
పన్ను ఎగవేతలపై చట్టపరంగానే చర్యలు
న్యూఢిల్లీ: పన్ను ఎగవేతదారులపై చట్టపరంగానే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీబీడీటీ (ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్) ఒక ప్రకటనలో సోమవారం స్పష్టంచేసింది. పన్ను ఎగవేతదారులందరిపై కేవలం ఐటీ దాడులు, పత్రాల పరిశోధనలు, జరిమానాలతోనే సరిపెట్టకుండా, పన్ను ఎగవేతకు సంబంధించి పరువు తీయడం, జైలులో పెట్టడం వంటి హెచ్చరికలతో వారిలో తీవ్రమైన భయాందోళనలు కలిగించేలా చర్యలు తీసుకోవాలని పన్నుల శాఖ తన అధికారులను ఆదేశించినట్లు వచ్చిన వార్తలను సీబీడీటీ తోసిపుచ్చింది. అధిక మొత్తంలో పన్ను ఎగవేతల వ్యవహారంలో చట్టం మేరకు కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని ఈ సందర్భంగా సీబీడీటీ స్పష్టం చేసింది.