Indian Currency
-
రూ. 5 నుంచి రూ. 2000.. ఏ నోటుపై ఏ చిహ్నం?
మరికొద్ది రోజుల్లో మనమంతా పంద్రాగస్టు స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు చేసుకోనున్నాం. 1947లో మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. నూతన స్వదేశీ ఆవిష్కరణలు జరిగాయి. వాటిలో ఒకటే సొంత కరెన్సీ. భారతీయ నోట్లపై వివిధ చిత్రాలు మనకు కనిపిస్తాయి. ఏ నోట్‌పై ఏ చిత్రం ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.ఐదు రూపాయలుఐదు రూపాయల నోట్ల ప్రింటింగ్ ఖర్చు ఎక్కువ కావడంతో ఆర్బీఐ ఇటీవలే ఈ నోటు ముద్రణను నిలిపివేసింది. అయినప్పటికీ గతంలో ముద్రించిన 8 వేల 500 కోట్ల విలువైన ఐదు రూపాయల నోట్లు మార్కెట్లో చలామణీలో ఉన్నాయి. ఐదు రూపాయల నోటుపై ఒక వైపు మహాత్మాగాంధీ చిత్రం, మరో వైపు పొలం దున్నుతున్న రైతు చిత్రం కనిపిస్తుంది. ఈ ఫోటో ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానికున్న ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.పది రూపాయలుపది రూపాయల నోటు ముందు భాగంలో మహాత్మా గాంధీ ఫోటో, వెనుకపైపు అశోక చక్రం కనిపిస్తాయి. 10 రూపాయల కొత్త నోట్ల శ్రేణిలో ఒకవైపు సూర్య దేవాలయ చక్రం కనిపిస్తుంది.ఇరవై రూపాయలుఇరవై రూపాయల నోటు విషయానికొస్తే ఈ నోటుపై ఒకవైపు మహాత్మా గాంధీ చిత్రం, మరోవైపు అశోక స్థూపం కనిపిస్తుంది. మరికొన్ని నోట్లపై ఎల్లోరా గుహల దృశ్యం కనిపిస్తుంది.యాభై రూపాయలుయాభై రూపాయల నోటులో ఒకవైపు గాంధీజీ చిత్రం, వెనుకవైపు 'స్వచ్ఛ భారత్' లోగో కనిపిస్తుంది.100 రూపాయలుకొత్త రూ.100 నోటుపై ముందు భాగంలో గాంధీజీ చిత్రాన్ని, వెనుకవైపు రాణికి వావ్(గుజరాత్‌లోని చారిత్రక ప్రాంతం) చిత్రాన్ని చూడవచ్చు.200 రూపాయలురూ.200 నోటుపై ఒకవైపు గాంధీజీ చిత్రాన్ని, వెనుక భాగంలో ప్రసిద్ధ సాంచి స్థూపం చిత్రాన్ని చూడవచ్చు.500 రూపాయలుకొత్త రూ.500 నోటు విషయానికొస్తే, ఒకవైపు గాంధీజీ చిత్రాన్ని, వెనుక వైపు స్వచ్ఛ్ భారత్‌తో పాటు ఎర్రకోట చిత్రాన్ని చూడవచ్చు.రెండు వేల నోటురెండు వేల రూపాయల నోటును చలామణీని నిలిపివేశారు. ఈ నోట్‌పై ఒకవైపు గాంధీజీ చిత్రాన్ని, మరోవైపు మంగళయాన్ చిత్రాన్ని చూడవచ్చు. -
పెద్ద నోట్ల రద్దు.. ఇంతకీ వాటిని ఏం చేశారు.. ఎక్కడున్నాయో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: దేశంలో పెద్ద నోట్ల(500, 1000)ను 2016 నవంబర్ 8వ తేదీన భారత ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, భారీ సంఖ్యలో ఉన్న ఈ నోట్లను ఏం చేశారు? కరెన్సీ నోట్లను కాల్చివేశారా?.. లేక ఈ కరెన్సీ నోట్లను ఆర్బీఐ వద్దే దాచి పెట్టారా? లేక రీసైక్లింగ్ చేశారా? అంత విలువ చేసే నోట్లను ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.. -
రూ.2000 నోట్లను వదిలించుకోవడానికి వీళ్లంతా ఏం చేశారో చూడండి!
ఆర్బీఐ రూ. 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడా నోట్లను వదిలించేందుకు ప్రజలు రకరకాల మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు 72 శాతం క్యాష్ ఆన్ డెలివరీలు (సీవోడీ) వచ్చినట్లు తెలిపింది. సీవోడీ వినియోగించుకున్న కష్టమర్లు తమకు రూ.2,000 నోట్లు ఇచ్చినట్లు పేర్కొంది. (రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా?) ప్రజలు తమ వద్ద ఉన్న 2000 నోట్లను ఈ ఏడాది సెప్టెంబర్ 30లోగా డిపాజిట్ లేదా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చని ఆర్బీఐ సూచింది. ఆర్బీఐ ప్రకటన నేపధ్యంలో ప్రజలు రూ. 2000 నోట్లను వదిలించుకునేందుకు పెట్రోల్ బంకులకు బారులు తీరారు. (అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్!) since friday, 72% of our cash on delivery orders were paid in ₹2000 notes pic.twitter.com/jO6a4F2iI7 — zomato (@zomato) May 22, 2023 ఈ కామర్స్ సైట్లలో షాపింగ్ చేస్తున్నారు. గోల్డ్ కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. పెట్రోల్ బంకులకు, బంగారం షాపులకు, బారులుతీరారు. వెరసీ 11 వారాలలో తొలిసారి దేశంలో బంగారం అమ్మకాలు భారీ ఎత్తున జరిగినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. చదవండి👉 అయ్యో పాపం! ఐటీ ఉద్యోగులు.. అత్యంత చెత్త సంవత్సరంగా 2023! -
2022 మార్చికి చలామణిలో రూ.31 లక్షల కోట్ల విలువైన కరెన్సీ: కేంద్రం
న్యూఢిల్లీ: గత సంవత్సరం మార్చి నెలనాటికి దేశంలో రూ.31.33 లక్షల కోట్ల విలువైన కరెన్సీ చలామణిలో ఉందని కేంద్రం ప్రకటించింది. 2014 ఏడాదిలో చలామణిలో రూ.13 లక్షల కోట్ల కరెన్సీ ఉండగా గత మార్చికి ఇంతటి భారీ స్థాయికి పెరిగిందని సోమవారం లోక్‌సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. 2014 ఏడాది మార్చిలో డీజీపీలో 11.6 శాతంగా ఉన్న బ్యాంక్ నోట్లు, నాణేల వాటా 2022 మార్చి 25వ తేదీకల్లా 13.7 శాతానికి పెరిగింది. 2016 మార్చి నెలలో రూ.16.63 లక్షల కోట్ల కరెన్సీ చలామణిలో ఉండగా పాత పెద్ద నోట్ల రద్దు కారణంగా 2017 మార్చినాటికి కరెన్సీ చలామణి రూ.13.35 లక్షల కోట్లకు తగ్గింది. ఆ తర్వాత మళ్లీ చలామణిలో ఉన్న కరెన్సీ పెరుగుతూ పోయింది. చలామణిలో ఉన్న కరెన్సీ విలువ 2018 మార్చికి రూ.18.29 లక్షల కోట్లకు, 2019 మార్చినాటికి రూ.21.36 లక్షల కోట్లకు, 2020 మార్చినాటికి రూ.24.47 లక్షల కోట్లకు, 2021 మార్చి నాటికి రూ.28.53 లక్షల కోట్లకు, 2022 మార్చి నాటికి రూ.31.33 లక్షల కోట్లకు ఎగబాకింది. నల్ల ధనం చలామణికి చరమగీతం పాడటంతోపాటు డిజిటల్ ఆర్థికవ్యవస్థను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అడుగులువేసిందని మంత్రి ఉద్ఘాటించారు. -
ఇండియాగేట్‌కు గుమ్మడికాయ కడదాం!
కరెన్సీ నోట్ల, రూపాయి విలువ, ద్రవ్యోల్బణం, అరవింద్ కేజ్రీవాల్, ఇండియాగేట్, ఎలాన్ మస్క్, ట్విట్టర్, రిషి సునాక్, సరికొండ చలపతి ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ.. ‘ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లు పెట్టి ట్విట్టర్ కొన్నాడురా ‘వార్నీ! అంత డబ్బు ఎందుకు వేస్ట్ చేశాడు? మనలాగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోయేది కదా!’’ – ఫ్రెండ్ చమత్కారం ..... దాదాపు ఇంతే చమత్కార సూచన ఓ ముఖ్యమంత్రి నుంచి సీరియస్‌గా వచ్చింది. చూడండి: ‘‘ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదు. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బాగా తగ్గుతోంది. సామాన్య ప్రజలు కష్టాల్లో కూరుకుపోతున్నారు. దేవతల ఆశీస్సులు కావాలి. ఆ చిత్రాలను కరెన్సీ నోట్లపై ముద్రిస్తే వారి ఆశీర్వాదాలు మనకు లభిస్తాయి. మన నోట్లపై గణేశ్, లక్ష్మీదేవిల చిత్రాలు వేద్దాం. అప్పుడే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెంది భారతదేశం సంపన్న దేశంగా మారుతుంది.’’ – ఈ అరవింద్ కేజ్రీవాల్ సూచనను జనం కాసింత క్రేజీ ఐడియాగానే చూశారు. కరెన్సీ నోట్లపై అంబేడ్కర్, వల్లభభాయ్ పటేల్, భగత్‌సింగ్, సుభాష్ చంద్రబోస్, అబ్దుల్ కలాం ఇలాంటి వారి బొమ్మలు కూడా ఉండాలన్న దేశభక్తితో పాటు... లక్ష్మీదేవి, గణేశ్ లాంటి దేవుళ్ల ఫొటోలు ఉండాలన్న మతపర విశ్వాసాలు ఆక్షేపణీయమేమీకాదు. – కానీ.. పడిపోతున్న రూపాయి విలువ పెంచడానికి, ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టడానికి మూలికా వైద్యం స్థాయి చిట్కాలు... అదీ ఓ ముఖ్యమంత్రి నోట, అందునా ఓ ఐఐటీ మేధావి నోటి వెంట రావడం చర్చకు దారితీసింది. రిషి సునాక్! వింటున్నారా... కాసింత ముందుగా ఈ చిట్కా చెప్పివుంటే బాగుండేది. ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టలేక 45 రోజులకే బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేయాల్సిన అవసరం లేకపోయేది. బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం 10 శాతానికి చేరి, ధరాభారం మోయలేక సామాన్యులు నానా యాతనలు పడుతున్నారు. మినీ బడ్జెట్‌తో దాన్ని బాగు చేయలేక మార్కెట్లన్నీ కుదేలయి పోతుంటే విధిలేక ప్రధానిగా ట్రస్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇంత అద్భుతమైన ఐడియా ఆమె చెవిలో వేసుంటే బాగుండేది కదా, అక్కడి కరెన్సీపై వాళ్ల దేవుళ్ల బొమ్మ ముద్రించి బయటపడేది కదా. –అని నెటిజన్లు చురకలేస్తున్నారు. ‘‘రిషి సునాక్ .. వింటున్నారా? కేజ్రీవాల్ చెప్పిన మేడ్ ఈజీ ఫార్ములా, చిన్న చిట్కాతో మీ దేశం బాగుపడిపోతుంది.. అంటూ సరదా కామెంట్లు పెడుతున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతోపాటు అనేక కారణాలతో ప్రధాన దేశాలు ఆర్థిక మాంద్యం దిశలో నడుస్తున్నాయి. 2023 కల్లా దాదాపు సగానికి తగ్గొచ్చన్న సంకేతాలు వినపడుతున్నాయి. కేజ్రీవాల్ జీ! కరెన్సీ నోట్లపై దేవుళ్ల బొమ్మలు ముద్రించాలని ప్రధాని మోదీకి రాసే లేఖలో... ఈ చిట్కాను ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో కూడా ప్రస్తావించాలని కోరండి. ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యంలోంచి బయటపడే అవకాశం ఉంది. మాంకాళమ్మ, పోలేరమ్మ... ఇదేమీ సీరియస్ కాదు. మోదీ మత రాజకీయాలపై కేజ్రీవాల్ వ్యంగాస్త్రమిది. ముల్లును ముల్లుతోనే తీయాలనే వ్యూహం. ఇప్పుడు చూడండి బీజేపీ గింగిరాలు తిరుగుతోంది. –అని ఓ అభిమాని ఆనందం. అవునవును.. రూపాయికీ, గుజరాత్ ఎన్నికల్లోనూ దైవసాయం అవసరమే. అయితే, దీన్ని ఇంకా పవర్‌ఫుల్‌గా వాడుకోవచ్చుననే సలహా కూడా వినిపిస్తోంది.. గణేశ్, లక్ష్మీదేవిలతో పాటు మాంకాళమ్మ, పోలేరమ్మ, ఉప్పలమ్మ, కట్టమైసమ్మలాంటి గ్రామ దేవతల ఫొటోలు కూడా కరెన్సీ నోట్లపై ముద్రిస్తే... రూరల్ ఓటింగ్ అంతా మనకే. – సూపర్ ఐడియా! గుమ్మడికాయ మంత్రం... కేజ్రీవాల్ దారిలోనే ఇంకాస్త అడుగు ముందుకు వేసిన తుంటరి కుర్రాళ్లు ఇలా సూచిస్తున్నారు. ‘‘నిరుద్యోగం పెరిగిపోతోంది, పేదరికం పెరిగిపోతోంది, మన దేశ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే, జనం చేతిలో డబ్బులు ఆడడం లేదు. విద్య, వైద్యం పరిస్థితి ఏం బాగాలేదు. గ్రామాల పరిస్థితి అంతంతే. పట్టణాల్లో కాలుష్యం బాగా పెరిగి పోతోంది. టపాసులతో దీపావళి చేసుకునే పరిస్థితి లేదు. చాలా విషయాల్లో ఇతర దేశాలకన్నా వెనుకబడిపోతున్నాం. పైగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనాలనుంచి నరదిష్టి ఎక్కువయింది. వీటన్నింటికి విరుగుడుగా ఇండియా గేట్‌కు ‘గుమ్మడి కాయ’ కడితే ఫలితం ఉంటుందేమో. మేమయితే మా ఇంటికి గుమ్మడి కాయే కడుతున్నాం.’’ – మంచి చిట్కా యాక్ట్ ఆఫ్ గాడ్.. అంతా దైవికం! ఇలా దేవుడిని లాగడం గతంలో కూడా జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కరోనా వల్లే ఆర్థిక వృద్ధిరేటు తగ్గిందనీ, జీడీపీ తగ్గుముఖం పట్టడానికి, జీఎస్టీ వసూళ్లు తగ్గడానికి అదే కారణం అని అంతా ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ (దైవిక చర్య )అనడం పెనుదుమారమే లేపింది. మీ తప్పిదాలను దేవుడిపై నెడతారా అని విపక్షాలవారు, నెటిజన్లు విరుచుకు పడ్డారు. ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ కాదనీ, యాక్ట్ ఆఫ్ గవర్నమెంట్ అనీ విమర్శలు గుప్పించారు. అంతకుముందు సంవత్సరం పరిస్థితేమిటని ప్రశ్నించారు. యాక్ట్ ఆఫ్ గాడ్ పేరు మీద ప్రజలు పన్ను చెల్లించడం మానేస్తే ఓకేనా అని ప్రశ్నించారు. కాస్త కొంటె నెటిజన్లు ఇండియాలో ముక్కోటి దేవతలు ఉన్నారు. ఇంతకీ ఏ దేవుడి పుణ్యం ఇది అని వెక్కిరించారు. ముస్లిం దేవుళ్లు, క్రిస్టియన్ దేవుళ్లు, ఇతర మైనారిటీ మతాల దేవుళ్ల పాత్ర ఏమైనా ఉందా అని ట్రోల్ చేశారు. వారందరినీ కోర్టుకు లాగుతున్నారా లేదా అని వ్యంగాస్త్రాలు సంధించారు. కరెన్సీకి ఎక్స్పైరీ డేట్... కరెన్సీ ప్రస్తావన రాగానే గుర్తుకు వచ్చేది నవంబర్ 8, 2016 నాటి డీమానిటైజేషన్. పెద్ద నోట్ల రద్దు జరిగి ఇప్పటికి ఆరేళ్లు. నల్లధనం ఏమీ బయటికి రాకపోగా దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిందని విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ సందర్భంగా కరెన్సీపై 10వ తరగతి కుర్రాడి ఐడియా ఒకటి సోషల్ మీడియాలో నడుస్తోంది. అన్ని వస్తువులకు ఎక్స్పైరీ డేట్ ఉంటోంది కదా, కరెన్సీ నోట్లపై కూడా ఎక్స్పైరీ డేట్ ఎందుకు ఉండదు? ఎన్నేళ్ల దాకా చెల్లుబాటు అవ్వాలో మేధావులు ఆలోచించి వాటిపై కూడా ఐదేళ్లో ఆరేళ్లో ఎక్స్పైరీ డేట్ ముద్రించాలి. ఆ టైమ్ దాటాక ప్రజలు పాత నోట్లు తీసుకువెళ్లి కొత్తవి తీసుకుంటారు. అంటే కరెన్సీ అంతా బ్యాంకుకు వస్తుంది. ఇక నల్లధనం అనే మాట ఉండదు కదా. – మన ఐఐటీయన్ సీఎం ఐడియా కన్నా టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఐడియా బాగున్నట్లుంది కదా! (క్లిక్ చేయండి: ఉప ఎన్నికలూ జిందాబాద్!) -
మీకు తెలుసా! భారత కరెన్సీని ఏ పదార్ధంతో తయారు చేస్తారో!
మన దేశానికి చెందిన కరెన్సీని ఏ పదార్ధంతో చేస్తారు? అని ప్రశ్నిస్తే ఎక్కువ మంది కాగితమనే చెబుతారు. కానీ ఇందులో వాస్తవం ఏంటంటే! ఆర్బీఐ ఆధ్వర్యంలో తయారయ్యే కరెన్సీని కాటన్(పత్తి)తో పాటు మన్నికగా ఉండేందుకు ఇతర పదార్ధాల్ని వినియోగిస్తుంది. కాటన్‌తో తయారు చేసే నోట్లలో 75 శాతం కాటన్, 25 శాతం లినెన్ మిక్స్ ఉంటుంది. దీంతో పాటు కాటన్ ఫైబర్‌లో నార అనే ఫైబర్ ఉంటుంది. నోట్లను తయారుచేసేటప్పుడు అవి ఎక్కువ కాలం మన్నికగా ఉండేందుకు పత్తికి జెలటిన్ అనే అంటుకునే ద్రావణాన్ని కలుపుతారు. ఈ ద్రావణం కారణంగా కరెన్సీని ఈజీగా లెక్కించవచ్చు.ఫేక్ కరెన్సీని సులభంగా గుర్తించొచ్చు. పైగా మరింత సెక్యూర్‌గా ఉంటుంది. కరెన్సీ బలంగా, మృదువుగా ఉండేందుకు దోహదపడుతుంది. రాయల్ డచ్ కస్టర్స్ ప్రకారం..ఐరోపాలో కరెన్సీ నోట్ల కోసం కాంబర్ నాయిల్‌ను ఉపయోగిస్తారు. కాంబెర్ నోయిల్స్ కాటన్ మిల్లు వ్యర్ధాల నుంచి వెలికి తీసి తయారు చేస్తారు. యూఎస్ సైతం తన కరెన్సీ నోట్లకు నార నిష్పత్తికి సమానమైన పత్తిని ఉపయోగిస్తుంది. బ్యూరో ఆఫ్ ఎన్‌గ్రావింగ్ అండ్ ప్రింటింగ్ ప్రకారం..అమెరికన్ కరెన్సీ నోట్లలో 75 శాతం పత్తి, 25 శాతం నారతో తయారు చేయబడ్డాయి. -
2 వేల రూపాయల నోటుపై క్లారిటీ
న్యూఢిల్లీ: రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపివేతపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సోమవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘రూ.2 వేల నోట్ల ముద్రణ ఆపే విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని వివరించారు. ‘రూ.2 వేల నోట్లకు చిల్లర కొరతతో వినియోగదారులకు ఇబ్బందిగా మారింది. దీంతో, రూ.500, రూ.200 నోట్లుంచేందుకు ఏటీఎంలను సిద్ధం చేయాలని ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్ తమ అధికారులను ఆదేశించాయి’ అని వివరించారు. చారిత్రక కట్టడాల్లో చోరీలు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శ్రీ ఆనందవల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న నంది విగ్రహం, కర్ణాటకలోని సదాశివస్వామి గుడిలో రాగి కలశం చోరీకి గురయ్యాయని సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ లోక్‌సభకు తెలిపారు. రక్షిత చారిత్రక కట్టడాల వద్ద 280 మౌలిక సౌకర్యాల కల్పన ప్రాజెక్టులకు అనుమతులిచ్చినట్లు చెప్పారు. (చదవండి: కమల్‌ను కాపాడిన ‘కరోనా’) -
నోటుకో ప్రత్యేకత..!
