మన దేశానికి చెందిన కరెన్సీని ఏ పదార్ధంతో చేస్తారు? అని ప్రశ్నిస్తే ఎక్కువ మంది కాగితమనే చెబుతారు. కానీ ఇందులో వాస్తవం ఏంటంటే! ఆర్బీఐ ఆధ్వర్యంలో తయారయ్యే కరెన్సీని కాటన్(పత్తి)తో పాటు మన్నికగా ఉండేందుకు ఇతర పదార్ధాల్ని వినియోగిస్తుంది. కాటన్‌తో తయారు చేసే నోట్లలో 75 శాతం కాటన్, 25 శాతం లినెన్ మిక్స్ ఉంటుంది.
దీంతో పాటు కాటన్ ఫైబర్‌లో నార అనే ఫైబర్ ఉంటుంది. నోట్లను తయారుచేసేటప్పుడు అవి ఎక్కువ కాలం మన్నికగా ఉండేందుకు పత్తికి జెలటిన్ అనే అంటుకునే ద్రావణాన్ని కలుపుతారు. ఈ ద్రావణం కారణంగా కరెన్సీని ఈజీగా లెక్కించవచ్చు.ఫేక్ కరెన్సీని సులభంగా గుర్తించొచ్చు. పైగా మరింత సెక్యూర్‌గా ఉంటుంది. కరెన్సీ బలంగా, మృదువుగా ఉండేందుకు దోహదపడుతుంది.
రాయల్ డచ్ కస్టర్స్ ప్రకారం..ఐరోపాలో కరెన్సీ నోట్ల కోసం కాంబర్ నాయిల్‌ను ఉపయోగిస్తారు. కాంబెర్ నోయిల్స్ కాటన్ మిల్లు వ్యర్ధాల నుంచి వెలికి తీసి తయారు చేస్తారు. యూఎస్ సైతం తన కరెన్సీ నోట్లకు నార నిష్పత్తికి సమానమైన పత్తిని ఉపయోగిస్తుంది. బ్యూరో ఆఫ్ ఎన్‌గ్రావింగ్ అండ్ ప్రింటింగ్ ప్రకారం..అమెరికన్ కరెన్సీ నోట్లలో 75 శాతం పత్తి, 25 శాతం నారతో తయారు చేయబడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment