Veer Savarkar
-
నాన్న ఆస్తిని అమ్మేశా, ఎవరూ సాయం చేయలేదు: నటుడు
బయోపిక్ చేయాలంటే ముందు కంటెంట్ తెలుసుండాలి, తర్వాత దాన్ని తెరకెక్కించేందుకు గట్స్ ఉండాలి. ఈ రెండూ ఉన్నందువల్లే స్వతంత్ర సమరయోధుడు సావర్కర్ జీవితాన్ని తెరపై చూపించాలని ఆరాటపడ్డాడు నటుడు రణ్‌దీప్ హుడా. ఈయన ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం స్వాతంత్య్ర వీర్ సావర్కర్. ఈ మూవీ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్డ్ రివ్యూలు అందుకుంటున్న ఈ చిత్రం ఇప్పటివరకు రూ.13 కోట్లు మాత్రమే రాబట్టింది. క్వాలిటీగా తీయాలన్న ధ్యాసే లేదు తాజాగా అతడు ఈ బయోపిక్ కోసం పడ్డ కష్టాలను ఏకరువు పెట్టాడు. 'ఈ సినిమాను గతేడాది ఆగస్టు 15న విడుదల చేయాలనుకున్నాను, లేదంటే ఈ ఏడాది జనవరి 26కు రిలీజ్ చేద్దామనుకున్నాను. అందుకోసం ఎంతో కష్టపడ్డాను. కానీ ఏదీ జరగలేదు. మా టీమ్‌లో ఉన్నవారికి సినిమా చేద్దామని ఉందే తప్ప క్వాలిటీగా తీయాలన్న ధ్యాసే లేదు. దానికి తోడు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. నా సినిమాకు ఎవరూ సపోర్ట్ చేయలేదు. దీంతో మా నాన్న నాకోసం పైసాపైసా కూడబెట్టి కొన్న ముంబైలోని రెండు, మూడు ప్లాట్లను అమ్మేశాను. కాలికి దెబ్బ తగిలి.. మరోవైపు నా బరువు తగ్గించేందుకు కష్టాలు పడ్డాను. కేవలం బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, మంచినీళ్లు.. ఇదే నా మెనూ అయిపోయింది. తర్వాత చాక్లెట్స్, నట్స్ తినడం మొదలుపెట్టాను.. అయినా సరే, సరైన తిండి లేకపోవడంతో ఒక్కోసారి సెట్స్‌లో పడిపోయేవాడిని. ఒకసారి గుర్రంపై స్వారీ చేస్తూ కింద పడ్డాను. కాలికి బాగా దెబ్బ తగిలి రెండు నెలలు నడవలేకపోయాను. అప్పుడు కూడా అన్నం తినకుండా డైట్ కంటిన్యూ చేశా. ఒక చెంచా బాదం బటర్, ఒక చెంచా కొబ్బరి నూనె, కొన్ని నట్స్.. ఇదే నా రోజూవారి ఆహారం. ఈ డైట్ మెయింటెన్ చేస్తూ మూడు పనులు (డైరెక్షన్, యాక్టింగ్, ప్రొడ్యూసింగ్) చేయడం వల్ల తీవ్ర ఒత్తిడికి లోనయ్యాను. నిద్రమాత్రలు వేసుకున్నా ఒక్కోసారి సరిగా నిద్రపోయేవాడినే కాదు. ఒక్కోసారి సావర్కర్ సెట్స్‌లోనే ఉన్నట్లుగా ఓ నీడ కనిపించేది' అని చెప్పుకొచ్చాడు. చదవండి: తెలుగులో ఆ సినిమాతో ఫుల్ క్రేజ్.. వివాదాలతో వార్తల్లో.. ఎవరో గుర్తుపట్టారా? -
ఇదేందయ్యా సామీ.. అస్థిపంజరంలా అయిపోయావ్!
ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా కొత్త లుక్‌తో షాకిచ్చాడు. ఈసారి ఏదో హెయిర్ స్టైలో, డ్రెస్సింగ్ స్టైలో మార్చలేదు. ఏకంగా బక్కచిక్కిపోయి అస్థిపంజరంలా దర్శనమిచ్చాడు. స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న స్వతంత్ర వీర్ సావర్కర్ మూవీ కోసమే ఇలా అయిపోయాడు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా రణ్దీపే స్వయంగా దర్శకత్వం వహిస్తుండటం విశేషం. సోమవారం (మార్చి 18) నాడు అద్దం ముందు సెల్ఫీ దిగి ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు రణ్‌దీప్. మీరు గ్రేట్ సార్ ఇది చూసిన జనాలు అతడిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్, ఇలాంటివాళ్లు కదా అసలైన యాక్టర్స్ అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. హీరోలు సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ ట్రై చేయడం చూశాం.. అవసరమైతే మాస్, క్లాస్ లుక్‌లో కనిపించడం చూశాం.. కానీ ఓ సినిమా కోసం తిండీనిద్ర మానేసి మరీ ఇంతలా పీక్కుపోయినట్లుగా తయారైన వ్యక్తిని నిన్నే చూస్తున్నాం అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే వీరసావర్కర్ మూవీ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. కెరీర్ అలా మొదలైంది.. కాగా 2001లో మాన్సూన్ వెడ్డింగ్ సినిమా ద్వారా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు రణ్‌దీప్ హుడా. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, బివి ఔర్ గ్యాంగ్‌స్టర్, జన్నత్ 2, జిస్మ్ 2, కాక్టెయిల్, కిక్ (బాలీవుడ్), రసియా, సర్బజిత్, హైవే వంటి చిత్రాల్లో నటించాడు. గతంలో మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో డేటింగ్ చేశాడు. ఆమెకు బ్రేకప్ చెప్పిన తర్వాత నటి లిన్ లైస్రామ్‌తో ప్రేమలో పడ్డాడు. గతేడాది నవంబర్‌లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. View this post on Instagram A post shared by Randeep Hooda (@randeephooda) చదవండి: ఎంత పెద్ద స్టార్ అయితే ఏంటి? అసభ్యంగా ఫోటోలు దిగే వ్యక్తి.. -
సావర్కర్‌ను అవమానిస్తే.. దోస్తీ కటీఫ్!
ముంబై: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్దవ్ థాక్రే హెచ్చరికలు జారీ చేశారు. వినాయక్ దామోదర్ సావర్కర్(వీర సావర్కర్)ను అవమానిస్తే చూస్తూ ఊరుకోబోమని.. ఇది విపక్ష కూటమిలో విభేదాలకు దారి తీయొచ్చని సున్నితంగా రాహుల్‌ను మందలించారు. ఆదివారం మాలేగావ్‌లో జరిగిన ఓ ర్యాలీలో ఉద్దవ్ థాక్రే ప్రసంగిస్తూ.. ‘‘వీరసావర్కర్ మా దేవుడు. ఆయన్ని అవమానించేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు. మా దేవుళ్లను అంటూంటే మేం చూస్తూ ఊరుకోవాలా?’’ అని థాక్రే అభ్యంతరం వ్యక్తం చేశారు. సావర్కర్ 14 ఏళ్లపాటు అండమాన్ జైల్లో చిత్రహింసలు అనుభవించారు. అది ఊహాకు కూడా అందనిది. అదొక త్యాగం. అలాంటి త్యాగాలను అవమానిస్తే ఊరుకోవాలా? అని రాహుల్ గాంధీని ఉద్దేశించి థాక్రే ప్రసంగించారు. అయితే.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది. కానీ, రాహుల్ గాంధీని ఉద్దేశ్యపూర్వకంగా తన వ్యాఖ్యలతో రెచ్చగొడుతున్నారని, తద్వారా పోరాట సమయం వృథా అవుతోంది అని ఉద్దవ్ థాక్రే అభిప్రాయపడ్డారు. ఇదిలా ఇలాగే కొనసాగితే.. విపక్ష కూటమి ముక్కలయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చివర్లో హెచ్చరించారు కూడా. తాజాగా అనర్హత వేటు ఎదుర్కొన్న రాహుల్ గాంధీ మీడియా ముందు మాట్లాడుతూ.. ‘క్షమాపణలు చెప్పేందుకు తానేం సావర్కర్‌ను కాదని, తాను గాంధీనని, గాంధీ ఎవరికీ క్షమాపణలు చెప్పినట్లు చరిత్రలో లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపైనే థాక్రే అభ్యంతరం వ్యక్తం చేశారు. 2019 కర్నాటక ఎన్నికల ర్యాలీ సందర్భంగా.. మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలు, పరువు నష్టం దావా.. చివరకు తాజాగా ఈ కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడింది రాహుల్ గాంధీకి. ఆ వెంటనే ఆయన లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. అయితే ఈ పరిణామాలపై మిత్రపక్షం శివసేన (యూబీటీ) రాహుల్‌కు మద్దతుగా నిలిచింది. రాహుల్‌పై బీజేపీ విమర్శలను స్వయంగా తిప్పికొట్టారు ఉద్దవ్ థాక్రే. ‘‘మోదీ భారతదేశం కాదు. మన స్వాతంత్ర్య సమరయోధులు ఇందుకోసమే ప్రాణాలర్పించారా? మోదీని ప్రశ్నించడం అంటే.. భారత్‌ను అవమానించడం ఏమాత్రం కాదు’’ అని థాక్రే వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: లోక్‌సభ ఎన్నికలపై కమల్ హాసన్ కామెంట్ -
అసెంబ్లీలో వీర్ సావర్కర్ చిత్రపటంపై రగడ.. నిరసనకు దిగిన ప్రతిపక్షం
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలిరోజే ఆందోళనల పర్వం కొనసాగింది. శాసనసభలో వీర్ సావర్కర్ చిత్రపటాన్ని పెట్టడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. తమను సంప్రదించకుండా వివాదాస్పద వ్యక్తి ఫొటోను ఎలా పెడతారని మండిపడింది. ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి శాసనసభ బయట ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళనకు దిగారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వ అవినీతిపై తాము ప్రశ్నలు లేవనెత్తుతామని బొమ్మై సర్కార్‌కు తెలుసునని, అందుకే సభా కార్యకాలాపాలు జరగకుండా కావాలనే వీర్ సావర్కర్ బొమ్మ పెట్టారని డీకే శివకుమార్ ఆరోపించారు. ఇది చూసి తాము ఆందోళనలకు దిగుతామని బీజేపీకి తెలుసునని పేర్కొన్నారు. వెంటనే ఆయన ఫొటోను అసెంబ్లీ నుంచి తొలిగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు వీర్ సావర్కర్‌పై తప్పుడు ప్రచారాన్ని పోగెట్టేందుకు తాము రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని బీజేపీ చెబుతోంది. ఆయన గౌరవార్థమే అసెంబ్లీ ఫొటో పెట్టినట్లు పేర్కొంది. బెళగావితో ఆయనకు అవినావ సంబంధం ఉందని చెప్పింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో సావర్కర్ విషయంపై ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సావర్కర్ బ్రిటిష్ వాళ్లకు భయపడి క్షమాభిక్ష కోరిన వ్యక్తి అని కాంగ్రెస్ చెబుతోంది. ఇది తప్పుడు ప్రచారం అని, ఆయన స్వతంత్ర సమరయోధుడని బీజేపీ వాదిస్తోంది. చదవండి: ప్రధాని మోదీతో భేటీకి ముందు సీఎంకు షాక్.. -
రాహుల్ వ్యాఖ్యలపై రగడ.. మహా వికాస్ అగాడీకి బీటలు?
ముంబై: వీర సావర్కార్‌పై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ విమర్శలు మహారాష్ట్రలో రాజకీయ కాక రేపుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో భారత్ జోడో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గురువారం సావర్కర్‌పై తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే. ఆయన బ్రిటిష్ వారికి భయపడి క్షమాభిక్ష కోరారని, గాంధీ, పటేల్, నెహ్రూ వంటి స్వాతంత్య్ర సమర యోధులకు ద్రోహం చేశారని ఆరోపణలు గుప్పించారు. వీటిపై కాంగ్రెస్ మిత్రపక్షమైన శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం మండిపడుతోంది. ఇందుకు నిరసనగా కాంగ్రెస్, ఎన్సీపీలతో కూడిన మహా వికాస్ అగాడీ నుంచి బయటికి వచ్చే ఆలోచన కూడా చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. రాహుల్ వ్యాఖ్యలను ఉద్ధవ్ ఠాక్రే వెంటనే ఖండించడం తెలిసిందే. మహారాష్ట్రులకు ఆరాధ్యుడైన సావర్కర్ వ్యతిరేక వ్యాఖ్యలను తాము సహించే ప్రసక్తే లేదని ఉద్ధవ్ వర్గానికి చెందిన నేత అరవింద్ సావంత్ కుండబద్దలు కొట్టారు. ఇటీవలే రాహుల్‌తో కలిసి జోడో యాత్రలో నడిచిన ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా తాజాగా అదే మాట చెప్పారు. రాహుల్ అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని ఉద్ధవ్ వర్గం సీనియర్ నేత సంజయ్ రౌత్ కూడా శనివారం అభిప్రాయపడ్డారు. అవి అగాడీ కూటమి మనుగడపై ప్రభావం చూపుతాయంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ కాకను మరింత పెంచేలా సావర్కర్‌పై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే శనివారం మరిన్ని విమర్శలు గుప్పించారు! బ్రిటిష్ వారి నుంచి సావర్కర్ రూ.60 పెన్షన్ తీసుకున్నారంటూ మరోసారి వివాదాల తేనెతుట్టెను కదిపారు. రాహుల్ వ్యాఖ్యలను విమర్శిస్తున్న వారు ముందుగా దీనికి బదులివ్వాలన్నారు. మరోవైపు ఉద్ధవ్‌కు సావర్కర్‌పై ఏ మాత్రం గౌరవమున్నా కాంగ్రెస్‌కు తక్షణం గుడ్‌బై చెప్పాలని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రావ్‌సాహెబ్ దన్వే శనివారం డిమాండ్ చేశారు. ఆ ఉద్దేశముందో లేదో చెప్పాలని సవాలు చేశారు. -