సాక్షి, ఆలేరు: ఏ వస్తువు కొనాలన్నా డబ్బుతోనే ముడిపడి ఉంది. అందుకే పైపా మే పరమాత్మ అంటారు. డబ్బుకున్న విలువ అలాంటిది. అయితే నోటు అనేది సాధారణ కాగితం కాదు. దేశ సార్వభౌమాధికార చిహ్నం. వినిమయ సాధనంలో ద్రవ్యానిది ప్రత్యేక పాత్ర. మార్కెట్ క్రయవిక్రయాల్లో నోట్లదే ప్రధాన పాత్ర. అందుకే ప్రతిదేశం తమ దేశానికి సంబంధించి ప్రత్యేక కరెన్సీని ముద్రించుకుంటుంది. ఏ దేశంలో నోట్లు ఆ దేశంలోనే చెల్లుబాటు అవుతాయి. పరాయి దేశంలో మన దేశం నోటుకు విలువలేకున్నా వినిమయ శక్తి ఉంటుంది. ప్రతి దేశం పలు ప్రత్యేకతలతో భద్రతాపరమైన చర్యలతో నోట్లను ముద్రిస్తుంది. ఇందుకు దేశసార్వభౌమాధికార చిహ్నాలు, సంస్కృతి, సంప్రదాయాల ఆనవాళ్లు, జాతినేతల చిత్రాలను నోట్లపై పొందుపరుస్తుంటారు. ప్రస్తుతం నోట్లపై విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ కరెన్సీ (నోట్లు) వాటి విశిష్టతపై 'సాక్షి' అందిస్తున్న ప్రత్యేక కథనం. రూపాయి నోటు.. సాగర్ సామ్రాట్ మన కరెన్సీలో రూపాయి నోటుకి విశిష్ట ప్రాధాన్యం ఉంది. ఈ నోటు వెనుక సాగర్ సామ్రాట్ ఆయిల్రిగ్ కనబడుతుంది. ఓఎన్జీసీకి చెందిన ఈ ఆయిల్రిగ్ దేశ మౌలిక వసతులను తెలియజేస్తుంది. 100 రూపాయల నోటు.. మన జాతి ఔన్నత్యం వంద నోటు వెనుక భాగంలో ప్రపంచంలో ఎత్తయిన పర్వాతాలైన హిమాలయాలను చూడొచ్చు. ఇందులో సుమారు నూరు శిఖరాలు 7200 మీటర్లు ఎత్తుకు మించి ఉన్నాయి. ఆసియాలో బూటాన్, చైనా, భారతదేశం, నేపాల్, పాకిస్థాన్‌లో ఇవి వ్యాపించి ఉన్నాయి. మనే దేశానికి ఇవి పెట్టని కోటగోడలు. 2 రూపాయల నోటు.. పులికి గౌరవం రెండు రూపాయల నోటుపై మన జాతీయ జంతువు పులి బొమ్మ ఉంటుంది. వన్యప్రాణుల సంరక్షణకు ప్రాముఖ్యతనిస్తూ నోటుపై ఈ బొమ్మ ముద్రించారు. 5 రూపాయల నోటు.. వ్యవసాయం ఐదు రూపాయల నోటు వెనుక ముద్రించిన ట్రాక్టర్ వ్యవసాయ పనులను, నిర్మాణరంగంలో ఎక్కువగా వాడుకలో ఉన్న కార్యకలాపాలను తెలియజేస్తుంది. ట్రాక్టర్ అనే పదం ట్రహేర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. దేశం వ్యవసాయ రంగానికి వెన్నెముక లాంటిదని తెలియజేసే లక్ష్యంతోనే ఐదు రూపాయల నోటుపై ఈ బొమ్మ ముద్రించారు. 20 రూపాయల నోటు.. పార్క్‌కు హోదా ఇరవై రూపాయల నోటుపై అండమాన్ నికో బార్ దీవుల్లోని మౌంట్ హేరియంట్ నేషనల్ పార్కు బొమ్మను ముద్రించారు. దీన్ని 1979లో నిర్మించారు. ఈ పార్క్ విస్తీర్ణం 46.62 కిలోమీటర్లు, పోర్టుబ్లెయిర్ అండమాన్‌కు కేపిటల్. 2000 రూపాయల నోటు.. శాస్త్ర సాంకేతికత పెద్ద నోట్ల రద్దు తర్వాత రెండు వేల రూపాయల నోటును రిజర్వ్ బ్యాంకు అమల్లోకి తెచ్చింది. ఈ నోటు ముందు భాగంలో మహాత్మాగాంధీ బొమ్మ, కుడివైపు అశోకుడి స్థూపం ముద్రించారు. వెనుక వైపు స్వచ్చభారత్లోగో, మంగళ్యాన్ ప్రయోగ చిహ్నం ముద్రించారు. గులాబీ రంగులో ఉన్న ఈ నోటు ముద్రణలో 19 జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ చర్యల వల్ల ఈ నోటును నకిలీ చేయడం సాధ్యం కాదని కేంద్రం చెబుతోంది. 500 రూపాయల నోటు.. ఎర్రకోట భారతదేశ అద్భుత కట్టడాల్లో ఎర్రకోట ఒకటి. స్వాతంత్య్ర సంబ రాలకు చిహ్నం. అదే ఢిల్లీలోని ఎర్రకోట. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో మువ్వన్నెల జెండాను ప్రధాని ఎగురవేస్తారు. ఈ కోటకు 360 ఏండ్ల చరిత్ర ఉంది. దీని నిర్మాణాన్ని 1638లో మొదలు పెడితే 1648లో పూర్తయింది. యమున నది ఒడ్డున ఇది ఉంది. మొత్తం 120 ఎకరాల స్థలంలో దీనిని నిర్మించారు. 