మరికొద్ది రోజుల్లో మనమంతా పంద్రాగస్టు స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు చేసుకోనున్నాం. 1947లో మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. నూతన స్వదేశీ ఆవిష్కరణలు జరిగాయి. వాటిలో ఒకటే సొంత కరెన్సీ. భారతీయ నోట్లపై వివిధ చిత్రాలు మనకు కనిపిస్తాయి. ఏ నోట్‌పై ఏ చిత్రం ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఐదు రూపాయలు
ఐదు రూపాయల నోట్ల ప్రింటింగ్ ఖర్చు ఎక్కువ కావడంతో ఆర్బీఐ ఇటీవలే ఈ నోటు ముద్రణను నిలిపివేసింది. అయినప్పటికీ గతంలో ముద్రించిన 8 వేల 500 కోట్ల విలువైన ఐదు రూపాయల నోట్లు మార్కెట్‌లో చలామణీలో ఉన్నాయి. ఐదు రూపాయల నోటుపై ఒక వైపు మహాత్మాగాంధీ చిత్రం, మరో వైపు పొలం దున్నుతున్న రైతు చిత్రం కనిపిస్తుంది. ఈ ఫోటో ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానికున్న ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
పది రూపాయలు
పది రూపాయల నోటు ముందు భాగంలో మహాత్మా గాంధీ ఫోటో, వెనుకపైపు అశోక చక్రం కనిపిస్తాయి. 10 రూపాయల కొత్త నోట్ల శ్రేణిలో ఒకవైపు సూర్య దేవాలయ చక్రం కనిపిస్తుంది.
ఇరవై రూపాయలు
ఇరవై రూపాయల నోటు విషయానికొస్తే ఈ నోటుపై ఒకవైపు మహాత్మా గాంధీ చిత్రం, మరోవైపు అశోక స్థూపం కనిపిస్తుంది. మరికొన్ని నోట్లపై ఎల్లోరా గుహల దృశ్యం కనిపిస్తుంది.
యాభై రూపాయలు
యాభై రూపాయల నోటులో ఒకవైపు గాంధీజీ చిత్రం, వెనుకవైపు 'స్వచ్ఛ భారత్' లోగో కనిపిస్తుంది.
100 రూపాయలు
కొత్త రూ.100 నోటుపై ముందు భాగంలో గాంధీజీ చిత్రాన్ని, వెనుకవైపు రాణికి వావ్(గుజరాత్‌లోని చారిత్రక ప్రాంతం) చిత్రాన్ని చూడవచ్చు.
200 రూపాయలు
రూ.200 నోటుపై ఒకవైపు గాంధీజీ చిత్రాన్ని, వెనుక భాగంలో ప్రసిద్ధ సాంచి స్థూపం చిత్రాన్ని చూడవచ్చు.
500 రూపాయలు
కొత్త రూ.500 నోటు విషయానికొస్తే, ఒకవైపు గాంధీజీ చిత్రాన్ని, వెనుక వైపు స్వచ్ఛ్ భారత్‌తో పాటు ఎర్రకోట చిత్రాన్ని చూడవచ్చు.
రెండు వేల నోటు
రెండు వేల రూపాయల నోటును చలామణీని నిలిపివేశారు. ఈ నోట్‌పై ఒకవైపు గాంధీజీ చిత్రాన్ని, మరోవైపు మంగళయాన్ చిత్రాన్ని చూడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment