‘నోట్లపై గాంధీని తీసి సావర్కర్‌ను పెట్టండి’ | Hindu Mahasabha Demands Veer Savarkar Picture On Indian Currency | Sakshi

May 29 2018 1:06 PM | Updated on May 29 2018 4:03 PM

Hindu Mahasabha Demands Veer Savarkar Picture On Indian Currency - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ కరెన్సీ నోట్లపై జాతిపిత మహాత్మ గాంధీ ఫొటోను తొలగించి వీడీ సావర్కర్‌ ఫొటో పెట్టాలని అఖిల భారత హిందూ మహాసభ(ఏబీహెచ్‌ఎం) కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ.. కొత్త వివాదానికి తెర తీసింది. సోమవారం సావర్కర్‌ జయంతి (మే 28) సందర్భంగా ఏబీహెచ్‌ఎం చీఫ్‌ స్వామి చక్రపాణి మీడియాతో మాట్లాడుతూ.. భారత దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో స్ఫూర్తి నింపిన సావర్కర్‌కు  దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. నోట్లపై జాతిపిత గాంధీ బొమ్మ స్థానంలో  సావర్కర్‌ బొమ్మ ముద్రించాలని ఏబీహెచ్‌ఎం కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు వెల్లడించారు. 

సావర్కర్‌ పూర్తి పేరు వినాయక దామోదర సావర్కర్‌, హిందుత్వ అనే పదాన్ని ఖాయం చేసింది ఈయనే. ఆయన రాసిన ‘హిందుత్వ: హు ఇజ్‌ హిందు’ బాగా ప్రచుర్యం పొందింది. 1923లో ఆయన ఈ పుస్తకాన్ని రచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement