పన్ను ఎగవేత ఆరోపణలు: శాంసంగ్‌కు షాక్‌! | Samsung offices searched by DRI over suspicion of customs duty evasion: Report | Sakshi
Sakshi News home page

Samsung: కస్టమ్స్‌ సుంకం ఎగవేత ఆరోపణలు, సోదాలు

Published Fri, Jul 9 2021 4:40 PM | Last Updated on Fri, Jul 9 2021 5:21 PM

Samsung offices searched by DRI over suspicion of customs duty evasion: Report - Sakshi

దక్షిణ కొరియా సంస్థ శాంసంగ్‌ కార్యాలయాలలో  కస్టమ్స్ సుంకం ఎగవేత ఆరోపణలపై ఆధారాలను సేకరించేందుకు  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు సోదాలు నిర్వహించారు.

సాక్షి,\న్యూఢిల్లీ:  దక్షిణ కొరియా సంస్థ  శాంసంగ్‌ చిక్కుల్లో పడింది.  పన్ను ఎగవేత ఆరోపణలతో శాంసంగ్‌ కార్యాలయాలలో అధికారులు దాడులు నిర్వహించారు. కస్టమ్స్ సుంకం ఎగవేత ఆరోపణలపై ఆధారాలను సేకరించేందుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు ఈ సోదాలు నిర్వహించారు.  కానీ  దీనికి సంబంధించిన ఆధారాలు లభించాయా లేదా అనే దానిపై స్పష్టత లేదు.

నెట్ వర్కింగ్ కార్యకలాపాలు నిర్వహించే న్యూఢిల్లీ, ముంబైలోని  శాంసంగ్  ఆఫీసులపై డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు.  ఇటీవలే శాంసంగ్ కంపెనీ నెట్ వర్క్ పరికరాలను అక్రమంగా దిగుమతి దిగుమతి చేసుకుందనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. దక్షిణ కొరియాతో పాటు, వియత్నాంలో తయారు చేసిన టెలికం పరికరాలు, ఇతర ఉత్పత్తులపై స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) కింద సంస్థకు కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు ఉంది. అందులో భాగంగా టెలికం సేవలు, నెక్ట్స్ జెన్ వైర్ లెస్ నెట్ వర్క్ ల డెవలప్ మెంట్, ఆధునికీకరణ, విస్తరణ వంటి విషయాల్లో పరస్పర సహకారం కోసం భారత్, దక్షిణ కొరియాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అయితే ఎఫ్‌టిఎయేతర దేశంలో తయారన పరికరాలను దక్షిణ కొరియా లేదా వియత్నాం గుండా తరలించిందనేది ప్రభుత్వానికి అందిన విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో సోదాలు అధికారులు సోదాలు నిర్వహించారు. ఇదే నిజమని తేలితే సరఫరా చేసిన  సంబంధిత పరికరాలపై కస్టమ్స్ సుంకం విధించవచ్చు.

మరోవైపు డీఆర్ఐఅధికారులు సోదాలపై శాంసంగ్ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు.వాల్యూమ్ పరంగా దేశంలో అతిపెద్ద 4జీ విక్రయ సంస్థ శాంసంగ్‌. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు ప్రత్యేకమైన 4 జీ పరికరాల ప్రొవైడర్‌గా శాంసంగ్‌ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement