indipendance day
-
రూ. 5 నుంచి రూ. 2000.. ఏ నోటుపై ఏ చిహ్నం?
మరికొద్ది రోజుల్లో మనమంతా పంద్రాగస్టు స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు చేసుకోనున్నాం. 1947లో మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. నూతన స్వదేశీ ఆవిష్కరణలు జరిగాయి. వాటిలో ఒకటే సొంత కరెన్సీ. భారతీయ నోట్లపై వివిధ చిత్రాలు మనకు కనిపిస్తాయి. ఏ నోట్‌పై ఏ చిత్రం ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.ఐదు రూపాయలుఐదు రూపాయల నోట్ల ప్రింటింగ్ ఖర్చు ఎక్కువ కావడంతో ఆర్బీఐ ఇటీవలే ఈ నోటు ముద్రణను నిలిపివేసింది. అయినప్పటికీ గతంలో ముద్రించిన 8 వేల 500 కోట్ల విలువైన ఐదు రూపాయల నోట్లు మార్కెట్లో చలామణీలో ఉన్నాయి. ఐదు రూపాయల నోటుపై ఒక వైపు మహాత్మాగాంధీ చిత్రం, మరో వైపు పొలం దున్నుతున్న రైతు చిత్రం కనిపిస్తుంది. ఈ ఫోటో ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానికున్న ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.పది రూపాయలుపది రూపాయల నోటు ముందు భాగంలో మహాత్మా గాంధీ ఫోటో, వెనుకపైపు అశోక చక్రం కనిపిస్తాయి. 10 రూపాయల కొత్త నోట్ల శ్రేణిలో ఒకవైపు సూర్య దేవాలయ చక్రం కనిపిస్తుంది.ఇరవై రూపాయలుఇరవై రూపాయల నోటు విషయానికొస్తే ఈ నోటుపై ఒకవైపు మహాత్మా గాంధీ చిత్రం, మరోవైపు అశోక స్థూపం కనిపిస్తుంది. మరికొన్ని నోట్లపై ఎల్లోరా గుహల దృశ్యం కనిపిస్తుంది.యాభై రూపాయలుయాభై రూపాయల నోటులో ఒకవైపు గాంధీజీ చిత్రం, వెనుకవైపు 'స్వచ్ఛ భారత్' లోగో కనిపిస్తుంది.100 రూపాయలుకొత్త రూ.100 నోటుపై ముందు భాగంలో గాంధీజీ చిత్రాన్ని, వెనుకవైపు రాణికి వావ్(గుజరాత్‌లోని చారిత్రక ప్రాంతం) చిత్రాన్ని చూడవచ్చు.200 రూపాయలురూ.200 నోటుపై ఒకవైపు గాంధీజీ చిత్రాన్ని, వెనుక భాగంలో ప్రసిద్ధ సాంచి స్థూపం చిత్రాన్ని చూడవచ్చు.500 రూపాయలుకొత్త రూ.500 నోటు విషయానికొస్తే, ఒకవైపు గాంధీజీ చిత్రాన్ని, వెనుక వైపు స్వచ్ఛ్ భారత్‌తో పాటు ఎర్రకోట చిత్రాన్ని చూడవచ్చు.రెండు వేల నోటురెండు వేల రూపాయల నోటును చలామణీని నిలిపివేశారు. ఈ నోట్‌పై ఒకవైపు గాంధీజీ చిత్రాన్ని, మరోవైపు మంగళయాన్ చిత్రాన్ని చూడవచ్చు. -
స్పెయిన్‌లో జెండా ఎగురవేసిన నయనతార దంపతులు
‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిండు గౌరవం’ను నిజం చేస్తూ నయనతార, విఘ్నేష్ శివన్ జంట విదేశాల్లో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రేమ, పెళ్లి అంటూ సినీ పరిశ్రమలో సమ్‌థింగ్ స్పెషల్‌గా నిలిచిన జంట వీరిది. పెళ్లికి ముందు షూటింగ్లో విరామం దొరికినప్పుడల్లా విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసేవారు. వివాహం తరువాత కూడా ఈ జంట అలాగే ఎంజాయ్ చేస్తోంది. చదవండి: సుమారు నాలుగేళ్ల తర్వాత అలా శ్రావణ భార్గవి! ప్రస్తుతం స్పెయిన్‌లో సేద తీరుతున్నారు. తరచూ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా స్పెయిన్ దేశం, బార్సిలోనా నగరంలోని ప్రసిద్ధి గాంచిన దేవాలయాన్ని దర్శించి ఆ ఫొటోలను ట్విటర్లో పోస్టు చేశారు. అలాగే 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నయనతార, విఘ్నేష్ శివన్ జంట బార్శిలోనా నగర వీధుల్లో భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడించి దేశ గొప్పతనాన్ని చాటారు. -
సింగపూర్‌లో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
సింగపూర్: శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం జయ ప్రియ భారత జనయిత్రీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రఖ్యాత సినీ గేయ రచయిత భువనచంద్ర, ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ దూర దేశాల్లో ఉన్న శ్రీ సాంస్కృతిక కళాసారథి వంటి సంస్థలు పిల్లలు పెద్దలతో కలిసి కూర్చుని ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ లో నివసించే 32 మంది గాయనీ గాయకులు కవులు పిల్లలు అందరూ కలిసి మాతృభూమిని కీర్తిస్తూ చక్కటి దేశభక్తి గీతాలు కవితలను వినిపించి భారతమాతకు సంగీత సాహిత్య నీరాజనాలు అర్పించారు. కార్యక్రమం ముఖ్య నిర్వాహకులు కవుటూరు రత్న కుమార్ మాట్లాడుతూ 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రవాస భారతీయులు ఒక సాయంత్రం దేశమాతని స్తుతిస్తూ ఆనందంగా కలసి గడపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బు వి పాలకుర్తి, పంపన సునీత వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక సహకారం అందించారు. సంస్థ కార్యనిర్వాహక వర్గ సభ్యులు రాధిక మంగిపూడి, చామిరాజు రామాంజనేయులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. -
JioMart: మరో రెండు రోజులే... పైసా వసూల్ స్పెషల్ ఆఫర్
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జియోమార్ట్ పైసా వసూల్ పేరుతో సరికొత్త ఆఫర్‌ని అందుబాటులోకి తెచ్చింది. కస్టమర్లు పైసా వసూల్ అనేలా అచ్చమైన, స్వఛ్చమైన తగ్గింపు ధరలతో మెగాసేల్‌ను ప్రకటించింది. ఆగస్టు 14 నుంచి 18 తేది వరకు ఈ మెగా సేల్ నిర్వహిస్తోంది. ఈ మధ్య ఈ కామర్స్ సంస్థలు రకారకాల పేర్లతోని సేల్స్‌ని నిర్వహిస్తున్నాయి. అద్భుతమైన ఆఫర్లు అంటూ ఊదరగొడుతున్నాయి. ఇలాంటి ఆఫర్ ఇక్కడ తప్ప మరెక్కడా దొరకదు అన్నట్టుగా ప్రకటనలు గుప్పిస్తున్నాయి. అయిదే ఇందులో ఏదీ అసలైన ఆఫరో, ఏదీ కేవలం ప్రచార అర్భాటమో తేల్చుకోవడం కస్టమర్లకు ఓ సమస్యగా మారింది. ఇలా అవసరానికి మించి ఆర్భాటం లేకుండా మీ పర్సుపై భారం తగ్గించేలా తక్కువ ధరలకే నాణ్యమైన వస్తువులు అందించేందుకు మెగా సేల్ అందుబాటులోకి జియోమార్ట్ అందుబాటులోకి వచ్చింది. మెగాసేల్ ఆఫర్లు - 300 గ్రాములు ఆపై ఎక్కువ బరువు ఉండే పెద్ద బిస్కట్ ప్యాకెట్లపై 33 నుంచి 50 శాతం వరకు తగ్గింపు - 240 గ్రాములు ఆపైన ఎంపిక చేసిన నూడుల్స్‌పై 33% తగ్గింపు - సాఫ్ట్ డ్రింక్ విభాగంలో అన్ని రకాల కోక్ ఉత్పత్తులు, మజాపై 33 శాతం తగ్గింపు - చాక్లెట్ ప్యాకెట్స్ 33 నుంచి 50 శాతం వరకు తగ్గింపు ధరలకే లభిస్తున్నాయి - రూ .1049లకే దావత్ దేవాయ బాస్మతి రైస్ 5 కేజీల ప్యాకేట్, 5 లీటర్ల ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ ఆయిల్ కాంబో అందుబాటులో ఉంది. - అన్ని రకాల మసాలా దినుసులపై 33 శాతం తగ్గింపు - ఎంపిక చేసిన మల్టీ ప్యాక్ సబ్బులపై 33 శాతం తగ్గింపు - 4 కేజీలు ఆపై ఉన్న డిటర్టెంట్లపై 30 శాతం వరకు తగ్గింపు - ఎంపిక చేసిన షాంపూలపై 50 శాతం డిస్కౌంట్ - ఎంపిక చేసిన టూత్‌పేస్ట్‌లపై 50 శాతం తగ్గింపు ఎస్బీఐ కార్డుపై క్యాష్‌బ్యాక్ జియోమార్ట్ మెగా సేల్‌లో ఎస్బీఐ డెబిట్, క్రెడిట్‌కార్డు చెల్లింపులపై 10 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందవచ్చు. (అడ్వటోరియల్) -
సీఎం మమతాపై గవర్నర్ అసంతృప్తి
కోల్‌కతా: స్వాతంత్ర్య వేడుకుల సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ జగదీప్ ధంఖర్ నిర్వహించిన తేనీటి విందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుకాలేదు. కార్యక్రమానికి సంబంధించి ముందుగా సమాచారం అందిచినా సీఎం మమతా బెనర్జీ, ప్రభుత్వ అధికారులు గైర్హజరు కావటం తనకు ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. శనివారం ఉదయం కోల్‌కతాలోని రెడ్‌రోడ్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం గవర్నర్ సీఎం మమతా బెనర్జీ, ప్రభుత్వ అధికారులను రాజ్‌భవన్‌లో జరిగే ‘ఎట్ హోం’ కార్యక్రమానికి ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి సీఎం మమతా హాజరు కాలేదు. దీంతో సీఎం లేకుండానే గవర్నర్ దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో గవర్నర్ పక్కన ఏర్పాటు చేసిన కుర్చి ఖాళీగా కనిపించింది. (ప్రజాస్వామ్యానికి పరీక్షా సమయం) ప్రస్తుతం గవర్నర్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో మమతా పాల్గొనకపోవటం చర్చనీయంశంగా మారింది. ‘రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య వేడుకుల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మమతా బెనర్జీ హాజరు కాకపోవడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. మనకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, భద్రత కల్పించిన స్వాతంత్ర్య సమరయోధులను గుర్తు చేసుకోవటంలో మనం మరింత ఎదగాలి’ అని ఆయన ట్విటర్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితి పశ్చిమ బెంగాల్‌కు ఉన్న గొప్ప సంస్కృతి, నీతిని పలుచన చేస్తుందన్నారు. ఇది ఒక అనాలోచితన ధోరణి అని ట్వీట్ చేశారు. ఇక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో గవర్నర్ నిర్వహించే ఎట్ హోం కార్యక్రమం సరికాదని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. (రాష్ట్రపతి భవన్లో ఎట్ హోం కార్యక్రమం) -
శాంతి మన విధానం
న్యూఢిల్లీ: భారత్ శాంతికాముక దేశమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. అయితే, ఎవరైనా ఆక్రమణవాద దుస్సాహసానికి పాల్పడితే తగిన గుణపాఠం చెప్పగల సామర్థ్యం ఉన్న దేశమని స్పష్టం చేశారు. ‘పొరుగున ఉన్న కొందరు ఇటీవల విస్తరణవాద దుస్సాహసానికి ఒడిగట్టార’ని ఇటీవల తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంట ఘర్షణలకు పాల్పడిన చైనాను రాష్ట్రపతి పరోక్షంగా హెచ్చరించారు. ‘ప్రపంచమంతా కరోనాతో పోరాడుతున్న సమయంలో మన పొరుగుదేశం విస్తరణవాద దుస్సాహసానికి పాల్పడింది’ అన్నారు. భారతీయ సైనికులు అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి, ప్రాణాలు పణంగా పెట్టి దేశ భూభాగాన్ని కాపాడుకున్నారని కొనియాడారు. నేడు 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి శుక్రవారం రాష్ట్రపతి ప్రసంగించారు. ‘భరతమాత ముద్దుబిడ్డలు వారు. దేశ గౌరవం కోసం ప్రాణత్యాగం చేశారు. గల్వాన్ లోయలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు దేశమంతా సెల్యూట్ చేస్తోంది’ అన్నారు. ఒకవైపు సరిహద్దులను, మరోవైపు అంతర్గత భద్రతను కాపాడుతున్న త్రివిధ దళాలు, పారామిలటరీ, పోలీసు బలగాలు మనకు గర్వకారణమన్నారు. గల్వాన్‌లోయ వద్ద చైనాతో సరిహద్దు ఘర్షణల్లో 20 మంది భారతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చెప్పిన స్వావలంబ భారత్‌ను రాష్ట్రపతి ప్రస్తావిస్తూ.. భారతదేశ స్వావలంబన విధానం ప్రపంచాన్ని కలుపుకుని పోయేదేనని వివరణ ఇస్తూ విదేశీ పెట్టుబడుదారుల ఆందోళనలను తొలగించే ప్రయత్నం చేశారు. వైద్యులకు సెల్యూట్ కరోనా వైరస్‌పై ముందుండి అలుపెరగని పోరాటం చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి దేశమంతా రుణపడి ఉందన్నారు. ‘దురదృష్టవశాత్తూ వారిలోనూ చాలామంది ఈ మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోయారు. వారంతా ఈ దేశ హీరోలు. వారిని ఎంత ప్రశంసించినా తక్కువే’ అన్నారు. వైద్యులు, వైద్య సిబ్బందితో పాటు విపత్తు నిర్వహణ దళాలు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, రైల్వే, విమానయాన, విద్యుత్ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్జీవోలు, ఇతర సేవల్లోని వారు అంతా ఈ మహమ్మారిపై అలుపెరగని పోరాటం చేస్తున్నారని రాష్ట్రపతి ప్రశంసించారు. ప్రపంచమంతా తలుపులు మూసుకున్నవేళ.. ప్రజలందరికీ ఆరోగ్య సేవలు, ఇతర వసతులు అందేలా వీరు ప్రజా సేవలో నిమగ్నమయ్యారన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా లక్షలాది ప్రాణాలను బలిగొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా తలెత్తిన సవాళ్లను కేంద్ర ప్రభుత్వం సమర్థ్ధవంతంగా ఎదుర్కొన్నదని ఆయన ప్రశంసించారు. కరోనా ముప్పును ముందుగానే పసికట్టి, సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందన్నారు. ‘భారీ జనాభా ఉన్న, విస్తారమైన, వైవిధ్యభరిత భారత్ లాంటి దేశంలో ఈ సవాళ్లను ఎదుర్కోవాలంటే మానవాతీత శక్తులుండాలని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో భారత్ సాధించిన విజయాన్ని ప్రపంచం గుర్తించాలన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలు కూడా సరైన చర్యలు తీసుకున్నాయని రాష్ట్రపతి ప్రశంసించారు. ‘ప్రజలంతా కలసికట్టుగా పోరాడారు. ప్రభుత్వాలు, ప్రజలు.. అంతా కలిసి చేసిన పోరాటం ఫలితంగానే ఈ మహమ్మారి విస్తృతిని సాధ్యమైనంతగా అడ్డుకోగలిగాం’ అన్నారు. 2020 నేర్పిన పాఠం 2020 సంవత్సరంలో కరోనా అనే కంటికి కనిపించని సూక్ష్మజీవి మానవాళికి గొప్ప పాఠాలు నేర్పించిందని ఆయన వ్యాఖ్యానించారు. మానవులు సర్వ శక్తిమంతులనే భ్రమను తొలగించిందని వివరించారు. ఇప్పటికైనా ప్రకృతిని నాశనం చేయకుండా, ప్రకృతితో కలిసి సహజీవనం చేయడం నేర్చుకోవాలని హితవు పలికారు. విభేదాలు పక్కనబెట్టి భూగోళ రక్షణ కోసం మానవాళి అంతా ఏకమైన శతాబ్దం ఇదని కోవింద్ వ్యాఖ్యానించారు. మానవ సమాజం ఏర్పర్చుకున్న కృత్రిమ అడ్డుగోడలను కరోనా కూల్చివేసిందన్నారు. ఆరోగ్య సేవల్లో మౌలిక వసతులను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని కరోనా మనకు గుర్తు చేసిందన్నారు. కరోనాపై పోరాటంలో ప్రభుత్వ వైద్యశాలలే ముందున్నాయన్నారు. ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా కారణంగా పేదలు, రోజు కూలీలు దారుణంగా దెబ్బతిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన తదితర సంక్షేమ పథకాలను యుద్ధప్రాతిపదికన అమలు చేసిందన్నారు. కరోనా సంక్షోభాన్ని ఆర్థిక పునరుత్తేజానికి లభించిన అవకాశంగా భావించాలన్నారు. రామాలయ నిర్మాణం గర్వకారణం అయోధ్యలో ఆగస్ట్ 5న రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగిన విషయాన్ని రాష్ట్రపతి కోవింద్ ప్రస్తావించారు. అది భారతీయులందరికీ గర్వకారణమని వ్యాఖ్యానించారు. ‘దశాబ్దాలుగా దేశప్రజలు గొప్ప సంయమనాన్ని, ఓపికను ప్రదర్శించారు. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంచారు. రామ మందిర వివాదాన్ని శాంతియుతంగా న్యాయవ్యవస్థ పరిష్కరించింది. సుప్రీంకోర్టు తీర్పును అన్ని వర్గాలు ఆమోదించి.. భారతీయ శాంతి, అహింస, ప్రేమ, సౌభ్రాతృత్వ భావనలను ప్రపంచానికి చూపాయి’ అని పేర్కొన్నారు. -
ప్రగతికి కృషి
జిల్లా ఇన్చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఏలూరు (మెట్రో) : జిల్లా కేంద్రం ఏలూరు పోలీసు పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరంలో జిల్లా సగర్వమైన పాత్ర పోషించిందన్నారు. బ్రిటీష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజును దేశానికి అందించిన వీరభూమి పశ్చిమగోదావరి జిల్లా అని కొనియాడారు. ఎందరో త్యాగధనులు దేశంకోసం తమ జీవితాలను పణంగా పెట్టారని గుర్తుచేసుకున్నారు. ప్రగతికి కృషి జిల్లా ప్రజల ప్రగతికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ప్రత్తిపాటి వెల్లడించారు. సాగు జలాలను మరింత సమర్థంగా వినియోగించుకుని మూడో పంటకు రైతులను సన్నద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో రైతులకు రూ.250 కోట్ల విలువైన విత్తనాలను 75శాతం సబ్సిడీపై అందించామని వివరించారు. 17వేల 601 భూసార పరీక్షలు నిర్వహించి 66వేల ఫలితాలను 2లక్షల మంది రైతులకు అందించామని చెప్పుకొచ్చారు. పోలవరంతో కరువు నివారణ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే జిల్లాలోనూ, రాష్ట్రంలోనూ కరువు నివారణ సాధ్యమని మంత్రి ప్రత్తిపాటి చెప్పారు. ప్రస్తుత వ్యవసాయ సీజన్లో జిల్లాకు 29 టీఎంసీలు అందిస్తున్నామని వెల్లడించారు. నీటి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, కురిసిన వానబొట్టునూ పరిరక్షించుకోవాలని హితవు పలికారు. జిల్లాలో 43వేల స్వయం సహాయక సంఘాలకు రూ.987 కోట్లు రుణాలు అందిస్తున్నామని చెప్పారు. విద్య, వైద్యం, పౌరసరఫరాలు, గృహనిర్మాణం, ఉపాధిహామీ, స్వచ్ఛభారత్ వంటి పథకాల ప్రగతిని వివరించారు. పాపికొండలు, కొల్లేరు, యలమంచిలిలంక, నరసాపురం, ఎర్రకాలువ జలాశయం వంటి ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఖేలో ఇండియా రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికైన జిల్లా జట్టును అభినందించారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులు, అధికారులకు సేవా పురస్కారాలు అందించారు. వేడుకల్లో వివిధ పాఠశాలలు, విద్యాసంస్థల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎస్పీ ఎం.రవిప్రకాశ్, జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, ఏజేసీ షరీఫ్, కుక్కునూరు సబ్‌కలెక్టర్ ఎస్.షాన్మోహన్, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, పార్లమెంటు సభ్యులు గోకరాజు గంగరాజు, జడ్పీ చైర్మన్ ఎం.బాపిరాజు, రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ శాసనమండలి సభ్యులు రామూ సూర్యారావు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు, మేయరు నూర్జాహాన్, అదనపు ఎస్పీ రత్న, డీఆర్వో కె.హైమావతి, ఆర్డీఓ జి.చక్రధరరావు పాల్గొన్నారు. -
మద్యం దుకాణాలపై ఎక్సైజ్ దాడులు
భీమవరం టౌన్ : భీమవరం ఎక్సైజ్ జిల్లా పరిధిలోని మద్యం దుకాణాలపై సోమవారం దాడులు చేసినట్టు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.శ్రీనివాసులు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడూ డ్రైడే అయినా మద్యం విక్రయిస్తున్న దుకాణాలపై 17 కేసులు నమోదు చేసి 16 మందిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. 141 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. భీమవరం స్టేషన్ పరిధిలో మూడు కేసులు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేయగా, 31 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఆకివీడు స్టేషన్ పరిధిలో రెండు కేసులు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశామని, 16 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని శ్రీనివాసులు వెల్లడించారు. తణుకు స్టేషన్ పరిధిలో నాలుగు కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసి 27 మద్యం సీసాలు, పాలకొల్లు స్టేషన్ పరిధిలో రెండు కేసుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసి 18 మద్యం సీసాలు, నర్సాపురం స్టేషన్ పరిధిలో మూడు కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసి 25 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని శ్రీనివాసులు పేర్కొన్నారు. పెనుగొండ స్టేషన్ పరిధిలో రెండు కేసుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసి 14 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు.