ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా కొత్త లుక్‌తో షాకిచ్చాడు. ఈసారి ఏదో హెయిర్ స్టైలో, డ్రెస్సింగ్ స్టైలో మార్చలేదు. ఏకంగా బక్కచిక్కిపోయి అస్థిపంజరంలా దర్శనమిచ్చాడు. స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న స్వతంత్ర వీర్ సావర్కర్ మూవీ కోసమే ఇలా అయిపోయాడు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా రణ్‌దీపే స్వయంగా దర్శకత్వం వహిస్తుండటం విశేషం. సోమవారం (మార్చి 18) నాడు అద్దం ముందు సెల్ఫీ దిగి ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు రణ్‌దీప్.
మీరు గ్రేట్ సార్
ఇది చూసిన జనాలు అతడిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్, ఇలాంటివాళ్లు కదా అసలైన యాక్టర్స్ అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. హీరోలు సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ ట్రై చేయడం చూశాం.. అవసరమైతే మాస్, క్లాస్ లుక్‌లో కనిపించడం చూశాం.. కానీ ఓ సినిమా కోసం తిండీనిద్ర మానేసి మరీ ఇంతలా పీక్కుపోయినట్లుగా తయారైన వ్యక్తిని నిన్నే చూస్తున్నాం అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే వీరసావర్కర్ మూవీ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కెరీర్ అలా మొదలైంది..
కాగా 2001లో మాన్‌సూన్ వెడ్డింగ్ సినిమా ద్వారా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు రణ్‌దీప్ హుడా. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, బివి ఔర్ గ్యాంగ్‌స్టర్, జన్నత్ 2, జిస్మ్ 2, కాక్‌టెయిల్, కిక్ (బాలీవుడ్), రసియా, సర్బజిత్, హైవే వంటి చిత్రాల్లో నటించాడు. గతంలో మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో డేటింగ్ చేశాడు. ఆమెకు బ్రేకప్ చెప్పిన తర్వాత నటి లిన్ లైస్రామ్‌తో ప్రేమలో పడ్డాడు. గతేడాది నవంబర్‌లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.
చదవండి: ఎంత పెద్ద స్టార్ అయితే ఏంటి? అసభ్యంగా ఫోటోలు దిగే వ్యక్తి..
Comments
Please login to add a commentAdd a comment