వీర్ సావర్కర్ పై రాహుల్ గాంధీ మాట్లాడిన దాంట్లో తప్పులేదు : జగ్గారెడ్డి
-
కాంగ్రెస్ బ్లండర్.. స్వాతంత్ర్య సమరయోధుల పక్కన సావర్కర్ ఫోటో
తిరువనంతపురం: భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ బ్లండర్ మిస్టేక్ చేసింది. పార్టీ ఏర్పాటు చేసిన బ్యానర్లో స్వాతంత్ర్య సమరయోధులతో పాటు వీర్ సావర్కర్ ఫోటో ఉంది. ప్రస్తుతం యాత్ర 14వ రోజుకు చేరుకుని కేరళలో కొనసాగుతోంది. ఎల్డీఎఫ్ మద్దతుతో గెలిచిన స్వతంత్ర్య్ ఎమ్మెల్యే పీవీ అన్వర్ కాంగ్రెస్ బ్యానర్లో సావర్కర్ ఫోటోను గుర్తించి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్తా వైరల్‌గా మారింది. అయితే ప్రింట్ మిస్టేక్ వల్లే బ్యానర్లో పొరపాటుగా సావర్కర్ ఫోటో పడిందని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. సావర్కర్ ఫోటోపై గాంధీ ఫోటోను అంటింటి తప్పును కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. వీర్ సావర్కర్‌ను కాంగ్రెస్ ఏనాడూ స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తించలేదు. ఆయన బ్రిటీష్ వాళ్లకు క్షమాపణలు చెప్పిన బలహీనమైన వ్యక్తి అని విమర్శలు చేసింది. అలాంటిది ఆయన ఫోటో ఇప్పుడు కాంగ్రెస్ బ్యానర్లో కన్పించడం రాజకీయ ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లయింది. దీన్నే అదనుగా తీసుకున్న బీజేపీ కాంగ్రెస్‌పై సెటైర్లు వేసింది. హస్తం పార్టీ ఇప్పుడైనా నిజం తెలుసుకుని వీర్ సావర్కర్‌ను స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తించిందని పేర్కొంది. రాహుల్ గాంధీ ఇప్పుడైనా తేరుకోవడం శుభపరిణామం అని పంచులు వేసింది. చదవండి: ఇద్దరు కాదు ముగ్గురు.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తెరపైకి కొత్త పేరు -
సినిమా కోసం 18 కేజీల బరువు తగ్గిన హీరో, అవాక్కవుతున్న ఫ్యాన్స్
భారత స్వాతంత్య్ర సమరయోధుల్లో ఒకరైన వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితం వెండితెరపైకి రానుంది. ఈ బయోపిక్కు ‘స్వాతంత్య్ర వీర్ సావర్కర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. నటుడు మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ రోల్లో బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా నటిస్తున్నాడు. జూన్ సెట్స్‌పైకి వచ్చిన ఈ చిత్రం కోసం రణ్‌దీప్ ఏకంగా 18 కేజీలు బరువు తగ్గాడట. ఇందుకు కోసం అతడు జిమ్‌లో తీవ్రంగా శ్రమించానని ఇటీవల ఓ ఇంటర్య్వూలో చెప్పాడు రణ్‌దీప్. ఇక తాజాగా అతడు బరువు తగ్గి సన్నగా మారిన ఫొటోను షేర్ చేశాడు. ఇది చూసి అతడి ఫాలోవర్స్, ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. ఇంత తక్కువ సమయంలో అన్ని కేజీ బరువు ఎలా తగ్గారు భయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: ‘లైగర్’ ఫ్లాప్‌తో పారితోషికంలో భారీ మొత్తం వెనక్కిచ్చేసిన విజయ్! ఎంతంటే.. కాగా 2016లో సరబ్జిత్ మూవీ కోసం కూడా రణ్‌దీప్ కేవలం 28 రోజుల్లోనే 18 కేజీలు బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచిన విషయం విధితమే. 1883 మే 28న మహారాష్ట్రలో జన్మించారు దామోదర్ సావర్కర్. ఆ తర్వాత న్యాయవిద్యను అభ్యసించడం కోసం ఇంగ్లాండ్ వెళ్లారు. అక్కడి భారతీయ విద్యార్థుల్లో స్వాతంత్య్ర కాంక్షను ప్రేరేపించారాయన. హిందూ మహాసభల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. సావర్కర్ రాసిన ‘ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్’ బుక్‌ను అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత 1910లో సావర్కర్‌ను అరెస్ట్ చేసింది బ్రిటీష్ ప్రభుత్వం. అండమాన్ నికోబార్ దీవుల్లోని జైల్లో పది సంవత్సరాలకు పైనే బ్రిటీష్ ప్రభుత్వపు శిక్షను అనుభవించారు సావర్కర్. 1966 ఫిబ్రవరి 26న ఆయన తుదిశ్వాస విడిచారు. చదవండి: బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్ ఈవెంట్, షాకిచ్చిన హైదరాబాద్ పోలీసులు View this post on Instagram A post shared by Randeep Hooda (@randeephooda) -
సావర్కర్ పోస్టర్ ఏర్పాటుపై ఉద్రిక్తత.. కర్ఫ్యూ విధింపు!
బెంగళూరు: వీర్ సావర్కర్ పోస్టర్ ఏర్పాటుపై కర్ణాటకలోని శివమొగ్గలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని అమీర్ అహ్మెద్ సర్కిల్లో వీర్ సావర్కర్ పోస్టర్ ఏర్పాటు చేశారు. హిందూ గ్రూప్స్ ఆ పోస్టర్‌ను కావాలనే ఏర్పాటు చేశాయని దానికి వ్యతిరేకంగా కొందరు ముస్లిం యువత ఆందోళనకు దిగారు. సావర్కర్ ఫ్లెక్సీని తొలగించేందుకు యత్నించారు. దీనిని వ్యతిరేకిస్తూ హిందూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు శివమొగ్గ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. మరోవైపు మంగళూరులోనూ ఇలాంటి సంఘటనే ఎదురైంది. సూరత్కల్ జంక్షన్‌కు హిందూత్వ సిద్ధాంతకర్త సావర్కర్ పేరును మారుస్తూ బ్యానర్ ఏర్పాటు చేశారు. అయితే.. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో బ్యానర్‌ను తొలగించారు. మంగళూరు ఉత్తర నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే భరత్ షెట్టీ అభ్యర్థనతో సర్కిల్‌కు సావర్కర్ పేరు పెట్టేందుకు ఆమోదం తెలిపింది నగర కార్పొరేషన్. అధికారికంగా పేరు మార్చేందుకు ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం వేచి చూస్తోంది. ఈ క్రమంలో సూరత్కల్ సర్కిల్ చాలా సున్నితమైన ప్రాంతమని, సావర్కర్ పేరు పెట్టటాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎస్డీపీఐ స్థానిక కార్యకర్త ఒకరు తెలిపారు. ఇదీ చదవండి: Vinayak Damodar Savarkar: సముద్రంలోకి దూకి తప్పించుకున్న రోజు -
వెండితెరపై వీర్ సావర్కర్ బయోపిక్..
