్ప రూ. 2 లక్షల కంటే ఎక్కువ విలువైన నగదును స్వీకరించడం కూడా నిషేధం. నిబంధనలకు విరుద్థంగా పరిమితికి మించి నగదు చెల్లించినా, స్వీకరించినా లావాదేవీ మొత్తంలో 100 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక మోసం, అక్రమ నగదు లావాదేవీలు , ఇతర డబ్బు నేరాల ప్రమాదాన్ని తగ్గించేలా ఆదాయపు పన్ను శాఖ, ఇతర కేంద్రం కసరత్తులో భాగంగా నిబంధనలను సవరిస్తోన్న సంగతి తెలిసిందే. -
డోలో కంపెనీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు...ఆ వైద్యులకు ఝలక్
సాక్షి,ముంబై: కోవిడ్ సంక్షోభంలో కోట్ల రూపాయలు దండుకున్న డోలో-650 మేకర్ మైక్రోల్యాబ్స్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డోలో-650 తయారీదారుల ‘అనైతిక పద్ధతులను’ పరిశోధించడానికి ప్రభుత్వం సెపరేట్ అండ్ స్పెషల్ ప్యానెల్‌ను రూపొందించాలని ఫార్మస్యూటికల్ విభాగాన్ని ఆదేశించింది. ఈ ప్యానెల్ నివేదికను జాయింట్ సెక్రటరీ నేతృత్వంలోని ఫార్మా మార్కెటింగ్ పద్ధతులపై కోడ్ రూపొందించి ఎథిక్స్ కమిటీకి అందించాలని కోరింది. ఈ విభాగం రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది. అంతేకాదు మైక్రోల్యాబ్స్ ద్వారా ప్రయోజనాలు పొందిన వైద్యుల వివరాలను సేకరించి వారికి షోకాజ్ నోటీసు లివ్వాలని కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. కంపెనీ ప్రాంగణంలో దాడులు చేసి పేర్లు బయటపడ్డ వైద్యులకు షోకాజ్ నోటీసులు పంపాలని మంత్రిత్వ శాఖ కార్యాలయం అధికారులను ఆదేశించిందని సంబంధిత ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఫార్మా స్యూటికల్ సంస్థల అనైతిక చర్యల గురించి తెలుసుకోవాలని కోరింది. ఇప్పటివరకు, మధుమేహం, కార్డియో, మానసిక చికిత్స అనే మూడు విభాగాల ఫార్మా కంపెనీలు డబ్బును పెట్టుబడి పెట్టేవి, వైద్యులకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించేవని తెలుసంటూ మరో అధికారి వ్యాఖ్యానించారు. కాగా బెంగళూరుకు చెందిన డోలో-650 తయారీదారు మైక్రోల్యాబ్స్ అనైతిక విధానాలకు పాల్పడుతోందనీ, తమ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు వైద్యులు, వైద్య నిపుణులకు సుమారు రూ.1,000 కోట్ల ఉచితాలను ఇచ్చిందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) బుధవారం ఆరోపించింది. ఆసుపత్రి పరికరాలు, బంగారు ఆభరణాలు, విదేశీ పర్యటనలు, ఇతరత్రా ఉచితాలతో వారిని ఆకర్షించినట్టు సీబీడీటీ పేర్కొంది. అధికారి వెబ్సైట్ ప్రకారం మైక్రోల్యాబ్స్ విక్రయాల పరంగా 19వ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా లక్షా, 50 వేలకు పైగా వైద్యుల ద్వారా తమ ఉత్పత్తులపై ప్రచారాన్ని నిర్వహిస్తోంది. తాజా పరిణామాలపై మైక్రో ల్యాబ్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ ఛైర్మన్‌గా నితిన్ గుప్తా నియామకం!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఛైర్మన్‌గా ఐఆర్ఎస్ నితిన్ గుప్తా నియమితులయ్యారు. కేంద్ర యూనియన్ కేబినెట్ నితిన్ గుప్తాను నియమిస్తూ ఖరారు చేసింది. The Government of India has appointed IRS Nitin Gupta as chairman of the Central Board of Direct Taxes (CBDT). pic.twitter.com/p073ixjXHi — ANI (@ANI) June 27, 2022 కేంద్ర ఆర్ధిక శాఖ నిర్ణయించిన తేదీ నుంచి గుప్తా సీబీడీటీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని కేంద్ర రెవెన్యూ శాఖ నియామకాల కమిటీ సెక్రటేరియట్ విడుదల చేసిన ఓ నోటిఫికేషన్లో తెలిపింది. కాగా, ప్రస్తుతం గుప్తా సీబీడీటీ విభాగంలో ఇన్వెస్టిగేషన్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లుకు, డాక్టర్లకు కేంద్రం షాక్!
సోషల్ మీడియా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లుకు, డాక్టర్లకు కేంద్రం ఊహించని షాక్ ఇవ్వనుంది. జూన్1 నుంచి ఇన్ఫ్లూయెన్సర్లలకు సంస్థలు అందించే ఫ్రీగిఫ్ట్ పై, అలాగే డాక్టర్లకు ఫార్మాస్యూటికల్స్ ఫ్రీగా ఇచ్చే మెడిసిన్‌పై ట్యాక్స్ కట్టాల్సి ఉందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ఏదైనా సంస్థ ప్రొడక్ట్ ప్రమోషన్ కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లలను ఆశ్రయిస్తాయి. ఇన్ఫ్లూయెన్సర్లు సదరు సంస్థ ప్రొడక్ట్ సేల్ చేయమని ఫాలోవర్లకు సలహా ఇస్తారు. వారి సలహా మేరకు కొనుగోలు దారులు ఆ ప్రొడక్ట్‌లపై భారీ ఎత్తున ఖర్చు చేస్తారు. దీంతో ప్రొడక్ట్ సేల్స్ పెరుగుతాయి. అలా కొన్ని కంపెనీలు ప్రొడక్ట్‌లను ఇన్ఫ్లూయెన్సర్లకు ఉచితంగా అందిస్తాయి. ఆ ఉచితాలపై జులై 1నుంచి కేంద్రం ఆధ్వర్యంలో పనిచేస్తున్న సీబీడీటీ సంస్థ 10శాతం ట్యాక్స్ వసూలు చేస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇన్‌ఫ్లూయెన్సర్లతో పాటు డాక్టర్ల నుంచి ట్యాక్స్ వసూలు చేస్తున్నట్లు నివేదికలు హైలెట్ చేశాయి. వాటిపై నో ట్యాక్స్ ఒకవేళ సంస్థలు ప్రమోషన్ (పబ్లిసిటీ) కోసం ఇచ్చిన కార్, మొబైల్, ఔట్ ఫిట్ (దుస్తులు) కాస్మోటిక్స్ వంటి ప్రొడక్ట్‌లను ఇన్ఫ్లూయెన్సర్లు తిరిగి ఇచ్చేస్తే వాటిపై ట్యాక్స్ ఉండదని సెక్షన్ 194 ఆర్ టీడీఎస్ నిబంధనలు చెబుతున్నాయని సీబీడీటీ తెలిపింది. అదే ఫ్రీగా పొందే కార్లు, టీవీలు, మొబైల్ ఫోన్లు, ఫ్రీ టిక్కెట్లు, విదేశీ పర్యటనలు, బిజినెస్ కోసం అందించే ఇతర ప్రోత్సహకాలపై టీడీఎస్ వర్తించనుంది. డాక్టర్లు సైతం ఆస్పత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తికి ఫార్మాస్యూటికల్స్ ఫ్రీగా కొన్ని మెడిసిన్లను అందిస్తాయి. వాటిపై టీడీఎస్ కట్టాల్సి ఉంటుంది. అయితే ఆ ఫ్రీ మెడిసిన్లు ఆస్పత్రికి ప్రయోజనం అనే అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఆదాయపు పన్ను మినహాయిస్తుంది. అందుకే డాక్టర్లు టీడీఎస్ నుంచి ఉపశమనం పొందాలంటే సదరు ఆస్పత్రి యాజమాన్యం ట్యాక్స్ రిటర్న్ అందించాల్సి ఉంటుంది.అలా చేస్తే చట్టంలోని సెక్షన్ 194ఆర్ కింద మినహాయించబడిన పన్ను క్రెడిట్‌ను పొందవచ్చని సీబీడీటీ పేర్కొంది. దీంతో డాక్టర్లు టీడీఎస్ కట్టాల్సిన అవసరం ఉండదు. చదవండి👉 ఈ యూట్యూబర్ల నెలవారీ సంపాదన తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది! -
ఆదాయ పన్ను రిటర్నులు అప్
పనాజీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఆదాయ పన్ను రిటర్నులు పెరిగినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) చైర్మన్ సంగీతా సింగ్ పేర్కొన్నారు. గతేడాదిలో 6.9 కోట్ల నుంచి 7.14 కోట్లకు రిటర్నులు పుంజుకున్నట్లు వెల్లడించారు. పన్ను చెల్లింపుదారుల సంఖ్య బలపడటంతోపాటు.. సవరించిన రిటర్నులు మెరుగుపడినట్లు తెలియజేశారు. సాధారణంగా ఆర్థిక వ్యవస్థ పురోగతికి అద్దంపట్టే పన్ను వసూళ్లు ఇటీవల ఊపందుకున్నట్లు తెలియజేశారు. ఆర్థిక కార్యకలాపాలు మరింత పుంజుకుంటే అమ్మకాలు, కొనుగోళ్లు సైతం వృద్ధి చూపనున్నట్లు వివరించారు. గతేడాది పన్ను వసూళ్లు రూ. 14 లక్షల కోట్లను అధిగమించినట్లు వెల్లడించారు. చదవండి: ఆధార్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త! -
భారీ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా? కొత్త రూల్స్ ఈ రోజు నుంచే
సాక్షి, న్యూడిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఇటీవల జారీ చేసిన కొత్త నిబంధనలు నేటి (మే 26) నుంచి అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం 20 లక్షలు రూపాయలు అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీలకు పాన్ లేదా ఆధార్ తప్పనిసరిగా ఉండాలి. మే 10 నాటి నోటిఫికేషన్లో ప్రకటించిన కొత్త నిబంధన ప్రకారం ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల కన్నా ఎక్కువ విత్‌డ్రా చేసినా, డిపాజిట్ చేసినా తన పాన్ నెంబర్ పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ నంబర్‌ను వెల్లడించాలి. ఇంతకుముందు, ఒకే రోజులో రూ 50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేసేటప్పుడు మాత్రమే పాన్ నంబర్ అవసరం. కానీ నగదు డిపాజిట్ లేదా ఉపసంహరణకు వార్షిక పరిమితి లేదు. కొత్త నిబంధనలు ఖాతాదారులు ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులతోపాటు, కోఆపరేటీవ్ బ్యాంకుల్లో రూ.20 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ చేసినా కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. బ్యాంకులేదా పోస్ట్ ఆఫీసులో కరెంట్ ఖాతా క్యాష్ క్రెడిట్ అకౌంట్ ఓపెన్ చేసినా పాన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ వివరాలు ఇవ్వడం తప్పనిసరి. అంతేకాదు ఒకేసారి రూ.20 లక్షల ట్రాన్సాక్షన్ చేసినా, వేర్వేరు సందర్భాల్లో మొత్తం కలిపి రూ.20 లక్షల లావాదేవీలు జరిపినా పాన్ నెంబరును నమోదు చేయాలి. అయితే ఈ లావాదేవీలు జరిపే సందర్భంలో పాన్ నెంబర్, ఆధార్ నంబర్లను తీసుకునే వ్యక్తులు అవి సరైన వివరాలేనా కాదా అని నిర్థారించుకోవాలని సీబీడీటీ వెల్లడించింది. ఏయే వ్యక్తులు పాన్ కార్డ్ కోసం అప్లై చేయాలో, ఎవరు పాన్ కార్డ్ వివరాలను వెల్లడించాలో సెక్షన్ 139ఏ తెలుపుతుంది. అందుకే సీబీడీటీ రూ.20 లక్షల కన్నా ఎక్కువ లావాదేవీలకు పాన్ కార్డ్ లేదా ఆధార్ నెంబర్ తప్పనిసరి. ఒకవేళ భారీ ఆర్థిక లావాదేవీలు జరిపే వారి దగ్గర పాన్ కార్డ్ లేకపోతే లావాదేవీ చేసే తేదీకి కనీసం 7 రోజుల ముందు పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సీబీడీటీ తన నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. లేదంటే సంబంధిత లావాదేవీలకు ఆస్కారం ఉండదు. -
ఈపీఎఫ్ చందాదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
మీరు ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా? అయితే మీకు ఒక ముఖ్య గమనిక. వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. కొత్తగా అమలులోకి రానున్న పీఎఫ్ నిబంధనల ప్రకారం.. రూ. 2.5 లక్షలకు పైన ఈపీఎఫ్ ఖాతాలో జమ అయ్యే పీఎఫ్ మొత్తంపై ట్యాక్స్ పడనుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) కూడా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్ధిక మంత్రి ఈ విషయాన్ని తెలియజేశారు. 2021 ఆగస్ట్ 31న సీబీడీటీ జారీ చేసిన నిబంధనల ప్రకారం.. ప్రావిడెంట్ ఫండ్‌లో రూ. 2.5 లక్షల వరకు ఇన్వెస్ట్‌మెంట్‌పై వచ్చే వడ్డీ ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. అయితే ఈ లిమిట్ దాటితే మాత్రం పన్ను పడుతుంది. అంటే రూ.2.5 లక్షలకు మించి ఇన్వెస్ట్ చేస్తే వచ్చే వడ్డీ ఆదాయంపై ట్యాక్స్ చెల్లించుకోవాల్సి ఉంటుంది. యజమానులు పీఎఫ్ కంట్రిబ్యూట్ చేయనప్పుడు ఈ పరిమితి సంవత్సరానికి రూ.5 లక్షలుగా ఉంటుంది. రూ.2.5 లక్షలకు పైగా ఇన్వెస్ట్మెంట్ కలిగిన వారు పీఎఫ్ ఖాతాను రెండు విభాగాలుగా మార్చుకోవాల్సి వస్తుంది. అంటే రూ.2.5 లక్షల వరకు ఒక అకౌంట్లో, మిగతా డబ్బులు మరో అకౌంట్లో డిపాజిట్ చేసుకోవాల్సి రావొచ్చు. అప్పుడు ఈ అదనపు అకౌంట్‌పై ట్యాక్స్ పడుతుంది. కొత్త పీఎఫ్ నిబంధనలు: ప్రస్తుతం ఉన్న పీఎఫ్ ఖాతాలను పన్ను పరిధిలోకి వచ్చే కంట్రిబ్యూషన్ అకౌంట్లు, నాన్ ట్యాక్సబుల్ కంట్రిబ్యూషన్ అకౌంట్లుగా విభజించనున్నారు. ప్రావిడెంట్ ఫండ్ వార్షిక కంట్రిబ్యూషన్ రూ.2.5 లక్షలు దాటితే అప్పుడు రెండు ప్రత్యేకమైన అకౌంట్లను క్రియేట్ చేసుకోవాలి. ఒక అకౌంట్లో రూ.2.5 లక్షలు డిపాజిట్ చేస్తారు. ఈ లిమిట్‌కు మించిన డబ్బులు మరో అకౌంట్లో డిపాజిట్ చేయాలి. దీని వల్ల పన్ను లెక్కింపు సులభతరం అవుతుంది. కొత్త పీఎఫ్ నిబంధనలు వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1, 2022 నుంచి అమల్లోకి వస్తాయి. ఏడాదికి రూ.2.5 లక్షలకు మించిన ఉద్యోగుల కంట్రిబ్యూషన్ పీఎఫ్ ఆదాయంపై కొత్త పన్ను విధించేందుకు ఐటీ నిబంధనలకు కొత్త సెక్షన్ 9డీని తీసుకొచ్చింది. (చదవండి: ఓలా, ఒకినావా ఈవీ స్కూటర్ అగ్నిప్రమాదంపై కేంద్రం కీలక నిర్ణయం..!) -
గడువులోగా పాన్-ఆధార్ లింక్ చేయకపోతే.. భారీ జరిమానా కట్టాల్సిందే!
మీకు పాన్ కార్డు ఉందా? అయితే, మీకు ఒక ముఖ్య గమనిక. కేంద్రం ప్రభుత్వం గత ఏడాదికి సంబంధించి ఒక కొత్త నిబంధనను అమలులోకి తీసుకొని వచ్చింది. ఈ కొత్త నిబంధన ప్రకారం.. కేంద్ర పేర్కొన్న గడువు తేదీలోగా మీ పాన్ కార్డ్ నంబర్‌ను ఆధార్ నంబర్‌తో లింకు చేయాల్సి ఉంటుంది. అయితే, గత ఏడాది ఆర్థిక శాఖకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) పాన్-ఆధార్ లింక్ గడువు తేదీని 2022 మార్చి 31 వరకు పొడగించినట్లు పేర్కొంది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గడువు తేదీని పొడగించినట్లు అప్పట్లో ఒక ప్రకటన విడుదల చేశారు. రూ. 10వేల జరిమానా..! పాన్ కార్డ్ హోల్డర్లు మార్చి 31 లోపు ఆధార్ కార్డ్ నంబర్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన గడువులోగా లింక్ చేయడంలో విఫలమైతే ఆయా పాన్ కార్డ్ హోల్డర్ల పాన్ కార్డ్ చెల్లుబాటు కాదు. ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 272ఎన్ ప్రకారం.. సదరు వ్యక్తిపై 10 వేల జరిమానాను అసెస్సింగ్ అధికారి విధిస్తారు. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్‌లు, బ్యాంక్ ఖాతా తెరవడం మొదలైన వాటిలో తప్పనిసరిగా పాన్ కార్డ్‌ను కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఇలా లింక్ చేయండి ముందుగా ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్ https://www.incometax.gov.in/ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలోనే Link Aadhaar లింక్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత పాన్ నెంబర్, రెండో కాలమ్‌లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఆధార్ కార్డులో ఉన్నట్టుగా మీ పేరు నమోదు చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ ఆధార్ కార్డుపై పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే I have only year of birth in Aadhaar card సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత I agree to validate my Aadhaar details సెలెక్ట్ చేసుకొని Link Aadhaar క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి Validate పైన క్లిక్ చేయాలి. మీ పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది. ఒకవేళ మీ పాన్, ఆధార్ నెంబర్ ముందే లింక్ అయితే Your PAN is already linked to given Aadhaar అనే మెసేజ్ కనిపిస్తుంది. (చదవండి: ఫోక్స్‌వ్యాగన్‌కి సవాల్ విసిరిన ఎలన్‌మస్క్) -
ట్యాక్స్ పేయర్స్కి షాక్! బడ్జెట్లో అవకాశం అన్నారు.. వాడుకోబోతే మెలిపెడుతున్నారు
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారు ఒక అసెస్మెంట్ సంవత్సరానికి ఒక్క విడతే రిటర్నులను (ఐటీఆర్) సవరించేందుకు (అప్డేట్) అనుమతి ఉంటుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి చైర్మన్ జేబీ మహాపాత్ర తెలిపారు. పన్ను రిటర్నులకు సంబంధించి వెల్లడించాల్సినది ఏదైనా నిజాయితీగా మర్చిపోయిన వారికి ఇది అనుకూలంగా ఉంటుందన్నారు. సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐటీఆర్‌లను దాఖలు చేసిన తర్వాత రెండేళ్ల వరకు వాటిని సవరించుకోవచ్చంటూ 2022–23 బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించడం తెలిసిందే. ఇలా సవరించినప్పుడు పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉంటే.. 12 నెలల్లోపు సవరించినప్పుడు వాస్తవంగా చెల్లించాల్సిన పన్నుకు 25% అదనం, వడ్డీ కట్టాలి. 12 నెలల తర్వాత సవరణ రిటర్నులు వేస్తే అప్పుడు వాస్తవ పన్నుకు అదనంగా 50 శాతం, వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. చదవండి: ట్యాక్స్ పేయర్స్కి గుడ్‌న్యూస్! నిర్మలమ్మ వరాలు -
నాన్ రెసిడెంట్ పన్ను చెల్లింపుదారులకు ఊరట
న్యూఢిల్లీ: ‘ఈ-అడ్వాన్స్ రూలింగ్ స్కీమ్, 2022’ను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి(సీబీడీటీ) నోటిఫై చేసింది. దీంతో పన్ను చెల్లింపుదారులు అడ్వాన్స్ రూలింగ్‌కు సంబంధించి తమ దరఖాస్తులను ఈ మెయిల్ ద్వారా ఫైల్ చేసుకునే అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా స్థానికేతర పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనకరంగా ఉండనుంది. పన్ను కేసుల్లో విచారణను అడ్వాన్స్ రూలింగ్స్ బోర్డ్ వీడియో కాన్ఫరెన్స్/వీడియో టెలిఫోనీ ద్వారా చేపట్టేందుకు ఈ పథకం అనుమతిస్తుంది. నాన్ రెసిడెండ్‌లు, కొన్ని ప్రత్యేక కేటగిరీ పన్ను చెల్లింపుదారులకు సంబంధించి స్పష్టత ఇచ్చేందుకు ఆదాయపన్ను చట్టం కింద అడ్వాన్స్‌రూలింగ్ యంత్రాంగం పనిచేస్తుంటుంది. భారత్‌లో లావాదేవీలకు భారత పన్ను చట్టాల కింద పన్ను అంశాల్లోనూ స్పష్టత ఇస్తుంది. దీనికింద అడ్వాన్స్ రూలింగ్స్ బోర్డు చేసే సమాచార, సంప్రదింపులను ఈ మెయిల్ రూపంలో పన్ను చెల్లింపుదారులకు పంపిస్తారు. (చదవండి: దేశంలో కొనసాగుతున్న డిజిటల్ చెల్లింపుల హవా..!) -
Corporate IT Returns : ఇన్‌కం ట్యాక్స్.. వన్మోర్ ఛాన్స్..
న్యూఢిల్లీ: కార్పొరేట్లు 2021 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి (2021–22 అసెస్మెంట్ ఇయర్) సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి గడువును మార్చి 15వ తేదీ వరకూ పొడిగిస్తూ, సీబీడీటీ (ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్) కీలక నిర్ణయం తీసుకుంది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి పన్ను ఆడిట్ నివేదిక, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఆడిట్ నివేదికను దాఖలు చేయడానికి గడువును కూడా ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. కార్పొరేట్లకు ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌కు గడువు పొడిగింపు ఇది మూడవసారి. చదవండి:ఇక ఆర్థిక వ్యవహారాల గుట్టు రట్టు.. కొత్తగా అమల్లోకి ఏఐఎస్ -
ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కేంద్రం తీపికబురు..!
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను శాఖ తీపికబురు అందించింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువును మార్చి 15 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. వాస్తవానికి ఈ గడువు డిసెంబర్ 31 వరకే ఉంది. ఈ రిటర్న్ ఫైలింగ్ గడువు పొడిగింపు గురించి ఆదాయపు పన్ను శాఖ కూడా ట్వీట్ చేసింది. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితి కారణంగా పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల కారణంగా మార్చి 15 వరకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు సీబీడీటీ తెలిపింది. ఆదాయపు పన్ను చట్టం 1961 నిబంధనల కింద వివిధ ఆడిట్ నివేదికలను ఈ-ఫైలింగ్ చేస్తున్నప్పుడు ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా గడువును కూడా పొడిగించినట్లు పేర్కొంది. 2021, ఏప్రిల్ 1 నుంచి 2022, జనవరి 3 వరకు 1.48 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రత్యక్ష్య పన్నుల శాఖ (సీబీడీటీ) రూ.1,50,407 కోట్లకు పైగా రీఫండ్స్ విడుదల చేసినట్లు ఆదాయపన్ను శాఖ జనవరి 5న తెలిపింది. ఇందులో 1.46 కోట్ల మందికి రూ.51,194 కోట్లు ఇన్‌కం టాక్స్ రీఫండ్స్ జారీ చేయగా 2.19 లక్షల మందికి కార్పొరేట్ టాక్స్ రీఫండ్ రూపంలో రూ.99,213 కోట్లు రీఫండ్ చేసింది. On consideration of difficulties reported by taxpayers/stakeholders due to Covid & in e-filing of Audit reports for AY 2021-22 under the IT Act, 1961, CBDT further extends due dates for filing of Audit reports & ITRs for AY 21-22. Circular No. 01/2022 dated 11.01.2022 issued. pic.twitter.com/2Ggata8Bq3 — Income Tax India (@IncomeTaxIndia) January 11, 2022 (చదవండి: ఎలక్ట్రిక్ వాహనాల దెబ్బకు ఆ కంపెనీలకు భారీ నష్టాలు..!) -
గడువులోపు ఐటీఆర్ దాఖలు చేయకపోతే.. ఎంత ఆలస్య రుసుము చెల్లించాలో తెలుసా?
2020-21 ఆర్థిక సంవత్సరానికి(మార్చి 2021తో ముగిసింది) సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్)లను ఆన్లైన్లో దాఖలు చేసే గడువు తేదీని కేంద్ర ప్రభుత్వం పొడిగించలేదు. డిసెంబర్ 31, 2021 గడువు ముగిసే నాటికి దాదాపు 5.89 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్)లు దాఖలు చేసినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాదితో పోల్చి చూస్తే జనవరి 10, 2021 నాటికి దాఖలు చేసిన మొత్తం ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్)లు 5.95 కోట్లు. అంటే, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐటీఆర్‌ల దాఖలు చేసిన వారి సంఖ్య తక్కువ. గడువు తేదీ తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయవచ్చా? చాలా వరకు సామాన్య జనం గుడువు తేదీని చివరి తేదీ అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఐటీఆర్ ఫైలింగ్ కు సంబంధించి రెండు తేదీలు ఉంటాయి. ఒకటి గడువు తేదీ, మరొకటి చివరి తేదీ. ఒకవేళ మీరు గడువు తేదీ నాటికి మీ ఐటీఆర్ ఫైల్ చేయకపోతే.. చివరి తేదీ నాటికి మీరు ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. చివరి తేదీ 2022 మార్చి 31 వరకు అన్నమాట. కానీ గడువు తేదీ నాటికి ఐటీఆర్ దాఖలు చేయకపోవడం వల్ల కొంత జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఎంత ఆలస్య రుసుము చెల్లించాలి? గడువు తేదీ తర్వాత ఐటీఆర్ దాఖలు చేసినందుకు ఆలస్య రుసుము కింద రూ.5,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.5 లక్షలకు లోపు ఉన్న పన్ను చెల్లింపుదారులు గడువు తేదీ తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే(మార్చి 31, 2022 చివరి తేదీ లోపు) ఆలస్య రుసుము గరిష్టంగా రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.5 లక్షలకు పైగా ఉన్నట్లయితే, ఆలస్య రుసుము అనేది రూ.5 వేల వరకు ఉంటుంది. (చదవండి: ల్యాప్‌టాప్, పీసీలలో ఇలా చేస్తున్నారా? ఇక మీ పని అయిపోయినట్టే..) -
విదేశీ మొబైల్ కంపెనీలు.. రూ.6,500 కోట్ల పన్ను ఎగవేత
న్యూఢిల్లీ: విదేశీ సంస్థల ఆధీనంలోని మొబైల్ కమ్యూనికేషన్, హ్యాండ్సెట్ తయారీ సంస్థల కార్యాలయాలు, వాటికి సంబంధించిన వ్యక్తుల నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో భారీగా పన్ను ఎగవేత జరిగిందని ఆదాయ పన్ను విభాగం గుర్తించింది. రూ. 6,500 కోట్ల పైచిలుకు లెక్కల్లో చూపని ఆదాయాన్ని గుర్తించినట్లు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. డిసెంబర్ 21న తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్ మొదలైన రాష్ట్రాల్లో ఆయా సంస్థల కార్యాలయాల్లో ఐటీ విభాగం సోదాలు నిర్వహించింది. రెండు పెద్ద కంపెనీలు.. విదేశాల్లోని తమ మాతృ సంస్థలకు ఏకంగా రూ. 5,500 కోట్ల పైచిలుకు మొత్తాన్ని రాయల్టీ మొదలైన రూపాల్లో చెల్లించాయని ఈ సోదాల్లో తేలినట్లు సీబీడీటీ పేర్కొంది. అయితే ఆ సంస్థల పేర్లు మాత్రం వెల్లడించలేదు. సందేహాస్పద సంస్థల నుంచి రూ. 5,000 కోట్ల పైచిలుకు రుణాలు చూపిన దేశీ విభాగాలు.. వాటిపై వడ్డీ వ్యయాలను కూడా క్లెయిమ్ చేసుకున్నాయని సీబీడీటీ పేర్కొంది. అలాగే అనుబంధ సంస్థల తరఫున చేసిన చెల్లింపులను ఎక్కువగా చేసి చూపించడం, భారత విభాగాల లాభాలను (పన్నులు వర్తించే) తక్కువ చేసి చూపించడం వంటి అవకతవకలకు పాల్పడ్డాయని తెలిపింది. ఈ తరహా నేరాలకు రూ. 1,000 కోట్ల పైగా జరిమానా విధించేందుకు ఆస్కారం ఉందని పేర్కొంది. చదవండి: క్రిప్టో లావాదేవీల్లో అక్రమాలు.. రూ. 49 కోట్ల ఫైన్.. -
పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్.. రూ.1.44 లక్షల కోట్లు రీఫండ్..!
పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను శాఖ తీపికబురు అందించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 1.38 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ఖాతాల్లో రూ.1.44 లక్షల కోట్లకు పైగా ఆదాయపు పన్ను జమ చేసినట్లు ఐటీ విభాగం తెలిపింది. సీబీడీటీ తెలిపిన వివరాల ప్రకారం.. 1, ఏప్రిల్, 2021 నుండి 20 డిసెంబర్ మధ్య కాలంలో ఆదాయపు పన్ను శాఖ 1.38 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులకు రూ.1,44,328 కోట్లను రీఫండ్ చేసినట్లు తెలిపింది. ఇది కాకుండా రూ. 2.11 లక్షలకు కార్పొరేట్ కేసులలో రూ.95,133 కోట్లను రీఫండ్ చేసినట్లు తెలిపింది. 1,35,35,261 సంస్థలకు రూ.49,194 కోట్ల ఆదాయపు పన్ను రీఫండ్లు జారీ చేసినట్లు పేర్కొంది. CBDT issues refunds of over Rs. 1,44,328 crore to more than 1.38 crore taxpayers from 1st Apr,2021 to 20th December,2021. Income tax refunds of Rs. 49,194crore have been issued in 1,35,35,261 cases &corporate tax refunds of Rs. 95,133crore have been issued in 2,11,932cases(1/2) — Income Tax India (@IncomeTaxIndia) December 22, 2021 (చదవండి: "మెర్రీ క్రిస్మస్" మెసేజ్ ఖరీదు ఇన్ని లక్షలా.. స్పెషల్ ఏంటి?) -
వీరికి ఐటీ రిటర్నుల నుంచి మినహాయింపు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల దాఖలు విషయంలో స్థానికంగా నివసించని వారు, విదేశీ ఇన్వెస్టర్లకు వెసులుబాటు కల్పిస్తూ ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. భారత్‌లో నివసించని వారు (కార్పొరేట్స్).. నిర్దేశిత ఫండ్‌లో పెట్టుబడులు మినహా ఎటువంటి ఆదాయాన్ని పొందని వారు.. గిఫ్టిసిటీలో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కేటగిరీ–3 కిందకు వచ్చే వారు రిటర్నులు దాఖలు చేయనక్కర్లేదని సీబీడీటీ తన నోటిఫికేషనలో తెలిపింది. అర్హత కలిగిన విదేశీ ఇన్వెస్టర్లు.. జీడీఆర్, రూపీ డినామినేటెడ్ బాండ్లు, డెరివేటివ్‌లు లేదా ఎంపిక చేసిన సెక్యూరిటీలు, ఐఎఫ్ఎస్సీలోని గుర్తింపు ఉన్న స్టాక్ ఎక్సేంజ్ల్లోని లిస్టెడ్ సెక్యూరిటీల్లో లావాదేవీలు నిర్వహించిన వారు రిటర్నులు దాఖలు చేయనవసరం లేదని సీబీడీటీ స్పష్టం చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ వెసులుబాటు అమల్లోకి వస్తుందని తెలిపింది. -
‘పండోరా పేపర్స్’.. వారి గుట్టురట్టు చేయనున్న కేంద్రం
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది సంపన్నులు, ప్రముఖులు, రాజకీయ నేతల రహస్య ఆస్తులు, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలను ‘పండోరా పేపర్స్’ పేరిట ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) బహిర్గతం చేసింది. ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద లీక్ అని భావిస్తున్నారు. పండోరా లీక్డ్ డాక్యుమెంట్లలో 300 మందికిపైగా భారతీయుల వివరాలున్నాయి. వీరిలో చాలామంది ఆర్థిక నేరగాళ్లు, మాజీ ఎంపీలే కావడం విశేషం. వీరు ఇప్పటికే దర్యాప్తు సంస్థల నిఘా పరిధిలో ఉన్నారు. చాలా మంది భారతీయులు ఇవి తప్పుడు ఆరోపణలను తిరస్కరించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి 18 దేశాల్లో ఆస్తులు ఉన్నట్లు వార్తలొచ్చాయి. వీరిలో మాజీ క్రికెటర్, భారతరత్న సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నారు. అయితే, ఈ నేపథ్యంలో కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. "పండోరా పేపర్స్" కేసు దర్యాప్తును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్ నేతృత్వంలోని మల్టీ ఏజెన్సీ గ్రూప్ పర్యవేక్షిస్తున్నదని సోమవారం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని సంబంధిత దర్యాప్తు సంస్థలు ఈ కేసుల దర్యాప్తును చేపడతాయని, చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకొనున్నట్లు సీబీడీటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేసుల దర్యాప్తులో ఈడీ, ఆర్బీఐ, ఎఫ్ఐయూ సంస్థల ప్రతినిధులు ఈ బృందంలో కీలక పాత్ర పోషించనున్నారు. (చదవండి: నల్ల ధనవంతుల గుట్టురట్టు!) ఇప్పటివరకు కొంతమంది భారతీయుల పేర్లు(చట్టపరమైన సంస్థలతో పాటు వ్యక్తులు) మాత్రమే మీడియాలో కనిపించాయని తెలిపింది. తాము సేకరించిన 1.2 కోట్ల పత్రాల ఆధారంగా సంపన్నుల ఆర్థిక రహస్యాలను బహిర్గతం చేసినట్లు ఐసీఐజే ట్వీట్ చేసింది. ఐసీఐజే వెబ్సైట్లో కూడా పేర్లను, అన్ని సంస్థల ఇతర వివరాలకు సంబంధించిన సమాచారం విడుదల చేయలేదని పేర్కొంది. ఐసీఐజే వెబ్సైట్లో దశలవారీగా సమాచారం విడుదల చేయనున్నట్లు తెలిపింది. పండోరా పేపర్స్ దర్యాప్తుకు అనుసంధానించిన నిర్మాణాత్మక డేటా దాని ఆఫ్ షోర్ లీక్స్ డేటాబేస్ లో రాబోయే రోజుల్లో మాత్రమే విడుదల చేయనున్నట్లు సూచించింది. 117 దేశాల్లోని 150కి పైగా వార్తా సంస్థలకు చెందిన 600 మంది విలేకర్లు 1.20 కోట్ల ఆర్థిక లావాదేవీల పత్రాలను పరిశీలించి ఈ గుట్టును రట్టుచేసింది. విశ్లేషించిన మొత్తం సమాచారం పరిమాణం 2.94 టెరాబైట్ల మేర ఉంది.(చదవండి: రహస్య లావాదేవీల కుంభకోణం.. సచిన్‌కు క్లీన్చిట్!) -
పన్ను చెల్లింపుదారులకు కేంద్రం భారీ ఊరట
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం మరోసారి భారీ ఊరట కల్పించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు(సెప్టెంబర్ 30, 2021 వరకు ఉన్న) గడువును డిసెంబర్ 31, 2021 వరకు పొడగిస్తూ నేడు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాలను ట్విటర్ వేదికగా వెల్లడిస్తూ సీబీడీటీ సర్క్యులర్ నెం.17/2021 జారీ చేసింది. అకౌంట్లు ఆడిట్ చేయాల్సిన అవసరం లేని వ్యక్తులు, సాధారణంగా ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-4 ఫారాలను ఉపయోగించి తమ ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేసే వ్యక్తుల కోసం ఈ గడువును పొడగించారు.(చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు వాయిదా..?) 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్(ఐటిఆర్) దాఖలు గడువును గతంలో జూలై 31, 2021 వరకు పొడిగించారు. అయితే, కొత్త ఆదాయపు పన్ను ఈ -ఫైలింగ్ పోర్టల్ లో సమస్యలు రావడం, కరోనా వైరస్‌తో నెలకొన్న పరిస్థితుల కారణంగా సెప్టెంబర్ 30 వరకు మళ్లీ పొడగించారు. గత సంవత్సరం కూడా ప్రభుత్వం వ్యక్తులకు సంబంధించి ఐటీఆర్ దాఖలు గడువు తేదీని నాలుగుసార్లు పొడిగించింది. మొదట జూలై 31 నుంచి నవంబర్ 30, 2020 వరకు, తర్వాత డిసెంబర్ 31, 2020 వరకు, చివరకు జనవరి 10, 2021 వరకు సీబీడీటీ పొడగించింది. -
ఆన్లైన్లో ఐటీ రీఫండ్ స్టేటస్ తెలుసుకోవడం ఎలా..?
ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్) దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులకు ఒక ముఖ్యమైన గమనిక. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) శనివారం ఏప్రిల్ 1, 2021 - ఆగస్టు 30, 2021 మధ్య 23.99 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదారులకు రూ.67,401 కోట్ల విలువైన నగదును తిరిగి చెల్లిస్తున్నట్లు తెలిపింది. ఆదాయపు పన్ను శాఖ సెప్టెంబర్ 3న ఐటీఆర్ దాఖలు చేసిన 22,61,918 మందికి రూ.16,373 కోట్ల ఆదాయపు పన్ను రీఫండ్ చేసినట్లు, అలాగే, 1,37,327 కేసుల్లో రూ.51,029 కోట్ల కార్పొరేట్ పన్ను రీఫండ్ చేసినట్లు పేర్కొంది.(చదవండి: ఇక రెండుగా ఈపీఎఫ్ ఖాతాల విభజన) ఆదాయపు పన్ను శాఖ కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ సంబంధించి పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందుల మధ్య ఐటీఆర్ రీఫండ్ చేసింది. అయితే, ఈ సమస్య కారణంగా చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఇంకా తమ ఆదాయపు పన్ను రిటర్న్స్(ఐటీఆర్) దాఖలు చేయలేదు. సాధారణంగా, ఐటీఆర్ రీఫండ్ దాఖలు చేసిన 10 రోజుల్లోగా జారీ చేస్తారు. అయితే వివిధ కారణాల వల్ల ఇంకా ఆలస్యం కావొచ్చు. అయితే, ఒకవేళ మీరు ఇంకా మీ రీఫండ్ అందుకోనట్లయితే, ఐ-టీ డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ మీరు ఐటీఆర్ స్టేటస్ ఆన్ లైన్ లో చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఐటీఆర్ రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి: వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్ డీఎల్) వెబ్ సైట్ లేదా ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ వెబ్ సైట్ లో రీఫండ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఎన్ఎస్ డిఎల్ వెబ్ సైట్ లో, మీరు పాన్, అసెస్ మెంట్ ఇయర్(ఎవై) వివరాలు నమోదు చేసి 'ప్రొసీడ్' మీద క్లిక్ చేయాలి. ఆదాయపు పన్ను రీఫండ్ స్టేటస్ మీకు డిస్ప్లే మీద చూపిస్తుంది.(చదవండి: నకిలీ కోవిడ్-19 వ్యాక్సిన్లను గుర్తించడం ఎలా..?) మొదట మీరు ఐ-టీ డిపార్ట్ మెంట్ ఈ-ఫైలింగ్ పోర్టల్ లో లాగిన్ కావాలి. ఇప్పుడు రిటర్న్స్/ఫారమ్స్ ఎంచుకోండి. ఆ తర్వాత 'మై అకౌంట్' ట్యాబ్ కు వెళ్లి 'ఐ-టీ రిటర్న్స్' ఎంచుకోండి. ఇప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అలాగే, అక్నాలెడ్జ్ మెంట్ నెంబరుపై క్లిక్ చేయండి. ఆదాయపు పన్ను రీఫండ్ స్టేటస్ తో పాటు మీ రిటర్న్ వివరాలను పేజీ మీద కనిపిస్తాయి. పన్ను చెల్లింపుదారులు రీఫండ్ డబ్బు నేరుగా వారి ఖాతాకు క్రెడిట్ చేస్తారు. చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చిరునామాకు పంపిస్తారు. అందువల్ల, ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు బ్యాంకుకు సంబంధించిన వివరాలు సరిగ్గా నింపబడ్డాయని వారు ధృవీకరించుకోవాలి. -
ఇక రెండుగా ఈపీఎఫ్ ఖాతాల విభజన
ప్రస్తుతం ఉన్న ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) ఖాతాలకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ ఖాతాల్లో భారీగా నగదు జమ చేసే మొత్తాల ద్వారా సమకూరే వడ్డీపై పన్ను విధించే దిశగా కేంద్రం పీఎఫ్ నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. ఇకపై ఏడాదికి ₹2.5 లక్షలకు మించి పీఎఫ్ ఖాతాల్లో జమ చేసే ఆదాయంపై ప్రభుత్వం పన్ను విధించనుంది. దీనికి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) నిబంధనలను జారీ చేసింది. అలాగే, రెండు వేర్వేరు ఖాతాలగా ఏర్పాటు చేయాల్సిందిగా పేర్కొంటూ నిబంధనలలో పేర్కొంది. ఇప్పటికే ఉన్న ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) ఖాతాలు అన్నీ పన్ను పరిధిలోకి వచ్చే, పన్ను పరిధిలోకి రాని కంట్రిబ్యూషన్ ఖాతాలుగా విభజించనున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆగస్టు 31న కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. తర్వాత ఆదాయపు పన్ను విభాగానికి కూడా ఈ సమాచారం అంధించింది. అధికారిక వర్గాల ప్రకారం, ఈ నిబంధనలు వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1, 2022 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఏటా ₹2.5 లక్షలకు మించి పీఎఫ్ ఖాతాల్లో జమ చేసే ఆదాయంపై కొత్త పన్నును వసూలు చేయడానికి ఆదాయపు పన్ను నిబంధనల్లో కొత్త సెక్షన్ 9డీని చేర్చారు. పన్ను పరిధిలోకి వచ్చే వడ్డీని లెక్కించడం కొరకు, ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అదేవిధంగా ఇంతక ముందు సంవత్సరాల్లో ఇప్పటికే ఉన్న ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో రెండు ప్రత్యేక ఖాతాలను నిర్వహించాల్సి ఉంటుంది. (చదవండి: రిలయన్స్ చేతికి జస్ట్ డయల్!) -
అదనపు ఛార్జీలు లేకుండా పన్ను చెల్లింపు .. సెఫ్టెంబరు 30 వరకే ఛాన్స్!
వివాద్ సే విశ్వాస్ పథకం కింద ఎటువంటి వంటి అదనపు చార్జీలు లేకుండా పన్ను చెల్లించడానికి ఉన్న ఆఖరు తేదిని ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తున్నట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రకటించింది. వివాద్ సే విశ్వాస్ ద్వారా పన్ను చెల్లింపులో భాగంగా ఫారమ్ 3 వల్ల ఇబ్బందులు ఎదురైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రకటించింది. అదనపు ఛార్జీలతో పన్నులు చెల్లించేందుకు అక్టోబరు 31కే చివరి తేది అని, ఇకపై గడువు పొడగింపులు ఉండవని సీబీడీటీ తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆగస్టు 29న సీబీడీటీ ప్రకటన జారీ చేసింది. Date of payment under the Direct Tax Vivad se Vishwas Act, 2020 (without additional amount) extended to 30th September, 2021. The last date for payment of the amount (with additional amount) remains 31st October, 2021. Press release issued. pic.twitter.com/gNPPUEbEEF — Income Tax India (@IncomeTaxIndia) August 29, 2021 చదవండి : నాణేల చెలామణీ..ప్రోత్సహకాల్ని పెంచిన ఆర్బీఐ -
ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారికి ఊరట..!
ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ చేసే వారికి ఊరట. కొత్త ఐటీఆర్ పోర్టల్ విషయంలో అనేకా సాంకేతిక సమస్యలు రావడంతో ఆ సమస్యలను ఇన్ఫోసీస్ పరిష్కరించింది. దీంతో ఫైలింగ్ విషయంలో వేగం పుంజుకున్నప్పటికీ ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్) ఫైలింగ్ కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) గడువు తేదీలను పొడగించే అవకాశం ఉంది. సాంకేతిక కారణాల వల్ల పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో గడువు పొడగించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడున్న గడువు ప్రకారం సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంది. ఆగస్టు 21 నుండి రెండు రోజుల పాటు పోర్టల్ మొత్తం నిలిచిపోవడంతో గత నాలుగు రోజులుగా 4 లక్షలకు పైగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నారు. అందుకే పరిస్థితిని బట్టి కేంద్రం కీలక రిటర్న్ ఫైలింగ్ గడువు తేదీలను పొడగించనుంది. ఐటీఆర్ దాఖలు చేయడానికి పన్ను చెల్లింపుదారులకు తగినంత సమయం ఇవనున్నట్లు తెలుస్తుంది. "కొత్త పోర్టల్‌లో ఏర్పడిన సాంకేతిక అవాంతరాల కారణంగా ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ ఆలస్యం అవుతున్నాయి. అందుకే, తేదీల పొడిగింపు గురుంచి రాబోయే ఒకటి లేదా రెండు రోజుల్లో నోటిఫై చేసే అవకాశం ఉంది. దీని వల్ల పన్ను చెల్లింపుదారులు ఫైలింగ్ చేయడానికి తగినంత సమయం ఇవ్వడం వల్ల వారిలో ఉన్న భయం కొంచెం తగ్గే అవకాశం ఉంది" అని కొందరు ప్రభుత్వ అధికారులు మీడియాకు తెలిపారు.(చదవండి: ఆస్తుల నగదీకరణ ఎందుకు ?) కొత్త వెబ్సైట్లో ఉన్న మొత్తం సమస్యలను సెప్టెంబర్ 15వ తేదీ నాటికి పరిష్కరించాలని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇన్ఫోసిస్ సీఈఓకు సూచించారు. ఒకవేల అప్పటి వరకు అన్ని సమస్యలను పరిష్కరించిన మరో 15 రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది. కాబట్టి, అంత తక్కువ సమయంలో ఐటీ రిటర్న్స్ సమర్పణ సాధ్యం కాదనే భావనలో అధికారులు ఉన్నారు. అందుకే మరోసారి ఐటీ రిటర్న్స్ఈ గడువును పొడిగించే అవకాశం ఉందని చెబుతున్నారు. -
ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే!
మీరు ఎక్కువగా బ్యాంకు సంబంధిత లావాదేవీలు చేస్తుంటారా? అయితే, మీకు ఒక ముఖ్య గమనిక. ఆగస్టు 1 నుంచి బ్యాంకుకు సంబంధించిన కొత్త నిబందనలు అమలులోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల సామాన్యుల మీద ఎక్కవగా భారం పడనుంది. ఏటీఎం లావాదేవీలు, ఎల్పీజీ ధరలు, వేతనాలు, పెన్షన్లు ఇలా చాలా అంశాలకు సంబంధించి కొత్త మార్పులు ఆగస్టు 1 నుంచి చోటు చేసుకొనున్నాయి. సాధారణంగా ప్రతీ నెల ప్రారంభంలో కొత్త నిబందనలు అమల్లోకి వస్తుంటాయి. మరి ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఏంటీ? అవి మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేయనున్నయో? తెలుసుకోండి. వేతనం, ఈఎమ్ఐ చెల్లింపులు: నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(ఎన్ఏసీహెచ్) నిబంధనలలో ఆర్బీఐ మార్పు చేయడం వల్ల సెలవు రోజుల్లో కూడా విద్యుత్, గ్యాస్, టెలిఫోన్, నీరు, జీతం, మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ సంబంధిత లావాదేవీలు సెలవు రోజుల్లో కూడా జరగనున్నాయి. ఈ కొత్త మార్పులు ఆగస్టు 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయి. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్(ఆర్ టీజిఎస్), ఎన్ఏసిహెచ్ సేవలు 24ఎక్స్7 అందుబాటులో ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది. ఎన్ఏసీహెచ్ అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ పీసీఐ) చేత నిర్వహించబడుతుంది. ఎటిఎమ్ క్యాష్ విత్ డ్రా: జూన్ నెలలో ఆర్బీఐ తీసుకొచ్చిన మరో ఆర్డర్ ప్రకారం, ఆగస్టు 1 నుంచి ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్(ఏటీఎం) చార్జీలు పెరగనున్నాయి. ఏటీఎం కేంద్రాల నిర్వహణ భారంగా మారిందన్న బ్యాంక్ ఆందోళన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఇంటర్ చేంజ్ ఫీజ్ ను ₹2 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. తాజాగా వచ్చే ఆగస్టు 1 నుంచి ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్ధిక లావాదేవీపై ఇంటర్ ఛేంజ్ ఫీజు రూ.15 నుంచి రూ.17కు, ఆర్ధికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు పెరగనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డులు 90 కోట్ల వరకు వాడుకలో ఉన్నాయి. ఐపీపీబీ డోర్ స్టెప్ సేవలు ఖరీదు: ఇప్పటి వరకు ఉచితంగా అందిస్తున్న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్ స్టెప్ సేవలకు ఇక నుంచి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలను, సేవింగ్స్ అకౌంట్ల వడ్డీ రేట్లను ఐపీపీబీ సవరించింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలు 01 ఆగస్టు 2021 నుంచి వర్తిస్తాయి. ప్రస్తుతం, డోర్ స్టెప్ బ్యాంకింగ్ సంబంధించి ఎలాంటి ఛార్జీలు లేవు. ఇక ఆగస్టు 1, 2021 నుంచి ప్రతి కస్టమర్ ఐపీపీబీ డోర్ స్టెప్ అభ్యర్థనకు బ్యాంకింగ్ ఛార్జీల కింద రూ.20 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకే కస్టమర్ ఎక్కువ సార్లు అభ్యర్థనలు చేయడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ సర్వీస్ ఛార్జీలు: భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు ఐసీఐసీఐ తన దేశీయ పొదుపు ఖాతాదారులకు నగదు లావాదేవీలు, ఎటిఎం ఇంటర్ చేంజ్, చెక్ బుక్ ఛార్జీల సవరించిన్నట్లు తెలిపింది. ఈ మార్పులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్ సైట్ తెలిపింది. అన్ని నగదు లావాదేవీలపై ఛార్జీల సవరణ వర్తిస్తుంది.ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలలో నెలకు మొత్తం 4 ఉచిత నగదు లావాదేవీలను అనుమతించింది. ఆ తర్వాత లావాదేవీలకు ఛార్జీలు వర్తిస్తాయి.ప్రతి ఆర్థిక లావాదేవీకి బ్యాంకు ₹20, ఆర్థికేతర లావాదేవీకి ₹8.50 వసూలు చేస్తుంది. ఆగస్టు 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారుల హోమ్ బ్రాంచీలో నగదు లావాదేవీ పరిమితి నెలకు రూ.1 లక్ష వరకు ఉచితం. లక్షకు పైగా జరిపే ప్రతి లావాదేవిపై ₹1,000కు ₹5 చెల్లించాలి. కనీస రుసుము ₹150గా ఉంది. ఎల్పీజీ ధరలు: ఎల్పీజీ ధరలను గ్యాస్ ఏజెన్సీలు ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తాయి. జూలై నెల 1 తేదీన ఎల్పీజీ ధరలను రూ. 26 పెంచాయి. మరి ఈ నెల పెరగనున్నాయా? తగ్గనున్నాయా? అనేది ఆగస్టు 1 తేదీన తెలవనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ): 15సీఏ, 15సీబీ ఫామ్స్ ఎలక్ట్రానిక్ ఫైలింగ్ విషయంలో పలు సడలింపులు ఇచ్చింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. గతంలో జూలై 15 వరకు ఉన్న చివరి తేదీని ఆగస్ట్ 15కి పొడిగించింది. -
Income Tax Return: వారికోసం ఐటీ రిటర్న్ తేదీల గడువు పెంపు
ముంబై: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సీబీడీటీ) 2021 జూలై 15 వరకు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్ఆర్ఐ) తో పాటు ఇతర ప్రవాసులకు ఆదాయపు పన్ను చెల్లింపులను దాఖలు చేయడానికి చివరి తేదీని పొడిగించింది. ఆదాయపు పన్నులను మ్యానువల్‌గా చెల్లించడానికి టాక్స్ పేయర్లకు ఆప్షన్‌ను సీబీడీటీ ఇచ్చింది.ఆదాయపు పన్ను శాఖ కొత్తగా ఏర్పాటు చేసిన ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఆదాయపు పన్ను ఫారాలు 15 సీఎ, 15 సీబీలను దాఖలు చేసేటప్పుడు పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా పొడిగించామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు ఎన్ఆర్ఐ టాక్స్ పేయర్లకు ఈ ఫైలింగ్ చేయడానికి జూన్ 30 చివరి తేదిగా ఉంది.పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు రెండు ఫారాలను మాన్యువల్ ఫార్మాట్లో అధీకృత డీలర్లకు సమర్పించవచ్చని, అంతేకాకుండా విదేశీ చెల్లింపుల ప్రయోజనం కోసం ఈ ఫారాలను 2021 జూలై 15 వరకు అంగీకరించాలని ఆర్థిక శాఖ సూచించింది. డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్(DIN)ను రూపొందించే ఉద్దేశ్యంతో ఈ ఫారమ్‌లను తరువాతి తేదీలో అప్లోడ్ చేయడం కోసం కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్‌తో అవకాశం కల్గుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. CBDT grants further relaxation in electronic filing of forms 15CA & 15CB in view of difficulties reported by taxpayers in filing of the forms online on https://t.co/GYvO3n9wMf. Date for submission of forms in manual format to the authorised dealers is extended to 15th July, 2021. pic.twitter.com/gQLRJsnlBu — Income Tax India (@IncomeTaxIndia) July 5, 2021 -
కొత్త ఇళ్లు కొనేవారికి కేంద్రం గుడ్ న్యూస్!
దేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా చాలా మంది బీద, మధ్య తరగతి ప్రజలతో పాటు పన్ను చెల్లింపుదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కొత్త ఇళ్లు కొనుగోలుచేయడానికి ఖర్చు చేసే పెట్టుబడిపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవడానికి గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. సాదారణంగా అయితే ఈ గడువు తేదీ జూన్ 30వ తేదీతో ముగియాల్సి ఉంది. కానీ, కేంద్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి వల్ల తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోని గడువును పెంచింది. దీనికి సంబందించి కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54, 54 జీబీ ప్రకారం మీరు మీ రెసిడెన్షియల్ ప్రాపర్టీని విక్రయిస్తే క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ప్రాపర్టీ విక్రయం ద్వారా వచ్చిన డబ్బును మూడు సంవత్సరాల లోపు కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి లేదా రెండు సంవత్సరాల లోపు కొత్త ఇంటిని కొనడానికి వాడాలి. అప్పుడే మీరు పెట్టుబడి పెట్టే నగదుపై పన్ను మినహాయింపు లభిస్తుంది. 2019 కేంద్ర బడ్జెట్ లో సెక్షన్ 54 కింద మూలధన లాభం పన్ను మినహాయింపును పెంచింది. పెట్టుబడి పెట్టె నగదు రూ.2 కోట్ల కంటే తక్కువగా ఉండాలి. అలాగే, పన్ను చెల్లింపుదారుడు ఈ అవకాశాన్ని ఒకసారి మాత్రమే వినియోగించుకోవచ్చు. చదవండి: త్వరలో మార్కెట్లోకి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు! -
రిటర్నుల దాఖలు చేయకపోతే భారీ జరిమానా?
న్యూఢిల్లీ: గత రెండేళ్లుగా మూలం వద్ధపన్ను కోత(టీడీఎస్), మూలం వద్దే పన్ను వసూలు(టీసీఎస్) చేసేవారు.. పన్ను రిటర్నులు దాఖలు చేయని వారిని గుర్తించేందుకు తగిన సదుపాయాన్ని ప్రత్యక్ష పన్నుల కేంద్రమండలి(సీబీడీటీ) ప్రారంభించింది. సెక్షన్206ఏబీ, సెక్షన్ 206సీసీఏ విషయమై ఆదేశాలు జారీ చేసింది. వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాలకు పన్ను రిటర్నులు దాఖలు చేయని వారీ విషయంలో జూలై 1 నుంచి అధిక టీడీఎస్, టీసీఎస్ అమల్లోకి రానుంది. వీరిని ‘ప్రత్యేక వ్యక్తులు’ (స్పెసిఫైడ్ పర్సన్స్)గా గుర్తించేందుకు అవసరమైన ఒక యుటిలిటీని టీడీఎస్, టీసీఎస్ వసూలు చేసేవారికి అందుబాటులోకి తెచ్చింది. అంటే 2018-19, 2019-20 అర్థిక సంవత్సరాల రిటర్నులు వేయకుండా.. టీడీఎస్ లేదా టీసీఎస్ రూ.50,000, అంతకుమించి మినహాయించి ఉంటే, అటువంటి వారికి(నిర్ధేశిత వ్యక్తులు) జూలై 1 నుంచి 5 శాతం అధిక రేటును వసూలు చేయనన్నారు. ఇటువంటి నిర్దేశిత వ్యక్తులను తెలుసుకునే సదుపాయాన్ని https://report.insight.gov.in/ పోర్షల్పై అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సీబీటీటీ ప్రకటించింది. చదవండి: 21 రోజుల్లో భారీగా తగ్గిన బంగారం ధర -
అలర్ట్: దగ్గర పడుతున్న ఆధార్ పాన్ లింక్ గడువు
పాన్ కార్డుదారులకు అలర్ట్. గతంలో మార్చి 31 వరకు ఉన్న ఆధార్-పాన్ లింకు గడువును కేంద్రం కరోనా మహమ్మారి నేపథ్యంలో జూన్ 30 వరకు పొడగించింది. ఒకవేల ఈ గడువు లోపు లింక్ చేయకపోతే రూ.1000 ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు 2021 ఆర్థిక బిల్లులో ప్రభుత్వం కొత్త సెక్షన్ 234 హెచ్‌ను ప్రవేశపెట్టింది. గతంలో మాదిరి ఈసారి పొడగించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. బ్యాంకు సంబంధిత పనులు, ఆదాయపు పన్ను సంబంధిత కార్యకలాపాల కోసం ఆధార్-పాన్ లింక్ చేయడం తప్పనిసరి. పాన్ ప్రధానంగా ఎక్కడ అవసరం? మోటార్ వేహికల్ లేదా టూ వీలర్ కాకుండా ఏదైనా వేహికల్ ని అమ్మలన్న లేదా కొనాలన్న ఆధార్ తప్పనిసరి. బ్యాంకింగ్ కంపెనీ/సహకార బ్యాంకులో ఖాతా తెరవడం. క్రెడిట్ లేదా డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి. డిపాజిటరీ, పార్టిసిపెంట్, సెక్యూరిటీల కస్టోడియన్ లేదా డీమ్యాట్ ఖాతాతెరవడం కోసం పాన్ తప్పనిసరి. ఒక హోటల్ లేదా రెస్టారెంట్ లో రూ.50,000 కంటే ఎక్కువ బిల్లు చెల్లించాలంటే. ఏ విదేశీ దేశానికైనా సంబంధించి రూ.50,000 మించి నగదు రూపంలో చెల్లించాలంటే. డిబెంచర్లు లేదా బాండ్లను కొనుగోలు చేయడానికి ఒక కంపెనీ లేదా సంస్థకు రూ.50,000 కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన బాండ్లను కొనుగోలు చేయడానికి రూ.50,000 కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తే. బ్యాంకు డ్రాఫ్ట్ లు, పే ఆర్డర్లు లేదా బ్యాంకింగ్ కంపెనీ లేదా కో ఆపరేటివ్ బ్యాంక్ నుంచి బ్యాంకర్ చెక్కుల కొనుగోలు కొరకు ఏదైనా ఒక రోజులో రూ. 50,000 కంటే ఎక్కువ మొత్తానికి నగదు రూపంలో చెల్లించడం కోసం ఆధార్ తప్పనిసరి. చదవండి: పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడం ఎలా..? -
కొత్త ఇన్‌కంటాక్స్ పోర్టల్ లోపాలపై సోషల్ మీడియాలో మీమ్స్
జూన్ 7 సాయంత్రం తీసుకొచ్చిన కొత్త ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో వినియోగదారులు సాంకేతిక సమస్యలు ఎదుర్కోవడంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ పై నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రి సీతారామన్ ఇన్ఫోసిస్, దాని సహ వ్యవస్థాపకుడు చైర్మన్ నందన్ నీలేకనిని ఒక ట్వీట్ లో ఫిర్యాదులను పరిష్కరించాలని కోరారు. 2019లో బిడ్డింగ్ ప్రక్రియలో రూ.4,242 కోట్ల వ్యయంతో ఇన్ఫోసిస్ ఈ ప్రాజెక్టు దక్కించుకుంది. రిటర్న్ ల ప్రాసెసింగ్ సమయాన్ని 63 రోజుల నుంచి ఒక రోజుకు తగ్గించడానికి, రీఫండ్ లను వేగవంతం చేయడానికి, తర్వాత తరం ఆదాయపు పన్ను ఫైలింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఇన్ఫోసిస్ లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి రోజు నుంచే ఈ ఫైలింగ్ పోర్టల్‌లో తలెత్తిన సమస్యలు, లోపాలపై యూజర్లు సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు చేస్తూన్నారు. దీనికి ఇన్ని కోట్లు ఖర్చు చేశారా? అని కొందరు కామెంట్ చేస్తే, మరికొందరు పోర్టల్ టెస్ట్ చేయకుండానే ఎందుకు తీసుకువచ్చారు అని తమ కోపాన్ని మీమ్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఈ సమస్యలపై స్పందించిన కేంద్రం లోపాలపై భాగస్వాముల నుంచి సూచనలను కేంద్ర అర్థిక శాఖ ఆహ్వానించింది. ఈ నెల 18 వరకు సూచనలు అందించాలని కోరింది. ఈ నెల 22న ఇన్ఫోసిస్ అధికారుల బృందం, ఆర్జిక శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించే సమావేశంలో వీటిపై చర్చించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ ఫైలింగ్ పోర్టల్‌లో లోపాలు, సమస్యలను fmo@nic.in అనే ఈమెయిల్ చిరునామాకు ఈ 18వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు పంపించాలని కోరింది. After hearing about the 4200 cr new site, I have ordered 20 men to come and change a light bulb. P.S. The light was working just fine. But I had too much time at hand. #4200cr #incometaxnewportal — Rakshita Khanna (@Raxita) June 10, 2021 Taxpayers to https://t.co/1LrS8smqf8 #incometaxportal #incometaxnewportal #incometaxwebsite pic.twitter.com/BAvWqIMS8k — ANANT JAIN (@JIMMYANANT) June 11, 2021 Chellam Sir .. kya lagta hai income tax ki site kab tak sahi se chalu ho jayegi ?#ChellamSir - Ye...to out of syllabus question puch liya 🤣☝️🤣😜🤣#incometaxportal #incometaxnewportal #incometaxwebsite pic.twitter.com/YjrV4r5hqX — Paras Mehta (@parasmehta91) June 11, 2021 Infosys gets Income Tax Portal Contract inspite of its poor performing GST portal: pic.twitter.com/l4SKtcywAn — India Tax Memes (@memes_tax) June 12, 2021 CA's after visiting New Income Tax e-filing portal #Infosys #incometaxportal #incometax pic.twitter.com/Lpfqw8daWT — CA Divya Arora (@CA_DivyaArora) June 8, 2021 చదవండి: పది నిమిషాల్లో ఈ-పాన్ కార్డు పొందండి ఇలా..? -
కొత్త ఇన్‌కంటాక్స్ పోర్టల్ మరీ ఇంత ఖరీదా?
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్(సీబీడీటీ) జూన్ 7న కొత్త ఆదాయపు పన్ను ఈ-ఫిల్లింగ్ పోర్టల్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. పన్ను చెల్లింపుదారులకు చిరాకు లేని, సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించడానికి ఆదాయపు పన్ను శాఖ కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ ను ప్రారంభించింది. అయితే, ఈ పోర్టల్ రూపకల్పన పనిని కేంద్ర ప్రభుత్వం రూ.4,242 కోట్లకు ఇన్ఫోసిస్ కు అప్పజెప్పింది. ఇప్పుడు ఈ కొత్త పోర్టల్ లో అనేక బగ్స్ బయట పడుతున్నాయి. దీంతో చాలా మంది కొత్త పోర్టల్ సేవల విషయంలో అసౌకర్యానికి గురి అవుతున్నారు. మరికొందరు తమ కోపాన్ని మీమ్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఆదాయపు పన్ను పోర్టల్ ఇప్పుడు కొత్త జీఎస్ టీ పోర్టల్ గా మారిందని సీఎ రీతు గుప్తా వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. మరికొందరు పాత ఆదాయపు పన్ను వెబ్ సైట్ ను తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు. @casansaar అనే వ్యక్తి ఎందుకు టెస్టింగ్ చేయకుండా తీసుకొచ్చారు, అంత అత్యవసరంగా లాంచ్ చేయాల్సిన అవసరం ఏమి ఉంది అని అన్నారు. పాత పోర్టల్ బాగానే పనిచేస్తున్నప్పటికి కొత్త పోర్టల్ అనవసరమని కామెంట్ చేశారు. ఈ పోర్టల్ కి రూ.4200 కోట్లు ఖర్చు చేశారా? అని ఎగతాళి చేశారు. అయితే, ఈ సమస్యలపై కేంద్రం స్పందించింది. జూన్ 22 వీటి విషయంలో ఇన్ఫోసిస్, కేంద్రం మరో సారి సమావేశం కానుంది. After hearing about the 4200 cr new site, I have ordered 20 men to come and change a light bulb. P.S. The light was working just fine. But I had too much time at hand. #4200cr #incometaxnewportal — Rakshita Khanna (@Raxita) June 10, 2021 FM @nsitharaman Ji, Why No testing of the new income tax portal before its launched? Why so hurry in launching the new portal? Any penalty clause on developers / officers?@Infosys @NandanNilekani @FinMinIndia @IncomeTaxIndia @ianuragthakur @PMOIndia #incometaxportal #harassment — CA Sansaar (@casansaar) June 9, 2021 చదవండి: జనవరి నుంచి భారీగా పెరిగిన నిరుద్యోగ రేటు -
పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్
ఆదాయపు పన్ను శాఖ అనేక కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రజలు మరింత సులభంగా పన్నుల చెల్లించే విధంగా రేపు (జూన్ 7) కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను (www.incometax.gov.in) లాంచ్ చేయబోతుంది. ఐటీ రిటర్న్‌లను తక్షణమే అమలు జరిగే విధంగా ఈ కొత్త e-Filing పోర్టల్ రూపొందిస్తున్నట్లు ఆదాయపన్ను శాఖ తెలిపింది. పోర్టల్ తో పాటు మొబైల్ యాప్‌ను కూడా విడుదల చేయనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) ఒక ప్రకటనలో వెల్లడించింది. కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం అత్యుత్తమ అనుభవాన్ని అందించడానికి ఈ పోర్టల్ తీసుకొస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సీబీడీటీ) తెలిపింది. ఆదాయపు పన్ను పోర్టల్‌లో అందుబాటులో ఉండే అన్ని ముఖ్యమైన ఫీచర్లు మొబైల్ యాప్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. దీంతో మొబైల్ నెట్‌వర్క్‌తో ఎప్పుడైనా, ఎక్కడైనా యాప్‌ను యాక్సెస్ చేయవచ్చు. దీని వల్ల పన్ను సంబందిత విషయాల్లో అవగాహన లేని వారు కూడా సులభంగా పన్ను చెల్లించేలా రూపోదించినట్లు పేర్కొంది. ఆదాయపు పన్ను రిటర్న్స్(ఐటీఆర్) ఇక నుంచి ధాఖలు చేయడం సులభం. ఐటీఆర్ 1, 4 (ఆన్లైన్, ఆఫ్‌లైన్) ఐటీఆర్ 2(ఆఫ్‌లైన్) కోసం పన్ను చెల్లింపుదారులకు సహాయపడేలా ఇంటరాక్టివ్ ప్రశ్నలతో ఉచిత ఐటీఆర్ తయారీ సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంది. పన్ను చెల్లింపుదారుల ప్రశ్నలకు త్వరగా స్పందించడానికి కొత్త కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు సీబీడీటీ తెలిపింది. వీటితో పాటు కొత్త టాక్స్ పేమెంట్ సిస్టమ్ జూన్ 18న ప్రారంభం అవుతుందని సీబీడీటీ తెలిపింది. ఇంటరాక్షన్లు, అప్లోడ్లు, పెండింగ్ యాక్షన్లు ఒకే డ్యాష్ బోర్డుపై కన్పిస్తాయని ఆదాయపు పన్ను శాఖ వివరించింది. చదవండి: Income Tax Return: ఐటీ రిటర్నుల చివరి గడువు తేదీ తెలుసా? -
Income Tax Return: ఐటీ రిటర్నుల చివరి గడువు తేదీ తెలుసా?
పన్ను చెల్లింపు దారులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్(సీబీడీటీ) 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు గడువును పొడిగించింది. సర్క్యులర్ ప్రకారం.. 2020-21 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికం టీడీఎస్ పన్ను దాఖలు చివరి తేదీని జూన్ 30 వరకు పొడగించినట్లు పేర్కొంది. అంతకుముందు టీడీఎస్ ను దాఖలు చేయడానికి గడువు మే 31 వరకు ఉండేది. ఈ కొత్త సర్క్యులర్ ప్రకారం.. ఫారం 16 జారీ చేయవలసిన తేదీని జూన్ 15 నుంచి జూలై 15 వరకు పొడగించారు. తాజా టీడీఎస్ రిటర్న్ ఫైలింగ్ ఫారమ్ లలో ఉద్యోగుల కోసం మరో కాలమ్ జోడించబడింది. దీని ప్రకారం, టీడీఎస్ రిటర్న్ దాఖలు చేసే సమయంలో కొత్తగా పన్ను చెల్లించే వారు ఈ ఎంపికను ఎంచుకోవాల్సి ఉంటుందని టాక్స్ 2 విన్ సహ వ్యవస్థాపకుడు & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అభిషేక్ సోని అన్నారు. అలాగే గత రెండేళ్లలో వ్యక్తి టీడీఎస్ దాఖలు చేయకపోతే, రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ప్రభుత్వం ఎక్కువ పన్ను వసూలు చేస్తుంది అని అన్నారు. ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు నగదు రూపంలో చెల్లించాల్సిన పన్ను మొత్తం లక్ష రూపాయల కన్నా ఎక్కువ ఉంటే, సెక్షన్ 234ఎ కింద జరిమానా, వడ్డీ ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత తేదీ నుంచి వర్తిస్తుంది. చదవండి: కేవలం వారంలో భారీగా ముకేశ్ అంబానీ సంపద -
Income Tax Return: ఐటీ రిటర్నులకు మరింత గడువు
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2020 –21) సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల దాఖలుకు అదనంగా రెండు నెలల గడువు ఇస్తున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. అదే విధంగా కంపెనీలకు సైతం అదనంగా ఒక నెల గడువు ఇస్తూ నవంబర్ 30 వరకు రిటర్నులు దాఖలు చేయవచ్చని పేర్కొంది. ఆదాయపన్ను చట్టం ప్రకారం.. వ్యక్తులు (ఖాతా లకు ఆడిటింగ్ అవసరం లేని వారు) తమ రిటర్నులను జూలై 31 వరకు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఖాతాలకు ఆడిటింగ్ అవసరమైన వ్యక్తులు, కంపెనీలకు రిటర్నుల దాఖలు గడువు అక్టోబర్ 31. ఇవి సాధారణ గడువులు. అంతక్రితం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా అదనపు సమయాన్ని ఆదాయపన్ను శాఖ ఇచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. కరోనా మహమ్మారి కారణం గా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని సీబీడీటీ ఈ నిర్ణయాలు తీసుకుంది. గడువు పొడిగిం చడం వల్ల నిబంధనల అమలు విషయంలో పన్ను చెల్లింపుదారులకు ఊరట దక్కినట్టేనని నాంజియా అండ్ కో పార్ట్నర్ శైలేష్ కుమార్ పేర్కొన్నారు. ► సంస్థలు తమ ఉద్యోగులకు ఫామ్ 16 మంజూరుకు సైతం గడువును జూలై 15కు సీబీడీటీ పొడిగించింది. ► ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ దాఖలుకు అక్టోబర్ 31 వరకు, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ సర్టిఫికెట్ దాఖలుకు నవంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. ► ఆలస్యపు, సవరించిన రిటర్నుల దాఖలుకు నూతన గడువు 2022 జనవరి 31. ► ఆర్థిక సంస్థలు ‘ఆర్థిక లావాదేవీల నివేదిక’ (ఎస్ఎఫ్టీ) సమర్పించేందుకు మే 31వరకు ఉన్న గడువు జూన్ 30కు పెరిగింది. ► 2020–21 ఏడాదికి సంబంధించి నూతన పన్ను విధానాన్ని (తక్కువ రేట్లతో, పెద్దగా మినహాయింపుల్లేని) ఎంపిక చేసుకునే స్వేచ్ఛను కేంద్రం కల్పించిన విషయం విదితమే. ఈ మేరకు ఐటీ రిట ర్నుల పత్రాల్లో సీబీడీటీ మార్పులు కూడా చేసింది. 7 నుంచి ఆదాయపన్ను కొత్త పోర్టల్ పన్ను చెల్లింపుదారులకు స్నేహపూర్వకమైన నూతన పోర్టల్‌ను జూన్ 7 నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు సీబీడీటీ ప్రకటించింది. www. incometaxindiaefiling.gov.in ప్రస్తుత ఈ పోర్టల్ స్థానంలో జూన్ 7 నుంచి www. incometaxgov.in పోర్టల్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. పన్ను చెల్లింపుదారులు ఏవైనా సమర్పించాల్సినవి ఉంటే, అప్లోడ్, డౌన్లోడ్ పనులను జూన్ 1లోపు పూర్తి చేసుకోవాలని సూచించింది. జూన్ 1–6 మధ్య ప్రస్తుత పోర్టల్ అందుబాటులో ఉండదని స్పష్టం చేసింది. పన్ను చెల్లింపుదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదన్న ఉద్దేశంతో ఆ రోజుల్లో ఎటువంటి గడువులు నిర్దేశించలేదని పేర్కొంది. వేగంతోపాటు కొత్త సదుపాయాలు కొత్త పోర్టల్ ఎన్నో సదుపాయాలతో ఉంటుందని, వేగంగా రిటర్నుల దాఖలు, పన్ను రిఫండ్లకు అనుకూలంగా ఉంటుందని సీబీడీటీ తెలిపింది. పన్ను చెల్లింపుదారులకు సంబంధించి అన్ని రకాల స్పందనలు, అప్లోడ్లు, అపరిష్కృత అంశాలన్నీ ఒకే డాష్‌బోర్డులో దర్శనమిస్తాయని వివరించింది. వెబ్సైట్లో ఉండే అన్ని ముఖ్య సదుపాయాలు మొబైల్ యాప్‌పైనా లభిస్తాయని పేర్కొంది. -
పాన్–ఆధార్ గడువు మరో 3 నెలలు
న్యూఢిల్లీ: పర్మనెంట్ అకౌంట్ నంబరు (పాన్)తో ఆధార్‌ను అనుసంధానించేందుకు నిర్దేశించిన డెడ్‌లైన్‌ను కేంద్రం మూడు నెలల పాటు పొడిగించింది. జూన్ 30 దాకా దీన్ని పెంచుతున్నట్లు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి పరిణామాల నేపథ్యంలో ఆఖరు తేదీని పొడిగించాలంటూ పన్నుచెల్లింపుదారుల నుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వాస్తవానికి దీనికి ముందుగా నిర్దేశించిన గడువు మార్చి 31. మరోవైపు, పన్ను వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన ‘వివాద్ సే విశ్వాస్ స్కీమ్’ గడువు మార్చి 31తో ముగిసింది. వాస్తవానికి డిక్లరేషన్ దాఖలు చేయడానికి ఫిబ్రవరి 28, చెల్లింపులు జరిపేందుకు మార్చి 31 ఆఖరు తేదీలు. అయితే, ఆదాయ పన్ను శాఖ ఈ డెడ్లైన్లను గతంలో పొడిగించింది. దీని ప్రకారం డిక్లరేషన్ల దాఖలుకు మార్చి 31తో గడువు ముగిసింది. ఏప్రిల్ 30లోగా చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. ఈ స్కీము కింద ఫిబ్రవరి 22 దాకా సుమారు రూ. 98,328 కోట్ల విలువ చేసే పన్ను వివాదాలకు సంబంధించి 1.28 లక్షల డిక్లరేషన్లు దాఖలయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ గత నెలలో లోక్‌సభకు తెలిపారు. దీని ద్వారా సుమారు రూ. 53,346 కోట్లు ఖజానాకు వచ్చాయి. గతేడాది ఆగస్టు నాటి గణాంకాల ప్రకారం 50.95 కోట్ల పాన్ కార్డులు ఉండగా 32.71 కోట్ల పాన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానించారు. -
అనధికారికంగా ఒక వ్యక్తి వద్ద ఎంత బంగారం ఉండవచ్చు?
భారత దేశంలో ఎక్కువ మంది వయస్సు, ఆదాయంతో సంబంధం లేకుండా వివిధ కారణాల వల్ల బంగారాన్ని కొనుగోలు చేస్తారు. కొంతమంది దీనిని పెట్టుబడి ప్రయోజనాల కోసం కొనుగోలు చేస్తుండగా, మరి కొందరు పండుగలు, వివాహాలు వంటి ప్రత్యేక సందర్భాలలో కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలను ధరించడం అనేది భారతీయుల సంస్కృతిలో ఒక భాగం. చాలా మంది ప్రజలు తమ చేతిలో డబ్బు ఉన్నప్పుడల్లా విలువైన బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఏవైనా అనుకోని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవచ్చని వారి ఉద్దేశ్యం. కరోనా వంటి విపత్కర సమయంలో ప్రజలు తమ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలను తెచ్చుకున్నారు. అందుకే అలంకరణ కోసమే కాకుండా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కోసం కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఇలా ఎంత పడితే అంత మన దేశంలో బంగారం కొనుగోలు చేయవచ్చా? చట్టబద్దంగా ఒక వ్యక్తి వద్ద ఎంత బంగారం ఉండాలి? ఎక్కువ బంగారం ఉంటే ఏమవుతుంది? అనే ప్రశ్నలకు చాలా మందికి సమాధానం తెలియదు. వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 132 భారత పన్ను అధికారులకు తనిఖీ సమయంలో ఏవైనా ఆధారాలు లేని ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు దొరికితే స్వాధీనం చేసుకునే అధికారం వారికీ ఉంటుంది. ఒక వ్యక్తి ఇంతే బంగారం కలిగి ఉండాలనే అనే ప్రత్యేక నిబంధన లేదు. కానీ, మీ దగ్గర ఉన్న బంగారానికి సరైన ఆధారాలు చూపిస్తే ఎటువంటి సమస్య లేదు. లేకపోతె వాటిని ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకుంటారు. ‘‘ఆదాయపు పన్ను అధికారులు తనిఖీ నిర్వహించే సమయంలో మీ ఇంట్లో ఉన్న బంగారానికి కొనుగోలు/ఎక్స్ఛేంజ్ ఇన్వాయిస్లు చూపించాలి. ఒకవేళ మీకు పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆభరణాలైతే బహుమతి దస్తావేజులను చూపించాల్సి ఉంటుంది. వారసత్వ బంగారానికి 1994 మే 11 నాటి సిబిడిటి చట్టంలోని సూచన నెం.1916 రక్షణగా నిలుస్తుంది. లెక్కలో చూపని బంగారాన్ని జప్తు చేసే అధికారం ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఉంటుంది.” అని డెలాయిట్ ఇండియా భాగస్వామి సుధాకర్ సేతురామన్ చెప్పారు. అలాగే, మీ దగ్గర భారత ప్రభుత్వం నిర్దేశించిన దాని కన్నా తక్కువ ఉన్న బంగారానికి ఆధారాలు లేకున్న ఎటువంటి సమస్య లేదు. పరిమితికి లోబడి ఉండే బంగారాన్ని స్వాధీనం చేసుకోమని గతంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వివాహిత మహిళలు 500 గ్రాముల బంగారం, పెళ్లికాని మహిళలు 250 గ్రాములు, పురుషులు 100 గ్రాముల బంగారాన్ని కలిగి ఉండవచ్చు. వీటిని కుటుంబ ఆచారాలు, సంప్రదాయాలు వంటి వివిధ కారణాలతో స్వాధీనం చేసుకోకూడదని చట్టం చెబుతోంది. ఈ పరిమితికి మించి మీ వద్ద లెక్కల్లో చూపని బంగారు ఆభరాణాలుంటే, వాటిని జప్తు చేసే అధికారం సంబంధిత అధికారులకు ఉంటుంది. చదవండి: మళ్లీ కరోనా సెగ.. బంగారం ధరకు రెక్కలు! -
ఫేక్ బిల్లింగ్ స్కాం : భారీ నగదు, నగలు సీజ్
-
ఫేక్ బిల్లింగ్ స్కాం : భారీ నగదు, నగలు సీజ్
సాక్షి, న్యూఢిల్లీ : కోట్ల రూపాయల విలువైన నకిలీ బిల్లింగ్ రాకెట్‌ను ఆదాయపు పన్ను శాఖ ఛేదించింది. ఈ మేరకు ఆదాయ పన్నుశాఖ సోమవారం పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. ఢిల్లీ, ఉత్తరాఖండ్, గోవా, హర్యానా, పంజాబ్ తదితర 42 ప్రాంతాల్లో ఆదాయ పన్ను అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున నగదు, విలువైన ఆభరణాలను సీజ్ చేశారు. నకిలీ కంపెనీల ద్వారా ఈ నగదును దారి మళ్లిస్తున్నట్టు తేలిందని వెల్లడించారు. నకిలీ బిల్లింగ్ రాకెట్లో 500 కోట్ల రూపాయలకు పైగా కుంభకోణం జరిగిందని ప్రత్యక్ష పన్నుల బోర్డు ( సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్) ప్రకటించింది. దీనికి సంబంధించిన ఎంట్రీలతోపాటు, ఇతర ఆధారాలున్న పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. అక్రమాలకు పాల్పడుతున్న ఎంట్రీ ఆపరేటర్లు, మధ్యవర్తులు, నగదు నిర్వహణదారులు, లబ్ధిదారులతో కూడిన నెట్‌వర్క్‌ను గుర్తించినట్టు సీబీడీటీ అధికారులు తెలిపారు. తాజా దాడుల్లో రూ .2.37 కోట్ల నగదు, 2.89 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దీంతోపాటు 17 బ్యాంక్ లాకర్లను కూగా గుర్తించినట్టు చెప్పారు. బీరువాల్లోదాచి పెట్టిన కట్టల కొద్దీ నగదును అధికారులు స్వాధీనం చేసుకోగా ఇందులో ఒక కట్టలో 180 బండిల్స్, 9 కోట్లు అని రాసి ఉండటం గమనార్హం. కాగా బ్యాంకు అధికారులతో కుమ్మక్కై, షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి, ఇందులో తమ వ్యక్తిగత సిబ్బందినే భాగస్వాములుగా, డమ్మీ డైరెక్టర్లుగా నియమించుకుని అక్రమాలకు తెరతీసారని తెలిపారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందన్నారు. -
చైనా కంపెనీల మనీలాండరింగ్ రాకెట్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా విస్తరణ, ఇండో చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో ఒకవైపు చైనాపై తీవ్ర వ్యతిరేకత కొనసాగుతుండగా మరోవైపు చైనా కంపెనీల భారీ హవాలా రాకెట్‌ను ఆదాయ పన్ను శాఖ ఛేదించింది. 1,000 కోట్ల రూపాయలు మనీలాండరింగ్‌కు పాల్పడుతున్న చైనీయులు, ఢిల్లీలోని సంబంధిత భారతీయ వ్యక్తులపై ఆదాయం పన్ను (ఐటీ) శాఖ సోదాలు నిర్వహించింది. షెల్ కంపెనీల ద్వారా భారీగా అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై ఈ సోదాలు జరిపినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)తెలిపింది. వివిధ బ్యాంకుల్లో 40కి పైగా అకౌంట్ల ద్వారా హవాలా లావాదేవీలకు పాల్పడినట్లు సీబీడీటీ అధికార ప్రతినిధి సురభి అహ్లువాలియా ఒక ప్రకటనలో తెలిపారు. చైనా అనుబంధ సంస్థల ద్వారా భారత్‌లో రిటైల్ షోరూమ్‌ల బిజినెస్‌ను ప్రారంభించేందుకు ప్రయత్నించిందనీ, నకిలీ కంపెనీలు, స్థానిక భాగస్వామ్యంతో వెయ్యి కోట్ల అక్రమ లావాదేవీలకు పాల్పడ్డట్టు తేలిందని పేర్కొంది. దీనికి సంబంధించిన పత్రాలను, హాంకాంగ్, యుఎస్ డాలర్లతో సంబంధం ఉన్న విదేశీ హవాలా లావాదేవీల సాక్ష్యాలను కూడా వెలికి తీసినట్టు ఐటీ విభాగం వెల్లడించింది. బ్యాంకు ఉద్యోగులు, చార్టర్డ్ అకౌంటెంట్ల సహకారంతో ఈ అక్రమాలకు తెగబడినట్టు పేర్కొంది. -
డైరెక్టర్ల వేతనాలపై జీఎస్టీ ఉండదు: సీబీడీటీ
న్యూఢిల్లీ: కంపెనీ డైరెక్టర్లకు చెల్లించే వేతనాలపై జీఎస్టీ వసూలు ఉండదని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) స్పష్టత ఇచ్చింది. డైరెక్టర్లకు చెల్లించే పారితోషికంపై కంపెనీలు జీఎస్టీ చెల్లించాలంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో రాజస్థాన్ అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ తీర్పునిచ్చిన నేపథ్యంలో సీబీడీటీ నుంచి ఈ స్పష్టత రావడం గమనార్హం. ‘‘డైరెక్టర్లకు ఇచ్చే పారితోషికాన్ని వేతనాలుగా కంపెనీలు పుస్తకాల్లో చూపించినట్టయితే, ఈ మొత్తంపై ఐటీ చట్టంలోని సెక్షన్ 192 కింద టీడీఎస్ అమలు చేస్తున్నట్టు అయితే.. జీఎస్టీ పరిధిలోకి రాదు’’ అంటూ సీబీడీటీ పేర్కొంది. ఒకవేళ డైరెక్టర్ల పారితోషికం వేతనం రూపంలో కాకుండా.. వృత్తిపరమైన ఫీజులుగా చెల్లిస్తుంటే మాత్రం జీఎస్టీ చెల్లించాలని సీబీడీటీ స్పష్టం చేసింది. -
విద్యుత్తు బిల్లు రూ.లక్ష దాటితే రిటర్న్‌లు!
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ వర్గాలు దాఖలు చేయాల్సిన రిటర్నుల పత్రాలను (ఐటీఆర్ ఫామ్) నోటిఫై చేసింది. సహజ్ (ఐటీఆర్–1), ఐటీఆర్–2, ఐటీఆర్–3, సుగమ్ (ఐటీఆర్–4), ఐటీఆర్–5, ఐటీఆర్–6, ఐటీఆర్–7 నోటిఫై చేసిన వాటిల్లో ఉన్నాయి. అధిక విలువ కలిగిన లావాదేవీలకు సంబంధించిన వివరాలను వీటిల్లో తెలియజేయాల్సి ఉంటుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) స్పష్టం చేసింది. కరెంటు ఖాతాలో డిపాజిట్లు రూ.కోటికి మించి ఉంటే, విదేశీ ప్రయాణం కోసం రూ.2 లక్షలకు మించి ఖర్చు చేసి ఉంటే, విద్యుత్తు బిల్లు రూ.లక్షకు మించితే రిటర్నుల్లో తెలియజేయాల్సి ఉంటుంది. -
సంపన్నులపై ‘కరోనా’ పన్ను!
కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా ఆదాయాన్ని పెంచుకు నేందుకు అధిక సంపద కలిగిన వారిపై 40% పన్ను, విదేశీ కంపెనీలపై అధిక లెవీ విధించాలంటూ కేంద్రానికి కొందరు సీనియర్ అధికారులు సూచించడం సంచలనంగా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం ‘ఫోర్స్’ పేరుతో ఒక నివేదికను సీబీడీటీ చైర్మన్ పీసీ మోదీకి ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ సమర్పించింది. రూ.కోటికి పైగా ఆదాయం కలిగిన వారిపై ప్రస్తుతం 30% పన్ను రేటు అమల్లో ఉండగా దీనిని 40% చేయాలని కోరింది. రూ.5 కోట్లు పైబడి ఆదాయాన్ని ఆర్జించే వారిపై తిరిగి సంపద పన్ను ప్రవేశపెట్టాలని సూచించింది. 3–6 నెలల కాలానికి ఈ సూచనలు చేసింది. అయితే ఈ నివేదికను ప్రభుత్వ అధికారిక అభిప్రాయంగా పరిగణించరాదని సీబీడీటీ స్పష్టం చేసింది. అధికారికంగా ఎవరూ చెప్పకుండానే దీన్ని తమంత తాముగా రూపొందించిన 50 మంది ఐఆర్ఎస్ అధికారులపై విచారణ చేపడుతున్నట్లు పేర్కొంది. -
పన్ను చెల్లింపుదారులకు మరో అవకాశం
సాక్షి, న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఆదాయపు పన్ను నేరాల కాంపౌండింగ్ కు కల్పించిన ప్రత్యేక అవకాశాన్ని మరో నెలపాటు పొడిగిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్ (సీబీడీటీ) ప్రకటించింది. డిసెంబరు 31తో ముగిసిన గడువును జనవరి 31 వరకు పెంచుతున్నట్టు సీబీడీటీ జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది. ఆదాయపు పన్ను నేరాల సమ్మేళనం కోసం దరఖాస్తు చేసుకోవడానికి పన్ను చెల్లింపుదారులు సదుపాయాన్ని పొందటానికి చివరి తేదీ జనవరి 31 వరకు సిబిడిటి పొడిగించినట్లు శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వులలో తెలిపింది. ఐపీఏఐ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా)తో సహా మిగిలిన క్షేత్ర నిర్మాణాల నుంచి వచ్చిన అభ్యర్ధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ తుది అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది. కాగా న్యాయబద్ధమైన కేసుల్లో పన్ను చెల్లింపుదారుల ఇక్కట్లను తప్పించేందుకు, ప్రాసిక్యూషన్ కేసుల పెండింగ్‌ను తగ్గించేందుకు ‘‘వన్-టైమ్" అవకాశాన్నిగత ఏడాది సెప్టెంబరులో ప్రకటించింది. డిసెంబరు 31వరకు అవకాశాన్నికల్పించింది. పన్ను నేరాలు లేదా పన్ను ఎగవేతకు పాల్పడిన వారు పన్ను బకాయిలు, సర్‌చార్జీలు చెల్లించేందుకు అవకాశం ఇవ్వాలన్న లక్ష్యంతో వారిపై ప్రాసిక్యూషన్ దాఖలు చేయకపోవడాన్నే కాంపౌండింగ్‌గా వ్యవహరిస్తారు. -
పాన్– ఆధార్ లింకింగ్ గడువు తేదీ డిసెంబర్ 31
న్యూఢిల్లీ: పాన్ కార్డ్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు ఈ నెల 31 గడువు తేదీగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం (సీబీడీటీ) ప్రకటించింది. ఆదాయ పన్ను సేవలు మరింత పారదర్శకంగా కొనసాగడం కోసం ఈ రెండింటి అనుసంధాన్ని తప్పనిసరి చేసినట్లు పేర్కొంది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 139 ఏఏ (2) ప్రకారం 2017 జూలై 1 నాటికి పాన్ కార్డును పొంది ఉండి, ఆధార్ పొందడానికి అర్హులైన ప్రతి వ్యక్తి, సంస్థ తమ ఆధార్ నంబర్‌ను ఆదాయ పన్ను శాఖకు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ సెక్షన్‌లోని అంశానికి గడువు తేదీని ఇంతకుముందు ఈ ఏడాది సెప్టెంబర్ 30గా ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఐటీకి చిక్కిన ముడుపుల ‘ముఖ్యుడు’!
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక ప్రముఖ కంపెనీకి నిర్మాణ పని అప్పగించినందుకు ఆ కంపెనీ నుంచి నేరుగా ముడుపులు తీసుకొని నాటి ‘ముఖ్య’నేత ఆదాయపన్ను శాఖకు అడ్డంగా దొరికిపోయారు. అమ రావతిలో రూ. 2,652 కోట్ల నిర్మాణ పనులను మూడు సంస్థలకు అప్పగిం చగా అందులో ఒక సంస్థ నుంచి తీసు కున్న అవినీతి సొమ్ముకు సంబంధించి ఆధారాలు దొరికినట్లు పేరు ప్రకటిం చేందుకు ఇష్టపడని ఆదాయపన్ను శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ సంస్థలపై ఐటీ దాడులు నిర్వహించిన సందర్భంలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి నప్పుడు రూ. 150 కోట్లను ఒక కంపెనీ ఆ ముఖ్య నేతకు చెల్ళలించినట్లు నిర్ధారణ అయ్యిందని ఆ సీనియర్ అధికారి ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు. ఇటీవల ముంబైలోని ఆ ప్రముఖ నిర్మాణరంగ కంపెనీలో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సంస్థ తాము చేసిన చెల్లింపులకు సంబంధించి రూపొందించుకున్న లెడ్జర్ ఒకటి ఐటీ బృం దానికి చిక్కింది. ఎవరెవరికి ఎంత మొత్తంలో చెల్లించారన్న స్పష్టమైన ఆధారాలు ఆ లెడ్జర్ ద్వారా లభించాయి. మొత్తం రూ. 2,652 కోట్ల పనులకుగాను సుమారు 20% అంటే 500 కోట్లు ముడుపులుగా ఇచ్చేందుకు మూడు సంస్థల మధ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా బయటపడింది. అందులో భాగంగానే రూ. 150 కోట్లు నేరుగా చెల్లించినట్లు బహిర్గతమైంది. బయటపడింది ఇలా... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కీలక వ్యక్తులు, సంస్థలపై ఈ ఏడాది ఫిబ్రవరి–ఏప్రిల్ మధ్య ఆదాయపన్ను శాఖ దాడులు చేసిన సందర్భం లోనే నగదు సరఫరాకు సంబంధించిన క్లూ ఒకటి లభించింది. ఐదు షెల్ కంపెనీల పేరుతో బ్యాంకులో భారీగా డబ్బు జమ చేయడాన్ని ఆదాయపన్ను శాఖ సీరియస్‌గా తీసుకుంది. మామూలుగా అయితే కంపెనీల్లో డిపాజిట్లు, చెల్లింపులు ఎక్కువగా చెక్కులు లేదా ఆన్లైన్ పద్ధతిలో జరుగుతుంటాయి. కానీ ఈ షెల్ కంపెనీల ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి భారీ మొత్తంలో నగదు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై సంబంధిత వ్యక్తుల నుంచి సంతృప్తికరమైన సమాధానం రాలేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు దాదాపు అన్ని కంపెనీలపైనా ఇటీవల దాడులు నిర్వహించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధికారికంగా, అనధికారికంగా పనులు చేపట్టిన కంపెనీలను లక్ష్యంగా చేసుకొని ఆ దాడులు జరిగాయి. ఆదాయపన్ను శాఖ అనుమానాన్ని నివృతి చేసే ఆధారం ఒక నిర్మాణరంగ కంపెనీ రికార్డులను పరిశీలించినప్పుడు బయటపడింది. ఇదే విషయాన్ని ఈ నెల 11వ తేదీన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, దక్షిణ భారతదేశంలోని నిర్మాణరంగ కంపెనీలపై దాడులు నిర్వహించినప్పుడు రూ. 3,300 కోట్ల మేర పనులకు సంబంధించి అక్రమాలు చోటుచేసుకున్నట్లు నిర్ధారించింది. వాటిలో చాలా వరకు ఆయా రాజకీయ పార్టీలకు విరాళంగా చెల్లించిన సొమ్ము కొంత ఉండగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ముఖ్య నేతకు నేరుగా రూ. 150 కోట్లు చెల్లించినట్లు వెల్లడించింది. ముఖ్య నేతకు ముందే తెలుసా? ఆదాయపన్ను శాఖ దాడులను సదరు ముఖ్య నేత ముందే ఊహించారు. తనను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయని ఊరూవాడా చాటుకున్నారు. ఈ దాడులను ఎన్నికల సమయంలో రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్న సదరు ముఖ్య నేత... ఆ తరువాత మళ్లీ దాడులు జరుగుతాయన్న విషయం తెలిసి కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలతో రహస్య రాయబారం నడిపారు. తనకు అత్యంత సన్నిహితులైన ముగ్గురు రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్పించడానికి తెరవెనుక నాటకం రక్తి కట్టించారు. అయినా ఆదాయపన్ను శాఖ కేసును ఎప్పటికప్పుడు తిరగదోడుతూనే వచ్చింది. ఈ నెల మొదటి వారంలో మళ్లీ దాడులతో విజృంభించింది. ఈ దాడుల్లో తనకు రూ. 150 కోట్లు నేరుగా చెల్లించిన విషయం ఐటీ పసిగట్టిందన్న విషయమూ ముఖ్య నేతకు చేరింది. అయితే ఇది బయటకు రాకుండా ఉండటం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తదుపరి చర్య ఏమిటి? ఆదాయపన్ను శాఖ నిర్వహించిన దాడుల్లో ఓ ముఖ్య నేతకు రూ. 150 కోట్లు చేరాయని సీబీడీటీ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఆదాయపన్ను శాఖపైనే ఉంది. లంచంగా పుచ్చుకున్న వ్యక్తిని విచారిస్తారా లేక కేసు నమోదు చేస్తారా వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే విషయాన్ని సాక్షి ప్రతినిధి తనకు తెలిసిన సీనియర్ అధికారి ఒకరిని అడగ్గా ఆయన స్పందిస్తూ ‘‘మామూలుగా ప్రాథమిక సమాచారం ఆధారంగా తదుపరి దర్యాప్తు చేపడతాం. లంచం ఇవ్వడానికి తీసుకున్న వ్యక్తితో లావాదేవీలు ఏమిటో పరిశీలిస్తాం. ఆ లావాదేవీల ఆధారంగా లంచం ఇచ్చిన వారిని విచారిస్తాం. వారి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేస్తాం. ఆ తరువాతే లంచం తీసుకున్న వ్యక్తికి నోటీసులు ఇచ్చి విచారిస్తాం. ఈ ప్రక్రియకు కొంతకాలం పట్టొచ్చు’’ అన్నారు. ఎల్లో మీడియా ఎందుకు వీరంగం వేయలేదు? ప్రతి విషయాన్నీ భూతద్దంలో చూపే తెలుగుదేశం పార్టీ, దాని అనుబంధ పచ్చ మీడియా ఈ విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాయి. తెరవెనక ముఖ్య నేత ఎవరో తెలియడం వల్లే సీబీడీటీ ప్రకటన వచ్చి నాలుగు రోజులైనా ఒక్క కథనాన్నీ వండి వార్చలేదు. ‘హమ్మ ముఖ్య నేతా’ అంటూ ప్రత్యేక కథనాలు ప్రచురించలేదు. ఈ మొత్తం వ్యవహారంలో తేలు కుట్టిన దొంగలా పచ్చ మీడియా వ్యవహరిస్తోంది. ఇసుక కొరత, ఆంగ్ల మీడియం అంటూ ప్రత్యేక కథనాలతో ఊదరగొడుతున్న పచ్చ మీడియాకు రూ. 150 కోట్ల లంచం అంత ప్రాధాన్యత కలిగిన అంశంగా కనిపించకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఈ సొమ్ము ఎవరికి చేరిందో వాళ్లకు ముందే తెలిసినందువల్లే సెంట్రల్ బోర్డు అఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) నుంచి అంత ముఖ్యమైన ప్రకటన వెలువడినా మౌనంగా ఉంటున్నాయన్నది అర్థమవుతోంది. -
రూ. 150 కోట్లు ముట్టిన ఆంధ్రా ప్రముఖుడెవరు?
సాక్షి, న్యూఢిల్లీ : మౌలిక వసతుల రంగంలో కాంట్రాక్టులకు సంబంధించి ఆదాయపన్నుశాఖ బయటపెట్టిన కుంభకోణం ఒకటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలువురు పారిశ్రామికవేత్తలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బోగస్ బిల్లులు పెట్టి భారీగా డబ్బు తీసుకున్న వాళ్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖుడొకరికి రూ. 150 కోట్లు ముట్టజెప్పారంటూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) వెల్లడించడం సంచలనంగా మారింది. ప్రముఖుడంటూ చేసిన ప్రకటనలోని వ్యక్తి ఎవరా అనేది ఉభయ రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బోగస్ బిల్లులు, హవాలా లావాదేవీలతో సంబంధం ఉన్న సదరు ప్రముఖ వ్యక్తి ఏపీ ప్రభుత్వంలో (2014–2019) కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఆ కీలక వ్యక్తికి రూ. 150 కోట్లు చేరినట్లు ఆధారాలు ఉన్నాయని ఆదాయపన్నుశాఖ అత్యున్నతస్థాయి అధికారి ఒకరు వెల్లడించారు. హవాలా వ్యాపారులకు, సదరు కీలక వ్యక్తికి ఉన్న సంబం ధాలు కూడా తమ దాడుల సందర్భంగా వెల్లడయ్యాయని ఆ అధికారి చెప్పారు. ప్రభుత్వ సంబంధిత ప్రాజెక్టుల పనుల పేరుతో బోగస్ బిల్లులు పెట్టి భారీగా డబ్బు దోచేసిన వారి వివరాలను వీలైనంత త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఫిబ్రవరి–ఏప్రిల్ మధ్య జరిగిన దాడులే కీలకం... షెల్ కంపెనీలు సృష్టించడం, బోగస్ బిల్లులతో నిధులు కాజేయడం వంటివి బయటకు రావడానికి ముందు ఆదాయపన్నుశాఖ పెద్ద కసరత్తే చేసింది. అనుమానం ఉన్న వారందరిపైనా దాడులు చేస్తూ వచ్చింది. అవన్నీ 2018 జూన్–డిసెంబర్, 2019 ఫిబ్రవరి–ఏప్రిల్ మధ్య జరిగినవే. ఐటీశాఖ దాడులు ఎదుర్కొన్న వారంతా అప్పటి ప్రభుత్వంలో భాగస్వాములు లేదా సన్నిహితులైన వారే కావడం గమనార్హం. గత ప్రభుత్వంలో మంత్రి నారాయణ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, రాజ్య సభ సభ్యుడు సీఎం రమేష్ కంపెనీలు, గుంటూరు లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్‌కు సంబంధించిన అకౌంటెంట్‌తోపాటు అప్పటి పోలవరం కాంట్రాక్టు సంస్థ సహా అనేక కంపెనీలపై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో బహిర్గతమైన సమాచారం ఆధారంగానే నవంబర్ మొదటి వారంలోనూ ఏపీ, తెలంగాణలో మరికొన్ని సోదాలు జరిగాయి. షెల్ కంపెనీల పేరుతో బ్యాంకులకు రూ. 364 కోట్లు ఎగవేసిన ఆరోపణల కేసులో సుజనా చౌదరికి చెందిన రూ. 315 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. నకిలీ ఆస్తులు, బోగస్ ఇన్వాయిస్లతో బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకొని ఆ మొత్తాన్ని షెల్ కంపెనీల ద్వారా తరలించినట్లు ఈడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంలో హవాలా వ్యాపారుల పాత్రను గుర్తించింది. ఆ క్రమంలోనే నవంబర్ మొదటి వారంలో ఏపీ, తెలంగాణలో ఆదాయపన్నుశాఖ పలు చోట్ల దాడులు నిర్వహించింది. హవాలా ద్వారా ఏపీలో ప్రముఖ వ్యక్తికి రూ. 150 కోట్లు చేరవేసిన వ్యవహారాన్ని ఈ దాడుల్లో పసిగట్టింది. ‘ఆదాయపన్నుశాఖ దాడుల ఫలితంగా తమ బండారం బయటపడుతుందన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఆదాయపన్నుశాఖ దాడుల సమయంలో పోలీసు భద్రత ఇవ్వబోమని ప్రకటించింది’అని ఢిల్లీలో ఈడీ అధికారి ఒకరు గుర్తుచేశారు. కాంట్రాక్టు పనులు, బిల్లులు గత ప్రభుత్వంలోనివే... మౌలిక వసతుల రంగంలోని కొన్ని కంపెనీలు బోగస్ కాంట్రాక్టు బిల్లులతో భారీ ఎత్తున నగదు సమకూర్చుకున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వెల్లడించింది. దీనినిబట్టి చూస్తే కాంట్రాక్టు పనులు, బోగస్ బిల్లులన్నీ 2019కి పూర్వం ఉన్న ప్రభుత్వాల్లో జరిగినవేనని తేలికగా అర్థమవుతోంది. ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించిన నిధులను ఎంట్రీ ఆపరేటర్లు (కాంట్రాక్టర్లు), లాబీయిస్టులు, హవాలా డీలర్ల ద్వారా నగదుగా మార్చుకున్న సంగతి బయటపడింది. బోగస్ బిల్లులతో ముడిపడిన భారీ ప్రాజెక్టులు దక్షిణ భారతదేశంలో ఉన్నట్లు వెల్లడించిన సీబీడీటీ... ఆంధ్రప్రదేశ్ పేరును ప్రముఖంగా ప్రస్తావించింది. బోగస్ బిల్లులతో సంబంధం ఉన్నవారు ఆ రాష్ట్రానికి చెందిన ప్రముఖుడికి రూ. 150 కోట్ల నగదు సమకూర్చిన సాక్ష్యాలు ఇప్పుడు ఆదాయపన్నుశాఖ వద్ద ఉన్నాయి. బోగస్ బిల్లులు, హవాలా చెల్లింపులన్నీ ఈ ఏడాది ఏప్రిల్‌కు ముందు జరిగినవేనని తేటతెల్లమమవుతోంది. ప్రముఖ పత్రికాధిపతి వియ్యంకుడి కంపెనీకి రూ. 5 వేల కోట్ల విలువైన భారీ కాంట్రాక్టు కట్టబెట్టడమే కాకుండా గత ప్రభుత్వం రూ. 750 కోట్ల మేర మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చిన వ్యవహారంలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఐటీశాఖ గుర్తించింది. ఈ కంపెనీ కార్యాలయాలపై 2018లోనే ఆదాయపన్నుశాఖ రోజుల తరబడి దాడులు నిర్వహించింది. అనేక అక్రమ లావాదేవీలతోపాటు వందల సంఖ్యలో షెల్ కంపెనీలను ఆ కంపెనీ సృష్టించినట్లు వెల్లడించింది. పోలవరం ఏటీఎం అన్న ప్రధాని వ్యాఖ్యల వెనుక మర్మమిదే... పోలవరం కాంట్రాక్టు సంస్థపై పలు పర్యాయాలు దాడులు నిర్వహించిన ఆదాయపన్నుశాఖ... అనేక అక్రమాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి 2018 డిసెంబర్లో నివేదిక సమర్పించింది. నిర్దేశిత అంచనా కంటే ఎక్కువ మొత్తానికి పనులు అప్పగించడం, భారీగా మొబిలైజేషన్ అడ్వాన్సుల నిధులు ఇవ్వడం మొదలుకొని అనేక అక్రమ లావాదేవీలు దాడుల్లో వెలుగులోకి వచ్చాయని అత్యున్నతస్థాయి అధికారి ఒకరు ఇచ్చిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది. సదరు కంపెనీ నుంచి ప్రభుత్వంలో ముఖ్యులకు హవాలా ద్వారా భారీగా నగదు చేరిందన్న విషయాన్ని ఐటీశాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ రాజమండ్రి సభలో పోలవరం ప్రాజెక్టును కొందరు ఏటీఎంలా వాడుకుంటున్నారన్న సంగతిని బయటపెట్టినట్లు స్పష్టమవుతోంది. -
ఆధార్‌తో ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారా? మీకో గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) శుభవార్త అందించింది. పాన్ లేకుండా కేవలం ఆధార్ ద్వారా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినవారికి ఆదాయపన్ను శాఖ ఆటోమేటిక్‌గా పాన్ కార్డును జారీ చేయనుంది. ఈ మేరకు సీబీడీటీ సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది. సీబీడీటీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం వ్యక్తిగతంగా ఆధార్ నెంబరు ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వారికి ఆటోమేటిక్‌గా పాన్ కార్డును ఇవ్వనుంది. బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విధంగా ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు ఆధార్ కార్డును ఉపయోగించడం అంటే పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసినట్లుగా పరిగణింస్తున్నట్టు సీబీడీటీ స్పష్టం చేసింది. ఈ నిబంధనలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని, త్వరలోనే పాన్ జారీ చేసే ప్రక్రియను ప్రారంభిస్తామని సీబీడీ ఛైర్మన్ పీసీ మోడీ తెలిపారు. ఆధార్ కార్డులో వినియోగదారుడి పేరు, పుట్టిన తేదీ, జండర్, ఫోటో, అడ్రస్, తదితర వ్యక్తిగత వివరాలను యూఐడీఏఐ ద్వారా ఆదాయ పన్ను శాఖ సేకరించి దాని ఆధారంగా 10 అంకెల పాన్ కార్డును జారీ చేస్తామన్నారు. పాన్ కార్డులేని పన్ను చెల్లింపుదారులు ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఆధార్ కార్డును ఉపయోగించు కోవచ్చునని ఆదాయపన్ను చట్టం ప్రకారం పాన్‌కు ఆధార్ ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. -
వీడనున్న ‘స్విస్’ లోగుట్టు
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో భారతీయులకు సంబంధించిన ఖాతాల వివరాలు నేటి నుంచి భారతీయ పన్ను అధికారులకు అందుబాటులోకి రానున్నాయి. ఇరుదేశాల ఆటోమేటిక్ సమాచార మార్పిడి ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి రానుండటంతో స్విస్ ఖాతాల వివరాలు భారత్‌కు తెలియనున్నాయి. నల్లధనంపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి ఇది దోహదపడుతుందని, దీంతో స్విస్ బ్యాంకుల లోగుట్టు శకం ఎట్టకేలకు ముగిసినట్లు అవుతుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) తెలిపింది. దీనిపై సీబీడీటీ ఆదాయపు పన్ను విభాగానికి ఓ విధానాన్ని రూపొందించింది. స్విట్జర్లాండ్ అంతర్జాతీయ ఫైనాన్స్ విభాగానికి చెందిన ఉన్నతాధికారి నికోలస్ మారియో ఈనెల 29, 30 తేదీల్లో భారత రెవెన్యూ కార్యదర్శి ఏబీ పాండే, సీబీడీటీ చైర్మన్ పీసీ మోదీలతో భేటీ అయి దీనిపై చర్చించారు. ఆర్థిక ఖాతాల సమాచార మార్పిడి కార్యక్రమం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. పన్నుకు సంబంధించిన భారత్ కోరిన కొన్ని ప్రత్యేక కేసుల సమాచార మార్పిడి ప్రక్రియను వేగవంతం చేయడంపైనా ఇరుదేశాల అధికారులు చర్చించారు. స్విట్జర్లాండ్‌లో 2018 సంవత్సరంలో భారతీయులు నిర్వహించిన అన్ని ఆర్థిక లావాదేవీల వివరాలను భారత్ అందుకుంటుందని సీబీడీటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందులో 2018లో క్లోజ్ అయిన ఖాతాల వివరాలు కూడా ఉంటాయని తెలిపింది. -
ఐటీ రిటర్నుల దాఖలు గడువుపై తప్పుడు ప్రచారం
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక తప్పుడు వార్త హల్చల్ చేస్తోంది. దీనిపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ), ఐటీ శాఖ స్పందించాయి. 2018-19 సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2019–20) సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు గడువులో ఎలాంటి పొడిగింపు లేదని సీబీడీటీ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఆర్డర్ ఫేక్ ఆర్డర్ అనీ, ఆగస్టు 31వ తేదీ అంటే రేపటితో ఐటీఆర్ ఫైలింగ్ గడువు ముగియనుందని ఐటీ విభాగం ట్వీట్ చేసింది. ఐటి రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువును పొడిగిస్తూ సీబీడీటీ ఆర్డర్ పేరుతో చలామణి అవుతున్న వార్త నిజమైంది కాదని సీబీడీటీ స్పష్టం చేసింది. గడువులోపు పన్ను చెల్లింపుదారులు తమ ఐటీ రిటర్న్‌లను దాఖలు చేయాలని సూచించింది. కాగా ఐటీఆర్‌లు దాఖలు చేయడానికి ఐదు వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఆదాయపు పన్ను విభాగం పోర్టల్... ఐటీఆర్ దాఖలు చేయడానికి అధికారిక వెబ్‌సైట్‌గా అందుబాటులో ఉంది. క్లియర్ ట్యాక్స్, మైఐటీ రిటర్న్, ట్యాక్స్‌స్పానర్, పైసాబజార్ ఈ వెబ్సైట్ల ద్వారా కూడా ఐటీఆర్‌లు దాఖలు చేయవచ్చు. ఇవే కాకుండా చాలా బ్యాంక్‌లు ఈ–ఫైలింగ్ ఆప్షన్‌ను అందిస్తున్నాయి. ఐటీఆర్‌లు దాఖలు చేయాలనుకుంటున్న వాళ్లు సంబంధిత బ్యాంక్‌ల ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఐటీఆర్‌లను దాఖలు చేయవచ్చు. ఈ నెల 31లోపు ఐటీఆర్ దాఖలు చేయలేకపోతే, ఈ ఏడాది డిసెంబర్ వరకూ రూ. 5,000 జరిమానాతో, ఆ తర్వాత రూ.10,000 ఫైన్‌తో దాఖలు చేయవచ్చు. It has come to the notice of CBDT that an order is being circulated on social media pertaining to extension of due dt for filing of IT Returns. It is categorically stated that the said order is not genuine.Taxpayers are advised to file Returns within extended due dt of 31.08.2019 pic.twitter.com/m7bhrD8wMy — Income Tax India (@IncomeTaxIndia) August 30, 2019 -
నోట్లరద్దు అక్రమార్కులపై ఐటీశాఖ నజర్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబర్ 8న సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో జరిగిన అక్రమ లావాదేవీలపై కేంద్రం దృష్టి సారించింది. ఈ క్రమంలో ఆదాయపన్ను శాఖ 17 పాయింట్ల చెక్లిస్ట్ను విడుదల చేసింది. లెక్కల్లో చూపించని నగదును స్వాధీనం చేసుకునే క్రమంలో సమన్వయంతో పని చేస్తున్నామని ఆదాయపు శాఖ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ(సీబీడీటీ) తెలిపింది. పన్ను చెల్లింపుదారుడు తన నిజాయితీని నిరూపించుకునే నిబంధనను ఇందులో పొందుపరిచారు. ముఖ్యంగా నవంబర్ 9, 2016 నుంచి డిసెంబర్ 31, 2016 వరకు జరిగిన లావాదేవీలపై అధికారులు దృష్టి పెట్టనున్నారు. అక్రమ లావాదేవీలు గుర్తించాక వారి వాదనను కూడా ఐటీ శాఖ అధికారులు పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇందులో వ్యాట్ రాబడిలో హెచ్చుతగ్గులను సమీక్షించనున్నారు. అక్రమ లావాదేవీలు జరిగినట్లు నిరూపణ అయితే జరిమానా విధించనున్నట్లు ఆ చెక్‌లిస్ట్‌లో పేర్కొన్నారు. -
‘ఐటీఆర్ ఫామ్స్’లో మార్పుల్లేవ్..
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను రిటర్నుల (ఐటీఆర్) ఫామ్స్‌లో ఎటువంటి మార్పులు లేవని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మంగళవారం స్పష్టంచేసింది. ఐటీఆర్ ఫామ్స్‌లో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకుంటోన్న కారణంగా రిటర్నులను దాఖలు చేయడంలో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సోషల్ మీడియాలో వస్తోన్న కథనాలు కేవలం అపోహలు మాత్రమే అని కొట్టిపడేసింది. యుటిలిటీ సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుందే తప్పించి మరే ఇతర మార్పులు లేవని వివరించింది. మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) సమాచారం ఆధారంగా ప్రీ–ఫైలింగ్ వంటి పలు సౌకర్యాలు ఇందులో భాగంగా ఉన్నట్లు తెలిపింది. రిటర్నుల దాఖలుకు జూలై 31 ఆఖరి తేదీ. -
ఎఫ్‌పీఐలు కార్పొరేట్లలా మారొచ్చు!
న్యూఢిల్లీ: ఆదాయపన్ను సర్‌చార్జీ పెంపు నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐలు) మినహాయింపు ఇవ్వటానికి అవకాశం లేదని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్ పీసీ మోడీ స్పష్టం చేశారు. ఎఫ్‌పీఐలు కావాలనుకున్న పక్షంలో కార్పొరేట్ సంస్థగా రిజిస్టర్ చేసుకుని, ఆ విభాగంలో ఉన్న తక్కువ రేట్ల పరిధిలోకి మారొచ్చని సూచించారు. రూ.2 కోట్లపైన ఆదాయం కలిగిన వారిపై సర్‌చార్జ్ పెంచాలన్న నిర్ణయాన్ని... దేశ నిర్మాణం కోసం వారు మరింత చెల్లించగలరన్న ఉద్దేశంతోనే తీసుకున్నామన్నారు. ‘‘బేస్ రేటులో మార్పు లేదు. మారింది సర్‌చార్జీ మాత్రమే. ఇది ఎఫ్‌పీఐలు, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్‌పై (ఏఐఎఫ్) ప్రభావం చూపిస్తుంది. కానీ, కార్పొరేట్ సంస్థగా మారే ఆప్షన్ వారికి ఉంది. ఈ విషయంలో ఏవిధమైన భేదభావం లేదు’’ అని సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మోదీ పేర్కొన్నారు. ఆదాయపన్ను పరిధిలో దిగువ స్థాయిల్లో ఉన్న వారికి ప్రయోజనాలు అందించేందుకు అధికాదాయ వర్గాలపై సర్‌చార్జీ పెంచినట్టు మోడీ తెలిపారు. బడ్జెట్ 2019–20లో అధిక ఆదాయం కలిగిన వారిపై సర్‌చార్జీలను పెంచుతూ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన విషయం విదితమే. రూ.2–5 కోట్ల మధ్య ఆదాయం ఉన్న వారిపై సర్‌చార్జీని 25 శాతానికి, రూ. 5 కోట్లు దాటిన వారిపై 37 శాతానికి పెంచేశారు. దాదాపు 40 శాతం మంది ఎఫ్‌పీఐలు నాన్ కార్పొరేట్ సంస్థల రూపంలో అసోసియేషన్ ఆఫ్ పర్సన్ లేదా ట్రస్ట్‌గా ఇన్వెస్ట్ చేస్తున్నందున వారిపై తప్పనిసరిగా ఈ భారం పడనుంది. ఎందుకంటే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వారిని వ్యక్తులుగానే పరిగణిస్తున్నారు. పన్నుల లక్ష్యాన్ని చేరుకుంటాం.. ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని రూ.13.35 లక్షల కోట్లకు సవరించామని, ఇది ఆచరణ సాధ్యమేనని పీసీ మోడీ తెలిపారు. కార్పొరేట్ పన్ను మరింత తగ్గించే అంశాన్ని, ఈ రంగంలో మినహాయింపులు, తగ్గింపులన్నవి తొలగిపోయిన తర్వాతే ప్రభుత్వం పరిశీలించగలదన్నారు. ‘‘గత సవరించిన అంచనాల్లో మా పన్ను వసూళ్ల లక్ష్యం 2019–20 సంవత్సరానికి రూ.13.78 లక్షల కోట్లుగా ఉంది. కానీ, ఇది వాస్తవానికి దూరంగా ఉంది. ఎందుకంటే అంతకుముందు ఏడాది వసూళ్లతో పోలిస్తే 24 శాతం ఎక్కువ. బడ్జెట్ సంప్రదింపుల సమయంలో మేం ఇదే తెలియజేశాం. దీంతో పన్ను వసూళ్ల లక్ష్యాన్ని ఇప్పుడు రూ.13.35 లక్షల కోట్లుగా నిర్ణయించడం జరిగింది’’ అని మోడీ వివరించారు. దీంతో గతేడాది వసూళ్ల కంటే 17.5 శాతం ఎక్కువన్నారు. ఇది కష్టమైన లక్ష్యమే కానీ, అసాధ్యం మాత్రం కాదన్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను శాఖ ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.11.37 లక్షల కోట్లను వసూలు చేసిం ది. బడ్జెట్లో పెట్టుబడులు, వృద్ధికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో, ఆర్థిక రంగం మంచి పనితీరు చూపుతుందని, దాంతో వసూళ్లు కూడా మెరుగ్గానే ఉంటాయని చెప్పారు. వస్తు సేవలç పన్ను (జీఎస్టీ) వసూళ్ల విషయంలో ఫలితాలు బాగుంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెండు రెట్లు తగ్గిన భారత కంపెనీల ఎఫ్‌డీఐలు ఆర్బీఐ జూన్ గణాంకాలు ముంబై: భారత కంపెనీలు తమ విదేశీ వెంచర్లలో ఇన్వెస్ట్ చేసే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) ఈ ఏడాది జూన్‌లో రెండు రెట్లకు పైగా తగ్గాయి. గత ఏడాది జూన్‌లో 229 కోట్ల డాలర్లుగా ఉన్న భారత కంపెనీల ఎఫ్‌డీఐలు ఈ ఏడాది జూన్‌లో 82 కోట్ల డాలర్లకు తగ్గాయని ఆర్బీఐ వెల్లడించింది. ఈ ఏడాది మేలో భారత కంపెనీల ఎఫ్‌డీఐలు 156 కోట్ల డాలర్ల మేర ఉన్నాయి. భారత కంపెనీల జూన్ ఎఫ్‌డీఐల్లో ఈక్విటీ మార్గంలో 34 కోట్ల డాలర్లు, రుణాల రూపంలో 22 కోట్ల డాలర్లు, గ్యారంటీల రూపంలో 26 కోట్ల డాలర్లు ఉన్నాయి. ఓఎన్జీసీ విదేశ్... తన వివిధ విదేశీ వెంచర్లలో 6 కోట్ల డాలర్ల మేర ఇన్వెస్ట్ చేసింది. ఏషియన్ పెయింట్స్ 4.3 కోట్ల డాలర్లు, అలోక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2.4 కోట్ల డాలర్ల మేర ఇన్వెస్ట్ చేశాయి.