న్యూఢిల్లీ: రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) భారీ ఎత్తున బంగారాన్ని, అక్రమ కరెన్సీని స్వాధీనం చేసుకుంది. ఢిల్లీ జోనల్ యూనిట్ నల్లధనం,బంగారం అక్రమ రవాణా వెలికితీతలో భాగంగా దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో 20.64 కిలోల బంగారాన్ని, 6.44 కోట్ల రూపాయలను సీజ్ చేసింది.
పాత ఢిల్లీ ప్రాంతంలో రాజేష్ గుప్తా కి చెందిన ఒక దుకాణంనుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు. పంకజ్ కుమార్ అనే వ్యాపారి అక్రమ బంగారాన్ని అమ్మినట్టుగా డీఆర్ఐ అధికారి తెలిపారు. ఇరువురినీ అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీ తరలించామన్నారు. విచారణ కొనసాగుతుందని చెప్పారు. 995 స్వచ్ఛత 1 కిలో బరువు తూగే 20విదేశీ బార్లనుతో పాటు నగదు మొత్తం మొత్తం విలువ సుమారు రూ 12.91 కోట్లు ఉంటుందని ప్రకటించారు. బ్లాక్ మనీ, అక్రమంగా రవాణా అవుతున్న విదేశీ బంగారానికి వ్యతిరేకంగా తమ డ్రైవ్ తో కొనసాగుతుందని తెలిపారు.
కాగా గత నెల, డిఆర్ఐ ఢిల్లీ జోనల్ యూనిట్ రూ 2,000 కోట్ల విలువైన సుమారు 7,000 కిలోగ్రాముల బంగారాన్ని సీజ్ చేసిన సంగతి తెలిసిందే.
భారీ ఎత్తున బంగారం, కరెన్సీ పట్టివేత
Published Tue, Oct 18 2016 4:11 PM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM
Advertisement
Advertisement