Tax evasion
-
జీఎస్టీలో కొత్త సవరణలు..
పన్నులు ఎగవేసేందుకు ఆస్కారమున్న ఉత్పత్తులను ట్రాక్ చేసేందుకు ఉపయోగపడేలా ‘ట్రాక్ అండ్ ట్రేస్’ నిబంధన సహా వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానంలో కేంద్ర బడ్జెట్ పలు సవరణలు ప్రతిపాదించింది. ఈ నిబంధన అమలు కోసం విశిష్ట గుర్తింపు మార్కింగ్‌కు నిర్వచనం ఇస్తూ సెంట్రల్ జీఎస్టీ చట్టంలో కొత్త నిబంధన చేర్చింది. ప్రత్యేకమైన, సురక్షితమైన, తొలగించడానికి వీలుకాని విధంగా ఉండే డిజిటల్ స్టాంప్, డిజిటల్ మార్క్ లేదా ఆ కోవకు చెందిన ఇతరత్రా గుర్తులు ‘విశిష్ట గుర్తింపు మార్కింగ్’ కిందికి వస్తాయి. సరఫరా వ్యవస్థను మెరుగ్గా పర్యవేక్షించడానికి, వ్యాపారవర్గాలను డిజిటైజేషన్ వైపు మళ్లించడానికి ఇలాంటి చర్యలు దోహదపడగలవని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్నర్ రజత్ మోహన్ తెలిపారు. -
పాలసీబజార్ కార్యాలయంలో జీఎస్టీ సోదాలు
పాలసీబజార్(Policybazaar) మాతృసంస్థ పీబీ ఫిన్‌టెక్ గురుగ్రామ్ కార్యాలయంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) సోదాలు నిర్వహించింది. పాలసీబజార్ ఆఫ్‌లైన్ ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ విభాగమైన పీబీ పార్టనర్స్‌తో కలిసి కొందరు విక్రేతల ద్వారా పన్ను ఎగవేతకు పూనుకుందని ఆరోపణలొచ్చాయి. దాంతో జీఎస్టీ అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించినట్లు తెలిసింది.ఈ సోదాల్లో భాగంగా అధికారులు కంపెనీ ఆవరణలోని డాక్యుమెంట్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. జీఎస్టీ ఫైలింగ్‌లో వ్యత్యాసాలు, ఎగవేతలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ సోదాలపై పీబీ ఫిన్‌టెక్ స్పందించింది. జీఎస్టీ అధికారులకు అవసరమైన మొత్తం సమాచారాన్ని అందించినట్లు, తదుపరి ఏవైనా సమాచారం కావాల్సి వచ్చినా పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది. ఈ సోదాల వల్ల కంపెనీపై ఎలాంటి ఆర్థిక ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఈ కంపెనీ పైసాబజార్‌ను కూడా నిర్వహిస్తోంది. ఈ సోదాలకు సంబంధించి జీఎస్టీ అధికారిక వివరణ ఇవ్వలేదు.ఇదీ చదవండి: హిండెన్‌బర్గ్ మూసివేత! బెదిరింపులు ఉన్నాయా..?తనిఖీలు ఎందుకు..?పన్ను చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూడటానికి, ఏదైనా పన్ను ఎగవేతను కనుగొనడానికి జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తూంటారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఫ్రేమ్‌వర్క్ కింద ఎన్ఫోర్స్మెంట్ చర్యల్లో భాగంగా ఈ సోదాలు చేస్తారు. అయితే ఇలా నిర్వహించే సోదాలకు చాలా కారణాలున్నాయి. జీఎస్టీ ఫైలింగ్‌లో వ్యత్యాసాలను గుర్తించడానికి, పన్ను ఎగవేతను వెలికితీయడానికి ఇవి సహాయపడతాయి. తనిఖీల సమయంలో మోసపూరిత కార్యకలాపాలను సూచించే పత్రాలు, రికార్డులు, ఇతర సాక్ష్యాలను అధికారులు స్వాధీనం చేసుకోవచ్చు. పన్నులు ఎగవేయాలని భావించే వ్యాపారాలు, వ్యక్తులకు ఈ తనిఖీలు అడ్డంకిగా మారుతాయి. -
జీఎస్టీ నిబంధనలు పాటించని 30 విభాగాలు గుర్తింపు
పన్ను పరిధిని విస్తరించడానికి, జీఎస్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కొత్త విధానాలను అన్వేషిస్తోంది. పన్ను ఎగవేతను గుర్తించి, అధికారికంగా నమోదుకాని డీలర్లను దాని పరిధిలోకి తీసుకురావడానికి గుజరాత్ రాష్ట్ర జీఎస్టీ యంత్రాంగం 30 బిజినెస్-టు-కన్స్యూమర్ (బీ2సీ) విభాగాలను గుర్తించింది. చాలా మంది రిజిస్టర్డ్ ట్రేడర్లు తమ ఆదాయాన్ని తక్కువగా నివేదిస్తున్నారని జీఎస్టీ అధికారులు తెలిపారు. మరికొందరు తమ వివరాలు నమోదు చేయకుండా పరిమితికి మించి సంపాదిస్తున్నారని చెప్పారు. అలాంటి వారిని కట్టడి చేసేలా 30 బీ2సీ విభాగాలను గుర్తించినట్లు చెప్పారు.ప్రభుత్వం గుర్తించిన బీ2సీ సెక్టార్లకు సంబంధించి అద్దె పెళ్లి దుస్తుల వ్యాపారులు, పాదరక్షలు, సెలూన్లు, నాన్ క్లినికల్ బ్యూటీ ట్రీట్మెంట్స్, ఐస్ క్రీం పార్లర్లు, టెక్స్టైల్ విక్రేతలు, పొగాకు వ్యాపారులు, బ్యాటరీ వ్యాపారులు, మొబైల్ ఫోన్, యాక్సెసరీస్ డీలర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, కృత్రిమ పూలు అమ్మకం దారులు, అలంకరణ ఉత్పత్తుల విక్రేతలు, కోచింగ్ క్లాసుల నిర్వాహకులు ఉన్నట్లు తెలిపారు.పరిమితి దాటినా నమోదవ్వని వివరాలు..రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 12 లక్షల మంది రిజిస్టర్డ్ డీలర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే వీరి వాస్తవ సంఖ్య అంతకంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. జీఎస్టీ నిబంధనల ప్రకారం పన్నుదారులను దీని పరిధిలోకి తీసుకురావడంపై దృష్టి సారించామన్నారు. బీ2సీ విభాగంలో చాలా మంది పన్ను చెల్లింపుదారులు వారి పూర్తి ఆదాయాన్ని నివేదించడం లేదన్నారు. కొందరు సరైన బిల్లులను జారీ చేయకుండా లావాదేవీలు నిర్వహిస్తున్నారని చెప్పారు. చాలా మంది వ్యాపారుల టర్నోవర్ జీఎస్టీ పరిమితిని మించినప్పటికీ వివరాలు నమోదు చేయడం లేదన్నారు. పన్ను ఎగవేతను తగ్గించడమే లక్ష్యంగా కొన్ని విధానాలను ప్రవేశపెట్టబోతున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: అంబానీ జెట్ పైలట్ల జీతం ఎంతంటే..రెండు నెలల్లో రూ.20 కోట్లు..గత రెండు నెలలుగా గుజరాత్ వ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహించి రాష్ట్ర జీఎస్టీ విభాగం రూ.20 కోట్ల పన్ను ఎగవేతను గుర్తించింది. పన్ను పరిధిని విస్తరించడానికి దేశవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. సరైన బిల్లింగ్ లేకుండా లావాదేవీలు నిర్వహిస్తున్న వారి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు చెబుతున్నారు. రిజిస్టర్ కాని డీలర్లకు సరుకులు సరఫరా చేసే రిజిస్టర్డ్ ట్రేడర్లు కూడా ప్రభుత్వ పరిశీలనలోకి వస్తారని తెలియజేస్తున్నారు. -
పన్ను ఎగవేత.. పలు రకాలు..
పన్ను ఎగవేత చట్టరీత్యా నేరం. అనైతికం. ఆర్థికంగా సంక్షోభం తయారవుతుంది. అయితే, మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా మోసం చేస్తున్నట్లు అనిపిస్తుంది. సినిమాలో ‘విలన్’ మనకు ఆది నుంచి చివరి వరకు కనిపిస్తాడు. నిజజీవితంలో ‘విలన్’ విలన్‌లాగా కనిపించడు. ఓ పరోపకారి పాపయ్యలాగా, ఓ మర్యాద రామన్నలాగా అనిపిస్తాడు. వినిపిస్తాడు. కనిపిస్తాడు. ఎంతో మోసం చేస్తాడు. మనం తెలుసుకునే లోపల తెరమరుగవుతాడు.‘‘మీరు ఇప్పుడే మోసపోయారు’’ పుస్తకంలో రచయిత.. మనం ప్రతి రోజూ వైట్‌కాలర్ క్రైమ్ ద్వారా ఎలా మోసపోతున్నామో కళ్ళకి కట్టినట్లు తెలియజేశారు. ‘‘డబ్బుని ఎలా సంపాదించాలి’’ అనే పుస్తకంలో రచయిత ’అంకుర్ వారికూ’ ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఆస్తిని ఎలా ఏర్పాటు చేసుకోవాలని మొదలైన విషయాల మీద ఆచరణాత్మకమైన సలహాలు ఇస్తారు. అలాగే తెలుగు రచయతలు వీరేంద్రనాథ్‌గారు, బీవీ పట్టాభిరాం గారు తమ పుస్తకాల ద్వారా ఎన్నో మంచి విషయాలు చెప్పారు. ఇంత మంది చెప్పినా, ఇన్ని విషయాలు తెలిసినా, షరా మామూలే!ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!ఒకరిని చూసి ఒకరు. ఆశతో, ప్రేరేపణతో. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్లు మోసం చేస్తున్నారు. పన్ను ఎగవేస్తున్నారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి మార్గాలున్నట్లు..అకౌంట్స్ బుక్స్ నిర్వహించపోవడం, నిర్వహణలో అవకతవకలు, ఆదాయాన్ని తక్కువగా చూపించడం, ఖర్చులను పెంచేయడందురాలోచనలతో బంగారాన్ని .. అంటే ఆభరణాలు, రత్నాలు, డైమండ్లు, వెండి విషయాల్లో సెంటిమెంటు పేరు మీద, పసుపు–కుంకాల పేరు మీద, పెళ్లిళ్ల పేరు మీద కొంటున్నారు. అమ్ముతున్నారు. మళ్లీ కొంటున్నారు. పెట్టుబడికి సోర్స్ చెప్పరు. లాభాన్ని లెక్కించరు. ఆస్తిగా చూపించరు. ‘‘భర్తకే చెప్పం’’ అంటారు కొందరు మహిళలు. మీకు గుర్తుండే ఉంటుంది. రైళ్లలో బోగీ ఎక్కే ముందు ఇదివరకు ప్రయాణికుల జాబితా ఉండేది. పేరు, వయస్సు, లింగం, పాన్ నంబరు, మొదలైనవి అందులో ఉంటాయి. బంగారం షాపులవాళ్లు వారి సిబ్బందిని పంపించి ఆ వివరాలను సంగ్రహించేవారు. ఆ జాబితాను తీసుకుని, షాపునకు వచ్చి, అందులోని పేర్ల మీద ఇతరులకు అమ్మేవారు.వ్యవసాయ భూమి అంటే ఏమిటో ఆదాయపు పన్ను నిర్వచించినా, గ్రామాల పేరు మార్చి, సరిహద్దులు మార్చి అమ్మకాల్లో మోసం. అలాగే ఆదాయం విషయంలో ఎన్నో మతలబులు.. ఎందుకంటే వ్యవసాయ ఆదాయం, భూమి అమ్మకాల మీద పన్ను లేదు.ఇక రియల్ ఎస్టేట్ రంగంలో చెప్పనక్కర్లేదు. నేతి బీరకాయలో నేయి లేదు కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ‘‘రియల్’’ గానే పన్ను ఎగవేత ఉంది.అన్‌లిస్టెడ్ కంపెనీల షేర్లు, స్టాక్స్, క్రయవిక్రయాల్లో ఎన్నో అక్రమమార్గాలు అవలంబిస్తున్నారు.పబ్లిక్ కంపెనీల్లో షేరు ప్రీమియం పేరుతో మోసాలు.. అలాగే షేర్స్ అలాట్మెంట్కి ముందుగా అప్లికేషన్‌తో పాటు వసూలు చేసే మనీతో మోసాలు.వ్యాపారంలో సర్దుబాటు హుండీలు సహజం... వీటి మార్పిడి... ఇదొక సరిహద్దుల్లేని వ్యాపారం అయిపోయింది.డమ్మీ సంస్థలు.. ఉనికిలో లేనివి.. ఉలుకు లేని..పలుకు లేని.. కాగితం సంస్థలు. కేవలం ఎగవేతకే ఎగబాకే సంస్థలు. దొంగ కంపెనీలు. డొల్ల కంపెనీలు. బోగస్ వ్యవహారాలు. బోగస్ కంపెనీలు.క్రిప్టోకరెన్సీల్లో గోల్మాల్..ఇలా ఎన్నో.. ముఖ్యంగా సోర్స్ చెప్పకపోవడం, పెట్టుబడికి కానీ.. రాబడికి కానీ వివరణ ఇవ్వకపోవడం, పన్ను ఎగవేతకు పన్నాగం చేయడం. వీటి జోలికి పోకండి.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
పన్నుల ప్రణాళిక.. ఎగవేత మధ్య తేడా!
పన్నుల ఎగవేతకు, ప్రణాళికబద్ధంగా పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి గల తేడాలకు సంబంధించి నిపుణులు కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఇంగ్లీషులో Tax Evasion అంటే ఎగవేత.. ఇంగ్లీషులో Tax Planning అంటే ప్లాన్ చేయడం. ప్లాన్ చేయడం వల్ల Tax Avoidance చేయవచ్చు. ఎగవేత నేరపూరితం. ప్లానింగ్ చట్టబద్ధమైనది. వివరాల్లోకి వెళితే..పన్నుల ప్రణాళిక లక్ష్యాలుచట్టంలో ఉన్న అంశాలకు లోబడి ప్లాన్ చేయడం.అన్ని వ్యవహారాలు, బాధ్యతలు చట్టప్రకారం ఉంటాయి.చట్టప్రకారం అవకాశం ఉన్నంతవరకు పన్ను భారాన్ని తగ్గించుకోవడం.ఇదొక హక్కులాంటిది .. శాస్త్ర సమ్మతమైనది.పన్ను ఎగవేత: ఉద్దేశాలుచట్టంలో అంశాలను ఉల్లంఘించడం.జరిగే వ్యవహారాలు చట్టానికి వ్యతిరేకంగా ఉంటాయి.ఉద్దేశపూర్వకంగా పన్ను తప్పించుకునే మార్గాల అమలు.ఇది నేరం. చట్టవిరుద్ధం.పన్నుల ఎగవేతలో కావాలని పన్నులు కట్టకుండా ఎగవేయడం ఉంటుంది. అది చట్టవిరుద్ధం. అనైతికం. అబద్ధాలు చెప్పి, తప్పులు చేసి, ఎన్నో కుతంత్రాల ద్వారా ఆదాయాన్ని దాచి, దోచి.. పన్నులను కట్టకపోవడం కిందకు వస్తుంది. ఎన్నో మార్గాలను వెతుక్కుని, అమలుపర్చి తద్వారా పన్నులు ఎగవేస్తారు. మోసపూరితమైన వ్యవహారాలు, మోసపూరితమైన సమాచారం, లెక్కలు.. ఇవన్నీ అభ్యంతరకరం. చట్టరీత్యా నేరం. ఎండమావుల్లాగా ప్రయోజనం అనిపిస్తుంది. కానీ ప్రయోజనం ఉండదు. ఎన్నెన్నో ఉదాహరణలు. ఎన్నో మార్గాలు. అడ్డదార్లు. ఎందరో మనకు తారసపడతారు. మెరిసిపోతుంటారు. మురిసిపోతుంటారు. వెలిగిపోతుంటారు. కానీ ఇవన్నీ తాత్కాలికం. ఇలాంటి వారిపై చట్టపరంగా శిక్షలు తీవ్రంగానే ఉంటాయి. వడ్డీలు వడ్డిస్తారు. పెనాల్టీలు వేస్తారు. కటకటాల పాలు కావచ్చు. ఎన్నో చట్టాలు వారిని పట్టుకుంటాయి.ఇదీ చదవండి: అత్యవసర నిధికి నిజంగా ‘బంగారం’ అనుకూలమా?పన్నుల ప్లానింగ్ఇక పన్నుల ప్లానింగ్‌లో ఓ పద్ధతి ఉంటుంది. ఇది చట్టానికి లోబడి ఉంది. నైతికంగా ఉంటుంది. అబద్ధం ఉండదు. తప్పు ఉండదు. కుతంత్రం ఉండదు. ఆదాయాన్ని దోచడం ఉండదు. దాచడం ఉండదు. పన్నులు పడకుండా జాగ్రత్త పడటం.. పన్నుల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం మోసపూరితం కాదు. లెక్కలు గానీ, సమాచారం గానీ మోసపూరితమైనదిగా ఉండదు. అతిక్రమణ ఉండదు. ప్రయోజనం ఉంటుంది. పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఎన్నెన్నో సక్రమమైన మార్గాలు ఉన్నాయి. 2024 సంవత్సరం 10 కోట్ల 41 లక్షల మంది రిటర్నులు వేశారు. లక్ష మంది వారి ఆదాయం కోటి రూపాయలు ఉన్నట్లు చెబుతున్నారు. వీరే మనకు ఆదర్శవంతులు. మనకు కట్టాల్సిన పన్నుల వివరాలు వెల్లడించడం ద్వారా చట్టప్రకారం అన్ని ప్రయోజనాలు దొరుకుతాయి. ఎటువంటి శిక్షలు ఉండదు. మనం ఈ మార్గాన్నే అనుసరిద్దాం.-కె.సీ.హెచ్ ఏ.వీ.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
పన్ను ఎగవేతను పట్టించే చట్టాలివే.. తస్మాత్ జాగ్రత్త!
పన్ను తప్పకపోవచ్చు. అలాంటప్పుడు కట్టడమే.. నాగరిక పౌరుల బాధ్యత. కట్టాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు పన్ను చెల్లించకపోవడమే ‘ఎగవేత’. ఈ ‘ఎగవేత’ సముద్రంలో ఎందరో గజ ఈతగాళ్లను ఏరిపారేసిన చట్టాలున్నాయి. దాని ఊసెత్తకండి. ఎన్నెన్నో మార్గాలు.ఆదాయాన్ని చూపించకపోవడం, ఆదాయం తక్కువ చేయడం, పన్ను చెల్లించకపోవటం, తప్పుడు లెక్కలు చూపడం, లెక్కలు రాయకపోవడం, స్మగ్లింగ్, దొంగ కంపెనీలు, తప్పుడు బిల్లులు, బ్లాక్ వ్యవహారాలు .. ఇలా శతకోటి మార్గాలు. కొన్ని పరిశ్రమ రంగాల్లో అవకాశం ‘ఎండమావి’లాగా ఎదురుచూస్తుంది. సినిమా రంగం, రియల్ ఎస్టేట్, కొన్ని వస్తువుల ఉత్పత్తిలో, బంగారంలో, షేరు మార్కెట్, వ్యవసాయం, బెట్టింగ్, పందాలు, అస్తవ్యస్తమైన రంగాలు.. ఇలా ఎన్నో. చట్టాన్ని అనుసరించడానికి ఒకే మార్గం. రాచమార్గం ఉంటుంది. అతిక్రమించడానికి అన్నీ అడ్డదార్లే.ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. 1. తనిఖీ చేయడం 2. సమన్లు ఇవ్వటం 3. పిలిచి ఎంక్వైరీ చేయడం 4. సెర్చ్ 5. సీజ్ చేయడం 6. సర్వే చేయడం 7. ఇతరులను కూడా ఎంక్వైరీ చేయడం 8. సాక్ష్యాలను సేకరించటం 9. పన్ను కట్టించడం (కక్కించడం) 10. వడ్డీ, రుసుములు, పెనాల్టీ విధించడం 11. జైలుకి పంపడం ఇలా ఎన్నో విస్తృత అధికారాలు ఉన్నాయి.బినామీ వ్యవహారాల చట్టం.. ఇది సునామీలాంటి చట్టం. బినామీ వ్యవహారాల ద్వారా పన్ను ఎగవేత చేస్తుంటారు. ఈ చట్టం ప్రకారం అధికార్లకు నోటీసులు ఇవ్వడం, ఎంక్వైరీలు, వ్యవహారంలో ఉన్న ఆస్తులను జప్తు చేయడం మొదలైన అధికారాలు ఉన్నాయి. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ చట్టం ప్రపంచంలో జరిగే వ్యవహారాల మీద నిఘా ఉంటుంది. విదేశీయులతో వ్యవహారాలు, ఎక్స్చేంజ్ వ్యవహారాలు, అనుమతులు లేకుండా ఆస్తుల సేకరణ, ఆస్తులను ఉంచుకోవడం, వ్యవహారాలు చేయడం, వాటి ద్వారా లబ్ధి పొందడం .. ఇలాంటి వాటిపై అధికార్ల వీక్షణం తీక్షణంగా ఉంటుంది. అన్యాయంగా వ్యవహారాలు చేస్తే, తప్పులు చేస్తే ఉపేక్షించదు ఈ చట్టం. అతిక్రమణ జరిగితే ‘అంతే సంగతులు’ .. శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందే.మనీలాండరింగ్‌కి సంబంధించిన చట్టం.. అక్రమంగా పొందిన డబ్బుని దాచి.. కాదు దోచి.. దాని మూలాలను భద్రపర్చి.. పన్ను కట్టకుండా.. లెక్కలు చూపకుండా .. దానికి ‘లీగల్’ రంగు పూసే ప్రయత్నమే మనీలాండరింగ్. ఈ ప్రక్రియ చట్టవిరుద్ధం. ఇందులో ఎందరో బడాబడా బాబులు ఇరు క్కుని జైలు పాలయ్యారు. హవాలా వ్యవహారాలు మొదట్లో హల్వాలాగా ఉంటాయి. హలీంలాగా నోట్లో కరిగిపోతాయి. కానీ అవి చాలా డేంజర్. అలవాట్లకు బానిస అయి, తాత్కాలిక ఆర్థిక ఒత్తిళ్లకు తలవంచి ‘లంచావతారం’గా మారిన వారు ఉద్యోగాలు కోల్పోయి.. ఉనికినే కోల్పోయారు. కాబట్టి, సారాంశం ఏమిటంటే ‘ఎండమావి’ భ్రమలో పడకండి. చక్కటి ప్లానింగ్ ద్వారా చట్టప్రకారం సరైన దారిలో వెళ్లే ప్రయత్నం చేయండి.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
మరిన్ని ఐటీ కంపెనీలకు షోకాజ్ నోటీసులు!.. ఎందుకంటే?
పన్నులు చెల్లించలేదనే కారణంగా ఇన్ఫోసిస్ కంపెనీకి జీఎస్టీ అధికారులు ప్రీ-షోకాజ్ నోటీసు జారీ చేశారు. 2017 జులై నుంచి 2022 మార్చి వరకు 32,403 కోట్ల రూపాయలకు జీఎస్టీ చెల్లింపు చేయలేదనేది ఈ ప్రీ-షోకాజ్ నోటీసు సారాంశం.ఇన్ఫోసిస్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసిన అధికారులు.. మరిన్ని టెక్ కంపెనీలను రాబోయే రోజుల్లో ఇలాంటి నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. తమ విదేశీ కార్యాలయాల సేవలపై పన్నును ఎగవేసిన ఆరోపణలపై తదుపరి పరిశీలనలో నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.ప్రీ-షోకాజ్ నోటీసు అందుకున్న తరువాత ఇన్ఫోసిస్ స్పందిస్తూ.. ఎప్పటికప్పుడు జీఎస్టీ చెల్లిస్తూనే ఉన్నామని, ఈ విషయంలో తాము కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధలనకు లోబడి పాటించాల్సిన అన్ని నిబంధవులను పాటిస్తున్నట్లు తెలిపింది.ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (ఐజీఎస్టీ) చట్టం ప్రకారం భారతదేశం వెలుపల ఉన్న ఇన్ఫోసిస్ కార్యాలయాలు కంపెనీ నుంచి విభిన్న సంస్థలుగా పరిగణించబడతాయని అధికారులు పేర్కొన్నారు. కాబట్టి బ్రాంచ్ కార్యాలయాలు అందించే అన్ని సేవలను దిగుమతిగా పరిగణిస్తామని, తద్వారా జీఎస్టీ విధించడం జరుగుతుందని వెల్లడించారు. -
తెలంగాణలో మరో భారీ స్కాం.. మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌పై కేసు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీ కుంభకోణం ఒకటి బయటపడింది. కమర్షియల్ ట్యాక్స్‌లో కుంభకోణం జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌తో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కమర్షియల్ ట్యాక్స్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో భారీ కుంభకోణం జరిగినట్టు అధికారులు గుర్తించారు. దాదాపు రూ.1000 కోట్ల అవకతవకలు జరిగినట్టు అధికారులు తెలిపారు. కాగా, 75 కంపెనీలు ఈ కుంభకోణానికి పాల్పడ్డినట్టు చెప్పారు. ఇక, ఈ స్కాంలో లబ్ధి పొందిన జాబితాలో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ కూడా ఉంది. అయితే, ఈ మొత్తం వ్యవహారం ఫోరెన్సిక్ అడిట్‌తో వెలుగు వచ్చింది.ఇక, మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సూచనలతో ట్యాక్స్ పేమెంట్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లో మార్పులు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌తో పాటు ఐఐటీ హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు, కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఎ.శివరామ ప్రసాద్, పిలాంటో టెక్నాలజీస్లపై కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి కనూరి సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో, స్కామ్‌కు పాల్పడిన నిందితులపై ఐపీసీ 406,409,120B ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. -
టానిక్ మోసాలు.. 100 కోట్ల ట్యాక్స్ ఎగవేత!
హైదరాబాద్, సాక్షి: నగరంతో పాటు శివారుల్లో టానిక్ వైన్ మార్ట్ పేరిట జరిగిన భారీ అక్రమాలు బయటపడుతున్నాయి. సులువుగా అనుమతులు పొందడం మొదలు.. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరపడం, ట్యాక్సులు ఎగ్గొట్టడం దాకా.. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వంద కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు తేలగా.. ఇందుకు గత ప్రభుత్వ హయాంలోని కొందరు అధికారులు పూర్తి సహకారం అందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఎలైట్ లిక్కర్ మార్ట్ కోసం పర్మినెంట్ లైసెన్స్‌ను 2016లో ప్రత్యేక జీవో 271ను పేరిట జారీ చేసింది గత ప్రభుత్వం. ఈ జీవో ప్రకారం ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే.. మొదటి మూడు సంవత్సరాలు లిక్కర్ అదనపు అమ్మకాలపై ఎలాంటి ప్రివిలేజ్ ఫీజ్ చెల్లిచకుండా వెసులుబాటు కల్పించారు. ఇదిలా ఉంటే.. ఎలైట్ వైన్ షాపు కోసం 2016లో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే.. టానిక్ బేవరేజెస్ మాత్రమే టెండర్ కోట్ చేసింది. దీంతో.. టానిక్ కు ఎలైట్ వైన్ షాప్ పర్మినెంట్ అనుమతి సులువైంది. అయితే.. తెలంగాణ లో ఒక్క ఎలైట్ ఔట్ లెట్‌కు మాత్రమే అనుమతి ఇవ్వగా.. హైదరాబాదు, నగర శివారుల్లో మరో 10 ఎలైట్ వైన్ షాపులను ‘Q By టానిక్’ పేరుతో నిర్వహిస్తూ వస్తోంది. నిబంధనల ప్రకారం.. ఎలైట్ వైన్స్ లైసెన్స్ ట్రాన్స్‌ఫర్‌కు అవకాశమే లేకపోవడం గమనార్హం. ఇక.. ఈ లైనెస్స్ ప్రకారం లిక్కర్‌ను బాటిల్స్‌గా మాత్రమే విక్రయించాలి. లూజ్ వైన్‌కు అనుమతి లేదు. ఇతర పానీయాలు ,ఆహార పదార్ధాల అమ్మకానికి వీలులేదు. అయితే ఈ వ్యవహారం మొత్తంలో సాధారణ మద్యం లైసెన్స్ అనుమతులు తీసుకుని విదేశీ మద్యం అమ్మకాలు జరపడం ఇక్కడ కొసమెరుపు. రీటైల్‌గా ఫారెన్ లిక్కర్ తోపాటు ప్రీమియం ఇండియన్ లిక్కర్ అమ్మడానికి టానిక్కు వెసలుబాటు కల్పించారు. ఇక.. టానిక్ వైన్ మార్టులో పని చేసే ఉద్యోగుల పేరిట లైసెన్సులు తీసుకున్నారు. అంతేకాదు.. ఈ ఫ్రాచైజీల్లో బడా బాబుల పిల్లల పెట్టుబడులు పెట్టారు. గత ప్రభుత్వ అనుమతులతోనే ఈ తతంగం అంతా నడిచినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌తో పాటు శివారులో వైన్ మార్టులు ఏర్పాటు చేసింది టానిక్. ఇందుకు ఓ ఐఏఎస్ అధికారితో పాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులు సహకరించినట్లు ఎక్సైజ్ శాఖ గుర్తించింది. గచ్చిబౌలి, బోడుప్పల్, మాదాపూర్‌లో ఏర్పాటైన టానిక్ మార్టులో ఈ ముగ్గురు అధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలింది. అలాగే సీఎంవో మాజీ అధికారి ఒకరి పాత్రపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. టానిక్ షాపులకు ఎక్సైజ్ శాఖ షాకిచ్చింది. ప్రత్యేక జీవోతో అర్ధరాత్రి 2 గంటల దాకా లిక్కర్ అమ్ముకునే వెసులుబాటును తొలగించింది. రెగ్యులర్ లిక్కర్ దుకాణాల మాదిరే రాత్రి 11 గం. వరకే అమ్ముకోవాలని సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పన్నుల ఎగవేతపై ప్రాథమిక నిర్ధారణకు వచ్చాకే ఈ నిర్ణయం ప్రకటించింది. ఇక.. పూర్తిస్థాయి తనిఖీల అనంతరం చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. -
ఆన్లైన్ గేమింగ్ కంపెనీలపై పన్ను పిడుగు
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ కంపెనీలపై పన్ను పిడుగు పడింది. పన్ను ఎగవేతకు సంబంధించి రూ.లక్ష కోట్ల మేర చెల్లించాలని కోరుతూ జీఎస్టీ అధికారులు షోకాజు నోటీసులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అక్టోబర్ 1 తర్వాత భారత్‌లో నమోదు చేసుకున్న విదేశీ గేమింగ్ కంపెనీలకు సంబంధించి డేటా లేదన్నారు. విదేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహించే గేమింగ్ కంపెనీలు, జీఎస్టీ చట్టం కింద నమోదు చేసుకోవడాన్ని అక్టోబర్ 1 నుంచి కేంద్రం తప్పనిసరి చేసింది. ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో బెట్టింగ్ పూర్తి విలువపై 28 శాతం పన్ను వసూలు చేస్తామని జీఎస్టీ కౌన్సిల్ ఆగస్ట్‌లోనే స్పష్టం చేయడం గమనార్హం. డ్రీమ్11, డెల్టా కార్ప్ తదితర సంస్థలు భారీ మొత్తంలో పన్ను చెల్లింపులకు సంబంధించి గత నెలలో షోకాజు నోటీసులు అందుకోవడం తెలిసిందే. గేమ్స్క్రాఫ్ట్ సంస్థ రూ.21,000 కోట్ల పన్ను ఎగవేసిందంటూ గతేడాది జీఎస్టీ అధికారులు షోకాజు నోటీసులు జారీ చేశారు. దీంతో సంస్థ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి, సానుకూల ఆదేశాలు పొందింది. దీనిపై కేంద్ర సర్కారు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు డ్రీమ్11 సంస్థ రూ.40,000 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించి షోకాజు నోటీసులు అందుకుంది. డెల్టా కార్ప్, దాని అనుబంధ సంస్థలకు రూ.23,000 కోట్లకు సంబంధించి షోకాజు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులపై డెల్టాకార్ప్ బోంబే హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. న్యాయస్థానాలు ఇచ్చే తదుపరి ఆదేశాలకు అనుగుణంగా పన్ను వసూళ్లు ఆధారపడి ఉన్నాయి. -
వేల కోట్ల జీఎస్టీ ఎగవేత: అధికారుల షాక్..కోర్టుకెక్కిన డ్రీమ్11
ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ (RMG) కంపెనీలకు పన్ను అధికారులు భారీ షాక్ ఇచ్చారు. రూ. 55 వేల కోట్ల పన్ను బకాయిలు చెల్లించాలంటూ పలు కంపెనీలకు ప్రీ-షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దేశంలో అత్యంత విలువైన పరోక్ష పన్ను నోటీసు అని భావిస్తున్నారు. ముఖ్యంగా రూ.66,500 కోట్ల విలువైన ఫాంటసీ స్పోర్ట్స్ మేజర్ డ్రీమ్11కి రూ. 25 వేల కోట్ల పన్ను ఎగవేత నోటీసులు అందించడం కలకలం రేపింది. ఈ షో కాజ్ నోటీసు నేపథ్యంలో డ్రీమ్11 బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ జనరల్ అనేక ఇతర ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు సుమారు రూ. 55,000 కోట్ల పన్ను డిమాండ్‌ను పెంచుతూ ప్రీ-షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇందులో, ముంబైకి చెందిన వ్యాపారవేత్త హర్ష్ జైన్, అతని స్నేహితుడు కో-ఫౌండర్ భవిత్ షేత్‌కు చెందిన డ్రీమ్11కి రూ. 25000 కోట్ల అతిపెద్ద నోటీసు ఇవ్వడం కలకలం రేపింది. వాస్తవానికి ఇది దాదాపు రూ. 40,000 కోట్లుకు పై మాటేనని పలు మీడియాలు నివేదించాయి. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి డ్రీమ్ స్పోర్ట్స్ నిరాకరించింది. డ్రీమ్ 11కు హర్ష్ సీఈవోగా, భవిత్ సీఓఓగా ఉన్నారు. ఇక ప్లే గేమ్స్24x7 రూ. 20,000 కోట్లు, హెడ్ డిజిటల్ వర్క్స్ రూ. 5,000 కోట్లు మేర ఎగవేసినట్టుగా నోటీసులందాయి. తాజా పరిణామంతో డ్రీమ్ 11 (స్పోర్టా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్) మాతృ సంస్థ డ్రీమ్ స్పోర్ట్స్ ఈ షోకాజ్ నోటీసులను సవాలు చేస్తూ బాంబే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. డ్రీమ్11 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 3,841 కోట్ల నిర్వహణ ఆదాయంపై రూ.142 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. మరోవైపు రూ. 21,000 కోట్ల మేర పన్ను ఎగవేతకు ఆరోపణలెదుర్కొంటున్న గేమ్స్క్రాఫ్ట్ కేసులో జీఎస్టీ నోటీసును రద్దు చేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై రానున్న వారాల్లో సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది. అంతేకాదు పన్ను ఎగవేత ఆరోపణలపై 40కి పైగా స్కిల్-గేమింగ్ కంపెనీలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు అండ్ కస్టమ్స్ (CBIC) షోకాజ్ నోటీసులు పంపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ సమీక్షలో ఆన్లైన్ రియల్ మనీ గేమ్స్‌పై జీఎస్టీని18 శాతంనుంచి 28 శాతానికి పెంచింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని కౌన్సిల్, అక్టోబర్ 1, 2023 నాటికి కొత్త పన్ను రేట్లను అమలు చేయాలని అన్ని రాష్ట్రాలను కోరింది. ఈ నిర్ణయాన్ని అమలును ఆరు నెలల తర్వాత సమీక్షించడానికి కూడా అంగీకరించింది. అలాగే ఆగస్ట్ 11న వర్షాకాల సమావేశాల చివరి రోజు, ఆర్థిక మంత్రి సీతారామన్ సీజీఎస్టీ చట్టాల సవరణ బిల్లులను ప్రవేశపెట్టారు. ఉభయ సభల ఆమోదం తరువాత దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆగస్టు 19న సవరణలకు ఆమోదం తెలిపారు. తదనంతరం, హర్యానా, గోవా, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు తమ తమ రాష్ట్ర GST చట్టాలకు ఇదే విధమైన సవరణలను ఆమోదించాయి. -
హైదరాబాద్: మూడో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో బుధవారం మొదలైన ఐటీ సోదాలు శుక్రవారం మూడోరోజూ కొనసాగుతున్నాయి. వైష్ణవి గ్రూప్ స్థిరాస్తి సంస్థ, హోటల్ అట్ హోమ్ సంస్థలు వాటి అనుబంధ సంస్థల్లో సోదాలు కొనసాగుతున్నాయి. వీటితో పాటు ఆయా సంస్థల కార్యాలయాల్లో మేనేజింగ్ డైరెక్టర్లు , సీఈఓల ఇళ్లలో అధికారులు తనీఖీలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి ,శేఖర్ రెడ్డి ఇళ్లల్లో సైతం అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలల్లో 70 మంది ఐటీ అధికారుల బృందాలు పాల్గొన్నాయి. పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి కలసి చేసిన రియల్ ఎస్టేట్, మైనింగ్ సహా ఇతర వ్యాపారాలపై ఐటీ శాఖ దృష్టి పెట్టింది. ఇందులో హిల్‌ల్యాండ్, మైన్స్‌ల్యాండ్, తీర్థ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్, శ్రీలార్వెన్ సిండికేట్ సంస్థల్లో ఈ ముగ్గురికీ చెందిన కుటుంబ సభ్యులే భాగస్వాములుగా ఉండటంతో ఇందుకు సంబంధించిన వివరాలను ఐటీ అధికారులు సేకరిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరులో సాగించిన వెంచర్లు, విల్లాల అమ్మకాల్లో నగదు రూపంలో జరిగిన లావాదేవీలపైనా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు లాకర్లను గుర్తించి తెరవగా కీలక డాక్యుమెంట్లు, విలువైన ఆభరణాలు బయటపడ్డట్లు తెలిసింది. చదవండి: ఢిల్లీలో కేసీఆర్, ఖర్గే చేతులు కలిపారు.. రేవంత్ పరిస్థితి ఏంటో! -
ప్రపంచ దేశాల్లో రుణ సంక్షోభం.. పన్ను ఎగవేతలను అరికట్టాలి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి, రుణ సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపత్యంలో పన్ను ఎగవేతలను, అక్రమ నిధుల ప్రవాహానికి (ఐఎఫ్ఎఫ్) అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని ఓఈసీడీ ఒక నివేదికలో తెలిపింది. ముఖ్యంగా ఆసియా దేశాలు ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇలాంటి వాటివల్ల 2016లో 25 బిలియన్ యూరోల మేర నష్టం వాటిల్లిందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) తెలిపింది. ఒక అధ్యయనం ప్రకారం ఆసియా ఆర్థిక సంపదలో దాదాపు నాలుగు శాతం (సుమారు 1.2 ట్రిలియన్ యూరోలు) విదేశాల్లో చిక్కుబడి ఉందని ’ఆసియాలో పన్నులపరమైన పారదర్శకత 2023’ పేరిట రూపొందించిన నివేదికలో వివరించింది. దీనివల్ల 2016లో ఆసియా ప్రాంత దేశాలకు వార్షికంగా 25 బిలియన్ యూరోల మేర నష్టం వాటిల్లి ఉంటుందని పేర్కొంది. పన్నుల విషయంలో పారదర్శకత పాటించేందుకు, వాటికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు ఏర్పాటైన గ్లోబల్ ఫోరం సమావేశం సందర్భంగా ఈ నివేదికను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ గ్లోబల్ ఫోరంలో 167 దేశాలకు సభ్యత్వం ఉంది. నివేదికలో మరిన్ని విశేషాలు.. ►కోవిడ్–19 మహమ్మారి, తదనంతర భౌగోళిక రాజకీయ సంక్షోభాల వల్ల ఆర్థిక వృద్ధి మందగించింది. ప్రజారోగ్యం, సామాజిక.. ఆర్థికపరమైన మద్దతు కల్పించేందుకు ప్రభుత్వాలు మరింతగా వెచ్చించాల్సి వస్తోంది. ►ప్రస్తుతం పన్నులపరమైన ఆదాయాలు తగ్గి, దేశాల ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ఇక రుణ భారం, వడ్డీ రేట్లు పెరిగిపోతుండటం, వర్ధమాన దేశాల్లో వడ్డీలు చెల్లించే సామర్థ్యాలు తగ్గుతున్నాయి. ►2004–2013 మధ్య కాలంలో ఐఎఫ్ఎఫ్ కారణంగా వర్ధమాన దేశాలు 7.8 లక్షల కోట్ల (ట్రిలియన్) డాలర్లు నష్టపోగా, ఇందులో ఆసియా దేశాల వాటా 38.8 శాతంగా ఉంది. ► పన్ను ఎగవేతలు, ఐఎఫ్ఎఫ్లు దేశీయంగా ఆ దాయ సమీకరణకు అవరోధాలుగా మారాయి. అంతర్జాతీయంగా కూడా ఇది సమస్యగా ఉంది. ►ఐఎఫ్ఎఫ్ల పరిమాణం గణనీయంగా పెరుగుతోంది. పన్నులపరమైన పారదర్శకతను పెంచేందుకు ప్రాంతీయంగా తీసుకునే చర్యలు మాత్రమే వీటిని కట్టడి చేయగలవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
పన్ను ఎగవేతలను అరికట్టాలి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి, రుణ సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపత్యంలో పన్ను ఎగవేతలను, అక్రమ నిధుల ప్రవాహానికి (ఐఎఫ్ఎఫ్) అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని ఓఈసీడీ ఒక నివేదికలో తెలిపింది. ముఖ్యంగా ఆసియా దేశాలు ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇలాంటి వాటివల్ల 2016లో 25 బిలియన్ యూరోల మేర నష్టం వాటిల్లిందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) తెలిపింది. ఒక అధ్యయనం ప్రకారం ఆసియా ఆర్థిక సంపదలో దాదాపు నాలుగు శాతం (సుమారు 1.2 ట్రిలియన్ యూరోలు) విదేశాల్లో చిక్కుబడి ఉందని ’ఆసియాలో పన్నులపరమైన పారదర్శకత 2023’ పేరిట రూపొందించిన నివేదికలో వివరించింది. దీనివల్ల 2016లో ఆసియా ప్రాంత దేశాలకు వార్షికంగా 25 బిలియన్ యూరోల మేర నష్టం వాటిల్లి ఉంటుందని పేర్కొంది. పన్నుల విషయంలో పారదర్శకత పాటించేందుకు, వాటికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు ఏర్పాటైన గ్లోబల్ ఫోరం సమావేశం సందర్భంగా ఈ నివేదికను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ గ్లోబల్ ఫోరంలో 167 దేశాలకు సభ్యత్వం ఉంది. నివేదికలో మరిన్ని విశేషాలు.. ♦ కోవిడ్–19 మహమ్మారి, తదనంతర భౌగోళిక రాజకీయ సంక్షోభాల వల్ల ఆర్థిక వృద్ధి మందగించింది. ప్రజారోగ్యం, సామాజిక.. ఆర్థికపరమైన మద్దతు కల్పించేందుకు ప్రభుత్వాలు మరింతగా వెచ్చించాల్సి వస్తోంది. ♦ ప్రస్తుతం పన్నులపరమైన ఆదాయాలు తగ్గి, దేశాల ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ఇక రుణ భారం, వడ్డీ రేట్లు పెరిగిపోతుండటం, వర్ధమాన దేశాల్లో వడ్డీలు చెల్లించే సామర్థ్యాలు తగ్గుతున్నాయి. ♦ 2004–2013 మధ్య కాలంలో ఐఎఫ్ఎఫ్ కారణంగా వర్ధమాన దేశాలు 7.8 లక్షల కోట్ల (ట్రిలియన్) డాలర్లు నష్టపోగా, ఇందులో ఆసియా దేశాల వాటా 38.8 శాతంగా ఉంది. ♦ పన్ను ఎగవేతలు, ఐఎఫ్ఎఫ్లు దేశీయంగా ఆ దాయ సమీకరణకు అవరోధాలుగా మారాయి. అంతర్జాతీయంగా కూడా ఇది సమస్యగా ఉంది. ♦ ఐఎఫ్ఎఫ్ల పరిమాణం గణనీయంగా పెరుగుతోంది. పన్నులపరమైన పారదర్శకతను పెంచేందుకు ప్రాంతీయంగా తీసుకునే చర్యలు మాత్రమే వీటిని కట్టడి చేయగలవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
పేపరు మీద లెక్కలు.. చూస్తే బోగస్ సంస్థలు!
విజయవాడ గాంధీనగర్‌లో మదీనా ఎంటర్ ప్రైజెస్ అనే బోగస్ సంస్థను సృష్టించి పాత ఇనుము విక్రయాల ద్వారా రూ.7.2 కోట్లకు పైగా టర్నోవర్ చేసినట్లు లెక్క చూపారు. ఈ లావాదేవీలన్నీ పేపరు మీద ఉన్నాయి తప్ప.. వాస్తవంగా సరుకు కొన్న, అమ్మిన దాఖలాల్లేవు. ఈ విషయాన్ని అధికారులు టోల్గేట్ ద్వారా వెళ్తున్న వాహనాల ఫాస్ట్యాగ్, వేబిల్లుల సిస్టం ద్వారా కనుగొన్నారు. విజయవాడ–3 సర్కిల్ పరిధిలోని పెనమలూరులో కె.వి.రావు ట్రేడర్స్ పేరుతో ఫేక్సంస్థను సృష్టించి రూ.2.27 కోట్లకు పైగా టర్నోవర్ చేసినట్లు కనుగొన్నారు. ఇవన్నీ పేపరుపైన లావాదేవీలే తప్ప.. వాస్తవంగా అమ్మకాలు, కొనుగోళ్లు జరగలేదని అధికారులు గుర్తించారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇలా బోగస్ సంస్థలు సృష్టించి ఇన్పుట్ ట్యాక్స్ (కొనుగోలు చేసిన వస్తువులపై చెల్లించేపన్ను) కట్టకుండా ఎగవేసే దొంగల్ని వాణిజ్యపన్నుల అధికారులు వేటాడుతున్నారు. తుక్కు ఇనుముకు సంబంధించి కాగితాలపైనే సరఫరా చేసినట్లు చూపుతూ, మాన్యుఫాక్చర్ యూనిట్లకు లబ్ధి చేకూరుస్తున్న వారిని గుర్తించి పెనాల్టిలు వేసేదిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల విజయవాడలో పాత ఇనుము వ్యాపారానికి సంబంధించి నమోదై ఉన్న సంస్థల్లో వాణిజ్యపన్నుల అధికారులు చేసిన తనిఖీల్లో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ తనిఖీల్లో 43 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విచారణలో 18 బోగస్ సంస్థలు ఉన్నట్లు గుర్తించారు. వీటిద్వారా రూ.40 కోట్లకుపైగా టర్నోవర్ జరిగినట్లు గుర్తించారు. ఆ సంస్థలకు సంబంధించి అసలైన యజమానులను గుర్తించి పెనాల్టీ విధించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నకిలీ సంస్థలను సృష్టిస్తున్నారిలా.. పాత ఇనుము వ్యాపారం చేసే వారిలో కొందరు వివిధ మార్గాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు. తమ వద్ద పనిచేసే పేదల ఆధార్‌కార్డు తీసుకుని పాన్‌కార్డు దరఖాస్తు చేసి, దొంగ రెంటల్ అగ్రిమెంట్‌తో ఆన్లైన్లో కాటన్, టెక్స్టైల్స్, కిరాణా వ్యాపారం పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. తర్వాత పాత ఇనుము కమోడిటీని దానికి యాడ్ చేస్తున్నారు. విచ్చలవిడిగా ఇన్వాయిస్లు, వేబిల్లులు సృష్టించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ని దొంగచాటుగా కాగితాలపైనే సరఫరా చేసినట్లు చూపి, మాన్యుఫాక్చ రింగ్ సంస్థలకు లబ్ధి చేకూరుస్తున్నారు. మున్సిపల్ పన్ను రశీదులను సైతం ఈ బోగస్ సంస్థల సృష్టికి కొంతమంది వాడుకుంటున్నారు. మున్సిపల్ వెబ్సైట్ నుంచి ఏదో పేరు మీద ఉన్న పన్ను రశీదులను డౌన్లోడ్ చేసుకొని, దొంగ లీజు అగ్రిమెంట్లతో నకిలీ సంస్థలను సృష్టిస్తున్నారు. మాన్యుఫాక్చరింగ్ సంస్థలకు లబ్ధి ఇలా.. పాత ఇనుము సేకరించే హాకర్స్‌కు ఎటువంటి ఇన్పుట్ ట్యాక్స్ ఉండదు. పాత ఇనుము వివిధ మార్గాల్లో కొన్నదానికి బిల్లులు ఉండవు. ఇలా కొనుగోలు బిల్లుల్లేకుండా సరుకును రీరోలింగ్ మిల్లుకు సరఫరా చేస్తే ఆ కంపెనీ వారు ప్రభుత్వానికి 18 శాతం ట్యాక్స్ చెల్లించాలి. కానీ ట్యాక్స్ కట్టకుండా ఎగవేసేందుకు ఈ నకిలీ సంస్థలను సృష్టించి ఫేక్ అమ్మకం బిల్లులను జనరేట్ చేసి, ఈ–వేబిల్లులు, బ్యాంకు అకౌంట్ల ద్వారా లబ్దిపొంది, వచ్చే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను రీరోలింగ్ సంస్థలకు పాస్ చేస్తున్నారు. ఇక్కడ తయారయ్యే వస్తువులకు దొంగ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను వాడుకుని ఈ మాన్యుఫాక్చరింగ్ సంస్థలు లబ్దిపొందుతున్నాయి. బోగస్ సంస్థలను సృష్టించి పాత ఇనుమును ఎక్కువగా విజయవాడ నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు. దోషులను పట్టుకునేందుకు చర్యలు బోగస్ సంస్థలు సృష్టించి, పన్ను ఎగవేసే వారిని గుర్తించి కఠినచర్యలు తీసుకుంటున్నాం. రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులతోపాటు, దాని వెనుక ఉన్న అసలైన దోషులను, సాఫ్ట్వేర్, ప్రత్యేక నిఘా ఆధారంగా గుర్తించి, వారు టర్నోవర్ చేసిన మొత్తానికి సంబంధించి పెనాల్టీ వసూలు చేస్తాం. ఇటీవల విజయవాడలో చేసిన తనిఖీల్లో 43 కేసులు నమోదు చేశాం. ఇప్పటివరకు విచారణలో 18 బోగస్ సంస్థలను గుర్తించాం. – ఇ.కృష్ణమోహన్‌రెడ్డి, అడిషనల్ కమిషనర్, వాణిజ్యపన్నుల శాఖ విజయవాడ రీజియన్ -
రూ. 232 కోట్లు ఎగ్గొట్టి ‘పరుగులు’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 2,17,930 రవాణా వాహనాలు మూడు నెలలకోసారి చెల్లించాల్సిన త్రైమాసిక పన్ను ఎగ్గొట్టి రహదారులపై యథేచ్ఛగా పరుగులు తీస్తున్నాయి. ఏకంగా రూ. 232 కోట్లను కొన్ని నెలలుగా చెల్లించకుండానే దర్జాగా దూసుకెళ్తున్నాయి. వాటిలో కనిష్టంగా 3 నెలల కాలపరిమితి నుంచి గరిష్టంగా 18 నెలల వరకు పన్ను చెల్లించాల్సిన వాహనాలు వేలల్లోనే ఉన్నాయి. కొన్నిచోట్ల కోవిడ్ కాలం నుంచి కూడా పన్ను చెల్లించని వాహనాలు భారీగానే ఉన్నట్లు అంచనా. హైదరాబాద్‌లోనే అధికం.. త్రైమాసిక పన్ను ఎగ్గొట్టి తిరుగుతున్న 2.17 లక్షల వాహనాల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్‌లోనే లక్షకుపైగా ఉన్నాయి. ఈ క్రమంలో చాలాకాలం తర్వాత అధికారులు కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల రవాణా కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్ పన్ను ఎగవేత వాహనాలపై సమీక్ష నిర్వహించారు. ఒకవైపు లక్ష్యానికి మించిన ఆదాయాన్ని ఆర్జించడంపట్ల ప్రశంసిస్తూనే పన్ను ఎగవేత వాహనాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రేటర్‌లోని మూడు జిల్లాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన రవాణా వాహనాలను తనిఖీ చేయాలని అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. గ్రేటర్లో ఆటోలు మినహా... సాధారణంగా వ్యక్తిగత వాహనాలకు ఒకసారి జీవితకాల పన్ను చెల్లిస్తే చాలు. కానీ రవాణా వాహనాలకు మాత్రం ప్రతి 3 నెలలకోసారి త్రైమాసిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వాహనాల సామర్థ్యం మేరకు దీనిని నిర్ణయిస్తారు. వెయిట్ గ్రాస్ వెహికల్ (డబ్ల్యూజీవీ) ప్రకారం వాహనం బరువుకు అనుగుణంగా త్రైమాసిక పన్ను కనిష్టంగా రూ. 535 నుంచి గరిష్టంగా రూ. 15,000 వరకు ఉంటుంది. గతంలో ఇచ్ఛిన ఎన్నికల హామీ మేరకు జీహెచ్ఎంసీలోని సుమారు 1.4 లక్షల ఆటోలను ఈ త్రైమాసిక పన్ను జాబితా నుంచి ప్రభుత్వం మినహాయించింది. మిగతా అన్ని రకాల రవాణా వాహనాలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ జాబితాలో స్కూల్ బస్సులు, ప్రైవేట్ బస్సులు, లారీలు, క్యాబ్‌ల వంటి వాహనాలు ఉన్నాయి. కోవిడ్ కాలంలో పన్ను చెల్లించని రవాణా వాహనదారులు... కోవిడ్ ఆంక్షలను సడలించాక చాలా వరకు చెల్లించారు. కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆర్టీఏ అధికారులు అప్పట్లో ఉదారంగా వ్యవహరించడం కూడా ఇందుకు కారణమైంది. ఎంవీఐలకు పన్ను వసూలు టార్గెట్లు! ఈ నెలాఖరు నాటికి బకాయిలు వసూలు చేయాల ని రవాణా కమిషనర్ అధికారులను మౌఖికంగా ఆదేశించినట్లు తెలిసింది. అలాగే వారికి టార్గెట్లు విధించారని తెలియవచ్చింది. గతంలో జీహెచ్ఎంసీ పరిధిలోప్రతి ఎంవీఐకి రూ. 6 లక్షల చొప్పున టార్గెట్ విధించగా ప్రస్తుతం దాన్ని రూ. 7 లక్షలకు పెంచారని సమాచారం. ఈ లెక్కన ఆర్టీఏ కార్యాలయాల్లో పౌరసేవలు అందించే ఎంవీఐలు స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా రోజుకు పన్ను చెల్లించని 5 వాహ నాలను జఫ్తు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అ లాగే ఎన్ఫోర్స్మెంట్ విధుల్లో ఉన్నవారు రోజుకు 10 వాహనాలను జఫ్తు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అయితే జఫ్తు చేసిన వాహనాలను నిలిపేందుకు సరైన పార్కింగ్ సదుపాయం లేక ఇబ్బందులకు గురవుతున్నట్లు ఓ ఎంవీఐ పేర్కొన్నారు. స్వచ్ఛందంగా ముందుకొస్తేనే ఊరట... త్రైమాసిక పన్ను పెండింగ్ జాబితాలో ఉన్న వాహన యజమానులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పన్ను చెల్లిస్తే అపరాధ రుసుము ఉండదని అధికారులు చెబుతున్నారు. తనిఖీల్లో పట్టుబడితే మాత్రం 200 శాతం వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. బ్లాంక్ డీడీలతో దళారుల వసూళ్లు స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా సీజ్ చేసిన వాహనాలపై పెనాల్టితో సహా కట్టాల్సిన బకాయిల మొత్తానికి డీడీ తీసుకురావాలని అధికారులు చెబుతుండటంతో దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. వారు అప్పటికే వివిధ మొత్తాలతో బ్యాంకుల నుంచి తెచ్చిన ఖాళీ డీడీలు చూపి ఒక్కో డీడీపై ‘సర్విస్ చార్జీ’గా రూ.200 వసూలు చేస్తున్నారు. దీంతో ఆరొందల నుంచి రూ.1200 వరకు ఆ రూపంలో అదనపు భారం పడుతోంది. కళ్లముందే ఈ దందా జరుగుతున్నా రవాణాశాఖ అధికారులు చర్యలు తీసుకోవట్లేదు. -
బీబీసీలో ఆర్థిక అవకతవకలు జరిగాయ్
న్యూఢిల్లీ: బీబీసీ గ్రూప్‌లో ఆదాయ పన్ను శాఖ జరిపిన సర్వేలో కీలకమైన ఆధారాలు లభించాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. కొన్ని సంస్థలు చూపిస్తున్న ఆదాయం, లాభాలు భారత్‌లో వారి కార్యకలాపాలకు అనుగుణంగా లేవని, దాని విదేశీ సంస్థల చెల్లింపులపై కట్టాల్సిన పన్నుల్ని ఎగవేసిందని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉద్యోగులిచ్చిన వాంగ్మూలాలు, డిజిటల్ ప్రూఫ్‌లు, సేకరించిన డాక్యుమెంట్ల ద్వారా ఆ గ్రూప్‌లో భారీగా ఆర్థిక అవకతవకలు, పన్ను ఎగవేతలు చేసినట్టుగా ఆదాయ పన్ను శాఖ అధికారులు గుర్తించారని తెలిపింది. ప్రైసింగ్ డాక్యుమెంటేషన్ బదిలీకి సంబంధించి ఎన్నో వ్యత్యాసాలు, అవకతవకలు జరిగినట్టుగా ఐటీ సర్వేలో తేలిందని ఆ ప్రకటన వివరించింది. పన్ను చెల్లింపులో అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఐటీ శాఖ సర్వే సమయంలో మందకొడిగా వ్యవహరిస్తూ ప్రతీది ఆలస్యం చేసే వ్యూహాలు రచించిందని ఆరోపించింది. ఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు దాదాపు 60 గంటలు ఐటీ శాఖ సర్వే నిర్వహించింది. 2002 గుజరాత్ మతఘర్షణలకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బాధ్యుడిగా ఆరోపిస్తూ ‘‘ఇండియా ది మోదీ క్వశ్చన్’’ పేరిట బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేసిన కొద్ది రోజుల్లోనే ఐటీ శాఖ సర్వే జరపడం చర్చనీయాంశంగా మారింది. -
జీఎస్టీ కౌన్సిల్ అజెండాలో కీలక అంశాలు
న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్ భేటీ ఈ నెల 17న జరగనుంది. జీఎస్టీ నిబంధనల ఉల్లంఘనలను నేరాలుగా పరిగణించకపోవడం అన్నది ముఖ్యమైనది. అలాగే, జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు, పాన్ మసాలా, గుట్కా కంపెనీల పన్ను ఎగవేతలు తదితర అంశాలు చర్చకు రానున్నాయి. జీఎస్టీ కింద నిబంధనల ఉల్లంఘనలో ప్రాసిక్యూషన్ చేపట్టే వాటి ద్రవ్య పరిమితి (కేసు విలువ) మూడు రెట్లు పెంచాలని జీఎస్టీ కౌన్సిల్‌కు సంబంధించి న్యాయ కమిటీ సిఫారసు చేసింది. దీనిపై జీఎస్టీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే, జీఎస్టీ ఉల్లంఘనలదారుల నుంచి వసూలు చేసే ఫీజును కూడా తగ్గించడాన్ని తేల్చనుంది. ముఖ్యంగా ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందేలపై పన్ను రేటు పెంపు అంశాన్ని ఈ విడత జీఎస్టీ కౌన్సిల్ సమావేశం చర్చకు చేపట్టకపోవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై మంత్రుల బృందం ఇంకా నివేదిక సమర్పించాల్సి ఉందని పేర్కొన్నాయి. -
జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లలో... ఐటీ శాఖ సోదాలు
రాంచీ/న్యూఢిల్లీ: జార్ఖండ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కుమార్ జైమంగళ్, ప్రదీప్ యాదవ్‌ల నివాసాలు, కార్యాలయాల్లో అదాయపు పన్ను(ఐటీ) శాఖ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేసినట్లు ఇద్దరు ఎమ్మెల్యేలపై ఆరోపణలు ఉన్నాయని, దర్యాప్తులో భాగంగానే రాంచీ, బెర్మో, పట్నాలో ఈ సోదాలు జరిగాయని అధికారులు వెల్లడించారు. చైబాసాలో ముడి ఇనుప ఖనిజ వ్యాపారితోపాటు మరికొందరి ఇళ్లల్లోనూ సోదాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఐటీ సోదాలపై ఎమ్మెల్యే జైమంగళ్ అలియాస్ అనూప్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రంలోని అధికార బీజేపీ ఒత్తిళ్లతోనే ఈ సోదాలు నిర్వహించారని ఆరోపించారు. బీజేపీని వ్యతిరేకిస్తే వేధిస్తారా? అని ప్రశ్నించారు. తనను ఎవరూ భయపెట్టలేరని అన్నారు. బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టే కుట్రల్లో భాగంగానే తమ ఎమ్మెల్యేల నివాసాల్లో ఐటీ సోదాలు జరిగాయని జార్ఖండ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ విమర్శించారు. అయితే, ఐటీ శాఖ ఆపరేషన్‌తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ శాసనసభా పక్షనేత బాబూలాల్ మరాండీ తేల్చిచెప్పారు. పన్నుల ఎగవేత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఐటీ శాఖపై బురద చల్లుతున్నారని జార్ఖండ్ బీజేపీ నేత ప్రతుల్ షాదియో దుయ్యబట్టారు. జార్ఖండ్‌లో అధికార జేఎంఎం నేతృత్వంలోని కూటమిలో కాంగ్రెస్ సైతం భాగస్వామిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
రూ.5 కోట్ల పైగా జీఎస్టీ ఎగవేస్తే ఇక తీవ్ర నేరమే!
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ)కి సంబంధించి రూ.5 కోట్లకుపైగా ఎగవేత, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ దుర్వినియోగం అంశాలను తీవ్ర నేరంగా పరిగణించడం జరుగుతుందని ఆర్థికశాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఆయా ఆరోపణలకు సంబంధించి ఆధారాలు లభిస్తే ప్రాసిక్యూషన్ చర్యలు ఉంటాయని ఉద్ఘాటించింది. కాగా, ఎప్పుడూ ఎగవేతలకు పాల్పడే వారు లేదా ఆయా కేసులకు సంబంధించి అప్పటికే అరెస్ట్ అయిన సందర్భాల్లో ప్రాసిక్యూషన్‌కు తాజా నోటిఫికేషన్‌తో సంబంధం లేదని ఫైనాన్స్ శాఖ జీఎస్టీ ఇన్వెస్టిగేషన్ విభాగం స్పష్టం చేసింది. -
కోట్ల రూపాయల పన్ను ఎగవేత ఆరోపణలు: అంబానీకి ఐటీ నోటీసులు
న్యూఢిల్లీ: బ్లాక్ మనీ చట్టం కింద పారిశ్రామికవేత్త రిలయన్స్ గ్రూప్ (అడాగ్) చైర్మన్ అనిల్ అంబానీని ప్రాసిక్యూట్ చేసేందుకు ఆదాయ పన్ను శాఖ (ఐటీ) నోటీసులు జారీ చేసింది. రెండు స్విస్ ఖాతాల్లో రూ. 814 కోట్ల మేర రహస్యంగా దాచిన నిధులపై రూ. 420 కోట్ల పన్నులను ఆయన ఉద్దేశపూర్వకంగా ఎగవేశారని అభియోగాలు మోపింది. ఆయన కావాలనే విదేశీ బ్యాంకు ఖాతా వివరాలను వెల్లడించలేదని ఆరోపించింది. (భారత్‌లో క్షీణిస్తున్న క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి) దీనికి సంబంధించి ఆగస్టు తొలినాళ్లలో ఐటీ శాఖ అంబానీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. 2012-13 నుంచి 2019-20 అసెస్మెంట్ సంవత్సరాల మధ్య కాలానికి సంబంధించి విదేశాల్లోని అసెట్లను వెల్లడించక పోవడం ద్వారా అనిల్ అంబానీ పన్నులు ఎగవేశారని పేర్కొంది. ఆగస్టు 31లోగా అభియోగాలపై సమాధానమివ్వాలని సూచించింది. డైమండ్ ట్రస్ట్, నార్తర్న్ అట్లాంటిక్ ట్రేడింగ్ అన్లిమిటెడ్ (ఎన్‌ఏటీయూ) అనే రెండు విదేశీ సంస్థల కూపీ లాగితే వాటి అంతిమ లబ్ధిదారు అనిల్ అంబానీయేనని తేలినట్లు ఆదాయ పన్ను శాఖ వర్గాలు తెలిపాయి. చదవండి : అదానీ గ్రూప్ చేతికి ఎన్డీటీవీ.. మరి మాతో చర్చించ లేదు! -
టాప్ ప్రొడ్యూసర్ల కార్యాలయాలపై భారీ ఐటీ దాడుల కలకలం
సాక్షి, చెన్నై: తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలపై ఉదయం నుంచి ఆదాయపన్ను శాఖ దాడులు చేయడం సినీ వర్గాల్లో కలవరం రేపుతోంది. కలైపులి సహా 10 మంది బిగ్ షాట్స్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ మంగళవారం ఈ దాడులు చేపట్టింది. అలాగే చెన్నైలోని టి.నగర్‌లోని కలైపులి థాను చిత్ర నిర్మాణ సంస్థ కార్యాలయంలో ఈ తనిఖీలు నిర్వహిస్తోంది. పన్ను ఎగవేత అనుమానాలతో తమిళనాడులోని నలభైకి పైగా ప్రాంతాల్లో ఈ రోజు సోదాలు నిర్వహించినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు. అయితే ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఈ దాడులు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయని భావిస్తున్నారు. తమిళ నిర్మాత కలైపులి థాను, అన్బుచెజియన్, ఎస్ఆర్ ప్రభు, జ్ఞానవేల్ రాజా, నలుగురు నిర్మాతల కార్యాలయాలపై ముమ్మర ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. చెన్నైలోని నుంగంబాక్కంలో అన్బుచెజియన్ ఇంటిపై ఉదయం 5 గంటల నుంచి దాడులు చేస్తోంది. నిర్మాతలు అన్బుచెజియన్, ఎస్ఆర్ ప్రభు, త్యాగరాజన్, కలిపుల్లి ఎస్ .అన్బుచెజియన్‌కు చెందిన 40 చోట్ల ఆదాయపు పన్ను శాఖ ఈరోజు తనిఖీలు నిర్వహిస్తోంది. మదురైలో 30, చెన్నైలో 10 ప్రాంతాల్లో సోదారులు నిర్వహిస్తున్నారు. వీరితోపాటు చాలామంది సినిమా ఫైనాన్షియర్లపై కూడా ఈ దాడులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అన్బుచెజియన్ తమిళ చిత్రాలకు ఫైనాన్షియర్, ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను కార్యాలయంపై ఐటీ దాడులు చేపట్టింది. మధురైకి చెందిన ఆయన గోపురం ఫిలింస్ ఆధ్వర్యంలో కొన్ని చిత్రాలను నిర్మించడంతోపాటు పలు సినిమాలకు ఫైనాన్షియర్ కూడా వ్యవహరించారు. కాగా తమిళ నిర్మాత అశోక్‌కుమార్ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలుఎదుర్కొంటున్న అన్బుచెజియన్పై ఐటీ దాడులు చేయడం ఇది మూడోసారి. అన్బుచెజియన్ నుంచి అప్పు తీసుకున్న నిర్మాతల ఇళ్లపై కూడా ఐటీ శాఖ దాడులు చేస్తోంది. -
డోలో-650 కంపెనీపై పెద్ద ఎత్తున ఐటీ దాడులు
బెంగళూరు: కోవిడ్-19సంక్షోభంలో కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిన డోలో-650 తయారీ సంస్థ మైక్రో లాబ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆదాయపు పన్ను ఎగవేశారనే ఆరోపణలతో మైక్రో ల్యాబ్స్ కార్యాలయంపై ఐటీ శాఖ బుధవారం పెద్ద ఎత్తున సోదాలు చేపట్టింది. బెంగళూరులోని సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా ఈ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఏకంగా 200 మంది ఐటీ సిబ్బంది పాల్గనడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా మాధవనగర్‌లోని రేస్‌కోర్స్ రోడ్డులోని మైక్రో ల్యాబ్స్ నుంచి అధికారులు విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. న్యూఢిల్లీ, సిక్కిం, పంజాబ్, తమిళనాడు, గోవా సహా దేశవ్యాప్తంగా 200 అధికారులు ఏకకాలంలో 40 ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. గత రెండేళ్లుగా ఆదాయానికి సంబంధించి పన్నులు ఎగ్గొట్టారనే అనుమానంతో సంస్థ సీఎండీ దిలీప్ సురానా, డైరెక్టర్ ఆనంద్ సురానాల ఇళ్లల్లో కూడా దాడులు చేపట్టినట్టు ఐటీ శాఖ. వెల్లడించింది. కాగా 2020లో కరోనా విజృంభణ కాలంనుంచి డోలో-650 ట్యాబ్లెట్ల వినియోగం భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. జ్వరాన్ని నియంత్రించే డోలో-650 జనంలోకి విపరీతంగా చొచ్చుకుపోయింది. ఫలితంగా అమ్మకాల్లో రికార్డుల్ని బ్రేక్ చేసింది. 350 కోట్ల టబ్లెట్ల విక్రయాలతోఏడాదిలో 400 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. 1983లో కుటుంబ వ్యాపారాన్ని స్వీకరించిన సురానా ఫార్మా రంగంలో అనుభవజ్ఞుడు -
రిటర్న్‌ల స్క్రూటినీకి మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్నులను స్క్రూటినీకి ఎంపిక చేసే విషయంలో పాటించాల్సిన మార్గదర్శకాలను ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసింది. వీటి ప్రకారం పన్ను ఎగవేతకు సంబంధించి ఏ అధికారిక ఏజెన్సీల దగ్గర సమాచారమున్నా స్క్రూటినీ చేపట్టవచ్చు. అయితే, పూర్తి స్థాయి పరీక్షకు నిర్దిష్ట కేసులను ఎంపిక చేసేందుకు ప్రిన్సిపల్ కమిషనర్ / ప్రిన్సిపల్ డైరెక్టర్ / కమిషనర్ / డైరెక్టర్ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు చెల్లుబాటయ్యే అనుమతులు లేకుండా చారిటబుల్ ట్రస్టులు మినహాయింపులను క్లెయిమ్ చేసిన కేసుల్లో.. సర్వే, సెర్చి, జప్తులకు సంబంధించిన కేసుల్లో.. నోటీసుల జారీ కోసం ముందస్తుగా అనుమతులు తీసుకోవాలి. పూర్తి స్థాయి స్క్రూటినీలో భాగంగా పన్ను చెల్లింపుదారులు నిజాయితీగానే మినహాయింపులు పొందారా అన్నది ఆదాయపు పన్ను శాఖ అధికారులు పరిశీలిస్తారు. ఆదాయం తక్కువగా, నష్టాలను ఎక్కువగా చూపడం లాంటివేవీ చేయలేదని ధృవీకరించుకునేందుకు స్క్రూటినీ నిర్వహిస్తారు. -
భారత్‌పే వ్యవహారాలపై జీఎస్టీ దర్యాప్తు
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే పన్ను ఎగవేతలపై జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం మరింత లోతుగా దర్యాప్తు చేయనుంది. సేవలకు సైతం నకిలీ ఇన్వాయిస్లను జారీ చేశారా, లేదా? అన్న విషయాన్ని నిర్ధారించుకోనుంది. గడిచిన నాలుగేళ్ల కాలానికి సంబంధించి కంపెనీ పుస్తకాలను తనిఖీ చేసే పనిలో ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. భారత్‌పే సహ వ్యవస్థాపకుడైన అష్నీర్ గ్రోవర్, అయన భార్య మాధురి జైన్ అక్రమాలు, ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు కంపెనీ అంతర్గత దర్యాప్తులో వెల్లడి కావడం తెలిసిందే. దీంతో గ్రోవర్ దంపతులను అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టు భారత్‌పే ప్రకటించింది. భారత్‌పే ఎటు వంటి ఉత్పత్తులు సరఫరా చేయకుండానే నకిలీ ఇన్వాయిస్లు జారీ చేయడంపై జీఎస్టీ అధికారులు గడిచిన ఏడాది కాలం నుంచి దర్యాప్తు నిర్వహిస్తుండడం గమనార్హం. గతేడాది అక్టోబర్‌లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) అధికారులు భారత్‌పే ప్రధాన కార్యాలయంలో సోదాలు కూడా నిర్వహించారు. ‘‘సరుకుల సర ఫరా లేకుండానే ఇన్వాయిస్లు జారీ చేసిన కేసులో దర్యాప్తు నిర్వహిస్తున్నాం. ఎటువంటి సేవలు అందించకుండా ఇన్వాయిస్లు జారీ చేసినట్టు మాధురీ జైన్‌కు వ్యతిరేకంగా ఇటీవలి ఆరోపణలు రావడంపై వాటిపైనా దృష్టి పెట్టనున్నాం’’ అని ఓ సీనియర్ అధికారి తెలిపారు. -
చైనా కంపెనీకి గట్టి షాకిచ్చిన ఐటీ శాఖ..!
ప్రముఖ చైనీస్ టెలికాం కంపెనీ హువావేకు ఆదాయ పన్నుశాఖ గట్టి షాక్‌ను ఇచ్చింది. దేశవ్యాప్తంగా కంపెనీకి చెందిన ఆయా ప్రాంతాల్లో ఐటీ శాఖ దాడులను జరిపినట్లు తెలుస్తోంది. ముప్పేట దాడి...! పన్ను ఎగవేత విచారణలో భాగంగా హువావేకి చెందిన పలు ప్రాంగణాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి. ఢిల్లీ, గురుగ్రామ్ (హర్యానా), కర్ణాటకలోని బెంగళూరు ప్రాంగణాల్లో మంగళవారం దాడులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. విదేశీ లావాదేవీలపై పన్ను ఎగవేత దర్యాప్తులో భాగంగా పలు ఆర్థిక పత్రాలను, రికార్డులను అధికారులు పరిశీలించి అందులో కొన్ని రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా భారత నియమాలకు కట్టుబడి ఉన్నామని హువావే ఒక ప్రకటనలో తెలిపింది. 5జీ నెట్వర్క్ ట్రయల్స్‌కు దూరంగా..! పన్నుఎగవేత విషయంలో హువావేపై ఆరోపణలను రావడంతో కేంద్ర ప్రభుత్వం 5G సేవల కోసం హువావేను ట్రయల్స్ నుంచి దూరంగా ఉంచింది. అయినప్పటికీ, టెలికాం ఆపరేటర్లు తమ నెట్‌వర్క్‌లను నిర్వహించడానికి వారి పాత ఒప్పందాల ప్రకారం హువావే, ZTE నుంచి టెలికాం గేర్‌ను సోర్స్ చేయడానికి అనుమతించబడ్డారు, అయితే టెలికమ్యూనికేషన్ సెక్టార్‌పై నేషనల్ సెక్యూరిటీ డైరెక్టివ్ ప్రకారం ఏదైనా కొత్త వ్యాపార ఒప్పందంలోకి వచ్చే ముందు వారికి ప్రభుత్వం ఆమోదం అవసరం. కాగా గత ఏడాది షావోమీ, ఒప్పో చైనీస్ కంపెనీలపై ఆదాయపన్ను శాఖ సోదాలను నిర్వహించింది. ఆయా కంపెనీలు నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను రూ. 6500 కోట్లను ఐటీ శాఖ జరిమానా వేసింది చదవండి: ‘అంతా బోగస్ లెక్కలు..! మమ్మల్ని నట్టేంటా ముంచేసింది..’ యాపిల్‌కు గట్టి షాకిస్తూ కోర్టుకు -
నా కమీషన్ ఇప్పించండి
లండన్: భారత్‌లో మనీ ల్యాండరింగ్, పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయుధాల కొనుగోలు మధ్యవర్తి సంజయ్ భండారీ పదేళ్ల క్రితం నాటి తన కమీషన్ సొమ్ము ఇప్పించండంటూ బ్రిటన్ కోర్టును ఆశ్రయించారు. భారత వాయుసేనకు చెందిన మిరాజ్–2000 రకం యుద్ధవిమానాల నవీకరణ కాంట్రాక్ట్.. ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆయుధాల సంస్థ ‘థేల్స్ గ్రూప్’కు దక్కేలా మధ్యవర్తిగా వ్యవహరించానని ఆయన కోర్టులో పేర్కొన్నారు. 2008 నుంచీ థేల్స్ కోసం పనిచేస్తున్నానని, అధునాతన మిరాజ్ విమానాలను భారత్‌కు విక్రయించేలా మధ్యవర్తిత్వంలో భాగంగా నాటి భారత రక్షణ శాఖ ఉన్నతాధికారితో భేటీని ఏర్పాటుచేశానని పిటిషన్లో ప్రస్తావించారు. భారత్ ప్రతిష్టాత్మంగా కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాలను తయారుచేసే దసాల్ట్ ఏవియేషన్‌కు థేల్స్ సంస్థే కీలకమైన ‘ఏవియోనిక్స్’ ఉపకరణాలను సరఫరా చేస్తుండటం గమనార్హం. 2.4 బిలియర్ యూరోల(దాదాపు రూ.20వేల కోట్ల) విలువైన మిరాజ్ కాంట్రాక్ట్‌లో మధ్యవర్తిగా వ్యవహరించినందుకు మొత్తంగా 2 కోట్ల యూరోలు(దాదాపు రూ.167 కోట్లు) ఇస్తానని థేల్స్ సంస్థ హామీ ఇచ్చిందని, కానీ కేవలం 90 లక్షల యూరోలే(దాదాపు రూ.75 కోట్లు) ఇచ్చి చేతులు దులిపేసుకుందని ఆయన వెల్లడించారు. సంస్థ నుంచి మిగతా కమిషన్ ఇప్పించాలని ఆయన పారిస్ సమీపంలోని నాంటయర్లోని ‘ట్రిబ్యునల్ డీ కామర్స్’ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని బ్రిటన్‌కు చెందిన ‘ది డైలీ టెలిగ్రాఫ్’ వార్తా సంస్థ ఇటీవల ఒక కథనం ప్రచురించింది. భారత వాయుసేనకు రఫేల్–బి, రఫేల్–సి రకం యుద్ధవిమానాల సరఫరాకు సంబంధించిన చర్చల్లో ఫ్రాన్స్ కన్షార్షియంలో థేల్స్ ఉంది. యూపీఏ హయాంలో యుద్ధవిమానాల ఆధునికీకరణ ఒప్పందం వేళ భండారీకి, కాంగ్రెస్‌కు సత్సంబంధాలు కొనసాగాయని బీజేపీ ఆరోపించింది. రక్షణ కొనుగోళ్లు జరిగిన ప్రతీసారి ముడుపులపై కాంగ్రెస్ దృష్టిపెట్టిందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా వ్యాఖ్యానించారు. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా, భండారీ మంచి మిత్రులని ఆరోపించారు. -
గప్పాలొద్దు, దోచుకుంది చాలదా?.. ఎలన్ మస్క్‌కు చురకలు
టాప్ బిలియనీర్ హోదా, స్పేస్ఎక్స్ ప్రయోగాలు, క్రిప్టో కరెన్సీ ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా సెన్సేషన్, టైమ్ పర్సన్ 2021 ఇయర్ ఘనత .. వెరసి నిత్యం వార్తల్లో నిలిచే సెలబ్రిటీగా పోయిన ఏడాది మొత్తాన్ని ఏలేశాడు ఎలన్ మస్క్. అఫ్కోర్స్.. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అయితే కిందటి ఏడాది చివర్లో ఆయన చేసిన ఓ ట్వీట్ రాజకీయ విమర్శలకు కారణమైంది. డిసెంబర్ 20వ తేదీన ఎలన్ మస్క్ తన ట్విటర్లో ఓ ట్వీట్ చేశాడు. ఏడాదిగానూ ఏకంగా 11 బిలియన్ డాలర్ల పన్ను చెల్లించబోతున్నట్లు ప్రకటించుకున్నాడు. దీంతో ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన వ్యక్తి చెల్లించే పన్ను గురించి ఆసక్తికర చర్చ నడించింది. అయితే ఈ ట్వీట్‌పై ఎలన్ మస్క్‌ను తిట్టిపోస్తున్నారు అమెరికా చట్టప్రతినిధులు. ఎలన్ మస్క్ సహా ధనవంతులెవరూ సరైన పన్నులు చెల్లించడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. For those wondering, I will pay over $11 billion in taxes this year — Elon Musk (@elonmusk) December 20, 2021 ఈ విమర్శలు చేసేవాళ్లలో ఇండో-అమెరికన్ కాంగ్రెస్ఉమెన్ ప్రమీలా జయపాల్ కూడా ఉన్నారు. ప్రమీలా యూఎస్ హౌజ్‌లో తొలి ఇండో-అమెరికన్ కాంగ్రెస్ ఉమెన్ కూడా. పన్నుల చెల్లింపుపై గొప్పలకు పోతున్నారా? అంటూ ఆమె ఎలన్ మస్క్‌ను నిలదీశారు. ‘పన్ను చెల్లింపు విషయంలో గప్పాలు కొట్టుకోవద్దు.. ఆ చెల్లించేది సరైన పన్నులు కావనేది అందరికీ తెలుసు’ అని ఆమె పేర్కొన్నారు. ఎలన్ మస్క్ ఒక్కరోజు సంపాదనే 36 బిలియన్ డాలర్లు. కానీ, 11 బిలియన్ డాలర్లు ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు గొప్పగా చెప్పుకుంటున్నారు. కేవలం కరోనా టైంలోనే 270 బిలియన్ డాలర్లు వెనకేసుకున్నాడు. ధనికులు తమ న్యాయమైన వాటాను చెల్లించే సమయం వచ్చేసింది’ అంటూ వ్యాఖ్యానించారామె. మరోవైపు రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రూజ్ కూడా ‘ఎలన్ మస్క్ దోపిడీ’ మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా చట్టప్రతినిధులకు, అమెరికాలోని బిలియనీర్లకు మధ్య ట్యాక్స్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. సక్రమంగా పన్నులు చెల్లించని బిలియనీర్ల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేసేందుకు ప్రత్యేక చట్టాల్ని రూపొందించింది బైడెన్ ప్రభుత్వం. దీని నుంచి తప్పించుకునేందుకు ఎలన్ మస్క్ సహా పలువురు టెక్ మేధావులు ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఇక 40.8 శాతం అత్యధిక పన్ను రేటుతో, 280 బిలియన్ డాలర్ల నికర విలువ సంపదన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన మస్క్, టెస్లా షేర్ల ద్వారా దాదాపు 10.7 బిలియన్ డాలర్ల ఫెడరల్ పన్ను బిల్లును చెల్లించాల్సి ఉంటుందని ప్రోపబ్లికా నివేదిక పేర్కొంది. అయితే మస్క్ సహా ఇతర బిలియనీర్లు 2018లో ఫెడరల్ ఆదాయపు పన్నులు చెల్లించలేదని ప్రోపబ్లికా దర్యాప్తు ఒక నివేదిక విడుదల చేసింది. 2014 మరియు 2018 మధ్య కాలంలో, మస్క్ తన సంపద $13.9 బిలియన్లు పెరిగినప్పటికీ, 1.52 బిలియన్ డాలర్ల ఆదాయంపై కేవలం 455 మిలియన్ల డాలర్ల పన్నులు చెల్లించాడు. చదవండి: పాపం ఎలన్ మస్క్..! తినడానికి తిండి లేని రోజుల్లో ఏం చేసేవాడో తెలుసా? -
విదేశీ మొబైల్ కంపెనీలు.. రూ.6,500 కోట్ల పన్ను ఎగవేత
న్యూఢిల్లీ: విదేశీ సంస్థల ఆధీనంలోని మొబైల్ కమ్యూనికేషన్, హ్యాండ్సెట్ తయారీ సంస్థల కార్యాలయాలు, వాటికి సంబంధించిన వ్యక్తుల నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో భారీగా పన్ను ఎగవేత జరిగిందని ఆదాయ పన్ను విభాగం గుర్తించింది. రూ. 6,500 కోట్ల పైచిలుకు లెక్కల్లో చూపని ఆదాయాన్ని గుర్తించినట్లు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. డిసెంబర్ 21న తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్ మొదలైన రాష్ట్రాల్లో ఆయా సంస్థల కార్యాలయాల్లో ఐటీ విభాగం సోదాలు నిర్వహించింది. రెండు పెద్ద కంపెనీలు.. విదేశాల్లోని తమ మాతృ సంస్థలకు ఏకంగా రూ. 5,500 కోట్ల పైచిలుకు మొత్తాన్ని రాయల్టీ మొదలైన రూపాల్లో చెల్లించాయని ఈ సోదాల్లో తేలినట్లు సీబీడీటీ పేర్కొంది. అయితే ఆ సంస్థల పేర్లు మాత్రం వెల్లడించలేదు. సందేహాస్పద సంస్థల నుంచి రూ. 5,000 కోట్ల పైచిలుకు రుణాలు చూపిన దేశీ విభాగాలు.. వాటిపై వడ్డీ వ్యయాలను కూడా క్లెయిమ్ చేసుకున్నాయని సీబీడీటీ పేర్కొంది. అలాగే అనుబంధ సంస్థల తరఫున చేసిన చెల్లింపులను ఎక్కువగా చేసి చూపించడం, భారత విభాగాల లాభాలను (పన్నులు వర్తించే) తక్కువ చేసి చూపించడం వంటి అవకతవకలకు పాల్పడ్డాయని తెలిపింది. ఈ తరహా నేరాలకు రూ. 1,000 కోట్ల పైగా జరిమానా విధించేందుకు ఆస్కారం ఉందని పేర్కొంది. చదవండి: క్రిప్టో లావాదేవీల్లో అక్రమాలు.. రూ. 49 కోట్ల ఫైన్.. -
ఐటీ దాడులు: పుష్ప రాజ్ అనుకొని.. పీయూష్ ఇంటికా?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ యూపీలో అత్తరు వ్యాపారుల మీద ఐటీ దాడుల పర్వం చర్చనీయాంశంగా మారింది. ఈమధ్యే కాన్పుర్‌కు చెందిన వ్యాపారి పీయూష్ జైన్ ఇంట్లో భారీ నోట్ల కట్టలు బయటపడిన విషయం తెలిసిందే. ఇది రాజకీయపరమైన విమర్శలకు దారితీసిన తరుణంలో.. మరో ఆసక్తికర పరిణామం ఇవాళ చోటు చేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ పుష్పరాజ్ అలియాస్ పంపీ జైన్ ఇంట్లో ఇవాళ(శుక్రవారం) ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పుష్పరాజ్ జైన్ ఈ మధ్యే సమాజ్‌వాదీ పార్టీ పేరిట ఓ ప్రత్యేక అత్తరును తయారు చేయించి.. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ చేతుల మీదుగా లాంచ్ చేయించాడు. ఈ క్రమంలో ఇవాళ జరిగిన దాడులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఐటీ అధికారులు ఉత్తప్రదేశ్‌లోని కన్నౌజ్, కాన్పూర్, దేశ రాజధాని ప్రాంతం, సూరత్, ముంబై, మరికొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఏకకాలంలో దాడులు చేశారు. అయితే ఈ దాడులపై సమాజ్‌వాదీ పార్టీ ట్విటర్లో స్పందిస్తూ.. బీజేపీ కేంద్ర ప్రభుత్వ సంస్థలను బహిరంగంగా దుర్వినియోగం చేస్తోంది. బీజేపీ చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. వారు తమ ఓట్ల ద్వారా సమాధానం చేబుతారు’అని పేర్కొంది. అత్తరు వ్యాపార సంస్థలు ఆదాయ పన్ను ఎగవేసినట్లు జీఎస్టీ నుంచి వివరాలు పొందిన తర్వాత ఐటీ అధికారులు దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఐటీ అధికారులు కాన్పూర్, కన్నౌజ్ ప్రాంతాల్లో మరో అత్తరు వ్యాపారి పీయూష్ జైన్‌పై దాడులు చేసి.. సుమారు రూ.196 కోట్ల నగదు, 23కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పీయూష్ జైన్ ఇంటిపై జీఎస్టీ అధికారుల దాడులు చేసిన సమయంలో పుష్పరాజ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే పేర్లు ఒకేలా ఉండటం వల్ల, ఇద్దరు అత్తరు వ్యాపారులే కావటంతో గందరగోళం తలెత్తినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే పీయూష్ జైన్ వ్యవహారంపై యూపీ పర్యటన సందర్భంగా స్వయానా ప్రధాని మోదీ, అమిత్ షాలు అఖిలేష్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే పుష్పరాజ్ జైన్ బదులు.. పీయూష్ జైన్ సమాజ్‌వాదీ పార్టీకి దగ్గర వ్యక్తని భావించి దాడులు చేసి ఉండొచ్చని అఖిలేష్ బీజేపీ విమర్శలను తిప్పి కొట్టారు కూడా. ఇది జరిగిన రెండు రోజులకే పుష్పరాజ్ ఇంటిపై ఐటీ దాడులు జరగడం గమనార్హం. -
చైనా మొబైల్ కంపెనీలకు షాక్! సోదాలు చేస్తోన్న ఐటీ శాఖ
న్యూఢిల్లీ: భారత మొబైల్ ఫోన్స్ పరిశ్రమలో దూకుడుగా ఉన్న చైనా కంపెనీలకు షాక్ తగిలింది. చైనాకు చెందిన ఒప్పో, షావొమీ, వన్‌ప్లస్ మొబైల్ కంపెనీల కార్యాలయాలు, ఉన్నతాధికారుల ఇళ్లపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తోంది. భారీ ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడ్డట్టు నిఘా విభాగం ఇచ్చిన సమాచారం ఆధారంగా తనిఖీలు జరుగుతున్నాయి. ఈ కంపెనీలపై చాలా కాలంగా ఐటీ నిఘా ఉన్నట్టు తెలుస్తోంది. కచ్చితమైన సమాచారంతోనే కంపెనీల సీఈవోలు, ఇతర ప్రతినిధులను ఐటీ అధికారులు విచారిస్తున్నారు. మంగళవారం నుంచి ఈ తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గ్రేటర్ నోయిడా, కోల్‌కత, గువాహటి, ఇందోర్‌తోపాటు పలు ప్రాంతాల్లో 24కుపైగా కార్యాలయాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఉత్పత్తుల సరఫరా, విక్రయం, ఆర్థిక సేవల్లో ఉన్న కొన్ని కంపెనీలూ ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. పన్ను ఎగవేసినట్టు నిరూపించే డిజిటల్ సమాచారాన్ని గుర్తించి, సీజ్ చేసినట్టు సమాచారం. ఐటీ అధికారులకు సహకరిస్తున్నట్టు ఒప్పో వెల్లడించింది. భారతీయ చట్టాలకు అనుగుణంగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నట్టు షావొమీ తెలిపింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో టెలికం పరికరాల విక్రయంలో ఉన్న చైనాకు చెందిన జడ్‌టీఈపైనా ఐటీ తనిఖీలు జరిగాయి. -
అయిదో రోజూ పెట్రో మంట
న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ధరలు వరుసగా అయిదో రోజు కూడా పెరిగాయి. ఆదివారం లీటరుపై పెట్రోల్, డీజిల్ ధరలు 35 పైసల చొప్పున పెరిగినట్లు ప్రభుత్వం రంగ ఇంధన సంస్థలు ప్రకటించాయి. తాజా పెంపుతో, లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.107.59కు, ముంబైలో రూ. 113.46కు చేరిందని తెలిపాయి. అదేవిధంగా లీటరు డీజిల్ ధర ముంబైలో రూ.104.38కి, ఢిల్లీలో రూ.96.32కు చేరింది. కాగా, పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు. ఈ పెరుగుదలను ప్రభుత్వం పాల్పడుతున్న పన్ను దోపిడీగా ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎక్కడైనా ఎన్నికలు జరిగితే కొంతయినా ఉపశమనం లభిస్తుందేమోనని వ్యాఖ్యానించారు. ప్రజలను ఇబ్బందుల పాలు చేయడంలో మోదీ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. దేశంలో తీవ్రస్థాయికి చేరిన నిరుద్యోగం, ప్రభుత్వ ఆస్తుల విక్రయాలు, పెట్రోల్ ధరల పెంపులో మోదీ ప్రభుత్వం రికార్డులు సాధించిందన్నారు. -
రూ. 20 కోట్ల పన్ను ఎగవేశారు
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సోనూసూద్, ఆయన భాగస్వాములు కలిపి 20 కోట్ల రూపాయలకు పైగా పన్నుని ఎగవేసినట్టు ఆదాయ పన్ను శాఖ తెలిపింది. గత మూడు రోజులుగా ముంబైలోని సోనూసూద్ నివాసం, కార్యాలయాలు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆయన భాగస్వాముల కార్యాలయాల్లో సోదాలు జరిపిన ఐటీ శాఖ ఆయన ఆర్థిక లావాదేవీలన్నీ పరిశీలించింది. 20 కోట్లకు పైగా ఆదాయ పన్ను ఎగ్గొట్టినట్టు గుర్తించామని శనివారం ఐటీ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఐటీ శాఖ వివరాల ప్రకారం... సోనూసూద్ లెక్కల్లో చూపించని ఆదాయాన్ని ఎన్నో బోగస్ సంస్థల నుంచి తనఖాలేని రుణాల రూపంలో తీసుకున్నారు. ఈ నిధులతో పెట్టుబడులు పెట్టడం, ఆస్తులు సమకూర్చుకోవడం వంటివి చేశారు. అంతేకాదు సోనూసూద్ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సిఆర్ఏ) కింద నిబంధనలకు వ్యతిరేకంగా విదేశీ దాతల నుంచి క్రౌడ్ ఫండింగ్ ద్వారా 2.1 కోట్లు సేకరించారు. కరోనా ఫస్ట్ వేవ్‌లో ఏర్పాటు చేసిన సూద్ ఛారిటీ ఫౌండేషన్‌కి ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ఇప్పటివరకు రూ.18.94 కోట్ల విరాళాలు అందగా.. సోనూసూద్ వాటిలో 1.9 కోట్లు మాత్రమే సహాయ కార్యక్రమాలకు వెచి్చంచారు. మిగిలిన డబ్బంతా ఆ ఖాతాలోనే ఉంది. మరోవైపు సోనూసూద్‌కు చెందిన కంపెనీ ఇటీవల లక్నోకి చెందిన ఒక రియల్ ఎస్టేట్ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకుని సంయుక్తంగా ప్రాజెక్టులు మొదలు పెట్టింది. ఇప్పుడు ఐటీ శాఖ ఆ ఒప్పందాలు, ప్రాజెక్టులపై దృష్టి సారించింది. లక్నో సంస్థ బోగస్ బిల్లులు, సంస్థల ద్వారా నిధులు మళ్లించినట్టుగా ఐటీ వర్గాలు ఆరోపించాయి. అలా 65 కోట్లకు పైగా నిధులు బోగస్ కంపెనీలకు దారి మళ్లినట్టుగా అనుమానిస్తున్నారు. ఇక సోదాల సమయంలో సోనూసూద్ వద్ద నుంచి రూ.1.8 కోట్లు స్వా«దీనం చేసుకున్నట్టుగా ఆదాయపన్ను శాఖ తెలిపింది. -
సోనూసూద్‌పై ఐటీ దాడులు మరింత ఉధృతం
ముంబై: పన్ను ఎగవేత ఆరోపణలకు సంబంధించి బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌పై ఆదాయ పన్ను శాఖ దాడుల్ని మరింత ఉధృతం చేసింది. ముంబైలోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఏకకాంలో శుక్రవారం దాడులు చేసినట్టుగా ఐటీ వర్గాలు వెల్లడించాయి. సోనూ సూద్‌కు చెందిన మరిన్ని నివాసాలపై వరసగా మూడో రోజు దాడులు కొనసాగిస్తున్నట్టుగా తెలిపాయి. రియల్ ఎస్టేట్‌కు చెందిన ఒక ఒప్పందం, మరికొన్ని ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టినట్టు వివరించాయి. కరోనా సంక్షోభ సమయంలో వలసదారుల్ని తమ స్వగ్రామాలకు సురక్షితంగా చేర్చడంలో ఎంతో సాయం చేసిన సోనూ సూద్ లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ఇటీవల ఢిల్లీ సీఎం కేజ్రివాల్ సోనూని ఆప్ పార్టీ తరపున దేశ్ కా మెంటర్‌గా నియమించారు. ఇప్పుడు ఆయనపై ఐటీ శాఖ చేస్తున్న దాడులకి రాజకీయ పరమైన కారణాలున్నాయనే విమర్శలు వస్తున్నాయి. -
అధికారుల పైత్యం: రూ. కోటి పన్ను చెల్లించలేదంటూ దినసరి కూలీకి
చెన్నై: వేల కోట్ల రూపాయల పన్ను ఎగవేతదారులను ఏం చేయలేని అధికారులు.. అసలు పన్నంటే ఏంటో తెలియని సామాన్యులపై ప్రతాపం చూపిస్తారు. వేల కోట్ల రూపాయలు పన్ను ఎగవేశారంటూ.. సామాన్యులకు నోటీసులు పంపి వారిని ఇబ్బందులకు గురి చేస్తారు. తాజాగా తమిళనాడులో ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. దినసరి కూలీగా పని చేసుకుంటున్న మహిళ ఏకంగా కోటి రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడిందంటూ ఐటీ అధికారులు ఆమె ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కానీ మహిళ షాక్‌లో ఉండి పోయింది. ఆ తర్వాత విషయం అర్థం చేసుకుని.. తమ పరిస్థితి వివరించడంతో అధికారులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. కానీ ఈ విషయం ఊరంతా పాకడంతో పాపం సదరు మహిళను కూలీకి రావద్దోని ఆదేశించారు ఆమె పని చేసే షూ కంపెనీ అధికారులు. దాంతో అధికారుల తీరుపై మండి పడుతోంది సదరు మహిళ. ఆ వివరాలు.. తిరుపత్తూరు జిల్లాలోని ఆంబూర్ మెల్మిట్టలం గ్రామానికి చెందిన జి. క్రిష్ణవేణి(41) అనే మహిళ ఆ ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో దినసరి కూలీగా పని చేసుకుంటూ జీవిస్తుండేది. (చదవండి: తమిళనాడులో ఉగ్రవాదులు.. హై అలర్ట్) ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం కొందరు ఐటీ అధికారులు క్రిష్ణవేణి ఇంటికి వచ్చారు. ఆమె కోటి రూపాయలు పన్ను ఎగవేతకు పాల్పడిందని తెలిపారు. అధికారుల మాటలు విన్న క్రిష్ణవేణితో పాటు గ్రామస్తులు కూడా ఆశ్చర్యపోయారు. దినసరి కూలీ అంత భారీ మొత్తంలో ప్రభుత్వాన్ని మోసం చేయడం ఏంటని గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. (చదవండి: మనీషాయే దిక్కు.. ‘తమిళనాడు థెరిస్సా’) అందుకు అధికారులు తమ రికార్డుల ప్రకారం క్రిష్ణవేణి చెన్నై తాంబ్రంలో స్క్రాప్ లోహాలను విక్రయించే గిడ్డంగికి యాజమానురాలని.. అంతేకాక ఓ లేదర్ కంపెనీని కూడా నడుపుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో క్రిష్ణవేణి కోటి రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడిందని ఆరోపించారు. ఈ మాటలు విన్న క్రిష్ణవేణి, ఆమె భర్త ఆశ్చర్యపోయారు. అసలు తాంబ్రం ఎక్కడ ఉంటుందో తమకు తెలియదన్నారు. అంతేకాక అనారోగ్య సమస్యల వల్ల ఒకటి రెండు సార్లు చెన్నై వెళ్లినట్లు తెలిపారు. తమకు ఎలాంటి వ్యాపారాలు లేవని స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తిందని తెలుసుకున్న అధికారులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇక కొసమెరుపు ఏంటంటే అధికారులు ఇలా రావడంతో షూ ఫ్యాక్టరీ అధికారులు క్రిష్ణవేణి పనుల నుంచి తొలగించారు. దాంతో అధికారుల పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది క్రిష్ణవేణి. -
హైదరాబాద్: 11 హై ఎండ్ లగ్జరీకార్లు సీజ్
-
హైదరాబాద్‌లో 11 హై ఎండ్ లగ్జరీకార్లు సీజ్, ఇదే తొలిసారి
సాక్షి, హైదరాబాద్: పన్ను ఎగవేసి తిరుగుతున్న హై ఎండ్ లగ్జరీ కార్లపై ఆర్టీఏ కొరడా ఝుళిపించింది. రవాణ శాఖ అధికారులు ఆదివారం ఆకస్మిక దాడులు చేసి 11 వాహనాలను సీజ్ చేశారు. వివరాలు... డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ కె.పాపారావు నేతృత్వంలో మోటారు వాహన తనిఖీ అధికారులు, సహాయ మోటారు వాహన తనిఖీ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రర్ అయిన ఈ లగ్జరీ కార్లు రవాణా శాఖకు జీవితకాల పన్ను చెల్లించకుండా హైదరాబాద్‌లో తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆర్నెల్లుగా ఇలాంటి వాహనాలపై పక్కా నిఘా పెట్టి పథకం ప్రకారం దాడులు నిర్వహించి 11 కార్లను సీజ్ చేశారు. జఫ్తు చేసిన వాహనాల నుంచి జీవితకాల పన్ను రూపంలో రూ.5 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశంఉంది. సీజ్ చేసిన వాటిలో మెర్సెడస్ బెంజ్, మాసరట్టి, పెర్రారి, రోల్స్ రాయిస్, బీఎండబ్ల్యూ, లాంబోర్గీని తదితర ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. హై ఎండ్ వాహనాలపై దాడులు నిర్వహించడం ఆర్టీఏ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి కావడం గమనార్హం. -
పన్ను ఎగవేత ఆరోపణలు: శాంసంగ్‌కు షాక్!
సాక్షి,\న్యూఢిల్లీ: దక్షిణ కొరియా సంస్థ శాంసంగ్ చిక్కుల్లో పడింది. పన్ను ఎగవేత ఆరోపణలతో శాంసంగ్ కార్యాలయాలలో అధికారులు దాడులు నిర్వహించారు. కస్టమ్స్ సుంకం ఎగవేత ఆరోపణలపై ఆధారాలను సేకరించేందుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. కానీ దీనికి సంబంధించిన ఆధారాలు లభించాయా లేదా అనే దానిపై స్పష్టత లేదు. నెట్ వర్కింగ్ కార్యకలాపాలు నిర్వహించే న్యూఢిల్లీ, ముంబైలోని శాంసంగ్ ఆఫీసులపై డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇటీవలే శాంసంగ్ కంపెనీ నెట్ వర్క్ పరికరాలను అక్రమంగా దిగుమతి దిగుమతి చేసుకుందనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. దక్షిణ కొరియాతో పాటు, వియత్నాంలో తయారు చేసిన టెలికం పరికరాలు, ఇతర ఉత్పత్తులపై స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) కింద సంస్థకు కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు ఉంది. అందులో భాగంగా టెలికం సేవలు, నెక్ట్స్ జెన్ వైర్ లెస్ నెట్ వర్క్ ల డెవలప్ మెంట్, ఆధునికీకరణ, విస్తరణ వంటి విషయాల్లో పరస్పర సహకారం కోసం భారత్, దక్షిణ కొరియాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అయితే ఎఫ్‌టిఎయేతర దేశంలో తయారన పరికరాలను దక్షిణ కొరియా లేదా వియత్నాం గుండా తరలించిందనేది ప్రభుత్వానికి అందిన విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో సోదాలు అధికారులు సోదాలు నిర్వహించారు. ఇదే నిజమని తేలితే సరఫరా చేసిన సంబంధిత పరికరాలపై కస్టమ్స్ సుంకం విధించవచ్చు. మరోవైపు డీఆర్ఐఅధికారులు సోదాలపై శాంసంగ్ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు.వాల్యూమ్ పరంగా దేశంలో అతిపెద్ద 4జీ విక్రయ సంస్థ శాంసంగ్. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు ప్రత్యేకమైన 4 జీ పరికరాల ప్రొవైడర్‌గా శాంసంగ్ ఉంది. -
ఆ కుబేరుడి కలలు కల్లలేనా?
టోక్యో: జపాన్‌కు చెందిన అపర కుబేరుడు, ఫ్యాషన్ దిగ్గజం యుసాకు మేజావా(45) మరోసారి వార్తల్లో నిలిచారు. స్పేస్-ఎక్స్ సంస్థ తొలి అంతరిక్ష పర్యాటక యాత్రకు వెళ్లే మొట్టమొదటి వ్యక్తిగా నిలవనున్న యుసాకు ఇపుడు ఇబ్బందుల్లో పడినట్టు తెలుస్తోంది. పన్ను ఎగవేత ఆరోపణల కారణంగా ఆయన ఈ యాత్ర నుంచి తప్పుకునే అవకాశం ఉందని జపాన్ మీడియా నివేదించింది. సుమారు 4.6 మిలియన్ డాలర్ల పన్నులను ఎగవేసినందుకు ఆయనపై దర్యాప్తు జరుగుతోందని కథనాలు ప్రచురించాయి. గత మూడు సంవత్సరాల కాలంగా తన ఆస్తి నిర్వహణా సంస్థ యాజమాన్యంలోని కార్పొరేట్ జెట్ వ్యక్తిగత వినియోగానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించడంలో మేజావా విఫలమయ్యారని పేర్కొన్నాయి. ఆన్లైన్ రిటైలర్, జోజోటౌన్ వ్యవస్థాపకుడు యుసాకు మేజావా జపాన్ మీడియా నివేదికలపై ట్విటర్ ద్వారా స్పందించారు. మనశ్శాంతిగా జీవించగలిగే దేశంలో తాను నివసించాలని కోరుకుంటున్నాననీ, అలాగే తమ వ్యాపార రహస్యాలు వ్యక్తిగత మీడియాకు అధికారులు లీక్ చేయకుండా భద్రంగా ఉంచాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. అంతేకాదు ఎక్కడికీ పారిపోను, దాక్కోను, తన పన్నులను ఎలా నిర్వహించాలో దయచేసి సెలవివ్వాలంటూ సెటైర్లు వేశారు. తన పేరును కూడా సరిగా రాయలేక పోయారంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు జపాన్ జాతీయ పన్ను ఏజెన్సీ దీనిపై స్పందించడానికి నిరాకరించింది. కాగా ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో స్పేస్ఎక్స్ రాకెట్లో ఈ అంతరిక్షయాత్రను 2023లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే,1972 అనంతరం సాధారణ పౌరులు చంద్రుని మీదకు వెళ్లడం అదే మొదటిసారి అవుతుంది. అలాగే గత ఏడాది తన ట్వీట్ ఒక దానిని షేర్ చేసిన వెయ్యిమందికి ఒక్కొక్కరికి 10 లక్షల యెన్లు పంచుతానని ప్రకటించారు. దీంతోపాటు ఈ జాబిల్లి యాత్ర అనుభవాన్ని ఒక ''విశిష్ట'' మహిళతో పంచుకోవాలని తాను కోరుకుంటున్నట్లు యుసాకు ఆన్లైన్లో ఈ ఏడాది ఆరంభంలో ప్రకటించడం విశేషంగా నిలిచింది. చదవండి : నాకో ప్రేయసి కావాలి...జపాన్ కుబేరుడు జపాన్ కుబేరుడు సంచలన నిర్ణయం -
విదేశీ సైట్లలో కొంటే బాదుడే..!
న్యూఢిల్లీ: విదేశీ ఈ–కామర్స్ సైట్లలో జరిపే కొనుగోళ్లు ఇకపై భారం కానున్నాయి. ఈ షాపింగ్ పోర్టల్స్‌లో లావాదేవీల్లో సుంకాలు, పన్నుల ఎగవేత ఉదంతాలు చోటు చేసుకుంటుండటంపై కేంద్రం మరింతగా దృష్టి సారించడమే ఇందుకు కారణం. సీమాంతర లావాదేవీలపై ప్రీ–పెయిడ్ విధానంలో కస్టమ్స్ సుంకాలు, పన్నులను వడ్డించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విధానం అమల్లోకి వచ్చిన పక్షంలో విదేశీ ఆన్లైన్ షాపింగ్ సైట్ల ద్వారా జరిపే కొనుగోళ్లు దాదాపు 50% మేర భారం కాగలవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఏం జరుగుతోందంటే... భారతీయులకు విదేశాల నుంచి వచ్చే గిఫ్టుల విలువ రూ. 5,000 దాకా ఉన్న పక్షంలో పన్నుల భారం ఉండదు. దీన్ని ఆసరాగా చేసుకుని పలు చైనీస్ ఈ–కామర్స్ వెబ్సైట్లు .. ఇక్కడివారు కొనుగోలు చేసిన ఉత్పత్తులను బహుమతుల పేరిట ఎగుమతి చేస్తున్నాయి. తద్వారా సుంకాలు, పన్నుల ఎగవేత జరుగుతోంది. పలు ఉత్పత్తులపై భారీగా ఉండే సుంకాల భారం తగ్గడం వల్ల దేశీ ఈ–కామర్స్ పోర్టల్స్‌తో పోలిస్తే విదేశీ షాపింగ్ పోర్టల్స్‌లో కొనే ఉత్పత్తులు దాదాపు 40 శాతం చౌకగా లభిస్తున్నాయి. ఇలా విదేశీ ఈ–కామర్స్ సంస్థలు వ్యాపార లావాదేవీల కోసం గిఫ్ట్ విధానాన్ని దుర్వినియోగం చేస్తుండటం వల్ల దేశీ ఈ–కామర్స్ సంస్థలకు నష్టం జరుగుతోందని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం లోకల్‌సర్కిల్స్ చైర్మన్ సచిన్ తపారియా తెలిపారు. కస్టమ్స్ సుంకాలు, వస్తు–సేవల పన్ను (జీఎస్టీ) ఎగవేత జరుగుతున్న ఇలాంటి లావాదేవీలను గతేడాది.. కస్టమ్స్ డిపార్ట్మెంట్ మరింత లోతుగా పరిశీలించింది. గిఫ్టుల రూపంలో వచ్చే దిగుమతులపై ముంబై కస్టమ్స్ విభాగం నిషేధం విధించింది. దీంతో ఈ తరహా కొనుగోళ్లు సుమారు 60 శాతం దాకా పడిపోయాయి. కీలకమైన ఔషధాలు, రాఖీలు మినహా గిఫ్ట్ మార్గంలో విదేశీ ఈ–కామర్స్ సైట్ల నుంచి వచ్చే ప్యాకేజీలన్నింటిపైనా నిషేధం విధిస్తూ విదేశీ వాణిజ్య విధానంలో కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. కొత్త విధానం ఇలా.. తాజాగా విదేశీ షాపింగ్ పోర్టల్స్ ద్వారా జరిగే కొనుగోళ్లపై సుంకాలు, పన్నులు విధించే అంశంపై కేంద్రం .. లోకల్‌సర్కిల్స్ వంటి సంబంధిత వర్గాల అభిప్రాయాలు సేకరిస్తోంది. ఈ విధానం ప్రకారం కస్టమ్స్ విభాగం సొంత పేమెంట్ ఇంటర్ఫేస్ను వినియోగంలోకి తెస్తుంది. చైనా తదితర విదేశీ ఈ–కామర్స్ సంస్థలు.. భారత కస్టమర్ల నుంచి సుంకాలు, పన్నులు వసూలు చేసి ఈ ఐటీ సిస్టమ్ ద్వారా భారత ప్రభుత్వానికి చెల్లిస్తాయి. లావాదేవీ వివరాలు సమర్పించి, ప్రీపెయిడ్ సుంకాలను చెల్లించిన తర్వాత.. ఆయా ఈ–కామర్స్ సంస్థలకు రసీదు, లావా దేవీ రిఫరెన్స్ నంబరు లభిస్తుంది. ఈ ప్రక్రి య పూర్తయిన తర్వాతే ఉత్పత్తుల డెలివరీకి వీలవుతుంది. ప్రత్యామ్నాయంగా సదరు విదేశీ ఈ–కామర్స్ సంస్థకు భారత్‌లో ఉన్న భాగస్వామ్య సంస్థ అయినా సంబంధిత పన్నులు చెల్లిస్తే లావాదేవీకి ఆమోదముద్ర లభిస్తుంది. ఇలాంటి ప్రీ–పెయిడ్ మోడల్‌తో కస్టమర్లు, విదేశీ సరఫరాదారుల మధ్య లావాదేవీలపై పారదర్శకత పెరుగుతుందని లోకల్‌సర్కిల్స్ చైర్మన్ సచిన్ తపారియా తెలిపారు. -
యాంకర్ అనసూయకు పన్ను సెగ
హైదరాబాద్: టీవీ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ సర్వీసు ట్యాక్స్ బకాయి రూ. 55 లక్షలు చెల్లించాల్సి ఉందని జీఎస్టీ అధికారులు తెలిపారు. అనసూయ మొత్తం రూ. 80 లక్షల సేవ పన్ను చెల్లించాల్సి ఉండగా ఆమె కేవలం రూ. 25 లక్షలు మాత్రమే చెల్లించారన్నారు. జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ జనరల్, అదనపు డైరెక్టర్ జనరల్ బాలాజీ మజుందార్ తెలిపిన వివరాల ప్రకారం.. అనసూయ గతంలో రూ. 35 లక్షలు సర్వీసు టాక్స్ చెల్లించాల్సి ఉంది. అయితే సరైన సమయంలో చెల్లించని కారణంగా దీనికి వడ్డీ రూ. 15 లక్షలు జత కలిసింది. పెనాల్టీతో కలిపి మొత్తం పన్ను రూ. 80 లక్షల పన్ను చెల్లించాల్సి ఉండగా ఆమె కేవలం రూ. 25 లక్షలు మాత్రమే చెల్లించారని ఆయన పేర్కొన్నారు. మిగతా బకాయి ఇప్పటివరకు చెల్లించలేదని, ఈ మేరకు అనసూయకు నోటీసులు కూడా పంపినట్లు ఆయన వెల్లడించారు. అయితే దీనిపై అనసూయ స్పందిస్తూ... ‘సర్వీసు పన్ను చెల్లించాలని ఈ ఏడాది మే నెలలో జీఎస్టీ అధికారులు అడిగారు. జీఎస్టీ అమల్లోకి రాకముందు అంటే 2013- 2014కు చెందిన పన్నులన్నీ చెల్లించాను. జీఎస్టీ చట్టంపై అవగాహన లేని కారణంగా సంబంధిత పన్ను చెల్లించలేకపోయాను. నిర్ణీత సమయంలో ప్రిన్సిపల్ అమౌంట్ చెల్లించాను కనుక జరిమానా, వడ్డీ పడదని అనుకున్నాను. మే నెలలో మా ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించిన మాట వాస్తవమే. నా వృత్తికి సంబంధించిన కాంట్రాక్టు కాగితాలను తీసుకున్నారు తప్పా, వారికి ఎటువంటి నగదు లభించలేదు. అధికారులు నాకు నోటీసులు ఇవ్వలేద’ని ఆమె స్పష్టం చేశారు. (జీఎస్టీ సోదాలు.. స్పందించిన సుమ, అనసూయ) -
లెక్కలు చూపని రూ. 700 కోట్ల గుర్తింపు
చెన్నై : తమిళనాడుకు చెందిన రెండు మద్యం కంపెనీలపై ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో లెక్కలు చూపని రూ. 700 కోట్లను అధికారులు గుర్తించారు. అలాగే ఆ రెండు సంస్థల కార్యకలాపాలను స్తంభింపచేశారు. తొలుత బీర్, ఐఎంఎఫ్ఎల్ తయారు చేస్తున్న ఓ ప్రముఖ సంస్థ భారీగా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్టు నిఘా వర్గాల నుంచి ఐటీ అధికారులకు సమచారం అందింది. ఈ మేరకు రంగంలోకి దిగిన అధికారులు ఈ నెల 6వ తేదీ ఉదయం సోదాలు ప్రారంభించారు. ఆ సంస్థకు చెందిన కార్యాలయాలతోపాటు, ప్రమోటర్లు, కీలక వ్యక్తుల ఇళ్లపై అధికారులు దాడులు చేశారు. తమిళనాడు, గోవా, ఆంధ్రప్రదేశ్, కేరళలో మొత్తం 55 చోట్ల ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో పన్ను ఎగవేతకు సంబంధించి అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. గత ఆరేళ్లుగా పన్ను చెల్లించని రూ. 400 కోట్ల ఆదాయాన్ని అధికారులు గుర్తించారు. అయితే ఈ సోదాలు చేపడుతున్న క్రమంలో.. ఇదే రంగానికి చెందిన మరో సంస్థ కూడా భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్టుగా తెలిసింది. దీంతో ఈ నెల 9 తేదీన సదురు సంస్థ కార్యాలయాలతోపాటు కీలక వ్యక్తుల ఇళ్లపై దాడులు చేపట్టారు. మొత్తంగా చెన్నై, కరైకల్‌లోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఆ సంస్థ దాదాపు ఆ సంస్థ రూ. 300 కోట్ల ఆదాయానికి పన్ను చెల్లించలేదని గుర్తించారు. అయితే ఆ సంస్థల పేరు మాత్రం ఐటీ అధికారులు వెల్లడించలేదు. -
ఎగవేతదారులను వదలొద్దు
న్యూఢిల్లీ: వ్యవస్థలో లొసుగులను అడ్డం పెట్టుకుని పన్నులను ఎగవేయాలనుకునే వారితో కఠినంగా వ్యవహరించాలని ఆదాయ పన్ను శాఖ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. అయితే, నిజాయతీగా కట్టాలనుకునేవారికి అవసరమైన తోడ్పాటునిచ్చి, తగిన విధంగా గౌరవించాలని పేర్కొన్నారు. 159వ ఆదాయపు పన్ను దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. ఎగవేతదారులను పట్టుకునేందుకు రెవెన్యూ శాఖలోని మూడు కీలక విభాగాలు (ఆదాయపు పన్ను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) పరస్పరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని సూచించారు. ‘తప్పు ఎక్కడ జరుగుతోందో తెలుసుకునేందుకు మీ దగ్గర డేటా మైనింగ్, బిగ్ డేటా విశ్లేషణ వంటి సాధనాలు ఉన్నాయి. ఎగవేయాలనుకునే వారితో కఠినంగా వ్యవహరించండి. అలాంటి విషయాల్లో మీకు నా పూర్తి మద్దతు ఉంటుంది‘ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. సంపన్నులపై అధిక పన్ను భారం అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. పన్నులు చెల్లించడాన్ని ప్రజలు జాతి నిర్మాణంలో తమ వంతు కర్తవ్యంగా భావించాలే తప్ప జరిమానాగా అనుకోరాదని మంత్రి చెప్పారు. ‘ఎక్కువ సంపాదిస్తున్న వారిని శిక్షించాలన్నది మా ఉద్దేశం కాదు. ఆదాయాలు, వనరులను మరింత మెరుగ్గా పంచడానికి ఈ పన్నులు అవసరం. అత్యధికంగా ఆదాయాలు ఆర్జించే వర్గాలు కొంత మేర సామాన్యుల అభ్యున్నతికి కూడా తోడ్పాటు అందించాలన్నదే లక్ష్యం. ఈ భావాన్ని అర్థం చేసుకుంటే చాలు.. ఇన్‌కం ట్యాక్స్ విభాగమంటే భయం ఉండదు‘ అని ఆమె తెలిపారు. సులభసాధ్యమైన లక్ష్యం.. 2019–20లో నిర్దేశించుకున్న రూ. 13.35 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యం సులభసాధ్యమైనదేనని నిర్మలా సీతారామన్ చెప్పారు.‘గడిచిన అయిదేళ్లలో పన్ను చెల్లింపుదారుల సంఖ్యను రెట్టింపు స్థాయికి చేర్చగలిగాం. అలాంటప్పుడు పన్ను వసూళ్లను రూ. 11.8 లక్షల కోట్ల నుంచి కాస్త ఎక్కువగా రూ. 13 లక్షల కోట్లకు పెంచుకోవడం పెద్ద కష్టం కానే కాదు. సాధించతగిన లక్ష్యాన్నే మీకు నిర్దేశించడం జరిగింది‘ అని ఆమె వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యించినట్లుగా పన్ను చెల్లింపుదారుల సంఖ్యను ప్రస్తుతమున్న 7 కోట్ల నుంచి 8 కోట్లకు పెంచే దిశగా కృషి చేయాలని చెప్పారు. ఆహ్లాదకర వ్యవహారంగా ఉండాలి.. పన్ను చెల్లింపు ప్రక్రియ అంటే భయం కోల్పేదిగా కాకుండా ఆహ్లాదకరమైన వ్యవహారంగా ఉండే పరిస్థితులు కల్పించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ ప్రమోద్ చంద్ర మోదీ చెప్పారు. పన్ను వసూళ్లు పారదర్శకమైన, సముచిత రీతిలో జరిగేట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు చూడాలని ఆయన సూచించారు. 1960–61 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ. 13 లక్షలుగా ఉన్న ప్రత్యక్ష పన్ను వసూళ్లను గత ఆర్థిక సంవత్సరం (2018–19)లో రూ.11.37 లక్షల కోట్ల స్థాయికి చేర్చడంలో ఆదాయపు పన్ను శాఖ సిబ్బంది చేసిన కృషి అభినందనీయమని మోదీ చెప్పారు. -
జెట్ ఎయిర్వేస్: మరో షాకింగ్ న్యూస్
సాక్షి, ముంబై : అప్పుల ఊబిలో కూరుకు పోయి కార్యకలాపాలను నిలిపివేసిన ప్రయివేటు రంగవిమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. కంపెనీలో అక్రమాలకు పాల్పడినట్లుగా జెట్ ఎయిర్వేస్ వ్యవస్థపాకుడు నరేష్ గోయల్ మీద తొలిసారిగా ఆరోపణలు వచ్చాయి. భారీ పన్ను ఎగవేత ఆరోపణలతో ఆదాయ పన్ను శాఖ ఆయనకు సమన్లు జారీ చేసింది. రూ. 650 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించి ఐటీ శాఖ నరేష్ గోయల్‌ను ప్రశ్నించబోతోందని తాజా మీడియా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. పన్నులు ఎగవేసేందుకు నరేష్ గోయల్ దుబాయ్‌లోని దాని గ్రూప్ కంపెనీతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డంతోపాటు, ఇందుకు దుబాయ్ కంపెనీకి కమిషన్ ముట్టినట్టుగా అసెస్మెంట్ వింగ్ దర్యాప్తులో తేలింది. దీంతో దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా నరేష్ గోయల్‌ను ఆదేశించింది. త్రైమాసిక ఫలితాలను ప్రకటించడంలో ఆలస్యం చేస్తున్న సమయంలో ఈ సర్వే జరిగిందని ఆదాయపు పన్ను అధికారి చెప్పారు. పన్నులు ఎగవేసేందుకు విదేశాలకు నిధులను మళ్లించాలనే ఉద్దేశ్యంతో చేసిన అధిక చెల్లింపులు అనే కోణంలో అసెస్మెంట్ వింగ్ విచారణ అనంతరం, మరింత వివరణ కోరేందుకు ఆయన్ను పిలిపించనున్నట్టు మరో అధికారి అందించిన సమాచారం ద్వారా తెలుస్తోంది. అయితే తాజా పరిణామాలపై అధికారిక స్పందన రావాల్సి ఉంది. కాగా 2018 సెప్టెంబర్‌లో జెట్ ముంబై కార్యాలయాంలో దాడులు, కొన్నికీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దీనిపై దర్యాప్తు ఫిబ్రవరిలో పూర్తయింది. అయితే ఫిబ్రవరిలో వెలువడిన ఈ నివేదికపై స్పందించిన జెట్‌ఎయిర్‌వేస్ అవకతవకల ఆరోపణలను ఖండించింది. లావాదేవీలన్నీచట్ట ప్రకారం, నియంత్రణ, కార్పొరేట్ పాలన అవసరాలకు లోబడే ఉన్నాయంటూ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
ఏడాదిన్నరలో రూ 50,000 కోట్ల పన్ను ఎగవేత..
సాక్షి, న్యూఢిల్లీ : గత ఏడాదిన్నరలో దేశవ్యాప్తంగా రూ 50,000 కోట్ల మేర పన్ను ఎగవేతలను కేంద్ర పరోక్ష పన్నుల విభాగం (సీబీఐసీ) గుర్తించింది. మొత్తం పన్ను ఎగవేతలో పది శాతం వరకూ జీఎస్టీ వసూళ్లున్నాయని పేర్కొంది. జులై 2017-18 మధ్య నమోదైన 604 కేసుల్లో రూ 4441 కోట్ల జీఎస్టీ ఎగవేతను అధికారులు కనుగొన్నారని సీబీఐసీ పర్యవేక్షణలో పనిచేసే జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ (డీజీజీఐ) డేటా వెల్లడించింది. ఇక పన్ను ఎగవేతల్లో రూ 39,047 కోట్లు సర్వీస్ ట్యాక్స్ ఎగవేతలు కాగా, రూ 6,621 కోట్ల సెంట్రల్ ఎక్సైజ్ ఎగవేతలున్నాయని సీబీఐసీ గుర్తించింది. జీఎస్టీ అమలుకాక ముందు పన్ను ఎగవేతలు అధికంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. జీఎస్టీ హయాంలో పన్ను వసూళ్ల రేటు పుంజుకుందని, గుర్తించిన పన్ను ఎగవేతల్లో 57 శాతం రికవరీ రేటు సాధించామని పేర్కొన్నారు. ఈ ఏడాది నమోదైన పాత కేసుల్లో రికవరీ కేవలం 9 శాతంగానే ఉందని చెప్పారు. -
రాఘవ్ బాహల్ ఇంట్లో ఐటీ సోదాలు
న్యూఢిల్లీ: పన్ను ఎగవేత కేసుకు సంబంధించి మీడియా అధిపతి రాఘవ్ బాహల్ నివాసం, కార్యాలయంపై గురువారం ఆదాయ పన్ను(ఐటీ) శాఖ దాడులు జరిపింది. నకిలీ లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్(ఎల్టీసీజీ) పత్రాల కేసులో నోయిడాలోని రాఘవ్ బాహల్ నివాసంతోపాటు, క్వింట్ న్యూస్ పోర్టల్ కార్యాలయంపై గురువారం తమ అధికారులు సోదాలు చేపట్టినట్లు ఐటీ శాఖ తెలిపింది. ఇదే కేసులో జె.లల్వానీ, అనూప్ జైన్, అభిమన్యు అనే అధికారుల కార్యాలయాల్లోనూ సోదాలు చేపట్టారు. వీరితో వ్యాపార లావాదేవీలు జరిపిన ఇతర దేశాల్లోని సంస్థలపైనా తమ విచారణ కొనసాగుతుందని ఐటీ శాఖ పేర్కొంది. తనిఖీల సమయంలో ముంబైలో ఉన్న రాఘవ్ బాహల్ ట్విట్టర్లో స్పందిస్తూ..‘మా సంస్థ అన్ని పన్నులను చెల్లిస్తోంది. అవసరమైన అన్ని పత్రాలను అధికారులకు అందుబాటులో ఉంచుతాం. సోదాల్లో పాలుపంచుకుంటున్న యాదవ్ అనే పేరున్న ఐటీ అధికారితో ఫోన్లో మాట్లాడా. పాత్రికేయ సంబంధ కీలక పత్రాలు, మెయిళ్లు, ఇతర వస్తువులను చూడటం, తీసుకువెళ్లడం, ఫొటోలు తీయడం వంటివి చేయరాదని కోరాను. అలా చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించా’అని పేర్కొన్నారు. ఎడిటర్స్ గిల్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు కూడా అయిన రాఘవ్ బాహల్ ది క్వింట్ న్యూస్ పోర్టల్‌తోపాటు నెట్వర్క్18 గ్రూప్‌ల వ్యవస్థాపకుడు. రాఘవ్ బాహల్ నివాసం, కార్యాలయాలపై ఐటీ దాడులను ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఖండించింది. ‘ప్రేరేపిత’ ఐటీ దాడులు మీడియా స్వేచ్ఛకు భంగకరమనీ, ఇటువంటి చర్యలను ప్రభుత్వం మానుకోవాలని కోరింది. -
ఫంక్షన్ హాళ్లు, కోచింగ్ సెంటర్ల ఇష్టారాజ్యం
సాక్షి, హైదరాబాద్: నగరవాసులకు వివిధ వాణిజ్య పరమైన సేవలు అందిస్తున్న సర్వీస్ కేంద్రాలు బాహాటంగా సేవాపన్ను ఎగవేతకు పాల్పడుతున్నాయి. ఖాతాదారులు, వినియోగదారుల నుంచి ఇష్టారాజ్యంగా వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్న వీరు ప్రభుత్వ ఖజానాకు నయాపైసా చెల్లించడం లేదు. కొన్ని సంస్ధలు స్లాబ్ పేరుతో చేతివాటం ప్రదర్శిస్తుండగా, మరికొన్ని పూర్తిగా ఎగవేతకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య పన్నుల శాఖాధికారుల ఉదాసిన వైఖరి, అవినీతి కారణంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున సేవా పన్నును నష్టపోతుంది. సేవా పన్ను వసూలపై పట్టింపేది... జీఎస్టీ చట్టం అమల్లోకి వచ్చి ఏడాది పూర్తయినా సేవా పన్ను రాబట్టడంపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు పట్టింపు లేకుండా పోయింది. వాస్తవంగా ఏడాది కంటే మందు కేవలం వస్తువు పన్ను మాత్రమే వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో ఉండేది. సేవల పన్నుల వ్యవహారం కేంద్ర ఎక్సైజ్ శాఖ పరిధిలో వచ్చేది. జీఎస్టీ అమలుతో రెండు పన్నులు ఒకే పరిధిలోకి వచ్చాయి. ఏటా కోటిన్నర పైగా టర్నోవర్ గల డీలర్లు సగం కేంద్రం, సగం రాష్ట్రం పన్నుల పరిధికి వచ్చారు. ఇప్పటి వరకు కేంద్ర పరిధిలో ఉండి సేవా పన్నులు చెల్లించిన సంస్ధలు పాత విధానమే పునరావృత్తం చేస్తూ సేవాపన్నును ఎగవేస్తున్నట్లు తెలుస్తోంది. ఫంక్షన్ హాళ్లు, కోచింగ్ సెంటర్లు, ఆహార సంస్ధలు ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. రెండువేలకు పైనే.... హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు రెండు వేలకు పైగానే ఉన్నాయి. వాటి దినసరి అద్దె, వివిధ చార్జీలు కలిపి కనీసం రూ.20 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఉంది. శుభకార్యాలయాలు, ఇతర కార్యక్రమాలకు డిమాండ్ బట్టి నిర్వాహకులు చార్జీలు వసూలు చేస్తుంటారు. ఇందుకుగాను వారు రెండు రకాల రికార్డుల నిర్వహిస్తుంటారు. అధికారిక రికార్డులో వసూలు మొత్తం నమోదు కనిపించదు. అధికారికంగా రశీదు కూడా ఇవ్వడం లేదు. వాస్తవంగా ఫంక్షన్ హాల్స్, కన్వెన్షన్ హాల్స్‌కు వసూలు చేసే మొత్తంలో సుమారు 18 శాతం జీఎస్టీ పన్ను కింద చెల్లించాల్సి ఉంటుంది. అయితే జీఎస్టీ పరిధిలో నమోదైన వాటి సంఖ్య చాల తక్కువ. జీఎస్టీ కింద నమోదు హాళ్లు సైతం రికార్డుల తారుమారుతో మొక్కుబడిగా పన్నును చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల వాణిజ్య పన్నుల శాఖ అధికారులు నగరంలోని సుమారు 200 పైగా ఫంక్షన్‌హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లను గుర్తించారు. వాటిలో కొన్నింటికి నోటీసులు ఇచ్చి చేతులు దులుపు కున్నారు. కోచింగ్ సెంటర్లు అంతే... తెలంగాణ ఏర్పాటు అనంతరం వివిధ పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లకు డిమాండ్ పెరింది. ప్రభుత్వం నోటిఫికేషన్లతో కోచింగ్ సెంటర్లపై కనక వర్షం కురుస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై కూడా నిరుద్యోగ యువత ఆసక్తి కనబర్చడం తో కోచింగ్ కేంద్రాలకు మరింత కలిసి వచ్చింది. వివిధ పరీక్షల కోచిం గ్ను బట్టి అడ్డు అదుపు లేకుండా ఫీజులు వసూలు చేస్తున్నారు. నగరంలో సుమారు మూడు వేలకు పైగా కోచింగ్ కేంద్రాలు ఉన్నట్లు సమాచారం. నిర్వాహకులు వసూలు చేసే ఫీజుల్లో జీఎస్టీ కింద కొంత పన్ను చెల్లించాల్సింది. ఆయితే జీఎస్టీ పరిధి కింద నమోదైన వాటి సంఖ్య వేళ్లపై లెక్కిం చ వచ్చు. అదేవిధంగా బ్యాంకింగ్, ఏటీఎం. ఎస్ఎంఎస్, క్రెడిట్ కార్డు, ఆర్టీజీఎస్, ఫైనాన్స్ సం స్ధలు కూడా ఖాతాదారుల నుంచి, ఆహార సరఫ రా సంస్ధలు వినియోగదారుల నుంచి వసూలు చేసే చార్జీల్లో సుమారు ఐదు నుంచి 18 శాతం వర కు జీఎస్టీ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇందులో కనీసం పదిశాతం కూడా పన్నులు చెల్లిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటికైనా పన్నుల వసూలుపై వాణిజ్య పన్నుల శాఖ దృష్టి సారించాలని నిపుణులు కోరుతున్నారు. -
జీఎస్టీతో ఆటంకాల్లేవు..
న్యూఢిల్లీ: జీఎస్టీ అమలుకు ఏడాది పూర్తవగా, ఈ కాలంలో నూతన పన్ను చట్టం కారణంగా ఎటువంటి సమస్యలు కలగలేదని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. దీని ద్వారా పన్ను వసూళ్లు అధికమవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అధిక పన్ను ఆదాయంతో భవిష్యత్తుల్లో రేట్ల క్రమబద్ధీకరణకు అవకాశం ఉంటుందని చెప్పారు. మూత్రపిండాల మార్పిడి చికిత్స తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న జైట్లీ జీఎస్టీ తొలి వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జీడీపీ వృద్ధి, వ్యాపార సులభ నిర్వహణ, వాణిజ్య విస్తరణ, భారత్‌లో తయారీపై జీఎస్టీ సానుకూల ప్రభావమే చూపించిందని జైట్లీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించిన ‘ఒక్కటే పన్ను రేటు’ ఆలోచనను దోషపూరితమైనదిగా పేర్కొన్నారు. దేశ జనాభా అంతా ఒకే విధమైన అధిక వినియోగం కలిగి ఉంటేనే ఇది సాధ్యపడుతుందని వివరించారు. జీఎస్టీ గతేడాది జూలై 1 నుంచి అమల్లోకి రాగా తొలి ఏడాదిలో 1.14 కోట్ల వ్యాపార సంస్థలు నూతన పన్ను చట్టం కింద నమోదు చేసుకున్నాయి. జీఎస్టీ అమలైన దేశాల్లో ప్రారంభంలో ఆటంకాలు ఎదురైన విషయాన్ని ప్రస్తావిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థలోనూ నూతన పన్ను చట్టంతో ఇబ్బందులు ఎదురవుతాయని తాను సైతం భావించినట్టు జైట్లీ చెప్పారు. ‘‘అతిపెద్ద సంస్కరణ అయిన జీఎస్టీ కారణంగా ఆటంకాలు ఏర్పడతాయన్న మాట నా నోటి నుంచి కూడా వచ్చింది. ఎందుకంటే ఇది సర్దుకోవడానికి సమయం పడుతుంది కనుక. కానీ ఏడాది అనుభవం తర్వాత, సాఫీగా నూతన పన్ను చట్టానికి మారడం చూస్తే, ప్రపంచంలో మరెక్కడా ఇలా సాధ్యం కాలేదు’’ అని జైట్లీ పేర్కొన్నారు. ఏడాది కాలంలో జీఎస్టీ కారణంగా ఆర్థిక వ్యవస్థకు గట్టి ప్రయోజనాలే సమకూరాయన్నారు. అయితే, దీన్నుంచి ఇంకా పూర్తి ప్రయోజనాలు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో జీఎస్టీని మరింత సరళంగా మార్చడం, పన్ను రేట్ల క్రమబద్ధీకరణ, మరిన్ని ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి చేర్చడం వంటి చర్యలు ఉంటాయని అరుణ్ జైట్లీ తెలిపారు. వసూళ్లను లక్ష కోట్లకు తీసుకెళతాం: అధియా న్యూఢిల్లీ: జూన్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.95,610 కోట్లుగా ఉన్నట్టు ఆర్థిక శాఖా కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం మే నెలలో రూ.94,016 కోట్లు వసూలు కాగా, ఏప్రిల్‌లో వసూళ్లు రూ.1.03 లక్షల కోట్లుగా ఉన్నాయి. అయితే, ప్రతి నెలా వసూళ్లను రూ. లక్ష కోట్లకు తీసుకెళ్లగలమన్న ఆశాభావాన్ని అధియా వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు వసూళ్లు రూ.89,885 కోట్లుగా ఉన్నట్టు చెప్పారు. -
వెయ్యి కోట్ల పన్ను ఎగవేత!
సాక్షి, చెన్నై: ‘ఆపరేషన్ క్లీన్ మనీ’లో భాగంగా చెన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో శశికళ సన్నిహితుల ఇళ్లలో ఐటీ సోదాలు రెండో రోజూ కొనసాగాయి. ఈ సోదాల్లో శశికళ, ఆమె కుటుంబ సభ్యులు రూ. 1000 కోట్ల పన్ను ఎగవేసినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు, బంగారు నగలు, వెండి, వజ్రాలు బయటపడినట్లు తెలిసింది. పెద్ద సంఖ్యలో బినామీ సంస్థల ద్వారా నగదు బట్వాడా, బ్యాంకు ఖాతాలు, విదేశీ సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన రికార్డులు స్వాధీనంచేసుకున్నట్లు సమాచారం. బంధువుల నుంచి పనిమనుషుల వరకు.. అక్రమాస్తుల కేసులో శిక్షననుభవిస్తున్న శశికళ, ఆమె భర్త నటరాజన్, సోదరుడు దివాకరన్, మేనల్లుడు దినకరన్‌లతో పాటు సన్నిహితులు, వారి సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది, వారి బంధువులు, వారి వంట, పనిమనుషులు, జ్యోతిష్కుడు, వైద్యుడు, ఆడిటర్.. ఇలా ఆ కుటుంబంతో సంబంధమున్న వారి ఇళ్లల్లో, కార్యాలయాల్లో శుక్రవారం దాడులుచేశారు. రెండో రోజు 147 చోట్ల తనిఖీల్లో ఐటీ వర్గాలు నిమగ్నమయ్యాయి. పలుచోట్ల శశికళ, దినకరన్, దివాకరన్ మద్దతుదారులు దాడులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. శశికళ స్వగ్రామం మన్నార్గుడిలో ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో ఆమె మద్దతుదారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ తనిఖీల్లో వెయ్యి కోట్ల మేరకు పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలు చిక్కినట్టు ఓ అధికారి పేర్కొన్నారు. అలాగే, మన్నార్గుడిలోని దివాకరన్ కళాశాలలో రూ.25 లక్షలు విలువగల నగలు, వెండి బయట పడ్డట్టు తెలిసింది. ప్రధానంగా పది బినామీ సంస్థల వివరాలతో పాటు, విదేశాల్లోని అనేక సంస్థల్లో శశికళ కుటుంబం పెట్టుబడులకు సంబంధించిన రికార్డులు, దస్తావేజుల్ని ఐటీ వర్గాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. -
దలాల్ స్ట్రీట్ లో దందా: భారీగా పన్ను ఎగవేత
స్టాక్ మార్కెట్లో భారీగా పన్ను ఎగవేత కేసులు వెలుగులోకి వచ్చాయి. దీర్ఘకాలిక మూలధన లాభాల్లో ఉన్న పన్ను ప్రయోజనాలను దుర్వినియోగం చేస్తూ దాదాపు 11వేల కేసులు పెన్నీ స్టాక్ ట్రేడింగ్ కు పాల్పడినట్టు తెలిసింది. పన్ను ఎగవేతలకు పాల్పడుతున్న సంస్థల జాబితాను తయారుచేసిన సెక్యురిటీస్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ), ఈ జాబితాను పన్ను అధికారులకు పంపింది. దీనిలో మూలధన లాభాల ప్రొవిజన్స్ ను దుర్వినియోగం చేస్తూ 34వేల కోట్ల రూపాయల పన్నులను 11వేల సంస్థలు ఎగొట్టినట్టు ఆదాయపు పన్నుశాఖకు తెలిపింది. ఈ డేటాను పన్ను అధికారులతో షేర్ చేసుకున్న సెబీ, 11వేల సంస్థలపై విచారణను రివీల్ చేసింది. ఈ సంస్థలు ఎలాంటి కార్యకలాపాలు జరుపకుండా గత మూడేళ్లలో ఒక్కోటి 5 లక్షలకు పైగా లిస్టెడ్ కంపెనీలషేర్లను కొనుగోలుచేసినట్టు పేర్కొంది. మూడేళ్ల డేటా అనాలటిక్స్, ట్రేడింగ్, సర్వైలెన్స్ డేటా ఆధారంగా వీటిని గుర్తించినట్టు సెబీ పేర్కొంది. ఆదాయపు పన్ను శాఖ కూడా సెబీ పన్ను ఎగవేతదారుల జాబితాను పంపినట్టు ధృవీకరించింది. పన్ను ఎగొట్టడానికి ఈ సంస్థలు స్టాక్ మార్కెట్ ను దుర్వినియోగపరుస్తున్నాయని, మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నాయని ఐటీ అధికారులు చెప్పారు. 12 నెలల కంటే ఎక్కువ రోజులు పెట్టుబడులు పెట్టి, షేర్లను విక్రయించినప్పుడు వచ్చే లాభాలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ఉండదు. ఈ నిబంధనను అడ్డంపెట్టుకుని, కంపెనీలు ఈ దుర్వినియోగాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది. దీనిలో ఎక్కువ కోల్ కత్తా, ముంబై, అహ్మదాబాద్, సూరత్, ఢిల్లీకి చెందిన పన్ను ఎగవేతదారులే ఉన్నట్టు సెబీ పేర్కొంది. -
జీఎస్టీతో సరుకులు చౌక జూలై 1 నుంచి అమలు
-
జీఎస్టీతో సరుకులు చౌక జూలై 1 నుంచి అమలు
⇒ పన్నుల ఎగవేతకు చెక్ పడుతుంది ⇒ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్నును జూలై 1 నుంచి అమల్లోకి తేనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంచేశారు. నూతన పన్ను విధానంతో ప్రపంచంలో అతిపెద్ద ఏకైక మార్కెట్‌గా మన దేశం అవతరిస్తుందని, పన్నులు ఎగ్గొట్టడం కష్టతరమవుతుందని, కమోడిటీలు చౌకగా మారతాయని ఆయన తెలియజేశారు. బుధవారమిక్కడ జరిగిన కామన్వెల్త్ ఆడిటర్ జనరల్ 23వ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు దేశ జీడీపీ 7–8 శాతం వృద్ధి సాధించేందుకు తోడ్పడతాయని, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మన ప్రస్థానం కొనసాగుతుందని చెప్పారాయన. అయినప్పటికీ చమురు ధరల్లో హెచ్చుతగ్గులు, ప్రైవేటు పెట్టుబడులను పెంచడం, ప్రభుత్వరంగ బ్యాంకులను చక్కదిద్దడం వంటి సవాళ్లున్నట్టు హెచ్చరించారు. ఒకవేళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన వృద్ధి బాటలో అడుగుపెడితే మనదేశ వృద్ధి రేటు మరింత అధిక స్థాయికి చేరుతుందన్నారు. ధరలు దిగొస్తాయి...: ‘‘జీఎస్టీ అన్నది అతిపెద్ద సంస్కరణ. దీన్ని జూలై 1 నుంచి అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. దీంతో వస్తు సేవల సరఫరా సాఫీగా సాగిపోతుంది. పన్ను ఆదాయం పెరుగుతుంది. బలమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల పన్ను ఎగవేత కష్టమవుతుంది. ఎన్నో అంచెల పన్ను విధానాల వల్ల సరుకుల ధరలు అధికంగా ఉంటున్నాయి. 17 రాష్ట్రాల పన్నులు, కేంద్ర పన్ను స్థానంలో జీఎస్టీ అమల్లోకి వస్తుంది. పన్ను మీద పన్ను లేకపోవడం వల్ల సరుకులు, కమోడిటీలు, సేవల ధరలు కొంచెం చౌకగా మారతాయి’’ అని జైట్లీ వివరించారు. నాలుగు జీఎస్టీ అనుబంధ బిల్లులను కేంద్ర కేబినెట్ ఈ వారం ఆమోదించటం తెలిసిందే. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో వీటికి ఆమోదం లభిస్తుందన్న ఆశాభావాన్ని జైట్లీ వ్యక్తం చేశారు. పన్నుల ఎగవేతకు చెక్... మన దేశంలో ఎక్కువ శాతం మంది పన్ను చట్టాలను పట్టించుకోవటం లేదని జైట్లీ చెప్పారు. ప్రజల్లో నగదు ఆధారిత చలామణి ధోరణి ఎక్కువగా ఉండడంతో పన్నుల ఎగవేత జరుగుతోందన్నారు. జీఎస్టీ అమల్లోకి వస్తే ఎగవేతలకు చెక్ పడుతుందన్నారు. ‘‘నగదు లావాదేవీలకు చెక్ పెట్టేందుకు ప్రత్యక్ష పన్ను చట్టానికి సవరణ తెచ్చాం. రూ.2 లక్షలకు మించిన నగదు లావాదేవీలను నిషేధించే ఆర్థిక బిల్లును పార్లమెంటు ఆమోదించింది. జీడీపీలో నగదు చలామణి 12.2 శాతం ఉండగా... దీనిలో 86 శాతం పెద్దనోట్లేనన్నారు. అధిక స్థాయిలో నగదు ఆర్థిక వ్యవస్థకు సవాల్‌గా మారింది. నేరాలు, అవినీతి, ఉగ్రవాదులకు నిధుల సాయం, పన్నుల ఎగవేత, విద్రోహ చర్యలకు నగదు వీలు కల్పిస్తోంది. వీటికి అడ్డుకట్ట వేసేందుకే పెద్ద నోట్లను రద్దు చేశాం’’ అని జైట్లీ వివరించారు. ఆర్థిక వ్యవస్థలో డిజిటైజేషన్ పెరిగితే సమాంతర ఆర్థిక వ్యవస్థకు చెక్ పడుతుందని, తెరచాటు ఆర్థిక వ్యవస్థ కాస్తా అధికారిక ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ రిటర్న్‌లకు ఆధార్ తప్పనిసరి పన్ను ఎగవేత, మోసాలను అరికట్టేందుకు ఆదాయపన్ను రిటర్న్‌లకు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఈ విషయంపై పునరాలోచించాలన్న విపక్షాల డిమాండ్‌ను తోసిపుచ్చారు. ఫైనాన్స్ బిల్లు–2017పై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. ఆధార్ తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు చెప్పిందని, ఆ నంబర్‌ను తీసుకోవాలని ప్రజలను బలవంతం చేస్తున్నారా అని బీజేడీ సభ్యుడు భర్తృహరి మెహతాబ్ ప్రశ్నించగా, ‘అవును’ అని జైట్లీ సమాధానమిచ్చారు. తర్వాత 40 అధికారిక సవరణలతో బిల్లును సభ ఆమోదించింది. ఏప్రిల్ 1 నుంచి నగదు లావాదేవీల పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 2 లక్షలకు కుదించడం, మంత్రిత్వ శాఖల ట్రిబ్యునళ్ల వీలీనం తదితరాల కోసం ఈ సవరణలు చేశారు. పన్ను వసూళ్లు 17 లక్షల కోట్లు పైనే.. న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లు బడ్జెట్ అంచనాలను మించి ఉం టాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. పన్ను వసూళ్లు తక్కువగా ఉంటాయన్న ప్రతిపక్ష సభ్యుల ఆందోళనపై జైట్లీ స్పందిచారు. ‘‘ప్రత్యక్ష, పరోక్ష పన్నుల లక్ష్యాన్ని రూ.16.25 లక్షల కోట్లుగా ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్ణయించాం. దీన్ని రూ.17 లక్షల కోట్లకు సవరించాం కూడా. ఏదైమైనప్పటికీ ఈ ఈ లక్ష్యాన్ని చేరుకుంటాం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మా లక్ష్యం రూ.19.05 లక్షల కోట్లు’’ అని జైట్లీ పేర్కొన్నారు. -
నేను పన్ను ఎగొట్టలేదు: సానియా మిర్జా
సేవా పన్ను కట్టకుండా ఎగవేశారంటూ తనపై వచ్చిన ఆరోపణలను తెలంగాణ బ్రాండు అంబాసిడర్, టెన్నిస్ క్వీన్ సానియా మిర్జా ఖండించారు. తాను సర్వీసు పన్నును ఎగొట్టలేదని సానియా మిర్జా స్పష్టంచేశారు. సర్వీసు ట్యాక్స్ సక్రమంగా చెల్లించనందుకు విచారణ కోసం సానియా లేదా ఆమె చార్టెడ్ అకౌంటెండ్ కాని తమ ముందు హాజరుకావాలని సర్వీసు ట్యాక్స్ శాఖ అధికారులు సమన్లు జారీచేశారు. ఈ విషయంపై స్పందించిన సానియా మిర్జా తను పన్నును సక్రమంగానే చెల్లించినట్టు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వమిచ్చిన కోటి రూపాయలు, ట్రైనింగ్ ప్రోత్సహకం కింద ఇచ్చినట్టు ఆమె తెలిపారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా సానియా ప్రతినిధి అదికారులకు సమర్పించినట్టు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వమిచ్చిన కోటి రూపాయల ట్రైనింగ్ ప్రోత్సహకంగానే సానియా మిర్జా అందుకున్నారని, రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా తాను అవి తీసుకోలేదని అధికార వర్గాలూ పేర్కొంటున్నాయి. 2014 జూలైలో తెలంగాణ ప్రభుత్వం సానియాను బ్రాండు అంబాసిడర్ గా నియమించి, మేజర్ టోర్నమెంట్ల ప్రిపరేషన్ కోసం కోటి రూపాయలను అందించింది. ప్రస్తుతం సానియా మిర్జా ప్రతినిధి సమర్పించిన డాక్యుమెంట్లపై సర్వీసు ట్యాక్స్ డిపార్ట్ మెంట్ అధికారులు పరిశీలిస్తున్నారు. -
రూ. 2 కోట్లలోపు పన్ను ఎగవేతకు బెయిల్
న్యూఢిల్లీ: జీఎస్టీ అమలు భారంగా మారకుండా శిక్షార్హమైన నిబంధనల తీవ్రత తగ్గించాలని కేంద్ర, రాష్ట్రాలు నిర్ణయించాయి. పన్ను ఎగవేత రూ. 2 కోట్ల లోపు ఉంటే ఆ వ్యాపారి బెయిల్ పొందే అవకాశం కల్పించనున్నారు. కేవలం ఫోర్జరీ, నిర్దేశిత సమయంలో సేకరించిన పన్నుల్ని ప్రభుత్వానికి చెల్లించనప్పుడు మాత్రమే అరెస్టు చేసేలా నిబంధనల్ని రూపొందించాలని గత జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయించినట్లు కేంద్ర రెవెన్యూ విభాగం అధికారి ఒకరు వెల్లడించారు. ‘జీఎస్టీ పరిధిలో తప్పు జరిగినప్పుడు ఆ మొత్తం రూ. 2 కోట్ల కంటే మించకుండా ఉంటే... అరెస్టయ్యే వ్యక్తి బెయిల్‌కి అర్హుడవుతాడు’ అని ఆయన తెలిపారు. -
ఆ డిపాజిట్లు.. నల్లధనమేనా?
సుమారు నాలుగు లక్షల కోట్లపై ఐటీ నజర్ పన్ను ఎగవేతలపై ముమ్మరంగా దర్యాప్తు న్యూఢిల్లీ: రూ. 500, వెయ్యినోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా బ్యాంకులలో నమోదైన డిపాజిట్లపై ఆదాయపన్ను శాఖ (ఐటీ) నజర్ పెట్టింది. నోట్ల ద్దు తర్వాత 50రోజుల గడువులోగా డిపాజిట్ అయిన మొత్తాలను సమగ్రం విశ్లేషిస్తోంది. దేశవ్యాప్తంగా డిపాజిట్ అయిన పాత నగదులో రూ. 3 నుంచి నాలుగు లక్షల కోట్లు పన్ను ఎగ్గొట్టిన ధనం ఉండవచ్చునని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. ఈ నాలుగు లక్షల కోట్ల డిపాజిట్ల వివరాలు పరిశీలించి.. ఆయా డిపాజిటర్లకు నోటీసులు పంపాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చినటు ఐటీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 'నోట్ల రద్దు తర్వాత దాదాపు 60 లక్షల బ్యాంకు ఖాతాలలో రూ. 2 లక్షలకు మించి డిపాజిట్లు నమోదయ్యాయి. వీటి వివరాలన్నీ విశ్లేషించగా.. నిశితంగా ఈ పరిశీలంచగా.. ఈ 60 లక్షల ఖాతాలలో రూ. 7.34 లక్షల నగదు డిపాజిట్ అయినట్టు తేలింది. ఇక ఈశాన్య రాష్ట్రాలలోని వివిధ బ్యాంకు ఖాతాలలో ఏకంగా రూ. 10,700 కోట్ల అనుమానిత డిపాజిట్లు నమోదైనట్టు ఐటీ గుర్తించింది. సహకార బ్యాంకులలో డిపాజిట్ అయిన రూ. 16వేల కోట్లపైనా ఐటీ, ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు' అని ఆయన వివరించారు. ఇక ఎప్పుడూ నిష్క్రియాత్మకంగా ఉండే ఖాతాలలో ఏకంగా రూ. 25వేల కోట్ల డిపాజిట్ అయ్యాయని ఆయన చెప్పారు. ఇక, నవంబర్ 8న జరిగిన నోట్ల రద్దు తర్వాత ఏకంగా రూ. 80వేల కోట్లు రుణాలు బ్యాంకులకు తిరిగి చెల్లించడం జరిగిందని ఆ అధికారి పీటీఐకి తెలిపారు. -
పన్ను చెల్లింపుల్లో కూడా ట్రంప్ కంపే!
న్యూయార్క్ అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున పోటీచేస్తున్న డోనాల్డ్ ట్రంప్ తాను అధికారంలోకి వస్తే ధనవంతులు అధిక పన్నులు చెల్లించాల్సి వస్తోందని, అధిక పన్నులు చెల్లించేందుకు తాను వ్యక్తిగతంగా ఎల్లప్పుడు సిద్ధమేనని పదే పదే చెప్పారు. అదే నోటితో అతి తక్కువ పన్నును చెల్లించేందుకు ఎంతదాకైనా పోరాడుతానంటూ 'ఐ కెన్ ఫైట్ లైక్ ఏ హెల్' అని సెప్టెంబర్‌లో జరిగిన ఓ విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. పరస్పర భిన్నమైన ఈ రెండు వ్యాఖ్యలను చూస్తే ట్రంప్ ద్వంద్వప్రమాణాలు తేటతెల్లమవుతాయి. వాస్తవంగా ఆయన కంపెనీలు పన్నులు ఎగ్గొడుతున్నాయా, పన్ను వివాదాల్లో చిక్కకున్నాయా, పన్నులు ఎగవేసినందుకు జరిమానాలు చెల్లించాయా? అన్న అంశంపై 'యూఎస్ఏ టుడే' పత్రిక లోతుగా అధ్యయనం చేయగా దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన కంపెనీలపై వందకుపైగా పన్ను ఎగవేత కేసులు నమోదయ్యాయి. డజన్లకొద్దీ వారెంట్లు ఉన్నాయి. కొన్ని కేసుల్లో కోర్టు ఆదేశాల మేరకు ఆయన కంపెనీలు దాదాపు మూడు లక్షల డాలర్ల బకాయిలను చెల్లించాయి. ఇంకా అనేక కేసులు కోర్టు విచారణలో ఉన్నాయి. పన్ను చెల్లింపుల్లో ఆయన కంపెనీలేవీ పారదర్శకతను పాటించడం లేదు. ఆస్తులను, ఆదాయాలను అతి తక్కువ చూపించడం ఆయన కంపెనీలకు అలవాటు. వెయ్యి కోట్ల డాలర్ల ఆస్తిని వందకోట్ల డాలర్లుగా చూపించిన సందర్భాలు అనేకం. చట్టాల నిబంధనల మేరకు ఆదాయాన్నిబట్టి పన్ను చెల్లించాలంటూ సంబంధిత ప్రభుత్వం జారీచేసే ఉత్తర్వులను ఆయన కంపెనీలు ఎప్పుడు ఖాతరు చేయవు. తదుపరి చర్యలకు ఉపక్రమించినప్పుడు కోర్టులకు వెళ్లి పోరాటం చేస్తాయి. ఓడిపోయినప్పుడు మాత్రమే బకాయిలు చెల్లిస్తాయి. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ సమర్పించిన ఆస్తుల డిక్లరేషన్‌లో కూడా తన ఆస్తుల విలువను అతి తక్కువ చేసి చూపించారు. ఎన్నికల ప్రచారం కోసం ఆయన తిరుగుతున్న సొంత జెట్ బోయింగ్ విమానానికి దాదాపు పదివేల డాలర్ల పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఆయన దేశధ్యక్ష పదవికి అభ్యర్థిగా రంగంలోకి దిగిన 2015, జూన్ నెల నుంచే ఇప్పటి వరకు ఆయనకు చెందిన ఐదు కంపెనీలకు 13వేల డాలర్ల వారంట్లను 'న్యూయార్క్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టాక్సెస్ అండ్ ఫైనాన్స్' జారీచేసింది. న్యూయార్క్‌లోని బ్రియార్క్లిఫ్, ఫ్లోరిడాలోని జూపిటర్‌లో ఉన్న లగ్జరీ గోల్ప్ కోర్టుల వాస్తవ విలువను తక్కువగా చూపిస్తూ ట్రంప్, ట్యాక్స్ అఫీసర్స్పై కోర్టుకెక్కారు. న్యూయార్క్‌తోపాటు నెవడా, ఫ్లోరిడా, న్యూజెర్సీ కోర్టుల్లో కూడా ట్రంప్ కంపెనీలపై పన్ను ఎగవేత కేసులున్నాయి. ఆయన కంపెనీలు గత 27 ఏళ్ల కాలంలో కేసుల కారణంగా మూడు లక్షల డాలర్ల బకాయిలను ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చింది. 1990 నుంచి 2011 నాటికి న్యూయార్క్ సిటీ ట్యాక్స్ కమిషన్ ట్రంప్ కంపెనీలపై 55 కేసులు దాఖలు చేసింది. 2006 నుంచి 2007 మధ్య ట్రంప్ మార్ట్గేజ్ కంపెనీ కూడా 4,800 డాలర్ల పన్ను చెల్లించాల్సి ఉందని డాక్యుమెంట్లు తెలియజేస్తున్నాయి. ట్రంప్ కంపెనీలపై దేశవ్యాప్తంగా ఉన్న కోర్టుకేసులను, ఆస్తుల డాక్యుమెంట్లను, ఇతర డాక్యుమెంట్లను పరిశీలించడం ద్వారా 'యూఎస్ఏ టుడే' పత్రిక ఈ వివరాలను వెల్లడించింది. -
పన్ను పారదర్శక కూటమిలోకి పనామా
పారిస్: సీమాంతర పన్ను ఎగవేతదారులపై పోరాటానికి ఏర్పడ్డ ప్రపంచ కూటమిలో పనామా దేశం కూడా చేరింది. దీంతో ఈ కూటమిలో దేశాల సంఖ్య 105కు పెరిగింది. ‘పన్ను విషయాల్లో పరిపాలనా పరమైన సహాయంపై బహుపాక్షిక కూటమి’లో సభ్య దేశంగా గురువారం పనామా చేరింది. కూటమిలో సభ్యదేశాలు పన్నులు చెల్లించేవారి సమాచారాన్ని పంచుకుంటాయి. ఈ ఏడాది ప్రారంభంలో పనామా పేపర్స్ లీక్స్ పేరుతో అంతర్జాతీయ జర్నలిస్టుల కన్సార్టియం పలు కంపెనీల బండారం బయట పెట్టడంతో ఒక్కసారిగా పనామా దేశం ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఈ కూటమిలో భారత్ 2012లో చేరింది. -
ముత్తూట్ సంస్థలపై ఆకస్మిక తనిఖీలు
కొచ్చి: పన్ను ఎగవేత అరోపణల నేపథ్యంలో ముత్తూట్ సంస్థ బ్రాంచ్ లపై ఆదాయపన్ను శాఖ శుక్రవారం సోదాలు నిర్వహిస్తోంది. దేశంలోని పలు కీలక నగరాలతో పాటు కేరళలోని కొన్ని ముఖ్య పట్టణాలలో ముత్తూట్ ఆస్తులపై అధికారులు ఆకస్మిక దాడులు జరుగుతున్నాయి. తిరువనంతపురం, కొచ్చి, కొలెన్చెర్రీలతో పాటు న్యూఢిల్లీ, ముంబై, కొయంబత్తూర్, చెన్నై, బెంగళూరు నగరాలలో సోదాలు నిర్వహించిన అధికారులు కొన్ని కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్లు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నేటి (శుక్రవారం) తెల్లవారుజాము నుంచి ఇప్పటికీ కొన్ని నగరాలలో దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. తనిఖీలలో భాగంగా ఆదాయపన్ను శాఖ అధికారులకు పూర్తిగా సహకరించినట్లు ముత్తూట్ గ్రూప్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ధనదాహం
♦ నీటిశుద్ధి పేరిట కాసుల వేట ♦ అనుమతులు లేకుండా విక్రయాలు ♦ పుట్టగొడుగుల్లా మినరల్ వాటర్ ప్లాంట్లు ♦ బీఎస్ఐ నిబంధనలకు మంగళం ♦ రూ.కోట్లల్లో పన్నుల ఎగవేత ♦ కేంద్రాలపై లోపించిన పర్యవేక్షణ జిల్లావ్యాప్తంగా 200కుపైగా వాటర్ ప్లాంట్లు అనుమతి లేకుండా నడుస్తున్నాయి. కేవలం ఐదింటికి మాత్రమే అనుమతి ఉంది.. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నాణ్యతా ప్రమాణాలు పాటించ రు.. అనుమతులు తీసుకోరు.. ప్రాథమిక నిబంధనలు అమలు చేయరు.. ప్రభుత్వానికి పన్నులు చెల్లించరు.. అయితేనేం రూ.కోట్లల్లో వ్యాపారం చేస్తున్నారు. జిల్లాలో శుద్ధజలం పేరిట మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నారుు. ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి రూ.కోట్లు సంపాదిస్తున్నారు. కరువైన అధికారుల నియంత్రణతో ఇష్టారాజ్యంగా సాగుతున్న ‘నీళ్ల’ వ్యాపారంలో సామాన్యులే సమిధవులవుతున్నారు. మినరల్ వాటర్ పేరిట జనరల్ వాటర్ సరఫరా చేస్తూ వినియోగదారులకు లేని రోగాలను అంటగడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. భారత ప్రమాణా ల సంస్థ(బీఎస్ఐ) నిబంధనలను పూర్తిగా విస్మరించిన వాటర్ ప్లాంట్ల నిర్వాహకులకు ‘అమ్యామ్యాల’కు రుచి మరిగిన అధికారులు తోడు కావడం అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. నిజామాబాద్, కామారెడ్డి, బోధ న్, ఆర్మూరు, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బాల్కొండ నియోజకవర్గాలతోపాటు జిల్లా వ్యాప్తంగా మంచి నీళ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. సుమారుగా 200 వరకు వాటర్ ప్లాంట్లు ఉన్నా.. కేవలం ఐదింటికీ మాత్రమే బీఎస్ఐ అనుమతి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ జిల్లాలో నిర్వహిస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్లలో చాలా మంది ప్రమాణాలు పాటించడం లేదు. డబ్బులు ఎరగా వేసి అరకొర వసతులున్న అనుమతులు తెచ్చుకుంటున్న వ్యాపారులు చిన్న చిన్న గదుల్లో ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. నీటిని నిల్వచేసే క్యానులను ప్రతిసారి శుభ్రం చేయకుండానే సరఫరా చేస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూరు, బాన్సువాడ, ఎల్లారెడ్డిలతోపాటు జిల్లా వ్యాప్తంగా వాటర్ ప్లాంట్లలో మైక్రోబయాలజిస్టు, కెమిస్టులు అందుబాటులో ఉండటం లేదు. పీహెచ్, టీడీఎస్ పరీక్షలు అసలే జరగడం లేదు. శానిటరీ అధికారులు మామూళ్లకు రుచిమరిగి అసలే తనిఖీలు చేయడం లేదు. కొన్ని సంస్థలు ఐఎస్ఐ సర్టిఫికెట్లు కలిగినప్పటికీ వాటిని ఏటా రెన్యూవల్ చేయడం లేదు. వాటర్ కేంద్రాలు కచ్చితంగా భూగర్భజలాలను ఉపయోగించాలి. అయితే కొందరు ఇతర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తీసుకొచ్చి వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా వుండగా ఒక లీటరు శుద్ధి జలాన్ని తయారు చేయడానికి మూడు లీటర్ల నీరు వృథా అవుతోంది. ఈ క్రమంలో భూగర్భజలాలను విరివిగా తీయడం వలన ఈ ప్లాంట్లు ఉన్న ప్రాంతంలో భూగర్భ నీటినిల్వలు తగ్గిపోతున్నాయని చుట్టు పక్కల ఉండేవారు ఫిర్యాదులు చేస్తున్నా అక్రమంగా నిర్వహిస్తున్న ప్లాంట్లపై చర్యలు తీసుకోవడానికి అధికారులు జంకుతున్నారు. మినరల్ వాటర్‌పై కూడా 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉండగా, సేవ ముసుగులో వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు ఆ పన్నులు ఎగవేస్తున్నారు. అధికారుల ఉదాసీనతే కారణం మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వహించాలంటే ఐఎస్ఐ నిబంధనలు పాటించాలి. భారత ప్రమాణాల సంస్థ(బీఎస్ఐ) అనుమతుల సమయంలో ఇచ్చిన మార్గదర్శక సూత్రాలు అమలు చేయాలి. వాటర్ ప్లాంట్‌లో మైక్రోబయాలజిస్టు, కెమిస్టులు విధిగా ఉండాలి. వీరు శుద్ధి చేసిన ప్రతి బ్యాచ్‌కు చెందిన నీటిలోని పీహెచ్‌ను పరీక్షిస్తూ ఉండాలి. పీహెచ్ 7 కంటే తగ్గితే కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయని బీఎస్ఐ, డాక్టర్లు చెప్తున్నారు. నీటిలో పూర్తిగా కరిగి ఉండే లవణాలను(టీడీఎస్) కూడా పరీక్షించాలి. కొత్తగా ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే కనీసం 10 గదులు ఉండేలా చూడాలి. ఇందులోనే నీటిని పరీక్ష చేసే ల్యాబ్, అందుకు ఉపయోగించే పరికరాల కోసం రెండు గదులు కేటాయించాలి. ఫిల్లింగ్ సెక్షన్, ఆర్వో సిస్టంలో 3,000 లీటర్ల కెపాసిటీ డ్రమ్ములను ఏర్పాటు చేయాలి. శుద్ధి చేసిన జలాలను నిల్వచేసేందుకు 304 గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేసిన డ్రమ్ములు వాడాలి. శుద్ధి చేసిన నీటిని తప్పకుండా ఓజోనైజేషన్ చేయాలి. మినరల్ వాటర్‌ను బబుల్స్(క్యాను)లోకి పట్టే ముందు అల్ట్రావైరస్ రేస్‌తో వాటిని శుద్ధి చేయాలి. నీటిని క్యాన్‌లోకి పట్టిన తర్వాత రెండు రోజులపాటు భద్రపరిచి అనంతరం మార్కెట్లోకి పంపాలని బీఎస్ఐ నిబంధనలు సూచిస్తున్నాయి. నీటిని సరఫరా చేసే క్యానులకు ప్రతిసారి పొటాషియం పర్మాంగనేట్ లేదా హైపోసొల్యూషన్తో కెమికల్ క్లీనింగ్ చేయాలి. సీలుపై నీటిని శుద్ధి చేసిన తేదీ, బ్యాచ్ ను వేయాలి. నీటిని క్యానులలోకి నింపేవారు చేతులకు గ్లౌజస్ ధరించాలి. శానిటరీ అధికారుల చేత ప్రతినెలా నీటిని తనిఖీ చేయించి రిపోర్టును ఐఎస్ఐకి పంపాలి. ప్రతి ఏడాది ఐఎస్ఐ గుర్తింపు ఉన్నవాళ్లు తప్పనిసరిగా రెన్యూవల్ చేయించుకోవాలి. ఇవేమీ పాటించకున్నా నిర్వహిస్తున్నారంటే అధికారుల ఉదాసీనతే కారణమన్న చర్చ జరుగుతోంది. -
పన్ను ఎగవేతలపై చట్టపరంగానే చర్యలు
న్యూఢిల్లీ: పన్ను ఎగవేతదారులపై చట్టపరంగానే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీబీడీటీ (ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్) ఒక ప్రకటనలో సోమవారం స్పష్టంచేసింది. పన్ను ఎగవేతదారులందరిపై కేవలం ఐటీ దాడులు, పత్రాల పరిశోధనలు, జరిమానాలతోనే సరిపెట్టకుండా, పన్ను ఎగవేతకు సంబంధించి పరువు తీయడం, జైలులో పెట్టడం వంటి హెచ్చరికలతో వారిలో తీవ్రమైన భయాందోళనలు కలిగించేలా చర్యలు తీసుకోవాలని పన్నుల శాఖ తన అధికారులను ఆదేశించినట్లు వచ్చిన వార్తలను సీబీడీటీ తోసిపుచ్చింది. అధిక మొత్తంలో పన్ను ఎగవేతల వ్యవహారంలో చట్టం మేరకు కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని ఈ సందర్భంగా సీబీడీటీ స్పష్టం చేసింది. -
తారల ‘పన్ను’పోటు
రూ.100 కోట్ల మేర పన్ను చెల్లించని సినీ ప్రముఖులు సాక్షి, హైదరాబాద్: తెలుగు సినీ రంగం ప్రముఖుల సేవల పన్ను(సర్వీస్ ట్యాక్స్) బకాయిలు ఎంతో తెలుసా...? అక్షరాలా రూ.100 కోట్లపైనే. ఓ సినిమాను నిర్మాతలు నిర్మిస్తే పారితోషికం తీసుకుని అందులో నటించిన నటీనటులతోపాటు నేపథ్య గాయకులు, ఇతర ప్రముఖులను తమ సేవలను అందిస్తున్నట్టుగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో నిర్మాతల నుంచి పారితోషికాలతోపాటు సేవల పన్ను(సర్వీస్ ట్యాక్స్) రూపేణా సొమ్ము వసూలు చేస్తున్న కొందరు సినీ ప్రముఖులు ఆ మొత్తాన్ని సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగానికి చెల్లించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. కొందరు ‘పెద్దలు’ కనీసం సేవల పన్ను విభాగంలో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా బండి లాగిస్తున్నారు. సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ హైదరాబాద్ కమిషనరేట్ ఆధీనంలోని సేవల పన్ను విభాగం పరిశీలనలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన ఆ విభాగం చట్టపరమైన చర్యలకు సమాయత్తమైంది. సేవల పన్ను ఇలా: వాణిజ్య అవసరాల నిమిత్తం సేవలందించే ప్రతి వ్యక్తి, సంస్థ కేంద్రం విధించే సేవల పన్ను పరిధిలోకి వస్తారు. ఈ నేపథ్యంలో వాణిజ్య సంస్థలు, హోటళ్లు తదితర సంస్థలు తమ బిల్లులో వినియోగించిన, ఖరీదు చేసిన వస్తువు విలువకు అదనంగా సేవల పన్నును చేర్చి ఆ మొత్తాన్ని వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాయి. ఏటా ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో ఆయా సంస్థలు ఈ ట్యాక్స్‌ను సేవల పన్ను విభాగానికి చెల్లించాలి. సినీరంగం విషయానికొస్తే.. నిర్మాతల నుంచి పారితోషికం తీసుకుని వారి చిత్రాల్లో నటించిన నటీనటులతోపాటు నేపథ్య గాయకులు, ఇతర నిపుణులు తమ సేవలను అందిస్తున్నట్లే లెక్క. దీంతో ఆర్థిక చట్టప్రకారం వీరు సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆధీనంలోని సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. కాగా నిర్మాత నుంచి పారితోషికం తీసుకునే సమయంలో వీరంతా అదనంగా 12.36 శాతం చొప్పున సేవల పన్ను వసూలు చేస్తున్నారు. ఈ మేరకు వారు సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగం వద్ద రిజిస్టర్ చేయించుకోవడంతోపాటు వార్షిక రిటర్న్స్ దాఖలు సమయంలో ఈ అంశాలను పక్కాగా లెక్కల్లో చూపి ఆ మొత్తాన్ని సేవల పన్ను విభాగానికి చెల్లించాల్సి ఉంది. పరిశీలనలో బయటపడిన జాతకాలు.. గడిచిన కొన్నేళ్లుగా అనేకమంది సినీ ప్రముఖులు సరైన రిటర్న్స్ దాఖలు చేయట్లేదని, లెక్కల్లో చెప్పిన మొత్తాన్ని సర్వీసు ట్యాక్స్‌గా చెల్లించట్లేదని సేవల పన్ను విభాగం అనుమానించింది. లోతుగా ఆరా తీసిన నేపథ్యంలో చాంబర్స్, మండళ్లతోపాటు దర్శకులు, హీరోలు, హీరోయిన్లు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులుసహా మరికొందరు రూ.100 కోట్లకుపైగా బకాయి పడినట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో ప్రాధాన్యతాక్రమంలో ఈ సెలబ్రిటీల జాబితాను, సంస్థల పేర్లను సిద్ధం చేసిన అధికారులు ఆయా సంస్థలకు, వ్యక్తులకు సోమవారం నుంచి సమన్లు జారీ చేయాలని నిర్ణయించారు. ఆర్థిక చట్టప్రకారం రూ.50 లక్షలకు మించి సేవల పన్ను బకాయిపడిన వారిపై నాన్-బెయిలబుల్ వారెంట్ తీసుకుని నేరుగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించే అధికారమూ సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అధికారులకు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సమన్లకు స్పందించని వారిపై వరుస దాడులు చేయడంతోపాటు అరెస్టు చేయాలని నిర్ణయించారు. రాజకీయంగానూ కీలకంగా ఉన్న ఓ ప్రముఖ నటుడితోపాటు మరో ప్రముఖ గాయని, ఇంకా మరికొందరు ప్రముఖులు కనీసం సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్‌లో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోలేదని అధికారులు గుర్తించారు. వీరికీ నోటీసులు జారీ చేయడానికి రంగం సిద్ధం చేశారు. 2011లో రెండు ప్రముఖ సంస్థలపై సేవల పన్ను విభాగం దాడులు చేసింది. ఆ సమయంలో బకాయిలు చెల్లించడానికి కొంత గడువు కోరిన వారు.. ఆ గడువు తీరిన తర్వాత కూడా చెల్లించలేదు. ఈ దఫా వీరిపై చర్యలు తీసుకోవడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. -
తీవ్ర నేరంగా పరిగణించాలి
పన్ను ఎగవేతపై సిట్ న్యూఢిల్లీ: పన్ను ఎగవేతను తీవ్రమైన నేరంగా పరిగణించాల్సిన అవసరం ఉందని, నల్లధనంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం చైర్మన్ ఎంబీ షా అన్నారు. విదేశాల్లో అక్రమ సంపదను దాచుకున్న భారతీయుల వివరాలను ఆయా దేశాలు వెల్లడించేలా ఒత్తిడి పెంచేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి రప్పించాలనే భారత్ లక్ష్యానికి మరింత ఊతం ఇవ్వడంతో పాటు దేశంలో సైతం అక్రమ సంపద పేరుకుపోవడాన్ని నిరోధిస్తుందని అన్నారు. పన్ను ఎగవేత భారత్‌లో ప్రస్తుతం సివిల్ నేరంగా ఉందని, విదేశీ మారకద్రవ్య ఉల్లంఘనలు ఫెమా (విదేశీ మారక నిర్వహణ చట్టం) కిందకి వస్తుండగా.. పన్ను ఎగవేతను ఆదాయ పన్ను చట్టం (1961) కింద ఎదుర్కోవడం జరుగుతోందని షా వివరించారు. స్వభావరీత్యా రెండూ సివిల్ చట్టాలేనని, క్రిమినల్ ప్రొసీడింగ్స్‌కు అవకాశం ఉన్నవి కాదని సిట్ చైర్మన్ పీటీఐతో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పన్ను ఎగవేతను తీవ్రమైన క్రిమినల్ నేరంగా పరిగణించాలని తాము గట్టిగా ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. పన్ను సంబంధిత నేరాలు సివిల్ స్వభావాన్నే కలిగివున్న పక్షంలో విదేశీ ప్రభుత్వాలు సహకరించవని అన్నారు. తీవ్రమైన నేరంగా కనుక చేస్తే.. విదేశాలు నల్ల కుబేరుల పేర్లు వెల్లడించక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. సుప్రీం మాజీ న్యాయమూర్తులు ఎంబీ షా, అరిజిత్ పసాయత్ చైర్మన్, వైస్ చైర్మన్లుగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్.. ఇటీవల నల్లధనంపై తాజా నివేదికను అందజేసింది. -
సత్యం స్కాం బయటపడి ఇప్పటికి సరిగ్గా అయిదేళ్లు
-
'సత్యం’రామలింగరాజు సతీమణికి జైలుశిక్ష
రామలింగరాజు సతీమణి సహా 20 మంది కుటుంబసభ్యులకు జైలుశిక్ష సాక్షి, హైదరాబాద్: ఆదాయపు పన్ను ఎగవేత కేసులో సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ బి.రామలింగరాజు కుటుంబానికి పెద్ద షాక్ తగిలింది. రామలింగరాజు కుటుంబానికి చెందిన 19 అనుబంధ కంపెనీల్లో డెరైక్టర్లుగా ఉన్న 20 మందికి నాంపల్లిలోని ప్రత్యేక ఆర్థిక నేరాల న్యాయస్థానం జైలుశిక్ష, జరిమానా విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్ష ఉత్తర్వుల అమలును నెల రోజుల పాటు వాయిదా వేసింది. జైలుశిక్ష పడిన వారిలో రామలింగరాజు సతీమణి బి.నందినీరాజు, కుమారుడు బి.తేజరాజు, సోదరులు బి.రామరాజు, బి.సూర్యనారాయణరాజు, సోదరుడి భార్య బి.రాధారాజు, మాజీ సీఎఫ్‌వో ఎన్.రామరాజులతో పాటు పలువురు సమీప బంధువులు ఉన్నారు. మహిళా డెరైక్టర్లకు ఆర్నెల్ల జైలుశిక్ష, రూ. 5వేల జరిమానా విధించగా, మిగిలిన వారికి ఏడాది జైలు, రూ. 10 వేల జరిమానా విధించింది. శిక్ష పడిన నిందితులంతా అప్పటికప్పుడు రూ. 8.40 లక్షలు పూచీకత్తు చెల్లించి ఇంటికి వెళ్లారు. రామలింగరాజుకు చెందిన మరో సంస్థ మేటాస్ హిల్కౌంట్ నిర్మించిన అపార్ట్మెంట్, విల్లాలకు ఈ 19 అనుబంధ సంస్థల పేరు మీద భూముల బదలాయింపు జరిగింది. మేటాస్ సంస్థ తనకు వచ్చిన ఆదాయాన్ని ఈ 19 కంపెనీలకు ఇచ్చింది. ఈ కంపెనీలు కూడా రికార్డుల్లో ఆ ఆదాయాన్ని చూపించాయి. పెట్టుబడి లాభాలకు ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయాన్ని చూపుతూ రిటర్న్స్ దాఖలు చేసిన ఈ కంపెనీలు, పన్ను మాత్రం చెల్లించలేదు. ముందస్తు పన్ను చెల్లింపులూ చేయలేదు. ఈ కంపెనీలన్నీ ఆదాయ పన్ను శాఖకు రూ. 90 లక్షల నుంచి రూ. 3 కోట్ల వరకు బకాయి పడ్డాయి. పన్ను చెల్లించాలంటూ ఆదాయపు పన్ను శాఖ ఈ కంపెనీలకు నోటీసులు జారీ చేసినా ప్రయోజనం లేకపోవడంతో... అవి ఆదాయ పన్ను ఎగవేశాయంటూ ఐటీ విభాగం ప్రత్యేక ఆర్థిక నేరాల న్యాయస్థానంలో ఫిర్యాదులు చేసింది. వీటిపై విచారించిన కోర్టు... ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 276సీ(2) కింద పన్ను చెల్లించకపోవడాన్ని నేరంగా పరిగణిస్తూ ఆయా డెరైక్టర్లకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. 19 అనుబంధ కంపెనీలివే... నాగవల్లి గ్రీన్‌ల్యాండ్స్, గోమతి ఆగ్రోఫార్మ్స్, నల్లమల ఆగ్రోఫార్మ్స్, చిత్రావతి ఆగ్రోఫార్మ్స్, గోమన్ ఆగ్రోఫార్మ్స్, కాంచన్‌జంగా గ్రీన్‌ల్యాండ్స్, హిమగిరి గ్రీన్‌ఫీల్డ్స్, కోనార్ గ్రీన్‌ఫీల్డ్స్, హిమగిరి బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, మేదరవతి ఆగ్రోఫార్మ్స్, సింధూ గ్రీన్‌ఫీల్డ్స్, స్వర్ణగిరి గ్రీన్‌ఫీల్డ్స్, వింధ్యా గ్రీన్‌ల్యాండ్స్, వార్దా గ్రీన్‌ఫీల్డ్స్, యమునా ఆగ్రోఫార్మ్స్, వంశధార ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్, పర్బతి ఆగ్రోఫార్మ్స్, ఉత్తరాషాడ బయోటెక్ లిమిటెడ్, స్వర్ణముఖి గ్రీన్‌ఫీల్డ్స్ కంపెనీల్లో డెరైక్టర్లు వీరే... బీవీఎస్ సుబ్బరాజు, ఐవీ కృష్ణంరాజు, బి.ఝాన్సీ, ఎన్.రామరాజు, బి.నందినీరాజు, ఏవీ రాఘవరాజు, బి.రాధారాజు, బి.సూర్యనారాయణరాజు, ఎం.సూర్యనారాయణరాజు, బి.తేజరాజు, కె.గోపాలకృష్ణరాజు, మంతెన హరిప్రసాద్‌రాజు, ఎన్ఎస్ఎల్ఆర్ ప్రసాదరాజు, మల్లప్పరాజు, డి.శ్రీనివాసరాజు, కె.గోపీకృష్ణంరాజు, కేవీవీ కృష్ణంరాజు, జానకీరామరాజు, డీజీకే రాజు, బి.రామరాజు -
బకాయిలు చెల్లించకుంటే అరెస్ట్
న్యూఢిల్లీ: సర్వీస్ ట్యాక్స్ ఎగవేతదారులపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. పన్ను బకాయిలను మంగళవారం(31)లోగా చెల్లించాల్సిందిగా ఆదేశించింది. లేదంటే అరెస్ట్ చేయడం వంటి చట్టపరమైన చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది. 2014 జనవరి 1 నుంచి సర్వీస్ ట్యాక్స్ ఎగవేతదారులపై కఠిన చర్యలను తీసుకోనున్నట్లు రెవెన్యూ కార్యదర్శి సుమిత్ బోస్ చెప్పారు. ఈ ఏడాది మే 10 నుంచి అమల్లోకి వచ్చిన వీసీఈ పథకం కారణంగా సర్వీస్ పన్ను బకాయిదారులు ఎలాంటి జరిమానాలు లేకుండా బకాయిలను చెల్లించేందుకు వీలు కలిగింది. దీనిలో భాగంగా ఈ నెల 29కల్లా రూ. 5,500 కోట్లమేర బకాయిలకు సంబంధించి సుమారు 40,000 దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. గత నాలుగు రోజుల్లోనే రూ. 1,500 కోట్లమేర సర్వీస్ ట్యాక్స్ చెల్లింపులకు 16,000 దరఖాస్తులు లభించినట్లు వివరించారు. మంగళవారంతో వీసీఈ పథకం గడువు ముగియనున్నందున తమ కార్యాలయాలు అర్థరాత్రి వరకూ పనిచేయనున్నట్లు బోస్ పేర్కొన్నారు. ఈ ప్రత్యేక పథకాన్ని వినియోగించుకోవలసిందిగా ఇప్పటికే ఆర్థిక మంత్రి పి.చిదంబరం సర్వీస్ ట్యాక్స్ ఎగవేతదారులకు సూచించారు. ఇలాంటి అవకాశం మళ్లీ 20ఏళ్లకుగానీ లభించదని వివరించారు కూడా. ఈ పథకం కి ంద సర్వీస్ ట్యాక్స్ చెల్లింపుల్లో విఫలమైనవారు 2007 అక్టోబర్ 1 నుంచి 2012 డిసెంబర్ 31 వరకూ సెస్ చార్జీలతోసహా బకాయిల చెల్లింపు వివరాలను ప్రభుత్వానికి అందించేందుకు వీలుంటుంది. తద్వారా జరిమానా చెల్లింపు, చట్టబద్ధ చర్యలనుంచి తప్పించుకునేందుకు అవకాశముంది. సర్వీస్ ట్యాక్స్కింద 17 లక్షల మంది రిజిస్టరైనప్పటికీ 7 లక్షల మంది మాత్రమే రిటర్న్‌లను దాఖలు చేశారు. -
మరో వివాదంలో అద్నాన్ సమీ!
వీసా గడువు వివాదం నుంచి బయటపడ్డ పాకిస్థానీ గాయకుడు సంగీత దర్శకుడు అద్నాన్ సమీ మళ్లీ ఇబ్బందుల్లో పడ్డాడు. పన్ను ఎగవేతకు సంబంధించిన వ్యవహారంలో సోమవారం విచారణకు హాజరుకావాలంటూ సర్వీస్ టాక్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అద్నాన్ సమీ నిర్వహించిన కార్యక్రమాలపై పన్ను చెల్లించలేదనే కారణంతో ఆయనపై అక్టోబర్ 15 తేదిన కేసు నమోదు చేసామని సర్వీస్ టాక్స్ విభాగం అధికారులు తెలిపారు. ఎంత మేరకు పన్ను ఎగవేతకు పాల్పడినాడో ఖచ్చితంగా ఇప్పుడే చెప్పలేమని అధికారులు తెలిపారు. సోమవారం సమీని విచారించిన తర్వాతనే ఎంత మొత్తం ఎగవేతకు పాల్పడినాడో చెప్పగలమన్నారు. విచారణకు హాజరయ్యే సమయంలో తాను నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను తీసుకు రావాలని నోటీసులో పేర్కొన్నట్టు అధికారులు తెలిపారు. వీసా గడువు పూర్తయిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా భారత్ లో అద్నాన్ సమీ ఉండటం గతవారం వివాదంగా మారింది. అయితే తాను చేసిన విజ్క్షప్తికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మూడు నెలలపాటు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.