మద్యం దుకాణాలపై ఎక్సైజ్ దాడులు
Published Tue, Aug 16 2016 12:49 AM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM
భీమవరం టౌన్ :
భీమవరం ఎక్సైజ్ జిల్లా పరిధిలోని మద్యం దుకాణాలపై సోమవారం దాడులు చేసినట్టు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.శ్రీనివాసులు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడూ డ్రైడే అయినా మద్యం విక్రయిస్తున్న దుకాణాలపై 17 కేసులు నమోదు చేసి 16 మందిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. 141 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. భీమవరం స్టేషన్ పరిధిలో మూడు కేసులు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేయగా, 31 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఆకివీడు స్టేషన్ పరిధిలో రెండు కేసులు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశామని, 16 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని శ్రీనివాసులు వెల్లడించారు. తణుకు స్టేషన్ పరిధిలో నాలుగు కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసి 27 మద్యం సీసాలు, పాలకొల్లు స్టేషన్ పరిధిలో రెండు కేసుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసి 18 మద్యం సీసాలు, నర్సాపురం స్టేషన్ పరిధిలో మూడు కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసి 25 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని శ్రీనివాసులు పేర్కొన్నారు. పెనుగొండ స్టేషన్ పరిధిలో రెండు కేసుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసి 14 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు.
Advertisement
Advertisement