భారత స్వాతంత్య్ర సమరయోధుల్లో ఒకరైన వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితం వెండితెరపైకి రానుంది. ఈ బయోపిక్కు ‘స్వాతంత్య్ర వీర్ సావర్కర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ రోల్లో బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా నటిస్తారు. మహేశ్ మంజ్రేకర్ దర్శకుడు. జూన్‌లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. లండన్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవుల్లో చిత్రీకరణను ప్లాన్ చేశారు. ‘'స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు కృషి చేశారు. అలాంటి వారిలో ప్రముఖులైన సావర్కర్గారి జీవితం అందరికీ తెలియాల్సి ఉంది’’ అన్నారు రణ్‌దీప్. 1883 మే 28న మహారాష్ట్రలో జన్మించారు దామోదర్ సావర్కర్. ఆ తర్వాత న్యాయవిద్యను అభ్యసించడం కోసం ఇంగ్లాండ్ వెళ్లారు. అక్కడి భారతీయ విద్యార్థుల్లో స్వాతంత్య్ర కాంక్షను ప్రేరేపించారాయన. హిందూ మహాసభల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. సావర్కర్ రాసిన ‘ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్’ బుక్‌ను అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత 1910లో సావర్కర్‌ను అరెస్ట్ చేసింది బ్రిటీష్ ప్రభుత్వం. అండమాన్ నికోబార్ దీవుల్లోని జైల్లో పది సంవత్సరాలకు పైనే బ్రిటీష్ ప్రభుత్వపు శిక్షను అనుభవించారు సావర్కర్. 1966 ఫిబ్రవరి 26న ఆయన తుదిశ్వాస విడిచారు. -
అలా చేస్తే స్వాతంత్ర్య యోధులను కించపరిచినట్లే
బెంగుళూరు: ప్రపంచం అంతా కరోనాతో సతమతమవుతుంటే కర్ణాటకలో మాత్రం ఫ్లైఓవర్ పేరు మీద వివాదం రాజుకుంటోంది. గురువారం బెంగుళూరులోని యెలహంక వద్ద 400 మీటర్ల పొడవైన ఫ్లైఓవర్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రారంభించనున్నారు. దీనికి స్వాతంత్ర్య సమరయోధుడు, హిందుత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్ పేరును నామకరణం చేయనున్నారు. అదే రోజు వీర్ వీర్ సావర్కర్ జయంతి కావడం విశేషం. అయితే మహాత్మాగాంధీ హత్యతో అతడికి సంబంధం ఉన్న కారణాల చేత కాంగ్రెస్, తదితర రాజకీయ పార్టీలు అతడిని దేశ భక్తుడిగా పరిగణించడానికి ఇష్టపడలేవు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏకంగా ఫ్లై ఓవర్‌కు అతని పేరును ఖరారు చేయడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఆయన మన రాష్ట్రానికి ఏం చేశాడని అతడి పేరును పెట్టారంటూ గగ్గోలు పెడుతున్నాయి. (యడ్డీ, సిద్దూల మధ్య ఏం జరుగుతుంది!) మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ.. సీఎం యడియూరప్పది తొందరపాటు చర్యగా అభివర్ణించారు. రూ.34 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్‌కు సావర్కర్ పేరును పెట్టడం ద్వారా స్వాతంత్ర్య సమరయోధులను కించపరిచినట్లవుతుందని పేర్కొన్నారు. జేడీఎస్ నేత హెడీ కుమారస్వామి సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. సీఎం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర్యానికి ముందు, తర్వాత కూడా రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడిన ఎందరో ప్రముఖులు ఉన్నారని, ఫ్లైఓవర్‌కు వారి పేరు పెడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. కాగా ప్రతిపక్షాల వ్యాఖ్యలను అధికార పార్టీ ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాథ్ కొట్టిపారేశారు. ప్రభుత్వ నిర్ణయం సరైనదేనని సమాధానమిచ్చారు. విపక్షాలు కావాలనే రాజకీయం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. కాగా ఫిబ్రవరి 29న జరిగిన బృహత్ బెంగళూరు మహానగర పాలిక కౌన్సిల్ సమావేశంలో ఫ్లైఓవర్‌కు వీర్ సావర్కర్ పేరు పెట్టాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం పేర్కొంటుండగా అసలు దీనిపై చర్చే జరపలేదని కౌన్సిల్ మెంబర్ అబ్దుల్ వాజీద్ తెలిపారు. () -
పది జన్మలెత్తినా అది నీవల్ల కాదు: స్మృతి
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మరోసారి రెచ్చిపోయారు. రాహుల్ మరో పది జన్మలెత్తినా.. హిందూత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్‌కు ఉన్న ధైర్యం, తెగువ రాదని అన్నారు. శనివారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్మృతి సావర్కర్ గురించి ప్రస్తావించారు. ‘నా పేరు రాహుల్ గాంధీ. రాహుల్ సావర్కర్ కాదు. నేను నిజమే మాట్లాడాను. చావనైనా చస్తాను కానీ క్షమాపణ మాత్రం చెప్పను’ అని గతంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆమె గుర్తుచేశారు. సావర్కర్ ధైర్య సాహసాలను ఆమె ప్రశంసించారు. ఏ విషయంలో కూడా వారిద్దరికి పోలిక లేదని అన్నారు. కాగా సావర్కర్‌పై రాహుల్ చేసిన గతంలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. (నా పేరు రాహుల్ సావర్కర్ కాదు) -
వాళ్లందరినీ అండమాన్ జైల్లో నిర్బంధించండి..
సాక్షి, ముంబై : ప్రముఖ హిందూత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చి తీరాల్సిందేనని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. దీనికి వ్యతిరేకంగా ఎవరైన గళం విప్పితే వారందరిని అరెస్ట్ చేసి అండమాన్ జైల్లో నిర్బంధించాలని అన్నారు. శనివారం ఆయన ముంబైలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వీర్ సావర్కర్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని శివసేన తొలినుంచి డిమాండ్ చేస్తోందని ఆయన గుర్తుచేశారు. దీనిపై కాంగ్రెస్ భిన్నవాదనలను వినిపిస్తోందని, తమ నిర్ణయాన్ని ఆ పార్టీ గౌరవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. (వీర్ సావర్కర్‌కు భారతరత్న!) దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన చేసిన సేవ, త్యాగం ఎంతో గొప్పదని రౌత్ అభిప్రాయపడ్డారు. కాగా వీర్ సావర్కర్‌కు వ్యతిరేకంగా కొందరు కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి.. ఆయన కృషికి గుర్తింపుగా అత్యున్నత పురస్కారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రౌత్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు సావర్కర్ మనవడు.. రంజిత్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ శివసేన దారిలో నడవాలని అన్నారు. మహారాష్ట్రలో తిరిగి అధికారంలోకి వస్తే.. వీరసావర్కర్‌కు భారతరత్న కోసం ప్రయత్నిస్తామని భారతీయ జనతాపార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. -
గాడ్సే – సావర్కర్ల సంబంధం!
ముంబై: మహాత్మాగాంధీ హంతకుడు నాథూరాం గాడ్సేకు, ప్రముఖ హిందూత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్‌కు శారీరక సంబంధం ఉందని కాంగ్రెస్ అనుబంధ ‘సేవాదళ్’ పేర్కొనడంపై బీజేపీ, శివసేన మండిపడ్డాయి. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సేవాదళ్ విడుదల చేసిన ఒక బుక్‌లెట్‌లో ఆ విపరీత వ్యాఖ్యలను పొందుపర్చారు. దీనిపై మహారాష్ట్రలో కాంగ్రెస్ మిత్రపక్షం శివసేన స్పందిస్తూ.. సావర్కర్ గురించి కాంగ్రెస్ నేతల మెదళ్లలో చెత్త ఉందని వ్యాఖ్యానించింది. సావర్కర్ దేశభక్తిని, వీరత్వాన్ని ప్రశ్నించడం ద్వారా వారు తమను తాము కించపర్చుకుంటున్నారని సేన ఎంపీ సంజయ్‌రౌత్ పేర్కొన్నారు. సావర్కర్‌పై వికృతబుద్ధితో చేసిన అర్థపర్థం లేని వ్యాఖ్యలు అవని బీజేపీ పేర్కొంది. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. వీర్ సావర్కర్: కిత్నే ‘వీర్’! పేరుతో సేవాదళ్ ఆ బుక్లెట్ విడుదల చేసింది. -
హిందూ మహాసభ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : వీర్‌సావర్కర్, నాథూరాం గాడ్సేల మధ్య శారీరక సంబంధం ఉందని కాంగ్రెస్ సేవాదళ్ పుస్తకం ప్రచురించిన క్రమంలో తాజాగా రాహుల్ గాంధీపై హిందూ మహాసభ అలాంటి వ్యాఖ్యలనే చేసింది. వీర్‌సావర్కర్‌పై వచ్చిన ఆరోపణలు అర్ధరహితమైనవని అఖిల భారతీయ హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి తోసిపుచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వలింగ సంపర్కుడనే వాదనలను కూడా తాము విన్నామని ఆయన వ్యాఖ్యానించారు. కాగా వీర్‌సావర్కర్‌తో నాథూరాం గాడ్సేల శారీరక బంధంపై కాంగ్రెస్ సేవాదళ్ ప్రచురించిన పుస్తకం కలకలం రేపుతోంది. బీజేపీతో పాటు ఆ పార్టీతో గతంలో కలిసి పనిచేసిన శివసేన సైతం సేవాదళ్ తీసుకువచ్చిన వివాదాస్పద పుస్తకాన్ని తప్పుపట్టింది. దేశభక్తుడిగా పేరొందిన గొప్ప నేత వీర్ సావర్కర్‌ను కించపరిచేలా కాంగ్రెస్ సేవాదళ్ పుస్తకం ప్రచురించడం సరైంది కాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. ప్రజల మనసుల్లో ఉన్నత స్ధానం పొందిన సావర్కర్ ప్రతిష్టను పలుచన చేయాలని చూడటం తగదని హితవు పలికారు. -
బీజేపీ ఎమ్మెల్యేల వినూత్న నిరసన
-
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల వినూత్న నిరసన
ముంబై : ‘రాహుల్ సావర్కర్’ వ్యాఖ్యలపై మహారాష్ట్ర బీజేపీ నాయకులు సోమవారం వినూత్న నిరసన తెలిపారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు బీజేపీ ఎమ్మెల్యేలంతా ‘నేను సావర్కర్’ అని రాసి ఉన్న టోపీలు ధరించారు. అసెంబ్లీ బయటకూడా పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు ఈ టోపీలు ధరించి ఆందోళన చేపట్టారు. హిందుత్వ సిద్ధాంత కర్త వినాయక్ దామోదర్ సావర్కర్‌ను అగౌరవపరిచేలా మాట్లాడిన రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఫడ్నవీస్ ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. భారత స్వాతంత్ర్యోద్యమం గురించి తెలుసుకుని రాహుల్ మాట్లాడితే బాగుంటుందని చురకలంటించారు. కాగా, ‘రేపిన్ ఇండియా’ వ్యాఖ్యలు చేసిన రాహుల్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ‘ప్రాణాలు పోయినా సరే.. నిజం మాట్లాడి క్షమాపణలు చెప్పబోను’అని రాహుల్ తేల్చి చెప్పారు. ‘నేను రాహుల్ సావర్కర్‌ను కాదు’అని మాట్లాడి దుమారం రేపారు. ఇదిలాఉండగా.. రాహుల్ వ్యాఖ్యలపై శివసేన అభ్యంతరం తెలిపింది. భరత జాతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన హిందుత్వ సిద్ధాంతకర్తను అగౌరపరిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది విదితమే. -
‘రాహుల్ సావర్కర్’ వ్యాఖ్యలపై స్పందించిన శివసేన
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ ‘రేపిన్ ఇండియా’ వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగింది. మహిళలపై అకృత్యాల్ని పెంచేదిగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని.. భేషరతుగా రాహుల్ జాతికి క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈక్రమంలో శనివారం జరిగిన కాంగ్రెస్ భారత్ బచావో ర్యాలీలో పాల్గొన్న రాహుల్ క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని.. తాను ‘రాహుల్ సావర్కర్‌ను కాదు’ అని తేల్చి చెప్పాడు. అయితే, మహారాష్ట్రలో కాంగ్రెస్‌తో కలిసి అధికారంలో ఉన్న శివసేన రాహుల్ వ్యాఖ్యలపై స్పందించింది. హిందుత్వ పితామహుడు.. భరత జాతికి ఎనలేని సేవలు చేసిన వీర సావర్కర్ పేరును తక్కువ చేసి మాట్లాడొద్దని సూచించింది. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ మాదిరిగా వీర సావర్కర్ కూడా దేశం కోసం జీవితాన్ని త్యాగం చేశారని శివసేన ఎంపీ సంజయ్ రావత్ గుర్తు చేశారు. సావర్కర్ గౌరవానికి భంగం కలిచించే రీతిలో మాట్లాడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ట్విట్టర్ వేదికగా రావత్.. స్వాతంత్య్ర సమర యోధుడు వినాయక దామోదర్ వీర సావర్కర్ భారత దేశ మహనీయుడు. ఆయన కేవలం మహారాష్ట్రకే పరిమితం కాదు. జాతిపిత మహాత్మ గాంధీ, దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ లాగే వీరసావర్కర్ కూడా దేశం కోసం జీవితాన్ని త్యాగం చేశారు’అని పేర్కొన్నారు. -
హిందుత్వ వ్యతిరేకతే కాంగ్రెస్ బలహీనత
వీర సావర్కర్, జాతీ యవాదంపై సోనియా, రాహుల్ కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవల్సిందేమిటి? వీర సావర్కర్ పట్ల కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అయోమయం మరోసారి జాతీయవాదంపై దాని ద్వైదీభావాన్ని బట్టబయలు చేసింది. సావర్కర్‌కు భారతరత్న అవార్డుపై తాజా వివాదం కాంగ్రెస్‌ని బట్టలూడదీయించినంత పనిచేసింది. సావర్కర్‌ని నాజీగా, గాంధీ హత్యకు కుట్రదారుగా ఖండించడానికి, ‘మేం సావర్కర్‌జీని గౌరవిస్తాం కానీ ఆయన భావజాలంతో ఏకీభవించలేం’ అంటూ మన్మోహన్ సింగ్ సూక్ష్మభేదంతో చెప్పడానికి మధ్య కాంగ్రెస్ పార్టీకి ఒక సున్నితమైన అంశంపై తన పంథా గురించి ఏమీ తెలీదని అనిపిస్తోంది.మన్మోహన్ వివేకంతో కూడిన ప్రకటన చేసిన 24 గంటల తర్వాత, కాంగ్రెస్ పార్టీ సింగ్ ప్రకటన నుంచి దూరం జరగడానికి ప్రయత్నించింది. సింగ్ ప్రకటనను తేలికపర్చడానికి కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జీవాలా చేసిన ప్రయత్నం నిస్పృహతోనూ కూడి ఉంది. మన్మోహన్ ప్రకటనలో కుతర్కం గానీ, సందిగ్ధత గానీ లేదు. నిజానికి ఆయన చేసిన ప్రకటన ప్రారంభం నుంచి తన పార్టీ వైఖరిగా ఉండి ఉండాలి. అప్పుడే ఆ పార్టీ స్వీయ విధ్వంసంవైపు పోకుండా అది కాపాడి ఉండేది. ప్రత్యేకించి సావర్కర్ వీరాభిమానులు 1970లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ సావర్కర్ గౌరవార్థం పోస్టేజీ స్టాంప్ విడుదల చేసిన చిత్రాన్ని, సావర్కర్‌కి ఇందిర అందించిన నివాళిని గుర్తు చేస్తూ ఫాసిమైల్ పంపుతున్న ప్రస్తుత సందర్భంలో కాంగ్రెస్ తనవైఖరిని పునరాలోచించుకోవలసింది. సావర్కర్ జీవితంపై డాక్యుమెంటరీకి ఇందిర ప్రోత్సాహమివ్వడమే కాకుండా ఆయన స్మారక నిధికి రూ.11,000 (నేటి విలువలో రూ. 5 లక్షలు) డొనేషన్ కూడా ఇచ్చారు. మరి కాంగ్రెస్ తన ప్రస్తుత వైఖరిని ఇందిరతో పోల్చుకోగలదా? ఇందిర, పీవీ నరసింహారావు లాంటి వ్యక్తి కాదు. హిందుత్వకు సన్నిహితుడు కానప్పటికీ మెతక లౌకికవాదం ప్రదర్శించడమే కాకుండా తన ‘ధోవతీలో కాకీ నిక్కర్ ధరించినందుకు’గాను పీవీని కాంగ్రెస్ పార్టీ తృణీకరించింది, పార్టీలో ఆయనకు స్థానం లేకుండా చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు మళ్లీ పార్టీ పాత తరహా కరడుగట్టిన లౌకికవాదానికి మళ్లాలని డిమాండు చేస్తున్నారు. లౌకికవాదంపైగానీ, హిందుత్వపైగానీ ఇందిర మెతకవైఖరితో వ్యవహరించారని కాంగ్రెస్ పార్టీలో ఎవరూ ఆరోపించలేరు. సైద్ధాంతికత కంటే రాజకీయానికే ఆమె ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆర్ఎస్ఎస్/జనసంఘ్‌ను అసహ్యించుకున్నప్పటికీ, వారిని దేశపటం నుంచి పరిత్యజించాలని ఆమె అనుకోలేదు. ఆరెస్సెస్‌పై ఆమె ఆరోపణ ఏమిటంటే, అది స్వాతంత్య్రోద్యమంలో భాగం కాకుండా బ్రిటిష్ వారితో కుమ్మక్కయిందనే. వీరసావర్కర్ని ఆరెస్సెస్ చేతిలో పెట్టాలని ఇందిర భావించలేదు. ఆరెస్సెస్‌కి ఒక పెద్ద సమస్య ఉంది. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న నిజమైన హీరోలు ఎవరూ ఆ సంస్థకు లేరు. కాంగ్రెసేతర నేతలైన భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్‌ను కూడా వారి భావజాలం నుంచి ఆరెస్సెస్ తొలగించివేసింది. గాంధీ, నెహ్రూ వంశానికి చెందని ఎవరినైనా కౌగిలించుకోవడానికి ఆరెస్సెస్ సిద్ధంగా ఉంది. మోదీ ప్రభుత్వం ఇప్పుడు నెహ్రూ కంటే సర్దార్ పటేల్‌ని భారత గణతంత్ర రాజ్య సంస్థాపకుడిగా ఎత్తిపట్టాలని చూస్తోంది. కానీ పటేల్ ఎన్నడూ ఆరెస్సెస్ అభిమాని కాదని, గాంధీ హత్య తర్వాత ఆ సంస్థను పటేల్ నిషేధించారని మర్చిపోవద్దు. ఆరెస్సెస్ పట్ల ఆయనకు వ్యతిరేకత ఉన్నప్పటికీ, నెహ్రూతో పటేల్ విభేదాలు మరింత బలంగా ఉన్నాయి కాబట్టే కాంగ్రెస్ నుంచి బీజేపీ లాగేసుకున్న తొలి ప్రముఖ వ్యక్తిగా పటేల్ నిలిచారు.ఆరెస్సెస్ మేధావి, దాని అధికార వాణి ఆర్గనైజర్ సంపాదకుడు శేషాద్రి ఒక ముఖ్యమైన రాజ కీయ అంశాన్ని లేవనెత్తారు. ఇందిర జనసంఘ్ /బీజేపీలను హిందుత్వపార్టీగా ఎన్నడూ వర్ణించలేదు. తన రాజకీయాలను హిందూయిజానికి వ్యతిరేకంగా ఆమె ఎన్నడూ నిలపలేదు లేదా మెజారిటీ ప్రజానీకం విశ్వాసాన్ని తన ప్రధాన ప్రత్యర్థులకు ఆమె ఎన్నడూ అప్పగించలేదు. బనియా పార్టీగా మాత్రమే వారిని ఆమె కొట్టివేసేది. జనసంఘ్, బీజేపీలను హిందూ పార్టీగా పిలిస్తే హిందువుల నుంచి రాజకీయ మద్దతు వారికి లభిస్తుంది. బనియాలు అని ముద్రిస్తే వారు ఓట్లపరంగా అతి చిన్న బృందానికి పరిమితం అవుతారు. పైగా జనసంఘ్, బీజేపీలు సంపన్నులకు, వడ్డీవ్యాపారులకు, లాభాపేక్షగల వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చినందున, గ్రామీణ ప్రాంతంలో చాలామంది హిందువులు బీజేపీ పట్ల పెద్దగా అనుకూలంగా ఉండేవారు కాదు. అందుకే ఇందిర వారిని సమాజానికి ఏమాత్రం మంచి చేయని ఫక్తు వ్యాపారులుగా, బనియాలుగా ముద్రించి తృణీకరించేవారు. సోనియా గాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని బని యాలపై కాకుండా హిందుత్వపై, హిందూయిజం పైకి మళ్లించిందని శేషాద్రి వ్యాఖ్యానించారు. ఇందిర కాంగ్రెస్‌కు, నేటి కాంగ్రెస్‌కి మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే. ఇందిర వామపక్ష మేధావులను తన దర్బారులో చేర్చుకుని, తన రాజకీయాలకోసం వారి ఆలోచనలను వాడుకున్నారు. కానీ సోనియా మాత్రం వామపక్షాలను, వారి మేధావులను దూరం పెట్టి తన రాజకీయాలను నడిపారు. ఇందిర వారసులు జాతీయవాదం, మతం, సోషలిజం వంటి అంశాలపై భీకర రాజకీయ త్రిశూలధారులైన మోదీ, షాల బీజేపీని ఎదుర్కొంటున్నారు. వీరిని సోనియా–రాహుల్ కాంగ్రెస్ ఎలా ఎదుర్కోగలుగుతుంది? శబరిమల, ట్రిపుల్ తలాక్, అయోధ్య వంటి ప్రతి అంశంలోనూ కాంగ్రెస్ ఓడిపోయింది. కరడుగట్టిన సోషలిజాన్ని మాత్రమే కాంగ్రెస్ తిరిగి పాటిస్తూ జాతీ యవాదాన్ని, మతాన్ని, సంస్కృతిని బీజేపీకి అప్పగించేటట్లయితే లోక్‌సభలో 52 స్థానాలు దానికి దక్కడం కూడా అదృష్టమేనని చెప్పాలి. రాజకీయ వేత్తకాని మన్మోహన్ సింగ్ దాన్ని అర్థం చేసుకున్నారు. కానీ ఆయన పార్టీ మాత్రం సింగ్ మాటల్ని ఎన్నడూ వినలేదు. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
‘గాడ్సేకు కూడా భారతరత్న ఇస్తారా’
న్యూఢిల్లీ : వీరసావర్కర్‌కు భారతరత్న కోసం ప్రయత్నిస్తామన్న బీజేపీ వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందుత్వం కోసం పనిచేసిన వీరసావర్కర్‌కు భారతరత్న ఇవ్వదల్చుకున్నప్పుడు నాథూరాం గాడ్సేకు కూడా భారతరత్న ఇవ్వొచ్చుగా అని ఎద్దేవా చేశారు. ‘రెండు జాతుల సిద్ధాంతాన్ని తొలుత సావర్కర్ పరిచయం చేశారు. అనంతరం మహ్మద్ అలీ జిన్నా అనుసరించారు. ఎవరికైనా భారతరత్న ఇవ్వాలని మీరనుకుంటే గాడ్సేకు కూడా ఇవ్వండి. బీజేపీ హిందుత్వ సిద్ధాంతాలను సావర్కర్ రాశారు. సిద్ధాంతాల ప్రాతిపదికన అవార్డులు ఇవ్వడం సరికాదు. అయినా, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, సీఎం ఫడ్నవీస్ పదేపదే 370 ఆర్టికల్ రద్దు అంశాన్ని ఎందుకు తెస్తున్నట్టు’అని ఓవైసీ ప్రశ్నించారు. (చదవండి : వీర్ సావర్కర్‌కు భారతరత్న!) మహారాష్ట్ర ప్రజలకిచ్చిన హామీల అమలును విస్మరించిన ప్రభుత్వం, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే హిందుత్వ రాజకీయాలకు పాల్పడుతోందని ఓవైసీ విమర్శించారు. దేశవ్యాప్తంగా వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ మొత్తం మహారాష్ట్రాలోనే అధికం. ఇవేవీ పట్టించుకోకుండా అవార్డు రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. వీటి బదులు రైతుల బాగుకోసం మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయొచ్చుకదా అని చురకలంటించారు. దేశవ్యాప్తంగా కోటి ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రధాని మోదీ హామీలేమయ్యాయని ఓవైసీ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీట్రేడ్ విధానం వల్ల ఎనిమిది కోట్ల మంది నిరుద్యోగులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. -
వీర్ సావర్కర్‌కు భారతరత్న!
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో తిరిగి అధికారంలోకి వస్తే.. హిందూత్వ సిద్ధాంత రూపకర్త, స్వాతంత్ర్య సమరయోధుడు వీరసావర్కర్‌కు దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న కోసం ప్రయత్నిస్తామని భారతీయ జనతాపార్టీ హామీ ఇచ్చింది. సావర్కర్‌తోపాటు మహాత్మా ఫూలే, సావిత్రిభాయ్ ఫూలేకు భారతరత్న కోసం కేంద్రానికి సిఫారసు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముంబైలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. వచ్చే ఐదేళ్లలో మహారాష్ట్రలో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని కమలదళం తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అందరికీ ఇళ్లు, ఆరోగ్యం, మంచినీటి సరఫరా కల్పిస్తామని తెలిపింది. రాష్ట్రాన్ని కరువురహితంగా చేసేందుకు 11 డ్యామ్‌లతో మహారాష్ట్ర వాటర్‌గ్రిడ్ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చింది. చదవండి: ‘సీఎం పీఠంపై వివాదం లేదు’ -
‘వారిని అందరి ముందు చితక్కొట్టాలి’
ముంబై : హిందూ మహాసభ అధ్యక్షుడు, స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ త్యాగాలను విశ్వసించని వారిని బహిరంగంగా దండించాలని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భరతమాతను బానిస సంకెళ్ల నుంచి విముక్తురాలిని చేసేందుకు సావర్కర్ చేసిన పోరాటాలను తక్కువగా చూసే వారికి ఇదే సరైన శిక్ష అని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఆరెస్సెస్‌కు చెందిన విద్యార్థి విభాగం ఏబీవీపీ ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో వీర్ సావర్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ) సావర్కర్ విగ్రహానికి చెప్పుల దండవేసి, ముఖానికి నలుపు రంగు పూసి అవమానించారు. అంతేకాకుండా అదే ప్రాంగణంలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్‌ల విగ్రహాలతో పాటు సావర్కర్ విగ్రహం ఉండటాన్ని తాము సహించబోమని ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ విషయంపై స్పందించిన ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘ స్వాతంత్ర్య ఉద్యమంలో వీర్ సావర్కర్ పోరాటాన్ని, ఆయన చేసిన త్యాగాలను గుర్తించని వాళ్లను బహిరంగంగా చితక్కొట్టాలి. అప్పుడే వాళ్లకు సావర్కర్ విలువ ఏమిటో తెలుస్తుంది. నిజానికి రాహుల్ గాంధీకి కూడా సావర్కర్ గురించి ఏమీ తెలియదు. ఆయన కూడా గతంలో సావర్కర్‌ను తీవ్రంగా అవమానించారు’ అని ఉద్ధవ్ ఠాక్రే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ఎన్ఎస్యూఐ కాంగ్రెస్‌కు చెందిన యూనియన్ అన్న విషయం తెలిసిందే. సావర్కర్ సేవలు అసమానమైనవి.. ఢిల్లీ విశ్వవిద్యాలయ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా స్పందించారు. ఆయన మాట్లాడుతూ..స్వాతంత్ర్యోద్యమంలో ఎన్నో విప్లవాలకు సావర్కర్ నాంది పలికారన్నారు. దేశ ప్రజలు స్వేచ్చా వాయువులు పీల్చుకోవడంలో ఆయన చేసిన కృషి అసమానమైనదని పేర్కొన్నారు. సావర్కర్తో పాటు ఆయన కుటుంబం కూడా దేశ సేవకు అంకితమైందని పేర్కొన్నారు. అలాంటి మహనీయ వ్యక్తిని అవమానించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫడ్నవిస్ సూచించారు. భావోద్వేగాలను రెచ్చగొడుతూ శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిని ఉపేక్షించకూడదన్నారు. చదవండి : మెడలో చెప్పుల దండ.. ముఖంపై నలుపు రంగు -
విద్యార్థులకు కత్తుల పంపిణీ..!
ఆగ్రా : స్వాతంత్ర సమరయోధుడు, హిందూ మహాసభ దిగ్గజ నాయకుడు వీర్ సావర్కర్ (వినాయక్ దామోదర్ సావర్కర్) జయంత్యుత్సవాలు మంగళవారం దేశవ్యాప్తంగా జరిగాయి. దానిలో భాగంగా అఖిల భారత హిందూ మహాసభ నాయకులు ఆగ్రాలో 10, 12 తరగతుల పిల్లలకు కత్తుల్ని పంపిణీ చేశారు. హిందూ సమాజం సాధికారత సాధించేందుకు.. ముఖ్యంగా యువత ఆత్మరక్షణ, దేశ రక్షణకు జాగురూకులై ఉండేందుకు కత్తులను పంపిణీ చేస్తున్నామని హిందూమహాసభ జాతీయ కార్యదర్శి పూజా శకున్ చెప్పారు. విద్యార్థులకు కత్తులతో పాటు భగవద్గీత ప్రతులను కూడా అందిస్తున్నామని తెలిపారు. మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెచ్చుమీరుతున్నాయని, ఆత్మ రక్షణ కోసం యువతులకు ఆయుధ శిక్షణ అవసరమని పేర్కొన్నారు. ఇక సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. ప్రజల్లో దేశభక్తి రగిల్చి ఎందరికో ధీరోదాత్తమైన స్ఫూర్తిని అందించిన సావర్కర్ కృషి మరువలేనిదని అన్నారు. జాతీనిర్మాణం కోసం పనిచేసిన ఆయన సదాస్మరణీయుడని ట్వీటర్లో పేర్కొన్నారు. ‘రాజకీయాల్లో హిందూకీకరణ.. హిందువుల్లో సైనికీకరణ.. అనేది సావర్కర్ నినాదం. నరేంద్రమోదీ దేశ ప్రధానిగా ఎన్నికై సావర్కర్ కలను నెరవేర్చారు. ఇక రెండోది. దేశ రక్షణ కోసం ప్రతి హిందువు సైనికుడిగా మారాలి. అందుకోసమే.. యువతకు కత్తులను అందిస్తున్నాం’అని హిందూ మహాసభ అదికార ప్రతినిధి అశోక్ పాండే చెప్పారు. దేశంలో ఇప్పటికే మతపరమైన దాడులు జరగుతున్న నేపథ్యంలో అఖిల భారత హిందూ సభ అత్యుత్సాహం ప్రదర్శించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. We bow to Veer Savarkar on his Jayanti. Veer Savarkar epitomises courage, patriotism and unflinching commitment to a strong India. He inspired many people to devote themselves towards nation building. pic.twitter.com/k1rmFHz250 — Narendra Modi (@narendramodi) May 28, 2019 -
రాహుల్‌పై ముంబై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
సాక్షి, ముంబై : స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్‌పై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన ప్రకటన దుమారం రేపుతోంది. రాహుల్ తప్పుడు ప్రకటన చేశారంటూ సావర్కర్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పాలక బీజేపీ కొనియాడే వీర్ సావర్కర్ గతంలో తనను జైలు నుంచి విడుదల చేయాలని బ్రిటిషర్ల కాళ్లు మొక్కారని రాహుల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఓ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన రాహుల్ వీర్ సావర్కర్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్ధార్ పటేల్ వంటి స్వాతంత్ర సమరయోధులు దీర్ఘకాలంగా జైళ్లలో మగ్గితే వీర్ సావర్కర్ తాను ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనని, తనను క్షమించి జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ బ్రిటిష్ వాళ్లకు మొక్కుతూ లేఖ రాశారని రాహుల్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్లో వీర్‌సావర్కర్ చిత్ర పటం పెట్టారని ఆయన ఎలాంటి త్యాగాలు చేయలేదని చెప్పుకొచ్చారు. దీనిపై సావర్కర్ మునిమనుమడు రంజిత్ సావర్కర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సావర్కర్‌ను 27 ఏళ్ల పాటు బ్రిటిష్ వారు జైళ్లలో ఉంచారని ఆయన పేర్కొన్నారు. హిందుత్వ నేతపై రాహుల్ తప్పుడు ప్రకటన చేయడం పట్ల తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. -
‘నోట్లపై గాంధీని తీసి సావర్కర్‌ను పెట్టండి’
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ కరెన్సీ నోట్లపై జాతిపిత మహాత్మ గాంధీ ఫొటోను తొలగించి వీడీ సావర్కర్ ఫొటో పెట్టాలని అఖిల భారత హిందూ మహాసభ(ఏబీహెచ్ఎం) కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ.. కొత్త వివాదానికి తెర తీసింది. సోమవారం సావర్కర్ జయంతి (మే 28) సందర్భంగా ఏబీహెచ్ఎం చీఫ్ స్వామి చక్రపాణి మీడియాతో మాట్లాడుతూ.. భారత దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో స్ఫూర్తి నింపిన సావర్కర్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నోట్లపై జాతిపిత గాంధీ బొమ్మ స్థానంలో సావర్కర్ బొమ్మ ముద్రించాలని ఏబీహెచ్ఎం కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు వెల్లడించారు. సావర్కర్ పూర్తి పేరు వినాయక దామోదర సావర్కర్, హిందుత్వ అనే పదాన్ని ఖాయం చేసింది ఈయనే. ఆయన రాసిన ‘హిందుత్వ: హు ఇజ్ హిందు’ బాగా ప్రచుర్యం పొందింది. 1923లో ఆయన ఈ పుస్తకాన్ని రచించారు.