10 రూపాయల నోటు.. వన్యప్రాణులు పది రూపాయల నోటు వెనుక వన్యప్రాణులైన ఏనుగు, పులి, ఖడ్గమృగం బొమ్మలు కనిపిస్తాయి. భారతీయ ఖడ్గమృగం ఓ పెద్ద క్షీరదం నేపాల్, భారత్, అస్సోంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ఇవి పరిగెత్తగలవు. ఈతలో ప్రావీణ్యం ఉన్న జంతువు, మందమైన చర్మం కలిగి ఉంటుంది. ఆసియన్ ఏనుగులు ఆఫ్రికా ఏనుగుల కంటే చిన్నవిగా ఉంటాయి. రెండువేల నుంచి ఐదువేల కేజీల వరకు బరువు ఉంటుంది. బెంగాల్ టైగర్‌ను రాయల్ బెంగాల్ టైగర్ అని అంటారు. ఇది మన జాతీయ జంతువు. -
‘ఆ నోట్లు నేపాల్‌లో చెల్లవు’
-
‘ఆ నోట్లు నేపాల్‌లో చెల్లవు’
ఖట్మండు : రూ వందకు పైబడిన భారత కరెన్సీ నోట్ల వాడకాన్ని నేపాల్ కేంద్ర బ్యాంక్ నిషేధించింది. రూ 2000, రూ 500, రూ 200 నోట్ల వాడకం చెల్లదని బ్యాంక్ పేర్కొంది. నేపాల్ రాష్ట్ర బ్యాంక్ జారీ చేసిన ఉత్తర్వులు భారత పర్యాటకులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. రూ 100కు మించిన భారత నోట్లతో కూడిన లావాదేవీలు, వాటిని కలిగిఉండటం, ట్రేడింగ్ చేయడం నిషేధిస్తూ నేపాల్ రాష్ట్ర బ్యాంక్ అక్కడి ట్రావెల్ సంస్ధలు, బ్యాంకులు, ఆర్థిక సంస్ధలకు సర్క్యులర్ జారీ చేసిందని ఖట్మండు పోస్ట్ పేర్కొంది. భారత్ మినమా మరే ప్రాంతానికి ఈ నోట్లను నేపాల్ పౌరులు తీసుకువెళ్లరాదని స్పష్టం చేసింది. ఇతర దేశాల నుంచి భారత కరెన్సీని నేపాల్‌కు తీసుకురావడం నిషిద్ధమని తమ పౌరులకు జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. భారత్‌కు చెందిన రూ 100 అంతకు లోపు ఉన్న నోట్లను ట్రేడింగ్, మార్పిడికి అనుమతిస్తామని బ్యాంక్ తెలిపింది. కాగా నేపాల్ కేంద్ర బ్యాంక్ ఉత్తర్వులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశ పర్యాటక రంగానికి ఇది తీవ్ర విఘాతమని ట్రావెల్ వ్యాపారులు, వాణిజ్యవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. -
భారతీయ కరెన్సీని చట్టబద్ధం చేయండి
కఠ్మాండ్: నోట్ల రద్దు అనంతరం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెద్ద నోట్లను నేపాల్‌లో చట్టబద్ధం చేయాలని కోరుతూ ఆ దేశ ప్రభుత్వం భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ)కి లేఖ రాసింది. దేశంలో ప్రసుత్తం చలామణి అవుతున్న రూ. 200, రూ. 500, రూ. 2,000 కొత్త నోట్లకు సంబంధించిన బ్యాంకు బిల్లులకు చట్టబద్ధత కల్పించాలని కోరింది. ఈ మేరకు నేపాల్ రాష్ట్ర బ్యాంకు (ఎన్ఆర్బీ) శుక్రవారం ఆర్బీఐకు లేఖ రాసినట్లు స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది. నేపాలీల వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకునే సౌలభ్యం కల్పించాలని కూడా లేఖలో విజ్ఞప్తి చేసింది. నోట్ల రద్దు అనంతరం నేపాల్‌లో రూ. 100, అంతకంటే తక్కువ విలువున్న నోట్ల చలామణికి మాత్రమే ఆర్బీఐ అనుమతిచ్చింది. భారత్ ప్రవేశపెట్టిన కొత్త నోట్లకు నేపాల్‌లో చట్టబద్ధత కల్పించకపోవడంతో పెద్ద నోట్లను రద్దు చేయాలని ఇటీవల నిర్ణయించినట్లు ఎన్ఆర్బీ అధికారి ఒకరు వెల్లడించారు. దీనిపై పలు రంగాల ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో వెనక్కుతగ్గామని పేర్కొన్నారు. -
పెద్ద నోట్లు రద్దు: షాకిచ్చిన నేపాల్
ఖాట్మండు: నేపాల్ ప్రభుత్వం భారీ షాకిచ్చింది. భారతీయ కరెన్సీ రూ .2,000, రూ 500, రూ.200 ల నోట్లను నిషేధించింది. స్థానిక మీడియా అందించిన సమాచారం ప్రకారం రూ.100 కంటే ఎక్కువ విలువ కలిగిన భారతీయ నోట్లు చలామణిని చట్టబద్దంగా రద్దు చేసింది. రూ. 100పైన విలువ ఉన్నభారతీయ కరెన్సీని తమ వద్ద ఉంచుకోవద్దని నేపాల్ ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. తాజా నిర్ణయం ప్రకారం 100రూపాయలు, ఆలోపు విలువగల భారతీయ నోట్లు మాత్రమే అక్కడ చలామణిలో ఉంటాయన్నమాట. భారత్ కరెన్సీ రూ.2000, రూ.500, రూ.200 నోట్ల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు నేపాల్ సమాచార, ప్రసార శాఖ మంత్రి, నేపాల్ ప్రభుత్వ ప్రతినిధి గోకుల్ ప్రసాద్ బస్కోట ప్రకటించారని ఖాట్మండు పోస్ట్ రిపోర్టు చేసింది. తాజా నిర్ణయం భారతదేశంలో పనిచేసే నేపాల్ కార్మికులను భారీగా ప్రభావితం చేయనుంది. అలాగే నేపాల్‌ను సందర్శించే భారత పర్యాటకులకు కూడా ఇబ్బందులు తప్పవు. కాగా 2016లో పెద్ద నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లను ప్రవేశపెట్టింది భారత ప్రభుత్వం. అయితే ఆ సమయంలో ఎటువంటి ప్రకటనా చేయని నేపాల్ ప్రభుత్వం అకస్మికంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించింది. -
‘నోట్లపై గాంధీని తీసి సావర్కర్‌ను పెట్టండి’
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ కరెన్సీ నోట్లపై జాతిపిత మహాత్మ గాంధీ ఫొటోను తొలగించి వీడీ సావర్కర్ ఫొటో పెట్టాలని అఖిల భారత హిందూ మహాసభ(ఏబీహెచ్ఎం) కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ.. కొత్త వివాదానికి తెర తీసింది. సోమవారం సావర్కర్ జయంతి (మే 28) సందర్భంగా ఏబీహెచ్ఎం చీఫ్ స్వామి చక్రపాణి మీడియాతో మాట్లాడుతూ.. భారత దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో స్ఫూర్తి నింపిన సావర్కర్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నోట్లపై జాతిపిత గాంధీ బొమ్మ స్థానంలో సావర్కర్ బొమ్మ ముద్రించాలని ఏబీహెచ్ఎం కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు వెల్లడించారు. సావర్కర్ పూర్తి పేరు వినాయక దామోదర సావర్కర్, హిందుత్వ అనే పదాన్ని ఖాయం చేసింది ఈయనే. ఆయన రాసిన ‘హిందుత్వ: హు ఇజ్ హిందు’ బాగా ప్రచుర్యం పొందింది. 1923లో ఆయన ఈ పుస్తకాన్ని రచించారు. -
విమానంలో వ్యాపారవేత్తకు చేదు అనుభవం
సాక్షి, న్యూఢిల్లీ : ఓ వ్యాపారవేత్తకు విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. భారత కరెన్సీ చెల్లక పోవడం వివాదాస్పదంగా మారింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఇండియన్ బిజినెస్ మ్యాన్ ప్రమోద్ కుమార్ జైన్ ఇటీవల బెంగళూరు నుంచి దుబాయికి ఇండిగో విమానంలో ప్రయాణించారు. అయితే తాను ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో ఏదో వస్తువు కొనుగోలు చేయడం లేదా అవసరాల నిమిత్తం మన కరెన్సీని చెల్లించాలని చూడగా కరెన్సీ చెల్లదంటూ సిబ్బంది వాటిని తిరస్కరించారు. దేశానికి చెందిన కరెన్సీ చెల్లదని భారత్ నుంచి వెళ్తున్న విమానంలో చెప్పడంతో వ్యాపారవేత్త ప్రమోద్ కుమార్ కంగుతిన్నారు. దేశం నుంచి నడుస్తున్న విమానంలో భారత కరెన్సీ చెల్లదని చెప్పడం దేశద్రోహ చర్యగా పరిగణిస్తారు. దీనిపై తాను ఢిల్లీ పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. భారతీయుల గౌరవ చట్టం 1971 ప్రకారం స్వదేశంలోనే కరెన్సీ చెల్లదని, స్వీకరించకపోవడం ఉల్లంఘన కిందకి వస్తుందన్నారు. తాను ఫిర్యాదు చేసిన కేసుపై డిసెంబర్ 15న విచారణ జరగనున్నట్లు ప్రమోద్ కుమార్ జైన్ వివరించారు. స్వదేశం నుంచి తిరుగుతున్న విమానాల్లోనే మన కరెన్సీ చెల్లదంటూ, ఆ డబ్బును వెనక్కి ఇవ్వడం చాలా దారుణమని అభిప్రాయపడ్డారు. -
భారీ ఎత్తున బంగారం, కరెన్సీ పట్టివేత
న్యూఢిల్లీ: రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) భారీ ఎత్తున బంగారాన్ని, అక్రమ కరెన్సీని స్వాధీనం చేసుకుంది. ఢిల్లీ జోనల్ యూనిట్ నల్లధనం,బంగారం అక్రమ రవాణా వెలికితీతలో భాగంగా దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో 20.64 కిలోల బంగారాన్ని, 6.44 కోట్ల రూపాయలను సీజ్ చేసింది. పాత ఢిల్లీ ప్రాంతంలో రాజేష్ గుప్తా కి చెందిన ఒక దుకాణంనుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు. పంకజ్ కుమార్ అనే వ్యాపారి అక్రమ బంగారాన్ని అమ్మినట్టుగా డీఆర్ఐ అధికారి తెలిపారు. ఇరువురినీ అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీ తరలించామన్నారు. విచారణ కొనసాగుతుందని చెప్పారు. 995 స్వచ్ఛత 1 కిలో బరువు తూగే 20విదేశీ బార్లనుతో పాటు నగదు మొత్తం మొత్తం విలువ సుమారు రూ 12.91 కోట్లు ఉంటుందని ప్రకటించారు. బ్లాక్ మనీ, అక్రమంగా రవాణా అవుతున్న విదేశీ బంగారానికి వ్యతిరేకంగా తమ డ్రైవ్ తో కొనసాగుతుందని తెలిపారు. కాగా గత నెల, డిఆర్ఐ ఢిల్లీ జోనల్ యూనిట్ రూ 2,000 కోట్ల విలువైన సుమారు 7,000 కిలోగ్రాముల బంగారాన్ని సీజ్ చేసిన సంగతి తెలిసిందే. -
రూపాయి జూమ్
ముంబై: ఎన్డీయే ఘన విజయంతో రూపాయి దూసుకుపోయింది. డాలర్‌తో పోలిస్తే 50 పైసలు పెరిగి 58.79 వద్ద ముగిసింది. ఇది 11 నెలల గరిష్టం. ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం కొనసాగించడంతో రూపాయి వరుసగా మూడో రోజూ బలపడినట్లయింది. గడచిన 3 రోజుల్లో రూపాయి మారకం విలువ మొత్తం 126 పైసలు (2.10 శాతం) పెరిగింది. శుక్రవారం ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి ట్రేడింగ్ క్రితం ముగింపు 59.29 కన్నా మెరుగ్గా 59 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత 58.62 - 59.11 శ్రేణిలో తిరుగాడింది. చివరికి 0.84 శాతం లాభంతో 58.79 వద్ద ముగిసింది. 2013 జూన్ 19 తర్వాత రూపాయి మారకం విలువ ఈ స్థాయికి రావడం ఇదే ప్రథమం. అప్పట్లో దేశీ కరెన్సీ 58.70 వద్ద ముగిసింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నికరంగా రూ. 3,635 కోట్ల మేర ఈక్విటీలను కొనుగోలు చేయడం.. రూపాయి విలువ పెరిగేందుకు దోహదపడింది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం సాధించడంతో భారత మార్కెట్లపై ఆశాభావం పెరిగిందని అడ్మిసి ఫారెక్స్ ఇండియా డెరైక్టర్ సురేశ్ నాయర్ చెప్పారు. రాబోయే రెండు, మూడు నెలల్లో కొత్త ప్రభుత్వం తీసుకోబోయే ఆర్థిక, ద్రవ్యపరమైన చర్యలు భారత సావరీన్ క్రెడిట్ రేటింగ్‌పై ప్రభావాలు చూపే అవకాశం ఉందని స్టాండర్డ్ అండ్ పూర్స్ రేటింగ్స్ సర్వీసెస్ తెలిపింది.