భారత స్వాతంత్య్ర సమరయోధుల్లో ఒకరైన వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితం వెండితెరపైకి రానుంది. ఈ బయోపిక్‌కు ‘స్వాతంత్య్ర వీర్ సావర్కర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. నటుడు మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ రోల్‌లో బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా నటిస్తున్నాడు. జూన్ సెట్స్‌పైకి వచ్చిన ఈ చిత్రం కోసం రణ్‌దీప్ ఏకంగా 18 కేజీలు బరువు తగ్గాడట. ఇందుకు కోసం అతడు జిమ్‌లో తీవ్రంగా శ్రమించానని ఇటీవల ఓ ఇంటర్య్వూలో చెప్పాడు రణ్‌దీప్. ఇక తాజాగా అతడు బరువు తగ్గి సన్నగా మారిన ఫొటోను షేర్ చేశాడు. ఇది చూసి అతడి ఫాలోవర్స్, ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. ఇంత తక్కువ సమయంలో అన్ని కేజీ బరువు ఎలా తగ్గారు భయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
చదవండి: ‘లైగర్’ ఫ్లాప్‌తో పారితోషికంలో భారీ మొత్తం వెనక్కిచ్చేసిన విజయ్! ఎంతంటే..
కాగా 2016లో సరబ్జిత్ మూవీ కోసం కూడా రణ్‌దీప్ కేవలం 28 రోజుల్లోనే 18 కేజీలు బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచిన విషయం విధితమే. 1883 మే 28న మహారాష్ట్రలో జన్మించారు దామోదర్ సావర్కర్. ఆ తర్వాత న్యాయవిద్యను అభ్యసించడం కోసం ఇంగ్లాండ్ వెళ్లారు. అక్కడి భారతీయ విద్యార్థుల్లో స్వాతంత్య్ర కాంక్షను ప్రేరేపించారాయన. హిందూ మహాసభల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. సావర్కర్ రాసిన ‘ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్’ బుక్‌ను అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత 1910లో సావర్కర్‌ను అరెస్ట్ చేసింది బ్రిటీష్ ప్రభుత్వం. అండమాన్ నికోబార్ దీవుల్లోని జైల్లో పది సంవత్సరాలకు పైనే బ్రిటీష్ ప్రభుత్వపు శిక్షను అనుభవించారు సావర్కర్. 1966 ఫిబ్రవరి 26న ఆయన తుదిశ్వాస విడిచారు.
చదవండి: బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్ ఈవెంట్, షాకిచ్చిన హైదరాబాద్ పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment