సాక్షి, న్యూఢిల్లీ : వీర్‌సావర్కర్, నాథూరాం గాడ్సేల మధ్య శారీరక సంబంధం ఉందని కాంగ్రెస్ సేవాదళ్ పుస్తకం ప్రచురించిన క్రమంలో తాజాగా రాహుల్ గాంధీపై హిందూ మహాసభ అలాంటి వ్యాఖ్యలనే చేసింది. వీర్‌సావర్కర్‌పై వచ్చిన ఆరోపణలు అర్ధరహితమైనవని అఖిల భారతీయ హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి తోసిపుచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వలింగ సంపర్కుడనే వాదనలను కూడా తాము విన్నామని ఆయన వ్యాఖ్యానించారు. కాగా వీర్‌సావర్కర్‌తో నాథూరాం గాడ్సేల శారీరక బంధంపై కాంగ్రెస్ సేవాదళ్ ప్రచురించిన పుస్తకం కలకలం రేపుతోంది.
బీజేపీతో పాటు ఆ పార్టీతో గతంలో కలిసి పనిచేసిన శివసేన సైతం సేవాదళ్ తీసుకువచ్చిన వివాదాస్పద పుస్తకాన్ని తప్పుపట్టింది. దేశభక్తుడిగా పేరొందిన గొప్ప నేత వీర్ సావర్కర్‌ను కించపరిచేలా కాంగ్రెస్ సేవాదళ్ పుస్తకం ప్రచురించడం సరైంది కాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. ప్రజల మనసుల్లో ఉన్నత స్ధానం పొందిన సావర్కర్ ప్రతిష్టను పలుచన చేయాలని చూడటం తగదని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment